Showing posts with label తెలంగాణ. Show all posts
Showing posts with label తెలంగాణ. Show all posts

Thursday, September 5, 2013

భాషావూపయుక్త రాష్ట్రాలు - భారతదేశం By -లంకా వెంకట పాపిడ్డి



తెలంగాణ -ఉద్యమం సందర్భంగా సీపీఎం పార్టీ అవకాశవాద రాజకీయాలు మరోసారి తేటతెల్లం అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం విషయంలో అభివూపాయం చెప్పవవలసి వచ్చినప్పుడు సీపీఎం ఎప్పుడు తను భాషా ప్రయుక్త రాష్ట్రాల అవగాహనకే కట్టుబడి వున్నామని చెప్పుతూ వచ్చింది. అయితే సీపీఎం దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడిన చరిత్ర ఎప్పుడూ లేదు. వీళ్లు గొప్పగా చెప్పుకునేది ఒక్క రాష్ట్రం ఆంధ్రవూపదేశ్ గురించి మాత్రమే. విశాలాంవూధలో ప్రజారాజ్యం పేరు తో తెలుగువారందరికి ఒకే రాష్ట్రం కావాలని మేము సైతం పోరాడామని చెప్పుకుంటారు. ఇది తప్ప మరో ఉదాహరణ చెప్పలేరు. అది కూడా అప్పు డు ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలోనే జరిగింది. ఆ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సీపీఐ దాని నుంచి విడిపోయిన ఎందరో కమ్యూనిస్టులు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని బలపరుస్తున్నారు. కానీ సీపీఎంగా ఏర్పడిన నాటి నుంచి ఆ పార్టీ భాషావూపయుక్త రాష్ట్రాల కోసం చేసిన పోరాటం ఏది లేదు, గొప్పగా కట్టుబడి వుండడం తప్ప.

అవును భారతదేశంలో అన్నీ భాషల వారికి తమ తమ భాషా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అందుకే మాకు మళ్ళీ ఆ అవసరం రాలేదని సీపీఎం వారు వాదించవచ్చు. అప్పుడు భారతదేశాన్ని పరిశీలించక తప్పదు. వీరి గొప్ప భాషా ప్రయుక్త రాష్ట్రం పశ్చిమబెంగాల్‌నే ముందు చూద్దాము. పశ్చిమ బెంగాల్‌లో గుర్ఖాలాండ్ రాష్ట్రం కావాలని కోరుతున్న ప్రజలు బెంగాళీలు కాదు. వారి భాష బెంగాలీ కాదు. అయినప్పుడు వారి భాషా ప్రతిపాతిపదికన ఒక రాష్ట్రం కావాలని కోరడం ఎలా తప్పు అవుతుంది. 30 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని వెలగపెట్టిన సీపీఎం గుర్ఖాలాండ్‌ను ఎందు కు వ్యతిరేకించింది. జార్ఖండ్ రాష్ట్రానికి సరిహద్దుగా వున్న బెంగాల్ కు చెందిన జిల్లాల్లో సంతాల్ ఆదివాసీ ప్రజలు ఉన్నారు. సంతాల్ ప్రజల భాష బెంగాళీ కాదు. సంతాల్ ఆదివాసులకు బెంగాళీ జాతికి ఎక్కడా అంటు సొంటు లేదు. మరి సీపీఎం పార్టీ మహాశయుల్లారా జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు జార్ఖండ్‌కు చెందిన వారి సోదర సంతాల్ ప్రజ లు, బెంగాల్‌లోని సంతాలు ప్రజలున్న జిల్లాలను కూడా జార్ఖండ్‌లో కలపాలని కోరినప్పుడు, ఆ జిల్లాల ప్రజలూ అంగీకరించినప్పుడు మీరెందుకు అంగీకరించలేదు. (జార్ఖండ్‌లో 24 లక్షల మంది సంతాల్ ప్రజలు ఉంటే, బెంగాల్‌లో 23 లక్షల మంది సంతాల్ ప్రజలు ఉన్నారు.)ఒకే ఆదివాసీ తెగకు చెందిన ఒకే సంస్కృతి, భాష కలిగిన ప్రజలు, ఒకే భూ భాగం కలిగిన ప్రజలు ఒకే రాష్ట్రంగా వుం టామని ఎంత బతిమాలినా బెంగాల్‌లో అధికారాన్ని చెలాయించిన సీపీఎం ఎందుకు ఒప్పుకోలేదు.

మేము పోరాడి సాధించామని చెప్పే ఆంధ్రవూపదేశ్‌ను కూడా చూద్దాము. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల సరిహద్దులలో వున్న ఆదిలాబా ద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పుగోదా వరి, పశ్చిమగోదావరి జిల్లాలలో కోయ ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి భాష, సంస్కృతి, ఆర్ధిక, సామాజిక జీవనం మహారాష్ట్ర, ఛత్తీస్‌గ ఢ్, ఒడిషా రాష్ట్రాలలో వున్న కోయ ప్రజలతో దగ్గరగా వుంటాయి. ఈ నాలుగు రాష్ట్రాలలో విశాల ప్రాంతంలో వున్న ఒకే భాష, ఒకే సంస్కృతి కలిగిన కోయ ప్రజలందిరికీ ఒకే రాష్ట్రం వుండాలని భాషా ప్రయుక్త రాష్ట్రాలకు గొప్పగా కట్టుబడి వుండే సీపీఎంకు ఇప్పిటికి గుర్తుకు రాలేదు. (కానీ తెలంగాణ అనగానే మాత్రం సీపీఎంకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు గుర్తుకు వస్తాయి.) లేకపోతే సీపీఎం భాషావూపయుక్త రాష్ట్రాల అవగాహనా పరిధిలోకి కోయ ప్రజలురారా?, ఒకే భాష వున్నా లిపిలేని భాషల ప్రజలు ఆ పరిధిలోకి రారా? దేశంలో స్వచ్ఛమైన భాషావూపయుక్త రాష్ట్రము ఒక్కటీ లేదు. అన్ని రాష్ట్రాల సరిహద్దులలో భిన్నమైన భాషా సంస్కృతులు కలిగిన ఆదివాసులు వున్నారు. ఒకే భాష, సంస్కృతి, ఆర్థిక, సామాజిక విధానం, ఒకే భూభాగం కలిగి వున్న ఆదివాసులకు ఒకే రాష్ట్రం ఏర్పాటు చేయకుండా అప్పటికే అభివృద్ధి చెందిన జాతుల ప్రజల తో కలిపి వివిధ రాష్ట్రాలలో విభజించి వేశారు. ఇప్పుడు ఆ ఆదివాసులు ఆయా రాష్ట్రాలలో తమ భాషను, సంస్కృతిని, అవకాశాలను కోల్పోతూ రెండవస్థాయి పౌరులుగా జీవించవలసి వస్తున్నది. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు గొప్పగా కట్టి వేసుకున్న సీపీఎం దేశ ఆదివాసులకు వారి భాష ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని సైద్ధాంతికంగానైనా చెప్పదు.

తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించడానికి సీపీఎం దగ్గర ఒక్క భాషావూపయు క్త రాష్ట్రాల ఆయుధమే లేదు చిన్న రాష్ట్రాల ఆయుధం కూడా ఉన్నది. దీనికి మతతత్వ ఆర్‌ఎస్‌ఎస్‌ను, బీజేపీ పార్టీలను బూచిగా కూడా చూపుతున్నది. చిన్న రాష్ట్రాల వల్ల భారతదేశ ఫెడరల్ వ్యవస్థ బలహీన పడుతుంది. కేంద్రం బలోపేతమవుతుంది. దీనితో కేంద్రం రాష్ట్రాలపైన నియంతృత్వాన్ని రుద్దుతుంది, నిరంకుశంగా వ్యవహరిస్తుంది అని సీపీఎం వాద న. బీజేపీ లాంటి మతతత్వపార్టీ నిరంకుశ కేంద్రం కోసం చిన్న రాష్ట్రాల నిర్మాణాన్ని బలపరుస్తున్నదనీ, భారతదేశ ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీయడానికే చూస్తున్నదనీ సీపీఎం చెప్పుతున్నది. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ల అవగాహన గురించి సీపీఎం చెప్పుతున్నది ఒకవేళ నిజమే అయినా అది తెలంగాణ విషయంలో పనికిరాని వాదనే అవుతుంది. ఆంధ్రవూపదేశ్ విభజన జరిగినా, తెలంగాణ చిన్న రాష్ట్రం కాదు. సీమాంధ్ర చిన్న రాష్ట్రం అంతకంటే కాదు. తెలంగాణ గతంలోనే ఒక దేశంగానూ, ఒక రాష్ట్రంగా నూ మనగలిగింది. నిజంగానే చిన్న రాష్ట్రాల వల్ల కేంద్రం నిరంకుశంగా నియంతృత్వాన్ని అమలు చేస్తే చిన్న రాష్ట్రాలు అన్ని కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడలేవా? కేంద్రం రాష్ట్రాల మధ్య సరియైన సంబం ధాల కోసం చిన్న రాష్ట్రాలన్నింటితో కలిసి నిరంకుశ కేంద్రానికి వ్యతిరేకంగా సీపీఎం పోరాటం చేయరు? నాయకత్వం వహించదు ? ఘోరమైన విషయం ఏమిటంటే కేంద్రంలో ఎన్నడైనా అధికారంలోకి వస్తామనే అవగాహనే సీపీఎంకు లేదు. అటువంటి అవగాహన వుంటే, చిన్న రాష్ట్రాలు వుంటే బీజేపీ కేంద్రానికి నిరంకుశంగా మార్చుతుందనే వాదన చేయదు. సీపీఎం అధికారంలోకి వస్తే, వచ్చినప్పుడు అసలైన ఫెడరల్ కేంద్రానికి ఆచరణలో చూపించవచ్చు. కానీ కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలు తప్ప ఎవరూ అధికారంలోకి రారు అనే అవగాహనకు సీపీఎం బలంగా కట్టి వేసుకున్నది. అసలు విషయం ఒక రాష్ట్రం ఏర్పడడానికి సరైన, అవసరమైన ప్రాతిపదికలు వున్నాయో లేవా అనేది చూడాలి కానీ ఎలా అడ్డుకోవాలనే సాకులు కాదు.

ప్రస్తుతం సీపీఎం పరిస్థితి మరింత దిగజారింది. తెలంగాణ ఉద్యమం సాగుతున్నంతకాలం, భాషావూపయుక్త రాష్ట్రాలకు కట్టుబడివున్నామని చెప్పి నా, సీపీఎం తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయలేదు. ఇతర వ్యతిరేక ప్రకటనలూ చేయలేదు. అంతేకాదు కేంద్రం ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకొని రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితిని తొలగించాలని సీపీఎం డిమాండ్ కూడా చేసింది. తెలంగాణ ఏర్పడకపోవడానికి ఇతర పార్టీలను కారణాలుగా చూపుతూ కేంద్రం మా భూజాల పైన తుపాకి పెట్టి కాల్చాలని చూస్తున్నదని సీపీ ఎం ఆరోపణ చేసింది. మా అంగీకారం లేకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఎన్ని బిల్లులు పాస్ చేయించుకోలేదు అంటూ ఎదురు ప్రశ్నించారు. ఈ కాలంలో తెలంగాణ విషయంలో సీపీఎం చేసిన ప్రకటనలు అన్ని కేవలం సైద్ధాంతికమైనవి మాత్రమే అనే అర్ధం వచ్చేలా వున్నా యి. అందుకే టీఆర్‌ఎస్ ఉన్న ఎన్నికల కూటముల్లో వుండడానికి సీపీఎంకు ఎటువంటి అభ్యంతరం కూడా లేకుండింది. కానీ ఈరోజు సీపీఎం కార్యదర్శి రాఘవులు అవకాశవాదంలో చంద్రబాబు, జగన్‌లను కూడా మించిపోయాడు. ఇప్పుడు సీమాంవూధలో సమైక్య ఉద్యమం పేరుతో జరుగుతున్న ఆక్రమణ ఉద్యమాలను చూసేసరికి సీపీఎం అసలు రూపం బయటికి వచ్చింది. ఈ ఆక్రమణ ఉద్య మంలో చొరబడి మిగతా వారందరికంటే చాంపియన్‌లుగా ఫోజు పెట్టి తమ ఓటు బ్యాంకు పెంచుకోవడానికి సీపీఎం కూడా మిగతా బూర్జువా పార్టీల లాగానే పోటీ పడుతున్నది. మిగతా పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని సమైక్యత కోసం మేము స్వతంవూతంగా నిఖార్సైన పోరాటం చేస్తామని బి.వి.రాఘవులు చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం. సీమాంధ్ర ఆక్రమణ ఉద్యమంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల పట్ల వ్యతిరేకతను సీపీఎం వాడుకొంటున్నది. కానీ మహా కూటమిలో చేరి సీపీఎం కూడా డ్రామా ఆడిందని అక్కడి ప్రజలకు తెలుసు. సీపీఎం తన అసలు రూపం బయట పెట్టుకుని లాభం పొందవచ్చని అనుకోవచ్చు కానీ అది భ్రమ మాత్రమే. సీమాంవూధలో ఎలాగూ ఒక్క సీటు కూడా రాదు. తెలంగాణలో వున్న ఒక్క సీటు కూడా వూడుతుంది. రెండు నాల్కల పార్టీలన్నింటికి ప్రజలు ఇటువంటి వైద్యమే చేశారు చరిత్ర పొడుగునా...

-లంకా వెంకట పాపిడ్డి
Namasete Telangana Telugu News Paper Dated : 06/09/2013 

Thursday, January 10, 2013

అస్తిత్వ పోరాటాలదే అంతిమ విజయం ----టి.మోహన్‌డ్డి


అస్తిత్వ పోరాటాలదే అంతిమ విజయం
‘తెలంగాణ ఉద్యమానికి చారివూతక నేపథ్యంతోపాటు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక కారణాలున్నా యి. సాధారణ ప్రజల్లో సైతం బలమైన ఆకాంక్ష కనిపిస్తున్నా ఈ ప్రాంత ప్రజావూపతినిధుపూందుకు వ్యతిరేక దిశలో వ్యవహరిస్తున్నారు’? అంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ పెద్దమనిషి మలిదశ ఉద్యమానికి ముందునన్నడిగారు. ప్రభుత్వోద్యోగిగా చాలా కాలం ఢిల్లీలో పనిచేసి పదిహేనేళ్లుగా హైదరాబాద్‌లో విశ్రాంత జీవితం గడుపుతున్న ఆ సీనియర్ సిటిజన్ మొహమాటం లేకుండా మరో ముఖ్యమైన మాట అన్నారు. ‘అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మనవాళ్లు తమిళసోదరుల నుంచి పొందిన అవమానాలు, వివక్షలన్నీ, ఇక్కడి వారి పై ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నట్లుగా ఉన్నది. అసలు విషయాలు, చారివూతక సత్యాలను మీ లాంటి న్యాయవాదులు సామాన్య ప్రజలందరికి తెలియచేయాల’ని ఆయన చేసిన కర్తవ్యబోధ నన్ను ఆలోచింపచేసింది.

విశాలాంవూధలో తెలంగాణకు ప్రత్యేకమైన కష్టాలు షురువైన రోజులవి. అప్పుడప్పుడే రాష్ట్ర రాజధాని కర్నూలు నుం చి తరలిరావడంతో హైదరాబాద్‌లో హఠాత్తుగా పెరిగిపోయి న జనాభా వల్ల వనరులు, వసతుల కొరతతోపాటు స్కూలు, కాలేజీ సీట్లకు అనూహ్యమైన స్థాయిలో పోటీ ప్రారంభమైం ది. తెలంగాణ ప్రాంతం మొత్తానికి అప్పట్లో ఒకే ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేది. పెరుగుతున్న ప్రాంతీయ విద్యా అవసరాలకు అది సరిపోయేదికాదు. సీమాంధ్ర నాన్-ముల్కీల చొరబాటుతో సమస్య మరింత జటిలమైంది. అధికారం తెలంగాణేతర శక్తుల్లో ఉండేది.‘బడితే ఎవడిదో బర్రె వాడిదే’అన్నట్లు పరిస్థితులుండేవి. రాష్ట్రావతరణకు ముందు రాసుకున్న పెద్దమనుషుల ఒప్పందంలోని అంశాలన్నింటిని కాలరాస్తున్న కాలమది. ఆగమేఘాల మీద మలక్‌పేట, పంజాగుట్ట లాంటి ప్రాంతాలలో కర్నూలు క్యాంపు రాజధాని నుంచి తరలి వచ్చిన ప్రభుత్వోద్యోగుల కోసం భారీఎత్తున వసతి గృహాలు నిర్మించబడ్డా యి. అంతటా నిరుద్యోగ సమస్య. అప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్, ఐడీపీఎల్, డీఆర్‌డీఎల్ లాంటి అనేక సంస్థలు హైదరాబాద్ చుట్టూ వెలిసినా తగిన సహకారం లేనందున తెలంగాణ నిరుద్యోగులకు నిరాశేమిగిలేది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కోటాలో ఇష్టారాజ్యం. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ఉద్యోగాల్లో తెలంగాణ వారి వాటా, హక్కుల గురించి ఆడిగేనాథుడు లేడు. జవాబు దొరికే మార్గం కూడా కనిపించేది కాదు. రాజకీయాల్లో ఉండేవారికి పదవులు, పైరవీలయితే, ఉద్యోగస్థులకు సాధారణం గా వారి ప్రమోషన్, జీతభత్యాలు పెంపుదలకోసం పోరాటాలతో సరిపోయేది. సగటు పౌరుని స్థితిగతుల గురించి, వం చించబడుతున్న తెలంగాణ ప్రాంతీయుల కష్టాలు ఎవరికీ పట్టని పరిస్థితి ఉండేది. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితుల్లో అప్పుడప్పుడే తెరమీదికోస్తున్న నక్సలైట్ ఉద్యమం, అందులో కలుస్తున్న విద్యాధికుల గురించి వార్తలు వినిపిస్తుండేవి. మరోవైపు వివక్ష పాలనవల్ల పెరిగిన రాజకీయ కక్షలవల్ల పరిస్థితి విషమించి 1969లోతొలి తెలంగాణ ఉద్య మం ఉధృత రూపంలో రానే వచ్చింది. ఈ ఉద్య మం ప్రపంచదేశాలను సైతం ఆకర్షించి సత్ఫలితాలు పొందే దశలో స్వార్థ రాజకీయాలు రంగ ప్రవేశంచేసి ఉద్యమాన్ని పక్కదారి పట్టించాయి. ఆ తర్వాత అన్యాయాలు, వివక్ష పెరిగిందే గాని ఒరిగిందేమిలేదు. 

స్వరాష్ట్రంలో ఆదరణ కరువైన నిరుద్యోగులలో ఆరోజుల్లో డిగ్రీ, డిప్లమోలు చేతపట్టుకుని మహారాష్ట్ర, కర్ణాటకలో స్థిరపడిన వారెందరో ఉన్నారు. ఒక్కరు కూడా సీమాంధ్ర వెళ్లడానికి ఇష్టపడేవారు కాదు. ఇరు ప్రాంతాల మధ్య ఆదేదో అర్థం కానీ దాయాదుల మధ్య ఉండే వైరం లాంటిది ఉందని చరిత్ర పాఠాలు చెప్తున్నాయి. విశాలాంధ్ర మంత్రం ఒక విఫలమైన ప్రయోగం. అస్తిత్వ పోరాటాలు కులం, మతం వర్గాలకు అతీతమైనవి. ఇంత జరిగిన తర్వాత కూడా ఇరు ప్రాం తాలు కలిసి ఉండడమనేది ‘కల’ మాత్రమే కాదు ‘కల్ల’. విశాలాంధ్ర అనేది ఆరిపోతున్న దీపం లాంటిది. ఆరిపోయే ముందు వెలిగే వెలుగులా, ఇరువైపుల ఉన్న స్వార్థశక్తులు ఎన్ని కుట్రలు, కుతంవూతాలకు, విష ప్రచారాలకు పూనుకున్నా ఆలస్యమవుతుందేమో గానీ అస్తిత్వ పోరాటానిదే అంతిమ విజయం.

