Sunday, September 4, 2011

ప్రపంచీకరణ సామిజిక ఉద్యమాలు పొ. జి. హరగోపాల్ Namasethe Telangana 5/8/2011


ప్రపంచీకరణ సామిజిక ఉద్యమాలు
పొ. జి. హరగోపాల్
అందరికీ అవకాశాలు అన్నది చాలా దూరంలో ఉందని, ఉన్న అవకాశాలలో ఎవరి వాటా ఎంత? అన్న సమస్య ప్రధానమైందిగా మారింది. దీంతో భిన్న సామాజిక సమూహాల మధ్య, కలలు కనే యువత కలతలకు గురై సమష్టి చైతన్య దశ నుంచి తమ సమూహపు సమస్య గురించి ఆందోళన చెందడం పారంభించింది. ఇది అవకాశవాద రాజకీయాలకు చాలా దోహద పడింది.
సమకాలీన సమాజంలో దేశ వ్యాప్తంగా భిన్న ఉద్యమాలు జరుగుతున్నాయి. ఏ ఉద్యమాలకైనా ప్రధాన ప్రేరకము - వ్యక్తులు తమ సమస్యలను తాము పరిష్కరించుకునే స్థితిలో లేనప్పుడు సమష్టి చర్యల ద్వారా ప్రయత్నిస్తారు. మనుషులు ఎదుర్కొనే చాలా సమస్యలకు కారణాలు వాళ్ల వ్యక్తిగత జీవితంలో నుంచి పుట్టినవి కావు. చాలా సమస్యలకు కారణాలు సామాజిక, ఆర్థిక నిర్మాణంలో, దాని చలనంలో ఉంటాయి. వాటి పరిష్కారం అది ప్రయాణిస్తున్న దిశను బట్టి ఉంటుంది. చరిత్ర నిండా ఈ అనుభవం ఉంది. చారివూతక స్పృహలేని వారికి సమస్యల పట్ల శాస్త్రీయమైన అవగాహన ఉండదు. అందుకే చాలా మంది ఆందోళనకు, గందరగోళానికి గురవుతుంటారు. ఒక సామాజిక స్థితి సంక్షోభంలో ఉన్నప్పుడు వ్యక్తిగా, సమష్టిగా- రెండు విధాలుగా కూడా పరిష్కారాలు కనుగొనడంలో విఫలమైనప్పుడు ఒకవైపు హింస, మరొకవైపు ఆత్మహత్యలు పెరుగుతుంటాయి.
‘ఆత్మహత్య ఒక రోగక్షిగస్థ సమాజ లక్షణ’మని మార్క్స్ విశ్లేషించారు. అందుకే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మొదట జరిగిన ఆత్మహత్యలను అలా అర్థం చేసుకోవచ్చు. కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జె.ఎ.సి. నిర్వహించిన అద్భుతమైన మీటింగ్ తర్వాత ఆత్మహత్యలు ఆగుతాయని భావించిన నాలాంటి వాళ్లకు, తర్వాత జరిగిన ఆత్మహత్యలు ఆశ్చర్యపరచడమేగాక చాలా ఆవేదనకు గురిచేశాయి. వేలాదిమంది సమూహం, సమష్టి చైతన్యం, సమష్టి శక్తి ఒక విశ్వాసాన్ని కలిగించకపోతే అది పెద్ద విషాదంగా పరిణమిస్తుంది.
అరవై ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత దేశ వ్యాప్తంగా ఒక నూతన ఉత్సాహము, ఒక స్వతంత్ర దేశ నిర్మాణము, యువతకు కావలసినన్ని అవకాశాలు, భవిష్యత్తు మీద విశ్వాస ము కలిగించాలి. దేశమంతా సామాజిక సంబంధాలను మౌలికంగా మార్చి నూతన పునాదుల మీద సామాజిక నిర్మాణంలో నిమ గ్నం కావలసిన తరుణంలో.. స్వాతంవూత్యోద్య మ ఆశయాలను, లక్ష్యాలను, విలువలను, వ్యవస్థలను విధ్వంసం చేస్తున్న రాజకీయాలు మనను నడుపుతున్నాయి. ఒక్క రాజకీయ పార్టీ కూడా(వామపక్షాలతో సహా) ప్రజల ముందు ఒక కొత్త స్వప్నాన్ని ప్రతిపాదించలేకపోవడం ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మా ర్గం. రాజకీయ నాయకులను అసహ్యించుకుంటున్న యువత విదేశీ పెట్టుబడి మన సమస్యలను పరిష్కరిస్తుందని భావిస్తున్నారు. మనమే విదేశాలకు వెళ్లిపోవడమే ముక్తి మార్గమని అత్యాశలోకి నెట్టబడ్డ మరొక తరం యువత మన ముందు కనిపిస్తోంది.
