Thursday, September 5, 2013

షెడ్యూల్డు కులాల వెనుకబాటుతనం ఏపాటిది? By Asaiah IIS


భారతదేశంలో బడుగులు అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే ఏకైక మార్గం. కాని ఆ విద్యనే వారికి అందకుండా చేస్తోంది.ఈ అగ్రకుల సమాజం. దేశంలో ప్రకటనలు చూస్తే మాత్రం షెడ్యూల్డుకులాల వారికి అన్నివసతులు కల్పించుతున్నామని చెబుతున్నారు. కాని ఆ విద్యా విషయంలో అభివృద్ధి చాలా వెనుకబడి ఉన్నారన్నదే పచ్చినిజం. అన్ని గణాంకాలు పరిశీలిస్తే విషయం బోధ పడుతుంది. షెడ్యూల్డు కులాల జనాభాలో 0-6 సంవత్స రాల వారిని మినహాయించి వారిలో  అక్షరాస్యులను చూస్తే చాలా వ్యత్యాసం కన్పిస్తుంది.

ఎస్‌.సిలలో విద్యావంతులు తక్కువగా ఉన్నారు. 2001 జనాభా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ జనాభా మొత్తం 7,62,10,007 కాగా ఎస్‌.సి శాతంగా నమోదు అయింది. అంటే వీరిద్దరు కలిసి జనాభా 25.2 శాతంగా నమోదయ్యిందని గణాంక శాఖ కమి షనర్‌ వెల్లడించారు. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతులవారి జనాభా 2001 నుండి 2011 మధ్యకాలంలో ఎస్‌.సిల జనాభా 20.8 శాతం, ఎస్‌.టి.లు 23.7శాతం పెరిగిందన్నమాట. విద్యా,కార్మికుల శాతం 2011 ఎస్‌సి, ఎస్‌టిల వివరాలు ఇంకా గుణించాల్సి ఉంది. దేశంలో షెడ్యూల్డుకులాల జనాభా ఎక్కు వగా పంజాబ్‌ రాష్ట్రంలో మొదటి స్థానం 31.9 శాతంగా ఉంది. షెడ్యూల్డు జాతుల వారు అధికంగా లక్షద్వీప్‌ కేంద్రపాలిత ప్రాం తంలో 94.8 శాతంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 59 ఎస్‌సి కులాల్లో మాల,మాదిగ,ఆది ద్రావిడ, ఆది ఆంధ్ర మొత్తం కలిపి 93.6 శాతం మంది ఎస్‌.సిల జనాభాలో ఉన్నట్లు 2011 గణాం కాలు వివరిస్తున్నాయి. మిగతా 55కులాల జనాభా 6.4శాతమే. మాదిగల జనాభా 6,074,250 మంది అంటే ఎస్‌.సిల జనాభాలో 49.2 శాతం మాదిగలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు. మాలలు జనాభా 5,139,305 అంటే 41.6శాతంగా ఉన్నారు. ఆది ద్రావిడులు 1,94,806 మంది అంటే 1.6 శాతం ఆది ఆంధ్రులు 1.9 శాతంగా ఉన్నారు. మిగతా 19ఎస్‌.సి జాతుల వారు జనాభా 2001లో కేవలంవెయ్యిమందిగా నమోదయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2001 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డు కులాలు వారిలో 82.5 శాతం గ్రామాలలో నివసిస్తున్నారు. గ్రామాలలో నివసించే ఎస్‌సిజనాభాలో ఆది ద్రావిడులు 88.7 శాతం ఉన్నారు. మాదిగలు గ్రామాలలో 85.1 శాతం, మాలలు 81.9 శాతం, ఆది ఆంధ్రులు 76.8 శాతం జీవిస్తున్నారు. అన్ని జిల్లాలో కంటే నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 22 శాతం ఎస్‌.సి జనాభాలో జీవిస్తున్నట్లు,విశాఖపట్నంజిల్లాలో అతితక్కువ ఎస్‌సి జనాభా 7.6 శాతం నమోదయింది. ఆంధ్ర ప్రదేశ్‌లో ఎస్‌.సిల విద్య మొత్తం రాష్ట్రంలో అక్షరాస్యులలో 34.9 శాతం ఎస్‌.సిలు అక్షరాస్యులు వీరు ప్రాథమికస్థాయి కంటే దిగువన ఉన్నారు. అక్ష రాస్యులు అంటే ఎవరైతే విద్యా మొదటి నుండి ప్రైమరీ, మాధ్య మికస్థాయి 32 శాతంగా ప్రైమరీ స్థాయిలోను 10.6 శాతం మాధ్యమిక స్థాయిలో ఎస్‌.సిలు విద్యావంతులుగా ఉన్నారు. 17.8శాతం ఎస్‌.సిలు మెట్రిక్‌,ఆపైన విద్యావంతులుగా ఉన్నారు. అంటే ఎస్‌.సి జనాభాలో ఆరవవ్యక్తి అక్షరాస్యుడు, మెట్రిక్యులేట్‌గా గుర్తించబడ్డారు. అక్షరాస్యుడు నుండిడిగ్రీ స్థాయి ఆపైన నమోదైన ఎస్‌.సిల 3.7 శాతం మాత్రమే. వ్యక్తిగతంగా వీరిలో ఆది ఆంధ్రులు 6.3శాతం మంది గ్రాడ్యుయేట్లు ఆపైన చదువుకున్న వారీగా ఉన్నారు. మొత్తం విద్యలో ఎస్‌.సిల చదు వుకోనేవారు డ్రాప్‌ అవుట్‌లో ఎక్కువమంది ఉండటం గమ నార్హం. జనాభాలో 5-14 వయస్సువారు ముఖ్యమైన విద్యా ర్థులు వీరు 72.8 శాతంగా ఆంధ్రప్రదేశ్‌ పిల్ల జనాభాలో విద్యా ర్థులుగా ఉన్నారు. చదువుకొనే ఎస్‌.సి కులాలలో ఎక్కువ శాతం ఆది ద్రావిడ, ఆది ఆంధ్రా మాలలు, ఎక్కువ మంది పాఠశాలలో నమోదై చదువుతున్నారు. విద్యా గణాంకాలు ప్రాథమికంగా అభివృద్ధిపెరుగుదల రేటును సూచిస్తుంది. తద్వార సమాజం పురోభివృద్ధిచెందుతున్నట్లు అంచనా వేయవచ్చును.వారి జనాభా శాతాన్ని బట్టి కూడా అభివృద్ధిరేటును అంచనా వేయవచ్చు. విద్యతోపాటు షెడ్యుల్టు కులాలవారిలో అవగాహన శాతాన్నిబట్టి వారి పెరుగుదల రేటును గుర్తించవచ్చు. విద్యాతో పాటు ఆరో గ్యం,పరిశుభ్రత, ఇతర సామాజిక స్థితిని గుణిస్తారు. 2001 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డు కులంలో విద్యావం తులు రాయడం,చదవడం, అర్థంచేసుకొనే వారు వయస్సు ఏడు సంవ త్సరాలపై బడిన వారిసంఖ్య 53.5 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో సరాసరి విద్యశాతం 60.5 శాతం జనాభాలో ఉండగా అందులో షెడ్యూల్డు కులం వారులో విద్య 1991లో 31.6 శాతం కాగా 2001 నాటికి ఎస్‌సిలో విద్యా శాతం 21.9 శాతం పెరిగింది. అంటే ఎస్‌సిలో మొత్తం విద్యశాతం 53.5 శాతం మాత్రమే.

