Thursday, October 10, 2013

తెలంగాణకు శాంతి కావాలి By అల్లం నారాయణ


‘మరియు దేవుడు అన్నాడు.. అక్కడ వెలుతురు ప్రసరించాలని...
ఇప్పుడక్కడ వెలుగుపరుచుకుని యున్నది’-జెనెసిస్ I 3
-

దిహోలీ బైబిల్


మీరు మీ చీకటి మనస్తత్వాల వల్ల పరుచుకునియున్న వెలుగును గుర్తించ నిరాకరిస్తున్నారు. చివరకు మీరు బైబిలునూ ప్రేమించరు. నమ్మినా పాటించరు. అబద్ధాలాడతారు. అన్నమాట మీద నిలబడరు. ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రం తెలంగాణపై చర్యలు తీసుకోవచ్చంటారు. తెలంగాణకు వ్యతిరేకం కాదంటారు. కానీ తెలంగాణలో దశాబ్దాల తర్వాత ఒక వెలుగు ప్రసరించినాక... చివరికి అల్ప విషయాల కోసం దేవుని ఆజ్ఞలనూ పాటించరు.

మీది కృత్రిమ ప్రపంచం. లాభనష్టాలు, అధికారమూ, ప్రతిష్ట, సంపద, ఆధిపత్యం, అహంకారంలలో మీరు మీలోని మనిషిని కోల్పోయిన జీవశ్చవాలు మీరు. మనం కలిసి ఉండలేం. కుదరదు. మా తెలంగాణలో వెలుగు ప్రసరించనివ్వండి.. ఆంధ్రాబాబులూ.. మీలో ప్రవహిస్తున్న మీమీ ప్రాంతీయ అహంకారాన్ని మడుచుకుని, మీ ఎత్తులు, జిత్తులు, కత్తులు మీ ప్రాంతానికి పరిమితం చేసుకోండి. హైదరాబాద్ స్టేట్, తెలంగాణకు శాంతి కావాలి... అదిప్పుడు వెలుగును అనుభవించాలి. ఉత్సవంలో అదిప్పుడు బతుకు పండుగయై భువిన వర్ధిల్లాలి.
అవును ఇట్లా అన్నప్పుడు మీకు ఇబ్బందిగానే ఉంటుంది. అమరవీరుల స్థూపం ముందు ఒక అమ్మలా నిలుచుని, ఆ స్థూపంలో నుంచి గుడగుడ గుండె గొంతుకలు కొట్లాడే భాష విన్నట్టుగా మీరప్పుడు ప్రార్థించారు. మీ చేతిలో అప్పుడు బైబిలుంది. కానీ ఇప్పుడేమో టైర్లు మాత్రమే రోడ్ల మీద కాలిపోతున్న మంటలు మీకు మహోగ్ర భగభగలుగా కనిపించి ప్లేటు ఫిరాయించారు. టైర్లు కాలాయి అక్కడ. కానీ తెలుసా! మీకు మనుషులు రోడ్ల మీద కాలిపోయారిక్కడ. నిండు రక్తమాంసాలు రోడ్డు మీద దహించుకుంటున్నప్పుడు వీచిన కమురు వాసనలు తెలుసా! మీకు. కానీ మీరు టైర్లు కాల్చే ఉద్యమంలో న్యాయమే దో ఉందని, నిలు మనుషులు దహించుకుపోయిన ఉద్యమం ఫలితంగా ప్రసరించిన వెలుగులో సమన్యాయం లేదని అనుకుంటున్నారు. ఎందుకు? అయి నా ఈ ప్రశ్న.. దీనికి జవాబు కూడా ఎందుకు? మీరంతే. కరుడుగట్టిపోయిన వాళ్లు. తెలంగాణను కేవలం ఓటర్లుగా చూస్తున్న వాళ్లు. ఓటర్లంటే కేవలం మిమ్మల్ని అధికార పీఠాల మీద కూచోపె మాత్రమే పనికివచ్చే బానిసల మంద. అవునా! మీ నాయన నుంచి మీ దాకా! అవును అధికార పీఠాపూక్కడానికి, ఎక్కినాక లోటస్ పాండ్‌లై వికసించడానికి తెలంగాణ లేవాలి. లేచి నిలబడాలి. ఆ తర్వాత హైదరాబాద్ పాకిస్థాన్ కావాలి. నంద్యాల నుంచి తిరిగి వచ్చేటపుపడు పాస్‌పోర్టు, వీసా కావాలి. అయినా... మీ వేదనభరితమైన నాటకం రక్తి కట్టడం లేదు. హైదరాబాద్ మీది కాదు. నిజమే మీరు రాయలసీమ బిడ్డలు. కాలమో, ఖర్మమో, చరిత్రో, భాషావూపయుక్తమో, కలిశాం. కానీ... మేము కేవలం ఓటు బోడమల్లన్నలమయి. యాతనపడ్డాం. అనుభవించాం. పోగొట్టుకున్నాం... నిలబడ్డాం. ఇంకెంత మాత్రం తెలంగాణ ఓటరు బానిసల మందకాదు. దయచేసి హైదరాబాద్‌లో సభ వద్దు. హైదరాబాద్‌లో మీ దీక్ష వద్దు.

