Friday, November 29, 2013

పోరాటాలతోనే విముక్తి By -జగన్ సీపీఐ (మావోయిస్టు) ఎన్.టి.ఎస్.జెడ్.సి

ప్రియమైన తెలంగాణ ప్రజాలా రా! ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యం గా, పీఎల్‌జీఏ 13వ వార్షికోత్సవాన్ని తెలంగాణ వ్యాప్తంగా విజయవంతం చేద్దాం! అంతర్జాతీయ ఎర్రసైన్యంలో ఒక డిటాచ్‌మెంట్‌గా, ప్రపంచ సోషలి స్టు విప్లవంలో భాగంగా భారత నూత న ప్రజాస్వామిక విప్లవ విజయం కోసం, భారత విప్లవ మహోపాధ్యా యులు చారుమజుందార్, కాన్హాయ్ చటర్జీల పథ నిర్దేశంలో మన పీఎల్ జీఏ ఆవిర్భవించింది. 2013 డిసెం బర్ 2 నాటికి అది 13ఏళ్లు పూర్తిచేసుకోబోతున్నది. ఈ సందర్భంగా ఉత్తర తెలంగాణవ్యాప్తంగా పీఎల్ జీఏ13వ వార్షికోత్సవాలను డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 8 వరకు జరుపుకోవాలని ఎన్‌టీ ఎస్‌జెడ్‌సీ పిలుపు నిస్తున్నది. విప్లవోద్యమాన్ని నిర్మూలించే లక్ష్యంతో పాలకవర్గాలు ప్రజలపై సాగిస్తున్న గ్రీన్‌హంట్‌ను ఓడించడానికి, ప్రజస్వామిక తెలం గాణను సాధించే లక్ష్యంతో యువతి, యువకులు పీఎల్‌జీఏలో పెద్ద యెత్తున భర్త్తీ అవుతూ.. గెరిల్లా యుద్ధాన్ని తీవ్రతరం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపునిస్తున్నది. 2012 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఉత్తర తెలంగాణ ప్రజాయుద్ధంలో 10మంది విప్లవ కారు లు అమరులయ్యారు. దేశవ్యాప్తంగా 150 మందికి పైగా నేలతల్లి ఉత్తమ పుత్రికలు, పుత్రులు, సాధారణ ప్రజలు తమ నులివెచ్చని నెత్తురుధారబోసి అమూ ల్యమైన తమ ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పిం చారు. కామ్రేడ్స్ సుధాకర్,పుష్ప,సబిత,గౌతం, ఊర్మి ల, రాజు, వసంత, బీమా.. ఇంకా ప్రజాసంఘాల నాయకుడు గంటి ప్రసాదం, వెంకట సుబ్బయ్య, విప్లవరచయిత ఆలూరి భుజంగరావు తదితరులు రాజ్యం చేస్తున్న బూటకపు ఎన్‌కౌంటర్లలో, రాజ్య ప్రేరేపిత హంత కముఠాల చేతుల్లో అమరులైనారు. మరికొంత మంది అనారోగ్యంతో అమరులైనారు. వీళ్లంతా నూతన ప్రజస్వామిక విప్లవంకోసం, దోపిడీ పాలన అంతంకోసం, నవసమాజంకోసం తుదికం టా పోరాడి తమ రక్తాన్ని చిందించి ఎర్రజెండాకు మరింత వన్నె తెచ్చారు. వారి ఆశయాలను సమున్న తంగా ఎత్తిపడదాం. వారు వదిలివెళ్లిన కర్తవ్యాలను పూర్తి చేసేవరకు పోరాడుతామని శపథం చేద్దాం.

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాల వికృత మైన అభివృద్ధి పర్యవసానంగా అంతర్జాతీయంగా సుడులు తిరుగుతున్న ఆర్థిక మాంద్యం ప్రభావం మనదేశంపై కూడా తీవ్రంగానే పడింది. అవినీతి పెరిగిపోవడం,నిరుద్యోగం,అధిక ధరలు, దారిద్య్రం, విస్థాపిత సమస్యవల్ల,భూములు, అడవులు, నీరు కోల్పోవడం వల్ల కార్మిక, కర్షక, మధ్యతరగతి పీడిత ప్రజానీకం బతుకులు దుర్భరంగా మారాయి. వారికి విప్లవం తప్ప మరో మార్గం ఏదీ లేకుండా పోయిం ది. విప్లవానికి భౌతిక పరిస్థితులు పరిపక్వ మవుతు న్నాయి. అన్ని సెక్షన్ల ప్రజల సమ్మెలు, ఆందోళనలు పెరుగుతున్నాయి.ఆర్థిక పోరాటాలు రాజకీయ పోరా టాలుగా మారుతున్నాయి. దేశంలోని వనరులను దోచిపెట్టడానికి దేశంలో, మన రాష్ట్రంలో 1991 నుంచి నూతన ఆర్థిక విదానాల ద్వారా దోపిడీని తీవ్రతరం చేస్తున్నాయి. ఫలితంగా వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్నది. లక్షలాదిమంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నారు. మరోవైపు రాజ్యం ప్రజల మధ్య వైరుధ్యాలను పెంచి వారిపై బహుముఖ దాడిని కొనసాగిస్తున్నది. పీడిత ప్రజలైన రైతాంగం, దళితులపై, ఆదివాసీల పై, మైనార్టీలపై, మహిళలపై, కార్మికులపై అణచివేతే ప్రధానాయుధంగా నిర్బంధాలకు గురిచేస్తున్నది. ప్రజాస్వామ్యం ముసుగులో బూర్జువా, భూస్వామ్య వర్గాలు, దళారీ పాలకులు, సామ్రాజ్య వాదులతో మిలాఖతై ప్రంపచీకరణ విధానాలను అమలు చేస్తూ బహుళజాతి సంస్థలకు గనులు, టైగర్ ప్రాజెక్టులు, భారీ నీటి ప్రాజెక్టులు, కోస్టల్ కారిడార్ పేరిట, సెజ్ లు, ఓపెన్‌కాస్టుల పేరిట పీడితప్రజలను, ముఖ్యం గా ఆదివాసీలను నిర్వాసితులను చేస్తున్నారు. మరో వైపు ప్రజలను మభ్యపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆహారభద్రత చట్టం, నూతన భూసంస్కరణ చట్టా న్ని రూపొందించింది. రాష్ట్రంలో కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం రచ్చబండ, బంగారు తల్లి, రాజీవ్ యువ కిరణాలు పథకాలను ప్రవేశపెట్టింది. ఇవన్నీ ప్రజల్లో భ్రమలు కల్పించేందుకే తప్ప మరోటి కాదు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక దాడికి గురైన తెలంగాణ ప్రజలు,ఆదివాసీలు, దళిత కులాలు, మైనార్టీలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాటాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల పోరా టంతో కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్టాన్ని ప్రకటిం చా ల్సివచ్చింది. ఇది తెలంగాణ ప్రజల పోరాట విజ యం. 

