Showing posts with label ఘంటా చక్రపాణి. Show all posts
Showing posts with label ఘంటా చక్రపాణి. Show all posts

Thursday, May 10, 2012

తెలంగాణ గళంలో కాషాయ గరళం!---ఘంటా చక్రపాణి,



బీజేపీ గురించి ఈ తరం నాయకుల్లో చాలామంది కంటే డా. దాసోజుశ్రావణ్‌కే ఎక్కువగా తెలుసు. టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరోలో క్రియాశీలంగా ఉన్న ఈ యువనేత పూర్వాక్షిశమం లో కరుడుగట్టిన కాషాయ కరసేవకుడు. శ్రావణ్ మాతో పాటు ఉస్మానియా యూనివర్సిటిలో చదువుతున్నప్పుడు అఖిల ఏబీవీపీ మిలిటెంట్ నాయకుల్లో ముఖ్యుడు.ఆయన ఏబీవీపీనుంచి ఆర్ట్స్‌కాలేజీ విద్యార్థిసంఘం ప్రధానకార్యదర్శిగా గెలుపొందారు. 1985-90 మధ్యకాలంలో కొన్ని వామపక్ష విద్యార్ధిసంఘాలను ప్రభుత్వం నిషేధించింది. మరికొన్నిటిని నిర్మూలించడానికి ఏబీవీపీ ప్రయత్నించేది. వామపక్ష, దళిత బహుజన విద్యార్ధి సంఘాలు, ఆ భావజాలంతో పనిచేసే విద్యార్థుల మీద ఏబీవీపీ ఆధ్వర్యం లో అనేక దాడులు జరిగేవి.ఆయనకు ఆకాలంలో అగ్రక్షిశేణి బీజేపీ నాయకులతో సన్నిహిత సంబంధాలుండేవి. అదే శ్రావణ్ ఇప్పుడు బీజేపీ రాజకీయాలను ఏవగించుకుంటున్నాడు. మతతత్వ, ప్రాంతీయ అవకాశవాద పార్టీ అని, నిండుకుండ లాంటి తెలంగాణ ఉద్యమంలో విషపుచుక్క అని బీజేపీపై విరుచుకుపడ్డారు. శ్రావణ్ మాటలను రాజకీయ ప్రేలాపనలుగా కొట్టిపారేయలేము. ఎందుకంటే ఆయన సంప్రదాయ రాజకీయ వాదికాదు. ఎంబీఏతో పాటు ఎంఏ, పీహెచ్‌డీ చేసిన శ్రావణ్ కొంతకాలం ఆధ్యాపకుడుగా ఉన్నా డు. ఆ తరువాత ప్రముఖ కార్పొరేట్ కంపనీలలో పనిచేసేవాడు.సామాజిక న్యాయం నినాదానికి ఆకర్షితుడై ప్రజారాజ్యంలో చేరిన శ్రావణ్ ఇప్పుడు తెలంగాణాతోనే అది సాధ్యమని నమ్ముతున్నాడు. ఆ నమ్మకంతోనే ఎన్ని ఒడిదుడుకులున్నా టీఆర్‌ఎస్‌లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. బీజేపీ కుల, మతవాద ధోరణి తెలంగాణవాదానికీ, సామాజిక న్యాయానికి పెనుముప్పుగా మారిందని అంటున్నారు.ఆయనొక్కరే కాదు, జాతీయవాద పార్టీగా బీజేపీని అభిమానిస్తోన్న వాళ్ళు, సంఘ్ పరివార్ పట్ల గౌరవం ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ రాజకీయ ఎత్తుగడలపట్ల ఆందోళన చెందుతున్నారు. ఇది బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు, ఆయన శిష్యుడు కిషన్‌రెడ్డి రాజేసిన కుంపటి అని వారి వాదన. ఆ కుంపటి ఇప్పుడు తెలంగాణ జేఏసీలో పొగపెడుతోంది. ఇది చాలా మంది తెలంగాణ వాదులను కలవరపెడుతోంది. 

బీజేపీ పన్నెండేళ్ళ క్రితం కాకినాడలో కాగితంమీద రాసి పెట్టడం మిన హా సంస్థాగతంగా తెలంగాణ కోసం ఎన్నడూ పోరాడింది లేదు. 2004 దాకా కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ఎన్నడూ తెలంగాణ ఊసే ఎత్తలేదు. తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఆ పార్టీ అగ్రనాయకత్వం భావించింది.తెలంగాణ ఉద్యమం 2009 లో ఊపందుకున్న తరువాత ఆ పార్టీ గుంపులో గోవింద అన్నట్టుగా ఉద్యమానికి జైకొట్టింది. అడపాదడపా ఆ పార్టీ శ్రేణులను బహిరంగ సభలకు తరలించి బలోపేతం అయ్యే ప్రయత్నాలు చేసింది. బీజేపీకి ఎన్నడూలేని జనామోదం లభించడానికి ఆ పార్టీ సొంత ఎజెండా పక్కకుపెట్టి తెలంగాణ జేఏసీలో చేరడం కారణమయింది. తెలంగాణ జేఏసీకి ఉన్న విశ్వసనీయత మొత్తం తెలంగాణ సమాజాన్ని కులమతాలకు అతీతంగా, రాజకీయ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అందరినీ ఏకం చేయడానికి దోహదపడింది. సిద్ధాంతపరంగా బద్ధ శత్రువులుగా ఉండే నక్సలైటు పార్టీలు, ప్రజాసంఘాలతో బీజేపీ చేతులుకలిపి పనిచేయాల్సిన పరిస్థితి తెచ్చింది. అప్పటిదాకా మతతత్వ రాజకీయాలు నడిపే పార్టీగా ఉన్న బీజేపీ, తెలంగాణ ఉద్యమ పార్టీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. 

చాలా మంది ఆ పార్టీని అంగీకరించే స్థితికి వచ్చారు. కేవలం తెలంగాణ సాధనే తప్ప మరో ఎజెండా లేని నాయకత్వం, దానికోసం సంఘటిత శక్తిగా కదిలిన ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, పౌర సమాజం వెన్నెముకగా ఉంటూ జేఏసీని నిలబెట్టాయి. ఆ పార్టీ తెలంగాణ కోసం చిత్తశుద్ధిగా పోరాడుతున్నదని నమ్మడం వల్లే నిజామాబాద్‌లో డి.శ్రీనివాస్‌ను కాదని ముస్లింలు కూడా జేఏసీ పై విశ్వాసంతో బీజేపీకి పట్టం కట్టారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మినారాయణ ముస్లిం వీధుల్లో తలపై టోపీ పెట్టుకుని కేసీఆర్, కిషన్‌డ్డితో కలిసి ఊరేగితే ప్రజలు నిజంగానే నమ్మారు. కానీ జేఏసీ కార్యక్షికమాల్లో, ప్రజా ఉద్యమ క్షేత్రంలో బీజేపీ కదలికలను నిశితంగా గమనించిన వారికి బీజేపీ పట్ల పెద్ద నమ్మకం ఎప్పుడూ లేదు. 
బీజేపీ కూడా టీడీపీ లాగే రెండు కళ్ళ సిద్ధాంతాన్నే పాటించింది. ఆ పార్టీ తరపున రాజేశ్వర్‌రావు, విద్యాసాగర్‌రావు, దత్తావూతేయ, లక్ష్మణ్‌లాంటి వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడితే కిషన్‌రెడ్డి మాత్రం వెంకయ్యనాయు డు కనుసన్నల్లో పనిచేస్తూ వచ్చారు. ఉద్యమం ఉధృతంగా ఉన్నరోజుల్లో బీజేపీ ఒకవైపు జేఏసీలో ఉంటూనే కార్యక్షికమాలకు దూరంగా ఉన్న సందర్భాలూ ఉన్నాయి. బతుకమ్మ ఆడడంలో ఆసక్తిగా పాల్గొన్న బీజేపీ శ్రేణులు సహాయ నిరాకరణ, సకలజనుల సమ్మె సందర్భంగా ప్రత్యక్ష కార్యాచరణకు దూరంగా ఉన్నాయి. రైల్‌రోకో సందర్భంగా టీఆర్‌ఎస్, టీ-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర నాయకులు అరెస్ట్ అయినప్పుడు బీజేపీ అగ్రనాయకులు ఎక్కడా కనిపించలేదని ఉద్యమాన్ని పరిశీలించిన వారికి అర్థమవుతోంది. అలాగే జేఏసీ పిలుపు మేరకు అందులో భాగస్వామ్య పక్షాల ప్రతినిధులంతా రాజీనామా చేసిన సందర్భంలో కూడా కిషన్‌డ్డి రాజీనామా చేయలేదు. 


జగన్ నిజామాబాద్ వచ్చినప్పుడు ఆయనను నిలదీయాలన్నా, చంద్రబాబును పాలకుర్తి రాకుండా అడ్డుకోవాలన్నా బీజేపీ స్పందించలేదు. పైగా అది తమ విధానం కాదని తప్పించుకున్నది. మహబూబ్‌నగర్ ఎన్నికలకు ముందు యాత్రచేసే దాకా ఆయన పెద్దగా ఉద్యమంలో లేరు. కనీసం ఉద్యమంలో పాల్గొని కేసుల పాలయిన వారిని విడిపించడంలో, నిరాశతో ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు మనోధైర్యం నింపడంలో ఆ పార్టీ నిర్లిప్తతే దీనికి నిదర్శనం. ఆంధ్రాలో జై ఆంధ్రా నినాదంతో ముందుకు వెడతామని చెప్పిన ఆ పార్టీ మూడేళ్ళు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది.నిజానికి జై ఆంధ్రా ఆపార్టీ విధానం అయితే ఇప్పటికే అటువంటి నిర్మాణం, కార్యాచరణకు పూనుకుని ఉండాలి. భావ సారూప్యం ఉన్న రాజకీయ సంస్థలు, పౌర సమాజంతో అక్కడ కూడా ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుని ఉండాల్సింది. కనీసం అక్కడ ఆంధ్ర రాష్ట్రంకోసం పోరాడుతున్న దళిత బహుజన సంఘాలకు బాసటగా ఉండాల్సింది. కొవ్వూరులో పోటీ చేసి తమ వాదనను వినిపించి ప్రజలను ఆదిశగా చైతన్యవంతులను చేయాల్సింది. ఆప్రాంతంలో తన కులంలో ఆదరణ ఉన్న వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఒక మహాకూటమి ఏర్పాటు చేయాల్సింది.ఇవేవీ ఆ పార్టీ చేయలేదు. ఈ విషయంలో సీపీఐని, ఆపార్టీ అధినేత నారాయణను అభినందించాలి. ఆయన ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకే నాలుకతో మాట్లాడారు. జేఏసీలో భాగం కాకపోయినా అన్ని సందర్భాల్లోనూ సీపీఐని ప్రజలపక్షాన నిలబడేలా చూశారు. ఇలాంటి విమర్శలు వచ్చిన ప్రతిసారీ బీజేపీ సుష్మాస్వరాజ్ పార్లమెంటు ప్రసంగాన్ని గురించి చెపుతుంటారు.


అది నిజమే, ఆమెకు స్పీకర్ అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ సమస్యను అద్భుతంగా ఆవిష్కరించి అందరినీ ఆకట్టుకున్నది. అందు కే ఆమె తెలంగాణ ప్రజలకు దగ్గర కాగలిగారు. కానీ అన్నా హజారే అవినీతి అజెండాకోసం నెలలతరబడి పార్లమెంటు జరుగకుండా అడ్డుకున్న పార్టీ తెలంగాణ కోసం నిరవధికంగా పార్లమెంటును ఎందుకు స్తంభింప చేయలేక పోయింది? బీజేపీ ఎంపీల్లో వందమంది ఒక్కసారిగా లేచి నిలబడితే నిజంగానే ప్రభుత్వానికి ముచ్చెమటలు పడతాయి. కానీ ఆపార్టీ అలా చేయలేదు. 2014 దాకా చేయదు కూడా! ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలలాగే ఈ సమస్య 2014 దాకా మిగిలి ఉండాలని కోరుకుంటోంది. 2014ఎన్నికల్లో తెలంగాణలోని అన్నిస్థానాల్లోఒంటరిగానే పోటీ చేస్తాం అని ఆ పార్టీ నేత కిషన్‌డ్డి ప్రకటించారు. మహబూబ్‌నగర్ విజయం తరువాత ఆయనలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది.నిజానికి అప్పటినుంచే ఆ పార్టీ తప్పటడుగులు మొదలయ్యాయి. మహబూబ్‌నగర్ గెలుపు పూర్తిగా తనదేనని బీజేపీ భ్రమ పడుతున్నది. మహబూబ్‌నగర్‌లో బీజేపీ బలం కన్నా ఎన్నం శ్రీనివాసడ్డికి ఉన్న బలగం ఎక్కువ ప్రభావం చూపింది. శ్రీనివాసడ్డి పోటీ చేసే నాటికి ఆయనకు బీజేపీ సభ్యత్వం కూడా లేదు. ఆయన కరుడుగట్టిన తెలంగాణావాది. కేంద్రప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో చేరి టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. కేసీఆర్‌తో విభేదించి బయటకు వెళ్ళినా పార్టీ శ్రేణులతో సాన్నిహిత్యం కొనసాగిం చారు. టీఆర్‌ఎస్ పట్ల అక్కడక్కడా ఉన్న అసంతృప్తిని కూడా అనుకూలంగా మలుచుకున్నారు. 


ఆయనకు అక్కడ సామాజికంగా పెద్ద బలగమే ఉన్నది. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న ఎన్నంను బీజేపీఅభ్యర్థిగా ఎంచుకుంది. ఇదే మహబూబ్‌నగర్ జేఏసీ రెండుగా చీలిపోవడానికి కారణం అయింది. అక్కడి జేఏసీలో వామపక్ష భావాలున్న విద్యావంతులు ఉన్నట్టే ఆధిపత్య కులరాజకీయాలు నడిపే వాళ్ళూ ఉన్నారు. బీజేపీ శ్రీనివాసరెడ్డి బలంతో పాటు ఆయన కులాన్ని కూడా ఆయుధంగా వాడుకున్నది. అక్కడ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఆయన ఒక్కరే రెడ్డి కావడం కలిసి వచ్చింది. ఇక రెండోది మతం.టీఆర్‌ఎస్ ముస్లిం అభ్యర్థిని రంగంలో దింపే సరికి బీజేపీ తన పాత మతవాదానికి పదునుపెట్టింది. కాషాయం పులుముకుని కిషన్‌రెడ్డి కాస్తా లాల్‌కిషన్ అద్వానీగా మారిపోయా రు. ఈ ఎన్నికను ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌తో పోల్చారు.ఆయనకు ముస్లిం సోదరుల్లో రజాకార్లు కనిపించారు. ఎన్నికల్లో గెలిచారు కానీ రెండేళ్లపాటు బీజేపీ నేతలు ఉద్యమంలో ఉంటూ పార్టీకి సమకూర్చిన సరికొత్త ఉదార రూపాన్ని మాత్రం చెరిపేసుకున్నారు. ఇప్పుడు ఆపార్టీ తెలంగాణ సాధనకు, ఉద్యమ సామాజిక న్యాయ ఎజెండాకు భిన్నంగా నడుస్తోంది. అందుకే పరకాలలో మరో శ్రీనివాసడ్డి కోసం గాలిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ చిన్నాచితక నేతలు కూడా సకల జనుల సమ్మె విరమణను తప్పుపడుతున్నారు. ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ రాదనే వాదన లేవనెత్తుతున్నారు. శాసనసభకు జరిగే ఉపఎన్నికల్లో జాతీయ పార్టీ అవసరం ఏమిటో అర్థం కాదు. లోక్‌సభలో 114 మంది సభ్యులున్నా ఏమీ చేయలేకపోతున్న ఈ పార్టీ ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీలో నాలుగో సభ్యుడు గెలిస్తే తడాఖా చూపిస్తామని చెప్పడం నమ్మశక్యంగా లేదు. బీజేపీ వైఖరి తెలంగాణవాదుల్లో ఆందోళన కలిగిస్తున్నది. భాగస్వామ్య పార్టీల ఈ ఆధిపత్య పోరు జేఏసీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నది. ఇంతకాలం మీడియా గుసగుసలకే పరిమితమైన ఈ విభేదాలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మాటల యుద్ధమే దానికి అద్దంపడుతోంది.

మహబూబ్‌నగర్ లో బీజేపీ ప్రదర్శించిన దూకుడే ఇప్పుడు పరకాలలో టీఆర్‌ఎస్ ప్రదర్శిస్తున్నది. కచ్చితంగా వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్‌కు, తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు. మహబూబ్‌నగర్‌లో జేఏసీ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన బీజేపీ ఇప్పటికైనా పరకాల నుంచి విరమించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరిమీదయినా పోటీకి దిగొచ్చు. కానీ జేఏసీలో చేరిన పార్టీలు సమష్టిగా తెలంగాణ కోసం ఉద్యమిస్తామని, ఉద్యమ వ్యతిరేక శక్తులమీద యుద్ధం చేస్తామని చెపుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఒకరిమీద ఒకరు యుద్ధానికి దిగి ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయి. ఇంతకాలం తమకు నీడనిచ్చిన చెట్టును తామే నరికేసుకుంటున్నాయి. జేఏసిని రద్దు చేస్తారని, కోదండ రామ్‌ను చైర్మన్ పదవినుంచి తప్పిస్తారని వార్తాకథనాలు వ్యాపిస్తున్నాయి. జేఏసీ అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిఫలించే వేదిక. దాన్ని రద్దు చేయడమంటే తెలంగాణ ఉద్యమాన్ని రద్దు చేయడమే. ఆ హక్కు ఏ ఒక్కరికీ ఉండదు. సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నా తెలంగాణ సమష్టి, జన ఆకాంక్షకు అధికారిక ప్రతినిధిగా నిలబడ్డ వ్యక్తి కోదండ రామ్. ఆయన జేఏసీ ఏర్పడ్డాక ఉద్యమంలోకి వచ్చిన వ్యక్తికాదు. మలిదశ ఉద్యమానికి పునాది వేసిన వారిలో ఒకరు. కీలకమైన సమయంలో ఉద్యమ రథానికి సారధిగా ఉన్న కోదండరామ్‌ను తొలగించే అధికారం కూడా ఎవరికీ లేదు. ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు జేఏసీ సూచన మేరకు నడుచుకోవాలి. లేదంటే ఎవరిదారి వాళ్ళు చూసుకోవాలి. ఉద్యమాన్ని విషతుల్యం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు! 

సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ghantapatham@gmail.com

Namasete Telangana News Paper Dated : 11/05/2012 

Thursday, April 26, 2012

గాంధీ, అంబేద్కర్, రాజ్యాంగవ్యవస్థ---పొఫెసర్ ఘంటా చక్రపాణి



ఉద్యమాలు చాలా విషయాల పట్ల మన అవగాహనను పదునెక్కిస్తా యి. అదే ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది. తెలంగాణ ప్రజలు ఉన్నట్టుండి తమ పెద్దలందరినీ పేరుపేరునా తలుచుకుంటున్నారు. ఒక అలిశెట్టి ప్రభాకర్‌ను, ఒక సాహూను వారి మిత్రులు స్మరించుకున్నట్టే కొమురం భీమ్ జయంతిని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. నాలుగు దశాబ్దాల తరువాత నాటి తెలంగాణ యువతరం కథానాయకుడు జార్జిడ్డిని మళ్ళీ జనంలోకి తెచ్చి యువతరానికి వీరులంటే ఎలావుంటారో పరిచయం చేశారు. అదేవిధంగా ఈ సారి డాక్టర్ అంబేద్కర్‌ను కూడా స్మరించుకున్నారు. రెండేళ్ళ నిరంతర పోరాటం అంబేద్కర్ గురించిన అవగాహనను పెంచింది. ఈసారి హైదరాబాద్‌లో అంబేద్కర్ జయంతి జాతరను తలపించింది. దానికి తెలంగాణవాదం కూడా కారణం. అంబేద్కర్ అంటే కేవలం దళితుల నాయకుడు మాత్రమే అన్న ప్రచారం, ఆయన బతికున్న కాలంలోనే మొదలై ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఆయనను చదువుతున్నవాళ్ళు ఆ ఆలోచనలనుంచి బయటపడుతున్నారు. అందులో తెలంగాణ ప్రజానీకం కూడా ఉండ డం మంచి పరిణామం. తెలంగాణ ఉద్యమం వల్ల ప్రజలకు కొద్దో గొప్పో రాజ్యాంగ పరిజ్ఞానం అబ్బింది. ఇప్పుడు మన ఊళ్ళల్లో మూడో తరగతి చదివే పిల్లలకు కూడా రాజ్యాంగంలోని మూడవ ఆర్టికల్‌లో ఏముందో తెలిసిపోయింది. అంబేద్కర్ చిన్న రాష్ట్రాల గురించి ఏమన్నాడో వాళ్ళు చెప్పేస్తున్నారు. ఈ అవగాహన వల్లే ప్రజలు ఇంకా రాజ్యాంగం మీద చట్టసభల మీద నమ్మకంతో ప్రత్యేక రాష్ట్రం కోసం అలసటలేని పోరాటం చేస్తున్నారు. అంబేద్కర్ ఆచరణలో చూపిన మార్గాన్నే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనుసరిస్తోంది. బహుశా అదే శాసన సభ ఆవరణలో అంబేద్కర్ విగ్ర హం ప్రతిష్టించాలనే డిమాండ్‌కు కారణమైంది. 

