Saturday, September 28, 2013

చర్చకు రాని భూ విప్లవం - డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి -


ఇరవయ్యో శతాబ్ది ఆరంభం నుంచి ఇప్పటిదాకా తెలంగాణలో తరచూ ఒక సంఘర్షణ జరుగుతూనే వచ్చింది. అయితే అవి కొన్ని సంఘర్షణ రూపం తీసుకుంటే కొన్ని అంతర్గత అలజడులుగా మిగిలిపోయేవి. ఆర్య సమాజం ఏర్పాటు, దానికి జవాబుగా అన్నట్లు ఇత్తెహాదుల్ ఏర్పాటు, ఆంధ్ర మహాసభ ఆవిర్భావం, స్వాతంత్య్రోద్యమం, సాయుధ పోరాటం, మిలిటరీ చర్య, హైదరాబాద్ విభజన, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, 1969 జై తెలంగాణ ఉద్యమం, కొనసాగుతున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, నిజాం పాలనా కాలం నాటి ముల్కీ ఉద్యమం ఈ ప్రాంతంలో చర్చకు వచ్చాయి. చర్చల సారాంశాలు, ఉద్యమ గమనాలు ఏ దిశగా వెళ్ళాయన్నది పెద్ద అంశమే. ఇలాంటి రాజకీయ అంశాల మీద జరిగిన చర్చ, మంచి చెడుల విశ్లేషణ నిజానికి ప్రజల జీవితాలలో నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చిన భూ సంస్కరణలలో జరగలేదు. 1970లలో వచ్చిన భూ సంస్కరణల చట్టం సాధించిన పాక్షిక విజయాల మీద కొంత చర్చ జరిగింది. అది కూడా కమ్యూనిస్టుల వల్లే. ఆ చట్టం విఫలమైనందువల్లే.
హైదరాబాద్ రాష్ట్ర వ్యవసాయ చరిత్రలో 1948లో పెను విప్లవం సంభవించింది. అది జాగీర్ల రద్దు. హైదరాబాద్ జాగీర్ల రద్దు రెగ్యులేషన్, 1948 ప్రకారం రాష్ట్రంలోని జాగీర్లన్నీ రద్దయి దివానీ (ప్రభుత్వ భూమి)లో కలిసిపోయాయి. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నుంచి రాజ్యాధికారాన్ని స్వీకరించిన జనరల్ జె.ఎన్. చౌదరి ఆధ్వర్యంలోని మిలటరీ పాలనా కాలంలో జాగీర్లను రద్దు చేసి ఎల్.వి. గుప్తా ఆధ్వర్యంలో జాగీర్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేయబడింది.
ఏమిటీ జాగీర్లు : మహ్మదీయ పరిపాలనా విధానంలో జాగీరు ఒక పరిపాలనా యూనిట్ అంటారు మౌల్వీ చిరాగ్ అలీ. ప్రజల నుంచి నేరుగా పన్ను వసూలుకు జవాబుదారీగా ఉంటూ రాజ్యానికి నిర్ణీత పన్ను భాగాన్ని జాగీర్దార్ చెల్లించాలి. తన జాగీర్ యూనిట్‌కు రాజ్యం వేలుపెట్టనంత వరకు జాగీర్దారే సర్వాధికారి. అయితే జాగీర్దార్లకు పన్ను వసూలుపై వచ్చే ఆదాయం తప్ప భూమిపై ఎలాంటి హక్కులు లేవు. కానీ వాస్తవానికి వచ్చేసరికి భూమిపై సర్వాధికారాలు వారే అనుభవించడం జరిగింది. జాగీర్లు నిజానికి ఒక పరిమిత కాలానికి ఇవ్వబడేవి. రానూరానూ అవి జాగీర్దార్ల జీవితకాలం కొనసాగాయి. ఒకవేళ కాలపరిమితి పూర్తైనా, లేక జాగీర్దారు మరణించినా తిరిగి నజరానా సమర్పించగానే అది రెన్యూ చేయబడేది. సాధారణంగా నజరానా అంటే వజ్రాలు, బంగారు నాణేలు రాజుకు సమర్పించడం. నిజాం బంధువర్గం పెద్దది. వాళ్ళు నిజాం తప్ప మిగతా శ్రేణులందరి కంటే ఉన్నతులు. వాళ్ళకే జాగీర్లు ఇవ్వబడేవి. జాగీర్దార్లు తిరిగి తమ జాగీర్‌లో ఉప జాగీర్‌లు ఇచ్చేవారు. ఉప జాగీర్దార్లు చాలావరకు స్థానికులు.
పాయెగాలు, జాగీర్‌లు, సంస్థానాలు, ఎస్టేట్లు, మక్తాలు, అగ్రహారాలు, ఉమ్లీలు, ముకాసాలు అన్నీ జాగీర్ల కిందే లెక్క. ఈ జాగీర్‌లలో మినహాయించబడిన జాగీర్లు (Exempted Jagirs) ప్రత్యేకమైనవి. మినహాయించబడిన జాగీర్లలో సాధారణ పరిపాలనతో పాటు పోలీసు, న్యాయవ్యవస్థ ప్రత్యేకంగా ఉండేది. దివానీతో దానికి ఏ సంబంధం ఉండేది కాదు. మూడు పాయెగాలు; నాలుగు ఎస్టేట్లు; గద్వాల, జటప్రోలు, అమరచింత సంస్థానాలు; ధరమ్ కరమ్ బహద్దూర్, శ్యాంరాజ్ బహద్దూర్, కళ్యాణి, సూర్యజంగ్, మెహదీ జంగ్ ఎస్టేట్లు మినహాయించబడిన జాగీర్‌లు. మిగతా జాగీర్లు పరిమిత అధికారాలతో పరిపాలన చేసేవి.
ప్రత్యేక హోదాలు : సామాన్య ప్రజల దృష్టిలో జాగీర్లన్నీ ఒక్కటే. ఫర్మానాల ప్రకారం జాగీర్దార్లకు పరిమితమైన అధికారాలే ఉన్నా వాస్తవం వేరుగా ఉండేది. శాంతి భద్రతలు, న్యాయం, పన్ను వసూళ్ళు, వివాదాల పరిష్కారం అంతా జాగీర్దార్ల కనుసన్నల్లోనే నడిచేవి. మినహాయించబడని జాగీర్లలోనూ దివనీ వ్యవహారాలన్నీ జాగీర్దార్లే నిర్వహించేవారు. నవాబు దృష్టిలో మాత్రం పాయోగాలకు, ప్రముఖుల ఎస్టేట్‌లకు చాలా గౌరవం ఉండేది. సంస్థానాలు హిందూ రాజుల ఆధీనంలో ఉండడం వల్ల వాటి నిర్వహణను దివాని జాగరూకతతో వ్యవహరించేది. మిగతావి సాధారణ జాగీర్లు. ఈ జాగీర్దార్లనే తరచూ నవాబు మార్చుతూ ఉండేవాడని అంటారు.
అస్మాన్ జా, కుర్షీద్ జా, వికారుల్ ఉమ్రాలు విలీనం నాటి పాయోగాలు. ఇది నిజాం వ్యక్తిగత భద్రత చూసుకునే కుటుంబానిది. నిజాం తర్వాత వీళ్ళే అత్యున్నతులు. పాయోగాల తర్వాత స్థానం ఇలాకాదార్లది. వారు నలుగురు - నవాబ్ సలార్ జంగ్ బహద్దూర్, మహరాజా కిషన్ పెర్షాద్ బహద్దూర్, నవాబ్ ఖాన్ ఖానమ్, నవాబ్ ఫక్రుల్ ముల్క్. తర్వాత స్థానం సంస్థానాధిపతులది. గద్వాల, వనపర్తి, జటప్రోలు, అమరచింత, పాల్వంచ, దోమకొండ, గోపాల్‌పేట, ఆనెగొంది, రాజపేట, దుబ్బాక, నారాయణపూర్, పాపన్నపేట, గుర్గుంలు, సిర్నాపల్లి అప్పటి ప్రధాన సంస్థానాలు. మిగిలినవి చిన్న జాగీర్లు. విశేషమేమంటే సంస్థానాలు, చిన్న జాగీర్లు ఒకే భూభాగం (Compact) కలిగి ఉండగా పాయోగాలు, ప్రముఖుల ఎస్టేట్లు మాత్రం దూరదూరంగా, అనేక చోట్ల Non-Compact) విస్తరించి ఉండేవి.
హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమయ్యే నాటికి సంస్థానంలో అంతర్గత పాలన ప్రజానుకూలంగా లేదు. జాగీర్దార్లు ప్రజలను పన్నుల కోసం పీడించిన ఆధారాలున్నాయి. నిజానికి నవాబు దివానీ ఏరియా రైతులతో పాటు జాగీర్ ఏరియాలోను రైతులకు పన్ను మాఫీ చేసినప్పటికీ జాగీర్దార్లు బేఖాతరు చేసేవారు. ప్రజల నుంచి వసూలైన పన్నులో చాలా తక్కువ భాగం దివానీకి చేరేదన్నదీ నిజమే. దానికే జాగీర్దార్లు పేష్‌కాష్, నజరానా, హక్-ఇ-మాలికానాం, మక్తాపన్, చౌత్, మనాకా, ఉమ్లి, కహదానా, జాగీర్ కాలేజ్ సెసస్, లోకల్ సెసస్, సెటిల్మెంట్ చార్జీలు, ఖానుంగోయి, దడుపత్తి లాంటి పేర్లతో జాగీర్దార్లు ఖజానాకు నిధులు సమర్పించేవారు.

జాగీర్ కానిదెంత? : నిజాం రాష్ట్రం పరిపాలనా పరంగా జాగీర్లు, సర్ఫెఖాస్, దివానీగా విభజించబడి ఉండేది. సర్ఫెకాస్ నిజాం స్వంత ఆస్తి. జాగీర్ వసూళ్ళు కొంత భాగమే ప్రభుత్వానికి వచ్చేవి. దివానీ ఒక్కటే నేరుగా ప్రభుత్వ భూభాగం. మిలటరీ చర్య నాటికి మొత్తం సంస్థానం విస్తీర్ణం 82,700 చ.మైళ్ళుంటే అందులో 33,000 చ.మైళ్ళు జాగీర్లే. జాగీర్ల రద్దు నాటికి సంస్థానపు జనాభా కోటి ఎనభై లక్షలుంటే అందులో 37.2 శాతం జనాభా జాగీర్లదే. కాబట్టి ఏ రకంగా చూసినా జాగీర్ల మీద పట్టు సాధించడం పౌరపాలనలో అత్యవసరమైంది. అప్పటికే జాగీర్ల నిర్వహణ, అందులో ప్రజా వ్యతిరేక కోణంపై ఒక అవగాహనతో ఉన్న కేంద్ర ప్రభుత్వం నిజాం నుంచి పగ్గాలు స్వీకరించగానే జాగీర్లపై దృష్టి పెట్టింది. పరిపాలనా పరంగా చూసినా జాగీర్లు ఒకదానికొకటి ఏమాత్రం సారూప్యత లేని యూనిట్లు. కొన్ని తాలూకాల కంటే చిన్నవి కాగా కొన్ని జాగీర్లు జిల్లాల విస్తీర్ణం కన్నా పెద్దవి. కొన్ని అనేక చోట్ల విస్తరించబడి (Scatter ఉన్నవి. ఆదాయ వ్యయాలలోనూ చాలా తేడాలున్నాయి. ఉదాహరణకు వికారుల్ ఉమ్రా వార్షికాదాయం రూ. 27,83,033 ఉండగా కళ్యాణి జాగీర్ ఆదాయం కేవలం రూ. 2,43,316 మాత్రమే ఉండేది. జాగీర్ పాలనలో సమర్థులైన అధికారులు లేరు. ఉన్నా వాళ్ళ జీతాలు చాలా తక్కువ. స్వల్ప ఆదాయాలు, అసంగత వ్యయాలు, సర్వే సెటిల్మెంటు సరిగ్గా లేకపోవడం, రైతులతో మంచి సంబంధాలు లేకపోవడం జాగీర్లలో పాలు.
ఈ కారణాల వల్ల రైతులకు భూమి మీద హక్కులు సరిగ్గా రికార్డు చేయబడలేదు. కరువు కాటకాల్లోనూ బలవంతంగా పన్నులు వసూలు చేయడం వల్ల రైతులు కుదేలయ్యారు. పన్నులు కట్టలేక భూముల్ని వదిలేసుకున్న రైతులు కోకొల్లలు. ఇప్పుడు రెవెన్యూ రికార్డుల్లో 'కారిజ్ కాతా' (ఓఓ) కింద నమోదైన ప్రభుత్వ భూములన్నీ అప్పటి రైతులు అలా వదిలేసినవే. స్థానిక అధికారుల, గ్రామాధికారుల అలసత్వం, అవినీతి జాగీర్లను రద్దు చేయవలసిన అగత్యాన్ని కల్పించింది.
జాగీర్ల రద్దు రెగ్యులేషన్ : వందల సంవత్సరాల చరిత్రగలిగిన జాగీర్లు, సంస్థానాలు, ఇలాకాలు, ఎస్టేట్లు, పాయెగాలు హైదరాబాద్ జాగీర్ల రద్దు రెగ్యులేషన్, 1358 ఫస్లీ ప్రకారం రద్దయ్యాయి. ఈ రెగ్యులేషన్ 1949 స్వాతంత్య్రదినోత్సవం నుంచి అమలులోకి వచ్చినట్లు ప్రకటించారు. జాగీర్దార్లు తమ జాగీరు లెక్కలను చెప్పడం కోసం నిర్దాక్షిణ్యంగా బలవంతపు తేదీలిచ్చారు. రెండు వారాలలో జాగీర్ల అవశేషాలను పరిసమాప్తం చేశాడు జాగీర్ పరిపాలకుడిగా నియమించబడ్డ ఎల్.ఎన్. గుప్తా. మిగిలిపోయిన వ్యవహారాలను చక్కదిద్దడానికి ఫస్టుతాలూక్‌దార్ (కలెక్టర్)లను అసిస్టెంట్ జాగీర్ అడ్మినిస్ట్రేటర్‌గా నియామకం చేసారు. ఇదొక భూమి విప్లవం. కేవలం 14 రోజుల్లో ఫ్యూడల్ వ్యవస్థ పునాదులనే పెకలించిన విప్లవం.
జాగీర్లు రద్దయ్యాక జాగీరు గ్రామాల రెవెన్యూ రికార్డుల్లో జాగీర్దార్ల పేర్లకు బదులు రైతుల పేర్లు రాయమని ఆదేశాలిచ్చారు. జాగీర్దార్లవి కానీ, వారి బంధువులవి కానీ పేర్లు రాయకూడదని, ఫౌతీమార్పులు చేయకూడదని ఆదేశాలున్నాయి. అందుకు బదులుగా వాస్తవంగా సాగుచేస్తున్న వారి పేర్లు రికార్డులలో రాయాలనీ స్పష్టంగా ఆదేశించడం జరిగింది. 'జాగీర్ గ్రామాల రైతులందరినీ వారు కాస్తు చేస్తున్న భూముల పట్టెదార్లుగా గుర్తించాలి. అందుకు ఎలాంటి పత్రాలు అవసరం లేదు. జాగీర్దార్ల నుంచి రాతపూర్వకమైన అనుమతి అవసరం లేదు. ఒకవేళ జాగీర్దారు స్వయంగా వ్యవసాయం చేసుకున్నట్లయితే ఆ భూమిపై జాగీర్దారు వ్యక్తిగత పేరు నమోదు చేయాలి' అని సర్క్యులర్ నెం. 2, తేదీ 18 అజుర్, 1359 ఫస్లి (18.10.1949) ద్వారా సహాయ రెవెన్యూ కార్యదర్శి అందరు పౌర పాలకులకు తెలియజేసాడు.
అయినా అక్కడ కూడా ఈ సర్కుల్యర్ సూచనలు అమలు పరచబడలేదు. తిరిగి 1954-55లో తెలంగాణ ప్రాంతపు విశిష్ట రెవెన్యూ రికార్డు ఖాస్రాపహాణి తయారైన సందర్భంలో ప్రభుత్వం మరింత స్పష్టమైన సూచనలిచ్చింది. ఆ సూచన ప్రకారం ఖాస్రా పహాణిలో వాస్తవంగా కాస్తు చేస్తున్న వ్యక్తిని తర్వాత సంవత్సరం నుంచి ఎలాంటి పత్రాలు అడగకుండా పట్టాదారుగా నమోదు చేయాలి.
భూస్వామ్య అవశేషాల్ని కూడా లేకుండా పెకిలించిన జాగీర్ల రద్దు రెగ్యులేషన్, సంపూర్ణ విజయవంతమవడం నిజంగా భూ విప్లవమే!
- డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి
డిప్యూటీ కలెక్టర్