ఎట్లాగూ మీరు రాయలసీమ బిడ్డ. కర్నూలు ఉంది. కడప ఉంది. చిత్తూరు ఉంది. అనంతపురం ఉంది. అక్కడ సభలు పెట్టుకోండి. ఊరేగండి. లక్షలమందికి మీ భాషణలు చెప్పండి. సుభాషితాలు చెప్పండి. సమన్యాయం సంగతులూ మాట్లాడండి. ఫర్వాలేదు. కానీ...మీరు నిజంగానే దేవుడి బిడ్డలయితే మా వెలుగులో దయచేసి చీకట్లు నింపకండి. తెలుసా! మాకు మానుకోట రాయి ఒక పూజించుకున్న దేవుడి విగ్రహం.అది ఒక సమ్మక్క సారక్కల విల్లంబు. అదొక సమ్మక్క సారక్కలు పోరాడిన కత్తి. దయచేసి నిండు తటాకంలా ఉన్న మా ప్రశాంతతను భగ్నం చెయ్యకండి. దీక్షలైనా, సభలైనా ఇక్కడ వద్దు. ఇక్కడ ఏ రాయీ ఏ ప్రశాంతతనూ చెదరగొట్టడం తెలంగాణకు ఇష్టమే లేదు. మేము శాంతిని కోరుకుంటున్నాం. మీ నుంచి శాంతినే ఆశిస్తున్నాము. మీవి ఒకవేళ రాతిగుండెలే అయితే.. మా విసిరిన వడిసెల రాళ్ల సంగతి అనుభవించి ఉన్నారు కనుక. అర్థం చేసుకోండి. తెలంగాణ ఇంకెంత మాత్రం ఓటరు బానిసలు ఉన్న గడ్డ మాత్ర మే కాదు. అసలే దసరా, సద్దుల బతుకమ్మల సంబరాల్లో ఒక జీవన ఉత్సవంలో ఉన్నాం. బతుకమ్మ పాటలకు మోగే చప్పట్లే మీ చీకటి కోటలు కూలగొట్టే తప్పట్లు కావొద్దు.. జాగ్రత్త. జాగ్రత్త. హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉంచేందుకు, ఉండేందుకు సహకరించండి.
అయ్యా! బాబూ... ఎవడి చెప్పులతో వాడే కొట్టుకుంటున్న కేవలం అరవైరోజు ల, లక్ష అపవూభంశాల యాగీకే మీరు సులభంగా బుట్టలో పడిపోయారు. కానీ తన నేలను అవమానపరిచిన వాడి మీదకు, నలభై వేల మందిలో ఒక్కడు విసిరిన చెప్పు తెలంగాణ. ఇది తెగువ. తెలుసా! ఈ తెగువకు అరవై ఏళ్ల చరిత్ర ఉంది. ఈ నేలకు దశాబ్దాల తిరుగుబాటు చరిత్ర ఉన్నది. కానీ బాబూ! మీ రెండు కళ్లూ ఎప్పుడూ ఒకే కన్నై, ఒకే గొంతై మాట్లాడుతూ ఉంటుంది. విన్నాం. చాలా. కానీ. ఏ గూటి పక్షులు ఆ గూటికే. తప్పేమీ లేదు. గూడు మీద, పుట్టిన రాయలసీమ మీద ప్రేమ ఉండాలి. నిజాం నవాబులకు పాఠాలు చెబుతారు మీరు. అమెరికా వీధుల్లో అడుక్కొచ్చి, మైక్రోసాఫ్ట్‌లతో నేనే అభివృద్ధి చేసిన నెపం పెట్టవద్దు. హైదరాబాద్ మీ జాగీరు కాదు. ఉంటే ఉండవచ్చుగాక. జూబ్లీహిల్స్‌లో మీకొక ఇల్లు. నిర్మిస్తే నిర్మించవచ్చు కాక. బహుళజాతి కంపెనీల దళారీల మందలాది ఆఫీసులు. 
కానీ తెలుసా బాబూ! మీ తెరిచిన కన్నెప్పుడూ సుదీర్ఘంగానూ, ప్రజాస్వామ్యబద్ధంగానూ, రాజ్యాంగ స్ఫూర్తిగానూ జరిగిన ఆత్మగౌరవ పోరాటంపైన శీతకన్నే వేసింది. మీ యూటర్న్‌లన్నీ అంతిమంగా‘పీ’ టర్న్ తీసుకున్నట్టు చెప్పారు. కానీ.. ఆ ‘పీ’ అనగా ప్రజల్లో మేము లేము. మా వేదనాభరితంగా కొనసాగిన ఆత్మబలిదానాల పోరాటమూ లేదు. ఒక్కనాడూ మీరు కూడా నిలువునా తగులబెట్టుకున్న తెలంగాణ ప్రజల గురించి మాట్లాడలేదు. చివరికి ఇప్పుడు మీకు గుర్తుకొస్తున్నది. అక్కడేదో న్యాయం జరగాలని హైదరాబాద్ బొడ్డుకోసి బొందలేసి పేరుపెట్టింది నేనని చెప్పుకోవడమే మీ అహంకారానికి, మీ ప్రాంతీయ దురహంకారానికి నిలువుటద్దం. చరిత్రా తెలువదు. వర్తమానమూ అర్థం కాదు. నిజమే. మీకు హైదరాబాద్ అంటే మీరు కట్టిన ప్రైవేటు బంగ్లాల సొగసు. ఛప్పన్నారు కంపెనీలు కట్టుకున్న, కూడగట్టుకున్న సంపద. ప్రజల సొత్తు పరాయి పాలైన చోట మొలిచిన అంత్రాల అద్దాల భవనాలు. పోగుబడిన ప్రైవేట్ సంపద. కొత్తగా మొలిచిన సైబరాబాద్.
చార్మినార్‌కు పోటీపెట్టిన హైటెక్‌సిటీ. చుట్టూ వ్యాపించి ప్లాట్లు ప్లాట్లుగా విస్తరించి కొల్లగొట్టిన రియల్ ఎస్టేట్ సొమ్ము.అయినా చిత్తూరులో పుట్టిన వాళ్లకు, కడపలో పుట్టిన వాళ్లకు ఈ షాన్ షహర్ ఎట్లా అర్థమవుతుంది. ఎన్ని ‘ప్యారడైజ్’ I ‘లాస్ట్’లో పోగొట్టుకున్న మూలాలు ఎట్లా అర్థమవుతాయి. వీధులు వెడల్పైయినప్పుడు మీ కోసం, మీ ఛప్పన్నారు కంపెనీల కోసం కిలోమీటర్ల కొద్దీ విస్తరించిన ఫ్లైఓవర్లు, ఎన్ని కడుపులు కొట్టాయో, ఎన్ని కాపురాలు కూల్చాయో, ఎన్ని అస్లీ హైదరాబాద్ మూలాలను ధ్వంసం చేశాయో అడుగు. ఇక్కడ ధ్వంసమైన పురా ఆత్మల మూలుగులను. బాబూ... ఎందుకు? పుట్టిన శిశువుకు సమైక్యాంధ్ర వేలాడదీసి ఆనందించి క్రూర పరిహాసం చేసే ఒక కృత్రిమ, కపట, రాజ్యాంగ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక ఉద్యమం మీద, కేవలం అరవై రోజుల అల్లరి మీద మీకెందుకంత ప్రేమ పొంగుతున్నది. ఏమి న్యాయం కావాలి. ఆ ప్రాంతానికి. ఒక పార్టీ తీర్మా నం మాత్రమే న్యాయాన్యాయాల చర్చ జరపలేదని, సమస్యలను ప్రభుత్వం మాత్రమే పరిష్కరిస్తుందని తెలియనంత మూర్ఖులు కాదనే అనుకుంటా మీరు. ఎందుకంటే మీరు తొమ్మిదేండ్ల ముఖ్యమంత్రి. ఒక పార్టీ తీర్మానం, మొన్న క్యాబినెట్ నోట్ అయింది. ఇక సమస్యలు వినడానికి, పరిష్కారాలు కనుగొనడానికి మంత్రివర్గ బృందమూ రెడీ... నిజంగానే మీరు లేఖ ఇచ్చింది నిజమయితే, నిజంగానే మీరు తెలంగాణకు వ్యతిరేకం కాదంటే.. నిజంగానే మీకు సీమాంధ్ర సమస్యలు మాత్రమే పరిష్కరించాలనుంటే.. ఇప్పుడు మాట్లాడండి. మంత్రివర్గ బృందంతో. స్టేట్స్‌మన్ కావడం అంత సులభం కాదు.

