Showing posts with label ఎన్. వేణుగోపాల్. Show all posts
Showing posts with label ఎన్. వేణుగోపాల్. Show all posts

Thursday, October 10, 2013

9/12, 30/7, 3/10... ఇంకో రెండు తారీఖులు కావాలి --ఎన్. వేణుగోపాల్,

తెలంగాణ మళ్లీ ఒకసారి సంబురపడుతున్నది. 2009 డిసెంబర్ 9న, 2013 జూలై 30న ఎంత సంబురపడిందో 2013 అక్టోబర్ 3న కూడా అంత సంబురపడుతున్నది. అయితే ఈ సంబురం నిలవాలన్నా, బలపడాలన్నా ఇంకో రెండు తారీఖులు కూడా గడవవలసి ఉన్నది. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొంది చట్టం అయ్యే తారీఖు ఒకటి, ఏ ఇబ్బందులూ లేకుండా పది సంవత్సరాలు గడిచి ఉమ్మడి రాజధాని అనే గుదిబండ తొలగిపోయే తారీఖు ఒకటి. ఆరెండు తారీఖులూ సక్రమంగా నమ్మకంగా కుదిరేదాకా తెలంగాణ తారీఖు మారుతుందనే నమ్మకం లేదు. (తారీఖు అనే ఉర్దూ మాటకు తేదీ అనే అర్థంతోపాటు చరిత్ర అనే అర్థం కూడా ఉన్నది. తెలంగాణ విషయంలో రోజు మారి రోజు రావడం అనే తారీఖు మార్పు మాత్రమే కాదు, చరిత్ర మార్పే జరగవలసి ఉంది).

అయితే ఆ రెండు తారీఖులు అంత సులభంగా వచ్చేటట్టు లేవు. వచ్చినా తెలంగాణ సమాజం ఆకాంక్షిస్తున్నట్టుగా వస్తాయో లేదో అనుమానంగా ఉంది. అందువల్ల ఆ రెండు తారీఖులు వాస్తవరూపం ధరించేదాకా తెలంగాణ సమాజం నిరంతర జాగరూకత వహించవలసిన అవసరం పెరుగుతున్నది. 


మొదటి తారీఖుకు ఇప్పటికి ఇప్పుడు నాలుగైదు అవరోధాలున్నాయి.మంత్రివర్గ ఉపసంఘం తనకు ఇచ్చిన ఆరు వారాలలో బిల్లు ను తయారు చేస్తుందా అనేది మొదటిది. ఆ బిల్లును తెలంగాణ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేస్తుందా, ఏవైనా కొత్త మెలికలు పెడుతుందా అనేది రెండోది.ఆ బిల్లును అందుకున్న వెం టనే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారా, రాష్ట్ర శాసనసభ అభివూపాయా ల కోసం వెంటనే పంపుతారా అనేది మూడోది. ఆ పని ఎంత త్వరిత గతిన జరిగినా ఒక వారం పడుతుంది. శాసనసభ అభివూపాయాలు చెప్పడానికి కనీసం రెండు వారాలు గడువు ఇచ్చినా మొత్తం ఇవాళ్టి నుంచి తొమ్మిది వారాలు పడుతుంది. ఆ తర్వాత గాని ఆ బిల్లు పార్లమెంటు ముందరికి పోదు.


పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ - డిసెంబర్‌లలో జరగడం ఆనవాయితీ. ఆ లెక్కన అవి ఇప్పటి నుంచి నాలుగు వారాల తర్వాత మొదలై పన్నెండు వారా లు గడిచేటప్పటికి ముగుస్తాయి.అందులో తొమ్మిది పది వారాలు పైన చెప్పిన పనులకే పట్టేటట్టయితే, ఇక బిల్లు ప్రవేశపెట్టడానికి ఒక వారం మిగిలినా గొప్పే. ఆ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత దానికి అన్ని పక్షాలూ మద్దతు ఇస్తాయా, మెజారిటీ వచ్చి అది చట్టంగా మారుతుందా అనేది మరో అవరోధం. బిల్లులో ఏవైనా మెలికలు పెట్టినట్టయితే వాటిని కారణంగా చూపి ఏ రాజకీయ పార్టీ అయినా తమ మద్దతు ఉపసంహరించుకుంటే బిల్లు ఆమోదం పొందకపోతే ఎట్లా అనేది మరొక సందేహం. కనుక వెంటనే బిల్లు తయారు చేసి పార్లమెంటు ముందుకు తీసుకుపోవాలని తెలంగాణ సమాజం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచవలసి ఉంది.
ఉమ్మడి రాజధాని అనేది హైదరాబాదులో ఆస్తులు ఉన్నవారికి, శాసనసభ్యులకు, సచివాలయ ఉద్యోగులకు ప్రయోజనకరం కావచ్చుగాని, ఆ ప్రాంత ప్రజలకు నష్టదాయకం. వారు ఏ చిన్న పనికైనా రెండువందల కిలోమీటర్లు మరొక రాష్ట్రంలో ప్రయాణించి తమ రాజధానికి రావలసి ఉంటుంది. చరివూతలో ఎక్కడా ఎప్పుడూ తమ భూభాగానికి ైట ఇంతదూరంలో రాజధాని ఉన్న ప్రజలు లేరు.
Telangana_3


