Wednesday, May 2, 2012

చీకటి వెలుగుల ‘సత్యం’-----డాక్టర్ ఎం.ఎఫ్. గోపీనాథ్,



సుమారు 150 సంవత్సరాల క్రితం కె.జి.సత్యమూర్తి (కె.జి./ ఎస్.ఎం.)గారి ముత్తాత గడ్డియ్య కుటుంబం ఖమ్మం జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు ‘కూటి’ కోసం వలస వెళ్లినట్టు తన జీవిత చరివూతలో రాసుకున్నారు. నా చిన్నప్పుడు అంటే 1970ల వరకు మా ఊళ్ల నుంచి (ఖమ్మం జిల్లా, మధిర తాలూకా) మాల, మాదిగ కూలి జనం వరినా కాలంలో గుడ్లవల్లేరు, గుడివాడ ప్రాంతాలకు కూలీ కోసం వెళ్తుండేవాళ్లు. మా ఊళ్ల మీదుగా కట్టెలేరు ప్రాజెక్టు వచ్చిన తర్వాత శ్రామిక వలసలు తగ్గిపోయాయి. గుడ్లవల్లేరులో కమ్మ భూస్వాముల పసువుల కొట్టాల్లో ఆ నెల రోజులు నాలుగు రాళ్లు సంపాదించుకోవడానికి మా కూలి జనం ఎన్నెన్ని కష్టాలు, నిందలు, వేధింపులు అనుభవించేవారో తిరిగొచ్చిన తర్వాత కథలు కథలుగా చెప్పుకునేవాళ్లు. మళ్లా అటు మొఖం చూపించగూడదనుకునేవాళ్లు వయస్సులో ఉన్న ఆడపిల్లలు. కానీ ‘ఆకలి’ వాళ్లను పదే పదే, అటే అడుగు లు వేయించేది.

వీళ్లు మానమర్యాదల్ని చంపుకుని ఆ వైపు వెళ్లేది కేవలం నాలుగు రోజులైనా తమ పిల్లాపీచులకు నాలుగు మెతుకులు ఏరుకుందామనే. కానీ కాటన్ బ్యారేజీ, కృష్ణా బ్యారేజీలు 1855 నాటికి పూర్తయిన తర్వాత కృష్ణా, గుంటూరు, గోదావరి, కడప జిల్లాల నుంచి 1870 నుంచి ఆ జిల్లాల్లోని పెజెంట్ బూర్జువా ముఠాలు ఖమ్మం జిల్లాలోని భూమిని, భూమిమీది అటవీ సంపదను, భూగర్భ ఖనిజ సంపదను దోచుకోవడానికి ఇప్పటికీ వలస వస్తూనే ఉన్నారు. సాహితీ స్రష్టలు, మర్యాదస్తులు కూలికిపోయినోళ్ల గురించి రాసుకో, దోచుకునేవాళ్ల గురించి మర్చిపో అంటారు. శ్రమను దోచుకునేవాడి గురించి రాయకుండా శ్రమజీవుల గురించి ఏం రాయడం? అట్లా రాస్తే ఏం బావుంటుంది చెప్పండి.

ఖమ్మం నుంచి 150 సంవత్సరాల క్రితం ఆకలితో వలస వెళ్లిన సత్యమూర్తి పూర్వీకులు క్రిస్టియన్ మత ఆసరాతో నిలదొక్కుకుని, జ్ఞానవంతుడై న సత్యమూర్తిని భారతదేశ కమ్యూనిస్టు విప్లవోద్యమానికి కానుకగా ఇచ్చా రు. అదే ఖమ్మం జిల్లాలో 1973లో మిత్రవూదోహం వల్ల ఖమ్మం పట్టణంలో పోలీసులకు పట్టుబడ్డట్టు జైలు కిటికీ నుంచి తొంగి చూస్తున్న ‘వెన్నెల’తో చెప్పుకున్నాడు సత్యమూర్తి. ముత్తాత గడ్డియ్య నడిచి వెళ్లిన అడుగుజాడల్ని, వలస వెళ్లిన కారణాల గుట్టు రహస్యంగా తెలుసుకో ప్రయత్నిస్తున్నాడో ఏమో లేక ఆ కారణాలు ఇంకా సజీవంగా ఉన్నందువల్ల, వాటిని తుదకంటా నిర్మూలించబూనుకున్నాడో ఏమో 1973లో ‘సత్యాన్ని’ పోలీసులకు పట్టించింది ఖమ్మం వలస రాజ్యం. అప్పటి నుంచి 1978 వరకు జైలు జీవితం గడిపిన తర్వాత హైదరాబాద్‌లోని వైఎంసీఏ మీటింగు హాలులో జరుగుతున్న కామ్రేడ్ జార్జిడ్డి సంస్మరణసభలో మాట్లాడుతున్న సత్యమూర్తిని మొదటిసారి చూశాను. 