1970 లలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు కొత్త కలలను కంటున్న యువత, సాహసంగా ప్రశ్నలు లేవదీసి ప్రత్యామ్నాయ వ్యవస్థల గురించి ఆలోచించే యువత..ఎక్కడ చూసినా ఒక సజీవ సమాజం కనిపించేది. దీంట్లో కొందరు జీవితంలో రాజీపడ్డారు. మరికొందరు ఉద్యమాలలో ప్రాణాలు త్యాగం చేశారు. అందుకే ఆ రోజులను తలచుకుంటే విద్యార్థుల పట్ల నాలాంటి వారికి ఒక కృతజ్ఞతా భావం కలుగుతుంది.
1980ల నుంచి ‘మౌలిక మార్పులు వస్తాయి’ అన్న భావన ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా సామాజిక ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చాయి. ప్రత్యామ్నాయ సమాజ సాధన, అస్తిత్వాల ప్రశ్న పరిష్కారం కాకుండా, తక్షణ సామాజిక సమస్యలు పరిష్కారం కాకుండా సామాజిక సమగ్ర మార్పు గురించి మాట్లాడడం ‘తొందరపాటు చర్య’ అనే ఒక ఆలోచనా స్రవంతి ముందుకు వచ్చింది. అందరికీ అవకాశాలు అన్నది చాలా దూరంలో ఉందని, ఉన్న అవకాశాలలో ఎవరి వాటా ఎంత? అన్న సమస్య ప్రధానమైందిగా మారింది. దీంతో భిన్న సామాజిక సమూహాల మధ్య, కలలు కనే యువత కలతలకు గురై సమష్టి చైతన్య దశ నుంచి తమ సమూహపు సమస్య గురించి ఆందోళన చెందడం ప్రారంభించింది. ఇది అవకాశవాద రాజకీయాలకు చాలా దోహద పడింది. అందరికీ అవకాశాలు అని అడిగితే రాజకీయాలకు సవాలు. కానీ ఎక్కడికక్కడ విడగొట్టడం, ఘర్షణ పెరగడంతో రాజకీయాల మీద భారము, బరువు తగ్గాయి.
అస్తిత్వ ఉద్యమాలు ముఖ్యంగా అట్టడుగున ఉండే సమూహాల ఉద్యమాలకు ప్రజాస్వామిక స్వభావముంటుంది. అది వాళ్లకు ఆత్మగౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తుంది. అందుకే నక్సలైట్ ఉద్యమం కూడా ‘అస్తిత్వాల’ను తిరస్కరించలేకపోయింది. అయితే ఉన్న అవకాశాలలోనే వాటా తాత్కాలిక పరిష్కారమని గుర్తించి, ‘అందరికీ అవకాశాలు’ అని అడిగే రాజకీయాలు లేనప్పుడు సమాజం చాలా పెద్ద సంక్షోభంలో పడుతుంది.
ఈ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని స్వార్థ రాజకీయం భిన్న కారణాలు చెప్పి ప్రపంచీకరణే దీనికి పరిష్కారమని తాత్కాలికంగానైనా మధ్యతరగతి యువతను ఒప్పించగలిగింది. ప్రపంచీకరణ పెద్ద ఎత్తున ప్రారంభమై రెండు దశాబ్దాలు దాటుతున్నది. ఈ అనుభవం ఏం చెపుతున్నది? అవకాశా లు పెరిగాయా? తగ్గాయా? అసమానతలు పెరిగాయా? తగ్గాయా? హింస తగ్గిందా? పెరిగిందా? ఆత్మహత్యలు పెరిగాయా? తగ్గాయా? దేశ సంపద పెరిగిందా? తగ్గిందా? పెరిగిన దేశ సంపదలో పేద వారికి ఏమైనా వాటా లభించిందా లేదా? దేశంలో అవినీతి పెరిగిందా? తగ్గిందా? ఇలా చాలా ప్రశ్నలు ప్రతి సామాజిక ఉద్యమం, అస్తిత్వ ఉద్యమం అడగవలసిన తరుణం ఇదే.
