Showing posts with label ప్రభాత్‌ పట్నాయక్‌. Show all posts
Showing posts with label ప్రభాత్‌ పట్నాయక్‌. Show all posts

Monday, March 10, 2014

నయా ఉదారవాదం - అవినీతి, అస్తిత్వ ఉద్యమాలు By ప్రభాత్‌ పట్నాయక్‌


నయా ఉదారవాద దృశ్యం గురించిన మరో విషయంపై మనం దృష్టిని సారించాలి. ఇది 'అవినీతి'కి సంబంధించినది. అలాంటి ఆర్థిక వ్యవస్థలో చిన్న ఉత్పత్తిదారులను బడా పెట్టుబడి కబళించే ధోరణి ఉంటుంది. అయితే కేవలం చిన్న ఆస్తులను మాత్రమే అది లక్ష్యంగా చేసుకోదు. చిన్న ఆస్తులనే కాక సమిష్టి ఆస్తులనూ, తెగల ఆస్తులనూ, ప్రభుత్వ ఆస్తులనూ నామమాత్రపు వెలకుగానీ, ఉచితంగా కానీ పోగు చేసుకుంటుంది. వేరే విధంగా చెప్పాలంటే నయా ఉదారవాదం కాలంలో 'పెట్టుబడి యొక్క ఆదిమ సంచయం' ప్రక్రియ కసిగా కొనసాగుతుంది. దీనికి ప్రభుత్వాధికారుల సమ్మతి అవసరం.

పెట్టుబడిదారీ వ్యవస్థ సామాజికంగా మనగలగటానికి కారణం దాని అంతర్గత తర్కం బలంగా ఉండటం వలన కాక అది బలహీనంగా ఉన్నప్పటికీ మనగలగటం దాని ప్రత్యేకత. వివిధ సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన కార్మికులు ఈ ప్రపంచంలో ఒకేచోటకు చేర్చబడి చిన్నచిన్న గ్రూపులుగా విభజితమై ఒకరితో మరొకరు పోటీ పడతారు. పెట్టుబడిదారీ వ్యవస్థ తర్కం కోరేదీ అదే. అలాంటి ప్రపంచం సామాజికంగా విజయవంతంగా మనగలగటం సాధ్యపడదు. (ఎందుకంటే అలాంటి ప్రపంచంలో ఎలాంటి 'సమాజం' ఉండజాలదు). పెట్టుబడిదారీ వ్యవస్థ తర్కానికి వ్యతిరేకంగా మొదట్లో ఒకరితో మరొకరికి పరిచయంలేని కార్మికులు ట్రేడ్‌ యూనియన్ల ద్వారా 'మేళవింపులు' (ఒకటిగా కలిసిపోవడం) జరిగి వర్గ సంస్థలుగా ఏర్పడతాయి. వీటి నుంచి 'నూతన సమాజం' ఆవిర్భవిస్తుంది.

              ప్రపంచీకరణ శకం వర్గ శక్తుల సమతౌల్యంలో బూర్జువా వర్గానికి అనుకూలంగా నిర్ణయాత్మకమైన మార్పును తీసుకువచ్చింది. ఈ మార్పుకు కనీసం రెండు ప్రధాన పర్యవసానాలున్నాయని గమ నించాలి. మొదటిది, వర్గ రాజకీయాలు బలహీ నపడటంతోపాటు 'అస్తిత్వ రాజకీయాలు' బలోపేత మయ్యాయి. అయితే 'అస్తిత్వ రాజకీయాలు' అనే పదబంధం గందరగోళపరిచేదిగా ఉంటుంది. ఇది రెండు పరస్పర విరుద్ధ ఉద్యమాలను తన పదబంధంతో బంధిస్తుంది. ఇక్కడ మూడు విశిష్ట విషయాల మధ్య తేడాను గమనిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. దళిత, మహిళా ఉద్యమాల (వీటి ప్రత్యేకతలు వీటికున్నప్పటికీ) వంటి 'అస్తిత్వ ప్రతిఘటనా ఉద్యమాలు', 'అస్తిత్వ బేరసార రాజకీయాలు' - ఇవి 'రిజర్వేషన్స్‌'ను ఉపయోగించుకుని తమ స్థితిని మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో 'వెనుకబడిన తరగతి' హోదా కోసం జాట్‌ కులస్తులు చేసే డిమాండ్‌ లాంటివి. 'అస్తిత్వ ఫాసిస్టు రాజకీయాలు - దానికి ఉదాహరణగా మతతత్వ - ఫాసిజాన్ని తీసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక 'అస్తిత్వ గ్రూపుల' ఆధారంగా ఈ రాజకీయాలున్నప్పటికీ కార్పొరేట్‌ ఫైనాన్షియల్‌ పెట్టుబడిదారుల సహకారంతో ఇతర 'అస్తిత్వ గ్రూపుల'ను లక్ష్యంగా చేసుకుని విష ప్రచారం చేయటం ఈ రాజకీయాల ప్రత్యేకత. తాము ఏ అస్తిత్వ గ్రూపు ప్రయోజనాల ఉన్నతికి సమీకరింపబడ్డామో వాటి కోసం పాటుపడకుండా వాస్తవంలో కార్పొరేట్‌ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగస్వాములవడం ఈ రాజకీయాల ప్రత్యేకత.
ఈ మూడు రకాల 'అస్తిత్వ రాజకీయాల' నడుమ ఎన్ని విభేదాలున్నప్పటికీ బలహీనపడిన వర్గ రాజకీయాల ప్రభావం వీటిన్నిటిపైనా ఉన్నది. వర్గ సంస్థల కార్యాచరణలో లేని సభ్యులున్న 'అస్తిత్వ బేరసార రాజకీయాల'ను ఈ పరిస్థితి ప్రోత్సహిస్తుంది. కార్పొరేట్‌ ఫైనాన్స్‌ వర్గ ఆధిపత్యానికి అవసరమైనందున 'అస్తిత్వ ఫాసిస్టు రాజకీయాల'కు కూడా ఈ పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 'అస్తిత్వ ప్రతిఘటనా రాజకీయాల' మీద దీని ప్రభావం మరోలా ఉంటుంది. వర్గ రాజకీయాలు బలహీనపడడం వలన ఈ రాజకీయాలలో సమరశీలత నశించి అవి 'అస్తిత్వ బేరసార రాజకీయాల' దిశలో పయనిస్తాయి. మొత్తం మీద బలహీనపడిన వర్గ రాజకీయాలు వ్యవస్థకు ప్రమాదకరం కాని 'అస్తిత్వ రాజకీయ' రూపాలను బలోపేతం చేస్తాయి. దానితో ప్రజలలోని ఒక సెక్షన్‌ను మరో సెక్షన్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టి వ్యవస్థకు వచ్చే ప్రమాదాలను మరింతగా తగ్గించటం జరుగుతుంటుంది. దేశంలోని కుల వ్యవస్థకు మూలమైన భూస్వామ్య వ్యవస్థ అవశేషం అయిన 'పాత సమాజా'న్ని నాశనం చేసి ప్రజాస్వామ్యానికి అవసరమైన 'నూతన సమాజా'న్ని తీర్చిదిద్దే ప్రయత్నానికి దానితో విఘాతం కలుగుతుంది.