మాట్లాడాను. అప్ప టి నుంచి సత్యమూర్తి విప్లవ రాజకీయాలు, వ్యక్తిగత జీవితం, సాహిత్యం, పాటలు, ఒక సమస్య ను ముందుపెడితే, దాన్ని నినాదంగా మార్చి తిరిగి మనకందించే పద్ధతి- ఇవన్నీ అటు విప్లవ శ్రేణుల్ని, ఇటు సామాజిక ఉద్యమకారుల్ని ఉత్తేజపరుస్తూ కార్యోన్ముఖుల్ని చేస్తూనే ఉన్నాయి.
ప్రపంచ విప్లవాల చరివూతలో కె.జి.సత్యమూర్తిలాంటి వ్యక్తులు ఇద్దరే కనిపిస్తుంటారు. పెన్ను, గన్ను పట్టిన విప్లవయోధులు వాళ్లు. ఒకరు వియత్నాం ప్రజానాయకుడు హోచిమిన్. రెండు శ్రీకాకుళ సాయుధ పోరాట యోధుడు సుబ్బారావు ప్రాణిక్షిగహి. హోచిమిన్ రాసిన విప్లవ సాహిత్యం గురించి తెలియదు. సుబ్బారావు ప్రాణిక్షిగహి రాసిన జముకుల కథ తెలుసు. శివసాగర్ రాసిన సాహిత్యం అన్‌పేరలల్. 1980లో నేను ఉస్మానియాలో ఎండీ చేస్తున్నప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పటల్‌లో సత్యమూర్తిగారు అడ్మిట్ అయ్యారు. 1969లో తను రహస్య జీవితంలోకి వెళ్లే ముందు వదిలిపెట్టిన తన సహచరిని, పెద్ద కొడుకు సిద్ధార్థ, చిన్న కూతురు సౌజన్యను చూశాను. పెద్ద కూతురు అనుపమని 1978లో, శ్రీదేవిని 1980లో చూశాను. సత్యమూర్తి సహచరిని హాస్పిటల్‌లో చూసినప్పుడు, ఆమెతో మాట్లాడినప్పుడు అది ఒక డిస్టర్బడ్ ఫ్యామిలీ అనిపించింది. విప్లవం కోసం అంకితమైన వ్యక్తు ల సాధారణ కుటుంబం సంబంధాలు ధ్వంసం అయి సంక్లిష్టంగా తయారవుతాయనడానికి సత్యమూర్తి జీవితం, కుటుంబం ఒక ఉదాహరణ. 

ఇప్పటికీ నాకు బోధపడని విషయం ఒకటుంది. సత్యమూర్తిగారి కుటుంబమే కాదు, అణచివేయబడ్డ కులాల కుటుంబాల నుంచి విప్లవబాటలో నడిచి వెళ్లిన దాదాపు అన్ని కుటుంబాలు, ముఖ్యంగా దిగువ మధ్యతరగతి కుటుంబాలు సైకలాజికల్‌గానే కాదు, సామాజిక, ఆర్థిక విషయాల్లోనూ, ఊహించని దిగువకు దిగిపోతాయేమోననిపిస్తుంది. సత్యమూర్తిగారు తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కమ్యూనిస్టు పార్టీలతో సంబంధం, ఎస్.ఎఫ్.తో సంబంధం, విద్యార్థి నాయకుడిగా, కష్టకాలంలో కొండపల్లి సీతారామయ్యగారికి కుడిభుజంగా, అండగా నిలిచి గౌరవూపదమైన టీచర్ ఉద్యోగాన్ని వదులుకొని, పూర్తికాలం విప్లవకారుడిగా, తన కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసిన సత్యమూర్తిగారు, తన ఏ సంస్థల కోసమైతే పనిచేశాడో చివరి దశలో ఆ సంస్థల గౌరవాన్ని పొందలేకపోవడం తన జీవితంలో ఊహించని విషా దం. ఇట్లా ఎందుకు జరిగింది? లోతుగా అధ్యయనం చేయాల్సిన అంశం. మానవత్వానికి, మార్క్సిజానికి అడ్డుగోడలు నిర్మించబడ్డాయి. ఆ అడ్డు గోడ లు కుల సమాజంలో సహజమేనా? కొందరికి ఇవి రిజర్వ్ చేయబడ్డాయా? మార్క్సిజం-పూనినిజంతో అంతో ఇంతో సంబంధం ఉన్న వారందరం ఆలోచించాల్సిన విషయం ఇదే. ఏ రాజకీయాలైనా, తాత్విక సిద్ధాంతాలైనా, మానవత్వమనే తాత్విక చింతనకు లోబడి ఉండాలి. 

