Monday, April 30, 2012

పెద్ద పసుపులలో మద్యంపై పోరు--- పి. వరలక్ష్మిపెద్దపసుపుల గ్రామంలో ఒక మధ్యతరగతి రైతు నెలకు దాదాపు 15వేలు, కూలి మీదే బతికే మనిషి నెలకు ఐదారు వేలు మద్యం కోసం ఖర్చుపెడుతున్నారు. ఈ ఒక్క ఊరి నుంచే మద్యం షాపు యజమానికి నెలకు 80 లక్షల ఆదాయం వస్తుంది. ఇట్లా మా చెమట, నెత్తురు మద్యం వ్యాపారుల బొక్కసాల్లోకి పారితే, మా వాళ్ళకు మాత్రం అవయవాలు కుళ్ళి, ఆరోగ్యాలు చెడి, అప్పులు పెరిగి వినాశనం మిగులుతోందని, ఇక ప్రభుత్వమిచ్చే బియ్యం, పెన్షన్ వీటిలో ఎన్నోవంతని పెద్దపసుపుల ఆడపడుచులు అడిగారు. 

మళ్ళీ ఒకసారి 90ల నాటి సారా ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చేలా 'మా ఊర్లో మద్యం వద్దు' అని పెద్దపసుపుల గ్రామ మహిళలంతా కొంగు నడుముకు చుట్టారు. గ్రామంలో ఎంతో మంది పురుషులూ మద్యం పోరులో భాగమయ్యారు. సంవత్సరానికి ఒక్క పైరు మాత్రమే పండించగలిగిన ఆ సగటు రాయలసీమ గ్రామంలో అప్పు రాయించుకుని మరీ తాగబోయించి ఎంతో మంది ఆస్తుల్ని, జీవితాల్ని స్వాహా చేసిన మద్యం దుకాణంపై దండెత్తారు. ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న మద్యంషాపును మూతేసి దాని ఎదుటే వారం రోజులపాటు వంటావార్పు చేసుకుంటూ, ఆటపాటలతో హోరెత్తించారు. ఊర్లో ఎవరూ మద్యం షాపుకు ఇళ్ళు అద్దెకివ్వకూడదని తీర్మానించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రజాసంఘాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉద్యమానికి మద్దతునిచ్చాయి. అన్ని పార్టీలూ దిగివచ్చాయి. నాయకగణం ఇక తమ అనుచరులెవ్వరూ ఆ ఊరి మద్యం టెండర్లలో పాల్గొనం అని ప్రమాణాలు చేశారు. చిట్టచివరిగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి షాపు యజమానితో మాట్లాడి, అవసరమైతే నష్టాన్ని తాను భరించైనా షాపు తెరవకుండా చూసుకుంటానని హామీ ఇవ్వడంతో ఉద్యమానికి తాత్కాలికంగా విరమణ ప్రకటించారు. 

పెద్దపసుపుల గ్రామం ఫ్యాక్షన్ చరిత్రలో ఎంతో పేరున్న కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోనిది. పెద్దపసుపులలో పాతతరం వాళ్ళని కదిలిస్తే ఒకప్పుడు కడప జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రైతాంగ పోరాటాన్ని గుర్తుచేసుకుంటారు. ఇప్పటి తరానికి కమ్యూనిస్టు ఈశ్వరరెడ్డి ఊరని పరిచయం చేస్తారు. నాలుగు సార్లు కడప ఎంపిగా గెలిచి, తన ఆస్తినే కాదు జీతం డబ్బులను, జీవితాన్ని కూడా పార్టీ కోసం, ప్రజల కోసం అర్పించిన ఆయన నిజాయితీ, నిబద్ధతల గురించి గొప్పగా చెప్తారు. ఆయన తర్వాత ఫ్యాక్షనిస్టుల పాలైందిగాని కడపజిల్లాకు గర్వించదగిన ప్రజాపోరాటాల చరిత్ర ఉందని దానికి నిదర్శనంగా ఆ ఊరి చావిడికి కొంచెం దూరంలో కా.వెంకట కొండారెడ్డి పేరుతో ఉన్న పాడుబడిన స్థూపాన్ని చూపిస్తారు. 

అటువంటి పెద్దపసుపులకు అనుకోకుండా ఒక సమస్యపై నిజనిర్ధారణ కోసం వచ్చిన ప్రజాసంఘాల బృందానికి మా ఊర్లో బ్రాందీషాపుతో చచ్చిపోతున్నాం, అది లేకుండా ఏమైనా చెయ్యగలరా అని మహిళలు మొరపెట్టుకోవడం, ఇదే ప్రధాన సమస్యగా ముందుకు రావడం కాకతాళీయంగా జరిగినా ఏళ్ల తరబడి గూడుకట్టుకున్న వేదనంతా ఉద్యమంగా పెల్లుబికింది. మొదట గ్రామాల్లో సాధారణంగా బెల్టుషాపులుంటాయి కదా అని అందరం కలిసి దాన్ని పగలగొట్టొచ్చులెమ్మని భరోసా ఇచ్చిన ప్రజాసంఘాలకు అది లైసెన్సు ఉన్న షాపని కాస్త ఆలస్యంగా తెలిసింది. తెలిశాక అది ప్రభుత్వ పాలసీకి సంబంధించిన విషయం కాబట్టి సమస్య తీవ్రతను అర్థం చేయించే ప్రయత్నం చేశాం. 

మద్యం అమ్మకాలు ప్రభుత్వానికిప్పుడు ప్రధాన ఆర్థిక వనరు అయ్యాయని, ఇది అంత తేలిగ్గా పరిష్కారమయ్యే సమస్య కాదని చెప్పాము. మా రక్తం తాగి, మా జీవితాలను నాశనం చేసి ప్రభుత్వాలు ఆదాయం సంపాదించేబదులు తలకింత పన్ను వెయ్యవచ్చు కదా అని మహిళలు ప్రశ్నించారు. మాకు రూపాయి బియ్యం ఇవ్వమని, పెన్షన్లు కావాలని మేమేం అడగలేదు. అవన్నీ ఇవ్వడానికి మద్యం అమ్మి ఆదాయం పెంచుకోవడమంత పనికిమాలిన పని ఇంకోటి ఉండదని కూడా అన్నారు. ఇవే విషయాల్ని మరుసటిరోజు జమ్మలమడుగు ఆర్డీవోకు, తర్వాత జిల్లా కలెక్టర్‌కు తెగేసి చెప్పారు. మీరు కలుగజేసుకొని మద్యం షాపును మూసేయించకపోతే గ్రామ మహిళలందరూ కలిసి అమ్మకాలను అడ్డుకుంటామని ఒక విజ్ఞాపన పత్రం రాసిచ్చి మరీ చెప్పారు. 

ప్రభుత్వ అధికారులు విస్తుపోయేలా ఒక మారుమూల పల్లె ప్రజలు ప్రభుత్వ విధానాలను ఇక్కడ ప్రశ్నించారు. వీళ్ళు ఆర్థికవేత్తలు చెప్పే చిక్కుముడుల లెక్కలకన్నా అతి సాధారణంగా తమ జీవితాల్లోనించి కూడికలను, తీసివేతలను చూపించి ప్రభుత్వ విధానాల్లోని డొల్లతనాన్ని, మోసాన్ని విప్పి చెప్పారు. పెద్దపసుపుల గ్రామంలో ఒక మధ్యతరగతి రైతు నెలకు దాదాపు 15వేలు, కూలి మీదే బతికే మనిషి నెలకు ఐదారు వేలు మద్యం కోసం ఖర్చుపెడుతున్నారు. ఈ ఒక్క ఊరి నుంచే మద్యం షాపు యజమానికి నెలకు 80 లక్షల ఆదాయం వస్తుంది. (దీనిచుట్టూ అనధికార బెల్టుషాపులు 13 ఉన్నాయి) ఇట్లా మా చెమట, నెత్తురు మద్యం వ్యాపారుల బొక్కసాల్లోకి పారితే, మా వాళ్ళకు మాత్రం అవయవాలు కుళ్ళి, ఆరోగ్యాలు చెడి, అప్పులు పెరిగి వినాశనం మిగులుతోందని, ఇక ప్రభుత్వమిచ్చే బియ్యం, పెన్షన్ వీటిలో ఎన్నోవంతని అడిగారు. ప్రభుత్వాలు ప్రజల కోసమా, మద్యం వ్యాపారుల కోసమా అని నిలదీశారు. 

మద్యం కుంభకోణంలో పీకలదాకా కూరుకుపోయిన ప్రభుత్వం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోదలచుకోలేదు. ప్రభుత్వ నిర్వహణలోకి మద్యం షాపులు తేవాలని, యం.ఆర్.పి రేట్లకే మద్యాన్ని అమ్మాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు వీటికి సమాధానాలు చెప్పాలనుకోలేదు. నిరసనగా ఏప్రిల్ 16 నుంచి మద్యం షాపు ఎదుటే వందలాది మహిళలు కూర్చొని అమ్మకాలు జరగనివ్వలేదు. వెనకవైపు నుంచి దొంగచాటుగా సీసాలు పోతున్నాయని తెలిసి ఒక్కసారిగా దాడి చేశారు. షాపు మూసేయించారు. వారం రోజులపాటు అక్కడే బైఠాయించారు. ఆరుగురు మహిళలపై పోలీసులు కేసులు పెట్టినా కూడా పట్టుదల పెరిగిందేగాని సడలలేదు. 

మరోవైపు ప్రజాపథం పేరుతో జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించినా వీళ్ళవైపు చూడలేదు. దీనిపై ఆయనను కలవబోయిన ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. కలెక్టర్ మాత్రం ఎక్సైజ్ అధికారుల ద్వారా ఆ షాపు నిబంధనల ప్రకారమే నడుస్తున్నదని 'తెలుసుకొని' ఇక తన పరిధిలో చేయగలిగిందేం లేదని అనిపించుకున్నాడు. జనంలో అసహనం పెరిగి ఉద్యమం రెండో దశలోకి వెళుతున్న దశలో, ఆ దుకాణం నడుస్తున్నది 'ఇందిరమ్మ' ఇంటిలో అన్న విషయం ప్రజాసంఘాల దృష్టికి వచ్చింది. తీగలాగి డొంక కదిలించబోయే తరుణంలో, పెద్దపసుపుల నిప్పురవ్వలు జిల్లాలో మరో మూడు గ్రామాల్లో అగ్గిరాజేసిన క్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఏప్రిల్ 22న రంగ ప్రవేశం చేశారు. రెండు నెలల్లో లైసెన్సు గడువు పూర్తవుతుంది కాబట్టి ఈ రెండు నెలలకుగాను మద్యం షాపు యజమానికి అవసరమైతే తాను నష్టపరిహారం చెల్లించైనా షాపును తెరవకుండా ఒప్పిస్తానని, ఈ ఊరి వరకు తన వర్గం వారెవరూ టెండర్లు వేయకుండా చూసుకుంటానని హామీ ఇచ్చి ఉద్యమాన్ని విరమింపజేశారు. 

'ఈ జాడ్యం విస్తరిస్తే ఎలా' అని కలెక్టర్ నిర్మొహమాటంగా ప్రజాసంఘాల ప్రతినిధులతో అనడం, ప్రజాపథం తర్వాత ఎమ్మెల్యే దిగివచ్చి అనధికారికంగా షాపును మూసేయిస్తాననడం - అన్వయించి చూస్తే సులభంగా అర్థమయ్యేవే. అసలు మద్యం షాపు ఆదినారాయణ రెడ్డి బినామీకి బినామీదని, కాబట్టే ఆయన అనుకుంటే దాన్ని కొంతకాలం మూసేసి, ప్రత్యామ్నాయంగా సరుకును ఇంకెక్కడైనా అమ్ముకోగలడని గ్రామస్థులు అర్థం చేసుకున్నా 'మా ఊరి నుంచి మహమ్మారిని తరిమేశాం, వేరే ఊర్లలో సంగతి వాళ్ళు చూసుకోవాల'ని మాతో చెప్పి ప్రస్తుతానికి సంబరాల్లో మునిగిపోయారు. 

