Friday, May 10, 2013

వివక్షల కొలిమిలో 'ఇఫ్లూ' - గుర్రం సీతారాములు





మదశిర్ కామ్రాన్  ముల్లా  ఈ పేరు నేడు జాతీయ అంతరాజాతీయ పత్రికల్లో పతాక శీర్షికలలో కనబడుతోంది .ఇరవై తొమ్మిదేళ్ళ ముదశీర్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ స్ యూనివర్సిటీ లో పిహెచ్చిడి చేస్తున్న  స్కాలర్ . పోయిన నెల  మార్చ్ రెండవ తేదేన హాస్టల్ రూమ్ లో  ఉరి వేసుకొని చనిపోయాడు.సరియిన విచారణ లేకుండా యూనివర్సిటీ లో జరిగిన ఇద్దరి మిత్రుల గొడవను పోలీసులదాకా తీసుకొని పోవడం , ఒక అర్దరాత్రి పది గంటలప్పుడు ఉస్మానియా పోలీసులు అదుపులోకి తీసుకోవడం దాన్ని అవమానం గా భావించి ఉరేసుకుని చనిపోయాడు . ముదసీర్ చనిపోయి సరిగ్గా నెల రోజుల  తర్వాతా అంటే  మే ఒకటో తేదీన   తమిళనాడుకు చెందినా మరో  ముస్లిం విద్యార్ది  అరబిక్ స్టడీస్ లో పరిశోదన చేస్తోన్న మహమద్ మొహిద్దిన్ ఉరేసుకొని చనిపోయాడు . తల్లి తండ్రి లేని ఒక ఒంటరివాడు , తమిళనాడు మదురై నుండి వచ్చిన అతను గత మూడేళ్ళుగా ఇక్కడ అరబిక్ డిపార్టుమెంటు లో పరిశోదన చేస్తున్నాడు. తెల్లవారితే అతని పరిశోదన పిహెచ్చిడి వైవా పరీక్ష , ఇంకో రెండురోజుల్లో అతని ముప్పై మూడో జన్మ దినం ఈ లోగానే యూనివర్సిటీ దగ్గరలో ఉన్న ఒక మసీద్ లో ప్రార్దన అయ్యాక అక్కడే నిద్ర పోయి అర్దరాత్రి ఉరేసుకొని చనిపోయాడు మొహిద్దిన్ తల్లి తండ్రి చనిపోయి తోడూ నీడ లేని నిరుపేద యూనివర్సిటీ తో కోట్లాడి పట్టా పొందలేని నిస్సహయత డిగ్రీ లేకుండా బయటికి పోతే ఉపాది లేని తనం ఆ క్రమం లో అతని  phd వైవా పరీక్ష ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడ్డది . దానికి కారణం డిపార్టుమెంటు లో ఉన్నతాదికారులు కావాలని జాప్యం చేస్తూ అడ్డు కుంటున్నారని  తన తోటి వాళ్ళు చెప్పగా విన్నా వాళ్ళతో వేగలేక నే   ఉరేసుకొని చనిపోయాడు .ఈ ఒక్కనేలలోనే ఇద్దరు ముస్లిమ్స్   చనిపోయారు.  ఇక పోతే ముదసిర్ కమ్రాన్ ఆత్మాహత్య  యూనివర్సిటీ లో పని చేసే ప్రోక్టర్ హరీష్ విజ్రా నిర్లక్ష్యం వలన  విచక్షణ కోల్పోయి  వ్యక్తిగతంగా నిందలు వేసి పరోక్షంగా అతని చావుకి కారణం అయ్యాడు  అనేది ఇప్పుడు దేశ వ్యాప్త  చర్చ అయింది . తనను  పోలీసులే కొట్టి చంపారు అని అది రాజ్యం చేసిన హత్య అని యవత్  కాష్మీరీ లు ఆ సుందర లోయలను దిగ్భందనం చేసారు . హర్తాళ్లు , బందులతో కాశ్మీరు లోయ దాదాపు ౩ రోజులు దద్దరిల్లింది.  అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు  చనిపోయారు .అతని అంతిమ యాత్రలో లక్షలాది మంది ఆజాది!! ఆజాది !!! అని ముక్త కంటమ్ తో చేసిన నినాదాలతో  పుల్వామా  లోయ మర్ర్మోగి పోయింది .
