Saturday, October 13, 2012

బాధితులారా బహుపరాక్ (లక్షింపేటలో)---కృపాకర్‌మాదిగ



శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్షింపేటలో 2012 జూన్ 12న వెనుకబడిన కులమైన తూర్పు కాపు కులస్తుల జాతి నిర్మూలనా దాడుల్లో ఐదుమంది మాల కులస్తులు హతులయ్యారు. అనేకమంది మాలలు కాళ్ళు చేతులు విరిగి, నెత్తురోడి చావునుంచి తప్పించుకున్నారు. వెనుకబడిన ఆడవారు ఈ దాడులకు పాల్పడిన వారిలో భాగస్తులవడం ఈ సంఘటనలో కొసమెరుపు. మడ్డువలస ప్రాజెక్టు క్రింద ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను భూమిలేని మాల కులస్తులు సాగు చేసుకోవడమే తూర్పుకాపుల దృష్టిలో నేరమైంది. సంఘటన జరిగిన వంగర మండలం ఎంపీపీ బొత్స వాసుదేవనాయుడు తూర్పుకాపు. పేరుకు వెనుకబడిన కులమే అయినా సాంఘికశక్తి, ఆర్థికశక్తి, రాజకీయశక్తి, వాటి తాలూకు కోరలు ఆధిపత్య కులాల స్థాయికి తీసిపోకుండా పెంచుకున్న అహంకారి తూర్పుకాపు కులం. బాధితులకు న్యాయం జరగాలని, దోషులకు కఠినశిక్షలు పడాలని మానవతావాదులు, కుల నిర్మూలనావాదులు, అణగారిన కులాల ప్రజలు, సంఘాలు పెద్దస్థాయిలో ఉద్యమించారు. అయినప్పటికీ లక్షింపేట బాధితులకు కొంత ఆర్థిక పరిహారం తప్ప, వారి ముఖ్యమైన డిమాండ్లేవీ నేటి వరకూ నెరవేరలేదు. బాధితులు దున్నుకుంటున్న ప్రభుత్వ భూములను బాధితులకే పంచాలి. ఊచకోత సంఘటన జరిగిన ఊర్లోనే న్యాయవిచారణ జరగడానికి వీలుగా ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం (1989) కల్పించిన ప్రత్యేకకోర్టును లక్షింపేటలోనే స్థాపించాలి. దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన రక్షణ కల్పించాలి.లక్షింపేట మాలల మానవహక్కు అయిన భూమిపై హక్కు, వారి ప్రాణాలపైన జరిగిన ఈ అమానుష దాడులను సభ్యసమాజం తీవ్రంగా ఖండించింది. బాధితుల పట్ల సర్వత్రా సానుభూతి వ్యక్తమైంది. స్వచ్ఛంద సంఘీభావం బాధితులకు అందింది. మాదిగలు, మాదిగ సంఘాలు కూడా పెద్దఎత్తున ఈ సంఘీభావంలో పాలుపంచుకున్నాయి. అనేక రంగాలకు చెందిన ప్రముఖులు, నాయకులు లక్షింపేటకు వెళ్ళి బాధితుల్ని పరామర్శించారు. ఓదార్చే ప్రయత్నం చేశారు.

ఐదునెలలు దాటింది. అయినా బాధితులకు తగిన న్యాయం, పరిహారం అందడంలో ప్రభుత్వం వివక్ష, అలసత్వం పాటిస్తున్నది. ప్రత్యేకకోర్టు ఎక్కడ స్థాపించాలన్నది ఇంకా వివాదంగానే ఉన్నది. కానీ, మరోవైపు ప్రధాన నిందితులంతా బెయిల్ పై బయటికొచ్చేశారు. ఈ విచారకరమైన పరిణామాలు చోటుచేసుకోవడం వెనుక, లక్షింపేట బాధితులకు సత్వర న్యాయం అందకపోవడం వెనుక కారణాలేమిటి?స్థానిక తహసీల్దార్, సర్కిల్ ఇన్స్‌పెక్టర్, డీఎస్పీ, ఎమ్మెల్యే, మంత్రి, వీరందరూ బాధితుల సామాజిక వర్గానికే చెందినవారై ఉన్నప్పటికీ, బాధితులకు తగిన సత్వర న్యాయం, రక్షణ అందకపోవడం దేనికి సూచిక? విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రిజర్వేషన్లు పొందినవారు సహ బాధితుల పట్ల, సాటి కులస్థుల పట్ల నిర్వర్తించాల్సిన ప్రత్యక్ష, పరోక్ష సామాజిక బాధ్యతలను మరిచిపోయారనటానికి ఇది కొండగుర్తు కాదా? కూడు దొరికితే కులాన్ని మర్చిపోవడం అంటే ఇదే కదా? హవ్వ! ఇంత విభాషణమాతైపముఖ మాల నాయకులు, మాల సంఘాలు, మాల మేధావుల మధ్య తగినంత సమన్వయం, ఐక్యత లోపించింది. మాదిగ ఉద్యమం ముందుకు తెచ్చిన ఎస్సీ రిజర్వేషన్లలో పంపిణీ న్యాయం తాలూ కు ప్రశ్నలకు జవాబుదారీ బాధ్యతల నుంచి తప్పుకోవడం ద్వారా బహుజన కులాల దొంతరలోని అంతర్గత ఆధిపత్యాలను ప్రశ్నించే, ఎదుర్కొనే స్వభా వం, నైతికశక్తీ, సమతాభావం మాల నాయకత్వంలో బలహీనపడింది. ఆధిపత్య కులాల పార్టీలకు రాజకీ య పాలేర్లుగా పనిచేస్తున్న మాల నాయకుల ప్రాబ ల్యం పెరుగుతున్నది. ప్రగతిశీల నాయకత్వం బలహీనంగా మారింది.