ఈ విఘాతం వ్యక్తీకరణ రెండవ పర్యవసానంగా ఉంటుంది. ఈ పరిస్థితి సమాజాన్ని మొద్దుబారుస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ సామాజికంగా మనగలగటానికి కారణం దాని అంతర్గత తర్కం బలంగా ఉండటం వలన కాక అది బలహీనంగా ఉన్నప్పటికీ మనగలగటం దాని ప్రత్యేకత. వివిధ సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన కార్మికులు ఈ ప్రపంచంలో ఒకేచోటకు చేర్చబడి చిన్నచిన్న గ్రూపులుగా విభజితమై ఒకరితో మరొకరు పోటీ పడతారు. పెట్టుబడిదారీ వ్యవస్థ తర్కం కోరేదీ అదే. అలాంటి ప్రపంచం సామాజికంగా విజయవంతంగా మనగలగటం సాధ్యపడదు. (ఎందుకంటే అలాంటి ప్రపంచంలో ఎలాంటి 'సమాజం' ఉండజాలదు). పెట్టుబడిదారీ వ్యవస్థ తర్కానికి వ్యతిరేకంగా మొదట్లో ఒకరితో మరొకరికి పరిచయంలేని కార్మికులు ట్రేడ్‌ యూనియన్ల ద్వారా 'మేళవింపులు' (ఒకటిగా కలిసిపోవడం) జరిగి వర్గ సంస్థలుగా ఏర్పడతాయి. వీటి నుంచి 'నూతన సమాజం' ఆవిర్భవిస్తుంది. ఆ విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి విజయవంతమైన సమాజం ఆవిర్భవిస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో గతంలో ఇది సాధ్యమైంది. దానికి కారణం పెట్టుబడిదారీ అభివృద్ధి బాగా జరిగిన కేంద్ర స్థానాల నుంచి సమశీతోష్ణ ప్రాంతాలకు పెద్దఎత్తున యూరోపియన్‌ ప్రజలు వలసలుగా వెళ్లటంతో దేశీయ నిరుద్యోగ సైన్యం సాపేక్షంగా పరిమిత పరిమాణంలో ఉండటం జరిగింది. ఈ పరిస్థితి ట్రేడ్‌ యూనియన్లు శక్తివంతంగా మారటానికి దారితీసింది. నేటి తృతీయ ప్రపంచ దేశాల కార్మికులకు అలా వలస వెళ్లే అవకాశం లేదు. ఇంతకు ముందు విశ్లేషించినట్లుగా నిరుద్యోగం సాపేక్ష పరిమాణాన్ని నయా ఉదారవాదం పెంచుతోంది. ట్రేడ్‌ యూనియన్లనూ, కార్మికుల ఇతర సమిష్టి సంస్థలనూ బలహీనపరుస్తోంది. దీని పర్యవసానంగా విడివడిపోయే వైపు కొట్టుకు పోతారు. వర్గ భ్రష్ట శ్రామికవర్గం సంఖ్య పెరుగు తుంది. విభిన్న సామాజిక నేప థ్యాల నుంచి వచ్చిన కార్మికుల మధ్య అనుబంధం ఉండ కుండా పోవటమో లేక ఉన్నది బలహీ నప డడమో జరుగుతుంది. ఇద ంతా భ్రష్టత్వాన్ని పెంచే స్పష్ట మైన ధోరణిని సృష్టిస్తుంది. నిజానికి అన్ని పెట్టు బడిదారీ సమా జాలలో అలాంటి భ్రష్టత్వం ఉం టుంది. అభి వృద్ధి చెందిన పెట్టు బడిదారీ దేశా లలోని కార్మికవర్గ సమిష్టి సంస్థలు అలాంటి భ్రష్టత్వాన్ని అదుపు చేస్తాయి. నయా ఉదారవాదం కింద ఇది బలహీ నపడుతుంది. నయా ఉదారవాదానికి దాసోహం అనే తృతీయ ప్రపంచ దేశాలలోని ప్రభు త్వాల పాలనలో ఇది నిరర్థకమవుతుంది. నా దృష్టిలో నేటి భారతదేశంలో మహిళలపై జరిగే నేరాలూ, ఘోరాలూ ఈ ప్రక్రియతో సంబంధం లేకుండా లేదు.
నయా ఉదారవాద దృశ్యం గురించిన మరో విషయంపై మనం దృష్టిని సారించాలి. ఇది 'అవినీతి'కి సంబంధించినది. అలాంటి ఆర్థిక వ్యవస్థలో చిన్న ఉత్పత్తిదారులను బడా పెట్టుబడి కబళించే ధోరణి ఉంటుంది. అయితే కేవలం చిన్న ఆస్తులను మాత్రమే అది లక్ష్యంగా చేసుకోదు. చిన్న ఆస్తులనే కాక సమిష్టి ఆస్తులనూ, తెగల ఆస్తులనూ, ప్రభుత్వ ఆస్తులనూ నామమాత్రపు వెలకుగానీ, ఉచితంగా కానీ పోగు చేసుకుంటుంది. వేరే విధంగా చెప్పాలంటే నయా ఉదారవాదం కాలంలో 'పెట్టుబడి యొక్క ఆదిమ సంచయం' ప్రక్రియ కసిగా కొనసాగుతుంది. దీనికి ప్రభుత్వాధికారుల సమ్మతి అవసరం. ఇంతకు ముందు పేర్కొన్నట్లు ప్రపంచీకరణ యుగంలో జాతి రాజ్యం విధానపర విషయాలలో ఎదుర్కొనే ఒత్తిడులు కాక ధరను చెల్లించి అలాంటి సమ్మతిని బడా పెట్టుబడి పొందుతుంది. దీనినే మనం 'అవినీతి' అని పిలుస్తాం.