‘ఎంత చైతన్యం ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నంత కాలం సీమాంధ్ర ధనిక వర్గాలు తెలంగాణ ప్రాంతపు బలహీన వర్గాలను అణచివేస్తూనే ఉంటాయి. ఏ వర్గాన్నీ ఎదగ నీయవు. ఐక్యంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించడమే పరిష్కా రం’ అన్న ప్రొఫెసర్ జయశంకర్ మాటల్ని మరోసారి జ్ఞాప కం చేసుకుందాం. రాష్ట్ర సాధన పోరాటంలో అందరం కలిసి ఉద్యమిద్దాం. మన కల సాకారం చేసుకుందాం.మన నేలలో మన పాలనను స్థాపించుకుందాం. ప్రాంతేతర దోపిడీ దారులను పొలిమేర దాకా తన్ని తరుముదాం. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే పాతాళంలో పాతరేద్దాం.

-టి.మోహన్‌డ్డి, హైకోర్టు న్యాయవా

Namasete Telangana News Paper Dated: 10/1/2013

Saturday, December 8, 2012

డిసెంబర్ 9, ఒక నిజం-- Sampadakiyam



pranahita

ఆర్ట్స్ కాలేజీ ముందర ఒక గాయపడిన చెట్టుంది! ఆ చెట్టుకు వందనం. సంతోష్ శవం వేలాడిన చెట్టు. జీవంతో తొణికిసలాడుతూ ఉన్న సంతోష్‌తో చివరి తెలంగాణ ముచ్చట్లు పంచుకున్న చెట్టు. సంతోష్ చివరి కోరికా, ఏమాత్రం మార్మికం కాని బహిరంగ ఆలాపనా ఆ చెట్టుకు తెలుసు. పచ్చదనం మాత్రమే ప్రపంచానికి పంచే ఆ చెట్టు సంతోష్ చివరి జీవునం తన్నుకులాడినప్పు డు మోడువారినట్టు విలవిలలాడినట్టున్నది. ఆ చెట్టు మూడేండ్ల కిందట సఫలమ యి విఫలమయిన కలను గన్న చెట్టు. యవ్వన తేజంతో వెలిగిన ఆర్ట్స్ కాలేజీ వైభవాన్ని, పోరాట సంప్రదాయాన్ని కళ్లు తెరుచుకుని చూసిన చెట్టు. అదొక సాఫల్యాన్ని కళ్లు విప్పార్చుకొని పత్రసతతంగా సయ్యాటలాడి వీక్షించింది. కొమ్మల తలలూపుతూ ‘కదనాన శత్రువుల కుత్తుకలు తెగటార్చ’ ఆకుల బాకులు దూసి ఇదీ తెలంగాణ అని విద్యార్థి వీరుల గానాలను విన్నది. గాలికి నృత్యం చేసింది. సంబురం అంబరమంటిన ఆ డిసెంబర్ 9 అర్ధరాత్రీ, అపరాత్రీ తెల్లవారిందాకా ఊగితూగిన తెలంగాణవాదులతో కత్తుకలిపింది. కదం కలిపింది. పదం కలిపింది. ఆ చెట్టు ఇంకా కలగంటున్నది. డిసెంబర్ 9 నిజమే. అది ఆరు దశాబ్దాల దుఃఖ సమువూదపు చివరి ఒడ్డు. అంతంలేని బాధల గాధల పల్లవుల చివరి చరణం. ఆ రాత్రి. ఎంతకీ తెల్లారని రాత్రి. మూడేండ్ల తర్వాత కూడా కలలోలా? మెలకువలాగా సందిగ్ధం లాగా సంధిలాగా.. జ్వరపీడనలాగా. ప్రేలాపనలాగా, ఆలాపనలాగా, ఆర్సిపెట్టిన దద్దరిల్లి ప్రతిధ్వనించిన ఆర్ట్స్ కాలేజీ ఏకశిలా స్తంభాలలో పరివ్యాపించిన కేకలాగా.. తెలంగాణ వచ్చింది. మున్నూటా అరవై తొమ్మిది మంది త్యాగాల మునుమే కదా! వెయ్యిమంది బలిదానాల తెగువే కదా! తెలంగాణ, తెలంగాణ.. గుండె గుండె కూ వ్యాపించింది తెలంగాణ. మనం గెలిచాం.. ఆడుదాం ధూలా. నెగళ్లు ఎగసిన ఆర్ట్స్ కాలేజీ. డిసెంబర్ రాత్రి చలికి వేడి పుట్టించిన ఆకాశమెత్తు ఎగిసిన నినాదాలు. దిక్కులు పిక్కటిల్లే చివరి నినాదం. 

గెలుపూ మనదే. విజయహాసమూ మనదే. జై తెలంగాణ. చెట్టు సంబరపడింది. చెట్టు కొంచెం క్షోభపడింది. తరతరాల దుక్కం వెక్కిళ్లలోకి అంతమైంది. కానీ, కానీ, కానీ... మూడేండ్ల తర్వాత ఒకానొక విషాద రాత్రి. కేరింతలు కొట్టిన యవ్వనం. డస్సిపోయి, భంగపడి చెట్టుదగ్గర నిలబడింది. తెలంగాణ ఇంకా తెల్లారలేదు. ఇస్ రాత్‌కా సుభా నహీఁ. విసిగిపోయాను ఈ ప్రపంచం మీద, రాజకీయాల మీద.. చివరికి ప్రజాస్వామ్యం మీదా నాలుక మడిచిన ప్రజాస్వామ్య సౌధాల మీద. చివరికి జీవితంమీదా రోసిపోయిన వాడు నిలబడ్డప్పుడు దుక్కాన్నీ, నవ్వునీ, సంబురాన్నీ, విషాదాన్నీ ఏకకాలంలో అనుభవించి న ఆ చెట్టు గజగజా వణికింది. పత్రహరితంలా పరుచుకోవాల్సిన యవ్వనం, పండు వెన్నెలై వికసించాల్సిన యవ్వనం, పండిత, సిద్ధాంత చర్చల్లో పరిఢవిల్లాల్సిన యవ్వ నం, ప్రేమలో వికసించే విద్యుత్తేజం కావాల్సిన యవ్వనం నిండురూపంతో తనముందు నిలబడి తల్లడిల్లినప్పుడు ఆ చెట్టు భయంతోనూ, భీతితోనూ మూర్ఛనలు పోయింది. రాజకీయమా! ఏమి శెరపెట్టినవ్ ఈ తెలంగాణ బిడ్డలకు. 

మ్రాన్పడిపోయింది చెట్టు. ఉరితాడు వేస్తున్నప్పుడు బిగుసుకుపోయింది. శవమై వేలాడినప్పుడు కన్నీటి చుక్కలు విడిచి మ్రాన్పడిపోయింది చెట్టు. ఆ చెట్టు ఇప్పుడు మౌన సాక్షి. ఆ చెట్టు ఇప్పుడు ఘనీభవించిన నిశ్శబ్ద సంకేతం. ఆ చెట్టు ఇప్పుడు పిట్ట పీచుమనని నీరవ నిశబ్దంలోకి జారుకున్నది. ఆ చెట్టుకు వందనం. సంతోష్ కూ, అతని తెల్లారని కలకూ వందనం. ఆ కల తెల్లారాల్సి ఉన్నది. ఆ కల సాకారం అయ్యే తీరవలసి ఉన్నది. అది తెలంగాణ. డిసెంబర్ 9 నిజమే. అది వర్తమానంలో దశాబ్దాల పేదనలకు ఒక ఊరట. రెక్కవిప్పి గర్జించిన ఆత్మగౌరవ విజయ చిహ్నం డిసెంబర్ 9. ఆ డిసెంబర్ విని ఆవాహన చేసుకోవడమే చెట్టు సందేశం. ఆ చెట్టే మన ప్రాణం. ప్రాణమై వికసించడమే. నిరాశ నుంచీ, నీరసాల నుంచీ, అచేతన నుంచి, నిశ్శబ్దాలను బద్దలుకొట్టడమే చెట్టు జీవనసారం. యస్. డిసెంబర్ 9 ఒక స్ఫూర్తి. ఒక ఆలంబన. ఒక పోరాటం. గెలిచిన రోజు. కేసీఆర్ ఆస్పవూతిలో మరణపు మెట్ల ముందు దీక్షలో ఉన్నాడు. తెలంగాణ భగ్గున మండింది. అంటుకున్నది తెలంగాణ. విద్యార్థులు గర్జించారు. ఆర్ట్స్ కాలేజీ ముందు లేచిన గుడారాల్లో విప్లవాలకు కలలు నేర్పారు. కత్తులకు కోలాటం నేర్పింది తెలంగాణ ఎత్తిన జెండా. ఆర్ట్స్ కాలేజీ నిద్రపోలేదు. అవును ముట్టడిస్తాం అసెంబ్లీని. ఎంతకైతె గంతకాయె. మాకు తెలంగాణ కావాలె. ముట్టడిస్తాం మీ సౌధాలను. డిసెంబర్ 9 ఒక కల విడుదలయింది. ఒక రాత్రి ఇంకా తెల్లారనేలేదు.

‘డూ నాట్ డై’కృషాంక్, తలపగిలిన భాస్కర్ ఢిల్లీలో ఉన్నట్టున్నారు. తల్లిచెట్టుకు దూరంగా. ఆర్ట్స్ కాలేజీ బోసిపోయి ఉన్నది. నిన్న కూడా ఇక్కడ సభ జరిగింది. చెట్టు తలూపి ఉంటుంది. మౌనంగా చూసి ఉంటుంది. అది సంతోష్ దుక్కంలో మునిగిపోయి ఉంటుంది. ఢిల్లీ తోలుబొమ్మలాటల కేంద్రం. అదొక ఆత్మలేని సిమెంటు తాపడం చేసిన నగరం. జర్రున జారే రోడ్ల మీద ప్రవహిస్తున్న తెలంగాణ యవ్వనం. జాడ తప్పి జంతర్ మంతర్ ముందర. అవును మేం ముట్టడిస్తాం. దేన్ని. ఆర్ట్స్ కాలేజీ బోసిపోయి ఉన్నది. మూడేండ్ల కిందటి సంబురాలు లేవు. ఢిల్లీ గేట్ల ముందర ఆట. గారడి ఆటలకు గుండెలు తెరుచుకోవు. శాస్త్రి భవన్ చెట్టుకు వేలాడిన యాదిడ్డి. ఢిల్లీకి కూడా అంటిన తెలంగాణ నెత్తుటి చారిక. టెన్ జనపథ్ లో మరుగున పడిన త్యాగాల కలలను కూడా గుర్తించదు. సాఫల్యాలనూ వైఫల్యం చేసే గారడి విద్యలు తెలిసినవారు మూగిన ప్రాంతాలు మన నిషేధిత ప్రాంతాలు.

చివరికిలా మిగిలామా? యూటూ.... వీధులు ఎదురు చూస్తున్న వేళ. అసెంబ్లీ భవనాలు ముట్టడి కోసం ఇనుప కంచెలు కట్టుకుంటున్న వేళ. ఉవ్వెత్తున ఎగసే అలల కోసం ట్యాంక్‌బండూ, నెక్లెస్‌రోడ్డూ ఎదురుచూస్తున్న వేళ జంతర్‌మంతర్ దగ్గర దిగాలు పడ్తున్న యవ్వనం. ఆర్ట్స్ కాలేజీ ఢిల్లీకి తరలిపోతున్నప్పుడు, ఆర్ట్స్ కాలేజీ ఆత్మలను కోల్పోతున్నప్పుడు, ఆర్ట్స్ కాలేజీ అపవూభంశపు పోకడలు పోతున్నప్పుడు, ఆర్ట్స్ కాలేజీ ముందరి ఆ చెట్టు విలవిలలాడింది. తండ్లాడింది. బిడ్డలారా! గొంతు గద్గదమై ఏ మాటా చెప్పలేకపోయింది చెట్టు. బతుకు ఇక్కడే. చావు ఇక్కడే. బాతఖానీ క్లబ్బుల్లో ప్రవహించే అబద్ధాల సాలెగూడుల్లోకి వెళ్లకండి వీరులారా! విద్యార్థులారా! సంతోష్ మీద ఆన.. మీ కోసం ఆర్ట్స్ కాలేజీ ముందరి మైదానం ఎదురుచూస్తున్నది. సబ్బండ వర్ణాలు, సబ్బండ జాక్‌లు ఒక్కటై, ఒక్క పొలికేక పెట్టి.. అయ్యో! నిజమే ఉద్యమం ‘ఇన్నోసెన్స్’ను కోరుకుంటుంది. త్యాగనిరతిని కోరుకుంటుంది. ఉద్యమం ఐచ్ఛికతనూ, అంకితభావాన్ని, స్వీయ ప్రయోజన రాహిత్యాన్ని కోరుకుంటుంది. ఏవవి. మిత్రులారా! పోగొట్టుకున్నాం మనం. 

కానీ పొందడానికి ఏమీ లేదు. ఇంకా మూడేండ్ల కిందటి డిసెంబర్ అతి పొడవైన ఆ రాత్రి తెల్లరనే లేదు. నిజమే. స్వార్థం శిరస్సు గండ్రగొడ్డలితో నరకగలిగిన వాడే నేటి హీరో... తెలంగాణ పిలుస్తున్నది. నిజమే ఢిల్లీల లేదు పరిష్కారం. నిజమే గల్లీలనే ఉన్నది. జీనాహైఁతో మర్‌నా సీఖో కదమ్ కదమ్ పర్ లడ్‌నా సీఖో.. తెలంగాణ వచ్చింది. దాన్ని కాపాడుకోవడమే. ఒక కల సాకారమైంది. దాన్ని అనుభవించి పలవరించడమే. పట్టిన పట్టు సడలకపోవడమే. తోలుబొమ్మలాటల్లో చిక్కుపడిన దారపు కండె ఉద్యమం.

ఈంట్‌కా జవాబ్ పత్థర్‌సే...
ప్రతీకారం కోరుతున్నది తెలంగాణ. వర్నిలో ఆంధ్రులు తెలంగాణ పిల్లలను కొట్టారు. తెలుసా! రెండు ఇటుకల మధ్య తల ఇరికించి ఇప్పుడనరా! సమైక్యాంధ్ర జిందాబాద్ అని హింసించిన వాడి చిరునామా నిజామాబాద్. పాలమూరు విశ్వవిద్యాలయంలో పోలీసులు, షర్మిల సేన నెత్తురు కళ్ల చూశారు. జై తెలంగాణ అన్నందుకు విద్యార్థులకు బహుమానం. భైంసాలో ఇల్లిల్లు తిరిగీ కొట్టారు పోలీసులు. మాలల తిరుగుబాటు. మన్నాల తిరుగుబాటు. చంద్రబాబూ తెలంగాణపై తేల్చమన్నందుకు లాఠీల కరాళనృత్యం. ప్రపంచం సజావుగా ఉన్నది. కవి తీవ్ర అభినివేశంతో మరో కవిత రాసుకుంటున్నాడు. సంకలనం కొత్తదొకటి తయారవుతున్నది. ఇప్పుడిది సందర్భం. పాటగాడు కొత్త క్యాసెట్ కోసం రికార్డింగ్ థియేటర్ గుమ్మం ముందు నిలుచున్నాడు. వీర విద్యార్థి ఒకడు నియోజకవర్గం ముందు తలదూర్చుకుని నిలుచున్నాడు. యువసేన తెలంగాణ క్రికెట్ ఆటాడుతున్నది. ఇందిరాపార్క్ ముందు పదమూడోసారి ధర్నాలో ప్రసంగిస్తున్నడు ఒక నాయకుడు తెలంగాణపై ఏమి చేయాలన్న మీమాంసలో సదస్సు జరుగుతున్నది. వేదికలు పునరుక్తి దోషాలతో తడబడ్తున్నవి.

టీవీ చర్చలో పదహారోసారి. తెలంగాణను రోషంతో వీరరసంతో నూటా ఒక్కటో సారి అదే భాషతో పలికిస్తున్నడు విశ్లేషకుడు. చంద్రబాబు కు, షర్మిలకు, కిరణ్‌కుమార్‌డ్డికీ తెలంగాణ మీద అప్రకటిత ప్రేమ కలిగినందు వల్ల వారు ఊరూరా పొరుకపోడుగా పదఘట్టనలతో ఊదరగొడ్తున్నారు. ఢిల్లీకెళ్లిన చైతన్యం.. చెట్టు ప్రాణవాయువు నింపుకుని రాయి విసిరి రక్తమోడుతున్నది. పల్లెబాటలు బారులు తీరుతున్నవి పతాకాలు. కూద్ ఖేల్.. మస్తీ మజా.. జంప్ జిలానీలు అగ్గడ్‌బగ్గడ్ ఆగమాగంగ దుంకుతున్నరు. తరాజులో న్యాయంవేపు ఆశగా చూస్తున్నదొక బిచ్చగత్తె. ఎఫ్‌డీఐల్లో విప్లవాన్ని కలగంటున్నడు కురువృద్ధుడైన మన్‌మోహన్‌సింగ్. ప్రపంచం సజావుగానే ఉన్నది.

వర్నిలో గాయపడిన పిల్లగాని పెయ్యి సలుపుతున్నది. అతనికి లోలోన ఆక్రమించుకున్న కలకూడా సలుపుతున్నది. లగడపాటి మళ్లీ మాట్లాడాడు తీవ్ర విద్వేషంతో. యూనివర్సీటీకి రా దమ్ముంటే అని విద్యార్థి నాయకుడొకరు సవాల్ చేశాడు. అతను ఆర్ట్స్ కాలేజీని మూతేయమని చెప్పినవాడు. రాడు. లగడపాటిని వెతకాల్సిన పనిలేదు. కానీ వెతుకులాటలేని వ్యథల జీవితంలో ‘డూ నాట్ డై’... నిజమే. దిమ్మెలుండవు. జెండాలుండవు. ఫ్లెక్సీలు తగులబడుతవి. డిసెంబర్ 9 ఒక సఫలమైన కల. డిసెంబర్ 9 ఒక ఆకాంక్షకు అర్థవంతమైన ముగింపు. తెలంగాణ దానిచుట్టూ బరిగీసి నిలబడి ఉన్నది. రక్షించుకుందాం డిసెంబర్ 9ని.. అది మన తెల్లారని రాత్రి. కనుప్పలల్లో దాగున్న విజయం. ఖబడ్దార్ డిసెంబర్ 9 నిజం. అఖిలపక్షా లు, అడ్డగోలు ప్రకటనలు ఇంకానా ఇక చెల్లవు. రగులుకుంటున్నది రగల్ జెండా. తెలంగాణ డిసెంబర్ 9ని కీర్తిస్తున్నది. ఆవాహన చేసుకుంటున్నది. నమ్ముతున్నది.. ఆర్ట్స్ కాలేజీలో మూడేండ్ల కింద ప్రారంభమైన సంబరాలు.. అతి పొడవైన ఈ రాత్రి నుంచి వేకువ కోసం ఎదురు చూస్తున్నది.. రగులుకుంటున్నది. ఎర్రటి పొద్దు. అవును తెల్లవారక మానదు. తెలంగాణ రాక మానదు. ఇంటి వాకిట్లో నిలబడి ఉన్నడు శ్రీకాంతచారి నిలువెత్తు మంటల్లో.. ఇక తప్పదు. అడ్డంపడ్డ వారి చీకటి కొట్టాలకు నిప్పంటక మానదు. మళ్లీ పాడతాం అదేపాట.. ఆ చెట్టుకు మొక్కి.. చెట్టు ఆకుల బాకులు దూసేదాక.. ఈ రాత్రి తెల్లారే దాకా.. చెట్టు మీద ఆన.. జై తెలంగాణ.