నిజానికి బిల్లు తయారీకి ఎక్కువ సమయం అవసరంలేదు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసినప్పుడు తయారైన ఆంధ్రా స్టేట్ యాక్ట్ 1953 సంగతి వేరు గాని, ఆ తర్వాత వచ్చిన బాంబే రీఆర్గనైజేషన్ యాక్ట్ 1960, పంజాబ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 1966, నార్త్ ఈస్టర్న్ ఏరియాస్ (రీ ఆర్గనైజేషన్) యాక్ట్ 1971, మధ్యవూపదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2000, ఉత్తరవూపదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2000, బీహార్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2000 దాదాపు ఒకేరకంగా ఉన్నాయి. 
ఒకటి రెండు సెక్షన్ల తేడాలు, పదాల తేడాలు, ఆయా రాష్ట్ర ప్రత్యేకతల కోసం కొన్ని సెక్షన్లు తప్ప మొత్తం చట్టాన్ని కొత్తగా తిరగరాసిన దాఖలాలు లేవు. అంటే ప్రస్తుత ఆంధ్రవూపదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2013 తయారు (పాత చట్టం ప్రతి తీసుకుని దానిలో అవసరమైన చోట మార్పులు, కొత్తగా ప్రవేశపెట్టవలసిన కొన్ని సెక్షన్లు చేర్పు) చేయడానికి పెద్ద శ్రమ అవసరం లేదు. కానీ మంత్రివర్గ ఉపసంఘానికి ఇచ్చిన విధివిధానాల జాబితా చూస్తే కోతిపుండు బ్రహ్మరాక్షసి లాగ గెలుకుతారేమోనని, అందువల్ల ఎక్కువ సమయం తీసుకుంటారేమోనని అనుమానించడానికి ఆస్కారం ఉన్నది. అలాగే సుప్రీంకోర్టులో వివాదంలో ఉన్న, మూడు లక్షల మంది ఆదివాసులను నిర్వాసితులను చేసే, అన్నిటికన్న మిన్నగా తెలంగాణ వాటాగా బచావత్ ట్రిబ్యూనల్ నిర్ధారించిన గోదావరి జలాల్లో గణనీయమైన భాగాన్ని కొల్లగొట్టే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించే పని కూడ ఈ విధివిధానాలలో ఉంది. రెండు రాష్ట్రాల హైకోర్టులను, గవర్నర్లను హైదరాబాదులోనే ఉంచే ప్రతిపాదన ఉంది. పౌరుల రక్షణ, ప్రాథమిక హక్కుల రక్షణ వంటి అనవసరమైన అంశాలు కూడా ఉన్నాయి. కనుక ఈ మంత్రివర్గ బృందం పని తీరు మీద, అది తయారు చేసే బిల్లు మీద తెలంగాణ సమాజం వెయ్యి కళ్లతో జాగరూకత వహించవలసి ఉంది. 
ఇక రెండో తారీఖు, ఉమ్మడి రాజధాని మూర్ఛబిళ్ల తొలగిపోయే తేదీ, పది సంవత్సరాల తర్వాతది గదా అని అజాక్షిగత్త, నిర్లక్ష్యం వహిస్తే తెలంగాణ మరింత నష్టపోవలసి వస్తుంది. అసలు ఉమ్మడి రాజధాని అనే భావనే అర్థరహితమైనది. దేశంలో 1953 లో మొదటి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి 2000లో చివరి రాష్ట్రాల విభజన జరిగినంతవరకూ ఎప్పుడూ ఉమ్మడి రాజధాని అనే ఊసేరాలేదు. ఎంత చిన్న పట్టణాలనైనా రాజధానులుగా ప్రకటించారు. కేవలం పంజాబ్, హర్యానాల విషయంలోనే చండీగఢ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా, పది సంవత్సరాల కోసం ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఇప్పటికి నలభై ఆరు సంవత్సరాలు గడిచిపోయినా ఆ పది సంవత్సరా లు ముగియలేదు. అలా పది సంవత్సరాలు అనే మాట చండీగఢ్ విషయంలో లాగ హైదరాబాద్ విషయంలో దైవాధీనం కాకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే, ఆ గడువు వారమంటే ఏడు రోజులేనా అన్న ఆజాద్ యథాలాపపు మాటా కావడానికి వీలులేదు. 
ఉమ్మడి రాజధాని భావన అర్థరహితమైనదని చెప్పడానికి మరో రెండు కారణాలున్నాయి. ఒకే నగరంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తాయన్నప్పుడు, ఆ నగరం మీద ఏ రాష్ట్ర ప్రభుత్వపు అధికారం ఉంటుందనే ప్రశ్న వస్తుంది. రాజ్యాంగం ప్రకారం దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ సమాన ప్రతిపత్తి ఉంది గనుక ఆ నగరం మీద ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికారం ఉండడానికి వీలులేదు. అంటే అది మూడోవారి చేతిలో, కేంద్రం చేతిలో ఉండే కేంద్రపాలిత ప్రాంతం కావడానికి మార్గం సుగమమవుతుంది. చండీగఢ్ అనుభ వం చెప్పేదదే. అంటే ఉమ్మడి రాజధాని అనేది కేంద్రపాలిత ప్రాం తంగా మార్చడానికి దొడ్డిదారి అన్నమాట. ఈ పది సంవత్సరాలలో చక్రం తిప్పి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్పించుకుని తమ అక్రమ ఆస్తులు పరిరక్షించుకోవాలని కోస్తా, రాయలసీమ పెట్టుబడిదారులు కుట్రలు పన్నుతూ ఉండవచ్చు. 
ఇక ఉమ్మడి రాజధాని అనేది హైదరాబాదులో ఆస్తులు ఉన్నవారికి, శాసనసభ్యులకు, సచివాలయ ఉద్యోగులకు ప్రయోజనకరం కావచ్చుగాని, ఆ ప్రాంత ప్రజలకు నష్టదాయకం. వారు ఏ చిన్న పనికైనా రెండువందల కిలోమీటర్లు మరొక రాష్ట్రంలో ప్రయాణించి తమ రాజధానికి రావలసి ఉంటుంది.చరివూతలో ఎక్కడా ఎప్పు డూ తమ భూభాగానికి బైట ఇంతదూరంలో రాజధాని ఉన్న ప్రజలు లేరు. ఈ అన్ని కారణాల వల్ల హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ప్రకటించడాన్ని అడ్డుకోవాలి. ఒకవేళ ప్రకటించినా, ఆ నిర్ణీత వ్యవధి వరకూ జాగరూకతతో ఉండాలి.
మొత్తం మీద అక్టోబర్ 3 కేంద్ర మంత్రివర్గ నిర్ణయం తెలంగాణ సమాజపు ఆకాంక్షను పూర్తిగా తీర్చలేదు. తెలంగాణ సమాజం మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని పెంచింది. 

-ఎన్. వేణుగోపాల్

Namasete Telangana News Paper Dated: 06/10/2013

Saturday, February 25, 2012

కేంద్ర హోంమంత్రికి బహిరంగ లేఖ-- -ఎన్. వేణుగోపాల్


పళనియప్పన్ చిదంబరం గారూ, మీరు అగ్రాసనాధిపత్యం వహిస్తున్న మహా ఘనత వహించిన గృహమంత్రిత్వశాఖ మే 6న విడుదల చేసిన ఒక ప్రకటన (బెదిరింపు లేఖ)కు జవాబుగా బహిరంగలేఖ రాయాలనిపిస్తున్నది. ఆ రెండు పేరా గ్రాఫుల ప్రకటనలో చెప్పినవీ, చెప్పనివీ చాలా విషయాలున్నాయి. తమ రాజకీయాలను సమర్థించమని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) నాయకులు కొన్ని స్వచ్ఛంద సంస్థలను, మేధావుల ను అడుగుతున్నారని, అలా సమర్థించడం 1967 నాటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధ) చట్టం కింద శిక్షార్హమని, అలా సమర్థించిన వారికి పది సంవత్సరాల శిక్ష విధించవచ్చునని మీ మంత్రిత్వశాఖ ఆ ప్రకటనలో బెదిరించిం ది.

ఈ ప్రకటనను 'ప్రజాప్రయోజనాల' కోసమే చేస్తున్నామని, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)కు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్థానం లేదనీ ఆ ప్రకటన చెప్పింది. మావోయిస్టులు ఆదివాసులతో సహా అమాయకులను చంపుతున్నారనీ, విధ్వంసాలు సాగిస్తున్నారనీ ఒక ముక్తాయింపు కూడా చేసింది.

