Saturday, April 14, 2012

ప్రజాసైన్యాన్ని నిర్మించిన సేనాని----మల్లోజుల వేణుగోపాల్



Maoistreb talangana patrika telangana culture telangana politics telangana cinema
అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు-4
కిషన్‌జీ తన స్వప్నం‘దండకారణ్యాన్ని విముక్తి ప్రాంతంగా’ చేయడమేనని చెప్పుకున్నారు. ఇందుకోసం ఆయన 196-93 మధ్య ఎంతో కృషి చేశాడు. సైనికుడుగా, కమాండర్‌గా, ఆర్గనైజర్‌గా, నాయకుడిగా, విద్యార్థిగా, టీచర్‌గా, కవిగా, సాహితీ ప్రియుడుగా ఇంకా అనేక రకాలుగా ఏకకాలంలో అనేక బాధ్యతలు నిర్వహించాడు. తన కలల పంటను చిదిమివేయడం కోసం దూకుడుగా వస్తున్న ప్రత్యేక పోలీసు బలగాలను ఎదుర్కోకుండా దానిని కాపాడుకోలేమని పార్టీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా మన్యంలో దారగడ్డ,పస్తుత ఏఓబీ), ఆదిలాబాద్‌లోని అల్లంపెల్లిలో జయవూపదంగా జరిగిన తొలి దాడులు అందరిలో ఉత్తేజా న్ని నింపాయి. సరిగ్గా ఆ సమయంలో మిలటరీ శిక్షణ శిబిరంలో విద్యార్థిగా ఉన్న రాంజీ భవిష్యత్‌లో జరగబోయే యుద్ధం గురించి లోతుగా ఆలోచించాడు. ఆయనతోపాటు ఆ క్యాంపులో పార్టీలోని ప్రధాన నాయకత్వం అంతా పాల్గొన్నది.

మందుపాతరల యుద్ధతంవూతానికి, మార్క్‌మెన్‌షిప్ శిక్షణకు, ఇతర యుద్ధ టెక్నినిక్కుల అభ్యాసానికి క్యాంపు పునాదులు వేసింది. ఉత్తర తెలంగాణ, దండకారణ్యాలలో గెరిల్లా శక్తు లు బలపడుతూ ప్రజాయుద్ధం, గెరిల్లా యుద్ధం అభివృద్ధి చెందుతుండడంతో ప్రత్యేకపోలీసు బలగాలతో తలపడటమే ప్రధాన కర్తవ్యంగా ముందుకు రావడం తో 197లో ఉత్తర తెలంగాణ, దండకారణ్యాలను ‘గెరిల్లా జోన్’లుగా పార్టీ గుర్తించింది. భారతదేశ ప్రజాయుద్ధం లో గెరిల్లా జోన్‌ల నిర్ధారణకు దీన్నే ప్రాణంగా తీసుకోవడం అప్పటినుంచే ఉనికిలోకి వచ్చింది. ఈ సైనిక సిద్ధాంత విశ్లేషణలో నల్లా ఆదిడ్డి, రాంజీల పాత్ర ప్రముఖమైనది. 2007లో పార్టీ జరుపుతున్న ఐక్యతా కాంగ్రెస్ తొమ్మిదో సభ నాటికి దేశంలో దాదా పు డజన్‌కు పైగా గెరిల్లా జోన్‌లు ఉనికిలోకి వచ్చినట్టు గా చెప్పుకోవచ్చు.

ఈ అన్ని గెరిల్లా జోన్‌లలో చాలా వరకు ప్రత్యక్ష్యంగా, కొన్నిటిలో పరోక్షంగా రాంజీ పాత్ర చిరస్మరణీయమైనది. నిర్మాణ రంగా న్నీ (మాస్ వర్క్) సైనికరంగాన్నీ వేరు చేసి అభివృద్ధి చేయాలనే మా ఆలోచనలను దండకారణ్యంలో సైనికరంగ అభివృద్ధికి రాంజీ విశేష కృషి చేశాడు. ప్లాటూన్ల నిర్మా ణ విషయంలో చాలా ఓపికగా, సుదీర్ఘంగా మాతో చర్చలు జరిపారు. ఉన్న శక్తిపై ఆధారపడి పనులు, నూత న నిర్మాణాలు, ఉన్నత కర్తవ్యాలు చేపట్టాలనే మా ఆలోచనలకు ఆయన పదును పెట్టాడు.ఉద్యమ పురోగమన నేపథ్యంలో మన కర్తవ్యాలను రూపొందించుకోవాలనీ, ఆ కర్తవ్యాలను పరిపూర్తికి మనశక్తినీ, శక్తులను అనేక రెట్లు పెంచుకోవాలనీ బోధించారు. సైనిక శక్తి లేకుండా యుద్ధంలో వెనుకబడిపోతామనే అవగాహనతో సరిదిద్దాడు.