-అల్లం నారాయ

Andhra Jyothi News Paper Dated: 9/12/2012 

Saturday, September 8, 2012

సెప్టెంబర్ 17: దురాక్రమణే---నలమాస కృష్ణ




తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్రం అనే పేరుతో చీకటి బాటలు వేసిన 194pandu సెప్టెంబర్ 17కు చరివూతలో ప్రాముఖ్యం ఉన్నది. ఈ రోజును పాలకవర్గాలు, ప్రజలు భిన్న కోణాల నుంచి చూస్తున్నారు. కనుకనే విలీనమా? విద్రోహ మా? విమోచనా? అనే దానిపై ఇంకా చర్చ జరుగుతున్నది. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత సైన్యాలకు లొంగిపోయిన రోజు గా, బ్రిటిష్ పాలన అనంతరం సంస్థానాల మహా సమ్మేళనంగా రూపుదిద్దుకుంటున్న భారత్ యూనియన్ కోసం తన మొదటి సైనిక చర్య హైదరాబాద్‌పైనే జరి పింది. దీన్ని భారత పార్లమెంటరీ వ్యవస్థ కుట్రలో భాగం చేసిన రోజుగా చెప్పు కో వచ్చు. వెట్టిచాకిరికి, భూస్వామ్యానికి, ఎదురు నిలిచి పోరాడుతున్న ప్రజలను అణచివేయడానికి, రాజకీయ వ్యవస్థీకృత నియంతృత్వానికి చట్టబద్ధమైన హక్కు పాలకవర్గం పొందిన రోజుగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా..ఎన్ని భిన్న పార్శాలున్నప్పటికీ సారాంశంలో ప్రజలపై ‘ఆపరేషన్ పోలో’ పేరిట క్రూరదాడికి నాంది పలికిందనేది కాదనలేని సత్యం. నేడు తెలంగాణ ప్రజలు చేస్తున్న ప్రజాస్వామిక పోరాట దృక్పథం నుంచి చూస్తే మాత్రమే నాటి దురాక్షికమణను, దానికి గల ఉద్దేశ్యాలను సరిగ్గా అర్థం చేసుకోగలం.ఒకపార్టీ ముస్లిం రాజుపై హిందూ ప్రజల విజయంగానూ, మరొక పార్టీ స్వతంత్ర దినంగానూ, విలీన దినంగానూ చెబుతుంటే, పీడి త ప్రజలకు మాత్రం పీడకలను మిగిల్చిన రోజుగానే కనబడుతున్నది. విమోచన జరిగిందనే వాదన పాలకవర్గాలది మాత్రమే. అప్పుడు విమోచన జరిగితే ఇప్పుడు తెలంగాణ ప్రజలు పోరాటం ఎందుకు చేస్తున్నట్టు? నిజానికి విమోచన దినం గా స్థానం కల్పించడానికి పాలకవర్గం చూస్తున్న రోజు తెలంగాణ ప్రజలు సాధించుకున్న విజయాలు కోల్పోవడానికి దారితీసిన రోజు కాదా? ఇక్కడ ఒక విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవలసిందేమిటంటే తెలంగాణ పేరు వినడం కూడా జీర్ణించుకోలేని చంద్రబాబు లాంటి నియంతలు వేలమంది తెలంగాణ బిడ్డలను పొట్టన బెట్టుకున్న వాడు కూడా తెలంగాణ సాయుధ పోరాట వీరులకు నివాళులు అర్పించడం ఇప్పటి ఓ చారిత్రక విషాదం.


ఇప్పుడు సాగుతున్న తెలంగాణ పోరాటాన్ని అణచివేయడం లో ప్రముఖపాత్ర వహించే వారు కూడా సెప్టెంబర్17న త్రివర్ణ పతాకాలు ఎగురవేసి తెలంగాణ స్వతంత్ర సంబరాలు జరుపుతున్నారు. అంతే కాదు, నాటి సాయుధ పోరాటంలో పాల్గొన్న వారికి సన్మానం చేయడం క్రూర పరిహాసమే. త్యాగాలను కూడా పెట్టుబడిగా మార్చుకోవాలనుకుంటున్న సీమాంధ్ర సంపన్నవర్గం విమోచన సంబరాల్లో భాగం ఎందుకవుతున్నది? ఈ సందర్భంగా మూడు రంగుల జెండాలు ఎగురవేసి సంబరాలు చేయాలనే పాలకవర్గానికి తెలంగాణ ప్రజలకు మధ్య వైరుధ్యం ఉన్నది. తెలంగాణ ప్రజలు తమ మౌలికమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటంలో తమ విముక్తిని చూసుకోకుండా, నాటి సైనిక దురాక్షికమణలో (సైనిక చర్య) విముక్తి చూసుకొమ్మని చెబుతున్నాయి. తెలంగాణ స్వాతంత్య్ర వేడుకలను కూడా ఘనంగాను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని వివిధ పార్టీలు కోరడం ఇందులో భాగమే. తెలంగాణ సాధన పోరాటాన్ని, భావోద్వేగాలను వక్రమార్గం పట్టించాలనే పాలకుల కుట్రలను ప్రజలు గ్రహించాలి. తెలంగాణ ప్రజలు వీరోచిత త్యాగాలతో నిజాంను కూల్చితే, వంద లాది మంది నైజాంను తలదన్నే నియంతలు ఎలా పుట్టుకొచ్చారనేది నేడు మన ముందున్న ప్రశ్న. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పాలనలో ఉన్న ఆరు వందల సంస్థానాల్లో హైదరాబాద్ అతి పెద్దది. 1946 భారత స్వతంత్ర చట్టం ప్రకారం ఇండియాలోగానీ పాకిస్థాన్‌లోగాని, స్వతంత్ర సంస్థానాలుగా ఉండవచ్చు. లేదా స్వతంత్ర దేశంగా ఉండవచ్చు. దీన్ని అనుసరించి నైజాం ఆజాదీ హైదరాబాద్‌గా ఉంటానని ప్రకటించాడు. కొన్ని సంస్థానాలు స్వతంవూతంగా ఉండడానికి నిర్ణయించుకున్నప్పటికీ 1947 ఆగస్టు నాటికి హైదరాబాద్‌తోపాటు జునాగఢ్- కాశ్మీర్ తప్ప మొత్తం చిన్నా చితక సంస్థానాలు విలీనం అయ్యాయి. జునాగఢ్ సంస్థానం ప్రజల తిరుగుబాటు ద్వారా , కాశ్మీర్ కొన్ని నిర్దిష్ట షరతులతో కూడిన ఒప్పందం ద్వారా భారత భూభాగంలో భాగమయ్యాయి. హైదరాబాద్ పరిస్థితి పూర్తిగా భిన్నమైనది. నిజాం రాజు అటు పాకిస్థాన్‌లోనూ ఇండియాలోను కలవకుండా 1947 నవంబర్ 29 భారత్‌తో యథాతథ ఒడంబడిక చేసుకున్నాడు. దీన్ని ఉల్లంఘించి ఇండియన్ యూనియన్ సైన్యాలు హైదరాబాద్ పై దాడికి దిగాయి. ప్రజలపై దాడులను ఆపుతామనే హామీ ని భారత ప్రభుత్వం నుంచి తీసుకున్న అనంతరం నిజాం తన లొంగుబాటును రేడియో ద్వారా ప్రకటించాడు. దీనిని కూడా కనీసం నిలబెట్టుకోలేని భారత పాలకవర్గం కొనసాగించిన ఆకృత్యాలకు సెప్టెంబర్ 17 తర్వాత జరిగిన దాష్టీకాలకు అంతులేదు. వేలాది మంది ప్రజలు రజాకార్ల ఊచకోత, అత్యాచారాలకు బలయ్యారు. కాశ్మీర్ వలె హైదరాబాద్ ప్రజలకు కనీసం రాజ్యాంగ పరంగానైనా కొన్ని ప్రత్యేక హక్కులు రాలేదు. భారతదేశం నిర్మాణంలో హైదరాబాద్ ప్రజలు ఏనాడు భాగం కాలేదు. అటువంటిప్పుడు నిరంకుశ నిజాం కూడా ప్రజలపై దాడి చేయవద్దన్న విజ్ఞాపనను కూడా గౌరవించని దురాక్షికమణ మనస్తత్వం కలిగిన భారత పాలకవర్గం మనకు కల్పించింది విముక్తేనా?



తమ భూమి, భుక్తి,విముక్తి కోసం పిడికిపూత్తిన ప్రజల చేత గ్రామాల నుంచి తరి మివేయబడ్డ అగ్రకుల దొరలు, భూస్వాములు, జమీందార్లు, జాగీర్‌దార్లకు అండ గా పోలీసు క్యాంపులు పెట్టి చట్టబద్ధ భూస్వామ్యానికి పాదుకొల్పడమేనా తెలంగాణకు జరిగిన విముక్తి? సైన్యాల ప్రవేశంతో ప్రజల్లో చిగురించిన ఆశలను అంధకారం చేసి,గాంధీ టీపీలు, ఖద్దర్ బట్టలతో శాంతి జపం చేస్తూ ప్రజల నెత్తురు తాగారు.1949 ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లో జరిగిన బహిరంగసభలో నాటి ఉప ప్రధాని సర్ధార్ పటేల్ తెలంగాణను ఉద్దేశించి మాట్లాడుతూ ‘కమ్యూనిస్టుల మూలంగా చైనా, బర్మా ఇప్పటికీ తగలబడిపోతున్నాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి దాపురించే అవకాశం ఉన్నది. కమ్యూనిస్టులు సమస్యలు జఠిలం చేయాలని చూస్తున్నారు. నేనొక్కటి చెప్పదలచుకున్నాను. వారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలా కాకుండా ఇక్కడే ఉంటే ఒక్కణ్ణి కూడా ప్రాణాలతో వదిలేదిలేదు. ఎందుకంటే కమ్యూనిజం అది ఒక్క హైదరాబాద్ రాజ్యాన్నే కాదు మొత్తం దేశాన్ని విషపూరితం చేస్తుంద’ని విషం గక్కాడు. దోపిడీ పీడనలేని వ్యవస్థ కోసం జరుగుతున్న ప్రజాపోరాటాన్ని దేశాన్ని విషతు ల్యం చేసే చర్యగా భావించిన పటేల్ ప్రకట న వెట్టిచాకిరిని, భూస్వామ్య విధానాన్ని పాలకవర్గ స్వభావాన్ని తెలియచేస్తున్నది. భూమి కోసం, ప్రజాస్వామిక హక్కుల కోసం తెలంగాణ ప్రజ లు చేస్తున్న పోరాటాన్ని నేటి పాలకవర్గం శాంతి భద్రతల సమస్యగా చూడడంలో నాటి పటేల్ చూసిన దృష్టి కోణమే కనిపి స్తున్నది.తెలంగాణ సాయుధపోరాట విజయాలు, ఫలితాలు కోల్పోవలసి రావడానికి దారితీసిన రోజును, ఘోర మారణహోమానికి దారితీసిన రోజును, మిలటరీ, సివిల్ పాలన పేరుతో సీమాంధ్ర ఉద్యోగస్వామ్యం చొరబాటుకు దారితీసిన రోజును సంబరాలు జరపవలసిన బాధ్యత ప్రజలపై ఎందుకున్నదో విమోచనను సమర్థించేవారు ప్రజలకు చెప్పాలి. తెలంగాణ చరివూతను, సంస్కృతిని, భాష యాసలను ఎక్కిరించే సీమాంధ్ర దురంహంకారానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారు వాస్తవాలు గుర్తించాలి. తెలంగాణ ప్రజల భవిష్యత్తును సంక్లిష్టంగా మార్చిన ఆధునిక నియంతృత్వ దురాక్షికమణ దాడిని ఎదిరించాలి. సెప్టెంబర్ 17ను దురాక్షికమణ దినంగా జరపడమే అమరవీరుల త్యాగాలకు మనమిచ్చే గౌరవం. నివాళి. ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం, సమానత్వంతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఈ ప్రాంత ప్రజలకు విమోచన, అంతవరకు దాని కోసం పోరాటం తప్పదు.

-నలమాస కృష్ణ
తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రధానకార్యద

Namasete Telangana News Paper Dated : 09/09/2012

Tuesday, July 17, 2012

పోరాటాల ‘మునుం’బట్టిన తెలంగాణ--డాక్టర్ కాసుల లింగాడ్డి

కాశెవోసి కొంగుబిగించి కొడవలి చేతవట్టి తెలంగాణ కోతల ‘మునుం’ పట్టింది. ఇది తెలంగాణను సమెక్యవాద ముసుగు లో దోచుకుంటున్న సీమాంధ్ర పెట్టుబడిదారుల, పాలకవర్గాల ఆధిపత్య అహంకారాలమీద, తెలంగాణ పాలకవర్గాల దళారీతనంమీద పట్టిన కోతల మునుం.ఈ మునుం మూడు భిన్న కథల్లో కొనసాగింది. పొలం చదును చేసి, బిగిసిపోయిన కొయ్యకాళ్ల నూడబెరికి వ్యవసాయ యోగ్యం చేయడానికి సాగిన కాలం ఒక కథ. కన్నీళ్ళు, వేదన, నిస్సహాయతల కాలం అది. మునుం పట్టి నాట్లువేసి, నీరుపోసి పంటను పెంచి న కాలం రెండవ కథ. ఈ కథ ప్రధానంగా తెలంగాణ పురావైభవాన్ని, చారివూతక, సాంస్కృతిక ఔన్నత్యాన్ని ఎత్తిపట్టిన కాలం. ఇక చివరి కథ పోరాటాల మునుం కాలం.
భూస్వామ్య ఆస్తి సంబంధాలను ధ్వంసంచేసి, శ్రమను విముక్తంచేసి మార్కెట్టును వ్యాప్తిచేస్తూ పెట్టుబడి శ్రమల మధ్యవున్న సంబంధాన్ని నిరంతరంగా వృద్ధిచేస్తూ వుండే రాజకీయార్థిక నిర్మాణాన్ని పెట్టుబడిదారీ విధానం అంటున్నం. పెట్టుబడిదారీ వర్గం పెరుగుతున్న క్రమంలో, పోటీకూడ పెరిగిన ఫలితంగా మార్కెట్టు మరింత వ్యాపించి భూస్వామ్య సంబంధాలను నిరంతరంగా ధ్వంసం చేయాలి. జాతిరాజ్యాలు బలంగా వుండడంవల్ల ఈ పరిణామం మొత్తం తన రక్షిత భౌగోళిక ప్రాంత పరిధిలోనే జరగాలి. ఇట్లా మార్కెట్టు కుంచితమైపోవడం ద్వారా లాభాలు తగ్గిపోవడం వల్ల పారిక్షిశామిక పెట్టుబడి వాణిజ్య పెట్టుబడిగా, ద్రవ్యపెట్టుబడిగా రూపాంతరం చెందింది. గుత్తాధిపత్య లక్షణాలు సమకూర్చుకున్న ద్రవ్యపెట్టుబడికి మరింత అదనపు విలువను పొందడానికి నూతనమ్కాట్ల వేట అవసరమైంది. పెట్టుబడి పూర్వవిధానాలు కలిగిన నూతన మార్కెట్లు పెట్టుబడి నిలదొక్కుకోవడానికి, బలపడడానికి కావాల్సిన అన్ని వసతులు సమకూర్చాయి. చౌక శ్రమ, అసాంఘిక నిర్మాణం లో వ్యాపారం, సరుకులు అమ్ముకోగలగడం ముడిసరుకుల వెలికితీత, ద్రవ్య స్పెక్యులేషన్, పెట్టుబడులుపెట్టే అవకాశం కల్పించాయి. పెట్టుబడిపూర్వ సమాజంలో ప్రవేశించే అంతర్జాతీయ పెట్టుబడి శ్రమశక్తి, ఉత్పత్తి సాధనాలలో మార్పుల ద్వారా కాకుండా, ఉత్పత్తి విధానంలోని మార్పులతో సంబంధంలేని కొత ్తసరుకులను ప్రవేశపెట్టింది. ఉత్పత్తుల ప్రక్రియ కంటె చెలామణి ద్వారా మిగులు పోగుచేసుకోవడానికి సిద్ధపడడం వల్ల అది స్థానిక పాలకవర్గంతో సహజీవనం చేయవలిసి వచ్చింది.
భూస్వామ్య వ్యవస్థను కూలదోయకుండా దానితో రాజీ కుదుర్చుకుంది. ఉత్పత్తిశక్తులు, ఉత్పత్తి సంబంధాలు ఈ రెండు వ్యవస్థల లక్షణాలు కలిగివుండి, భూస్వామ్య వ్యవస్థ ఉపరితలం బలోపేతమైంది. అంతర్జాతీయంగా మరింత విస్తరించింది. ఇదే మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ కొనసాగుతున్న అర్ధవలస, అర్ధభూస్వామ్య వ్యవస్థ. తొంభయవ దశకం ఆరంభం నుంచి భారత వూపభుత్వం సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణలతో నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టింది. మార్కెట్టు వృది ్ధకోసం, ఎగుమతుల వృద్ధి కోసం సామ్రాజ్యవాద దేశాలు మన దేశంమీద రుద్దిన ప్రక్రియ ఇది. భారతదేశంలో దోపిడీ కొనసాగించడానికి, యథాతథ స్థితిని కొనసాగించడానికి భూస్వామ్యానికి, సామ్రాజ్యవాదంతో వున్న మైత్రి వల్ల ఏ ఆటంకం లేకుండా ఈ ప్రక్రియ మనమీద రుద్దబడింది. పర్యవసానంగా బహుళజాతి సంస్థలతో కలిసి భూస్వాము లు, ధనిక రైతులు చిన్న, సన్నకారు రైతుల నుంచి భూముల్ని హస్తగతంచేసుకొని వాళ్ళను రైతుకూలీలుగా మార్చారు. వీళ్ళు ఆ భూముల్లో అధిక భాగాన్ని పడావు పెట్టడం వల్ల, వాణిజ్య పంటలకు వినియోగించడం వల్ల దేశంలో ఆహార కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని అంటాయి. స్థూల జాతీయఉత్పత్తిలో వ్యవసాయోత్పత్తి 1980లో 39శాతం వుంటే, 2010 నాటికి అది 15 శాతానికి పడిపోయింది. ఆ రకంగా వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామీణ చేతివృత్తులు మొత్తంగా ధ్వంసమైనవి. ఇట్లా లక్షలాది ప్రజలు తమ భూముల నుండి, వృత్తినుండి, నైపుణ్యం నుండి విడుదల చేయబడి నిరుద్యోగులుగా మిగిలారు. అట్లా ఒక అసంఖ్యాకమెన రిజర్వుడ్ పారిక్షిశామిక సైన్యం ఏర్పడింది. దేశీయంగా పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ కలగాపులగపు వ్యవస్థలో దానికవసరమైన నైపుణ్యంలేని కారణంగా జీవనోపాధి దొరకక ఈ ప్రజలు సమాజపు అట్టడుగు పొరల్లోకి ఇంకిపోయారు. దాని పర్యవసానమే మితిమీరిన పట్టణీకరణ. దాని పర్యవసానమే అసంఖ్యాకమెన రైతుల, రైతుకూలీల ఆత్మహత్యలు. ఇట్లాంటి సామాజిక భౌతిక పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వ ఉద్య మం తలెత్తితే, దాన్ని ఒకాయనకు మంత్రి రాకపోవడం వల్లనో, మరొకాయనకు రెండవసారి వీసీ పదవి రాకపోవడంవల్లనో మొదలైన ఉద్యమంగా చూడడమంటే వ్యక్తివాద, భావవాద ధృక్పథమే.

