Saturday, February 4, 2012

ధ్వంసమవుతున్న ఆదివాసీ జీవనం


మేడారం జాతర వచ్చిందంటే..తమ ఇష్ట దైవాలైన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోవచ్చని ప్రజలు ఆనందపడతారు. కానీ..రాజకీయనాయకులకు మాత్రం మేడారం జాతర అందివచ్చిన ఓ అరటి పండు. కాంట్రాక్టర్లుగా అవతారమెత్తిన నేతలకైతే.. మేడారం బంగారు గుడ్లు పెట్టే బాతు. ఈ జాతర పేరుతో..సౌకర్యాల కల్పన పేరుతో కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. వేసిన రోడ్డు నాలుగు నెలలు తిరగకుండానే చిన్న వర్షానికే కొట్టుకుపోవడం సర్వసాధారణం అయింది. నిధుల దుర్వినియోగం ఒక ఎత్తు అయితే.. జాతర పేరుతో.. ఆదివాసీ ప్రాంతాల్లో, వారి సంస్కృతిలో తీరని నష్టం జరుగుతున్నది. 
ప్రధానంగా.. 2006 నుంచి ఈ జాతర పై పాలకుల కుట్రలు మొదలయ్యాయి. జాతర ప్రతి రెండు ఏళ్లకు ఒకసారి ఫిబ్రవరిలో జరుగుతుందనేది అందరికీ తెలుసు. కానీ ఆరు నెలల ముందు హడావుడిగా జాతర ప్రణాళికలు పంపిస్తున్నారు. దీనిపై మూడు నెలల ముందు అనుమతులు ఇస్తారు. ఈ అభివృద్ధి పనులలో పర్సం దండుకోవడానికి ప్రజాప్రతినిధులు అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఆదివాసీ బినామీ పేర్ల మీద తమ కార్యకర్తలకు, అనుచరులకు పనులు కట్టబెడుతున్నారు. పర్సం కోసం ప్రజావూపతినిధులు పనులకు అడ్డుపడుతున్నారు.దీంతో నెలల తరబడి పనులు వాయిదా పడుతున్నాయి. ఈయేడాది జాతర సమీపిస్తున్న నెల పదిహేను రోజుల ముందు కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టారు. తొందరగా పనులను పూర్తి చేయాలని నాణ్యతలేని పనులు చేసి కోట్లు దండుకుంటున్నారు. ఈ సంవత్స రం ఇప్పటివరకు పనులు పూర్తికాలేదు. కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్టు రోడ్లు వేయటం వల్ల ఆదివాసులు భూములను కోల్పోతున్నారు. మరుగుదొడ్ల కోసం ఇష్టవచ్చినట్లు గుంతలు తీసి గిరిజన వ్యవసాయ భూములను పాడుచేస్తున్నారు. 

పర్యావరణ విధ్వంసం భారీగానే జరుగుతున్నది. జాతర తర్వాత ప్లాస్టిక్ వస్తువులను అక్కడే వదిలి వల్ల అవి భూమిలో వందల సంవత్సరాలు అట్లే ఉండి పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. దీంతో గిరిజన భూములు పంటకు పనికి రాకుండా పోతున్నయి. ప్రభుత్వం జాతర తర్వాత పారిశుద్ధ్య నిర్వహణను గాలికొదిలేయటం వల్ల పరిసరాల గ్రామాలలో రోగాలు వ్యాపిస్తున్నాయి. దీంతో సరియైన వైద్యం అందని ప్రజలు చనిపోతున్నారు. భక్తులు వదిలి వెళ్ళిన వస్తువులు, కుళ్ళిపోయిన ఆహారపదార్థాలు తిని పశువులు కూడా చనిపోతున్నాయి. గత జాతర తర్వాత 500 మేకలు, 100 పశువులు చనిపోయాయని స్థానికులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా జాతర ముగిసిన తర్వాత ప్రభుత్వ అధికారులు ఎవరూ కూడా కన్నెత్తి చూడటంలేదు. ఇది ప్రతిసారి జరుగుతోంది. 
పవిత్ర మేడారాన్ని రక్షించాల్సిన రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు రాజకీయ పార్టీలు సమ్మక్క, సారలమ్మల జాతరను రాజకీయ ప్రచార వేదికలుగా మార్చివేస్తున్నాయి. మీటింగ్‌లు, సమావేశాలు, యాత్రలు పెడుతూ జాతర పవివూతతను దెబ్బతీస్తున్నారు.సమ్మక్క ఆశయసాధన అయిన ఆదివాసీల స్వయంపాలన విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. మేడారం జంపన్న వాగుపై వంతెనల నిర్మాణాన్ని నాటి పీపుల్స్‌వార్ (మావోయిస్టు)పార్టీ వ్యతిరేకించడం జరిగింది. 

దానివల్ల వలసవాదం పెరుగుతుందని వారు అప్పుడు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో నలభై సంవత్సరాల క్రితం భద్రాచలం దగ్గర గోదావరి నదిమీద చింతూరు దగ్గర శబరి నదిమీద వంతెనలు కట్టక ముందు జిల్లాలో ఆదివాసీల పరిస్థితి ఇప్పటి పరిస్థితిని గమనిస్తే ఈ అభివృద్ధి ఎవరి కోసమనేది అర్థమవుతుంది. కూనవరం నుంచి శబరి మీదుగా నిర్మించిన రోడ్డు, వంతెన ఎవరి కోసమనేది తేలిపోతుంది. కోస్తా నుంచి వచ్చిన గిరిజనేతర భూస్వాములు గోదావరి తీరంలోని సారవంతమైన వేలాది ఎకరాల ఆదివాసీల భూములను ఆక్రమించుకున్నారు. వేలసంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసులు భూములు కోల్పోయి నిర్వాసితులయ్యారు. ఇవ్వాళ మేడారంలో కూడా అదే పరిస్థి నెలకొన్నది.ండు దశాబ్దాల క్రితం నల్లగొండ, కరీంనగర్, వరంగల్ నుంచి మేడారం వచ్చిన గిరిజనేతర రెడ్డి, కమ్మలు ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పరుచుకుని తిష్ట వేశారు.ఈ వలసలు మేడారంలో అభివృద్ధి పేరుతో.. నేటికీ కొనసాగుతున్నది. ఈ విధంగా వలస వచ్చిన గిరిజనేతరులు వివిధ రాజకీయ పార్టీలలో చేరి రాజకీయ పెత్తనం చెలాయిస్తున్నారు. 

