Thursday, September 8, 2011

గడి పునాదులు కదిలిన వేళ..-చిల్ల మల్లేశం, కొత్తూరి మహేశ్ Namasethe Telangana 09/09/2011


9/8/2011 11:51:03 PM
గడి పునాదులు కదిలిన వేళ..
ఆ రోజు బలవంతమైన సర్పం, చలి చీమల చేతచిక్కింది..! గడి పునాదులు కదిలి, పెత్తందార్ల పీచమణిగింది..! అంతకు ముందు ఓ ప్రశ్న పుట్టింది. ‘ఈ వెట్టి ఎందుకు?’ అని. ఆ తర్వాత ప్రశ్నల మీద ప్రశ్నలు.. ‘ఈ దొర ఏంది?’ ‘మాపై పెత్తనం ఏంది?’ ‘భూమంతా అతడిదెట్ల?’ ‘మేము కూలీలమెట్ల?’.. ఇలా తామరతంపరలా ప్రశ్నలే ప్రశ్నలు.. అలా నాగేటి సాళ్లళ్ల పడ్డ ఈ ‘ప్రశ్నల’ విత్తనాల్లోంచి, విప్లవం మొలకెత్తింది.. అది ఇంతితై 34 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు లక్షలాదిగా తరలివచ్చిన రైతు కూలీలు, విద్యార్థులు, మేధావులతో జగిత్యాల పట్టణాన్ని ముంచెత్తింది.. కూలీ రేట్ల పెరుగుదల ఎజెండాతో దిగ్విజయంగా సాగిన నాటి జైత్రయాత్ర, భూస్వామ్య వ్యవస్థకు చరమగీతం పాడడంతో పాటు మావోయిస్టు ఉద్యమానికి ఊపిరులూదింది..

‘నువ్వు ఉరిమి చూసిన నాడు ఊరంతా పాలేర్లు..వాళ్లే నిన్ను ఊరి నుంచి తరిమికొడితే నీ బతుకంతా పల్లేర్లు’ 
-అలిశెట్టి ప్రభాకర్


‘ఏమని చెప్పను రామరామ.. మాఊరి దొర కథ రామరామ సచ్చెదాక సంపుతాడు.. పచ్చినెత్తురు తాగుతాడు.. గుడ్లగూబ మొఖపోడు.. గుంట నక్క చూపోడు..’
- ముప్పాల లక్ష్మణ్‌రావు(వూపస్తుత మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి)


ఈ మాట, పాట నాటి జైత్రయావూతను ఓ ఊపు ఊపాయి. ఎర్రజెండెర్రజెండెని య్యలో పాటలయ్యాయి. వికృతరూపం దాల్చిన భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పాలేర్లు నడిపిన జగిత్యాల జైత్రయావూత రాష్ట్ర చరిత్ర గతిని మార్చింది. ఈ ఉద్యమం మూడున్నర దశాబ్దాలుగా తన ప్రభావం చూపుతూనే ఉంది. తెలంగాణ పల్లెలో రక్తం ఏరులై పారినా,నిత్యం అనుమానపు చూపులు వెంటాడినా.. ఇనుపబూట్ల కింద పడి పచ్చని పల్లెలు నలిగినా, వేలాది ప్రాణాలు గాల్లో కలిసి నా, స్ఫూర్తియాత్ర కొనసాగుతూనే ఉంది. జగిత్యాల జైత్రయాత్ర, ప్రజలకు ప్రశ్నించే హక్కును ఆయుధంగా అందించింది. ఈ యాత్ర స్ఫూర్తితో ఎందరో యువకులు సాయుధ పోరాట బాటలో నడిచి, ప్రాణాలను కోల్పోయారు. మరికొందరు సర్కారును, పోలీసులను ప్రశ్నించే హక్కుల నేతలుగా మారగా, మరికొందరు కలాలనే కత్తులుగా చేసుకుని తాము నమ్మిన సిద్ధాంతాల కోసం నేటికీ పోరాడుతూనే ఉన్నారు.

