Showing posts with label సామజిక తెలంగాణా. Show all posts
Showing posts with label సామజిక తెలంగాణా. Show all posts

Friday, May 2, 2014

సామాజిక తెలంగాణలో వంచన! By దామిశెట్టి రామాకోటేశ్వర్ రావు


లోపించిన సామాజిక కోణం 
వంచనకు గురైన ఉద్యమ బిడ్డలు 
నీరు గారిన ఉద్యమ హామీలు 
నిరాశలో విద్యార్ధి, యువజనులు 
కల్లలుగా మారిన బడుగు వర్గాల కలలు 
ఎవరికి బంగారు తెలంగాణ రాబోతోంది? 
మరో పోరాటం తప్పని పరిస్థితులు ్చ 

ఉద్యమాలే ఊపిరిగా, ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటే ధ్యేయంగా అర్ధశతాబ్దానికిపైగా నిరసనకారుల గుండెల్లో, కళాకారుల ప్రదర్శనల్లో, కవుల కలాల్లో, వాగ్గేయకారుల గొంతుకల్లో రణన్నినాదమై ఉవ్వెత్తున ఎగసిపడిన తెలంగాణ పోరాటం దేశంలోనే ఓ మహోజ్వల ఉద్యమఘట్టం. సుదీర్ఘ ఉద్యమ చరిత్ర కలిగిన తెలంగాణ భారత భౌగోళిక చిత్ర పటంపై 29వ రాష్ర్టంగా, తొలి భాష వియుక్త రాష్ర్టంగా ఆవిర్భవించాక పోలింగ్‌ ముగిసిన మొట్టమొదటి ఎన్నికలు పార్టీల పరంగా అధికారం కోసం సాగుతున్న అంతర్యుద్ధం, అస్తిత్వం కోసం జరుగుతున్న ఆఖరి యుద్ధంలా సాగాయి. సంపూర్ణ తెలంగాణ ప్రజలు కోరుకున్నదొకటి, జరుగుతున్నది మరొకటి. ప్రజలు ఆకాంక్షలు, ఆశయాలకు భిన్నంగా సామాజిక తెలంగాణకు వ్యతిరేకంగా అడుగడుగునా రాజకీయ వంచన పర్వం వేళ్ళూనుకు పోతోంది. 

తెలంగాణ పునర్నిర్మాణం పేరిట అన్నీ పార్టీలు ఉద్యమ బిడ్డల్ని వంచించే ప్రయత్నాలకు ఏమాత్రం చరమగీతం పాడకపోగా వాటిని మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి. 16వ లోక్‌సభ ఎన్నికలలో దేశంలోనే అతి ఖరీదైన రాజకీయాలు నడుస్తున్న నయా రాష్ర్టంగా తెలంగాణ మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే టి.పి.సి.సి. అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించినట్లుగా విస్వసనీయతకు- విస్వాసఘాతుకానికి జరిగిన ఎన్నికలివి. ప్రత్యేక రాష్ర్టం కోసం అసువులు బాసిన అమరవీరుల ఆశయాలను జెండాగా మార్చి దాని నీడలో రాష్ర్ట పునర్నిర్మాణమంటూ పొంతనలేని అజెండాలతో తెలంగాణ ప్రజలను మరింతగా వంచించేందుకు నిస్సిగ్గు రాజకీయాలకు పాల్పడుతున్నాయి కొన్ని బూర్జువా పార్టీలు. త్వరలో ఈ సార్వత్రిక ఎన్నికలను రాజకీయ పార్టీలు తమ తమ అధికార బలప్రదర్శనకు వేదికగా మార్చుకోగా, సామాజిక తెలంగాణ ఆశయసాధకులకు అదొక బలిపీఠంగా మారింది. చీమలు పెట్టిన పుట్టలు పాములకు స్థావరమైనట్లుగా- నవతెలంగాణ రాష్ర్టం నిరుద్యోగ రాజకీయ పార్టీలు, సంస్థలకు కోరకపోయినా లభించిన వరంగా మారింది. 

ఉద్యమ సమయంలో కలుగులో ఉన్న చిన్న చితక పార్టీలు, రాజకీయ సామాజిక ఉద్యమ సంస్థలన్నీ తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకు ఎన్నికల వేళ ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. విద్యార్ధులు, యువతీయుకుల భుజంస్కంథాలమీద సాగిన తెలంగాణ చివరి దశ ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టంలో నేడు రాజకీయ ఆధిపత్యం, అధికార సాధనల కోసం కొన్ని పార్టీలు అర్రులు చాస్తున్నాయి. సామాజికన్యాయం కోసం జరిగిన సాయుధ పోరాట చరిత్ర కలిగిన పురిటి గడ్డను రాజకీయ రణరంగంగా మార్చివేస్తున్నారు కొందరు స్వార్ధపరులు. భూస్వామ్య పెత్తందారి దొరల తెలంగాణలో సామాజిక రుగ్మతలు, వర్గ వైషమ్యాలు లేని పునర్నిర్మాణమే ప్రజల ఆకాంక్ష. అందుకు భిన్నంగా అగ్రవర్ణ పాలక వర్గాల ఆధిపత్యానికి ఈ ఎన్నికలనుండే బీజం పడింది.

ఒకనాటి ఉద్యమ సంస్థగా ఉన్న టిఆర్‌ఎస్‌, తెలంగాణ ఏర్పాటు అనంతరం కనుమరుగై పోతుందని అన్నీ పార్టీలు ఊహించినదానికి భిన్నంగా నేడు అది బలమైన రాజకీయ పార్టీగా ఎదిగి అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో అభ్యర్ధులను నిలపడమే కాకుండా, ఈ ఎన్నికల్లో బరిలో దిగుతూ శతాబ్దాలు, దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుండటం ఆశ్చర్యకరƒ పరిణామం. తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు పరిశీలిస్తామని సూత్ర ప్రాయంగా అప్పట్లో అంగీకరించారు కేసిఆర్‌. అదే విధంగా టిఆర్‌ఎస్‌ గెలిస్తే తెలంగాణలో దళిత వ్యక్తిని సిఎం చేస్తామని ప్రకటించారు. కానీ ఈ రెండు విషయాలు ప్రస్తుతం ఆయన విస్మరించి ఓట్ల కోసం ప్రచారానికి బయలు దేరడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. బడుగు, బలహీన వర్గ ప్రజలు అత్యధికంగా ఉన్న తెలంగాణలో ఆయా వర్గాల ప్రజల తరపున ఈ ఎన్నికలలో సీట్ల కేటాయింపులలో సముచిత ప్రాధాన్యం ఇవ్వని ఆయన- రానున్న ఏడేళ్ళలో బంగారు తెలంగాణను నిర్మిస్తామని చేస్తున్న ప్రకటనల అంతరార్ధం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. 
తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది తామే గనుక ఓటర్ల ఆదరణ తమకే ఉంటుందనే భ్రమలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ- టిఆర్‌ఎస్‌ ఇచ్చిన అనూ„హ్య షాక్‌తో- తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ శల్య సారథ్యం చేయాల్సిన అగత్యం ఏర్పడింది. దీంతో ఈ ఎన్నికలు కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, టిడిపి కూటములకు రెఫరెండమ్‌గా మారగా, వైఎస్సార్‌సిపి, వామపక్ష, ఇతర పార్టీలు అస్తిత్వ పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్నాళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కోసం ఊపిరి సలపని ఉద్యమాలు నడిపిన ప్రజలు అతి తర్వరలోనే తిరిగి- సంపూర్ణ సామాజిక తెలంగాణ కోసం ఉద్యమించాల్సిన పరిస్థితులను కొన్ని పార్టీలు వ్యూహాత్మకంగా తీసుకొస్తున్నాయి. 

119 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలున్న తెలంగాణ ప్రాంతంలో అధికారిక లెక్కల ప్రకారం 50.07 శాతం మంది బిసిలు, 15.8 శాతం మంది ఎస్సీలు, 8.9 శాతం మంది ఎస్టీలు, 12.4 శాతం మంది ముస్లిం మైనారిటీలు, 12.87 శాతం మంది మాత్రమే అగ్రవర్ణ కులాలవారున్నారు. ఈ ఎన్నికల్లో బిసిలు నిర్ణాయక శక్తిగా ఉన్నప్పటికీ టిఆర్‌ఎస్‌ పార్టీ 12.87 శాతం ఉన్న ఓసిలకి ఏపార్టీ కేటాయించని విధంగా అత్యధికంగా 47 శాతం సీట్లు (56) కేటాయించింది. బిసిలని 23 శాతం సీట్ల (26)కే పరిమితం చేసింది. 12.4 శాతమున్న ముస్లిం మైనారిటీలకు కేవలం 3.36 శాతం సీట్లు (4) కేటాయించి సమన్యాయాన్ని గాలికి వదిలేసింది. అదే విధంగా 15.8 శాతం జనాభా ఉన్న ఎస్సీలకు 10.9 శాతం సీట్లు మాత్రమే కల్పించి- బడుగు, బలహీన వర్గ ప్రజల పట్ల తమ వివక్షను చాటుకుంది. 

మొదటినుండీ బిసిని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చిన టిడిపి సీట్ల కేటాయింపులో సామాజిక నమన్యాయాన్ని పాటించిందనే చెప్పాలి. జనాభా దామాషా ప్రకారం ఓసిలకు రెట్టింపు టిక్కెట్లు కేటాయించినా, 37.5 శాతం సీట్లు బిసిలకే వెచ్చించి చిత్తశుద్ధిని చాటుకుంది. అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ కూడా 37 శాతం టిక్కెట్లను బిసిలకు కేటాయించడం చెప్పుకోదగ్గ అంశం. లెక్క ప్రకారం ప్రతి పార్టీ ఓసిలకు 12 నుండి 15 అసెంబ్లీ స్థానాలను మాత్రమే కేటాయించాలి. కానీ టిఆర్‌ఎస్‌ పార్టీ 56, కాంగ్రెస్‌ 41 స్థానాలు కేటాయించగా- టిడిపి మాత్రం 25 స్థానాలకు మించి ఇవ్వకపోవటం గమనార్హం. కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీల పట్ల వివక్షను విడనాడలేదు. 12.4 శాతం ఉన్న ముస్లిం మైనారిటీలకు 4.5 శాతం టిక్కెట్లు (5) కేటాయించింది. టిడిపితో పొత్తుపెట్టుకున్న బిజెపి సైతం తమకు దక్కిన 47 అసెంబ్లీ స్థానాల్లో 26 శాతం (12) టిక్కెట్లను బిసిలకు కేటాయించడం విశేషం. తెలంగాణలో ఓసి యేతర శక్తుల వాటా 89.3 శాతం కాగా, వారికి ఈ ఎన్నికలలో సామాజిక న్యాయ వాటా 45.2 శాతం మాత్రమే. 
13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులను బరిలో నిలిపిన వైఎస్సార్‌సిపి సైతం 7 స్థానాలకు ఏకంగా రెడ్డి సామాజిక వర్గీయులకే కట్టబెట్టి, మొత్తం 70 శాతం టిక్కెట్‌లను ఓసిలకే కేటాయించింది. సామాజిక తెలంగాణ ధ్యేయమని చెప్పుకునే పార్టీల చిత్తశుద్ధి ఇదేనా? 

తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిల్చిన యువతకి అన్నీ పార్టీలు తీరని ద్రోహం చేశాయి. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను టిడిపి, బిజెపి కూటమి- ఓసి యేతరలకు 52 శాతం సీట్లు, కాంగ్రెస్‌ 53 శాతం సీట్లు, టిఆర్‌ఎస్‌ 44 శాతం సీట్లు కేటాయించాయి. వీటిలో కేవలం 10 శాతం సీట్లు కూడా అమరవీరుల తరఫున కృతజ్ఞతగా యువలోకానికి ఏ పార్టీ కల్పించకపోవడం దారుణమైన అంశం. అధికార కాంగ్రెస్‌ పార్టీని మినహాయిస్తే టిఆర్‌ఎస్‌, బిజెపి- టిడిపి కూటమి ఎస్సీ, ఎస్టీ, బిసిలకు సీట్ల కేటాయింపులో సముచితన్యాయం చేశాయనే చెప్పాలి. ఇక వైఎస్సార్‌సిపి విషయానికొస్తే 70శ ాతం సీట్లు ఓసిలకే కట్టబెట్టింది. సామాజిక తెలంగాణ కోరుకునే ప్రతిఒక్కరూ ఏ పార్టీ ఓసియేతరలకు పెద్దపీఠ వేసిందో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. 

ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా మారిన 89.3శాతం ఓసియేతర శక్తులకు టిడిపి కూటమి అత్యధికంగా 52 శాతం సీట్లు కేటాయించింది. ముఖ్యమంత్రిని కూడా బిసినే చేస్తామని టిడిపి ప్రకటించింది. దళిత వ్యక్తిని సిఎం చేస్తానని తొలుత ప్రకటించి ఆ తర్వాత మాట మరచిన టిఆర్‌ఎస్‌ అధినేత ఏ మేరకు సామాజిక తెలంగాణను తెస్తారో ప్రజలు అర్ధంచేసుకోవాలి. టిడిపి కూటమితో సమానంగా బిసిలకు అసెంబ్లీ సీట్లను కేటాయించిన కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు, సీట్లు కోసం తప్ప, తెలంగాణ ప్రజలపై ప్రేమతో రాష్ట్రాన్ని విభజించలేదనేది కూడా బడుగు, బలహీన వర్గ ఓటర్లు తెలుసుకోవాలి. తెలంగాణ ఆవిర్భావానంతరం జరుగుతున్న తొలి ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో బిసిలకు అన్యాయం చేసిన పార్టీలేవో ప్రజలు గమనించాలి. సంపూర్ణ సామాజిక తెలంగాణ ఏ పార్టీతో సాధ్యమో గుర్తెరగాలి. 29వ రాష్ర్టం భవిష్యత్తు- తెలంగాణలో ఉన్న 89 శాతం బడుగు, బలహీన వర్గ ప్రజలు తీసుకున్న నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. దొరల పాలనకు చరమగీతం పాడాలంటే ఓసియేతర శక్తులు సంఘటితం కావలసిఉంది. అప్పుడే సామాజిక తెలంగాణ, తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమనే వాస్తవాన్ని గ్రహించాలి.

Surya Telugu News Paper Dated: 3/5/2014 

Wednesday, December 5, 2012

కులనిర్మూలన మార్గదర్శకుడు - పాపని నాగరాజు



అంబేద్కర్ గురించి మాట్లాడుకోవటమంటే కులవ్యవస్థ గురించి మాట్లాడుకోవడమే. కులవ్యవస్థలో అంతర్భాగమైన వర్ణవ్యవస్థ గురించి మాట్లాడుకోవడమే. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రత్యామ్నాయంగా కుల స్థిరీకరణ వాద వ్యతిరేక, కుల-వర్గ వ్యవస్థల నిర్మూలన గురించి మాట్లాడుకోవడమే. ఈ దేశంలోని కులవాదులు, వర్గవాదులు అంబేద్కర్‌ను ఈ దృష్టితో చూడకపోవడంతో బ్రాహ్మణీయ అగ్రకుల పాలకవర్గాలు రాయితీలు, రాజ్యాధికారానికే(ఎంపీ, ఎమ్మెల్యే) పరిమితం చేసి నిజమైన కుల అణిచివేత, వివక్షత, విభజన వ్యతిరేక స్వయం గౌరవం, సామాజిక న్యాయాన్ని (ఎవరెంతో - వారికంతా!, మీది మీకు - మాది మాకు!) కాలగర్భంలో కలిపి వారి అధికారాన్ని, కుల స్థిరీకరణను సుస్థిరం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏక కులపోరాట వాదులు, ఏక వర్గపోరాట వాదులు వైఫల్యం చెందడమే. కనుక కులవ్యవస్థ వ్యతిరేక పోరాటాల్ని వర్గవ్యవస్థ వ్యతిరేక పోరాటంతో సమన్వయం చేసుకొని ఈ దేశ సామాజిక విప్లవాన్ని నిర్మించే పాత్రను తీసుకోవాల్సిన బాధ్యత నిజమైన అంబేద్కర్, మార్క్స్ వాదులది.

అంబేద్కర్‌ను, తను పుట్టిన శూద్రవర్ణంలోని మెజార్టీ ప్రజల్ని ఈ దేశంలోని వర్ణ-కుల వ్యవస్థ మనుషులుగా చూడ నిరాకరించి అణచివేసి, వివక్ష చూపి అమానవీయంగా దోపిడీ చేసింది. అందుకే అంబేద్కర్ కులవ్యవస్థ వ్యతిరేకతను కలిగి, ఆచరణ ద్వారా దాని నిర్మూలనకు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దృష్టితోనే ఎన్నికష్టాలెదురైనా విద్యను మానలేదు. ప్రపంచ చరిత్రను, మానవ సమాజ పరిణామక్రమాన్ని, సామాజిక, రాజకీయ, ఆర్థిక శాస్త్రాల్ని, బ్రాహ్మణవాద శాస్త్రాల్ని అధ్యయనం చేశారు. ఈ చరిత్ర అవలోకనం చేసుకోవడంతోనే సింధు ప్రాంతంలో ఆర్యులు దండయాత్ర చేసి వర్ణ-కుల వ్యవస్థల్ని ఎలా నిర్మించారో అధ్యయనం చేశారు. అందుకే ప్రపంచ మేధావులు ఐదుగురిలో ఒకరుగా అంబేద్కర్ పేరొందారు.

కుల వ్యవస్థ వ్యతిరేక పోరాటంలో భాగంగా అంబేద్కర్ పలు పోరాటాలు చేశారు. 1928లో సా«ధారణ నియోజకవర్గాలతో పాటు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని, అస్పృశ్యులకు వయోజన ఓటు హక్కు కావాలని కింది కులాల పక్షాన పోరాడారు. 1938 ఫిబ్రవరిలో రైల్వే కార్మికుల సభలో పాల్గొని 'బ్రాహ్మణిజం-క్యాపిటలిజం' ఈ రెండూ ఇండియా ప్రజలకు ప్రధాన శత్రువులని ప్రకటించారు. మౌలిక పరిశ్రమలు, భూమి తదితరాలు జాతీయం చేయాలంటూ ప్రకటించారు. 1949లో న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు హిందూకోడ్ బిల్లు(స్త్రీలకు జీవించే హక్కు, స్వేచ్ఛ కావాలని)ను ప్రవేశపెట్టారు. బ్రాహ్మణులైన ఆర్ఎస్ఎస్ వాది స్వామికర్ పతీజీ మహారాజ్, బాబు రాజేంద్ర ప్రసాద్, రాంనారాయణ సింగ్‌ల వ్యతిరేక ఉద్యమ ప్రభావంతో నెహ్రూ ఆ సాకును చూపి బిల్లును అడ్డుకున్నారు. దీనిని నిరసిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు చిన్న రాష్ట్రాల్ని ఏర్పాటు వల్ల పీడిత కులాలు అధికారంలోకొస్తారని, పరిపాలనకు సౌలభ్యముంటుందని చిన్న రాష్ట్రాల ఏర్పాటును బలపర్చారు.

