Saturday, October 13, 2012

వృద్ధుల సంక్షేమమే సమాజ అభివృద్ధి --శివాజీ సర్కార్



వృద్ధులను, వృద్ధాప్యాన్ని గౌరవించని సమాజం జ్ఞానాన్ని తిరస్కరించిన సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. అయినా.. ముసలివాళ్లను గౌరవంగా చూడటం అటుంచి, కనీసం వారి యోగక్షేమాలు కూడా పట్టించుకోని విధంగా ప్రపంచం తయారైంది. ఉత్పత్తికి దూరమైన వృద్ధులను భారంగా చూసే పరిస్థితి దాపురించింది. సమాజంలోని వృద్ధులకు సరైన పోషణ, రక్షణలేని సమాజం అభివృద్ధి చెందలేదని యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ (యూఎన్‌ఎఫ్‌పీఏ) పేర్కొన్నది. అలాగే ప్రపంచ దేశాలన్నీ 60 ఏళ్లకు పైబడిన వృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రత విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించింది. కానీ ఈ సూచనలను చాలా దేశాలు పెడచెవినపెట్టిన దాఖలాలే కనిపిస్తున్నాయి. వృద్ధులు తాము పనిచేస్తున్న కాలంలో చెల్లించిన పన్నులు, వేతనాల్లో విధించిన కోత అంతా కలిసి వృద్ధాప్యంలో వారి సామాజిక భవూదత కోసం వెచ్చించాల్సిన బాధ్యత సమాజానిది. ప్రపంచవ్యాప్తం గా వందకోట్ల పైగా వృద్ధులున్నారు. అలాగే భారతదేశంలో 2050 నాటికి 30 కోట్లకు పైగా ముసలివారుంటారు. సమాజంలో గణనీయ సంఖ్యలో ఉన్న ఈ వృద్ధుల సంక్షేమాన్ని చాలా దేశాలు గాలికి వదిలేస్తున్నాయి. వృద్ధుల యోగ క్షేమాలు, సంక్షేమాలను సమాజాభివృద్ధిలో భాగంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి. సామాజిక వేత్తలు, ఐక్యరాజ్యసమి తి లాంటి అంతర్జాతీయ సంస్థలు వృద్ధులు సంక్షేమం గురించి అనేక పథకాలను అమలు పర్చాలని ప్రపంచ దేశాలకు సూచిస్తుంటే, ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ లాంటి సంస్థ లు మాత్రం వృద్ధులపై చేస్తున్న ఖర్చును నిరర్ధమైనదిగా చెప్పుకొస్తున్నా యి. వృద్ధుల సంక్షేమానికి చేస్తున్న ఖర్చును అనుత్పాదక, అనవసర ఖర్చు గా చెబుతూ వాటిని తగ్గించుకోవాలని దేశాలపై ఒత్తిడి చేస్తున్నాయి. 


యూఎన్‌ఎఫ్‌పీఏ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల కష్టాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కనీస అవసరాలు తీరక, ఆరో గ్య, ఆవాస, రక్షణ కరువై తీవ్రమైన సమస్యలతో సతమతమవుతున్నారు. సమాజం నుంచి తగిన భద్రత, రక్షణ విధానాలు కొరవడి సమస్యల పాలవుతుంటే, సొంత కుటుంబాల నుంచి కూడా ఆదరణకు నోచుకోక వృద్ధు లు నరకయాతనపడుతున్నారు. కష్టాల కొలిమిలో కన్నీరుమున్నీరుగా కాలం వెల్లబుచ్చుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వయసు పైబడిన ప్రజల ప్రయోజనార్థం ప్రత్యేకంగా ఏ రక్షణ చర్యలు తీసుకోవడం లేదని యూఎన్‌ఎఫ్‌పీఏ పేర్కొన్నది. అలాగే ద్రవ్యలోటు, ఆర్థిక సమస్యలతో ముడిపెట్టి వృద్ధుల సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని, కార్పొరేట్ విధానాలను దుయ్యబట్టిం ది. వృద్ధుల సంక్షేమానికి నిధులు, పెన్షన్‌లను పెంచాల్సింది పోయి కోతలు విధిస్తున్నాయని బహుళజాతి ఇన్స్యూన్స్ కంపెనీలను విమర్శించింది. ఒక్క భారతదేశంలోనే లక్షకోట్ల పెట్టుబడిని వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన పెట్టుబడులను వెనక్కి తీసుకుని వృద్ధుల యోగక్షేమాలకు ముప్పు తలపెట్టాయి. యూఎన్‌ఎఫ్‌పీఏ అధ్యయనాల్లో పాలుపంచుకున్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామి క్ గ్రోత్ (ఐఈజీ) సంస్థకు చెందిన ప్రొఫెసర్ మునీర్ ఆలమ్ చెప్పిన దాని ప్రకారం ‘వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వాలకు రాజకీయ సంకల్పం ఉండాలి’. అభివృద్ధి చెందుతున్న సమాజంలో నానాటికీ పెరిగిపోతున్న వృద్ధుల సంఖ్యను పట్టించుకోక పోతే.. సమాజంలో ఒక పార్శం మొత్తం కన్నీటిలో మునిగిన ఆయన అన్నా రు. కాబట్టి వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేకమైన పథకాలు, నిధులు తప్పనిసరిగా ఉండాలి. రైల్వేల్లో కూలీగా పనిచేసే వ్యక్తి నుంచి మొదలు ఉత్పత్తిలో పాలుపంచుకుంటున్న ప్రతి వ్యక్తి నుంచి సర్వీస్‌టాక్స్‌తో పాటు, ఏదో రూపంలో పన్నులు వసూ లు చేస్తున్న ప్రభుత్వం వృద్ధుల సంక్షేమానికి పెన్షన్ పథకాలను ఎందుకు ప్రవేశ పెట్టకూడదని ప్రశ్నించాడు.



ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా వృద్ధుల గోస ఒకే తీరుగా ఉన్నది. అంతటా కన్నీటి వరదలో తేలియాడుతున్నది. అలాగే మనదేశంలో సుప్రీంకోర్టు కూడా వృద్ధుల సంక్షేమం కోసం అనేక సందర్భాల్లో స్పష్టమైన తీర్పును ప్రకటించిం ది. వృద్ధుల సంక్షేమం సమాజ బాధ్యత అని పేర్కొన్నది. ప్రతి వ్యక్తీ తాను పనిచేస్తు న్న కాలంలో అతనికి చెల్లించిన వేతనం నిజవేతనం కాదనీ, అప్పుడు కోత విధించి న వేతనంలో, ఉద్యోగ విరమణ అనంతరం వృద్ధాప్యంలో పెన్షన్ రూపంలో చెల్లించాలని సూచించింది. ఇది ఏదో జాలితో ఇస్తున్నది కాదని, అది అతని హక్కుఅని పేర్కొన్నది. సామాజికశాస్త్రవేత్తలు, అత్యున్నత న్యాయస్థానాలు వృద్ధుల సంక్షేమం గురించి ఆందోళన పడుతుంటే.. ప్రభుత్వ యంత్రాంగంలోని ఉన్నతాధికారులు, ప్రభుత్వ నేతలు మాత్రం ఉన్నత వర్గాల పెన్షన్‌లను భారీగా పెంచేసుకుని, సాధారణ ప్రజల పెన్షన్‌లలో మాత్రం కోత విధించారు. ఏవర్గాలకైతే పెన్షన్ జీవనాధారంగా ఉంటుందో ఆ వర్గాల పెన్షన్‌లో కోత విధించడం అమానవీయం. 2004 తెచ్చిన కొత్త పెన్షన్ విధానం కూడా పేదల పెన్షన్‌లో కోత విధిస్తూ ఉన్నత వర్గాల విలాసాల కు పెన్షన్‌ను భారీగా పెంచింది. దీంతో దేశంలోని తొమ్మిదికోట్ల మంది పేద వృద్ధ పెన్షన్‌దారులు తీవ్రంగా నష్టపోయారు. సమాజంలో 20 శాతంగా ఉన్న ఇలాంటి పేద, వృద్ధ పెన్షన్‌దారులు ప్రభుత్వ విధానాలతో జీవన్మరణ సమస్యలతో సతమతమవుతున్నారు. 



