Sunday, November 18, 2012

తీరని వెతలు-మారని బతుకులు---బుద్ధారం రమేష్ఆంధ్రప్రదేశ్‌లోని 35 గిరిజన తెగల్లో చెంచులు అత్యంత ప్రాచీనమైన తెగ. అలాగే అభివృద్ధికి నోచుకోని దుర్భర దుస్థితిలో ఉన్న తెగ. ఇది అతి ప్రాచీన తెగ అని చెప్పడానికి మనుస్మృతి, వినుకొండ వల్లభరాయుని క్రీడాభిరామం, యామునిడి రాజనీతిసూవూతాలు, గుర్రం జాషువా గబ్బిలంలో వీరి ప్రస్తావనల ద్వారా తెలుస్తున్న ది. మహబూబ్‌నగర్, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, నల్గొండ జిల్లాల్లోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వేల సంవత్సరాలుగా జీవిస్తున్నారు. రాష్ట్రంలోని మిగతా జన సమూహాలతో కానీ, ఇతర గిరిజన తెగలతో కానీ, చెంచు తెగకు దగ్గరి పోలికలు లేవు. వీరి మనస్తత్వాలు, అలవాట్లు, మానసిక, శారీరక స్థితిగతులు, సంస్కృతి భిన్నమైనవి. వీరి ప్రధాన వృత్తి ఆహారసేకరణ.శ్రీశైలంలోని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 46 మండలాల్లో 340 గ్రామాల్లో 10768 కుటుంబాలు న్నాయి. మొత్తం జనాభా 42 లక్షలు. రాష్ట్ర జనాభాలో 0.055 శాతం. నల్లమలలోని చెంచు పెంటలకు చాలా వరకు కనీస సౌకర్యాలయిన రోడ్డు, కరెంట్, మంచినీరు, పక్కా గృహాలు లేక దుర్భర స్థితిలో జీవితాలు గడుపుతున్నారు. 
చెంచులకు పూర్వం దట్టమైన అడవుల వల్ల ఆహార కొరత ఉండేదికాదు. ప్రస్తుతం అడవులు అంతరించిపోవ డంతోపాటు అటవీ ఉత్పత్తులు తగ్గుదల చెంచుల జీవనంపై తీవ్రవూపభావం చూపుతున్నది. చెంచులు పస్తులుండాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఈ దుస్థితిని ఆసరా తీసుకున్న మైదాన ప్రాంత దళారులు వారికి ముందుగా కొంత సొమ్ము చెల్లించి వారిచేత ఎక్కువ గంటలు పని చేయిస్తూ శ్రమదోపిడీ చేస్తున్నారు. చెంచులను వలసబాట పట్టించి వారి కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. ప్రతియేటా వేలాది మంది వలసబాట పడుతున్నారని ప్రభుత్వ లెక్కలు చెపుతున్నాయి. చెంచులకు ఉపాధి హామీ పథకం కొంత మేర ఊరట నిచ్చినా, అదివారికి పూర్తిగా భరోసా ఇవ్వడం లేదు. అంతేకాదు పథకాల అమలులో అవకతవకలు జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. నల్లమలలో చెంచులను మాత్రమే టైగర్ ట్రాకర్లుగా నియమించాల్సి ఉన్నప్పటికి అక్రమంగా చెంచేతరులతో నియామకం జరుపుతున్నారు.
నల్లమల్లలోని చెంచులు నిత్యం అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రక్షిత మంచినీరు లభించకపోవడం వల్ల చెరువులు, చెలిమెల నీటిపై ఆధారపడుతున్నారు. వాటిని తాగి అంటువ్యాధుల బారిన పడుతున్నారు. ఇదేకాకుండా మైదాన ప్రాంతపు కొన్ని తెగలవారు కల్తిసారా అమ్మడం వల్ల దాన్ని తాగి ప్రాణాలు కోల్పోతున్నారు. పోషకాహారలేమి కారణంగా ఏ చిన్నవ్యాధి ప్రబలినా అల్లాడుతున్నారు. పౌష్టికాహార లోపం వల్ల చిన్నారుల్లో ఎదుగుదల లేక అనేక పసి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. దీని నివారణకు ప్రభుత్వం గిరిజన సహకార సంస్థ ద్వారా ప్రతినెలా ఫుడ్ బాస్కెట్ల పంపిణీ చేస్తున్నప్పటికి వీటిలో అవకతవకలు జరుగుతున్నాయి. అవి కూడా నాసిరకంగా ఉంటున్నాయి. అలాగే గర్భిణి స్త్రీలకు ఇచ్చే సరుకుల్లో కూడా నాణ్యతా ప్రమాణాలు లేవు. చెంచులకు వైద్య సేవలందించ డానికి ఐ.టి.డి.ఎ శ్రీశైలం పరిధిలో 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 146 ఉప కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు లెక్కలు చెపుతున్నాయి. వీటిల్లో డాక్టర్, స్టాఫ్ నర్సులు, సిబ్బంది కొరత మూలంగా అత్యవసర సమయాల్లో ఆదుకోలేకపోతున్నాయి. గతంలో పని చేసిన మొబైల్ మెడికల్ యూనిట్లు ప్రస్తుతం పడకేసి కూర్చున్నాయి.

చెంచులకు విద్యనందించడానికి ప్రత్యేకంగా 34 ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటు చేశారు. అయితే మారుమూల ప్రాంతాల్లో ఉపాధ్యాయు లు పనిచేయటానికి సిద్ధంగా లేకపోవడంతో పాఠశాలలు వెల పశువుల కొట్టాలుగా మారుతున్నాయి. మరి కొన్ని పాఠశాలలు మొక్కుబడిగా గంటో, రెండు గంటలు పనిచేస్తున్నాయి. ఉన్న పాఠశాలల్లో సౌకర్యాల కొరత వేధిస్తున్నది. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యనందించాల్సిన బాధ్యత ఎవరు తీసుకోవాలి అనే విషయంపై అ టు గిరిజన శాఖ, ఇటు విద్యాశాఖల మధ్య సమన్వయ లోపంతో సౌకర్యాల కల్పన విషయంలో జాప్యం చోటు చేసుకుంటున్నది.

