Tuesday, February 11, 2014

SWAEROES.. శంకరన్ అడుగుజాడల్లో నడుస్తున్న పాదాలు

100%టీచర్స్
SWAEROES.. శంకరన్ అడుగుజాడల్లో నడుస్తున్న పాదాలు.. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బాణాలు.. ఉత్సాహంగా పాఠాలుచెప్పే టీచర్లు.. ఉల్లాసంగా చదువుకునే విద్యార్థులు.. వెరసి సోషల్ విద్యాసంస్థలు సాధిస్తున్న ఫలితాలు.. దళిత అభ్యున్నతికి మైలురాళ్లు.. ఈ విద్యాయజ్ఞంలో ప్రిన్సిపల్స్‌గా కర్తవ్యం నిర్వహిస్తున్న ఉపాధ్యాయ దంపతులు..గొల్లేపల్లి నర్సింహా, చింత విజయలక్ష్మితో ములాఖాత్ ఇది..

‘నరత్నం అన్విష్యతి మృగ్యతే హితత్’ అంటే రత్నాన్ని ఇతరులు అన్వేషించాలేగానీ తనంతట తానుగా ఎవరి వద్దకు అది రాదు. ఇది తెలుసుగనకే రత్నాల్ని వెదికిమరీ సానపెడుతున్నారు సోషల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్‌టిట్యూషనల్ సొసైటీ(SWREIS) ఉపాధ్యాయులు! గత కొన్నేళ్లుగా పదవతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో వీరు సాధించి ఫలితాలు రత్నాల వేటకి చిన్న రుజువులు మాత్రమే! మొత్తం 279 స్కూళ్లకిగానూ 180 పాఠశాల్లో ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన జరుగుతోంది.

teachers2013 పదవతరగతి ఫలితాల్లో 101 పాఠశాలలు వందశాతం ఫలితాల్ని సాధించాయి! 2012లో సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలల్నుంచి 84 మంది విద్యార్థులు IITకి అర్హతసాధించడం మరో ఘనత! ఈ విజయ పరంపరలో ప్రిన్సిపల్స్‌గా భాగం పంచుకున్నారు గొల్లేపల్లి నర్సింహా, చింత విజయలక్ష్మి దంపతులు. వేరువేరు పాఠశాలలు, కళాశాలల్లో భర్త వందశాతం ఫలితాల్ని రెండుసార్లు రాబడితే.. ఆయనకంటే ఒకడుగు ముందేసి మూడుసార్లు(హ్యావూటిక్) 100% రిజల్ట్స్ సాధించింది భార్య! ఇద్దరి ప్రస్థానం ప్రారంభమయింది నల్గొండ జిల్లాలోనే!

ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ
విజయలక్ష్మిది నల్లగొండ టౌన్. తల్లిదంవూడులు బొజ్జమ్మ, ఎల్లేశం. ఐదుగురు సంతానంలో చివరిది. చదువంటే విపరీతమైన ఆసక్తి ఉన్న ఎల్లేశం.. ఉర్దూ మీడియం బడికి టోపీ పెట్టుకొని పోయేటోడు. ముస్లిం అయితే టీచర్స్ తనమీద ఇంకాస్త శ్రద్ధ చూపెడతారని ఆయన ఆశ! అప్పట్లో దళితులకి అందని ద్రాక్షలాంటి విద్య కోసం పట్టుదలతో శ్రమించి పీయూసీ పూర్తిచేసిండు. బొజ్జమ్మేమో ఏడో తరగతి చదివింది. విజయలక్ష్మి పేరెంట్స్ ఇద్దరూ టీచర్లే! ఆమె స్కూలింగ్ నుంచి డిగ్రీ వరకు నల్లగొండలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలోనే! బీజెడ్‌సీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ జువాలజీ చదివింది. ఓయూలోనే బీఎడ్, ఎమ్‌ఎడ్ చేసింది విజయలక్ష్మి! 1993లో మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో టీచర్‌గా జాయిన్ అయింది. రెండేళ్ల తర్వాత జూనియర్ లెక్చరర్‌గా ప్రమోషన్‌పై జేపీ నగర్(కల్వకుర్తి)కి వచ్చింది. ఏడాది తర్వాత కాలేజ్‌గా అప్‌క్షిగేడ్ అయి అచ్చంపేటలో మరో ఐదేళ్లు పనిచేసింది. సూర్యాపేట్ గర్ల్స్ కాలేజ్‌లో చెప్పేటప్పుడు ఓ రెండేళ్లపాటు ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్‌గా బాధ్యత తీసుకుంది.