1995లో తొలి ప్లాటూన్ ఏర్పడినప్పుడు మా భావాల మధ్య పెద్ద చర్చ ఫలితమే ప్లాటూన్ల నిర్మాణం.దీంతో ఉద్యమంలో పెద్ద మార్పు సాధ్యమైంది.ప్లాటూన్ల నిర్మాణం ప్రజాగెరిల్లా సైన్య నిర్మాణానికీ, ‘పీజీఏ’ నిర్మాణాలతో ‘కంపెనీలు’, ‘బెటాలియన్’లు ఉనికిలోకి వచ్చాయి. గెరిల్లాయుద్ధం చలన యుద్ధంగా, ‘పీఎల్‌ఏ’గా వికసించాలన్న కర్తవ్యం ముందుకొచ్చింది. రాంజీ ఇతరులను కన్విన్స్ చేయడంలో మంచినేర్పరి. ఆయన తన ఆలోచనలను సమష్టి ఆలోచనలుగా మలచడంలో, వాటి ని అమలు చేస్తూ, ఆశాజనకమైన ఫలితాలు సాధించడంలో అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగినవాడు.
పార్టీలో నాయకత్వం ఒకటి లేదా రెండు రంగాలలో మంచిపట్టు సంపాదించి, విశేషానుభవం గడించినవారున్నారు. కానీ రాంజీ అనేక రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాడు. సిద్ధాంత, రాజకీయ, నిర్మాణ, సైనిక, సాహిత్య, సాంస్కృతిక రంగాలన్నింటిలో ఆయనకు మంచిపట్టు ఉండేది. పార్టీకి అరుదైన కేడర్లలో రాంజీ ఒకరు.

రాంజీ దండకారణ్యంలో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు తన సన్నిహిత సహచరుడి ‘ఏకే’ ఫైర్‌అయ్యి కుడి చేతిదండంలో నుంచి గుండు దూసుకుపోయింది.పక్కనే కూచున్న మేమంతా తీవ్రఆందోళనకు గురవుతుంటే ఆయన ఈ రక్తస్రావాన్ని అరికట్టడానికి ముందు కట్టుకట్టండంటూ, 1979లో ఓసారి ఇలాంటి సన్నిహిత సహచరుని చేతిలో తయారీ తుపాకీ పేలి కుడిచేయి మోచేతినుంచి గుండ్లు దూసుకుపోవడం గుర్తు చేస్తూ, మా ఆందోళనను మాయం చేస్తూ అందరినీ తన మాటలతో నవ్వించాడు.194లో దిల్‌సుఖ్‌నగర్(హైదరాబాద్)లో పోలీసులు తన మీద కాల్పులు జరిపినప్పుడు తానె లా తప్పుకున్నాడో గుర్తుచేశాడు. ఆయన 2010లో చివరి సారి కల్సినప్పుడు 2010 మార్చి చివరి వారంలో తనమీద పోలీసులు కాల్పులు జరిపినట్టూ, తన కాలు విరిగినట్టూ చేసిన ప్రచారమంతా ఉత్తదేనని తెలిపాడు. కానీ 2011, నవంబర్‌నాడు మేం విన్న ఆందోళనకరమైన వార్త కిషన్ జీ ఇకలేరని. సోనియా, మన్మోహన్‌పణబ్, చిదంబరం, మమతా బెనర్జీల నమ్మిన బంటయిన భారత అర్థ సైనిక బలగాల డీజీ విజయ్‌కుమార్ కోవర్టు కుట్రలతో కిషన్‌జీని హత్యచేశాడు.