ఈ డిమాండ్‌ను తెలంగాణవాదులు తెరమీదికి తేవడానికి ఆయన పట్ల ఈ ప్రాంత ప్రజలకు ఏర్పడ్డ గురి కూడా కారణం కావొచ్చు. విగ్రహాలతో సమాజంలో మహనీయుల పట్ల గౌరవం పెరుగుతుందన్న భ్రమలు నాకేమీ లేకపోయినా తెలంగాణ ఉద్య మం విగ్రహాలను ఆత్మగౌరవ ప్రతీకలుగా మార్చివేసిన సందర్భంలో అంబేద్కర్ విగ్రహం కోసం డిమాండ్ చేయడం న్యాయమైనదని నమ్ముతున్నాను. అయితే రాజకీయ నాయకులు చెబుతున్నట్టుగా అంబేద్కర్ కేవలం దళిత వర్గాలకే నాయకుడని నేననుకోను. ఆయన తరతరాలుగా దాస్యంలో మగ్గిన భారతీయ మహిళలకు విముక్తిని ప్రసాదించిన దార్శనికుడు. ఈ దేశం లో పుట్టిన ప్రతి శిశువుకూ నిర్బంధ ఉచిత విద్య ఉండాలని వాదించిన మేధావి. కార్మికులకు కనీస హక్కులుండాలని, వాటి సాధనకోసం సంఘటితమయ్యే అవకాశాలు ఉండాలని చట్టాన్ని రూపొందించిన శ్రామిక వర్గ పక్షపాతి. భారతదేశంలో సమానత్వం రావాలంటే భూములను జాతీయం చేసి వ్యవసాయాన్ని పరిక్షిశమగా గుర్తించాలని ప్రతిపాదించిన ధీశాలి. భారత దేశంలో బుద్ధుడు ప్రవచించిన సమానత్వం, సౌభ్రాతృత్వం, శాంతి సౌభాగ్యాలతో సమసమాజంగా విలసిల్లాలని కలలుగన్న స్వాప్నికుడు. ఆ కలలను నిజం చేసేందుకు తన అనుభవాన్ని, అధ్యయనాన్ని కలబోసి సమక్షిగమైన రాజ్యాంగాన్ని అందించిన శాసనకర్త! ఈ దేశంకోసం, దేశంలోని ప్రజలకోసం, భవిష్యతు కోసం అంబేద్కర్ అంతగా శ్రమించి, రాజ్యాంగ శాసన వ్యవస్థలను ప్రభావితం చేసిన నాయకుడు ఇంకొకరు పుట్టలేదు. తన నల భై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇరవై ఏళ్ళు గతాన్ని సవరించడానికి మరో ఇరవై ఏళ్ళు భవిష్యత్తును నిర్మించడానికి ఆయన వెచ్చించారు. అంబేద్కర్ ఈ దేశపు రాజ్యాంగ నిర్మాత కాబట్టి ఆ రాజ్యాంగ వ్యవస్థకు ప్రతిరూపమైన చట్టసభల ముందు అంబేద్కర్ విగ్రహం కచ్చితంగా ఉండి తీరాలి.

ఇప్పుడున్న చట్ట సభలైన పార్లమెంటు, శాసన సభల రూపురేఖలు, విధివిధానాలు రూపొందించింది ఆయనే. అసలైతే ఒక్క అంబేద్కర్ విగ్రహమే ఉండాలి!
కానీ హైదరాబాద్ నగరపు నడిబొడ్డున ఉన్న ఆంధ్రవూపదేశ్ శాసనసభ ముందు గంభీర మౌనమువూదలో కూర్చున్న గాంధీ విగ్రహమే కనిపిస్తుంది. ఇరవైండు అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని టీడీపీ ప్రభుత్వం 1988లో ఏర్పాటు చేసింది. ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా గాంధీకి శాసనసభకు ఉన్న సంబంధం ఏమిటన్న అనుమానం కలుగుతుంది. రాజ్యాంగానికి, శాసన వ్యవస్థకు, చట్టబద్ధ పరిపాలనకు రూపశిల్పి అయిన అంబేద్కర్ విగ్రహాన్ని శాసనసభ ఆవరణలో పెట్టడానికి ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం అవలంబిస్తోన్న వ్యతిరేకత చూసిన తరువాత ఈ ప్రశ్న లేవనెత్తక తప్పడం లేదు. హైదరాబాద్‌తో పరిచయంగానీ, ఈ ప్రాంతంతో సంబంధంగానీ లేని అనేకమంది విగ్రహాలు టాంక్‌బండ్ మీద ఉన్నట్టే చట్టసభలతో పరిచయం గానీ, వాటిల్లో ప్రవేశానుభవంగానీ కనీసం చట్టాల పట్ల గౌరవంగానీ లేని గాంధీ విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఉండడంలో ఔచిత్యం అర్థం కాదు. గాంధీజీ గొప్ప నాయకుడే. స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన వారిలో ఆయన ముఖ్యులు. దేశమంతా పర్యటించి జాతీయభావాన్ని విస్తరించడంలో గాంధీజీ పాత్ర విస్మరించలేనిది. ఆయన పేరుమీద దేశంలో అనేక వాడలు, రహదారులు మొదలు మహానగరాలే వెలిశాయి. ఆయన విగ్రహాలు వీధివీధినా కనిపిస్తాయి. కానీ గాంధీకి శాసనవ్యవస్థకు ఎలాంటి సంబంధ మూ లేదు. అసలు ఆయనకు ఇప్పుడున్నరాజ్యాంగ వ్యవస్థ పట్ల గౌరవం కూడా లేదు. గాంధీ ఇప్పటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కంటే ధర్మకర్తల్లాంటి పాలకులుండే ఆదర్శవాద గ్రామ స్వరాజ్య నమూనాను కలగన్నాడు. గాంధీ గ్రామీణ వ్యవస్థలో పెత్తందారీ కర్రపెత్తనం ఉండాలనుకున్నాడు కానీ సార్వవూతిక ఓటింగును సమర్థించలేదు. 

ఆయన పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడ్డాడు. ప్రజాస్వామ్యం గ్రామంలో పెద్దమనుషులను ఎన్నుకుంటే, ఆ పెద్దమనుషులు పై స్థాయి పాలకులను ఎన్నుకోవాలని కోరుకున్నాడు. కానీ ఆ పెత్తందారీ వ్యవస్థను తుత్తునియలు చేసే సాధనంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని మలిచాడు. రాజ్యాంగం అమాలౌతున్నదా? లేదా అన్నది వేరే చర్చ కానీ ఇప్పటికీ ప్రభుత్వాలకు దిశా నిర్దేశం చేసి నడిపించేది రాజ్యాంగమే! రాజ్యాంగ రచన కోసం అంబేద్కర్ దాదాపు మూడేళ్ల తన విలువైన జీవిత కాలాన్ని వెచ్చించాడు. రాజ్యాంగ రచనా సంఘ సారథిగా ఆయన రాత్రింబవళ్ళు కృషి చేశారు. కానీ గాంధీ నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ వారసులమని చెప్పుకునే వారు ఇప్పుడు దాన్నొక చిత్తుకాగితంగా మార్చేశారు. అంబేద్కర్ శాసనం ఏ రూపంలో ఉన్నా దాన్ని ప్రజలకు అనుకూలంగా మలచాలని ప్రయత్నించాడు. పెత్తందారీ ధర్మకర్తలకంటే చట్టం, న్యాయం మాత్రమే ధర్మాన్ని నిలబెడుతుందని నమ్మాడు.

ముఖ్యంగా అప్పటి బ్రిటీష్ పాలకుల మీద తన ఒత్తిడిని పెంచి పాలనా వ్యవస్థను ప్రజాస్వామీకరించే ప్రయత్నం చేశాడు. బ్రిటీష్ పాలనాకాలంలో అప్పటి పాలకులకు ఈ దేశం గురించి, దేశంలోని ప్రజల సమస్యల గురించి, ప్రాథమిక అవసరాల గురించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి, చేయాల్సిన చట్టాల గురించి మొట్టమొదటిసారిగా సమక్షిగంగా నివేదించిన వారిలో అంబేద్కర్ ఆద్యుడు. అప్పట్లో భారతీయ పరిపాలనా వ్యవస్థను మానవీకరించాలని గానీ, రాజకీయ వ్యవస్థను ప్రజాస్వామీకరించాలని గానీ ఏ ఒక్కరూ ఆలోచించలేదు. ఆ మాటకొస్తే గాంధీ లండన్‌లో చదువు పూర్తిచేసుకుని తిరిగిరాగానే దేశం గురించి ఆలోచించలేదు. రాజ్‌కోట్ కోర్టులో ప్రాక్టీసు మొదలుపెట్టాడు. అది సరిగా నడవకపోయేసరికి దక్షిణావూఫికాలో గుజరాతీ షావుకార్ల తరఫున వాదించడానికి డర్బన్ వెళ్లి అక్కడే దాదాపు ఇరవై ఏళ్ళకు పైగా ప్రాక్టీసు చేస్తూ స్థిరపడ్డాడు. అంబేద్కర్ అలా చేయలేదు. దేశీయ పాలకుల సహాయంతో విదేశాలకు వెళ్లి చదువు పూర్తికాగానే తిరిగి వచ్చిన వెంటనే సామాజిక వ్యవస్థ ప్రక్షాళనకు నడుం కట్టాడు. అందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకున్నాడు. దాదాపు ఇరవయ్యేళ్ళ పాటు న్యాయవాదిగా, పాత్రికేయుడిగా, ప్రొఫెసర్‌గా ఉంటూ అనేక ఉద్యమాలను నిర్మించాడు. సమాజంలో పేరుకుపోయిన దురాచారాలను చట్టాలద్వారా రూపుమాపగలమని నమ్మాడు. అందుకోసం బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించి బ్రిటీష్ పాలకులను ఆలోచించే విధంగా చేశాడు. 

1919లో బ్రిటీష్ ప్రభుత్వం పాలనా సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన మాంట్-ఫోర్డ్ కమిటీ అంబేద్కర్‌ను సంప్రదించింది. కమిటీ ముందు ఆయన ప్రత్యేక నియోజకవర్గాలు, సార్వవూతిక ఓటింగ్ గురించే కాక భారతీయ సమాజంలో ఉన్న అసమానతలు, విద్యావకాశాల ఆవశ్యకత, సాంఘి క సంస్కరణలు, తేవాల్సిన శాసనాల గురించి సమక్షిగమైన నివేదిక అందించారు. భారత దేశానికి చట్టాలు చేసేముందు సమాజాన్ని అర్థం చేసుకోవాలన్న ప్రతిపాదన చేశారు. ఆ తరువాత 1925లో భారత దేశ ద్రవ్య వినిమయ విధానంలోని సమస్యలను అధ్యయనం చేయడానికి వచ్చిన రాయల్ కమిషన్ ముందు హాజరై తన ఆలోచనలు పంచుకున్నాడు. అప్పుడే ఆయ న ఉమ్మడి వ్యవసాయం, భూమిశిస్తు విధానం, భూసంస్కరణల గురించి ప్రతిపాదనలు చేశారు. అదే కాలంలో ఆయన బొంబాయిలో చట్టసభలో క్రియాశీల పాత్ర పోషించాడు. ఆ తరువాత చట్టబద్ధ పరిపాలనను అందించే రాజ్యాంగ నిర్మాణం కోసం 1928లో వచ్చిన సైమన్ కమిషన్‌ను బహిష్కరించాలని గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పిలుపునిచ్చింది.అప్పటికి కాంగెస్ స్వాతంత్య్రం కోసం తీర్మానం చేయలేదు. అయినప్పటికీ కమిషన్‌లో భారతీయులకు ప్రాతినిధ్యం లేదని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన లేవదీసింది. అంబేద్కర్ మాత్రం పూణెలో కమిషన్ ముందు హాజరై భారత దేశంలో రాజ్యాంగ వ్యవస్థ ఎలా ఉండాలో నివేదిక అందించారు. అందులో సార్వవూతిక ఓటు హక్కుతో పాటు, అస్పృశ్యులకు ప్రత్యేక ప్రాదేశిక నియోజక వర్గాల ప్రస్తావన ఒకటి. కమిషన్ అంబేద్కర్ సూచనలేవీ పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆయన లండన్‌లో నిర్వహించిన రెండు రౌండ్ సమావేశాలకు హాజరై తన వాదనలు వినిపించాడు.దాదాపు ఐదేళ్ళు పోరాడి అంబేద్కర్ కొద్దో గొప్పో అణగారిన వర్గాలను ప్రజాస్వామ్య శాసన నిర్మాణ వ్యవస్థలో భాగస్వాములను చేయాలని ప్రయత్నిస్తే గాంధీ దాన్ని అడ్డుకోవడానికి ఎరవాడ జైలులో నిరాహార దీక్షకు దిగి చివరకు ఆ అవకాశాలు అందకుండా చేశాడు. గాంధీజీకి తన మీద, తన నాయకత్వం, ఆలోచనల మీద ఉన్న నమ్మకం చట్టాల మీద ఎన్నడూ లేదు. అనేక సార్లు ఆయన శాసన బద్ధ పాలనను వ్యతిరేకించాడు. స్వయంగా శాసనాలను ఉల్లంఘించాడు. 

శాసనోల్లంఘనకు పిలుపునిచ్చాడు. 1922-42 మధ్యకాలంలో గాంధీ అనేక సార్లు చట్టాలను ఉల్లంఘించి జైలుకు వెళ్ళాడు. ఇదంతా స్వాతంత్య్రం కోసమే అని మనం సరిపెట్టుకోవచ్చు. కానీ చట్టం ముందర ఆయన మాత్రం దోషిగానే నిలబడ్డారు. ఇదే కాలంలో సమాజాన్నిమానవీకరించే ప్రయత్నం చేస్తూనే అంబేద్కర్ దేశంలో రాజ్యాంగబద్ధ పాలనకోసం, శాసన వ్యవస్థకోసం కృషి చేసారు. బ్రిటీష్ ప్రభుత్వం భారత దేశంలో రాజ్యాంగ సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా 1932-34 మధ్య కాలంలో విశేషమైన సేవలు అందించి, భారత దేశంలో ప్రజాస్వామిక పాలనకు బీజాలు వేశారు. అదే 1935లో భారత ప్రభుత్వ చట్టం పేరుతో భారత ప్రభుత్వ పాలనా వ్యవస్థకు స్వయంవూపతిపత్తి కల్పించి స్వతంత్ర అధికారాలను ఇచ్చింది. దేశంలో చట్టబద్ధ పాలనకు ఆస్కారం కలిగించింది. 1941 లో బ్రిటిష్ ప్రభుత్వంలో రక్షణ సలహా మండలి సభ్యుడిగా, వైస్రాయ్ కౌన్సిల్ లో లేబర్ మెంబర్‌గా ఆయన అనేక చట్టాలకు రూపకల్పన చేసారు. 

అంబేద్కర్ జీవితంలో ఎప్పుడూ విగ్రహాలను నమ్మలేదు. విగ్రహారాధననే వద్దనుకున్నాడు. కానీ తన విగ్రహాలే భవిష్యత్తులో చైతన్య ప్రతీకలుగా నిలబడతాయని, కోట్లాది మందిని ఆత్మగౌరవంతో నిలబెడతాయని ఊహిం చి ఉండడు. అంబేద్కర్ జీవితం, పోరాటం, ఆదర్శాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. అంబేద్కర్‌ను గుండెల్లో నిలుపుకోవడానికి, ఆయన ఆశయాలను చిరస్థాయిగా, సజీవంగా నిలబెట్టడానికి ఇప్పుడు దేశంలో కోట్లాది మంది సిద్ధంగా ఉన్నారు. అందులో తెలంగాణ ప్రజలు కూడా కులమతాలకు అతీతంగా ఆ జాబితాలో చేరిపోయారు. ఆయన విగ్రహాలు పార్లమెంటు మొదలు గ్రామ సచివాలయం దాకా అన్ని రాజ్యాంగ వ్యవస్థల ముందు ఉండాలని కోరుకోవడం న్యాయమయిందే.కానీ ఆ చట్టసభలే రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నాయి. చట్టవ్యతిరేక శక్తులకు, అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలయిపోతున్నాయి. వాటిముందు వేలెత్తి నిలదీసే అంబేద్కర్ లాంటి ఆదర్శ మూర్తి కంటే మౌనమువూదలో కూర్చుండే ఉత్సవ విగ్రహాలు ఉండడమే మంచిదేమో! 

పొఫెసర్ ఘంటా చక్రపాణి 
సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు 
ఈ మెయిల్ : ghantapatham@gmail.com

Namasete Telangana News Paper Dated : 27/04/2012 

Friday, April 13, 2012

తెలంగాణకు కొత్త ఫేస్‌బుక్ కావాలి!---పొఫెసర్ ఘంటా చక్రపాణి



మిమ్మల్ని మీరు దహించుకోకండి. 2014 వరకు ఆగండి, అప్పుడు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను కాల్చిపారేయవచ్చు’. ఇది తెలంగాణ విద్యార్థులకు హరిరాఘవ్ అనే ఒక యువకుడు ఫేస్‌బుక్ ద్వారా ఇచ్చిన సందేశం.ఇలాంటి సందేశాలు చూసినప్పుడు సోషల్ మీడియా మనకు చాలా మేలు చేస్తోందనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమానికి ఇదొక వారధిగా మారిపోయింది. చిన్న సంఘటన జరిగితే చాలు క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రసారమైపోతోంది. మరుక్షణం లక్షలాది గొంతులు ఒక్కటయి నినదిస్తున్నాయి. ఆవే శం, ఆవేదన, ఆలోచనల సమ్మిళిత సందేశాలు ప్రపంచం నలుమూలలనుంచి మనకు చేరిపోతాయి. ఇప్పుడు తెలంగాణవాదం ఈ గడ్డమీదే కాదు ప్రపంచంలో మనిషనేవాడు సంచరిస్తున్న ప్రతి దేశంలోనూ ప్రాణంతో ఉన్నందుకు ఆనందమేస్తుంది. భోజ్యానాయక్ ఆత్మహత్య పట్ల వీరాడ్డితండా తల్లడిల్లినట్టుగానే వీళ్ళంతా తల్లడిల్లారు. చావొద్దని సొంత తమ్ములకు చెప్పినట్టు చెప్పారు. కానీ తెలంగాణ రాకపోతే జీవితం లేదని మనమే కదా వాళ్లకు చెప్పాం. తెలంగాణ వాదాన్ని పదునెక్కించిన మాటలు, ఆటలు, పాటలు అదే కదా బోధించింది. అలా భయపడి, బెంగపడి కూడా చివరకు రెండేళ్ళు పోరాటంలో నడిచే కదా భోజ్యానాయక్ నడిరోడ్డుమీద నిప్పురవ్వై రగిలిపోయింది. ఒకరిని చూసి ఒకరు ఒక్కవారంలో ఏడుగురు అలా బలయిపోవడం తెలంగాణలో విషాదం నింపిం ది. అందరిలో ఆవేదన ఉన్నదే తప్ప ఆత్మహత్య ఆలోచనలో ఉన్న వారిని ఊరడించగలిగే ఉపాయమేదీ కనిపించలేదు. కానీ హరిరాఘవ్ సందేశం మాత్రం స్పష్టంగా ఒక పరిష్కారాన్ని చూపినట్టు కనిపించింది. హరి రాఘవ్ ఎవరో తెలియదు. ఫేస్‌బుక్ స్టేటస్ ప్రకారం హైదరాబాద్‌లో ఉండే సైకాలజిస్ట్. భోజ్యానాయక్ సజీవదహనం తరువాత ఆత్మహత్యలకు వ్యతిరేకంగా అనేక విధాలుగా ఆయన స్పందించారు. అనేక పోస్టర్లు తయారు చేశారు. కవితలు, పాటలు పోస్ట్ చేశారు. ఆత్మహత్యలకు కారణాలు విశ్లేషిస్తూ, చనిపోవడం వల్ల కలిగే నష్టాలు ఏకరువు పెట్టారు. హరిరాఘవ్ లాగే నిశాంత్ దొంగారి, సమత, పాండు, మహి ఇట్లా అనేకమంది స్పందించారు. ఎవ్వరూ నిరాశ పడ 2014 దాకా ఆగుదామనే అంటున్నారు. 

