Wednesday, July 23, 2014

దళిత విద్యార్థులు..కొన్ని అనుభవాలు By ప్రొఫెసర్ జి. హరగోపాల్


Updated : 7/24/2014 3:30:28 AM
Views : 70
వరంగల్ నా చైతన్యాన్ని, సామాజిక స్పృహని చాలా ప్రభావితం చేసింది. దళిత పిల్లలకుండే సామాజిక అనుభవం వల్ల వాళ్లకు రీసెర్చ్ గైడెన్స్ చేస్తే వాళ్లకంటే నాకే ఎక్కువ ప్రయోజనమని, సమాజం మరింత లోతుగా అవగాహన అవుతుందనే కొంత స్వార్థంతో చాలామంది దళిత, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, అలాగే మహిళా రీసెర్చ్ స్కాలర్లకు నేను పరిశోధనా పర్యవేక్షకుడిగా బాధ్యతలు తీసుకున్నాను.

గత వారం కాలమ్‌లో రాసిన వ్యాసంలో దళిత విద్యార్థినీ విద్యార్థులకు లోతైన జీవితానుభవం ఉంటుందని సామాజిక చలన సూత్రాలు వాళ్లకు అవగాహన అయిన విధంగా ఇతర సామాజిక వర్గాలకు అర్థంకాకపోవచ్చునని కూడా రాశాను. ఇవి అధ్యాపకుడిగా నాల్గున్నర దశాబ్దాలు విద్యారంగంలో పనిచేసిన అనుభవ ఆధారంగా రాసిన మాటలు.నాలుగు, ఐదు నెలల క్రితం రైల్వే అధికారి భరత్‌భూషణ్ పదోన్నతి సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన సన్మాన సభకు నన్ను పిలిచారు. 

భరత్‌భూషణ్ నిజాయితీ, నిబద్ధత గల అధికారి. దళితులకు శంకరన్ లాగ సేవ చేశారన్న పేరు కూడా ఉంది. ఆయన తన ఆత్మకథ ను ప్రచురించే ముందు నా అభిప్రాయం కోసం పం పించాడు. నేను వ్యక్తిగతంగా చాలా గౌరవించే అధికారులలో ఆయన ఒకరు. ఆ సందర్భంలో డీజీపీ ప్రసాదరావు నా పక్కనే కూర్చుని ఉండడం వల్ల, ఆయన నన్ను ఆశ్చర్యపరిచే ఒక ప్రశ్న అడిగాడు. 

హరగోపాల్ గారూ.. మీ సామాజిక నేపథ్యం భిన్నమై నా దళితుల పట్ల, పేదల పట్ల మీకు ఏర్పడ్డ అనుబం ధం, ఆ కన్‌సర్న్ మీకు ఎలా వచ్చిందో తెలుసుకోవాలని చాలాకాలంగా అనుకుంటున్నానని అన్నాడు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి కొంత వ్యవధి పట్టిం ది. అయితే నాకు తక్షణం తట్టిన జవాబు నేను వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో చదువు చెబుతున్నప్పుడు ఉన్న రాజకీయ వాతావరణం, దళిత పిల్లల వ్యక్తిగత జీవితాలు దగ్గరగా చూడడం వల్ల కావచ్చు అని చెబితే, ఎప్పుడైనా తీరికగా దానిమీద మనం మాట్లాడుకోవాలి అని ప్రసాదరావు గారన్నారు. ఆయన లా అండ్ ఆర్డర్ డీజీపీ అయినప్పుడు పోలీసు వ్యవస్థను మానవీకరించండి అని నేను మెసేజ్ పంపితే, నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను అని తిరిగి మెసేజ్ పంపాడు.

కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పు డు ఒక విద్యార్థి తనకు ఒకే ఒక డ్రెస్ ఉందని, దాన్ని ఉతికి ఆరవేసేటప్పుడు అది ఆరకపోతే క్లాసుకు రావ డం ఇబ్బందిగా ఉంది అని అన్నాడు. మరొక అబ్బా యి తల్లికి అల్సర్ ఉందని ఆపరేషన్ చేయించడానికి 600 రూపాయాలు అవసరమని సెలవుల్లో మట్టిపని చేసి మూడువందలు సంపాదించానని తన బుగ్గలు పోయిన చేతులను చూపుతూ మరొక మూడువందలకు ఎవరైనా తోడ్పడితే తల్లి ఆపరేషన్ జరుగుతుందని చెప్పాడు. 