రెండు అసమ సమాజాల్ని బలవంతం గా కలపడం వలన పాశ్చాత్య పెట్టుబడిదారుల పాలనలో వున్న సీమాంవూధులు అమాయక తెలంగాణ ప్రజలను అన్నివిధాల దోచుకోవడం మొదపూంది.‘ఢిల్లీపెత్తనానికి సీమాంధ్ర పెత్తందార్లకు పుట్టిన అక్రమ సంతానం ఆంధ్రవూపదేశ్’’ (ఉదయమిత్ర) పెద్దమనుషుల ఒప్పందాన్ని, తెలంగాణ రీజనల్ కమిటీని తుంగలో తొక్కి వేల ఎకరాల భూముల్ని కబ్జా చేసుకున్నరుపాజెక్టుల్లో భూములు కోల్పోయిన వాళ్ళు కూలీలుగా మారితే, నీటివూపవాహాలకు ఎదుక్కి వచ్చిన సీమాంవూధులు భూ యజమానులైనరు.1983లో టీడీపీ అధికారంలోకి వచ్చినంక బాహాటంగానే హైదరాబాదు చుట్టుపక్కల వేలఎకరాల్ని కబ్జా చేసుకున్నరు. ఒక్క తెలంగాణలోనే కాదు ఒరిస్సాలోని హీరాకుడ్ ప్రాజెక్టుకింద కూడ వీళ్ళ నిర్వాకం ఇదే. అక్కడెనా, ఇక్కడెనా అక్రమంగా సంపద పోగు చేసుకోవడం, స్థానికులను ద్వితీయక్షిశేణి పౌరులు గా దిగజార్చడం, వారి వేష,భాషల్ని, సంస్కృతుల్ని అవహేళన చేయ డం, తద్వారా అణచివేతను కొనసాగించడం సీమాంధ్ర పెట్టుబడిదారుల నైజం. ఇట్లా నయావలసవాదం, అంతర్గత వలసవాదం దాని పెంపు డు బిడ్డ అయిన సామ్రాజ్యవాద సంస్కృతి తెలంగాణను పరాయీకరణకు గురిచేసింది. అందుకనే తెలంగాణ కవులు ఈ పరాయీకరణ విషపు కోరల్లో నేనొక్కన్నేనా?అని తమను తాము ప్రశ్నించుకున్నరు. విధ్వంసాన్ని వేదనతో వ్యక్తీకరించిండ్రు.‘నెలలు నిండని శిశువుల కన్న ప్రపంచీకరణ’ సోయి తోటే చేసింవూడని చెప్పలేం కాని, పరిణామాలను అర్థం చేసుకున్నరు.‘ఇంతచేస్తే!/రాళ్ళు జీల్చినోళ్ళకు గూళ్ళు లేవు ఇటుకలు చేసినోళ్ళకు ఇండ్లు లేవు/గొర్రెలుగాసినోళ్ళకు గొంగళ్ళు లేవు’ (రామగిరి శివకుమార శర్మ) ‘వెలుగుపంట దిగుబడి పెంచేందుకు పెంటగా మారిన పల్లెల’ దుస్థితిని చిత్రీకరించినరు(సదాశివుడు).‘మంచీచెడు అర్సుకోలేని సిమెంటు మనుషుల’ పట్నం నుంచి తమ వూరెల్తున్న కల కంటనే వున్నరు’(బెల్లి యాదయ్య).వ్యవసాయరంగం కుదేలవ్వడానికి కారణం తలాపున పారుతున్న గోదావరి, తెలంగాణ కాళ్ళ కడాలె చుట్టుకున్న కృష్ణ నీళ్ళను సీమాంవూధులు కుట్ర పూరితంగా దోచుకోవడం వల్లనేననే సోయి తెలంగాణ కవులకొచ్చింది. ‘భూమి బ్లాంక్ చెక్, నీళ్ళు విలువను రాస్తయ్ నీళ్ళు లేక కాదు, నీతిలేక బ్లాంక్ చెక్ నా తెలంగాణ’ (సుంకిడ్డి నారాయణడ్డి)‘కె.ఎల్.రావుకు నీళ్ళొదులుదాం తిలోదకాలతో సహా అతనొక కుట్రదారు’(అల్లం నారాయణ) ‘తలాపున నదులున్నాపొలాల నవ్వులు నగుబాటైన వైనం (ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్)‘సమక్షిగతకింద సాగుకాని చెలక’గా మిగిలిపోయిన తెలంగాణకు’తిండిగింజలు దొరకకపోవడం ఈ శతాబ్దపుకువూటగా గుర్తించింవూడు (బియ్యాల జనార్దన్ రావు). సామ్రాజ్యవాద సాంస్కృతిక దాడికి, అంతర్గత వలసవాదుల దాడికి పరాయీకరించబడ్డ తెలంగాణ తన అస్తిత్వాన్ని పలవరించింది. ‘భాష ఒక ముట్టిచ్చిన దీపం, భాష ఆత్మల అనుసంధానం ఆరాట పోరాట విరాట్ స్వరూపాల అమ్మలగన్నయమ్మ భాష యాసేడిది....తెలంగాణ ఒక జీవద్భాష’ (అల్లం నారాయణ) మరి అట్లాంటి భాషమీద మాట్లాడడానికి కూడ భయపడేంత హీనత్వాన్ని ఎట్లా రుద్దిండ్రు?’బందిపోట్లయినా బాగుండేది, సర్వసంపదలను ఒలిచియిచ్చి సంస్కృతినెనా దక్కించుకునేవాళ్ళం’ అన్నంత దీనస్థితికి ఎట్లా నెట్టింవూడు(జయధీర్ తిరుమలరావు).‘ఏ పదబంధ ప్రబంధంలోనూ నా యాసలేదు బాసలేదు
వాక్యం నా పలుకు వల్లించదు, అక్షరాల్లో నా నుడికార శబ్దంలేదు నా భాషనే ఆంబుక్క పెట్టిన నీవు జీవశ్వాస ను బంధిస్తున్న దేవేందర్).

ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రపంచీకరణ పడ తన్ను తాను ఆంధ్రవూపదేశ్‌కు సీయీవోగా ప్రకటించుకున్న చంద్రబాబు విజన్2020 అంటూ అభివృద్ధి నమూనాను దిగుమతి చేసుకుండు. భారీవూపాజెక్టులు,అంతర్జాతీయ విమానాక్షిశయా లు, ఆరులేన్ల రోడ్లు, తృతీయ ఆర్థికరంగమైన సేవారంగపు అసమానవృద్ధి అభివృద్ధికి చిహ్నాలుగా చెప్పుకున్నడు. ఆర్థిక ప్రథమ రంగమైన వ్యవసాయం పనికిరాదని తూలనాడిండు. ఉత్పత్తితో ప్రత్యక్ష సంబంధం లేకుండా డబ్బు సంపాదించవచ్చనే భావజాలాన్ని పెంచిపోషించిండు (స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్‌లా గా). అభివృద్ధి అంటే ఒక సమాజంలోని ప్రజ లు ఎదుర్కొనే సమస్యలకు సమాధానం వెతికే క్రమం కాక, అభివృద్ధి చెందిన దేశాలలోని కార్యక్షికమాల అనుకరణే అభివృద్ధిగా చిత్రించిం డు. మార్క్సిస్టు శాస్త్రీయ అవగాహన ప్రకారం నిర్మాణం-విధ్వంసం అభివృద్ధికి విడదీయలేని రెండు పార్శ్వాలు. విధ్వంసంలో విస్థాపనకు గురైన ప్రజలు నిర్మాణంలో ఇమిడిపోయినప్పుడే అది అభివృద్ధి అవుతుంది. కాని తెలంగాణలో అట్లా జరుగలేదు. ప్రాజెక్టులకోసమో, సెజ్‌ల కోసమో భూముల్నుంచి బేదఖల్ చేయబడ్డవాళ్ళు రోజు కూలీలుగా మారిండ్రు. వృత్తుల నుంచి విస్థాపనకు గురైనవాళ్ళు పట్టణంలో అడ్డాకూలీలుగా, బిచ్చగాళ్ళుగా మారిండ్రు. కొండొకచో విప్లవీకరించబడ్డరు. కొన్నిచోట్ల సంఘ వివూదోహ శక్తులుగా మార్చబడ్డరు.ఈ క్రమాన్ని మన కవులు సరిగ్గానే ఒడిసి పట్టుకున్నరు.‘తెలంగాణ పల్లెకు సర్కారికి వొక బ్యారం కుదరని యాపారం’ నడుస్తుందనే విషయాన్ని గమనిస్తనే వున్నరు(వడ్డెబోయిన శ్రీనివాస్). ‘ప్రాంతేతరునికే నల్లబంగారం, గని సంపదను దోచుకెళ్ళడం, మోసుకెళ్ళడమే ఆధునిక రాజ్యంలో అసలైన అభివృద్ధి’గా చెలామణీ అవుతున్న వైనాన్ని గుర్తిస్తనే వున్నరు (పిట్టల రవీందర్).

కన్నీళ్ళు తుడుచుకొని, గోసి సరిచేసుకొని, గొంగడి భజాన వేసి అతా ర చేతవట్టింది తెలంగాణ. ‘భవూదకాళి చెరువు లో రుద్రమ దాచిన తల్వార్’ తడిమి చూసింది (జగన్‌డ్డి). హైదరాబాదును ఎకరాలు గా, గజాలుగా అమ్ముకుంటున్న నయా వలసపాలకులను తాలిబన్లుగా చిత్రిస్తూ ప్రేమవారధి పురావైభవాన్ని కవులు కీర్తిస్తున్నారు (లోకేశ్వర్). తనకు ‘సామాజిక ఉద్యమాల ఓనమాలు దిద్దించిందని’(ఎస్వీ సత్యనారాయణ),’ మొహంజాహి బంగారు పూలజడ’ (షాజహాన), ‘వేదనలు వైరుధ్యాలు ఎన్నివున్నా అనుబంధాల నగరమ’ని(లోచన్) హైదరాబాద్ వైభవాన్ని కీర్తిస్తనే వున్నరు.తెలంగాణలోని అనేక సాంస్కృతిక ప్రత్యేకతల్ని ఎత్తిపడుతున్నరు. ఏడుపాయల జాతరను(యం.డి.అహ్మద్),నిర్మల్ రంజన్‌లను (మునిమడుగుల రాజారావు),పాలమూర్‌లేబర్ ఓపికను(లింగాకారి మహేష్),ఆదిలాబాద్ అమాయకుల ఔన్నత్యాన్ని(అప్పాల చక్రధారి) గానం చేస్తున్నరు.‘బత్కుమీదికన్న మనిషిమీదికన్న మట్టిమీన్నే పావురం’ (సూటెంకి రవీంద్ర) అంటూ’ యుద్ధాన్ని నేర్పిన ఈ మట్టికి’(జూలూరు గౌరీశంకర్) ఘనమెన చరిత్ర వున్నదని చెప్తున్నరు.‘యుద్ధంలో రాలిపడిన బొడ్డుమల్లె లేత నవ్వులపై పూసిన సూర్యకిరణం నా తెలంగాణ’ (కాశీం) అని కీర్తిస్తున్నరు.పోరాటాల వారసత్వ ప్రతీకలైన సమ్మక్క, సారక్క, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, బందగీ, తుపూరేబాజ్‌ఖాన్, మగ్దూం,షోయబుల్లా ఖాన్, నల్లా ఆదిడ్డి, సంతోష్‌డ్డిలను గుర్తుచేసుకుంటున్నరు. తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా నిలిచిన బతుకమ్మ స్ఫూర్తిని గానం చేస్తున్నరు.

ఈ పుష్కర కవిత్వంలో తెలంగాణ గ్రామీణ భాషను, నుడికారాన్ని కవులు ప్రతిభావంతంగా వాడుకున్నరు. హైదరాబాద్‌లో స్థిరపడ్డవాళ్ళకంటె చిన్నపట్టణాలో ్లవున్న కవులే ఈ పని ఎక్కువగా చేసిండ్రు. సీమాం ధ్ర కవులు సంఘీభావంగా రాసిన కవిత్వమూ ఇందులో ఉంది. సీమాం ధ్ర దళిత కవులు, విరసం మిత్రులు తప్ప మిగిలినవారు మనస్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమాన్ని సపోర్టు చేస్తున్నారా? చేస్తే ఉద్యమంలో భాగస్వాములు కావాలికదా!నోటితో పొగిడి నొసటితో వైఖరుల పట్ల తెలంగాణ అప్రమత్తంగా ఉండాలి. పోతే, కె.శ్రీనివాస్ ముందుమాటలో ‘ఆధునిక ప్రయోగశైలిలో, శిల్పంతో తెలంగాణవాద కవిత్వం రాయడం సాధ్యం కాదనిపిస్తుంది. అట్లా వచ్చిన కొన్నికవితలు సానుభూతిపరుపూన ప్రాంతేతరులు రాసిందే కావడం విశేషం’ అన్నాడు. ఈ వాక్యాలు ఒకదానికొకటి వైరుధ్యంగా వున్నయి. అతను చెప్పదలుచుకన్నదేమిటోబోధపడడంలేదు. అట్లే తెలంగాణలో మధ్యతరగతి ఒక శ్రేణి గా రూపుదిద్దుకోకపోవడం 1969లో అయితే కావచ్చుగాని, 2012లో ఆ పరిస్థితి ఉందనుకోను. మరింత చర్చ జరగాలి. ఇక సంపాదకుల ముందు మాటలో ‘1946 నుంచి ఎనిమిదేళ్ళుగా ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగిన’ అని రాశారు. ఎంతగింజుకున్నా 1948 సెప్టెంబర్ 18నుంచి వెల్లోడి గవర్నర్‌గా కొనసాగిన కాలమనుకోవచ్చు కాని,1946 అయ్యే అవకాశం ఏ కోశాన లేదు. శిల్పరీత్యా పలుచనైన కవిత్వాన్ని ఇందులోంచి మినహాయిస్తేనే బాగుండేది. పుష్కరకాల కవిత్వాన్ని సంకలనం చేయడంలోని శ్రమని, పరిమితుల్ని గుర్తించి సంపాదకులను అభినందించాలె. తెలంగాణ ఉద్యమంలో ‘మునుం’ మైలురాయి.
-డాక్టర్ కాసుల లింగాడ్డి
సెల్: 9948900691

Thursday, March 22, 2012

హక్కులడిగితే అణచివేతేనా?---ఆకుల భూమయ్య



Jaill talangana patrika telangana culture telangana politics telangana cinema

నేడు షహీద్ భగత్‌సింగ్‌ను ఉరితీసిన రోజు.యావత్ భారతదేశం కంటతడిపెట్టి బ్రిటీష్ సామ్రాజ్యవాదులపై కసి పెంచుకున్నరోజు. తమ రాజకీయ భావాలు ప్రచారం చేసినందుకు భగత్‌సింగ్‌ను నాటి బ్రిటీష్ వలస పాలకులు ఉరితీశారు. ఉరి తప్పించాలనే డిమాండ్ చేయవీలున్నప్పటికీ రౌండ్ సమావేశాన్ని వాయిదా వేయించి, ఆ అవకాశం రాకుండా చూసుకున్నారు గాంధీ. దేశమాత దాస్యశృంఖలాలు తెంచడం కోసం బ్రిటీష్ సామ్రాజ్యవాదుల పన్నాగాలను సాయుధంగానే ఓడించగలమనే వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే హక్కు భగత్‌సింగ్‌కు, ఇతర విప్లవకారులకుందా? లేదా? అనేది ఇక్కడ సమస్య. ఎవరికైనా తమ ఆశయాలను, ఆలోచనలను ప్రచారం చేసుకునే హక్కు, ఆచరించుకునే హక్కు ఉంటుంది. ఉండాలి. లేకుంటే ఆధునిక రాజ్యమనే దానికి, ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు. రాజకీయ సిద్ధాంతాలు ఒక్కరోజే ఆకాశం నుంచి ఊడిపడవు. వాటి కోసం చాలా కాలం ఘర్షించక తప్పదు.
నీ అభివూపాయాలతో ఏకీభవించేవాడి అభివూపాయాన్ని గౌరవించడం సహజం. కానీ నీ అభివూపాయాలను విమర్శించేవాడి, ఖండించేవాడి హక్కును గౌరవించడంలోనే నీ గొప్పదనం ఉంటుంది. ఇది ప్రజాస్వామిక విలువ. ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఈ నీతిని అందరూ విధిగా పాటించాలి. లేకుంటే అది నియంతృత్వమే అవుతుంది. వేల సంవత్సరాల మానవ నాగరికత, చరిత్ర క్రమాన్ని పరిశీలిస్తే విభిన్న రాజకీయాభివూపాయాలు, వాటి మధ్య ఘర్షణ మొదటి నుంచి ఉన్నాయి. నిర్దిష్ట సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులలో అమలు కావాల్సిన రాజకీయ విధానాలు నిర్ధారణ కావడానికి భావాల మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘర్ష ణ నుంచే దేశకాల పరిస్థితులకు తగిన రాజకీయ వ్యవస్థ ఏర్పడుతుంది. అయితే నిర్ధారించబడిన రాజనీతికి విరుద్ధంగా ఉండే ఇతరుల అభివూపాయాలు తప్పు అనలేము. ఆచరణలో పలుమార్లు పరీక్షించిన తర్వాత మాత్రమే సత్యం నిర్ధారించబడుతుంది. అప్పటికీ అది కూడా పాక్షిక సత్యమే అవుతుంది తప్ప పరమ సత్యమనిపించుకోదు. ఒక మెజారిటీ అభివూపాయాన్ని ఆచరిస్తూనే ఇతర అభివూపాయాల ఆచరణ యోగ్యతను స్వేచ్ఛ గా చర్చకు పెట్టాలి. నేడు మైనారిటీగా ఉన్న అభివూపాయాలు ఒకానొక సమయంలో మెజారిటీగా మారవచ్చు. 

స్వేచ్ఛా సమానత్వాల గురించి, సత్యాన్వేషణ కోసం తమ వాదనల ద్వారా నిజాన్ని నిగ్గు తేల్చాలన్నందు కు నాడు గ్రీసు పాలకులు సోక్రటీస్‌కు విషమిచ్చి చంపడాన్ని ఇప్పుడెవరైనా సమర్థించగలరా? భిన్నాభివూపాయాలు స్వేచ్ఛగా కలపోసుకోగలగడమే ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ. భిన్నాభివూపాయం వెలిబుచ్చితేనే కంటక ప్రాయంగా చూడ డం, నిర్బంధాలకు గురిచేయడం, భౌతిక నిర్మూలనకు పూనుకోవడం, తమ న్యాయవ్యవస్థతో ఉద్దేశపూర్వకంగా తీవ్ర శిక్షలకు బలిచేయడం వర్గ రాజ్యరక్షణకు అవసరమనిపించవచ్చు. కానీ ప్రజాస్వామ్య పరిరక్షణకు పనికిరాదు. ఇలాంటి నిర్బంధాలు, అణచివేతలు సామాజికాభివృద్ధిని అడ్డగిస్తాయి. మానవ సమాజం అనేక రాజకీయ దశలు దాటి వచ్చింది. బానిస సమాజం నుంచి మొదలుకొని భూస్వామ్య రాజరికాలు వేల ఏళ్లు రాజ్యమేలాయి. కానీ తరువాత కాలంలో అభివృద్ధిని అడ్డగించడంతో ఆ వ్యవస్థలను ఛేదించి మూడు శతాబ్దాల కిందట యూరప్‌లో ప్రారంభించి అనేక దేశాలలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతున్నది.
కొన్ని దేశాల్లో శతాబ్ద కాలంగా ఉన్నతమైన సోషలిస్టు వ్యవస్థలు ఆచరణలోకి వచ్చాయి. అన్ని దేశాల్లో ప్రజాస్వామ్య, సోషలిస్టు వ్యవస్థలను నిర్మాణం చేస్తూ కమ్యూనిజంవైపు అడుగేయాల్సి ఉన్నది. అలాంటి సామాజిక పరిణామ దశలో ప్రజాస్వామిక ఉద్యమాలపై నిర్బంధం, అణచివేత, రాజ్యహింసలు ప్రయోగించి నియంతృత్వ వ్యవస్థలను కొనసాగించబూనుకోవడం మూర్ఖత్వం. ఆచరణలో సాధ్యం కానిది.
సమకాలీన భారత సమాజంలో జరుగుతున్న వివక్ష, అణచివేతలు సమాజ విచ్ఛిన్నానికి దారి తీయక తప్పదని అర్థం అవుతున్నది. రాజకీయ అభివూపాయాలు కలిగి ఉన్నందున జైలు పాలైన వారిపట్ల జైలు అధికారులు ఎలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారో అంచనా వేయగలము. దేశ ద్రోహుల పట్ల ఉదారంగా మెలిగే మన న్యాయ వ్యవస్థ, నిజమైన దేశభక్తుల పట్ల ఎందుకు ఇంత వివక్ష పూరితంగా ఉంటున్నదో ఒక్కసారి ఆలోచించుకోవాలి. 
ఆదర్శ్ స్కాంలో రాజకీయ నాయకులు, అధికారులు, సైనికాధికారులు కూడా ఉన్నారు. ఇప్పటికీ కేంద్రంలో కొందరు మంత్రులుగా కూడా ఉంటున్నారు. రాష్ట్రం లో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతున్నది. దానికి ఐఏఎస్ అధికారులు వత్తాసుపలికి జైలుపాలయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటై వారి ప్రాసిక్యూషన్‌కు అనుమతించక న్యాయ వ్యవస్థను, సీబీఐని ఒక ఆట ఆడిస్తున్నారు. రాజకీయ నాయకులు, బ్యూరోక్షికాట్లు కుమ్మక్కై, పరస్పరం రక్షించుకుంటూ దేశాన్ని దోచుకుంటున్నారు. ఈ సందర్భంలో అలాంటి వారిపట్ల ఉదారంగా ఉంటున్న చట్టం, న్యాయవ్యవస్థ, దేశం కోసం, సమాజ హితం కోసం నిరంతరం తాపవూతయ పడు తూ తమ ప్రాణాల్ని తృణవూపాయంగా ఎంచి అభివృద్ధి నిరోధక రాజ్యవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవకారుల ఎడల ఎంత వివక్షాపూరితంగా ఉంటున్నాయో స్పష్టంగా చూస్తున్నాము.