తెలంగాణ సాధనకు ఒకే ఒక మార్గం పార్లమెంటులో బిల్లు పెట్టడం. కచ్చితంగా అది రాజకీయపార్టీల ద్వారానే సాధ్యం. అలాంటప్పుడు ఆత్మాహుతుల వల్ల ప్రయోజనం ఏముంది? ఇది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఏర్పాటు 2014దాకా సాధ్యం కాదని, అప్పటిదాకా ఉద్యమాలు అక్కరలేదని కాదు. ఇప్పుడున్న పరిస్థితు ల్లో తెలంగాణ ఎప్పుడైనా ఏర్పడవచ్చు. ఎప్పుడనేది తేల్చాల్సింది ప్రభుత్వం కాదు, ఉద్యమం. మరోసారి ఉద్యమం ఉవ్వెత్తున లేస్తే ప్రభుత్వం దిగి వస్తుంది.ఇప్పుడిప్పుడేసాధ్యపడకపోయినా 2014 నుంచి ఎవరూ తప్పించుకునే వీలులేదు. అలా వీలులేని స్థితిని సృష్టించాల్సిన బాధ్యత ఉద్యమాని ది. ప్రజలను దహించి వేస్తోన్న భావోద్వేగాలను చల్లార్చకుండా ఆత్మహత్యలు ఆగాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. కాబట్టి ఆ దిశగా ఉద్యమ కార్యాచరణ ఉండాలి. ఉద్యమం ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్‌పార్టీ టార్గెట్‌గా సాగా లి. కాంగ్రెస్ నేతలు- తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరి పాత్రను వాళ్ళు రక్తికట్టిస్తున్నారు. తెలంగాణవాదులుగా చెలామణీ అవుతూనే పార్టీలో, పదవిలో కొనసాగుతున్నారు. వీళ్ళ నాటకానికి తెరపడాలంటే ఉద్యమం బరిగీసి నిలబడాలి. ఉద్యమంతో నిలబడేవారే తెలంగాణవాదులని మిగిలిన వారంతా ద్రోహులేనని ప్రకటించాలి. ఇది చేయకపోతే కాంగ్రెస్‌లో తెలంగాణవాదులని చెప్పుకునేవాళ్ళు రోజొకరి ఇంట్లో టిఫిన్ కో, భోజనానికో కలుస్తారు. అది తెలంగాణ కోసమే అని నమ్మబలుకుతారు. వారానికో గుంపు ఢిల్లీ వెళ్లి పైరవీలు చేసుకుని వస్తుంది. అధిష్ఠానంతోనో, అమ్మతోనో మాట్లాడామని చెబుతారు. నెలా రోజుల్లో అని ఒకడంటే, వారమే అని ఇంకొక డు వాగుతుంటారు. ఏ పదవిలోలేని వాడు ఇప్పుడే తెలంగాణ రాదని కుండ బద్దలుకొడతాడు. ఇది ప్రజల మీద, మరీ ముఖ్యంగా తెలంగాణ కోసం పడి చచ్చే అమాయక జనాల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఈ పరిస్థితులను అనుకూలంగా మలచుకోవడానికి కాంగ్రెస్ స్థానికసంస్థల ఎన్నికలను తెరమీదికి తెస్తోంది. తెలంగాణలో టీడీపీ నామరూపాలు లేకుండాపోయిన పరిస్థితులను అవకాశంగా తీసుకొని పార్టీని పటిష్ట పరచుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ నేత లను నిలదీయడానికి ఇంతకు మించి సమయం ఇంకొకటి ఉండదు. ఇది ఉద్య మం నీరుగారిందనో, తెలంగాణ రాదనో దిగులుపడే వారికొక ధైర్యాన్ని ఇస్తుంది. 

ఇక రెండోది ఉద్యమం ఒక దీర్ఘకాలిక ప్రక్రియ అని ప్రజలు అర్థం చేసుకోవా లి. జేఏసీలు, రాజకీయ పార్టీలు ఈ విషయం స్పష్టంగా చెప్పాలి. 2014 ను అంతిమ గడువుగా ప్రకటించాలి. తెలంగాణ ఉద్యమం ఒక ప్రవాహంలా కదల డం లేదు. అలల లాగా ఎగిసిపడుతోంది. అలల్లో అలా పైకి లేచిన వాళ్ళు ఒక్కసారిగా మళ్ళీ కుప్పకూలే సరికి తట్టుకోలేకపోతున్నారు. ఆ ఉద్వేగ ఉత్థాన పతనాలు సామాన్యులను కలతకు గురిచేస్తున్నాయి కాసేపు పరుగెత్తడం, అంతకు రెట్టింపు సమయం విశ్రమించడం వల్ల గమ్యం చేరుతామా లేదా అనే అయోమ యం సహజం. కాబట్టి ఉద్యమం నడక నేర్చుకోవాలి. ఆ నడకకు ఒక గమ్యం ఉండాలి. ఆ గమ్యం 2014 అని స్పష్టం చేసుకోవాలి. ఆలోపు వస్తే సంతోషం. రాకపోతే అదే అంతిమ సమరం అని అర్థం చేయించాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు మినహా వేరే అవకాశాలు ఉండవు. కాబట్టి ఎన్నికలు సృష్టించడమో, ఎన్నికల సమయం దాకా ఆగడమో చేయాలి. ఎవరినీ రాజీనామా చేయాలని అడగక్కరలేదు. వాళ్లకు వాళ్ళుగా రాజీనామా చేసే పరిస్థితులు కల్పించాలి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తలుచుకుంటే ఒక్క నెలలో తెలంగాణ ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఉన్న దివాలా పరిస్థితుల్లో అది మరీ సులభం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు,మంత్రులు ఇరవైమంది రాజీనామా చేస్తే చాలు. అందరూ ఒకేసారి చేస్తే భావోద్వేగాలని స్పీకర్ అడ్డు చెప్పవచ్చు. కాబట్టి రోజుకొకరు-రాజీనామా చేస్తే తెలంగాణ ఏర్పా టు ప్రక్రియ మొదలుపెట్టడానికి పదిరోజుల సమయం చాలు. అంటే ఇన్ని చావు లు లేకుండా ఒక్క నెలలో తెలంగాణ తెచ్చే శక్తి కాంగ్రెస్ నేతలకు ఉంది. ఉద్యమం చేయాల్సిందల్లా వాళ్లు తలవంచే పరిస్థితి సృష్టించడం. వాళ్ళ రాజీనామాలు కోరుతూ కోదండరామ్ ప్రకటనలు చేయడం కాదు. అలా చేస్తే కోదండరామ్ టీఆర్‌ఎస్ తొత్తు అనో, బీజేపీ బంటు అనో ప్రచారం చేస్తారు. కాబట్టి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఉద్యమం ద్వారా కల్పించాలి. 

ఇవన్నీ సాధ్యపడాలంటే తెలంగాణకు ఒక నిజమైన ఫేస్‌బుక్ కావాలి. జనం లో ఒకరినుంచి ఒకరికి అల్లుకుపోగలిగే సోషల్‌నెట్ కావాలి. అది జేఏసీ పునర్‌వ్యవస్థీకరణతోనే సాధ్యమౌతుంది. ఇప్పుడున్న జేఏసీలో ఎన్నికల రాజకీయాల కు అతీతంగా ఉద్యమంకోసం ఉన్న సంఘాలు, సంస్థలు ఇరవైకి పైగానే ఉన్నా యి. వాటితో పాటు బయట ఉంటూ తెలంగాణకోసం నిజాయితీగా పనిచేస్తున్న పౌరసమాజంతో జేఏసీ ఏర్పడాలి. ఇప్పుడు జేఏసీకి ఊరూరా ప్రతినిధులున్నా రు. అలా లేనిచోట ఉద్యోగులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులు, విద్యావంతులు, విద్యార్థులు ఎవరో ఒకరున్నారు. ఎవరూలేనిచోట సామాన్య ప్రజలున్నారు. అంతాకలిస్తే తెలంగాణకు అతిపెద్ద సోషల్ నెట్ వర్క్ అయి తీరుతుంది. ఒక స్వతంత్ర సంస్థగా జేఏసీ నిలబడుతుంది. ఉద్యమాన్ని రాజకీయ అవసరాలకు అనుగుణంగా కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడిపించవచ్చు. ఇందుకోసం ముందుగా ఇప్పుడున్న జేఏసీ పూర్తిగా ప్రక్షాళన జరగాలి. మహబూబ్‌నగ ర్ ఎన్నికల ఫలితం తరువాత జేఏసీ విశ్వసనీయత సన్నగిల్లినట్టు కనిపిస్తోంది. పరస్పర విరుద్ధమైన ఎజెండాలతో ఉన్న టీఆర్‌ఎస్, బీజేపీలు ఒకే రాజకీయ జేఏసీలో ఉండడం విస్మయం కలిగించే విష యం. రాజకీయ జేఏసీకి రాజకీయ ఎజెండా ఉండాలి. ప్రణాళికా ఉండాలి. కానీ ఇప్పుడు జేఏసీలో అటు ఐక్యతా ఇటు కార్యాచరణ రెండూ కనిపించడం లేదు. ఇరవైనాలుగు పుల్లల గొడుగుగా జేఏసీ విస్తరిస్తే రాజకీయపార్టీలు ఆ గొడుగు కింద తలదాచుకుంటున్నాయి. అదికూడా ఎన్నికల దాకే! ఆ తరువాత ఎవరిదారి వారిదే అంటున్నా యి. ఎన్నికల దాకా జాయింట్‌గా ఉంటాం ఎన్నికల్లో ఎవరి యాక్షన్ వాళ్ళది అంటే ప్రజలకు నిజంగానే పిచ్చెక్కుతుంది. టీఆర్‌ఎస్, బీజేపీ నిన్న ఎన్నికల్లో ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకున్నారు. రేపు పరకాల కోసం ఎవరి వలలు వాళ్ళు భుజాన వేసుకుని తిరుగుతున్నారు. వాళ్ళు ఉమ్మడిగా ఉద్యమాన్ని నడిపించడం వీలయ్యే పనికాదు. రాజకీయ అవసరాల రీత్యా కూడా అది అనైతికమే. రాజకీయ జేఏసీ చైర్మన్‌గా ఒకే ఒరలో రెండు కత్తులు పెట్టుకుని యుద్ధం చేస్తానంటే కోదండరామ్‌ను ఎవరూ నమ్మరు. జేఏసీ ఆ నమ్మకాన్ని పోగొట్టుకుం మొత్తం తెలంగాణ ఉద్యమానికే నష్టం. ఆ నష్టం ప్రజల ఆత్మస్థైర్యాన్ని మరింత దెబ్బదీసే ప్రమాదం ఉంది. ఏకాభివూపాయంలేని రాజకీయ పార్టీలు జేఏసీకి అనుగుణంగా నడుచుకోవడమో లేక జేఏసీ వారిని వదిలించుకోవడమో తప్పనిసరి. అలాగని రాజకీయ పార్టీలను దూరం చేసుకోవాలని కాదు. వాళ్ళనూ కొద్దిరోజు లు స్వతంవూతంగా ఎవరిసత్తా ఏమిటో నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చి చూస్తే తప్పేమీ లేదు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అన్ని సీట్లూ మావే అని బీరా లు పలుకుతున్న కొన్ని పార్టీలకు చాలా గ్రామాల్లో, మండలాల్లో పార్టీ శాఖలు కూడాలేవు. ఈ రకంగానైనా వాళ్ళు వారి పార్టీల పునాదులను పటిష్టం చేసుకుంటారు. రెండేళ్ళ సమయం ఇచ్చి ఈ రెండేళ్లలో ఎవరు ఎవరివైపో తేల్చి 2014లో ప్రజల పక్షానలేని పార్టీలను నిజంగానే కుప్పవేసి కాల్చి పడేయవచ్చు. ఆ అవకా శం తప్పక వస్తుంది. అప్పటిదాకా ఎవరూ కాలిపోవద్దనే కోరుకుందాం. 

పొఫెసర్ ఘంటా చక్రపాణి 
రచయిత సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు 
ఈ మెయిల్: ghantapatham@gmail.co

Namasete Telangana News Paper Dated : 14/04/2012 

Thursday, March 29, 2012

ఆ ‘ఆత్మ’లను అర్థం చేసుకున్నారా?!---పొఫెసర్ ఘంటా చక్రపాణి



వరుస ఆత్మహత్యలతో మళ్ళీ తెలంగాణ అల్లకల్లోలమయింది. వరంగల్ నడి బొడ్డున భోజ్యానాయక్ వంటి ఉన్నత విద్యావంతుడు నిట్టనిలువునా కాలిపోయాడు. ఆ జ్వాలలు ఆరిపోకముందే మరో రాజమౌళి మంటల్లో మాడిపోయాడు. ఆ వెంటనే ఉప్పలయ్య... ఇలా వరుసగా రాలిపోతూనే ఉన్నారు. రాజకీయపార్టీలు, పాలకవర్గాలు చేస్తున్న మోసం భరించలేక తెలంగాణలో ఇప్పుడు అందరి గుండెలూ ఆవేదనతో రగిలిపోతున్నాయి. ఆ చావులు చూసినప్పుడు చలించిపోవడం, దుఃఖించడం మినహా వాటిని ఆపలేని నిస్సహాయతలో ఇప్పుడు తెలంగాణ సమాజం మిగిలిపోయింది. ‘సమస్య ఏదైనా, ఎంత క్లిష్టమైనదైనా చావుద్వారా పరిష్కరించడం కుదరదు. చనిపోవడమంటే సమస్యనుంచి పారిపోవడమే! ఆత్మహత్య అటువంటి పిరికితనానికి ప్రతీక లాంటిద’ని ఆత్మహత్యలను ఒక వ్యక్తిగత సమస్యగా చూసేవాళ్ళు చెప్పే మాటలివి. నిజమే సమస్య వ్యక్తిగతమైనది అయినప్పుడు ఆ సమస్యనుంచి తప్పించుకోవడానికి చనిపోవడం ఒక వైయక్తిక పరిష్కారంగా పరిగణిస్తారు. ఇక్కడ సమస్య వ్యక్తిగతమైనది కాదు. చనిపోతున్నవాళ్ళు కూడా తమ వ్యక్తిగత ఆకాంక్షల కోసం ఆత్మహత్యను ఎంచుకోవడం లేదు. తెలంగాణ ఒక విస్తృత సామాజి క ఆకాంక్ష. రాష్ట్ర సాధన అనేది తమ వ్యక్తిగత అవసరాలకంటే ఎక్కువ ప్రధానమైనదిగా భావిస్తున్నవాళ్లు, తమ సమస్యలకు ఒక పరిష్కారంగా నమ్మేవాళ్లు.. ఇంతకాలం అన్నిరకాల ప్రజాస్వామ్య మార్గాల ద్వారా తమ ఆకాంక్షను వ్యక్తపరిచారు. ఏళ్ళతరబడి జీవితం అంటేనే పోరాటమని చాటి చెప్పా రు. ఎవరినుంచీ ఎటువంటి హామీ రాక ఇప్పుడు ఆ త్మాహుతులకు ఒడిగడుతున్నారు. ఆత్మహత్యలు పరిష్కారం కాద ని పోరాడితేనే తెలంగాణ వస్తుందని ఉద్యమకారులే చెప్పడం వాళ్లకు విసుగుపుట్టిస్తోంది. ఉద్యమం ద్వారా కూడా తెలంగాణ ఎం దుకు రాలేదన్న వాళ్ళ ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. సమాజంలో ఒక ప్రశ్నకు సమాధానం దొరకడం లేదంటే ఆ సమాజం చచ్చినట్టే లెక్క! అదే ఇవాళ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. 

తామర తంపరల్లా ఇవాళ తెలంగాణ నిండా ఉద్యమసంస్థలు, పిడి బాకుల్లాంటి ‘జాక్’లు చాలానే పుట్టుకొచ్చాయి. ఆశ్చర్యకరంగా అందరూ రెండు మూడేళ్ళుగా వేరే పనిలేకుండా ఉద్యమమే ఊపిరిగా ఊరూరా తిరుగుతూనే ఉన్నారు. ధూమ్ ధామ్‌లతో మొదలై, మీటింగులు, యాత్రలు, గర్జనలు ఒక్కోరోజు ఒక్కో జిల్లాలో ఏదో ఒక ఉద్యమసంస్థ తన కార్యక్షికమాలను కొనసాగిస్తూనే ఉంది. మరోవైపు తెలంగాణ ప్రజానీకం ఒక సంఘటితశక్తిగా నిలబడింది. రెండేళ్లకు పైగా మునిగాళ్ళ మీద నిలబడే పోరాడుతోంది. ఆ ప్రజానీకానికి తెలంగాణ వచ్చి తీరుతుందన్న విశ్వాసాన్ని ఏ ఒక్క సంస్థా ఎందుకు కల్పించలేకపోయిందన్నది అర్థం కాని ప్రశ్న! మీరే ఒక్కసారి గమనించండి. ఒక సంస్థ ఎన్నికలు, ప్రజాస్వామ్యంలో విశ్వాసాల ప్రకటనకు, రాజకీయ అభివూపాయాల వ్యక్తీకరణకు ఒక అవకాశంగా చూస్తోంది. ఆ సంస్థ తెలంగాణవాదుల్ని గెలిపించడం ద్వారా వాదాన్ని వినిపించాలని అంటుం ది. మరో సంస్థ ఎన్నికలతో తెలంగాణ రాదని ఉద్యమాల ద్వారానే అది సాధ్యమని, కాబట్టి అందర్నీ ఓడించాలని పిలుపునిస్తున్నది. ఇంకొకరు ఆర్థికమూలాలను దెబ్బతీస్తే తప్ప తెలంగాణ రాదని చెప్తున్నారు. ఒకరు రాస్తారోకో అంటే, మరొకరు రైల్‌రోకో అంటున్నప్పుడు ఏమనాలో తెలియక ఇంకొకరు విమానాల రోకో అనడం కూడా ప్రజలు చూశారు. ఉద్యమాల పేరుమీద ఎవరి మనుగడ కోసం వాళ్ళు పరస్పర విరుద్ధంగా మాట్లాడుకోవడం తప్ప ఐక్య కార్యాచరణ లేకపోవడానికి కారణాలు వెతకాలి. 

ఎప్పుడైనా సరే సైద్ధాంతిక, పరస్పర విరుద్ధ రాజకీయ అభివూపాయాలు ఉన్నప్పుడు ఆ సంస్థలు కలిసి పనిచేయడానికి జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్)లు ఏర్పడతాయి. కానీ తెలంగాణలో ఇప్పుడు కేంద్రస్థాయిలో కనీ సం డజను జాక్‌లు ఒక్కో విభాగంలో, రంగంలో అరడజను, ఒక్క జిల్లా లో వందలు మొత్తంగా తెలంగాణ ఉద్యమంలో వేలాదిగా జాకులు పుట్టా యి. ఇవన్నీ ఏం చేస్తున్నాయన్నది అర్థంకాని ప్రశ్న. ఈ ప్రశ్న ఎందుకు వస్తోందంటే ఇలాంటి ఆత్మాహుతులు జరిగినప్పుడు అందరూ ‘ఆత్మహత్యలు పరిష్కారం కాదు పోరాటమే మా ర్గం’ అని గంభీరమైన సంతాప సందేశాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ‘పోరాడాలి’ అని పిలుపునిస్తోన్న మీరేం చేస్తున్నారు? ప్రజలు పోరాడడం లేదని, ఉద్యమాల్లో లేరని ఎందుకు అనుకుంటున్నారు? పిలుపులు ఎవరైనా ఇవ్వగలరు. ఎవ రు ఆచరించాలి, ఎవరు జన సమీకరణ చేయాలి, ఎవరు పోరాడాలి, ఎవరు ఎవరి ఆర్థిక మూలాలను కనిపెట్టాలి, ఎవరు వాటిని దెబ్బకొట్టాలి? ఇవన్నీ నాయకత్వ స్థానంలో ఉన్న మీరే నిర్ణయించాలి. 

ఉద్యమం ఎలా ఉండాలో నిర్దేశించి నడిపించాలి. భోజ్యానాయక్ రెండున్నరేళ్లుగా అందరు తెలంగాణ విద్యార్థుల్లాగే ఉద్యమాల్లోనే ఉన్నాడు. రాజమౌళి తన ప్రాణంపోయే రోజుదాకా ఉద్యమాల్లోనే గడిపాడు. చివరగా ఆయన భోజ్యానాయక్ అంత్యక్షికియల్లో కూడా పాల్గొన్నాడు. అటువంటి ఉద్యమకారుల చావుల సందర్భం గా సంతాపం చెప్పేటప్పుడు ఇంకా పోరాడాలి అంటే ఈ జాకులను, మూకలను ఎలా అర్థం చేసుకోవాలి?! అసలు పోరాటం అంటే ఏమిటి? అన్ని పోరాట రూపాలను అద్భుతంగా ప్రయోగించిన తరువాత కూడా ఇంకా పోరాడాలంటే ఎలా? అదీ పోరాట వేదికలు నడిపిస్తోన్న నాయకులు, ఉద్యమకారులు అంటే ఏమని అర్థం? బహుశా ఇది అర్థం కాకే ‘భోజ్యా.. అంద రూ వస్తున్నారు, తెలంగాణ తెస్తమంటున్నారు..ఇంకెప్పుడు తెస్తారు?’ అన్న ప్రశ్నను తన ప్రాణం పోయేదాకా అడుగుతూనే ఉన్నాడు. దానికి ఎవరైనా సరే సమాధానం చెప్పగలరా? ఆ సమాధానం దొరకకే ఇవాళ అనేకమంది సమిధలై పోతున్నారు. ఈ సంఘాలు, సంస్థలు, జాకులు అన్నీ ఒకే గొడు గు కిందికి ఎందుకు రావడం లేదు? ఒకే ఉద్యమం, ఒకే ఉధృతి ఎందుకు లేదు? ఎవరి మనుగడ, ఎవరి ఉనికి, ఎవరి స్వార్థం వారిది. ఇటువంటి రాజకీయాలు, ఎత్తుగడలు రాజకీయ పార్టీలకు ఉంటాయి. 