బడా పెట్టుబడి ఆదిమ సంచయంతో లాభపడినందు వల్ల మనం అంటున్న 'అవినీతి' ఆచరణలో ప్రభుత్వాధికారులు, ముఖ్యంగా 'రాజకీయ వర్గం' దానిపై వేసే పన్నులాంటిది. ఈ మధ్యకాలంలో భారతదేశంలో బహిర్గతమైన అవినీతి కుంభకోణాలు - ఉదాహరణకు 2జి స్పెక్ట్రమ్‌, బొగ్గు గనుల కేటాయింపుల వంటి వాటిని ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు పెట్టుబడిదారులకు నామమాత్రపు ధరకు బదలాయించటంగా చూడవలసి ఉంటుంది. అలా బదలాయించటానికి నిర్ణయాలు తీసుకున్నవారు లంచాలు తీసుకున్నారు. దానినే మనం 'అవినీతి' అంటున్నాం. ఆ విధంగా 'అవినీతి' అనేది పెట్టుబడి యొక్క ఆదిమ సంచ యంపై వేసే పన్నుగా భావించాలి. ఈ మధ్యకాలంలో అవినీతి తీవ్రంగా పెరగటానికి కారణం నయా ఉదావాదంలో పెట్టుబడి యొక్క ఆదిమ సంచయం తీవ్రస్థాయిలో ఉండటమే. 'అవినీతి' రూపంలో ఉండే అలాంటి పన్నును రెండు ప్రత్యేక కారకాలను దృష్టిలో ఉంచుకుని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిది, రాజకీయాలు సరుకుగా మార్చబడటం. వేరువేరు రాజకీయ సమీకరణలు నయా ఉదారవాదం పరిధిలోనే ఉండటం అనే వాస్తవం వేరువేరు ఆర్థిక ఎజెండాలను రూపొందించుకోనివ్వదు. దానితో ప్రజామోదం పొందటానికి వేరే మార్గాలను వెదకాలి. ఇది తమను తాము 'మార్కెట్‌' చేసుకోవటం అవుతుంది. ప్రచారం చేసే కంపెనీల సేవలను వినియోగించుకోవటం, మీడియాలో 'చెల్లింపు వార్తలు' వచ్చేలా చూడటం, ఎక్కువ ప్రాంతాలను చుట్టిరావటం ద్వారా ఎక్కువమందికి కనిపించటానికి హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవటం లాంటివి రాజకీయ పార్టీలు తమను తాము 'మార్కెట్‌' చేసుకోవటానికి అవసరమౌతాయి. ఇవన్నీ చాలా ఖరీదైన అవసరాలు. అందుకే రాజకీయ పార్టీలు వనరుల కోసం అర్రులు చాస్తుంటాయి. అవి ఎలాగైనా ఈ వనరులను సమీకరించుకోవాలి.
అంతేకాకుండా ఒక వైపు 'రాజకీయ వర్గం' ముందుకు సాగాలంటే ఎక్కువ వనరులు అవసరం ఏర్పడుతుండగా మరో వైపు నిర్ణయాలు తీసుకోవటంలో ఆ వర్గం పాత్రకు ప్రాధాన్యత తగ్గుతుంది. 'ప్రపంచ ద్రవ్య పెట్టుబడిదారీ సమాజం'గా పిలువబడే ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, బహుళజాతి బ్యాంకులు, ఇతర సంస్థలకు చెందిన అధికార గణం ప్రభుత్వ పాలనలో నిర్ణయాలు తీసుకునే ముఖ్య స్థానాలను ఆక్రమిస్తారు. ఆర్థిక విషయాలను నిర్ణయించే అధికారం సంప్రదాయ రాజకీయ పార్టీల చేతుల్లో ఉండటం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ఇష్టం ఉండక పోవడమే దానికి కారణం. సంప్రదాయ 'రాజకీయ వర్గం' దానిని సహజంగా తిరస్కరిస్తుంది. ఈ వర్గాన్ని 'ఎంతో కొంత' పోగు చేసుకునేందుకు అనుమతిస్తేనే అది పరిస్థితులతో రాజీపడుతుంది. 'అవినీతి' రూపంలో ఉండే పెట్టుబడి యొక్క ఆదిమ సంచయంపై వేసే పన్నులోనే ఆ 'ఎంతో కొంత' ఉంటుంది. 'రాజకీయవర్గం'కు రాజకీ యాలను సరుకుగా మార్చడం వల్ల ఆ అవసరం ఎలాగూ ఉంది గనుక దానికి ఆ వర్గం అభ్యంతర పెట్టదు.
నయా ఉదారవాద పాలనలో 'అవినీతి'కి ప్రయోజనకర పాత్ర ఉన్నది. 'రాజకీయ వర్గం' తన 'నైతికత'ను అకస్మాత్తుగా కోల్పోవటం వలన 'అవినీతి' జరగటం లేదు. ఇది నయా ఉదారవాదం విలక్షణత. నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ పెంచి పోషించే 'అవినీతి' కార్పొరేట్‌ ఫైనాన్షియల్‌ వర్గానికి మరో కారణం చేత ఉపయో గకరంగా ఉంటుంది. అవినీతి 'రాజకీయ వర్గం'కు అపకీర్తిని కొనితెస్తుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య సంస్థలైన పార్లమెంటు, ఇతర సంస్థలకు 'అవినీతి'తో చెడ్డ పేరు వస్తుంది. అదే సమయంలో కపటోపాయాలతోనూ, మీడియాను నియంత్రిం చటంతోనూ ప్రజల దృష్టిని రకరకాల విషయాలపై కేంద్రీకరింపజేసి 'అవినీతి' పాపపంకిలం తనకు అంటకుండా కార్పొరేట్‌ ఫైనాన్స్‌ వర్గం చూసుకుంటుంది. కార్పొరేట్‌ పాలన ప్రవేశానికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించటంలో 'అవినీతి'కి సంబంధించిన ప్రవచనాలు తమ పాత్రను తాము నిర్వహిస్తాయి.
- ప్రభాత్‌ పట్నాయక్‌
Prajashakti Telugu News Paper Dated: 10/3/2014 

Tuesday, February 28, 2012

ప్రతిష్టంభనలో పెట్టుబడిదారీ వ్యవస్థ---ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రతిష్టంభనలో పెట్టుబడిదారీ వ్యవస్థ

గ్రీస్‌లో చోటుచేసు కుంటున్న పరిణామాలు సమకాలీన ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో పేరుకుపోయిన రుగ్మతల్లో ఒక లక్షణం మాత్రమే. పెట్టుబడిదారీ వ్యవస్థలోని రుగ్మతలను సవివరంగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక ఆర్థిక వ్యవస్థగా పెట్టుబడిదారీ వ్యవస్థలో కొన్ని మౌలిక లక్షణాలను లోతుగా అధ్యయనం చేయాలి. పెట్టుబడిదారీ వ్యవస్థలో పెద్దయెత్తున ఒక చోట పోగుపడుతున్న సంపదలో అధిక భాగం ప్రత్యక్షంగా భౌతిక ఆస్తుల రూపంలో ఉండదు. అది పరోక్షంగా భౌతిక ఆస్తుల మీద కెయిమ్స్‌ రూపంలో అనగా డబ్బు, ద్రవ్య ఆస్తుల రూపంలో ఉంటుంది. ఈ పరోక్ష క్లెయిమ్స్‌లో కూడా అనేక దొంతరలు ఉంటాయి. ఒక కర్మాగారం, లేదా భవనం వంటి భౌతిక ఆస్తులపై సంపద కలిగిన వ్యక్తి క్లెయిమ్‌ మీద క్లెయిమ్‌. క్లెయిమ్‌ మీద క్లెయిమ్‌ ఇలా అనేక క్లెయిమ్స్‌ చేస్తుంటాడు. ఈ అన్ని క్లెయిమ్స్‌కు ఒక నిర్దిష్ట విలువ ఉంటుంది. ఈ విలువే అంతిమంగా ప్రాధాన్యత సంతరించు కుంటుంది. అయితే విలువ నిలకడగా ఉండదు, ఎప్పటికప్పుడు మారుతుం టుంది. సరుకుల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. మారేది వాటి విలువలే. అస్థిత్వంలేని బుడగలు (అవి పేలిపోవడాలు) ఈ క్లెయిమ్స్‌ చూపుతుంటాయి. డాట్‌కామ్‌ బబుల్‌, హౌసింగ్‌ బబుల్‌, ఆ తరువాత కుప్పకూలడాలు వంటి పదాల గురించి మనం తరచూ ప్రస్తావిస్తూ ఉంటాం. ఇవి సరకుల ద్రవ్య విలువకు సంబంధించిన అన్ని రకాల క్లెయిమ్స్‌పైనా ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితి పెట్టుబడిదారీ వ్యవస్థలో మరింత అధికంగా ఉంటాయి. అటువంటి పతనాలను ఎలా నిరోధించగలుగుతాం? సరుకులకు సంబంధించి ద్రవ్య విలువను ఎలా నిలకడగా ఉంచగలుగుతాం?
