05-04-2016 04:05:38
వలసపాలన నుంచి విముక్తి కోసం, కుల నిర్మూలన కోసం జరిగిన స్వాతంత్ర్యోద్యమం, కుల నిర్మూలన కోసం జరిగిన సామాజిక సంస్కరణోద్యమాలు కన్న ముద్దు బిడ్డ బాబూ జగ్జీవన్‌రామ్. భారత దేశ స్వరాజ్య ఉద్యమంతో, తదనంతరం జరిగిన దేశ పునర్నిర్మాణంతో ముడివడిన జగ్జీవన్‌రామ్ జీవితం రాజకీయ, సామాజిక, చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది. జగ్జీవన్‌రామ్‌ని స్మరించుకోవడం అంటే భారత దేశ స్వాతంత్య్రం, సామాజికోద్యమాల ప్రాంగణాన జరిగిన ఉప్పొంగిన సమరోజ్వల సమున్నత ఘట్టాలను గుర్తు చేసుకోవడమే. కుల రహిత సమాజం కోసం జీవితాంతం ఆయన పోరాడారు.
జగ్జీవన్‌రామ్ మహోన్నత నాయకత్వం, వ్యక్తిత్వం, సేవలు భారత దేశ ప్రజాస్వామిక వ్యవస్థలకు, సంస్థలకు మహా బలాన్ని చేకూర్చిపెట్టాయి. జగ్జీవన్‌రామ్ వ్యక్తిత్వం మరెవ్వరితోనూ పోల్చజాలనిది. పార్లమెంటు లోపలా, బయటా హుందాయైున జీవితం, వ్యక్తి త్వం ఆయన సొంతం.
ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక విలువల పట్ల జగ్జీవన్ రామ్‌కు ఉన్న ప్రగాఢమైన నమ్మకం, రాజీలేని వైఖరి కాంగ్రెస్ పార్టీకి రాజీ నామా చెయ్యటం వలన మరింత వెలుగు చూసింది. భారత రిపబ్లిక్ లోక్‌సభకు 1952 నుంచి వరుసగా ఎనిమిదిసార్లు జగ్జీవన్‌రామ్ ఎన్ని కయ్యారు. ముప్ఫై మూడు సంవత్స రాలు కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశంలో ప్రజారాజ్య నిర్మాణా నికి నిరంతరం కృషి సాగించారు. ప్రథమ పార్లమెంటేరియన్‌గా నిలిచారు. జగ్జీవన్‌రామ్ సుదీర్ఘ కాలం కేంద్ర మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్‌లో కొనసా గారు. పుట్టుకతో సంక్రమించిన కుల వివక్షలు, అణచివేతలకు వ్యతిరేకంగా జగ్జీవన్‌రామ్ పోరాడారు. చదువుల్లో ఉత్తమ శేణ్రి విద్యార్థిగా రాణిచారు. చిన్న వయసులోనే నిర్మాణాత్మక తిరుగుబాటు స్వభావం, దార ్శనికత కలిగిన సామాజిక, స్వాతంత్ర్యోద్యమ మహా నాయకుడిగా స్వయం కృషితో ఎదిగిన విప్లవ శక్తి జగ్జీవన్‌రామ్ అనేది చరిత్ర చెప్పిన సత్యం.
1908 ఏప్రిల్ ఐదవ తేదిన జగ్జీవన్‌రామ్ బీహరు రాష్ట్రంలో షాబాద్ (ప్రస్తుతం భోజ్‌పూర్) జిల్లాలోని చిన్న గ్రామమైన చాంద్యాలో జన్మించారు. తల్లిదండ్రులు వసంతీ దేవి, శోభీ రామ్. సామాన్య కుటుంబం. చర్మకార కులం. మొత్తం విద్యార్థి జీవితమంతా అడుగడునా ఎదరైన కుల వివక్షను ప్రతిఘటిస్తూ జగ్జీవన్‌రామ్‌ఎదిగారు.
డిగ్రీ చదివేందుకు జగ్జీవన్‌రామ్ కోల్‌కతాకు వచ్చిన ఆరు నెలల్లోనే వెల్లింగ్టన్ స్క్వేర్‌లో ముప్ఫై అయిదు వేల కార్మికులను కూడగట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ విజయంతో జగ్జీవన్‌రామ్ సుభాస్ చంద్రబోస్, చంద్రశేఖర్ అజాద్ వంటి చాలామంది జాతీయ నాయకుల దృష్టిలోకి వచ్చారు. కమ్యూనిస్టు మేనిఫెస్టో, పెట్టుబడి గ్రంథాలతోపాటు ఇతర సోషలిస్టు సాహిత్యం అధ్యయనం చేశారు. 1934లో జగ్జీవన్‌రామ్ కలకత్తాలో అఖిల భారతీయ రవిదాస్ మహాసభను స్థాపించారు. గురు రవిదాస్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అనేక జిల్లాల్లో రవిదాస్ సమ్మేళనాలు నిర్వహించారు. సాంఘిక సంస్కరణల కోసం వ్యవసాయ కారర్మికుల మహాసభ, ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ మొదలైన సంఘాలను స్థాపించారు. బీహార్‌లో 1934లో జరిగిన భయంకరమైన భూ కంపం సందర్భంగా జగ్జీవన్‌రామ్ ప్రజలకు సహాయ, పునరావాస చర్యలు చేపట్టారు. 1935కలో జరిగిన డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ కాన్ఫరెన్స్‌కు జగ్జీవన్‌రామ్ అధ్యక్షత వహించారు. ఆ సంస్థకు అప్పటి నుంచి 1942 వరకు ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1935లో కాన్పూర్‌కు చెందిన సంఘ సేవకుడడు డాక్టర్ బీర్బల్ కుమార్తె ఇంద్రాణిదేవితో జగ్జీవన్‌రామ్ వివాహం జరిగింది.