కానీ కేవలం తెలంగాణ సాధన ఒక్కటే లక్ష్యం అని చెపుతున్న వారిలో ఈ వైరుధ్యాలు ఎందుకో సమాధానం దొరకదు. నాకు తెలిసినంత వరకు కోదండరామ్ నేతృత్వంలో ఉన్న రాజకీయ జేఏసీ ఒక విశాల వేదిక. బీజేపీనో, టీఆర్‌ఎస్‌నో మహబూబ్‌నగర్లో పోటీ చేయకుండా ఒప్పించడంలో కోదండరామ్ విఫలమై ఉండవచ్చు. కానీ గడిచిన పదేళ్లుగా విద్యావంతుల వేదిక నిర్మించడంలో, రెండేళ్లకుపైగా తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టడంలో ఆయనదే కీలక భూమిక. అటు హిందూ ఛాందసులు అన్న ముద్రపడ్డ బీజేపీని, ఇటు వారికి ఆగర్భ శత్రువులమని చెప్పుకునే నక్సలైటుపార్టీ మిత్రులతో సహవా సం చేయించిన వ్యక్తి అతను. ఆశ్చర్యంగా ఆయనతో, ఆయన రాజకీయ అభివూపాయాలతో చాలాకాలం ఊరేగిన వాళ్ళే ఇవాళ ఆయనకు పోటీగా కుంపట్లు వెలిగించుకుంటున్నారు. వీలయినప్పుడు తెలుగుదేశంపార్టీకి జెండాలు ఊపి, అవకాశం దొరికితే కాంగ్రెస్‌కు కండువాలు కప్పి, కుదిరితే కేసీఆర్‌తో ‘టీ’ ని, కాదంటే కిషన్‌డ్డితో కప్పు ‘కాఫీ’ని తాగేవాళ్ళు ఇప్పుడు సంఘటిత పోరాటాల గురించి, సమైక్య కార్యాచరణ గురించి మాట్లాడుతున్నారు. అంతేతప్ప రెండేళ్లుగా అది ఎందుకు సాధ్యపడలేదో ఆలోచించాలి. అది జరిగి ఉంటే నిజంగానే తెలంగాణ ప్రజలకు ధైర్యం ఇచ్చిన వాళ్ళు అయ్యేవాళ్ళు. తెలంగాణవాదుల్లోని ఈ అనైక్యతే ఇప్పుడు రాజకీయపార్టీల ఐక్యతకు ఆయిష్షు పోస్తున్నది. ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ పక్షం వాళ్లైనా, ఏ కులానికి చెందిన వాళ్లైనా తెలంగాణ వ్యతిరేకులంతా సంఘటితంగానే ఉన్నారు. కానీ ఒకే ప్రాంతానికి చెంది, ఒకే నినాదం అన్న వాళ్ళే వేయిగొంతుకలతో మాట్లాడుతున్నారు. అసలు పోరాటం వదిలేసి ఒకరిమీద ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. ఉద్యమకారులే ఉద్యమం వదిలేసి అసలు ఉద్యమం ఎలా ఉండాలో లెక్చర్లు దంచుతున్నారు. ఉద్యమాల ద్వారానే తెలంగాణ వస్తుంది. 


నిజమే! ఆ ఆశతోనే సకల జనులు సమైక్యంగా పోరాడుతున్నారు. అలాంటి పోరాటాలు పతాకస్థాయి కి చేరిన ప్రతిదశలో అడ్డంగా మాట్లాడి అడ్డు తగిలిన ఉద్యమకారులూ తెలంగాణలో ఉన్నారు. అసలిప్పుడు తెలంగాణే వద్దు అంటున్న మేధావులు కూడా తమ వాదనలు వినిపిస్తున్నారు. ఇది అయోమయానికి కారణం అవుతోంది. అది అర్థం కాకపోవడంవల్లే ఇవాళ అమాయకుల గుండెల్లో అగ్గిమండుతోంది. అది ఆర్పాల్సిన బాధ్యత ముమ్మాటికీ ఉద్యమానిది, ఉద్యమ సంస్థలదే. ఉద్యమాలు నడిపిస్తున్న వారికే ఉద్యమ గతిమీద, గమనం మీద పట్టులేకపోతే ప్రజలకు కచ్చితంగా మిగిలేది అయోమయమే! ఆ అయోమయమే ఇప్పుడు అగ్నికీలల్లో ఆవిరైపోతున్నది. 

ఈ అనైక్యత, అయోమయాన్ని ఆసరా చేసుకుని రాజకీయపార్టీలు ఇప్పు డు కొత్త రాగం ఎత్తుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇంత జటి లం కావడానికి కారణమైన రాజకీయపార్టీల అధినేతలు కూడా ఇప్పుడు చావులకు సంతాపం చెపుతున్నారు. ఆత్మహత్యలకు కారణమైన వాళ్ళే చావు లు సమస్యలకు పరిష్కారం కాదని ఉపదేశాలిస్తున్నారు. ఇది వినడానికే విడ్డూరంగా ఉన్నది. ముఖ్యంగా కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు సమస్య పరిష్కారానికి ప్రయత్నించకుండా ఆత్మహత్యల గురించి మాట్లాడడం బాధ్య తారాహిత్యమే తప్ప ఇంకొకటి కాదు. చనిపోయిన వాళ్ళు, చనిపోతున్న వాళ్ళు పదే పదే వేడుకుంటున్నది తెలంగాణ సంక్షోభానికి పరిష్కారం చూపించాలని. ఆ పరిష్కారం చూపే బాధ్యత ఈ రెండు పార్టీల మీద ఉన్న ది. ముందుగా కిరణ్‌కుమార్ రెడ్డి తను ఇప్పటికి ఇంకా మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న సంగతి గమనించాలి. తెలంగాణ ఆత్మాహుతులు తన ప్రభుత్వ అసమర్థతకు, ఆ ప్రభుత్వానికి వెన్నెముక అయిన కాంగ్రెస్ పార్టీ చేతగానితనానికి నిదర్శనం అన్న సంగతి గుర్తించాలి. 2009 ఎన్నికలకు ముందు రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి రాజశేఖర్‌డ్డి తెలంగాణ రాష్ట్రా న్ని ఏర్పాటు చేస్తే ఈ శాసనసభకు అభ్యంతరం లేదని ప్రకటించారు. అప్పు డు కిరణ్ ప్రభుత్వ చీఫ్‌విప్‌గా ఆ ప్రకటనను రికార్డు చేశారు. 2009 డిసెంబర్ ఏడున శాసనసభా పక్షాల అఖిలపక్ష సమావేశం శాసనసభాపతిగా ఆయన నేతృత్వంలో జరిగింది. ఆ సమావేశం చేసిన ఏకక్షిగీవ తీర్మానం మేర కు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. 

అటు తీర్మానం పంపించి ఆ మరుసటి రోజే స్పీకర్‌గా సీమాంధ్ర శాసనసభ్యుల రాజీనామాలను ఆయనే తీసుకుని పరిస్థితి గంభీరంగా ఉన్నదని కేంద్రానికి నివేదించారు. ఆ గంభీరత చల్లారిన తరువాత తెలంగాణ ప్రక్రియ కొనసాగిస్తామని, అది చల్లార్చాల్సిన బాధ్యత రాష్ట్రంలోని రాజకీయ పార్టీలదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ కిరణ్‌మీద పెడుతూ ఆయనను ముఖ్యమంవూతిగా చేసింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకకే ఆత్మాహుతులతో ఆయన వైఖరి పట్ల నిరసన ప్రకటిస్తున్నారని ఎం దుకు అర్థం చేసుకోవడంలేదు. ఇప్పుడు ప్రభుత్వాధినేతగా ఈ చావులన్నిటికీ ఆయన బాధ్యత వహించి తీరాలి. విశ్వాసంతో ఉండండి అని చెప్పడం కాదు. అటువంటి విశ్వాసం కల్పించడం కోసం శాసన సభలో తీర్మానంచేసి పంపాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. అలాగే చంద్రబాబు కూడా బహుశా మొదటిసారిగా ఆత్మహత్యల మీద మాట్లాడారు. కానీ ఆయన మాటలను నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారా! తెలంగాణకు వ్యతిరేకం కాదని వేయిన్నొక రాగంలో చెపుతున్న బాబు తెలంగాణకు తమపార్టీ అనుకూలమని ఒకే ఒక ముక్క కేంద్రానికి రాసి ఉంటే ఈ సంక్షోభం ముదిరేది కాదు. ఎన్నికల్లో అనుకూలమని, ఆ తరువాత కానేకాదని తమకున్నది రెండు కళ్ళని, తనవాదం తటస్థమని మాటలు మారుస్తూ సంక్షోభానికి కారణమైన ఆ పార్టీ వైఖరిని ప్రజపూవరూ మరిచిపోలేదు. 

ఉద్యమాన్నే కాదు చివరకు ఆత్మహత్యల్లో అసువులు బాసిన వారిని కూడా అవహేళన చేసే విధంగా తెలంగాణ తెలుగుదేశం ఫోరం నేతలు మాట్లాడిన మాటలు ఇంకా ప్రజలకు వినిపిస్తూనే ఉన్నాయి. అదే నేతలు ఇప్పుడు చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటాం అంటున్నారు. అయ్యా! చనిపోయినవాళ్ళు మీరు ఆదుకోవాలని కోరుకోలేదు. మీ బాబు మారాలని కోరుకుంటూ ప్రాణం విడిచారు. మీకు సాధ్యమైతే ఆయనను మార్చండి. నిజంగానే చంద్రబాబు నాయుడు చనిపోతున్న యువకుల మనోభావాలు గౌరవిస్తే, ఇంకెవరూ చనిపోవద్దని కోరుకుంటే ప్రతిపక్ష నాయకుడిగా సభా తీర్మానానికి నోటీసు ఇవ్వాలి, లేదా కేంద్రానికి పార్టీ తరఫున లేఖ ఇవ్వాలి. ఇవేవీ చేయకుండా సంతాప ప్రకటనలతో చేతులు దులుపుకోవడం భావ్యం కాదు. ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్ళ మరణ వాంగ్మూలాలు మరొక్కసారి చదవండి. వాళ్ళ చివరి మాటలను మళ్ళీ వినండి. వాళ్ళ మాటల్లో నిరాశలేదు. నిస్పృహ లేదు. నిలు నిరసన ఉంది. నిలదీసే ప్రశ్నలున్నాయి. నిప్పును రాజేసినవాళ్ళు, మంట లు ఎగదోసినవాళ్ళు, తెలంగాణను రావణకాష్టం చేసినవాళ్ళు ఆత్మపరిశీల న చేసుకోండి. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఆ సమాధానాలు మాత్రమే మండిపోతున్న మనసులకు స్వాంతన చేకూరుస్తాయి. 

పొఫెసర్ ఘంటా చక్రపాణి 
రచయిత సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు 
ఈ మెయిల్: ghantapatham@gmail.co

Namasete Telangana News Paper Dated : 29/03/2012 

Thursday, March 8, 2012

ఈ విరామం ఇక చాలు...



చింత చచ్చినా పులుపు చావలేదన్న సామెతను గుర్తు చేస్తోంది కాంగ్రెస్ వైఖరి. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశాక కూడా ఆ పార్టీ తన స్థాయి గుర్తించకపోవడం విడ్డూ రం. ప్రతి పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటామని ప్రకటించినా, సోనియా ఏజెంట్లు మాత్రం ఇంకా తలబిరుసు మాటలే మాట్లాడుతున్నా రు. గులాంనబీ ఆజాద్‌నే తీసుకోండి. ఆయన తెలంగాణ ప్రజలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తెలంగాణ ఇచ్చే విషయం ఆలోచిస్తాడట. ఆయన కశ్మీర్ మఖ్యమంవూతిగా ఉన్న కాలంలో భూమి కేటాయింపు విషయంలో హిందూ ముస్లింల మధ్య వివాదాలు పెద్దవి చేసి శాసనసభలో అవిశ్వాసం పాలయ్యారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ పార్టీ పట్ల ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయే విధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఆజాద్ ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యం మరింత పెరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే తెలంగాణ విషయం తేల్చేస్తామని చెప్పిన ఆయన.. ఇప్పుడు తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రం ఇస్తామని అన్నట్టు వార్తలొస్తున్నాయి. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత ప్రతి ఏడాది ఏవో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తూనే ఉన్నా యి. సరిగ్గా ఏడాది కిందట పశ్చిమబెంగాల్ ఎన్నికలకు ముందు కూడా ఇదే కథ చెప్పింది. ఎన్నికలు అయిపోగానే తెలంగాణ ఇచ్చేస్తామని ఆ పార్టీ నేత లు ముక్తకం చెప్పారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న ఆజాద్ తెలంగాణ అంశాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని ఒకసారి డిసెంబర్ అని, దీపావళి అని.. హోలీదాకా లాక్కొచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజల ఛీత్కారానికి గురైనా ఇక్కడ ఎన్నికల్లో గెలిపించమని కోరడం, గెలిపిస్తే తెలంగాణ ఇస్తామని ఆశ చూపడం అవకాశవాదం తప్ప మరోటి కాదు. జాదూ చేయడంలో ఆజాద్‌ను మించిన వాళ్లు ఇంకొకరు కనిపించరు. ఆ జాదూ పార్టీ వరకో, పదవుల కోసమో అయితే పరవాలేదు. కానీ ప్రజాస్వామ్యంతో కూడా అదేస్థాయిలో పరాచికాలాడగల వ్యక్తి ఆయన. 
కేవలం మాయమాటలతో ప్రజలను మోసం చేస్తూ వస్తోన్న కాంగ్రెస్ పార్టీకి ఉత్తరవూపదేశ్‌తో సహా మిగిలిన రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, వాటి ఫలితాలు కనివిప్పు కలిగించాలి. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా ప్రకటించి ఫైనల్‌గా రాహుల్‌గాంధీని రాజును చేయాలని కలగన్న ది. ఆ పాచిక పారలేదు సరికదా ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది. ఈ ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా రెండేళ్ల తర్వాత రాబోయే పార్లమెంటు ఎన్నికలకు దేశవ్యాప్తంగా ఊపును తీసుకురావాలనుకున్న కాంగ్రెస్ ఆశలు పూర్తిగా చెదిరిపోయాయి. ఉత్తరవూపదేశ్ పరాజయం ఆ పార్టీని, రాహుల్ కూటమిని నైతికంగా కుంగదీసింది. అంతేకాదు మిత్రుల అలకలతో లుకలుకలాడుతున్న యూపీఏకు రానున్న రెండేళ్లు దినదిన గండంగా మారే పరిస్థితి కనిపిస్తున్నది. బీజేపీ పరిస్థితి కాంగ్రెస్‌కు భిన్నంగా లేదు. రాబోయే కాలంలో కేంద్రంలో అధికారం తమదేనని ఉత్సాహపడుతున్న ఆ పార్టీ మీద కూడా ఎన్నికల ఫలితాలు నీళ్లు చల్లినట్టే ఉన్నాయి. అయినప్పటికీ తామే అధికారంలోకి వస్తామని, తెలంగాణ తామే తెస్తామని ఆ పార్టీ తెగ ప్రచారం చేసుకుంటున్నది. ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు మహబూబ్‌నగర్ శాసనసభ ఉప ఎన్నికల్లో కూడా తమ అభ్యర్థిని రంగంలోకి దించి మిగతా అందరికంటే తామే మెరుగు అనే ప్రచారం చేస్తోంది. రాబోయే కాలంలో కొత్త రాజకీయ సమీకరణలు తెరమీదికి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు సమానంగా ఓటమిని పంచుకోవడం, స్థానిక అంశాల ఎజెండాతో ముందుకొచ్చిన ప్రాంతీయ పార్టీలు విజయం సాధించడం భవిష్యత్ రాజకీయ చిత్రపటంలో మార్పుకు సంకేతంగా భావించాలి. కేవలం పార్టీలకే కాదు, ప్రజా ఉద్యమాలకు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి కూడా ఈ ఎన్నికల ఫలితాల్లో నేర్చుకోదగిన పాఠాలు ఉన్నాయి.
ఒక రకంగా ఇవి తెలంగాణవాదానికి వ్యతిరేక ఫలితాలు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, బహుజన సమాజ్ పార్టీ మూడు ఓడిపోవడం తెలంగాణకే కాదు ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమాలకు కలిసి వచ్చే అంశం కాదు. ఈ మూడింటిలో ఏ ఒక్క పార్టీ యూపీలో గెలుపొందినా పరిస్థితులు వేరుగా ఉండేవి. స్థానిక రాజకీయ కూటములు, ప్రాంతీయ పార్టీలు బలపడితే అది ముమ్మాటికీ ఉప ప్రాంతీయ అస్తిత్వాలకు, ఉద్యమాలకు వ్యతిరేక సంకేతమే అవుతుంది. అదే సమయంలో ఇది జాతీయస్థాయిలో ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్న కాంగ్రెస్, బీజేపీలకు కలవరపెట్టే పరిణామం. ఆ కలవరపాటు తో పాటు 2014లో అధికారంపట్ల బెంగ కూడా ఈ పార్టీలో సహజం. అలాంటి సందర్భంలో ఉద్యమం ఉధృతమైతే తప్ప ఈ రెండు పార్టీలు తెలంగాణ విషయంలో నిలబడే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలే కాదు, పార్లమెంటు ఎన్నికలలోపు రానున్న ఏ ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. రెండేళ్లలో అనేక రాష్ట్రాలలో ఎన్నికలున్నా యి. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, హిమాచల్‌వూపదేశ్, మధ్యవూపదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరింత బలహీనపడే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్‌వూపదేశ్‌లలో కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీచే సూచనలే ఉన్నాయి. కర్ణాటకతో సహా మరికొన్ని చోట్ల బీజేపీకి అదే పరిస్థితి ఎదురుకానుంది. ఈ పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలు ఇచ్చిన మాటకు కట్టుబడతాయా అన్నది ప్రశ్న. బీజేపీ విషయాన్నే తీసుకుం దాం. ఆంధ్రవూపదేశ్‌లో బీజేపీ తెలంగాణ పాట పాడుతున్నా.. ఆ పార్టీ ఆచరణలో ద్వంద్వ నీతితోనే ఉన్నది.199లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసిన ఆ పార్టీ ఏడేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఆ అంశాన్ని తొక్కిపెట్టింది. ఆ నెపం టీడీపీ మీదకు నెట్టింది. 2014లో కూడా బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చే సూచనలు లేవు. చిన్న చితకా పార్టీల సహకారంతోనే అధికారంలోకి రావాలి. అలాంటప్పుడు తెలంగాణ కోసం కట్టుబడి ఉంటుందా అన్న సందేహాలు సహజం. పైగా ఇవాళ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్న తరుణంలో కూడా బీజేపీ వ్యూహాత్మకంగా జేఏసీలో ఉంది తప్ప తెలంగాణ కోసం రాజకీయ పోరాటం చేయలేదు. తెలంగాణవాదులంతా రాజీనామాలు చేసినప్పుడు కూడా ఆ పార్టీ రాజీనామాలకు ముందుకురాలేదు. ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జై తెలంగాణ అంటూ యాత్రలు చేయడం మినహా ఆ పార్టీ నిర్మించిన పోరాటం ఏదీ లేదు. అద్వానీ, సుష్మాస్వరాజ్ మొదలు కిషన్‌డ్డి దాకా బహిరంగ సభలు పెట్టి పార్టీని బలోపేతం చేసుకోవడానికి చూశారు. ఉద్యమ కాలంలో సాగిన వేధింపుల పైనగానీ, పెట్టిన కేసుల విషయంలో కానీ, సమ్మెలు, సహాయనిరాకరణల సందర్భంగా గానీ స్వతంత్ర కార్యక్షికమాలేవీ చేపట్టలేదు. త్వరలో జైఆంధ్ర అంటామన్నా, ఇప్పటివరకు ఆంధ్రాలో ఆమేరకు చేసిన ప్రయత్నాలేవీ కనిపించడం లేదు. ఆ లెక్కన చూసినప్పుడు సీపీఐ చాలా నయమనే చెప్పుకోవాలి. ఆ పార్టీ నేత నారాయణ ఏ ప్రాంతంలోనైనా ఒకే మాట మాట్లాడుతున్నాడు. ఎన్ని ఒత్తిడులున్నా ఉప ఎన్నికల్లో తెలంగాణవాదానికి మద్దతునిస్తామని స్పష్టమైన వైఖరితో ఉన్నారు. కానీ తెలంగాణవాడే అయి న కిషన్‌డ్డి మాత్రం వెంకయ్యనాయుడి కనుసన్నల్లో నడుస్తున్నాడన్న విమర్శలు ఆ పార్టీలోనే ఉన్నాయి. ఇప్పుడు మహబూబ్‌నగర్‌లో పోటీ కూడా ఆ పార్టీ సొంత ఎజండాలో భాగమే తప్ప తెలంగాణకోసం కాదని అర్థమవుతున్నది. పార్లమెంటులో ఒకరోజు మాట్లాడడం, బిల్లుపెడితే మద్దతు ఇస్తామనడం మాత్రమే తెలంగాణకోసం పోరాడుతున్నామని చెప్పడానికి సరిపోతామని అనుకుంటే పొరపాటు. ఆ పార్టీ జాతీయ ఎజెండాలో రాష్ట్రాల విభజన విషయంలో స్పష్టత ఉండాలి. అది ఇప్పటికైతే కొరవడింది.