సాధించింది కొంతేనని, తమ ఊర్లో మాత్రమే మద్యం షాపు పోయినంత మాత్రాన సమస్య పూర్తిగా తొలగిపోదని వాళ్ళకు తెలుసు. ఇక్కడి నుంచి అంచెలంచెలుగా చేయవలసిన పోరాటానికీ వీళ్ళు సిద్ధంగానే ఉన్నారు. ఆ ప్రణాళికా వాళ్ళ వద్ద ఉంది. అందులో వాళ్ళ స్ఫూర్తిని సమున్నతంగా నిలబెట్టే ఒక్క అంశం ఎన్నికల సమయంలో మద్యం ఏరును పారించాలని చూస్తే ఏ రాజకీయ పార్టీనైనా మా ఊర్లోకి రాకుండా అడ్డుకుంటాం. ఈ 'జాడ్యం' విస్తరించాల్సిన, విస్తరింపజెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- పి. వరలక్ష్మి
విరసం కార్యదర్శి
Namasete Telangana News Paper Dated : 1/05/2012 

ఎద్దుకూరపై రాద్ధాంత మేల?-- డాక్టర్ జి.వి.ఎద్దు మాంసంపై జరుగుతున్న చర్చ మేధావుల మెదడుకు మేతగా వుందేమో గానీ సామాన్యులకది పోసుకోలు వ్యవహారంగా వుంది. ఆంధ్రజ్యోతిలో ఏప్రిల్ 26న వెలువడిన డాక్టర్ గాలి వినోద్ కుమార్ వ్యాసం 'ఎద్దు మాంసంకై యుద్ధం చేద్దాం' అన్న పిలుపునిచ్చినట్లుగా వుంది. యూనివర్సిటీలో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్, దాని వలన ఏర్పడిన గొడవలు, కత్తిపోట్లు ఏ ప్రజాస్వామిక సాంస్కృతిక విలువల్ని బలోపేతం చేయడానికో బోధపడడం లేదు. మత సామరస్యంతో వుండాల్సిన యూనివర్సిటీ క్యాంపస్‌ని కక్షల కార్ఖానాగా మారనీయకండి. ఇప్పటికే అనేక శకలాలగా విడిపోయిన మనుషులు తినే తిండి ద్వారా కూడా వేరుపడి పోవడంలో ఏదో కుట్ర వుంది. ఈ కుట్రని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై వుంది. సమాజ పరిణామ క్రమంలో మానవుని వేష, భాషలతో పాటు ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు వచ్చాయి. 


వేట మీద ఆధారపడిన ఆదిమ మానవుని ఆహారం జంతు మాంసమే! సామూహికంగా వేటాడిన జంతువుని (ఆవు, ఎద్దు, గుర్రం, జింక, దుప్పి ఏదైనాసరే) ఒక చోటుకి చేర్చుకుని అందరూ కలిసి తింటూ ఆనందంగా (ఆహారం దొరికినందుకు) కేరింతలు కొట్టడం ఆదిమ సమాజంలో ఒక ఆటవిడుపు (పండుగ). ఆధునిక సమాజంలో అలాంటి చర్యలతో ఎంజాయ్ చేయడమంటే మన ఆలోచనలు ఎటువైపు పయనిస్తున్నాయో ఊహించండి. ఎద్దు మాంసం తింటున్న బౌద్ధులను బ్రాహ్మణులు వెలివేశారని, వారే అంటరాని వారయ్యారని చెబుతున్న వినోద్ కుమార్ అభిప్రాయానికి మూలాలు తెలియాల్సిన అవసరం ఉంది. నా అనుమానం-జీవ హింసను వ్యతిరేకించిన బౌద్ధం మాంసం తినడం కొనసాగించిందా... అయితే ప్రారంభంలో అందరూ మాంసాహారులే కనుక బుద్ధుని బోధనల తర్వాత కొందరు మారి వుండవచ్చు. అంటరాని వారందరూ బౌద్ధాన్ని స్వీకరించారా? ఇప్పుడు అంటరాని వారంతా బౌద్ధం స్వీకరించాలా? బౌద్ధులు మాంసాహారులుగా మారాలా? చరిత్ర పరిణామ క్రమాన్నీ, తెచ్చిన మార్పుల్నీ అంగీకరిస్తారా లేక కొత్త సిద్ధాంతం ప్రతిపాదిస్తారా? ఆనాటి సమాజంలో సుఖాలు అనుభవిస్తూ పరాన్న భుక్కులైన హైందవ మతాధిపతుల ఉనికిని బౌద్ధం నిలదీసింది. కదులుతున్న తమ ఊడల్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో బౌద్ధానికి వ్యతిరేకంగా ప్రచారం, వ్యక్తిగత దాడులు, బౌద్ధారామాల విధ్వంసం హైందవ మతం తీవ్ర స్థాయిలో చేసింది. అయినప్పటికీ బౌద్ధం పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఇక దిక్కుతోచని స్థితిలో హైందవ మతం రాజీ పడక తప్పలేదు. బౌద్ధధర్మాలు హైందవ సంస్కృతిలో అంతర్భాగమని ప్రచారం చేసింది (భగవద్గీతలో చెప్పిన చాలా విషయాలు బుద్ధుని బోధనలేనని కొందరు చరిత్ర పరిశోధకుల అభిప్రాయం). బౌద్ధం ప్రభావం వలనే హైందవ మతాధిపతులు మాంసం వదిలి శాకాహారులుగా మారారు. అలా మానిన తర్వాత మాంసం తినేవారిని అసహ్యించుకోవడం మొదలు పెట్టారు. మరి తమ ఆధిపత్యం నిలుపుకోవాలి గదా! కానీ, శారీరక కష్టం చేసే వారికి శక్తి కావాలంటే మాంసాహారమే మంచిదనే స్వీయానుభవంతో గ్రహించిన అనేక మంది మాంసాహారాన్నే కొనసాగించారు. ఈ సందర్భంగా బౌద్ధ మతం రాజులను, ఉన్నత ధనాడ్య వర్గాలను ప్రభావితం చేసినంతగా సామాన్యులనూ, అట్టడుగు వర్గాలను ప్రభావితం చేయలేక పోయిందనే వాదన కూడా వుంది. ఇంతకూ బీఫ్ ఫెస్టివల్ ద్వారా సమాజానికి మీరిచ్చే సందేశం ఏమిటి? ఎద్దు మాంసం తింటే జాతి పునరుజ్జీవనం జరుగుతుందా? బుద్ధులు మారతాయా? ప్రకృతిలో దొరికే అనేక జంతువులనూ, పక్షులనూ , పురుగులనూ, ఎన్నో కులాల, తెగల ప్రజలు తమ ఆహారంగా తీసుకుంటున్నారు. ఇందులో ఎవరి బలవంతం లేదు. ఎవరి జీవన విధానం, ఆహారపు అలవాట్లు వారికున్నాయి-అవసరాన్ని బట్టి మార్చుకుంటున్నారు. బహుజనులందరి ఆహారం, అలవాట్లు ఒకే మాదిరి లేనప్పుడు ఎద్దు మాంసం బహుజనులందరి కామన్ ఫుడ్‌గా డిక్లేర్ చేస్తారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం!? ఈనాడు సామ్రాజ్యవాదం అన్ని రంగాలతో పాటు మన జీవన విధానాన్ని, మనం తినే తిండిని కూడా శాసించాలని చూస్తున్నది (పుట్టుకలో భారతీయులై, వేష భాషలందు యూరోపియనులై ఉండాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఆనాడు తలపోశారు. వారు ఇక్కడ నుంచి తరిమివేయబడ్డా, దురదృష్టవశాత్తూ ఆ వాసనలు పూర్తిగా తొలగిపోలేదు). పాశ్చాత్యుల ముఖ్య ఆహారం మాంసాహారం (బీఫ్, పోర్క్). ప్రపంచ ప్రజలందరి చేతా అదే తినపించాలని చూస్తున్నారు. ఎద్దు మాంసానికి అలవాటు చేసిన తర్వాత (డిమాండు పెరిగాక), మా మాంసం దిగుమతి చేసుకుంటారా, చస్తారా? అని సామ్రాజ్యవాదులు హుకుం జారీ చేస్తారు. దానికి ఆరోగ్యరహస్యాలను జోడిస్తారు. మనం ఎగబడతాం (కెంటకీ, వెబ్‌కాబ్ చికెన్ సెంటర్స్‌కి పరిగెత్తినట్లు) సామ్రాజ్యవాదుల వ్యాపారం ఊపందుకుంటుంది. మాంసం మన పొట్టలోకి, లాభం వారి జేబులోకి చేరిపోతుంది. అలా దేశభక్తి, సంస్కృతి రక్షించబడతాయి! దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో మేధావులూ, ప్రజాస్వామిక వాదులూ ఆలోచించాలి.

Namasete Telangana News Paper Dated : 1/05/2012 
-

మతకలహాలు ప్రమాద సంకేతాలు---డాక్టర్ గౌతమ్ పింగ్లేరాంగోపాల్ వర్మ 1993 ప్రాంతంలో ‘గాయం’ అనే పేరుతో సినిమా తీశారు. సాదా సీదా సినిమా యాక్టర్లతో తీసిన ఆ సినిమా సంచలనం అయ్యింది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం పదవిలో ఉన్న ముఖ్యమంవూతిని గద్దె దింపడానికి(హైదరాబాద్‌లో)మతకలహాలను రేపి ప్రయోజనాలు పొందే కథాంశంతో ఆ సిని మా తీశారు. అప్పట్లో అది సంచలనం. ‘గాడ్‌ఫాదర్’ సినిమాకు అనుకరణగా తీసిన సినిమా అని చెప్పుకున్నా.. అది పెద్ద చర్చకు తావిచ్చింది. సమకాలీన రాజకీయ విధానాలను కళ్లకు కట్టిన చిత్రంగా ఆకట్టుకుంది. 

సినిమా సంగతి ఎలా ఉన్నా.. హైదరాబాద్‌లో కూడా అలాంటి మతకలహాలకు ఎన్నింటికో సాక్షిభూతంగా నిలిచింది. 1990-92 మధ్యకాలంలో ముఖ్యమంవూతులను దించేయడం కోసం పలుమార్లు హైదరాబాద్‌లో మత కలహాలు జరిగాయి. కాంగ్రెస్‌లోని బలహీన ముఖ్యమంవూతుల కారణంగా.., ముఠాలకు నెలవైన కాంగ్రెస్‌పార్టీలోని గ్రూపులు ముఖ్యమంత్రులను దించేందుకు హైదరాబాద్ లో మతకలహాలను సాధనంగా చేసుకున్నాయి. ఇది ఇక్కడితోనే ఆగలేదు, 1980-83 ప్రాంతంలోనూ ఇదే తీరుగా మతకలహాలు చెలరేగాయి. ఇవన్నీ కాంగ్రెస్‌లోని అసమ్మతివాదుల రాజకీయాల పుణ్యమేనని అప్పటి రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఈ కాంగ్రెస్ ముఠా తగాదా లు, గ్రూపు రాజకీయాల నేపథ్యంలో ఢిల్లీ అధిష్ఠానం తీసుకున్న చర్య లు, ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ ముఖ్యమంవూతుల నియామకం తీరుతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ వ్యతిరేకత పాదుకొల్పబడింది. 1984లో ఎన్టీఆర్‌ను గద్దె దించేందుకు జరిగిన కుట్రలో కాంగ్రెస్ పాత్ర, హైదరాబాద్‌లో మతకలహాలు రాజకీయ ప్రేరేపితాలుగానే జరిగాయి. 

హైదరాబాద్‌లో పుట్టి పెరిగినవాడిగా.. నాకు ఆరోజుల్లో కర్ఫ్యూ అంటే.. దూరదర్శన్‌లో వచ్చే ప్రకటనగానే తెలుసు. అంతకుమించి.. కర్ఫ్యూ ఉన్నదంటే... స్కూలుకు సెలవులుగానే బోధపడేది. పాఠశాలకుపోయినా.. ఎప్పుడు ఏ సమయంలో కర్ఫ్యూ ప్రకటిస్తారో తెలియక.. దూరదర్శన్ ప్రకటన కోసం ఎదురుచూస్తూ ఉండేవాళ్లం. లేదా తరగతులు మాని స్కూల్ గ్రౌండులో ఆటలాడుకుంటూ.. కర్ఫ్యూ వార్తలకోసం గుండెలు గుప్పిట్లో పెట్టుకుని చూసేవాళ్లం. ఈ సమయంలోనే అప్పుటి మా గణితం టీచర్ ఉదంతం గుర్తు కు వస్తోంది. మతకలహాలు జరిగినప్పుడు ఆయన 20 ఏళ్ల హిందూ యువకుడు అయినందుకు గణితం చెప్పే మా మాస్టారును టెర్రరిస్టు కేసు పెట్టి జైళ్లో పడేశారు.