Andhra Jyothi Telugu News Paper Dated : 29/09/2013 

ప్రాంతీయ ఫండమెంటలిజం.. - కంచ ఐలయ్య

ఈ రాష్ట్రం విడిపోవడమో, కలిసుండడమో నిర్ణయించాల్సింది దేశస్థాయి, కొంతమేరకు రాష్ట్రస్థాయి రాజకీయ పార్టీలు. ఈ పార్టీలు ప్రభుత్వ నిబంధనలను బలంగా అమలుచేసయినా ఉద్యోగుల్ని తమ, తమ పనుల్లో ఉంచడం అవసరం. అది వ్యవస్థ కూలకుండా కాపాడడానికి ఉపయోగపడుతుంది. దేశ రాజకీయ పార్టీలు రాష్ట్రాల విభజనను సూత్రరీత్యా కాకుండా ఎన్నికల అవసరాలు రీత్యా చేస్తామంటే దాని పరిణామాలు ప్రజలపై ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ పరిస్థితి రుజువు చేస్తుంది.
ప్రాంతీయ ఫండమెంటలిజం మత ఫండమెంటలిజం కంటే ప్రమాదకరమైనది. అది ఒక ప్రాంత ప్రజలందరి చేత మరో ప్రాంతాన్ని ద్వేషించేదిగా చేస్తుంది. దీని అత్యున్నత రూపం మనం ఇజ్రాయెల్-పాలస్తీనాలో చూశాం, చూస్తున్నాం. క్రమంగా తెలంగాణ ఆంధ్ర సమస్యను ఆ రూపంలోకి మలుస్తున్నారు. ఇందులో ఒక్క రాజకీయ నాయకులే కాదు, మేధావులు, విద్యార్థులు, ముఖ్యంగా ఉద్యోగులు ముందు వరుసలో ఉంటున్నారు. నేను ఇంత కుముందే ఈ పత్రికలో ఉద్యమ-ఉద్యోగుల గురించి ఒక వ్యాసం రాశాను. 2009 డిసెంబర్ ప్రకటన తరువాత తెలంగాణ మంత్రులు, రాజకీయ పార్టీలు, తమ ఆధీనంలో ఉద్యోగులతో జేఏసీలను ఫామ్ చేసి ఇటు ప్రాంతం ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేసి, సంవత్సరాల తరబడి పాలనా యంత్రాంగాన్ని, విద్యారంగాన్ని సర్వనాశనం చేశారు.
ఇప్పుడు ఆ 13 జిల్లాల ఉద్యోగుల్ని అటు మంత్రులు, ముఖ్యమంత్రితో సహా ఉద్యమ రంగంలోకి దింపారు. ఏ దేశంలోనైనా రాజకీయ ఉద్యమాలను ప్రభుత్వ ఉద్యోగులు నడపడం ద్వారా యంత్రాంగాన్ని మొత్తం సబోటేజ్ చెయ్యగలరు. ప్రాంతీయ ఉద్యమాలు సమాజాన్ని సంస్కరించే లక్షణం ఉన్నవి కావు. వీటిద్వారా ద్వేషాలను ఉన్మాదాలను రెచ్చగొట్టడం చాలా సులభం. ఇటువంటి ఉద్యమాల్లో కొంతమంది అకస్మాత్తుగా హీరోలైనట్లు కనిపిస్తారు. ముఖ్యంగా ప్రజలకు జవాబుదారీగా ఉండే రాజకీయ పార్టీలు ఉద్యమాలు నడిపితే కష్టనష్టాలకు ఎన్నికల్లో జవాబుదారీ తనం ఉంటుంది. కానీ పార్టీలే డబ్బును, జనాన్ని సమీకరించి ఉద్యోగులను ఉద్యమ వీరులుగా నడిపిస్తే రేపు జరిగే మంచి, చెడులకు వారి జవాబుదారీ తనం లేదు. ఒక పార్టీ ఉద్యమాన్ని నడిపితే ఆ పార్టీలోని ఒక నాయకుడు తప్పుచేసినా బాధ్యతా రహితంగా మాట్లాడినా ఆ పార్టీ అంతా జవాబుదారీ తనం వహించాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకూ, యూనివర్సిటీ టీచర్లకు అన్ని హంగులు, ఆర్భాటాలు కల్పించి ఉద్యమాలు నడుపండి అని పార్టీలు వారి వెనుక ఉండి నడిపిస్తుంటే వాళ్ళు రెచ్చగొట్టి, బాధ్యతా రహిత ప్రకటనలు చేసి, తాత్కాలికంగా మీడియా వెంట నడుస్తుంటే చిన్న పిల్లల కంటే హీనంగా తయారవుతారు. చాలాకాలంగా ఇది తెలంగాణలో జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇది 'సీమాంధ్ర' పేరుతో జరిగే ఉద్యమంలో జరుగుతున్నది.
పార్టీలు ప్రాంతాల కోసం పుట్టడమో, లేదా ఒక ప్రాంతీయ పార్టీగా రూపాంతరం చెందడమో జరిగితే (టీఆర్ఎస్, వైసీపీ ఇప్పుడు అలా రూపొందినవే) టీఆర్ఎస్ ఎక్కడా లేని విధంగా ఒకే ఎజెండాతో పుట్టిన పార్టీ, ఇప్పుడు వైసీపీ ఆ పదమూడు జిల్లాల్లో ఆ రూపాంతరం చెందుతోంది. ఉద్యమ ఉద్యోగుల నేతృత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ రోడ్లమీద ధూంధాం చేయిస్తే ఆ ప్రాంతంలో ఇప్పుడు రోజూ రోడ్లమీద పౌరాణిక నాటకాల్ని వేస్తున్నారు. రెండు ప్రాంతాల మధ్య కల్చరల్ తేడా ఇంతకంటే పెద్దగా ఏం ఉండదు. కానీ ప్రాంతీయ తత్వాలని రెచ్చగొట్టాలనుకున్నప్పుడు ఇక్కడ రోజూ రోడ్లమీద అర్ధనగ్నంగా పాటలు పాడితే అక్కడ కిరీటాలు పెట్టుకొని పద్యాలు పాడుతారు. ఉద్యోగులు మేధావుల అవతారమెత్తి ఇది గొప్ప అంటే అది గొప్ప అని వీధివాదాలకు దిగుతారు.
రాష్ట్ర విభజనగానీ కలిసి ఉండడంగానీ ఇటువంటి ఉద్యమాల ప్రభావంతో జరిగితే ఇక్కడ ప్రజాస్వామ్యం పిండరూపంలో ఉందనే అర్థం. రాష్ట్రాలు విడిపోవడానికిగానీ, కలిసుండడానికిగానీ ఉద్యోగుల ప్రయోజనాలకు మించిన బలమైన కారణాలుండాలి. అటువంటి కారణాలు ఉన్నాయా లేవా అని తేల్చేది కమిషన్లు, సుదీర్ఘ అధ్యయనాలు గానీ ఉద్యోగులు కాదు. తెలంగాణను చిన్న రాష్ట్రం చేస్తామని పార్టీ నిర్ణయాన్ని చాలా కాలం కింద ప్రకటించిన బీజేపీకి ఆ పదమూడు జిల్లాల్లో ఓట్లు ఉంటే ఆ ప్రకటన ఇచ్చేది కాదు. ఆ నిర్ణయం అది తెలంగాణ జిల్లాల్లో తమకు ఓట్లు ఉన్నాయనే సీటు ఆశతోనే. టీడీపీ తెలంగాణ కోసం లేఖ ఇచ్చింది పొత్తుద్వారా 2009లో అధికారంలోకి వచ్చి సమస్యకు భిన్నమైన పరిష్కారం చూపవచ్చని భావించి మాత్రమే. ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఆ పదమూడు జిల్లాల్లో ఓట్లు రావని తేలాకే. ఈ మొత్తం ప్రక్రియలో విడిపోవాలా, వద్దా అనే అంశంపై హానెస్ట్ స్టడీ ఎవరికీ లేదు. ఇప్పుడు రెండు (నిజానికి మూడు) ప్రాంతాల్లో ఉద్యోగులను దింపి డబ్బులు గుప్పి ఉద్యమాలను నడపుతున్నారు. అకస్మాత్ హీరోలను సృష్టిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. రెండు ప్రాంతాల్లో ఉపాధ్యాయులు చదువు చెప్పడానికి పోటీపడనోళ్ళు బడులు మూసెయ్యడానికి పోటీపడుతున్నారు. ప్రాంతాల జిల్లాల అభివృద్ధి ఆ ప్రాంతంలోని విద్యారంగం అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ విద్యారంగంలో ఆ విలువలు ఎక్కడా పెరుగలేదు. ప్రభుత్వ స్కూ ళ్ళలో విద్యా ప్రమాణాలు పెరగాలని ఉపాధ్యాయ నేతలు పోటీపడ్డ దాఖలాల్లేవు. కానీ రాష్ట్రం చీలిపోవాలనో, కలిసుండాలనో నెలల తరబడి బడులు మూసేస్తున్నారు. ఇప్పుడు చదువును కోల్పోతున్న చిన్న పిల్లలు విడిపోతే బాగుపడతారో, కలిసుంటే బాగుపడతారో ఎవరు చెప్పగలరు.
ఇప్పుడు మూడు ప్రాంతాల్లో బడులు మూసెయ్యడంద్వారా భవిష్యత్ తరాలను బాగుచెయ్యగలమని ఎలాచెబుతారు? మనుషుల పౌరహక్కుల గురించి మాట్లాడాల్సిన మేధావులు కూడా ఇప్పుడు ప్రాంతాల పౌరహక్కుల గురించి మాట్లాడుతున్నారు? ఒక ప్రాంతంలో భూస్వాముల పాల నా హక్కును కాపాడే మేధావులు తయారైతే మరో ప్రాంతంలో పెట్టుబడిదారుల పౌరహక్కుల్ని కాపాడే మేధావి వర్గం సహజంగానే తయారౌతుంది.
అన్ని ప్రాంతాల్లో సాధారణ ప్రజల జీవితం ఇప్పుడున్న స్థితి కంటే వెనక్కి నెట్టి విభజన సాధించినా, సమైక్యత సాధించినా ఫలితమేంటి. రాష్ట్రాల్లోని ప్రాంతీయ తత్వం దేశాల మధ్య యుద్ధంలా తయారైతే వచ్చే సమస్యలేంటో ఊహించారా? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి సంఘం ఇతర ప్రాంతంలోని ప్రజలపై యుద్ధం ప్రకటించి ఏం సాధిద్దామనుకుంటున్నారు. గత కొంత కాలంగా రిజర్వేషన్ హక్కు కోసం అన్ని జిల్లాల ప్రజల్ని కూడగట్టి కొన్ని హక్కుల్ని సాధించిన సంఘాలు నిలువునా చీలిపోయాయి. అంటే ప్రాంతీయ ఫండమెంటలిజం అణిచివేయబడ్డ కులాలను కూడా చాలా ఆనందంగా చీల్చిందన్నమాట. ఇప్పుడు మొత్తం 23 జిల్లాల్లో దేశ పౌరుడనే వ్యక్తి కనిపించడం లేదు. అంతా ప్రాంతీయ యుద్ధ వీరులే. నేనొక దేశ పౌరున్ని, లేదా ప్రపంచ పౌరున్ని అంటే పరిహాసం చేసే పరిస్థితి వచ్చింది. దీనికి మౌలిక బాధ్యత మేధావి వర్గానిది అని చెప్పకతప్పదు. నేనొక ప్రాంత వాదినంటే, నేనొక మార్క్సిస్టును, లేదా సోషలిస్టును అని చెప్పుకోవడం కన్నా గొప్పగా ఫీలౌతున్న రోజులివి. ఈ వాతావరణాన్ని ఛేదించకుండా ఆలోచన అంటూ ఏ ప్రాంతంలో కూడా మిగిలి ఉంటుందని భావించలేం.
ఉద్యోగ గుంపులు రాజకీయ నిర్ణయాలను తాము నిర్దేశిస్తాం వాటి కోసం ఉద్యమాలు చేస్తామంటే ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలన్నీ తీసి 'అవుట్‌సోర్స్' చెయ్యడమో లేక చాలా రంగాల్ని ప్రయివేటీకరించడమో జరిగే ప్రమాదం లేకపోలేదు. తెలంగాణ, సమైక్యాంధ్ర సమ్మెలను సాకుగా అమెరికా వంటి కాంట్రాక్ట్ వ్యవస్థను ఇక్కడ కూడా ప్రవేశపెట్టాలని వాదించే వారూ ఉన్నారు. రఘురామ్ రాజన్ వంటి ఆర్థిక శాస్త్రవేత్తలు అందుకు కావలసిన ప్రణాళికలను తయారుచేస్తారు.

ఆఫీసులు నడపాల్సిన ఉద్యోగులు రాజకీయ నాయకుల కాన్వాయిల్లో కనబడే సరుకైతే దేశంలో ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుంది. చాలా విచిత్రమైన ఘటనలు ఇప్పుడు మనం చూస్తున్నాం. పార్లమెంటుకు ఎన్నికైన నాయకుడు అసలు పార్లమెంటుకు పోవడం లేదు. ఎప్పుడో ఒకసారి పోతే ఆయన్ని ఎయిర్‌పోర్టులో దింపడానికి 5వేల మంది, తిరిగి వెనక్కి వచ్చినప్పుడు జైకొట్టి రిసీవ్ చేసుకోవడానికి 10 వేల మంది కాన్వాయిలో కదిలిపోతున్నారు. చివరికి జైలు నుంచి ఇంటికి పోవడానికి వేల మంది రోడ్లపై కవాతులు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల నాయకుల్లో ఈ ప్రక్రియ హద్దులు మీరి సాగుతోంది. దీన్ని మనం డెమోక్రసీ అనలేం, దీన్ని ఖచ్చితంగా 'మాబోక్రసీ' అనాల్సిందే.
ఉద్యమాలు నడిపే ఉద్యోగ నాయకులు కాన్వాయిల్లో తిరిగితే ఇక వ్యవస్థ ఎలా నడుస్తుంది. రాష్ట్రంలో ఇప్పుడు మూడు ప్రాంతీయ పార్టీలున్నాయి. అవి డబ్బున్న కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అవి రాజకీయ సంస్కరణ, సాంఘిక సంస్కరణ కోసం పుట్టినవి కావు. అవి ఆయా కులాల అధికారాన్ని బలోపేతం చెయ్యడానికి పుట్టాయి. అవి అధికారంలోకొచ్చినా, రాకున్నా కొన్ని ఓట్లు, కొన్ని సీట్లు తమ వెంట ఉంచుకుంటే తమ కాంట్రాక్టులు, తమ భూముల ఆక్రమణ కార్యక్రమాలకు అడ్డంకి లేకుండా నడుపుకోవచ్చు. ఈ పార్టీలన్నీ ప్రపంచ ప్రజాస్వామిక విలువల్లో ఇమడగలిగే ఏ సిద్ధాంతం పునాదిగా పుట్టినవి కావు. ఇవి కుటుంబాల, కులాల, ఆస్తుల్ని, అధికారాన్ని పంచుకోవడంకోసం పుట్టినవి. వీరికి అంబేద్కర్, గాంధీ వంటి తాత్వికులు అసలు లెక్కలోని వారే కాదు. ఈ రాజకీయ వాతావరణం ప్రజాస్వామిక సంస్థల్లో పనిచేసేవారిని విచ్చలవిడిగా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది. ఈ పార్టీల నాయకులే తమ ఏజంట్లను ఉద్యోగ, ఉపాధ్యాయ రంగం నుంచి కొత్త కొత్త తోలుబొమ్మల్లాగా మనముందుకు తెచ్చి ఆడిస్తున్నారు.
క్రోనీ క్యాపిటల్‌కు పుట్టుకొచ్చే మీడియాకు ఈ తోలుబొమ్మలు కొంత ఆదాయాన్ని, ఆనందాన్ని తెచ్చిపెడతాయి. తమ కెమెరాలను, కాలాలను వాటి చుట్టూ తిప్పడం ప్రాంతీయ ఫండమెంటలిజానికి చాలా అవసరం. మూడు వేల ఏండ్లు 'నువ్వు ఏ కులంలో పుట్టావనేది నీ స్థాయిని' నిర్ణయించేది. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏ ప్రాంతంలో పుట్టావనేది కీలకంగా మారింది. పాలస్తీనా, ఇజ్రాయెల్‌లో నువ్వు ఏ మతంలో పుట్టావనేది వారి జీవిత స్థితిగతుల్ని నిర్ణయిస్తుంది. ఈ వాతావరణం ఇలాగే కొనసాగితే ఇక్కడ మానవ విలువలు ఇంకా అడుగంటుతాయి.
ఈ రాష్ట్రం విడిపోవడమో, కలిసుండడమో నిర్ణయించాల్సింది దేశస్థాయి, కొంతమేరకు రాష్ట్రస్థాయి రాజకీయ పార్టీలు. ఈ పార్టీలు ప్రభుత్వ నిబంధనలను బలంగా అమలుచేసయినా ఉద్యోగుల్ని తమ, తమ పనుల్లో ఉంచడం అవసరం. అది వ్యవస్థ కూలకుండా కాపాడడానికి ఉపయోగపడుతుంది. దేశ రాజకీయ పార్టీలు రాష్ట్రాల విభజనను సూత్రరీత్యా కాకుండా ఎన్నికల అవసరాల రీత్యా చేస్తామంటే దాని పరిణామాలు ప్రజలపై ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ పరిస్థితి రుజువు చేస్తుంది. దీనికి పరిష్కారం రాజ్యాంగం ఏం చెబుతుందో 'స్కూలు పిల్లల్లా' చదివితే కుదరదు. ఆ రాజ్యాంగ నిబంధనలను అమలు చెయ్యడానికి ఒక జాతీయ 'కన్‌సెన్‌సస్'ని రూపొందించగలగాలి. అందుకు కొంత ఎక్కువ కాలం పడితే పట్టొచ్చు. కానీ ఈ క్రమంలో సాధారణ ప్రజా జీవనాన్ని ఇప్పుడున్న స్థితి కంటే వెనక్కి తీసుకుపోకూడదు. ప్రతి ఉద్యమ కర్తవ్యం ఉద్యమ దశలో కూడా అందులోని సాధారణ ప్రజల జీవితాన్ని కాస్త మెరుగపర్చాలి గానీ, ఇంకా నాశనం చెయ్యకూడదు.
ప్రతి ఉద్యోగుల సమ్మెలో కూడా అతి తక్కువ జీతం తీసుకొని బతికేవారు, ముఖ్యంగా ఆ కుటుంబాల్లోని స్త్రీలు ఏం చెబుతారో దాన్నిబట్టి నిర్ణయం తీసుకోవాలి. వారు వద్దంటే సమ్మెను ఒక్క రోజు నడిపినా అది అప్రజాస్వామికం, వినాశనకరం.
- కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

