Monday, June 11, 2012

ఉద్యమానికి ఊతమిచ్చే తీర్పు---రమేశ్ హజారి,raju16-5 talangana patrika telangana culture telangana politics telangana cinema

నైజాం పాలననుంచి ఫ్యూడల్ రాజకీయ వ్యవస్థ కింద నలిగిపోయిన తెలంగాణ బిడ్డకు పోరాటమొక్కటే తెలిసిన రాజకీయ కార్యక్షికమం.సమాజం మార్పు చెందే క్రమంలో కొన్ని చారివూతక దశలను గతితార్కికంగా సమాజం అధిగమిస్తుంది అని మార్క్స్ మహానుభావుడు సూత్రీకరించాడు. ఆదిమ దశనుంచి ఫ్యూడల్ వ్యవస్థకు, ఆ తర్వాత పెట్టుబడి దారీ సమాజంలోకి ప్రవేశించి ఆ సమాజంలోని అంతర్గత వైరుధ్యాల మధ్య సంఘర్షణ ద్వారా సామాజిక మార్పు అనివార్యమై సోషలిజం వైపు ముందడుగేసి కార్మిక వర్గ నియంతృత్వం ద్వారా తన అవలక్షణాలను పూర్తిగా తుంచేసుకుని కమ్యూనిస్టు సమాజ స్థాపనవైపు మానవ పరిణామక్షికమం శాస్త్రీయంగా ముందుకు నడుస్తుందని చెప్పినవాడు కారల్ మార్క్స్. 

ప్రపంచ పరిణామ గతి ఆపద్ధతిలోనే ముందుకు నడుస్తున్నా భారత సమాజం మార్క్స్ సూత్రాన్ని కొనసాగించే క్రమంలో తేడా కనిపిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ సమాజంలో గతితార్కిక భౌతికవాదం ఆచరణలో అపసవ్యమైందనే చెప్పవచ్చు. ఈ సందర్భంగా చరిత్ర గతిని గమనిస్తే.., సామ్రాజ్యవాద బ్రిటిష్ వలసవాదులు భారతదేశాన్ని మొత్తంగా ఆక్రమించుకుని సంస్థానాలుగా రాజ్యాలను నడిపిస్తున్న రాజులను ఓడించి తమ ఏకఛవూతాధిపత్యం కిందకు తెచ్చారు.

అట్లా భారతదేశం బ్రిటిష్ ఇండియాగా మారి కొన్ని వందల ఏళ్లు వలస పాలన కింద నలిగిపోయింది. కానీ తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ సంస్థానంగా ఒక స్వతంత్ర రాజ్యంగానే ఉండింది. సీమాంధ్ర ప్రాంతం బ్రిటిష్ పాలన కిందికి వెళ్లిపోయింది. ఈ చారివూతక నేపథ్యమే తెలంగాణను ఆంధ్రను భౌగోళికంగా, రాజకీయంగా సాంస్కృతికంగా వేరుచేస్తున్నది. 

ఆంగ్లేయుల పాలన పెట్టుబడిదారీ విధానంతో కూడినది.దానికనుగుణంగానే కోస్తాంవూధలో వనరుల ఏర్పాటు, సంస్కృతి ఏర్పడింది. ఫ్యూడల్ విధానంలో ఉన్న తెలంగాణ ప్రజల్లో ఒకరూపాయి పెట్టి పదిరూపాయలు సంపాదించే(దోపిడీ చేసే) ఆలోచనలుండవు. సంప్రదాయ పద్ధతిలో సాగే ఉత్పత్తివిధానంపై ఆధారపడి తెలంగాణలో జీవనవిధానం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే స్వాతంవూత్యానంతరం ఆంధ్ర రాష్ట్రం కోసం కోస్తాంవూధులు చేసిన పోరాటానిది ఒక సామాజిక నేపథ్యమైతే.., సీమాంవూధతో తెలంగాణ విలీనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడింది మరో సామాజిక నేపథ్యం.

