Saturday, August 11, 2012

పోలవరంతో ఆదివాసులకు ముప్పే---మైపతి అరుణ్ కుమార్


పోలవరంతో ఆదివాసులకు ముప్పే
పోలవరం టెండర్ల ప్రక్రియ పూర్తయి భయంకరమైన జీవన విధ్వంసానికి మార్గం సుగమమైంది. రాష్ట్రంలో బహుళజాతి కంపెనీలకు కొమ్ముకాస్తున్న పాలక, ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ముంచి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాయి. బ్రిటిష్ వలస పాలకులతో ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్న స్వేచ్ఛా స్వాతంవూత్యాలను నేటి పాలకులు అదే సామ్రాజ్యవాదులకు తాకట్ట పెడుతున్నారు.

ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రవూపదేశ్‌లో 276, ఒరిస్సాలో 16, ఛత్తీస్‌గఢ్‌లో 14 గ్రామా లు, దాదాపు రెండు లక్షలమంది ఆదివాసీ ఆదివాసేతరులు, సుమారు 1.20లక్షల ఎకరాల సాగుభూమి ముంపునకు గురవుతుందని ప్రభుత్వం చెబుతున్నది. కానీ 1990లో వచ్చిన వరదలలో 250 గ్రామలు వరదముంపునకు గురై 1,12,000 మంది నిర్వాసితులయ్యారు. ఈ వరదల కారణంగా డ్యాం నిర్మాణం జరగకముందే 369 గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. గోదావరి నదికి అడ్డంగా డ్యాం నిర్మిస్తే ఎంత పెనుముప్పు ఉంటుందో అంచనా వేయవచ్చు. ప్రాజెక్టు నిర్మాణం జరిగితే 800 గ్రామాలు, నాలుగు లక్షల జనాభా నిర్వాసితులవుతారనేది నిపుణుల అంచనా. ఈ ప్రాజెక్టు వల్ల ఆదిమ తెగల ఉనికే ప్రశ్నార్థకమతుంది. 402 చారివూతక కట్టడాలు, పాపికొండలు, జంతుజాలం నశిస్తుంది. భద్రాచల రామాలయం, 44వేల చ.కి.మీ. రిజర్వు ఫారెస్టు కనుమరుగవుతుంది.

ప్రాజెక్టు క్రింద నిర్వాసితులయ్యే ఆదివాసులకు నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభు త్వం చెబుతున్నా, అది మాటల్లోనే తప్ప చేతల్లో కనిపించడం లేదు. ప్రభుత్వ సంస్థలు చెపుతున్నట్లు ఆదివాసీలకు భూమి నుంచి వచ్చే ఆదాయం తక్కువ. వారి ఆహారం, ఉపాధి 50శాతం అడవి నుంచే లభిస్తుంది. తునికి ఆకు, ఇప్పపువ్వు, కరక్కాయ, చింతపండు, వెదురు, పుట్టతేనె, చిల్లగింజలు, దుంపగడ్డలు ఇలా అటవీ ఉత్పత్తులతోనే వారి జీవనం ముడిపడి ఉన్నది. ఇప్పుడు మైదాన ప్రాంతంలో పునరావాసం కల్పిస్తే వారి సాంస్కృతిక జీవనం అంతరించిపోతుంది. అనాదిగా అడవినే నమ్ముకుని బతుకుతున్న ఆదివాసులకు ప్రకృతితో, పశుపక్ష్యాదులతో వారికి ఉన్న సంబంధాన్ని విడదీయాలనే దుర్మార్గపు చర్యకు ప్రభుత్వం పాల్పడుతున్నది. 