చాలా ఏళ్ల తర్వాత ఈ మధ్య మరోసారి హైదరాబాద్ మతకలహాలకు నెలవు అయ్యింది. విశ్వహిందు పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా నగరానికి వచ్చి పోయిన తర్వాతనే మతకలహాలు రేగాయని కొంతమంది చెప్పుకొస్తున్నారు. నిజానికి ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయాలను చూస్తే బలహీన ముఖ్యమంత్రి కారణంగానే, కాంగ్రెస్‌లో ని ముఠా రాజకీయాల నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. మరోసారి ప్రజాపునాదిలేని ముఖ్యమంత్రి ఉంటే.. రాష్ట్రం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒకటికి మించి బలంగా ఉన్న కాంగ్రెస్ గ్రూపులు, ఒకటి మరోదాన్ని దెబ్బతీయడం కోసం చేస్తున్న చర్యల్లో భాగంగా ఈ అస్థిరత, మతకలహాలు అని చెప్పక తప్పదు. నేతల వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ బల సమీకరణలు పోటాపోటీగా సాగుతున్నాయి. సీబీఐ దాడులతో వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటున్న నేతలు అస్థిరతకు కారణమవుతున్నారు. అలాగే తెలంగాణ ఉద్యమం, టీఆర్‌ఎస్, ఎంఐఎం రాజకీయ సమీకరణాల నేపథ్యం కూడా ప్రస్తుత రాజకీయ అనిశ్చితి, గందరగోళానికి కారణం.

హైదరాబాద్‌లో జరిగిన మత ఘర్షణలను కేవలం హైదరాబాద్‌కే సంబంధించినవి గా చూడరాదు. హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని సంగాడ్డిలోకూడా మత ఘర్షణలు జరిగాయి. వీటన్నింటిలో కూడా ప్రయత్న పూర్వకంగా మత పరమైన పవి త్ర స్థలాలను అపవిత్రం చేశారని ప్రచారం జరిగింది. ఇరు వర్గాలూ ఇదే భావనతో.. ఉడికిపోయారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోశారు. ఇదిలాఉంటే.. ముస్లింల ప్రతినిధిగా, రక్షకునిలా చెప్పుకుంటున్న ఎంఐఎం ఈ మతఘర్షణలకు ఇటీవలి కాలంలో బీజేపీ మతవాద పార్టీ చేస్తున్న చర్యలే కారణమని అంటోంది. ఇటీవల తెలంగాణలో ముఖ్యంగా మహబూబ్‌నగర్ ఉప ఎన్నికల తర్వాత బీజేపీ గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా మత ఘర్షణలకు కారణమవుతున్నదని ఎంఐఎం ఆరోపిస్తున్నది.

తెలంగాణ సమస్యతో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు తెలంగాణ ప్రాంతంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వా త మొదటిసారిగా మహబూబ్‌నగర్ జిల్లాలో తెలంగాణ కోరుకుంటున్న పార్టీల మధ్యన పోటి ఏర్పడింది. తెలంగాణ కోరుకుంటూ ఉద్యమిస్తున్న టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు పోటీ పడ్డాయి. కానీ బీజేపీ తన సర్వశక్తులను ఒడ్డి కొద్ది ఓట్ల తేడాతో మహబూబ్‌నగర్ సీటును గెలిచింది. దీంతో ముస్లిం శక్తులు, ఎంఐఎం తెలంగాణవాదం బలంగా ఉన్నదంటున్న తరుణంలో బీజేపీ గెలవడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఈనేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఆంధ్రా ప్రాంతంలో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుందని నేను గతంలోనే చెప్పాను. తెలంగాణ ఉద్యమం తర్వాత అన్ని పార్టీలు రెండుగా చీలిపోయిన తరుణంలో, బీజేపీ సీమాంధ్ర ప్రాంతంలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని నడపడంలో విఫలమైంది. దానికి సంబంధిం చి నాయకత్వాన్ని కూడా ముందుంచలేకపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌డ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ద్వారా, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు ఎలా మేలు జరుగుతుందో వివరిస్తూ 14 పేజీల పుస్తకాన్ని విడుదల చేశారు. సీమాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఇదే మంచి సదావకాశమని బీజేపీ ఆ బుక్‌పూట్‌లో వివరించింది. అయితే.. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో తెలంగాణ ఏర్పాటుకు ఏమేరకు మద్దతు కూడగట్టగలుగుతారనేది ఆయన నాయకత్వ ప్రతిభకు, చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తుంది.

మహబూబ్‌నగర్ ఫలితమే రాబోయే కాలం లో తెలంగాణ భవిష్యత్తుకు సంకేతమని చెప్పడం తొందరపాటు అవుతుంది. ఒకటి మాత్రం నిజం. ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి పరమ అధ్వాన్నంగా తయారైంది. పార్టీ ప్రయోజనాలు పక్కకు పెట్టిన నేతల చేష్టలు, బలసమీకరణలు, గ్రూపు రాజకీయాలతో రాష్ట్ర కాంగ్రెస్ లుకలుకలాడుతున్నది. మరోవైపు తెలంగాణపై ఎటూ తేల్చని విధానంతో చంద్రబాబు నాయుడు ఎటూ పాలుపోలేని స్థితిలో కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిల కొట్టుకుంటున్నారు. టీడీపీ మునుపెన్నడూ లేని క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒక రకంగా ఉనికికే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నది. ఇదే గాక ఎన్టీఆర్ ఫ్యామిలీ పార్టీపై ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా టీడీపీకి గొడ్డలిపెట్టుగా తయారయ్యాయి. 

ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి సంక్లిష్టంగా తయారైంది. కేంద్రంలో ప్రభుత్వ మనుగడకు అతి ఎక్కువ సంఖ్యలో ఎంపీలను అందించిన రాష్ట్రంగా తన ప్రాభవాన్ని చూపలేకపోతోంది. నిర్ణయాలు చేయడంలో, ప్రయోజనం పొందడంలో ప్రభావాన్ని కలగజేయలేకపోతోంది. ఈ స్థితి లో బీజేపీ ఎంత మేరకు లాభపడుతుందో కాలమే తేల్చాలి. అలాగే.. యువ నాయకుడిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌డ్డి తనదైన రాజకీయ చతురత, పట్టుదలతో ఇరువూపాంతాల్లో పార్టీకి ప్రయోజనం, ప్రజలకు మేలు చేసే విధంగా ఏ మేరకు నిర్ణయా లు తీసుకుంటారు? అందులో విజయాలు సాధిస్తారా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న! తెలంగాణకు మద్దతుగా ఆ కార్యాచరణ మాత్రమే ఆయన రాజకీయ పనితనానికి, విజయానికి గీటురాయిగా నిలుస్తాయి.

-డాక్టర్ గౌతమ్ పింగ్లే
డైరెక్టర్ సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ అండ్ గవ్న

Namasete Telangana News Paper Dated : 1/05/2012 

I News Debate on Beef (EFL-University -Hyderabad)


http://www.youtube.com/watch?v=1NK3M2XvUnE&feature=share

Beef Eating in University Mess Discussion

Some time back the students in EFL-University, cooked beef in mess. As a reaction to it ABVP goons pied on the cooked beef, through the curry on walls etc. The above discussion came after the incident.

Mr Sudharsan Dalit Student Leader (PhD Political Science)
Mr Rajesh PDSU (PhD Political Science )
Mr Kadiam Raju ABVP National Secretary Andhra Pradesh 
Mr Janardhan ABVP EFL-University -Hyderabad  

NIN Certificate on Beef


Beef eating: strangulating history By Prof. RAM PUNIYANI

http://www.hindu.com/2001/08/14/stories/13140833.htm


Beef eating: strangulating history

While one must respect the sentiments of those who worship cow and regard her as their mother, to take offence to the objective study of history just because the facts don't suit their political calculations is yet another sign of a society where liberal space is being strangulated by the practitioners of communal politics. [text Tag=blue-tint][/Text]PROF. D. N. JHA, a historian from Delhi University, had been experiencing the nightmares of `threats to life' from anonymous callers who were trying to prevail upon him not to go ahead with the publication of his well researched work, Holy Cow: Beef in Indian Dietary Traditions.
As per the reports it is a work of serious scholarship based on authentic sources in tune with methods of scientific research in history. The book demonstrates that contrary to the popular belief even today a large number of Indians, the indigenous people in particular and many other communities in general, consume beef unmindful of the dictates of the Hindutva forces.
It is too well known to recount that these Hindutva forces confer the status of mother to the cow. Currently 72 communities in Kerala - not all of them untouchables - prefer beef to the expensive mutton and the Hindutva forces are trying to prevail upon them to stop the same.
Not tenable
To begin with the historian breaks the myth that Muslim rulers introduced beef eating in India. Much before the advent of Islam in India beef had been associated with Indian dietary practices. Also it is not at all tenable to hold that dietary habits are a mark of community identity.
A survey of ancient Indian scriptures, especially the Vedas, shows that amongst the nomadic, pastoral Aryans who settled here, animal sacrifice was a dominant feature till the emergence of settled agriculture. Cattle were the major property during this phase and they offered the same to propitiate the gods. Wealth was equated with the ownership of the cattle.
Many gods such as Indra and Agni are described as having special preferences for different types of flesh - Indra had weakness for bull's meat and Agni for bull's and cow's. It is recorded that the Maruts and the Asvins were also offered cows. In the Vedas there is a mention of around 250 animals out of which at least 50 were supposed to be fit for sacrifice and consumption. In the Mahabharata there is a mention of a king named Rantideva who achieved great fame by distributing foodgrains and beef to Brahmins. Taittiriya Brahman categorically tells us: `Verily the cow is food' (atho annam via gauh) and Yajnavalkya's insistence on eating the tender (amsala) flesh of the cow is well known. Even later Brahminical texts provide the evidence for eating beef. Even Manusmriti did not prohibit the consumption of beef.
As a medicine
In therapeutic section of Charak Samhita (pages 86-87) the flesh of cow is prescribed as a medicine for various diseases. It is also prescribed for making soup. It is emphatically advised as a cure for irregular fever, consumption, and emaciation. The fat of the cow is recommended for debility and rheumatism.
With the rise of agricultural economy and the massive transformation occurring in society, changes were to be brought in in the practice of animal sacrifice also. At that time there were ritualistic practices like animal sacrifices, with which Brahmins were identified. Buddha attacked these practices. There were sacrifices, which involved 500 oxen, 500 male calves, 500 female calves and 500 sheep to be tied to the sacrificial pole for slaughter. Buddha pointed out that aswamedha, purusmedha, vajapeya sacrifices did not produce good results. According to a story in Digha Nikaya, when Buddha was touring Magadha, a Brahmin called Kutadanta was preparing for a sacrifice with 700 bulls, 700 goats and 700 rams. Buddha intervened and stopped him. His rejection of animal sacrifice and emphasis on non-injury to animals assumed a new significance in the context of new agriculture.
The threat from Buddhism
The emphasis on non-violence by Buddha was not blind or rigid. He did taste beef and it is well known that he died due to eating pork. Emperor Ashok after converting to Buddhism did not turn to vegetarianism. He only restricted the number of animals to be killed for the royal kitchen.
So where do matters change and how did the cow become a symbol of faith and reverence to the extent of assuming the status of `motherhood'? Over a period of time mainly after the emergence of Buddhism or rather as an accompaniment of the Brahminical attack on Buddhism, the practices started being looked on with different emphasis. The threat posed by Buddhism to the Brahminical value system was too severe. In response to low castes slipping away from the grip of Brahminism, the battle was taken up at all the levels. At philosophical level Sankara reasserted the supremacy of Brahminical values, at political level King Pushyamitra Shung ensured the physical attack on Buddhist monks, at the level of symbols King Shashank got the Bodhi tree (where Gautama the Buddha got Enlightenment) destroyed.
One of the appeals to the spread of Buddhism was the protection of cattle wealth, which was needed for the agricultural economy. In a way while Brahminism `succeeded' in banishing Buddhism from India, it had also to transform itself from the `animal sacrifice' state to the one which could be in tune with the times. It is here that this ideology took up the cow as a symbol of their ideological march. But unlike Buddha whose pronouncements were based on reason, the counteraction of Brahminical ideology took the form of a blind faith based on assertion. So while Buddha's non-violence was for the preservation of animal wealth for the social and compassionate reasons the counter was based purely on symbolism. So while the followers of Brahminical ideology accuse Buddha of `weakening' India due to his doctrine of non-violence, he was not a cow worshipper or vegetarian in the current Brahminical sense.
Despite the gradual rigidification of Brahminical `cow as mother' stance, large sections of low castes continued the practice of beef eating. The followers of Buddhism continued to eat flesh including beef. Since Brahminism is the dominant religious tradition, Babur, the first Mughal emperor, in his will to his son Humayun, in deference to these notions, advised him to respect the cow and avoid cow slaughter. With the construction of Hindutva ideology and politics, in response to the rising Indian national movement, the demand for ban on cow slaughter also came up. In post-Independence India RSS repeatedly raised this issue to build up a mass campaign but without any response to its call till the 1980s.
While one must respect the sentiments of those who worship cow and regard her as their mother, to take offence to the objective study of history just because the facts don't suit their political calculations is yet another sign of a society where liberal space is being strangulated by the practitioners of communal politics. We have seen enough such threats and offences in recent past - be it the opposition to films or the destruction of paintings, or the dictates of the communalists to the young not to celebrate Valentine's Day, etc., - and hope the democratic spirit of our Constitution holds the forte and any threat to the democratic freedom is opposed tooth and nail.
Prof. RAM PUNIYANI
A member of EKTA (Committee for Communal Amity), Mumbai