ఇక కాంగ్రెస్ అవకాశవాదానికి అంతేలేదు. అయితే ఈ ఎన్నికలు, రాబో యే కాలంలో ఎదురయ్యే పరీక్షలు కాంగ్రెస్‌ను ఇంకా బలహీనపరుస్తాయి. ఒకచోట బలహీనపడుతున్నప్పుడు ఇంకొక చోట బలపడే ప్రయత్నాలు చేయడం ఆ పార్టీ మొదటినుంచీ చేసే పనే. యూపీఏ భాగస్వామ్యపక్షాలు దయతలిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకా మిగిలి ఉన్న రెండేళ్లు అధికారంలో ఉండే అవకాశాలు లేవు. ఇప్పటికే మహారాష్ట్రలో ఎదురవుతున్న పరాభవాలను పసిగట్టిన శరద్‌పవార్ కాంగ్రెస్ నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. మమతాబెనర్జీ ఎలాగైనా సరే కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకోవాలని చూస్తోంది. విధిలేని పరిస్థితుల్లో కరుణానిధి అన్ని అవమానాలు దిగమింగి యూపీఏ మీద పీకల దాకా కోపంతో ఉన్నారు. వీళ్లంతా ఎప్పుడైనా యూపీఏకు విడాకులు ఇవ్వొచ్చు. అదే జరిగితే మధ్యంతరం తప్పదు. లేదంటే మరో రెండేళ్ల పాటు ఇలాగేనెట్టుకురావాలి. ఈ స్థితిలో కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచే విధంగా తెలంగాణ ఉద్యమకారులు పావులు కదపాలి. కేంద్రంలో, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పరిస్థితి గాలిలో దీపంలా ఉన్నది. ఈ ఉపఎన్నికల్లో, రాబోయే 17 నియోజకవర్గాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైతే ఇక్కడి ప్రభుత్వం కుప్పకూలక తప్పదు. కాబట్టే ఉప ఎన్నికలు కీలకమని గుర్తించాలి. రాజకీయ పార్టీలు అధికారానికి దూరమవుతామన్న సంకేతాలు ఉంటే తప్ప ప్రజల మాట వినవు. ఇప్పుడు అది వినపడాలంటే ఆయా పార్టీలను ఓడించాలి. అయితే ఎవరిని గెలిపించాలి? గెలిపిస్తే గెలిచి న వాళ్లు తెలంగాణ తెచ్చారా? మళ్లీ గెలిపిస్తే ప్రజలకు ఒరిగేదేమిటి అనే ప్రశ్నలు అనేకం వస్తున్నాయి. నిజమే రాజీనామాలు కోరి, ఎన్నికలు అనివార్యం చేసిన ఉద్యమకారులు ఇప్పుడు చేతుపూత్తేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. తెలంగాణ తేలాల్సింది చట్టసభల్లోనే అంటున్నప్పుడు ఆ సభలకు ఎవరిని పంపాలో ప్రజలే తేల్చుకోవాలి. ఎన్నికల వల్ల తెలంగాణ రాదు, ఉద్యమాల వల్లే తెలంగాణ వస్తుందన్నది నిజం. కానీ ఆ ఉద్యమాలు ఎవరిమీద ఎవరు చేయాలి? ఎవరు నడిపించాలి? అనేది ఆలోచించాలి. తెలంగాణ విషయంలో ఎన్నికల పార్టీలు పుట్టడానికంటే చాలా కాలం ముందే ఉద్యమ సంస్థలు పుట్టాయి. తెలంగాణ కల నెరవేరకపోవడం వెనుక ఎన్నికల్లో లబ్ధిపొందుతున్న పార్టీలకు ఎంత బాధ్యత ఉందో ఆ పేరు మీద నడుస్తున్న ఉద్యమ సంస్థలకు కూడా అంతే బాధ్యత ఉంది. ఈ ఎన్నికలు ఉద్యమంలో వచ్చిన రాజీనామాల పర్యవసా నం అని మరిచిపోరాదు. ఎమ్మెల్యే లంతా రాజీనామా చేయాలని జేఏసీలు, తెలంగా ణ పౌర సంఘాలు, ఉద్యమ వేదికలు డిమాండ్ చేశాయని తెలిసిందే. దానికి తెలంగాణ శాసనసభ్యులు, పార్టీలు పెద్దగా స్పందించలేదు. అది ఆయా పార్టీల బలం కాదు. ముమ్మాటికీ ఉద్య మ బలహీనతే. ఆయా పార్టీలు చట్టసభల మీద ఒత్తిడి తేవడంలో విఫమయినట్టుగానే తెలంగాణ ఉద్యమం ఆయా పార్టీలను ప్రభావితం చేయడం లో విఫలం అయినట్టుగానే లెక్క. ఇట్లా ఎవరి లెక్కలు వాళ్లే వేసుకుంటూ పోవడం వల్లే తెలంగాణ ఉద్యమం ఎక్కడిగొంగడి అక్కడి లాగానే ఉన్నది. ఇప్పుడు కూడా అదే గొంగట్లో అన్ని రాజకీయ పార్టీలు ఓట్లు సీట్లు ఏరుకు ని పంచుకునే స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు లెక్కతప్పినా 2014లో చూసు కుందాం అని టీఆర్‌ఎస్ పదేపదే చెబుతున్న మాటలు కూడా ఎవరూ నమ్మే పరిస్థితులు లేవు. ఎందుకంటే 2014లో కాంగ్రెస్, బీజేపీ రెండూ నిర్ణాయకస్థితిలో లేకపోతే, ఒకవేళ ఉన్నా తెలంగాణలో వచ్చే పదో పదిహేనో పార్లమెంటు స్థానాలు వద్దనుకుంటే పరిస్థితి ఏమిటో ఆలోచించాలి. కేంద్రంలో, రాష్ట్రంలో రెండు మూడునెలల్లో రాజకీయ పరిస్థితుల్లో పెను మార్పులు రావచ్చు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ జేఏసీ రెండు కీలక నిర్ణయా లు తీసుకోవాలి. ఒకటి -ఎన్నికల కోసమే ఉద్యమంలో ఉన్న పార్టీల ప్రమే యం లేకుండా జేఏసీని పునర్వ్యవస్థీకరించడం. రెండోది- తక్షణమే స్వతం త్ర ప్రజా ఉద్యమాన్ని తదనుగుణమైన ప్రత్యక్ష కార్యాచరణను ప్రకటించ డం. ప్రజలు రాజకీయ పార్టీలకంటే జేఏసీ నాయకత్వాన్నే ఎక్కువగా నమ్ము తున్నారు. జేఏసీ పట్ల ఉన్న గౌరవం పార్టీలకు అస్సలు లేదని మహబూబ్‌నగర్ ఎన్నికల విషయంలో స్పష్టం అయింది. ప్రజలు, ఎన్నికల లాభ నష్టాలతో సంబంధంలేని రాజకీయ సంస్థలు, ప్రజా సంఘాలు, పౌరసమాజం ముఖ్యంగా విద్యార్థి, యువజన వృత్తి సంఘాలు తెలంగాణ ఉద్యమానికి కొత్త రూపాన్ని ఇవ్వాలి. సకల జనుల సమ్మె విరమణ సందర్భంగా అది విరామం మాత్రమే అన్నారు. ఇంకా ఆరాంగా అదే విరామ స్థితిలో ఉంటే రాజకీయ పరిణామాలు మొదటికే మోసం తేవచ్చు. ఏడాదిలోపే కొత్త కూటములు ఏర్పాటు కావచ్చు. మమత, చంద్రబాబు, నవీన్ పట్నాయక్, ములాయం వంటి నేతలు తెరమీదకు రాబోతున్నారు. వీళ్లెవరూ రాష్ట్రాల విభజనకు అనుకూలం కాదు. కాబట్టి ఈ లోగా విరామం నుంచి బయటపడి కాంగ్రెస్ మీద వత్తిడి పెంచడం తప్ప మరో మార్గం లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తరువాత తెలంగాణ విషయం తేల్చుతామని చెప్పిన వారికి ఎన్నికలు ముగిసిన సంగతి, అక్కడ ఓడిపోయిన సంగతి గుర్తుచేయాల్సిన బాధ్యత జేఏసీ మీద ఉంది. తెలంగాణను వెంటనే తేల్చకుండా ఇక్కడ అధికారంలో ఉండలేరని అర్థం చేయించాలి. 

పొఫెసర్ ఘంటా చక్రపాణి
సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ghantapatham@gmail.com

Namasete Telangana News Paper Dated : 09/03/2012 

Thursday, January 5, 2012

మనుషులా? మృగాలా!?



ఆంధ్రవూపదేశ్ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎంత సౌమ్యుడుగా కనిపిస్తారో అంతటి రాజకీయ చతురుడు. ప్రజల ఒత్తిడో, తెలంగాణ సాధన లక్ష్యమో లేక ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్న తపనో తెలియదు గానీ తెలంగాణ శాసనసభ్యులు పార్టీలకు అతీతంగా ఒకటికి రెండుసార్లు రాజీనామాలు చేసి నా వాటిని ఆమోదించకుండా తన విచక్షణను ఉపయోగించి రాజ్యాంగ సంక్షోభం రాకుండా చేయగలిగాడు. ప్రజల ఒత్తిడికి లొంగి, భావోద్వేగాల తో చేసిన రాజీనామాలు చెల్లవంటూ తీర్పు చెప్పారు. మూకుమ్మడిగా చేసే రాజీనామాలు ఆమోదించడం కుదరదని కూడా కుండబద్దలు కొట్టారు. అదే మహా భాగ్యమని మన శాసనసభ్యులంతా ఆయన చతురతకు ముగ్దులై ధన్యవాదాలు చెప్పుకున్నారు. ప్రజలు కూడా తమకు రాజీనామాలు కోరే హక్కు ఉండదేమోనన్న సంశయంలో పడిపోయారు. ప్రజాస్వామ్య మూల సూత్రం అదేనని, రాజ్యాంగం ప్రజలకు ఆ హక్కు ఇచ్చిందని ఎవరైనా వాదనకు దిగి ప్రజావూపతినిధులను రాజీనామాలకు ఒప్పించినా, ఆ రాజీనామాలను ఆమోదించాల్సిన పనిలేదని వారు తేల్చేశారు. ఈ నూతన ప్రజాస్వా మ్య సూత్రాన్ని 2009 డిసెంబర్‌లో స్పీకర్‌గా ఉన్న కిరణ్ కుమార్‌డ్డి గారు కనిపెట్టలేకపోయారు. తెలంగాణ ప్రకటన వచ్చిన రాత్రి ఇంకా తెల్లారక ముందే ఆయన అందరి రాజీనామాలు తీసుకున్నారు. అంతేకాదు అదేరోజు శాసనసభ్యులను పిలిపించుకుని వారి వాదన విన్నారు. ఆ వెంటనే ఆ సమాచారం ఢిల్లీ కి చేరవేశారు. ఇంకేముంది సీమాంధ్ర శాసనసభ్యులు తెలంగాణ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల భావోద్వేగాలకు లోనయ్యి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు, కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే మాట మార్చింది. అదే పని తెలంగాణ వాళ్ళు చేస్తే చెల్లకుండా ఎలాపోతుం ది?. ఏ రాజీనామాలయితే ఒక ప్రక్రియను అడ్డుకోవడానికి పనికి వచ్చాయో అవే రాజీనామాలు అదే ప్రక్రియను కొనసాగించడానికి ఎందుకు పనికి రాకుండా పోయా యి? స్పీకర్ సభా సంప్రదాయాల పరంపరను పాటించి వుంటే యిప్పటికి తెలంగాణ రాష్ట్ర పరిస్థితి తేలిపోయేది కదా? ఇలాంటి ప్రశ్నలు రాజ్యాంగ నిపుణులు అడిగినా సమాధానం చెప్పవలసిన అవసరం బహుశా స్పీకర్‌కు లేదేమో! కానీ సిడాం దురుపతి భాయి అడుగుతున్న ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పవలసిన బాధ్యత మాత్రం కచ్చితంగా నాదెండ్ల మనోహర్‌కు ఉన్నది. ఆంధ్రవూపదేశ్ శాసనసభ వన్యమృగ, పర్యావరణ కమిటీ చైర్మన్‌గా నాదెండ్ల మనోహర్‌ఆదిలాబాద్ జిల్లా లో గోండుల గుండెకాయ లాంటి జన్నారం ప్రాంతంలోని 90 చదరపు కిలోమీటర్ల అడవిని జాతీయ పులుల సంరక్షణ సంస్థకు రాసిచ్చారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించి జూన్ నెలాఖరులో ఈ ప్రతిపాదనను ఢిల్లీ కి పంపారు. ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వం ఆగష్టు నెలలో ఆమోదముద్ర వేసింది. 

పాలకులు ప్రజల మనోభావాలను పట్టించుకోకూదడనే సూత్రాన్ని ఆయన టైగర్ జోన్ విషయంలో కూడా పాటిస్తున్నట్టున్నారు. 41 గ్రామాల ప్రజలు మేం మా ఊరిని, ఈ అడవిని విడిచి బతకలేం అని మొత్తుకుంటు న్నా ఇప్పటికీ కనీసం గ్రామసభలు కూడా పెట్టకుండా, అక్కడి ఆదివాసుల మనోభావాలు తెలుసుకోకుండా వాళ్ళను తమ తల్లివేరు నుంచి వేరుచేసే పనిచేస్తున్నారు. ‘మాకు అంగీకారం లేకుండా తరతరాలుగా నివసిస్తోన్న మమ్మల్ని ఈ అడవి నుంచి తరిమేసే అధికారం సర్కారుకు ఎవరిచ్చారని’ దురుపతి భాయి ప్రశ్నిస్తున్నారు. ఆమెకు ఆయన సభాహక్కుల నోటీసు ఇవ్వలేరు. ఎందుకంటే ఆమె ఇప్పుడు తనకున్న హక్కులను గురించి అడుగుతున్నారు. అసెంబ్లీ కమిటీకి చైర్మన్ గా ఆయన తమకు మరణశాసనం రాయడం తగదని వేడుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ప్రశ్నతోనే వాళ్ళ తాతల కాలంలో కొమురం భీమ్ నిజాం సర్కార్ మీద తిరుగుబాటు చేశా రు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ చర్యతో గోండులు ఉద్యమ బాటపట్టారు. 

ఆదిలాబాద్‌లో పులుల పెంపక కేంద్రం పేరుతో ప్రభుత్వం ప్రజలను భయవూబాంతులను చేస్తున్న నేపథ్యంలో అక్కడి ఆదివాసుల మనోభావాలు తెలుసుకునే ఉద్దేశ్యంతో నేను మిత్రులు పిట్టల రవీందర్, శ్రీధర్ దేశ్‌పాండే కలిసి అలీ నగర్, దొంగపల్లి గ్రామాలకు వెళ్ళాం. మాకు జన్నారం మండలం అలిపూర్‌లో ఉండే దురుపతిభాయి తారసపడింది. ఆమె ఆ అడవిలోనే పుట్టింది. ఆ అడవినే కన్నతల్లిగా కాపాడుకుంటున్నది. అదే అడవిని నమ్ముకుని తమ కుటుంబానికి ఉన్న నాలుగెకరాలను సాగుచేసుకుని ఒకరికి చేయి సాచకుండా బతుకుతున్నారు. ఆమెకు అడవే ఒక అందమైన లోకం. ఇప్పు డు ఆ లోకంలో పులుల పేరుతో పాలకులు అలజడి రేపుతున్నారు. మా వెంట ఉన్న టీవీ కెమెరాలు, స్థానిక రిపోర్టర్లను చూసి మమ్మల్ని కూడా సర్కారోల్లు అనుకుని దురుపతి భాయి తన వాదన మొదలు పెట్టింది. ఈ అడివి మాది, ఈ అడివి పుట్టినప్పటి నుంచి మేమూ ఈ అడివిలో ఉన్న సమస్త జీవరాశులు కలిసే బతుకుతున్నాం. మమ్మల్ని ఇప్పుడు ఎందుకు వేరుచేస్తున్నారని నిలదీసింది. మీరు వెళ్ళిపోతే యిక్కడ పులులను పెంచుతారట అంటే యే! మేం అడివిలో ఉంటే పులులు పెరుగవా? ఇంతకాలం అవీ మాతోపాటు బతకలేదా అని అని ఎదురు ప్రశ్న వేసింది? టైగర్ జోన్ ఏర్పాటయితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే భావన అక్కడి గిరిజనేతరుల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా జన్నారం, ఉట్నూర్ ప్రాంతాల్లోని వ్యాపారులు, చదువుకున్న గిరిజనేతర యువకులు టూరిజం పెరుగుతుందని, వ్యాపార వాణిజ్యాలు పెరుగుతాయనే ప్రచారం చేస్తున్నారు. అటవీ అధికారులు అక్కడి ప్రజల్లో అటువంటి భ్రమలు ప్రచారం చేస్తున్నారు. ఆదివాసులు మాత్రం అదేమీ నమ్మడం లేదు సరికదా ఆ అడవినుంచి కదిలే ప్రశ్నేలేదని అంటున్నారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా తమ వూరికి వచ్చి ఒక్కొక్క కుటుంబానికి పదిలక్షల రూపాయలు ఇస్తామని చెప్పాడని, తమ పిల్లలకు పోలీసు ఉద్యోగం ఇస్తామన్నాడని ఆ ఉద్యోగమేదో ఇక్కడే ఉంటే ఎందుకివ్వరని దురుపతి భాయి ప్రశ్నిస్తోంది. మా వూరికి పక్కా రోడ్డు లేదు, బడి లేదు, కనీసం మంచినీళ్ళు లేవు. మా అడివి, వూరు, భూమి, జీవితం వదిలేసుకున్నాక డబ్బులతో ఏం చెయ్యమంటావ్ అని ఎదురు ప్రశ్న వేసింది. అయినా మనుషులను తరిమేసి మృగాలను పెంచడం అభివృద్ధి ఎలా అవుతుందని అడిగింది.

మన దేశంలో పులుల కోసం మనుషుల్ని తరిమేసిన ప్రతిసారీ ఇదే పాలకులకు ఇదే ప్రశ్న ఎదురయ్యింది. ఇలాంటి ఉద్యమాలే వచ్చాయి. కొన్ని జోన్‌లలో ఇప్పటికీ పులులూ ఆదివాసులు కలిసే జీవిస్తున్నారు. అయినా పులుల్ని పెంచి ఏం చేస్తారు? దాన్నొక సంపన్నుల విహార కేంద్రంగా మార్చివేస్తారు. ఇదొక్కటే కాదని దానికి ఇంకా పర్యావరణ పరమైన లాభాలున్నాయని చెప్పేవాళ్ళూ ఉన్నారు. ఇప్పుడు పాలకులు డబ్బుమాయలో ఉన్నా రు. మనుషుల్ని అడవులనుంచి తరిమేసి పులులను పెంచితే ప్రపంచ వన్యమృగ నిధి నుంచి డబ్బులొస్తాయి. పెట్టుబడిదారీ దేశాల మృగయా వినోదం కోసం ఏర్పడ్డ ఈ సంస్థ కోటానుకోట్ల రూపాయల పెట్టుబడితో వన్యమృగ, పర్యావరణ సంరక్షణ చేస్తోంది. అందులో భాగంగా పులులు పెంచే ప్రభుత్వాలకు డబ్బులు ఎరవేస్తోంది. ఈ డబ్బు అవసరంలేని అమెరికా, ఐరోపాలలోని దేశాలు పులులను ఎప్పుడో పలహారంచేసి నమిలి మింగేశాయి. అక్క డి సంపన్నులు ఇప్పుడు మిగిలి పోయిన వాటిని పెంపుడు కుక్కలకంటే హీనంగా మార్చి దొడ్లల్లో కట్టేసుకుంటున్నారు. ఇప్పుడు అవే దేశాలు ఆసియాలో మాత్రమే మిగిలి ఉన్న పులులను కాపాడాలంటూ గోల చేస్తున్నా యి. అలా చేస్తేనే చెట్లు మొలిచి అడవులు ఎదుగుతాయని, పచ్చదనం నిలబడుతుందని, వానలు కురుస్తాయని, ఎండలు తగ్గుతాయని అంటున్నారు. కానీ చాలా మంది మానవశాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు అడవి అంటే కేవ లం చెట్లు,పుట్టల పర్యావరణము మాత్రమే కాదని, ఆదిమ తెగలతో పాటు సమస్త జీవావరణం కలిపే అడవి అని అంటున్నారు. అయినా అది మన పాలకుల చెవికి చేరక విచ్చలవిడిగా అడవుల ఆక్రమణ, ఆదివాసుల తరిమివేతతో పాటు కొట్లు వెచ్చించి అభయారణ్యాలు, పులుల విడిది కేంద్రా లు మొదలైన వాటికోసం ప్రత్యేక సంరక్షణ మండలాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 2006లో వన్యవూపాణి సంరక్షణ చట్టం పేరుతో ఒక ప్రత్యేక చట్టాన్ని తేవడంతో పాటు ఇప్పటికి ఆదిలాబాద్ కలిపి 42 పులుల సంరక్షణ మండలాలు ఏర్పాటు చేశారు. మానవాభివృద్ధిలో ప్రపంచంలోనే 17 దేశాల్లో 134వ స్థానంలో ఉన్న భారతదేశం పులుల జనాభా విషయంలో మాత్రం మూడవ స్థానంతో అగ్రరాజ్యంగా వెలుగొందుతోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పులుల కోసం మనుషుల్ని తరిమేసే ప్రణాళికలు, ప్రత్యేక చర్యల వెనుక అసలు కారణం అపరిమితమైన నిధులు. ఆ నిధులతోనే ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజలను అడవుల నుంచి పంపించివేసే పనికి పూనుకుంటున్నారు. 2005 టాస్క్‌ఫోర్సు నివేదిక ప్రకారం ఒక్కొక్క కుటుంబాన్ని తరలించడానికి అయ్యేఖర్చు 10 లక్షల రూపాయలు. 

