Saturday, April 14, 2012

ఇది ఒక సాంస్కృతిక విప్లవం----అరుణాంక్ ఎలుకటూరి




మండే మాదిగ డప్పులా/ఉదయిస్తున్న సూర్యునిపై
చిర్రా చిటికెన పుల్ల తీసుకుని /తొలకరి పాటకు దరువు వేస్తున్నారు -శివసాగర్
చచ్చిన పశువుల నుంచి చర్మం తీసి 60 రకాల వాయిద్యాలను తనలో పలికించే డప్పును సృష్టించిన శాస్త్రవేత్తలు మాదిగలు. ఎద్దు కొమ్ములలోనుంచి సమర నాదాన్ని పుట్టించి సమాజాన్ని మేలుకొలిపి చిర్రా చిటికెన పుల్లను తీసుకుని దరువు వేస్తుంటే పసిపిల్లల నుంచి కాటికి కాలుచాపిన ముసలివాళ్ల దాకా మంచాల నుంచి లేచి చిందేసేలా దరువేసిన మాదిగ లు. చర్మాలతో చెప్పులు తొడిగి, రాళ్లు రప్పలు, కొండలు కోనలు, కీకారణ్యాలలోకి మానవాళిని నడిపించిన వారు మాదిగలు. వారు ఇష్టంగా తినేది బలవర్ధకమైనదిగా భావించే ఆహారం ఎద్దుమాంసం. అది తినేవారు మాదిగలు, మాలలు, ఆదివాసులు సంచార జాతులు, క్రైస్తవులు, ముస్లింలు. వీరంతా బహుజనులు.వారు ఇష్టంగా తినే ఎద్దుకూరను వారి నుంచి దూరం చేసే ప్రయత్నం ఎన్నో ఏళ్లుగా జరుగుతూనే ఉంది.


వారు తినే గోవులకు, ఎద్దులకు పవివూతత అంటగట్టి పూజలు చేస్తూ ఎద్దుకూరను దళితుల నుంచి దూరంచేసే కుట్రలో భాగంగా గోవధ నిర్మూలన అనే కార్యక్షికమాన్ని హిందూత్వ ఫాసిస్టు శక్తులు ముందుకు తీసుకువస్తున్నాయి. సరికొత్తగా అంబేద్కర్ కూడా గోవు ను తినవద్దన్నాడని కొత్త పాట ఎత్తుకున్నారు. అంబేద్కర్ చచ్చిన పశువులను తినవద్దన్నాడు. ఎందుకంటే చచ్చిన పశువుల కళేబరాలలో హానికరమైన సూక్ష్మక్షికిములు ఉంటాయన్నదే కారణం తప్పమరేమీ కాదు. చివరిగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 4ని ముందుకు తీసుకొస్తున్నారు. నిజానికి ఆర్టికల్ 4 గోవధను పూర్తిగా నిషేధించాలని చెప్పలేదు. ఎం.ఎం. ఖురేషి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఏ.ఐ.ఆర్ 195, ఎస్.సి.371 ఆర్టికల్ ఇచ్చిన గోవధ నిర్వచనాన్ని అనుసరించి చాలా రాష్ట్రాలు ఉపయోగపడే పశువులను వధించరాదని చట్టాలు చేశాయి. దీనితో గోవధ ఉపయోగపడని పశువులకు మాత్రమే పరిమితమైనది. గోవులకు పవివూతత అంటగట్టిన హిందూ సమాజం వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానంలో అనారోగ్యానికి గురైన పశువులను కబేళాలకు ఎందుకు అమ్ముతున్నది?ఒక జంతువు నీచమైనది, మరొకటి పవివూతమైనది ఉన్న దా? దీనిని ఏ శాస్త్రం చెప్పిందో హిందూత్వ శక్తులే చెప్పాలి.



వేదకాలం నుంచి గోవును ఆహారంగా తినడం ఉన్నది. (అథో అన్నం వాయ్ గోవః) గోవును ఆహారంగా స్వీకరించవచ్చు అని తైత్తరీయ బ్రాహ్మణం చెబుతున్నది. యజ్ఞ వల్కుడు ఆవుమాంసం కోరడం గురించి శతపథ బ్రాహ్మణంలో స్పష్టంగా ఉన్నది. ఉత్తర క్రియలలో(దశదినకర్మ)భాగంగా ఆవునో, ఎద్దునో వధించి బ్రాహ్మణులకు విందు ఇచ్చేవారు. ఋగ్వేదం-10, 14-1 ప్రకారం రంతిదేవుని వంటగదిలో ఆవును వధించి దాన్యంతో పాటు బ్రాహ్మణులకు మాంసం వడ్డించేవారు. అదర్వణ వేదం-11.2, 4 వేదాలలో గోమాంస భక్షణ చేసిన రుషులు నేడు గోవధ పాపమంటే దాన్ని ఖండిస్తూ వేమన ‘గోవు పాపమేల గోమాంస భక్షక, ఎవడు పాపివేద రుషుల నుంచి, ఎద్దుమాంసం లేక ముద్ద మింగుడుపోదు, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు.