మావోయిస్టు పార్టీ రాజకీయాలను సమర్థిస్తూ రచనలు చేయడం చట్టరీత్యా నేరం అవునా కాదా చర్చించవలసిందే. కానీ దానికన్నా ముందు మిమ్మల్ని అడగవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి.

edit.భారతదేశంలో విద్యుదుత్ప త్తి చేస్తానని నమ్మించి వేల కోట్ల రూపాయలు ముంచిన ఎన్రాన్ కంపెనీని సమర్థించడం నేరం అవునా కాదా? భారత ప్రజల కూ, భారత ఖజానాకూ అపారమైన నష్టం కలగజేసిన ఎన్రాన్ కంపెనీ తరఫున న్యాయస్థానంలో వాదించడం నేరం అవునా కాదా? ఫెయిర్ గ్రోత్ అనే ముదుపు సంస్థలో పెట్టుబడులు పెట్టడం అనైతికమ ని, అవినీతికరమని పార్లమెంటులో కూడా చర్చ జరిగిన తర్వాత అలా పెట్టుబడులు పెట్టానని ఒప్పుకున్నవారు నేరస్థులవునా కాదా? వారు మంత్రి పదవికి రాజీనామా చేసినంత మాత్రానా ఆ నేరం సమసిపోయినట్టేనా? పన్ను ఎగవేత దారులకు క్షమాభిక్ష ప్రసాదించి దేశ ఖజానాకు లక్షల కోట్ల నష్టం కలగజేసి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేత మొట్టికాయలు వేయించుకోవడం నేరం అవునా కాదా? ఆసంస్థ డైరెక్టర్లలో ఒకరుగా ఉండి, ఆ తర్వాత వచ్చి న రాజకీయాధికారాన్ని ఉపయోగించి ఆ సంస్థకు లక్షల కోట్ల లాభాలు చేకూర్చగల పథకాలు రచించడం నేరం అవునా కాదా? చిదంబరం గారూ, ఈ పనులన్నీ చేసినది మీరే గనుక అవన్నీ నేరాలు కాదని మీరు అనుకోవచ్చు. కాని వలసవాద వ్యతిరేక భారత జాతీయోద్యమం, స్వావలంబననూ, సామాజిక న్యాయాన్నీ ప్రవచించిన భారత రాజ్యాంగ స్ఫూర్తి, భారత సమాజపు సహజ వివేకం వాటన్నిటినీ నేరాలుగానే గుర్తిస్తున్నాయి. నిజానికి దేశమంటే మనుషులోయ్ అనుకుంటే అవన్నీ దేశద్రోహకర నేరాలు. ఆ నేరాలు చేసిన మీకు ఇతరుల నేరాలు ఎన్నే హక్కులేదు.

మీరు ఎన్నుతున్న నేరాలన్నీ కేవలం మీరు, మీవంటివారు చేసిన నేరాలను ఎత్తిచూపేవి, బయటపెట్టేవి, అటువంటి నేరాలు జరగడానికి వీలులేని నిజమైన శ్రేయోరాజ్యం నెలకొనాలని ఆశించేవి. అటువంటి ప్రజల రాజ్యాం ఏర్పడాలని, ఇప్పటి వేదాంత భోజ్యం రద్దు కావాలని ఒక్క మావోయిస్టులు మాత్రమే కోరడంలేదు. ఆదివాసులు, దళితులు, అన్ని అణగారిన సామాజిక వర్గాలు, దోపిడీకి పీడన కూ గురవుతున్న వారందరూ ఆ ఆకాంక్షనే వ్యక్తం చేస్తున్నా రు. గాంధేయవాదులు, సర్వోదయవాదులు, స్వార్థప్రయోజనాలులేని దేశభక్తులు, ప్రతిపక్షాలలోని కింది స్థాయి కార్యకర్తలు కోరుతున్నారు.

మావోయిస్టులు కోరుకునేది అదేగనుక ఆమాట అన్నవారందరినీ మావోయిస్టుల సమర్థకులు గా భావించి చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టాన్ని ఉపయోగిస్తామంటే మీ ఇష్టం. కాని దేశంలో జైళ్లు సరిపోతాయో లేదో ఒక్కసారి చూసుకొండి. అసలు ఇంతకీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే మాట మీరు ఎత్తారు గనుక, పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలో అసలు ఒక రాజకీయ పక్షాన్ని నిషేధించడమే తప్పు.

నా విధానాలను సమర్థిస్తేనే వాక్, సభా స్వాతంత్య్రాలు, వ్యతిరేకిస్తే నిషేధం అనేది హిట్లర్ అమలు చేసిన నాజీజం. ముస్సోలినీ అమలు చేసిన ఫాసి జం అవుతుంది గాని ప్రజాస్వామ్యం కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అన్ని అభిప్రాయాలు గలవారికీ చోటు ఉండాలి, ఉంటుంది. ఫలానా వారికి చోటులేదు అనే మాట చెల్లదు.

మీ పేరు-బహుశా మీ పేరులో మొదటి పదమైన మీ తండ్రిగారి పేరు- తలచుకున్నప్పుడల్లా మా నేల మీద ఆ పేరుగల పోలీసు అధికారి సాగించిన ఆకృత్యాలు గుర్తుకొస్తాయి. ఆయన పాత మద్రాసు రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో కాటూరు, యలమర్రు గ్రామాల్లో కమ్యూనిస్టు విశ్వాసాలు ఉన్న పాపానికి స్త్రీల ను, పురుషులను వివస్త్రలను చేసి గాంధీ విగ్రహం చుట్టూ పరుగెత్తించాడు.

అప్పటి నుంచి కాలం ఆరు దశాబ్దాలు ముందుకు కదిలిందనీ, కొత్త పళనియప్పన్ హార్వర్డ్‌లో చదువుకుని వచ్చి నాజూకు తేరాడనీ భ్రమ పడ్డందుకు క్షమించండి. ఇప్పటి పళనియప్పన్ కమ్యూనిస్టు భావాలు ఉన్న వాళ్లను ఎట్లాగు చంపుతున్నాడు. 'ఎవరికైనా ఏ భావాలయినా ఉండవచ్చు. వాటిని కాపాడడమే ప్రజాస్వామ్యపు గీటురాయి' అని వోల్టేర్ అన్నమాటను నమ్మిన మేధావులను పది సంవత్సరాల పాటు జైలుకు పంపుతానంటున్నాడు. ఎంత అభివృద్ధి! ఎంత ప్రజాస్వామ్యం!!

-ఎన్. వేణుగోపాల్
Andhra Jyothi News Paper Dated : 11/05/2010

అజాగ్రత్త రచయిత గౌరవాన్ని తగ్గిస్తుంది-- - ఎన్.వేణుగోపాల్


2009లో వచ్చిన కథలన్నీ చూసినప్పుడు రచయితలు స్థూలంగా ఉపయోగించిన భాషా సౌందర్యం గురించీ, సామెతలు, నుడికారాల గురించీ, ప్రకృతి వర్ణనల గురిం చీ, కథన శైలుల గురించీ ఒకటి రెండు మాటలు చెప్పాలి. ఈ సంవత్సరం కథల్లో చాలమంది రచయితలు తమ ప్రాంతానికీ, తమ సామాజిక వర్గానికీ ప్రత్యేకమైన భాష ను అద్భుతంగా వినియోగించుకున్నారు. 

ప్రత్యేకించి కర్నూలు, కడప, చిత్తూరు, ఉత్తరాంధ్ర, మహబూబ్‌నగర్, కరీంనగర్, గుంటూరు- ప్రకాశం ప్రాంతాల భాషా ప్రయోగాలు వాటి సొగసుతోనూ, అర్థస్ఫోరకంగానూ వచ్చాయి. ఈ సంవత్సరం కథలు చదవకపోతే తెలుగు సమాజంలో ఒక ప్రాంతంలో సుడిగుండాన్ని తిరుగుడు గుమ్మి అంటారనీ, ఒక ప్రాంతంలో ఉజ్జిడి అనే ప్రత్యేక గ్రామీణ ఆచారం ఉందనీ, చిత్తూరు ప్రాంతంలో పెళ్లి తంతులో కొన్ని ప్రత్యేకతలున్నాయనీ నాకు తెలిసేది కాదు. 