ఈ దేశ భవిష్యత్ యూనివర్సిటీ లలో రూపు దిద్దుకుంటది అనే ఒక నానుడి. ఉపాధ్యాయ  విధ్యార్ది సంభందాలు ఒకప్పుడు  మానవీయంగా ఆదర్శం గా ఉండేవి , కానీ ఇప్పుడు అలా లేదు ఉపాధ్యాయులు విధ్యార్ది కులం , మతం ని బట్టి వాళ్ళతో మెలుగు తున్నారు . మరో  వైపు తల్లిదండ్రులు  పండిన ధాన్యం అమ్ముకొని తన కొడుకుని పట్నం చద్వులకు పంపుతూ కన్నీటి పొరలు కదులు తున్న కళ్ళతో వీడ్కోలు పంపుతూ,    తన కొడుకులు ఉన్నత చద్వులు చదవి తన తల రాతను మారుస్తాడు అనుకుంటారు  . ఇంకో వైపు వ్యవస్తీ క్రుతమయిన రాజ్య హింసకు భయపడి ఆయా ప్రాంతాల నుండి కేంద్రీయ విశ్వ విధ్యాలయాలలోకి  అడుగు పెడుతున్నారు,  కానీ ఇక్కడ వెలివేతకు , వివక్షకు,  ఆత్మన్యునతకు లోనవుతున్నారు .ఇక్కడ కట్టే బట్ట , తినే తిండి ప్రతిదానికీ కులం ఉంది.  ఆ కుల పీడనకు తట్టుకోలేకే ఆత్మహత్యలకు మించి మరో దారిలేని ఒక నిశ్శహయతలోకి లోకి నేట్టివేయబడుతున్నారు  .కోటి ఆలోచనతో  భవిష్యత్ మీద గంపెడు ఆశతో,తర తరాలుగా  తన తండ్రులు తట్టలు మోసారు, దానికి చదవే విముక్తి అనుకున్నారు . కానీ మొగ్గ దశలోనే చదిమి వేయబడుతున్నారు .  గడిచిన రెండేళ్ళల్లోకేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పదుల సంఖ్యలో ఆత్మ హత్యలు చేసుకోవడాన్ని హై కోర్టు సుమోటో గ స్వీకరించడం ప్రాదాన్యత సంత రించుకుంది. తరాల వెనకబాటు  పాలకుల నిర్లఖ్యం తిండి , కూడు , గుడ్డ , నీరు అన్నిటి కోసం వెతుకులాటే అది కాక ఇక్కడ నిత్యం , బాష ,యాస  , ప్రాంత , మైనారిటీ  ల పేరుతో వివక్ష . దానికి వ్యతిరేకంగా కోపం తో పిడికి బిగిస్తే వెలివేత , సోదాలు , అలాంటి  సంక్షుభిత కాలం లో మండల్ కమిషన్ వెలుగు లో , చుండూరు, కారం చేడు రగిల్చిన కసి తో వచ్చిన స్ఫూర్తి నేడు కేంద్రీయ విశ్వ విద్యాలయాలలో పురి విప్పింది .ఒక ప్రజా స్వామిక ప్రాతినిధ్యం ఇప్పు డిపుడే మొగ్గలు తోడుకుంటోంది. దళిత బహుజన విద్యార్థుల సమన్వయం నేడు అగ్రవర్నాలను  గంగ వెర్రులెత్తే లా చేస్తున్నాయి . ఒక మెరుగయిన సమాజం కోసం ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి కోసం ఆహార హింస కు వ్యతిరేకంగా ఉద్య మిస్తున్నారు, పురాణాల గుట్టును నిట్ట నిలువుగా ఛీల్చేస్తున్నారు.  ఆ చైతన్యాన్ని చిదిమేసే క్రమం లో  మనువాదం స్వైర విహారం చేస్తోంది ఆ క్రమం లోనే ముదసిర్ , మరియు మొహమద్ మొయిన్ ఆత్మ హత్య  గటనలు.  ఇది కేవలం ఒక్క ఇఫ్లూ లోనే కాదు అన్ని కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో కుల , ప్రాంత వివక్షకు గురై ఆత్మా బలిదానాలు చేసుకుంటున్నారు ఇవ్వాళా ముదసిర్ ఖమ్రాన్ ఒక సర్వనామం అతనిది ఆత్మ  హత్య అనడం  అకంటే హత్య అనడం బాగుంటది.
ప్రపంచం లో  అత్యంత సాయుధ మయిన సున్నిత ప్రాంత కాశ్మీర్ . అక్కడ నిత్యం వేదింపులు చిత్ర హింసలు  రాజ్య మేలతాయి .ఆతను పుట్టక ముందే దేశ ద్రోహుల  జాబితాలో చేర్చింది ఎవరు ? కల్లోల కాశ్మీరు నుండి వచ్చి నిప్పుల వాగులా మండుతున్న తెలంగాణాలో ప్రాణం పోవడం యాదృచ్చికంగా జరిగింది కాదు.  అక్కడ ఇక్కడ దేశ సరిహద్దులో ఉన్నట్లుంటది  . ఒకడు మంచి వాడా ద్రోహా అనేవిషయం  అతను పుట్టిన ప్రాంతం, కులం ,నిర్ణ యుస్తున్న సంస్ఖుభిత కాలం ఇది.  