బ్రాహ్మణిజం సృష్టించిన దేవుళ్లను, వేదాల్ని, పురాణాల్ని, పుట్టుపూర్వోత్తరాల్ని తన రచనల ద్వారా బయటపెట్టి సమాజాన్ని మేల్కొలిపారు. గాంధీ, కాంగ్రెస్‌లు హిందూ మత - కుల రక్షణను చేపట్టి శూద్రాతిశూద్ర ప్రజల్ని ఆధునిక బానిసలుగా చేసేందుకే ఏర్పడ్డాయని అంబేద్కర్ నిరూపించారు. ఈ దృష్టితోనే 1927 డిసెంబర్ 25న మనుధర్మ శాస్త్రాన్ని దగ్ధం చేశారు. అందుకే ఆర్ఎస్ఎస్ వాదులు అంబేద్కర్‌ను హిందూ కులవ్యవస్థకు వ్యతిరేకిగా ప్రకటిస్తారు. మొత్తంగా అంబేద్కర్‌ను కేంద్రం చేసుకుని ఈ దేశ పీడిత ప్రజల నిర్మూలనకు బ్రాహ్మణీయ 'హిందూ' కులతత్వవాదులు విధ్వంసం చేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇండియాలో కులరహిత, వర్గరహిత సమతా రాజ్యాన్ని నిర్మించేందుకు ఇండియా విప్లవకారులు అంబేద్కర్ కుల నిర్మూలన కార్యక్రమాన్ని పరిశీలించి స్వీకరించడం అవసరం.

హిందూ మతం మూలవాసులైన శూద్రాతిశూద్రులను మనుషులుగా చూడలేదు కనుక కులవ్యవస్థకు ముఖద్వారమైన హిందూ మతాన్ని తిరస్కరించి బౌద్ధాన్ని స్వీకరించారు అంబేద్కర్. బౌద్ధం మూలవాసుల్ని మనుషులుగా గుర్తించడమే అందుకు కారణం. ఈ మతస్వీకరణే అంబేద్కర్ ఆలోచనా విధానానికి ఆటంకంగా మారి తే ఆ మత స్వీకరణను విమర్శనాత్మకంగా తిరస్కరించాలిందేగానీ ఆ పేరుతో అంబేద్కర్ ఆలోచనను స్వీకరించరాదనడం విచారకరం.

బ్రిటిష్ వలసవాదులు, వారి పరిపాలన ద్వారా అస్పృశ్యులైన దళిత బహుజన ఆదివాసీ గిరిజన, మత మైనార్టీ ప్రజలకు హక్కులు పొందడంతోనే బ్రాహ్మణీయ మార్క్సిస్టులు, విప్లవ మార్క్సిస్టులు అంబేద్కర్‌ను సామ్రాజ్యవాదుల ఏజెంట్‌గా చిత్రీకరిస్తున్నారు. ఇండియా అధికార మార్పిడి కాబోతున్న సమయంలో బ్రాహ్మణ పాలకులు ఈ ప్రజలకు ఏమీ అందివ్వబోరని, వారికన్నా బ్రిటిష్ వలసవాదులే బడుగుల హక్కుల్ని గుర్తిస్తారని వారితో పోరాడాడు. ఇదే అంబేద్కర్ చేసిన నేరమా? నేడు నక్సలైట్, ప్రజా ఉద్యమాలు ఈ ప్రభుత్వాలు ప్రజల్ని హత్యచేస్తున్నాయని గ్రహించి వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని అరెస్టు చేస్తే విడుదల చేయమని ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి విడుదల చేయిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వాన్ని తిరస్కరించే వారు ఇలా విడుదల చేయమని అడగడం ఎలా సరైందో అంబేద్కర్ బ్రిటిష్ వారిని కింది కులాల హక్కుల్ని అడగడమూ అలానే సరైంది. దీనిని సాకుగా చూపి బ్రాహ్మణత్వాన్ని తిరస్కరించలేని బ్రాహ్మణ మార్కిస్టులు, విప్లవ మార్కిస్టులు అంబేద్కర్‌ను బ్రిటిష్ వలసవాదుల ఏజెంట్‌గా చిత్రీకరించారు. ఇదే బ్రాహ్మణీయ మార్క్సిస్టు వాదం.

ఈ దృష్టితో అంబేద్కర్ సహాయాన్ని స్వీకరించిన వీరన్న కొంతమేరకు ప్రయోగం చేసి మార్గాన్ని చూపారు. కనుక కుల పోరాటమంటే కుల స్థిరీకరణ కాదు, వర్గ పోరాటాన్ని మోసుకెళ్లే విప్లవ పోరాటం. వర్గపోరాటాన్ని విజయవంతం చేసే పోరాటంగా కులపోరాటాల్ని ప్రత్యామ్నాయ దృష్టితో నిర్మించాల్సి ఉంది. అప్పుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి.

- పాపని నాగరాజు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సామాజిక తెలంగాణ మహాసభ
(నేడు డా.బి.ఆర్. అంబేద్కర్ 56వ వర్ధంతి)

Andhra Jyothi News Paper Dated: 6/12/2012

Tuesday, November 27, 2012

భారత ప్రప్రథమ సామాజికతత్వవేత్త-- Y K



phule
కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకుగురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసినమహనీయుడు మహాత్మ జోతిరావ్‌ గోవిందరావు ఫూలే. సామాజిక తత్వవేత్త, ఉద్యమకా రుడు, సంఘసేవకుడెైన ఫూలే మహారాష్టక్రు చెందినవా డు. ఆయన భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసంపోరాడా డు. మహారాష్టల్రోని పూణే జిల్లాలో ఖానవలి ప్రాంతంలో 1827 ఏప్రిల్‌ 11న జోతిరావ్‌ ఫూలే జన్మించాడు. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవాడు.కాలక్రమేణా పీష్వా పరిపాలనాకాలంలో పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు ఫూలే గా మార్పు చెందింది. జోతిరావ్‌కి సంవత్సరం వయస్సు రాకుండానే తల్లి తనువు చాలించింది.7 సంవత్సరాల వయస్సులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. తరువాత చదువు మానివేసి వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండేవాడు.

అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ ఫూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ. ప్రతిరోజూ నిద్రకుపక్రమించే ముందు లాంతరు వెలుతురులో చదువుకునే వాడు. జోతిరావ్‌కు చదువుపట్ల ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం టీచర్‌, ఇంటి ప్రక్కనేఉండే ఒక క్రైస్తవ పెద్దమనిషి జోతిరావ్‌ తండ్రిని ఒప్పించి ఆయన విద్యాభ్యాసం కొనసాగేలా చేశారు. ఆయన1841లో స్కాటిష్‌ మిషన్‌ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించాడు. సదాశివ భిల్లాల్‌ గోవింద్‌ అనే బ్రాహ్మణునితో ఫూలే పరిచయం జీవితకాల స్నేహంగా మారింది. చిన్నప్పుడే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపెై జ్ఞానాన్ని సంపాదించాడు ఫూలే .జోతిరావ్‌కు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజి, జార్జ్‌ వాషింగ్టన్‌ల జీవితచరిత్రలు ప్రభావితం చేయడంవల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి. థామస్‌ రచించిన ‘మానవ హక్కులు’ పుస్తకం అతని ఆలోచనలను ప్రభావితం చేసింది. 

అమెరికా స్వాతంత్య్రపోరాటం ఆయనను ప్రభావితం చేయడమే కాకుండా మానవత్వపు విలువలెైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచింపచేసింది. గులాంగిరి, పూణే సత్య సోధక సమాజ నివేదిక, తృతీయ రత్న, ఛత్రపతి శివాజీ, రాజ్‌భోంస్లే యాంఛ, విద్యాకాథాతిల్‌, బ్రాహ్మణ్‌ పంతోజి మొదలెైనవి మహాత్మ ఫూలే ముఖ్య రచనలు.13 ఏళ్ళ ప్రాయంలో జోతిరావ్‌కి 9 సంవత్సరాల సావిత్రితో వివాహం జరిగింది. విద్యాభ్యాసం పూర్తయినతర్వాత ఆయన తన కుటుంబవ్యాపారమైన పూలవ్యాపారం ప్రారంభించాడు.1848లో జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో ఫూలే, బిసి ‘మాలి’ కులానికి చెందిన వాడవడం వల్ల కులవివక్షకు గురయ్యాడు. ఆ క్షణం నుండి కుల వివక్షపెై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. కుల విధానంలో ఆయన బ్రాహ్మ ణులనువిమర్శించ డమే కాకుండా సమాజంలో వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వ పోవడానికి ఆయన అభ్యంతరం తెలిపాడు.

బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించవలసినదిగా సామాన్యుల్ని ప్రోత్సహించాడు.సమాజంలో సగభాగంగా ఉన్న స్ర్తీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించాడు. అందువల్ల స్ర్తీలు విద్యావంతులు కావాలని నమ్మాడు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపాడు. 1948 ఆగస్ట్‌లో బాలికలకు పాఠశాల స్థాపించాడు. ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడం, అస్పృస్యులకు కూడా బోధించవలసిరావడంతోఉపాధ్యాయులె వరూ ముందుకు రాలేదు. చివరకు జోతిరావ్‌ఫూలే తనభార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు. పాఠశాల నిర్వహణలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కొంతకాలం పాఠశాలను నిర్వహించలేక మూసివేశాడు. అయినా పట్టు వదలక తన మిత్రులెైన గోవింద్‌, వల్వేకర్‌ల సహాయంతో పాఠశాలను పునఃప్రారంభించాడు.క్రమంగా ఆదరణ పెరగడంతో 1851-52లో మరో రెండు పాఠశాలలు స్థాపించాడు. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని ఫూలే విమర్శించేవాడు.

ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి. ముసలివారికిచ్చి పెళ్ళి చేయడంవల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు. వీరు మళ్ళీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేదికాదు. అందువల్ల వితంతు పునర్వివాహాలను గురించి ఫూలే ప్రజల్లో చెైతన్యం తీసుకువచ్చాడు. స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించాడు. 1864లో గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించి, వితంతువులెైన గర్భిణీ స్ర్తీలకు అండగా నిలిచాడు. దేశంలోనే ఇటువంటి కేంద్రం స్థాపించడం ఇదే మొదటిసారి. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి ఫూలే దత్తత తీసుకున్నాడు.1873 సెప్టెంబర్‌ 24న సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించాడు. దేశంలోనే ఇది మొట్టమొదటిసంస్కరణోద్యమం. శూద్రులను బ్రాహ్మణ చెర నుండి కాపాడటమే ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సంస్థ సభ్యులు పురోహితుల అవసరం లేకుండానే దేవుణ్ణి పూజించేవారు. 

కుల, మత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పించేవారు. వేదాలను పవిత్రంగా భావించడాన్ని ఫూలే వ్యతిరేకించాడు. విగ్రహారాధనను ఖండించాడు.1891లో ప్రచురించిన సార్వజనిక్‌ ధర్మపుస్తక్‌ మత, సాంఘిక విషాయలపెై ఫూలే అభిప్రాయాలను తెలియచేస్తుంది. స్ర్తీ, పురుషుల మధ్య లింగవివక్షను ఫూలే విమర్శించాడు. సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించాడు. 1853లో వితంతు మహిళల అనాథ శిశువుల కోసం సేవాసదనం ప్రారంభించాడు. ఈతరహలో ఒక భారతీయ హిందువు ఒకసంస్థను ప్రారంభిం చడం అదే మొదటిసారి. 1968లో తన ఇంటి దగ్గరున్న స్నానాల తొట్టి వద్ద స్నానం చేసేందుకు అంటరాని వారికి కూడా అనుమతి ఇచ్చాడు. 1869లో ‘పౌరోహిత్యం యొక్క బండారం’ పుస్తక రచన చేశాడు. 1871 సత్యశోధక సమాజం తరపున ‘దీనబంధు’ వార పత్రిక ప్రారంభించాడు. 1880లో భారత ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ పితామహుడు లొఖాండేతో కలసి రెైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు. 1873లో ‘గులాంగిరి’ (బానిసత్వం) పుస్తకం ప్రచురించాడు. 

దీనిలో బ్రాహ్మణీయ అమానుష సూత్రాలను, శూద్రులు- అతి శూద్రులపెై బ్రాహ్మణీయుల క్రూర వెైఖరిని ఫూలే తులనాత్మకంగా పరిశీలించాడు. సహపంక్తి భోజనానికి సంసిద్ధత ప్రకటించాడు. 1883 కల్టివేటర్స్‌ విప్‌కార్డ్‌ (సేద్యగాడిపెై చెర్నకోల) పుస్తక రచన పూర్తిచేశాడు. ఏప్రిల్‌లో బొంబాయిలో జరిగిన ఒక సమావేశంలో పుస్తకాన్ని వినిపించాడు. 1885లో సత్యసారాంశం ప్రచురించాడు. ఇదే సయంలో ప్రచురితమైన తన హెచ్చరిక (వార్నింగ్‌) బుక్‌లెట్‌లో ప్రార్థనా సమాజం, బ్రహ్మసమాజం తదితర బ్రాహ్మణీయ సంస్థలమీద తీవ్ర విమర్శలు చేశాడు.1891లో ఫూలే రచించిన ‘సార్వజనిక్‌ సత్యధర్మ పుస్తకం’ ఆయన మరణాంతరం ప్రచురితమైంది. ఇందులో చాతుర్వర్ణ వ్యవస్థను దుయ్యబట్టాడు.మద్యపానాన్ని వ్యతిరేకించి,1888లో మున్సిపాలిటీ అధ్యక్షునికి మద్యం షాపులను మూసి వేయవలసిందిగా ఉత్తరం వ్రాశాడు. ఆయన వ్రాసిన 33 ఆర్టికల్స్‌ గల సార్వజనిక్‌ సత్యధర్మ పుస్తకంలో కుటుంబ సృష్టి నియమాల గురించి వివరిస్తూ ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా వ్యక్తీకరించాడు. 

ప్రతి ఒక్కరికి సమాన స్వేచ్ఛ హక్కును తీర్మానించాడు. 1879 చివర్లో ‘దీనబంధు’ వారపత్రికను ముంబయిలో స్థాపించాడు. దీనిలో రెైతులు, కార్మికుల సమస్యలు, బాధలు వివరించేవాడు. శెత్కర్యాచ అస్సోడ్‌ పుస్తకం సామాజిక ప్రాముఖ్యం గలది.భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్ర్తీయంగా రూపొందించిన తొలి దార్శ నికుడు ఫూలే. దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఆలోచనలరి, విశ్లేషణకి ‘గులాంగిరి’ అద్దం పడుతుంది. మనుషుల చుట్టూ బ్రాహ్మణులు చుట్టిన దాస్యపు సంకెళ్ళ నుండి వాళ్ళు విముక్తికావడం, తోటి శూద్రుల నిజపరిస్థితిని బహిర్గతం చేయడం, ఇవి ఏకాస్త విద్యనెైనా నేర్చిన శూద్రసహోదరుల కర్తవ్యాలు. ప్రతిగ్రామంలోనూ శూద్రులకు పాఠశాలలు కావాలి. కానీ వాటిలో బ్రాహ్మణ ఉపాధ్యాయులు మాత్రం వద్దన్నాడు.

దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాలలాంటి వాళ్ళు అని చెప్పాడు. మహాత్మాఫూలే ఆధునిక భారతదేశ సమాజంలో అందరికంటే గొప్ప శూద్రుడు. హిందూ సమాజంలో అగ్రకులాలవారి బానిసలుగా బతుకుతున్న కిందికులాల వారిలో తమ బానిసత్వంపట్ల ఆయన చెైతన్యం రగిలించారు. సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారత దేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మ ఫూలే తన గురువు అని డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ ప్రకటించారు. దక్షిణాఫ్రికా జాతీయోద్యమ నాయకుడు నెల్సన్‌ మండేలా భారతదేశ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆ మహనీయునికి సమర్పించాలని నిర్ణయించు కొన్న గౌరవ కానుక మహాత్మ ఫూలే రచించిన మహత్తర గ్రంథం ‘గులాంగిరి’. సమాజంలో వెనుకబడినవర్గాల ప్రజలు, మహిళల అభ్యున్నతికోసం చేసినకృషికి ఆయనకు ‘మహాత్మ’ బిరుదు ఇచ్చారు. దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మ ఫూలే 1890 నవంబరు 28న కన్నుమూశాడు. కుల వివక్షను ఎదిరించి బడుగు వర్గాల హక్కుల కోసం కృషి చేసిన మహానీయునిగా ఫూలే పేరు చరిత్రలో నిలిచిపోతుంది. 

yk
ఆ మహనీయ సామాజిక తత్వవేత్తకి నిజమైన నివాళి అర్పించడమంటే- ఫూలే రచనలను ప్రాథమిక విద్యా స్థాయినుండి విశ్వవిద్యాల యస్థాయివరకు పాఠ్యాంశాలుగాచేర్చాలి. విశ్వవిద్యా లయాల్లో మహాత్మ ఫూలే విద్యాపీఠాన్ని ఏర్పాటుచేయాలి. ఫూలే జయంతి, వర్ధంతు లనాడు (ఏప్రిల్‌ 11, నవంబరు 28) సెలవుదినాలుగా ప్రకటించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో, హాస్టళ్లల్లో మహాత్మఫూలే చిత్రపటాలను అలంకరించాలి.ప్రతి జిల్లాలో ఫూలే బిసిభవనాలను నిర్మించాలి. విగ్రహాలను ఆవిష్కరించాలి. బిసి రిజర్వే షన్లను జనాభా దామాషా ప్రకారం 50 శాతానికి పెంచాలి. చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. దేశ జనగణనలో బిసి కులాల లెక్కలు విడివిడిగా సేకరించాలి.సామాజిక న్యాయం, సామాజిక ప్రజాస్వామ్యాలను స్థాపించాలి.