బుద్ధుడు, పూలే, అంబేద్కర్ ముసుగులో ఉన్న మాల మహానేతల పంపిణీ న్యాయవ్యతిరేక, సామాజిక న్యాయ వ్యతిరేక, అసాంఘిక శక్తులదే మాలకులంలో పైచేయిగా మారింది. వామపక్ష పార్టీలలో, కమ్యూనిస్టు పార్టీలలో పనిచేస్తున్న మాల నాయకులు వారి వారి రాజకీయ దృక్పథాలననుసరించి వారి కార్యక్షికమం ప్రాధాన్యతలు వేరే ఉంటున్నాయి. బాధితుల్లో/బాధిత కులంలో రాజ్యాధికార స్పృహ కం తక్షణ న్యాయం, సహాయం పొందాలనే న్యాయబద్ధమైన సహజ కాంక్ష బలంగా ఉంటున్నది. రాయితీలు, పరిహారాలు, సంక్షేమ పథకాల పట్ల మక్కువ ఎక్కువగా ఉంటున్నది. కొందరు వెనుకబడిన తరగతుల సోదరీ సోదరులు కుల హిందూ భూస్వాముల భూములను కౌలుకు తీసుకోవడంతోపాటు, వారి క్రూర పెత్తందారీ పోకడలను కూడ అలవర్చుకుంటున్నట్టు కనిపిస్తున్నది. బీసీ ప్రజలు మేధావులు ఈ అంశంపై ఆలోచించాలి. చర్చించాలి. అంబేద్కర్ ఆలోచనా విధానం, కాన్షీరాం పనివిధానంతో రాజకీయ విముక్తి దిశగా మాల కులస్తులను సంఘటితం చేసే బలమైన మాల నాయకత్వం లోపించింది. పైన పేర్కొన్న పరిమితులు, బలహీనతలు, ప్రతీఘాతకత్వాలు, వ్యక్తిగత స్వార్థా లు, దళారీతనం, పారదర్శకత, జవాబుదారీతనం, సాంఘిక పర్యవేక్షణ లోపించడం మొదలగు దుస్వభావాలు బాధితుల సామాజిక వర్గం నాయకుల్లోనే కాకుండా కొందరు మాదిగ నాయకులు, కొన్ని మాది గ సంఘాల్లోనూ, ఆ మాటకొస్తే అన్ని బహుజన కులాల్లోనూ ఈరకమైన జాడ్యం పేరుకుపోయింది. ఊడలు దిగిఉన్నది.ఈ కారణాల వల్లనే లక్షింపేట బాధిత మాలకులస్తులకు ఇంతవరకూ తగిన న్యాయం జరగలేదని బావించాలి.అసెంబ్లీ, పార్లమెంటులకు ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో మాల కులస్థుల ఓటు బ్యాంకును సానుకూలం చేసుకునే, సుస్థిరం చేసుకునే వ్యూహంలో భాగంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగానైనా ప్రభుత్వం చేత లక్షింపే ట బాధితులకు కొంత న్యాయం చేయించడానికి పూనుకోవచ్చు. బాధితుల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించవచ్చు. ఈ విధంగా బాధిత కులస్తుల ఓట్ల లబ్ధి పొందాలనుకునే అధికారపార్టీ వ్యూహం కాంగ్రెస్‌కు ఉండనే ఉంటుంది. బాధితులకు న్యాయం చేసినట్టు నటించే మనువాద ప్రభుత్వానికుం డే వ్యూహం ఉన్నది. ఇలా బాధితులకు భవిష్యత్‌లో జరగబోయే కొద్దిపాటి పరిహార న్యాయం, కంటితుడుపు న్యాయం మన సంఘీభావం వల్లనే, మన పోరాటపటిమ వల్లనే జరిగిందని కొందరు నాయకులు, కొన్ని సంఘాలు సంబరపడవచ్చు. చిత్తశుద్ధి వారిలో ఉండవచ్చుగాక, ఏదిఏమైనా, అణగారిన కులాలు, జాతుల్లోని ప్రతిఘటనా చైతన్యమే బాధితుల ఆత్మగౌరవా న్ని, హక్కులను రక్షిస్తుంది. వారిలో దీర్ఘకాలిక ప్రతిఘటనా శక్తిని పెంచుతుంది. ఈ దిశగా అడుగులేస్తే, పాదయావూతలు నిర్వహించే ప్రతివొక్కరికీ, ప్రతిసంఘానికీ నీలి సలాములు. జై భీములు. లక్షింపేట హక్కుల పేట కావాలి. బహుజన రాజ్యాధికార చైతన్యానికి కోటగా మారాలి.

-కృపాకర్‌మాదిగ 
ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి

Namasete Telangana News Paper Dated : 14/10/2012 

No comments:

Post a Comment