సీమాంవూధలోని సంపన్న భూస్వా మ్య వర్గాలు పెరిగిన సంపదతో బూర్జువాలు గా ఎదిగి పెట్టుబడిదారుడుగా, సామ్రాజ్యవాదులకు దళారీగా మారితే.., తెలంగాణ భూస్వామి నిజాం ప్రభువు దయాదాక్షిణ్యాలమీద మనుగడ సాగించి ప్రజలను పీడించి బతికాడు. అయితే.. ఈ వర్గాలు పైకి భూస్వామ్య వర్గంగా కనిపిస్తున్నా.. సారంలో చాలా భిన్నమైన గుణాత్మకమైన తేడాలు గల వర్గంగా ఉన్నారు. స్వాతంవూత్యోద్యమ కాలంనాటికే ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గంలో చైతన్యానికి పూనిక అయిన మార్క్సిజం అన్ని దేశాలకు విస్తరించింది. భారతదేశమూ వచ్చింది. స్వాతంవూత్యానంతరం ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ముసుగులో కోస్తా సీమాంధ్ర పెట్టుబడిదారీ వర్గం, కులం తెలంగాణను ఆక్రమించుకున్నా రు. ఈ వర్గమే పాలనను తన గుప్పిట్లో పెట్టుకున్నది. ఆర్థిక, సాంస్కృతికరంగాలను తమ చేతిలో పట్టుకుని తెలంగాణ యువత, మేధావివర్గం సమాజంలో ఎదగకుండా అడ్డుపడ్డది. 

అయితే తమ స్వయం పాలనకోసం 1956లో, 1969లో పోరాటాలు త్యాగాలు చేసినా.. సీమాంధ్ర అగ్రకుల నాయకత్వంతో లాలూచీ పడిన తెలంగాణ భూస్వామ్యవర్గం ప్రజల పోరాటాలకు ద్రోహం చేసింది. తమ స్వంత పాలనకోసం తెగించి పోరాడలేదు. 2001లో టీఆర్‌ఎస్ ఏర్పడిన తర్వాత తెలంగాణ సామాజిక, రాజకీయ రంగంలో మార్పు వచ్చింది.అప్పటి దాకా వివిధ విప్లవ సంస్థల ప్రభావంతో నూతన సమాజం కోసం సమస్త దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న యువత తెలంగాణ విముక్తికోసం పోరాటంలోకి దూకారు. ప్రజల ఆండతో.. యువత ముందుభాగాన నిలవడంతో.. తెలంగాణ ఉద్యమం అస్తిత్వ పోరాటంగా, ఆత్మగౌరవ పోరాటంగా ఎదిగింది. గల్లీనుంచి ఢిల్లీదాకా తెలంగాణ నినాదాన్ని విస్తరింపచేయడంలో కేసీఆర్ పాత్ర ఎంతో ప్రముఖమైనది. చైతన్యం పొందిన సమాజం తన ఆకాంక్షలకు అనుగుణంగా స్వీయ రాజకీయ వ్యక్తీకరణకు ఒక రాజకీయ పార్టీని ఏర్పాటుచేసుకుంటుంది. తమ ఆకాంక్షలకు అనుగుణంగా పోరాడుతుంది. సరిగ్గా ఈ పరిస్థితిలోనే తెలంగాణలో టీఆర్‌ఎస్ ఉనికిలోకి వచ్చింది. ప్రజల మన్ననలను పొందింది. సీమాంధ్ర వలస పాలకుల దోపిడీ, వివక్ష అంతం కావాలంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ తప్పని సరి అని ప్రకటించింది. ఈ క్రమంలో ఎన్నికల ద్వారా ఓటు శక్తితో రాజకీయ విజయంతో తెలంగాణ సాధన సాధ్యమని తెలంగాణ సమాజం నమ్ముతున్నది.

ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త మాక్స్ వెబర్ ప్రకారం ఒక రాజకీయ పార్టీ ముఖ్య లక్షణం అధికారంలోకి రావడం. అందుకోసం వూపజలకు తన మానిఫెస్టోను వివరించి తద్వారా ఓట్లు సాధిస్తుంది. సీమాంధ్ర రాజకీయ పార్టీల మెడలు వంచాలంటే స్థానిక పార్టీ బలోపేతం కావాలి. అయితే ఆపార్టీ ప్రజల చెప్పుచేతల్లో ఉంచుకోవడం అవసరం. స్వార్థం లేని మేధావివర్గం మాత్రమే ప్రజావసరాల వారధిని దాటకుండా చేయగలదు. అయితే ఈ తెలంగాణ మేధావి వర్గానికి అంబేద్కర్ అందించిన ఎన్నికల ప్రక్రియ పట్ల వ్యతిరేకత ఉండటమే తెలంగాణకు ఒక సమస్యగా మారింది. ఇందుకు కారణాలు అనేకం. అయితే ఉద్యమ సంస్థలు కూడా యువతను తెలంగాణ పట్ల పోరాటంలోకి క్రియాశీలంగా ముందుకు నడుపడంలో విఫలమవుతున్నాయి. ఇక తెలంగాణ సాధనకు బుల్లెట్ మార్గమా? లేదా బ్యాలెట్ మార్గమా అంటే.. ప్రజలంతా బ్యాలెట్ మార్గంలోకే ఎక్కువగా సమీకృతులు అవుతున్నారు కాబట్టి బ్యాలెట్ మార్గంలోకే నడుద్దాం. 