ఒక ప్రాంతం వాడు ఇంకొక ప్రాంతాన్ని ప్రేమించడమూ సులభం కాదు. అందునా ప్రాంతీయ అహంకారం, హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేసినా చెప్పుకునే వాళ్లకు, మాటిమాటికీ తన ప్రాంతం గుర్తొచ్చి ముఖంనిండా తెలియని అసహనం కదలాడి, ప్రస్ఫుటంగా మేక వన్నెపులి బయటపడ్డట్టుగా బహిర్గతం అయ్యే వాళ్లకు కష్టం. ఇక దీక్షపూందుకు? అయినా మీరు సీమాంవూధులే. ఒకటే మాట. సీమాంవూధలోనే మీ భవిష్యత్తు ఉంది. త్వరపడండి. తెలంగాణ ఇప్పుడు ఒక గడుసు భూతం. అది మీ రెండు కళ్లను నమ్మదు. అది మీ టర్నులనూ నమ్మదు. సర్దుకుంటే మంచిది. మా కన్నీళ్లు, మా వేదన అర్థంగాని వాళ్లు, ఎన్ని గ్లిసరిన్ మాయోపాయ కల్మష కన్నీళ్లు విడిచినా తెలంగాణ నమ్మదు. అహంకారం వద్దు. హైదరాబాద్ మీరు పెట్టిన భిక్షకాదు. జాగ్రత్త.. జాగ్రత్త...