ఈ చారివూతక నేపథ్యంలో బెంగళూరులోని ప్రతిష్టాత్మక లా విశ్వవిద్యాలయంలో జూలై 25,26 తేదీలలో రెండు రోజుల సదస్సు జరిగింది. ఆ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసే బాధ్యత నాకు ఇవ్వడం వల్ల పై ప్రశ్నలను అడిగే అవకాశం వచ్చింది. నేను ప్రశ్నలే అడగగలిగాను. కానీ ఉద్యమాల పరిమితుల గురించి నాకుండే సామాజిక నేపథ్యం వల్ల సాహసం చేయలేపోయా ను. నా తర్వాత మాట్లాడిన ప్రఖ్యాత దళిత మేధావి ఆనంద్ తెల్ తుంబ్‌డే నేను ఆగిన దగ్గర ప్రారంభించి, సమస్యలకు వ్యవస్థాపర కారణాలుంటాయని, ఏ అస్తిత్వ ఉద్యమమైనా కార్యకారణాలను మొత్తం సామాజిక, ఆర్థిక, రాజకీయ నిర్మాణంలో చూడాలని తమ సమూహాన్ని సమీకరిస్తూ మొత్తం వ్యవస్థను మార్చే రాజకీయ ప్రక్రియలో భాగం కాకుండా సాధ్యపడదని విశ్లేషించారు. అస్తిత్వ ఉద్యమాల పరిమితుల ను, పరిమిత లక్ష్యాలను, దీర్ఘకాలిక, సమ గ్రలక్ష్యాలలో భాగం చేయాలని అంటూ.. అస్తిత్వ సామాజిక ఉద్యమాలకు ప్రపంచీకరణ ప్రథమ ప్రధాన శత్రువు అని ప్రతిపాదించాడు. శత్రువు ఒకటే అయినప్పుడు చారివూతకంగా పీడిత ప్రజల ఐక్యత అనివార్యమని అన్నాడు.
తర్వాత జరిగిన చర్చలో పాల్గొన్న దళిత, వెనుకబడిన తరగతుల మహిళల, మైనారిటీ ల, గిరిజనుల, పర్యావరణ, హక్కుల ఉద్యమాల నేతలందరూ ప్రపంచీకరణ వల్ల నష్టపోయామనే అంశం మీద లోతు అభివూపాయాలను, ఉద్యమ అనుభవాలను పంచుకున్నా రు. ఈ అంశం మీద రెండు రోజుల సదస్సు లో ఎవ్వరూ విభేదించలేదు. కానీ ఐక్యత గురించి జరిగిన చర్చ చాలా వాడి వేడిగా సాగింది. వాద వివాదాలు జరిగాయి. పరస్ప ర నిందారోపణలు కూడా జరిగాయి. ఇలాం టి సదస్సులో ఇవి ఎవరూ నివారించలేరు.
సదస్సు ముగింపు సమావేశంలో మేమిద్ద రం మళ్లీ ప్రసంగించాము. సదస్సులో జరిగిన చర్చ సారాంశాన్ని నేను, భవిష్యత్తులో చేయవలసిన కృషి గురించి ఆనంద్ మాట్లాడాము. సదస్సు ముగిసిన తర్వాత దాదాపు 25 మంది భిన్న ఉద్యమా ల నాయకులతో, ప్రతినిధులతో ఒక సమన్వయ సంఘం ఏర్పడింది.
వీళ్లల్లో ప్రఖ్యాత దళిత రచయితలు, కవులు, హక్కుల నాయకులున్నారు. వీళ్లను సమన్వయపరిచే లేదా సమావేశపరిచే బాధ్యత లా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జాఫెట్ తీసుకున్నారు. జాఫెట్ లోహియా రాజకీయాలలో ఎదిగాడు. కానీ కర్ణాటకలోని అన్ని ఉద్యమాలతో చాలా దగ్గరి సంబంధాలు కలిగి ఉండబట్టే ఇంత మందిని సమీకరించగలిగారు. ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు చాలా అరుదైపోయారు. ఈ ప్రయోగాన్ని దగ్గరగా పరిశీలించవలసిన అవసరముం ది. అలాగే తెలంగాణ కూడా అస్తిత్వ ఉద్యమమే. ఇందులో ఇతర చాలా అస్తిత్వాలున్నాయి. తీవ్రమైన చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణకు,తెలంగాణలోని అస్తిత్వ ఉద్యమాలకు కూడా ప్రపంచీకరణ శత్రువే. ఈ భూమిక మీద తెలంగాణ ఉద్యమం సజీవంగా సాగుతూనే, బెంగుళూరులో జరుగుతున్న ప్రయత్నం, ప్రయోగం తెలంగాణలో కూడా జరిగితే తెలంగాణ భవిష్యత్తుకు అవసరమని భావిస్తూ..

No comments:

Post a Comment