Andhra Jyothi Telugu News Paper Dated : 29/09/2013 

Friday, September 27, 2013

భగత్ సింగ్ అధ్యయనశీలత ఆచరణ యోగ్యం By తోట కృష్ణారావు

   Fri, 27 Sep 2013, IST  

అంధ విశ్వాసం మన మెదళ్ళను మొద్దుపరిచి అభివృద్ధి నిరోధకులుగా తయారు చేస్తుంది' అని అంటూ 'విప్లవమనే ఆయుధం ఆధునిక ఆలోచనలతో పదునెక్కుతుంది' అంటాడు. భగత్‌సింగ్‌ భావాలు ఇంత పరిపక్వంగా ఉండటానికి కారణం ఆయన నిరంతరం అధ్యయనశీలిగా ఉండటమే కారణం. రాజరామశాస్త్రి మాటల్లో చెప్పాలంటే 'భగత్‌సింగ్‌ పుస్తకాలను తినేవాడు'. ఉరికంభం వద్దకు తీసుకొని వెళ్ళటానికి జైలు అధికారులు భగత్‌సింగ్‌ ఉండే సెల్‌ వద్దకు వెళ్ళినప్పుడు చివరి క్షణంలో కూడా ఆయన అధ్యయనంలో నిమగమై ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు.
'నన్ను ఉరితీసిన తర్వాత నా విప్లవ భావాలు ఈ సుందరమైన మాతృభూమి అంతటా వ్యాపిస్తాయి. బ్రిటీష్‌ సామ్రాజ్య వాదులకు బ్రతికున్న భగత్‌సింగ్‌ కంటే చనిపోయిన భగత్‌ సింగ్‌ మరింత ప్రమాదకారి. మా భావాలు మన యువతను ఆవహిస్తాయి. స్వాతంత్య్రం కోసం, విప్లవం కోసం పరితపించేట్లు చేస్తాయి' అని దృఢమైన విశ్వాసాన్ని భగత్‌సింగ్‌ ఉరిశిక్ష ప్రకటించిన అనంతరం వ్యక్తం చేశాడు.
భగత్‌సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌ 23 ఏళ్ళకే దేశ స్వాతంత్య్రం కోసం ఉరి కంభం ఎక్కిన త్యాగశీలురు. భగత్‌సింగ్‌ ఒక గొప్ప వీరుడుగా, సాహసిగా, ధైర్యవంతుడుగా బాగా సుపరిచితుడయ్యారు. 'ఇంక్విలాబ్‌-జిందాబాద్‌' అని వారు ఇచ్చిన నినాదం యావత్‌ జాతికి స్ఫూర్తిదాయకంగా మారి సామ్రాజ్యవాదులను గడగడ లాడించాయి.
అయితే భగత్‌సింగ్‌లో అనేక మంది విప్లవకారులందరిలో కెల్లా విశిష్టమైన ప్రత్యేక లక్షణాలున్నాయి. ఆయనో గొప్ప అధ్యయనశీలి, ఆలోచనాపరుడు. అందుకే విప్లవం, సోషలిజం, దేవుడు, మతం, టెర్రరిజం అనే విషయాలపై స్పష్టంగా తన అభిప్రాయాలను వివరించాడు. సెప్టెంబర్‌ 27న భగత్‌సింగ్‌ 107వ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా ఆయన భావాలను ప్రజల ముందుంచడం అవసరం.
సమాజ సేవ, సామాజిక న్యాయం, దేశ సార్వభౌమాధికారం, జాతీయ సమైక్యత, సమగ్రత, మానవత్వం, మత సామరస్యం కోసం పాటుపడాలనే చైతన్యాన్ని యువతలో పెంపొందించాలి. దేశ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్దికి, స్వావలంబనకు తద్వారా జాతి నిర్మాణానికి యువతను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి అని 'భారత జాతీయ యువజన విధానం' నొక్కి వక్కాణిస్తున్నది. కానీ ఆచరణలో అందుకు భిన్నంగా నేడు జరుగుతున్నది. జాతి నిర్మాణంలో యువత శక్తిసామర్థ్యాలను ప్రభుత్వాలు సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు. యువతలో సామాజిక స్పృహను తుంచి హింస, ద్వేషం, ష్యాషన్‌, ప్రేమోన్మాదం, వ్యష్టివాదం, మారక ద్రవ్యాలు వంటి పెడ ధోరణుల వైపు నెడుతోంది. సామాజిక చింతన, దేశభక్తి, నిస్వార్థ సేవ, రాజకీయ చైతన్యం స్థానంలో స్వార్థం, అస్తిత్వవాదం వంటి వాటికి పెద్ద పీటవేసి యువతను పెడదారి పట్టిస్తోంది. ఇంట్లో పిల్లలకు మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఎలా ఉందో, అలాగే ఈ దేశ యువతను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఈ బాధ్యతను గుర్తెరగకుండా నేడు పాలకవర్గాలు దేశ యువతలో నరనరాన తమ పెట్టుబడిదారీ ప్రపంచీకరణ విధానాలతో నిరాశ, నిస్పృహలను నింపుతున్నాయి. పైగా 'యువత చెడిపోతోంది' అంటూ మన పాలకులు నెపాన్ని ఇతరులపైకి నెట్టివేయాలని చూస్తున్నారు. నేటి యువత ఎంతో తెలివైనది, సృజనాత్మకత ఉన్నది. ఏదో సాధించాలనే తపన ఉన్నది. వారి శక్తిసామర్థ్యాలను వినియోగించుకుని సరైన మార్గ నిర్దేశం చేయగలిగితే ఎంతటి అసాధ్యాలనైనా సుసాధ్యం చేయవచ్చు.
యువత ఆత్మగౌరవంతో హుందాగా బతికేందుకు అనువైన పరిస్థితులు లేవు. ఫలితంగా నేటి యువత నిరాశానిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నది. యువతను ఆవరించిన ఈ నిరాశానిస్పృహలను తొలగించి మానవత్వం, ప్రేమ, త్యాగం, అంకితభావం, తెగువ, అభ్యుదయ భావాలు వంటి లక్షణాలు వారిలో పెంపొందించాలి. ఇందుకు విప్లవ వీరుడు భగత్‌సింగ్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. భగత్‌సింగ్‌ కేవలం ఒక విప్లవకారుడు మాత్రమే కాదు, గొప్ప దార్శనికుడు కూడా. అన్యాయాలు, అక్రమాలు, దోపిడీని ఎదిరించటంలో, సామ్రాజ్యవాదాన్ని దును మాడడంలో ఆయనకు ఆయనే సాటి. అటువంటి ఒక మహోన్నత విప్లవకారుని గురించిన సమాచారం చాలా తక్కువ ప్రచారానికి నోచుకుంటున్నది. ఇది చాలా శోచ నీయం. మహాత్మాగాంధీ తన నలభయ్యో ఏట స్వాతంత్య్రో ద్యమంలోకి వచ్చి 79వ యేట ఒక హిందూ మతోన్మాది చేతిలో హత్యగా వింపబడ్డారు. స్వామి వివేకానంద తన 30వ ఏట చికాగో ఉపన్యాసంతో ప్రసిద్ధుడై, హిందూ మత సంస్కరణకు కృషి చేసి 39వ యేట తనువుచాలించాడు. కాగా భగత్‌సింగ్‌ 18 ఏళ్ళకే స్వాతంత్య్రోద్యమంలోకి ఉరికి ఇరవై మూడేళ్ళ చిరు ప్రాయంలోనే ఉరికంబం ఎక్కాడు. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల పాలిట సింహ స్వప్నంగా నిలిచిన భగత్‌సింగ్‌ మృత్యువును సైతం చిరునవ్వుతో ఆహ్వానించిన ధీశాలి. యువత సమాజానికి ఆదర్శంగా ఎలా ఉండాలో చేతల్లో చూపించిన కార్యశాలి భగత్‌సింగ్‌. హింస, ప్రేమ, మతం ఇలా అనేక అంశాలపై భగత్‌సింగ్‌ తన విలువైన అభిప్రాయాలు వెల్లడించాడు. ప్రేమ గురించి ఆయన అన్నమాటలు 'ప్రేమ అంటే మరేమీకాదు. అది ఒక తపన మాత్రమే. అయితే అది జంతు ప్రవృత్తిపై నిలబడలేదు. మానవ ప్రవృత్తిపై మాత్రమే నిలబడుతుంది' అని చాలా సూటిగా చెప్పాడు. ప్రేమ పేరుతో పెడమార్గం పడుతున్న నేటి యువతకు భగత్‌సింగ్‌ ఒక ఆదర్శం. ఆయన భావాలు శిరోధార్యం.
ఈ రోజు దేశంలో మత ఛాందసులు, మతోన్మాదులు, అభివృద్ధి నిరోధక శక్తులు మతం పేరుతో చేస్తున్న విచ్ఛిన్నాలను, దేవుణ్ణి రాజకీయాల్లోకి తెచ్చి భావోద్వేగాలతో ప్రజల ఐక్యతకు చిచ్చు పెట్టడాన్ని చూస్తున్నాం. ఈ సందర్భంగా వాటి పట్ల భగత్‌సింగ్‌ అభి ప్రాయాలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. భయం, అజ్ఞానం, ఆత్మ న్యూనత నుంచి మానవుడు సృష్టించుకున్నవే 'మతం, దేవుడు' అంటాడాయన. కార్ల్‌మార్క్స్‌ మతం గురించి చెప్పిన విషయాలతో భగత్‌సింగ్‌ అభిప్రాయాలు పోలి ఉన్నాయి. క్రూరమైన దోపిడీ, సమాజంలో ఒక వైపు సకల భోగాలతో కొద్దిమంది కులుకుతుంటే అత్యధిక ప్రజానీకం అంతులేని దారిద్య్రంతో కుమిలిపోతుంటారు. ఆకలి, అనారోగ్యాలు, ఆర్తనాదాలు సర్వసామాన్యం. ఈ స్థితిలో 'మతం అనేది అణచివేయబడే జీవియొక్క నిట్టూర్పు. అది హృదయం లేని ప్రపంచంలో హృదయం లాంటిది. స్ఫూర్తి లేని పరిస్ధితుల్లో స్ఫూర్తిని ఇచ్చేది. కాబట్టి అది ప్రజల పాలిట మత్తుమందు' అని మార్క్స్‌ వ్యాఖ్యానించాడు. దోపిడీ వర్గం తన దోపిడీని శాశ్వతం చేసుకోవటానికి మతాన్ని అన్ని రకాలుగా వాడుకున్నది.
సోవియట్‌ రష్యాలో అప్పటికే సోషలిస్టు విప్లవం జయప్రదమై పదేళ్ళు దాటింది. ఆ ప్రగతిశీల భావాల ప్రభావం ప్రపంచంపై పడింది. భగత్‌సింగ్‌ 'కేవలం నమ్మడం, మరీగుడ్డిగా నమ్మడం చాలా ప్రమాదకరమైనది. అలాంటి అంధ విశ్వాసం మన మెదళ్ళను మొద్దుపరిచి అభివృద్ధి నిరోధకులుగా తయారు చేస్తుంది' అని అంటూ 'విప్లవమనే ఆయుధం ఆధునిక ఆలోచనలతో పదునెక్కుతుంది' అంటాడు. 'అభ్యుదయం కోసం నిలబడే ప్రతి వ్యక్తీ పాత విశ్వాసాలకు సంబంధించిన ప్రతి దాన్నీ ప్రశ్నించాలి. ఒక్కొక్క దాన్ని తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే నిర్ధారణకు రావాల్సి ఉంటుంది' అని భగత్‌సింగ్‌ వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా తాను నాస్తికుడనని ఆయన ప్రకటించుకున్నాడు.
భగత్‌సింగ్‌ ఎంతటి తార్కికవాదో తెలుసుకోవటానికి ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే. ఆయన జైల్లో ఉండగా రాసిన రచనల్లో కనిపించే ఇంగ్లీషు భాష, విషయ పరిజ్ఞానం పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, అసఫ్‌ అలీ లాంటి వారి ప్రజ్ఞకు ఏ మాత్రం తీసిపోవని ప్రముఖ చరిత్రకారుడు విఎన్‌ దత్‌ తన 'గాంధీ-భగత్‌సింగ్‌' పుస్తకంలో కొనియాడారు. 1930 అక్టోబర్‌ 7న భగత్‌సింగ్‌కు కోర్టు ఉరిశిక్ష విధించగా 1931 మార్చి 23న దాన్ని అమలు చేశారు. ఈ ఆరు నెలల కాలంలో ఆయన ఎన్నడూ నిరాశ, నిస్పృహలను దరి చేరనీయలేదు. ఉరి తీయటానికి ముందు కొద్ది క్షణాల వరకూ కూడా చదువుతూ ఈ దేశానికి సామ్యవాద భావాల అవసరాన్ని తెలియజెప్పిన గొప్ప సోషలిస్టు. క్షమాపణ కోరితే ఉరిశిక్ష నుంచి మినహాయింపు పొందవచ్చన్న తండ్రి ఆవేదనను కూడా తిరస్కరించి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదాన్ని చావుతో సవాల్‌ చేసిన ధీరుడాయన. లాలా లజపతిరారు మరణానికి కారకుడైన శాండర్స్‌ అనే బ్రిటీష్‌ సైనికాధికారిని మట్టుపెట్టి ఈ దేశ యువత చేతకానిదని భావించొద్దని బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించిన ధైర్యశాలి. ఎవరికీ ప్రాణ నష్టం కలగని రీతిలో తయారు చేసిన బాంబును అసెంబ్లీ సెంట్రల్‌ హాల్లో వేయటం ద్వారా ప్రాణ నష్టం తన అభిమతం కాదని చాటి చెప్పాడు. భగత్‌సింగ్‌ భావాలు ఇంత పరిపక్వంగా ఉండటానికి కారణం ఆయన నిరంతరం అధ్యయనశీలిగా ఉండటమే కారణం. రాజరామశాస్త్రి మాటల్లో చెప్పాలంటే 'భగత్‌సింగ్‌ పుస్తకాలను తినేవాడు'. ఉరికంభం వద్దకు తీసుకొని వెళ్ళటానికి జైలు అధికారులు భగత్‌సింగ్‌ ఉండే సెల్‌ వద్దకు వెళ్ళినప్పుడు చివరి క్షణంలో కూడా ఆయన అధ్యయనంలో నిమగమై ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు.
భగత్‌సింగ్‌కు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు కొన్ని పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఉన్నాయి. వాటిని మన దేశానికి తెప్పించటంలో భారత ప్రభుత్వం అంతగా శ్రద్ధ పెట్టలేదు. వాటిని తెప్పించటానికి ప్రముఖ పాత్రికేయుడు 'కులదీప్‌ నయ్యర్‌' కృషి చేస్తున్నారు. తెల్లవాడి చేతి నుంచి నల్లవాడి చేతికి అధికారం వస్తే సరిపోదు. దోపిడీకి తావులేని నిజమైన కార్మిక, కర్షక రాజ్యం ఏర్పడాలని భగత్‌సింగ్‌ కోరుకున్నాడు. ఆ మహానీయుని ఆశయాలు నేటికీ నెరవేరలేదు. భగత్‌సింగ్‌ సామ్యవాద భావాలు, ఆశయ సాధన కోసం నిత్యం పోరాడటం భగత్‌సింగ్‌కు మనం అర్పించే నిజమైన నివాళి. ఆ ఆశయ జ్యోతిని ఆరనివ్వక భగత్‌సింగ్‌ యొక్క నిరంతర అధ్యయనశీలత, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట వారసత్వం, త్యాగం, సోషలిజం వంటి భావాలను నేటి యువత పుణికిపుచ్చుకుని భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నేడు భగత్‌ సింగ్‌ 107వ జయంతి
-తోట కృష్ణారావు
Prajashakti Telugu News Paper Dated : 27/09/2013 
  

Tuesday, September 24, 2013

రాజకీయాధికార మార్గం బహుజన సమన్వయమే By - కదిరి కృష్ణ


భారత దేశంలో దేవుడు లేని గ్రామాలు ఉండొచ్చేమో కానీ ఎస్సీ, బీసీలు లేని గ్రామాలు దాదాపు శూన్యం. గ్రామ నిర్మాణంలో, నాగరికత కట్టడంలో ఎస్సీ, బీసీ కులాల పాత్ర అనిర్వచనీయం. వ్యవసాయిక దేశమైన భారత్‌లో ఈ కులాలు లేకుండా మనుగడ సాగించడం కష్టం. నీళ్లు తోడే తొండం, బొక్కెనలు సమకూర్చి తోలు సంస్కృతికి మాదిగలు ఆద్యులైతే, కమ్మరుల నాగలి, సాలెల వ్రస్తాలు, కుమ్మరుల కుండలు, వడ్డెరల గృహనిర్మాణ సాధనాలు, గొల్లకుర్మల పాడి దేశాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దినవి. ప్రపంచంలో మరెక్కడా లేని ప్రకృతి పూజ, సంస్కృతి ఎస్సీ, బీసీలదే. జనాభా రీత్యా చూసుకున్నా నూటికి ఎనభైశాతం బిసి, ఎస్సీ కులాలే. ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థల్లో గమనిస్తే ఈ కులాలు ఉత్పత్తి శక్తులుగా ఉన్నప్పటికీ, ప్రయోజనాలు కల్పించడంలో వీరిని దూరం చేస్తున్నారు. ఓటు బ్యాంకు దృష్ట్యా ఎనభై శాతం ఉండే బహుజనులు, మైనార్టీలైన బ్రాహ్మణాధిపత్య కులాల ఏలుబడిలో మగ్గుతున్నారు. దేశ రాజకీయాధికారాన్ని నిర్ణయించేది ఖచ్చితంగా బిసిలే (ఎస్సీల కు రాజ్యాధికారం లేకపోయినా కొంతమేరకు వాటా పొందగలుగు తున్నారు) ఐనప్పటికీ నిర్ణాయక శక్తులుగాకాక నిర్వీర్యశక్తులుగా మారుతున్నారు. గతంలో ఎస్సీలను నిర్ణాయక ఓటు బ్యాంకుగా భావించినప్పటికీ, ఇటీవల చీలిపోయి ఉండడంతో అమ్ముడు పోయే వ్యక్తులుగా మిగిలిపోయిన పరిస్థితి నెలకొని ఉన్నది. పైగా బిసిలు- ఎస్సీలు తమలో తాము కుల వైషమ్యా లతో కలహించుకుంటున్న సం ఘటనలు విచ్ఛిన్నతను మరింత పెంచిపోషిస్తున్నా యి. బీసీలను ఎస్సీలు, ఎస్సీలను బీసీలు శత్రువులుగా భావించుకుంటున్న దాఖలాలూ ఉన్నాయి. ఇలాంటి విపరీత పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాధికారం ఎలా సాధ్యం?