అలా ఉండాలని కోరుకోవడం అత్యాశా? గత నెల 17న కృష్ణా జిల్లా, జి.కొండూరు మండలం కందులపాడు గ్రామం దళితవాడలోని చర్చి ప్రాంగణంలో సత్యమూర్తి భౌతికకాయాన్ని ఉంచిన పరిస్థితి చూసినప్పుడు కడుపు తరుక్కుపోయింది. ఒక్కసారి ఏవేవో భరించరాని భావాలు చుట్టుముట్టాయి. 1979లో ‘ఆంవూధా’లో తుపాను వచ్చినప్పుడు గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర కోమలి గ్రామంలో ఉన్న దళితవాడను ‘సమువూదుడు’ మింగబోతున్నప్పుడు దళితుల్ని సవర్ణులు నిర్దాక్షణ్యంగా వారి ఇండ్లలోకి రానియ్యకపోతే చర్చి బిల్డింగే అక్కున చేర్చుకున్న సంఘటన గుర్తుకొచ్చింది. ఆధునిక భారతదేశ చరివూతలో విప్లవ సాహిత్యరంగంలోగాని, నిస్వార్థ వ్యక్తిత్వంలో గానీ ఎవరూ సరితూగనటువంటి వ్యక్తిత్వం సత్యమూర్తిగారిది. ఆయన నడిపిన రాజకీయాలపట్ల, విధానాలపట్ల ఎవరమైనా విభేదించవచ్చు. కానీ త్యాగంలో, నిబద్ధతలో, వ్యక్తిగత జీవితంలో సత్యమూర్తిగారిని మించిన విప్లవకారులుంటారంటే ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు. ఆయన రాజకీయ పని విధానంలో సమస్యలున్నాయి. విప్లవ రాజకీయాలకు వ్యూహం, ఎత్తుగడలు, శత్రువును చిత్తుచేసే కర్కశత్వం ఉండాలి. అవి సత్యమూర్తిగారికి తగుపాళ్లలో లేవనేది ఆయన పీపుల్స్‌వార్ సెంట్రల్ కమిటీ సెక్రటరీగా చేసి కూడా నిశ్శబ్దంగానే నిష్క్రమించిన విషయం చెప్పకనే చెప్తుంది. ఇది ఒక విషాద చరిత్ర. లౌక్యం లేని మొండి విధానం. ఇది కవులకు, కళాకారులకే సాధ్యమేమో?

