Saturday, September 10, 2011

తెలంగాణ బడబానలం by -అల్లం నారాయణ Sampadakeyam Namasethe Telangana 11/09/2011

తెలంగాణ బడబానలం
సల్లవడ్డదా! తెలంగాణ. కొంచెం స్తబ్దుగున్నదా? సాగిపోతున్నదా? నిజమే నా? ఇది. ఒక దిక్కు సకలజనులు సమ్మెకు తయారౌతున్న సందర్భం. సకల జనుల కోసం సర్వ జేఏసీలు ప్రచారం చేస్తూ వీధులు, వాడవాడా పాటలు హోరెత్తుతున్న కాలం. బతుకమ్మకు ముందే కాలం బతుకమ్మలాడుతున్న సంద ర్భం. ఉద్యోగి, ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, ఆర్టీసీ, బొగ్గుగని కార్మికుడు, న్యాయవాది, జర్నలిస్టు ఒకరేమిటి? సర్వ ఉద్యోగ సంఘాలు తెలంగాణ సమ్మె కోసం తైనాతీలు చేస్తుండగానే పనిగట్టుకొని ఉద్యమం సల్లవడ్తున్నదని మాట్లాడడంలో ఆంతర్యం ఏమిటి? నిజంగానే నిరంతరాయంగా జరుగుతున్న ఉద్యమంలో కొనసాగింపంటే ఏమిటి? సల్లవడుడంటే ఏమిటి? ఈ ఉద్యమం కొన్ని ఉచ్చిలి సంఘటనల సమాహారమా? అంతేనా? కొన్ని తాడోపేడో తేల్చుకోగలిగి న సన్నివేశాల సంరంభమేనా? అంతేనా? నిజానికి ఉధృతంగా ఇరవై రెండు నెల ల పాటు జరిగిన నిర్విరామ ఉద్యమం ఆగింది ఎన్నడూ లేదు.

కానీ ఉద్యమశక్తు ల్లో కానీ, ఉద్యమ పార్టీల్లో కానీ ఉన్న భిన్న వైఖరుల కారణంగా, ఐక్యతా లోపం కారణంగా ఈ హ్రస్వదృష్టి ఏర్పడుతున్నది. నిజానికి తెలంగాణ ఉద్యమం విస్తృతమైనది. అది సకల, సబ్బండ జనులది. దాని స్వభావంలోనే జాతి లేదా ఉపజాతి అస్తిత్వ ఉద్యమతత్వం ఉన్నది. అందువల్లనే అది ఇతర రూపాలలో సాగితే ఆరిపోయ్యే అవకాశం ఉన్నది. ఉచ్చిలి పనులు చేస్తే రాజ్యం ఊదిపారేసే అవకాశం ఉందన్న స్పృహ ఉంటే తప్ప ఉద్యమం సల్లవడ్డదా? ఉరుకుతున్నదా? అర్థం కాదు. నిజానికీ ఉద్యమ స్వభావం వ్యక్తుల, కొన్ని సమూహాల ఆకాంక్ష మేరకు, రూపాలు మార్చుకుంటున్నదీ కాదు. పోరాట రూపాలను ఎంచుకుంటున్నదీ కాదు. ఉద్యమ అవసరమే రూపాలు ఏర్పరుస్తున్నది. రెండు నెలలుగా రాజకీయ ఉద్యమం తీవ్రతరమైంది.