ఏ కులానికి ఆ కులం స్వంత అస్తిత్వాలు కలిగి ఉంటే తప్పు లేదు. మరో బాధిత కులాన్ని ద్వేషిస్తూ, హెచ్చుతగ్గులు పెచ్చరిల్లుతున్న తరుణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రాజ్యాధికార నినాదం నీటిమీద అలకడం లాంటిదేనా? కొందరు బిసీలు రాజ్యాధికారం సాధించాలనీ, కొందరు ఎస్సీలు సింహాసనం కైవసం చేసుకోవాలని వివిధ రకాల ప్రణాళికలు, సిద్ధాంతాలతో మరింత గందరగోళ వాతావరణం సృష్టిస్తున్నారు. ఎస్సీలపైకి బీసీలను, బీసీలపైకి ఎస్సీలను రెచ్చగొడుతూ పబ్బంగడుపుతూ అగ్రకులాల తొత్తులుగా, చెంచాలుగా మారిపోతున్న కాలంలో రాజ్యాధికారం పగటి కలేనా? రాజ్యాధికారాన్ని అందుకోవాలంటే ఏం చేయాలి? బహుజన పితామహులు ఫూలే, పెరియార్, డా॥ అంబేడ్కర్‌ల దృష్టిలో రాజ్యాధికారం ఎలా సాధించాలి? ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తుగడలు రాజ్యాధికారానికి మార్గాన్ని సులభ గ్రాహ్యం చేయగలవు? కేవలం మాదిగలు, కేవలం మాలలు అలాగే యాదవ, గౌడ, కాపు, చాకలి, మంగలి కులాలుగా వైయుక్తికంగా రాజ్యాధికారం సాధించగలవా? పోనీ బిసిలు ఎస్సీలు వేర్వేరుగా రాజ్యాన్ని కైవసం చేసుకోగలరా? రాజ్యాధికార సాధనలో ఈ అణగారిన కులాల్లోని విద్యార్థి, మేధావి, ఉద్యోగుల కర్తవ్యం ఎంత? ఇలాంటి ప్రశ్నలెన్నో బహుజన ప్రజల్ని, కార్యకర్తల్ని వేధిస్తున్నాయి. అయితే ఇవేమీ సమాధానం లేని ప్రశ్నలు కావు. పైగా ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానాల్ని ఇవ్వగలిగినప్పుడే స్పష్టమైన దృక్పథం, తాత్విక నేపథ్యం, సైద్ధాంతిక పట్టుతో బహుజన రాజ్యాధికార సిద్ధాంతాల్లో నెలకొన్న గందరగోళం నశిస్తుంది. స్పష్టమైన సైద్ధాంతిక నేపథ్యం లేని ఉద్యమాలు విఫలమవడం చరిత్రలో చూశాం. ఇండియా లోని కులవ్యవస్థ, దాని వికృత రూపాలు అవగతం చేసుకోక నిర్లక్ష్యంగా వ్యవహరించి కేవలం వర్గ దృక్పథంతో కమ్యూనిస్టు విప్లవ పోరాటాలు వైఫల్యం చెందడం ఇంకా పూర్తిగా గత చరిత్ర కాలేదు. కేవలం హిందుత్వ భావజాలంతో గాయపడిన గొంతుల్లోంచి పెల్లుబికిన ఆర్తనాదాలు కాకి కూతలుగా భావించిన హిందుత్వ జాతీయతా శక్తులు నీరుగారిపోవడం తప్పదు. ఇది వర్తమానం.

ఈ క్రమంలో బహుజనులు విస్పష్టసిద్ధాంతం, పకడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తే తప్ప రాజ్యాధికారం సాధ్యం కాదు. ఇందుకుగాను మొదట ఎస్సీ, బీసీల్లోని వైరుధ్యాల సమన్వయం సాధించడం అవసరం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఒక్కటే అంటే బీసీలు, ఎస్సీలను, ఎస్టీలు, బీసీలను బీసీలే వ్యతిరేకించడం గమనించగలం. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్టు బిసి, ఎస్సీ మేధావులు ఐడెంటిటీ క్రైటీరియాను ముందుకు తెచ్చి వికట్టాహాసం చేస్తున్నారు. ఎవరి ఐడెంటిటికీ ఏ ప్రమాదం లేకుండానే బహుజన దృక్పథం కొనసాగించవచ్చు. ఇంకా కావాలంటే 'మూలవాసీ దృక్పథం* దీనికి సరైన విధానం. బ్రాహ్మణ మత గ్రంథాలైన భగవద్గీత, రామాయణ మహాభారత, పురాణ, స్మృతిశృతులు కంచుకంఠంతో శూద్రులు, అతిశూ ద్రులు, నల్లటిప్రజలు, ఇండియన్ స్థానికజాతులని అరుస్తున్నాయి. వేదాలు, శ్రాస్తాలలో శూద్ర, అతిశూ ద్ర కులాలు/ జాతుల మూలాల చరిత్ర ఉంది. ఒరిస్సా ప్రాంతాన్ని గౌడ్‌లు, కర్ణాటక ప్రాంతాన్ని యాద వులు, సముద్ర ప్రాంతంలో ముదిరాజులు అనేక రాజ్యాలను పాలించారనేది చారిత్రక సత్యం. మాదిగ కులానికి చెందిన జాంబవంతుడు మొదట భారత పాలకుడని పురాణాలు, చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. 'శూద్రశ్చ అవివరశ్చ, వృషాలశ్చ, జఘనాంగ జన్యశ్చ' వంటి శ్లోకాలు శూద్ర, అతిశూద్ర జాతుల కూటమిలోని ఏకరూపత, చారిత్రక పునాదిలోని సామ్యతలను నిర్ధారిస్తున్నాయి. ఇటీవల వివిధ యానివర్శిటీలు చేసిన పరిశోధనల్లో ఈ దేశంలోని ఎస్సీ, బీసీలు అత్యంత ప్రాచీన జాతులని, ప్రపంచంలోని అనేక దేశాల్లోని ప్రాచీనజాతుల వంటివని నిరూపితమైంది. ఇది ఆధునికకాలంలో ఫూలే ప్రవచించాడు. పెరియార్ ఇదే దృక్పథంలో జీవితాంతం పనిచేశాడు. ఈ సంగతులను ప్రచారం చేయడం వల్ల ఈ జాతులమధ్య వైరుధ్యాలు బ్రాహ్మణవాదుల కుట్రేనని గ్రహించే విధంగా చేసి, సమన్వయం సాధించడం అవసరం. కుల సంఘాలు తమ కర్తవ్యాన్ని మరచి మనువాద పార్టీలవద్ద దళారుల పాత్ర పోషిస్తున్నాయి. ఇది బహుజన ప్రజల వ్యతిరేక విధానమేకాక ద్రోహంకూడా. తమ బతుకుదెరువుకోసం జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టడం క్షమించరాని నేరం. ఉద్యమ నాయకత్వ అవగాహనా రాహిత్యం రాజ్యాధికారానికి మరింత దూరంగా నెట్టివేస్తున్న దుస్థితి. పాలిష్‌డ్ నాయకత్వాన్ని ఇటు ఎస్సీల్లో, అటు బీసీ కులాల్లో రూపొందించాల్సి ఉంది. ఇది విద్యావేత్తల ప్రథమ కర్తవ్యం. ఈ దిశగా బామ్‌సెఫ్ వంటి సంస్థలు పనిచేయగలుగుతున్నా ఇది అణగారిన, బాధిత కులస్థులందరి బాధ్యత, అనివార్యం!
ఎస్సీల్లో మాదిగల సమస్య. జనాభాలో గణనీయంగా ఉన్నా మాదిగలు రిజర్వేషన్ల లబ్ధిలో మిక్కిలి వెనుకబడ్డారనే నేపథ్యంతో, మాల మాదిగలు, ఉప కులాలు తమ జనాభా దామాషా పద్ధతిన రిజర్వేషన్లు పొందేందుకు అనుగుణంగా తమను ఎ.బి.సి.డి.లుగా వర్గీకరించాలని పోరాడుతున్నాయి. నిజానికి ఇది న్యాయం. అంతేకాదు చాలా చిన్న సమస్య. ఈ సమస్యను అడ్డుపెట్టుకొని మనువాద పార్టీలు ఎంత లబ్ధిపొందాలో అంతా పొందాయన్నది వాస్తవం. ఈ దరిమిలా మాదిగలు బ్రాహ్మణీయశక్తుల కుట్రలను పసిగట్టి ఎండగట్టడంలో విఫలమయ్యారు. వర్గీకరణవంటి తాత్కాలిక సమస్యతోపాటు రాజ్యాధికారం వంటి శాశ్వత పరిష్కార మార్గాలపైనా దృష్టి సారించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎ.బి.సి.డీ.లుగా వర్గీకరించినా ఏదో ఒక గ్రూపులోని మరోకులం మళ్లీ అన్యాయానికి గురైనామనే నినాదంతో మరోపోరాటం అవసరమవు తుందేమో?! ఇలాంటి సమస్యనే బిసిలు ఎదుర్కొంటున్న విషయం పరిశీలనార్హం. బిసిల్లో వర్గీకరణ ఉంది. ఐనప్పటికీ కొన్ని అత్యంత వెనుకబడిన కులాలు తమను ఎం.బి.సి. లుగా గుర్తించాలంటూ ఉమ్మడి రిజర్వేషన్ల ద్వారా ఎదురవు తున్న సమస్యలను ఏకరువు పెడుతు న్నారు. ఇలాంటి సమస్యలే ఎస్సీ ల్లోనూ, బీసీల్లోనూ, అనైక్యతకు దారి తీస్తున్నాయి.

వీటన్నింటికీ మాస్టర్‌కీనే శాశ్వత పరిష్కారమైనప్పటికీ తాత్కాలిక ఉప శమనం/ మార్గమూ ఉన్నది. విద్య, ఉద్యోగ రంగాల్లో అత్యంత వెనుక బడిన ఎస్సీ, బీసీ కులాలకు ప్రత్యేక పథకాల ద్వారా (కార్పొరేషన్ ఏర్పాటు, ప్రత్యేక ఉద్యోగ సదుపాయాలు, విద్యావకాశాలు) అభివృద్ధి సాధించేందుకు అభివృద్ధి చెందిన కులాలు, మేధావి వర్గం ప్రయత్నించాలి. ఇది ఇట్లుంటే, రాజకీయరంగంలో బీసిలకు ప్రాతినిధ్యం లేనేలేదు. ఎస్సీల్లో ఉన్నా చట్టసభల్లో కాలుమోపని ఎస్సీ కులాల జాబితానే ఎక్కువ. వీటి పరిష్కారాల కోసం వివిధ దేశాల్లో వివిధ పద్ధతులు పాటిస్తున్నారు. దానినే దామాషా 'ప్రాతినిధ్య విధానం' అంటారు. కొన్ని దేశాల్లో అత్యంత తక్కువ జనాభా ఉన్న తెగలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ విధానం ఉపకరించింది. అంటే ప్రతి లక్ష మంది జనాభా ఉన్న కులానికి చట్టసభల్లో ప్రాతినిధ్యం వంటి విధానమే అన్ని కులాల సమస్యలకు పరిష్కారం. ఇది ఐక్యత, ఓర్పు, అంకితభావం ఉన్నప్పుడే సాధ్యం. సోదర కులాల పట్ల అభిమానం, గౌరవం మరింత ప్రయోజనకరం.

ఇక ప్రధాన సమస్య- ఎస్సీలు నాయకత్వం వహించాలా, బిసిలా? రాజ్యాధికారంలో పరస్పర అవసరం ఎంత? ఆంధ్రప్రదేశ్ ఐనా, తెలంగాణ రాష్ట్రమైనా ఎస్సీల జనాభా 18 నుండి 22 శాతం వరకు ఉంటుంది. ఇందులో వివిధ పార్టీల్లో ఇప్పటికే పీకల వరకు ఇరుక్కుపోయిన వారి శాతం 10 నుండి 12 వరకు ఉంటుంది. ఇక మిగిలింది 6 శాతం. ఈ ఆరు శాతానికి తొంభై సిద్ధాంతాలు, మూడు కొట్లాటలు, ఆరు విభజనలు. ఇలా కాకపోయినా 18 శాతం ఒక్కటిగా ఉన్నా స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటుకు 30 శాతానికి పైగా ఓటు బ్యాంకు కావాలి. బీసీల జనాభా 50 శాతానికి తక్కువ ఎక్కడా లేదు. బిసి ఓటర్ల పరిస్థితీ అంతే. ఒకవేళ బిసిలు ఒక్కటిగా ఉండగలిగితే 30 శాతం ఓట్లసాధన సులభమే. అలాంటప్పుడు స్వతంత్రంగా రాజ్యాధికారం సాధ్యమే. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. అందుచేత ఎస్సీల్లోని కనీసం 10 శాతాన్ని సమీకరించుకోగలిగితే తిరుగులేదు. కేరళ, తమిళనాడులలో గౌడ్‌లు ఎస్సీలుగా, రజకులు 18 ర్రాష్టాల్లో ఎస్సీలుగా, వడ్డెరలు కర్ణాటకలో ఎస్టీలుగా, ముదిరాజ్‌లు, బెస్తలు కొన్ని ర్రాష్టాల్లో ఎస్సీ, ఎస్టీలుగా చెలామణిలో ఉన్నారనే విషయం- బహుజనుల మూలాలు ఒక్కటేనని ప్రకటిస్తుంది. ఇక బిసిల్లో బిసిలు, ఎంబిసిలు విడిపోతే అగ్రకులాలు మరింత ఆయువు పట్టు పొందినట్టే. కాబట్టి ఎస్సీలకు బీసీల అసవరం, అలాగే బీసీలకు ఎస్సీ, ఎస్టీల అవసరం చాలా ఉన్నది. 1935లో భారత ప్రభుత్వ చట్ట రూపకల్పన సందర్భంలో, 1950లో భారత రాజ్యాంగ పరిషత్ ఎన్నికల విషయంలో బిసిల అనైక్యత వల్లే రాజకీయ బానిసలుగా మారిపోయారు. 66 సంవత్సరాలు గడిచినా చట్టసభల్లో బిసి ప్రాతినిధ్యం అందని ద్రాక్ష చందంగా మారింది. రాజ్యాంగ పరిషత్‌లో ఒక్క బిసి సభ్యుడుకూడా లేకపోవడం దేన్ని సూచిస్తుంది?
ఇటీవల జరిగిన లక్ష్మింపేట వంటి ఘటనలు చాలానే ఉన్నాయి. బిసీలపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక కేసుల సంఖ్య గణనీయంగానే ఉంది. పరస్పర విద్వేషాలకు కారణాలు అవగాహనా రాహిత్యమే. బ్రాహ్మణవాదాన్ని భుజాలపై ఊరేగించడమే. ఇలాంటి విషాదకరమైన ఘటనలు పునరావృతం కాకూడదంటే, ఏ కులంలోని మేధావి వర్గం ఆ కులంలో సామాజిక అవగాహన, రాజ్యాధికారం పట్ల కాంక్షపై బహుళ ప్రచారం చేయాలి. చైతన్యవంతులైన ప్రజలు కలహించుకోజాలరు. డా॥ బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పినట్లు, రెండు జాతుల మధ్య సంఘర్షణ ఒక జాతికి విజయాన్ని ఇస్తుంది. ఒకే జాతిలో సంఘర్షణ ఆ జాతిని తుదముట్టిస్తుంది. ఒక జాతి కుల అస్తిత్వాన్ని ఇంకో కులం గౌరవించి అమోదించగలిగితే అసలు సమస్యే ఉండదు. దీనికి సైద్ధాంతిక స్పష్టత లోతు చాలా అవసరం. కులాల వారీగా విద్వేషాలు సృష్టించుకోవడం, విడిపోవడం ఉద్యోగులు, విద్యావేత్తల్లోనే ఎక్కువగా ఉన్నది. విపరీతంగా పెరిగిపోయి అగ్రకులాలకు మద్దతుగా నిలవడానికి పోటీపడుతున్నారు. ఇది దురదృష్టకర పరిణామం. ఈ సెక్షన్‌లోనే ప్రథమంగా అవగాహన కల్పనకు కృషి చేయాలి. చరిత్ర పట్ల అవగాహన కల్పించగలిగితే ఐక్యత, తద్వారా అధికారం సులభ సాధ్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీల అసలు సమస్య పేదరికం కానేకాదు- అధికారం, స్వయంగౌరవం అసలు సమస్య! దీన్ని మౌలికంగా గుర్తించని వర్గాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి.

ఇది వేల సంవత్సరాల క్రితమే బీజాలు వేసుకుంది. స్వయంగౌరవం లేని జాతులు బానిసలుగా మారుతాయని చరిత్రకారుల భాష్యం నిజమే. ఆత్మగౌరవం కోల్పోవడం వల్లే బహుజనులు బానిసత్వానికే మొగ్గుచూపుతున్నారు. పెరియార్ ఈ దృష్ట్యా తన ఉద్యమానికి 'స్వయం గౌరవ ఉద్యమం'గా పేరు పెట్టారు. స్వయం గౌరవం ఉన్న జ్రలు మానవహక్కుల గురించి ఆలోచిస్తారు. పెత్తందారుల, అగ్రకులాల ఆధిపత్యంపై తిరగబడతారు. పెరియార్ ఇదే దృక్పథం కులనిర్మూలనకు దోహదకారి కాగలదని భావించాడు. ఫూలే తన ప్రతిబోధనలోనూ అణగారిన వర్గాల ప్రజల్లో ఆత్మనూన్యతా భావాన్ని పోగొట్టేందుకే ప్రయత్నించాడు. అందులో భాగంగానే బలిచక్రవర్తిని చరిత్రల్లోంచి వెలికి తీశాడు. బ్రాహ్మణ కులాల దాడుల చరిత్రను అవలోకించి స్పష్టమైన దృక్పథాన్ని అందించాడు. సామాజిక, చారిత్రక రంగాల్లోని గజి బిజిని చేధించి బహుజన దృష్టి కోణాల్లో మొత్తం వ్యవస్థను నిర్వచించాడు. ఇదే మూలవాసీ దృక్పథాన్ని హైదరాబాద్ సంస్థానంలో భాగ్యరెడ్డివర్మ, మద్రాస్ ప్రెసిడెన్సిలోని ఆంధ్రప్రాంతంలో త్రిపురనేని రామస్వామి ప్రచారంచేశారు. చివరగా స్వతంత్ర, పాలిష్‌డ్ నాయకత్వాన్ని బహుజన పితామహ సైద్ధాంతిక పునాదుల వెలుగులో నిర్మించుకోగలిగినప్పుడు రాజ్యాధికారం వస్తుంది, నిలుస్తుంది. డా॥ బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్నట్లు సాంస్కృతిక విప్లవం రాజకీయ విప్లవానికి, రాజకీయ విప్లవం సామాజిక, ఆర్థిక విప్లవానికి దారితీసి సమ సమాజం నెలకొనాలి. అప్పుడే ఈ బానిస కులాలకు విముక్తి. దీనిని సాధించడం ఎస్సీ ఎస్టీ బీసీ కులాల్లోని విద్యావేత్తలు, విద్యార్థులు, మేధావులు, నాయకుల కర్తవ్యం.

- కదిరి కృష్ణ
రచయిత మూలవాసీ బహుజన లిబరేషన్ మూవ్‌మెంట్ కన్వీనర్

Surya Telugu News Paper Dated : 24/09/2013 


అమ్మా మీకు దండం.. కలిసుండలేం.. By -అల్లం నారాయణ


అమ్మా మీరు పెద్దలు. పూజ్యులు. గొప్పవాళ్లు.. సరిగ్గా మీరక్కడ రాష్ట్రపతి భవనం ముందర ‘ఫ్యాషన్ పరేడ్’లాగా పట్టువస్త్రాలు, వజ్రవైఢూర్యాలు ధరించి తిరుగాడుతున్నప్పుడే.. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మందకృష్ణ మాదిగ యుద్ధభేరి జరుగుతున్నది. అతను నల్లవస్త్రం ధరించి ఆర్ట్స్ కాలేజీ ముందర వేదిక మీద కిందకూచొని ఉన్నడు. పెద్ద వేదిక. విమలక్క పాటపాడుతున్నది. ఆడుదాం దప్పుల్లా దురు అంటూ ఆమె కదమ్ తాల్ చేస్తున్నది.