ఏ దేశంలోనైనా వస్తువులకు సంబంధించి ద్రవ్య విలువ ప్రభుత్వ ఆదుపాజ్ఞలకు లోబడి ఉంటుందని భావించడం పొరపాటు. విలువలేని కాగితం ముక్కలు వస్తువులను కొనగలుగుతున్నాయి. దాని మీద ఉన్న ప్రభుత్వ చిహ్నమే ఆ కాగితం ముక్కలకు అంతటి విలువను ఆపాదిస్తోంది. ఈ కాగితాల రూపంలోనే ప్రభుత్వం పన్నులను వసూలు చేస్తోంది. గాడి తప్పిన ద్రవ్యోల్బణం పరిస్థితిని మనం విశ్లేషించాలి. ద్రవ్యోల్బణం కారణంగా ద్రవ్యానికి వస్తు రూపంలో విలువ తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో డబ్బు కలిగి ఉండాలని గానీ, ద్రవ్య ప్రాబల్యం గల ఆస్తులు కలిగి ఉండాలని గానీ ఏ ప్రభుత్వం తన పౌరులను ఆదేశించలేదు. అది మన వ్యవస్థల్లోని అంతర్గత లోపం. నగదు వేతనాలు ఒక నిర్ణీత కాలంలో స్థిరంగా ఉంటాయి. నిదానంగా మాత్రమే పెరుగుతాయి. ఏ ఆర్థికవ్యవస్థలోనైనా ద్రవ్య విలువ ఈ అంశంపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఒక వస్తువు విలువ దానికోసం వినియోగించిన కార్మిక శక్తిపై ఆధారపడి ఉంటుంది.
పెట్టుబడిదారీ వ్యవస్థలో పూర్తి స్థాయి
ఉద్యోగావకాశాలు అసాధ్యం
రిజర్వు కార్మిక సైన్యాన్ని ఏర్పాటుచేసుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ధరలు పెరిగినపుడు వేతనాలు పెంచమని కార్మిక సంఘాలు ఒత్తిడి తీసుకురాకుండా వాటిని బలహీనపరచడం ఈ రిజర్వ్‌ సైన్యం నిర్వహించే పాత్ర. పెట్టుబడిదారీ వ్యవస్థలో పూర్తి స్థాయిలో ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థలో పూర్తి స్థాయి ఉద్యోగావకాశాలను ద్రవ్య విలువతో పోల్చడం సాధ్యం కాదు.
అయితే, నగదు వేతనాలు అంటే కార్మిక శక్తి విలువ ప్రతి దేశంలో ఒకే విధంగా ఉన్నంతమాత్రాన సరిపోదు. ఒక దేశంలో కార్మిక శక్తి వినియోగం ఆ దేశంలో అమలులో ఉన్న వేతనాల రేటు (మారకపు రేటుకు అనుగుణంగా) డాలరు ధరకు సరుకులను ఉత్పత్తి చేస్తే ఆ డాలరు ప్రాతిపదికపైనే ఆ సరుకులను విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఆ సరుకులను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోతే ఆ దేశంలో ఆ ఆస్తుల యాజమాన్య హక్కులు పొందినవారు వ్యాకులత చెందుతారు. వారు ఉత్పత్తి చేసిన వస్తువులపై ఆస్తుల విలువ ఆధారపడి ఉంటుంది. అయితే సరుకులు అమ్ముడుపోకపోతే అంతర్జాతీయంగా ఎటువంటి విలువ ఉండదు. ఇలా అమ్ముడుపోని వస్తువులు, అంటే నగదు రూపంలో మార్చుకోవడానికి వీలులేని వస్తువులు ద్రవ్యంతో సమానం కాలేవు.
ఒక దేశంలో ఫైనాన్షియల్‌ ఆస్తులపై హక్కులు గలవారు ఆ హక్కులు గలిగి ఉండటంపై ప్రతిబంధకాలను ఎదుర్కొంటుంటే (ఇటువంటి సందర్భాల్లో వారికి మిగిలి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం సరుకులను విక్రయించకుండా తమ వద్దే ఉంచుకోవడం), లేదా తమ హక్కులను ఒక దేశం నుండి మరొక దేశానికి బదిలీ చేసుకోగలిగితే, అంటే, పెట్టుబడులను స్వేచ్ఛగా ప్రపంచంలోని దేశాల మధ్య బదిలీ చేసుకోవడానికి అవకాశముంటే, ఏ దేశంలోనైనా నగదు రూపంలో చెల్లించే వేతనాలు స్థిరంగా ఉండటమే కాదు, వాటికి ఒక కచ్చితమైన స్థాయి కూడా ఉండాలి. ఆ స్థాయి మారకపు విలువకు అనుగుణంగా ఉండాలి. ఈ మారకపు రేటు అంతర్జాతీయంగా సరితూగే విధంగా ఉండాలి.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. అంతర్జాతీయ పోటీతత్వం అనే పదానికి పెద్దగా విలువ లేదు. ఒక వస్తువును పరిగణనలోకి తీసుకుంటే ఒక దేశం అంతర్జాతీయ పోటీకీ సరి తూగేదిగా ఉండవచ్చు. అయితే ఆ దేశంలో ఉత్పత్తి అయిన సరుకులు అంతర్జాతీయంగా అమ్ముడుపోకపోవచ్చు. అందుకు అనేక కారణాలుంటాయి. ఆ వస్తువు మీద ఇష్టం లేకకావచ్చు లేక ఆ వస్తువు గురించి తెలియకపోవడం వల్ల కావచ్చు. అందువల్ల ఒక దేశంలోని ఆస్తులపై హక్కును ప్రకటించుకునే వ్యక్తులు చెల్లింపుల పరిస్థితిని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. వేతన ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వారు ఇతర దేశాలకు తరలివెళ్లేందుకు ఆసక్తి చూపుతారు.