కాంగ్రెస్‌పార్టీ రాజీనామాలకు సిద్ధపడిన తర్వాత, తెలుగుదేశం తెలంగాణ ప్రజావూపతినిధులు రాజీనామాలు చేసిన తర్వాత మొత్తం గా141 మంది ప్రజావూపతినిధులు రాజీనామా చేశారు. నిజానికి ఇదొక అపూర్వ సన్నివేశం. మంత్రులు లోపాయికారీగా ఫైళ్లమీద సంతకాలు పెట్టి ఉండవచ్చు. రహస్య మంతనాలు చేస్తూ ఉండవచ్చు. ఎంపీలలో కొందరు పార్లమెంటుకు వెళ్లి ఉండవచ్చు. కానీ ఒక ప్రాంత ఆకాంక్ష కోసం వీధుల్లో నడుస్తున్న పోరాటానికి జడిసే ప్రజావూపతినిధులందరూ ఒక ఒత్తిడి కోసం రాజీనామా చేశారు. నిజమే. మొత్తం 141 మందిలో స్వచ్ఛందంగా తెలంగాణ కోసం ఎవరూ రాజీనామా చేయలేదనీ చెప్పలేం. నిజమే ఒక ఒత్తిడితో రాజీనామా చేసి ఉండవచ్చు గాక. కానీ, ఆ రాజీనామాలను ఆమోదించకుండా, అప్రజాస్వామికంగా వ్యవహరించిన వారిది పూర్తి బాధ్యత, తప్పు అవుతుంది గానీ, లోపాయికారీగా కొందరు మంత్రులు విధులకు హాజరవడం తప్పవుతుంది గానీ, ప్రజాస్వామ్య దేశంలో తమ ప్రాంతపు ఆకాంక్షలను వెల్లడించడానికి రాజీనామా చేసిన వారిని టోకుగా శంకించడం తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసుకోవడమే. కోస్తాంధ్ర ప్రాంతం వాళ్లు రాజీనామాలు చేస్తే గగ్గోలు పెట్టిన మీడియా, వాళ్ల లోపాయికారీ చాటు మాటు, చంద్రబాబు, రోశయ్యల దోస్తానీతో నడిపిన రాజీనామాల డ్రామా మనకు ఎక్కువగా కన్పించి, ఇక్కడి ప్రజావూపతినిధులు 141 మంది రాజీనామాలు చేయడం తక్కువగా కనిపించడం ఎందువల్ల? మనకు ఈ ప్రజావూపతినిధుల మీద కనీస విశ్వాసం, నమ్మకం లోపించడం.

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ రాజకీయ పార్టీల చట్టసభల ప్రతినిధులు అట్లా పరాధీనులుగా, బానిసలుగా పదేపదే ప్రవర్తించడం. పదేపదే మోసగించే వారు ఉండడం, లాబీయింగ్ చేసే వారు ఉండడం, ప్రలోభాలకు ఎరవేసే వాళ్లు ఉండడం. కానీ కాలం ఒక అపూర్వమైన నిర్ణయాలను రికా ర్డు చేసి ఉంచింది. ఆ రికార్డు ఎక్కడికిపోతుంది? తెలంగాణ సాధన కోసం 141 మంది రాజీనామా చేసి మాట్లాడిన మాటలు ఎక్కడికి పోతాయి. ఇవ్వాళ్ల ఆమోదించుకోకపోవచ్చు. మళ్లీ రాజీనామాలు చేసి ఉండకపోవచ్చు. కానీ పార్లమెంటు లో కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు అపరిష్కృతంగా అట్లాగే ఉన్నాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పుడంటే అప్పుడు రాజీనామాలు ఎడమచేత్తో మళ్లీ విసిరేసే అవకాశమూ ఉంది. అట్లాంటప్పుడు కాలం నమోదు చేసిన ఈ అంశం ఒక సమ స్య కాకుండా ఎటుపోతుంది? రాజీనామాల నుంచి తాత్కాలికంగా ప్రజావూపతినిధులు తప్పించుకుని ఉండవచ్చు.

రేపు అనివార్యంగా జరిగే సకల జనుల సమ్మెలో తెలంగాణలో అన్ని సమూహాలు, అన్ని ఉద్యమ సంస్థలు, అందరు వ్యక్తులు, శక్తులు నువ్వెటు? అని తేల్చుకోవాల్సి ఉన్నట్టే రాజకీయ పార్టీల నాయకులూ తేల్చుకోవాల్సి ఉన్నది. ఇప్పటికి మనం చేపట్టిన పోరాట రూపాల మీద అసంతృప్తి ఉండవచ్చు. కానీ సకల జనుల సమ్మె రేపు నిన్ను నిలదీయక తప్ప స్థితి ఒకటి ఏర్పడినప్పుడు? ఏ పార్టీ నేతలు ఏమి చేస్తారు? నిజంగానే రాజీనామాల తో ఏమీ జరగలేదా? జరగాల్సిన నష్టం ఇరవై రెండు నెలల్లో చాలానే జరిగింది. కానీ ఏది మన కు అడ్డంకి! ఉద్యమం జరిగిన తీరా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగుల్బాజీ, కుట్ర పద్ధతులా? ఏ ప్రాంతంలోనన్నా ఇట్లాంటి పోరాటాలు ఈ సందిగ్ధ కాలంలో ఇంతకాలం కొనసాగినయా? ఎందుకని మనం ఈ స్పిరిట్‌ను గుర్తించడం లేదు. రాజకీయ పార్టీల నేతలు ఊసర రంగులు మార్చి నవారు అయితే కావచ్చు. కానీ తెలంగాణ ప్రజలు కాదు. డిసెంబర్ 9 ప్రకటన తెచ్చుకున్నది తెలంగాణే. ఇక్కడి ప్రజలే.