నవంబర్‌ 28 జోతిరావ్‌ ఫూలే వర్ధంతి
Surya Telugu News Paper Dated: 28/11/2012

ఖండాంతరాల్లో కన్నతల్లి పాట (రసమయి బాలకిషన్) --Sampadakiyam



Rasamayee
పాట ఎంత గొప్పదీ! ఉద్యమాల్లో ఉరుమై ఉరిమింది పాట. పోరాటమొక్కలను నాటింది పాట. మనుషులకు మట్టిమీద ప్రేమను పుట్టించింది. మనసుల మధ్య మమతలవారధి కట్టింది. అణిచివేతకు గురైన మన సంస్కృతిని బతికించేందుకు సిద్ధపడ్డది. దేశదేశాలకు విస్తరించి, జైతెలంగాణ అనిపిస్తున్నది. దూరమైనా పేగుబంధం మాసిపోదని రుజువుచేస్తున్నది. నాలుగుకోట్లమంది కొట్లాటకు మద్దతు కూడగడుతున్నది. వికసించిన ఆకాంక్షలకు పల్లవై చరణమై, రాగమై, భాగమై ఉద్యమంలో ముందు నడుస్తూ, నడిపిస్తున్నది. ఆస్ట్రేలియా ఖండంలో కూడా తెలంగాణపాట బరిగీసి నిలబడ్డది. ఖండాలు దాటిన తెలంగాణ బిడ్డలు ఇయ్యాల పుట్టినగడ్డ కోసం మేము సైతం అంటున్నరు. పాలుమరువని పసిపిల్లల నుంచి పండు ముసలోల్ల దాకా ఒక్కటే మాట. తెలంగాణ సాధించాలె. మావోళ్ల బతుకులు బాగ్గావాలె. మాది మాకు దక్కాలె. పడుకున్నా, మేల్కున్నా మదిల రగులుతున్న ముచ్చట ఇదే. 

మలిదశ తెలంగాణ ఉద్యమం అందించిన స్ఫూర్తి ఇయ్యాల ఖండాలుదాటి ఖన్నుమని మార్మోగుతున్నది. అందుకే సద్ది తిన్న తావును తలువాలన్నది తెలంగాణ జీవన విధానంలోనుంచి పుట్టుకొచ్చిన నానుడి. వలసపోయినా...వలపోత దు:ఖాలను గురించి వాళ్లు రందిపడుతున్నరు. అందు కే దేశదేశాల్లో తెలంగాణ నినాదాలు హోరెత్తున్నయి. తెలంగాణ సంస్కృతికి హారతి పడుతున్నయి. తెలంగాణ పాటన్న, మాటన్న సంబురపడుతున్నయి ఆ గుండెలు. సద్దు ల బతుకమ్మైనా, సంబురాల దసరైనా, దేశంగాని దేశంలో తెలంగాణ సప్పుడు వినపడాల్సిందే. అమెరికా నుంచి సింగపూర్ దాకా మన బిడ్డలందరిదీ జైతెలంగాణే. ఇక్కడ తండ్లాటకు వాళ్లు తల్లడిల్లుతున్నరు. ఇక్కడి పాటకు వాళ్లు గొంతుకలుపుతున్నరు. ఇక్కడి బలిదానాలకు వాళ్లు కన్నీళ్లు పెడుతూ కుమిలిపోతున్నరు. దేశంగాని దేశంలో పిడికిలి బిగించి జైతెలంగాణ అంటూ గర్జిస్తున్నరు. కొట్లాట పదునెక్కుతున్న యాల్ల జన్మనిచ్చిన మట్టిమీద లేనందుకు వాళ్లంతా దిగులు మేఘాలవుతున్నరు. అందుకే మేము సైతమంటూ పరాయిదేశాల్లో తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నరు. తెలంగాణ తల్లికి పబ్బతిపడుతున్నరు.

అరవయేండ్ల దు:ఖానికి చరమగీతం పాడాలని కంకణం కట్టుకున్న వాళ్ల ప్రేమజూస్తే మన కండ్లు మనల్నే నమ్మలేకుండ చేస్తయి. దూరం ఎంతుం కన్నతల్లి మీద పాయిరముండా లె. అస్ట్రేలియాలో వెయ్యికుటుంబాలకు ఇపుడొక్కటే రక్తసంబంధం. అదే తెలంగాణ పేగుబం ధం. కులం లేదు, మతం లేదు. తెలంగాణోడైతే చాలు. అక్కున చేర్చుకొని అలాయి బలాయి ఇచ్చుడే. ఏ ఊరు, ఏ పల్లె. ఇన్ని దినాలు యాడున్నరని కలుపకబోయేతనం. తెలంగాణ ఈ యేడు వచ్చేనాట్న అని సొద ఎల్లబోసుకునుడే. వైట్‌హౌజ్ ముందైనా సిడ్నీ లోటస్ బిల్డింగ్ ఆవరణలోనైనా తెలంగాణ నినాదం పోటెత్తాల్సిందే. ఎక్కడిది ఈ సోయి. ఎందుకింత పాయి రం. వాళ్లంతా ఈ నేలతల్లి బిడ్డలు. అందుకే ఈ నేల విముక్తి కోసం జబ్బసరిచి కొట్లాడుతమంటున్నరు. సందర్భమేదైనా తెలంగాణ నేటివిటీ కనిపించాలె. తెలంగాణ పాట వినిపించాలె. ఈ మట్టిమీద మాయని మమకారం. పిల్లాజెల్లా అంతా కలిసి పరాయి దేశంలో రోడ్ల మీద ప్లకార్డులు పట్టి జైతెలంగాణ అంటూ నినదిస్తున్నరు.

తెలంగాణ బిడ్డలకంటే ముందే తిష్టేసి ఆటాలు, తానాల అసోసియేషన్‌లుగా కులసంఘాలు పెట్టుకున్న సీమాంవూధుల పెత్తనాలు. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పనట్టు లొల్లి. కుల్లం కుల్లం మన మాట, మాట్లాడుకోనికి లేదు. మన బాధ చెప్పుకోనికి లేదు. తెలుగు తల్లి, తెలుగు జాతి, సంకురాత్రి, అట్లతద్ది. మరి మన ముచ్చట ఏమైపోవాలి. మన బతుకేమైపోవాలె. ఇగ లాభం లేదు. మనకో సంఘం ముండాలె. మనోళ్లంతా కలుసుకోవాలె. పండుగలు పబ్బాలే కాదు, తెలంగాణ కోసం పోరాటం చెయ్యనీకి ఒక్కటి కావాలె. ఏదో ఒకటి చెయ్యాలె. 

ఇగ వెతుకు భూతద్దమేసి వెతుకు. తెలంగాణకెల్లి వచ్చినోళ్లందరిని కూడగట్టు. అట్లా ఒకటి కాదు రెండు కాదు. ఐదారేండ్లు గాలిచ్చి గాలిచ్చి జాతరల తప్పిపోయినోడు దొరికనట్టు ఒక్కక్కరే కలిసి, కట్టుకున్న కలలగూడు. చెట్టుకొకడు పుట్టకొకడైన తెలంగాణ బిడ్డల జాడలు తీసి గుండెల నిండా వేసుకున్న గుర్తులు. తెలుగు అసోసియేషన్‌లకు దీటుగా రూపుదిద్దుకున్న తెలంగాణ కొంగుబంగారాల కొలుపులు. అందరొక్కపక్క జేరినంకా మనూరోడు కలిసిండని సంబురం సద్దికుండైంది. సీమాంవూధులతో పరాయిదేశాల్ల మన పోటీ, సంఘాలు పెట్టుడువరకే ఆగలేదు. వాళ్ల సినిమాలు చూడమని ‘జైతెలంగాణ’లాంటి తెలంగాణ సినిమాలను పోటికి తెప్పించుకొని అక్కడి థియేటర్‌లల్ల ఆడిచ్చుకున్నరు.

ఆత్మగౌరవం కలిగిన తెలంగాణ బిడ్డలు ఇయ్యాల మరిం త ధిక్కారంతో గళమెత్తుతున్నరు. తెలుగు భాష పేరుతో అన్నదమ్ములమని నిండాముంచిన కుట్రల మీద అగ్గై మండుతున్నరు. సందర్భమేదైనా తెలంగాణ ఇగురం కనిపించాలె. మొన్న దీపావళికి సుత ఆస్ట్రేలియాలో తెలంగా ణ అస్తిత్వాన్ని నిలబెట్టిన్రు. తెలుగోళ్లంత ఒక్కటై పండుగ చేసిన్రు. ఆడ ప్రతియేడు చేస్తరట. ‘దివాలి ఉత్సవ్’ పేరుతో తెలుగోళ్లంత ఒక్కచోట కలుసుకొని ఆటపాటలతో గడుపుతరు. 

ఇగ ఈ యేడు అట్లా కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేసివూనట. అక్కడున్న తెలంగాణ బిడ్డలకు ఒక్కసారిగా మన పాట గుర్తుకొచ్చింది. ఈడ గూడ ఆంధ్రోళ్ళ ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ...’ వినుడేంది. ఎట్లనన్న జేసి మన తడాఖ సూపెట్టాలె. ఏం చెయ్యాలె. ఏదో ఒకటి చెయ్యాలె. ఒక్క రు కాదు, ఇద్దరు కాదు. తెలంగాణ బిడ్డ ల ఇండ్లల్ల ఇదే ముచ్చట ఇసారిచ్చుకొని ఒక నిర్ణయానికొచ్చి. మన కళాకారుల్నే పిలిపించాలె. తెలంగాణ ధూంధాం అంటేందో చూపెట్టాలె. తెలంగాణ పాట ఎట్లుంటదో వినిపించాలె. ఆస్ట్రేలియా గడ్డ మీద తెలంగాణ దరు వు వెూత వెూగాలె. అట్లా నేను ఆస్ట్రేలియాలో ఉన్న తెలంగాణ బిడ్డల ఆతిథ్యం అందుకునే అవకాశం దక్కింది. అక్కడ అడుగు పెట్టిన్నోలేదో మూడేండ్ల చిన్నపాప నా దగ్గరికొచ్చి ‘అంకుల్ మీరు తెలంగాణకోసం మల్ల టీవి లోపటికి ఎపుడుపోతరు’ అని అడిగింది.

అవ్వతోడు కండ్లకు నీళ్ళొచ్చినయి. పసిపిల్లలకు సుత తెలంగాణ మీద అంత ద్యాస ఉన్నదా అనిపించింది. అక్కడి మనుషులు, మానవసంబంధాలు, డిగ్నిటీ ఆఫ్ లేబర్, సింప్లిసిటీ చూస్తుంటే నాకైతే మనసుల మనసులేదు. మనకు వాళ్ళ కు ఎంత తేడా. హెలికాప్టర్‌ల పోయి విత్తనాలేసుడేంది. ఒక్కోరైతుకు వందల ఎకరాల భూమి ఉండుడేంది. డెవలప్ అయిన దేశం ల సర్కారు కూడ ఎవుసానికే పెద్దపీ అని నాలోపట నాకే ఎన్నో ప్రశ్నలు. కానీ, అక్కడి తెలంగాణ బిడ్డలకు సుత ఎన్నో ప్రశ్నలు లేకపోలేదు. 

‘ఒక ప్రాంత విముక్తి కోసం మనుషులు తమ కు తాము ప్రాణాలు తీసుకునుడేంది? మనుషులు సచ్చిపోతున్నా పాలకుల గుండెపూందుకు కరుగుతలేవు?ఇంకెంత కాలం ఇట్లా దోచుకొని ఏలుతరట? చార్మినార్ కాడ కుక్కలను పట్టించుకున్న సినీయాక్టర్...మనుషులు సచ్చిపోతున్నా సపుడెందుకు చేస్తలేదు?పోరాడెటోళ్లు కలిసికట్టుగ ఎందుకుంటలేరు? అవకాశవాదులై పార్టీపూందుకు మారుతున్నరు? తెలంగాణ ఇంకా రాకుంటా వెూకాలడ్డుపెడుతున్నదెవరు? ఇంకెపుడొస్తది తెలంగాణ?’’ ఇట్లా మెల్‌బోర్న్, సిడ్నీ, కాన్‌బెపూరాల పొడుగూత ఉన్న తెలంగాణ బిడ్డల మనుసులల్ల ఈ ప్రశ్నలు మెదుల్తనే ఉన్నయి. నన్నుగూడ అడుగనే అడిగిన్రు. సవాలక్ష ప్రశ్నలు. కడుపు రగిలిపోయే నిప్పు కణికలు. పరాయి దేశాల్లో ఉన్నా ఇంతగనం ఆలోచిస్తున్న తీరుకు ఇక్కడినుంచి పోయినోళ్లకు ఎవలకైనా మనసంతా బేజారైతది. 

తెలంగాణ పదిజిల్లాల నుంచి అక్కడికిపోయినోళ్లు అక్కడ్నే స్థిరపడ్డరు. అయినా వాళ్ల మనాది మాత్రం తెలంగాణ గురించే కొట్టుకుంటున్నది. అయినా వాళ్ల కొలువుల బిజీకి వాళ్ల సంసారాల నే పట్టించుకునే టైం లేదు. శనివా రం, ఆదివారం తప్ప ఇంటిపట్టున ఉండేదే లేదు. అసొంటోళ్లు తెలంగాణ గురించి పట్టించుకుంటున్న తీరుకు నాకైతే సంబురమైంది. ఉద్యమం ఎంత గొప్పది. ఎన్నిగీతల్ని చెరిపి ఎంతమందిని ఇట్లా కలిపిందోనని మనసుల్నే ఉద్యమానికి దండం పెట్టిన. తెలంగాణ తల్లి గొప్పతనం ఇదీ అనిపించింది. పాడెటందుకు నేను ఉన్నా. కానీ, కోరస్ పాడెటో ళ్లు లేరుకదా అనుకున్న. కానీ, తెలంగాడ ఆడబిడ్డలు ‘అన్న మేమున్నం, నీకెందుకు బాధ’న్నరు. మన ఆడబిడ్డలకు బతుకమ్మపాటలో, పెండ్లిపాటలో తెల్వకుంట ఉంటదా. ఎన్నడో చిన్ననాడు పాడుకున్నయి. ఇన్నయి. ఇపుడు అర్జంటుగా అవసరమొచ్చినయి. గొంతువిప్పాలె. పాట నేర్వాలే.

ఆంధ్రోళ్లకు మన తడాఖ చూపెట్టాలె. చలో కంప్యూటర్ తెరువు. తెలంగాణ పాటలు వెతుకు. టెక్నాలజీ ఎవడబ్బ సొత్తు. తెలంగాణ పాట కోసం టెక్నాలజీ కూడా క్యూకట్టాలె. పాటకు హారతిపట్టాలె. యూట్యూబ్‌లల్ల గుట్టలోలే ఉన్న పాటలల్ల మంచి మంచియి ఏరుకోని, ఎదురుకోని, వినుకుంట రాసుకోని, రాసినయి వినుకుంట మళ్ల పాడుకోని, నేర్వాలే. తెలంగాణ బిడ్డలతో మాట్లాడినట్టు. తెలంగాణ బతుకుపాటలో లీనం కావాలె. అట్లా ఆడబిడ్డలు కోరస్‌కు సిద్ధమైన్రు. అది కూడా ఎన్నో కష్టాలను భరించుకుంట. ఒకపక్క వాళ్ల నౌకర్లు చేసుకుంటునే వారంరోజుల పాటు రోజు సాయంత్రం 5గంటల నుంచి రాత్రి పదిగొట్టెదాకా తెలంగాణ పాటలు ప్రాక్టీ స్ చేసిన్రు. వాళ్లెందుకీ తిప్పలు. వాళ్ల బతుకు వాళ్లు బతుకచ్చు కదా అనిపిస్త ది. 

కానీ, వాళ్లు తెలంగాణ మట్టి బిడ్డలు. జబ్బసరిచిన కొట్లాటను చూసి, మేము కూడా తెలంగాణ బిడ్డలమే అని నిరూపించిన్రు. పాడడానికి ఓకే కానీ, మరి పాటకు అనుగుణంగా దరువు లేకుంటే ఎట్ల. నా తండ్లాట చూసి ఆస్ట్రేలియల ఉన్న తెలంగాణ బిడ్డలు దానికీ ఓ పరిష్కారం ఆలోచించిన్రు. పక్కరాష్ట్రంల చర్చిలో డోలక్ వాయించే కళాకారునితో మాట్లాడి ఫ్లైట్ టిక్కెట్ రానుబోను కొనిచ్చి, ఓ కొత్త డోలక్ కొని తెలంగాణ పాటకు హుషారు తెచ్చిన్రు. కళాకారులను కల్యామాకుప్లూక్క సూశే ఇక్కడి రాజకీయ నాయకులకు కూడా, అంతటి సోయుంటే మా కళాకారులందరు మరింత లగాంచి పాడుదురేవెూ.

వారం రోజులు ప్రాక్టీసు జరిగే చోటనే కాదు, వాళ్ల ఇండ్లల్ల, ఆఫీసులల్ల పాటలు పిల్లకాలువలై పారినై. లయలో పాడాలని గొంతులు సవరించి న్రు అక్కచెప్లూండ్లు. పుట్టినగడ్డ మీద ప్రేమే లేకుంటే ఎట్లా సాధ్యమైతది. తెలంగాణ పల్లెమీద, ఇక్కడి మనుషుల మీద ఉన్న మమకారానికి నిదర్శనమనిపించింది. పట్టుపట్టి పాటలు నేర్చుకున్నరు. ఎన్నోవందలమంది కళాకారులను చూసి వేలాది సభల్లో గొంతెత్తిన ఇన్నేండ్ల నా సాంస్కృతిక జీవితంలో ఇదో కొత్త అనుభవం. తెలంగాణ పౌరుషాన్ని, పాటలో జతకలిపి తెలుగోళ్లందరికి చూపించాలని పంతం పట్టిన సమయం ఇది. మనదికాని నేల మీద సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, రకరకాల చిన్నా, పెద్ద కొలువు లు జేసె తెలంగాణబిడ్డలు తెలంగాణ పాటకు పట్టం కట్టిన సందర్భం.