పాలకుల్లో ఒక వర్గం అండ ఉన్నందున గుజరాత్‌లో జరిగిన సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ లాంటి కేసు ల్లో సీబీఐ నిష్పాక్షికంగా దర్యాప్తు జరపగలదేమో కానీ, దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసే కేసుల్లో సీబీఐ దర్యాప్తు అనేది ఒక కంటి తుడుపు మాత్రమేనని తేలిపోయింది.
మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్రంతో చర్చల ప్రక్రియలో ఉన్న కామ్రేడ్ ఆజా ద్ కేసులో బూటకపు ఎన్‌కౌంటర్ కాదని సీబీఐ తుది నివేదికలో చెప్తే సుప్రీంకోర్టు నమ్మేసింది. సీబీఐ పోలీసు వ్యవస్థలో భాగమేకదా. అలాంటి సంస్థలు తమ సొంత పోలీసులపై నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించగలవా? కేంద్ర హోం మంత్రి చిదంబరానికి వ్యతిరేకంగా సీబీఐ నక్సలైటు కేసుల్లో దర్యాప్తు చేయగలదనుకోవడం భ్రమ మాత్రమే. అందులో వాస్తవాలు వెల్లడించడం కన్నా రాజ్యవ్యవస్థను కాపాడడం అనే అంశం ప్రాధాన్యం వహిస్తుంది.

విప్లవకారుల కేసుల్లో వర్గ ప్రయోజనాల కోసం అన్ని వ్యవస్థలు ఒక్కటవ్వడం చూస్తున్నాం. ముఖ్యంగా న్యాయవ్యవస్థ ఇతర సంస్థలకన్నా కొంత ఉదారంగా ఉన్న చరిత్ర ఉంది. కానీ ఉద్యమకారుల విషయం వచ్చేసరికి బినాయక్‌సేన్ లాంటి వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్షలు, జీతన్ మరాండి లాంటి వాళ్లకు ఉరిశిక్షలు వేయడంలో తమ వర్గ నీతినే చాటుకుంటున్నాయి. ఆజాద్ కేసు సందర్భంలో‘రిపబ్లిక్ తన బిడ్డల్ని తానే చంపుకోవడం అనుమతించరానిద’ని సుప్రీంకోర్టు ఒక మంచి మాట చెప్పి న్యాయ వ్యవ స్థ పట్ల ప్రజల్లో గౌరవం పెంచిం ది. పదిహేనేళ్లలో దేశ ప్రజలకు అన్నంపెట్టే రైతులు రెండున్నర లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు.
దీనికి కారణం ఈ రిపబ్లిక్ కాదనగలమా? స్వయంగా సుప్రీంకోర్టు చెప్పినా ముక్కిన బియ్యాన్ని కూడా ఆకలితో అలమటించే వాళ్లకు పంపిణీ చేయలేమ ని చెప్పింది ప్రభుత్వం. బడా పారిక్షిశామిక వేత్తలకు, దివాలా తీసే బ్యాంకులకు బెయిలవుట్ ప్యాకేజీ లు ప్రకటిస్తున్న ప్రభుత్వం, పేదలను నిర్వాసితులను చేస్తున్నది. దీన్ని ప్రశ్నిస్తే అది టెర్రరిస్టు చర్య అవుతుందా? దేశ ద్రోహులను అందలమెక్కిస్తూ..నిజమైన దేశ భక్తులను దేశ ద్రోహులుగా, టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తున్న విచిత్ర పరిస్థితి మన సార్వభౌమ రిపబ్లిక్‌ది. చివరకు గ్రీన్‌హంట్ పేర రాజ్యం తన ప్రజలపైనే యుద్ధాన్ని ప్రకటించింది. నాలుగు లక్షల కోట్ల మేర అపార ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి సామ్రాజ్యవాదులకు అనుమతిచ్చింది. దాన్ని అడ్డుకుంటున్న ఆదివాసులపై దేశ ద్రోహులంటూ ముద్రవేసి వారి గూడాలను తగలబెడుతున్నది. సామూహిక లైంగిక అత్యాచారాలకు పాల్పడడం, నిర్బంధ క్యాంపులు పెట్టడం, అందులో పారా మిలటరీని, సైన్యాన్ని దించడం చేస్తున్న మన రిపబ్లిక్ గురించి ఏమనుకోవాలి. సుప్రీంకోర్టు స్వయంగా నిరాకరించిన ‘సల్వాజుడుం’ను మరో పేరుతో పోలీసులుగా నియమించడం చూస్తే ఈ పాలకులకు న్యాయవ్యవస్థపై కూడా గౌరవం లేదని తేలిపోతున్నది. ఆదివాసులకు అండగా ఉంటున్న మావోయిస్టు పార్టీ నాయకులపై, కార్యకర్తలపై దేశవూదోహులుగా ముద్రవేసి అక్రమ కేసులు బనాయిస్తున్నది. వీరికి బెయిల్ కూడా రాకుండా చేసి ఏళ్ల తరబడి అక్రమంగా జైళ్లలో నిర్బంధిస్తున్నది.

1931 మార్చి 23న దేశ విముక్తి కోసం భగత్‌సింగ్ ఉరి కంబమెక్కాడు.1950 లో రాజ్యాంగం అమలై రిపబ్లిక్ ఏర్పడింది. ప్రభుత్వం 5,6, షెడ్యూల్డ్స్‌ను, పి.ఇ.ఎస్.ఎ చట్టాలను కాదని ఆదివాసీ ప్రాంతాల్లో ఎంవోయులు కుదుర్చుకున్న ది. అంబేద్కర్ ఈ రాజ్యాంగం పేదలకు మంచి చేయలేకపోతే దాన్ని తానే తగలబెడతానన్నాడు. న్యాయమైన రాజకీయ హక్కుల కోసం, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం భగత్‌సింగ్‌ను ఆదర్శంగా తీసుకుని పోరాటం సాగిస్తున్న రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలి. మార్చి 23ను జైళ్లలో పోరాడుతున్న రాజకీయ ఖైదీల పోరాట సంఘీభావ దినంగా పాటిద్దాం. దేశ వ్యాప్తంగా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించి రాజకీయ ఖైదీల విడుదల కోసం పోరాడుదాం. నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమంలో దేశభక్తులతో పాటుగా కలిసి పయనిద్దాం.

-ఆకుల భూమయ్య
తెలంగాణ ప్రజావూఫంట్ రాష్ట్ర ఉపాధ్యక్షు

నమస్తే తెలంగాణా న్యూస్ పేపర్ Dated : 23 /03 /2012 

మేల్కొన్న మనుషులే చరిత్ర సృష్టిస్తారు---‘మా భూమి’ సినిమా


మేల్కొన్న మనుషులే చరిత్ర సృష్టిస్తారు
Maa-Bhoo talangana patrika telangana culture telangana politics telangana cinema
బరిగాళ్లను ఉక్కుముళ్లమీద నడిపించిన ఫ్యూడల్ వ్యవస్థను సవాల్ చేసినప్పుడు రక్తసిక్త అధ్యాయం. అరిగోసకు గురయిన గోసిగాళ్లు, గొంగడి గాళ్లే చరిత్ర నిర్మాతలన్న సత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సందర్భం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం (1946-51). అదొ క యుద్ధం. ఒక చరిత్ర. నిజాంతో మొదలైన వీరోచిత పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగింది. కొనసాగుతూ ఉన్నది. ఈపోరాటం ఇతివృత్తంగా కథలు, నవలలు,కవిత్వం,నాటకాలు, ప్రజాకళారూపాలు అసంఖ్యాకంగా వచ్చాయి. గౌతంఘోష్ దర్శకత్వంలో బి.నరసింగరావు నిర్మించిన ‘మా భూమి’ సినిమా 23-03-1979నాడు విడుదలయింది. అంటే 32 సంవత్సరాల తర్వాత కూడా ‘మాభూమి’ ‘మన భూమి’ అనిపించే ప్రాసంగికతను కలిగి ఉన్నది. 

ఫ్యూడల్ భూస్వాముల క్రౌర్యం, దోపి డీ బడుగు బలహీనవర్గాల ఆర్థిక మూలాలను దెబ్బతీసింది. దౌర్జన్యంగా పేదల భూములను ఆక్రమించే క్రమంలో హత్య కు గురైన నిర్భాగ్యులకు లెక్కేలేదు. పాశవికమైన పన్నులు, వెట్టిచాకిరి, మానభంగాలు నిరుపేదలను సమిధలను చేశా యి. నిరాక్షిశయులను చేశాయి. ఆంధ్ర మహాసభ (సంగం) వీరి పక్షం వహించడంతో ప్రాణాలతో మాత్రమే మిగిలిన వాళ్లలో చైతన్యం రగిలింది. కుందుర్తి, సోమసుందర్, ఆరు ద్ర, కాళోజీ, దాశరథుల కవితాసంపుటాలే కాక ఆళ్వారుస్వామి, మహీధర రామమోహనరావు, బొల్లిముంత శివరామకృష్ణ, లక్ష్మీకాంత మోహన్, రంగాచార్యుల నవలలు కూడా ఈ ఇతివృత్తంతోనే వచ్చాయి. ఈ నవలలమీద మౌలిక విశ్లేషణలతో వచ్చిన అరుదైన పరిశోధన వరవరరావు ‘తెలంగాణ విమోచనోద్యమం- తెలుగు నవల’. ఇది ఆ తర్వాత ఎందరో పరిశోధకులకు మార్గదర్శనం చేసింది. 
కవి, రచయిత, చిత్రకారుడు, ఫోటోక్షిగాఫర్ మాత్రమే కాక సంగీతం కూడా బాగా తెలిసిన నరసింగరావు మంచి పాఠకుడు కూడా. తెలంగాణ ఇతి వృత్తం గా వచ్చిన కిషన్‌చందర్ జైత్రయాత్ర వారికి స్ఫూర్తినిచ్చింది. నవలలోని పరిమిత అంశాన్ని మొత్తం తెలంగాణ పోరాటానికి విస్తరించి సినిమా తీయాలనే లక్ష్యంతో వారు ముందుగా మృణాల్‌సేన్‌ను కలిశారు. చిన్న బడ్జెట్‌తో తాను సినిమా తీయలేనని గౌతంఘోష్ అయితే బాగుంటుందని ఆయ సలహా ఇచ్చారు. గౌతంఘోష్‌కు అప్పటికి కొన్ని డాక్యుమెంటరీలు తీసిన అనుభవం మాత్రమే ఉన్నది. ‘హంగ్రీ ఆటమ్’ అన్న డాక్యుమెంటరీకి అవార్డ్‌కూడా లభించింది. పూర్తిస్థాయి సినిమాకు దర్శకత్వం వహించటం ఇదే మొదలు.

ఆ మాటకొస్తే నిర్మాత నరసింగరావుకు కూడా ఇదే మొదటి సినిమా.‘పథేర్ పాంచాలి’ తీసేముందు సత్యజిత్‌రాయ్ ఆలోచించినట్లే ఈ దర్శక నిర్మాతలు కొత్తవాళ్లు సహజంగా నటిస్తారని అనుకున్నట్టుంది. రోడ్డుమీద క్రికె ట్ ఆడుకుంటున్న సాయిచంద్‌ను పట్టుకున్నారు. అప్పుడు పోలీస్‌శాఖలో ఉన్నతోద్యోగం కోసం చదువుకుంటున్న సాయిచంద్ సంక్లిష్టమైన హీరో పాత్ర ను చేయలేనని వెనుకంజ వేశారు. నీతోమేమున్నామని దర్శక నిర్మాతలు భరో సా ఇవ్వటంతో సాయిచంద్ హీరోగా బుక్కయ్యారు. మొదట్లో కొంత బెరుకుగా అనిపించినా రానురాను భేష్ అనిపించుకున్నారు. భూపాల్, రామిడ్డి, యాదగిరి, రాంగోపాల్, రాజేశ్వరి, గద్దర్, హంస మొదలైన నటీనటులతో సినిమా మొదలైంది. నటీనటులలో చాలామంది తొలిసారి వెండితెరమీద వెలగినవారే. భూపాల్, శకుంతల పాత్రలు చిన్నవే అయినా చిరకాలం గుర్తుండిపోతాయి. కళా దర్శకుడిగా వైకుంఠం చేసిన తొలి సినిమా కూడాఇదే. 
మా భూమి ఇతివృత్తానికి వస్తే.. యువరైతు రామయ్య(సాయిచంద్) నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకించి తిరుగుబాటు బాట పట్టినవాడు. అత డు ప్రేమించిన అమ్మాయి (హంస) పెత్తందార్ల లైంగికదాహానికి లొంగిపోక తప్పదు. ఇది తెలిసిన రామయ్య ప్రతీకారంతో రగిలిపోయి..ఊరువదిలి సూర్యాపేట చేరుకుంటాడు. ఉర్దూకవి మగ్దూం మొహియుద్దీన్‌కు ప్రతీకగా రూపొందిన మగ్బూల్ అనే కమ్యూనిస్టు నాయకుని దగ్గర రామయ్య ఉద్యమ పాఠాలు నేర్చుకొని, తిరిగి ఊరు చేరుకుంటాడు. గ్రామకమిటీలను ఏర్పరిచి విప్లవకార్యాచరణకు పూనుకుంటాడు. దొర గడీని ఆక్రమించి దస్తావేజులు చింపేసి దున్నేవాడిదే భూమి అన్న ఉద్యమ నినాదాన్ని అమలు చేస్తాడు.

ఆవే శ ప్రవృత్తి ఉన్న నాగయ్య (బి.నరసింగరావు) జైలునుంచి విడుదల అవుతా డు. రజాకార్ల హింసాకాండకు అంతులేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వం పోలీస్ యాక్షన్ పేరుతో సైన్యాన్ని దింపటంతో 194 సెప్టెంబర్‌లో నిజాం లొంగిపోతాడు. నిజాం గద్దె దిగాడు కనుక ఉద్యమం ఆపేయాలని ఒక వర్గం, కర్షక కార్మిక రాజ్యం ఏర్పడలేదు కనుక కొనసాగించాలని మరో వర్గం భావిస్తాయి. ఉద్యమకారులకు భయపడి ఊళ్లు విడిచి తలదాచుకున్న భూస్వాములు కాంగ్రెస్ తీర్థం తీసుకొని ఖద్దరు ధరించి, గాంధీటోపీలతో ఊళ్లలోకి ప్రవేశిస్తారు. సైనికదళాలతో తలపడ్డ రామయ్య వీరమరణం పొందుతాడు. ఉద్యమం కొనసాగించాలనే కృతనిశ్చయంతో దళాలు అడవిలోకి ప్రవేశించటంతో సినిమా ముగుస్తుంది. కర్షక కార్మిక రాజ్యం ఏర్పడేదాకా పోరాటం సాగుతూనే ఉంటుందన్నది సూచన.
నరసింగరావుకు తాను తీయదలిచిన సినిమాకు సంబంధించిన రాజకీయ, సాంస్కృతిక అంశాల అవగాహన పూర్తిగా ఉన్నది. కానీ సినిమా కళకు సంబంధించిన అవగాహన సాంకేతికమైన నైపుణ్యం లేదు. ఇక్కడి వాడు కాకపోయి నా వామపక్ష భావాలున్న వాడు కాబట్టి గౌతంఘోష్ తెలంగాణ సంక్షిష్ట అంశాల ను అవగాహన చేసుకొని వాటిని తన ప్రజ్ఞతో సినిమా మాధ్యమంలోకి మలచగలిగారు. ఆ తర్వాత తాము తీసిన ఏసినిమాలోనూ ఈ టెక్నిక్‌ను తిరిగి వాడుకోలేదు. అవార్డుల పరంగా చూస్తే జాతీయస్థాయిలో రెండవ ఉత్తమ ప్రాంతీయ చిత్రం(190), ఉత్తమ సినిమా, ఉత్తమ స్క్రిప్ట్ విభాగాలలో నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమ చిత్రం విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డు, ఉత్తమ తెలుగు చిత్రంగా సినీ హెరాల్డ్ అవార్డు మాభూమి గెలుచుకుంది.

కార్లొవివరీ(చెకొస్లొవేకియా), కైరో, సిడ్నీ, తాష్కెం ట్‌లలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శించబడి గౌరవాలను అందుకున్నది. ఈ సిని మా అనుభవం పునాదిగా గొప్ప సినిమాల సారాంశాన్ని కలకలిపి తనదైన జీవితావగాహనతో దర్శకుడిగా రంగుల కల, దాసి వంటి గొప్ప చిత్రాలను నరసింగరావు తీశారు. ఈ సినిమాలతో నరసింగరావుకు గుర్తింపు ఎలా ఉన్నా ఎన్నటికీ తీరని అప్పులు మాత్రం మిగిలాయి. అయితే.. కళ కళకోసం కాదు ప్రజల కోసమని నమ్మి నరసింగరావు తనదైన ఉన్నత మార్గాన్ని ఎప్పుడూ వదలలేదు. ఫక్తు వ్యాపార సినిమా మార్గాన్ని ఎంచుకోలేదు. తన సినిమాలకు ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి. 30 ఏళ్లకిందట కేవలం 5 లక్షలతో తీసిన సినిమా అయినా.. దోబిగా జమీన్, మదర్ ఇండియా, లగాన్ వంటి సినిమాల సరసన గౌరవవూపదమైన స్థానాన్ని ‘మాభూమి ’సాధించింది. నవ్య సినిమా, సమాంతర సినిమా వంటి పేర్లకంటే ప్రజాసినిమా అన్న పేరే మాభూమికి సరిపోతుంది. ఇది మేల్కొన్న మనిషికథ. మేల్కొన్న మనిషి వీరుడవుతాడు. ఆ వీరుడు చరిత్ర సృష్టిస్తాడు. 
-అమ్మంగి వేణుగోపాల్, 9441054637
(మాభూమి సినిమాకు 32 ఏళ్లు నిండిన సందర్భంగా..) 

నమస్తే తెలంగాణా న్యూస్ పేపర్ DATED : 23 /03 /2012 

Friday, March 9, 2012

ఆగ్రహమూ, నిగ్రహమూ---Sampadakiyam




తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిన ‘మిలియన్ మార్చ్’ జరిగి నేటికి ఏడాది నిండింది. వలసవాదులు ఆధిపత్య స్వభావంతో ఈ మహత్తర ఘటనను విధ్వంసంగా చూపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ అనేక విధాలుగా మిలియన్ మార్చ్ ప్రాధాన్యం సంతరించుకున్నది. ఉద్యమ చైతన్యాన్ని అర్థం చేసుకోడానికి, ఉద్యమ గతిని నిర్దేశించుకోవడానికి ఈ మిలియన్ మార్చ్ అధ్యయనాంశంగా ఉపయోగపడుతుంది. 