యూనివర్సిటీ లో చదవు కుంటున్న ముదశీర్ అంతిమ యాత్రలో దాదాపు లక్షకు  పైగా పాల్గొన్నారని జాతీయ , అంతర్జాతీయ పత్రికల్లో పతాక శీర్షిక అవడం తో బాటు కాశ్మీర్ , ఆంద్ర ప్రదేశ్ ముక్యమంత్రుల తో బాటు దేశ ప్రధాని  దృష్టికి కి కూడా ఈ వార్త దానావాలంగా వ్యాపించింది. జమ్మూ అండ్ కాశ్మీర్ కు చెందిని పుల్వామా జిల్లా పరిగం గ్రామానికి చెందిన ముదశిర్ ఖమ్రాన్ ముల్లా మా యూనివర్సిటీ లో ఇద్దరు కాశ్మీరీ లలో ఒకడు అత్యంత నియమ నిష్టల తో ఉండేవాడు తన తోటి మిత్రుడు వసీం సలీం తో జరిగిన చిన్న గొడవ మూలాన యూనివర్సిటీ ప్రోక్టర్  ప్రో. హరీష్ విజ్రా చేసిన అవివేకమయిన చర్య ముదశీర్ చావుకు కారణం అయ్యింది నిజానికి వసీం మరయు ముదశీర్ లు గడిచిన కొంత కాలంగా మంచి మిత్రులు.  ఇద్దరి మధ్య వచ్చిన అభిప్రాయాల  బేదాల వళ్ళ  ఒకటి రెండు సార్లు గొడవ పడ్డారు . ముదశీర్ మీద వశీం వ్రాత  పూర్వకంగా పిర్యాదు కూడా చేసాడు , దానికి కౌంటర్ గా ముదశీర్ కూడా నాకూ సమస్యలు ఉన్నాయని మరో పిర్యాదు చేసాడు .అంతే కాకుండా చాలా మంది తోటి విద్యార్దులు ఇది చాలా సున్నితమయిన అంశము అని అతనో మైనారిటీ అనీ సున్నితమయిన కాశ్మీరీ వాడు అని సూసైడ్ చేసుకొనే లక్షణాలు కనిపిస్తున్నాయి అని అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడం అవసరమని కొంత మంది చేసిన విజ్ఞప్తులు కూడా పెడ  చెవిన పెట్టి అతని చావుకి కారకులయ్యారు ‘అతను చనిపోవడానికి ఒకరోజు ముందు సాయంత్రం ఇద్దరూ గొడవ పడి  రాత్రి పది గంటల సమయంలో యూనివర్సిటీ ప్రోక్టర్ దగ్గరకు వెళ్ళారు , సమయస్పూర్తిగా ఇద్దరి  మధ్య సయోధ్య చేయాల్సిన ప్రొఫెసర్ ముదాశీర్ ను ఇష్టం వచ్చినట్లు తిట్టి , నీ లాంటివాడు యూనివర్సిటీ లో ఉండకూడదు అని , నువ్వు పిచ్చివాడివి అని దుశ్ర్భాశలాడు తూ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కి వెళ్లి వెంటనే ముదాశీర్ ను కస్టడీ లోకి తీసుకోవాలని పిర్యాదు చేసి వచ్చాడు .అర్దరాత్రి హాస్టల్ నుండి పోలిస్   స్టేషన్ కు తీసుకొని వెళ్ళారు . పైగా ఈ అర్దరాత్రి పోలీస్ స్టేషన్కు పంపడం ను ప్రశ్నించిన విద్యార్థి నాయకులను సైతం నోటికి వచ్చినట్లు తిట్టడం యూనివర్సిటీ మొత్తం చూసింది .వెంటనే నేను మరి కొంత మంది విధ్యార్ది నాయకు లతో బాటు యూనివర్సిటీ డీన్ తో కలిసి ఉస్మానియా పోలీసు స్టేషన్ కు  వెళ్ళాము . మేము వెళ్ళే సరికే ఇన్స్పెక్టర్ ముదశీర్ తో  మాట్లాడుతున్నాడు .జరిగిన విషయాన్ని వివరించి యూనివర్సిటీ లో పరిస్కరించుకున్టాము అని చెప్పి ఇన్స్పెక్టర్ తో మాట్లాడి తిరిగి హాస్టల్ కి వచ్చాం. ఆ రాత్రంతా ముదసిర్  ప్రోక్టర్ అనవసంగా తిట్టాడు నాకు పిచ్చి అని ముద్ర వేసాడు  అని ఏడ్చాడు
.తను చనిపోయాక అతని సెక్సు వాలిటి  మీద , అతని జీవిత విదానం మీద అనేక వాదాలు వివాదాలు లేచాయి అతను రౌడీ అని , హోమో సెక్సువల్ అని వివక్షా పూరితంగా ప్రచారం . అటు పోలీసులు ఇటు యూనివర్సిటీ యాజమాన్యం అపవాదు వేసారు.  చనిపోయాక  మరింత గా అతని వ్యక్తిత్వానికి సమాధి కట్టే ప్రయత్నం చేస్తున్నారు  .ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని  వ్యక్తిత్వం మీద బురద వేయడం హీనమయిన చర్య నీతులు చెప్పే పంతుళ్ళు ఇలా చేయడం ఇంకా బాదాకరం .నిజమే  అతని మనసిక స్థితి బగాలేకుంటే పిర్యాదు వచ్చినప్పుడే అతన్ని కౌన్సిల్ చేయాల్సి ఉండాలి . పోలీసులదకా పంపడం అవివేకం దీన్ని పరిష్కరించడం లో యూనివర్సిటీ పాలకవర్గం అధ్యాపక వర్గం గోరంగా విఫల మయ్యింది .