సీమాంవూధ పాలనలో మన యాస బోయింది, బాసపోయింది. పండుగలు, పబ్బాలు కళతప్పినై. కానీ పరాయి దేశాల్లో ఉన్న, ఏ తెలంగాణ బిడ్డకైనా తెలంగాణ పేరువినపడితే మనసు పులకరిస్తున్నది. అందుకే మన పండుగ లు, మన వంటలు చేసుకోని జన్మనిచ్చిన తావును యాదిచేసుకుంటున్నరు. ఆస్ట్రేలియాలో ధూంధాం నాడు తెలంగాణ వంటకాలు కొలువుదీరినయి. ఒక్కరే అన్ని వంటలు చేసుడు కుదురదని ఒకరు గుడా లు చేస్తే, ఇంకొకరు బచ్చాలు, ఒకరు బగారేసుకొత్తే, ఇంకొకరు పచ్చిపలుసు చేసుకొచ్చిన్రు. మక్కగ్యాలు, మలీదముద్దలే కాదు, సర్వపిండి కాంచి సర్వం చేసిన్రు. టైం సరిపోదని ఒక్కో ఇంటికెల్లి ఒక్కో తెలంగాణ వంటకం బోనం బైలెల్లినట్టే బైలెల్లినై. కలిసి తినడానికి, కష్టసుఖం మాట్లాడుకోవడానికి ధూంధాం తెలంగాణోళ్లందరిని ఒక్కచోట చేర్చింది. 

నామూషి లేదు, నారాజయ్యేది లేదు. పనికి విలువిచ్చే దేశంల ఇన్సల్ట్ అనే మాటకు జాగేలేదనపించింది. లేకుంటే మున్సిపాలిటీ చెత్త తీసుకపోయెటోన్ని ఎంపీగా ఎన్నుకున్నరంటే నమ్మగలమా? పక్కింటి కుక్కకు తిండిపెడతలేరని కంప్లయింట్ చేసెటోల్లను ఎక్కడన్నా చూడగలమా? అంతేకాదు, చారివూతక కట్టడం ఏదైనా...మన రోడ్ల మీద కట్టే చిన్న మైసమ్మ గుడి అంతదయినా సరే, దాన్ని కాపాడుకునే తీరు ఎక్కడన్నా చూడగలమా. ఆడున్నట్టు ఈడ కూడా ఉంటే మన కోటిలింగాల, రామప్ప అసొంటియి ఆగమెందుకైతయి. ఎన్ని ప్రశ్నలో ఆ దేశాన్ని చూసినంక. 
ఆరున్నర దశాబ్దాల సీమాంధ్ర పాలనలో తెలంగాణ పల్లె పడావుబడ్డది. ఇయ్యాల పండుగలు, పబ్బాలకు ఒకనాడున్న ఆనందం లేదు. సంబురం లేదు. కానీ, ఆస్ట్రేలియా మనోళ్లను చూసినంక, వాళ్లు తినేతిండిలో కూడా తెలంగాణను యాజ్జేసుకుంటున్న తీరుకు ఆశ్చర్యం కలిగింది. 

బహుశా వాళ్లు అక్కడే స్థిరపడడం ఒక కారణమైతే, తెలంగాణ సంస్కృతికి జరిగిన నష్టమేందో తెలిసిన తనం కూడా మరో కార ణం. అందుకే బయటిదేశంలో బతుకుతున్నా, అవ్వల్దర్జా ఉద్యోగాలు చేస్తున్నా తెలంగాణ నేలను మరువద్దునే సోయి వాళ్లల్లో బలంగా నాటుకపోయింది. సంస్కృతిని రక్షించుకోవాలని మాటలు చెప్పుడుకాదు, ఆచరించి చూపించాలె అని ఒకలకొకలు చెపుకోకుండనే అనుకున్నట్టుగా మెదిలిన్రు. తెలంగాణ పల్లెను గుర్తుకు తెచ్చిన్రు. తెలంగాణ మట్టిపరిమళాన్ని సజీవంగా వెూసుతిరుగుతున్న రు. సాటి తెలుగోళ్లకు రుచిచూపిస్తున్నరు. తెలంగాణ డిమాండ్ ఎంత న్యాయమైందో వివరించి, చర్చించి, తర్కించి చెప్తున్నరు. అందుకే ఏ ప్రాంత ఏ దేశపోడైనా ఇయాల తెలంగాణ ఉద్యమాన్ని కాదనలేకుండ ఉన్నరు. అరుదైన ఈ కలయిక కోసం వెయ్యిమంది తెలంగాణ బిడ్డలు ఒక్కచోట చేరిన్రు. వాళ్లందరికీ సరిపడ తెలంగాణ వంటకాలు తయారు చేసివూనంటే, వాళ్లకు ఈ మట్టిమీద ఎంత ప్రేమున్నదో అర్థం చేసుకోవచ్చు.

ఒక్కచోట చేరిన తెలంగాణ బిడ్డల మధ్య, తెలంగాణ బువ్వ తింటుంటే ఎంత దిల్‌కుష్ అయ్యిందో. కాస్ట్‌లీ దేశం. ఖరీదైన డాలర్ల రాజ్యం. ఈడ మన తిండే దొరుకుతదనుకున్న. కానీ, వెయ్యిమందికి తెలంగాణ రుచులనే పంచివూనంటే ‘ఆవూస్టేలియా తెలంగాణ ఫోరమ్’కి ఉన్న శక్తియేందో, తెలంగాణ మట్టిపట్ల ఎంత అభిమానం గూడుకట్టుకొని ఉందో తెలిసింది. మన ఊళ్లల్ల దసరా చేసుకున్నట్టు, సంబురంగా హోలీ ఆడినట్టు అంద రి ముఖాల్లో ఒక సంతోషం. ఆనందం. కాటగలిసినోడు దొరికినట్టు. తింటున్నంత సేపు తెలంగాణ ముచ్చట్లే. మన ఊళ్లల్ల ఎట్లుండె ఎనుకట. అంతమారిపాయె. ఆంధ్రోళ్లొచ్చి ఆగం చేసిపాయె. తలుచుకొని, తల్లడిల్లి, ఓదార్చుకొని, ఎన్ని ముచ్చట్లో అన్ని గుంపులల్ల. 

తెలంగాణ పాటకున్న దమ్ము చూపెట్టే టైం రానే ఒచ్చింది. దివాలి ఉత్సవ్ సందర్భంగా రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ మధ్య తెలంగాణ పాటకు సీమాంవూధులు ఇచ్చిన ఛాన్స్ ఐదునిమిషాలు. ఈ ఐదునిమిషాల కోసమా ఇంతదూరమొచ్చింది. నా సంగతిపోనీ. వారం రోజుల సంది ప్రాక్టీసులు చేస్తే ఐదునిమిషాలేనా. అయినా ఏం కాదు. ఒక్క తెలంగాణ పాట చాలదా సీమాంవూధుల గుండెలు గుబెల్లు మనడానికి. ‘ఎనుకముందు చూసుడేంది రాజన్న ఒరె రాజన్న ఎత్తుర తెలంగాణ జెండా...’పాట ఆస్ట్రేలియా ఆకాశాన్ని తాకింది. గూడా అంజన్నకు జై. హాల్ హాలంతా సీట్లల్ల కూసుంటే పాపం. 

ఆంధ్రోళ్లు కూడా ఎగురందుకు, గొంతు కలుపందుకు. అట్లా ఫట్టఫట్ట పాట మార్చి పాట అందుకొనుడు నా వంతైతే, జై తెలంగాణ అని నినదించుడు కిందున్నోళ్ల వంతైంది. పాటకు తోడు నాలుగు ముచ్చట్లు చెప్పాలె. ఇంతమంది తెలంగాణ కోసం అల్లాడుతున్నరంటే అది నా గొప్పతనం కాదు. తెలంగాణ ఉద్యమ గొప్పతనం. మీరు నాకిచ్చిన ఈ అవకాశం నాకేకాదు, తెలంగాణ మాటను, పాటను వెూసుకుంటొచ్చే ఎవ్వలకైనా ఇట్లనే ఆతిథ్యమిస్తరని తెలుసునాకు.. నాగుండెల నుండి మనస్ఫూర్తిగా వచ్చిన నాలుగుమాటలవి. 

వాళ్లకు నా మీదనో, నా పాడుడు మీదనో కాదు. వాళ్లకు తెలంగాణ ఉద్యమం మీద ప్రేమ. లేకుంటే తెలంగాణ వ్యతిరేకైనా నల్లగొండ నకిరేకల్ సీపీఎం నాయకుని అల్లుడు, సీమాంవూధుడే అయినా తెలంగాణ కోసం ఎందుకు నిలబడుతడు. తెలంగాణ రావాలని ఎందుకు కోరుకుంటడు. తెలంగాణోల్లతో కలిసి జై తెలంగాణ అని ఎట్లా అంటడు. కాలికి బలపం కట్టుకొని తిరిగి ధూంధాం ప్రోగ్రాం ఎట్లా పెట్టిస్తడు. దేశం దాటినంకా బయటినుంచి చూస్తే న్యాయాన్యాయాలు తేలిపోయినై. తెలిసొచ్చినై. ఏమైతేనేం మామ చెయ్యలేని పనిని అల్లుడు ఖండాలకు ఆవల చేస్తున్నడు. ఆయన మంచి మనసుకు తెలంగాణ బిడ్డలందరి తరుపున దండాలు చెప్పిన. ఎనిమిదివందల మంది బలిదానాల తర్వాత కూడా, ఇక్కడున్న ఒక్క సీమాంవూధుని గుండైనా కరిగింది. 

ఆ బిడ్డల కోసం ఒక్క కన్నీ టి సుక్కైనా కార్చిన్రా. పదవులు, అధికారం కాపాడుకోవడానికి నిత్యం అధిష్టానాల చుట్టూ తిరుగుతూ అందరికందరూ తెలంగాణ ద్రోహం చేసే జాదూలే. పైగా ఒకరిమీద ఒకరు నిందలేసుకుంటూ జనానికి గంతలు కడుతూ నీతిమంతులమంటూ ఫోజులు కొట్టే యాక్టర్లే. ఇన్ని చేస్తూ పాదయావూతలని, పరామర్శలని ఎన్ని నక్కజిత్తుల ఏషాలో. తెలంగాణ మీద స్పష్టత ఇయ్యువూనంటే సీమగూండాలు తెలంగాణ బిడ్డల మీద దాడులుచేస్తున్న వైనం మన మనుసుల కెల్లి ఎట్లా చెరిగిపోతది. ఆస్ట్రేలియాలో ఉన్న జనాలకు తెలంగాణ ఉద్యమం గురించి చెప్తే ఆశ్చర్యపడ్డరు. ఒక ఉద్యమం కోసం మనుషులు నిలువునా తగులబడి పోవడం ఎక్కడైనా ఉందా అనడిగిన్రు. ఏం సమాధానం చెప్తం. ప్రపంచమంతా తెలుసుకున్నోళ్లు వాళ్లు. గొప్పగొప్ప సదువులు సదివినోళ్లు. వాళ్లకు అన్యాయమనిపిస్తున్నది. కానీ, ఇక్కడున్న ఏ నేతకు కూడా ఇసుమంతైనా బాధ్య త ఉన్నదా అనేది మనల్ని నిత్యం వెంటాడుతున్న ప్రశ్నే. 

దగాపడ్డ తెలంగాణ బతుకుపట్ల వాళ్లు నిండుమనసుతో ఆలోచిస్తున్నరు. ఈ బాధలు తీరాలే. ఈ రాత మారాలె. తెలంగాణ రావాలె. తెలంగాణ బతుకుల్లో పొద్దు పొడువాలె. స్టేజి మీద అమరవీరుల పాటపాడితే కన్నీరు పెట్టని కన్నులేదు. తెలంగాణ అమరవీరులకు జోహార్లు చెప్పని గొంతులేదు. పిడికిల్లు బిగుసుకున్నయి. అనుకున్నదానికంటే ఎక్కువ రెస్పాన్సే వచ్చింది. దివాలి ఉత్సవ్‌లో అన్ని ప్రోగ్రామ్స్ ఒకెత్తయితే, తెలంగాణ పాట మరో ఎత్తుగా నిలిచింది. తెలంగాణ బిడ్డల గుండెల్లో ఇదీ మా తడాఖ అని ఉంటే, సీమాంవూధుల నోట ‘పాటంటే తెలంగాణే’ అనేది అవ్యక్తంగా జాలువారిన మాట.


ఇల్లుకు దూరమైనోనికి ఇంటోల్లమీద పాణం కొట్టుకున్నట్టు ఆస్ట్రేలియా, సింగపూరే కాదు ఏ దేశంలో ఉన్నా వాళ్ల ధ్యాసంతా తెలంగాణలో రాజకీయ మార్పుల గురించే. ఎవ్వరు కొంచెం వైదొలిగినా, ఏం జరిగేనో, ఎటుమళ్ళేనో, ఉద్యమం మీద ఏ ప్రభావా న్ని చూపుతోందోనని వెయ్యికండ్లతో పహారా కాస్తున్నరు. ఢోకా చేసెటోళ్లను చూసి కలవరపడుతున్నరు. పార్టీలన్నీ తెలంగాణకుసై అంటూనే వాళ్లు బలపడడానికే పెద్దపీటవేస్తున్నరు. ఇలాంటి పెడధోరణులు ఉద్యమానికి నష్టం చేస్తయి. అరవయేండ్ల ఆశలు తీరాలంటే ఉద్యమం ఉధృతం గావాలె. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ నిలబడాలని, కాంగ్రెస్ మీద కలబడాలని, అట్లా తెలంగాణ సాధించాలని వాళ్లందరిలో ఒక ఆశ. 

ఉద్యమం మాటున స్వార్థ ప్రయోజనాలు చూసుకునే నాయకులంటే వాళ్లకు మంట. ఉద్యమాన్ని రాజేసి ఢిల్లీ మెడలు వంచాలె. అందుకోసం తెలంగాణ సమాజమంత ఒక్కటికావాలె. జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టా లె. ఊరువాడ కలిసిపోయి, పట్నం పల్లె పోరుబాట పట్టాలె. ఇందుకోసం ప్రతీఒక్క తెలంగాణ బిడ్డ ముందునడువాలె. అందరినీ కలిపి సమరానికి సై అనాలె. పార్టీలతో పాటు జేఏసీ కృషిజెయ్యా లె. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి రథసారధిగా ఉన్న కేసియార్‌లాంటి పెద్దలు అందరిని ఒక్కటి చేసి ఉద్యమపంథాలో కొత్త అధ్యాయాన్ని రచించాలె. తెలంగాణ సమాజాన్ని ఒక్కతాటిమీదికి తీసుకొచ్చిననాడు తెలంగాణను ఎవ్వరూ అడ్డుకోలేరన్నది అక్కడి మనసుల్లో మెదులుతున్న ఆలోచన. 

తెలంగాణను అడ్డుకోవడానికి సీమాంధ్ర పెట్టుబడిదారులంత ఒక్కటై, పార్టీలకు అతీతంగా నిలిచిన చరిత్ర మనకు తెలియందా. అన్యాయం చేయడానికి వాళ్లంత ఒక్కటై తెలంగాణను అడ్డుకుంటుంటే, మరి మనం న్యాయం కోసం కొట్లాడుతున్నోళ్లుగా మరింత లౌక్యంగా వ్యవహరించాలె గదా. తెలంగాణ పేరుతో ఇంకా రాజకీయాలు చేసే సీమాంధ్ర పార్టీలకు బుద్ధిచెప్పాలె గదా. అది ఎట్లా సాధ్యమైతదో మనసుపెట్టాలె. డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడని కేంద్రం కళ్లు తెరిపించాలె. గత అనుభవాలను సమీక్షించుకోని ఉద్యమాన్ని కొత్తగా నిర్మించాలె. ఆస్ట్రేలియాలో నన్ను మరింత ఆశ్చర్యపరిచిన విషయం...అమరులకు నివాళులు అర్పించిన కొవ్వత్తులను వేదిక మీది నుంచి తీసి, పిల్లల చేతికందించిన తల్లిదంవూడులు చెప్పిన మాట. ‘కొట్లాట ఇంకా ఒడువలేదు. ఇక మీరు కూడ మా పోరాట వారసత్వాన్ని అందుకోన్రి..’ అని క్రొవ్వత్తులను పిల్లల చేతిలో పెట్టిన్రు. పోరాటాన్ని వారసత్వంగా అందిస్తున్న ఆ బిడ్డల స్ఫూర్తి ఇవాళ తెలంగాణ ఉద్యమానికి కావాలి. అందుకోసమే వాళ్లు ఖండాతరాల్లో మన కన్నతల్లి పాటను గుండెలకు అద్దుకున్నరు. వాళ్లందరికీ పేరుపేరునా శరనార్థి...

ఆస్ట్రేలియాలో నన్ను మరింత ఆశ్చర్యపరిచిన విషయం...అమరులకు నివాళులు అర్పించిన క్రొవ్వత్తులను వేదిక మీది నుంచి తీసి, పిల్లల చేతికందించిన తల్లిదంవూడులు చెప్పిన మాట. ‘కొట్లాట ఇంకా ఒడువలేదు. ఇక మీరు కూడ మా పోరాట వారసత్వాన్ని అందుకోన్రి..’ అని కొవ్వత్తులను పిల్లల చేతిలో పెట్టిన్రు. పోరాటాన్ని వారసత్వంగా అందిస్తున్న ఆ బిడ్డల స్ఫూర్తి ఇవాళ తెలంగాణ ఉద్యమానికి కావాలి. అందుకోసమే వాళ్లు ఖండాతరాల్లో మన కన్నతల్లి పాటను గుండెలకు అద్దుకున్నరు. 

-రసమయి బాలకిషన్ 
ధూంధాం వ్యవస్థాపక అధ్యక్షులు , 944085920


Namasete Telangana Telugu News Paper Dated: 28/11/2012

Sampadakiyam 

సమన్యాయ సత్యశోధకుడు(మహాత్మ జ్యోతిరావు ఫూలే ) - పాపని నాగరాజు



విప్లవ ప్రతిబంధకమైన ఈ కుల వ్యవస్థ, వర్గ వ్యవస్థను తనలో అంతర్భాంగా ఇముడ్చుకుంది. కనుక ఈ దేశంలో కుల-వర్గ వ్యవస్థలు ఉన్నాయన్న సత్యాన్ని శోధించిన ఫూలే-అంబేద్కర్‌లను విమర్శించడం గుడ్డితనమే అవుతుంది. ఫూలే-అంబేద్కర్ అవగాహనతో నూతన ప్రత్యామ్నాయ సమన్యాయ పోరాటాల్ని నిర్మించడమే ఫూలేకి అర్పించే నిజమైన నివాళి. 