తెలంగాణ ఉద్యమం ఊరూరా వాడవాడనా బహుముఖాలుగా ఇప్పటికీ సాగుతున్నది. ఊళ్ళలో వృత్తుల వారీగా నిరాహార దీక్షలు పట్టడం మొదలుకొని హైదరాబాద్ నడి బజారులోకి వచ్చి వంట చేసుకోవడం దాన్క అనేక విధాల నిరసన వ్యక్తీరణ సాగుతున్నది. అయితే ప్రజలలో ఆగ్రహం ఉండి కూడా నిగ్రహం పాటిస్తున్నారా? ఉద్యమ నాయకులు వారిని నియంవూతిస్తున్నారా? ప్రజలు అవకాశం వస్తే ఆగ్రహాన్ని ఏ స్థాయిల్లోనయినా వ్యక్తీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? మొదలైన సందేహాలు ఉండేవి. తెలంగాణ ప్రజల ఆగ్రహ స్థాయిని గ్రహించడానికి మానుకోట వంటి ఘటనలు ఉపయోగపడతాయి. కానీ ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను తొలగించడంలో వారి చైతన్యం, పరిణతి, ఆగ్రహం, నిబ్బరం మిళితమై ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం అంతటా విస్తరించినప్పటికీ, భిన్న వర్గాలు, సైద్ధాంతిక శక్తులు పాల్గొంటున్నప్పటికీ, ఒక్క కుతికెతో కదులుతున్నది. పైకి చెప్పుకోని ఒక అవగాహన అందరిలో తొణకిసలాడుతున్నది. ఆర్థిక పరమైన దోపిడీ మొదలుకొని, సాంస్కృతిక అణచివేత వరకు అన్నీ తెలంగాణ ప్రజలు అవగాహన చేసుకుని ఉన్నారు. వలస పాలకులు తమ ఆధిపత్యాన్ని సుస్థిరపరచుకోవడానికి ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు పెట్టారనే అవగాహన కూడావారికి ఉన్నది. అయితే తెలంగాణ ఆకాంక్షను వలస ప్రభుత్వానికి, ఢిల్లీ పెద్దలకు వినిపించడానికి మాత్రమే మిలియన్ మార్చ్‌ను తలపెట్టారు. అదొక ప్రజాస్వామిక కార్యక్షికమం. మన రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వమైతే, ప్రజల శాంతియుత, ప్రజాస్వామిక నిరసనకు సహకరించాలె. వేదిక చూపించి అక్కడ నిరసన వ్యక్తీకరించడానికి ఏర్పాట్లు చేయాలె. కానీ వలస ప్రభుత్వానికి ఆ సంస్కారం లోపించింది. తన నిరంకుశ స్వభావాన్ని బయట పెట్టుకున్నది. జిల్లాల నుంచి తరలి వస్తున్న అనేక మందిని నిర్బంధించింది. హైదరాబాద్ గల్లీలలో అప్రకటిత నిషేధం అమలు పరిచింది. ఉద్యమ నాయకులందరినీ ప్రభు త్వం నిర్బంధించింది. అయినప్పటికీ, బడితె పాలనకు ఒక పరిమితి ఉంటుందని, ప్రజల చైతన్యాన్ని నివారించలేదని మిలియన్ మార్చ్ నిరూపించింది. 

అనేక వ్యూహాలతో విడిగా, గుంపులుగా ఉద్యమకారులు ట్యాంక్‌బండ్‌పైకి చేరుకోగలిగారు. వారిలో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతున్నా, దారిలో ఎక్కడా విధ్వంసానికి పాల్పడలేదు. ఉద్యమ నాయకత్వం నిర్బంధంలో ఉన్నప్పటికీ జనం ఎంతో చైతన్యాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వ అణచివేతకు నిరసనగా-ముందుగా తమ కార్యక్షికమంలో లేనప్పటికీ- వలసవాద ప్రతీకలుగా ఉన్న కొన్ని విగ్రహాలను తొలగించి వేశారు. కొన్ని ఆంధ్ర ప్రముఖుల విగ్రహాలను సైద్ధాంతిక కారణాలపై కూలగొట్టవద్దని కొందరు కోరినప్పుడు గొడవ లేకుండా వదలి పెట్టారు. ఆంధ్ర సంపన్నులు ఉంటున్న ప్రాంతాలు సమీపంలోనే ఉన్నా ఉద్యమకారులు అటువైపు మళ్ళి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించలేదు. అనుక్షణం వివేచనతో వ్యవహరించారు. ఉద్యమకారులు ట్యాంక్ బండ్‌పై ఆంధ్ర విగ్రహాలను తొలగించడాన్ని తెలంగాణ ప్రజానీకం యావత్తూ హర్షించింది. తెలంగాణ ప్రజల గుండెల్లో బడబాగ్ని రగులుతున్నది. వారిలో ఆగ్రహం ఉన్నది. కానీ సమయం, సందర్భం తెలుసుకుని వ్యవహరించే వివేచన కూడా వారికి ఉన్న ది. అవసరం వచ్చినప్పుడు ఆగ్రహాన్ని ఎంత మేరనైనా ప్రదర్శించగలరనే హెచ్చరిక కూడా మిలియన్ మార్చ్‌లో ఉన్నది. 

వలస ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకున్న పరిణతిలో ఆవగింజ వంతైనా లేదు. మిలియన్ మార్చ్ జరిగి ఏడాది గడిచింది. వలస ప్రభుత్వానికి ఇదొక అవకాశం. కనీసం ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను పెట్టడంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడానికైనా పూనుకోవడం విజ్ఞత. మళ్లీ కొత్తవి పెట్టేముందు వివక్షకు తావు లేకుండా తెలంగాణ వైతాళికుల విగ్రహాలు కొన్ని పెట్టాలె. వలస ప్రభుత్వం ప్రతిష్ఠించదలచుకోవాలే కానీ తెలంగాణ ప్రముఖులకు కొదవలేదు. అలనాడే తొలి స్వాతంత్య్ర సమరంలో కొదమ సింహమై పోరాడి బలైన తుర్రెబాజ్ ఖాన్ విగ్రహం ట్యాంక్‌బండ్‌పై లేదు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య, గిరిజన వీరుడు కొమురం భీము వలస వాదుల కంటికి కనిపించరు. పెత్తందారులను దోచి, పేదలకు పంచిన మహావీరుడు సర్వా యి పాపన్న విగ్రహం పెట్టరు. ప్రముఖ రచయిత, ఉద్యమకారుడు వట్టికోట ఆళ్వారు స్వామిని, రజాకార్లను ఎదిరించిన ప్రాణాలను పణంగా పెట్టిన పాత్రికేయుడు షోయెబుల్లా ఖాన్‌ను గుర్తించరు. గులామీ కీ జిందగీ సే మౌత్ అచ్చీ హై అని నినదించిన తెలంగాణ నాయకుడు కె.వి. రంగాడ్డి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టరు. తెలంగాణ నీళ్ళను దోచుకుంటూ కాటన్ విగ్రహం పెట్టుకుంటారు తప్ప నిజాంసాగర్ కట్టించిన ఇక్కడి ఘనత వహించిన ఇంజనీరు అలీ నవాజ్ జంగ్‌ను తలువరు. 

హైదరాబాద్ నడిబొడ్డున గల చిరాన్ ఫోర్ట్ ప్యాలస్‌కు, వందలాది మంది తెలంగాణ బిడ్డలను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపించిన కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు పెట్టి, ఆయన విగ్రహాన్ని నిలబెట్టారు. తెలంగాణ గడ్డపై వలస పాలకులు తమ ప్రాంతపు విగ్రహాలే పెట్టుకోవడం ఎంత వరకు సమర్థనీయం? అణచివేతకు గురవుతున్న ప్రజలు వలస పాలకుల ఆధిపత్య చిహ్నాలను తొలగించడం ప్రపంచమంతటా సాగుతున్నది. అమెరికాలో మూలవాసులు కొలంబస్ విగ్రహాలను పడగొట్టారు. మధ్యఆసియా దేశాల వారు సోవియట్ చిహ్నాలను తొలగించారు. ఇదే సంప్రదాయాన్ని తెలంగాణ జనం కొనసాగించారు. ఇందులో తప్పేమీ లేదు. కానీ తమకు న్యాయం జరగాలని ఇంత తీవ్రంగా తెలంగాణ ప్రజలు కోరిన తరవాత కూడా వలస పాలకులు ఈ ఏడాది కాలంలో తెలంగాణ వైతాళికుల విగ్రహాలు పెట్టకుండా, మళ్ళీ తమ ఆధిపత్య చిహ్నాలనే పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటుండడం మాత్రం క్షమించరాని నేరం.

Namasete Telangana Sampadakiyam Dated : 10/03/2012 

పోరాట ప్రతీక ‘మిలియన్ మార్చ్----కె. గోవర్ధన్



రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో ‘మిలియన్ మార్చ్’ విలువైన గుణపాఠాన్ని నేర్పింది. ఉధృతంగా సాగుతున్న ఉద్యమాన్ని క్రూర నిర్బంధంతో నలిపేయాలనుకున్న కిరణ్ సర్కార్‌కు చెంపపెట్టుగా మారింది. అణచివేత ప్రతిఘటనకు దారితీస్తుందన్న చారివూతక సత్యాన్ని మిలియన్‌మార్చ్ మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. ఉద్యమ శక్తులకు, ప్రజానీకానికి అంతులేని విశ్వాసాన్ని ఇవ్వడమే కాకుండా, తెగించి పోరాడందే తెలంగాణ రాదనే సందేశాన్ని ఇచ్చింది. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మాట తప్పి, మోసగిస్తున్నందుకు మిలిటెంట్ పోరాటాలే మార్గమని చెప్పిన మిలియన్ మార్చ్ బాట అనుసరణీయమైనది.
నాడు ‘మిలియన్ మార్చ్‌కు ప్రభుత్వ అనుమతి లేదన్నది. మార్చి 11వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలో నిషేధాజ్ఞలున్నాయి. సభలు, సమావేశాలు నిషిద్ధం. ఎవరైనా ఈ ఆంక్షలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవు’ అంటూ రాష్ట్ర డీజీపీ మొదలు సాధారణ పోలీసు అధికారుల దాకా అదే పనిగా ప్రచారం సాగించారు. మార్చి 5వ తేదీ నుంచే హైదరాబాద్‌కు ఎవరూ వెళ్లకూడదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌ను నాలుగు నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడకుండా ‘రచ్చబండ’లో అడ్డుపడి తెలంగాణ పౌరుషానికి ప్రతీకగా నిలిచిన రాయినిగూడెం మహిళల్ని మార్చి 6వ తేదీనే కస్టడీలోకి తీసుకున్నారు. తెలంగాణ జిల్లాల్లోని ప్రజానీకం మిలియన్‌మార్చ్‌కు తరలిరాకుండా ఆయా జిల్లాల ఎస్పీలు హెచ్చరికలు జారీచేశారు. కొన్నిచోట్ల గ్రామస్థులను పిలిచి బైండోవర్ కేసులు పెట్టారు. మార్చి 10న హాజరు కావాలని ఆజ్ఞలు జారీ చేశారు. ఈ ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తే పదివేల రూపాయల జరిమానా కట్టాలని, బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు. తెలంగాణ జేఏసీ నాయకుల్ని, ఇతర ప్రజా సంఘాల కార్యకర్తల్ని మార్చి అర్ధరాత్రి నుంచే అరెస్టుచేశారు. వేలాది మందిని పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించారు.


మార్చి 10న తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే రైళ్లనంటిని రద్దు చేశారు. ఏ లారీని, జీపును, ఇతర వాహనాలను కూడా అనుమతించలేదు. ఎవరైనా మిలియన్ మార్చ్‌కు లారీలను, ఇతర వాహనాలు సమకూరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని, వాటి యజమానులను బెదిరించారు. చాలాచోట్ల ఆర్‌సీ బుక్కులను లాగేసుకున్నారు. చివరికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిని సైతం పోలీసులు విడిచిపెట్టలేదు. కొన్నిచోట్ల ప్రయాణికులను దించివేశారు. ఇలా హైదరాబాద్ నగరానికి వచ్చే రహదారులలో చాలాచోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. రాజధాని నగరంలోని ముఖ్యమైన రోడ్లన్నిటిని మూసివేసి వేలాదిమంది పోలీసులతో పహరా పెట్టారు. ప్రజలను ట్యాంక్‌బండ్ చేరుకోకుండా ప్రభుత్వం అన్ని రకాల నిరంకుశ, నిర్బంధ చర్యలకు ఒడిగట్టింది.
ప్రభుత్వం అనుసరిస్తున్న క్రూరమైన అణచివేత విధానాన్ని ఎదుర్కొని ఎలాగైనా ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్‌ను జయవూపదం చేయాలని న్యూడెమోక్షికసీ భావించింది. ఆ సంకల్పం నుంచే ఆర్యసమాజ్‌లో పెళ్లి ఆలోచన ముందుకొచ్చింది. దీన్ని పకడ్బందిగా అమలుచేసి, అక్కడ క్యాడర్‌ను జమ చేసింది. అలా ఆర్యసమాజ్‌లో, చుట్టుపక్క ప్రాంతాల్లో గుమిగూడిన దాదాపు ఎనిమిదివందల మంది న్యూడెమోక్షికసీ, పీడీఎస్‌యూ, పీఓడబ్ల్యూ, ఐఎఫ్‌టీయు, జేఏసీ శ్రేణులు సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటలోపే ట్యాంక్‌బండ్‌కు చేరుకోగలిగారు. ఆర్యసమాజ్ నుంచి వందల సంఖ్యలో జై తెలంగాణ అంటూ రాకెట్‌లా దూసుకొచ్చారు. మూడంచెల పోలీసు వలయాన్ని, బారికేడ్లను, ముళ్ల కంచెలను ఛేదించి ట్యాంకుబండ్‌పై మిలియన్ మార్చ్‌ను ప్రారంభించారు. టీజేసీ కో-ఛైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, న్యూడెమోక్షికసీ నాయకులు సూర్యం. ప్రదీప్, జె.వి. చలపతిరావు, పీఓడబ్ల్యూ నాయకురాళ్లు సంధ్య, ఝాన్సీలతో పాటు నాలాంటి వందలాది మందిమి ట్యాంక్‌బండ్‌పైకి దూసుకెళ్లాం. పోరాట పతాకమైన ఎర్రజెండా ఎగురవేశాం. దీంతో హతాశులైన పోలీసు బలగాలు ఉద్యమకారులపై విరుచుకుపడ్డాయి. దొరికిన వారిని దొరికినట్టుగా చితకబాదారు. ముళ్లకంచెలను, తుపాకులను, లాఠీలను ఎదురొడ్డిన వందలాది ఉద్యమకారులు సమరోత్సాహంతో పోలీసుల అష్ట దిగ్బంధాన్ని వీరుల్లా చిత్తుచేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన దిగ్బంధాన్ని పటాపంచలు చేస్తూ వేల సంఖ్యలో వివిధ వర్గాలకు చెందిన ప్రజానీకం ట్యాంక్‌బండ్‌పై ఉత్సాహపూరితంగా మార్చ్ నిర్వహించారు. ఊరేగింపులుగా పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ మిలియన్ ‘మార్చ్’ను విజయవంతంగా నిర్వహించారు. న్యూడెమోక్షికసీ శ్రేణులతో పాటు బీజేపీ, సీపీఐ, టీఆర్‌ఎస్, జేఏసీలకు చెందిన నాయకులు, ఉస్మానియా, కాకతీయ,తదితర యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు,జర్నలిస్టులు లాయర్లు, డాక్టర్లు, ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మిలియన్ మార్చ్‌లో పాల్గొన్నా రు. అమరవీరుల త్యాగా ల సాక్షిగా తెలంగాణ వచ్చేవరకు వీరోచితంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అణచివేత విధానాలకు వ్యతిరేకంగా సాగిన మిలియన్ మార్చ్‌ను కొంతమంది పనిగట్టుకుని ‘విగ్రహాల విధ్వంసం’గా ప్రచారం చేశారు. మిలియన్ మార్చ్ ప్రశాంతంగా ముగుస్తున్న సమయంలో కొంతమంది విగ్రహాల విధ్వంసానికి పూనుకున్నారు. దీన్ని నాలాంటివాళ్లతో పాటు అనేక మంది సరికాదని వారించాం. అయితే ప్రభుత్వ అణచివేతలోంచి కట్టలు తెంచుకున్న ప్రజాక్షిగహానికి ప్రతీకగానే మిలియన్‌మార్చ్ చూడాలి. శాంతియుతంగా జరుప తలపెట్టిన మిలియన్ మార్చ్‌కు తెలంగాణ జేఏసీ ముందుగానే ప్రభుత్వ అనుమతిని కోరింది. పోలీసులు అనుమతి నిరాకరించడమే కాకుండా అడ్డుకుంటామని బహిరంగంగా ప్రకటించారు. అడుగడుగునా అడ్డంకుల్ని సృష్టించారు. అయినప్పటికీ ప్రభుత్వ నిర్బంధాన్ని తిప్పికొడుతూ తెలంగాణ ప్రజలు మిలియన్‌మార్చ్‌ను సాహసోపేతంగా నిర్వహించారు. తెలంగాణ నినాదాన్ని దేశమంతటికి వినిపించడంలో కృతకృత్యులయ్యారు. అందుకే తెలంగాణ ఉద్యమానికి మిలియన్ మార్చ్ పోరాట ప్రతీక.

-కె. గోవర్ధన్
సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్షికసీ రాష్ట్ర కమిటీ సభ్యులు
Namasete Telangana News Paper Dated : 10/03/2012 

ఆధిపత్యంపై తిరుగుబాటు యాత్ర---పొఫెసర్ కోదండరామ్



మిలియన్ మార్చ్ ఆంధ్రపాలకుల నిరంకుశత్వంపై తెలంగాణ ప్రజలు చేసిన తిరుగుబాటు యాత్ర. సహాయనిరాకరణ ఉద్యమంలో సకల జనులను భాగం చేయడానికి, ప్రభుత్వంపై ఒత్తిడిని తీవ్రతరం చేయడానికే జేఏసీ మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. సహాయ నిరాకరణతో పాలన స్తంభించిపోయింది. అయితే ఈ కార్యక్షికమ భారం మొత్తం ఉద్యోగులే భరించవలసి వచ్చింది. ఉద్యోగులకు అండగా ప్రజలను కదిలించకుండా లక్ష్యాన్ని సాధించలేమన్న ఆలోచనతోనే జేఏసీ మిలియన్ మార్చ్ కార్యక్షికమాన్ని తయారుచేసింది. జేఏసీలో లేని అనేక సంఘాలు ప్రత్యేకించి ప్రజావూఫంట్ కూడా మిలియన్ మార్చ్‌లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చాయి.

అప్పటికే ఈజిప్టులో తెహరీర్ స్కేర్ నిరసన జరిగింది. ఆ పోరాట స్ఫూర్తి మిలియన్ మార్చ్‌కు దారి తీసింది. ప్రజలు కూడా చాలా ఉత్సాహంగానే స్పందించారు. యువతీ యువకులు, విద్యార్థినీ విద్యార్థులు, మధ్యతరగతి మేధావులు చాలా పెద్ద ఎత్తున కదిలారు. ప్రభుత్వ నిర్బంధ విధానాలు, ప్రత్యేకంగా ఎవ్వరూ హైదరాబాద్‌లోకి ప్రవేశించకుండా, ప్రవేశించినా ట్యాంక్‌బండ్ చేరకుండా ఏర్పాటు చేసిన పోలీసు వలయం ప్రజల్లో ఆగ్రహజ్వాలను రగిలించాయి. మన హైదరాబాద్ చేరుకోవడానికి ఇన్ని ఆంక్షలా అన్న అభివూపాయం తెలంగాణ అంతటా వ్యాపించింది. తెలంగాణ ఇక్క డి ప్రజలదే ఇది గుప్పెడుమంది ఆంధ్ర పాలకులది కాదన్న విషయాన్నిచాటి చెప్పడానికి ట్యాంక్‌బండ్‌కు చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఎవరి వ్యూహాలు వారు తయారు చేసుకున్నారు. పక్కనున్న వ్యక్తికి కూడా ఆ విషయం చెప్పలేదు.