1970వ దశకంలో తెలంగాణ జిల్లాల్లో భూస్వామ్య, బూర్జువా వర్గాల ఆధిపత్యం స్పష్టంగా కనిపించేది. భూస్వాముల చేతుల్లో నిరుపేద కూలీలు పూర్తి స్థాయిలో శ్రమదోపిడీకి గురయ్యేవారు. ఎలాంటి జీతం లేకుండా, కేవలం బట్టపొట్టకు దొరలు, పటేండ్ల ఇళ్లల్లో వెట్టి చాకిరీ చేసే ‘బగేలా’ పద్ధతి అమల్లో ఉండేది. శ్రీకాకుళం ఉద్యమంతో ఉత్తేజితులైన తెలంగాణ ప్రజల్లో స్వేచ్ఛా భావాలను ప్రజ్వలింపజేసిన ఘనత శ్రీశ్రీకి దక్కుతుంది. 1973లో కరీంనగర్‌లో నిర్వహించిన సభలో శ్రీశ్రీ ఉద్యమ విధానాలను, పోరాట స్వరూపాలను వివరించారు. వేములవాడలో గద్దర్, కూర రాజన్న పౌర హక్కుల సభలను నిర్వహించి, ప్రజలను ఉత్తేజపరిచారు. దీంతో చైతన్యవంతమైన నిమ్మపల్లివాసులు తమ గ్రామంలోని భూస్వామికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు.

22ఎకరాల భూమిపై తమకు హక్కు ఉందనీ, కూలీ పనులు మానివేశారు. అదే సమయంలో 1973 ఆగస్టు 15న కరీంనగర్ పరేడ్ గ్రౌండ్స్‌లో విద్యార్థులు ‘బూటకపు స్వాతంవూత్యాన్ని బద్దలు కొట్టండి’ అంటూ కరపవూతాలు పంచి సంచలనం సృష్టించారు. అప్పుడు అరెస్టు అయిన చందుపట్ల కృష్ణారెడ్డి చంద్రాపూర్‌లో చనిపోయాడు. మల్లోజుల కోటేశ్వరరావు కేంద్ర కమిటీ రెండవ నాయకుడుగా, కిషన్‌జీ సుప్రసిద్ధుడయ్యాడు. 1974లో జిల్లాలో ప్రగతి శీల, రాడికల్, విద్యార్థి సంఘాలు ఏర్పాటయ్యాయి. ఈ సంస్థలు భూస్వామ్య వ్యవస్థను తూర్పారపడుతూ ప్రచారం నిర్వహించాయి. ఇంతలోనే ఎమ్జన్సీ ప్రకటన జరిగింది. దీంతో తాత్కాలికంగా ఉద్యమాలకు బ్రేక్ పడింది. ఎమ్జన్సీ ఎత్తివేత తర్వాత తిరిగి జిల్లాలో విద్యార్థుల పోరాటాలు మొదలయ్యాయి.

అప్పటికే సాయుధ పోరాట పంథాను ఎంచుకున్న నక్సల్స్ ‘రోడ్ టు రెవల్యూషన్’ పేరిట ఆగస్టు తీర్మానాన్ని చేశారు. ప్రజా ఉద్యమాలు, సాయుధ పోరు సాగించాలని ఇందులో ప్రతిపాదించారు. ఈ క్రమంలోనే జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి ప్రాంతాల్లో ఉద్యమాలు ఊపందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 600మంది విద్యార్థులు గ్రామాల్లో భూ స్వామ్య వ్యతిరేక ప్రచారానికి బయలుదేరారు. జట్లు, జట్లుగా విడిపోయి జిల్లాలోని అన్ని గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించారు. జగిత్యాల సమీపంలో ఉన్న ఉప్పుమడుగు, కన్నాపూర్, రాయికల్, ఇటిక్యాల గ్రామాల్లో నిర్వహించిన సభలు అప్పట్లో అలజడి సృష్టించాయి. ముఖ్యంగా ఇటిక్యాల, ఉప్పుమడుగు గ్రామాల్లో విద్యార్థులను భూస్వాములు నిర్బంధించడం, వారి కోసం ప్రజలు భూ స్వాములపై ఎదురు తిరగడంతో పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.