Tuesday, August 14, 2001 the Hindu News Paper 

FTN: Is serving beef in public against Indian culture? IBN Debate On

http://ibnlive.in.com/videos/249608/ftn-is-serving-beef-in-public-against-indian-culture.html

Apr 17/04/2012FTN: Is serving beef in public against Indian culture?

విలువలకు విఘాతం ఈ ప్రాపకం -రమా మెల్కోటేఒక దైవ పురుషుని మరణం, శాంతి కోసం యాగం, ఎద్దు మాంసాన్ని వడ్డించాలని విశ్వవిద్యాలయంలో ఆందోళన - ఇవన్నీ మన దేశంలో రాజ్యం, సమాజం స్వభావాన్ని సూచిస్తున్నాయి. భారతీయ సమాజంలో మతం, మూఢ నమ్మకాల ప్రభావం ఎంత బలీయంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రభుత్వం నుంచి వాటికి అంతకంతకూ లభిస్తోన్న ప్రాపకం మూలంగా మన రాజ్య వ్యవస్థ ప్రజాస్వామిక, లౌకిక స్వభావానికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

సత్యసాయి బాబా మరణం ఊహించిందే. సాయిబాబాను భగవంతుడిగా కొలిచి, ఆయన మరణానికి అమితంగా బాధపడినవారి పట్ల సానుభూతి చూపవచ్చు. విశ్వాసాన్ని హేతుబద్ధం చేయలేము కదా. అయితే అటువంటి విశ్వాసమూ, ఆ విశ్వాసానికి ఆలంబననిస్తోన్న సంస్థలూ విలసిల్లడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని, నిధులను ఉపయోగించడం లౌకికవాద ప్రమాణాలు ప్రతి ఒక్కదాన్ని ఉల్లంఘించడమే కాదూ? 

పుట్టపర్తి సత్యసాయిబాబా మరణించిన తీరూ, ఆయన మరణమూ, భక్తుల పరితాపంలోనూ ఆ బాబాకు రాజ్య వ్యవస్థ పరంగా ఎంతటి ప్రాపకం లభించిందో మనకు స్పష్టంగా కన్పించింది. బాబా చేసిన 'మంచి పని'ని ఇక్కడ ప్రశ్నించడం లేదు. అయినా సంచితమైన సంపదను ఖర్చు పెట్టాలి కదా. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, రాష్ట్ర గవర్నర్ మొదలైన వారు తమ విచారాన్ని వ్యక్తం చేసిన తీరు అభ్యంతరకరం, గర్హనీయం. పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో వారు బాబా పట్ల తమ గౌరవాన్ని లోకానికి తెలియజేశారు. 

ఇటువంటి సందర్భాలన్నిటిలోనూ ఖర్చు చేసేది ప్రభుత్వ నిధులు అంటేప్రజల సొమ్మే కాదూ? మతం, విశ్వాసం అనేవి వ్యక్తిగత వ్యవహారాలు. వ్యక్తిగత హోదాలో స్వీయ మత, విశ్వాసాలను ప్రదర్శించుకొనే హక్కు ప్రభుత్వాధినేతలు, ప్రభుత్వాధికారులకు పూర్తిగా ఉంది. అయితే బాబాలను, అమ్మలను- అశేష జనావళి వారికి భక్తులుగా ఉన్నప్పటికీ- ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నప్పుడు పోషిస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం లౌకికవాద ప్రభుత్వమెలా అవుతుంది? అటువంటి ప్రభుత్వపు లౌకిక వాద నిబద్ధత ప్రశ్నార్ధకమే. మరీ అభ్యంతరకరమూ, ప్రశ్నించవలసిన విషయమేమిటంటే ఆ బాబాకు ప్రభుత్వపరంగా అంత్యక్రియలు నిర్వహించడం. 

'తెలంగాణ, శాంతి కోసం' టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు చండీయాగం నిర్వహించారు. ఈ యాగం వ్యవహారాలకు మీడియాలో మంచి ప్రచారం లభించింది. అయితే ఒక వ్యక్తిగా తన వ్యక్తిగత హోదాలో చంద్రశేఖర్‌రావు చండీయాగాన్నే కాదు, మరెదైనా పూజను నిర్వహించినా ఆందుకు ఆయనకు గల హక్కును ఎవరూ ప్రశ్నించరు. తాను నిర్వహించిన చండీయాగాన్ని వ్యక్తిగత హోదాలో నిర్వహించానని ఆయన చెప్పవచ్చు. నిజానికి యాగం కంటే జాతరే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. 

తన విశ్వాసం మేరకు యాగాలు, పూజలు నిర్వహించే హక్కు చంద్రశేఖర్‌రావుకు ఉందా లేదా అన్నది ఇక్కడ ఒక అంశం కాదు. అయితే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తోన్న ఒక పార్టీ నాయకుడిగా తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని సాధించేందుకై యాగాన్ని నిర్వహించడం సమంజసమేనా? ఆ యాగంలో బ్రాహ్మణ సంస్కృతీ సంబంధ కర్మకాండను ఆచరించడం, ఆంధ్ర, తెలంగాణ బ్రాహ్మణుల తీరుతెన్నులపై చేసిన వ్యాఖ్యలు లౌకికవాద స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. 

ఇఫ్లూ (భారతీయ, విదేశీ భాషల విశ్వవిద్యాలయం)లోని దళిత, బహుజన విద్యార్థులు తమ భోజనంలో ఎద్దు మాంసాన్ని వడ్డించాలని డిమాండ్ చేయడం ప్రజాస్వామిక, లౌకిక డిమాండ్ల పరిధిలోనే ఉంది. ఎద్దు మాంసాన్ని తినని వారిచేత బలవంతంగా తినిపించవలసిన అవసరం లేదు. చాలా ఉన్నత విద్యా సంస్థలు ఇప్పటికీ అగ్రకులాల అభిరుచుల, ఆ కులాలవారికి నిషిద్ధాలయిన వాటి ప్రభావంలోనే ఉన్నాయి. కనుకనే విద్యార్థులకు ఎద్దు మాంసాన్ని వడ్డించడంపై అలిఖిత నిషేధం ఉంది. ఎద్దు మాంసాన్ని, ఆ మాటకు వస్తే పంది మాంసాన్ని తినే వారికి ఆ మాంసాన్ని వడ్డించకపోవడానికి కారణమేమీ లేదు. 

ఉస్మానియా వర్సిటీ, ఇఫ్లూలోని దళిత విద్యార్థులు తమ అస్తిత్వాన్ని, ప్రజాస్వామిక హక్కులను చాటడానికి కల్యాణి బిర్యానీ విందుల నేర్పాటు చేశారు. ఆహార సంస్కృతి, అభిరుచులు దేశానికీ దేశానికీ మారుతుంటాయి; ఒక సామాజిక సముదాయానికీ, మరో సామాజిక సముదాయానికీ మారుతుంటాయి. చివరకు వ్యక్తికీ వ్యక్తికీ మధ్య కూడా ఆహార అభిరుచులు ఒకటిగా ఉండవు కదా. ఈ వ్యవహారంలో నైతిక ప్రశ్న ఏమీలేదు. సంస్కృతి అనేది ఆచారాలు, అలవాట్ల సమ్మేళనం. ఆహారం సైతం ఇందుకు భిన్నం కాదు. ఈ ఆచారాలు, అలవాట్లు కాలంతో పాటు మారుతుంటాయి. 

అగ్రకులాల, ఉన్నత వర్గాల వారి శక్తిమంతమైన, గుత్తాధిపత్య సంస్కృతిని అందరిపై రుద్దడం సకల ప్రజాస్వామిక, లౌకికవాద ప్రమాణాలు, విలువలన్నిటికీ వ్యతిరేకం. గతంలో కంటే ఇప్పుడు మతం ప్రభావం అధికమయింది. ఉన్నత విద్యా సంస్థలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఉదాహరణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కనీసం 1970ల వరకు మతపరమైన పండుగలను చేసుకొనేవారు కాదు. 1980 ల్లో వినాయకచవితి, ఇతర మతపరమైన పర్వదినాలను జరుపుకోవడం ప్రారంభమయింది. ఇందుకు రాజకీయపక్షాల ప్రోత్సా హం ఎంతైనా ఉంది. ఆ వేడుకలు క్రమంగా విద్యార్థుల మధ్య ఘర్షణలకు కారణమయ్యాయి. ఇప్పటికీ అవుతున్నాయి కూడా. 

ఇప్పుడు వివిధ సామాజిక బృందాలవారు మతపరమైన పండుగలను మరింత ఆవేశపూరితమైన పద్ధతుల్లో జరుపుకోవడాన్ని మనం చూస్తున్నాం. ఇది తరచూ మతతత్వ ఘర్షణలకు కారణమవుతోంది. మీడియా, ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, వ్యాపారవర్గాలు ఒక సంఘటనకు, ఒక పర్వదిన వేడుకల నిర్వహణకు, ఒక బాబాకు మద్దతు, ప్రోత్సాహం ఇవ్వడం, ప్రచారం కల్పించడంపై మతం, సంస్కృతి గణనీయమైన ప్రభావాన్ని నెరపుతున్నాయి. 

పెట్టుబడిదారీ విధానం ప్రపంచీకరణ అయిన ఈ రోజుల్లో మతపరమైన లేదా రాజకీయ పరమైన లక్ష్యాల కోసం ప్రజలను సమీకరించేందుకు పోటీదాయక మతతత్వాన్ని, ప్రజలు సమష్టిగా పాల్గొనే కొత్త ఆరాధనా పద్ధతులను సృష్టిస్తున్నారు. ఈ ప్రక్రియలలో రాజ్య వ్యవస్థ కూడా పూర్తిగా అంతర్భాగమవుతోంది. ఇది మన ప్రజాస్వామిక,లౌకికవాద సంస్కృతికి ఎంత మాత్రం మేలు చేయదు. మన సమున్న త సంస్కృతిని కుంటుపరుస్తోంది. మరి ఈ ప్రక్రియలను ఎలా ఎదుర్కోవడం? 

మతాన్ని నిషేధించలేం. అయితే ఘర్షణలు, హింసాకాండను నిరోధించడానికి ప్రజా వ్యవహారాల్లో మతపరమైన ఆచరణలను క్రమబద్ధీకరించవచ్చు. ప్రజాస్వామిక, లౌకికవాద సంస్కృతిని సృష్టించేందుకు రాజ్యం ప్రజాస్వామిక, లౌకిక వ్యవస్థగా కన్పించి తీరాలి. బహిరంగ ప్రదేశాలను మతాలకు అతీతమైన లౌకిక ప్రదేశాలుగా ఉంచేందుకై ప్రభుత్వం ఆ ప్రదేశాలను మతపరమైన చొరబాట్లకు గురికాకుండా కాపాడాలి. వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా సరస్సులను కాలుష్య మయం చేయడం ప్రజలకు చెందిన సహజ వనరులను ఉల్లంఘించడం కాదా అని మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరముంది. 

పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థపదార్థాలే సరస్సులు మొదలైన వాటిని మరింతగా కాలుష్యమయం చేస్తున్నాయన్న వాదన వాదనే కాదు. ఎందుకంటే ఆ విషయమై కూడా మన ం తీవ్ర నిరసన తెలుపుతున్నాం కనుక. అన్ని మతాలకు వర్తించే స్పష్టమైన నియమ నిబంధనలతో మతపరమైన కట్టడాల, ఆరాధనా మందిరాల నిర్మాణాన్ని క్రమబద్ధీకరించాలి. ఆ నియమ నిబంధలను ఎవరూ ఉల్లంఘించడానికి వీలులేదు. వ్యక్తిగత హోదాలో మతపరమైన వేడుకలకు హాజరు కావడానికి, మతపరమైన ప్రదేశాలను సందర్శించడానికి ప్రభుత్వాధికారులెవరూ ప్రభుత్వ నిధులను ఉపయోగించుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి. 

ఇప్పుడు మన అనుభవంలోకి వస్తోన్న ఆధ్యాత్మికత షిర్డీ సాయిబాబా, ఇతర రుషులు, సాధువులు ఉపదేశించిన ఆధ్యాత్మికతకు పూర్తిగా విరుద్ధమైనది. ఇది పూర్తిగా పచ్చి భౌతిక లా లస, సిరిసంపదల ప్రదర్శనే. కాకపోతే సంపన్నులు, అధికారంలో ఉన్నవారికి ప్రత్యేకంగా భగవదర్శనం కల్పించడమేమిటి? సకల రంగాలూ ప్రపంచీకరణ అయిన కాలమిది. అసమానతలు, అభద్రతలు పెరిగిపోతున్నాయి. ప్రజాస్వామ్యం సమున్నతమవడానికి, మానవ సంబంధాలు మానవీయమవడానికి కొత్త ప్రజాస్వామిక సంస్కృతిని సృష్టించుకోవల్సిన అవసరమెంతైనా ఉంది. 

కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ ప్రజాస్వామిక హక్కులను వినియోగించుకొనేందుకు వీలుగా ఆస్తిపరుల ఔద్ధత్యాన్ని, దురహంకారాన్ని రాజ్యం, ప్రభుత్వ, పౌర సమాజ సంస్థలూ సమర్థంగా ఎదుర్కోవాలి. అర్థవంతమైన రాజకీయ వ్యవస్థను సృష్టించేందుకై ప్రజా జీవితాన్ని క్రమబద్ధీకరించేందుకు ఒక ఆచరణాత్మక దృక్పథం అవసరం. ఆ సమున్నత లక్ష్యాన్ని సాధించగలమనే విశ్వాసం మనలో నిండుగా ఉన్నప్పుడే దానిని సాకారం చేసుకొనే కృషిని ప్రారంభించగలుగుతాము. 