ఇది బతుకు వాస్తవం. మేమింకా యూనివర్సిటీ క్యాంపస్‌లల్లో ఉన్నాం. చెట్ల కింద, మైదానాలన్నింటా అల్లుకొని ఉన్నాం. మీరు దిగ్విజయ్‌సింగ్ వద్దకు వెళ్లిన సమయానికే ఇక్కడ గుంటూరు నుంచొచ్చిన బహుజన కెరటం పల్నాటి శ్రీరాములు బవిరిగడ్డం గల ముఖంలోనుంచి విస్ఫులింగాలు చిమ్ముతుండగా నరకబడిన దళితుల శవాల గురించి మాట్లాడుతూ ఉన్నడు. చేలల్లో, చెలకల్లో పంట కాల్వల్లో పారిన దళితుల నల్లనెత్తురు గురించీ, మీరు ముక్కలు చేసిన దేహాల గురించీ మాట్లాడుతూ ఉన్నడు. సాదాసీదా మనుషులు. వీధులు ఆవాసం చేసుకుని ఎత్తిన పిడికిళ్లు, ఎర్రబడిన కళ్లు అలంకారాలు చేసుకొని జీవితకాలమంతా రాష్ట్రపతి భవన్‌లకూ, డిగ్గీరాజాల కోటలకు వెలియై, బలియైన బతుకు పటాలు వీళ్లవి. 

మీ చెలకలు, పంట కాల్వలు నల్లని దళిత నెత్తురుతో ఉప్పెనలై ప్రవహించినప్పుడు మందకృష్ణ మాదిగ మంకెనపువ్వై పూచి ఆ ఖండ ఖండాలైన మృతదేహాలను మోసి, రక్తక్షేవూతాన్ని నిర్మించాడు. అతను తెలంగాణవాడు. అతను దళిత పతాకయై ఎగసినవాడు. అతనిప్పుడు ‘యూటీ అంటే యుద్ధమే’ అని నినదిస్తున్నవాడు. అమ్మా! తల్లులూ మీరు గొప్పవాళ్లు. మీ పట్టుచీరల పాటి కాదు మా బతు కు. అయినా ఈ చేదు సంగతులు మీకెందుకు గుర్తు చేస్తున్నానంటే ఫైసలా రాష్ట్రపతి భవన్‌లో జరగదు. తెలంగాణ పంచాది డిగ్గీరాజా గడీలో తెగదు. అది ఓయూ లో మొలకెత్తుతుంది. ‘ఓయుద్ధభేరి’ వేదిక మీద ప్రత్యేకంగా ఒక పేరును గురించి మీకు మరోసారి గుర్తు చెయ్యడానికే ఇదంతా. సిరిపురం యాదయ్య ఒక పిల్లవా డు. తెలంగాణ కోసం తల్లడిల్లినవాడు. మా ఓయు దివారావూతులూ వెలిగి, పీతిరిగద్దల అణచివేత దుఃఖాల్లో, గాయాల్లో, మున్నూటా అరవై దినాలు ఆరిద్ర పురుగులై వికసించిన విద్యుత్తేజాలైన మా విద్యార్థుల సరిహద్దు ఎన్‌సీసీ గేట్ దగ్గర దగ్ధమైన ఒక వీరుడు. ఆ వీరుడి పేరిట యుద్ధభేరి మోగుతున్నది.


బహుశా మీరు తల్లులు కూడా.. కన్నబిడ్డలు బలైపోతే అనుభవమయ్యే వేదన ఒక అలుగెల్లిన చెరువులాగా ఎంత నరకయాతనగా ఉంటుందో? మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదనుకుంటా.. పాలసేపుల తీపి దుక్కం సంగతి మీకు చెప్పేంత గొప్పవాణ్ణీ కాను. కన్నబిడ్డలు పాలకేడుస్తున్నప్పటి బాధ, చెట్టెత్తు కొడుకు మంట ల్లో మాడిపోయినప్పటి రంపెపు కోత వివరించలేను. దుక్కానికి భాష లేదు. దుక్కానికి వర్ణనా లేదు.

ఆ మాటకొస్తే దుక్కానికి ప్రాంతమూ లేదనే నమ్ముతూ... తల్లులారా! ఆ యాదయ్య మంటల్లో ఎగురుతూ ఎగురుతూ, కాలిపోతూ, కూలిపోతూ, శ్రీకాంతచారి మంటల్లోంచి జై తెలంగాణ అంటూ... అవి తెలంగాణ సబ్బండ వర్ణాలకు, సకల జనులకు జీవితకాలపు పీడకలైనట్టు... కానీ ఆ పిలగాండ్ల బలిదానాల ఫలితంగా వచ్చిన తెలంగాణను అడ్డుకోవడానికి మీరు చతురంగ బలాలతో ఢిల్లీలో ‘ఫ్యాషన్ పరేడ్’లు జరుపుతున్నప్పుడు.. ‘ఓయు’ద్ధభేరి వేదిక ఒక ప్రశ్న అడుగుతున్నది. ఎన్నడన్నా.. ఈ మంటల్లో మాడిపోయిన మా పిల్లగాండ్ల కోసం ఒక్కనాడన్నా మీ కండ్లల్ల నుంచి ఒక్క కన్నీటి చుక్క విడిచారా! తల్లులారా! మంత్రుల, ఎంపీల, ఎమ్మెల్యేల సతీమణులారా! మీరు గొప్పవాళ్లు. సౌధాల్లో బతికే వాళ్లు. అద్దాల మేడల్లో కొలువుదీరేవాళ్లు. సంసారాల కడుపులు చల్లగా, శీతలమైన జీవితాలు గడిపేవాళ్లు. కానీ సత్యం కటిక చేదుగా ఉంటుంది. అది అద్దాల సౌధాల మీద విసిరినప్పుడు భళ్ళున పగిలి చెల్లాచెదురయిన గాజు ముక్క మీది ప్రతిబింబంలా మెరుస్తూ ఉంటుంది. కొంచెం నాటుగా ఉంటుంది. మీరు తల్లులే కదా! మా పిల్లల చావులూ పట్టని మీతో కలిసి ఉండాలని ఎట్లా కోరుకుంటారు.
అంతెందుకు.. మీరు రాష్ట్రపతి భవన్ వైపు వెళ్తున్నప్పుడో, వస్తున్నప్పుడో, పార్లమెంట్ స్ట్రీట్‌లో, శాస్త్రి భవన్ ఒకటి ఉంటుంది. శవాలు అంతటా పరివ్యాప్తమై ఉంటాయి.

లెక్కకు వెయ్యికి మించి. అక్కడ శాస్త్రి భవన్ వద్ద, పార్లమెంటుకు కూతవేటు దూరంలో, రంగాడ్డి జిల్లా నుంచి రైలెక్కి వెళ్లిన యాదిడ్డి తెలంగాణ కోసం ఉరిపోసుకుని చనిపోయిన ఒక చెట్టు ఉంటుంది. ఇదంతా అవాస్తవాల పునాదుల మీద నిర్మితమయిన ఇటీవలి చరిత్ర కానేకాదు. వెయ్యి అబద్ధాలకు తోడు వెయ్యినొక్క అబద్ధమూ కాదు. అమ్మలారా! మీరు ఆ పచ్చని చెట్టును దర్శించండి. వీలైతే ఆ చెట్టు చెప్పే రహస్య సంభాషణలని వినండి. అప్పుడు చెప్పండి. ఒక పచ్చని చెట్టు చెప్పిన ఒక వీరుని మృత్యురహస్యం. బహుశా రాష్ట్రపతికి, బహుశా పార్లమెంటులో కూచున్న తెల్లబట్టల ఏ హృదయునికీ ఆ మృత్యు రహస్యం అర్థం కానేలేదు. మా యూనివర్సిటీ ఇప్పుడలాంటి ప్రశ్నలు అడుగుతున్నది. డప్పుకొట్టి మోగించి న యుద్ధభేరి మిమ్మల్ని ఆ ప్రశ్న అడుగుతున్నది. దేహాలను ముక్కలు చేసిన మీరు, ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా ఇంకెన్ని ఖండిత శిరస్సులను మాకు కానుకలుగా ఇస్తారని, ఈ దాష్టీకం ఇంకెన్నాళ్లని, కమ్మ సమాజపు, సీమాంధ్ర రెడ్డి సమాజపు తెలుగుతల్లిని అడుగుతున్నడు మందకృష్ణ.

ప్రశ్నలు కొంచెం చేదుగా ఉంటాయి. రాష్ట్రపతి భవన్ దాకా వెళ్లొచ్చిన మీకు, మా బలిదానాల మీదుగా సమాధుల మీదుగా తొక్కుకుంటూ ఢిల్లీలో ఫ్యాషన్ పరేడ్‌లు చేస్తున్న మీరు కొంచెం జవాబులు చెప్పుకోవాల్సే ఉన్నది. ఎందుకంటే అమ్మా మీతో కలిసి ఉండ డం కల్ల అని ఈ చేదు నిజాలు మీకు జ్ఞానోదయం కలిగించాలనే ఇదంతా.. ఇవన్నీ యాధృచ్ఛికం కాదు. మీరక్కడ ఢిల్లీలో ఊరేగుతున్నప్పుడయినా, రాజ్‌భవన్‌లో సంచరిస్తూ మీమీ టీవీ గొట్టాల ముందు వచ్చీరాని మాటలు మాట్లాడినప్పుడయినా ఈ చేదు నిజాలని వినాల్సియే ఉంటుంది. తప్పదు.
‘మా పచ్చని పంట పొలాల్లో బిల్డింగులు కట్టుకుంటామా’? అంటారు మీరు.


అవును పచ్చని పంట పొలాల్లో కారంచేడు శవాలను విసిరేస్తారు. పంట కాల్వల్లో ఖండిత దేహాలను విసిరేస్తారు మీరు. బిల్డింగులన్నీ మంది జాగల కట్టి, పంట పొలాలకు నెత్తురు మళ్లించుకుంటారు మీరు. కవి అన్నట్టు పిట్టలేమైనా కానీ, పిల్లపూట్లన్నా పోనీ, మీరు మేఘాల దిక్కు చూడండి, మేం నదులు తన్నుక పోతాం. మనం కలిసుందాం అంటారు మీరు.. సాధ్యమా. తల్లులారా! మా ఓయూ దివారావూతులు, మున్నూటా అరవై ఐదు దినాలు, వేదికలతో, దద్దరిల్లుతున్నన్ని రోజు లూ అట్లా సాధ్యమేనా? అమ్మా... అ‘సత్యవాణి’ లెందరో మా మియాపూర్ దీప్తిశ్రీనగర్‌లను కొల్లగొట్టి ఉల్టా భారత, రామయణాలు, పవిత్ర భాషణలు పలుకుతుంటే.. కలిసుందమని యాసిడ్ సీసాలతో కమ్ముకొచ్చి బెదిరిస్తుంటే.. కనబడితే కబ్జా పెట్టినప్పుడు తిప్పిన యంత్రమూ మీదే.. యంత్రాంగమూ మీదే. మీభర్తలు..


రాజ్యం చక్రాలు తిప్పుతూ కొల్లగొట్టిన భూముల జాడల్లో మళ్లీ మా కవే చెప్పిన ట్టు ‘‘నా జానీ జిగర్ నగర సుందరి కళ్లూ, ముక్కూ, చెవులూ, చెంపల్ని చెక్కేసి నామ రూపాలు లేని అనామికను చేస్తున్న హైదరాబాద్ తాలిబన్లు, ఎకరాలుగా, గజాలుగా, లెక్కలేస్తున్న నయా వలస పాలకులు..’’ మీరయి.. ‘‘మా ఇంట్లో మేము పరాయిలమై , కాందిశీకులమై, అపరిచితులమై, ఒంటరి బాటసారులమై, మక్కా మసీదులో రెక్కలు విరిగి, నెత్తురు కక్కుకుంటూ, నేలకు ఒరిగిన ఒక చిన్న తెల్ల కబూతర్‌ల లెక్క తిరుగుతున్నం.. ఎగురుతున్నం.. వేదికలయి మెరుస్తు న్నం..’’ అమ్మా మమ్మల్ని కబళించిన వారే.. మీరే.. కలిసుండమంటే ఎట్లా నమ్మా... అమ్మా! నిజంగానే నిండు ‘బంగారు’ తల్లులారా!
మనుషుల్ని ముక్కలు చేసే సంస్కృతి గురించి మా నల్ల సూర్యుళ్లు, మంద కృష్ణలు, వంగపల్లి శ్రీనివాస్, పల్నాటి శ్రీరాములు, అద్దంకి దయాకర్‌లు పోరు నగారా వినిపిస్తున్నప్పుడు, గుండెలు కట్టిన డప్పుల దండోరా వినిపిస్తున్నప్పుడు మీ పక్కన నిలబడిన ఒక తల్లి..

అదే మీ ప్రాంతపు ఒక నల్ల సూరీని అర్థాంగి.. మోక్షవూపసన్న ఉస్మానియా మెడికల్ కాలేజీలో అడ్డగోలు పోస్టింగులూ, పదోన్నతులు పొంది అప్పుడు గవర్నర్‌కు, ఇప్పుడు రాష్ట్రపతికీ కలిసుండాలి ఖబర్దార్ అని వినిపిస్తే తల్లులారా! అమ్మా మోక్ష ప్రసన్నా... మాకు ఎట్లా ఉంటుంది. నిజంగానే ఇదొక ఆధిపత్యం సమస్య. ఇదొక వలసాధిపత్యం సమస్య. 
అమ్మా మోక్ష ప్రసన్నా.. మీ మీద నిండు గౌరవంతోనే .. చెబుతున్నాం. ఇది కులాలు, మతాల సమస్య కాదు. మా ప్రాంతం మీ ఏలుబడిలో కునారిల్లి ఇప్పుడు మేల్కొని ఒక్కటిగా ఒకే ఒక్క గొంతుకగా, వెయ్యి బలిదానాలుగా, తల్లుల ఆగర్భ శోకాల మీదుగా పోరాడుతున్నాం. మీరు మా ఉద్యోగాలూ, మా ప్రమోషన్లూ తన్నుకుపోయి, మా భూములూ కబళించి, మా జాగలూ కబళించి, మా ఆత్మల నూ కొల్లగొట్టి, మా భాషను, చరివూతను, సంస్కృతిని కొల్లగొట్టి కలిసుండమంటే మేడమ్.. ఎట్లా కుదురుతుంది. ఇది న్యాయమా?


మా స్త్రీలు.. మా కవయిత్రి చెప్పినట్టు... గాజుల గలగల వెనుక ఒట్టిపోయిన వెట్టి జీవితాన్ని, వంటి మీద రైకగుడ్డకు గతిలేని తల్లి చనుబాల చేవలో, ఆకలి పేగు ల్ని నూలుపోగులుగా, అతికి చీరెల్నిచ్చిన సిరిసిల్ల సంస్కృతినీ కోల్పోయినం. అదొ క శవాల దిబ్బ.. పోగుకు ఉరిపడ్డ ఉరిశాల. మరో కవి అన్నట్టు.. ‘మా తెలంగాణ ‘ఎన్నో పసుపు కుంకుమలు చెల్లిపోయి తెగిన మొండాలపై నీ హస్తసామువూదికాన్ని చదువుకొంటాం మేము.. ఓ తెలంగాణ’ అని అమ్మా, తల్లులారా! మదొక తరతరాల పోరాటం. మేము మీరెక్కిన మెట్లు ఎక్కలేము. మీరు తొక్కిన గడపలూ తొక్కలేము. రాష్ట్రపతి భవన్‌లూ, రాజ్‌భవన్‌లూ, డిగ్గీరాజా గడీలకూ రాలేము. సామాన్యులం. వేదికలమీద ఉంటాం, కోపానికి , శోకానికి, సంబురానికి కవిత్వాలు చెప్పుకుంటాం. పాటలు కైగట్టి పాడుకుంటాం. ధూమ్ ధామ్‌లై వెన్నెల రాత్రులను వెలిగిస్తాం. దివారావూతులు పోరాడుతూనే ఉంటాం. విశ్రమించం.


అయినా మీరు అడగాల్సింది మీ భర్తలని.. కుళ్లుమోతు అబద్ధాల చక్రవర్తులను, ఏడేండ్ల కింద ఢిల్లీ కెళ్లి జై ఆంధ్ర అని ఇప్పుడు అడ్డగోలు వజ్రాల కథలు చెబుతున్న మేతావి శ్రీనివాసులను, మీ ముఖ్యమంవూతిని.. మీ ముఖ్యమంత్రి హయాంలో పనిచేసిన మీ భర్తలను..ఇస్తే అభ్యంతరం లేదని, అధిష్ఠానానికి కట్టుబడి వుంటామని, ఇప్పుడు అడ్డం తిరిగి తెలుగు జాతి భవిష్యత్తును చీకటి మయం చేస్తున్న మీ భర్తలను నిలదీయండి. అయినా దిగ్విజయ్‌సింగ్ చెప్పినట్లుగానే.. ప్రజల మధ్య విద్వేషం నింపుతున్న మీ భర్తలను, సీమాంధ్ర ప్రయోజనాలను కాలరాస్తున్న మీమీ నాయకులను నిలదీయండి. మాట తప్పి, నైతికత కోల్పోయి, ఏ విలువలూ, ప్రమాణాలూ లేకుండా గాలివాటపు, కృత్రిమ ఉద్యమాలు నిడిపిస్తున్న మీకు దండం. వందనం. శణార్థి. మీతో కలిసి ఉండలేం.. ఉండలేం.