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చే మాట పక్కకు పెడితే, ఎప్పుడో పూర్తయిన శ్రీశెలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, తాండవ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందని దుస్థితి ఉన్నది. ఈ నిర్వాసితులపోరాటం ఇప్పటికీ కొనసాగుతున్నది. నాగార్జునసాగర్ క్రింద నిర్వాసితులైన లంబాడీలకు నష్టపరిహారం అందక తమబిడ్డలను అమ్ముకొని జీవనం కొనసాగించే దౌర్భా గ్యపు స్థితి వచ్చింది. తాండవ ప్రాజెక్టు నిర్వాసితులకు 30 ఏళ్లు అయినా దిక్కుమొక్కు లేదు. దీన్నిబట్టి చూస్తే పోలవరం కింద మునిగే ఆదివాసీలకు కూడా పునారావాసం అనేది అందని ద్రాక్షగానే మిగులుతుంది.

పోలవరం ప్రాజెక్టుపై 1980 ఏప్రిల్ 2న నాటి మధ్యవూపదేశ్ పస్తుత ఛత్తీస్‌గఢ్), ఒడిషా, ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వాలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 36లక్షల క్యూసెక్కుల నీటిని నిలువచేసే విధంగా పోలవరం డ్యాంను డిజెన్ చేశారు. ఈ ఒప్పం దం జరిగి మూడు దశాబ్దాలు అయింది. ఆ తర్వాత 2006 ఆగష్టులో ఆంధ్రవూపదే శ్ ప్రభుత్వం 36 లక్షల క్యూసెక్కులను కాస్తా 50 లక్షల క్యూసెక్కులుగా డ్యాం నిర్మాణం (స్పిల్‌వే)లో మార్పులు చేసింది. కానీ ముంపు ప్రాంతాల నిర్ధారణ గానీ, కోబ్రా ఆపరేషన్ రూల్స్ గాని, 50లక్షల క్యూసెక్కులకు సరిపడ డిజెన్ గాని చేయలేదు. 36 క్యూసెక్కుల సామర్థ్యంగల ఈ డ్యాం 50లక్షల క్యూసెక్కుల నీటిని ఆపగలదా? ఇటువంటిపరిస్థితులలో డ్యాం తెగిపోదని గ్యారంటి ఉందా? నాణ్యత లేకుం డా నిర్మించిన కడెంవాగు(ఆదిలాబాద్), పాలెంవాగు (ఖమ్మం), గుండ్లవాగు(వరంగల్) ప్రాజెక్టులు తెగిపోయిన సందర్భాలు తెలియనివి కావు. అలాంటప్పుడు పోల వరాన్ని అడ్డదిడ్డంగా ఎలా నిర్మిస్తున్నారు? 

దురదృష్టవశాత్తు డ్యాం తెగితే పరిస్థితి ఏమిటని పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతీయ నీటి వనరుల సంస్థ ఇంజనీర్ల చే అధ్యయనం చేయించింది. ఈ నిపుణులు 1999 జూన్‌లో సమర్పించిన నివేదిక ప్రకా రం పోలవరం డ్యాం బద్దలైతే పది గంటల వ్యవధిలో రాజమండ్రి కొవ్వూరు ప్రాంతాలలో 50లక్షల క్యూసెక్కుల నీరు చేరి ఆ ప్రాంతాలన్నీ జలసమాధి అవుతాయని పేర్కొన్నది. రాజమండ్రితో సహా 45లక్షల మందిని జలసమాధి చేస్తుందని తెలిపింది. పోలవరం ప్రాజెక్టుతో ఇప్పటి అంచనాల మేరకు కాలువల నిర్మాణం జరిగితే గోదావరి, కృష్ణ డెల్టాల్లో సుమారు 3లక్షల ఎకరాలలో తొలకరి పంట ఉండదు. మురుగు సమస్య తీవ్రం అవుతుంది. ముఖ్యంగా పశ్చిమగోదావరి డెల్టా నష్టపోతుంది. బుడమేరు వరద తీవ్రమవుతుంది. పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. దీంతో సముద్రమట్టం మూడు నాలుగు అడుగులు పెరగవచ్చు అని శాస్త్రజ్ఞనుల అంచనా. ఇదే జరిగితే డెల్టాలో లోతట్టు భూములు ఉప్పునీటిలో మునిగిపోతాయి. మురుగు కాలువల్లో సమువూదపు నీరు ఎగతన్నటం వలన ప్రవాహం తగ్గుతుంది.దీంతో డెల్టాలో దుర్భ ర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నది. మూడు లక్షల మందిని ముంచే ఈ ప్రాజెక్టు ఇప్పుడున్న పూడిక ప్రమాదతీవ్రతను బట్టి ఎన్నేళ్లలో నిరూపయేగం కాగలదో అంచనా కట్టలేదు. 