1980లో సిపిఎం(ఎంఎల్) పీపుల్స్‌వార్ పార్టీని ఏర్పర్చినప్పుడు, కొండపల్లి సీతారామయ్యగారిలోని ఆర్గనైజర్, సత్యమూర్తిగారిలోని సిద్ధాంతబలం ఒక అభేద్యమైన నిర్మాణాన్ని ఈ దేశ పీడిత ప్రజల ముందుంచాయి. ఆ ఇద్దరిమివూతుల పొలిటికల్ కెమిస్ట్రీ అద్భుతంగా పనిచేసి రాడికల్ విద్యార్థి సంఘానికి, రాడికల్ యూత్ లీగ్‌కు విప్లవ దిశా నిర్దేశం చేసింది. నాడు ‘గ్రామాలకు తరలండి’ అనే క్యాంపెయిన్ లేకుంటే ఈనాటి ‘రెడ్ స్టార్ ఓవర్ ఇండియా’ లేదు. నేను 1983 అక్టోబర్‌లో ఢిల్లీ నుంచి వచ్చాను. కొంతమందితో కల్సి బస్తర్‌లో జరిగే మిలిట్రీ ట్రైనింగ్ క్యాంపుకు వెళ్లాలి. 1982లో కొండపల్లిని బేగంపేట రైల్వేస్టేషన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. సత్యమూర్తిగారు పీపుల్స్‌వార్ సెంట్రల్ కమిటీ సెక్రటరీగా ఎన్నుకోబడ్డారు. మల్లోజుల కోటేశ్వరరావు ప్రొవిన్షియల్ కమిటీ సెక్రటరీ, నన్ను దిల్‌షుఖ్‌నగర్ దగ్గర ఆగివున్న జీపులో మధ్యాహ్నం రెండు గంటలకు ఎక్కించాడు ప్రహ్లాద్ (కిషన్ జీ) కొరియర్. జీపులో చూస్తే సత్యమూర్తిగారు, ప్రహ్లాద్, నెల్లూరి నారాయణడ్డి ఉన్నారు. భయమేసింది. పట్టపగలు దిల్‌షుఖ్‌నగర్ మెయిన్‌రోడ్డు. నేను తప్ప అందరూ అండర్‌క్షిగౌండ్ నక్సలైట్లే. సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ సెక్రటరీలు.

దొరికితే పోలీసుల పంటపండినట్టే. కేతేపల్లి దాటి మూసినది బ్రిడ్జి దగ్గరకొచ్చిన తర్వాత నారాయణడ్డి బైనాక్యులర్స్ తీసి మూసీ నది అందా లు తిలకించడం ప్రారంభించాడు. ఇప్పుడిదేం పని? సమయం సందర్భం లేకుండా అన్నాను. మల్లెప్పుడు దొరుకుద్ది మూసీ నది అన్నాడు. ఆ రాత్రం తా ప్రయాణం చేసి తెల్లతెల్లవారుతుండగా ఒక కోయగూడెం చేరుకున్నాము. మేమొస్తున్నట్టు తెలుసుకున్న సెంట్రీ, దళం ఉన్న షెల్టర్‌కు తీసుకెళ్లింది. సత్యమూర్తిగారు నడవడం కష్టంగా ఉంది. శబరినది పొంగుతోంది. నాకు ఎస్.ఎం.కు తప్ప, అందరికీ ఈత వచ్చు. నన్ను గణపతి పట్టుకున్నాడు. కానీ నేను మునిగిపోతున్నాను. అప్పుడు గణపతి నా జుట్టుపట్టుకుని నీళ్లమీద తేలేట్లు చేశాడు. ఎస్.ఎం.ను ఇద్దరు కామ్రేడ్స్ పట్టుకుని ఒడ్డుకు చేర్చా రు. ఇక అక్కడి నుంచి కష్టాలు మొదలైనై. నిటారుగా ఎత్తైన కొండలు. నేలమార్గాననే ఎస్.ఎం.సరిగ్గా నడవలేడు. కామ్రేడ్స్ డోలి కట్టారు. ఆయన్ని ఆ కొండలమీదికి డోలీలో మోసుకుని, చివరకు కొండల మీదున్న మైదానానికి చేర్చారు. తెల్లవారి నుంచి పార్టీ నిర్దేశించిన ప్రకారం రాజకీయ తరగతులు, మిలట్రీ ట్రైనింగ్. మేము కల్సి ఉన్న అన్ని రోజుల్లో, ఏ రకమైన సమస్యలు లేకుండా క్యాంప్ జయవూపదంగా ముగించుకుని ఏటూరు నాగారం మీదుగా వరంగల్ అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నాము. 

అప్పటికీ కొండపల్లి సీతారామయ్యగారు ముషీరాబాద్ జైల్లో ఉన్నారు. 1983 డిసెంబర్‌లో సీతారామయ్య గారిని కల్సినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని అడిగారు. ఏమంటే ‘మీరు క్యాంప్‌కు వెళ్లారు కదా? క్యాంప్ జరిగిన తీరుపై మీ అభివూపాయం ఏమిటి? అని. క్యాంప్ బాగా జరిగింది. ఏ నష్టం లేకుండా జయవూపదమైందన్నాను. అందుకు సీతారామయ్యగారు బాగా జరగలేదని మాస్టారు (ఐ.వి) అంటున్నారు అన్నారు. అప్పుడు అవాల్సిన పద్ధతిలో నాకర్థం అయింది. ఆ తర్వాత ఎస్.ఎం. నాకు 1990 వరకు కలవలేదు.