మహాత్మ జ్యోతిరావు ఫూలే ఈ దేశ ఆధునిక యుగ వైతాళికుడు, నిజమైన పునరుజ్జీవనోద్యమ పితామహుడు. ఫూలేను పునరుజ్జీవనోద్యమ పితామహుడిగా, ఆధునిక యుగ వైతాళికుడిగా మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందో ఆయన జీవిత చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది. భారతదేశంలోని శూద్రాతి శూద్రులు (దళిత బహుజన, ఆదివాసీ గిరిజన, ముస్లిం మైనార్టీలు) బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో బానిసలుగా ఉన్నారనీ, వీరు, అమెరికాలోని నల్లజాతి బానిసల్లాగా ఉన్నారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఫూలే. అందుకే బ్రాహ్మణీయ కుల వ్యవస్థలోని బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడడమొక్కటే మన ముందున్న ప్రథమ కర్తవ్యంగా ఫూలే ప్రకటించారు.

బడుగులు బానిసలుగా ఉండడానికి బ్రాహ్మణీయ దోపిడీ, అణచివేత, వివక్షలను అర్థం చేసుకోకపోవడం, అందుకు చదువు లేకపోవడమే మూలమని ఫూలే గ్రహించాడు. 1834-38 కాలంలో ఫూలే మరాఠీ పాఠశాలలో చేరి విద్యాభ్యాసం ప్రారంభించారు. శూద్రులు, అగ్రవర్ణాలకు సేవలు చేయాలేగానీ విద్య నేర్చుకోకూడదని బ్రాహ్మణులు ఆయన తండ్రి గోవిందరావును బెదిరించి ఫూలే చదువు(బడి) మాన్పిస్తారు. బ్రాహ్మణుల కుటిలోపాయాల్ని గ్రహించిన ఫూలే తన తండ్రి స్నేహితులైన ముస్లిం, క్రిస్టియన్ మతస్థులైన వారి ద్వారా లహుజీబువామాంగ్ వద్ద క్రిస్టియన్ మిషనరీ (ఇంగ్లీష్) పాఠశాలలో మళ్లీ విద్యాభ్యాసం ప్రారంభిస్తారు. బ్రాహ్మణ విద్యార్థుల కన్నా ప్రతిభావంతుడవుతాడు.

తరగతి గదిలో స్నేహం ఏర్పడ్డ ఓ బ్రాహ్మణ విద్యార్థి ఫూలేను తన వివాహానికి ఆహ్వానిస్తాడు. ఆ వివాహానికి హాజరైన ఫూలేను బ్రాహ్మణులు, మాలి కులస్తుడని తెలుసుకొని బ్రాహ్మణులతో పెళ్లిలో సమానంగా నడవడమా? అంటూ, శూద్రుడంటూ ఫూలే ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు. అలా అవమానించిన బ్రాహ్మణుల దోపిడీ, అణిచివేతల్ని బహిర్గతపర్చాలని కంకణం కట్టుకొని 1848లో ఫూణేలో మొట్టమొదటగా దళిత (అస్పృశ్యులకు) బాలికలకు పాఠశాల నెలకొల్పారు. ఆ తదనంతరం 1851లో మరో రెండు పాఠశాలల్ని నెలకొల్పారు. శ్రామిక ప్రజల కోసం 1855లో 'రాత్రి బడి'ని స్థాపించారు. ఇలా బ్రాహ్మణ వ్యతిరేకతతో శూద్ర వర్గంలోని అతిశూద్రులకు విద్యావ్యాప్తి చేయడంతో బెంబేలెత్తిన బ్రాహ్మణులు 1849లో ఫూలేను ఆయన తండ్రి చేత కుటుంబం నుంచి బహిష్కరింపజేస్తారు. అయినా కలత చెందక మొక్కవోని ధైర్యంతో, పట్టుదలతో మరింత ముందుకు పోతాడు. జీవిత భాగస్వామి సావిత్రీభాయి సహకారంతో బ్రాహ్మణ వ్యతిరేక సాంస్కృతిక పోరాటాల్ని నిర్మిస్తారు ఫూలే.

ఫూలే కేవలం శూద్ర వర్ణాల్లో అణిచివేతకు గురౌతున్న కులాల ప్రజల పక్షాన పోరాడటమే కాకుండా, అగ్రవర్ణ వితంతువుల పునర్వివాహానికి గొప్ప కృషి చేశారు. 1873లో 'గులంగిరి' 'సేద్యగాని చర్మకోల' అనే గ్రంథాల్ని రచించారు. 'దీనబంధు' అనే పత్రికను స్థాపించి పురోహితులు చేసే దోపిడీలపై భావజాల ప్రచారాన్ని మరింత ప్రచారం చేశారు. భావజాల ప్రచారాన్ని కార్యాచరణగా మార్చడానికి 1870లో 'సార్వజనిక్ సభ', 1873 సెప్టెంబర్ 24న 'సత్యశోధక సమాజం సంస్థ'ను స్థాపించారు. దీనికన్నా ముందు బ్రిటిష్ వలస వాదులకు '1882లో హంటర్ కమిషన్‌కు' శూద్రాతి శూద్రులకు చదువు చెప్పించాల్సిన అవసరం ఉందని నివేదికలిచ్చి, అస్పృశ్యుల కోసం బ్రిటిష్ వారితో పాఠశాలల్ని ఏర్పాటు చేయించారు. సామ్రాజ్యవాద కోణంలోనైతే ఇది మనకు వ్యతిరేకమైనది. భారతదేశంలో కులం కోణంలో చూస్తే అస్పృశ్యులు వేల సంవత్సరాలుగా విద్యకు, విజ్ఞానానికి దూరం చేయబడుతున్నారు కనుక కులం కోణంలో అనుకూలమైనది. 1873-75 సంవత్సరాలలో బ్రాహ్మణ పురోహితులు లేకుండా జున్నార్ పరిసర ప్రాంతాల్లో సుమారు 40 గ్రామాల్లో పెళ్ళిళ్లు నిర్వహించి, ప్రత్యామ్నాయ వివాహ సంస్కృతికి బీజం వేసారు.

బ్రాహ్మణీయ కుల వ్యవస్థ వ్యతిరేక కార్యక్రమాలే కాకుండా బ్రిటీష్ వలసవాదులకు వ్యతిరేకంగానూ, శూద్ర వర్గంలోని రైతాంగంపై బ్రాహ్మణ-వైశ్యు (బాట్‌జీ-షేట్‌జీ)ల వడ్డీ దోపిడీ, శ్రమ దోపిడీల రూపాల్ని, వారి బండారాన్ని బయటపెట్టారు. అంతేకాదు, తను ఏర్పాటు చేసిన సత్యశోధక సమాజ్ సంస్థ సారధ్యంలో తన సహచరుడు ఎన్.ఎమ్.లోఖండేతో బొంబాయి నూలు మిల్లులలోని శూద్రాతిశూద్ర కార్మికుల హక్కుల కోసం, 12 గంటల పనిదినం, ఆదివారం సెలవుకై ట్రేడ్ యూనియన్‌ను నెలకొల్పి పోరాటాలు చేశారు. ఫూలేకి కేవలం కుల వ్యవస్థ వ్యతిరేకతే కాదు, సామ్రాజ్యవాద వ్యతిరేకత, కార్మికవర్గ, రైతాంగ పక్షంగా పోరాడే అవగాహన, కార్యాచరణ ఉంది. ఫూలే-లోఖండే నిర్మించిన కార్మికవర్గ పోరాటాల్ని చరిత్ర పుటల్లో చేర్చకపోవడంలోనే బ్రాహ్మణీయ కుట్ర ఉంది.

బాట్‌జీ, సేట్‌జీల దోపిడీ, వివక్షలతో శూద్రవర్ణ ప్రజలు మనుషులుగా గుర్తించ నిరాకరిస్తున్న మూలంగా శూద్రులు వడ్డీకి అప్పులు తీసుకోవడం, మంగలి కులస్తులు క్షవరాలు చేయడం మానేస్తారు. అంతేకాదు ఫూలే ఒక అడుగు ముందుకేసి శూద్ర వర్ణాల ప్రజలకు పాలకులకన్నా బ్యూరోక్రాట్స్ ప్రమాదకారులని ప్రకటిస్తారు. ఇలా బ్రాహ్మణీయ వ్యవస్థపై స్పష్టంగా యుద్ధాన్ని చేయడంలో ఫూలేకు మరెవ్వరూ సాటిలేరు.

బ్రాహ్మణీయ కుల వ్యతిరేక పోరాట చారిత్రక అంశాల్ని పరిశీలించి స్వీకరించడంలో ఫూలే తీసుకున్న అవగాహనను భారతదేశ విప్లవ మార్క్సిస్టులు తీసుకోకపోవడం విచారకరం. పైగా విప్లవానికి అడ్డంకిగా మారుతుందని చిత్రీకరించడం విడ్డూరం. ఫూలే వారసులుగా పిలువబడేవారు బ్రాహ్మణీయ కుల వ్యవస్థ వ్యతిరేక, స్వయం గౌరవ సమన్యాయ పోరాట అవగాహనను వదిలి అగ్రకుల పాలకవర్గాలకు ఉపయోగపడే కులస్థిరీకరణకై బారులు తీరడం, బడుగు ప్రజల్ని ఆధునిక బానిసలుగా మార్చే ప్రయత్నం చేయడమే అవుతుంది. ఇది విచారకరం, ప్రమాదకరం కూడా. ఇది ఫూలే-అంబేద్కరిస్టుల అవగాహనకు విరుద్ధం.

విప్లవ ప్రతిబంధకమైన ఈ కుల వ్యవస్థ, వర్గ వ్యవస్థను తనలో అంతర్భాంగా ఇముడ్చుకుంది. కనుక ఈ దేశంలో కుల-వర్గ వ్యవస్థలు ఉన్నాయన్న సత్యాన్ని శోధించిన ఫూలే-అంబేద్కర్‌లను విమర్శించడం గుడ్డితనమే అవుతుంది. ఫూలే-అంబేద్కర్ అవగాహనతో నూతన ప్రత్యామ్నాయ సమన్యాయ పోరాటాల్ని నిర్మించడమే ఫూలేకి అర్పించే నిజమైన నివాళి.

- పాపని నాగరాజు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సామాజిక తెలంగాణ మహాసభ
(నేడు ఫూలే 122వ వర్థంతి)

Andhra Jyothi Telugu News Paper Dated: 28/11/2012

Wednesday, November 23, 2011

మంద కృష్ణతో బిసిలు కలవాలి - గోవిందు నరేష్ మాదిగ


గత రెండేళ్ళుగా అగ్రకులాల వారి నాయకత్వంలో నడిచిన భౌగోళిక తెలంగాణ ఉద్యమం సూత్రప్రాయంగా విఫలమయింది. అంబేద్కర్ సిద్ధాంతం పునాదిగా బిసి, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యానికి డిమాండ్ చేస్తోన్న సామాజిక తెలంగాణ వాదానికి సమాజంలో విస్తృతంగా మద్దతు పెరుగుతోంది. ఈ పరిణామాలని హర్షించాల్సిన సమయాన కొంతమంది బిసి వాదులు 'దగాపడ్డది బిసిలే' (నవంబర్ 17, ఆంధ్రజ్యోతి) అని వాపోయారు. 

వివక్షకు గురైన వర్గాలవారి కోసం పోరాడుతోన్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మంద కృష్ణ, అంబేద్కర్ సిద్ధాంతాన్ని బిసిలకు అందించడం కోసం కృషిచేస్తోన్న ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై విమర్శలు గుప్పించారు. ఒకవైపు బిసిలకు నాయకత్వం లేదని ఒప్పుకుంటూనే మరోవైపు బిసిల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేసే సామాజిక ఉద్యమకారులపై నిందలు మోపే ప్రయ త్నం చేశారు. గత అరవై నాలుగేళ్ళుగా బిసిలను ఓటు బ్యాంక్‌గా మార్చుకొని తమ ఆధిపత్యాన్ని, అధికారాన్ని నిలబెట్టుకొంటున్న అగ్రకుల పాలకులను, అదే విధంగా తమ లాగే వివక్షను అభవించిన బిసిలను చైతన్యపరిచి పాలకులుగా ఉన్న వారిని పాలకులుగా మార్చాలని పోరాడుతున్న సామాజిక ఉద్యమ నేతలను ఒకే విధంగా చూడడం వారి వివేకానికి నిదర్శనం. 

అసలు సామాజిక తెలంగాణ అంటే సామాజిక న్యాయమే. సామాజిక న్యాయం అంబేద్కరిజమ్‌లో నుంచి పుట్టిన భావనే. అలాంటి అంబేద్కరిజమ్ పునాదిపైన సామాజిక న్యాయాన్ని సాధించుటకు గత పద్దెనిమిదేళ్ళుగా మంద కృష్ణ మాదిగ తన జీవితాన్ని పణంగా పెట్టి ఉద్యమిస్తూనే ఉన్నారు. ఆయన పోరాటమంతా అంబేద్కర్ సిద్ధాంత స్ఫూర్తితోనే కొనసాగుతున్నది. ఆ క్రమంలోనే 'సామాజిక తెలంగాణ'ను డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యాన్ని పరిశీలించి గుర్తించాల్సిన అవసరం బిసి కులాల ప్రజలకు ఉన్నది. 

తెలంగాణలో 90 శాతం జనాభా కలిగిన అణగారిన కులాలలో ఏ కులానికి లేని సామాజిక ఉద్యమ చైతన్యం మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ జాతి అందిపుచ్చుకుంది. తద్వారా మాదిగలు సమాజానికి నాయకత్వం వహించే స్థాయిలో ఎదిగారు. అందుకనుగుణంగానే తెలంగాణలో 50 శాతం జనాభా కలిగిన బిసిలను, 12 శాతం జనాభా కలిగిన ముస్లింలను తమ రాజకీయ హక్కుల సాధన కోసం మేలుకొలపడాన్ని ఒక సామాజిక బాధ్యతగా మందకృష్ణ భావిస్తున్నారు. ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ముందుకెళుతున్నారు. ఇది అంబేద్కర్ వారసుడిగా ఆయన నిర్వహిస్తోన్న మహత్తర కర్తవ్యం. 

వర్తమాన తెలంగాణ ఉద్యమ తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తే 'సామాజిక తెలంగాణ' ద్వారానే బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల ప్రజలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని విశ్వసించాల్సి వస్తుంది. ఎస్సీ, ఎస్టీ కులాల ప్రజలకు చట్టసభలలో ఉన్న రిజర్వేషన్లలాగే, మెజారిటీ బిసి, ముస్లిం ప్రజలకు కూడా చట్టసభలలో జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కలిగివుంటే రేపు ఏర్పడబోయేది ఖచ్చితంగా 'సామాజిక తెలంగాణ'నే. దీన్ని కోరుకోవడం వలనే బిసిలను అడ్డుపెట్టుకొని తెలంగాణ ఏర్పడకుండా అడ్డుతగులుతున్నారని కృష్ణపై నిందలు మోపుతున్నారు. 

బిసిల కోసం కృష్ణ మాదిగ ఎందుకు మాట్లాడాలని అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బిసిల కోసం మాట్లాడక పోవడాన్ని ఆయనకు లేని అర్హతలేమిటో చెప్పగలరా? వైకల్య వివక్షను ఎదుర్కొన్న వికలాంగులను సమాజంలో తలెత్తుకొని ఆత్మగౌరవంతో జీవించే స్థాయికి తీసుకొచ్చిన త్యాగపూరిత పోరాటం చాలదా? నిరుపేద గుండె జబ్బుల చిన్నారుల హృదయాలకు తన పోరాటంతో భద్రతనిచ్చి రాష్ట్రంలోని ఏడు కోట్ల మంది పేద ప్రజలకు ఆరోగ్యశ్రీని అందించిన మానవతా ఉద్యమస్ఫూర్తి సరిపోదా? 

2006లో కరీంనగర్‌లో టిఆర్ఎస్ నిర్వహించిన నిండు సభలో బిసికులానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యను కించపరిచేలా, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా మట్లాడిన కెసిఆర్‌కు ఎదురుతిరిగి ప్రశ్నించి, క్షమాపణలు చెప్పించిన మంద కృష్ణ మాదిగ సామాజిక స్పృహను మరచిపోయారా? దొరల సంస్కృతిని ప్రతిబింబించే విధంగా దొరసానులకు 'ప్రతిరూపమైన' తెలంగాణ తల్లిని ఒక బొమ్మ మాత్రమేనని చెప్పి, నిజజీవితంలో దొరల దౌర్జన్యాలపై తిరగబడ్డ వీర వనిత 'చాకలి ఐలమ్మే మా అమ్మ' అని బిసి కులానికి చెందని మహిళను తెలంగాణ తల్లిగా మంద కృష్ణ ప్రకటించిన విషయాన్ని గర్తుంచుకోవాలి. 

అంబేద్కర్ స్వాతంత్య్రానికి పూర్వమే ఎస్సీ, ఎస్టీ హక్కులకై ఒకవైపు బ్రిటిష్ వారితో, మరోవైపు గాంధీజీతో పోరాడి విజయం సాధించారు. ఆ సమయంలోనే బిసి ప్రజల హక్కుల కోసం కూడా మాట్లాడాలని సిద్ధపడిన అంబేద్కర్‌ను, గాంధీజీ పెట్టిన భ్రమలకు లోబడిన బిసిలు వదిలివేశారు. స్వాతంత్య్రానంతరం న్యాయం చేస్తానన్న గాంధీజీని నమ్మి, అంబేద్కర్ నాయకత్వాన్ని వదిలివేయడం ఈ దేశచరిత్రలో బిసిలు చేసిన చారిత్రక తప్పిదం. ఆ తప్పిదం వలనే బిసి కులాలు శాశ్వతంగా రాజకీయ హక్కులకు దూరమయ్యారు. 

ముప్పై ఏళ్ళ గాంధీ పోరాటం బిసిలను మభ్యపెట్టింది. ఆరున్నర దశాబ్దాల గాంధీ వారసుల పాలన బిసి ప్రజలను మోసం చేసింది. ఈ చరిత్ర నేటికీ సాక్ష్యం కదా! అయితే స్వాతంత్రోద్యమ కాలంలో చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఈ దేశంలోని ఒక్క తెలంగాణ ప్రాంత బిసి ప్రజలకే వచ్చింది. అది తెలంగాణ ఉద్యమంలో అంబేద్కర్ వారసత్వ నాయకత్వాన్ని స్వీకరించడం ద్వారానే సరిచేసుకోవచ్చు. 