నేను గ్రామానికి చెందినవాడినైనా, నాకుండే సామాజిక నేపథ్యం నా చుట్టూ ఉండే పరిస్థితులను అంత నిశితంగా చూడడానికి అడ్డువచ్చిందేమోనని నాకు అనిపిస్తుంది. కొందరు ఎంఏ చదువుతున్న పిల్లల కుటుంబ పరిస్థితులు వింటుంటే, ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల చదువు ఎంత కష్టమో నని అనిపించింది. వినే పాఠాలకు, చదివే గ్రంథాలకు వాళ్ల జీవితానికి ఏం సంబంధం లేదని వాళ్లు అర్థం చేసుకున్నప్పుడు ఈ విద్యా విధానం పట్ల ఏం గౌరవం ఏర్పడుతుంది? ఈ విద్యావ్యవస్థ పేదల జీవితాలను ఎలా మారుస్తుంది. దీని రెలెవెన్స్ ఏమి టి అని క్లాసులో సూటిగానే ప్రశ్నించేవారు.

వరంగల్ నా చైతన్యాన్ని, సామాజిక స్పృహని చాలా ప్రభావితం చేసింది.దళిత పిల్లలకుండే సామాజిక అనుభవం వల్ల వాళ్లకు రీసెర్చ్ గైడెన్స్ చేస్తే వాళ్లకంటే నాకే ఎక్కువ ప్రయోజనమని, సమాజం మరింత లోతుగా అవగాహన అవుతుందనే కొంత స్వార్థంతో చాలామంది దళిత, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, అలాగే మహిళా రీసెర్చ్ స్కాలర్ల కు నేను పరిశోధనా పర్యవేక్షకుడిగా (రీసెర్చ్ సూపర్‌వైజర్) బాధ్యతలు తీసుకున్నాను. బహుశా నేను 30 ఎంఫిల్‌లు, 20 పీహెడ్‌డీలకు గైడ్ చేశాను. దీంట్లో అత్యధికులు పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులే. ఈ విద్యార్థులు తమ పీహెచ్‌డీ పూర్తిచేసి జీవితంలో బాగా రాణిస్తున్నారు. దేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో పనిచేస్తున్నారు.

వీళ్ల గురిం చి తెలంగాణ సమాజానికి, అధ్యాపకవర్గానికి చెప్పడం చాలా అవసరం. అలాగే తెలంగాణ పునర్ నిర్మాణమంటే వచ్చే తరంలో అత్యంత సామాజిక స్పృహ కలిగి ఈ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే దళిత, బహుజన మేధావులు కావాలి. అధ్యాపకులు ఆ దిశలో చర్యలు చేపట్టవలసిన అవసరం ఉన్నది.
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నేను గైడ్‌గా పనిచేసిన స్కాలర్లలో సుకుమార్, ఇందిర, సౌజన్య, జగన్నాథ్, చంద్రయ్య, సాయిబాబా, అరుణ్‌కుమా ర్, మల్లిక్‌లు మేధోపరంగా ఎంత అద్భుతంగా ఎదిగారో చూస్తే.., ఇలాంటి స్కాలర్లు విద్యారంగానికి, విజ్ఞాన అభివృద్ధికి, సామాజిక మార్పుకు ఎలా తోడ్పడగలరో మనకు తెలుస్తున్నది.
సుకుమార్ అంబేద్కర్ దృక్పథంలో మానవహక్కులు అనే అంశం మీద పీహెచ్‌డీ చేశాడు. క్యాంపస్‌లో దళిత రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేవాడు.

భారత రాజ్యాంగం: యాభై దశాబ్దాలు అనే అంశం మీద జాతీయ సదస్సు పెట్టి సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలను ఆహ్వానించాం. కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డితో పాటు బొజ్జాతారకం, శంకరన్, పి.ఎస్. కృష్ణన్, కన్నబీరాన్ ఇలా చాలామంది పాల్గొన్నారు. సెమినార్‌ను ప్రారంభించడానికి జస్టిస్ వెంకటాచలయ్య గారిని ఆహ్వానించాం. చాలామంది విద్యార్థు లు ముఖ్యంగా దళిత విద్యార్థులు రాత్రి చాలాసేపు నాతో సెమినార్ పనులు చేస్తూనే ఉన్నారు.