ఆయ్యా! కిరణం.దేని కోసం యుద్ధాలు. మీరు మాట్లాడుతుంటే ముచ్చ మీరు నడిపిస్తున్న ఉద్యమమూ ముచ్చట గొలుపుతున్నది. సమాధుల మీద పండేవాడు. గడ్డి తినేవాడు. కొరడాలతో కొట్టుకునే వాడు. అవును ఆశ్చర్యం. హైదరాబాద్‌లో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగినా ఇక్కడి బతుకు సారం మీకు అర్థం కానేలేదు. అధిష్ఠానం మాటకు కట్టుబడి ఉంటానన్నారు. కానీ ఇప్పుడా మాటను గట్టుమీద పెట్టారు. యుద్ధాన్ని పలవరిస్తుంటారు. నిజమే. మీకు యుద్ధాలు కావాలి. సామ్రాజ్యాలు కోల్పోయినప్పటి బాధ. ఓటరు బానిసల కాళ్ల కింది ధూళి ఎగసి కంట్లో పడ్డ వ్యధ. మీరూ అంతే. ధాతూ ఫిర్యాదులేని రాజ్య ప్రతినిధి. మీ హయాం లో ఉద్యోగులు చక్కగా నల్లవస్త్రాలు ధరించి పైకి ఎక్కి సచివాలయం మీద నిరసన జెండా ఎగిరేయగలరు. అంతా చట్టబద్ధమే. కానీ మీ ఏలుబడిలోనే ముందర పోలీసు వాహనా ల బారు, వెనుక ఎన్జీవోల బస్సుల బారూ కదిలిరాగా నిజాం కాలేజీ ముంగట, ఫతే మైదాన్‌లో జరిపిన దండయావూత నాడు మా నిజాం కాలేజీ పిల్లలు నెత్తురోడారు. 

మా బాలరాజ్‌యాదవ్ నడివీధిలో గాయమయ్యాడు. దిక్కులేని వాళ్లం. ఈ రాజ్యం నిరాకరించిన వాళ్లం. తెలంగాణ వాళ్లం. మా నేల మీద మేము అవమానాల పాలయిన వాళ్లం. నిజాం కాలేజీ ప్రిన్సిపాల్‌ను కూడా ధిక్కరించి, హాస్టళ్లల్లో చొరబడి, చెరపట్టి, ఖాకీల లాఠీలకు, కాళ్లూ చేతులూ విరిగిన మా నిజాం కాలేజీ పిల్లల మీద ఆన. మీరు రాయలసీమకు చెందినవారు మాత్రమే. మీరే చెప్పుకున్నట్టు.. మీరు బలవంతపు సమైక్యాంవూధకు మాత్రమే నాయకులు. మీరు కూడా నాయకులు కాలేరు. కాబోరు. మీ ఆత్మ చిత్తూరులో, తిరుపతి వెంక గర్భగుడిలో కొట్టుకుంటున్నది. మా గద్వాల పంచెలు నిరాకరించిన టీటీడీ ఆహంకారం లాగే మీదీ ఆధిప త్య అహంకారం. ఓట్లకోసమూ, పీఠం కోసమూ, మీరెన్నయినా మాట్లాడి ఉండవ చ్చు. కానీ మీరొక ప్రాంతీయ ‘ఫండమెంటలిస్టు’ మాత్రమే. సమస్యలు విన్నవించే సమయంకోసమూ నిరీక్షించలేరు.నీళ్లంటారు. నిప్పులంటారు. హైదరాబాద్ అం టారు. సర్దార్ వల్లభాయి పటేల్ అంటారు. 