యూఎన్‌ఎఫ్‌పీఏతో పాటు అనేక అధ్యయనాల ప్రకారం కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర,ఒడిషా,పశ్చిమబెంగాల్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ లాంటి ఏడు రాష్ట్రా ల్లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. గ్రామీణవూపాంతాల్లో 75 శాతం వృద్ధులున్నా రు. వీరిలో 48 శాతం మహిళలున్నారు. ఇందులో 55 శాతం వితంతువులు. ప్రతి ఐదుగురిలో ముగ్గురు పూర్తిగా నిరుపేదలు, ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నారు. అందులో 80 ఏళ్లకుపైబడిన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. అలా గే వృద్ధుల్లో ఐదింట్ల ఒక వంతు ఒంటరి జీవితాలు వెల్లదీస్తున్నారు. గత 20 ఏళ్లుగా ఈ సంఖ్య ఇంకా పెరుగుతున్నది. వీరిలో అత్యధిక శాతం నిరక్షరాస్యులుగా అనేక సమస్యలతో కనీస అవసరాలు తీరక కష్టాలు పడుతున్నారు. పనిచేసే సామర్థ్యమున్న కాలంలోనే దినదినగండంగా గడిచిన జీవితాలకు, వృద్ధాప్యం పెద్ద శాపంగా మారిం ది. తీర్చలేని కష్టాలను, కన్నీళ్లను మిగులుస్తున్నది. వీటన్నింటికి తోడు వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలు వీరిని పట్టి పీడిస్తున్నాయి.హెల్పేజ్ ఇండియా సంస్థ అధ్యయనం ప్రకారం దేశంలోని వృద్ధులు సంక్షేమం, ఆరోగ్య సమస్యలతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. వీరికి ప్రభుత్వాలు ఆర్భాటంగా ప్రారంభించిన జాతీయ ఆరోగ్య బీమా పథకం కూడా ఏ ప్రయోజనం చేకూర్చలేకపోతున్నదని పేర్కొన్నది. ఈ పథకానికి అనేక అసంబద్ధ షరతులు పెట్టి ముగ్గురు పిల్లలు వారి కుటుంబానికి మాత్రమే వర్తింపచేస్తున్నారు. మిగతా కుటుంబ సభ్యుల సమస్యలు ఎవరికీ పట్టనివి అవుతున్నాయి. ఈ మధ్య జరిపిన ఓ అధ్యయనం ప్రకారం దేశంలోని కోటి 60 లక్షలమందికి మాత్రమే నెలకు 200 రూపాయల పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ సహాయం నేడు పెరిగిన నిత్యావసర సరకుల ధరల నేపథ్యంలో దేనికీ సరిపోవడం లేదు. అలాగే.. వృద్ధులను స్థానికేతరులని, పెద్ద కుటుంబమనీ, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నదని అనేక మంది అర్హులైన వృద్ధులకు పెన్షన్‌లు ఇవ్వడం లేదు. ఈ విధంగా లక్షలాది మంది వృద్ధ వితంతువులు పెన్షన్ అందక అనేక రకాలుగా బాధలు అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వృద్ధాప్య పింఛన్ కనీసం వెయ్యి రూపాయలు ఉంటేగానీ వారి కనీస అవసరాలు తీరవు. 



సామాజిక పరిస్థితులు, ప్రభుత్వ నిరాదరణ ఇలా ఉంటే.. సొంత కుటుంబాల నుంచి ఆదరణ కరువై వృద్ధులు అష్టకష్టాలు పడుతున్నారు. 43 శాతం మంది వృద్ధులు కుటుంబాల్లో హింసను అనుభవిస్తున్నారు. 53 శాతం మంది సొంత కుమారులు, కోడళ్లతో బాధలు అనుభవిస్తున్నారు. ఈ మధ్య చాలా దేశాలు వృద్ధుల సంక్షేమం కోసంవూపత్యేక పథకాలను రూపొందిస్తున్నాయి. పొరుగున ఉన్న నేపాల్‌లో 70 ఏళ్లకు పైబడిన వృద్ధులందరికీ పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నది. చైనా కూడా వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. బ్రిక్స్ దేశాలు, యూరప్ దేశాలు కూడా వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి. ఎన్డీఏ హయాంలో వృద్ధుల సంక్షేమం కోసం ఆలోచన మొదలుపెట్టినా ఆచరణలో అడుగు కూడా కదలలేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇందిరా గాంధీ వృద్ధాప్య పింఛన్‌ను దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నామంటూనే వృద్ధుల్లో సగభాగానికి కూడా సరిగా అందజేయడం లేదు. ఈ పరిస్థితుల్లో యూఎన్‌ఎఫ్‌పీఏ ప్రభుత్వాలన్నీ వృద్ధుల సంక్షేమాన్ని సమాజాభివృద్ధిలో భాగంగా చూడాలని సూచిస్తున్నది. దీనిని ప్రభుత్వాలు ఎంతమేరకు పట్టించుకుంటాయి, ఎంత నిజాయితీగా అమలు చేస్తాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. సమాజ సంక్షేమం వృద్ధుల సంక్షే మంతో ముడిపడి ఉంటుంది. ఇప్పటికైనా మన పాలకులు చిత్తశుద్ధిగా వృద్ధుల సంక్షేమం కోసం పాటు పడాలని సామాజిక సంస్థలు కోరుతున్నాయి. వృద్ధుల సంక్షేమమే సమాజాభివృద్ధికీ, మానవీయ సమాజానికీ నిజమైన సూచిక.

-శివాజీ సర్కార్
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయె

Namasete Telangana News Paper Dated : 14/10/2012 

No comments:

Post a Comment