అంటే గ్రామా లు ఖాళీ చేయించడంతో సహా సహాయం, పునరావాసం అన్నీ కలిపి పది లక్షలు! కానీ ఆదిలాబాద్ అటవీ శాఖ అధికారులు పదిలక్షలు పరిహారం కింద అందిస్తామని ఊదరకొడుతున్నారు. 
పులులకూ, తమకూ పేచీ లేదన్నది ఆదివాసుల వాదన. పైగా పులి వాళ్లకు ప్రాణవూపదం. గోండు జాతి మూలపుటమ్మ జంగుభాయికి పులి వాహనం. ఆమె పరమశివుణ్ణి ఎదిరించి తమను శాప విముక్తుల్ని చేసి గుహల్లో నుంచి బయటకు తెచ్చిన వీరనారి అని వారి నమ్మకం. ఆమె వల్లే బతికి బట్టకట్టిన గోండులు ఆమెను వాళ్ళ తల్లిగా పూజిస్తారు. ఆ తల్లి వాహనమైన పులినీ ప్రేమతో ఆదరిస్తారు. ఇప్పుడు ఆ పులికే బలికావడం వాళ్లకు మింగుడు పడని విషయం. ‘పులులు పుట్టినప్పటి నుంచి అవీ మేం కలిసే ఉంటున్నాం. నా జీవితంలో ఎన్నో పులుల్ని చూశాను. మేం రమ్మంటే వచ్చే వి. పొమ్మంటే పోయేవి. వాటికి మేమెప్పుడూ అపకారం చెయ్యలేదు. అవికూడా మాకు ముప్పని ఎప్పుడూ అనుకోలేదు అని తమకూ పులికీ ఉన్న బంధాన్ని వివరించాడు దొంగపల్లికి చెందిన డ్బ్భై ఏళ్ల పట్టపు లస్మయ్య. దొంగపల్లి గ్రామంలో అంతా నాయకపోడ్ తెగకు చెందిన వాళ్ళే. వెదురు బుట్టలల్లి బతుకులు వెళ్ళదీసుకునే జాతులున్న ఆ గ్రామం కూడా ఇప్పుడు పులి జూదంలో చిక్కుకుంది. ఆదిలాబాద్ ఆదివాసులకు మరీ ముఖ్యంగా గోండులకు పర్యావరణ ప్రేమికులనే పేరుంది. అలా ఉండబట్టే ఆ జిల్లా ఇప్పటికీ పచ్చగా ఉంది. సింగరేణి గనుల పేరుతో, పరిక్షిశమల పేరుతో, అధికార పార్టీల నేతల కలప స్మగ్లింగ్ లేకపోతే అడవి ఉంటే అందులో పొరుక ల సార్లు (నక్షలైట్లు) ఉంటారన్న భయంతో ప్రభుత్వమే అడవిని మేసేసింది తప్ప ఆ అడవి బిడ్డలైన గోండులు, కోలాములు, నాయకపోడ్‌లు అక్కడ పుల్లకూడా ముట్టరు. వాళ్ళు ఇతర సంచార గిరిజన జాతుల లాగా అడవులను నరుక రు. అడవి మృగాలను చంపరు. మేం పులులను మా కాపలా కుక్కని అనుకుంటామని వివరించాడు లస్మయ్య. కుక్కలను పెంచుకోవడం కోసం మనుషులను గ్రామాలు ఖాళీ చేయమని అడుగుతారా? అన్న ప్రశ్న ఆయన మాటల్లో ధ్వనించింది. 

డబ్బులు ఖర్చుచేయడమే అభివృద్ధి అని భావించే మన దేశంలో ఆదివాసుల్ని బలి తీసుకోవడం కొత్తకాదు. దేశంలో ఈ విధ్వంసకర అభివృద్ధి వల్ల నిర్వాసితులో, నిరాక్షిశయులో అయిన వారిలో అరవై శాతం ఆదివాసు లే కావడం కలవరం కలిగించే విషయం. జనాభాలో ఆరు నుంచి ఎనిమిది శాతం మాత్రమే ఉన్న ఆదివాసుల్లో ఇప్పటికే అరవైశాతం మంది నిరాక్షిశయులైపోతే ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుంది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మరింత విధ్వంస పూరితంగా ఉన్నది. గడిచిన పదేళ్ళలో ఈ విధ్వంస పూరిత అభివృద్ధి వల్ల దేశంలోనే అరుదైన ఆదివాసీ తెగలు అంతరిస్తున్నాయి. చెంచు, కోయ జాతులు దేశంలో తొలి నాగరికతలకు పునాదులు వేసినవి. ఇప్పుడు పోలవరంవల్ల ఖమ్మం జిల్లా కోయ జాతి, వజ్రాలు ఇతర ఖనిజాలా తవ్వకం పేరుతో మహబూబ్ నగర్ నల్లమల చెంచు తెగ అంతరిస్తోంది. ఇప్పుడు మిగిలి వున్న ఒకే ఒక ఆదిమ జాతి గోండులు. ఇప్పుడు పాలక వర్గాల పులిపంజా గోండు జాతి మీద పడింది. 

అవును..! మనుషులు అంతరించవచ్చు, తెగలు తరిగిపోవచ్చు, జాతు లు మాయమైపోవచ్చు కానీ మృగాలు మాత్రం బతకాలని అంటున్నారు. అదేం చిత్రమో కానీ ఇప్పుడు మనుషులను ద్వేషించే వాళ్ళే జీవ కారుణ్యవాదులైపోతున్నారు. మానవ హక్కులకు విలువ ఇవ్వని వాళ్ళు ఇప్పుడు జంతువుల హక్కుల గురించి ఉద్యమిస్తున్నారు. సాటి మనిషిని ఇంకా జంతువుకంటే హీనంగా చూసే సాంప్రదాయ విలువలున్న దేశం మనది. తన అధికారానికి విలువ ఇవ్వలేదనో, తన అహంకారానికి తలొగ్గలేదనో కట్టుకున్న భార్యలతో సహా రోజుకు వేలాదిమందిని చంపేస్తున్న మన దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గోవునుంచి మొదలుకుని పులిదాకా అన్నీ పూజనీయమే! ఇక్కడ ఒక్క బలహీనుడి ప్రాణానికే విలువలేదు. ఆదిలాబాద్ ఆదివాసులు అడవి దాటి బయటికొస్తే పులులకంటే ప్రమాదకరమైన మృగాలున్నాయని అర్థం చేసుకున్నారు. అందుకే తమ ప్రాణాలు పోయినా సరే అడవిలోనే, పులులతోనే సహజీవనం కొనసాగిస్తామని అంటున్నారు. గోండులు కేవలం ఆదివాసులే కాదు. మన ఆది రాజు లు. ఆదిలాబాద్‌ను పరిపాలించిన రాజులు. రాజ్ గోండ్ నాయకుడు రాంజీ గోండ్ మొదలు వందలాది మంది గోండ్ వీరులు మనల్ని కాపాడడానికో, విముక్తం చేయడానికో పోరాటాలు, ఉద్యమాలు, విప్లవాలు నడిపారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వాళ్ళకు వెన్నుదన్నుగా నిలవాలి. వాళ్ళను, వాళ్ళు అన్యాక్షికాంతం కాకుండా ఆపుతున్న అడవినీ కాపాడుకోవాలి. కేవలం పులులనే కాదు. సాటి మనుషులను కాపాడుకోవడం కూడా మన సామాజిక బాధ్యత!

పొఫెసర్ ఘంటా చక్రపాణి 
రచయిత సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు 
ఈ మెయిల్ :ghantapatham@gmail.com
Namasete Telangana News Paper Dated 06/01/2012 

Thursday, December 22, 2011

మౌపమే మారణాయుధం!



agitation00-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
మీరెప్పుడైనా జూబ్లీహిల్స్‌లో ఉన్న కేబీఆర్ పార్క్‌కు వెళ్ళారా? హైదరాబాద్‌లో ఉండే వారు మినహా చాలా మందికి అదేమిటో తెలియకపోవచ్చు. సరిగ్గా తెలంగాణ భవన్ (టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసు)కు తలవాకిలిలా ఉంటుందది. హైదరాబాద్‌లో అత్యంత సంపన్నులు ఉండే బంజా రా హిల్స్ -జూబ్లీహిల్స్ మధ్యలో నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉండే జాతీయ ఉద్యానవనమే కాసు బ్రహ్మానందడ్డి పార్క్. దాని అసలుపేరు చిరాన్ పాలెస్. చిరాన్ అంటే టర్కిష్ భాషలో అందరివాడు అని అర్థమట. బహుశా తన వారసుడు ప్రజలందరి వాడుగా ఉండాలని అనుకున్నాడో ఏమో ఏడవ నిజాం ప్రిన్స్ ఆజం జాహీ ఈ వనాన్ని తన కొడుకు ముఖరంఝాకు కానుకగా ఇచ్చారు. అందులో అంతఃపురాన్ని తలపించే అత్యాధుని క వసతి సౌకర్యాలు గల పదహారు భవంతులతో పాటు చిరాన్ పాలెస్ పేరు తో ఒక రాజసౌధాన్ని నిర్మించారు. కొద్దికాలం పాటు ప్రిన్స్ ముఖరం ఝా అక్కడే నివసించారు.

దాదాపు ఆరువందల రకాల అరుదైన వృక్షజాతులు, నూటాయాభై రకాల పక్షులున్న ఈ తెలంగాణ జాతిసంపద జాతీయ నందనవనం హోదా పొందింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కొండలన్నీ ఆంధ్రా సంపన్నవర్గాల కాలనీలుగా మారిపోయాక కొండల నడుమ ఉన్న ఈ వనం మీద వారి కన్ను పడింది. ఇంకేముంది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాన్నివాకింగ్ పార్క్‌గా మార్చివేసి వారికి కానుకగా ఇచ్చేశారు. పనిలో పనిగా చిరాన్ పాలెస్ పార్క్ పేరును 1969 తెలంగాణ ఉద్యమాన్ని పాశవికంగా అణచివేసిన కాసువూబహ్మానంద రెడ్డి పేర మార్చేశారు. ఇప్పుడు ప్రతిరోజూ తెల్లారకముందే మం త్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, కాంట్రాక్టర్లు ఇట్లా వేలాదిమంది ఆ వనంలో వచ్చి వాలుతారు. పొట్ట తగ్గించుకోవడానికో, కండ లు పెంచుకోవడానికో, రోగాలు నయం చేసుకోవడానికో అక్కడ నడుస్తారు. వ్యాయామాలు, యోగాభ్యాసాలు చేస్తారు. మొత్తం హైదరాబాద్ నగరమే ఆంధ్రా సంపన్నుల విడిది కేంద్రమైనప్పుడు ఇందులో పెద్ద విశేషమేమీ కనిపించక పోవచ్చు. కానీ అక్కడికి దోమలగూడ బస్తీ నుంచి నాగేశ్వర్ రావు అనే యువకుడు రావడం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

నాగేశ్వర్ రావు అక్కడికి వాకింగ్ కోసం రావడం లేదు. అంతటి హోదా, అంతస్తు అతనికి లేవు. ఆ అవసరం కూడా అతనికి లేదు. అతనొక మెకాని క్ దగ్గర కార్లు కడుగుతాడు. పొద్దంతా కార్లు కడిగితే వాళ్ళ సేటు రెండువందల రూపాయలు ఇస్తాడు. ఆ సొమ్ముతోనే అతను బతకాలి. అలాంటి దిన కూలీ ప్రతిరోజూ ఉదయమే కేబీఆర్ పార్క్‌కు వచ్చి అక్కడికి వచ్చే వాళ్లకు తెలంగాణ వాదం వినిపిస్తాడు. రాగానే పార్క్ గేటు దగ్గర కాసేపు ప్రసంగిస్తాడు. తెలంగాణకు నీళ్ళల్లో, నిధులు, ఉద్యోగాల్లో ఎలాంటి అన్యాయం జరిగిందో మొదలు పెట్టి డిసెంబర్ తొమ్మిది చిదంబరం ప్రకటన ఆ తర్వాతి పరిణామాలను పూసగుచ్చి వివరిస్తాడు. తన కళ్ళ ముందే కాలి బూడిదైన శ్రీకాంతాచారి గుర్తొచ్చి గొల్లుమంటాడు. ఎందరు అమరులైనారో ఏకరువు పెడతాడు. మధ్యమధ్యలో గోరేటి వెంకన్నపాటలు అందుకుంటాడు.

తెలంగాణ కోసం నిరంతరం పలవరించే నాగేశ్వర్‌రావుకు నిద్ర పట్టదు. టీఆర్‌ఎస్ ఉద్యమంతో తెలంగాణ గురించి తెలుసుకున్న అతను కే సీఆర్ నిరాహార దీక్షరోజు ఎల్‌బీ నగర్‌లో శ్రీకాంతాచారితో కలిసి ఉన్నాడు. అంబేద్కర్ విగ్రహం ముందు మిత్రులతో కలిసి మాట్లాడుతుండగా ఉన్నట్టుండి శ్రీకాంతాచారి నిప్పంటించుకున్నాడు. ఆ రోజునుంచి అన్ని హైదరాబాద్‌లో జరిగే ప్రతి సభ లో పాల్గొన్నాడు. బతుకు కోసం రోజూ ఉదయం నాలుగున్నరకు అతని దిన చర్య మొదలవుతుంది. ఐదు గంటలకల్లా మంత్రి దానం నాగేందర్ ఇంటికి చేరుకుంటాడు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన మోసం గురించి ఆ ఇంటిముందు మొరపెట్టుకుంటాడు. ఆ మోసం వల్ల జరిగిన నష్టం గురించి మొత్తుకుంటాడు. రాజీనామా చేయాలంటూ నిలదీస్తాడు, నిందిస్తాడు. నినాదాలు చేస్తాడు. అప్పటికి నాగేందర్ నిద్ర లేచివుండడని తెలంగాణ విషయంలో నిద్ర నటిస్తోన్న వాళ్లకవి వినిపించవని నాగేశ్వర్‌రావుకు తెలుసు.

అయినా అరగంట పాటు అక్కడ తన అక్కసు వెళ్లబోసుకుని మరో అరగంటలో జూబ్లీహిల్స్‌లో మంత్రి జానా రెడ్డి ఇంటికి చేరుకుంటాడు. అక్కడా అదే కథ. ఆ తరువాత పార్కుకు చేరుతాడు. ఎనిమిది గంటల దాకా అక్కడ పని పూర్తి చేసుకుని కూలీ పనికి వెళ్ళిపోతాడు. అంతా అతన్నొక పిచ్చివాడి కింద జమకడతారు. నవ్వుకుంటారు. విసుక్కుంటారు. మంత్రుల ఇళ్లముందరి పోలీసులు అదిరిస్తారు, బెదిరిస్తారు. లాఠీలు ఝుళిపిస్తారు. తరిమేస్తారు. నాగేశ్వర్‌రావు కు పిచ్చి అనుకుంటారు. ఒక్క నాగేశ్వర్ రావుకేనా?! ఇప్పుడు తెలంగాణ అంతటికీ అదే పిచ్చి! తెలంగా పిచ్చి!! ఇప్పుడు తెలంగాణ అంతా నాగేశ్వర్‌రావు లాగే కనిపిస్తోంది. అలాగే కలవరిస్తోంది.

రాజకీయ వ్యవస్థ ఇప్పుడు తన మౌనంతో ఎందరినో పిచ్చివాళ్ళను చేస్తోంది. మౌనాన్ని మించిన మారణాయుధం ఇంకొకటి ఉండదని తెలంగాణ ప్రజల విషయంలో స్పష్టంగా రుజువయ్యింది. రెండేళ్లుగా ఢిల్లీ పెద్దలు మౌన ముద్ర దాల్చడం వందలాది మందిని బలి తీసుకుంది. డిసెంబర్ తొమ్మిది తరువాత సోనియాగాంధీ మాట్లాడి వుంటే ఈ మారణహోమం జరిగేదే కాదు. ఆమె మౌనాన్ని ఎంచుకున్నారు. కనీసం ఆమె చేతిలో మరబొమ్మలా ఉన్న ఈ దేశ ప్రధాని చేత ఒక్క మాట చెప్పించినా ప్రజలకు ఆమె మనసులో ఏముందో ఆమె ఏమనుకుంటున్నారు తెలిసేది. ఆమె మౌనం అర్థం కాని ప్రధాని అడపా దడపా నోరు విప్పినా పొంతనలేని మాటలు చెపుతున్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు పార్లమెంటులో అప్పుడప్పుడు నోటికి గుడ్డలు కట్టుకుని ఆమె మౌనానికి సంఘీభావం తెలుపుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఏమాత్రం తక్కువ తినలేదు. వాళ్ళుకూడా కిక్కురుమనకుండా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ముందు గంగిద్దులైపోయారు.

అవిశ్వాస తీర్మానం సందర్భంగా నోరుకూడా విప్పకుండా తలలూపి తమ విశ్వాసం చాటుకున్నారు. ఆ మౌనమే తెలంగాణలో నరమేధం సృష్టించింది. ఆత్మహత్యలు, ఆందోళనలు, లాఠీలు, రబ్బరు తూటాలు, అరెస్టులు, కోర్టు కేసులు, జైళ్ళు, సమ్మెలు, బందులు, బాధలు ఇట్లా రెండేళ్లుగా తెలంగాణ జనజీవితాన్ని అస్తవ్యస్తం చేసింది ఆమె మౌనం. మౌనం ఒక సైలెంట్ కిల్లర్ అనడానికి ఇదొక మచ్చు తునక. ఆ నేరానికి స్వయంగా సోనియా గాంధీ పాటియాలా కోర్టులో కేసును కూడా ఎదుర్కొంటున్నారు. 
వాళ్ళ సంగతి అలా వదిలేద్దాం. రెండేళ్ళ పాటు మరఫిరంగుల్లా మారుమోగిన తెలంగాణ వాదులు కూడా ఉన్నట్టుండి మౌన వ్రతం తీసుకున్నట్టు గప్ చుప్ అయిపోవడం ఇప్పుడు గందరగోళానికి కారణం అవుతున్నది. ముఖ్యంగా సకల జనుల సమ్మె తరువాత చాలా మంది సైలెంట్ అయిపోవ డం అయోమయాన్ని సృష్టిస్తోంది. ఆ అయోమయం మనుషుల్ని నిజంగానే ఏమీ తోచని పిచ్చివాళ్ళను చేస్తున్నది. ఇది విరామం అన్నవాళ్లు పూర్తిస్థాయి విశ్రాంతికి అలవాటు పడ్డారా అన్న అనుమానాలు, 2014 దాకా ఈ విరా మం కొనసాగుతుందేమోనన్న భయాలు వ్యక్తమౌతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ మాట్లాడకపోవడం ఇప్పుడు ఈ కలవరానికి కారణం అవుతోంది.

కేసీఆర్ మౌనం కొత్తదేమీ కాదు. ఆయన ఎంత గట్టిగా మాట్లాడగలరో అంతే మౌనంగా ఉండగలరు. యుద్ధంలో అవసరమైనప్పుడే ఆయుధాలు సంధించాలనుకునే పోరాట వ్యూహం ఆయనది. సకల జనుల సమ్మె విరమించారేమో కానీ ప్రజలు మాత్రం ఇంకా పోరాటం మాత్రం ఆపేయలేదు. ప్రజలు తమ సమస్యలను తెలంగాణతో మిళితం చేస్తున్నారు. సకల జనుల సమ్మె తరువాత కూడా ప్రతిరోజూ ఏదో ఒకచోట సదస్సులు జరుగుతూనే ఉన్నా యి. సమీక్షలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 9 రోజున తెలంగాణ అంతటా ఒక్క పూట జాగారాలు జరిగాయి. అదే రోజున ఢిల్లీలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆడబిడ్డ నళిని నిరవధిక దీక్షకు కూర్చున్నారు. దాదాపు వారానికి పైగా ఆమె దీక్షచేసి తన నిరసనను తెలిపారు. మరోవైపు తెలంగాణ చెరుకు, పత్తిరైతులు రోజుకొకరి చొప్పున ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు.