నెహ్రూ అంటారు. ఇందిరాగాంధీ అంటారు. కానీ తెలుసా! సీమాంధ్ర కిరణంగా మీరు తెలంగాణ నేలను ధిక్కరించా రు. ఎన్జీవోల సభకు అనుమతి ఇస్తారు. జగన్ దీక్షకు అనుమతిస్తారు. బాబులూ మీ బాధ ఒక్కటే. తెలంగాణ తలెత్తకూడదు. తెలంగాణలో వెలుగు ప్రసరించకూడదు. కానీ మేము విడిపోయినాము! మీ ముగ్గురు ఆంధ్రా, బాబుల నుంచి, మీమీ అధికారాల నుంచి, మీమీ పెట్టుబడుల డాబుల నుంచి, మీ సంపదల వికృత ప్రదర్శనల నుంచి ... మీరు వేరు.. మేము వేరు.
మేము జీవితాన్ని ప్రేమించే వాళ్లం. ప్రవహించే నదిలాగా బతుకును పరవశింపజేసేవాళ్లం. తెలుసా? ఆంధ్ర బాబులూ.. ఒక పసుపు ముద్ద, ఒక గుమ్మడి పువ్వు, గుప్పెడు తంగేడు పువ్వు, చాటెడు గునుగు పువ్వు, మధ్యల ఒక బీరపువ్వు సొగసుల గౌరమ్మ మా బతుకమ్మయై మమ్మల్ని ఎల్లవేళలా బతికిస్తూ ఉంటుంది. ఒక గౌర మ్మ, లక్షల మందిని ట్యాంకుబండ కట్టమీద చప్పట్లై మోగిస్తుంది. రెండు కంకబద్ధలు గుట్టకు ఎదుక్కి జంపన్నవాగుల ప్రవాహంలో ఒక పోరాటం ఉంటుంది.
ఒక సమ్మ క్క సారక్క మాలో నెత్తురు వారసత్వమై పోటెత్తుతుంది. 
జీవితాలని ధ్వంసం చేస్తారు మీరు. జీవితాలని ప్రేమిస్తాం మేము. జీవితాన్ని ఒక ఉత్సవ వసంతంలా ఊరేగుతాము మేము. ఓపెన్ కాస్టులై విస్తరించినట్టుగా, మల్లెపూ ల తోటల్లో మరుభూముల ఇనుపడేగల అడ్డాలు ప్రతిష్టించినట్టుగా జీవితాన్ని ధ్వంసం చేస్తారు మీరు. లూటీలు చేస్తారు. టైర్లు తగుల బెడతారు శవాల్లాగా సమాధుల మీద పడుకుంటారు. గడ్డితింటారు. ఒక్కటన్నా వికసించిన ఒక విద్యుత్తేజంలాగా ఒక సామూహిక గానంలాగా..బతుకమ్మ చప్పట్లలాగా, బోనం ఎత్తిన మహిళల దండులా గా ఉండలేరు. మీది కృత్రిమ ప్రపంచం. లాభనష్టాలు, అధికారమూ, ప్రతిష్ట, సంపద, ఆధిపత్యం,అహంకారంలలో మీరు మీలోని మనిషిని కోల్పోయిన జీవశ్చవాలు మీరు. మనం కలిసి ఉండలేం.కుదరదు. మా తెలంగాణలో వెలుగు ప్రసరించనివ్వం డి.. ఆంధ్రాబాబులూ.. మీలో ప్రవహిస్తున్న మీమీ ప్రాంతీయ అహంకారాన్ని మడుచుకుని, మీ ఎత్తులు, జిత్తులు, కత్తులు మీ ప్రాంతానికి పరిమితం చేసుకోండి. హైదరాబాద్ స్టేట్, తెలంగాణకు శాంతి కావాలి... అదిప్పుడు వెలుగును అనుభవించాలి. ఉత్సవంలో అదిప్పుడు బతుకు పండుగయై భువిన వర్ధిల్లాలి.

-అల్లం నారాయణ 
narayana.allam@gmail.com

Namasete Telangana News Paper Dated: 06/10/2013 

No comments:

Post a Comment