స్త్రీ మూర్తులుగా మీమీద గౌరవంతో, చెబుతున్నాం. సత్యం చేదుగా ఉంటుంది. కఠినంగా ఉంటుంది. అటున్న పొద్దు ఇటు పొడిసినా ‘ఓయుద్ధ భేరి’ సాక్షిగా, మంద కృష్ణ ప్రకటిస్తున్నాడు. వినం డి.. యూటీ అంటే యుద్ధమే. రేపు కోదండరాం ప్రకటిస్తడు చూడండి. తెలంగాణ వెనక్కి వెళితే అంతర్యుద్ధమే. కేసీఆర్ చెప్తున్నడు బాగా వినండి. ఆరునూరయినా తెలంగాణ తథ్యం. మేమందరం చెబుతున్నం తల్లులారా! మమ్మల్ని బతకనివ్వం డి.. మేం విడిపోయినం. ఇక కలిసి ఉండలేం. ఉండలేం. ఉండలేం. మళ్లీ మా కవి చెప్పినట్టే ‘‘వెయ్యి వసంతాలు పూసి రాలిపోతయి, వంద శరద్‌రావూతులు తూలిపోతాయి, తెలంగాణ/ నా తెలంగాణ’’ అదొక్కటే మా మంత్రం. 
జై తెలంగాణ




narayana.allam@gmail.com
Namsete Telangana Telugu News Paper Dated : 22/09/2013 

Monday, September 23, 2013

పతనమవుతున్న విశ్వవిద్యాలయాలు By -శ్రీధర్ మోతె


ఈమధ్యన ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాల నైపుణ్యాలు, విలువల స్థాయిని వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ (ఏఆర్‌డబ్ల్యూయూ)విడుదల చేసింది. అనేక అధ్యయనాలు, పరిశీలనల అనంతరం 2013 కు గాను 500 అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాను తయారు చేసింది. వీటిలో అమెరికన్ యూనివర్సిటీలే అగ్రగామిగా అత్యుత్తమ 182 స్థానాలను ఆక్రమించాయి. ఆ తర్వాత యూరోపియన్ యూనివర్సిటీలు తరువాతి 200 స్థానాలను దక్కించుకున్నాయి. వీటిలో 17 చైనా విశ్వవిద్యాలయాలున్నాయి. ప్రపంచంలో 20 అగ్రగామి అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో 17 అమెరికా యూనివర్సిటీలే ఉన్నాయి. ప్రపంచంలో అన్నింటికన్నా అత్యుత్తమ ప్రథమ శ్రేణి యూనివర్సిటీగా హార్వార్డ్ విశ్వవిద్యాల యం 100 పాయింట్లు దక్కించుకున్నది. ఈ జాబితాలో భారతదేశంలోని ఒక బెంగుళూరు ఐఐఎస్‌సీ మాత్రమే 300 స్థానంలో నిలిచి చోటు దక్కించుకున్నది.

ఆయా యూనివర్సిటీల నుంచి వెలుగులోకి వస్తున్న ప్రపంచ మేధావులు, వారు పొందుతున్న మెడల్స్, గౌరవం, పరిశోధనలు, ప్రఖ్యాతిగాంచిన పత్రికల్లో వారు రాసిన వ్యాసాల ప్రచురణల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌లు ఇచ్చారు. అలాగే ఆయా యూనివర్సిటీల్లో వనరులు, వసతులు,అర్హత గల బోధనా సిబ్బంది , అర్హతలు, నైపుణ్యాలను కూడా పరిశీలనలోకి తీసుకున్నారు. అలాగే బ్రిటన్‌కు చెందిన ‘క్యూఎస్’ ఏజెన్సీ కూడా ప్రపంచలోని 300 అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాను తయారు చేసింది.వీటిలో ఢిల్లీ ఐఐటీ 212స్థానం దక్కించుకున్నది. మిగతా ఐఐటీలన్నీ తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఆసియా ఖండంలోని 50 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో మన ఐఐటీలు 40వ స్థానంలో నిలిచాయి. ఈ క్రమంలో ఈ అధ్యయన సంస్థలకు అనేక విమర్శలు, చర్చల అనంతరం మాత్రమే మన యూనివర్సిటీలు తమ సమాచారాన్ని అందజేశాయి. వసతులు, నాణ్యతల విషయంలో గోప్యతను ప్రదర్శిస్తున్న విధానంపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఈ అధ్యయన ఏజెన్సీలకు సహకరించాయి. కావల సిన సమాచారాన్ని అందజేశాయి. అయితే ఈ అధ్యయన సంస్థలు ప్రపంచంలో అత్యుత్తమ యూనివర్సిటీలను నిర్ణయించడానికి పరిగణనలోకి తీసుకున్న అంశాలు, పరిశోధన తదితర అంశాలు కూడా సరియైన ప్రాతిపదికనలేవనే విమర్శలున్నాయి. 

భారతదేశంలో 700 విశ్వవిద్యాలయాల్లో దాదా పు 35వేల కాలేజీలున్నాయి. ఇదే సందర్భంలో మనం ప్రపంచంలోనే అత్యధిక మానవ వనరులున్న దేశంగా గొప్పలు చెప్పుకుంటాము. కానీ పరిశోధనా పత్రాలు సమర్పించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే మనం జపాన్, చైనా కంటే వెనకబడి ఉన్నాం. ప్రచురణల విషయంలో కూడా మిగతా యూనివర్సిటీలకన్నా చాలా వెనుకబడి ఉన్నాం. ఒక్క కాలిఫొర్నియా యూనివర్సిటీ నుంచే 120 మం ది ప్రపంచ స్థాయి మేధావులు తయారయ్యారు. ఇందులో ఒక్కరు కూడా భారతీయులు లేకపోవడం గమనార్హం. 

ఇక ఆంధ్రవూపదేశ్ విషయానికి వస్తే.. మన రాష్ట్రం లో ప్రతియేటా 250 ఇంజనీరింగ్ కాలేజీలు సుమారుగా రెండు లక్షల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఉత్ప త్తి చేస్తున్నాయి.ఇలా తామర తంపరగా బయటికి వస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థుల్లో కనీస స్థాయి పరిజ్ఞానం కూదా ఉండటం లేదన్న విమర్శలు వెల్లు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల కోసం ఆయా కాలేజీలను సందర్శించిన పలు కంపెనీలు విద్యార్థుల్లో 20, 25 శాతం మందిలో మాత్రమే కనీస పరిజ్ఙానం ఉందని విమర్శిస్తున్నాయి. వీరికి ఉద్యోగానికి కావలసిన పరిజ్ఞానం, నైపుణ్యాలు కనీసంగా కూడా లేవని అంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ పట్టా లు చేతపట్టుకున్న విద్యార్థులు నిరుద్యోగులుగా మిగులుతున్నారు.విషాదమేమంటే..దేశంలో ప్రతియేటా విద్యా ప్రమాణాలు నానాటికీ దిగజారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంనుంచి ప్రతియేటా లక్షాయాభై వేలమంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాల బాట పడుతున్నారు. ఐఐటీల నుంచి బయటకు వస్తున్న విద్యార్థుల్లో 90 శాతం మంది ఉన్నత చదువులు, మంచి అవకాశాల కోసం విదేశాలకు వెళుతున్నారు.

ఈ నేపథ్యంలోనే అమెరికాలో బిల్‌గేట్స్ కలల పంట సిలికాన్ వ్యాలీలో మెజారిటీ భారత విద్యార్థుల కృషే ఉంటున్నది. వీరే ప్రపంచంలో అత్యుత్తమ పరిశోధనలు, ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. 
నిజానికి విద్యాబోధన అన్నింటికన్నా ఉదాత్తమైనది. ఉత్తమమైనది. గౌరవవూపదమైనది. ప్రపంచంలోని చాలా దేశాల్లో అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన వారినే బోధనా సిబ్బందిగా తీసుకుంటారు. అలాగే వారికే సామాజిక గౌరవం కూడా దక్కుతుంది. దురదృష్టవశాత్తూ మనదేశంలో దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నది. ఏవిధమైన ఉద్యోగాలు రానప్పుడే బోధనా వృత్తిని ఎంచుకునే పరిస్థితి ఉన్నది. ఒకానొక అనధికార సర్వే ప్రకారం 80 శాతం బోధనా సిబ్బంది తమ పిల్లలను బోధనా వృత్తిలోకి పంపడానికి సంసిద్ధంగా లేరు. దీన్ని బట్టే మనదేశంలో బోధనా వృత్తి పట్ల సమాజంలో ఉన్న గౌరవం, స్థానం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దేశంలోని అన్ని బోధనాలయాలతోపాటు, ఐఐటీల్లో కూడా బోధనా సిబ్బంది కొరత ఉన్నది. ఐఐటీలు 40 శాతం బోధనా సిబ్బంది కొరతతో సతమతమవుతున్నాయి. 

మనదేశంలో బోధనాలయాలను దేవాలయాలుగా చెబుతారు. కానీ ఇవ్వాళ అవి అనేక సమస్యలతో కునారిల్లుతున్నాయి. రాజకీయాలు, ఆశ్రీత పక్షపాతం, వివక్షలు, అవినీతితో అధఃపాతాళానికి పడిపోయాయి. ఉన్నత విద్యాలయాల్లో అత్యున్నత అధికార నిర్ణయక ఉద్యోగాలు, అత్యున్నత పాలకమండలి సభ్యులు, బోధనా సిబ్బంది నియామకంలో కూడా రాజకీయాలు చోటు చేసుకుంటున్నా యి. పాలక ప్రభుత్వాలు, పార్టీలు తమ రాజకీయ అనుంగు అనుయాయులను అందలమెక్కిస్తున్నారు. నియామకాల్లో పారదర్శకతకు పాతరేసి పక్షపాతానికి పల్లకి కడుతున్నారు. దీంతో విశ్వవిద్యాలయాల్లో నిష్పాక్షికత మటు మాయమై కులం, రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. స్వయం వూపతిపత్తి ఆవిరైపోయి పైరవీ రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో విద్యాలయాల్లో విద్యావూపమాణాలు అడుగంటిపోయాయి. పరిశోధనలు, విజ్ఞానం కనీస స్థాయిని దాటడంలేదు. దీంతో వెలుగులు నింపాల్సిన విశ్వవిద్యాలయాలు చీకట్లను పం చుతున్నాయి. మరోవైపు విద్యార్థులు తమ భవిష్యతు ్తకోసం ఎంచుకున్న మార్గా ల్లో పయనించడం కోసం తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. అస్తవ్యస్తమైన పాఠ్యాంశాలు, భారమైన సిలబస్‌లతో కృంగిపోతున్నారు. ఇప్పుడున్న పరీక్షావిధానంతో విద్యార్థులు మరింత ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలో కార్పొరేట్ కాలేజీ లు అనుసరిస్తున్న విధానాలతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నా రు. ఉన్నత విద్యావకాశాల కోసం కోచింగ్ సెంటర్లు చేస్తున్న బోధనా విధానం కూడా పలు విమర్శలకు తావిస్తున్నది. 

దేశంలో విద్యా వ్యవస్థ తీవ్రమైన నిధుల కొర త ఎదుర్కొంటున్నది. నాణ్యమైన విద్యా ప్రమాణాలు, పరిశోధనలు కూడా నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉన్న త చదువులకోసం దేశం నుంచి విదేశాలకు వల స వెళుతున్న విద్యార్థుల కారణంగా వందల వేల కోట్ల రూపాయలు తరలిపోతున్నాయి. ఈ నిధులే ఇక్కడ ఉంటే ఇక్కడి విశ్వవిద్యాలయాలు ఎంతో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేవి. అలాగే విద్యా ప్రమాణాలకోసం ప్రపంచ దేశాలన్నీ తమ దేశ ప్రణాళికల్లో పెద్దపీట వేస్తుంటే.. మన దేశంలో మాత్రం విద్యకోసం ప్రణాళికా వ్యయం రాను రాను తగ్గిపోతున్నది. చైనాలో దేశ ప్రణాళికలో 20 శాతం విద్యకోసం ఖర్చు చేస్తున్నారు. కానీ మన దేశంలో మాత్రం పాలకులు నామమావూతపు నిధులు విదిల్చి చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు పేద ప్రజల అభ్యున్నతి పేరు మీద వం దల కోట్లు సబ్సిడీలు ఇస్తున్నారు. దేశ పునర్నిర్మాణానికి ఉపకరించే నిధులను సంక్షే మ పథకాలకు మళ్లించి ఓట్ల రాజకీయం చేస్తున్నారు. దేశ భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తున్నారు. వందకు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సంక్షేమ రాజ్యం పేరు మీద అనేక రాయితీలు, సబ్సిడీలు ఇస్తున్న ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాలు, దేశాభివృద్ధిని నిర్దేశించే విద్య కోసం మాత్రం నామమాత్రం నిధులు ఇచ్చి చోద్యం చూస్తున్నది. ఈ పరిస్థితులు ఇలా గే ఉంటే దేశ ప్రగతి కుంటుపడే ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. 

ఈ పరిస్థితుల్లో ప్రపంచంలోని విశ్వవిద్యాలయాల స్థాయికి మన విద్యాలయా లు చేరుకోవాలంటే.. నిధుల కేటాయింపు చాలినంతగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మన ప్రభుత్వం ఇది చేయడానికి బదులు దేశంలోకి విదేశీ విద్యాలయాలను అనుమతిస్తున్నది. విద్యా ప్రమాణాలు పెరగాలంటే ప్రపంచంలోని అత్యున్నత ప్రమాణాలు గల విద్యాలయాలతో కలిసి ఉమ్మడిగా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాలయాలను ఏర్పాటు చేయాలి. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించిన నాడే సర్వతోముఖాభివృద్ధికి అవకాశం ఉంటుంది. అలాగే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచానికి దీటుగా దేశం అభివృద్ధి చెందడానికి వీలు ఉంటుంది.


srimothe@gmail.com 
స్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఉపాధ్యక్షులు

Namasete Telangana Telugu News Paper Dated : 23/09/2013

నా మంచం నాఇష్టం! (Book Review) డా ఎం.ఎఫ్‌. గోపీనాధ్‌ రచన ‘నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా? అయితే సంతోషం!’ ఆవిష్కృతమవుతున్న సందర్భంగా ఆ పుస్తకంలోని కొన్ని భాగాలు)


నా కంప్యూటర్‌ నా ఇష్టం, నా ఫేస్‌ బుక్‌ నా ఇష్టం- అనాలి గానీ నా మంచం, నా ఇష్టం ఏంటి అనుకుంటున్నారా? భూమికి ఆత్మగౌరవానికి సంబంధం ఉన్నట్లే ఈ దేశంలోని గ్రామీణ జీవితంలో మంచానికి ఆత్మగౌరవానికి, కుల అణచివేతకు సంబంధం ఉందని నా నమ్మకం. చాలా మంది నాగరీకులు ఒప్పుకోకపోవచ్చు. కాని కుర్చీ కన్నా మంచానికే ఈ దేశ గ్రామీణ జీవితంలో విలువెక్కువ. మీరు నాలాగా ఊరోళ్లైతే మంచానికి ఆత్మగౌరవానికున్న లింక్‌ ఏమిటో అర్థం అవుతుంది. ఆ లింకేంటంటే ఈ దేశంలో మనుష్యులందరూ సమానం కాదని, అట్లా ఉండటానికి వీల్లేదని వేదాలు ఘోషించాయి. అట్లా అని బ్రాహ్మణేతరులను నమ్మించారు. అందుకే దోపిడీ కులపోడొస్తే, దోపిడీకి గురయ్యే కులపోడు మంచం మీద కూర్చోటం అపచారం, అరిష్టం అయింది. మా ఇండ్లలో అంటే మాల మాదిగిండ్లల్లో కూడా మంచాలు ఉంటాయి. పందిరి మంచాలు లేకపోయినా కుక్కి మంచాలైనా ఉంటాయి.

కనీసం ఒక్క మంచమైనా ఉంటుంది. మా కన్నా పై కులపోళ్లు మా ఇంటికి ఎవరొచ్చినా, లేక అటువైపు వెళ్తున్నా మేమందరం అంటే లేవలేని గర్భిణీ స్త్రీలైనా, ముసలోళ్లైనా దిగ్గున లేచి లెంపలేసుకోవాలి. వాళ్లు వచ్చినప్పుడే కాదు, రాకముందు కూడా మంచంలో కూర్చున్నందుకో, ‘మంచం’ అనే వస్తువును ఇంట్లో ఉంచుకున్నందుకో కాని, మా వాళ్లు తరతరాలుగా లెంపలేసుకుంటున్నారు. మా చిన్నప్పుడు, మా గూడెంలో మా పెద్దోళ్లు మాకు నేర్పే రూల్‌ నెం.1. పెద్ద కులపోళ్లు వస్తే మంచం మీద కూర్చోకూడదు. రూల్‌ నెం.2. కూర్చుంటే దిగ్గున లేచి, లెంపలేసుకోవాలి. రూల్‌ నెం.3. తలకు చుట్టుకున్న తలగుడ్డ తీసి, మంచాన్ని దులిపి ‘కూర్చోండయ్యా’ అని, వంగి రెండు చేతులు మంచం వైపు చూపించాలి. 

దీనికి భిన్నంగా జరక్కూడదు. ఒక వేళ ముసలివాళ్ళు మంచం మీద పడుకోవాలనుకుంటే మంచాన్ని తలక్రిందులుగా వేసి అంటే మంచంకోళ్ళు పైకి, నులక క్రిందకు వచ్చేటట్లు వేసికొని పడుకోవాలి. ఊరు, వాడకు సరిహద్దు మా ఇల్లు. మా ఇంటికి పడమర మాల ఇళ్లు, తూర్పున ఒక గౌండ్ల ఇల్లు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత కంసాలోళ్ల ఇల్లు. దాని పక్కనే వేరే ఊరు నుండి వచ్చిన రెడ్డోళ్ళ ఇల్లు, దక్షిణాన కొంచెం మోతుబరి రెడ్ల ఇళ్ళు, ఉత్తరాన దొడ్లు ఉన్నయి. మా ఇంటికి ఉత్తరాన ఉన్న దొడ్లలో నుండి మెయిన్‌రోడ్‌కు (డొంక)కు అనధికార దారి ఉంది. ఆ దారి గుండా నడిస్తే శూద్రోళ్లకు ఒక అరకిలోమీటర్‌ దూరం కలిసి వస్తుంది, మెయిన్‌రోడ్‌ ఎక్కటానికి. చిన్నప్పటి నుండి నాకొక అలవాటు ఉంది. అదేంటంటే, నా మంచంలో నేను కూర్చోవటం. ఎవరొచ్చినా సరే మంచం మీద నుండి లేవకపోవటం. 