ఈరోజు తెలంగాణ విముక్తి ఉద్యమంలో గాంధీ వారసుడైన కెసిఆర్‌కి, అంబేద్కర్ వారసుడైన మందకృష్ణ మాదిగకు అణగారిన కులాల 'వాటా' విషయంలో ఘర్షణ జరుగుతూనే ఉన్నది. స్వాతంత్య్రోద్యమ కాలంలో ఎస్సీ, ఎస్టీ హక్కుల కోసం అంబేద్కర్ పోరాడినట్లుగానే తెలంగాణ ఉద్యమంలో బి.సి, ముస్లింల రాజకీయ హక్కుల కోసం మందకృష్ణ మాదిగ పోరాడుతున్నారు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ నాయకత్వాన్ని బలపరచడం ద్వారానే బి.సి. కులాలు తమకు తాము న్యాయం చేసుకోగలరు. లేకుంటే గుడ్డిగా దొరలను నమ్ముకుంటే తరతరాలుగా మోసపోవడానికే బి.సి.లు బ్రతికున్నట్లవుతుంది. 

అంబేద్కరిజాన్ని అందుకోకుండా, మందకృష్ణ మాదిగ వాదనను బలపరచకపోతే మరో వందేళ్లు బి.సి.లు బానిసత్వంలో కూరుకుపోతారు. అన్నింటినిమించి ఒక చారిత్రక సత్యం ఏమిటంటే ఈ దేశ, రాష్ట్ర రాజకీయాలను మార్చగలిగే జనాభా కలిగిన బి.సి.లు ఫూలే, అంబేద్కర్ సిద్ధాంత మార్గాలను స్వీకరించకపోవడం వలనే 60 ఏళ్లుగా నిశ్చేష్టులుగా మిగిలిపోయారు. ఇకనైనా మేల్కోవాలి. 

- గోవిందు నరేష్ మాదిగ
ఎమ్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు  Andhra Jyothi News Paper Dated 24/11/2011

Wednesday, November 2, 2011


ఉద్యమ సుడిలో బడుగుల విద్య
- పాపని నాగరాజు

వేల సంవత్సరాలుగా నిచ్చెనమెట్ల కులవ్యవస్థ శూద్రులను విద్యకు దూరం చేసింది. ఈ చారిత్రక అన్యాయాన్ని గ్రహించిన చార్వాకులు, లోకాయతులు మొదలు మహాత్మ జ్యోతిరావు ఫూలే, డాక్టర్ అంబేద్కర్ వరకు విద్యతోపాటు సమస్త సకల జీవన రంగాలు, సంపద వరకు మాక్కావాలని పోరాడారు. ఈ క్రమంలో బ్రాహ్మణ-బనియాలతో ఫూలే; హిందూ దోపిడీ వర్గాల, బ్రిటీష్ వలసవాదులతో అంబేద్కర్‌లు పోరాడారు. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ కొన్ని రిజర్వేషన్ ఫలాల్ని సాధించిపెట్టారు.

అయినా ఈ శూద్రకులాల పేదలు ఆ ఫలాల్ని చేజిక్కించుకోలేకపోతున్నారు. దానికి విద్యాలేమియే ప్రధాన కారణం. ఆనాడు మహాత్మ జ్యోతిరావు ఫూలే తలపెట్టిన మహోజ్వల ఆధునిక బ్రాహ్మణేతర పోరాట స్రవంతికి తన చదువుతోనే అంకురార్పణ జరిగింది. ఆధునిక జీవితం ఆరంభమయ్యేది స్కూలుతోనే, స్కూలు విద్యతోనే. కనుక ఫూలే విద్యకి అంత ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. ఆ ప్రాధాన్యాన్ని ఆయన మాటల్లోనే చెప్పుకుందాం. "విద్యలేనిదే వివేకం లేదు.

వివేకంలేనిదే వికాసం లేదు. వికాసం లేనిదే (మానవీయ సమానవీయ) విలువలేదు. విలువలేనిదే పురోగతి లేదు. పురోగతిలేనిదే ప్రగతి లేదు. ప్రగతిలేకనే శూద్రులు (అతిశూద్రులు) అధోగతిపాలయ్యారు. ఇంతటి అనర్దమూ (అతిముఖ్యమైన) ఒక్క అవిద్యవల్లనే జరిగింది.'' అని పూలే అంటాడు. తెలంగాణలో భూస్వాముల వివక్ష, దాడులు, అసమానతలు, దోపిడీ ఆధిపత్యం మూలంగా విద్య వీరికి అందలేదు. ఈ క్రమంలో తెలంగాణ రైతాంగ పోరాటం నక్సలైట్ ఉద్యమం వారిలో చైతన్యాన్ని రగిలించింది.

ఆ స్ఫూర్తితో, ఆ మహానీయులు సాధించిన రిజర్వేషన్ ఫలాల మూలంగా శూద్రులైన బడుగులు ఇప్పుడిప్పుడే అనగా 15-20 ఏళ్ళుగా విద్యాఫలాల్ని అనుభవించడానికి దరిచేరుతున్నారు. వీరి విద్యాభివృద్ధి మూలంగా అధికారాన్ని ఎలా పట్టుకోవాలో తెలుసుకునే అవకాశం ఉంది. ఆ ప్రమాదాన్ని గ్రహించిన అగ్రకుల ధనికవర్గాలు పాలకులు దుర్బుద్దితో మళ్ళీ ప్రైవేటీకరణను వెంటేసుకొచ్చి దూరంగా నెట్టారు.

వారే మరో రూపంలో వలసవాదులుగా కొనసాగినవారు తెలంగాణలో విద్య మొదలు సమస్త జీవన రంగాలు, వనరులు, సంపద ఇలా అనేక వాటిపై పెత్తనం చెలాయించి బడుగులను పాతాళంలోకి నెడుతున్నారు. మొత్తంగా తెలంగాణపైగానీ, బడుగులపైగానీ పెత్తనంచేసి తెలంగాణను అడ్డుకునేది రెండున్నర జిల్లాల రెండున్నర అగ్రకుల బడా పెట్టుబడిదారీ, పాలకవర్గాలే. కనుక రెండోదశ(1997)లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం వివిధ సామాజిక సర్వజనుల మహాసంగ్రామంగా మారి ఇప్పుడు కాక మరెప్పుడు తెలంగాణ రాదనే దృఢసంకల్పంతో ఏకోన్ముఖంగా సాగుతున్నది.

ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, కార్మికులు, రైతాంగం, మహిళలు, సామాజిక కులాల వారు, విద్యార్థి యువజనులు ఇలా ఎందరో పాల్గొంటున్నారు. పరిపాలన వ్యవస్థను స్థంభింపచేసేందుకు ఉద్యోగస్తులే కాదు న్యాయశాఖ, రక్షణ- పోలీసులుశాఖలతో పాటు, ఆదాయం వచ్చే బొగ్గుగని, రిజిస్ట్రేషన్స్, స్టాంపులు, మద్యం, పన్నుల, ఎక్సైజ్ శాఖలు ఇలా అన్ని రంగాలను ఈ ఉద్యమంలోగాని, సమ్మెలోగాని పాల్గొనేలా చేస్తూ ప్రజాప్రతినిధులు త

మ పదవులకు రాజీనామా చేస్తే తెలంగాణ కచ్చితంగా వచ్చితీరుతుంది. కానీ ఒక్కవిద్యాసంస్థల (పాఠశాల) విద్యార్థులు పాల్గొంటేనే తెలంగాణ వస్తుందనేదికాదు. కానీ ఉద్యమంలో విద్యార్థులు ఒకభాగంగా ఉంటున్నారు. నిజానికి ఈ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నది బడుగులేనన్నది కాదనలేని సత్యం. వీరు చదువులకు దూరంగా ఉద్యమాల్లో - ఆత్మబలిదానాలలో ముందుంటున్నారు. పాలకవర్గాల, పెట్టుబడిదారుల పిల్లలు విదేశాల్లో ఇతర బడా విద్యాసంస్థల్లో చదువుతున్నారు.

దళిత బహుజన - పేదలు ఈ అరకొర చదువుల మూలంగా అగ్రకుల - ఉన్నత వర్గాల - సీమాం«ద్రులతో పోటీని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితి ఇలా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని ఇంతటి పతాకస్థాయిలోకి తెచ్చింది ఈ 'బడుగు'లేనన్నది వాస్తవం. ఈ అభిప్రాయం సీమాం«ద్రులచే లోపాయికారి ఒప్పం దం కుదుర్చుకొన్నదని గానీ, ముందు షరతులతో కూడిన ఒప్పందాలను కుదర్చుకొన్నాకనే భౌగోళిక తెలంగాణకు అంగీకరించే వాదం అంతకన్న కాదు మాది. బేషరతుగా తెలంగాణ ఇవ్వాలంటున్నా, అందుకోసం పోరాడుతు న్న సామాజిక తెలంగాణవాదం మాది.

తెలంగాణలో ఏ పాలకులు అధికారంలోకి వచ్చిన బడుగుల విద్యాభివృద్ధి ఏనాడు కోస్తాం«ద్రులకన్న అభివృద్ధి కాలేదు. అందుకు కారణం పాలకులకు ప్రజలు దరిద్రులుగా ఉంటేనే వారిబూటకపు వాగ్దానాలతో ఓట్లేయించుకొని సమాజాన్ని దోచుకోవచ్చనే. సమైక్యాంధ్రప్రదేశ్‌లోని, తెలంగాణ ఉద్యమం మొదలుతో ఎన్నికైన మన ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాలలో కనీసంగా ఏకోపాధ్యాయులను లేకుండా విద్యార్థుల 1:30 ప్రకారం కాకుండా తరగతి గదికొక్కరైన ఉపాధ్యాయుడిని నియమించిన చరిత్ర ఈ పాలకులకు ఉందా? భవనాలులేక పూరిగుడిసెల్లో, చెట్లకింద చదువులు, ఉన్న ఏకోపాధ్యాయ స్కూళ్లను ఎత్తివేయడం, మూత్రశాలలు, మరుగుదొడ్లు, మంచినీటిసౌకర్యం లేనివి ఎన్నో బడులు ఉన్నాయి.

మూతపడున్నవి, మూతపడ్డవి కూడా కోకొల్లలు. పైగా తెలంగాణ అంతటా ప్రైవేటుగా చదివించలేని బడుగులకు ప్రతి గ్రామంలో ప్రైవేటు బడులు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రైవేటు బడుల ప్రభావం ఎంతటి స్థాయిలో ఉందంటే నేడు తెలంగాణ అంతటా 10వేల పాఠశాలల్లో చదువుతున్న 50 లక్షల మంది విద్యార్థులు సమ్మెలో పాల్గొంటున్నట్టు ఆ యాజమాన్యాలు ప్రకటించాయి. కనుక ప్రాథమికంగా 10వ తరగతి వరకు ప్రతి 100 మందిలో 30 మంది బడిగడపతొక్కుతున్న వారుగా, ప్రతి 300 మందిలో ఒక్కరే డిగ్రీగా, ప్రతి 600 మందిలో ఒక్కరే పీజీగా, ప్రతి 5000 మందిలో ఒక్కరు ఇంజనీరుగా, 12000 మందిలో ఒక్కడాక్టరుగా చదువుతున్నారు.

అంటే బడుగులకు ప్రాథమికంగా రావాల్సిన విద్య సరిగ్గా రాక, వచ్చినా ఇంగ్లీష్ రాక చదువులకు స్వస్తిపలకాల్సివస్తోంది. మరి పాలకులు వా రి రికార్డుల్లో ఈ ప్రాంతానికి - బడుగు ల విద్యాభివృద్ధికి అధికస్థాయిలో నిధు లు, విద్యాసంస్థల్ని కేటాయించినట్లు ఉ న్నా అవి దారిమళ్ళించబడి ప్రైవేటు విద్యాసంస్థలుగా వృద్ధిచెందుతున్నా యే తప్ప ప్రభుత్వాధీనంలోనివి కాదు. పాలకులకు చిత్తశుద్ధి లేదని పై విషయాలను పరిశీలిస్తే అర్థం అవుతుంది.

కావున ఇంతటి చారిత్రక అన్యాయం తెలంగాణ బడుగులకు జరిగిందనే దృష్టిలో పెట్టుకొని నేటి తెలంగాణ ఉద్యమంలో బడుగులు చదివే విద్యాసంస్థలను మినహాయింపునిచ్చే ఉద్యమరూపాలను, ఎత్తుగడలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఆలోచించమని ఉద్యమకారులను కోరుతున్నాను. విద్య బడుగుల దరిచేరడానికి ప్రస్తుతం భౌగోళిక తెలంగాణ ద్వారా సాధ్యం కాదు. సీమాంధ్ర బడా అగ్రకుల విద్యాపెట్టుబడిదారులకు బదులు తెలంగాణ అగ్రకుల బడా విద్యపెట్టుబడిదారులే విద్యాసంస్థల్ని నెలకొల్పుకుని మళ్లీ దోచుకోవడం జరుగుతుంది.

మెజార్టీ ప్రజలందరికీ విద్య చేరాలంటే దేశీయ ప్రగతిశీల భౌగోళిక సామాజిక స్వత్రంత విద్యా విధానంతోనే సాధ్యం. ఈ స్థితిలో నేడు సీమాం«ద్రులు పేరెంట్స్ కమిటీ పేరిట తెలంగాణను అడ్డుకునేవారుగా ఉన్నారు. నిజానికి వలసవాద అగ్రకుల బడా విద్యాపెట్టుబడిదారుల కార్పొరేట్ విద్యాసంస్థల్లో, ఇంటర్నేషనల్, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లలో చదివించే సీమాంధ్ర అగ్రకుల బ్యూరోక్రాట్సే ఆందోళనలు చేపడుతున్నారు. ఈ పేరెంట్స్ కమిటీవారు బడులు తెరవాలంటున్నారేగానీ తెలంగాణ ఇవ్వాలనడం లేదు.

తెలంగాణకు మేం వ్యతిరేకం కాదంటున్న వీరు తెలంగాణ ఉద్యమంలో వీరి పాత్ర ఏస్థాయిలోఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందుకే సీమాంధ్ర పెట్టుబడిదారులు, పాలకులు, మీడి యా వంతపాడుతుందే కానీ తెలంగాణ వాదులు కాదు. పైగా ప్రభు త్వం సమ్మె విరమింపజేయమని హెచ్చరిస్తుందే కానీ తెలంగాణను ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ప్రభుత్వ మొండితనం ఎంతస్థాయి లో ఉందంటే గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్ని పోలీసులచే కఠినంగా అణిచైనా అడ్డుకోకుండా నిర్వహించాలని తపిస్తుంది. అణిచివేతల్ని ప్రదర్శిస్తుందని అనేక ఘటనలు రుజువుచేస్తున్నాయి.

కేంద్రం తెలంగాణ ఇవ్వదని, తెలంగాణలో 'బడుగుల' చదువులు అభివృద్ధి కావని, సమ్మె ఆగదని, ఈ పరిస్థితుల్లో తెలంగాణ బడు(గు)ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా తయారైంది. ఇలా కావడానికి అగ్రకుల దళారీ దోపిడీవర్గ వలసవాదులు, పాలకులు బాధ్యులు అవుతారు. ఈ అనిశ్చితిని పరిష్కరించాలని పాఠశాలేతర విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, రైతాంగం, మహిళలు, సామాజిక కులాల వారు, యువజనులు, లాయర్లు, కోర్టుసిబ్బంది ఎక్సైజ్ పోలీసులు, న్యాయశాఖ, రక్షణ- పోలీసుశాఖలతో పాటు, ఆదాయంవచ్చే బొగ్గుగని, రిజిస్ట్రేషన్స్, స్టాంపులు, మద్యం, ఎక్సైజ్ ఇలా అన్నిరంగాలను, అందర్ని పాల్గొనేలా చేసి భౌగోళిక తెలంగాణతో పాటు సామాజిక తెలంగాణను సాధించుకుందాం.

- పాపని నాగరాజు
తెలంగాణ బహుజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు

విరమణ కాదు - విద్రోహమే By - దరువు ఎల్లన్న Andhra Jyothi 02/11/2011


విరమణ కాదు - విద్రోహమే

నా తెలంగాణ కోటి గాయాల గేయమేనా..?
రాజకీయ చదరంగంలో, ఇగ రాజీపడ్డ బతుకులేనా?

సకల జనుల సమ్మె దాదాపు 42 రోజుల వరకు కొనసాగింది. మధ్యమధ్యన ఆర్.టి.సి. ఎంప్లాయీస్ విరమణ 32వ రోజు చేసినా.. డిపార్ట్‌మెంట్‌ల వారీగా... క్రమక్రమంగా సీమాంధ్ర ప్రభుత్వంతో చర్చల అనంతరం సమ్మె పూర్తిస్థాయిలో విరమిస్తున్నట్లు ప్రకటించే వరకు... విరమణల వెనుక ఒక విద్రోహపూరితమైన కుట్ర దాగున్నట్లు సగటు తెలంగాణ వాదికి కనిపించే నగ్నసత్యం. అసలు సకల జనుల ప్రారంభం నుండే ఏదో సంశయం కనిపించింది. మొదట 6వ తేదీ నుండి 13వ తేదీకి వాయిదా వేయడం. వాయిదా వెనుక రాజకీయ నాయకుల ప్రయోజనాలు ఉన్నట్లు కనిపించింది.

సమ్మె ఉద్యమ రూపాలు ఏ ఒక్కటీ ఉద్యమాన్ని ఉధృతం చేసేవిగా లేకపోవడం బాధాకరం. కాని సమ్మె ప్రారంభ కాలంలో మొట్టమొదటిసారిగా కోదండరాం విరమించినా, మేం నడిపిస్తాం అని గద్దర్ ప్రకటించడం వలన సమ్మెల్లో పాల్గొనాలనుకునే వారికి ఎంతో గుండె ధైర్యాన్ని నింపింది. అయితే మొట్టమొదటిసారి సకలజనుల సమ్మెలో ముందు వరుసలో నిలబడ్డది సింగరేణి కార్మికులే. అటు తర్వాత అన్ని డిపార్ట్‌మెంట్లు, ఆర్.టి.సి, విద్యుత్, పాఠశాలలు/టీచర్లు, డాక్టర్లు, లైబ్రరీ ఉద్యోగులు, టూరిజం, న్యాయవాదులు, టి.ఎన్.జి.ఓ.లు, గెజిటెడ్ ఉద్యోగులు అన్ని ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు, అన్ని కార్మిక సంఘాలు ఆఖరికి హమాలీ సంఘంతో సహా సమ్మెలో భాగస్వాములై పనిచేశారు.