1990 జనవరిలో నేను నిమ్స్‌లో (నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-హైదరాబాద్) నైట్ డ్యూటీలో ఉండగా తెల్లవారు జామున నాలుగు గంటలకు ఒక ఎమ్మార్వో ఫోన్ చేసి ‘ఎస్.ఎం.గారు అంబర్‌పేటలో ఉన్న రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ దగ్గర ఒంటరిగా ఉన్నారు. ‘నువ్వు వచ్చి తీసుకు అన్నాడు. ఏమీ ఆలోచించకుండా, అక్కడికెళ్లి చూస్తే హాలు బయట నేల మీద కూర్చొని ఉన్నారు ఎస్. ఎం. అప్పుడనిపించింది. ఎలాంటి వ్యక్తికి ఎలాంటి పరిస్థితి వచ్చింది అని. వెంటనే ‘మీకిదేం కర్మ? బండెక్కండి వెళ్దామన్నాను. నా బైక్ మీద ఎక్కించుకుని నిమ్స్‌కు తీసుకు తర్వాత ఆర్‌ఎస్‌యూలో పనిచేసిన సుధా- శ్రీనివాస్‌ల ఇంటికి వెళ్లారు. అప్పుడు, కొంతకాలం తరిమెల నాగిడ్డిపార్టీ (యుసీసీఆర్‌ఐ- ఎం-ఎల్)లో పనిచేసి కులం- వర్గం విషయంలో విభేదించి బయటికొచ్చిన కంచ ఐలయ్య, ఉసా, రవి మారుత్‌లతో కలిసి మార్క్సిస్టు- లెనినిస్టు సెంటర్‌ను ఏర్పర్చారు. ఈ సెంటర్ ఏర్పర్చక ముందే ఎస్.ఎంతో నాకున్న రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక విషయం స్పష్టంగా చెప్పాను.‘అంబేద్కర్ వాల్యూ మ్స్ అన్నీ మీకు ఇస్తాను. మీరైతేనే వాటిని చదివి ప్రజలకు అర్థమయ్యే తీరు లో వ్యాసాలు రాసి అంబేద్కరిజాన్ని, మార్క్సిజాన్ని పోల్చి చూపుతూ వీటి మధ్య సారూప్యతలేమిటి? విభేదాపూక్కడో తేల్చి చెప్పండి’ అన్నాను. ఇప్ప ట్లో ఎలాంటి రాజకీయ వేదికను ఏర్పర్చవద్దన్నాను. సరే అన్నారు. కానీ, ఆయన కన్విన్స్ కాలేదని తర్వాత జరిగిన పరిణామాలు తెలియచేశాయి. ఆయనకు ఇష్టం లేని విషయాల పట్ల కూడా ‘నో’ అనే అలవాటు లేదు. తను అనుకున్నదానికి భిన్నంగా ఏది ఎవరు చెప్పినా చెయ్యడు.

బహుశా ఇది మెజారిటీ కవులు, కళాకారుల లక్షణం అనుకుంటాను. మృదువుగా తిరస్కరించటం,ఎదుటివాళ్లు ఏమైనా అనుకుంటారేమోననే భావన... ఇలాంటి కవులే ఒక్కొక్కసారి ఎంత మొండిగా ప్రవర్తిస్తారో ఎస్.ఎం గారిని చూస్తే తెలుస్తుంది.