ఈ అలవాటు ఈ దేశంలోని దళితులకు నిషిద్ధం. కానీ నేనట్లా అనుకోలేదు. నా మంచం నా ఇష్టం. అందుకే మా ఇంటి ముందు దారి ప్రక్కన మంచం వేసుకుని స్వేచ్ఛగా కూర్చోని బువ్వ తినేవాణ్ణి. శూద్ర కులాలు అంటే రెడ్లు, కోమట్లు, కొన్ని బీసీల కులాలవాళ్లు ఆ దారి వెంట వెళ్తున్నప్పుడు లేచేవాణ్ణి కాదు. ఈ ‘సద్గుణా’లేవీ నాకబ్బలేదు. అందుకు నేను ఏనాడూ చింతించలేదు. పైగా గర్వపోతుననే పేరు కూడా వచ్చింది. సోకాల్డ్‌ అగ్రకులాల్తో ‘గర్వపోతు’నని 1965ల్లోనే పిలిపించుకున్నానంటే, మీకేమనిపిస్తుందో నాకు తెలీదు కానీ మరో జన్మంటూ ఉంటే మా వూళ్లోనే, మా కులంలోనే లేదా అలాంటి కులంలో ఏదో ఒక దాన్లో పుట్టి అయ్యంకాళి అంత ఎత్తున ఎదిగి నడిమంచంలో మళ్లీ మళ్లీ కూర్చోవాలనిపిస్తుంది.

ఆ నా అలవాటును సవాలుగా తీసుకున్నారో, లేక అవమానపడ్డారో కాని ఆయా కులాలవాళ్లు ఆ దారిన రావటం మానేశారు. అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను కానీ మా పెద్దయ్య కొడుకు శౌరి అన్నయ్య మాత్రం ‘జాగర్తరా! మనం అడవిలోకి పోతే ఏ చెట్టు మీద గొడ్డలేస్తాం? మంచిగున్న దాని మీదే కదా! మరి మా అందరిలో నువ్వే చదువుకుంటున్నావు. నీ పోకడేమో పెద్ద కులపోళ్ళని లెక్కచేయడం లేదు. జాగర్త!’ అన్నాడు.
......
మా ఊళ్ళో నేను ప్రైమరీ స్కూల్‌లో చదివేటప్పుడు మా ఊరి పంతులమ్మగారు (బ్రాహ్మణావిడ) ఒక పరీక్ష పెట్టారు. ఒక పుస్తకంలో రాజస్తాన్‌, భోజ్‌పూర్‌, ఉదయ్‌పూర్‌, జైపూర్‌, జంతర్‌మంతర్‌ లాంటి పదాలతో కూడిన పాఠం ఉంది. ఈ పాఠాన్ని తప్పుల్లేకుండా అందరూ చదవాలి. ఒకవేళ చదవకపోతే చదివినవాళ్లతో లెంపకాయ వేయిస్తానన్నారు పంతులమ్మగారు. మొదట మా క్లాస్‌లోని రెడ్డోళ్ళ పిల్లల్ని చదవమంది. అ పదాల్ని పలకలేక చదవలేకపోయారు. నన్ను చదవమంటే చదివాను. పంతులమ్మగారు లెంపకాయ వేయమంది. రెడ్డి పిల్లవాడి చెంప మీద ఒక్కటేశాను. వెంటనే పెద్ద గొడవ మొదలైంది. పంతులమ్మగారిని నిలదీయటానికి ఓ గుంపు స్కూల్లోకి వచ్చింది. ‘ఎంత ధైర్యం? మాలోడి చేత రెడ్డోరి పిల్లల్ని కొట్టిస్తావా?’ అని. పంతులమ్మ బిక్క మొఖం వేసి స్కూల్‌కు శెలవిచ్చింది.
.....
ఒకరోజు పంతులుగారు వానొచ్చినందువల్ల గోసీడు నుండి రాలేదు. బడిలో పిల్లలందరం గోల చేస్తున్నాం. అంతలోనే ఏమైందో ఏమోగాని మా దళిత పిల్లల్ని ఊరోళ్ళ పిల్లలందరూ కలిసి చీపుర్లు తీసుకుని బడి నుండి వెళ్ళగొట్టారు. ఇప్పటికీ ఈ సంఘటన నాకు అవమానంగా తోస్తుంది. బహుశా ఇలాంటి కార్యక్రమాలన్నీ అంటరానివాళ్ళ చదువును అడ్డగించే హిందూ ప్రణాళికలో భాగమనుకుంటాను. లేకుంటే అంత సడెన్‌గా ఒక రిఫ్లెక్స్‌లాగా ఊళ్లో అన్ని కులాల పిల్లలు ఏకమై మాలోళ్ళ పిల్లల్నందరినీ బడి నుండి గెంటేయడమేమిటి? ఇలాంటి హిందూ స్వభావానికి భిన్నంగా ‘మీరు చదువుకోవాలి’ అని స్కూల్స్‌ పెట్టిన క్రిస్టియన్స్‌ను, ‘మీరు ఆరోగ్యంగా ఉండాలి’ అని 150 సంవత్సరాల క్రితమే మిషన్‌ ఆసుపత్రులు కట్టించిన క్రిస్టియన్‌ మతాన్ని మేము గౌరవించి, మతం మార్చుకుంటే గాంధీలాంటి రుషులకు ఎందుకు కోపం? మేం చదువుకోవడం, జ్ఞానాన్ని పొందడం, ఆత్మగౌరవంతో బతకడం, గాంధీలాంటి అభివృద్ధి నిరోధకులకు ఇష్టముండదు కాబోలు. 

మేము చదువుకున్న ప్రైమరీ, హైస్కూల్‌ పుస్తకాల్లో ఒక ఫూలేని గురించికానీ, అంబేడ్కర్‌ గురించి కానీ, సావిత్రీబాయి ఫూలే గురించి కానీ ఏమీ లేదు. అభివృద్ధి నిరోధకులైన కులతత్వవాదుల గురించి మాత్రం గుట్టల కొద్దీ గుప్పించారు. నేను ప్రైమరీ స్కూల్లో చదువుతుండగా మాకు మహాత్మా గాంధీ గురించి ఒక పాఠం ఉంది. పాఠంలో అన్ని సుగుణాలతోపాటు ‘గాంధీగారు ఎప్పుడూ అబద్ధం ఆడలేదు’ అని మా పంతులుగారు ఒకటే మెచ్చుకుంటున్నారు. నా చిన్న మెదడుకు అప్పుడే ఒక అనుమానం కలిగింది. అసలు అబద్ధం ఆడకుండా ఉండడం ఏ మనిషికైనా ఎట్లా సాధ్యం? అని. ఇప్పుడనిపిస్తుంది. వకీలు వృత్తిని చేపట్టిన వ్యక్తికి, వ్యాపార కులం నుండి వచ్చిన వ్యక్తికి అబద్ధం చెప్పాల్సి రావడమనేది వాళ్ల వృత్తే కదా! ఇది చాలా వాస్తవ విరుద్ధమైన విద్యా బోధన. 
... 
1978 ఫిబ్రవరి 24న ఆర్‌ఈసీ వరంగల్‌లోని ఒక హాస్టల్‌లో నేను ‘వైట్‌మాన్‌’ అనే ప్రకాశ్‌ మాస్టర్‌ (ఐ.వి. సాంబశివరావు)ను కలవటం జరిగింది. ఆయన రహస్య జీవితం గడుపు తున్నారని, రాడికల్‌ విద్యార్థి రాష్ట్ర మహాసభలకు ఇంచార్జ్‌గా వచ్చారని తర్వాత తెలిసింది. ఆయన ఆ రోజు ‘చెరుకూరి రాజ్‌కుమార్‌ అధ్యక్షుడిగా, రవి ఉపాధ్యక్షుడిగా, నేను ప్రధాన కార్యదర్శిగా మరి కొంతమందిని మహాసభ ఎన్నుకో బోతున్నదని, బాధ్యతగా ఉండాలని చెప్పారు. అధ్యక్షుడిగా రవిని ఉంచాలని వరవరరావు పట్టుబట్టాడని, అయినా పార్టీ ఒప్పుకోలేదని ‘వైట్‌మాన్‌’ తర్వాత చెప్పారు. ఈ విషయం రవి చాలాసార్లు, అక్కడక్కడ రాజ్‌కుమార్‌కన్నా తనకే అధ్యక్షుడయ్యే అర్హత ఉందని అన్నందువల్ల ఒక ఎగ్జిక్యూటివ్‌ మీటింగ్‌లో, అనేక ఇతర అభియోగాలతో కలిపి రవిని ప్రకాశ్‌ మాస్టర్‌ నిలదీయటం, రవి తన తప్పు ఒప్పుకుని, ఉపాధ్యక్షుడిగా రాజీనామా చేస్తాననడం, ప్రకాశ్‌ మాస్టారే వారించి, సవరించు కోమనడం... 

ఇవన్నీ 1978లో జరిగాయి. వాస్తవంగా రాజ్‌కుమార్‌కున్న పట్టుదల, నిరాడంబరత, నిజాయితీ, సిద్ధాంత పరిజ్ఞానం రవిలో పదోవంతు కూడా లేదనేది వాస్తవం. మరి వరవరరావు రాజ్‌కుమార్‌ను ఎందుకు వద్దన్నాడు? రవిని ఎందుకు సపోర్ట్‌ చేశాడు? రవి బ్రాహ్మణుడు, వరవరరావు బ్రాహ్మణుడు. రాజ్‌కుమార్‌ బ్రాహ్మణుడు కాదు. రవి 1979లో ఖమ్మంలో జరిగిన రాడికల్‌ యూత్‌ లీగ్‌ సభల్లో పనిచేసి ఆ తర్వాత బాంబే వెళ్లిపోయాడు. డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ తమ్ముడు కాబట్టి ఒకసారి కలిశాడు. రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యాడు. 1978 ఫిబ్రవరి, 25, 26 తేదీల్లో వరంగల్‌లో రాడికల్‌ విద్యార్థి సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభలు ప్రారంభమవుతాయన్న రోజు ఉదయం, లిన్‌పియావో గ్రూపుకు చెందిన రామిరెడ్డి (ఇప్పుడు ప్రొఫెసర్‌ రామిరెడ్డి) నాయకత్వంలో కరపత్రాలు పంచు తున్నారు.

‘కొండపల్లి బొమ్మలు కొలువు తీరటానికి తప్ప పోరాటానికి పనికిరా’వని, ‘నరకండి, చంపండి భూస్వాముల్ని’ అని నినాదాలు ఇచ్చుకుంటూ వెళ్తున్న పదిమందిని చూశాము. ఈ మహాసభల్ని లీగల్‌గా ఉన్న వరవరరావు అన్నీ తానై నడుపుతున్నాడు. నాకు పరిచయం లేదు. అరుణ్‌ శౌరి (బ్రాహ్మణుడు, బిజెపీ ప్రభుత్వంలో పబ్లిక్‌ సెక్టార్‌ని నిండా ముంచిన మంత్రిత్వశాఖ మంత్రి) ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథి, ప్రారంభోపన్యాసకులు. ఈ వ్యక్తిని ప్రారంభోపన్యాసానికి ఆహ్వానించడానికి బాధ్యులు వరవరరావే. భారతీయ చరిత్రలో అభివృద్ధి నిరోధక బ్రాహ్మణులకు, లిబరల్‌ బ్రాహ్మణులకు, హాట్‌లైన్‌ ఎప్పుడూ ఆపరేట్‌ అవుతుం దనటానికి అరుణ్‌శౌరి, వరవరరావుల అనుబంధమే ఒక తాజా ఉదాహరణ. అంబేడ్కర్‌ మీద విషం వెళ్లగక్కిన ‘వర్షిప్పింగ్‌ స్మాల్‌ గాడ్స్‌’ అనే పుస్తకాన్ని రాసిన అరుణ్‌శౌరి, అంబేడ్కర్‌ను అవమానించి, తర్వాత అంబేడ్కర్‌ యువజన సంఘాలు దండెత్తాయని, అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మోకరిల్లిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ (ఎం.పి.) వరవరరావుకు మిత్రులవటం యాదృచ్ఛికం కాదు.
.....
ఉస్మానియాలో ఎండీ. చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది. కరీంనగర్‌ జిల్లా మిట్టపల్లి ప్రాంతానికి చెందిన ఒక వెలమ దొరను పీపుల్స్‌వార్‌ స్క్వాడ్‌ గొడ్డలితో నరికింది. ఆ పేషెంట్‌ న్యూరో సర్జరీ వార్డులో ఉన్నాడు. ఓ రాత్రి డ్యూటీలో పేషెంట్‌కు బాగాలేదని అక్యూట్‌ మెడికల్‌ కేర్‌లో ఉన్న మాకు ‘కాల్‌’ వచ్చింది. వెళ్ళి మెడికల్‌ హిస్టరీ తీసుకుంటే, పేషెంట్‌ చెప్పాడు ‘నక్సలైట్లు నరికారు’ అని. పేషెంట్‌కి కావల్సిన వైద్యం అందించి వచ్చాను. తరువాత ఒకానొక సందర్భంలో ఈ విషయం చర్చకు వచ్చింది. ఒకరు అన్నారు కదా ‘పార్టీ చంపాలనుకున్న వాడు కదా. ఫినిష్‌ చేసేస్తే సరిపోయేది’ అని. ‘ఆ పని చేయాల్సింది పార్టీ. డాక్టర్‌ కాదు. శుత్రువైనా వైద్యం కొరకు వస్తే రక్షించే పంపుతాము. ఆ దొరగాడు మరలా వస్తాడు కదా! మీ చేతికి చిక్కుతాడు కదా!’ అన్నాను. ఇలాంటి అభిప్రాయలున్న నాపట్ల నిమ్స్‌ హాస్పిటల్‌లో చేరే పోలీసులకెందుకు భయం అనుకున్నాను. లేని జబ్బుల్ని అడ్డం పెట్టుకొని జైళ్ళు, కోర్టుల నుండి తప్పించుకోటానికి హాస్పిటల్స్‌లో చేరి, హాయిగా మందుకొట్టే రాజకీయ నాయకులకు, కార్పొరేట్‌ గుండాలకు ‘రహస్యం’ బయటపడ్తుందేమోననే భయం ఉండాలి గానీ వీళ్ళ కెందుకు భయం? 
...
మానవత్వాన్ని మంటగలిపి, మారకపు విలువల్నే ప్రధానం చేసిన మృగాల మధ్య, కత్తుల వంతెన మీద నుండి నడుచుకుంటూ ఊరుకి వాడకీ మధ్యనున్న సరిహద్దుల్ని చెరిపే ఒక సున్నితమైన వృత్తిని సుమారుగా రెండు దశాబ్దాలు కొనసాగించిన, వైవిధ్యభరితమైన దళిత జీవితం అది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో గెస్టోపో కాన్సెంట్రేషన్‌ క్యాంపులో డాక్టర్‌ నార్మన్‌ బెతూన్‌ని నాజీ జర్మన్‌లు శారీరకంగా హింసించిన ఘటనలకన్నా కౄరంగా నన్ను ‘క’మ్మం సమాజం మానసికంగా హింసించింది. ఆ హింస ‘క’మ్మం రైటిస్టుల నుండి కాకుండా సోకాల్డ్‌ లెఫ్టిస్ట్‌(?) శిబిరం నుండి రావటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఆ హింస మీకు అర్థం కావాలంటే మీరు దళితులుగా పుట్టాలి. దళితులుగా పుట్టటం, బాధలు ఆనుభవించటమే కాదు ముఖ్యం. వీళ్లనెదిరించాలనే దృఢ నిశ్చయం, దాసోహమనకూడదనే ఆత్మగౌరవం, నిత్య నూతనంగా భగభగ మండే నిప్పుల కొలిమిలో రాటు దేలుతూ ఉంటేనే ‘ఆ హింస’ మీకు అర్థం అవుతుంది. ఒక వైపున ‘రాజ్యం’ నీలి నీడలు, మరోవైపు దోపిడీ కుల సామాజిక పీడన. నా కంట్లో నా వాళ్లతోనే పొడిపించే కుటిల రాజకీయం. నిస్సహాయతలో ఉన్న నా పునాది కులాలు! ఇదీ రెండో భాగంలో మీరు చదవబోయే విషయం.

అరుణ్‌ శౌరి (బ్రాహ్మణుడు, బిజెపీ ప్రభుత్వంలో పబ్లిక్‌ సెక్టార్‌ని నిండా ముంచిన మంత్రిత్వశాఖ మంత్రి) ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథి, ప్రారంభోపన్యాసకులు. ఈ వ్యక్తిని ప్రారంభోపన్యాసానికి ఆహ్వానించడానికి బాధ్యులు వరవరరావే. భారతీయ చరిత్రలో అభివృద్ధి నిరోధక బ్రాహ్మణులకు, లిబరల్‌ బ్రాహ్మణులకు, హాట్‌లైన్‌ ఎప్పుడూ ఆపరేట్‌ అవుతుం దనటానికి అరుణ్‌శౌరి, వరవరరావుల అనుబంధమే ఒక తాజా ఉదాహరణ. అంబేడ్కర్‌ మీద విషం వెళ్లగక్కిన ‘వర్షిప్పింగ్‌ స్మాల్‌ గాడ్స్‌’ అనే పుస్తకాన్ని రాసిన అరుణ్‌శౌరి, అంబేడ్కర్‌ను అవమానించి, తర్వాత అంబేడ్కర్‌ యువజన సంఘాలు దండెత్తాయని, అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మోకరిల్లిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ (ఎం.పి.) వరవరరావుకు మిత్రులవటం యాదృచ్ఛికం కాదు.

కరీంనగర్‌ జిల్లా మిట్టపల్లి ప్రాంతానికి చెందిన ఒక వెలమ దొరను పీపుల్స్‌వార్‌ స్క్వాడ్‌ గొడ్డలితో నరికింది. ఆ పేషెంట్‌ న్యూరో సర్జరీ వార్డులో ఉన్నాడు.... ఒకరు అన్నారు కదా ‘పార్టీ చంపాలనుకున్న వాడు కదా. ఫినిష్‌ చేసేస్తే సరిపోయేది’ అని. ‘ఆ పని చేయాల్సింది పార్టీ. డాక్టర్‌ కాదు. శుత్రువైనా వైద్యం కొరకు వస్తే రక్షించే పంపుతాము. ఆ దొరగాడు మరలా వస్తాడు కదా! మీ చేతికి చిక్కుతాడు కదా!’ అన్నాను. 

నా పొగరు మిమ్మల్ని 
గాయపరచిందా?
అయితే సంతోషం!
ఎం.ఎఫ్‌. గోపీనాధ్‌
వెల: రూ. 100
ప్రతులకు
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, 
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌
గుడిమల్కాపూర్‌, 
హైదరాబాద్‌, 500 006
ఫోన్‌: 23521849

(సెప్టెంబర్‌ 28వ తేదీన హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో డా ఎం.ఎఫ్‌. గోపీనాధ్‌ రచన ‘నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా? అయితే సంతోషం!’ ఆవిష్కృతమవుతున్న సందర్భంగా ఆ పుస్తకంలోని కొన్ని భాగాలు) 

Surya Telugu News Paper Dated: 23/09/2013 

Sunday, September 22, 2013

ఆంగ్ల ప్రావీణ్యతే లక్ష్యం By డాక్టర్. ఆర్. యస్. ప్రవీణ్ కుమార్ ఐ పి యస్, సెక్రెటరీ , APSWREIS.