ఈ ప్రాజెక్టుతో 7.20 లక్షల ఎకరాలకు నీరందిస్తాం. 965 మెగావాట్ల విద్యుత్ ఉత్ప త్తి అవుతుంది. 80 టీఎంసీల నీటిని కృష్ణ డెల్టాకు తరలిస్తారు. 23 టీఎంసీల నీటిని విశాఖనగరానికి తరలిస్తామని ప్రభుత్వం చెబుతున్నవన్నీ కాకి లెక్కలే. ఎందుకంటే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుతో సాగునీరు అందిస్తామని చెబుతున్న 7.20 లక్షల ఎకరాలకు ఏలేరు, తోడిగడ్డ ఎత్తిపోతల పథకం ద్వారా 5.20లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. కేవలం తాడిపూడి పుష్కరు ఆయకట్టు ద్వారా నే 3.92 లక్షల ఎకరాలు తడుస్తుండగా, ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోయేది 1.85 లక్షల ఎకరాలు. ఎక్కువ ఆయకట్టు, అధిక లెక్కలు చూపిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. 965 మెగావాట్ల విద్యుత్‌ను అందించే ఈప్రాజెక్టు కేవలం కష్ణా డెల్టాకు, సంపన్నులకు మూడో పంటకోసం కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు విస్తరించివున్న పారిక్షిశామిక కారిడార్ కొరకు నిర్మించబడుతున్నది. 

రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్డ్ సి క్లాజు(6) ప్రకారం ఒక షెడ్యూల్డ్ గ్రామాలను తొలగించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. కానీ ఈ ప్రాజెక్టు వల్ల 276 గ్రామాలు మునుగుతాయని ప్రభుత్వం చెబుతున్న వాటిలో 274 షెడ్యూల్డ్ హోదా కలిగిన గ్రామాలున్నాయి. పంచాయతీరాజ్ చట్టం 1998 సెక్షన్ 4(1) ప్రకారం షెడ్యూల్డ్‌‌డ ప్రాంతాలలో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించే ముందు గ్రామసభలను సంప్రదించి, ప్రజాభివూపాయ సేకరణ చేయాలి. కానీ మన పాలకులు ఈ చట్టాలను ఉల్లంఘించి పోలవరం ప్రాజెక్టును కట్టాలని చూస్తున్నారు. ఏప్రాంతానికి ఉపయోగపడని ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రాంత ప్రజాసంఘాలను, విద్యార్థి సంఘాలను, సీమాంధ్రులు తప్పుపడుతున్నారు. నీటి నుంచి చేపను వేరు చేస్తే ఎంత ప్రమాదమో అడవి నుంచి ఆదివాసిలను వేరు చేస్తే అంతే ప్రమాదం అనేది గుర్తించాలి. ఈప్రాజెక్టును వ్యతిరేకంగా చేసే పోరాటం న్యాయమైంది.వూపజాస్వామిక వాదులు మేధావులు దీనికి మద్దతు తెలపాలి. 

-మైపతి అరుణ్ కుమార్
ఆదివాసీ విద్యార్థి సంఘం (తుడుం దెబ్బ) రాష్ట్ర కమి

Namasete Telangana News Paper Dated : 05/08/2012 

No comments:

Post a Comment