Saturday, December 31, 2011

ఈ దాడులు ఇంకెన్నాళ్లు?మహిళలు సమాజంలో సగము, కష్టాల్లో సగము, కన్నీళ్లల్లో సగము. కానీ హక్కుల్లో మాత్రం జీరో. ఇది నేటి పురుషాధిక్య సమాజానికి అద్దం పడుతోంది. డీజీపీ దినేష్‌రెడ్డి అన్న వ్యాఖ్యలు నాగరిక సమాజానికి తలవంపు. వినయంతో ఉన్న మహిళల వస్త్రధారణ గురించి ఆయన మాట్లాడినా మాటలు చూ స్తుంటే తన నియంతృత్వ పోకడను చెప్పకనే చెప్పినట్టుంది. తమ తప్పులను కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తూ, అధికార బలంతో ఏమి మాట్లాడిన ప్రశ్నించేవారు లేరనే విధంగా వ్యవహరించారు. మహిళలపై హింస గురించి, ‘డ్రెసింగ్ వల్లే ఇదం తా జరుగుతుందే కానీ ఇందులో మగవాళ్ల తప్పేమీ లేద’ని చెప్పుకొచ్చారు. స్త్రీల డ్రెస్సింగ్ గురించి ఒక బాధ్యతాయుతమైన డీజీపీ హోదాలో ఉండి ఇలా మాట్లాడడం మంజసమేనా? ఇలాంటి దృక్పథం ఉన్నందుకు సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. ముక్కుపచ్చలారని పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా మహిళలకు ఈ రోజు రక్షణ లేకుండాపోయింది. అలాంటప్పుడు ఈ పోలీసు యంత్రాంగం ఏం చేస్తోంది? వాళ్ల ప్రతాపం అంతా ఎక్కడ చూపిస్తున్నారు? ఏమీ తెలియని అమాయకులపై, మహిళలు అని కూడా చూడకుండా ఇష్టము వచ్చినట్లుగా ఖాకీ కర్కశా న్ని చూపిస్తూ, లాఠీలను ఝుళిపిస్తూ ఆర్భాటాలు చేస్తారు కదా? ఉనికిలో లేని కొత్త కొత్త చట్టాలతో ప్రజలను వేధింపులకు గురిచేయడం మినహా వారి అధికారాన్ని ఎప్పుడైనా మంచికి ఉపయోగించారా? రోజు రోజుకూ పెరుగుతున్న నేరాలతో జనం గగ్గోలు పెడుతుంటే..పోలీసు వ్యవస్థ నిద్రపోతోందా? లేక నిద్రపోతున్నట్లు నటిస్తుందా? ఎవరిని ఉద్ధరించడానికి ఈ ఖాకీ దుస్తులు? సామాన్య జనాల మీద ప్రయోగించటానికి మాత్రమే కాదు కదా? మహిళలపై పెరిగిపోతున్న దాడులు, హత్యలు, ఆకృత్యాలకు బాధ్యులైన వారిని పట్టుకోవాల్సిన కనీస బాధ్యతను మరిచిపోయింది పోలీసు వ్యవస్థ. ‘నవ్విపోదురు గాక మాకేంటి’ అన్న చందంగా ఈ రోజు పోలీసు వ్యవస్థ తయారైంది. పాశ్చాత్య సంస్కృతిని, నేర సంస్కక్షుతిని, హత్యా రాజకీయాలను ఈ ప్రభుత్వమే పెంచి పోషిస్తున్నది.నేరాలను అరికట్టే పెద్దలను వదిలి పేదలను బలిచేస్తున్నది. చట్టాలను సక్రమంగా అమలు చేసి శాంతిభవూదతలను కాపా డకుండా.. నిర్లక్షం వహిస్తూ.. చోద్యం చూస్తున్నది. నేరస్తులపట్ల కఠినంగా వ్యవహ రించకుండా చూసీ చూడనట్లుగా ఉంటూ పరోక్షంగా సమాజాన్ని నేరమయం చేస్తున్న ది. నిజంగా ‘అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరగగలిగినప్పుడే’ ఈ దేశానికి నిజమైన స్వాతం త్య్రం వచ్చినట్లు అన్నారు గాంధీజీ. అర్ధరాత్రి కాదు కదా పట్టపగలే అడుగు బయట పెట్ట లేని దౌర్భగ్య పరిస్థితి ఈ రోజు సమాజంలో నెలకొని ఉంది. దీనికి కారణం ఈ పాలకుల అలసత్వం, పోలీసుల నిర్లక్ష పూరిత వైఖరే కారణం. ఇది ఇంతేలే అని ఊరుకోవటం కాదు, ఈ సమాజం మారనంత వరకు ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. దీనికి ప్రధా నంగా పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం, మరీ ముఖ్యంగా పోలీసు వ్యవస్థ బాధ్యత వహించవలసి ఉంటుంది. 