-రమా మెల్కోటే

Andhra Jyothi News Paper Dated : 07/06/2011 

Saturday, April 28, 2012

సిఐటియు 2012 మేడే ప్రణాళిక వర్గ పోరాటం మరింత ఉధృతం---prajashaktiతమ హక్కులపై, జీవనాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా మొత్తం యూరోపియన్‌ దేశాల్లో కార్మికులు సమ్మెలు, ఇతర కార్యాచరణలకు పూనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఉద్యమం తరహాలో మొత్తం ప్రపంచంలో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. అమెరికాలో గత సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం 75 నగరాలకు విస్తరించింది. ఆ తరువాత ప్రపంచంలోని నలుమూలలా వేలాది నగరాల్లో ఈ ప్రదర్శనలు విస్తరించాయి. ఈ ఉద్యమంలో ''90 శాతం - ఒక శాతం'' నినాదం ముందుకు వచ్చింది. ''స్పెక్యులేటర్లకు బిలియన్లు, ప్రజలకు పెన్నీలు'' అనేది ఈ సందర్భంగానే వచ్చిన మరో నినాదం. స్వచ్ఛందంగా జరిగే ఇటువంటి ప్రదర్శనలను సిఐటియు ఆహ్వానిస్తున్నది. కార్మికుల సంఘటిత ఉద్యమంలో ఈ స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొనాలని 2012 మే దినోత్సవం సందర్భంగా సిఐటియు పిలుపునిస్తోంది. కార్మికులందరూ అంకితభావంతో అందుకు కృషి చేయాలి.
కార్మికవర్గ అంతర్జాతీయ ఐక్యత, సంఘీభావానికి చిహ్నమైన మే దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని, అలాగే ప్రపంచంలోని కార్మికవర్గానికి, పీడిత, తాడిత ప్రజానీకానికి సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌యూనియన్‌(సిఐటియు) ముందుగా తన విప్లవాభినందనలు తెలియజేస్తున్నది. ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేసే అన్ని రకాల దోపిడీల నుంచి మానవ సమాజానికి విముక్తి కల్పించేందుకు, వర్గ పోరాటాలను ముందుకుగొనిపోయేందుకు కృత నిశ్చయంతో కృషి చేస్తానని సిఐటియు ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నది.
99 శాతం సామాన్య ప్రజలను ఒక శాతంగా ఉన్న పెట్టుబడిదారీ వర్గం నిరంతరం లూటీ, దోపిడీ చేయడానికి ఆసరా కల్పిస్తున్న నయా ఉదారవాద పెట్టుబడి విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, వివిధ రంగాలకు చెందిన సామాన్య ప్రజానీకం గొంతెత్తి నినదిస్తున్న నేపథ్యంలో 2012 మే దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. నయా ఉదారవాద విధానాల మాటున సాగే పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా భారత కార్మికవర్గం ఈ సంవత్సరం మే దినోత్సవాన్ని మరింత ఆత్మవిశ్వాసంతో, అంకితభావంతో జరుపుకోనున్నారు. దేశవ్యాప్తంగా కోటి మంది కార్మికులు పోరాటాన్ని మిలిటెంట్‌ స్థాయికి తీసుకెళ్లాలనే అంకితభావంతో సంయుక్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మె చారిత్రాత్మక విజయం సాధించిన దరిమిలా ఈ ఏడాది మే దినోత్సవం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మే దినోత్సవానికి మరో ప్రాధాన్యత కూడా ఉంది. మే 1న కష్టజీవుల పెన్నిధి, విప్లవ నాయకుడు కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య శతజయంత్యుత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సిఐటియు పీడిత, తాడిత వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన నాయకునికి సిఐటియు విప్లవ జోహార్లు అర్పిస్తోంది. ఆ మహోన్నత నాయకుని శతజయంతిని పురస్కరించుకుని ఈ సంవత్సరం అంతా సముచిత రీతిన కార్యక్రమాలు జరుపుకోవాలని తన అనుబంధ శాఖలన్నిటికీ సిపిటియు పిలుపునిస్తోంది.
సౌహార్థ శుభాకాంక్షలు
శాస్త్రీయ సోషలిజం విలువలను నిలబెట్టేందుకు పోరాడుతున్న సోషలిస్టు దేశాల కార్మికులకు ఈ మేడే సందర్భంగా సిఐటియు తన అంతర్జాతీయ సంఘీభావాన్ని పునరుద్ఘాటిస్తోంది. పెట్టుబడిదారీ వ్యవస్థను పునరుద్ధరించేందుకు విప్లవ ప్రతీఘాతానికి అదే పనిగా కుట్రలు, కుతంత్రాలు సాగిస్తున్న శత్రువులపై వామపక్ష, ప్రగతిశీల శక్తులు విజయం సాధించగలవన్న విశ్వాసాన్ని సిఐటియు వ్యక్తం చేస్తున్నది.
అభివృద్ధి చెందిన దేశాల కార్మికులు, శ్రమజీవులు ప్రమాదకర నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, అలాగే సామాన్య ప్రజలపై ప్రస్తుత ఆర్థిక సంక్షోభ భారాలను మోపేందుకు సాగిస్తున్న దుష్ట యత్నాలకు వ్యతిరేకంగా సాగే పోరాటాలకు కూడా సిఐటియు తన సంఘీభావం తెలియజేస్తోంది. ఒక వైపు తమ దేశ సామాజిక-రాజకీయ, ఆర్థిక వ్యవస్థపై సామ్రాజ్యవాద శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడుతూనే, మరోవైపు తమ హక్కులు, జీవనభృతిపై సామ్రాజ్యవాద నయా ఉదారవాద వ్యవస్థ ప్రోద్బలంతో ఇక్కడి పాలక పార్టీలు సాగిస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు నికరంగా పోరాడుతుంది. ఈ విషయంలో పెద్దయెత్తున పోరాటాలు సాగిస్తున్న వర్థమాన దేశాల కార్మికులకు సిఐటియు తన సంఘీభావాన్ని తెలియజేస్తోంది. ముదురుతున్న వ్యవసాయ సంక్షోభం, దాని ప్రభావంతో తీవ్రతరమవుతున్న పేదరికం, తరుగుతున్న ఉపాధి అవకాశాలు, ఆదాయాలు, పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై నేపథ్యంలో జీవన్మరణ పోరాటం చేస్తున్న నిరుపేద, చిన్న వ్యవసాయ దారులకు సిఐటియు అండగా నిలుస్తుంది.
వివక్షత, నిరుద్యోగం, నయా ఉదారవాద విధానాల కారణంగా ఉత్పన్నమవుతున్న విద్య, ప్రభుత్వ సేవా సంస్థల వ్యాపారీకరణ, ప్రయివేటీకరణలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలు, యువజన, విద్యార్థి సంఘాలకు కూడా సిఐటియు సాదర శుభాకాంక్షలు తెలియజేస్తోంది. దేశం కోసం, దేశ ప్రజల కోసం ఈ సెక్షన్ల చెంతకు చేరాల్సిన అవసరముంది.
పాలస్తీనా ప్రజలకు సంఘీభావం
పాలస్తీనాలోని వెస్ట్‌బ్యాంక్‌, గాజా ప్రాంతాలను దశాబ్దాలపాటు ఆక్రమించుకుని ప్రజలపై దాడులు చేస్తూ, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ, దిగ్బంధం గావిóస్తూ, నేరపూరిత చర్యలకు పాల్పడుతున్న యూదుల వైఖరిపట్ల సిఐటియు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయిల్‌ పాలకులు అనుసరిస్తున్న అమెరికా సామ్రాజ్యవాద ప్రాయోజిత, అనాగరిక, పాశవిక చర్యలను సిఐటియు నిర్ద్వంద్వంగా ఖండించింది. పాలస్తీనా ప్రజలు సాగిస్తున్న పోరాటాలకు ప్రపంచవ్యాపితంగా వున్న సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులు, దేశభక్తియుత, ప్రజాతంత్రవాదులు , ప్రజానుకూలమైన, కార్మిక వర్గ అనుకూల విధానాల కోసం పోరాడే కార్మిక ఉద్యమం మొత్తం మద్దతుగా నిలవడం వాటి కనీస నైతిక, మానవతావాద బాధ్యత అని సిఐటియు పేర్కొంది.
నియంతృత్వ పాలకులపై చారిత్రాత్మక పోరాటాల్లో చేతులు కలిపిన అరబ్‌ దేశాల కార్మికులకు, ప్రజలకు సిఐటియు అభినందనలు తెలిపింది. ఉత్తర ఆఫ్రికా, మద్య ప్రాచ్య దేశాలు కేంద్రంగా ఈ పోరాటాలు జరిగాయి. అమెరికా నేతృత్వంలోని సామ్రాజ్యవాద శక్తుల రెండు ముఖాల నయ వంచన పూర్తిగా బట్టబయలైంది. అమెరికా, దాని మిత్రపక్షాలు ప్రజాస్వామ్యం, పౌరహక్కుల పేరుతో కుట్రలుపన్నుతూ తమకు దాసోహం అనని సిరియా, ఇరాన్‌ దేశాల్లో అల్లర్లను రెచ్చగొడుతున్నాయి. అదే సమయంలో బహ్రెయిన్‌, యెమెన్‌, జోర్డాన్‌, మొరాకో, సౌదీఅరేబియా మొదలైన దేశాల్లో సామ్రాజ్యవాద అనుకూల నియంతృత్వ ప్రభుత్వాలు హక్కుల కోసం ఉద్యమిస్తున్నవారిపై అమానుష అణచివేత చర్యలకు, అత్యాచారాలకు పాల్పడుతుంటే వాటికి అమెరికా, దాని మిత్రదేశాలు బహిరంగంగా వత్తాసు పలుకుతున్నాయి. ఆ దేశాలకు ఆర్థిక, సైనిక పరమైన సహాయాన్ని అందిస్తున్నాయి. ఉగ్రవాదంపై పోరాటం పేరుతో అమెరికా వూహాత్మక ప్రాంతాల్లో, చమురు నిల్వలు పుష్కలంగా ఉన్న అరబ్‌ దేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతంలో పోరాటం చేస్తున్న ప్రజలకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని అంతర్జాతీయ కార్మికోద్యమానికి మే దినోత్సవం సందర్భంగా సిఐటియు విజ్ఞప్తి చేసింది. ఈ దేశాల్లో తమకు అనుకూలమైన నయా ఉదారవాద కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటుచేసి ఆధిపత్యం చెలాయించే ఉద్దేశంతో వ్యవహరిస్తున్న అమెరికా, దాని యూరోపియన్‌ మిత్రపక్షాల సామ్రాజ్యవాదాన్ని గట్టిగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చింది.
లాటిన్‌ అమెరికా ప్రజలకు శుభాకాంక్షలు
సామ్రాజ్యవాదశక్తులు వెనకడుగు వేసే విధంగా దశాబ్దాలపాటు అంకితభావంతో, మిలిటెంట్‌ పోరాటాలు నిర్వహిస్తున్న లాటిన్‌ అమెరికా దేశాల కార్మికులకు సిఐటియు శుభాకాంక్షలు తెలియజేసింది. వెనిజులా, బొలీవియా, ఈక్వెడార్‌, నికరాగువా, మరికొన్ని లాటిన్‌ అమెరికా దేశాల్లో వామపక్ష అనుకూల రాజకీయ శక్తులు సాధించిన విజయాలు, నయా ఉదారవాద విధానానికి ప్రత్యామ్నాయ పంథాను అనుసరించేందుకు ఆయా దేశాలు చేస్తున్న కృషి అమెరికా సామ్రాజ్యవాదానికి ఎదురుదెబ్బ వంటివనడంలో సందేహం లేదు. 33 లాటిన్‌ అమెరికా,కరీబియన్‌ దేశాలు వెనిజులాలో జరిగిన సమావేశంలో కమ్యూనిటీ ఆఫ్‌ లాటిన్‌ అమెరికన్‌, కెరీబియన్‌ స్టేట్స్‌ పేరుతో ఒక ప్రాంతీయ వేదికను ఏర్పాటు చేయడం అత్యంత కీలక పరిణామం. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు సోషలిస్టు క్యూబా ఆశాకిరణం.
2012 మే దినోత్సవ ప్రాధాన్యతలు
ఈ మే దినోత్సవం నాడు అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి కింద సామ్రాజ్యవాద నయా ఉదారవాద రాజకీయ-ఆర్థిక విధానాల రూపంలో పెట్టుబడి వ్యవస్థ పాశవిక స్వరూపాన్ని 2012 మే దినోత్సవం బట్టబయలు చేసింది. ఈ వ్యవస్థ ఒకవైపు అసమానతలు, వివక్షతలు, పేదరికం, నిరుద్యోగాన్ని పెంచుతోంది. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి వేగంగా పడిపోతోంది.. మరోవైపు ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టు బడులకన్నా స్పెక్యులేటివ్‌ పెట్టుబడులు ప్రాబల్యం వహిస్తున్నాయి. ఫలితంగా, ఎటువంటి అడ్డంకులు లేకుండా లాభాలు గరిష్ట స్థాయిలో త్వరితగతిన పోగుపడుతున్నాయి.ఈ వైఖరి ముందెన్నడూ లేని స్థాయిలో తీవ్ర సంక్షోభానికి దారితీసింది. సామ్రాజ్యవాద శక్తులకు ప్రధాన కేంద్రమైన అమెరికాలో ఈ సంక్షోభం తలెత్తింది. ఆ తరువాత మొత్తం పెట్టుబడిదారీ ప్రపంచానికి విస్తరించింది. ఈ సంక్షోభ భారాన్ని కార్మికులపైకి బదలాయిస్తున్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, కాంట్రాక్టు విధానాన్ని ప్రవేశపెట్టడం, వేతనాలపై కోత విధించడం వంటివి జరుగుతున్నాయి. ప్రజలు ఈ లూటీని గట్టిగా వ్యతిరేకిస్తునారు. తమ హక్కులపై, జీవనాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా మొత్తం యూరోపియన్‌ దేశాల్లో కార్మికులు సమ్మెలు, ఇతర కార్యాచరణలకు పూనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఉద్యమం తరహాలో మొత్తం ప్రపంచంలో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. అమెరికాలో గత సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం 75 నగరాలకు విస్తరించింది. ఆ తరువాత ప్రపంచంలోని నలుమూలలా వేలాది నగరాల్లో ఈ ప్రదర్శనలు విస్తరించాయి. ఈ ఉద్యమంలో ''90 శాతం - ఒక శాతం'' నినాదం ముందుకు వచ్చింది. ''స్పెక్యులేటర్లకు బిలియన్లు, ప్రజలకు పెన్నీలు'' అనేది ఈ సందర్భంగానే వచ్చిన మరో నినాదం.
స్వచ్ఛందంగా జరిగే ఇటువంటి ప్రదర్శనలను సిఐటియు ఆహ్వానిస్తున్నది. కార్మికుల సంఘటిత ఉద్యమంలో ఈ స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొనాలని 2012 మే దినోత్సవం సందర్భంగా సిఐటియు పిలుపునిస్తోంది. కార్మికులందరూ అంకితభావంతో అందుకు కృషి చేయాలి.
భారత్‌లో దేశ ఆర్థిక సార్వభౌమాధికారాన్ని కాపాడే ధ్యేయంతో , అన్ని సెక్షన్ల కార్మికులు, శ్రమజీవుల మౌలిక సామాజిక - ఆర్థిక హక్కులను సాధించే లక్ష్యంతో కార్మిక సంఘాలు సంపూర్ణ ఐక్యతను ప్రదర్శించిన గర్వించతగ్గ సెమ్మ చేసిన నేపథ్యంలో వస్తున్న మే దినోత్సవం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 1991లో నయా ఉదారవాద విధానాలు ప్రవేశపెట్టిన తరువాత 14వ సారి సార్వత్రిక సమ్మె అత్యంత విజయవంతమైంది. యుపిఎ-2 ప్రభుత్వం నయా ఉదారవాద అజెండాను దూకుడుగా అనుసరిస్తోంది. చారిత్రాత్మక సమ్మె తదనంతర చర్యగా కార్మిక సంఘాల మధ్య అట్టడుగు స్థాయిలో ఐక్యతను పటిష్టం చేసి కార్మికుల హక్కుల పరిరక్షణలో మిలిటెంట్‌ పోరాటాలను నిర్వహించాలని కార్మికులకు సిఐటియు పిలుపునిస్తోంది. ప్రజా వ్యతిరేక, సామ్రాజ్యవాద అనుకూల విధానాలను తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిస్తున్నది.
ప్రజాతంత్ర ఉద్యమంపై దాడికి నిరసనగా పోరాటానికి సంఘీభావం
అంతర్జాతీయ కార్మిక సంఘీభావ దినోత్సవం కార్మికులపై, ప్రజాతంత్ర ఉద్యమంపై దాడులకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలకు సంఘీభావం ప్రకటిస్తున్నది. పెట్టుబడిదారీ యజమాన్యాలు, వాటి ఆదేశాలతో వ్యవహరించే ప్రభుత్వం కార్మికులపై మరింత దూకుడుగా వ్యవహరించి కార్మికులను, కార్మిక సంఘాలను అణచివేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది. కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కును హరించేందుకు కార్మిక సంఘాల నాయకులు, అందులో చేరేవారిపై వేధింపులకు పాల్పడుతున్నది. నాయకులు, కార్మికులపై క్రిమినల్‌ కేసులు బనాయించింది. హర్యానాలో మారుతీ సుజుకీ కార్మగారం, తమిళనాడులో హుండారు, కర్నాటకలోని వోల్వో, యానాంలోని రీజెన్సీ కొన్ని ఉదాహరణలు మాత్రమే.
బెంగాల్‌లో ప్రజలపై దాడులు
2011లో అసెంబ్లీ ఎన్నికలు, టిఎంసి- కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం పశ్చిమ బెంగాల్‌లో కార్మిక సంఘాలు, ప్రజాతంత్ర హక్కులపై దాడులు యథేచ్ఛగా సాగుతున్నాయి. కార్మిక సంఘాలపై తీవ్రస్థాయిలో భౌతిక దాడులు జరిగాయి. ముఖ్యంగా సిఐటియు, ఇర కార్మిక సంఘాలపై, విద్యార్థి, మహిళా, చిన్న రైతులు, యువజన సంఘాలపై ఇవి ఎక్కువగా కేంద్రీకరించబడ్డాయి. కార్మిక సంఘాల కార్యాలయాలకు నిప్పుపెట్టడం, అంగన్‌వాడీ కార్యకర్తలతో సహా మహిళలపై దాడులకు దిగడాం, వారిని చిత్రహింసలకు గురిచేయడం నిత్యకృత్యమయ్యాయి. ఇప్పటివరకు 58 మంది ప్రజాతంత్ర ఉద్యమ నాయకులను పొట్టన పెట్టుకున్నారు.
లెఫ్ట్‌ ఫ్రంట్‌ పాలనలో ఉన్న త్రిపురలో కూడా ఇటువంటి దాడులు సాగించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు 2013 ప్రారంభంలో జరగనున్నాయి. కార్మిక ఉద్యమం బలంగా ఉన్న కేరళలో కూడా ఇటువంటి దాడులు జరుగుతున్నాయి.
2012 మే దినోత్సవం పిలుపు
నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా, తమ హక్కులు, జీవన ప్రమాణాలను రక్షించుకునేందుకు కార్మికులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలకు తన సంపూర్ణ సంఘీభావాన్ని సిఐటియు వ్యక్తం చేస్తున్నది. కార్పొరేట్‌ శక్తుల్లో బందీగా ఉన్న అధికార పార్టీ కార్మికుల హక్కులు, జీవనాలపై సమిష్టి పోరాటాలు జరిపేందుకు కార్మికుల మధ్య సంపూర్ణ ఐక్యత నెలకొనాలని సిఐటియు అన్ని కార్మిక సంఘలకు విజ్ఞప్తి చేసింది. కార్మికుల దైనందిన కార్యకలాపాల విషయంలో కూడా సంఘీభావ చర్యలు పాటించాలి. ఇది మే దినోత్సవ పిలుపు
కార్మికులు అప్రమత్తంగా ఉండి విచ్ఛిన్నకర శక్తులపై పోరాటం చేయాలి. అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడుతూనే మతతత్వం, కులతత్వం, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్న శక్తులపై నికరంగా పోరాటం కొనసాగించాలి.
వర్థిల్లాలి మేడే! అంతర్జాతీయ కార్మిక ఉద్యమానికి సంఘీభావం!
పెట్టుబడిదారీ వ్యవస్థ, సామ్రాజ్యవాద వ్యవస్థ నశించాలి!
నయా ఉదారవాద సామ్రాజ్యవాద, ప్రపంచీకరణ నశించాలి!
(ఎల్లుండి మేడే సందర్భంగా...)

Prajashakti News Paper Dated : 29/04/2012 

వడ్డెరలను ఎస్సీ జాబితాలో చేర్చాలె
ఆధునిక ప్రాజెక్టులులేని కాలంలో దేశ వ్యాప్తంగా బావులు, చెరువులు, కాలువలు తవ్వడంలో వడ్డెరలు కీలకపాత్ర పోషించారు. బావుల త్రవ్వకం, వాస్తుశాస్తం, నిర్మాణపరమైన సాంకేతిక నైపుణ్యాలు మొత్తం వడ్డెర కులస్థులకే సొంతం. మట్టికి సంబంధించిన పనుల్లో వడ్డెరల శక్తియుక్తి అంతులేనిది. దేశమంతటా వ్యాపించిన కులాల్లో వడ్డెర కులం కూడా ఒకటి. రాతిపని, మట్టిపని ప్రధాన జీవన వృత్తిగా వడ్డెరలు మన రాష్ట్రం లో లక్షలాదిగా ఉన్నారు. పేదరికం, నిరాక్షరాస్యతతో సంఘం లో అస్పృశ్యులుగా చూడబడుతున్నారు. 