1969-71 తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన తర్వాత-1996లో విప్లవోద్యమమే తెలంగాణ ఉద్య మానికి ఊపిరిపోసిన విషయం జగద్వితం. అప్పటి నుంచి దిశ, దశలను నిర్దేశిస్తూ ప్రజాస్వామిక తెలం గాణ రాష్ట్రసాధన నినాదాన్ని, స్పష్టమైన లక్ష్యాన్ని ముందుంచింది. ఇప్పటి భౌగోళిక తెలంగాణలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కాబోవు. పాక్షికంగానే కొన్ని సమస్యలు తీరుతాయి. దళారీ బూర్జువా, భూస్వామ్యవర్గాలకే అధికారం, ప్రయో జనం దక్కుతుంది. ప్రతి ఒక్క అణగారిన ప్రజల మౌలిక సమస్య ప్రజాస్వామిక తెలంగాణను సాధిం చుకోవడం ద్వారానే పరిష్కారం అవుతుంది. దాని కోసం తెలంగాణ ప్రజలు ఐక్యతతో మిలిటెంట్‌గా పోరాడాల్సిందిగా పిలుపునిస్తున్నాం. తెలంగాణ ప్రజలు, ఆదివాసీలు, మైనార్టీ, దళితులు, కార్మిక, మహిళ, రైతాంగం, విద్యార్థి,యువజనుల సమస్య లు అంతిమంగా వర్గపోరాటంలో పాల్గొనడం ద్వా రానే పరిష్కారం అవుతాయి. ఆదివాసీలపై టెర్రరిస్టులనే ముద్రవేసి లేగదూ డలపై ఎగబడ్డ తోడేళ్ల గుంపులాగా, ఆదివాసీలను ఊచకోత కోయడాన్ని, వారి మాన, ప్రాణాలనూ, సర్వాన్నీ హరించి వేస్తున్న కిరాయి పోలీసుల పాశ విక దాడుల్ని అడ్డుకునేందుకు క్రియాశీలంగా ప్రజలంతా కదలాలి. మావోయిస్టులు హింసావాదు లుకారు.నిజం చెప్పాలంటే శాంతికాముకుల్లో వారు అగ్రశ్రేణిలో నిలుస్తారు. వారిపై విషం కక్కు తున్న బూర్జువా ప్రచార సాధనాల దుష్ప్రచారాన్ని నమ్మ కండి! విప్లవోద్యమం పక్షం వహించండి! ఈ శత్రువు దాడిని ప్రజా రాజ్యాధికార నిర్మాణా ల ను, ప్రజా సంఘాలను తుడిచిపెట్టే శత్రువు కుట్రలను ఓడించక పోతే విప్లవోద్యమం సాధించిన విలువైన ఫలాలన్నీ నాశనమవుతాయి. కాబట్టి శత్రువును ఒంటరి చేసి దెబ్బతీయటంలో మీవంతు పాత్రను నెరవేర్చండి! పెద్దయెత్తున్న పీఎల్‌జీఏలో చేరి ప్రజాసైన్యపు బలగాన్ని అనేక రెట్లు పెంచి దాన్ని బలోపేతం చేయండి! భూమి-అధికారంపజా స్వామ్యం- ప్రజా సైన్య నిర్మాణం- స్వావ లంబన నినాదాలతో నేడు దేశంలో అనేక ప్రాంతా లలో ఉవ్వెత్తున సాగుతున్న ప్రజా ఉద్యమాలతో మమే కం కండి! దోపిడీ వర్గాలను సమూలంగా నాశనం చేయకుండా మౌలిక మార్పు ఏదీ రాదు. ప్రత్యా మ్నాయ నూతన ప్రజా స్వామిక వ్యవస్థ కోసం ముందడుగేద్దాం! రండి! పోరాడ సాహసిస్తే అంతిమ విజయం ప్రజలదే! మావోయి స్టు విప్లవో ద్యమ నిర్మూలనకు భారత దోపి డీ వర్గాలు శిక్షణ పేరుతో సైన్యాన్ని మోహరిం చడాన్ని వ్యతిరేకిద్దాం! 

-జగన్
సీపీఐ (మావోయిస్టు) ఎన్.టి.ఎస్.జెడ్.సి అధికార ప్రతిని

No comments:

Post a Comment