ఇప్పటికీ లక్షలాది రైతు కుటుంబాలు ప్రభుత్వ స్పందన కరువై దిక్కుతోచక ఉన్నారు. ఆదివాసులకే ఆది పురుషులైన గోండు బిడ్డలకు గడిచిన నెల రోజులుగా కంటిమీద కునుకులేదు. పులుల సంరక్షణ పేరుతో ఇప్పుడు ప్రభుత్వం ఆదిలాబాద్ గోండు గూడాలకు నిప్పుపెడుతోంది. ఎప్పుడు ఏ పాము పడగ విప్పుతుందో, ఏ చిరుత పంజా విసురుతుందో తెలియని భయంలో వాళ్ళు బిక్కు బిక్కుమంటున్నారు. ఇంకోవైపు తెలంగా ణ నిరుద్యోగుల పాలిట ఏపీపీఎస్సీ కొండ చిలువై కూర్చుంది. వీటిలో పలు సందర్భాల్లో మిగితా అన్ని పార్టీలూ మౌనంగానే ఉన్నా టీఆర్‌ఎస్ స్పందించింది. కొన్ని విషయాల్లో టీఆర్‌ఎస్ స్వయంగా ఉద్యమించింది. ముఖ్యంగా ఏ పీపీఎస్‌సీ విషయంలో టీఆర్‌ఎస్ చేసిన ప్రయత్నాన్ని ఎవరూ విస్మరించలేరు. కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా అలాగే అండగా ఉండాలని ప్రజలు కోరుకోవడం తప్పుకాదు. అలాగే కేసీఆర్ మాట్లాడాలని, తమకు దిశా నిర్దేశం చేయాలని అనుకోవడం కూడా అత్యాశ కానే కాదు.

ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఎదురవుతున్న ప్రతి సమస్యనూ, ఆ సమస్య లోంచి తలెత్తుతోన్న ప్రతి ఆందోళనను ఉద్యమీకరించాల్సిన అవసరం ఉంది. అందు కు కేసీఆర్ తన వ్యూహాత్మక మౌనాన్ని వీడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణకు ఆయనే సారథి. ఆయన మాట్లాడితేనే రథం కదులుతుంది.
మరోవైపు ఈ మౌనాన్ని అదను చూసుకుని తెలంగాణ చుట్టూ రాజకీయ వల విసిరే ప్రయత్నాలు అన్నిపార్టీలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా రెండేళ్ళ సుదీర్ఘ మూగనోము తరువాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన వందిమాగధ మూకతో తెలంగాణలో తిరుగుతున్నారు. అట్లాంటి సాహసం చేసే ముందు తెలుగుదేశం పార్టీ లో ఉన్న తెలంగాణ నాయకులు రెచ్చిపోయి మాట్లాడడం విన్నాం. అందులో ఏ ఒక్కరు తెలంగాణ గురించి మాట్లాడే నైతికత ఉన్నవాళ్ళు కాదు. కానీ వాళ్ళు కేసీఆర్‌ను, కోదండరాంను గుక్కతిప్పుకోకుండా తిడుతూనే ఉన్నారు.

చంద్రబాబు మూకలో పదో తరగతి ఫెయిలయిన ఒక నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఏకవచనంతో సంబోధిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి పంచన చేరి చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోసిన ఇంకొక నాయకుడు రోజూ నోరు పారేసుకుంటున్నాడు. కొంత కాలం ఎర్రరంగులో, కొద్ది రోజులు ప్రజారాజ్యం పంచ వన్నెల్లో కనిపించిన రామచిలక ఇప్పుడు బాబు భజనలో తల మునకలై కోదండ రామ్ ఖబర్దార్ అని బాబు మాటలనే బయట వల్లిస్తోంది. వాళ్ళు సవాలు చేస్తున్నది ఒక్క కేసీఆర్ నో, కోదండ రాంనో కాదు. మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని. రాజకీయ విమర్శల పేరుతో మొత్తం ప్రజలను, ఉద్యమాన్నీ అవమానిస్తున్నా అటు జేఏసీ కానీ, టీఆర్‌ఎస్ కానీ తిప్పికొట్టకపోవడం ఉద్యమానికి కచ్చితంగా నష్టదాయకమే. వాళ్ళను తిప్పికొట్టడమంటే వాళ్ళచేత ఆ మాటలు మాట్లాడిస్తోన్న చంద్రబాబును తెలంగాణలో అడుగుపెట్టకుండా తిప్పిపంపడమే.

కేసీఆర్ ఒక్క పిలుపునిస్తే చంద్రబాబును తెలంగాణలో ఒక్క అడుగు కూడా వేయనిచ్చే వాళ్ళం కాదు అంటున్నవాళ్లు ఉన్నారు. ఆయన మౌనంగా ఉన్నారు. ఆ మౌనాన్ని ఏమని అర్థం చేసుకున్నారో కానీ కోదండరాం మౌనంగా ఉన్నారు. కోదండరాం మౌనం వెనుక మర్మాన్ని సరిగ్గానే తెలుసుకున్న జేఏసీ శ్రేణులు కూడా ప్రేక్షకుల్లా మౌనంగా చేతులు ముడుచుకుని కూర్చున్నాయి. ప్రజలు కూడా చంద్రబాబు మాటలను మౌనంగా వింటున్నారు. ఆయన తిరగడం వల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏమీ లేకపోవచ్చు. పైగా అది అతని హక్కూ అయివుండవచ్చు. ఇదే హక్కును గతంలో జగన్ కూడా వినియోగించుకోవాలనుకున్నాడు. కానీ ఆయనను తెలంగాణలో అడుగుపెట్టకుండానే పంపించారు. రేపు జగన్ కూడా చంద్రబాబు బాటలోనే ఓదార్పుకో, పరకాల ఎన్నికలకో వస్తాడు. అదీ అతని హక్కే. హక్కులు కేవలం రాజకీయ పార్టీలకు, నాయకులకే కాదు కదా ప్రజలకు కూడా ఉంటాయి. తాము నమ్ముకున్న నాయకత్వం తాము కోరుకున్నట్టు పనిచేయాలని ఆశించడం కూడా ఆ హక్కులో భాగమే. అలాంటి హక్కు ప్రజలకు ఉందని, ఉండాలని రాజకీయ పార్టీలు గుర్తించాలి.

అలా చేసినప్పుడే ఆ పార్టీల పట్ల గౌరవం ఉంటుంది. ఉద్యమాలు, ఉద్యమకారులు మౌనాన్ని వదిలి మాటలతో, చేతలతో ఆ విషయం వారికి అర్థమయ్యేలా చేయాలి. లేకపోతే ఒక్క నాగేశ్వర్ రావు మాత్రమే కాదు. ప్రజలంతా మతి చలించిపోతారు. అప్పుడు ఓట్లు వేయడానికి కూడా ఎవరూ మిగలకపోవచ్చు!
పొఫెసర్ ఘంటా చక్రపాణి


రచయిత సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు 
ఈ మెయిల్:ghantapatham@gmail.com
Namasete telangana News Paper Dated 23/12/2011

Friday, December 2, 2011

తెలంగాణ తొలిపొద్దు.By .ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి



ఇంట్నట్ వికీపెడియాలో ఒకసారి కిషన్‌జీ అని టైప్ చేసి వెతకండి. అది నేరుగా మిమ్మల్ని మల్లోజుల కోటేశ్వర్‌రావు అనే పే జీకి తీసుకెళ్తుంది! ఆ పేజీ ఆరంభంలో ‘మీరు కిషన్‌జీ అని అడిగినందుకు మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాం. మీకు ‘హిందూ దైవం కిషన్ జీ’ కోసం వెతుకుతున్నట్టయితే కృష్ణ అని టైపే చేయండి’ అని మీకొక చిన్న నోట్ కనిపిస్తుంది. ఉత్తరాది హిందువులకు ద్వాపర యుగకర్త శ్రీ కృష్ణుడు కిషన్‌జీ గా ఆరాధ్య దైవం. ధర్మ సంరక్షణ కోసం ఆయన అవతరించినట్టు ప్రజలు నమ్ముతుంటారు. ధర్మం చెరబడ్డ ప్రతిసారీ నేనే ఏదో ఒక రూపంలో అవతరిస్తానని శ్రీ కృష్ణుడే గీతోపదేశంలో చెపుతాడు. దాన్ని భారతీయులు చాలా మందే నమ్ముతుంటారు. ఇప్పుడు కోట్లాది మంది భారతీయుల స్మృతిలో ‘కిషన్‌జీ’ ఆన్న నామవాచకానికి అర్థమే మారి పోయింది. ఔను! కిషన్‌జీ ఆంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు గుర్తుకు రావడం లేదు. తన జీవిత కాలమంతా వెచ్చించి భారతదేశ విప్లవోద్యమాన్ని మలచిన మల్లోజుల కోటేశ్వర్‌రావు ప్రజల మనోఫలకాల మీద మెదులుతున్నాడు. వికీపీడియాలో ఆయన కోసం పేజీని ప్రారంభించిన నాలుగు రోజుల్లో ఇరవై వేలకు పైన జనం ఆయన గురించి చదివారు. తన పిల్లలు ఎక్కడ ఉన్నా వారిని చల్లగా చూడాలని మల్లోజుల మధురమ్మ గడిచిన నాలుగు దశాబ్దాలుగా లెక్కలేనన్ని సార్లు ఆ దేవుడికే మొక్కుకుని ఉంటుంది. ఇప్పుడు ఆ దేవుణ్ణే స్థాన భ్రంశం చేసిన కిషన్ జీ ఈ దేశంలోని పీడిత వర్గాలకు ఆరాధ్య దైవంగా మారి పోవడం ఆమె ఊహకు అందని విషయం. ఒక్క ఆమెకే కాదు, అతనితో చిన్నప్పుడు పెద్దపల్లిలో కలిసి చదువుకున్న వాళ్ళల్లో ఏ ఒక్క రూ వాళ్ళ ’కోటి’ కిషన్‌జీగా ఈ దేశ చరివూతలో చిరకాలం నిలిచిపోతాడని ఊహించి ఉండరు.


గడిచిన వారం రోజుల్లో చాలా మందికి అతని జీవితం, జీవితంలో ఆయన పెంచుకున్న ఆదర్శాలు, నమ్ముకున్న సిద్ధాంతం, ఆచరణలో అతని నిబద్ధత అంతిమంగా అతను నిర్మించిన మహోద్యమం కొత్తగా పరిచయం అయ్యాయి. కరీంనగర్ పాత మిత్రులు ఆయనతో ఉన్న పరిచయాన్ని, సాన్నిహిత్యాన్ని కథలు కథలుగా చెప్పి మురిసిపోతున్నారు. మనుషులు మరణించినా..వారిని చూసి మురిసిపోయే సందర్భాలు చాలా అరుదు. మనల్ని బతికించే ఏదో ఒక ఆశ వాళ్ళు వదిలి వెళ్ళినప్పుడే అది సాధ్యమౌతుంది. అటువంటి అచంచలమైన విశ్వాసాన్ని కోటేశ్వర్‌రావు ఇప్పుడు మన దేశంలోని కొట్లాదిమందికి కలిగించాడు. 
ముఖ్యంగా తెలంగాణ అంతటా ఉన్న అతని సన్నిహితుల్లో ఇప్పుడు ఆ ఆశ ఒక కొత్త ధైర్యాన్ని ఇస్తోంది. ఆ ధైర్యమే అతని అంతిమ యాత్రను ఒక వైవిధ్యభరిత జన సమాహారంగా మార్చివేసింది. కోటేశ్వర్‌రావు నాయకత్వం వహిస్తోన్న పార్టీతో విభేదించి విడిపోయిన వాళ్ళు, ఆ పార్టీ పద్ధతులను విమర్శించే వాళ్ళు మొదలు ఆయనతో అసలు పరిచయం లేని వాళ్ళు, ఆయనను పొట్టన పెట్టుకున్న పాలక వర్గాలకు చెందిన వాళ్ళు అనేకమంది ఆయనకు మనస్పూర్తిగా నివాళులు అర్పించారు. ఈ అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా అతనితో ఏర్పడ్డ బంధం తెలంగాణ. అతని ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ అతని తొలి పాఠశాల.


తొలి తెలంగాణ ఉద్యమం(1969)ఒక్క కోటేశ్వర్‌రావు కే కాదు, ఆయన తరానికి చెందిన వేలాదిమంది యువకులకు ఎన్నో పాఠాలు నేర్పింది. అప్పటికే వందలాదిమంది యువకులను అప్పటి ప్రభుత్వం కాల్చి చంపింది. పోలీసుల నిర్బంధం, అరెస్టులు, జైళ్ళు, తుపాకీ తూటాలతో బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోన్న దశ అది. ఆ ఉద్యమంలో అరెస్టయ్యి, బయటికి వచ్చిన కోటేశ్వర్‌రావు 1971 లో పెద్దపల్లి వదిలి డిగ్రీ చదవడం కోసం కరీంనగర్ వచ్చారు. అతనికి సంతోష్‌కుమార్, ఎన్.శ్రీనివాస్, నారదాసు లక్ష్మణరావు వంటి మిత్రుల సాహచర్యం దొరికింది. అప్పటికి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, జగిత్యాలలో మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉండేవి. అదేకాలంలో జమ్మికుంటలో అక్కడి సోషలిస్టు ఆదర్శాలున్న సంపన్న రైతులు కొందరు ఆదర్శ కాలేజీ పేరుతో ఒక ప్రైవేటు డిగ్రీ కాలేజీని ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణ పై ఆశలు విఫలమై అక్కడికి చేరుకున్న కొత్త తరానికి ఆ కాలేజీలు ప్రధాన అధ్యయన కేంద్రాలుగా మారిపోయాయి. జమ్మికుంట ఆదర్శ కాలేజీలో నల్లా సుధాకర్‌రెడ్డి, నల్లా ఆదిడ్డి, ఆవునూరి సమ్మయ్య, శనిగరం వెంక (సాహూ), మడిపల్లి తిరుపతి, చంద్రప్రభాకర్ వంటి యువకులు క్రియాశీలంగా ఉండేవాళ్ళు. 

అప్పటికి ఇంకా శ్రీకాకుళ పోరాట పవనాలు కరీంనగర్ దాకా చేరలేదు. వరంగల్‌లో కాళోజీనారాయణరావు, వరవరరావులు ఆ ప్రయత్నం చేస్తోన్న కాలమది. తొలుత తిరుగుబాటు కవులుగా, ఆ తరువాత విప్లవ రచయితల సంఘంగా అక్కడ కార్యక్షికమాలు మొదలవుతున్న దశలో ఆ బీజాలను కరీంనగర్ మాగాణాల్లోకి తీసుకొచ్చింది భాగ్యనగర్ విజయకుమార్. కరీంనగర్‌లో అందరూ విజ్జన్న అని పిలుచుకునే ఆయనకు అప్పటికే వరంగల్‌తో పరిచయం, వరవరరావుతో సాన్నిహిత్యం ఉంది. ప్రత్యేక తెలంగాణ పోరాట అనుభవమూ ఉంది. అంతకుమించి శ్రీకాకుళ ఉద్యమ ప్రభావం అతని ఆలోచనను అప్పటికే పూర్తిగా ఆవరించి ఉన్నాయి. విజ్జన్న విద్యుల్లత పేరుతో అప్పటికే ఒక పత్రిక ప్రారంభించారు. కరీంనగర్‌ను తన కార్యక్షేవూతంగా పెట్టుకున్న విజ్జన్న పంచాది నిర్మల స్ఫూర్తితో నిర్మల ప్రెస్ పేరుతో ఒక ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించారు. విజయకుమార్‌కు మిత్రులు గోపు లింగాడ్డి, ముంజంపల్లి వెంకటడ్డి వెన్నుదన్నుగా నిలిచారు. వారితో పాటు తాడిగిరి పోతరాజు, అంపశయ్య నవీన్, తిరుపతయ్య వంటి మేధావులు తోడయ్యారు. వరవరరావు మార్గదర్శకత్వం మిత్రుల సమష్టి ఆలోచనల పర్యవసానమే కరీంనగర్‌లో ప్రారంభమైన ఉద్యమసాహితి, యువసాహితి. వీటి ప్రభావంతో జమ్మికుంట కాలేజీ విద్యార్థులు 1972 -73 నాటికి జనసాహితి ప్రారంభించారు. 1970 -74 మధ్యకాలంలో ఈ సంస్థలు నిర్వహించిన సదస్సులు, సమాలోచనలు మొత్తం కరీంనగర్ యువతరం స్వభావాన్ని సానబెట్టాయి. కేవలం ఒక్క తెలంగాణ మాత్రమే కాదు యావత్ భారత దేశం అందులో ప్రధానంగా శ్రామిక వర్గం విముక్తి కావాలన్న స్ఫృహ ఈ సమాలోచనలు కలిగించాయి. 

ఈ కార్యక్షికమాలు క్రమక్షికమంగా ప్రత్యేక తెలంగాణ గాయాలను మాన్పివేయడమే కాకుండా ఆతరం యువకుల్లో అభ్యుదయ, ప్రగతిశీల ఆలోచనలకు బీజాలు వేశాయి. వీళ్ళ సదస్సులకు శ్రీ శ్రీ, చెరబండరాజు, వరవరరావు మొదలు అనేకమంది కవులు రచయితలు, డాక్టర్ కొల్లూరి చిరంజీవి లాంటి వైద్య విద్యార్థులు, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్న అధ్యాపకులు కొందరు హాజరై పాఠాలు బోధించేవారు. 1975 మే నెల 11 న హుజూరాబాద్‌లో ఆవునూరి సమ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన జనసాహితి సదస్సుకు హాజరైన శ్రీ శ్రీ , చెరబండ రాజు కరీంనగర్‌లో కత్తులయి మెరుస్తోన్న నవతరాన్ని చూసి ముగ్ధులయ్యారు. ఆ ఉత్సాహంతో ఆయన హుజూరాబాద్ అంతా ఆ యువకులతో కలిసి పాదయావూతలో కలిసి నడిచారు.అప్పటికి ఆ యువ సందోహంలో కోటేశ్వర్ రావుతోపాటు, సాహూ, నల్లా ఆదిడ్డిలాంటి యువకులున్నారని, వాళ్ళే అతను కలలు గంటున్న నూతన సమాజ నిర్మాతలు కాబోతున్నారని బహుశా శ్రీశ్రీ కి తెలియదు. అప్పుడు మొదలైన కోటేశ్వర్‌రావు ప్రస్థానం అక్కడినుంచి గ్రామాలకు తరలి, దళిత, పీడిత కులాలకు అండగా నిలబడి తొలుత పాలేర్ల పోరాటమై.. వెట్టి విముక్తికి, గౌరవవూపదమైన కూలీ రేట్ల డిమాండుతో దొరల అహంకారాన్ని అణచివేసే పోరాటాలకు అంకురార్పణవేసింది. జగిత్యాలలో ‘జైత్ర యాత్ర’ అయ్యి దున్నేవాడికే భూమి కావాలన్న ఆకాంక్షను పేద రైతుకూలీలకు కలిగించింది. ఈ పోరాటం మైదాన ప్రాంతాలకూ విస్తరించింది. అదే దారి గుండా గోదావరి దాటి బస్తర్ చీకటి లోకంలో ఉన్న ఆదివాసులకు ‘దివిటీ’ అయి వెలుగు నింపింది. ఆ వెలుగే.. అక్కడినుంచి బీహార్, జార్ఖండ్, బెంగాల్‌తో సహా భారత దేశమంతటా విస్తరిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. 
కిషన్‌జీ నిర్మించిన మహోద్యమం తెలిసిన వారికి, ఆయన భారతీయ సమాజాన్ని సామాజికీకరించిన తీరు గమనించిన వారికి, ఆయన భారత ప్రజాస్వామ్యాన్ని మానవీకరించిన ప్రయత్నాన్ని పరిశీలించిన వారికి అయన ఆంటే ఎన లేని గౌరవం. కొన్ని సందర్భాల్లో మావోయిస్టు పార్టీ మీద సునిశిత విమర్శలు చేసిన దళిత బహుజన మేధావులు డాక్టర్ గోపీనాథ్, బీఎస్ రాములు వంటి వాళ్ళు కోటేశ్వర్‌రావు ను కులమత జాఢ్యాలకు అందని ఒక మహానీయుడని, అంతకు మించిన మానవతావాది అని కీర్తించారు. నిజమే ప్రత్యేక తెలంగాణతో మొదలైన కిషన్ జీ పోరాటం సామాజిక తెలంగాణ కోసం ఆయన నాయకత్వంలో సాగిన ప్రయత్నం, కులాలు తెగలు జాతుల విముక్తి దిశగా ఆయన సాగించిన ప్రస్థానం వారినే కాదు ఎవ్వరినైనా అబ్బుర పరుస్తాయి. ఆయన తెలంగాణ తొలిపొద్దు. 