2008లో రెగ్యులర్ ప్రిన్సిపల్‌గా దేవరకొండ పాఠశాలకి వెళ్లింది. 2009, 10, 11 సంవత్సరాల్లో వరుసగా వందశాతం ఫలితాల్ని సాధించింది అక్కడే! దేవరకొండ పాఠశాల 1992లోనే ఏర్పాటయినప్పటికీ సరైన బోధన లేకపోవడం వల్ల సగం మందికూడా పాస్ అవ్వకపోతుండె. సహోపాధ్యాయుల సహకారంతో విద్యార్థుల్లో గూడుకట్టుకున్న నైరాశ్యాన్ని తొలగించే ప్రయత్నం చేసింది. ‘వరుసగా మూడేళ్లు ఉత్తమ ప్రిన్సిపల్‌గా నల్గొండ జిల్లా కలెక్టర్ నుంచి అవార్డ్ తీసుకున్నది నేనే అయినా క్రెడిట్ మొత్తం మా స్టాఫ్‌దే’ అంటుంది విజయలక్ష్మి టీచర్! ప్రస్తుతం నకిరేకల్ గర్ల్స్ కాలేజ్‌కి ప్రిన్సిపల్‌గా పనిచేస్తోంది. దేవరకొండ స్కూల్‌లో సాధించిన ఫలితాలే ఇక్కడా రిపీట్ చెయ్యాలని కంకణం కట్టుకుంది.

ఉన్నదారి.. చదువొక్కటే!
నల్లగొండజిల్లా రామన్నపేట మండలం, తుమ్మలగూడెం నర్సింహా సొంతఊరు. తల్లిదంవూడులు దానమ్మ, రాములు వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు! పదోతరగతి దాకా తుమ్మలగూడెం, ఇంటర్మీడియట్ రామన్నపేట, హైదరాబాద్ చిక్కడపల్లిలోని బీఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజ్‌లో బీఏ(ఈపీపీ) చదివిండు. బీఎడ్ కూడా హైదరాబాద్‌లోనే. ఉస్మానియా క్యాంపస్‌లో ఎమ్మెస్సీ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిండు. ‘అణిచివేతనుంచి బయటపడటానికి దళితులకున్న ఏకైక మార్గం చదువే! అందుకే స్థోమత లేకపోయినా ఇష్టపడి చదివాను’ అంటాడు నర్సింహా సర్! భారతదేశంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ స్కూల్ నల్లగొండ జిల్లా సర్వేల్(1971)లో ప్రారంభమైంది. ఆ పాఠశాలలోనే టీచర్‌గా అపాయింట్ అయ్యాడు నర్సింహా.