షెడ్యూల్డు కులాల్లో విద్యశాతంలో ఆది ఆంధ్రులు 69.6 శాతం మంది, ఆది ద్రావిడులలో 65.4 శాతంమంది, మాల లలో 60 శాతం, మాదిగలలో 47.5 శాతం మంది విద్యావం తులుగా నమోదయ్యారు.ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డు కులాల మహి ళలలో విద్యాశాతం 43.3 శాతం మొత్తం రాష్ట్రంలోమహిళలలో విద్యాశాతం 50.4 శాతం ఉంది. షెడ్యూల్డు కులాల పురుషుల విద్యావంతుల కంటే మహిళలలో అక్షరాస్యుల శాతం తక్కువగా ఉంది.ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డుకులాల మహిళలలో విద్యాశాతం ఆది ఆంధ్రుల మహిళలు 63 శాతంకాగా మాదిగలు మహిళలు 36.9శాతం అక్షరాస్యులుగా ఉన్నారు. ఎస్‌.సిలలో స్త్రీ,పురు షుల శాతం ఆంధ్రప్రదేశ్‌లోని జనాభాలో ప్రతి వెయ్యిమంది పురుషులకు 981 మంది మహిళలున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం ఎస్‌సి జనాభాలో వెయ్యి మంది పురుషులకు 978 మహిళలున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలో వెయ్యిమంది పురుషులకు 1046 మంది మహిళలున్నా జిల్లా అదిలాబాద్‌. తక్కువ మహిళలున్న జిల్లా అనంతపూర్‌ 956 మంది.