ఉప్పెనలాంటి ప్రజా ఉద్యమాలు లక్షలు, కోట్ల సంఖ్యలో కోటన్నలను తయారు చేస్తాయి. రాంజీ జ్ఞాపకాలతో సుజాతక్క రాసినట్టు అతనొక సజీవ చైతన్యం. జగిత్యాల నుంచీ ఆ సజీవ చైతన్య స్ఫూర్తితో జంగల్‌మహల్ వరకు ఆయన పరిచిన పోరుదారులను ఎర్రకోట బురుజులపై ఎర్రజెండా నెగురవేసి ఆయన కలలను నిజం చేస్తాం.
పార్టీనిర్మాణాల విషయంలో రాంజీ ఎంతటి ప్రాధాన్యాన్ని ఇచ్చేవాడో, వాటి నాయకత్వంలో ప్రజా మిలీషియా నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధపెట్టేవాడు. ఆయన 190 కి ముందు పెద్దపెల్లి, అమర్‌నాథ్, జగన్, రాజలింగులతో ఏర్పాటు చేసిన తొలి పార్టీ సెల్ అనుభవాలతో గడ్‌చిరోలిలోని జిమ్మాల గట్టుప్రాంతంలో 196లో తొలి పార్టీ సెల్ ఏర్పరిచాడు.అమరుడు దేవేందర్‌డ్డితో కలిసి కుక్కలగూడూర్‌లో యువకుల ను సంఘటితం చేసి గ్రామరక్షక దళాన్ని నిర్మించిన అనుభవాన్ని కూడా ఆయన మా తో పంచుకొని, వాటిని పెద్ద ఎత్తున నిర్మాణం చేసే దిశలో మమ్ముల్ని గైడ్ చేశాడు. తెలంగాణ, దండకారణ్యం అనుభవాలను మూటగట్టుకొని బెంగాల్ చేరిన కిషన్‌జీ లాల్‌గఢ్‌లో అద్భుతమై ప్రజామిలీషియా నిర్మాణాలకు ప్రాణం పోశాడు. ఆయనను చివరి వరకూ ప్రాణపదంగా కాపాడుకున్నది ఆయన నిర్మించిన ప్రజా మిలీషియాలే. 

1993-94నాటికి దండకారణ్యంలో ప్రజా నిర్మాణాలు పటిష్టంగా తయారయ్యా యి. ఆదివాసీ సంప్రదాయం పెద్దల నియంవూతణ, దోపిడీ రాజ్యవ్యవస్థ నిర్మాణాలు చాలా వరకు దెబ్బతినిపోయాయి. దీంతో ఏర్పడిన శూన్యాన్ని ప్రజా రాజ్యాధికార సంస్థలతో నింపాలనీ 1994లో గ్రామకమిటీల నిర్మాణానికి కేంద్రకమిటీ ఇచ్చిన పిలుపు వెనుక రాంజీలో గల నిశిత పరిశీలన, ముందు చూపు, రాజ్యాధికార స్పృహ చాలా ముఖ్యమైనది. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నిర్మించిన గ్రామకమిటీలు, 190నాటికి కరీంనగర్ జిల్లాలో ఉనికిలోకొచ్చిన గ్రామకమిటీల అనుభవం, శ్రీకాకుళ ఉద్యమంలో ఉనికిలోకి వచ్చిన గ్రామకమిటీల గూర్చి లోతుగా అధ్యయనం చేయాలని, ఆయన తయారుచేసి అందించిన ఆధ్యయన సామాగ్రి దండకారణ్య జనతన సర్కార్‌ల నిర్మాణంలో, పురోభివృద్ధిలో ఎంతో తోడ్పడింది. తెలంగాణ రైతాంగ పోరాటం అందించిన చారివూతక పాఠాలను అనేక సందర్భాలలో ఆయన చెప్పేవారు.

ఈ అపార అనుభవాల వెలుగులో ఆయన బెంగాల్‌లోని సింగూర్, నందిక్షిగాంలలో, లాల్‌గఢ్‌లో ప్రజా రాజ్యాధికార సంస్థల నిర్మాణానికి కృషి చేశారు. విప్లవ ప్రజా సంఘాలు, ప్రజా మిలీషియా, గ్రామ పార్టీ నిర్మాణాలు అంతిమంగా రాజ్యాధికార సంస్థలుగా కొనసాగుతున్న పార్టీ నిర్మాణ పంథా రూపొందడం వెనుక ఆయన సిద్ధాం త కృషి గొప్పది.

