Tuesday, November 26, 2013

మార్క్స్- చే గువేరా బాటలో... (ఏఐఎస్‌ఎఫ్) By సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ



అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) 28వ జాతీయ మహాసభలు ఈనెల 28,29,30న భారతదేశంలో వామపక్ష, దళిత, సాంస్కృతిక, ప్రజాస్వామ్య ఉద్యమాలకు నిలయమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోతున్నాయి. దాదా పు ఇరువై ఏళ్ల తరువాత ఈ అవకాశం ఏఐఎస్‌ఎఫ్ ఆంధ్రవూపదేశ్ రాష్ర్ట సమితికి వచ్చింది. ఈ జాతీయ మహాసభలు భారతదేశ విద్యార్థి ఉద్యమాలకు దిశానిర్దేశం చేస్తాయని భావిస్తున్నాము. ప్రస్తుతం భారతదేశంలో విద్యావ్యవస్థ చాలా దిగజారిపోయింది. విద్య అంటే ఉపాధి కోసమే అన్నంత హీనమైన స్థితిలో వున్నది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్‌ల్లో విద్యారంగానికి కేటాయించిన నిధులు, అలాగే విద్యాహక్కు చట్టం అమలు ను పరిశీలిస్తే మన ప్రభుత్వాలకు విద్యారంగంపై ఉన్న మక్కువ ఎంతో అర్థమవుతూనే వున్నది. మన పాలకులు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతూ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నారు భారతదేశంలో శాస్త్రీయ విద్యావిధానం లేనందున సామాజిక, ఆర్థిక, శాస్త్ర సాంకేతికరంగాలలో రోజురోజుకు వెనుకబడిపోతున్నాం. ఈ ప్రపంచంలోని 193దేశాలలోని 112 దేశాలు కారల్‌మార్క్స్, చేగువేరా చెప్పినటువంటి విప్లవ సిద్ధాంతాల, విప్లవాల ద్వారా మాత్రమే స్వాతంవూత్యాన్ని సంపాదించుకున్నాయి. అందులో 85దేశాలు గయానా లాంటి దేశాలు కూడా 15ఏళ్లలో అద్భుతమైనటువంటి శాస్త్ర సాంకేతికాభివృద్ధిని ప్రజాసంక్షేమాభివృద్ధిని సాధించాయి. కాని, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 సంవత్సరాలైనా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అంటున్నాం దీనికి కారణం ఏ వ్యవస్థ అయి నా విద్యావ్యవస్థ నుంచి ప్రారంభం కావాల్సిందే.

1966 సంవత్సరంలో వచ్చినటువంటి కొఠారీ కమిషన్ కాదని తమ స్వలా భం కోసం కాంగ్రెస్ పాలకులు 1986 జాతీయ విద్యావిధానా న్ని తీసుకువచ్చారు. మానవ వనరుల అభివృద్ధిలో విద్య అనేది కీలకపాత్ర పోషిస్తుందని ప్రతి భారతీయుని ఆశ. కానీ, ఈరోజు దేశంలో విద్య గాట్ లాంటి అంతర్జాతీయ ఒప్పందాలలో వ్యాపారంగా మారిపోయింది. విద్య అనేది ఈ దేశంలో ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు అని రాజ్యాంగం చెబుతుంటే మన పాలకులు దాన్ని విస్మరిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైనటువంటి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈరోజు పార్లమెంట్‌లో అసెంబ్లీలలో కూర్చునటువంటి మన ప్రజావూపతినిధులు రాజ్యాంగం అంటే రాజకీయం అన్నంత హీనమైన స్థితికి దిగజారిపోయారు. విశ్వవిద్యాలయాలు విశ్వాసానికి మూలాలు అని భారత రాజ్యాంగ నిర్మాతలు భావిస్తే మన పాలకులు విశ్వవిద్యాలయాలపైనా కూడా రాజకీయం చేస్తూ విదేశీ విద్యాలయాలను దేశంలోకి అనుమతిస్తున్నారు.

మొన్నటి వరకు విద్యారంగంపై వ్యాపారం చేస్తావుంటే భాషను అడ్డుపెట్టుకొని వ్యాపారం చేస్తావుంటే చూస్తూ ఊరుకోలేక ఇంగ్లిషు వచ్చినంత మాత్రాన ఇండియాలో వున్నవారంతా మేధావులు కారు అంటూ సుప్రీంకోర్టు రంగవూపవేశం చేసి వెను దేశంలో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని ఏవిధంగా ఉండాలో చెప్పి మరీ తీర్పునిచ్చి విద్యాహక్కు చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెడితే దానిని చర్చించింది, (అందులో ఒకరు సీపీఐ ఎంపీ గురుదాస్‌దాస్ గుప్తా) ఆమోదించింది 84 మంది. దీన్ని బట్టి చూస్తే మన పాలకులకు విద్యపైనా ఎంత ఇష్టం ఉందో అర్థమవుతుంది. మళ్లీ దేశాలు పరిజ్ఞానం చాలదంటూ అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలకు దేశాన్ని తాకట్టు పెడుతున్నారు. విద్యార్థులకు రాజకీయం ఎందు కు అని సాకు చూపుతూ విశ్వవిద్యాలయాలలో ఎన్నికలను రద్దు చేశారు.

దానిపై, నియమించినటువంటి లింగ్డో కమిషన్ వాదనలను కూడా గాలికి వదిలేశారు. డబ్బుం రాజకీయం అంటూ వారసత్వ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈ సందర్భంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగేటువంటి జాతీయ మహాసభలలో దేశ విద్యారంగంపై చర్చించి విద్యావ్యవస్థకు ఊపిరిపోసేటువంటి ప్రణాళికను తయారు చేసి రాబోయే భవిష్యత్ విద్యార్థి ఉద్యమానికి ఏఐఎస్‌ఎఫ్ ప్రాతినిధ్యం వహిస్తుంది. వామపక్ష విద్యార్థి సంఘాలు లేవు అన్న మతతత్వ, మనువాదులకు ఇది చెంపదెబ్బతో సమానం. ఈ మహాసభలలో 28 రాష్ట్రాల నుం చి 1000 మంది ప్రతినిధులు అలాగే 15 దేశాల నుంచి అంతర్జాతీయ విద్యార్థి నాయకులు పాల్గొని, ప్రపంచ విద్యార్థి ఉద్యమంలో ఏఐఎస్‌ఎఫ్ పాత్రను వివరిస్తాం. అవినీతి, కుంభకోణాలకు మారుపేరైనటువంటి యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలను గద్దె దింపి లౌకిక, వామపక్ష ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాం. ఈ మహాసభలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలని కోరుతున్నాం. 
-సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ
ఏఐఎస్‌ఎఫ్ రాష్ర్ట అధ్యక్షు

Namasete Telangana Telugu News Paper Dated : 27/11/2013 

No comments:

Post a Comment