అలాగే ఈ సంవత్సరం కథల్లో బహుశా కథకులు మూలాల్లోకి పయనించాలని ప్రయత్నించినందువల్ల ఎన్నో మంచి సామెతలు, నానుడులు వచ్చి చేరాయి. గుర్తించినవాటిలో కొన్ని: 'మిన్ను కురవక చేను పండదు, కన్ను కురవక బతుకు పండదు' 'ఉరికిన శాలోడు గదే అంగడి, ఉరకని శాలోడు గదే అంగడి' 'చెప్పితె ఇననోన్ని చెడంగ జూడాలె' 'పేరు పెద్దిర్కం, ఇల్లు జలతంత్రం' 'కొంచెపోని కొంగు పడతె మంచోని మానం పోయిందట' 'నూనెవోసి అలుక్కున్నట్టే' 'అయ్యోడు గాదు అవ్వోడు గాదు జంగమోన్ని పట్టుకుని జామేడ్సినట్టు'... ఎంత విస్తృతమైన జీవతానుభవం నుంచి, ప్రాచీన వివేకం నుంచి ఈ నానుడులు వచ్చి ఉంటాయి! 

అట్లాగే ఈ సంవత్సరం కథలలో జరిగిన కొన్ని పొరపాట్లు కూడ చెప్పాలి. జీవిత దృశ్యాల చిత్రణ ఉన్నప్పటికీ పాత పద్ధతి కథన శైలితో ఉట్టి చిత్రం మాత్రమే, లేదా ఉట్టి చమత్కారం, కొస మెరుపు మాత్రమే కథ అనుకునే ధోరణి ఇంకా ఉంది. ఇతరంగా మంచి కథలు రాసిన కథకులు, నిశిత దృష్టి ఉన్న కథకులు కూడ ఈ పొరపాటు చేసినట్టు కనబడుతున్నది. 

ఈ సంవత్సరం వచ్చిన కథలలో రెండిటి గురించి మాత్రం నా విమర్శను కూడ నమోదు చేయవలసి ఉంది. డా.వి చంద్రశేఖరరావు రాసిన 'ఎచ్.నరసింహం ఆత్మహత్య' (నిజానికి ఇది జనవరి 2010లో అచ్చయింది గనుక కచ్చితంగా చెప్పాలంటే ఈ సింహావలోకనం పరిధిలోకి రాదు) నిర్దిష్ట స్థాయిలో అవాస్తవమేమో అనిపించే ఒక సాధారణ వాస్తవాన్ని వెటకరించడానికి, చిన్నచూపు చూడడానికి ప్రయత్నించింది. 

ఎప్పుడయినా సాధారణ స్థాయిలో వాస్తవమయినది ప్రత్యేక, నిర్దిష్ట స్థాయిలో నిజం కాకపోయే అవకాశం ఉంటుంది. కొంత వైవిధ్యం, తేడా ఉంటుంది. కాని ఆ ఒక్క ఉదాహరణ వల్ల సాధారణ వాస్తవం, వాస్తవం కాకుండా పోదు. ఈ కథ చెప్పే ప్రధాన పాత్ర హైదరాబాదును ప్రేమించే, తనను తాను హైదరాబాదీనే అనుకునే ఒక సుకుమార యువతి పి.కృష్ణవేణి. 

ఆమె కుటుంబం ముప్పై ఏళ్లకిందనే ఇతర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడింది. ఆమె ప్రేమించిన మనిషి ఎచ్.నరసింహం. మొరటుగా ప్రేమిస్తాడు. రెండురోజుల పాటు మంటపుట్టేలా ముద్దు పెట్టుకుంటాడు. గేదె పాల వ్యాపారం చేసే కుటుంబం నుంచి వచ్చాడు. ఆ యువకుడు ఏ కారణం వల్లనో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్యను ప్రాంతీయవాదులు కైవసం చేసుకుని అతనికి కొత్త చరిత్ర కల్పిస్తారు. 

ప్రతి ఆత్మహత్య వెనుకా సంక్లిష్టమైన కారణాలు ఉంటాయి. ఏదో ఒక కారణాన్ని ఆపాదించడం బతికి ఉన్నవాళ్ల ప్రయోజనాల కోసమే అనేది కూడ నిజమే. ఆత్మహత్యలను ఎంతమాత్రం సమర్ధించనక్కరలేదు. కాని ఒక సంక్షుభిత వర్తమాన ఘటన మీద ఇంతగా వెటకరించడం కూడ సాహిత్యకారులకు తగదేమో. 

అలాగే సెజ్ మీద తుమ్మేటి రఘోత్తమరెడ్డి రాసిన కథ సెజ్‌లను విమర్శించేవారిని వెటకరించింది. సెజ్ అనే విధానం వల్ల విమర్శకులు చెపుతున్న కీడు జరగదనీ, మేలే జరుగుతుందనీ అనుకునే అవకాశం, అధికారం ఎవరికైనా ఉన్నాయి. ఆ పని ప్రభుత్వం చేస్తూనే ఉంది. ఆ మేలును చిత్రిస్తూ కథ కూడ రాయవచ్చు. కాని ఆ విధానం వల్ల బాధితులైనవారి పక్షం తీసుకున్నట్టు కనబడుతూ, విధానాన్ని విమర్శించే వారి పట్ల వెక్కిరింతతో, విమర్శతో రాయడం చేయదగిన పని కాదు. 

పరభాషా పదాల, ముఖ్యంగా ఇంగ్లిష్ పదాల, అక్షరక్రమాన్ని తప్పుగా రాయడం కూడ తెలుగు కథకుల్లో కనబడుతున్నది. నిజానికి ఆయా స్థలాలలో పరభాషా పదాల అవసరం లేకపోవడం ఒక ఎత్తయితే, వాటిని సరిగా వాడకపోవడం మరొక ఎత్తు. ఇది వారి నేర్పు మీద, అవగాహనా స్థాయి మీద వ్యాఖ్య కాదు గాని, అజాగ్రత్త ఫలితం కావచ్చు. 

రచయిత అజాగ్రత్త పాఠకులలో ఆ రచయిత మీద గౌరవాన్నీ విశ్వాసాన్నీ తగ్గిస్తుంది, రచయిత ఎంత గొప్ప విషయం చెప్పినా ఇలా గౌరవాన్నీ, విశ్వాసాన్నీ కోల్పోతే, చెప్పే విషయానికి విలువ తగ్గుతుంది. అలాగే విరామ చిహ్నాల వాడకంలో కూడ తెలుగు కథకులలో అత్యధికులు అవసరమైన, తగిన శ్రద్ధ తీసుకోవడం లేదనిపిస్తున్నది. ఒక్క ఫుల్‌స్టాప్ మినహాయిస్తే, మిగిలిన అన్ని విరామ చిహ్నాలనూ అనవసరంగానో, తప్పుగానో వాడుతున్నారు. 

ఈ చిన్న పొరపాట్లను అలా ఉంచి తెలుగు కథ తప్పనిసరిగా 2009లో నడవవలసిన దారిలోనే నడిచింది. సమాజాన్ని అర్థం చేసుకోవలసిన పద్ధతిలోనే అర్థం చేసుకున్నది, సరిగానే చిత్రించింది. విశ్లేషించింది. వంద సంవత్సరాలకు పైగా సమాజ సాహిత్య సంబంధాల అన్యోన్యతకు ప్రతీకగా ఉన్న తెలుగు కథ తన ఘనమైన వారసత్వాన్ని కొనసాగించింది. ఉజ్వల భవిష్యత్తుకు హామీగా నిలిచింది. 