బ్రిటిష్ ఇండియాలో ప్రాజెక్టుల నిర్మాణం మొదలైన తర్వాత మొట్టమొదటగా సంచార కార్మికులుగా మారిన వారు వడ్డెరలే. కాలువల ద్వారా వ్యవసాయం సాగులోకి వచ్చేటప్పటికి బావు లు,చెరువులు తగ్గిపోయాయి. వీటి ప్రాముఖ్యం కూడా తగ్గిపో యింది. దీనికి పర్యావరణ సమస్యలు కూడా వడ్డెరల జీవన విధానంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో వడ్డెరలు తమ కుల వృత్తిలో భాగమైన బావులు, చెరువులు తవ్వడం, మట్టి పని, రాతి పనులను కోల్పోయారు.

ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు, హైదరాబాద్ రాష్ట్రంలోని బీదర్, బీజాపూర్, రాయచూర్‌లను గుల్బర్గా జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలోని బల్లారి జిల్లాలు కర్ణాటక రాష్ట్రంలో చేర్చడం జరిగింది. ఈ జిల్లాలోని వడ్డెరలను ఆ రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో చేర్చారు. ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిపోయిన వారు మాత్రం బీసీ లుగా ఉండిపోయారు. జీవో 1973, విద్యాశాఖ 23-9-1970 అనుసరించి ఆదిమ జాతులు, విముక్తి జాతులు, సంచార జాతులను మిగిలిన వెనుకబడిన కులాలను అన్నింటిని బీసీలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణలో వడ్డెర కులాన్ని ‘ఎ’గ్రూప్‌లో చేర్చారు. అయితే గతంలో విముక్తి జాతులుగా ఉన్న లంబాడీ, ఎరుకల, యానాదులను 1976లో ఎస్సీ,ఎస్టీ అమెండ్‌మెంట్ యాక్టు ద్వారా షెడ్యూల్డ్ జాతులల్లో చేర్చారు. 

వారితోపాటు సమాన ప్రతిపత్తి కలిగిన వడ్డెర, దొమ్మర, తదితర జాతుల గురించి ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోలేదు.ఎన్‌డీఏ ప్రభుత్వం సమాజంలో అత్యంత వెనుకబడిన 92 కులాల జాబితాను తయారు చేసి ఎస్సీలో చేర్చాలని నిర్ణయించింది. ఈజాబితాలో వడ్డెరలను చేర్చలేదు. దీనికి ఏ అంశాన్ని ప్రాతిపది కగా తీసుకున్నారో అర్థంకాదు. ఆ జాబితాలో వడ్డెరలను చేర్చకపోవడం చాలా అన్యాయంయకమంగా చేతి వృత్తుల వారిని నిర్మూలించడమే ప్రభుత్వాల లక్ష్యంగా అర్థం చేసుకోవాల్సి వస్తున్నది. బ్రిటిష్ కాలం నుంచి నేటి దాకా వడ్డెరలు క్వారీల లో, రైల్వే పనులలో, చెట్టు పుట్టలల్లో ఏ రక్షణ లేని బానిసలుగా,కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యం వడ్డెరల పాలిట శాపంగా మారింది.

బోరింగులు, రిగ్‌లు, క్రషర్‌లు వచ్చి వడ్డెరల కులం నడ్డివిరిచాయి. సంప్రదాయ సిద్ధమైన బావి, చెరువులు, తవ్వడం నిలిచిపోయినపుడు వడ్డెరలు తమ కుల వృత్తిని కోల్పోయే పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆధునిక, సాంకేతిక రంగాలలో భాగమైన బోర్లు, రిగ్‌లు, క్రషర్‌ల యాజమానులుగా వడ్డెరలు మారలేదు. నాటి నుంచీ నేటి దాకా కాయ కష్టం మీదనే, దినకూలీలుగా, సంచార జీవులుగా, కాంట్రాక్టు కార్మికులుగానే మిగిలిపోయారు. 

బ్రిటిష్ పాలనానంతరం భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దుర్మార్గమైన చట్టాల వల్ల అనేక కులాలు, తెగలు, సంచార జీవితాల్ని గడపాల్సిన దుస్థితి వచ్చింది. ఈ ప్రజల్ని నిర్బంధించి ‘సెటిప్మూంట్స్’ ప్రాంతాలు అని ఏర్పాటుచేసి అనేక చిత్రహింసలకు గురిచేశారు. కొన్ని జాతులను దొంగలుగా ముద్రవేశారు. ఆస్తికి, అధికారానికి, విద్యకు దూరం చేశారు. పిల్లలు, వృద్ధులు అని తేడా లేకుండా హత్య చేశారు. ఈ దమనకాండలో వడ్డెరలు బలై ఎంతోమంది అంగవైకల్యానికి గురయ్యారు. అక్రమంగా జైళ్లలో నిర్బంధించబడ్డారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వాపు కార్యదర్శి క్రిమినల్ ట్రైబ్స్ (సీటీ యాక్టుపతిపాదకుడు జేఎం స్టీఫెన్ 1924లో సృష్టించిన సీటీ యాక్ట్ చట్టాలకు వ్యతరేకంగా ఎరుకల, లంబాడీ, యానాది తదితర తెగలతో కలిసి వడ్డెరలు అనేక పోరాటాలు చేశారు. బ్రిటిష్‌వారితో తలపడిన వడ్డెర ప్రజలకు స్వేచ్ఛ లభించలేదు. ముప్ఫై సంవత్సరాల అనంతరం దేశ వ్యాప్తంగా సీటీ యాక్టును లంబాడీ,ఎరుకల తెగలపై ఎత్తివేసినా వడ్డెరలపై అలాగే కొనసాగిస్తున్నారు.

1956 సెప్టెంబర్ 26న కేంద్ర ప్రభుత్వం ఎరుకల, లంబాడీ, యానాది తెగలను ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎస్టీలుగా గుర్తించింది. వడ్డెరలను డీఎన్‌టీ (డీ నోటిఫైడ్ ట్రైబ్స్)గానే ఉంచారు. ఒకే తెగను కొన్ని జిల్లాల్లో ఎస్టీ జాబితాలో,మరికొన్ని ప్రాంతాల్లో డీఎన్‌టీ జాబితాలో చేర్చి విడదీసి అణగదొక్కిన చరిత్ర ఆంధ్రవూపదేశ్ అగ్ర కుల పాలకులదే. అయితే 1956 నుంచి 1976 వరకు ఆంధ్రప్రదే శ్‌లోని మొత్తం వడ్డెరలను, తెలంగాణలోని ఎరుకల, లంబా డీ, యానాది తెగలను డీఎన్‌టీ బీసీ(ఎ)లోనే ఉంచి ఎస్సీ జాబితాలో చేర్చలేదు. ఎస్సీ జాబితాలో చేర్చడానికి తెలంగాణలోని డీఎన్‌టీ తెగలతో వడ్డెరలు కలిసి పోరాటాలు చేస్తే అక్కడ కూడా వడ్డెరలకు తీరని అన్యాయం జరిగింది. ఎస్టీ జాబితాలో వడ్డెరలను చేర్చకుండా బీసీ (ఎ) గ్రూప్‌లో ఉంచి డీఎన్‌టీకు ఇచ్చే అన్ని హక్కులను రాయితీలను రద్దు చేశారు. 

1924నుంచి 192 వరకు సీటీ యాక్టుకు వ్యతిరేకంగా వడ్డెర, ఎరుకల, లంబాడీ, యానాది జాతులు కలిసి పోరాటాలు చేశాయి. 1952 నుంచి 1956 వరకు రిజర్వేషన్ కోసం గిరిజన జాబితాలో చేర్చడం కోసం వడ్డెరలకు మిత్రులైన ఎరుకల, లంబాడీ, యానాదులతో కలిసి అనేక పోరాటాలు చేశా రు. ఈ తెగలకు ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు దక్కినా వడ్డెరలకు దక్కలేదు. కర్ణాటకలో వడ్డెరలు ఎస్సీ రిజర్వేషన్ పొందుతున్నారు. కనుక మన రాష్ట్రంలోని వడ్డెరలను ఎస్సీ రిజర్వేషన్ జాబితాలో చేర్చాలనీ డిమాండ్ చేస్తూ బలమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నది. అగ్రకుల ప్రభుత్వాలు అనుసరించిన లోపభూష్టమైన విధానాల వల్ల వడ్డెరలు తీవ్రంగా నష్టపోయారు. ఈ కోల్పోయిన హక్కులను ఐక్యంగా ఉద్యమించి సాధించుకోవాలి.

-పాపని నాగరాజు
సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కో- కన్వీన

Namasete Telangana News Paper Dated : 29/04/2012 

సత్యమూర్తితో రెండేండ్లు---కాళిదాసునక్సల్‌బరీ పోరాటాలు 1970వ దశకంలో ఉధృతంగా జరుగుతున్నాయి. నక్సలైట్లు సాహసోపేతమైన దాడులతో ప్రభుత్వానికి హడలు పుట్టిస్తు న్న రోజులు. యూనివర్సిటీ, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు, లెక్చరర్లూ, లాయర్లు, ఉద్యమబాట పట్టిన కాలం. కరీంనగర్‌లో కొంతమంది విద్యార్థులమంతా ఒకచోట కలిసి అనేక విషయాలు చర్చించేవాళ్లం. అప్పుడప్పుడు శ్రీశ్రీ సాహిత్యం, మార్క్స్, మావోల రచనల గురించి తెలిసినవాళ్ళు చెపుతుంటే అందరూ ఆసక్తిగా వినేవాళ్లం. కొంతమంది లెక్చరర్లు వ్యవస్థలోని దోపిడీ, పేదరికం గురించి మాట్లాడుతుంటే ఊగిపోయెవాళ్లం. సృజన, పిలుపు పత్రికలు చదువుతూ మైమరచిపోయేవాళ్లం.

నేను డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నాను. ఒకరోజు ఒక లెక్చరర్ ఒక మధ్య వయ స్సు గల మనిషితో కలిసి మా రూంకు వచ్చిండ్రు. తనతో వచ్చినాయనను చూపి ‘ఈ సార్ కొన్ని రోజులు మీ దగ్గర ఉంటడు మంచిగా చూసుకోండ్రి’ అని చెప్పి వెళ్ళిపోయిండు. ఆయనది ముద్దముఖం. మరీ పొట్టిగాని పొడుగుకాని శరీరం. మరీ బక్కగా లేడు, మరీ లావుగా లేడు. అందమైన తలకట్టు ధోతి కట్టుకున్నడు. తమ్ముడూ అని మమ్ముల పిలిచేది. చాలా కలుపుగోలు గుణం. మంచి మాటకారి. చిన్న చిన్న మాట ల తో మమ్ముల నవ్వించేవాడు. మెల్ల మెల్లగా ఆయనతో మాకు చనువేర్పడ్డది. దేశ రాజకీయాలు, సాహిత్యం, సినిమాలు ఎన్నెన్నో విషయాలు చర్చించడం మాకు అలవాటయ్యింది. ఆయన మాట తీరు వినేవాళ్లకు హుషారు కలిగించేది. అప్పుడప్పుడు కొన్ని పాటలు పాడి వినిపించేవాడు. 

మేం ఎట్ల వంట చేసినా తినేది. అప్పుడప్పుడు కూరగాయలు, సరుకులూ తీసుకరమ్మని పైసలిచ్చేది. ఆయన ఎవరు? ఇక్కడెందుకుంటడు? అనే విషయం మాకు తెలువదు. వచ్చినవాళ్ళ వ్యక్తిగత విషయాలు అడగ డం సభ్యత కాదని ఏమి అడిగేవాళ్ళం కాదు. ఆయనకున్నది ఒక చిన్న మామూలు బట్ట సంచి. అందులో రెండు జతల బట్టలు, తువ్వాల, షేవ్ చేసుకునే బ్లేడు, కొన్ని తెల్ల కమ్మలు గల రెండు మూడు పుస్తకాలుండేవి. ఒక పదిహేను రోజులు గడిచినంక ఒక సాయంత్రం చీకటి పడ్డాక ‘మళ్ళీ వస్తాను తమ్ముడూ’ అంటూ వెళ్ళిపోయిండు. అటు ఇటు చూడకుం డా కిందివైపు చూస్తూ నడవడం నాకు గుర్తు. ఎటుపోతున్న వు అని గాని ఎపుడొస్తావని గానీ నేను అడుగలేదు. ఆ విధంగా పోయి మళ్ళీ కొన్నిరోజుల తర్వాత వచ్చిండు.