ఈ దేశంలో బ్యాలెట్‌ను ఓటు స్ఫూర్తిని ప్రజల పక్షాన వాడుకున్న రాజకీయ నాయకులు ఇద్దరే ఇద్దరు. ఒకరు కాన్షీరాం,మరొకరు కేసీఆర్. అణగారిన ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనారిటీ ప్రజలకోసం కాన్షీరాం ఓటును వాడుకుంటే.. , తెలంగాణ కోసం కేసీఆర్ విజయవంతంగా ఓ పోరాట ఆయుధంగా ఓటును మార్చినారు. రాజ్యాంగ పరిధిలో తెలంగాణ పోరాటాన్ని దశాబ్దకాలంగా కొనసాగిస్తూ సీమాంధ్ర పాలకులకు కొరకరాని కొయ్యగా మారారు. శాంతి భద్రతల నెపంతో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలనుకున్న సీమాంధ్ర పాలకుల కుట్రలను కేసీఆర్ నాయకత్వంలో మలిదశ తెలంగాణ ఉద్యమం విజయవంతంగా ఓడించింది. అలాగే.. తెలంగాణ రాష్ట్రసాధనే ఏకైక నినాదంగా ఉన్న టీఆర్‌ఎస్‌ను తెలంగాణ ప్రజలు సొంతంచేసుకోవాలి. సీమాంధ్ర నాయకత్వంలోని టీడీపీ, వైకాపా లాంటి పార్టీలు తెలంగాణ ప్రాం తంలోకి అడుగు పెట్టకుండా తెలంగాణ దళిత బహుజనులు ఇప్పటికైనా సోయి తెచ్చుకుని తమ అస్తిత్వాన్ని చాటుకుంటూనే తెలంగాణ ఏర్పాటు ఏకైక లక్ష్యం గా కొట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయాలె. ఇది తప్ప మరో మార్గంలేదు. 
చరిత్ర గమనాన్ని శాస్త్రీయంగా అంచ నా వేసే శక్తులకు, మేధావులకు ఉదారవాదం పనికి రాదు.

తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి అక్కరకొచ్చే పనిముట్లను సిద్ధం చేసుకోవాలి. దీనికి మొదటిది ఒక రాజకీయ పార్టీ నిర్మాణం. దీంతో సీమాంధ్ర పార్టీల మూలాలను దెబ్బతీయవచ్చు. తెలంగాణలోని అన్ని శక్తులు స్వీయ ఆలోచనా ధోరణులను విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏకం కావాలి. ఇది ఇప్పటి తెలంగాణ చారివూతక అవసరం. తెలంగాణ వ్యతిరేక సీమాంధ్ర పార్టీలకు పుట్టగతులు ఉండకుండా చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ఉద్యమశక్తులు, మేధావులు పనిచేయాలి. ఏ వర్గం, ఏ కులం లబ్ధి పొందుతున్నది అని కాకుండా, తెలంగాణ ఉద్యమానికి ఎవరి గెలుపు మేలు చేస్తుందో నిర్ణయించుకోవాల్సింది తెలంగాణ ఓటర్లే. కాబట్టి ఓటు తీర్పు ద్వారా తెలంగాణ వాదానికి బలం చేకూర్చి, ఉద్యమ లక్ష్యాన్ని ఒకడుగు దగ్గర చేయాలి. అనన్య పోరాటాల, త్యాగాల చరిత్ర కలిగిన తెలంగాణ ప్రజలు తగిన విధంగానే తీర్పునిస్తారు. ప్రజలే అంతిమ నిర్ణేతలు అని రుజువు చేస్తారు. 

-రమేశ్ హ
Namasete Telangana News Paper  Dated : 12/06/2012 

No comments:

Post a Comment