Saturday, November 3, 2012

బంజారాల బతుకుల్లో వెలుగులెన్నడు? ---డాక్టర్ ఎల్. నెహ్రూనాయక్



చరివూతకారులు, సామాజిక శాస్త్రవేత్తలు బంజారాల పుట్టుపూర్వోత్తరాలపై భిన్నాభివూపాయాలు కలిగి ఉన్నారు. బంజారా తెగ ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చినట్టుగా చారివూతక ఆధారాలున్నా యి. బంజారా సమాజంలో రాథోడ్, పమార్, చౌహాన్, వడ్తియా గోత్రాల వారు న్నారు. వీరే కాక బంజారాలలో వివిధ వృత్తులతో ఉండే తెగలు కూడా ఉన్నాయి. అందులో సోనార్ బంజారాలు అభరణాలు తయారు చేసేవారు. నావి బంజారాలు క్షౌరవృత్తికారులు. డప్పడియా బంజారాలు వాద్యకారులు. రాథోడ్‌లలో ఏడు గోత్రాలు గాను, పమార్‌లలో పన్నెండు గోత్రాలుగాను పిలవబడుతున్నారు. పూర్వం అడవుల పాలైన బంజారాలు తమ జీవనోపాధి కోసం పశువులను మచ్చి క చేసుకుని వాటిపై ఉప్పు, ధాన్యం లాంటివాటిని రవాణా చేసేవారు. రవాణా సదుపాయాలు, యంత్రాలతో నడిచే వాహనాలు లేని సమయంలో వీరే ముఖ్య రవాణాదారులుగా ఉపయోగపడ్డారు. ప్రజలకు నిత్యావసరవస్తువులను అందించడంలో ప్రముఖపాత్ర పోషించారు. వ్యాపారమే ముఖ్యవృత్తిగా స్వీకరించిన వీరు ఉప్పు వ్యాపారం చేసేవారు. ఉప్పు వ్యాపారం చేసే వారిని సంస్కృతంలో ‘బాణిజ్యకరి’ అనేవారు. దీని నుంచే ‘బంజారా’ అనే పదం వచ్చింది.ఆరు దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో బంజారాలు నేటికీ గ్రామాలకు దూరంగా తండాలలో ఎలాంటి అభివృద్ధి లేకుండా జీవిస్తున్నారు. అభివృద్ధి చెందుతామన్న ఆశ వారికి కనుచూపు మేరలో కనపడడం లేదు. స్వాతంవూత్యానంతరం బంజారాలు నేటి వరకు నిర్లక్ష్యానికి గురై ప్రధాన జనజీవన స్రవంతిలో కలవలేదు. సమాజానికి దూరంగా ఉంటూ తమ సంస్కృతిని,సంప్రదాయాలను, తమ ప్రత్యేక భాష జీవన విధానాలను కాపాడుకుంటూ వస్తున్నారు. క్రమంగా జనాభా పెరగ డం వల్ల అందరికి భూమి అందుబాటులోలేని కారణంగా 90 శాతం మంది వ్యవసాయ కూలీలుగా బతుకుతున్నారు. జీవనోపాధిని వెతుక్కుంటూ పట్టణాలకు వెళుతున్నారు. రిక్షా కార్మికులుగా, గృహ నిర్మాణ కార్మికులుగా, రోజు వారీ కూలీలుగా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. 

తండాల్లో మౌలిక సదుపాయాలైన విద్యా, వైద్యం, రోడ్లు, విద్యుత్, మంచినీరు, అందుబాటులో లేవు. చదువుకున్న కొద్దిపాటి బంజారా యువకులకు కూడా ప్రభుత్వం ఉపాధి చూపడం లేదు. బంజారాలకు రిజర్వేషన్లు కల్పించినా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. బంజారాలలో ఉన్న కొద్దిమంది రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక స్థానిక వ్యాపారుల, దళారుల దోపిడీకి గురై అప్పుల పాలవుతున్నారు. దీంతో వేరే దారిలేక బంజారాలు తమ సాంప్రదాయ బట్టిసారాను అమ్మి పొట్టుపోసుకుంటున్నారు. అయితే సారా వ్యాపారులు, పోలీసులు, గూండాలు తండాల్లో బీభత్సం సృష్టిస్తూ వారిపై అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారు. అలాగే గిరిజన స్త్రీలపై ఆత్యాచారాలు జరుగుతున్నా వీటిని పాలకవర్గాలు అరికట్టలేకపోతున్నాయి. దోషులను శిక్షించడంలో విఫలమవుతున్నాయి. గిరిజన ప్రజావూపతినిధులు వీరి బాధల్లో పాలుపంచుకోకపోగా, పాలక వర్గాలకు తొత్తులుగా మారుతున్నారు.పద్నాలుగు సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని రాజ్యాంగం నిర్ధేశించింది. పాలకులకు చిత్తశుద్ధిలేకపోవడంతో అది ఆచరణలో అమలుకావడం లేదు. దీంతో నేటికి 90 శాతంమంది గిరిజనులు నిరక్ష్యరాస్యులుగానే మిగిలిపోతున్నారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించినా, అధికారుల ఆశ్రీత పక్షపాతం, బంధువూపీతి మూలంగా గిరిజనులకు కేటాయించిన ఉద్యోగాలను గిరిజనేతరులతో భర్తీ చేస్తున్నారు. అంతేగాక బోగస్ కుల సర్టిఫికేట్ల ద్వారా గిరిజనుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు. డాక్టర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభు త్వం ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించింది. అది అమలు కాక ఇప్పటికీ వేలాది ఎస్సీ, ఎస్టీ ల బ్యాక్‌లాగ్ పోస్టులు అలాగే ఉన్నాయి. సం స్కరణల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగం సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నాయి. దీంతో గిరిజనులకు ఉపాధి అవకాశాలు లేకుండాపోతున్నాయి.కార్పొరేట్, బహుళజాతి సంస్థలకు కొమ్ముగాస్తున్న కేంద్ర ప్రభు త్వ విధానాలతో అడవిబిడ్డలు అనేక కష్టాలపాలవుతున్నారు.అభివృద్ధి పేరుతో ప్రభుత్వం సాగిస్తున్న విధ్వంసానికి గిరిజనులు బలవుతున్నారు. తరాలు మారినా గిరిజనుల తలరాతలు మారడం లేదు. పాలకుల విధానాల వల్ల ఇప్పటికే చాలా గిరిజన తెగలు అంతరించిపోయాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వారి అభివృద్ధి సంగతి ఏమో గానీ వారి అస్తిత్వమే ప్రశ్నార్థకమవుతుంది. 

-డాక్టర్ ఎల్. నెహ్రూనాయక్
తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షు

Namasete Telangana News Paper Dated : 4/11/2012 

No comments:

Post a Comment