ఏడాది తర్వాత సోషల్ వెల్ఫేర్‌కి వచ్చాడు. నిజామాబాద్ జిల్లా ఉప్పలవాయిలో మూడేళ్లు, నల్లగొండ జిల్లా దేవరకొండలో రెండున్నరేళ్లు పనిచేశాడు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో ప్రిన్సిపల్‌గా 1996లో అచ్చంపేటకి వెళ్లాడు. ప్రిన్సిపల్ అయిన రెండేళ్లకే(1998) పదవతరగతి ఫలితాల్లో ‘హంవూడెడ్ పర్సెంట్ రిజల్ట్స్ విత్ ఆల్ ఫస్ట్‌క్లాస్’ సాధించి ఉత్తమ పాఠశాలగా అచ్చంపేట స్కూల్‌ని నిలబెట్టాడు. ‘సికింవూదాబాద్ పెరేడ్‌క్షిగౌండ్స్‌లో జరిగిన ఆగస్టు 15 వేడుకల్లో అప్పటి సీఎం చంద్రబాబు నుంచి అవార్డ్ తీసుకోవడం ఓ మంచి జాపకం’ అంటాడు ప్రిన్సిపల్ నర్సింహా! జనగాం, సూర్యాపేట్, జీవీ గూడెం(నల్లగొండ), జేపీ నగర్‌ల్లో తనదైన రీతిలో ఉత్తమ ఫలితాలకోసం శ్రమించిండు. ప్రస్తుతం కరీంనగర్‌జిల్లా(జోన్-5) హుస్నాబాద్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాడు. 2013 ఇంటర్‌లో వందశాతం ఫలితాల్ని సాధించి ‘సోషల్ వెల్ఫేర్’ టీచర్స్‌డే వేడుకల్లో అవార్డ్ అందుకున్నడు. నల్లగొండకు చెందిన నరహరి అనే క్రాఫ్ట్‌టీచర్ ఆ ఇద్దరిఫ్యామిలీస్‌కి కామన్‌వూఫెండ్! ఆయన ద్వారానే సంబంధం కలిసింది. 1990లో నర్సింహా, విజయలక్ష్మిల పెళ్లి అయింది. ఇద్దరు సంతానం. పెద్దమ్మాయి యామిని ధన్‌బాద్ ఐఐటీలో ఫైనల్‌ఇయర్ చదువుతోంది. రెండోబిడ్డ ప్రగతి కామినేనిలో ఎంబీబీఎస్ చేస్తోంది.

100% ఇలా..
కొన్నేళ్లక్షికితం సోషల్ వెల్ఫేర్ విద్యాసంస్థల్లో ‘పూర్ స్టుడెంట్’ అనే పదాన్ని నిషేధించారు. చదువులో వెనకబడ్డ పిల్లల్ని ‘ఫ్యూచర్ లెర్నర్స్’ అంటున్నారు. విద్యార్థుల మెదళ్లలో ‘మేమూ చదవగలం’ అనే విశ్వాసాన్ని నెమ్మదిగా ఇంజెక్ట్ చేశారు. విద్యార్థి, ఉపాధ్యాయుడు, పరిసరాల మధ్య సహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తరు. నిజానికి గురుకులం అంటే అదే! ‘డ్యూటీ టైమ్‌లోనే కాకుండా స్టడీ అవర్స్‌లో కూడా స్టాఫ్ మొత్తం విద్యార్థులకి అందుబాటులో ఉండేవారు. స్లిప్, వీకెండ్, మంత్లీ పరీక్షల్తో విద్యార్థుల పరిణితికి ఎప్పటికప్పుడు పరీక్షపె కార్పొరేట్ కళాశాలల్లో నిత్యం మనం చూస్తున్నట్టు విద్యార్థుల్ని మందల్లా కూర్చోబెట్టకుండా.. ఫాస్ట్ లెర్నర్‌తో ఫ్యూచర్ లెర్నర్స్‌ని కలిపి సెక్షన్లుగా విభజించాం! ఉపాధ్యాయులందరం ఒక కుటుంబంలా పనిచేసి మా పిల్లల్ని పాస్ చేయించుకున్నం’ అంటూ దేవరకొండ స్కూల్‌లో ఆమె అనుసరించిన విధానాల్ని వివరించింది విజయలక్ష్మి టీచర్! ‘ఒకరిద్దరి వల్లే వందశాతం ఫలితాలు సాధించలేం! ఒక్కో టీచర్.. పది, పదిహేను మంది విద్యార్థుల బాధ్యతని పర్సనల్‌గా తీసుకుంటడు. సమష్టి కృషివల్లే ఇలాంటి ఫలితాలు సాధ్యమవుతయ్! 2013లో హుస్నాబాద్ వందశాతం ఫలితాలు వైస్‌వూపిన్సిపల్ సత్యనారాయణడ్డి సాధించినవే! ఈ సంవత్సరం కూడా ఆ పరంపర కంటిన్యూ చేస్తా’ అని నర్సింహా సర్ అంటాడు. భార్యాభర్తలిద్దరూ ప్రిన్సిపల్స్‌గా పనిచేస్తూ ఇద్దరూ వందశాతం ఫలితాల్ని తీసుకురావడం.. సోషల్ వెల్ఫేర్ చరివూతలోనే మొదటిసారి! ఈ ఘనత సాధించినందుకు అభినందనలతో పాటు భవిష్యత్‌లో అమలు చేయబోయే ప్రణాలికలూ సక్సెస్ కావాలని ఆశిద్దాం!