నాలుగు రోజుల ముందు చేరుకొని హైదరాబాద్‌లో ఉండి ట్యాంక్‌బండ్ చుట్టూ సేదదీరే బిచ్చగాళ్లలో చేరిపోయి, వాళ్లతో పాటు అక్కడనే రాత్రుళ్లు గడిపిండ్రు. ఊరి నుంచి హైదరాబాద్ తోవలు బంద్ కావడంతో పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న వాళ్లు ఉన్నారు. గుంపుగా వస్తే పోలీసుల దృష్టి పడుతుంద ని విడివిడిగా ప్రయాణం చేసి ఏదో ఒక కారణం చూపించి హైదరాబాద్ వచ్చిన విద్యార్థుపూందరో. పోలీసులు బస్సుల నుంచి దింపితే కాలినడకన ట్యాంక్‌బండ్ చేరుకోవాలని కృషి చేసి విజయం సాధించిన వాళ్లున్నారు. ట్యాంక్‌బండ్ ఎక్కాలన్నదే అందరి లక్ష్యం.

చాలా మంది రాలేకపోయారు. దాదాపు 50,000 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరెంతో మందిని బస్సుల నుంచి, రైళ్ల నుంచి దింపి వెనకకు పంపించినారు. అసెంబ్లీ నుంచి బయలుదేరిన ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినారు. జేఏసీ ఆఫీసు ఆరోజు పోలీసుల దిగ్బంధంలో ఉన్నది. నాతో పాటు ఆఫీ సు నుంచి బయలుదేరిన ఎండల లక్ష్మీనారాయణ, తదితరులను అరెస్టు చేసిండ్రు. ఇన్ని దాడుల మధ్య ట్యాంక్‌బండ్ ఎట్లా చేరుకుంటారని విలేకరులు వేసిన ప్రశ్నకు ఆరోజు మేము సమాధానం చెప్పలేదు. కానీ అప్పటికే వ్యూహ రచన జరిగింది. ట్యాంక్‌బండ్‌కు దగ్గరిలో కలుసుకోగలిగితే ట్యాంక్‌బండ్ పైకి రావడం కష్టం కాదు. అందుకే పెళ్లి నాటకంతో ఒకచోట చేరుకుని మూకుమ్మడిగా ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్నరు. చుట్టుపక్కల ఒంటరిగా తిరుగుతున్న వాళ్లు కొందరు ఆ గుంపులో చేరిపోయిండ్రు. అందరూ కలిసి బారికేడ్లను బద్దలుకొట్టి ట్యాంక్‌బండ్‌ను మద్దాడిండ్రు. ఒంటిమీదు న్న ప్యాంట్లు విడిచి తాడుగా మార్చుకొని ట్యాంక్‌బండ్ కట్టకిందనున్న వారినిపైకి లాగిన యువకులున్నారు. ట్యాంక్‌బండ్ ఎక్కినప్పుడు తెలంగాణవాదులకు కలిగిన ఆనందం ఎవస్టు శిఖరం ఎక్కినప్పుడు టెన్సింగ్ నార్గే కూడా పొంది ఉండడు. నాకు ఒక యువకుడు ఫోన్‌లో చెప్పిన విషయాలు ఆనాటి తెలంగాణవాదుల మానసిక స్థితిని తెలియజేస్తాయి.

ఆయన మాటల్లో ‘సార్ పోలీసుల బారికేడ్లు తప్పించుకున్న, లాఠీదెబ్బలు తిన్న, ముళ్ల కంచెలు దాటిన, బట్టలు చినిగినై, ఒళ్లంతా గాయాలు, రక్తంతో తడిసిన. కానీ ఇవి చెప్పడానికి ఫోను చేయలేదు, నేనిప్పుడు ట్యాంక్‌బండ్ పైనున్నానని చెప్పడానికి ఫోన్ చేసిన’.టెన్సింగ్ నార్గే ప్రకృతి నిర్మించిన అవరోధాన్ని అధిగమించిండు. కానీ తెలంగాణ ప్రజలు ఆంధ్రపాలకుల నిరంకుశత్వాన్ని, వాళ్లు ఏర్పాటు చేసిన ఆటంకాలను దాటి వచ్చిండ్రు. టెన్సింగ్ నార్గే మనిషి శక్తియుక్తులను ప్రదర్శించిండు. కానీ మిలియన్‌మార్చ్ రోజు తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలన్న ఆకాంక్షను- నిర్బంధాన్ని దాటి ట్యాంక్‌బండ్‌పై చేరుకుని- ప్రకటించినారు. స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం కోసం మనిషి ఏం చేయగలడో తెలుసుకోవాలంటే మిలియన్ మార్చ్ గురించి తెలుసుకోవాలి. నిరంకుశత్వంపైన, ఆధిపత్యంపైన మనిషి సాధించిన విజయానికి మిలియన్‌మార్చ్ ఒక అపురూపమైన ప్రతీక. మనిషి తలుచుకుంటే ఎంతటి నియంతనైనా ఎదిరించగలడు. ఇది ప్రపంచ చరివూతలోనే ఒక కీలకమైన దినం. అందుకే మిలియన్ మార్చ్ జ్ఞాపకాలను తెలంగాణ పదిలంగా దాచుకోవాలి. హైదరాబాద్ చేరుకోలేని వారు ఎక్కడికక్కడ మిలియన్ మార్చ్ నిర్వహించారు.

నిజానికి తెలంగాణ ప్రజలు శాంతినే కోరుకున్నారు. పోలీస్ కమిషనర్‌ను అనుమ తి కోరాము. పరీక్ష అయిపోయిన తర్వాతే ఒంటిగంటకు ర్యాలీ తీస్తాము. సాయంకాలం ఐదు గంటల కల్లా ముగిస్తామని అన్నాము. కమిషనర్ కాదన్నడు. కోర్టు ఆర్డరు ఉన్నది, ట్యాంక్‌బండ్‌పై ర్యాలీ ఒప్పుకోమన్నారు. పోనీ నిజాం కాలేజీ ఆవరణలో నిరసన సభ చేసుకుంటామని అన్నాము. అసెంబ్లీ ఉండగా అక్కడ అందుకు అవకాశం లేదన్నడు. అట్లాగైతే ఎవ్వరికీ ఇబ్బంది కలగదు కనుక నెక్లెస్ రోడ్డును నిరసనకు వాడుకుంటామని అడిగినాము. సెక్రె పక్కన గుమిగూడితే శాంతిభవూదతల సమస్య తలెత్తుతుందన్నాడు. మరి ధర్నాచౌక్‌లో కూర్చుంటాము, చట్టపరమైన సమస్యలు కూడా రావని చెప్పినం. కుదరదన్నడు. ‘మీరు అక్కడి నుంచి బయలుదేరి ట్యాంక్‌బండ్ ఎక్కవచ్చునన్న’ అనుమానం వ్యక్తం చేసిండు. చివరకు ఇంటర్ పరీక్షలు రాసే పిల్లలకు ఇబ్బంది రానీయవద్దని, పరీక్షలు మొదలైన తర్వాతనే బారికేడ్లు కట్టాలని ప్రాధేయపడినం. పిల్లల పరీక్షల కోసమే ర్యాలీని అనుమతించడం లేదన్న ప్రభుత్వం రాత్రికిరాత్రే బారికేడ్లు కట్టి పిల్లలకు ఇబ్బందులు సృష్టించింది. మీకు చేతనైతే ఆపండి, మాకు శక్తి ఉంటే ట్యాంక్‌బండ్‌పై చేరుకుంటామని చెప్పి లేసి వచ్చినం.
పై విషయాలు ఎందుకు చెప్తున్నానంటే తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఆంధ్ర పాలకులు వారి ఆస్తిపాస్తులకు, అధికారానికి కేంద్రంగా మారిన హైదరాబాద్ ను పోలీసు క్యాంపుగా మార్చిండ్రు. ముఖ్యంగా తెలంగాణవాదులు గుమిగూడుతున్నరం వారికి భయం. ఆస్తులపై దాడి జరుగుతందని వారి అనుమానం. అందుకే హైదరాబాద్‌లో ఏ ప్రజాస్వామిక నిరసనకూ అవకాశం లేదు. పోలీసుల దాడులతో అన్ని కార్యక్షికమాలను అణచివేస్తుంటరు. ఇంతటి అనుమాన వైఖరిని తెలంగాణ సమాజం ఎదిరించింది. విజయం సాధించింది. అందుకే తెలంగాణ ప్రజలు మిలియన్ మార్చ్‌ను ఆంధ్రపాలకుల ఆధిపత్యంపై సాధించిన విజయంగా చూస్తున్నరు.

ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారికి కలిగిన ఆనందం వర్ణనాతీతం. మిలియన్ మార్చ్ అయిన రెండు రోజులకు నేను వారిని హైదరాబాద్‌లో కలుసుకున్నాను. నగరంలో వారి స్నేహితుల అపార్టుమెంటులో ఉన్నారు. సారుకు విషయాలు చెప్పాలన్న ఆలోచనతో నేను వారింటికి వెళ్లినాను. అప్పటికే వారికి క్యాన్సర్ వచ్చింది. అది ఇక నయం కాదని తెలిసింది. మిలియన్ మార్చ్ నాడు సార్ ఎప్పటి వలెనె తయారై ఐదంతస్తులు దిగి ట్యాంక్‌బండ్ వెళ్లడానికి కారులో కూర్చున్నడు. పోలీసుల వలయంలో ఉన్న ట్యాంక్‌బండ్ చేరుకోవడానికి చాలా నడువాల్సి వస్తుందని, ఆయన ఆరోగ్యం బాగా లేనందున ఆ ప్రయత్నం చేయవద్దని మిత్రులు బతిమాలి వెనకకు తీసుకెళ్లినారు. మిలియన్ మార్చ్‌లో పాల్గొనాలన్న బలమైన కోరిక వారికి ఉండేది. తాను చేరుకోలేకపోయినా మిగతా తెలంగాణవాదులు చేరుకున్నందుకు సంతోషించిండు. 
సార్‌ను కలిసినప్పుడు విగ్రహాల విధ్వంసంపైకి చర్చ మళ్లింది. అప్పుడు ఆ విగ్రహాలను ఏర్పాటు చేసినప్పుడు చెలరేగిన వివాదాన్ని సహచరులతో కలిసి వారు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని గుర్తు చేసిండ్రు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపు లేకుండాపోయిందని తెలంగాణ చరివూతను, సాంస్కృ తి వారసత్వాన్ని గుర్తుచేసే వైతాళికులకు ట్యాంక్‌బండ్‌పై స్థానం ఉండాలని వారు ఇతర మిత్రులతో కలిసి విజ్ఞప్తి చేసిండ్రు. ఆంధ్ర పాలకులు తెలంగాణ విన్నపాలను ఎప్పుడూ పట్టించుకోలేదు. జయశంకర్ గారి విజ్ఞాపన పత్రమూ బుట్టదాఖలైంది. 

ఆ విధంగా ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు ఆంధ్ర ఆధిపత్యానికి గుర్తులుగా మిగిలిపోయినాయి. 1996లో ఉద్యమం బలపడిన తరువాత ఈ విషయాలు అందరికీ తెలిసినై. కీ.శే. గుడిహాళం ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు మీవి, హుస్సేన్‌సాగర్‌లో శవాలన్నీ మావి అనే కవితా పంక్తులను రాసినాడు. ఈ పంక్తులను కళాకారులు, కవులు గ్రామక్షిగామానికి మోసుకొనిపోయిండ్రు. విగ్రహాలు ఏర్పరిచినప్పుడే ఇది ఎప్పటికైనా బద్దలయ్యే సాంస్కృతిక అగ్నిపర్వతమని చెప్పినాం అని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాం. మిలియన్ మార్చ్‌లో పాల్గొన్న తెలంగాణ ప్రజల గుండెమంట అగ్నిపర్వతము వలె బద్దలైంది. వైతాళికుల చారివూతక పాత్ర ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆధిపత్యానికి ప్రతీకలుగానే విగ్రహాలను చూసినారు.

ఆంధ్రవూపదేశ్ సామాజిక, రాజకీయ విషయాలపైన చర్చను నిర్వహించేది సీమాంధ్ర మీడియానే. సహజంగానే తమ దృష్టి నుంచి మిలియన్ మార్చ్‌ను చూసి దానిపై వ్యాఖ్యానించిండ్రు. వారు విగ్రహాలను ధ్వం సం చేయడంలో ‘కల్లుతాగిన కోతులను’ మాత్రమే చూసినారు. తెలంగాణ ప్రజల మనసులలో ఉన్న ఆగ్రహానికి కారణమైన చారివూతక నేపథ్యాన్ని, ఆ ఆగ్రహాన్ని అర్థం చేసుకోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని మిలియన్ మార్చ్ పట్ల ప్రభుత్వం అనుసరించిన అప్రజాస్వామిక ధోరణిని పూర్తిగా విస్మరించినారు. ఈ చర్చ కారణంగానే విచ్చలవిడి అరెస్టులు జరిగాయి. ప్రదర్శనకారులు వెళ్లిపోయిన తర్వాత చుట్టుపక్కల బస్తీలలో కనిపించిన అమాయకులైన యువకులను అరెస్టు చేసినారు. అరెస్టయిన వారిలో ఈ ఘటనతో సంబంధం లేని ఒక గుడి పుజారి, ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన కూలీలు, రోడ్డుపై ఆడుకుంటున్న పదవ తరగతి విద్యార్థులూ, శాంతిని పెంపొందించడానికి కృషి చేసిన అడ్వకేట్లు ఉన్నారు. అక్రమంగా అరెస్టు చేసినందుకు కరీంనగర్ జిల్లా చెంజెర్ల గ్రామానికి చెందిన ఎంబీఏ చదువుతున్న ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనేక పట్టణాలలోని యువకులను ఎక్కడోవీడియోలో కనిపించాడంటూ ఎత్తుకొచ్చి కేసులు పెట్టినారు. 

మిలియన్ మార్చ్ తరువాత ప్రభుత్వం మరింత నిరంకుశంగా తయారైంది. ఎల్లప్పుడూ నక్సలైట్లకు శాంతి ప్రవచనాలు చేసే ప్రభుత్వం తాను మాత్రం హింసనే పాటించింది. తెలంగాణ ప్రజలు తాము ఎంచుకున్న శాంతియుత మార్గాన్ని వదిలిపెట్టలేదు. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో చరిత్ర గమనాన్ని శాసించగలమన్న విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు.

పొఫెసర్ కోదండరామ్
(తెలంగాణ జేఏసీ ఛైర్మన్)
Namasete Telangana News Paper Dated : 10/03/2012 

Wednesday, January 11, 2012

తెలంగాణ, టిఆర్ఎస్ ఉద్యమం



- కాశీనాథ్ చిలువేరు

స్వాతంత్య్రానంతరం జరిగిన ప్రజా ఉద్యమాలలో శిఖరాగ్రాన నిలువదగిన చారిత్రక నేపథ్యం, సైద్ధాంతిక పునాది, అత్యధిక ప్రజల భాగస్వామ్యం కలిగిన ఉద్యమం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. ఈ ఉద్యమానికి ఉన్న మహోన్నత చారిత్రక భూమికను ఎవరూ ప్రశ్నించజాలరు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ నెల 6న తెలంగాణలో పర్యటించిన విషయం తెల్సిందే. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఆయన పర్యటనను విదేశీయుల దండయాత్రలా చిత్రించి, భయభ్రాంతులను సృష్టించింది. 

ఇలా చేయడంలో ఆ పార్టీ ఆంతర్యాన్ని నిజాయితీగా చర్చించినప్పుడే తెలంగాణ ఉద్యమానికి, టిఆర్ఎస్ నడుపుతున్న తెలంగాణ ఉద్యమానికి మధ్యనున్న తేడాను గుర్తించగలుగుతాం. ఈ రెండు ఉద్యమాల మధ్య వ్యత్యాసం లేదని, రెండూ ఒకటేనని భ్రమింప చేయడంలోనూ, తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడంలోనూ దశాబ్ద కాలంగా టిఆర్ఎస్ పడరాని అగచాట్లు పడుతోంది. 

తెలంగాణ రాష్ట్ర సాధనకోసం హృదయపూర్వకంగా ఉద్యమిస్తున్న ప్రజల భావోద్వేగాల నుంచి, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా లబ్ధి పొందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోన్న టిఆర్ఎస్ పార్టీని సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. ఏకకాలంలో తెలంగాణ రాష్ట్రం, ఓట్ల రూపంలో ప్రజల మద్దతు సాధించాలనే విభిన్న లక్ష్యాలు నెరవేరడం ఆచరణ సాధ్యం కానివి. కోట్లాది ప్రజలు ప్రజాస్వామిక పథంలో, గాంధేయ పద్ధతులతో ఫలితం రాకపోవడానికి ప్రధాన కారణమేమిటి? తెలంగాణ రాష్ట్ర సాధనా ధ్యేయం కన్నా రాజకీయ ఆధిపత్యం సాధించాలనే బలమైన ఆకాంక్ష మూలంగా ఉద్యమం అంతిమ విజయాన్ని చేరుకోలేక పోతుంది. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969లో జరిగిన ఉద్యమానికి, నేటి వైవిధ్య భరితమైన ఉద్యమానికి స్వరూప స్వభావాలలో తేడా ఉన్నా నాయకుల 'రాజకీయ భవిష్యత్తు' అనే అంశంలో మాత్రం ఏక రూపకత ఉందని గుర్తించవచ్చు. టిఆర్ ఎస్ 2004లో కాంగ్రెస్ పార్టీతోను, 2009లో టిడిపితోను పొత్తు పెట్టుకొంది. ఈ పొత్తుల వ్యవహారంతో పాటు అప్పుడప్పుడు మధ్యంతర ఎన్నికలను ఆహ్వానించటం మొదలైనవన్నీ ఒక రాజకీయ పార్టీ భవిష్యత్‌కు పునాదులు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 

అయితే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కెసిఆర్) గొప్పతనమేమిటంటే టిఆర్ఎస్ ఎదుగుదలే తెలంగాణ ఉద్యమ సూచికగా సామాన్యులలో భావోద్వేగాలు రగిలించడంలో కృతకృత్యుడవడం. తెలంగాణ విలన్ పాత్రల్లో కాంగ్రెస్, టిడిపి లను చిత్రించడంలోనూ కెసిఆర్ తాత్కాలికంగా సఫలుడయ్యారు. అయితే తెలంగాణలో టిడిపి శ్రేణులు నేటికీ కంచుకోటలా ఉన్నాయి. వాటిని బద్ధలు కొట్టాలనే ఆకాంక్షతో టిఆర్ఎస్ వ్యూహాత్మక ఎత్తుగడలను పన్నుతోంది. వాటిలో భాగమే చంద్రబాబును టార్గెట్ చేసుకోవడం. ఆడలేక మద్దల వోడు అన్న చందంగా టిఆర్ఎస్ రెండు పడవల ప్రయాణం అర్థం, పరమార్థాన్ని నిష్పక్షపాతంగా విశ్లేషించుకోవాలి. 