కొన్నిసార్లు మన చరిత్ర మనకే అద్భుతమనిపిస్తుంటుంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం మనకు అలాంటి చారివూతిక అనుభవాల్ని మిగిల్చింది. సరిగ్గా కోటేశ్వర్‌రావు చదునుచేసిన దారిలో నడిచి వచ్చిన మాలాంటి వాళ్లకు దారిపొడుగునా ఆ జ్ఞాపకాలు గర్వాన్ని, ఆత్మ గౌరవాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలా ఎప్పుడూ దీర్ఘాలోచనల్లో ఉండే మా విజయకుమార్ సారు తన జీవితంలో ఏం కోల్పోయాడో ఇప్పుడు అర్థమయ్యింది. ఆయన 1985లో ప్రారంభించిన ‘జీవగడ’్డ దిన పత్రిక నుంచే జర్నలిస్టులుగా మా జీవితం మొదలయ్యింది. మల్లోజుల కోటేశ్వర్‌రావులాంటి అనేక మందికి ఎలా నడవాలో నేర్పిన విజ్జన్నే మాకు జర్నలిజంలో ఎలా రాయాలో నేర్పించారు. రాడికల్ విద్యార్థి సంఘం తొలి నాయకుల్లో డాక్టర్ ఎం ఎఫ్ గోపీనాథ్ ఒకరు. మొదటి తరంలో దివిటీలై కదిలిన వాళ్ళే లేకపోతె ఇవాళ తెలంగాణలో ఈ చైతన్యం లేదు, ఇంతటి ఉద్యమ స్ఫూర్తి లేదు. అదొక సామాజిక విప్లవం. ఆ విప్లవంలో కోటేశ్వర్‌రావు చివరంటా నిలబడిన సేనాని. ఇవాళ తెలంగాణలో మాట్లాడుతున్న తొలితరం మేధావులు, నాయకులు, రచయితలూ, కవులు, గాయకులూ ఎవరైనా సరే ఆ వెలుగు ప్రసరించకుండా వికసించలేదు. ఆయన తెలంగాణను విముక్తి చేయడానికి, సామాజీకరించడానికి, ప్రజాస్వామ్యీకరించడానికి వివిధ దశల్లో ఆయన, ఆయన నిర్మించిన ఉద్యమం అనేక ప్రయత్నాలు చేసింది. అవి అద్భుత ఫలితాలు ఇచ్చాయి. ఇప్పుడు సామాజిక తెలంగాణ ఆంటే ప్రత్యేక తెలంగాణను సాధించుకుని ఇంకా మిగిలి పోయిన ఆ ఎజెండాను పూర్తి చేయడమే తప్ప ఇంకొకటి కాదు. 


రచయిత: సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ఈమెయిల్: ghantapatham@gmail.co

Thursday, November 24, 2011

ఇద్దరూ దోచింది తెలంగాణనే! Byపొఫెసర్ ఘంటా చక్రపాణి



నవంబర్ నెలకు తెలంగాణకు అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. తెలంగాణను ఆంధ్రవూపదేశ్‌లో కలిపింది నవంబర్ ఒకటి అయి తే, ఆంధ్రవూపదేశ్ నుంచి తెలంగాణ విముక్తికి స్ఫూర్తిగా నిలిచింది కూడా నవంబర్ నెలనే. ఇటువంటి శీతాకాలంలోనే కేసీఆర్ తెలంగాణ కోసం తన ఆఖరి అస్త్రమైన నిరాహారదీక్షను ఉపయోగించారు. తెలంగాణ ఉద్యోగుల న్యాయమైన డిమాండు ఢిల్లీ వీధుల్లో నగుబాటుకు గురైన పరిస్థితుల్లో ఇక తెలంగాణ కోసం అమీతుమీ తేల్చుకోక తప్పదని గుర్తించి ఆయన నవంబర్ 29న ఆమరణ దీక్షకు దిగారు. అప్పటికి దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం కలలు కంటున్నవాళ్ళు, తపిస్తున్నవాళ్ళు అనేకమందే ఉండివుండవ చ్చు. కానీ తెలంగాణను సకల జనుల స్వప్నంగా మలచింది మాత్రం నవంబర్ 2009. ఇప్పుడు ఈ నవంబర్ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనూహ్యంగా తెలంగాణ డిమాండుకు ఉత్తరాది పార్టీల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోంది. మాయావతి విసిరిన చిన్న రాష్ట్రాల వలలో చిక్కుకుని ఇప్పుడు పార్లమెంటులోని పెద్ద పార్టీలన్నీ విలవిలలాడుతున్నాయి. ఈ సారి పార్లమెంటు చర్చల్లో తెలంగాణ ఒక ప్రధానమైన అంశంగా మారిపోయింది. రెండేళ్ళ క్రితం కేసీఆర్ దీక్ష ప్రజలనే కాదు, రాష్ట్ర రాజకీయాల దశ దిశ పూర్తి గా మార్చివేసింది. రాజకీయ పార్టీలు మొదలు చట్టసభల మీద విశ్వాసంలే ని పార్టీలు, ఉద్యమాలు కూడా కేసీఆర్ నిర్దేశించిన ఎజెండాను ఎత్తుకున్నా యి. తెలంగాణలో మూడు దశాబ్దాల విముక్తి ఉద్యమాలకు, సామాజిక సాంస్కృతిక పోరాటాలకు సారథులుగా ఉన్న గద్దర్, విమలక్కతో పాటు రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఉన్న మందకృష్ణ వంటి వారు కూడా ఏదో ఒక దశలో కేసీఆర్‌ను బలపరిచిన వారే. ఇప్పుడు వారు ఆయన మార్గంతో విభేదించవచ్చు. 

కానీ అందరి గమ్యం ఒక్కటే అనడంలో సందేహాలు ఉండక్కర్లేదు. ఇవన్నీ కలిసే గడిచిన రెండేళ్లలో ఈ రాష్ట్రంలో తెలంగాణ తప్ప మరో వార్తలేని పరిస్థితి నెలకొంది. కానీ ఢిల్లీ పరిణామాలు ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం పరిస్థితి అంత ఆశావహంగాలేదు. ఉద్యమాల్లో పాల్గొ న్న చాలా మంది ఇప్పటి పరిస్థితుల పట్ల కలవరపడుతున్నారు. రాజకీయ క్రీనీడలో మరోసారి తెలంగాణ తెరమరుగౌతుందా అన్న ఆందోళన వ్యక్తమౌతోంది. తెలంగాణ వచ్చేదాకా తెగించి పోరాడుదాం అన్న రాజకీయ నాయకులు డమ్మీ రాజీనామాలతో సహా తమ అమ్ములపొదిలోని అన్ని అస్త్రాలు చక చకా వాడేసి ఇప్పుడు చేతుపూత్తి నిలబడ్డారు. ఇదే అదునుగా చంద్రబాబు రెండేళ్ళ విరామం తరువాత తెలంగాణలో కాలుమోపి పునీతుడైపోయాడు. రేపో మాపో జగన్ మానుకోట కాకపొతే మరోబాటగుండా తెలంగాణలో ప్రవేశించి ఓదార్పు పొందుతాడు. ఇంకోవైపు తెలంగాణ తెచ్చే దీ ఇచ్చేదీ మేమే అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్తకొత్త కార్లలో ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాన్వాయ్‌గా కదులుతున్నారు. అధిష్ఠానాన్ని ఒప్పించి తెలంగాణ తెస్తామన్న మంత్రులు ముఖ్యమంత్రి గారికి రక్షణ కవచమై రచ్చబండలో రేషన్ కార్డులు ఇప్పిస్తున్నారు. సందట్లో సడేమియ్యలుగా కొందరు విశాలాంవూధవాదులు తెలంగాణ సంఘాల సహకారంతో జిల్లాలు తిరిగి సమైక్య స్వస్థత కూటములు నిర్వహించే సన్నాహాల్లో ఉన్నా రు. చారివూతాత్మకమైన సకల జనుల సమ్మె ముగిసిన వెను చోటుచేసుకున్న ఈ పరిణామాలన్నీ చాలా మందినే కలవర పెడుతున్నాయి. 

అంతకంటే కలవరపెట్టే వాస్తవాలను ఇప్పుడు సీబీఐ ఆవిష్కరిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుల ఆస్తుల వివరాలు సేకరిస్తోన్న సీబీఐ ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఎవంత దోచుకున్నది లెక్కగట్టబోతోంది. ఇది రెండు పిల్లుల కథను గుర్తుకు తెస్తోంది. రెండు పిల్లులు, ఒక ముసలమ్మ ఇంట్లో దూరి ఆ ముసలమ్మ చేసి పెట్టుకున్న రొట్టేముక్కను ఎత్తుకుపోతాయి. ఈ కథ, కథలోని నీతి అందరికీ తెలిసిందే.. ఆ కథ మొద ట్లో ఎవరు రాశారో ఎవరు చెప్పారో గానీ కొట్లాడుకోకుండా దోచుకున్న సొత్తును సమానంగా పంచుకోవాలన్నది ఆ కథలోని నీతి. ఆ నీతి సూత్రాన్ని అవినీతి పరులు చాలాకాలమే పాటిస్తూవచ్చారు. అదే న్యాయమని నమ్మించారు కూడా. తరతరాలుగా ఆ కథ చెపుతూ వస్తోన్న వాళ్ళు, వింటూ ఊ కొడుతున్న వాళ్ళు పాపం పిల్లులు అనుకున్నారు కానీ రొట్టె చేసుకున్న ముస ల్ది ఏమయిపోయిందో ఆలోచించలేదు. ఇవాళ మన తెలుగు మీడియా కూడా అదే ధర్మమని భావిస్తున్నట్టుంది. కొద్దికాలంగా మన మీడియాలో ఆస్తుల గొడవ నడుస్తోంది. ముఖ్యంగా జగన్ ఆస్తులమీద సీబీఐ విచారణ మొదలైనప్పటినుంచి మన ఛానళ్లు పత్రికలూ ఆయన ఆస్తుల చిట్టా సేకరించే పనిలో ఉన్నాయి. వై.ఎస్. రాజశేఖర రెడ్డి లాగా మిత్రలాభం గురించి ఆలోచించి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవేమో కానీ ఆయన కొంచెం ఆధునికుడు, ముల్లును ముల్లుతోనే తీయాలనుకుని ఇప్పుడు చంద్రబాబును కూడా సీబీఐ ఉచ్చులోకి దించాడు. సీబీఐ విచారణ సంగతేమో గానీ మీడియాకు మాత్రం ఇప్పుడు చేతినిండా పని దొరికింది. ఇరవై నాలుగు గంట లూ తెలుగు ఛానళ్లు విడతల వారీగా జగన్మోహనడ్డి, చంద్రబాబు నాయుడుల ఆస్తుల గురించి చర్చలు, వాదోపవాదాల చేస్తోన్నాయి. 


అసలు ఈ సొమ్మంతా ఎవరిది, ఇన్ని లక్షలు ఎక్కడినుంచి సృష్టించారు అన్న విషయాల మీదికి చర్చ వెళ్ళకుండా మీడియా ఇప్పుడు పిల్లుల గురిం చి, పిల్లులకు వాటాలిచ్చిన కోతుల గురించి కథలు కథలుగా కథనాలను ప్రసారం చేస్తున్నది. సీబీఐ, విచారణలు, కోర్టుల తీర్పులు ఎలా ఉన్నా ఈ రెండు కేసుల్లో ఇప్పటికే నష్టం జరిగింది మాత్రం తెలంగాణకు. వీళ్ళు అమ్ముకున్నారనో, పంచిపెట్టారనో లేదా కేటాయించారనో చెపుతున్న భూములన్నీ తెలంగాణ ప్రాంతంలోనివి. అందునా ఎక్కువ హైదరాబాద్ చుట్టూ ఉన్నవి. రాజశేఖర్‌డ్డి చంద్రబాబు వేరు వేరు వ్యక్తులు కావొచ్చు, వేరు వేరు పార్టీల్లో ఉండవచ్చు. వేరు వేరు జెండాలతో ఎన్నికల్లో పోటీ పడి ఉండవచ్చు. కానీ ఇద్దరి ఎజెండా ఒకటే అన్నది మాత్రం ఇప్పుడిప్పుడే సీబీఐ వెలికితీస్తున్న వివరాలను బట్టి తెలుస్తున్నది. ఇద్దరూ హైదరాబాద్‌ను, దాని చుట్టూ పక్కల ఉన్న భూములను ఆధారంగా చేసుకుని తమ తమ అభివృద్ధి ప్రణాలికలను అమలు చేశారు. రెండు పిల్లుల కథలో ఒక పిల్లి దోచుకొస్తే ఇంకొక పిల్లి కాప లా ఉంటుంది. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లపాటు వైఎస్ ప్రధాన కాపలాదారుగా ఉండాల్సిన ప్రతిపక్ష నాయకుడు. ఆ తరువాత వైఎస్ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లపాటు బాబు కాపలా దారు. యేవో క్షణికావేశంలో అప్పుడప్పుడు విమర్శించుకునే వారు తప్ప కోర్టులు కేసుల జోలికి వెళ్లలేదేప్పుడు. కేసులు వేసుకున్నా అవి విచారణ దాక వెళ్ళేలోపే రాద్ధాంతం లేకుం డా రాజీ పడిపోయారు. వైఎస్ హఠాన్మరణం తరువాత జగన్ అతని వారసునిగా అవతరించడం చంద్రబాబు రాజకీయ ప్రస్థానానికి ఊహించని అడ్డంకిగా మారింది. 

ఈ దశలో తెలుగుదేశం ఔత్సాహికులు కొందరు వైఎస్ అక్రమాలు, జగన్ ఆస్తుల మీద కేసు వేసి ఇరుకున పెట్టాలని భావించి ఉంటారు. అదే కోణం చూపిస్తూ ఎర్రన్నాయుడు హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఆకేసును సీబీఐకి అప్పగించడంతో అప్పటికే కాంగ్రెస్ ఎదురుదాడిలో గాయపడి ఉన్న జగన్‌కు పుండు మీద కారం చల్లినట్టయ్యిం ది. దీంతో అక్రమ ఆస్తుల కేసులో విచారణను ఎదుర్కొంటున్న జగన్ తల్లి విజయమ్మ చంద్రబాబు ఆస్తుల మీద విచారణకు కోర్టును ఆశ్రయించారు. ఆమె కేవలం పిటిషన్ మాత్రమే కాక దానితో పాటు వేలాది పేజీల ఆధారాల పత్రాలు కూడా కోర్టుకు సమర్పించారు. ఇట్లా కాలం నడిచినంతకాలం ఒకరికొకరుగా ఉన్న రెండు కుటుంబాలు ఇవాళ సీబీఐ విచారణలో ఉన్నారు.

రాజశేఖర్‌డ్డి, చంద్రబాబు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం ముందుగా అధికారంలోకి వచ్చారు. ప్రపంచంలో ఐటీకి ఆదరణ ఉన్న రోజుల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హైదరాబాద్ రూపురేఖలను మార్చేసే పనికి పూనుకున్నాడు. ప్రపంచబ్యాంకు మద్దతుతో అభివృద్ధి నిర్వచనాన్ని మార్చేసి హైదరాబాద్ అభివృద్ధే ఆంధ్రవూపదేశ్ అభివృద్ధి అని, హైదరాబాద్‌ను ఐటీ రాజధాని చేస్తానని వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములను, పేద రైతుల భూములను బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టారు. హైటెక్ సిటి నిర్మాణానికి దేశంలోని బడా కాంట్రాక్టర్లతో బేరసారాలు కుదిర్చారు. సత్యం రామలింగ రాజుతో స్నేహం చేశారు. ఆ స్నేహం తో అమెరికా అధినేతనే అతిథిగా పిలుచుకోగలిగారు. ఒక్క హైటెక్ సిటితో ఆగకుండా ఫార్మా సిటీలు మొదలు ఫిలింసిటీల దాకా వేలాది ఎకరాల తెలంగాణ భూములను ధారాదత్తం చేశారు. అంతేకాదు హైదరాబాద్ రంగాడ్డి జిల్లాల మధ్య కొత్తగా ఒక ఆర్థిక వ్యాపార వాణిజ్య జిల్లా పేరుతో వేలాది ఎకరాలు కంపెనీలకు కట్టబెట్టారు. దానికి ఆనుకునే ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు పునాదివేసి కోనేరు ప్రసాద్‌కు ఒక కొత్త సామ్రాజ్యాన్ని అప్పగించారు. పెద్ద పెద్ద చెరువులు పూడ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చేసి మళ్ళీ వర్షపు నీటికోసం ఇంకుడు గుంతలు తవ్వించారు. రోడ్లు వెడల్పు చేసి వాటిమీద పె్లై ఓవర్లు నిర్మించారు. ఈ అభివృద్ధిలో తన సామాజిక వర్గం వారిని భాగస్వాములను చేశారని వారిద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టారన్నది ఇవాళ కోర్టు ముందున్న వాదన. వారిలో కొందరు ఆ వెంటనే పార్లమెంటు సభ్యులైపోయారు. 

ఇంకొందరు పార్టీలో ముఖ్యనేతలుగా ఎదిగి తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్నారు. మరికొందరు బాబుగారి బినామీలుగా ఆయన సంపదను కాపాడుతున్నారన్నది వాదన. ఈ కేసును వైఎస్ సతీమణి విజయమ్మ వేశారు. వై.ఎస్. ప్రజా ప్రస్థానం కూడా అదే బాటలో సాగింది. వై.ఎస్. కూడా హైదరాబాద్ చుట్టుపక్కల భూములతోనే వివాదస్పదుడయ్యారు. జగన్‌కు పెట్టుబడులు పెట్టిన వారంతా ప్రత్యేక ఆర్థిక మండలాల పేరుతో వై ఎస్ దగ్గర తెలంగాణ జిల్లాల్లో భూములు, జలయజ్ఞం కాంట్రాక్టులు,మరికొందరు హైదరాబాద్‌లో ముస్లింల వక్ఫ్ భూములు, హుసింగ్ బోర్డ్ భూములు అక్రమంగా పొంది విల్లాలు, టవర్లు కట్టారని అభియోగం. 

ఇప్పటి పిల్లుల కథలో పిల్లులు, కోతులూ కలిసిపోయాయి. అభియోగాలను బట్టి ముసలమ్మ రొట్టెను కోతులకు కట్టబెట్టినట్టు తెలంగాణ భూములను తమ తమ బంధువులకు, వందిమాగధులకు, బినామీలకు, వాళ్ళు పెట్టిన కంపెనీలకు కట్టబెట్టారు. పాలన ఎవరిదైనా ప్రసాదంలా పంచుకున్న ది మాత్రం సీమాంధ్ర పెట్టుబడిదారులే. వారిలో మెజారిటీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు పత్రికల్లో వస్తోన్న పేర్లు, అఫిడవిట్‌లో ప్రస్తావించిన పేర్లను పరిశీలిస్తే పదేళ్ళలో పంచిపెట్టిన వాళ్ళు మారారు తప్ప పంచుకున్నది ఒక్కరే అని అర్థమౌతుంది. పది, పదిహేనేళ్ళ కాలంలోహైదరాబాద్, నగరం చుట్టూ ఉన్న నాలుగైదు జిల్లాల్లో ఉన్న భూములమీద లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. కొందరు లక్షలకోట్లు సంపాదిస్తే, వందలాదిమంది కోటీశ్వరులైపోయారు. అలాగే అనామకులు ఏ వన్ కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తారు. అక్కడితో ఆగకుండా ఆ సంపదను కాపాడుకోవడం కోసం రాజకీయా పార్టీల్లో చేరో, పార్టీలు పెట్టో దేశసేవకు పునరంకితం కావాలని కలలుగంటున్నారు. సరిగ్గా ఈ ఇద్దరి పాలనలో పెట్టుబడిదారులుగా ఎదిగిన వాళ్ళే తెలంగాణను అడ్డుకున్నారు. పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్లకార్డ్ పట్టుకున్నది, రెండుకళ్ల సిద్ధాంతాలు పుట్టుకొచ్చింది ఈ పెట్టుబడిదారులను, వాళ్ళ పెట్టుబడిని కాపాడుకోవడం కోసమే. ఇప్పుడు హైదరాబాద్ భవిష్యత్తుకోసం హైరానా పడుతున్నవాళ్లంతా వాళ్ల ఎంగిలి కూటికి అలవా టు పడ్డవాళ్లే. వీళ్ళకు ఈ రెండు కేసుల మధ్య తెలంగాణ కోల్పోయిన లక్షలాది ఎకరాల భూములు, వేలాదిమంది రైతు కుటుంబాల వ్యధలు, శిథిలమైపోయిన ప్రజల బతుకులు కనిపించవు.

అలాగే తెలంగాణ ఉద్యమం ద్వారా ఓట్లు, సీట్లు అని ఆరాటపడే వాళ్ళు, ఇదే పెట్టుబడి పార్టీలతో ఎన్నిక లు, ఎత్తులు పొత్తులు అనుకునే వాళ్ళు ఈ విషయాలను పట్టించుకోరు. కనీ సం తెలంగాణ ఉద్యమకారులైనా ఈ విషయాన్ని తెరమీదికి తెచ్చి ఎవరి భూములు వారికి ఇప్పించే పోరాటం చేయవచ్చు. అలాంటి పోరాటం తెలంగాణను దోచుకుని ముద్దాయిలుగా నిలబడ్డవాళ్లను నిలదీయడానికి, అడ్డుపడుతున్న వాళ్ళ మెడలు వంచడానికి పనికొస్తుంది. అన్నిటికీమించి సొంతభూముల్లో కూలిలై కునారిల్లుతున్న తెలంగాణ రైతుల బతుకులు బాగుపడతాయి. 

 
రచయిత సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు 
Namasete Telangana News Paper Dated 25/11/2011, ఈ మెయిల్ : ghantapatham@gmail.co