ఈ నేరాలు- ఘోరాలు మహిళల మీద జరగడానికి ఎవరు బాధ్యులు? ఈ పాలకులా? పోలీసు వ్యవస్థా? నేర రాజకీయాలను పెంచి పోషిస్తున్న రాజకీయ నాయకులా? ఎవరు ? ఎవరు దీనికి జవాబు ఎవరు చెబుతారు. ఫ్యాషన్ షోలు, పబ్బులు, క్లబ్బులకు విచ్ఛలవిడిగా లైసెన్సులు ఇచ్చి విశృంఖలత్వాన్ని ప్రభుత్వమే పెంచి పోషిస్తున్నది. అశ్లీలంగా చూపించే నీచ సంస్కృతిపై సరియైన నియంవూతణ లేకపోవడం ఈ సమాజపు దౌర్భాగ్యం. ఈ కుళ్ళి కంపుకొడుతున్న సిద్ధాంతాలతో శిథిలమయిన ఈ వ్యవస్థను రూపు మాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఈ పాలకులు ప్రజలకే సమస్యగా మారారు. మహిళల మీద అత్యాచారాలు జరగడానికి కారణం, వారు ధరించే వస్త్రధారణే అనడం మహిళలను కించపరచడమే! ఏది ఏమైనప్పటికి డిజీపీగారు ఇప్పటికయినా మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేదా యావత్తూ మహిళా లోకం తిరగబడుతుంది. ఇప్పటికైయినా డీజీపీ గారు తన మాటలను వెనక్కి తీసుకోవాలి. లేదా మహిళలు చైతన్యంతో ఒక్కటైయితే ఒక మహత్తరశక్తిగా ఎదిగి పురుషాహంకారాన్ని ఎదిరించే రోజు వస్తుంది. స్త్రీ తల్లిగా, చెల్లిగా, అక్కగా, మనిషిగా గౌరవించే నాగరి క సమాజాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. స్త్రీ ని అశ్లీలంగా చూపించే నీచ సంస్కృతిపై తిరగబడాలి. ‘స్త్రీ’ కి మనసుంది. గౌరవించండి. స్త్రీ కి మెదడుంది అలోచింప నివ్వండి’ అనే నాగరిక సమాజం కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. చట్టసభల్లో మహిళల హక్కుల కోసం, రాజ్యాధికారం కోసం పోరాడవలసిన అవసరం ఉంది. సమాజంలో మార్పు రావాలి. సమాజంలో మన వంతు కర్తవ్యాన్ని మనం నిర్వర్తించినప్పుడే మనందరం కోరు కున్న ఓ మానవీయ సమాజం వస్తుంది. ఎవరికి వారు నిబద్ధతతో ఆలోచించాలి. ఆచరించాలి. చిన్నతనం నుంచి పిల్లలు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతిపౌరు డూ బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రతి ఒక్కరు తమవంతుగా మంచి సమాజం కోసం, మార్పు కోసం విలువలతో కూడిన మనుషులుగా ఎదగడానికి ఆరోగ్యకర మైన వాతావరణం కల్పించాలి. పురుషాధిక్య భావజాలంతో మాట్లాడటం మాన వీయతకే మాయని మచ్చ. సాటి మనిషిని మనిషిగా గౌరవించే విలువలతో కూడిన సమాజం కోసం అందరూ పాటు పడాలి. నేరాలు, ఘోరాలు ఆకృత్యాలు, నేర ప్రవృ త్తి రాజకీయాలు, నియంతృత్వ పోకడలులేని, మంచి సమాజం కోసం పాటు పడాలి. దీనికోసం నేటి నుంచే అడుగులు వేద్దాం. మానవీయ సమాజం కోసం కల లు కనడమే కాదు కార్యాచరణతో ముందుకుపోదాం. అమానవీయ పురుషస్వా మ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేద్దాం. 

-రంగనేని శారద
టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు
Namasete telangana news paper Dated 1./1/2012 

No comments:

Post a Comment