ఇప్పుడు అఫ్జల్ ఉరి నేపధ్యం లో ముదాశీర్ చావు అత్యంత ప్రాదాన్యత సంత రించుకుంది. నా కొడుకు  ఆత్మ హత్య చేసుకొనే అంత పిరికివాడు కాదు అని అఫ్జాల్ గురును రాజ్యం ఉరి తీస్తే ముదాశీర్ ను తనకు తానె ఉరి వేసుకొని చనిపోయేలా చేసారు ని ఇది రాజ్యం చేసిన హత్య అని కాకుంటే ఇప్పుడు రాజ్యం విశ్వవిద్యాలయ రూపంలో ఒక మతం మీద మరో మతం చేస్తోన్న దాష్టీకం అని ముదాశీర్ చావుకు మేము గర్వపుడుత్న్నాం అని అతన్ని కన్నవాళ్ళు అన్నారు .

ముదాశీర్ చావు చాలా విషయాలు లేవనేత్తుతోంది తాను పుట్టిన కాశ్మీర్ ఒక సైనిక పహారా మధ్య ఉంటోంది. తానూ తన తండ్రి తనది కాని ఒక స్వేచ్ఛలేని బద్రత లేని పరిస్థితుల  మధ్య బిక్కు బిక్కుగా గడిచి ఉన్దోచ్చ్చు  అతని బాల్యం ఒక అనిశ్చితి మధ్య అబద్రత మధ్య గడిచింది అతని యవ్వనం తన తోటివాళ్ళ ను మాటిమాటికి ద్రోహులుగా చిత్రిస్తూ నిత్యం తుపాకీ పహారా నీడన గడిచి ఉంటది దాని నుండి కొంచం దూరంగా ఉంచాలనే ఇక్కడ చద్వుకు అతన్ని  పంపారు పాపం అతనికి తెలియదు హైదరాబాద్ లోనే కాదు ఎక్కడయినా కులం , మతం , ప్రాంతం ఒక నిర్దాయక పాత్ర పోషిస్తడి అని ఎక్కడో చద్విన గుర్తు   “ బజారులో ఎక్కడో బాంబ్ పేలినా  స్నిఫర్ డాగ్ మసీదులో నే ఎందుకు వాసన చూస్తాదో “ ఇదో విషాద విరోదా భాష  ఇక్కడ  పాటాలు చెప్పాల్సిన పంతుళ్ళు బుజం మీద చేయివేసి నిన్నూ నీ కులాన్ని నీ కుల ప్రాంతీయ అస్తిత్వాన్ని నీ ప్రతిభను కిలోల లెక్కన కులాల తక్కెడలో తూస్తారని  , తన వ్యక్తిగత జీవితం లోకి దుర్భిణి వేసి మరీ బట్టలు విప్పి నగ్నంగా నిల బెదతారని. అతనికి తెలియదు “ ఎవడు కాశ్మీరు ను నిప్పుల గుండం చేసాడో ?  ఎవడు కాశ్మీరు ను స్వతంత్ర పర్తిపత్తి అనే నిప్పుల కొలిమిచేసాడో ? అతనికి తెలియదు ఇప్పుడు తెలంగాణా కూడా కాశ్మీరు లాగా ఏటా మోసపోతూనే ఉందని . ఆనాడు కాశ్మీర్ లో ఎగ దోసిన కుంపటి ఆనాటి తాత నుండి ఈ నాటి మన్వరలుదాకా చలి కాసుకోడానికి కొన్ని శవాలు కావాలి అదికార దాహానికి అమాయకుల రక్తం పీల్చాలి ఇది ఇప్పుడు దేశ వ్యాప్తం అయింది  అది తెలంగాణా కావచ్చు కాశ్మీర్ కావచ్చు .
నేడు ఇఫ్లూ లో జోహార్ ముధసిర్ లాంగ్ లైవ్ ముదశీర్ ని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు ఇస్తున్నారు అతని సహచర విధ్యర్దినీవిద్యార్దులు నిన్నటి  దాకా జరిగిన క్రికెట్ టోర్నమెంటులో అతను  చేసిన కామెంటరీ ని తలచుకొని వలపోత లో ఉన్నారు.  క్రికెట్ గ్రౌండ్ అంతా కొవ్వొత్తులు పరిచి సహచర మిత్రుడికి నివాళి అర్పించారు. అదో ఉద్వేగ కరమయిన రోజు చిన్నపెద్ద తేడా లేకుండా దేశ , విదేశాల విద్యార్దిని విద్యార్దులు కొవ్వొత్తులు పోలీసుల పహారా మధ్య పాటలు పాడుకుంటూ మిత్రుని స్మృతులు నెమరేసుకున్నారు    .గడిచిన నెల రోజులుగా ఇఫ్లూ నినాదాలతో మార్మోగుతోంది . చర్చలు వాదాలు వివాదాలు అతని చావును చుట్టూ ముట్టాయి ఇక్కడ సేక్రేడ్ కౌ రంకేలోస్తోంది . చనిపోయాక అతనో మనషిక దుర్భలుడు అని హోమో సెక్సువల్ అని ముద్ర వేస్తున్నారు దానికి భయపడటానికి ఇది అనాగిరికతకు ఆవడ దూరం ఉన్నది కాదు  . హోమో సెక్సు వాలిటి లెస్బియన్స్ నిర్మోహమా మాటంగా తమ తమ అభిరుచులు అలవాట్లు బయటికి చెప్పుకొని గర్వంగా ఇక్కడ  చదువు లు సాగిస్తారు.