అంగబలంతో ఆదివాసీల భూములను లాక్కొ ని మేడారంలో పెత్తనం చెలాయిస్తున్నారు. ఇప్పటికి చుట్టు పక్కల గ్రామాల ఆదివాసీల భూములను గిరిజనేతరుల కబంధ హస్తాల్లోనే ఉన్నాయి. ఆదివాసీ భూముల రక్షణకు ఉన్న 1/70 చట్టం మేడారంలో అమలుకు నోచుకోలేదు. చట్టాపూన్ని ఉన్నా ఆదివాసులు భూములు అన్యాక్షికాంతం అవుతూనే ఉన్నాయి. స్థాని క రెవెన్యూ అధికారులు గిరిజనేతరులకు అమ్ముడుపోవటం, అవినీతి పోలీసు శాఖ కారణంగా గిరిజనుల రక్షణ కోసం ఉన్న చట్టాలన్నీ ఉన్నవారి చుట్టాలయ్యాయి. 5వ షెడ్యూల్డ్, 1/70 చట్టం అమలులో ఉన్న ఈ ప్రాంతంలో గిరిజనేతరులు ఇండ్లను, భవనాలను నిర్మించుకుంటున్నారం ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధితో ఉందో తెలిసిపోతోంది. 
జాతరలో దేవాలయ శాఖ, ప్రభుత్వం ఆదివాసీ వాలంటరీలను చిన్న చూపు చూస్తున్నది. దేవతలను గద్దెల వరకు తీసుకొచ్చేవరకు, తిరిగి వన ప్రవేశం చేసే వరకు ఆదివాసీ వాలంటీర్లు ప్రధాన భూమికను పోషిస్తారు. చాలా కాలంగా ఈ విధానం కొనసాగుతున్నా, వారికి కనీసం ఉండటానికి వసతి సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. అవసరమైతే ఆదివాసీ విద్యార్థులకు తగు శిక్షణ ఇచ్చి జాతరలో వాలంటరీలుగా చేర్చుకోవాలి. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటరీలను బయటినుంచి తీసుకొచ్చి, ఆదివాసీ వాలంటీర్లను గెంటివేసే ప్రయత్నం చేస్తున్నారు. గత జాతరలో ఆదివాసీ వాలంటీర్లకు భోజనం కూడా సరఫరా చేయలేదు. 
కొంతమంది స్వార్థ పరులు మేడారం, సమ్మక్క, సారలమ్మల జీవిత చరివూతను ఇష్టం వచ్చినట్టు వక్రీకరిస్తున్నారు.ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు కట్టుబాట్లు సమ్మక్క జీవిత చరివూతను తప్పుగా చిత్రీకరించి సొమ్ము చేసుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. 

భవిష్యత్తులో మేడారం జాతరపై ఆదివాసీలు సర్వహక్కులు కోల్పో యే ప్రమాదం ఉంది. మేడారం జాతరను,ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లను ప్రభుత్వం సంరక్షించే బాధ్యతను చేపట్టాలి. వీటి పరిరక్షణకు గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలి. సమ్మక్క, సారలమ్మల చరివూతను పాఠ్యాంశంగా చేర్చాలి. మేడారంలో అన్యమత ప్రచారాన్ని అరికట్టాలి.రాజకీయ ప్రచారాలను నిలిపివేయాలి. జాతర నుంచి వచ్చే ఆదాయంలో 20 శాతం నిధులను స్థానిక ఆదివాసుల అభివృద్ధికి కేటాయించాలి. ఆదివాసీ ప్రాంతా న్ని మొత్తాన్ని కలిపి సమ్మక్క, సారలమ్మ ఆదివాసీ జిల్లాగా ప్రకటించాలి.జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి. జాతర అనంతరం ప్రభుత్వం పరిసరాలను పూర్తిగా శుభ్రపర్చే చర్యలు చేపట్టాలి. జాతర సమీక్షా సమావేశంలో ఆదివాసీ సంఘాలకు అవకాశం కల్పించాలి. చిలుకల గుట్ట చుట్టు కంచెను నిర్మించాలి. గోవిందరాజు( కొండాయి) పగిడిద్దరాజు (పునుగొండ్ల) బయ్యక్కపేట (సమ్మక్క పుట్టినిల్లు) సారలమ్మ (కన్నెపల్లి)ల పుట్టిన స్థలాలను దైవ స్థలాలుగా ప్రకటించి, సంరక్షించాలి. నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి. ఇక్కడి ప్రజల అభివృద్ధికి కృషిచేయాలి. సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు, జంపన్న ,నాగులమ్మ ఆశయసాధన అయిన ఆదివాసీ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి.
-మైపతి సంతోష్ కుమార్ కేయూ రీసెర్చ్ స్కా
Namasete Telangana News Paper Dated 05/2/2012 

No comments:

Post a Comment