ఆర్థిక కార్యక్రమాలు
ఆంధ్రరాష్ట్ర జనాభాలో పనిచేసే వారిసంఖ్య షెడ్యూల్డు కులా లలో 50.5 శాతం మంది పనిచేసేవారు. అదే సాధారణ రాష్ట్ర జనాభాలో కేవలం 45.8 శాతం మాత్రమే. అంటే ఎస్‌.సిలలో ఎక్కువ మంది పనిచేసేవారున్నారు. అదే విధంగా ఎస్‌సి పురుషులలో కష్టపడేవారి సంఖ్య 54.4 శాతం మందిగా నమోద య్యారు. షెడ్యూల్డు కులాల జనాభాలో పనిచేసేవారి సంఖ్య 52.2 శాతం మాదిగలులో పనిచేసే వారిసంఖ్య అధికంగా ఉన్నారు. తక్కువమంది 49.9 ఆది ఆంధ్రులు తక్కువగా పని వారున్నారు. మహిలా పనివారిలో కూడా ఆదిఆంధ్ర మహిళలలో పనిచేసేవారి సంఖ్య 36.5శాతం డబ్ల్యుపిఆర్‌ వర్క్‌ పార్టిసిపేషన్‌ రేటుగా నమోదయ్యింది. పనిచేసే ఎస్‌సి పనివారు 1991 జనాభా లెక్కల్లో 95.6శాతం షెడ్యూల్డుకులాల వారు రాష్ట్రంలో పనిచేసేవారు. వీరు 2001నాటికి 79.6శాతంగా నమోదయ్యారు. 2001 లెక్కల వివరాలు ఇంకాఅందలేదు.అదే విధంగా ఎస్‌.సిలలో మాధ్యమిక పనివారి శాతం 4.4 శాతం 1991లో ఉండగా వారు 20.8 శాతానికి 2001 నాటికి పెరిగారు. రాష్ట్రం లోనున్న వ్యవసాయ కూలీలో 68.3 శాతం ఉండగా ఎస్‌.సి వ్యవసాయకూలీలు 80 శాతం అంటే 22.7 శాతం మంది ఎక్కువ. జాతీయ స్థాయిలో వ్యవసాయ కార్మికులు శాతం 45.6 శాతం రిజిస్టరు కాగా మిగతా పని కార్మికుల శాతం 20.1 శాతం ఇందులో 9.7 శాతం మందే వ్యవసాయ కార్మికులుగా రిజిస్టరు అయినారు.వ్యక్తిగత కులస్థాయిలో ఆది ద్రావిడులు 72.7 శాతం వ్యవసాయ కూలీలుగానూ, ఆది ఆంధ్రులు 71.4 శాతం గానూ మాదిగలు 70.4 శాతం, మాలలు 68శాతం వ్యవసాయ కూలీ లుగా నమోదయ్యారు.షెడ్యూల్డు కూలాలోస్థిరమైన ఆదాయ వనరులు భూమి మీద ఆధిపత్యం లేకపోవడం వలన స్థిరత్వం లేకుండా ఉన్నారు. మహిళాకార్మికులు ఎస్‌.సిలు 25.98 శాతం, ఎస్‌టిలు 43.71 శాతం, ఇతరులు అందరు 22.5 శాతం మహి ళలే కార్మికులు.ఆంధ్రప్రదేశ్‌లో మహిళా ఎస్‌.సి కార్మికులు 46.7 శాతం, ఎస్‌.టిలు 50.75 శాతం, పురుషుల ఎస్‌.సి కార్మికులు 90శాతంపైగా ఉన్నారు.


ఎస్‌సిల పెత్తనం ఎంత?
 షెడ్యూల్డు కులాల్లో భూమి ఉన్నవారు 19.7శాతం భూమి లేనివారి శాతం 7.9 శాతం కొద్ది భూమి ఉన్న ఎస్‌.సిల శాతం 48 శాతం ఇంటిస్థలం ఉన్నవారు 13.3 శాతం నమోదయ్యారు. షెడ్యూల్డు కులాల వారికి భూస్థలం ఉంటే వారి జీవితంలో స్థిరత్వం దొరుకుతుంది. స్థిరాదాయం లేనందువలన దేశదిమ్మ రులుగా తీరుగుతున్నారు. దేశంలో పేదవారు అంటే ముందుగా వీరిపైనే వెళ్లుతుంది ఎస్‌.సిలలో పేదరికం 48.35శాతం నుండి 35.97 శాతానికి 1995-96లో తగ్గి నట్లు నమోదయ్యింది. పేదరికపు దిగువ నున్న వారి ఎస్‌.సిలే అని చెప్పవచ్చును.

Vaartha Telugu News Paper Dated : 02/09/2013 

No comments:

Post a Comment