ఏదైనా ఒక దేశం చెల్లింపుల సమతుల్య పరిస్థితి ఆ దేశం తీసుకునే చర్యలపైనే పూర్తిగా ఆధారపడి ఉండదు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. మొత్తం డిమాండ్‌ పడిపోయిందంటే, కొన్ని దేశాల ఉత్పత్తులకు డిమాండ్‌ పడిపోయిందని అర్థం చేసుకోవాలి. అంతర్జాతీయ పోటీతత్వానికీ, దీనికీ సంబంధం లేదు. అయితే ఇక్కడ చెల్లింపుల సమతుల్య పరిస్థితి ఎదురవుతుంది. ఉదాహరణకు, అమెరికా ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గిస్తే ఒక వస్తువుకు ప్రపంచ డిమాండ్‌ తగ్గుతుందని భావిద్దాం. ఇందువల్ల అమెరికాలో కొంతమంది అధికారులు తమ ఉద్యోగాలు కోల్పోతారు. లేదా వారి ఆదాయం తగ్గిపోతుంది. వారు తమ సెలవులను గ్రీస్‌ దేశంలో ఉల్లాసంగా గడిపేందుకు వెళితే, వారు పెట్టే ఖర్చు గ్రీస్‌ చెల్లింపుల పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది. దీనికీ, గ్రీస్‌ అంతర్జాతీయ పోటీకి సరితూగడానికీ ఎటువంటి సంబంధం ఉండదు. పోటీతత్వమే చెల్లింపుల పరిస్థితిని నిర్ణయిస్తుందనే ప్రధాన స్రవంతి ఆర్థిక సిద్ధాంతం పూర్తిగా తప్పుల తడక అనే చెప్పాలి. గ్రీస్‌లో పెట్టుబడులు విదేశాలకు తరలిపోకుండా చూసేందుకై గ్రీస్‌ ప్రభుత్వం తమ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ తగ్గేందుకు చర్యలు తీసుకోవాలి. తద్వారా దిగుమతులపై ఆధార పడాల్సిన పరిస్థితి ఆ దేశానికి ఉండబోదు. ఫలితంగా, చెల్లింపుల సమస్య తీవ్రత తగ్గుతుంది. గ్రీస్‌లో పెట్టుబడిదారులు దీనినే డిమాండ్‌ చేస్తు న్నారు. అయితే ఇందువల్ల గ్రీస్‌ ప్రజలపై అనివార్యంగా భారాలు పెరుగుతాయి. ఇప్పటికే గ్రీస్‌లో ఉత్పత్తి అయ్యే వస్తువులకు ప్రపంచదేశాల్లో డిమాండ్‌ తగ్గిపోయింది. ఈ చర్య వల్ల నిరుద్యోగం పెరిగి, వినియోగం పడిపోయే అవకాశాలున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం కూడా తీవ్రమయ్యే అవకాశం ఉంది.
కార్మికుల సంఖ్యను తగ్గించడం
ఈ ఉదాహరణలో గ్రీస్‌ ముందు మరో రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. మారకపు రేటుపై ప్రభావం చూపకుండా నగదు వేతనాలను తగ్గించడం ఇందులో ఒకటి. ఇందువల్ల ఇతర దేశాలతో పోలిస్తే గ్రీస్‌లో వస్తువుల ధరలు తక్కువగా ఉంటాయి. చెల్లింపుల పరిస్థితి కూడా మెరుగుపడవచ్చు. అయితే, నగదు వేతనాల్లో తగ్గుదల కంటే సరుకుల ధరలు ఎక్కువగా తగ్గుతాయి. కార్మికుల సంఖ్యను తగ్గించడం వల్ల కూడా ఇదే ఫలితం సంభవిస్తుంది. మారకపు రేటును తగ్గించడం మరో మార్గం. అయితే ప్రస్తుత పరిస్థితిలో గ్రీస్‌లో ఇది సాధ్యం కాదు. గ్రీస్‌ తనకంటూ ప్రత్యేకంగా కరెన్సీ లేని దేశం, యూరోపియన్‌ దేశాల ఉమ్మడి కరెన్సీగా యూరో ఉంది. మారకపు రేటు తగ్గించాలంటే వేతనాలను కూడా తగ్గించాల్సి ఉంటుంది. డిమాండ్‌ పెరగకపోతే గ్రీస్‌ నేడు ఎదుర్కొంటున్న పరిస్థితినే అనేక ఇతర దేశాలు ఎదుర్కొంటాయి. ఏతావాతా, మారకపు రేటును తగ్గించడం వల్ల అదే పరిస్థితిలో ఉన్న ఇతర దేశాలు అందుకు ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చెల్లింపుల పరిస్థితిలో మిగులు ఉన్న దేశాలు కూడా నిరుద్యోగం, మాంద్యం ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. అవి కూడా తమ మార్కెట్లను కోల్పోవడం ఇష్టం లేక ప్రతీకార చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది. స్థూలంగా, విదేశీ మారక రేటు తగ్గించడం అంటే, పొరుగువాడిని దేబిరించడమే. ప్రపంచం మాంద్యం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇటువంటి చర్య తీసుకుంటే, అది ఇతర దేశాలతో శత్రుత్వాన్ని కొనితెచ్చుకోవడమే కాగలదు.
పెట్టుబడి, ముఖ్యంగా ఫైనాన్స్‌ స్వేచ్ఛగా ఏ ప్రాంతానికైనా మళ్లే అవకాశం ఉండే ప్రపంచంలో ఆరంభంలో డిమాండ్‌ తగ్గితే, పొదుపు చర్యల ద్వారా దానిని భూతద్దంలో పెట్టి చూపడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ప్రభుత్వం చేసేది పొదుపు చర్యలను ప్రవేశపెట్టడమే. దేశీయ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. నేడు గ్రీస్‌లో మనం ఇదే పరిస్థితిని చూస్తున్నాం. అక్కడ సంక్షోభం పేరుతో ప్రభుత్వం పొదుపు చర్యలను ప్రవేశపెడుతోంది. ఇందులో రెండు అంశాలను గమనించాలి. ఫైనాన్స్‌ క్యాపిటల్‌ ప్రయోజనాల కోసమే పొదుపు చర్యలను ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం తీసుకునే పొదుపు చర్య, దిగజారిపోయే కార్మికుల స్థితిగతులు పెట్టుబడిదారీ వ్యవస్థ సామర్ధ్యాన్నే ప్రశ్నిస్తున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక నిర్దిష్ట ప్రణాళికకు అనుగుణంగా రూపొందిన వ్యవస్థ కాదు. అది దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా స్వచ్ఛందంగా రూపొందిన ఒక వ్యవస్థ. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే, అసలు ప్రపంచ యుద్ధాలు వచ్చి ఉండేవి కావు.