సాంఘిక సం్కరణ కోసం చేస్తున్న ఉద్యమంలో భాగంగా అణగారిన కులాలవారికి ఓటు హక్కు కావాలని 1935 అక్టోబర్ 19న రాంచి వచ్చి హైమండ్ కమిటీ ముందు జగ్జీవన్‌రామ్ ప్రాతినిథ్యం వహించారు. 1936లో బీహార్ శాసనసభలో ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. 1937లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ తరపున 14 మంది రిజర్వుడ్ స్థానాల్లో గెలుపొందారు. దాంతో జగ్జీవన్‌రామ్ ఒక రాజకీయ నిర్ణయాత్మక శక్తిగా, కింగ్ మేకర్‌గా ఎదిగారు. 1937 బీహార్ శాసనసభలో వ్యవసాయం, సహకార పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి మంత్రిత ్వ శాఖలకు పార్లమెంటరీ సెక్రెటరీగా జగ్జీవన్‌రామ్ నియమితులయ్యారు. అండమాన్ ఖైదీలను రెండవ ప్రపంచయుద్ధంలోకి దించాలనే బ్రిటీష్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మంత్రిమండలికి రాజీనామా చేశారు. జగ్జీవన్‌రామ్ శాసనోల్లంఘన, సత్యాగ్రహ ఉద్యమాల్లో పూర్తిగా మునిగిపోయారు. వార్ధా వెళ్లి మహాత్మా గాంధీతో ఆయన అనేక విషయాలపై చర్చించారు. 1942లో జగ్జీవన్‌రామ్ బొంబాయిలో అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న క్విట్ ఇండియా పోరాటంలో క్రియాశీలంగా పాల్గొని అరెస్టయి జైలు జీవితం గడిపారు. కార్మిక, రక్షణ, రైల్వేలు, ఆహారం, పౌర సరఫరాల పంపిణీ, వ్యవసాయం, నీటిపారుదల, ఉపాధి, పునరావాసం, రవాణా, విమానయానం, తంతి, తపాలా మొదలగు మంత్రిత్వ శాఖలను జగ్జీవన్‌రామ్ విజయవంతంగా నిర్వహించారు.
ముప్ఫైమూడేళ్ళకు పైగా కేంద్ర కేబినెట్ మంత్రిగా, దేశ ఉపప్రధాన మంత్రిగానూ డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ తీసుకున్న అసంఖ్యాక నిర్ణయాలు, ఆయన నాయకత్వాన చేసిన అనేక ముఖ్యమైన మౌలికమైన చట్టాలు దేశ సామాజిక పరివర్తనలో, అమలు జరిగిన సామాజిక న్యాయంలో ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తున్నాయి. దేశంలోని పేద వర్గాలు, శ్రామిక ప్రజలు, సగటు మనుషులు, వెనకబడిన వర్గాలు, ముఖ్యంగా షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల వారి హక్కులు, అభివృద్ధి కోసం జగ్జీవన్‌రామ్ తీవ్రంగా కృషి చేశారు. 1946లో తాత్కాలిక పార్లమెంటుకు, 1947లో రాజ్యాంగ నిర్మాణ సభకు జగ్జీవన్‌రామ్ ఎన్నుకోబడ్డారు. అంటరానతనాన్ని శిక్షార్హమైన నేరంగా ప్రకటించి, దాన్ని రద్దు చేస్తూ రూపొందించిన అధికరణం-17ను రాజ్యాంగంలో చేర్చడానికి; ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనకబడిన వర్గాలకు సంబంధించిన హక్కుల కోసం జగ్జీవనరామ్ తీవ్రంగా కృషి చేశారు. మహిళలకు ఆస్తి, ఇతర హక్కులు ప్రతిపాదిస్తూ అప్పటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును ఆయన బలపరిచారు. 1955లోనే పౌరహక్కుల పరిరక్షణ చట్టం కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు.
కృపాకర్ మాదిగ
Published in Andhra Jyothi 05/04/2016
No comments:
Post a Comment