- ఎన్.వేణుగోపాల్
'కథావార్షిక 2009'కు రాసిన సింహావలోకనం నుంచి
Andhra Jyothi News Paper Dated : 6/12/2010

వార్త అంటే ఏమిటి? -ఎన్. వేణుగోపాల్


వ్యాసప్రోక్త మహాభారతం సభాపర్వానికి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, పురిపండా అప్పలస్వామి తెలుగు వచనానువాదం (ప్రగతి పబ్లిషర్స్, హైదరాబాద్, జూన్ 2008) చదువుతుంటే ఒక వాక్యం దిగ్భ్రాంతి కలిగించింది. ఆ దిగ్భ్రాంతి నుంచి తేరుకోవడానికి కొంత పరిశోధన సాగిస్తే అది మరింత పెరిగింది గాని తగ్గలేదు. 'కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత' అనే నానుడి నిజమేనా అని కంగారు కలిగింది. 

అది పాఠకుల దృష్టికి తీసుకువచ్చి విజ్ఞుల దగ్గరి నుంచి వివరణ పొందుదామని ఈ ప్రయత్నం. ప్రధాన స్రవంతి జర్నలిజంలో ప్రవేశించిన 1984 నుంచీ కూడా 'వార్త యందు జగము వర్ధిల్లుచుండు' అని నన్నయ అన్నాడనీ, 'వార్త'కు సమాచారం (న్యూస్) అనే అర్థంలో మహాభారత కాలం నుంచీ మనుగడ ఉందనీ చాలాసార్లు విన్నాను. నన్నయ పద్యంలోని వార్తకు అర్థం మనకు తెలిసిన సమాచారమే అన్నట్టు ఎబికె ప్రసాద్ ఆ పద్యాన్ని చాలాచోట్ల ఉటంకించారు. 

కాని శ్రీపాదా-పురిపండా సభాపర్వంలో నారదుడు ధర్మరాజుకు రాజనీతి బోధించే క్రమంలో 'నీ రాజ్యం లో వార్త -అంటే వ్యవసాయమూ, పశు సంరక్షణా, వాణిజ్యమూ-తగినవారివల్ల బాగా సాగుతోందా? వార్తవల్లేలోకం సుఖపడుతుంది (పేజి.13) అని చూసి ఆశ్చర్యం కలిగింది. వ్యాసుడు వార్త అన్నదీ మనం అంటున్నదీ ఒకటి కాదా అని సందేహం కలిగింది. 

సభాపర్వంలో 69వ శ్లోకంగా 'కచ్ చిత్ స్వానుష్ఠితా తాత వార్తా తే సాధుభిర్ జనైః/ వార్తాయాం సంశ్రితస్ తాత లోకో యం సుఖం ఏధతే' అని వ్యాసుడు రాశాడు. వ్యాసభారతానికి ప్రామాణిక ఇంగ్లీషు/ వచనానువాదం కీసరి మోహన్ గంగూలీ (1842-1895) చేయగా, 1883-1896 మధ్య ప్రచురితమయింది. 

దానిలో ఈ శ్లోకాన్ని 'పుత్రా, వ్యవసాయం, వాణిజ్యం, పశుపోషణ, వడ్డీ వ్యాపారం అనే నాలుగు వృత్తులూ నిజాయితీపరులైన మనుషుల చేతుల్లోనే ఉన్నాయి గదా. రాజా, ప్రజల సంతోషం ఈ వృత్తులమీదనే ఆధారపడి ఉంది' అని అనువదించారు గంగూలీ. 

అలాగే ప్రామాణిక సంస్కృత నిఘంటువు అమరకోశంలో కూడా 'వార్త యనగా బేరము మొదలైన జీవనోపాయము; తదర్థములైన ధాన్యాదులను వార్త యనబడును. ఆ ధాన్యాదుల మోయువాడు గనుక వార్తావహుడు' అని ఉంది. వార్త అంటే వృత్తాంతము అనే అర్థంతోపాటు వ్యవసాయం, పశుపాలన, వాణిజ్యం అనే అర్థాలు కూడా ఉన్నాయి. 

ఇక తెలుగులోకి వస్తే, నన్నయ శ్రీమదాంధ్ర మహాభారతము లో సభాపర్వం ప్రథమాశ్వాసంలో 51వ పద్యంగా 'వార్తయందు జగము వర్ధిల్లుచున్నది; యదియు లేనినాడ యఖిల జనులు/నంధకారమగ్నులగుదురు గావున/వార్త నిర్వహింపవలయు బతికి' అని రాశాడు. వార్త అనే సంస్కృత శబ్దాన్ని యథాతథంగా ఉంచి న నన్నయ ఆ మాటకు తెలుగులో ఇవాళ మనం ఇచ్చుకుంటున్న అర్థాన్ని ఉద్దేశించాడో లేదో స్పష్టంగా తెలియదు. 

కాని కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అని తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురించిన ప్రతిపదార్థ తాత్పర్య, సరళ వ్యాఖ్యాన సహితమైన పుస్తకంలోకి వచ్చే సరికి వ్యాసుడి నుంచీ, నన్నయ నుంచీ చాలా దూరం వచ్చేశాం. డాక్టర్ అప్పజోడు వేంకటసుబ్బయ్య వ్యాఖ్యాతగా, డాక్టర్ జివి సుబ్రహ్మణ్యం ప్రధాన సంపాదకుడిగా వెలువడిన ఈ గ్రంథం (ప్రచుర ణ ఆగస్టు 2000, పేజీ23)లో 'వార్త+అందు+అ=వార్త (న్యూస్) అని ఇంగ్లీషు కూడా కలిపి వార్తను మనకు తెలిసిన వార్త మాత్రమే అన్నట్టు అర్థం చెప్పారు. 'ప్రపంచమంతా వార్తమీదే నడుస్తున్నది. అది లేకుంటే ప్రజలంతా పెనుచీకట్లో మునిగినట్టే. అందువల్ల ప్రభువు వార్తను బాగా నడపాలి' అని తాత్పర్యం ఇచ్చారు. 

ఇంకా ముందుకువెళ్లి 'విశేషం' అనే వ్యాఖ్యానంలో 'వార్త అంటే-వృత్తాంతం, వర్తనం, అర్థానర్థ వివేచన విద్య-అనే అర్థాలున్నాయి. వార్తలను, సేకరించడం, ప్రసరించడం ప్రభుత్వ బాధ్యత. అంతేకాదు. అది గొప్ప సామాజికావసరం కూడా. వార్తా నిర్వహణ సరిగా లేకుంటే ప్రభుత్వంలో ఒక విభాగానికి మరొక విభాగానికి, దేశంలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి, సమాజంలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అవగాహన కుంటుపడుతుంది. సమన్వయం లోపిస్తుంది. 

ఎక్కడ ఏం జరుగుతున్నదో, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో, ఏయే సమస్యలకు ఏయే పరిష్కారాలో ఎవ్వరికి తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అందరు అంధకారంలో ఉన్నట్టే అవుతుంది. అందుచేత ప్రభువు వార్తను సమర్థంగా నిర్వహించాలి. ప్రత్యేకించి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వార్తా నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఉంది. ఒక విధంగా ప్రభుత్వానికి కళ్లు, చెవులు- ప్రజలకు కళ్లు చెవులు-వార్తా పత్రికలే. ఇవి మామూలు కళ్లకు అందని దృశ్యాలను చూపిస్తాయి. 