ఇక రెండో అంశం, పూర్తిగా సాంకేతిక పరమైంది. గ్రీస్‌ స్వతంత్రంగా ఒక కేంద్రీయ బ్యాంకు కలిగి ఉంటే ప్రభుత్వం ఆ బ్యాంకు నుండే రుణాలు చేసి ఉండేది. విదేశీ బ్యాంకులకు రుణపడే సమస్య ఉత్పన్నమై ఉండేది కాదు. పొదుపు చర్యలను ప్రకటించాల్సిన పరిస్థితీ తలెత్తేది కాదు. చెల్లింపుల పరిస్థితి కారణంగానే దేశ రుణ సమస్య తలెత్తింది. అనేక దేశాల పరిస్థితి కూడా ఇదే. ప్రభుత్వం విదేశీ బ్యాంకుల నుండి కాకుండా కేంద్ర బ్యాంకు నుండి రుణం స్వీకరించి ఉంటే, గ్రీస్‌ తన చెల్లింపుల పరిస్థితిని ఎదుర్కొనేందుకు విదేశాల నుండి రుణం సేకరించేందుకు అవకాశం ఉండేది. దిగుమతులు తగ్గుతున్నా, ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించుకోకపోవడం వల్ల చెల్లింపుల పరిస్థితి ఏర్పడి ఉండేది. ప్రభుత్వం చేసే రుణం దీంతో సమానంగా ఉండేది. దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అదనంగా కరెన్సీ ముద్రించడంతో సమస్య పరిష్కారమై ఉండేది..
-ప్రభాత్‌ పట్నాయక్‌
Prajashakti News Paper Dated 29/2/2012

Thursday, February 2, 2012

పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం- స్వభావం


  • అమెరికాలో రియల్‌ ఎస్టేట్‌ బుడగ ఈ సంక్షోభం బయటపడకుండా తాత్కాలికంగా మాత్రమే కప్పివుంచింది. ఆ బుడగ పేలిపోవడంతో సంక్షోభం బయటపడింది. సంక్షోభం అనేది మౌలికంగా పెట్టుబడిదారీ వ్యవస్థలోనే దాగి వుంది. దాని మీద ఇది అదనంగా రుద్దబడింది. ఇప్పుడు మనం చూస్తున్న సంక్షోభం ఆ బుడగలు పేలిపోవడం వల్ల తలెత్తినది మాత్రమే కాదు, అసలు పెట్టుబడిదారీ వ్యవస్థే సంక్షోభంలో చిక్కుకుంది. దీని నుంచి అది బయటపడడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఇది పెట్టుబడిదారీ సంక్షోభాల వలయంలో తరచుగానో, అప్పుడప్పుడూ వచ్చేటి సంక్షోభం లాంటిది కాదు.
పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నదనే విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. అయితే దీనిని ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా చూస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలిన పర్యవసానంగానే ఇదంతా జరిగిందని అంతటా వినిపిస్తున్న సాధారణ అభిప్రాయం. చివరికి ప్రగతిశీల ఆర్థికవేత్తలుగా పరిగణించబడే పాల్‌ క్రూగ్‌మన్‌, జోసెఫ్‌ స్టిగ్లిట్జ్‌ వంటివారు సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ప్రయివేటు వ్యయం (పెట్టుబడుల రూపంలోనైనా, వినియోగం రూపంలోనైనా) పెరిగే అవకాశం సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు. సంక్షోభం నుంచి కోలుకోవాలంటే ప్రభుత్వ వ్యయం పెంచడం ఒక్కటే పరిష్కార మార్గం. అమెరికా, యూరపులలో ప్రభుత్వాలు ప్రస్తుతం అనుసరిస్తున్న పొదుపు చర్యలను పక్కనపెట్టి వివిధ పథకాలపై ప్రభుత్వ వ్యయాన్ని విధిగా పెంచాలి. ఇలా చేయలేకపోవడానికి రిపబ్లికన్ల విశ్వాసరాహిత్యం, మితవాద పక్షాల నిర్లక్ష్యమే కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విధమైన సంకుచిత దృష్టి వల్లే సంక్షోభాన్ని అంతగా పట్టించుకోలేదు. ఇదే అమెరికా ఆర్థిక వ్యవస్థను సంకట స్థితిలో పడేసింది. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపింది. రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ గాలి బుడగ మాదిరిగా పేలిపోవడానికి అలాన్‌ గ్రీన్‌స్పాన్‌ నేతృత్వంలోని ఫెడరల్‌ రిజర్వు బోర్డు అనుసరించిన బాధ్యతారహిత ద్రవ్య విధానమే కారణమని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక ఉద్దీపనలా పనిచేసిన బూమ్‌ అ నే గాలి బుడగ పేలిపోవడంతో దాని డొల్లతనం బయటపడింది.
వ్యవస్థాగత సంక్షోభం
ఈ అభిప్రాయంతో వచ్చే సమస్య ఏమిటంటే వాస్తవాన్ని అది పూర్తిగా ప్రతిబింబించదు. దీనికి చాలా పరిమితులు ఉన్నాయి. రియల్‌ ఎస్టేట్‌ గాలి బుడగ పేలిపోవడంతో ఆర్థిక సంక్షోభం నెలకొన్నదనేది మొత్తం గాథలో ఒక భాగం మాత్రమే. రియల్‌ ఎస్టేట్‌ బుడగ ఈ సంక్షోభం బయటపడకుండా కప్పివుంచింది. ఆ బుడగ పేలిపోవడంతో సంక్షోభం బయటపడింది. సంక్షోభం అనేది మౌలికంగానే పెట్టుబడిదారీ వ్యవస్థలోనే దాగి వుంది. దాని మీద ఇది అదనంగా రుద్దబడింది. ఇప్పుడు మనం చూస్తున్న సంక్షోభం ఆ బుడగలు పేలిపోవడం వల్ల తలెత్తినది మాత్రమే కాదు, అసలు పెట్టుబడిదారీ వ్యవస్థే సంక్షోభంలో చిక్కుకుంది. దీని నుంచి అది బయటపడడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఇది పెట్టుబడిదారీ సంక్షోభాల వలయంలో తరచుగానో, అప్పుడప్పుడూ వచ్చేటి సంక్షోభం లాంటిది కాదిది. మనమిప్పుడు దీర్ఘకాలిక పెట్టుబడిదారీ సంక్షోభం అనే విషవలయంలో ప్రవేశించాము. ఇది 1930ల నాటి మహా ఆర్థిక మాంద్యాన్ని మనకు గుర్తు చేస్తున్నది. అయితే ఈ సంక్షోభం ఇప్పటికిప్పుడు తీవ్రతరమయ్యే అవకాశాలైతే లేవు. 30,40 దశకాల్లో మాదిరిగా వరుస రాజకీయ పరిణామాల రూపంలో ఈ సంక్షోభం ప్రభావం చూపుతుంది. వ్యవస్థ పరివర్తన చెందే క్రమంలోనే నిజమైన విప్లవ అవకాశాలు ఏర్పడతాయి.
సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వ వ్యయం పెంపు అవశ్యం. ఇక్కడే వారిని కొన్ని ప్రశ్నలు అడగాలి. ప్రభుత్వ వ్యయం పెంపునకు అమెరికా, యూరపు ఎందుకంత తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు? సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసే పొదుపు చర్యలు చేపట్టాలని అవి ఎందుకు పట్టుబడుతున్నట్లు? తప్పుడు ఆర్థికవిధానాల వల్లే ఇలా జరిగిందని చెబితే సరిపోదు. ఆధిపత్యం చెలాయించే వర్గాలు- కార్పొరేట్‌ సంస్థలు, ద్రవ్య సంస్థలు- పెత్తనం చెలాయించడానికి ఇది అన్నివిధాలా అనుకూలమైనది. ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు తోడ్పడే ప్రభుత్వ వ్యయాన్ని భారీగా పెంచడాన్ని ఫైనాన్స్‌ పెట్టుబడి అంగీకరించదు. దీంతో ప్రభుత్వాలు పొదుపు చర్యలను నిర్బంధంగా అమలు చేస్తున్నాయి.
ప్రభుత్వ క్రియాశీలతకు ఫైనాన్స్‌ పెట్టుబడి వ్యతిరేకం కాదు. అయితే ఆ క్రియాశీలత తనకు ప్రోత్సాహకాలందిరచే రీతిలో ఉండాలి. తన స్వీయ ప్రయోజ నాలను పరిరక్షించేదిగా ఉండాలి. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేదిగా ఉండాలి. అలా అని ప్రభుత్వం నేరుగా ఖర్చు చేస్తానంటే అది ఒప్పుకోదు.
ఫైనాన్స్‌ పెట్టుబడితో సంబంధం లేకుండా, కార్పొరేట్‌ ఫైనాన్షియల్‌ ప్రయోజనాలను పట్టించుకోకుండా ప్రభుత్వం స్వతంత్రంగా, నేరుగా చేపట్టే ఎటువంటి చర్యలనూ అది అంగీకరించదు. అలా గనుక ప్రభుత్వం చేస్తే పెట్టుబడిదారీ వ్యవస్థ సామాజిక చట్టబద్ధత ఎక్కడ దెబ్బతింటుందోనని దాని భయం. ప్రభుత్వ యాజమాన్యం ఎందుకు ఉండకూడదు? ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు ప్రభుత్వం 13లక్షల కోట్ల డాలర్లు వెచ్చిస్తే ఫైనాన్స్‌ పెట్టుబడికి ఎటువంటి అభ్యంతరమూ ఉండదు. కానీ, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఖర్చు చేస్తానంటే అడ్డుపడుతుంది. ప్రభుత్వ వ్యయం ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఫైనాన్స్‌ పెట్టుబడి పొదుపు చర్యల మంత్రాన్ని అది జపిస్తుంది. డిమాండ్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రభుత్వ జోక్యం ఎంత తక్కువగా వుంటే ఫైనాన్స్‌ పెట్టుబడి ఆధిపత్యానికి అంత ఎక్కువ అవకాశముంటుంది. అందుకే అది అలా వ్యవహరిస్తున్నది.
వృద్థిరేటును స్థిరంగా కొనసాగించేందుకు ఫైనాన్స్‌ పెట్టుబడికి బహిరంగ ప్రోత్సాహకాలు కావాలి. ఫైనాన్స్‌ పెట్టుబడి తనంతట తానుగా వృద్థిని కొంత పరిమితి మేరకే సాధించగలుగుతుంది. ఏదైనా కారణం వల్ల వృద్ధి మందగిస్తే లేదా వెనకడుగు వేస్తే లేదా వృద్ధికి ఎటువంటి సమస్యలైనా ఎదురైతే అటువంటి సందర్భాల్లో పెట్టుబడులు క్రమంగా పడిపోతాయి. వృద్ధి రేటు పతన ప్రక్రియ మరింత జోరందుకుంటుంది. అటువంటి సందర్భాల్లో బహిరంగ ప్రోత్సాహకాలను అది కోరుకుంటుంది.
బహిరంగ ప్రోత్సాహకాలు
రెండు రకాల బహిరంగ ప్రోత్సాహకాలు అమలులో ఉన్నాయి. ఇందులో మొదటిది మొత్తం వలస పాలనావ్యవస్థ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే వరకు కీలక పాత్ర పోషించింది. వలసపాలనా వ్యవస్థ గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే భారత్‌, చైనా వంటి వలసవాద, అర్ధవలసవాద పాలనా యంత్రాంగాల గురించి వివరించడం కోసం కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థలోని వలసవాదులకు ప్రవేశం కల్పించేందుకు స్థానికులను తరిమేసి వలసవచ్చిన పెట్టుబడిదారులతో వాటిని నింపేయడం. వీటినే సెట్లర్‌ కాలనీలుగా చెబుతున్నారు. వలసవాద పాలనా వ్యవస్థ పేర్కొన్న విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థ కింద వృద్ధి రేటును ప్రోత్సహించింది. సెట్లర్‌ కాలనీలకు వలసవచ్చిన జనాభాతోపాటు లేదా శ్వేతజాతీయుల నివాసం కోసం తాత్కాలిక ప్రాంతాలను ఏర్పాటుచేయడం, ఈ ప్రాంతాలకు పెట్టుబడి సమాంతరంగా వలస వస్తుంది. వలసవాద, అర్ధ వలసవాద ప్రాంతాల నుండి మిగులు నిధులు విదేశీ పెట్టుబడుల రూపంలో వలస వస్తాయి. భారత్‌, ఇతర వలసప్రాంతాల నుండి తగిన మేరకు పెట్టుబడులు లభించకపోవడంతో సెట్లర్‌ కాలనీలకు ఇతర ప్రాంతాల నుండి పెట్టుబడుల ఎగుమతులు కొనసాగుతాయి.
ఇతర దేశాల కంటే ప్రధాన పెట్టుబడిదారీ దేశమైన బ్రిటన్‌ పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఎగుమతులు చేసే దేశంగా పేరుగాంచింది. అమెరికా మాదిరిగా సెట్లర్‌ కాలనీలో పెద్ద ఎత్తున డిమాండ్‌ గల వస్తువులు ఆ దేశంలో ఉత్పత్తి కావు. ముడి సరుకులకే ఆ దేశంలో డిమాండ్‌ ఎక్కువగా ఉండేది. అంటే, ఖనిజాలు, ప్రాథమిక వస్తువులకు డిమాండ్‌ ఎక్కువగా ఉండేది. బ్రిటన్‌ నుండి వస్త్రాలు ఎక్కువగా ఎగుమతి అయ్యేవి వీటిని భారత్‌, ఇతర తూర్పు దేశాలకు ఎగుమతి చేసేది. బ్రిటన్‌ తమ వస్తువులను వలసవాద, అర్ధవలసవాద దేశాలకు ఎగుమతి చేసేది. బ్రిటన్‌ సరుకులను లోడింగ్‌ చేసేందుకు, మార్కెటింగ్‌ చేసేందుకు ఈ మార్కెట్లు ఉపయోగపడేవి. కావల్సిన మేరకు, ఏ సమయంలోనైనా ఈ సరుకులు దిగుమతి అయ్యేవి.