1990ల్లో పీపుల్స్‌వార్ నుంచి బహిష్కరించటం, విరసం సభల్లో ఎస్.ఎం గారికి అవమానం. ఇవన్నీ గడిచిపోయిన కొద్ది నెలల తర్వాత నల్లా ఆదిడ్డి ఎస్.ఎంను బహిష్కరించవలసిన పరిస్థితుల్ని వివరించబోయినప్పు డు నేనన్నాను. ఎస్.ఎం.ను ఎందుకు బహిష్కరించారని అడగదల్చుకోలేదు. కారణం రహస్యపార్టీ కార్యకలాపాల్లో ఉన్న అనేక విషయాలు, సమస్యలు మాకు తెలియాల్సిన అవసరం లేదు. కాని బహిష్కరించిన పద్ధతి నేను ఒప్పుకోలేకపోతున్నానన్నాను. అంతేకాదు, ఎస్.ఎం. లాంటి సీనియర్‌ను బహిష్కరిస్తే పార్టీలోకి రావాల్సిన వాళ్లు జంకుతారు కదా అన్నాను. ఒకటి రెండు సంవత్సరాల తర్వాత కె.ఎస్. పరిస్థితి ఇదే విధంగా ఉంటుందేమో అన్నాను.ఇక్కడ కొన్ని విషయాలు నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలి. కులం ప్రాతిపదికనే ఎస్.ఎం.ను బహిష్కరించారా? ఒకవేళ అదే వాస్త వం అయితే ఎస్.ఎం. బయటికొచ్చిన తర్వాత అయినా కూడా తను ప్రత్యామ్నాయంగా పార్టీలో పెట్టిన డాక్యుమెంట్ విస్తృతంగా ప్రజాక్షిశేణుల్లోకి చర్చలోకి రావాలి. అది కనపడలేదు. ఎస్.ఎం. అంటే పార్టీలోని యువ కేడర్ అందరికీ ‘మంచివాడు మా బాబాయి’ అన్నట్లుగానే ఫీలయ్యారు. అనుమా నం లేదు. నిమ్మలూరి భాస్కర్, ఐ.వి. సాంబశివరావులకు ఎస్.ఎం.కు మధ్య అభివూపాయ భేదాలున్న మాట వాస్తవం.

కె.ఎస్.లో కులాధిక్య భావాలున్నా యా అంటే నాకు ఎప్పుడు ఆవిధంగా అనిపించలేదు. బస్తర్ క్యాంపు లో ఉండడంతో నాతో ఏనాడు పార్టీలో కుల భేదాలున్నట్లు చెప్పలేదు. ఎస్.ఎం. పైపెచ్చు 1978 నుంచి నేను బాహాటంగానే కులం మీద చర్చ పెడుతూనే ఉన్నాను. ఏది ఏమైనా కె.ఎస్.కు, ఎస్.ఎం. లకు పీపుల్స్‌వార్ -మావోయి స్టు చరివూతలో సముచిత స్థానం లభించాలని వాళిద్దరి కాంట్రీబ్యూషన్ పార్టీ ప్రాథమిక నిర్మాణ దశలో లేకుండా నాటి జగిత్యాల జైతయాత్ర, నేటి దండకారణ్య ఉద్యమాలు ఊహించడం కష్టం అయితే ఉద్యమం, పార్టీ నిర్మాణం ఉన్నత దశకు చేరే క్రమంలో ఆ ఇద్దరి ఆలోచనలు ఉద్యమ పార్టీ పురోగతికి ప్రతిబంధకాలుగా వుండవచ్చు. ఆ పరిస్థితుల్లో బహిష్కరణకు ప్రత్యామ్నాయంగా ఇంకే పద్ధతు లు లేవా? అనే సందేహం కలుగుతుంది. ఈ సందర్భంగా రెండో ప్రపంచ యుద్ధ కాలంలో స్టాలిన్ కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల సీనియర్ జనరల్స్ కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంతేకాదు, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1946 లో చైనా కమ్యూనిస్టుపార్టీని చాంగ్- కై- షేక్‌తో కలిసి జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పర్చమని స్టాలిన్ సలహా ఇచ్చారు. 1949లో చైనా విప్లవం విషయంలో తాను ఇచ్చిన సలహా తప్పని ఒప్పుకున్నాడు. కమ్యూనిస్టులు కూడా మనుషులన్న విషయం, మార్క్సిజం మానవత్వాన్ని అత్యున్నత దశకు తీసుకు ఉపకరించే తత్వశాస్త్రమే కాని, మానవాతీత భావవాదం కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. కమ్యూనిస్టు పార్టీల్లో రెండు పంథాల మధ్య జరిగే పోరాటాన్ని శాస్త్రీయంగా నడపటంలోని లోపాల ప్రతిఫలమే ఈ పరిణామాలన్నింటికి కారణం కావచ్చేమో ఆలోచించాలి. 