మామూలు చెవులకు వినిపించని విషయాల్ని వినిపిస్తాయి' అని రాశారు. నారదుడు ధర్మరాజుకు బోధించిన రాజనీతి సందర్భంలో రెండువేల ఏళ్లకింద మొదటిసారి సంకలితమై, వెయ్యి సంవత్సరాల కింద తెలుగులోకి వచ్చిన గ్రంథంలో ఆధునిక వార్తా పత్రిక గురించి, ప్రజాస్వామ్య ప్రభుత్వం గురించి వెతకడం ఎంత అసందర్భమో చెప్పనక్కరలేదు. 

శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువు కూడా వార్త అనే సంస్కృత మూల పదానికి ఉన్న అర్థాలలో 'సమాచారము' తోపాటే 'జీవిక, వృత్తి, వైశ్యవృత్తి, వాణిజ్యము, సేద్యము, కృషీ, అన్వీక్షక్యాది విద్యలలో నొకటి' అనే అర్థాలు ఇచ్చింది. 'ఆంధ్ర గ్రంథములయందు మాత్రమే కానవచ్చుచున్నవి' అనే అర్థాలలో ప్రసిద్ధి, లోకోక్తి, నీతి అనే అర్థాలు ఇచ్చింది. 

ఇంతకీ ధర్మరాజుతో నారదుడు ప్రస్తావించిన వార్త, వ్యాసుడు రాసిన వార్త, నన్నయ అనువదించిన వార్త, తితిదే వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించిన వార్త, కొందరు పత్రికా సంపాదకులు అన్వయించిన వార్త ఒకటేనా, వేరువేరా? అట్లాగే వార్తకు సమాచారం అనే అర్థం మాత్రమే చెప్పుకుంటే వ్యాసుడి శ్లోకానికైనా, నన్నయ పద్యానికైనా అన్వయదోషం రాదా? వార్త అంటే వ్యవసాయమనో జీవనవృత్తి అనో అర్థం చెప్పుకుంటే అందువల్ల 'జగము వర్ధిల్లుచుండు' అంటే సరిపోతుంది గాని, వార్త అని చెప్పుకుంటే అర్థం సరిపోతుందా? సమాచార వార్త వల్ల జగము వర్ధిల్లుతుందా, జగము వల్ల సమాచార వార్త వర్ధిల్లుతుందా?

-ఎన్. వేణుగోపాల్
Andhra Jyothi News Paper Dated : 12/09/2010

Thursday, November 3, 2011

చంద్రబాబు నోట చరిత్ర మాట! -ఎన్. వేణుగోపాల్



తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు నోట చరిత్ర అనే మాట వెలువడడమా? ఎంత అపచారం! నవంబర్ 1న ఎన్‌టిఆర్ భవన్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ పతాకావిష్కరణ తర్వాత ఆయన చరిత్ర చెప్పడానికి ప్రయత్నించారట. మూడు వేల సంవత్సరాల తెలుగు వారి చరివూతలో తెలుగు ప్రజలు విడిపోయి ఉన్నది 150 ఏళ్లేనని అన్నారట. తెలుగువారి ఐక్యత కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు, బూర్గుల రామకృష్ణారావు లాంటి వారు పదవీత్యాగం చేశారని అన్నారట. అసలు చరిత్రే అక్కర లేదన్న ఘనచరిత్ర గల మహానేత! ఈ చరిత్ర పాఠాలు ఏ పాఠశాలలో నేర్చుకున్నారో తెలియదు.
సరిగ్గా పన్నెండు సంవత్సరాల కింద 1999 నవంబర్‌లో హైదరాబాద్ జరిగిన తెలుగుదేశం పార్లమెంటు సభ్యుల శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు అప్పటి డిగ్రీ కాలేజీల దుస్థితి గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆయన డిగ్రీ కాలేజీలకు ప్రభుత్వపరంగా సహాయం అందించే ప్రస క్తే లేదని, చరిత్ర, అర్థశాస్త్రం, ఆర్ట్ కోర్సులకు కాలం చెల్లిందని, ఆ డిగ్రీలన్నీ వృథా అని, కంప్యూటర్లు, వైద్యం, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ విద్యలు చాలునని అన్నారు. అప్పుడు పత్రికలన్నిటిలో ఆ వార్త హోరెత్తింది. చరిత్ర అధ్యాపకులు నిరసన ప్రకటనలు కూడా చేశారు. 

(అప్పుడు ఆంధ్రవూపభలో రాస్తుండిన వారం వారం శీర్షికలో నవంబర్ 30న ప్రపంచ బ్యాంకు పాఠాలు చాలు, చరిత్ర ఎందుకు? అనే వ్యాసంలో ఆ ఉపన్యాసాన్ని విమర్శిస్తూ రాశాను.) ఆ తర్వాత కూడ ఆయన ఆ అభివూపాయాన్ని ఎన్నోసార్లు పునరుద్ఘాటించారు. చరిత్ర అక్కరలేదని అనుకునేవారు తప్పుడు చరివూతను చెప్పడంలో, తమ ఇష్టారాజ్యంగా చరివూతను వక్రీకరించడంలో ఆశ్చర్యం లేదు. కానీ చరిత్ర పట్ల గౌరవం ఉన్నవారు, చరిత్ర కావాలనుకునేవారు నిజాయితీగా నిజమైన చరివూతను తెలుసుకోవలసి ఉంటుంది. 

చంద్రబాబు చేసిన రెండు వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలు. చరివూతలో జరగని, చరివూతతో సంబంధంలేని విషయాలు. మూడు వేల ఏళ్ల తెలుగువారి చరివూతలో తెలుగు ప్రజలు కలిసి ఉన్నది ఎక్కువలో ఎక్కువ నాలుగువందల యాభై సంవత్సరాలు మాత్రమే. చంద్రబాబు చెప్పినట్టు విడిపోయి ఉన్నది 150 ఏళ్లు కాదు, రెండువేల ఐదువందల సంవత్సరాలకు పైగా. తెలుగువారి చరిత్ర గురించి ఏ ప్రామాణిక గ్రంథం చూసినా ఈ వాస్తవం తెలుస్తుంది. కళింగ, వేంగి, వెలనా డు, పాకనాడు, రేనాడు, సబ్బినాడు మొదలై న నాడులేర్పడి ప్రతి నాడులోను స్వతంత్ర రాజ్యం వెలసి రాజకీయైక్యానికి భంగం వాటిల్లింది. రాజకీయంగానేగాక, ప్రతివర్ణం లోను నాడీభేదం ఏర్పడి సాంఘిక అనైక్యానికి కారణమై జాతీయభావం దుర్బలమయింది. రేనాడు, తెలంగాణ ప్రాంతాలు చిరకాలం ఆంధ్రేతర రాజవంశాల పాలనలోనే ఉండ డం జరిగింది. సుదీర్ఘమైన తమ చరివూతలో ఆంధ్రులు అత్యల్పకాలం మాత్రమే ఏకఛవూతాధిపత్యం కింద మనగలిగినారు అని స్వయం గా గుంటూరు జిల్లాకు చెందిన, నాగార్జున విశ్వవిద్యాలయంలో చరిత్ర అధ్యాపకులుగా పనిచేసిన బి.ఎస్.ఎల్ హనుమంతరావు రాశారు. 