పెట్టుబడులు, సరుకుల రవాణా పెట్టుబడిదారీ వ్యవస్థలో అత్యంత సానుకూలంగా ఉండేది. 19వ శతాబ్దం మధ్య నుండి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే వరకు బూమ్‌ కొనసాగింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఈ బూమ్‌ ముగిసింది. వలసప్రాంతాల్లో బూర్జువా శక్తులు విజృంభించాయి. ఆసియా మార్కెట్లలో బ్రిటన్‌కు జపాన్‌ పోటీగా తయారైంది. సరిహద్దు మూసివేయడంతో కొత్త ప్రపంచంలో పెట్టుబడులకు ఆస్కారం తగ్గిపోయింది. భారత్‌ వంటి దేశాల్లో కూడా పరిశ్రమల మూసివేత ప్రక్రియ ప్రారంభమైంది. 1930 దశకంలో మహా మాంద్యం పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్సాహం నింపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పెట్టుబడిదారీ వ్యవస్థకు రెండవసారి భారీ ఎత్తున బహిరంగ ప్రోత్సాహకాలు అందించిన తరువాత గానీ మాంద్యం అంతం కాలేదు. ప్రభుత్వ వ్యయం యుద్ధ సన్నాహాలకు మాత్రమే పరిమితమైంది. యుద్ధం ముగిసిన తరువాత కార్మిక వర్గం ఒత్తిడి కారణంగా, సోషలిజం ఆవిర్భవించే పరిస్థితి ఎదురుకావడంతో ప్రభుత్వాలు అనివార్యంగా కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాయి. డిమాండ్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రభుత్వ జోక్యం కూడా క్రమంగా తగ్గింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆధిపత్యం చెలాయించే శక్తిగా అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి ఆవిర్భవించింది. ఇంతకుముందు పేర్కొన్న కారణాల రీత్యా ప్రభుత్వ జోక్యం మరింత తగ్గిపోయింది. నేటి పెట్టుబడిదారీ వ్యవస్థలో స్థిరమైన వృద్ధి సాధించేందుకు ఎటువంటి యంత్రాంగం లేదు.
పడిపోతున్న నిజ వేతనాలు
అటువంటి యంత్రాంగం మరింత ఎక్కువ అవసరమైన తరుణంలో పెట్టుబడిదారీ వ్యవస్థ దానిని కోల్పోతోంది. ప్రపంచీకరణ కారణంగా పెట్టుబడుల ప్రవాహం మునుపటి కంటే ఎక్కువైంది. విదేశీ రుణాలతోపాటు సరుకులు, సర్వీసుల ప్రవాహం ఇంతకంటే అధికమైంది. పెట్టుబడిదారీ వ్యవస్థ చరిత్రలోనే మునుపెన్నడూ లేనంత ఎక్కువగా ఈ ప్రవాహం ఉంది. మెట్రొపాలిస్‌ నుండి పెట్టుబడులు వర్థమాన దేశాలకు పెద్ద ఎత్తున తరలివెళుతున్నాయి. పెద్ద ఎత్తున కార్మిక రిజర్వ్‌లు ఉండటంతో ఆ దేశాల్లో కార్మికులు చౌకగా లభిస్తారు. ఉత్పత్తి అయిన వస్తువులు మెట్రోపాలిస్‌కు ఎగుమతి అవుతున్నాయి. వర్ధమాన దేశాల్లో కార్మికులు పెద్ద ఎత్తున అందుబాటులో ఉండటంతో మెట్రొపాలిటన్‌ దేశాల్లో నిరుద్యోగం ఎక్కువైపోతోంది. ఉదాహరణకు అమెరికాలో గత మూడు దశాబ్దాల్లో కార్మికుల నిజవేతనాలు సుమారు 30 శాతం తగ్గిపోయాయి. వర్ధమాన దేశాల్లో సైతం కార్మికుల నిజ వేతనాల్లో ఎటువంటి పెరుగుదల లేదు. దీనికి బదులుగా చిన్న కార్మికులు, చిన్న రైతులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ఇది కూడా ప్రపంచీకరణ ఫలితమే. దీంతో ఉపాధి లేని కార్మిక సైన్యం పెరిగిపోతోంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో క్రియాశీలక పాత్ర పోషించే కార్మికుల నిజ వేతనాలు పడిపోతున్నాయి. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ పరిణామం ద్యోతకమవుతోంది. నిజవేతనాలు తగ్గకపోయినా పెరుగుదల లేని పరిస్థితి నెలకొంటోంది. అదే సమయంలో కార్మికుల ఉత్పాదకత క్రమంగా పెరుగుతోంది.
కార్మికులకు లభించే ఉత్పత్తి విలువ పెట్టుబడిదారులకు లభించే రూపాయి విలువను పెంచుతోంది. మిగులు విలువలో కార్మికులకు లభించే వాటా క్రమంగా తగ్గిపోతోంది. ఇది కార్మికుల డిమాండ్‌ తగ్గిపోవడానికి కారణమవుతోంది. పెట్టుబడిదారుల పెట్టుబడులు పెరిగేకొద్దీ వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. ఫలితంగా కార్మికుల డిమాండ్‌ తగ్గే పరిస్థితిని అధిగమించవచ్చు. అయితే పెట్టుబడిదారులు పెట్టే పెట్టుబడులు పెరగకపోవడం కాదు కదా, మరింతగా తగ్గుతున్నాయి. వారి పెట్టుబడులకు స్థిరమైన వృద్ధి లేకపోవడమే ఇందుకు కారణం. అవసరం కంటే అధిక స్థాయిలో ఉత్పత్తి కావడానికి ఈ పరిస్థితులు దోహదం చేస్తున్నాయి. ఫైనాన్స్‌ పెట్టుబడి వ్యతిరేకించడంతో ప్రభుత్వం ఈ పరిస్థితిని నివారించేందుకు అది వివిధ ప్రాజెక్టులు, పథకాలపై వ్యయం చేయలేని పరిస్థితిలో ఉంది. అందువల్ల తన అవసరాలకు అనుగుణంగా డిమాండ్‌ను సృష్టించే పెట్టుబడిదారీ వ్యవస్థ నిలకడైన అభివృద్ధికి దోహదం చేయకపోగా అభివృద్ధి స్తంభించిపోవడానికి దారితీస్తుంది. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ తప్పించుకోవడానికి మార్గాలు లేని వ్యవస్థాగత సంక్షోభంలో కూరుకుపోయింది. అంటే, దీనర్థం పెట్టుబడిదారీ వ్యవస్థ కుప్పకూలిపోతుందని అర్థం కాదు. 30వ దశకంలో మాదిరిగా ఇది చారిత్రాత్మక పరిణామాలకు దారితీసే పరిస్థితిలో ఉంది. 
Prajashakti News Paper Dated 2/2/2012 
-ప్రభాత్‌ పట్నాయక్‌