చెంచుల అభివృద్ధి కోసం, ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రకటించిన అనేక పథకాలు తూతూ మంత్రంగా అమలవుతున్నాయి. ఐటీడీఏ ఆధ్వర్యంలో భూమి కొనుగోలు, బోరుబావులు, గృహనిర్మాణం, రుణాలమంజూరి తదితర అనేక పథకాలను అమలుచేయాల్సి ఉన్నది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు సమకూరుస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. అయితే రాజకీయ నాయకుల జోక్యం,దళారుల ప్రమేయం, అధికారులపై చెంచేతరుల ఒత్తిడుల కారణంగా చెంచులకు అభివృద్ధి ఫలాలు అందడంలేదు. చెంచుల అభివృద్ధి కోసం ఖర్చు చేసిన నిధులు లెక్కల్లో ఉన్నా, వారి అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నది.

గతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య నలిగిపోయిన చెంచులు ప్రస్తుతం వజ్రాలు, ఇతర ఖనిజ నిక్షేపాలను వెలికితీసే ప్రయత్నంలో భాగంగా పెంటల ఎత్తివేతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం దగ్గర సరైన ప్రణాళిక లేకపోవడంతో సమస్యల వలయంలో చెంచులు కాలం వెళ్లదీస్తున్నారు. వికేంవూదీకరణ ద్వారా చెంచులకు సేవలందించే ఉద్దేశంతో ఏర్పాటైన గిరిజనాభివృద్ధి సంస్థలు కొత్తగా కొలువులో చేరిన యువ అధికారులకు అనుభవాన్ని ఇచ్చే సంస్థలుగా పనిచేస్తున్నాయి తప్ప ఆదివాసుల అభివృద్ధికి ఏమాత్రం తోడ్పడటం లేదంటే అతిశయోక్తి కాదు. ఐ.టి.డి.ఎ శ్రీశైలం ప్రాజెక్ట్ అధికార్లుగా ఇప్పటి వరకు చాలా మంది పనిచేశారు. కానీ అందులో చెంచులు చిరకాలం గుర్తుంచుకునే విధంగా పనిచేసిన అధికారులను వేళ్లపైన లెక్కించవచ్చు. సమాజం అభివృద్ధి చెంది జనాభా కూడా వృద్ధి చెందుతుంటే.. చెంచుల జనాభా మాత్రం రోజురోజుకి తగ్గడం ఆందోళన కలిగిస్తున్నది. 
1940-43 ప్రాంతంలో చెంచుల అస్తిత్వాన్ని పరిశీలించటానికి అప్పటి నిజాం నవాబు ప్రఖ్యాత మానవాభివృద్ధి శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్ చేత చెంచుల స్థితిగతులు అధ్యయనం చేయించాడు. వీరి అభివృద్ధికి ప్రత్యేకంగా భూ కేటాయింపులు చేశాడు. కానీ ప్రస్తుత ప్రభుత్వాలు మాత్రం ఆ ప్రయత్నాలు చేయక పోగా వారిని అడవి నుంచి తరిమేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. తరతరాలు గా శ్రీశైలం మల్లికార్జునస్వామి, అహోబిళ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు చెంచుల సంరక్షణలోనే ఉండేవి. చెంచులు వీటిని వారసత్వ సంపదగా భావి స్తారు. ఈ ఆలయాలు ప్రభుత్వాధీనంలోకి వెళ్లిన తర్వాత పూర్వం రోజు ల్లో ప్రధాన అర్చకులుగా ఉన్న చెంచులు ప్రస్తుతం వాచ్‌మెన్‌లుగా, స్వీపర్లుగా, బతుకులీడ్చాల్సిన పరిస్థితులు దాపురించాయి.

దేశం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నది. కానీ సామాజిక అసమానతలను మాత్రం తగ్గించలేకపోతున్నది. ప్రభుత్వాలు మారుతున్నా చెంచు ల తలరాతలు మారడంలేదు. స్వాతంవూత్యానంతరం ఆదివాసీల అభివృద్ధికి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నియమించిన మలయప్ప కమిటీ (1949) విలువైన సూచనలు చేసినా అవి అమలుకు నోచుకోలేదు. ఎన్నో పోరాటాల ఫలితం గా సాధిం చుకున్న అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006, షెడ్యూల్ ఏరియాలో పరిపాలన అధికారం పూర్తిగా ఆదివాసులదే అని చెప్పే పీసా చట్టం, 1/70 చట్టం సక్రమంగా అమలుకావడం లేదు. ఆ చట్టాలు ఉల్లంఘనలకు గురవుతున్నాయి. చెంచేతరులు చెంచుల ఆధీనంలోని వనరులపైన ఆధిపత్యం చెలాయిస్తున్నారు. చెంచుల అభివృద్ధికి ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించే బడ్జెట్ పక్కదారి పట్టకుం డా వినియోగించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈ చిత్తశుద్ధి పాలకులకు లేదు. దెబార్ కమిషన్ చెప్పినట్టు ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తూ చేపట్టే అభివృద్ధి కార్యక్షికమాల ద్వారానే వారి నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రాచీన తెగగా గుర్తించబడ్డ చెంచులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. 

-బుద్ధారం రమేష్
కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెం

No comments:

Post a Comment