అయితే క్రమక్రమంగా అన్ని రంగాల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నప్పటికీ ప్రభుత్వం నుండి తగిన స్పందన ఎందుకు రాలేదు? ప్రభుత్వ ఆర్థిక మూలాల్ని దెబ్బతీసేటట్లు ఉద్యమం జరిగినా ప్రభుత్వానికి ఎందుకు భయం కలగలేదు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ ప్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిస్థాయిలో కార్యాలయాలకు తాళాలేసినా, కేంద్రం నుండి కదలిక రాలేదెందుకు? ఏ ప్రకటన రాకముందే రాజకీయ జెఎసి విరమించింది ఎందుకు? ఉద్యోగులు విరమించేటప్పుడు చర్చలు సఫలమైనట్లు 9 డిమాండ్‌లకు ప్రభుత్వం అంగీకరించినట్లు, సంతకాలు చేసినట్లు నేతలు ప్రకటించారు.

అసలు సమ్మె ఈ తొమ్మిది డిమాండ్ల కోసం కాదు కదా? సమ్మె ప్రధాన లక్ష్యం రాష్ట్రం కోసం కదా? విద్యార్థులు/యువకులు బలిదానాలు చూసి చలించిపోయాం, జీవితాలే కోల్పోతున్న నేల మీద మా జీతాలొక లెక్క కాదని ఉద్యోగులు ఎన్నోసార్లు ప్రకటించారు. ఎంతో దృఢ నిశ్చయంతో ఉన్నారు. పవిత్రమైన కార్యంగా భావించారు, ఇంతలోనే ఏం జరిగినట్లు? విరమణల రోడ్ మ్యాప్ ఎవరిది? కాంగ్రెస్‌దా? టిఆర్ఎస్‌దా? జె.ఎ.సి.దా? ఎవరి ప్రభావం ఉద్యోగులపై పడింది? ఏ ప్రలోభాలు, ఎవరి రాజకీయ స్వార్థాలు, ఈ సమ్మెను విరమింప చేశాయి? అంటే అది కచ్చితంగా కెసిఆర్-కోదండరాంల కుట్రనే (కే.కో.కుట్ర) అని స్పష్టమవుతుంది.

ఉద్యోగుల నిజాయితీ మీద కె.సి.ఆర్ కోదండరాంల రహస్య ఒప్పంద స్వార్థపు బురద చల్లారు. మనకోసం - మన భవిష్యత్ తరాల కోసం చేస్తున్నామని ఉద్యోగులు, నాల్గవ తరగతి ఉద్యోగులు సైతం నానా కష్టాలు పడ్డారు. సామాన్య ప్రజానీకం ఆర్‌టిసి బస్సులు బందు ఉన్నందుకు ఎన్నో ప్రయాణాలు మానేసుకున్నారు. చిన్నా చితకా వ్యాపారులు పోతే పోయే తెలంగాణ కోసమే కదా అని త్యాగం చేశారు. ఇలా ప్రత్యక్షంగా ఉద్యోగులు ఉద్యమాల్లో ఉంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని వర్గాల ప్రజలు ఆయా మండల కేంద్రాల్లో, డివిజన్‌లలో, గ్రామాల్లో నిరహార దీక్షలు చేసి సంఘీభావం తెలిపారు.

వారం రోజుల క్రితం ఆర్మూర్‌లో తెలంగాణ సాధన కోసం '1500 డప్పుల దరువు' ర్యాలీ సభ పెట్టినప్పుడు నేను హాజరైన సందర్భంగా ఒక పెద్దాయన... "బిడ్డా... ఇన్ని రోజులు బస్సులు తిరుగకుండ ఉండుడు నా జీవితంలో మొదటి సారి అని చెప్తూ, తెలంగాణ వస్తదంటవా బిడ్డా..'' అని అనుమానంగా అడిగాడు. ఈ అనుమానం ఒక పెద్దమనిషిదే కాదు నాలుగు కోట్ల ప్రజల అనుమానమే అని నాకనిపించింది. ఎందుకంటే ఉద్యమం ఇంతగా నడుస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేదంటే అందులో ఖచ్చితంగా ఈ ప్రాంతపు రాజకీయ నాయకుల లాలూచీతనం ఉందనే అనుమానం కలుగక మానదు.

కాంగ్రెస్ ద్రోహపూరితమైన పార్టీ అయినప్పుడు అదే కాంగ్రెస్ నాయకులు చేసే డ్రామాలు చూస్తూ టి.ఆర్.ఎస్ ఎందుకు మౌ నం వహించినట్లు? ఉద్యమంలో రాజీనామాలు ఆమోదం పొందకుండా నామమాత్రంగా ఎందుకు మిగిలాయి? సమ్మెకాలంలో ఉద్యోగులు జీతాలు త్యాగం చేస్తుంటే, రాజకీయ నేతలు జీతాలు ఎందుకు తీసుకున్నట్లు? రాజీనామాలు ఆమోదించేది వీరి చేతిలో లేకున్నా, జీతాలు తీసుకునేది వీళ్ళ చేతుల్లోనే వుంది కదా? అంటే ఇది పార్టీల ద్వంద్వ వైఖరి కాదా? ఇలా ఏ అంశాన్ని చూసినా... అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని తమ స్వార్థం కోసం వాడుకుంటున్నాయన్నదే చారిత్రక వాస్తవం.

ఈ సందర్భంలో పార్టీల/నేతల మాటలు, ప్రధానంగా కెసిఆర్-కోదండరాంలు, నిజాయితీతో ఉద్యమంలోకి వచ్చిన ఉద్యోగుల్ని నిర్వీర్యం చేశారు. ఇన్ని డిపార్ట్‌మెంట్లు లక్షలాది ఉద్యోగులకు ఒక ఉమ్మడి కార్యక్రమం లేకపోవడం వెనుక కోదండరాం ఉద్యమ ఉధృతి వైపు కాకుండా ఉద్యమ నిర్వీర్యం వైపు అడుగులేసినట్లు అర్థమౌతుంది. తెలంగాణ ఏకైక ప్రధాన లక్ష్యమని చెప్పిన ఉద్యోగులకు, విరమణ కోసమే రూపొందించుకున్న 9 డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకున్నట్లు పొలిటికల్ జెఎసి సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పద అనుమానమే. గతంలో సింగరేణి కార్మికులు ఏ సమ్మె చేసినా అది విఫలమైనట్లు కార్మికుల చరిత్రలోనే లేదు.

వేతన ఒప్పందం కోసం గతంలో సికాస పిలుపు మేరకు దాదాపు 55 రోజులు సమ్మె చేసి వేజ్ బోర్డు సాధించుకున్న చరిత్ర సింగరేణి కార్మికులది. అలాంటి కార్మికులను సైతం ఏ ఫలితం లేకుండా విరమింపచేసిన ద్రోహులెవరు? టీచర్లు, లెక్చరర్లు, ఏ ఒక్కరు మనస్ఫూర్తిగా విరమించలేదన్నది వాస్తవం. గతంలో విద్యార్థి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి పూనుకున్న స్వార్థ రాజకీయ పార్టీలే, ఇప్పుడు ఉద్యోగుల ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసినట్లు కనిపిస్తోంది.

ఉద్యోగ సంఘాల్లోని కొంతమంది నేతలు రాజకీయ పార్టీలకు వత్తాసు పలకడం వల్లనే రాజకీయ పార్టీల సూచనల మేరకు ఉద్యమ విరమణ ప్రకటన చేసినట్లు కన్పిస్తోంది. ఇది 60 సంవత్సరాల ఉద్యమంలో ఒక కొత్త కోణం. ఇంతటి మహత్తర ఉద్యమం మరోసారి సాధ్యమా అని అనుకుంటున్న వాళ్ళందరికీ ఇదొక నిరాశనే మిగిల్చింది.

60 ఏళ్ల చరిత్రలో రాజకీయ పార్టీలది మోసపూరితమైన పాత్రనే. చెన్నారెడ్డిని మించిన ద్రోహం ప్రస్తుతం మన కండ్లముందు ప్రత్యక్షంగా కనబడుతుంది. తెలంగాణ రోడ్ మ్యాప్ ప్రకటించమని కొట్లాడిన ఉద్యమకారులను వక్రదారి పట్టిస్తూ ఉద్యమాన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలో, ఏఏ దశల్లో ఎవర్ని విరమింప చేయాలనే 'విరమణల రోడ్ మ్యాప్' తీసుకొని కేంద్రంతో కుమ్మక్కై తమ వ్యాపార లావాదేవీల కోసం, తమ కుటుంబ రాజకీయాల కోసం, ఉద్యమాన్ని వాడుకునే ఏ రాజకీయ పార్టీ నేతలకైనా ప్రజల మధ్యన గుణపాఠం తప్పదు. విరమణ వెనుక దాగిన విద్రోహాన్ని సరిగ్గా అర్థం చేసుకుందాం.

సకలజనుల సమ్మెలో సర్వం కోల్పోవడానికి సిద్ధపడ్డది ఉద్యోగులు, కాని సర్వనాశనం చేసింది రాజకీయ పార్టీ నేతలే. 'ఇది విరమణ కాదు పార్టీల విద్రోహమే.' మళ్ళీ తెలంగాణ ప్రజలకు భరోసానివ్వాల్సింది, కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించిన విద్యార్థి యువతరమే. ఉద్యమం ఆగిపోయిందని, ఇక తెలంగాణ రాదని ఆవేశంతో, మనస్సు కలత చెంది ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు. నిస్వార్ధంగా పనిచేసే యువకులు రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యాలయాల్ని ఉద్యమ కేంద్రాలుగా చేసి పోరాడే సమయం ఆసన్నమైంది.

- దరువు ఎల్లన్న
ఉస్మానియా పరిశోధక విద్యార్థి

Thursday, October 27, 2011

తెలంగాణ ఉద్యమం- సామాజిక న్యాయం By Chamakura Raju Dated 28/10/2011


తెలంగాణ ఉద్యమం- సామాజిక న్యాయం
- నాయకత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం
- రాబోయే తెలంగాణలో వారి వాటా కూడా ప్రశ్నార్ధకమే
- ఉద్యమంలో ముందుకు వచ్చిన రెండు అగ్రకులాలు
- బీసీల తెరమరుగుకు అన్ని పార్టీలలో కుట్రలు
- మంద కృష్ణ నినాదాన్ని ఎందుకు అందిపుచ్చుకోరు?
- ఇప్పటికైనా వాటా కోసం బీసీలు డిమాండ్‌ చేయాలి!


telanganaతెలంగాణ ఉద్యమం మహోద్యమంగా మారింది. తెలంగాణ ప్రజానీకం ఉద్యమంలో పాల్గొంటున్న క్రమంలో ఒక బలమైన వాదం వినిపిస్తోంది. అదే సామాజిక న్యాయ నినాదం. ఇంత మహా ఉద్యమం జరుగుతుంటే, ఈ సామాజిక న్యాయ నినాదం (కొందరు దీనిని కుల వాదంగా చూస్తున్నారు) ఇంత కీలక దశలో, సంక్లిష్ట సమయంలో అవసరమా అన్నది నేడు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అయితే ఈ వాదం వినిపించడానికి కారణాలను మాత్రం ఎవరూ విశ్లేషించడం లేదు. పైగా దీనిని ఒక శుష్క వాదంగా కొట్టివేస్తున్నారు. ఈ దశలో సామాజిక న్యాయ నినాదం ఆవశ్యకతపై విశ్లేషించవలసి ఉన్నది.
తెలంగాణ ఉద్యమం నడుస్తున్న చరిత్ర ప్రతి తెలంగాణ పౌరునికి తెలుసు.

ఉద్యమంతో అన్నీ తెలుసుకున్నారు. అయితే ఈ ఉద్యమంలో కనుపించని కోణం కూడా మరొకటి ఉంది. అవే అగ్రకులాలు వేస్తున్న ఎత్తుగడలు, పాచికలు, పకడ్బందీగా అమలు చేస్తున్న కుట్రలు. 2001లో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ ఆవిర్భవించింది. ఈ పార్టీ ఆవిర్భావానికి ముందు తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో- నియోజక వర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ దేవేందర్‌ గౌడ్‌, శ్రీనివాస యాదవ్‌, కృష్ణ యాదవ్‌, కడియం శ్రీహరి, సుద్దాల దేవయ్య, ఎల్‌. రమణ వంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు చక్రం తిప్పగలిగారు. సమర్ధవంతమైన మంత్రులుగా రాణించగలిగారు. ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ ఆవిర్భావం అనంతరం జరిగిన రాజకీయ పరిణామ క్రమంలో ఎన్నో మార్పులు సంభవించాయి. క్రమంగా నియోజక వర్గాల స్థాయిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నేతలు అన్ని పార్టీల్లో కనుమరగయ్యారు.

అదే క్రమంలో వెలమ కుల నేతలు వెలగడం మొదలు పెట్టారు. మావోయిస్టు (అప్పట్లో పీపుల్స్‌ వార్‌) పార్టీ హెచ్చరికలతో తమ గ్రామాలు, భూములు వదిలి నగరాలకు వలస వెళ్ళారు. అనంతరం ఉద్యమం వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఎందరో వెలమ నాయకులు ఎదిగారు. 2004 ఎన్నికల అనంతరం డా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో కాంగ్రెస్‌ పార్టీ వల్ల కోమటిరెడ్డి, జానారెడ్డి, జీవన్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు మంత్రులుగా ప్రముఖంగా ముందుకు వచ్చారు. వైఎస్‌ఆర్‌ మంత్రివర్గంలో చేరిన తెరాస మంత్రులుగా వెలమలే వెలిగారు. మొత్తంగా నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా వెలమ దొరలు, కాంగ్రెస్‌ ద్వారా రెడ్లు రాజ్యాలు (జిల్లాలలో) ఏలుతున్నారు.

అన్ని రాజకీయ పార్టీల్లో ఎదుగుదలను పరిశీలిస్తే, ఎంతో మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలను తెలంగాణ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్లో కేవలం జెండాలు మోసే, జిందాబాద్‌ కొట్టే కార్యకర్తలుగా, ద్వితీయ శ్రేణి నాయకులుగా పరిమితం చేశారు. కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో ఎంతో మంది (ఆయన అల్లుడు, బిడ్డ, కుమారుడు సహా) ఇన్‌స్టంట్‌ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వెలమలే ఎదిగారు. కాంగ్రెస్‌లో రెడ్లే ఇన్‌స్టంట్‌ ఎంపీలుగా తయారయ్యారు. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే, మరో వైపు జాయింట్‌ ఏక్షన్‌ కమిటీ (జెఏసీ)ల ద్వారా మరొక వ్యూహం అమలులోకి వచ్చింది. ఈ తెలంగాణ జేఏసీల ఆవిర్భావం, పటిష్ఠం, ప్రస్తుతం నడుస్తున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించాలి. కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్‌లో చేసిన రెండవ ప్రకటన అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించేందుకు అందరూ (అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు) కలిసి ఒక కూటమి ఏర్పాటయ్యింది.

అదే తెలంగాణ జాయింట్‌ ఏక్షన్‌ కమిటీ. ఈ కమిటీని హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ప్రకటించారు. దీనికి కన్వీనర్‌గా ప్రొ కోదండరామ్‌ను ఎన్నుకున్నట్టు ప్రకటించారు. అప్పుడు ఈ జెఏసీలో కాంగ్రెస్‌, బీజేపీ, టిడిపి, సిపిఐ (ఎం.ఎల్‌), న్యూ డెమోక్రసీ, టిఆర్‌ఎస్‌లతో బాటు ఎమ్మార్పీఎస్‌, తెలంగాణ మాల మహానాడు, తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఎన్జీఓల సంఘం తదితర ప్రజాసంఘాలతో బాటు ఇతర కుల సంఘాలు కూడా భాగస్వామ్యం పొందాయి. ఈ జేఏసీని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రాంతమంతటా వివిధ స్థాయిల్లో జెఏసీలు ఆవిర్భవించాయి. ఈ జెఏసీలు పల్లె పల్లెలో, పట్టణ స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో యూనిట్ల వారీగా ఉద్యమ స్ఫూర్తితో ముందుకొచ్చాయి. ఏ విధమైన స్వార్ధ రాజకీయ, కుల తదితర స్వార్ధ ప్రయోజనాలు లేకుండా ఏర్పడ్డాయ

ఈ జెఏసీల ఏర్పాటు వెనుక ఏ కులాల, రాజకీయ పార్టీల ప్రాబల్యం కూడా లేదు. అన్నీ స్వతంత్రంగా ఏర్పడినవే. ఈ జెఏసీలలో కీలకంగా నిలచి నాయకత్వం వహించినవారిలో అధికులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన విద్యావంతులు, విద్యార్థులు, యువకులు. ఈ జెఏసీలు ఎక్కడికక్కడ తమకు చేతనైన పద్ధతిలో ఉద్యమించాయి. వివిధ ప్రాంతాలలో సామాజిక వర్గాలు, ఉద్యోగులు, ఇతర ప్రైవేటు సంస్థలు నాయకత్వం వహిస్తున్నాయి. సరిగ్గా ఇదే తరుణంలో ఒక కుట్ర మొదలైంది. తెలంగాణ ప్రాంత జెఏసి కన్వీనర్‌గా ఉన్న కోదండరామ్‌ ఛైర్మన్‌గా మారి జెఏసిల పటిష్ఠం, సమన్వయం పేరుతూ ఊరూరా తిరగడం మొదలుపెట్టారు. తన పేరులో రెడ్డి కులాన్ని సూచించే పదాన్ని చేర్చుకోకుండా, ఈ ప్రొఫెసర్‌ వివిధ ప్రాంతాలలో ఉన్న జెఏసిలకు రెడ్డేతర వ్యక్తులు నాయకత్వం వహిస్తున్న స్థానాలలో రెడ్డి కులస్థులను ఛైర్మన్లుగా, కన్వీనర్లుగా నియమించాలని ఒత్తిడి తేసాగారు.