ప్రౌడ్ టు బి స్వెరో
కష్టపడటం నాన్నను చూసి నేర్చుకుంటే.. ఆలోచించడం పుస్తకప ద్వారా నేర్చుకున్నాను. పుస్తకాలంటే విపరీతమైన ఆసక్తి నాకు! అంబేద్కర్ ఆలోచనావిధానం, దళిత సాహిత్యం, సామ్యవాద సాహిత్యం, కంచె ఐలయ్య రచనలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. దళితుల అభ్యున్నతి కోసం ‘గ్రేట్‌మన్’శంకరన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన సోషల్ వెల్ఫేర్‌లో పనిచేయడం అదృష్టంగా భావిస్తాను. మా కుటుంబంలో చదువుకోవడం మొదలైంది నాతోనే! నాకన్నా విద్యావంతురాలైన నా భార్యంటే గౌరవం! సోషల్ వెల్ఫేర్ కోసం శంకరన్ తర్వాత ఆ స్థాయిలో పనిచేస్తోన్న వ్యక్తి ప్రవీణ్‌కుమార్ సర్! గతంలో సొసైటీలో చదువుకొని వివిధ రంగాల్లో విజయం సాధించినవాళ్లొచ్చి ప్రస్తుతం చదువుతున్న వాళ్లతో ఇంటరాక్షన్ అవుతారు. ఆలోచనల్ని, అవకాశాల్ని షేర్ చేసుకుంటారు. ఇవన్నీ సెక్రటరీ ప్రవీణ్‌సర్ ఆలోచనలే! నేనెవరికీ తక్కువ కాదు అనుకోవడమే స్వెరోస్ లక్షణం! ఐయామ్ ప్రౌడ్ టు బి స్వెరో!
గొల్లేపల్లి నర్సింహా,
ప్రిన్సిపల్, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ, హుస్నాబాద్


తక్షణ లక్ష్యం అదే
మా నాన్నలాగే నాక్కూడా చదువంటే చాలా ఇష్టం. టీచింగ్ ఫీల్డ్‌ని ఎంచుకోవడానికి ఇన్స్‌పిరేషన్ నాన్నే! వేసే ప్రతి అడుగుని ప్రోత్సహిస్తూ.. ఆలోచనల్ని గౌరవించేవాడు. నాన్న నాతో ఎలా ఉండేవాడో నా స్టూడెంట్స్‌తో నేనూ అలానే ఉండాలనుకుంటాను. అలా పిల్లల్ని ప్రేమించబట్టే ఈ రకమైన ఫలితాలు సాధిస్తున్నానేమో అనుకుంటాను! అకడమిక్ పరంగానే కాదు, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేలా విద్యార్థుల్ని నడిపించడమే ప్రిన్సిపల్ అసలు లక్ష్యం! ఈ సందర్భంగా నా కొలీగ్స్‌కి ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ల సహకారమే లేకుంటే.. నా ఆలోచనలు ఫలించేవేకావు! కెరీర్‌లో ఎక్కువకాలం నాకు ప్రిన్సిపల్‌గా ఉన్నది మా వారే! వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నన్నెప్పుడూ నిందించరు. ఎడ్యుకేటెడ్స్‌గా ఒకర్నొకరు గౌరవించుకుంటాం. ఇద్దరి మనస్తత్వాలూ ఒకటే. ఇద్దరి ఆశయమూ ఒకటే.. సాధ్యమైనంతమేర మా విద్యార్థులకి సేవచేయాలి! నకిరేకల్ కాలేజ్‌లో మంచి ఫలితాల్ని సాధించడం నా తక్షణ లక్ష్యం!
చింత విజయలక్ష్మి,
ప్రిన్సిపల్, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ, నకిరేక Namasete Telangaan Telugu News Paper Dated : 12/2/2014 


No comments:

Post a Comment