విద్యార్థుల సభలు ప్రజలను, ముఖ్యంగా గిరిజన, దళిత, బలహీన వర్గాల వారిని చైతన్యం చేశాయి. కూలీ రేట్లు పెంచాలని, కట్టు బానిసత్వం కూడదని, ‘నీ బాంచెన్ కాల్మొక్తా..’ పద్ధతి ఇకపై సాగదంటూ రైతు కూలీలు ఉద్యమించడం మొదలు పెట్టారు. 1978 సెప్టెంబర్‌లో జగిత్యాలలోని కళాశాల మైదానంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న వారికి భూమిపై హక్కు లభిస్తుందని చెప్పడంతో జగిత్యాల చుట్టు పక్కల గ్రామాల కూలీలతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అలా సెప్టెంబర్ 9, 1978న జగిత్యాల పట్టణంలో కూలీలు కదం తొక్కారు. లక్షలాది మంది పట్టణంలోని వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. వెట్టి చాకిరీ, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఆ రోజు సాయంత్రం మైదానంలో బహిరంగ సభ జరిగింది.

ఈ సభలో, ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమంలో ఉన్న, మరణించిన కీలక నాయకులందరూ దాదాపుగా పాల్గొన్నారు. ఈ దెబ్బతో ఇక్కడి 80మంది భూస్వాములు అప్పటి ముఖ్యమంవూతిని కలిసి, తాము పల్లెల్లో ఉండలేమని మొరపెట్టుకున్నారంటే జగిత్యాల జైత్రయాత్ర ఏ మేరకు విజయవంతమైందో అర్థం చేసుకోవచ్చు! నాటి జైత్రయావూతలో ప్రస్తుత మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్ రావు (గణపతి), శీలం నరేష్, లలిత, మల్లోజుల కోటేశ్వర్ రావు, మల్లా రాజిరెడ్డి, సాహూ, నల్లా ఆదిడ్డి, కిషన్, కైరి గంగారాం, గజ్జెల గంగారాం, పోశా లు, అంగ ఓదెలు, నారదాసు లక్ష్మణరావు, అలిశెట్టి ప్రభాకర్, గద్దర్, అల్లం నారాయణతో పాటు పలువురు పాల్గొని తమ ప్రసంగాలతో ప్రజలను ఉత్తేజపరిచా రు. అలా జైత్రయాత్ర తర్వాత విద్యావంతులైన యువకులు రైతాంగ సమస్యలకు సాయుధపోరు మాత్రమే పరిష్కారం చూపగలదని భావించారు.

ఈ క్రమం లో భూస్వాములను వర్గ శత్రువులుగా ఎంచి, వారి గడులపై, వారిపై భౌతిక దాడులకు దిగారు. ఈ యాత్ర స్ఫూర్తితో ఎన్నో పౌర హక్కుల సంఘాలు పురు డు పోసుకున్నాయి. అనేక పత్రికలు ఉద్భవించాయి. ఇది జరిగి ముప్ఫై నాలుగేళ్లు గడిచినా జైత్రయాత్ర ప్రభావం నేటికీ కనిపిస్తూనే ఉంది. నాటి యాత్ర స్ఫూర్తితో సాయుధబాట పట్టిన ఎందరో యువకులు అణగారిన వర్గాల కోసం తమ జీవితాలను పణంగా పెడుతూనే ఉన్నారు. జగిత్యాల జైత్రయాత్ర ఆనాటి పీడిత, తాడిత ప్రజల్లో చైతన్యం నింపడంతో పాటు భూస్వామ్య వ్యవస్థ పునాదులను కదిలించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ జైత్రయాత్ర సారాంశం ఇప్పు డు దేశవ్యాప్తంగా విస్తరించింది.
-చిల్ల మల్లేశం, కొత్తూరి మహేశ్

No comments:

Post a Comment