అలా నియోజక వర్గ స్థాయిలో ఒత్తిడికి లొంగనివారికి పైన సూపర్‌ న్యూమరి పోస్టులను సృష్టించి తన సామాజిక వర్గానికి చెందినవారిని- ఏ ఉద్యమ నేపథ్యం లేకున్నా, జెఏసీల ఏర్పాటులో వారి పాత్ర లేకున్నా నియామకం చేశారు. ఇలా నియామకం జరిగినవే- రంగారెడ్డి జిల్లా తూర్పు విభాగం జెఎసి ఛైర్మన్‌, వరంగల్‌ జిల్లా జెఏసి ఛైర్మన్‌- ఇలా నియోజక వర్గాల మొదలు జిల్లా స్థాయి వరకూ తన సామాజిక వర్గానికి చెందినవారిని జెఏసీ నాయకులుగా నిలబెట్టారు. ఇదే తతంగం కొన్ని ఉద్యోగ సంఘాల జెఏసిల్లో కూడా జరిగిందని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ విధంగా తన సామాజికవర్గం వారిని నాయకులుగా తయారు చేసే విధంగా జెఏసిలను నాయకుల్ని చేస్తూ- పటిష్ఠం పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యమ నాయకులను అట్టడుగుకు తొక్కి వేశారు.

తెలంగాణ ఉద్యమంలో ఒకవైపు ప్రజలు ఉధృతంగా పాల్గొంటూ ఉంటే, మరోవైపు కె. చంద్రశేఖర రావు వెలమలను, కోదండరామ్‌ రెడ్లను నాయకులుగా తయారు చేసే ఫ్యాక్టరీగా ఈ ఉద్యమాన్ని మార్చారు. మొత్తంగా ఉద్యమం చేస్తున్నది, త్యాగాలు చేస్తున్నది, అరెస్టుల్ని, లాఠీ చార్జ్‌లను, పోలీసు కేసులను ఎదుర్కొంటున్నది బడుగులైతే నాయకత్వం వహిస్తున్నది మాత్రం ఈ రెండు అగ్రకులాలే అని స్పష్టంగా అర్ధమవుతున్నది. ఈ కుట్రలను గమనించిన ఎమ్మార్‌పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ- రేపటి తెలంగాణలో తమ వాటా ఎంత అని ప్రశ్నిస్తూ సామాజిక తెలంగాణ కోసం డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే కొందరు అగ్రకుల నాయకులు, కొందరు కుహనా సామాజిక న్యాయవాదులు దీనిని కుల కోణంగా చిత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు తెలంగాణ అయితే రానివ్వండి, ఆ తర్వాత సామాజిక అంశాన్ని పరిశీలిద్దాం అంటూ సమస్యను దాటవేసే యుక్తులు పన్నుతున్నారు. ఈ కుట్రను గమనించలేని కొందరు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యావంతులు కూడా ఇదే అంటున్నారు. వేల సంవత్సరాల కిందట, బ్రాహ్మణవాదులు అమలు చేసిన బానిస భావజాలం లాగే నేడు బానిస రాజకీయ భావజాలాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల మెదళ్ళకు తమ తమ మీడియాల ద్వారా ఎక్కిస్తున్నారు. అందుకే వారు ఖచ్చితంగా ప్రశ్నించలేకపోతున్నారు.

rajuగిరిజనుల గురించి, ముస్లింల గురించి, దళితుల గురించి రేపటి తెలంగాణలో ఖచ్చితమైన రాజకీయ వాటాను ప్రస్తావిస్తూ జనాభాలో 52 శాతం ఉన్న బీసీల వాటా గురించి ప్రస్తావించకపోవడం ఎంత రాజకీయ కుట్రో బీసీలు ఇంకా అర్ధం చేసుకోకపోవడం విచారకరం. ఆ విషయాన్ని ప్రస్తావించిన మంద కృష్ణపై అగ్రకుల నాయకత్వాలు ఎదురు దాడి చేయించడం ఖండనీయం. మంద కృష్ణ వాదనను బీసీలు అందిపుచ్చుకోక పోవడం తెలంగాణలోని బీసీల పరిస్థితిని తెలుపుతోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా రాజకీయంగా అన్యాయానికి గురవుతున్నది బీసీ సామాజిక వర్గాలే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నవారిలో కూడా 50 శాతం మంది బీసీ వర్గాలవారే అనేది నిర్వివాదం. ఉద్యమంలో బలంగా పాల్గొంటున్నప్పుడు తమ వాటా గురించి నిలదీయవలసిన అవసరం ఉన్నది. లేకపోతే మోసపోయేది బీసీలే, నష్టపోయేది కూడా వారే!

Monday, October 17, 2011

ఉద్యమ సుడిలో బడుగుల విద్య - పాపని నాగరాజు Andhra Jyothi 18/10/2011


ఉద్యమ సుడిలో బడుగుల విద్య
- పాపని నాగరాజు

వేల సంవత్సరాలుగా నిచ్చెనమెట్ల కులవ్యవస్థ శూద్రులను విద్యకు దూరం చేసింది. ఈ చారిత్రక అన్యాయాన్ని గ్రహించిన చార్వాకులు, లోకాయతులు మొదలు మహాత్మ జ్యోతిరావు ఫూలే, డాక్టర్ అంబేద్కర్ వరకు విద్యతోపాటు సమస్త సకల జీవన రంగాలు, సంపద వరకు మాక్కావాలని పోరాడారు. ఈ క్రమంలో బ్రాహ్మణ-బనియాలతో ఫూలే; హిందూ దోపిడీ వర్గాల, బ్రిటీష్ వలసవాదులతో అంబేద్కర్‌లు పోరాడారు. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ కొన్ని రిజర్వేషన్ ఫలాల్ని సాధించిపెట్టారు.

అయినా ఈ శూద్రకులాల పేదలు ఆ ఫలాల్ని చేజిక్కించుకోలేకపోతున్నారు. దానికి విద్యాలేమియే ప్రధాన కారణం. ఆనాడు మహాత్మ జ్యోతిరావు ఫూలే తలపెట్టిన మహోజ్వల ఆధునిక బ్రాహ్మణేతర పోరాట స్రవంతికి తన చదువుతోనే అంకురార్పణ జరిగింది. ఆధునిక జీవితం ఆరంభమయ్యేది స్కూలుతోనే, స్కూలు విద్యతోనే. కనుక ఫూలే విద్యకి అంత ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. ఆ ప్రాధాన్యాన్ని ఆయన మాటల్లోనే చెప్పుకుందాం. "విద్యలేనిదే వివేకం లేదు.

వివేకంలేనిదే వికాసం లేదు. వికాసం లేనిదే (మానవీయ సమానవీయ) విలువలేదు. విలువలేనిదే పురోగతి లేదు. పురోగతిలేనిదే ప్రగతి లేదు. ప్రగతిలేకనే శూద్రులు (అతిశూద్రులు) అధోగతిపాలయ్యారు. ఇంతటి అనర్దమూ (అతిముఖ్యమైన) ఒక్క అవిద్యవల్లనే జరిగింది.'' అని పూలే అంటాడు. తెలంగాణలో భూస్వాముల వివక్ష, దాడులు, అసమానతలు, దోపిడీ ఆధిపత్యం మూలంగా విద్య వీరికి అందలేదు. ఈ క్రమంలో తెలంగాణ రైతాంగ పోరాటం నక్సలైట్ ఉద్యమం వారిలో చైతన్యాన్ని రగిలించింది.

ఆ స్ఫూర్తితో, ఆ మహానీయులు సాధించిన రిజర్వేషన్ ఫలాల మూలంగా శూద్రులైన బడుగులు ఇప్పుడిప్పుడే అనగా 15-20 ఏళ్ళుగా విద్యాఫలాల్ని అనుభవించడానికి దరిచేరుతున్నారు. వీరి విద్యాభివృద్ధి మూలంగా అధికారాన్ని ఎలా పట్టుకోవాలో తెలుసుకునే అవకాశం ఉంది. ఆ ప్రమాదాన్ని గ్రహించిన అగ్రకుల ధనికవర్గాలు పాలకులు దుర్బుద్దితో మళ్ళీ ప్రైవేటీకరణను వెంటేసుకొచ్చి దూరంగా నెట్టారు.

వారే మరో రూపంలో వలసవాదులుగా కొనసాగినవారు తెలంగాణలో విద్య మొదలు సమస్త జీవన రంగాలు, వనరులు, సంపద ఇలా అనేక వాటిపై పెత్తనం చెలాయించి బడుగులను పాతాళంలోకి నెడుతున్నారు. మొత్తంగా తెలంగాణపైగానీ, బడుగులపైగానీ పెత్తనంచేసి తెలంగాణను అడ్డుకునేది రెండున్నర జిల్లాల రెండున్నర అగ్రకుల బడా పెట్టుబడిదారీ, పాలకవర్గాలే. కనుక రెండోదశ(1997)లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం వివిధ సామాజిక సర్వజనుల మహాసంగ్రామంగా మారి ఇప్పుడు కాక మరెప్పుడు తెలంగాణ రాదనే దృఢసంకల్పంతో ఏకోన్ముఖంగా సాగుతున్నది.

ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, కార్మికులు, రైతాంగం, మహిళలు, సామాజిక కులాల వారు, విద్యార్థి యువజనులు ఇలా ఎందరో పాల్గొంటున్నారు. పరిపాలన వ్యవస్థను స్థంభింపచేసేందుకు ఉద్యోగస్తులే కాదు న్యాయశాఖ, రక్షణ- పోలీసులుశాఖలతో పాటు, ఆదాయం వచ్చే బొగ్గుగని, రిజిస్ట్రేషన్స్, స్టాంపులు, మద్యం, పన్నుల, ఎక్సైజ్ శాఖలు ఇలా అన్ని రంగాలను ఈ ఉద్యమంలోగాని, సమ్మెలోగాని పాల్గొనేలా చేస్తూ ప్రజాప్రతినిధులు త

మ పదవులకు రాజీనామా చేస్తే తెలంగాణ కచ్చితంగా వచ్చితీరుతుంది. కానీ ఒక్కవిద్యాసంస్థల (పాఠశాల) విద్యార్థులు పాల్గొంటేనే తెలంగాణ వస్తుందనేదికాదు. కానీ ఉద్యమంలో విద్యార్థులు ఒకభాగంగా ఉంటున్నారు. నిజానికి ఈ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నది బడుగులేనన్నది కాదనలేని సత్యం. వీరు చదువులకు దూరంగా ఉద్యమాల్లో - ఆత్మబలిదానాలలో ముందుంటున్నారు. పాలకవర్గాల, పెట్టుబడిదారుల పిల్లలు విదేశాల్లో ఇతర బడా విద్యాసంస్థల్లో చదువుతున్నారు.

దళిత బహుజన - పేదలు ఈ అరకొర చదువుల మూలంగా అగ్రకుల - ఉన్నత వర్గాల - సీమాం«ద్రులతో పోటీని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితి ఇలా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని ఇంతటి పతాకస్థాయిలోకి తెచ్చింది ఈ 'బడుగు'లేనన్నది వాస్తవం. ఈ అభిప్రాయం సీమాం«ద్రులచే లోపాయికారి ఒప్పం దం కుదుర్చుకొన్నదని గానీ, ముందు షరతులతో కూడిన ఒప్పందాలను కుదర్చుకొన్నాకనే భౌగోళిక తెలంగాణకు అంగీకరించే వాదం అంతకన్న కాదు మాది. బేషరతుగా తెలంగాణ ఇవ్వాలంటున్నా, అందుకోసం పోరాడుతు న్న సామాజిక తెలంగాణవాదం మాది.

తెలంగాణలో ఏ పాలకులు అధికారంలోకి వచ్చిన బడుగుల విద్యాభివృద్ధి ఏనాడు కోస్తాం«ద్రులకన్న అభివృద్ధి కాలేదు. అందుకు కారణం పాలకులకు ప్రజలు దరిద్రులుగా ఉంటేనే వారిబూటకపు వాగ్దానాలతో ఓట్లేయించుకొని సమాజాన్ని దోచుకోవచ్చనే. సమైక్యాంధ్రప్రదేశ్‌లోని, తెలంగాణ ఉద్యమం మొదలుతో ఎన్నికైన మన ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాలలో కనీసంగా ఏకోపాధ్యాయులను లేకుండా విద్యార్థుల 1:30 ప్రకారం కాకుండా తరగతి గదికొక్కరైన ఉపాధ్యాయుడిని నియమించిన చరిత్ర ఈ పాలకులకు ఉందా? భవనాలులేక పూరిగుడిసెల్లో, చెట్లకింద చదువులు, ఉన్న ఏకోపాధ్యాయ స్కూళ్లను ఎత్తివేయడం, మూత్రశాలలు, మరుగుదొడ్లు, మంచినీటిసౌకర్యం లేనివి ఎన్నో బడులు ఉన్నాయి.

మూతపడున్నవి, మూతపడ్డవి కూడా కోకొల్లలు. పైగా తెలంగాణ అంతటా ప్రైవేటుగా చదివించలేని బడుగులకు ప్రతి గ్రామంలో ప్రైవేటు బడులు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రైవేటు బడుల ప్రభావం ఎంతటి స్థాయిలో ఉందంటే నేడు తెలంగాణ అంతటా 10వేల పాఠశాలల్లో చదువుతున్న 50 లక్షల మంది విద్యార్థులు సమ్మెలో పాల్గొంటున్నట్టు ఆ యాజమాన్యాలు ప్రకటించాయి. కనుక ప్రాథమికంగా 10వ తరగతి వరకు ప్రతి 100 మందిలో 30 మంది బడిగడపతొక్కుతున్న వారుగా, ప్రతి 300 మందిలో ఒక్కరే డిగ్రీగా, ప్రతి 600 మందిలో ఒక్కరే పీజీగా, ప్రతి 5000 మందిలో ఒక్కరు ఇంజనీరుగా, 12000 మందిలో ఒక్కడాక్టరుగా చదువుతున్నారు.

అంటే బడుగులకు ప్రాథమికంగా రావాల్సిన విద్య సరిగ్గా రాక, వచ్చినా ఇంగ్లీష్ రాక చదువులకు స్వస్తిపలకాల్సివస్తోంది. మరి పాలకులు వా రి రికార్డుల్లో ఈ ప్రాంతానికి - బడుగు ల విద్యాభివృద్ధికి అధికస్థాయిలో నిధు లు, విద్యాసంస్థల్ని కేటాయించినట్లు ఉ న్నా అవి దారిమళ్ళించబడి ప్రైవేటు విద్యాసంస్థలుగా వృద్ధిచెందుతున్నా యే తప్ప ప్రభుత్వాధీనంలోనివి కాదు. పాలకులకు చిత్తశుద్ధి లేదని పై విషయాలను పరిశీలిస్తే అర్థం అవుతుంది.

కావున ఇంతటి చారిత్రక అన్యాయం తెలంగాణ బడుగులకు జరిగిందనే దృష్టిలో పెట్టుకొని నేటి తెలంగాణ ఉద్యమంలో బడుగులు చదివే విద్యాసంస్థలను మినహాయింపునిచ్చే ఉద్యమరూపాలను, ఎత్తుగడలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఆలోచించమని ఉద్యమకారులను కోరుతున్నాను. విద్య బడుగుల దరిచేరడానికి ప్రస్తుతం భౌగోళిక తెలంగాణ ద్వారా సాధ్యం కాదు. సీమాంధ్ర బడా అగ్రకుల విద్యాపెట్టుబడిదారులకు బదులు తెలంగాణ అగ్రకుల బడా విద్యపెట్టుబడిదారులే విద్యాసంస్థల్ని నెలకొల్పుకుని మళ్లీ దోచుకోవడం జరుగుతుంది.

మెజార్టీ ప్రజలందరికీ విద్య చేరాలంటే దేశీయ ప్రగతిశీల భౌగోళిక సామాజిక స్వత్రంత విద్యా విధానంతోనే సాధ్యం. ఈ స్థితిలో నేడు సీమాం«ద్రులు పేరెంట్స్ కమిటీ పేరిట తెలంగాణను అడ్డుకునేవారుగా ఉన్నారు. నిజానికి వలసవాద అగ్రకుల బడా విద్యాపెట్టుబడిదారుల కార్పొరేట్ విద్యాసంస్థల్లో, ఇంటర్నేషనల్, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లలో చదివించే సీమాంధ్ర అగ్రకుల బ్యూరోక్రాట్సే ఆందోళనలు చేపడుతున్నారు. ఈ పేరెంట్స్ కమిటీవారు బడులు తెరవాలంటున్నారేగానీ తెలంగాణ ఇవ్వాలనడం లేదు.

తెలంగాణకు మేం వ్యతిరేకం కాదంటున్న వీరు తెలంగాణ ఉద్యమంలో వీరి పాత్ర ఏస్థాయిలోఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందుకే సీమాంధ్ర పెట్టుబడిదారులు, పాలకులు, మీడి యా వంతపాడుతుందే కానీ తెలంగాణ వాదులు కాదు. పైగా ప్రభు త్వం సమ్మె విరమింపజేయమని హెచ్చరిస్తుందే కానీ తెలంగాణను ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ప్రభుత్వ మొండితనం ఎంతస్థాయి లో ఉందంటే గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్ని పోలీసులచే కఠినంగా అణిచైనా అడ్డుకోకుండా నిర్వహించాలని తపిస్తుంది. అణిచివేతల్ని ప్రదర్శిస్తుందని అనేక ఘటనలు రుజువుచేస్తున్నాయి.

కేంద్రం తెలంగాణ ఇవ్వదని, తెలంగాణలో 'బడుగుల' చదువులు అభివృద్ధి కావని, సమ్మె ఆగదని, ఈ పరిస్థితుల్లో తెలంగాణ బడు(గు)ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా తయారైంది. ఇలా కావడానికి అగ్రకుల దళారీ దోపిడీవర్గ వలసవాదులు, పాలకులు బాధ్యులు అవుతారు. ఈ అనిశ్చితిని పరిష్కరించాలని పాఠశాలేతర విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, రైతాంగం, మహిళలు, సామాజిక కులాల వారు, యువజనులు, లాయర్లు, కోర్టుసిబ్బంది ఎక్సైజ్ పోలీసులు, న్యాయశాఖ, రక్షణ- పోలీసుశాఖలతో పాటు, ఆదాయంవచ్చే బొగ్గుగని, రిజిస్ట్రేషన్స్, స్టాంపులు, మద్యం, ఎక్సైజ్ ఇలా అన్నిరంగాలను, అందర్ని పాల్గొనేలా చేసి భౌగోళిక తెలంగాణతో పాటు సామాజిక తెలంగాణను సాధించుకుందాం.

- పాపని నాగరాజు
తెలంగాణ బహుజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు