Sunday, September 4, 2011

ఆధ్యాత్మిక విప్లవకారుడు by -డా. గాలి వినోద్ కుమార్ న్యాయశాస్త్ర ఆధ్యాపకులు Namasethe Telangan 22/08/2011


ఆధ్యాత్మిక విప్లవకారుడు
భారత దేశంలో బహుజనుల విముక్తి కోసం మార్గం చూపిన మహనీయులు బుద్ధుడు, పూలే, సాహు మహారాజ్, పెరియార్ రామస్వామి నాయర్, డా. అంబేడ్కర్, నారాయణ గురువులను ఆంధ్రవూపదేశ్‌లో పరిచయం చేసిన బహుజన పితామహుడు కాన్షీరాం. అయితే మహాత్మాఫూలే, పెరియార్, డా. అంబేడ్కర్ లాగా నారాయణ గురు హిందూమతాన్ని అసహ్యించుకోలేదు. కొత్త మతాన్ని కూడా స్థాపించలేదు. హిందు త్వాన్ని సమర్థ్ధిస్తూనే అందులోని మతోన్మాదాన్ని, కుల వివక్షతను, అంటరానితనాన్ని, మూఢాచారాలను పారదోలడానికి కృషి చేశారు. మతం మనవాళిని సంఘటితం చేసి, మహోన్నతులను చేయాలని ఆయన ఆశించారు. అందుకే ఆయన మనుషులందరికీ ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు ఉండాలన్నారు.
మతం కోసం మనిషి కాదు, మనిషి కోసమే మతం అన్న లక్ష్యం తో సర్వ మానవాళిహితం కోసం నారాయణ గురు ధర్మ పరిపాలన యోగం (ఎస్.ఎన్.డి.పి)ని 1903 లో స్థాపించారు. ఆ సంస్థ ప్రధాన లక్ష్యాలు: 1) నారాయణ గురు ఆదర్శాలను, ఆశయాలను ప్రచారం చేయడం 2) ప్రజల్లో ఆధ్యాత్మిక, భౌతిక విద్యను ప్రోత్సహించటం 3) అణగారిన ప్రజలు ఆర్థికంగా నిలబడడానికి వృత్తిపరమైన అవకాశాలు కల్పించడం 4) మతాలు, సాంప్రదాయా ల పేరిట కొనసాగుతున్న కుల భేదాలను, అంటరానితనాన్ని మూఢ నమ్మకాలను, ఇతర సామాజిక రుగ్మతలను నిర్మూలించడం. విద్యతో స్వేచ్ఛా, సంఘటితం ద్వారా శక్తి పరిక్షిశమించడం ద్వారా ప్రగతి సాధించవచ్చునని నారాయణ గురు పిలుపునిచ్చారు. అందుకు తన కార్యకర్తలను సుశిక్షుతులను చేయడానికి వారికి విద్యతోపాటు నైతిక ప్రవర్తన పట్ల శిక్షణ ఇచ్చారు.
అందుకే హిందూ మతం ఆధారం చేసుకునే తన సంస్థ ను స్థాపించారు. నిత్య జీవితంలో సత్యాన్ని అనుసరించాలని, కాలనుగుణంగా పాత ఆచారాలను మార్చుకోవాలని, మనుషులంతా సత్పవూపవర్తన కలిగి ఉండాలని అందుకు విద్య ద్వారానే మార్పు సాధ్యమన్నా రు. శూద్రులు, అతి శూద్రుల కోసం అనేక పాఠశాలలుభగంథాలయాలను ఏర్పాటు చేశారు. పరిక్షిశమించడం ద్వారా మనవాళి ప్రగతిని సాధిస్తుందన్నారు. అందుకు సమాజంలో అందరూ కష్టపడి పనిచేసే స్వభావాన్ని కలిగి ఉండాలని, అభివృద్ధి చెందిన వారు అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేయాలని ఉద్బోధించారు. వ్యవసాయం, వాణి జ్యం, హస్తకళలు, నేర్చుకొని నిమ్నవర్గాలు అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. విద్యా, ఉపాధి, ఆర్థిక రంగాల్లో కింది కులాలు అభివృద్ధి చెందినపుడే వారి జీవితాల్లో మార్పు వస్తుందని నారాయణ గురు ఆశించారు.
ఇతరుల మనోభావాలకు భంగం కలగకుండా,ఈర్షా, ద్వేషాలకు అతీతంగా మత బోధన జరగాలని, మతం శాస్త్రీయ పునాది పై ఆధారపడినపుడే మార్పు సాధ్యం అని మూఢాచారాలు మత విలువల్ని మంటగలుపుతున్నాయని ఆయన భావించారు. 1912 విజ్ఞాన వర్ధిని సభలో ఆయన మాట్లాడుతూ విద్య వల్ల మాత్రమే ప్రగతి సాధ్యమని విద్యావిధానంలో మార్పు రావాలన్నారు. పురుషులు కాకుండా స్త్రీలు కూడా చదువుకోవాలని, ఇంగ్లిషు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని విదేశాల్లో సైతం చదువును కొనసాగించే విధంగా ఆయన వారిని ప్రోత్సహించారు. దీనికోసం ప్రభు త్వం, ధనవంతుల నుంచి భారీగా విరాళాలు సేకరించి పాఠశాలలు , కళాశాలలు ఏర్పాటు చేశారు. నిమ్న వర్గాలు ప్రగతి సాధించాలంటే పారిక్షిశామికంగా ఎదగాలని, అందుకు చిన్నతరహా, చేతి వృత్తుల పరిక్షిశమలు స్థాపించాలని కోరుతూ 1905 కొల్లంలో మొట్టమొదటి ఇండవూస్టీయల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
ఈ విధంగా నారాయణ గురు ఎస్.ఎన్. డి.పి స్థాపించిన పదేళ్లలో అపూర్వమైన ప్రగతిని సాధించింది. పీడిత ప్రజలకు అండగా నిలిచి హిందూమతంలో సవర్ణులు చూపుతున్న వివక్షత, హక్కుల ఉల్లంఘనల పట్ల అనేక రూపాల్లో నిరసన కార్యకలాపాలు చేసింది. అంటరాని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పట్ల కరపవూతాలు, పత్రికల ద్వారా వారిని చైతన్యం చేయగలిగింది. తన జన్మించిన ఎళవా (గౌడ) కులం వాళ్లలో అంటరాని కులం. ఆ కులస్థులు మత్తులో తూలేవారు. మద్యం అనేది విషంతో సమానం. మద్యా న్ని తయారు చేయొద్దు, తాగొద్దని పెద్ద ఎత్తున ఎస్‌ఎన్‌డిపి ప్రచారం చేసిం ది. ద్వారా ఎళవా కులస్థులు తాగుడు మాని, తమ జీవితాలను బాగు చేసుకున్నారు. కాల క్రమంలో ఎస్‌ఎన్‌డిపి భారత జాతీయోద్యమంలో కీలక భూమిక పోషించి, రాజకీయ శక్తిగా ఎదిగింది. ఈ సంస్థ ద్వారా ఎదిగిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరి గొప్ప గొప్ప పదవులు పొందా రు.
నారాయణగురు శిష్యులు అయిన ఇ.ఎం.ఎస్ నంబూవూదిపాద్ కేరళ రాష్ట్రానికి మొట్టమొదటి కమ్యూనిస్టు ముఖ్యమంత్రి అయ్యా రు. ఈ సందర్భంగా ఆయన ఒక సభలో మాట్లాడుతూ ఎళవా కులస్థు ల ఆధ్యాత్మిక గురువు, నాయకుడు రైతాంగాన్ని భూమిలేని వ్యవసాయదారులను సమీకరించి వారిని జాగృతపరచి రాజకీయ ప్రజాస్వా మ్య ఉద్యమంలో వారిని భాగస్వామ్యం చేసిన మహానీయుడు. నారాయణ గురును ఫ్రెంచ్ తత్త్వవేత రోమాన్ రోలాండ్ లా ప్రజల జీవన స్థితిగతులను, సామాజిక అవసరాలను గుర్తించిన జ్ఞానిగా అభివర్ణించారు. 1922లో రవీంవూదనాథ్ ఠాగూర్ నారాయణ గురు గురించి మాట్లాడుతూ ‘నేను ప్రపంచంలో అనేక ప్రాంతాలను పర్యటిస్తూ ఎందరో యోగులను, మహర్షులను చూశాను. నారాయణ గురువు మించిన గొప్ప తత్త్వవేత నాకు ఎక్కడా కనపడలేదని నిజాయితీగా ఒప్పుకుంటున్నానని’ అన్నా రు. అలాగే జాతిపిత మహాత్మాగాంధీ తిరువనంతపురం బహిరంగ సభలో మాట్లాడుతూ తిరువా న్కూర్ రాష్ట్రంలో పర్య టించడం.
నారాయణ గురును కలుసుకోవడం నా జీవితానికి లభించిన మహాభాగ్యంగా భావిస్తున్నాను అన్నారు. ఆ తర్వాత ఆయనతో సమావేశం అయిన గాంధీ కులం హేతు విరుద్ధ పాత్ర అర్థమైందని, దేశంలో అంటరానితనాన్ని రూపుమాపాల్సిన ఆవశ్యకత ఉందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. నారాయణ గురు స్ఫూర్తితో నాటి భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు కుల, మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని గాంధీ పిలుపునిచ్చారు.
నారాయణ గురు నడిపిన ఆధ్యాత్మిక, సాంఘిక పోరాటాలు తమిళనాడులో పెరియార్ రామస్వామి నాయర్‌కు స్ఫూర్తినిచ్చాయి. హిందూ మత మూఢాచారాల నిర్మూలన కోసం వైక్కమ్ పోరాటం యావత్ తమిళ ప్రజల్లో చైతన్యాన్ని రగిలించి పెరియార్ నాస్తిక ఉద్యమాన్ని ప్రారంభించి హిందూ మతంలోని కుల, మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఫూలే, పెరియార్, నారాయణ గురు, సాహు మహారాజ్ పోరాటాల ఫలితంగా డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగంలో నిమ్న కులాల వాళ్లకు ఆర్థిక, రాజకీయ, సామాజిక ఉద్యోగ రంగాల్లో రక్షణలు కల్పించారు. ఈ దేశంలోని బహుజన సమా జం కోసం అంటరానితనం, అవిద్యను రూపుమాపడం కోసం తమ జీవితాలను అర్పించిన రియల్ మహాత్మా సామాజిక విప్లవకారుడు ఫూలే, ఆధ్యాత్మిక విప్లవకారుడు నారాయణ గురువులను అంబేడ్కర్ తన స్వీయ గురువులుగా స్వీకరించారు.
-డా. గాలి వినోద్ కుమార్
న్యాయశాస్త్ర ఆధ్యాపకులు
(నేడు నారాయణ గురు 156వ జయంతి)

No comments:

Post a Comment