Dr. Repally Shiva Praveen Kumar IPS (Inspector General of Police) Secretary, Andhra Pradesh Social Welfare Residential Educational Institutions Society (APSWREIS), Hyderabad, Andhra Pradesh, India   

Dr. Repally Shiva Praveen Kumar IPS (Inspector General of Police) with Dress 



తల్లిదండ్రులు సవారన్న, ప్రేమమ్మ. ఇద్దరూ ఉపాధ్యాయులు కావడంతో చిన్నతనం నుంచే చదువు ప్రాధాన్యత తెలిసింది. వారిద్దరూ ఏ ఊళ్లో పనిచేసినా.. అక్కడ ఉండే దళితవాడలకు వెళ్లి ఉచితంగా ట్యూషన్లు చెప్పేవాళ్లు. అర్ధబలం, అంగబలం లేని మనకు చదువే పెద్దబలం అంటూ వారు చెప్పిన వారి మాటలు ఎందరో విద్యార్థులను బడి బాటపట్టేలా చేశాయి. ఇక నా విద్యా భ్యాసమంతా సాంఘికసంక్షేమ గురుకుల పాఠశాల్లోనే జరిగింది. ఏడవ తరగతి వరకు అమ్రాబాద్‌లో, ఎనిమిది నుంచి పదోతరగతి వరకు అలం పూర్‌లో చది వాను. ప్రశ్నలకు సమాధానాలు పుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా కాకుండా సొంతంగా రాసినందుకు సోషల్‌ టీచర్‌ క్లాస్‌లో అందరి చేత చప్పట్లు కొట్టించా రు. నా స్కూల్‌ జీవితంలో నన్ను ఎంతో ప్రభావితం చేసిన సంఘటన ఇది.
ఇంగ్లీష్‌ నేర్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాం..
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ కర్నూల్‌లో ఇంటర్‌ చదివిన తరువాత రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో వెటర్నరీ సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేశాను. కాలేజీల్లో విపరీతమైన ర్యాగింగ్‌ ఉండేది . వివక్ష చూపించేవారు. మిత్రులు, కొందరు ప్రొఫెసర్లు ధైర్యం చెప్పేవారు. ఇంటర్‌ వరకు తెలుగు మీడియంలోనే మా విద్యాభ్యాసమంతా కొనసాగింది. తోటి విద్యార్థులను చూస్తే తెలిసింది మేం ఎంత వెనుకబడి ఉన్నామో.. గ్రామీణ ప్రాంతాల నుంచి రావ డం, ఇంగ్లీష్‌పై అంతగా పట్టు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. చాలా అవకాశాలు చేజార్చుకున్నాం. తెలుగు మీడియంలో చదివిన వారందరం ఒక గ్రూప్‌గా సాధన చేశాం. కోఠిలో దొరికే ఇంగ్లీష్‌ నవలలను కొని( చాలా తక్కువ ధరకు లభించేవి) డిక్షనరీ సహాయంతో పోటీలు పడి చదివేవాళ్లం. గ్రామర్‌ నేర్చుకోవడానికి ఇది బాగా పనిచేసింది.
మూడో ప్రయత్నంలో సివిల్స్‌...
మా సీనియర్స్‌ తనతో పాటు సివిల్స్‌ రాయమని ప్రోత్సహించారు. మొదటిసారి సివిల్స్‌ రాసినప్పుడు ఇంట్లోనే ఉండి రోజుకు 16గంటలు చదివేవాడిని. ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. ఎపి స్టడి స ర్కిల్‌ ఎంట్రన్స్‌లో మొదటిర్యాంకు రావడంతో అక్కడ కోచింగ్‌ తీసుకునే అవ కాశం లభించింది. రెండో ప్రయత్నంలోనూ ఇంటర్వ్యూ వరకే వెళ్లాను. మూడవ ప్రయత్నంలో 1994 లో ఐపిఎస్‌కు సెలక్ట్‌ అయ్యాను. పోలీస్‌ శాఖలో 15సంవత్సరాలు పని చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో కలిసిన కొందరు విద్యార్థుల ద్వారా మళ్లిd చదవాలనిపించింది. 2011లో హార్వర్డ్‌ యూనివర్సిటీకి దరఖాస్తు చేశాను.


హార్వర్డ్‌ లో సీటు రావడం మరచిపోలేని అనుభవం..
ప్రపంచప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదవాలని ఆశించేవారు, అర్హత ఉన్నవారు లక్షల్లో ఉంటారు. గ్రామీణ పేద కుటుంబం నుంచి వచ్చిన సగటు విద్యార్థినైన నాకు సీటు రావడం అనేది మాత్రం అదృష్టమే. చిన్నతనం నుంచి నేను అనుభవించిన వివక్ష, అరకొర వసతుల్లో సాగిన విద్యాభ్యాసం, యూనివర్సిటీ మార్కుల్లో తేడాలు అన్నిటినీ ఎదుర్కొని ఐపిఎస్‌కు ఎంపిక కావడం వివరించాను. ఇంటర్వ్యూలో సైతం వీటిపైనే ఎక్కువగా ప్రశ్నలడిగారు. హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ అసోసియేట్‌ డీన్‌ అలెగ్జాండ్రా మార్టినెజ్‌ నా దరఖాస్తు, ఇంటర్వ్యూలో మాట్లాడిన విధానం ఉత్తేజపూ రితంగా ఉందన్నప్పుడు ఆనందిం చాను. నా లాగే మరెందరో సమాజంలోని కులవివ క్షను అధిగమించి అంతర్జాతీయ విశ్వవిద్యాల యాల్లో ఉన్నతవిద్యను అభ్యసించాలన్నదే నా ఆశయం. అందుకు కావల్సిన సదుపాయాలు కల్పిస్తూ.. మార్గనిర్దేశకత్వం మాత్రమే నేను చేస్తున్నాను.
నేటి విద్యార్థులకు భాష సమస్య కాకుండా..
బాల్యంలో మేం ఎదుర్కొన్న సమస్యలు ఇప్పటి తరం విద్యార్థులకు ఎదురుకావద్దన్న ఆలోచనతో హార్వర్డ్‌ యూనివర్సిటీలో కోర్సు పూర్తిచేసుకుని రాగానే.. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిగారిని స్వయంగా కలిసి నేను చదివిన సాంఘిక సంక్షేమ శాఖలో పోస్టింగ్‌ ఇవ్వమని, పేద విద్యార్థులకు సేవచేసే అవకాశం కల్పించమని కోరాను. ఆయన ఎంతో ఆనందంగా.. అభినందనలతో ఈ పోస్ట్‌ ఇచ్చి లక్షా70వేల మంది విద్యార్థుల జీవితాలను నా చేతుల్లో పెట్టారు.
నేను గురుకుల పాఠశాలలో సమస్యలు ఎమిటో నాకు బాగా తెలుసు. వాటికి పరిష్కారాలు ఆలోచించి, అమలుచేస్తూ గురుకుల విద్యార్థులను ఇతరులకు ఏ విధంగానూ తీసిపోని స్థాయికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. నా ఆలోచనలను అర్థం చేసుకున్న ప్రభుత్వం నాకు స్వేచ్ఛనిచ్చింది. బడ్జెట్‌లో కేటాయించిన నిధులనే జాగ్రత్తగా ఉపయోగిస్తూ.. చదువులోనే కాదు.. ఇతర అని ్న రంగాల్లోనూ విద్యార్థులు ముందుం డేలా శిక్షణనిస్తున్నాం.
మేధావులైన ఉపాధ్యాయులు..
వె ురికల్లాంటి విద్యార్థులు..
నేను వచ్చిన కొద్ది రోజుల్లోనే.. రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో పరిస్థితులను స్వయంగా తెలుసు కున్నాను. చాలా మంది ఉపాధ్యాయులు ఎంతో ప్రతిభ గలవారున్నా సరైన గుర్తింపు లభించడంలేదు. ఈ సంవత్సరం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందిస్తున్నాం. విద్యార్థులకు పోటీ పరీక్షలపై అవగాహన కల్పిస్తూ.. వారిని జాతీయస్థాయిలో కార్పొరేట్‌ విద్యా ర్థులతో సమానంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం.
పేద గ్రామీణ విద్యార్థులందరూ అంతర్జాతీయంగా అందుబాటులోకి వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ అందరితో సమానంగా.. అందలంపై ఉండాలన్న నా ఆలోచనను అర్ధం చేసుకున్న సిబ్బంది, ఉపాధ్యాయులు ఎంతో సహకరిస్తున్నారు. వారి కొత్త ఆలోచనలను జోడిస్తున్నా రు. విద్యార్థులకు చదువుతో పాటు వారిలోని సృజనాత్మకత వెలికితీసి మెరికల్లాంటి రేపటి తరాన్ని తయారుచేస్తున్నారు.
ఈ సంవత్సరం కేంద్రప్రభుత్వం క్యాలీటీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అనే అంశంపై ఈనెల 27,28తేదీల్లో బెంగళూర్‌లో జరిగే సదస్సుకు 40మంది ఉపాధ్యాయులు హాజరువుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల నుంచి ప్రతినిధులు ఇక్కడ క్వాలిటీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అందించడానికి సూచనలు ఇస్తారు.
ఇంగ్లీష్‌ మాతృభాష కాని దేశాలు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి.
ఇంగ్లీష్‌ అనేది గ్లోబల్‌ లింక్‌ భాషగా మారి అంతర్జాతీయ భాషగా గుర్తింపు పొందింది. ఇంగ్లీష్‌ మాతృభాష కాని ఎన్నో దేశాలు ఇంగ్లీష్‌ మాధ్యమంలో విద్యాబోధన చేస్తూ.. పట్టుసాధిస్తున్నాయి. ధనిక వర్గాలు స్వాతంత్య్రానికి పూర్వమే ఆంగ్లభాషను సొంతం చేసుకున్నాయి. ఇంగ్లీష్‌ అంటే మనలో ఒక భయం. ఆ భయం బాల్యంలోనే పోవాలి అన్నది మా తాపత్రయం. అందుకే ఇంగ్లీష్‌ నేర్చుకోవడం అనేది ఉద్యమంగా తీసు కుంటున్నాం. భాష రాని కారణంగా ఎవ్వరూ ఉన్నతవిద్యా, ఉపా ధి, ఉద్యోగా వకాశాలను కోల్పోవద్దు అన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం.
రిజర్వేషన్లతో పాటు ఆత్మవిశ్వాసం పెంచాలి..
సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న షెడ్యూల్‌ కులాలు, తెగలవారికి రిజ ర్వేషన్లు ఇచ్చారు. కాని, వారిలో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నాలు చాలా తక్కువగా జరిగాయి. 67సంవత్సరాల స్వతంత్రభారతంలో ఇంకా చదువురాని వారెందరో ఉన్నారు. మా విద్యాసంస్థల్లో అధికశాతం మొదటితరం విద్యావంతులు. వారికి ఎప్పుడూ తాము తక్కువ వాళ్లం అన్న భావన మన స్సు మూలల్లో ఉండటంతో ఉన్నతస్థానాన్ని అందుకున్నవారు చాలా తక్కువగా ఉంటున్నారు. నేను ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా వచ్చిన తరువాత విద్యార్థులతో ప్రతిరోజూ ఒక ప్రతిజ్ఞ చేయిస్తున్నాం. . అందులోని మొదటి వాక్యం.. మేం ఎవరికన్నా తక్కువ కాదు.. ఈ ఒక్క మాటతో వారిలో ఎంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ సంవత్సరం ఎంసెట్‌, ఐఐటి, నీట్‌లకు ఎంపికైన విద్యార్థులున్నారు. అతి పేద కుటుంబం నుంచి వచ్చిన మొదటితరం విద్యావంతురాలు జయంతి మెడిసిన్‌లో సీట్‌ సాధించింది.
విద్యార్థిదశలో జీవితలక్ష్యం అనేది లేకపోతే సమాజంలోని దురాలవాట్లన్నీ చుట్టేస్తాయి. నీవు ఈ ఉద్యోగం సాధించాలి, ఈ స్థాయికి చేరుకోవాలి అంటూ.. చెప్పడానికి ప్రపంచజ్ఞానం లేదు. కాని ఇప్పుడు ప్రపంచం చాలా చి న్నదిగా మారి విస్తృతమైన అవకాశాలను మన ముందుకు తీసుకువస్తోంది. వాటిని జీవనపురోగమ నానికి ఉపయోగించుకునేలా నేటి విద్యార్థులకు సూచనలు ఇవ్వగలిగితే చాలు వారే సమసమాజ నవజాతి నిర్మాతలవుతారు.
ప్రతి సంవత్సరం స్కూల్‌, కాలేజ్‌ కాన్వొకేషన్‌ డే..
విశ్వవిద్యాలయాల్లో మాదిరిగానే రెసిడెష్షియల్‌ స్కూల్‌, కాలేజిల్లో కాన్వొకేషన్‌ డే నిర్వహించాలని నిర్ణయించాం. డ్రాఫవుట్‌లను అరికట్టేందుకు, విద్యపై ఆసక్తి పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని మా ఆలోచన. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా యూనిఫామ్స్‌ను నిఫ్ట్‌ వారి సహకారంలో రూపొందించాం. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచి.. తాము చేరుకోవల్సిన గమ్యం గురించి తెలియ జేయాల న్నదే ఆ ప్రయత్నం.
బాలబాలికలకు ప్రత్యేక కౌన్సిలింగ్‌..
రేపటి ప్రపంచానికి వారసులైన నేటి బాలబాలికలు నిర్ధిష్టమైన జీవనప్రణాళికతో ముందుకు సాగేలా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకునేలా తర్ఫీదు నిస్తున్నాం. బాలికలు ఆత్మనూన్యతాభావంతో ఉంటున్నారు. వారి కోసం వాయిస్‌ ఫర్‌ గర్ల్స్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వారి సమస్యలను ధైర్యంగా చెప్పేలా.. శిక్షణనిస్తున్నాం. అలాగే బాలలకు ప్రత్యేక కౌన్సిలింగ్‌ ఇస్తున్నాం. ఆడవారిని తమతో సమానంగా చూసేలా.. గౌరవించేలా వ్యక్తిత్వ వికాసతరగతులను నిర్వహిస్తున్నాం. యూత్‌ ప్లారమెంట్‌ను జోనల్‌ స్థాయిలో ఏర్పాటుచేస్తున్నాం. మా ప్రయత్నాన్ని మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె అబ్దూల్‌కలామ్‌ ఎంతో అభినందించారు. ఇటీవల అనంతం పేరుతో మేం ఏర్పాటుచేసిన కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మా విద్యార్థులను భావిజాతి నిర్మాతలుగా అభివర్ణించారు.
ప్రత్యేక మ్యాగజైన్‌.. స్పెరోస్‌
నేను గమనించిన మరో ముఖ్యమైన విషయం రెసిడెన్షి యల్‌ స్కూల్‌ విద్యార్థులంటే చిన్నచూపు ఉంది. అందుకనే వారిని రెసిడెన్షియల్‌ విద్యార్థులన కుండా స్పెరోస్‌ అంటున్నాం. నాలుగునెలల కిందట స్పెరోస్‌ పేరుతో ఇంగ్లీష్‌ మ్యాగజైన్‌ తీసుకువచ్చాం. ప్రతినెలా వచ్చే ఈ మ్యాగజైన్‌లో విద్యార్థుల రచనలే ఉంటాయి. ప్రతి జిల్లా నుంచి బెస్ట్‌ ఎస్సే, బెస్ట్‌ పోయమ్‌ను ఎంపిక చేసి వాటిని ప్రచురించడంతో పాటు ఐదువందల రూపాయల పారితోషికం అందిస్తున్నాం. ఉన్నతవిద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఇం గ్లీష్‌ రాని కారణంగా చేజారిపోవద్దు అన్నదే నా ఆలోచన. ఈ విషయంలో పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు దిశదశ నిర్దేశం చేయాలన్నదే నా తపన.
2015నాటికి మౌంట్‌ ఎవరెస్ట్‌ పై స్పెరోస్‌..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 290 విద్యాసంస్థల్లో లక్షా70వేల మంది విద్యార్థులున్నా రు. ప్రతి విద్యార్థి జంకు లేకుండా ఆంగ్లంలో మాట్లాడాలి, తడబడకుండా చదవాలి. ఇలా అంటున్నాని నేను మాతృభాష వ్యతిరేకిని కాను. ఇంగ్లీష్‌ రాకపోవడం అనేది ఒక మైనస్‌ కావద్దు అన్నేదే నా ప్రయత్నం. గత రెండు సంవత్సరాలుగా టెక్నాలజీ పరంగా చాలా సంస్కరణలు జ రుగుతున్నాయి. ప్రతి విద్యార్థిలో అంతర్లీనంగా దాగిన శక్తిసామర్ధ్యాలను వెలికితీసేలా ప్రత్యేక విధానాలు అవలంభిస్తున్నాం. ప్రతి స్కూల్‌కు ఇరవై వేల రూపాయల క్రీడాసామాగ్రిని అందిస్తున్నాం. ఇండోర్‌ , ఔట్‌డోర్‌ క్రీడల్లో శిక్షణనిస్తున్నాం. ప్రపంచంలోని ఎతైన పర్వతాలను అధిరోహించిన శేఖర్‌బాబు ఆధ్వర్యంలో మొదటిబ్యాచ్‌ విద్యార్థులు భువనగిరికొండపై రాక్‌ క్లైమింగ్‌లో శిక్షణపొందుతున్నారు. 2015నాటికీ మౌంట్‌ ఎవరెస్ట్‌ అధిరోహించేలా శిక్షణ ఇస్తున్నాం. అర్ధబలం, అంగబలం లేనప్పుడు చదువునే ఆయుధంగా మలచుకోవాలి అనేది నేను నమ్మే సిద్దాంతం. అదే విద్యార్థులకు వివరిస్తూ.. కులం పేరుతో వివక్షకు గురవుతున్న వారందరికీ విద్యే వజ్రాయుధమని, దేశ ఉజ్వల భవిష్యత్‌కు గురుకుల విద్యార్థులే మార్గదర్శకుల ు కావాలన్నది నా తపన.

Exclusive Interview with Andhra Prabha Telugu News Paper Dated : 22/09/2013