ఇవాళ ఆంధ్రవూపదేశ్‌గా ఉన్న ప్రాంతం మొత్తంగా గాని, తెలుగు వారు నివసిస్తున్న ప్రాంతాలు అన్నీగాని 1956కు ముందు ఒకే పాలనలో ఎప్పుడూ లేవు. ఈ భూభాగంలో అతి ఎక్కువ ప్రాంతాలను ఏకచ్ఛవూతాధిప త్యం కింద పాలించిన రాజవంశాలు శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు మాత్రమే. క్రీ.పూ. మూడో శతాబ్దం మధ్య నుంచి క్రీ.శ. మూడో శతాబ్దం తొలిరోజుల దాకా నాలుగు శతాబ్దాల పాటు పాలించిన శాతవాహనులు ఎక్కువగా ఇవాళ్టి తెలంగాణ, మహారాష్ట్రల నుంచి పాలించారు. వారు ఆ నాలుగు శతాబ్దాల కాలంలో తూర్పు సమువూదాన్ని చేరిన ఆధారాలున్నాయి గనుక కోస్తాంవూధలో కొంతభాగం వారి ఏలుబడిలోకి వచ్చిందని అనుకోవచ్చుగాని మిగిలిన తెలుగు ప్రాంతాలు వారి పాలనకు బైటనే ఉండిపోయాయి. 


శాతవాహనుల తర్వాత కాకతీయుల వరకు తెలుగు వారు వేరువేరు చిన్న రాజ్యాల పాలనలలోనే ఉన్నారు. ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనంద గోత్రజులు, కళింగ రాజ్యాలు, విష్ణుకుండినులు, పల్లవులు, రేనాటి చోడులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, చోళులు, హైహయులు, వగైరా ఎన్నో వంశాలకు చెందిన రాజులు ఈ ఎనిమిది తొమ్మిది శతాబ్దాలలో తెలుగువారిని పాలించారు. వీరిలో అతి పెద్ద భూభాగాన్ని పాలించినవారు కూడా ఇవాళ్టి నాలుగు జిల్లాలకు మించి పాలించలేదు. పైగా ఈ రాజుల మధ్య, వారి సామంతుల మధ్య నిత్యం యుద్ధాలు, ఘర్షణలు జరిగాయి గనుక, ఆనాటి రవాణా సంబంధాలు అత్యల్పం గనుక ఆయా ప్రాంతాల తెలుగు ప్రజల మధ్య ఐక్యత ఉండిందని కూడ చెప్పడానికి వీలులేదు. ఆతర్వాత 950 నుంచి 1323 వరకు నాలుగు వందల సంవత్సరాలు హనుమకొండ, వరంగల్లు రాజధానులుగా పాలన నడిపిన కాకతీయుల కాలంలో, ముఖ్యంగా 1199 నుంచి 1262 వరకు పాలించిన గణపతి దేవుడు తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నిటినీ తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. అలా చూసినా మొత్తంమీద కాకతీయుల కాలంలో తెలుగువారందరూ ఒకేపాలనలో ఉన్న కాలం నూటయాభై ఏళ్లకు మించదు. 

కాకతీయుల పతనం నుంచి కుతుబ్ షాహీల పాలన మొదలయ్యేదాకా, పదహారో శతాబ్ది మధ్య దాకా, మళ్లీ తెలుగు ప్రజలు వేరువేరు పాలనల కింద నే కొనసాగారు. ఎక్కడికక్కడ రెడ్డి రాజులు, నాయక రాజులు తలెత్తి ప్రస్తుత జిల్లా కన్నా తక్కువ భాగాన్ని మాత్రమే పాలించారు. ఆ తర్వాత వచ్చిన విజయనగర సామ్రాజ్యం విశాలమైనదే గాని, మహాఘనత వహించిన శ్రీకృష్ణదేవరాయల పాలనలో కూడ ఆ పాలన కృష్ణానదిని దాటి తెలంగాణలో అడుగుపెట్టలేదు. తెలుగు ప్రజలను ఏకం చేయలేదు. రాచకొండ, ఖమ్మం, కొండపల్లి వంటి దుర్గాల మీద శ్రీకృష్ణదేవరాయల దాడి ఆ దుర్గాలను దోచుకోవడానికే గాని తెలుగు ప్రజలను ఏకం చేయడానికి కాదు!

విజయనగర పతనానంతరం గోల్కొండ రాజధానిగా తలెత్తిన కుతుబ్ షాహీల కాలంలో, దాదాపు 1670 ప్రాంతంలో దాదాపు ఇవాళ్టి ఆంధ్రవూపదేశ్ అంతా ఒకే పాలన కిందికి వచ్చింది. కానీ అప్పుడు కూడ కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని గణనీయమైన భాగాలు ఆ పాలనలో భాగం కాలేదు. మొఘల్ చక్రవర్తుల సామంతులుగా ఉండి 1724లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న అసఫ్ జాహీలు దాదాపు కుతుబ్ షాహి రాజ్యాన్నే పాలించారు కాని 1766 నుంచి 1802 మధ్య కోస్తాంధ్ర, రాయలసీమలను బ్రిటిష్ పాలకులకు ఇచ్చేశారు. మొత్తంగా తేలేదేమంటే, చంద్రబాబు తెలుసుకోవలసినదేమంటే, తెలుగువారు ఒకే పాలన కింద ఉన్న సమయాలు శాతవాహనుల పాలనలో దాదాపు 200 సంవత్సరాలు, కాకతీయుల కాలంలో దాదాపు150 సంవత్సరాలు, కుతుబ్ షాహి అసఫ్ జాహీ పాలనలో దాదాపు వంద సంవత్సరాలు, వెరసి మొత్తం 450 సంవత్సరాలు మాత్రమే.ఇంతకూ ఎంతకాలం కలిసి ఉన్నారు, లేదా విడిగా ఉన్నారు అనేది ప్రశ్న కాదు, ఒకరితో ఒకరు ఎట్లా ఉన్నారు అనేది ప్రశ్న. మొత్తానికి మొత్తం మూడువేల ఏళ్లూ కలిసే ఉన్నప్పటికీ కూడా,జరిగిన అన్యాయాలు, వివక్ష, ద్రోహాలు, వాగ్దానాల ఉల్లంఘనల తర్వాత విడిపోక తప్పని స్థితి ఏర్పడింది. విడిపోవాలనే కోరిక సమంజసమైనదే, న్యాయమైనదే. ఆ కోరికను తప్పుడు చరిత్ర సాయంతో కాదనడం అవివే కం, అజ్ఞానం, అన్యాయం, అమానవీయం. 

ఇక పొట్టి శ్రీరాములు తెలుగువారి ఐక్యత కోసం ప్రాణత్యాగం చేశారని చంద్రబాబు నోట పలికిన రెండో అబద్ధం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పొట్టి శ్రీరాములు నిరాహారదీక్ష మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు భాషా ప్రాంతాలను వేరు చేసి రాష్ట్రం ఏర్పాటు చేయాలని మాత్రమే, కొత్త రాష్ట్రానికి రాజధాని గా మద్రాసు ఉండాలని మాత్రమే. నిరాహారదీక్ష సాగుతుండగానే 1952 డిసెంబర్ 8న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడానికి అభ్యంతరం లేదని, కాని ఆంధ్ర రాష్ట్రవాదులు అడుగుతున్నట్టుగా వారికి మద్రాసు ఇవ్వడం కుదరదని ప్రధాని నెహ్రూ అన్నారు. ఆ ప్రకటన వెలువడిన తర్వాత కూడ శ్రీరాములు నిరాహారదీక్ష విరమించలేదు, ఆ తర్వాత వారానికి మరణించారు. అంటే ఆయన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కన్నా, మద్రాసును ఆంధ్రకు ఇవ్వడమే ప్రధానమైందన్నమాట. అప్పటికే కొందరి మనసుల్లో విశాలాంధ్ర భావన ఉండవచ్చుగానీ పొట్టి శ్రీరాములు ప్రకటించిన డిమాండ్లలో మాత్రం ఆ ప్రస్తావన లేదు. ఆయన కోరని డిమాండ్‌ను ఆయన నోట పెట్టడం చంద్రబాబు వంటి చరిత్ర వద్దనే వారికి మాత్రమే చెల్లుతుంది.
అబద్ధాలతో, వక్రీకరణలతో పాలన సాగించవచ్చుగాని, చరివూతను పునర్నిర్మించలేమని, ప్రజా ఉద్యమాల మీద బురద చల్లలేమని చంద్రబాబుకు తెలిస్తే బాగుండును! 