ఆ ప్రకటనను సాకారం చేసుకునేది ఇక్క డి ప్రజలే. ఇంతకాలం జరిగిన తర్వాత ఒకవేపు ప్రజలు సన్నద్ధం అవుతున్నప్పు డు, సకల జనుల సమ్మెకు సర్వం తయారు అవుతున్నప్పుడు ఇలాంటి మాటపూందుకు? వస్తున్నాయి. మనం ఒకే మాట పదే పదే మాట్లాడి, ఒకే పోరాటాన్ని పదేపదే చేసి, ఒకే అభినయాన్ని పదేపదే అభినయించి మనకు మనంగా ఒక సినికల్ మూడ్‌లోకి, బాధ్యతా రాహిత్యంలోకి కూరుకుపోతున్నామా? నిజమే తెలంగాణ ఉద్యమం ఒకరు నడుపుతున్నది కాదు. నిజమే తెలంగాణ ఉద్యమం ఏ ఒక్కరిది కాదు. ఇది రాజకీయ పార్టీల, ఉద్యమ సంస్థల, భిన్న వేదికల, భిన్న ఆలోచనల, భిన్న సంఘర్షణల, భిన్న భావజాలాల, విభిన్న అస్తిత్వాల సమాహారం. ఎందుకి ట్లా? ఏ ఒక్క దాని కోసమో పోరాడేది కాదు తెలంగాణ. విప్లవకారులు, ప్రధాన స్రవంతిగా చెప్పుకునే సగటు రాజకీయ పార్టీలు, అన్నీ భాగమే. సామాజిక న్యాయం, నూతన ప్రజాస్వామ్య విప్లవమూ, అధికా రం, ప్రజాస్వామ్య ప్రక్రియ, బూర్జువా రాజకీయాలు, ఎత్తులు, జిత్తులు, ఓట్లు సీట్లు అన్నీ కలగాపులగం కాకుండానే ఎవరి ఎజెండాలు వారు ఉంచుకుంటూనే సంఘర్షించుకుంటూనే, ఐక్యమవుతూనే, పోరాడుతూనే, తిట్టుకుంటూనే, విమర్శించుకుంటూనే, ఒకరిపై ఒకరు అసంతృప్తులుగా ఉంటూనే మనం ఒక తెలంగాణ కోరుకుంటున్నాం.

ఎందువల్ల? ఎందువల్ల డిసెంబర్ 9 ప్రకటన వెనక్కిపోయింది. ప్రజాస్వామ్యం లో ఒక ఉద్యమం ఇంకేమి చేస్తుంది. చట్టసభల్లో ప్రకటించిన ప్రకటనకు దిక్కులేనప్పుడు, ఒక ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో ఉద్యమాలు చేసిన వారు, ప్రజాస్వామ్య సౌధము కూడా మోసమే అనుకునే పరిస్థితి దాపురించినప్పుడు ఏమి చేస్తుంది? ఇట్లా ధోకా చేసిన ప్రభుత్వాలదీ, ప్రజాస్వా మ్య నిర్మాణాలదీ, ఈ ధోకాకు మూల కారణమైన అంతర్జాతీయ పెట్టుబడిదీ, వారి తైనాతీలదీ, దళారులు కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలదా? జరుగుతున్న ఉద్యమాలదా? నిజమే పార్లమెంటులో బిల్లు ద్వారా తెలంగాణ రావాల్సిన ఒక ప్రక్రి య జరగాల్సి ఉన్నప్పుడు ఏమి చెయ్యాలి? తెలంగాణ. నమ్మి నానబోసి పుచ్చి బుర్రలైనయి. ప్రజాస్వామ్యం తెలంగాణను నమ్మించి నిలువునా గొంతు కోసి ఉండవచ్చు. కానీ.. ఇవ్వాళ్ల చతికిలపడలేదు తెలంగాణ. అది పదే పదే పడిలేచిన కెరటంలా ఇవ్వాళ్ల లేచి నిలుచుంటున్నది. సకల జనుల సమ్మె కోసం సన్నాహాలు చేసుకుంటున్నది. నిజమే రాజకీయ ప్రక్రియలో ఉన్నవాళ్లు సరైన నిర్ణయాలు తీసుకుని ఉండకపోవచ్చు. కానీ మనం ఉన్నాం. జనం ఉన్నారు. జనంలో తెలంగాణ సజీవంగా బతికి ఉన్నది. ఏమీ కాదు తెలంగాణ చరిత్ర, వారసత్వం, వర్తమానంలో బతికి ఉన్నది.

అట్లాంటప్పుడు చల్లబడ్డది ఎక్కడ? నిజమే ఆర్థిక మూలాలను దిగ్బంధం చెయ్యకుండా, నిజమే కోస్తాంధ్ర పెట్టుబడిదారులను నొప్పించకుండా ఫలితం రాకపోవచ్చు. నిజమే చీమ కుట్టకుండా శివుని ఆజ్ఞ వెలువడకపోవచ్చు. కానీ జరుగుతున్న కాలాన్ని నిరాశలోకో, నిస్పృహలోకో మనం ఎందుకు? వంపుకోవాలి. ఏం జరిగిందని? ఒక నాగం జనార్ధన్‌డ్డి రాజీనామా బరాబర్ అని వీధికెక్కిండు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా తప్పుకుంటుం ది. పోనీ తప్పుకున్నా రేపు ప్రజల్లో వాళ్లెట్లా? ఏముఖాలు పెటుకొని ఉండగలరు? ఇజ్జత్ మానం లేకుండా వాళ్లు రేపె ట్లా తిరగగలరు? ఇన్నీ ప్రశ్నలు. నిజమే మనకొక సామాజిక తెలంగాణ కావా లి! నిజమే మనకొక ప్రజాస్వామిక తెలంగాణ కావాలి! నిజమే మనకు మతతత్వ చిహ్నాలు లేని, మధ్యయుగాల మత ఆధిపత్య అహంకారాలే లేని ప్రజాస్వామ్య సహిష్ణుతగల తెలంగాణ కావాలి. నిజమే ఇవ్వాళ ఉద్యమం నడుపుతున్న ఎవరై నా సరే ఒక సామాజిక, ప్రజాస్వామ్య, మత సహిష్ణుతగల తెలంగాణకు హామీ పడాలి. కానీ .. మిత్రులారా! ముందు మనకొక తెలంగాణ కావాలి. ప్రజాస్వామ్యాన్ని పరిహసించి దేశ అత్యున్నత చట్ట సభల్లో ప్రకటించి, వెనక్కి మళ్లిన మన కల సాకారం కావాలి. తెలంగాణ ఒక ఉమ్మడి అస్తిత్వం. తెలంగాణ మన ఆత్మల ఘోష. తెలంగాణ మున్నూట అరవై తొమ్మిది త్యాగాల పలవరింత.

తెలంగాణ ఏడువందల బలిదానాల, బలవన్మరణాల చింత. సకల దోపిడీలకు, సర్వ అనర్థాలకు, ప్రపంచం మీద పరివ్యాప్తమై ఉన్న సకల దోపిడీలకు తెలంగాణ సర్వరోగ నివారిణి మాత్రం కాదు. కానీ తెలంగాణ దానికదిగా ఒక అంతర్గత వలస దోపిడీని అరికట్టే అంతర్జాతీయ సామ్రాజ్యవాద దోపిడీని ప్రశ్నించే, ఆత్మగౌరవ, స్వయం పాలన పతాకం. నిధులు, నీళ్లు, కొలువులు, సాంస్కృతిక ఆధిపత్య, అవహేళన, ఒక ప్రాంతాన్ని మొత్తంగా ధ్వంసం చేసిన వలసదోపిడీ నిర్మూలనకు మనకొక తెలంగాణ కావాలి. అది తప్ప మార్గం లేదు. అందుకే తెలంగాణ ఒక విస్తృత అస్తిత్వ పోరాటం. అందుకే విప్లవకారుడు, బూర్జువా, జాతీయ బూర్జువా, దళితుడు, చేగువేరా అభిమానీ, జీబురు గడ్డం అసంతృప్తుడు, పోలీసు, గుండా, న్యాయవాది, కక్షిదారు, అధికారి, ఉద్యోగి, సబ్బండ వర్ణాలు, సకల జనులు ఒకే ఒక కల కంటున్నారు. అదే తెలంగాణ. ఇక సల్లవడ్డదా?తెలంగాణ. పైకి కనిపించినంత సులభంగానూ అర్థమయ్యే విధంగానూ విషయాలు ఉండవు. తెలంగాణ గర్భంలో ఒక బడబానలం ఉంది. అది బద్ధలయ్యే పర్వతం. తెలంగాణ తప్ప.. మరో పరిష్కారం.. ప్రత్యామ్నాయం లేదు. లేదు. ఉన్నదొక్కటే దారి.. వేరు తెలంగాణ దారి.
జై తెలంగాణ. సకల జనుల సమ్మె జిందాబాద్.
-అల్లం నారాయణ

No comments:

Post a Comment