ఇంద్రునికి, శివునికి గోవులు బలివ్వాలని, గర్భిణీ స్త్రీ ఎర్ర ఆవు మాంసం తింటే పండంటి బిడ్డకు జన్మనిస్తారని, యజ్ఞవల్కస్మృతి చెబుతున్నది. రాజు ను సర్వాధికారిగా నిలబెట్టే యాగంగా భావించి ఎందరో రాజులు చేసిన అశ్వమేథం అనే అనాగరిక యాగంలో యజ్ఞాశకంతోపాటు 600 గోవులను బలిఇచ్చేవారు. పురాణాలలో గోమాంస భక్షణకు సంబంధించి హేతువాదం మాసపవూతిక 9 వ సంచిక ‘వేదాలలో గోమాంస భక్షణ’ అనే వ్యాసంలో చూడవచ్చును. ఢిల్లీ యూనివర్సిటీ చరి త్ర పరిశోధక అధ్యాపకులు ప్రొఫెసర్ డి.ఎన్. ఝా ‘పారడాక్స్ ఆఫ్ ది కౌ ఆటిట్యూడ్స్ టు బీఫ్ ఈటింగ్ ఇన్ ఎర్లీ ఇండియా’ అనే పుస్తకంలో ఆధారాలతో సహా బయట పెట్టారు.



వేల ఏళ్లు ఎద్దుకూర తిని పుష్టిగా ఎదిగి సమాజాన్ని శాసించిన బ్రాహ్మణులు దళితుల విషయానికి వచ్చేసరికి దానిని పవిత్రం చేసి దూరం చేస్తున్నారు. దాన్ని తిన్నావారిని అంటరాని వారుగా చేస్తున్నారు. చరివూతలో దళితులు బ్రాహ్మణ సంస్కృతిలో ఎన్నడూ అంతర్భాగంగా లేరు. తినడానికి ఏమీలేక చనిపోయిన ఆవులను కూడా తిన్నారు దళితులు. నిజానికి ఎద్దుకూరలో చాలా ప్రొటీన్స్ ఉన్నాయి. నాలుగు ఔన్స్ ల ఎద్దుకూరలో 64.1 శాతం ప్రొటీన్స్ ఉంటాయి. దేశాన్ని పట్టి పీడించిన క్షయవ్యాధి దళితుల దరిచేరలేందంటే.. దానికి కారణం వారు తిన్న ఎద్దు మాంసమే. ఎద్దుకూరలో బి-12, బి-6 విటమిన్‌లు, రోగనిరోధకశక్తి పెంచే గుణం ఉంటుందని జాతీయ పోషకాహార సంస్థ తన పరిశోధనల ద్వారా తెలిపింది.ఇట్టి బలవర్ధకమైన ఆహారాన్ని ప్రజలనుంచి దూరం చేయడానికి హిందూత్వ శక్తులు చేస్తున్న కుట్రలకు నిరసనగా.. ఇఫ్లూ (ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ)లో ‘బీఫ్ ఫేస్టివల్’ను నిర్వహిస్తున్న విద్యార్థులపై హిందూ ఫాసిస్టు మూకలు దాడిచేసి పలువురు విద్యార్థులను గాయపరిచారు. ఎద్దుకూర వారి మనోభావాలను కించపరిచిందనే కారణం చెబుతూ దళిత విద్యార్థులపై దౌర్జన్యం చేశారు. సెక్యులర్‌దేశంలో ఎవరికి ఇష్టమైన ఆహారం వారు తినే హక్కు లేదా? ఏది ఎవరు తినాలో కూడా హిందూత్వ బ్రాహ్మణీయమే నిర్ణయిస్తుందా? 



ఆహార నియమాల వెనుక కులం ఉన్నది. బ్రాహ్మణత్వం, వైశ్యత్వం ఉన్న ది. మతం ఉన్నది. అది హిందూత్వం. మాంసాహారులైన బహుజనులను కించపరిచే కుట్రఇది. ఈ కుట్రలను భగ్నం చేసేందుకు చైతన్యవంతులైన అణగారిన వర్గాల విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో పెద్దకూర పండుగ (బీఫ్ ఫేస్టివల్)ను నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామీకరణ చెందినవారు, డీక్లాస్ ఫై, డీ క్యాస్ట్‌ఫై అయిన వారంద రూ ఎద్దుకూర సాంస్కృతిక విప్లవానికి మద్దతు ఇవ్వవలసిందిగా పిలుపునిస్తున్నాం.

-అరుణాంక్ ఎలుకటూరి
సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు 
(ఓయూలో ‘బీఫ్ ఫెస్టివల్’ సందర్భం

Namasete Telangana News Paper Dated : 15/04/2012 

No comments:

Post a Comment