ఇప్పుడు అతనికోసం ఎందుకు విలపిస్తున్నారు అంటే అతను పుట్టిన ప్రాంతం, కులం ఈ దేశం లో పుట్టినా అదో కుట్ర . అతనిక్కడ ఒక శరనార్ది , దేశద్రోహి , టెర్రరిస్టు ఒక హోమో సెక్సువల్ తను పుట్టిన ప్రాంతం వదిలి పోయి ఒక అగ్రహారం లో చేరడం అతను చేసిన నేరం  .

ముదసిర్ ఖమ్రాన్ మరణం ఈ దేశ  విద్యా వ్యవస్తలో దిగజారిన ఉపాధ్యాయ విద్యార్ది సంబందాల కోల్పోతున్న విలవలకు పరాకాష్ట . గడిచిన నెల రోజులుగా ఎఫ్లూ గోడలు  నినాదాల మయమయినవి ఇక్కడ ఆక్య్వుపై  సాగర్ స్క్వేర్ ఒక రాజకీయ నినాదమయింది . రోజంతా చద్వులో పడి సాగర్ స్టోర్ లో జొరబడి సేద తీర్చుకొనే ప్రాంతం ఇప్పుడు అది ఒక రజకీయ ప్రాదాన్యత సంత రిచుకుంది ఎటు చూసినా చనిపోయిన మిత్రుడి స్మృతులు పాటలుగా కవితఃలుగా పల్లవిస్తోంది.