ఉదయం వెంకటాచలయ్య గారు, నేను మా వైస్ చాన్స్‌లర్ రామారావు గారు హాలుకు చేరుకుంటుండగానే రాత్రి నాతో కలిసి పనిచేసిన విద్యార్థులతో పాటు చాలామంది పెద్దపెట్టున వెంకటాచలయ్య గోబ్యాక్ అని నినాదాలు చేస్తూ మమ్మల్ని ఘోరావ్ చేశారు. దీంట్లో సుకుమార్ కూడా ఉన్నాడు. మమ్మల్ని ఒక గంట పాటు ఆపారు. చాలాసార్లు విజ్ఞప్తులు చేసి, సెమినార్‌లో తమ అభిప్రాయాలు కూడా చెప్పుకోవచ్చని ఎంతో నచ్చజెప్పితే కానీ వినలేదు. అయితే విద్యార్థులు ఘోరావ్ చేయడాన్ని చూస్తే, మేము చెప్పిన పాఠాలు మాకు అప్పజెప్పారు అనిపించింది. నేను సుకుమార్ కలిసి రెండు మూడు రీసెర్చ్ పేపర్లు కూడా రాశాం. ఆయన పీహెచ్‌డీ చేస్తున్న క్రమంలో నే ఢిల్లీవిశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా సెలక్ట్ అయ్యా డు. నాలుగు రోజుల క్రితం నేను ఢిల్లీ వెళ్లినప్పుడు తాను స్వీడన్‌లో జరుగుతున్న ఒక అంతర్జాతీయ సదస్సుకు వెళ్తున్నానని చెప్పాడు.నేను ఢిల్లీలో వీలుం టే సుకుమార్ దగ్గరే ఉంటాను. 

ఇప్పుడు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సుకుమార్ దళిత హక్కుల కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నాడు. ఎవరికి భయపడడు. అలాగే ఇందిర దళిత ఫెమినిజం మీద పీహెచ్‌డీ చేసింది. ఈ అమ్మాయిలో కొంత మొండితనముంది. కానీ నేను చూస్తూండగానే ఇంగ్లీషులో అద్భుతంగా రాయడం,మాట్లాడడం నేర్చుకున్నది. ఆమె థీసిస్ రాస్తున్నప్పుడు గైడ్‌గా ఆమె రాసిన కొన్ని అంశాల మీద నాకు అంగీకరారముండేది కాదు. అభిప్రాయాలు ఎక్కువ రాయకూడదని అది రీసెర్చ్ చేసే పద్ధతి కాదని అంటే మీరు దళితులు కాదు, మహిళ కాదు కనుక మీకు ఈ అంశాలు బోధపడవు అని అన్నది. ఒక రీసెర్చ్ స్కాలర్ సాధారణంగా అలా మాట్లాడరు. కానీ అది-కేవలం గైడ్ తన స్నేహితుడు అనుకున్నప్పుడే సాధ్యం. మొదట ఆమె పద్మావతి యూనివర్సిటీలో చేరి, ఇప్పుడు ఐఐటీలో పనిచేస్తున్నది. పది సంవత్సరాలు ఆమె పరిశోధనను కొనసాగిస్తే దేశంలోని అగ్రమేధావులలో ఒకరిగా రాణిస్తుం ది.ఏ చిన్న సహాయం చేయకున్నా నా మీద అలుగుతుంది. ఈ సాన్నిహిత్యాన్ని నేను ఎప్పుడూ గౌరవించాను.అయితే ఇక్కడే ఒక విషయం చెప్పాలి. హైద రాబాద్ లుంబినీపార్క్ బాంబు పేలుళ్లు జరిగి నప్పు డు నేను కలకత్తాలో ఉన్నాను. ఇందిర ఫోన్ చేసి.. సార్ మీరెక్కడున్నారు? అని అడిగి బాంబు ఘటన జరిగినచోట లేనని చెప్పి నప్పు డు,నేనక్కడ ఉన్నా నేమోనని తాను భయపడ్డానని చెప్పింది. ఒక అధ్యా పకుడి గురించి విద్యార్థి ప్రేమాభిమానాలతో ఆందో ళన పడటం అరుదైన అనుభవంగా గుర్తుంచుకున్నా ను. మిగతా స్కాలర్ల గురించి వచ్చే వారం ప్రస్తావిస్తాను. ఈ విశ్లేషణ ముందు చెప్పినట్టుగా అగ్రవర్ణ అధ్యాపకులకు అలాగే తెలంగాణ అధ్యాపక లోకానికి తెలంగాణ పునర్‌నిర్మాణంలో మనం చెయ్యవలసిన, చెయ్యగలిగిన పాత్ర గురించి గుర్తు చెయ్యడమే.

No comments:

Post a Comment