ఒక వైపు ఉద్యమమే ఊపిరి అంటూనే మరోవైపు రాజకీయ ప్రయోజనాల కోసం టిఆర్ఎస్ ఆట కొనసాగిస్తోంది. ఈ ద్వంద్వ వైఖరిలోని ఆంతర్యం ఏమిటి? టిడిపి, కాంగ్రెస్ శాసనసభ్యలను టెర్రరైజ్ చేస్తున్నది తెలంగాణ సాధనకా? లేక టిఆర్ఎస్‌ను బలోపేతం చేయడానికా? కెసిఆర్ నైనా లేదా టిఆర్ఎస్ నైనా విమర్శించినా, వ్యతిరేకించినా తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రవేయడం నీతి బాహ్య విధానమే అవుతుంది. మొన్న వరంగల్‌లో జిల్లాలో టిడిపి పర్యటనకు స్వాగతం పలికిన వేలాది ప్రజలను, నాయకులను తెలంగాణ వ్యతిరేకులుగా ముద్ర వేస్తారా? టిడిపిలో ఉన్న తెలంగాణ నాయకులు రాజకీయాలు చేయకుండా సన్యసించాలా? టిడిపిని కోల్డ్ స్టోరేజిలో బంధించి తాను రాజకీయం చేయాలనుకునే కుటిల నీతి కెసిఆర్‌ది కాదా? 

తాను ఎంచుకున్న మార్గంలో పయనిస్తున్న టిఆర్ఎస్ విధానాల పట్ల ఏ పార్టీకి అభ్యంతరాలు ఉండనక్కర లేదు. కాని ఇతర పార్టీలను శల్య పరీక్షకు నిలిపేముందు స్వీయ రాజకీయ చతురతలో స్పష్టత, నిర్దుష్టత, నిలువెత్తు నిజాయితీలను పారదర్శకంగా ప్రజల ముందు ఆవిష్కరించగలగాలి. ఇందులో వేటికీ సరితూగని కెసిఆర్, ఇతర రాజకీయ పార్టీలను భూస్థాపితం చేస్తామని చేసే ప్రకటనలు తన బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి చేసేవే. ఇవి, తనకుతాను చేసే ఉత్తర కుమారుని ప్రగల్భాలలాగా మిగిలిపోతాయని గుర్తించాలి. ఎదుటి పార్టీలు బలహీనమైతే తాము బలపడతామని భావించే తత్వం నుంచి టిఆర్ఎస్ బయటపడాలి. స్వయం బలం పెంపొందించుకోకుండా ఓట్ల వేటలో సెంటిమెంట్‌ను ఎరగా చూపడం ఎంతో కాలం సాగదు. 

గడచిన పదేళ్ళలో జరిగిన ఎన్నికలను నిష్పాక్షికంగా పరిశీలిస్తే అర్థమయ్యేది ఏమిటి? తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్‌ను ఒక మంచి ఉద్యమ సంస్థగా గుర్తించారు. అయితే ఓట్ల రాజకీయాలలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో జత కట్టినా తెలంగాణలో ఏనాడూ ఐదో వంతు సీట్లను గెలుచుకోలేకపోయింది. అయినా టిఆర్ఎస్ దంతా ఎన్నికల ద్వారా తన బల నిరూపణ చేసుకోవాలనే తాపత్రయం. ఈ ప్రక్రియలో చాలా సార్లు తెలంగాణ ప్రజలు గట్టిగా తెలంగాణను కోరుకొంటున్నారా? అన్న విషయం సంశయాత్మకంగా మారింది. ప్రజలకు, పార్టీకి మధ్యనున్న ఈ వైరుధ్యం, అగాధమే టిఆర్ఎస్ పార్టీని పార్లమెంట్‌లో, శాసనసభలో బలంగా నిలుపలేకపోయింది. 

ప్రజలు కోరుకొంటున్నది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. టిఆర్ ఎస్ కోరుకొంటున్నది పార్టీ పరిపుష్టి. ఈ క్రమంలో కాంగ్రెస్, టిడిపి నాయకత్వాలను ఇరుకున పెట్టి టిఆర్ఎస్‌లో చేరకపోతే రాజకీయ భవిష్యత్ ఉండదనే న్యూనతా భావాన్ని వారి మనస్సులలో బలంగా నాటేందుకు కెసిఆర్ చేస్తున్న ఎత్తుగడలలో భాగంగానే చంద్రబాబు పర్యటనను అడ్డుకో జూసారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇకపోతే తెలంగాణ పొలిటికల్ 'జాక్' టిఆర్ఎస్ వ్యూహాన్ని అమలు చేయడంలో శల్య సార«థ్యం వహిస్తుంది. పొలిటికల్ జాక్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని అమలుచేసే పరిస్థితి కనిపించడం లేదు. 

పైగా జాక్ నాయకులు తామేదో రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే, ఎంపిలు అయిపోయినట్లుగా ఊహించుకుంటున్నారు. ఇది ఉద్యమ స్ఫూర్తిని నీరుగార్చడమే అవుతుంది. ప్రతి నిర్ణయానికి ముందు కెసిఆర్ వైపు చూచే జాక్ తెలంగాణ శాసనసభ్యలను రాజీనామా చేయమని కోరే నైతిక హక్కును కోల్పోయింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు పార్టీ గుర్తుపై పోటీచేయాలో స్పష్టం చేసే పరిస్థితి జాక్‌కు లేకుండా పోయింది. జాక్ తరఫున స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే సంప్రదాయాన్ని నెలకొల్పకుండా టిఆర్ఎస్, బిజెపి సభ్యులు తమ పార్టీల తరఫున పోటీచేయడంతో తెలంగాణ అంశానికి ప్రాధాన్యం ఇవ్వకుండా పార్టీల రాజకీయ ఆధిపత్యానికి ప్రాధాన్యాన్ని అంగీకరించినట్లయింది. 

దీంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని స్వతంత్రంగా నిర్వహించడం, కొనసాగించడంలో జాక్ సఫలం కాలేకపోయింది. మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఆశయాలను వ్యక్తీకరించడంలో పొలిటికల్ జాక్ ఉద్యమ శక్తులను ఏకం చేయడంలో ముందడుగు వేయలేకపోయింది. 1969 ఉద్యమం తర్వాత ఎన్నికలలో పాల్గొన్న తెలంగాణ ప్రజాసమితి ఉనికి కోల్పోయింది. ప్రస్తుత ఉద్యమ దశాబ్ది అనుభవం సైతం ఎన్నికల రాజకీయాల చుట్టూ తిరగడమే కనిపిస్తుంది. నిజాయితీ, చిత్తశుద్ధి, పారదర్శకతతో పెనవేసుకుని తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు ఏ రకమైన ఎన్నికలలోను పాల్గొనమని, తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లోనే పాల్గొంటామని శపథం చేసే నాయకత్వాలనే ప్రజలు విశ్వసించే అవకాశం ఏర్పడుతుంది. అందుకు ప్రస్తుత ఉద్యమ పంథా మారవలసి ఉంది. ప్రత్యేకంగా ఉద్యమ నాయకత్వ విధానాలను సమూలంగా మార్చుకోవలసి ఉంది. 

- కాశీనాథ్ చిలువేరు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి
Andhra Jyothi News Paper Dated 12/1/2012

Saturday, November 19, 2011

ఇంకా ఎన్నాళ్లీ బానిసత్వం? By -కల్లూరి కళావతి



ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణ ఇప్పుడే ఇవ్వలేమని చెప్పేశాడు. తెలంగాణ రాజకీయ ఆత్మ గౌరవానికి అదొక మరువలేని గాయం. తెలంగాణ తన స్వీయ రాజకీయ అస్తిత్వంతో, ఆత్మగౌరవంతో మాత్రమే సాధించు కోగలుగుతుందని మరోసారి రుజువైంది. తెలంగాణ స్వీయ రాజకీయబలంతో తప్ప ఏ ఇతర రాజకీయ పార్టీ తనకు తాను గా ఇవ్వదని ఇప్పటికైనా మనకు ప్రధాని గుర్తు చేసినందుకు సంతోషిద్దాం!
మలిదశ తెలంగాణ పోరాటం ఈతరానికి చారివూతిక నేపథ్యాన్ని తెలిపింది. సుసంపన్న తెలంగాణ, తదుపరి మోసపూరిత విలీనం, జరిగిన దోపిడీ గురించి తెలంగాణలో ఇవాళ తెలియని వారు ఉండరు. ఇన్నాళ్ళు అవమానాలు భరించిన భాష కూడా ఆత్మ గౌరవా న్ని సాధించుకుంది. తెలంగాణ మాండలికానికి ఇవాళ ఎనలేని గౌరవం వచ్చింది. ఒకప్పుడు తెలంగాణ మాండలికంలో మాట్లాడటానికి తెలంగాణ వాడే ఇష్టపడే వాడు కాదు. వచ్చీరానీ ఆంధ్రా మాండలికంలోనే మాట్లాడటానికి ప్రయత్నించేవాడు. దాన్నే ఒక సామాజిక గౌరవంగా భావించేవాడు. ఇవాళ తెలం గాణ మాండలికంలో మాట్లాడకపోతే తనను తానే ద్రోహం చేసుకుంటున్న వాడిగా భావిస్తున్నాడు. తన భాషలో మాట్లాడటమే తన ఆత్మ గౌరవంగా ప్రతి తెలంగాణ వాసి భావిస్తున్నాడు. ఇవాళ బతుకమ్మ పండగ కావచ్చు, బోనాల పండగ కావచ్చు కొంత కాలంగా తగ్గుముఖం పడుతూ వస్తున్న తెలంగాణ పండుగలు తిరిగి వైభవోపేతాన్ని సంతరించుకున్నాయి. ఇలాంటి అనేక తనవైన సాం స్కృతిక ప్రతీకలను ప్రతి తెలంగాణ వాసి తిరిగి స్పర్శిస్తున్నాడు. ఇలా భాష, చరిత్ర, సాంస్కృతిక అంశాల్లో తెలంగాణ తన ఆత్మ గౌరవాన్ని సాధించుకుంది. ఇవాళ రాజకీయ ఆత్మ గౌరవం కోసం అత్యంత కీలకమైన రాజకీయ పోరాటం చేస్తున్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఆత్మ గౌరవంతోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమని నమ్ముతున్నారు.

ఈ దేశంలో విలీనమై, ఈ దేశ అస్తిత్వాన్ని కాపాడిన తెలంగాణ దోపిడీ, అవమానాలకు గురవుతున్నది. నాడు తనకున్న ప్రపంచస్థా యి సంపదను ఈ దేశానికి ధారపోసిన తెలంగాణ, ఇపుడు ఆత్మహత్యలకు, నిరుద్యోగులకు నిలయమైంది. ఈ దేశ రాజ్యాంగం పట్ల తన విశ్వాసనీయతను చాటుకున్న తెలంగాణ, రాజ్యాంగ హామీల ఉల్లంఘనలకు బలైంది. తెలంగాణ రాజకీ య పార్టీలపై విశ్వాసం ఉంచింది, కానీ రాజకీయ పార్టీలు మాత్రం తెలంగాణ పట్ల విశ్వాసఘాతుకానికి పాల్పడుతూ వస్తున్నాయి. తెలంగాణ ప్రజలు రాజకీయ పార్టీలకు నిర్బంధ బందీలై తమ రాజకీయ స్వేచ్ఛను కోల్పోతూ వచ్చారు. తెలంగాణకు ఇచ్చిన రాజ్యాంగ రక్షణలు ఉల్లంఘించబడుతుంటే, తెలంగాణలో బతుకుతున్న ఒక్కపార్టీ అయినా గొంతెత్తి అడ్డుకున్న దాఖలా ఉంటే, ఇవాళ ఇంత పెద్ద ఉద్యమం వచ్చి ఉండేదేనా? ఇంకేముందని తెలంగాణేతర (బయటి) పార్టీలను తెలంగాణలో బతకనివ్వాలే? వచ్చిన తెలంగాణను అడ్డుకున్న పార్టీలను ఈ ప్రాంతంలో బతక నిచ్చేందుకు ఒక్క తెలం గాణవాసి మనసైనా ఒప్పుకుంటదా? అలాంటి పార్టీలను బతకనిస్తే రాష్ట్రం వస్తదా? కాబ ఇవాళ రాజకీయ పార్టీలపై తెలంగాణ విశ్వాసాన్ని కోల్పోయింది. స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని, రాజకీయ ఆత్మ గౌరవాన్ని సాధించుకోగలిగితే తప్ప ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోలేమని గుర్తించింది.

2009 డిసెంబర్ 7న అధికార పక్షంతో పాటూ, అన్ని ప్రతి పక్షాలు తెలంగాణ ఇవ్వటానికి ఒప్పుకున్నాయి. డిసెంబర్ 9న అవే పార్టీలు కొన్ని ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా తిరగబడ్డాయి. డిసెంబర్ 23న రెండో ప్రకటనతో తెలంగా రాజకీయ ఆత్మ గౌరవం అవమానించబడింది. దీంతో తెలంగాణ గుండె రగిలిపోయింది.
కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమంలో ఉండవచ్చు. కానీ తెలంగాణ కోసమే పుట్టిన టీఆర్‌ఎస్ తప్ప, మిగిలిన పార్టీలకు బయటి హైకమాండ్లు ఉన్నాయి. కాబట్టి అవి జై తెలంగాణ అంటున్న పార్టీలైనా, అనని పార్టీలైనా తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకలు కాలేవు. ఒక్క సిపిఎం తప్ప ప్రతి రాజకీయ పార్టీ జై తెలంగాణ అంటున్నాయి. మరి వచ్చిన తెలంగాణ ఆగిపోయిందెందుకు? బయటి పార్టీలు తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకలు కావని చెప్పటానికి ఇంతకు మించిన ఉదాహరణ అక్కరలేదు. తెలంగాణలో బతుకుతున్న రాజకీయ పార్టీలు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తమ అధిష్ఠానాల దగ్గర, అధినేతల దగ్గర తాకట్టు పెట్టాయి. ఈ పార్టీలు తెలంగాణ లో బతికున్నంత కాలం రాష్ట్ర ఏర్పాటుకు అవరోధాలు తప్పవు. కొందరు ఢిల్లీలో సోనియమ్మ దగ్గర, మరికొందరు ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో చంద్రబాబు దగ్గర, మిగిలిన వారు, వారి వారి బయటి అధినేతల దగ్గర తెలంగాణ రాజకీయ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. దీనితోనే ప్రధాని అంత ధైర్యంగా తెలంగాణ ఇవ్వలేమని చెప్పగలుగుతున్నాడు. ‘టెన్ జనపథ్’లో అమ్మ దగ్గర ఒక మాట, మీడియా కెమెరాల ముందు మరోమాట. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బాబు దగ్గర ఒక మాట, టివి కెమెరాల ముందు మరోమాట. సుష్మా స్వరాజ్ ది(జై తెలంగాణ) ఒక మాట, వెంకయ్య నాయుడిది మరొక మాట. ఆ మధ్య ఓ టీవీ ఛానల్లో, మీది తెలంగాణ వాద మా లేక సమైక్యవాదమా? అని అడిగితే, అతడు తనది సమైక్యభారత్ అని జవాబిచ్చా డు) నారాయణది ఇక్కడ జై తెలంగాణ మాట.

అక్కడ చంద్రబాబుతో కలిసి ప్రజా ఉద్యమాల బాట. ఇక ఏ భారత రాజకీయపార్టీ మనసార తెలంగాణ తేవాలని కోరుకుంటున్నాయో తెలిసిపోతోంది. ఈ ప్రాంతంలో రాజకీయ పార్టీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజావూపతినిధులెవరైనా సరే, వారికి నిజంగానే రాష్ట్రం రావాలని ఉంటే, వెంటనే వారి వారి రాజకీయ పార్టీలకు రాజీనామా చేసి బయటికి రావాలే. అప్పటిదాకా వారిని తెలంగాణ ప్రజలు ఇంటి దొంగలుగానే భావిస్తారు. నిజాయితీ ఉంటే తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడుతున్న పార్టీలో చేరాలె. లేదా మరొక పార్టీ పెట్టుకోవాలె. అంతేకానీ ఢిల్లీ అధిష్ఠానాలు, ఆంధ్రా అధిష్ఠానలున్న పార్టీలలో కొనసాగితే ప్రజలు వారిని ఎన్నటికీ క్షమించలేరు. ఆంధ్రప్రదేశ్‌లో సీమాంధ్ర మెజారిటీ ప్రాంతం, తెలంగాణ మైనారిటీ ప్రాంతం. ప్రతి రాజకీయపార్టీ మనసు మెజారిటీ ప్రాంతానికి, మాట మైనారిటీ ప్రాంతానికి పారేసి రాజకీయంగా బతక నేర్చాయి. కాబట్టి ప్రస్తుత రాష్ట్రంలో మైనారిటీ ప్రాంతమైన తెలంగాణ పట్ల ఏ రాజకీయ పార్టీ అయినా కపట ప్రేమను ప్రదర్శిస్తాయి తప్ప నిజమైన ప్రేమను కలిగి ఉండవు. చట్టసభల సీట్ల సంఖ్యకు లొంగిపోయే రాజకీయ పార్టీలు అన్యాయాన్ని ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాయని నమ్ముకుంటే అది వెర్రితనమే అవుతుంది.

కాబట్టి, తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం తో మాత్రమే సాధించుకోబడుతుంది, తప్ప మరొకరి దయాదాక్షిణ్యాలతో సాధించబడదని అందరూ గమనించాలి. ఆంధ్ర పార్టీలను, ఢిల్లీ పార్టీలను తరిమేసి తెలంగాణ తన స్వీయ రాజకీయ ఆత్మ గౌరవాన్ని చట్టసభల్లో చాటుకుంటే తప్ప రాష్ట్రం ఏర్పడదు. అటు ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో తెలంగాణ స్వీయ రాజకీయ బలం భారత రాజకీయ పార్టీలకు అవసరాన్ని, అనివార్యతను సృష్టించగలుగుతుంది. దాని తో రాజకీయ పార్టీలు దిగివచ్చి తెలంగాణ ఇవ్వక తప్పదు. రాష్ట్ర ఏర్పాటుకు ఎప్పటికైనా ఇంతకు మించిన మార్గం మరొకటి లేదు.బలమైన, వ్యూహాత్మక నేతృత్వ లేమి కారణంగానే తెలంగాణ 45 ఏళ్ళు నష్ట పోయింది. అలాంటి నష్టానికి తావివ్వని నేతృత్వాన్ని ఇవాళ కలిగి ఉంది కాబట్టే, తెలంగాణ సెగ ఢిల్లీ దాకా వెళ్ల గలిగింది. ఢిల్లీ పాలకులు ఇవ్వకపోయినా, తెచ్చే సమర్థత, వ్యూహాత్మకత కలిగిన నాయకత్వంతో చివరకు 2014 తర్వాతనైనా తెలంగాణ ఏర్పడక తప్పదు. అప్పుడు తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవటం చంద్రబాబుకో, సోనియాకో సాధ్యమయ్యే పనికాదు. అప్పుడు ఎర్రబెల్లిలు, రేవంతులు, దానంలు, ముఖేష్ లను... సోనియా, చంద్రబాబులు రక్షించలేరు. ఎందుకంటే, 2014 తర్వాత చట్టసభల్లో ఏర్పడే తెలంగాణ స్వీయ అస్తిత్వ రాజకీయ బలం చంద్రబాబు, సోనియాల ఆటకట్టిస్తుంది. వారికి అవసరాన్ని, అనివార్యతను సృష్టించి, వారి మెడలు వంచి తెలంగాణ తన రాష్ట్రాన్ని తానే తెచ్చుకుంటుంది. ఆ లోపల ఇస్తారా, చస్తారా తేల్చుకోవలసింది సోనియా, చంద్రబాబులే తప్ప తెలంగాణ ప్రజలు కాదు. ముఖ్యంగా వారి పంచన బతుకుతున్న ఈ ప్రజాప్రతినిధులు వారి పార్టీలకు రాజీనామా చేసి తెలంగాణ రాజకీయ ఆత్మ గౌరవాన్ని కాపాడుతారా! లేదా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ గల్లీల్లో, నారావారి పల్లెలో తాకట్టు పెట్టి బతుకుతారా తెల్చుకోవాలె. ఇప్పటికే ప్రధాని మాటలు తెలంగాణ ఆత్మను అవమానించాయి. అయినా బుద్ధి మారక సోనియా లేదా చంద్రబాబు దగ్గరే తలదాచుకుంటామంటే ఈ ప్రాంత నేతలను ప్రజలు క్షమించరు.
Namasete Telangana News Paper Dated 20/11/2011