కేంద్రీకృత ప్రజాస్వామ్యంలో నిబిడీకృతమైన అప్రజాస్వామిక లక్షణం పాలు ఎక్కువగా ఉండ టం వల్ల వస్తున్న అనవాయితీనా ఇది! వయస్సు మీద పడుతున్నప్పుడు సహజంగా వచ్చే మార్పుల్ని శాస్త్రీయంగా విశ్లేషించి మానవతా దృక్పథంతో తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల కలిగే దుష్పలితాలూ ఇవి! టూ లైన్ స్ట్రగుల్ ను మెకానికల్‌గా కాక భారతీయ సామాజిక వాస్తవ దృష్టితో చూడవల్సిన అవసరం లేదా? అభివూపాయ భేదాలు ఐక్యతకు భంగం కలిగించాలా? విడిపోవడానికి దారి తీయాలా? ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం, శ్రేణులు చేసిన త్యాగాలతో సరిపోల్చగల వారెవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారా? రక్తం ధారపోసి, కుటుంబాలను, బంధుమివూతులను వదిలి యుక్తవయస్సు నుంచి ప్రాణాలొడ్డి పీడిత ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న నాటి, నేటి విప్లవకారులందరూ పై విషయాలను ఆలోచించవలసిందని విజ్ఞప్తి చేస్తున్నాను. అన్నీ వదులుకున్నవాళ్లకు పీడిత జాతుల విము క్తే గమ్యమైనప్పుడు గమనంలో ఎదురవుతున్న సమస్యల్ని శాస్త్రీయంగా పరిష్కరించడం అతి ముఖ్యమైన అంశం. వీటిలో తొందరపాటుకు ఏమాత్రం స్థానం ఉండకూడదు. 1940లో జపాన్ వ్యతిరేక ఐక్య సంఘటనను తిరస్కరిస్తూ, చైనా కమ్యూనిస్టుపార్టీ నాయకుల్ని, శ్రేణుల్ని ఊచకోత కోస్తున్న చాంగ్-కై- షేక్ ను అతని మిలటరీ జనరల్స్ పట్టుకుని చంపబోయినప్పు డు కూడా ఆ విషయం మావోకు తెలిసి ‘అతణ్ణి చంపకండి’ అతని ద్వారానే జాతీయ ఐక్యసంఘటనకు పిలుపునిప్పించండి’ అన్న మావో రాజకీయ పరిణితిని విప్లవపార్టీల నాయకత్వం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.

సత్యమూర్తిది తల్లికోడి మనస్తత్వం. కవులందరికుండే భావుకత పాలు ఎక్కువ. ఆయన అసమాన విప్లవకవి. ఎస్.ఎం.కు విప్లవపంథా దిశానిర్దేశా లు నిర్ణయించడం కన్నా విప్లవ సాహిత్యమం మానసికంగా పూర్తి ఏకీభావంతో నిమగ్నమయ్యేవాడు. ఆయన మనస్సు నవనీతం. ఎండకు (కష్టాలకు)కరిగిపోతుంది. సంతోషంతో గడ్డ కడుతుంది. అంతా క్షణాల్లో మర్చిపోతారు. ఇది రాజకీయ ప్రక్రియ ఒకింత సరిపడదు. విప్లవ రాజకీయాల్లో ఉండబట్టే ఆయన కవిత్వం పాటా మాటా సృజనశీలంగా ఉన్నాయి. ప్రజా పోరాటాలను ఆయన ప్రభావితం చేశాడు. ఆయన్ని ప్రజా పోరాటాలు ప్రభావితం చేశాయి. ఇవే శివసాగర్‌ను సజీవంగా ఉంచే గతితార్కిక బంధం. ఆయన విప్లవసాహిత్య వినీలాకాశంలో ధృవతార. భారతీయ విప్లవ సాహి త్యం మీద చెదిరిపోని,చెరిగిపోని సంతకం. ఆయనకివే నావిప్లవ జోహార్లు.

-డాక్టర్ ఎం.ఎఫ్. గోపీనాథ్, కార్డియాలజి
Namasete Telangana News Paper Dated : 03/05/2012 

No comments:

Post a Comment