పార్టీ నిర్మాణం విషయంలో ఆయన చాలా నిక్కచ్చిగా ఉండేవారు. నక్సల్బరీ ఉద్యమం దెబ్బతిన్న తర్వాత ముక్కచెక్కలై మిగిలిన పార్టీలు, గ్రూపులు,వ్యక్తులను తిరిగి ఒక విప్లవ పార్టీ లో సమైక్యం చేయాలంటే ముందు పార్టీ నిర్మాణం విషయంలో భావసారూప్యతతో పాటు కార్యసారుప్యత కూడా ప్రాధాన్యం కలిగిన విషయమేనని ఆయన గుర్తిం చారు. ఆయన వ్యక్తులతో, సంస్థలతో చేసిన చర్చలు, పొల్లునూ-ల్లునూ వేరు చేశాయి. ఇల్లు కుటుంబం వదలకుండా విప్లవ కృషి చేసే వారిలో విప్లవంలో పూర్తికాలం విప్లవకారుల గుర్తించి, రహస్య పార్టీ ప్రాముఖ్యం గురించి లెనిన్ పదే పదే బోధించిన విషయాలను, విప్లవ పార్టీ లేకుండా విప్లవమే లేదన్న వాస్తవాన్ని వారితో చర్చించి బెంగాల్‌లో సూత్రబద్ధమైన పార్టీ నిర్మాణానికై అవిక్షిశాంతంగా, ఓపికతో కృషి చేసి కృతకృత్యుడయ్యాడు. బెంగాల్‌తో పాటు తూర్పు, ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలలో కిషన్ జీ చేసిన కృషి ఫలితంగా పూర్తికాలం విప్లవకారులతో కూడిన బలమైన రహస్యపార్టీ నిర్మాణాలు ఉనికిలోకి వచ్చాయి. 

పార్టీ నిర్మాణాలతో పాటు సైన్యం నిర్మాణ విషయంలోనూ భిన్నమైన కార్యాచరణ ఉందని అర్థమైన చోట దానిని సరిదిద్దడానికి కృషిచేశాడు. పార్ట్ టైమర్ సైనికులతో బలమైన ప్రాజాసైన్యం ఏర్పడదని, ప్రజాసైన్యం లేకుండా ప్రజలకు ఉండేది ఏమీ లేదని సైద్ధాంతికంగా సోదర సంస్థలతో చర్చించి బలమైన నిర్మాణానికి కృషి చేశాడు. సైన్య నిర్మాణంతో పాటు సైనిక క్రమశిక్షణ విషయంలో నిజమైన మావోయిస్టు మిలిటరీ జనరల్ ఆయన.తుపాకీ పట్టుకోవడం నుంచీ గురి చూసి కాల్చడం వరకు, పి.టి నుంచి మస్కిట్ డ్రిల్ వరకు గ్రౌండులో, గ్రౌండ్‌బయట ప్రతి సైనికున్నీ నిశితంగా పరిశీలించి వారి లోపాలను సరిదిద్దేవాడు. దండకారణ్య ఫారెస్టు కమిటీ రూపొందించిన స్థాయి ఆదేశాలు (స్టాండింగ్ ఆర్డర్స్) తయారీలో రాంజీ ముఖ్యుడు. ఇలా ప్రజాసైన్య అభివృద్ధిలోని ప్రతిదశలో తీవ్రంగా కృషి చేసి భారతదేశంలో ప్రజాసైన్యాన్ని నిర్మించిన ప్రజాసేనానులలో ఒక ముఖ్యున్ని కోల్పోయినట్లు అయింది. కానీ ఆయన నిర్మించిన ప్రజాసైన్యం అద్భుతమైన విజయాలతో ముందుకుపోతున్నది. 

-మల్లోజుల వేణుగోపాల్
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు
(మిగతా.. రేపు)
Namasete Telangana News Paper Dated : 15/04/2012 

No comments:

Post a Comment