తిరిగి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పోయిండు. వచ్చేది, పోయేది. ఇట్లా రెండు సంవత్సరాల కాలం గడిచిపోయింది. మేము డిగ్రీ ఫైనలియర్‌కు వచ్చినం. ఒక రోజు పత్రికల్లో కేజీ సత్యమూర్తి అనే పీడబ్యుజీ గ్రూప్ నాయకున్ని పోలీసులు అరెస్టు చేసినారన్న వార్త వచ్చింది. ఆ తర్వాత మాకు తెలిసిందేమిటంటే మాతో కలిసున్న మనిషే ‘సత్యమూర్తి ’ అని. మేం ఆశ్చర్యపోయినం.

వెనుకకు తిరిగి ఆలోచిస్తే ఆయన గురించిన అనేక విషయాలు మమ్ము కదిలించివేసినయి. మాటలో భావుకత, అతి సామాన్యమైన జీవితం, ఏకాక్షిగతతో చదవడం, ఎవరికీ ఏ విషయం తెలువకుండా జాగ్రత్తగా పార్టీ కార్యక్షికమాలు నిర్వహించడం, మాలో ఒక సామాన్యమైన వాడిలా కలిసి జీవించడం, నాకు ఇప్పటికీ జ్ఞాపకం. ఆయన చిత్తు కాగితాలతో రాసి ‘ఫేర్’ చేయని కొన్ని కవితలు చాలా కాలం దాచిపెట్టినం.ఆకాలంలో ఆయన ఉపాధ్యాయుడు. ఉద్యోగం వదిలి ఉద్యమంలోకి రావడం, అంకిత భావంతో పార్టీలో పనిచేయడం, ఏవో విభేదాలతో బయటకు రావడం, ఏ పార్టీలోను ఇమడకపోయినా ప్రజల కోసం తపించడం మరపురాని జ్ఞాపకాలుగా నాలో మిగిలిపోయినవి. నాడు విప్లవ సాహిత్యం చదువుతూ ఫ్యూడల్, బూర్జువా తత్వాన్ని, వ్యవస్థలోని దోపిడీని గురించి మాట మాటకు విమర్శిస్తూ విప్లవం జిందాబాద్, అంటూ అరిచిన మా మిత్రులు చాలా కొద్ది కాలానికే ఆ సిద్ధాంతాలు గాలికి వదిలి ఆ అవతారం అంతటితో చాలించారు. వాళ్లు అప్పుడప్పుడు కలిసినపుడల్లా నాకు సత్యమూర్తి జ్ఞాపకం వస్తుంటరు. మనసు తండ్లాడుతుంది. 

-కాళిదాసు, కరీంనగ
Namasete Telangana News Paper Dated : 29/04/2012 

విప్లవ 'సత్యం' - చంద్రశ్రీ


రెండు దశాబ్దాల క్రితం నాటి మాట. 1985లో రాజమండ్రిలో రైతు-కూలీ మహాసభల ప్రచారం కోసం ఆర్ఎస్‌యు, ఆర్‌వైఎల్ దళాలు పనిచేస్తున్న సందర్భం. నేను, ద్రోణవల్లి అనసూయమ్మగారు, కొండపల్లి మనుమరాలు చుక్కు(సుధ) మరికొంత మంది బృందాలుగా పనిచేస్తున్నాము. మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో 45 రోజులుంచారు. అపుడు నా వయసు 18 సంవత్సరాలు. నాకు ఏ రాజకీయాలు తెలియకుండానే ఆ టీంలో ఉన్నాను. 

ప్రతీరోజు అనసూయమ్మ గారి రాజకీయ తరగతులు, చుక్కు పాటలు నేను బాగా జీర్ణించుకున్నాను. చుక్కు కేవలం కె.జి. సత్యమూర్తిగారి పాటలే పాడేది. నేనూ ఆ పాటలన్నిటినీ నేర్చుకున్నాను. ఆ తరువాత 1989లో నేను దళంలో ఉన్నపుడు ఆ పాటలు పాడేదాన్ని. దళం కదలికలకు ఆయన పాటలే స్ఫూర్తి. 'గాలిలోని వాలులా/ ఏటిలోని నీటిలా/ నీటిలోని చేపలా/ ప్రజల మధ్యన ఒకనిగా/ రైతు బిడ్డడు లేచెనోయ్/ రైతు బిడ్డడు గెరిల్లాగా /కదన శంఖం ఊదెనోయ్ ' ( 'తూర్పు పవనం వీచెనోయ్' నుంచి). ఈ పాట దళం కదలికలకు చాలా ధైర్యాన్ని ఇచ్చేది. 

1996లో హైదరాబాద్ నుండి విజయవాడ ట్రెయిన్‌లో వెళుతుండగా నేను కూర్చున్న బోగీలో చాలా సందడి కనిపించింది. వాళ్ల పాటలు మాటలు సుపరిచితమైనట్లు అనిపించాయి. వెళ్లి చూస్తే మా పాటల రచయిత అక్కడున్నారు. 'నమస్కారం సత్యమూర్తిగారు' అన్నాను. 'అమ్మా తమరెవరు?' అని అడిగారు. ' నేను పీపుల్స్‌వార్‌లో 1985 నుండి 91 వరకు పనిచేశాను. నేను పార్టీలో దళాల్లో ఉండగా మీ పాటలే పాడేదాన్ని' అని ఆయన రాసిన పాటలు వరుసగా ఐదుపాటలు పాడాను. అది విని ఆయన నన్ను అక్కున చేర్చుకుని నుదుట ముద్దుపెట్టారు. నా అడ్రస్ తీసుకున్నారు. హైదరాబాద్‌లోని తన పార్టీ ఆఫీస్ అడ్రస్, ఫోన్ నంబర్ ఇచ్చారు. 

అంత ప్రేమగా ఆహ్వానించినా హైదరాబాద్‌లోనే చిన్న ఉద్యోగం చేసుకుంటున్న నేను ఆయన్ని కలవలేకపోయాను. నెల తిరక్కుండానే దిల్‌షుఖ్‌నగర్‌లో ఉంటున్న నన్ను ఆయనే వచ్చి కలిశారు. ' చలపతి, విజయవర్ధనరావుల ఉరిశిక్ష రద్దు ఉద్యమం జరుగుతోంది. అందులో నీ గళం వినిపించాలి ' అని ఇంటికి వచ్చి మరీ చెప్పారు. నేను వెళ్ళటం, ఆ తర్వాత ఉద్యోగం మానేసి సత్యమూర్తిగారితోనే కలిసి పనిచేయడం జరిగింది. ఆ పార్టీ ఆఫీసులో ఉన్నపుడు 'శత్రు చేజిక్కితినని వెక్కిరించకు నన్ను -మిత్రద్రోహము చేత శత్రువు చేజిక్కితిని చందమామా' అనే పాట ఎక్కువగా పాడేదాన్ని. నిజంగా ఆ పాట పాడేటపుడు నా హృదయం ద్రవించేది. 

ఆయనకు మిత్రుడెవరో శత్రువెవరో నిజంగానే తెలిసేది కాదు. అందర్నీ మిత్రులుగానే భావించేవారు. ఆ మిత్రులే తర్వాత చాపకింద నీరులా చేరి కొంపముంచుతారన్న వాస్తవం తెలిసేది కాదు. ఆయనకు తెలిసింది ఒక్కటే " సత్యం, సత్యం, సత్యం''. నిజంగా సత్యమూర్తి సార్థకనామధేయుడు. అతనికి కుట్రలు తెలీవు. కుట్రలు గమనించేవారు కాదు. మిత్రుల కుట్రలను గమనించలేక పోవడం వలన అతను ఎన్నో అవమానాలు చవిచూశాడు. దానివల్ల కేడర్‌కు కూడా కన్నీళ్ళు, ఆకలి మిగిల్చారు. నన్ను ఏకలవ్య కళామండలి రాష్ట్ర కన్వీనర్‌గా ఆయన నియమించినందుకు కొందరు 'మిత్రులనుకు'నేవాళ్లే అసూయతో మామీద బురదజల్లిన సంగతి నాకు ఇప్పటికీ గుర్తే. స్వార్థం శిరస్సు గండ్రగొడ్డలితో నరక గల్గినవాడే నేటి హీరో అన్నమాట ఆయన చనిపోయే వరకు నిలబెట్టుకున్నారు. 

వామపక్షాల్లోనూ కులతత్వం వుంది, ఇది కుల-వర్గ సమాజం అంటూ, అంబేద్కర్, మార్క్స్, మావో ఆలోచన- ఆచరణ సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించినపుడు లెఫ్ట్ పార్టీల్లోని అణగారిన కులాలవారి కళ్ళు తెరుచుకున్నాయి. అణగారిన కులాలవారి మీద నాయకత్వం వహిస్తున్న అగ్రకుల నాయకులకు గుండెల్లో గుబులుపుట్టింది. అన్ని పార్టీల్లోనూ కుల నిర్మూలన సంఘాలు, కుల వివక్ష వ్యతిరేక సంఘాలు పెట్టారు, తమ కేడర్ జారిపోకుండా. 

అనంతసాగరం లాంటి ఆయన సాహిత్యం చదివాను. ఆయన పాటలు పాడాను, ముఖ్యంగా నల్లనల్ల సూరీడు. ఆయన 1996లో ఆ పాట రాస్తే నేనే దానికి ట్యూన్ కట్టి పాడాను. అంతటి అదృష్టం నాకు దక్కింది. ఆచరణశీలియైన ఆ మహాకవి నెలవంకతో నన్ను పోల్చడం నా జన్మ సుకృతం. "ఆయన కాలజ్ఞాని సూర్యుడు''- 'ప్రత్యేక తెలంగాణలో బహుజన రాజ్యం' అనే నినాదాన్ని ఆయన 1997లోనే తీసుకున్నారు. ఎంత ముందుచూపో చూడండి. 

శివసాగర్ పీపుల్స్‌వార్ పార్టీ నుండి బయటికి వచ్చాక ఆయనకు ఎవరో మహానుభావుడు హైదరాబాద్ చింతల్‌బస్తీలో మూడుసెంట్లస్థలం గిఫ్ట్‌గా ఇచ్చారు. అపుడు బహుజన రిపబ్లికన్ పార్టీలో ఉన్న ఆయన సహచరి పార్వతి, ఆ స్థలంలో పార్టీ ఫండ్‌తో ఇల్లు కట్టింది. ఇప్పుడది పరాధీనంలో ఉంది. ఆ ఇం టిని శివసాగర్ లైబ్రరీగా మార్చాలని శివసాగర్ అనుచరులు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఒక విగ్రహం కట్టాలని కూడా కోరుతున్నారు. ఆయనకు మూడు సెంట్లు ఇచ్చిన దాతకు నమస్కారాలు. 

సుఖం అంటే ఏమిటో, అలుపంటే ఏమిటో, స్వార్థం అంటే ఏమిటో ఆయనకు తెలియదు. ఆయన ఆచరణ అంతా, జీవితమంతా ప్రజలకోసమే. 'సత్యమూర్తి'గా నెలవంకై మనవైపు ఎపుడూ దృష్టి ఉంచుతాడు. దళిత, విప్లవ ఉద్యమాల్లో తన అనుభవాల గురించి ఆయన స్వయంగా మాట్లాడింది, పాడింది నేను రికార్డు చేయడం నా అదృష్టం. అంతిమ యాత్రలో నన్ను గజ్టెకట్టి ఆడమని శివసాగర్ కోరారు. కాని పాడలేకపోయిన నా అశక్తతను, అనారోగ్యాన్నీ మన్నించు శివసాగర్... 

- చంద్రశ్రీ

Andhra Jyothi News Paper Dated : 29/04/2012