అతని  చావుకి కారణాలు అర్ధం కావాలంటే  కల్లోల కాశ్మీరీ బాల్యం అర్ధం కావాలి , చిత్రహింసల కొలిమి ని చూస్తోన్న కాశ్మీరీ యవత దీనత్వం అర్ధం కావాలి . చేయని నేరానికి మిలటరీ క్యాంప్ లలో నలుగుతోన్న శరనార్దుల కన్నీటి గాధలు తెలుసు కోవాలి. అక్కడి బాల్యం లో నిండిన నిరాశ నిస్పృహ తో విసిరే రాళ్ళల్లో కసి అర్ధం కావాలి. ఒకటి నిజం ముదసిర్ ను “ఒక కట్టుకథ కాటేసింది” ! “ఒక వక్రీకరణ అతన్ని వంచించింది”. అతను హొమొసెక్షుఅల్ అని అల్లరి పాలు చేసింది .ఒక కాశ్మీరీ బిడ్డ ను చవితి కొడుకుగా చిత్రించి వొంటరి వాణ్ని చేసి విగత జీవిగా మళ్ళీ కాశ్మీరుకు విమానం లో తిరుగు టపాలో పోయింది.. నేడు నేను  ముదసిర్ , మహమద్ మొహిద్దిన్ లాంటి స్నేహితుల్ని ఒకప్పుడు కలిగి ఉండి  కాపాడుకోలేని చేతగాని తనానికి సిగ్గుతో తలవంచు కుంటున్నా . తమ్ముళ్ళు ..మీరు  చనిపోయి మహోన్నతుల్లు అయ్యారు  మేమే మన్సులం  కాలేక పోతున్నాం క్షమించండి  .
 కాకుంటే అందమయిన వర్చస్సు మాసిన గడ్డం ముతక ముతక గుడ్డలు బేల చూపులు ఒక మర్యాద , ఒక ప్రశాంతమయిన యోగిలా ఒక మాన వీయమయిన విలువలకోసం తపన పీడన విముక్తికోసం వెతుకులాట .ఇవేమీ నేడు నాకు మళ్ళీ కనిపించవు చివరి రోజు పోలీస్ స్టేషన్ లో నా కడుపులో తల పెట్టి భోరున విలపించిన దృశ్యం తలచుకుంటే నా కళ్ళు మసకలు వస్తున్నాయి.  నిజమే ముదసిర్ నువ్వు ఎప్పుడూ అంటుండే వాడివి అల్లా అందరిని చక్కగా చూస్తాడని ఆయన దృష్టిలో అందరూ సమానమే అని,  నీ మతం చెప్పిన విశ్వ మానవత స్ఫూర్తి  ఎందుకో ఇక్కడ లేదు  . నీ దేహానికి ఒక్క దండ వేయలేని వ్యంధ విశ్వ విద్యాలయం మాది . కోటి ఆశలతో నీ తండ్రి నవ్వు డాక్టరేట్  చేసి ప్రోఫ్ఫేసర్ అయి కోటు వేసుకొని ఇంటికి వస్తావు అనుకుంటే డబ్బాలో విగతః జీవిగా విమానమెక్కి పోయావు కదా ఒకటి నిజం ముదసిర్ !! మొన్న భారత మాత తన భావ ప్రాప్తి కోసం తన్ను తానె ఉరేసుకుంది . దానికి సాముహిక భావాల సంతృప్తి అని ఒక సమర్ధన ఇప్పుడు నిన్ను నీతోనే ఉరి వేసుకొనే లా చేసింది సేక్రేడ్ కౌ ఇలా మనోభావాల సంతృప్తి కోసం గంటకో ఉరి , హత్య, లేదా  ఆత్మహత్య దానకి నీలాంటి బేల కళ్ళ ముదసిర్ లు కావాలిగా....
గుర్రం సీతారాములు : ఆంగ్లము మరయు విదేశీ విశ్వవిద్యాలయం లో పరిశోదక విధ్యార్ది : phone : 9951661001.



-- 
Gurram Seetaramulu
Doctoral Fellow,Translation Studies,
Room : C_ 6 Basheer Hostel,
Department of Translation Studies
School of Interdisciplinary Studies
The English and Foreign Languages University
Hyderabad-500 605, INDIA







-- 
Gurram Seetaramulu
Doctoral Fellow,Translation Studies,
Room : C_ 6 Basheer Hostel,
Department of Translation Studies
School of Interdisciplinary Studies
The English and Foreign Languages University
Hyderabad-500 605, INDIA




 Dated : 11/5/2013   Unpublished Version (Full Text )

No comments:

Post a Comment