-ఎన్. వేణుగోపాల్
Namasete Telangana   paper 04/11/2011 

Thursday, September 22, 2011

సకల జనులకు నీరాజనం by -ఎన్. వేణుగోపాల్ Namasethe telangana 23/09/2011


9/23/2011 12:30:10 AM
సకల జనులకు నీరాజనం
TG1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
సకల జనుల సమ్మెలో భాగంగా చరివూతాత్మకమైన, విశిష్టమైన, నిర్ణయాత్మకమైన పోరాటం సాగిస్తున్న తెలంగాణ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు నీరాజనం. ప్రత్యేకంగా హైదరాబాద్, ఢిల్లీ మాయల మరాఠీల ప్రాణాలు గోదావరి లోయ భూగర్భంలోనూ, ఆర్థిక ప్రయోజనాలలోనూ ఉన్నాయని గుర్తించి అక్కడి చిలుకను పట్టుకుంటున్న సింగరేణి కార్మిక వర్గానికీ, ఇతర కార్మిక, ఉద్యోగ సోదరులకూ జేజేలు.

తొమ్మిది రోజులుగా తెలంగాణ ప్రజలు ప్రదర్శిస్తున్న ఈ సమరశీల పోరాట స్ఫూర్తి అద్భుతంగా, ఉత్సాహభరితంగా, ఆశాసూచికగా ఉన్నది. తెలంగాణ ప్రజా ఉద్యమం ఆరు దశాబ్దాల ఆకాంక్షల వ్యక్తీకరణలూ, ఐక్యతా ప్రదర్శనలూ, నిరసన ప్రకటనలూ దాటి సెప్టెంబర్ 13న ఒక మలుపు తిరిగి సకల జనుల సమ్మెగా ప్రతిఘటనా మార్గా న్ని చేపట్టింది. ఈ ప్రతిఘటన ఇప్పటికే తెలంగాణ వైరివర్గాలలో భూకంపం పుట్టిస్తున్నది. మహా ఘనత వహించిన ముఖ్యమంవూతివర్యులు సచివాలయంలోకి దొడ్డిదారిన ప్రవేశించిన ఘట్టం ఆర్తనాదములు శ్రవణానందకరముగనున్నవి అని మాయాబజార్ ఘటోత్కచుడు అన్నట్టు కనులవిందుగా ఉన్నది.

ఈ అద్భుత, అపూర్వ సన్నివేశంలో మరచిపోకుండా గుర్తించవలసిన, ఎత్తిపట్టవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి గుర్తించి, విస్తరించినప్పుడు మాత్రమే, ఉన్నతీకరించినప్పుడు మాత్రమే తెలంగాణ స్వప్నం సాకారమయే దిశలో మరొక ముందడుగు వేయగలుగుతాం. సకల జనుల సమ్మె ప్రారంభంలో అది ఏమిటి, ఎలా జరగాలి, సకల జనులంటే ఎవరు, కార్యక్షికమం ఎలా ఉంటుంది లాంటి ప్రశ్నలతో గందరగోళ స్థితి కొంత ఉండింది. బహుశా ఆ కారణం వల్లనే అనుకు న్న సమయానికి ప్రారంభం కాకపోవడం, వాయిదా పడడం జరిగింది. కాని ఆ కృత్యాద్యవస్థను దాటి సకల జనుల సమ్మె సెప్టెంబర్ 13న 65,000 మంది సింగరేణి కార్మికుల సమ్మెతో, నాలుగున్నర లక్షల రాష్ట్రవూపభుత్వోద్యోగుల సమ్మెతో ప్రారం భం కావడం అద్భుతమైన నాంది.

ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న శక్తుల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయకుండా పోరాటం ముందుకు కదలడం సాధ్యం కాదని తెలిసిన స్థితిలో సింగరేణి సమ్మె ఆ పనిని సాధించింది. సింగరేణి విశిష్టమైనది, ప్రత్యేకమైనది. అది దక్షిణ భారతదేశం మొత్తంలో ఏకైక బొగ్గు గని. వందలాది ప్రభుత్వ, ప్రైవేటు విద్యుదుత్పత్తి కేంద్రాలకు, పరిక్షిశమలకు బొగ్గు సరఫరా చేసే గని. నాలుగు జిల్లాలు వ్యాపించిన, లక్ష కుటుంబా ల జీవనాధారమైన విశాలమైన బొగ్గు గని. కనీసం ఏడు దశాబ్దాలు గా వీరోచితమైన పోరాట సంప్రదా యం ఉన్న గని. అది మూతబడితే ఆ మేరకు ప్రభుత్వానికీ, పరిక్షిశమలకూ, కాంట్రాక్టర్లకూ గంగ అందువల్లనే సింగరేణి కార్మికులు, వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు సమ్మెలో దిగడం ప్రభుత్వాన్ని స్తంభింపజేసింది.

తర్వాత ఒక్కొక్కరుగా థియేటర్ కార్మికులు, ఒక లక్షా డ్బై వేల మంది ఉపాధ్యాయులు, అరవై వేల మంది ఆర్‌టిసి కార్మికులు, రెండు లక్షల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, వేలాదిగా అనేక ఇతర వర్గాల ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు, పారిశుధ్య కార్మికులు, న్యాయవాదులు, విద్యార్థులు కూడ సకల జను ల సమ్మెలో దిగడం రాష్ట్ర ప్రభుత్వాన్ని అల్లకల్లోలం చేసింది. చేస్తున్న ది. తెలంగాణ ఆకాంక్షలకు ప్రధాన అవరోధంగా ఉన్న ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సరైన శిక్ష.

ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సింగరేణి, ఆర్‌టిసి, విద్యుత్తు మూడు రంగాలూ అతి ప్రధాన స్థానంలో ఉన్నాయి. ఈ మూడు రంగాలలో ప్రతిష్టంభన ఏర్పడితే మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే దెబ్బతింటుంది. రాష్ట్ర ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అలా రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో పడినప్పుడే తెలంగాణ ఆకాంక్షలను గౌరవించడం, తానే 2009 డిసెంబర్ 9న చేసిన వాగ్దానాన్ని అమలు పరచడం ఎంత అవసరమో కేంద్ర ప్రభుత్వానికి తెలిసివస్తుంది. అందువల్ల ఈ అపురూప పోరాటాన్ని సమర్థించడం, ఎత్తిపట్టడం, అది ఆగిపోకుండా చూడడం, దాన్ని విస్తరించడం, దాని మీద అమలవుతున్న భయంకరమైన, చట్టవ్యతిరేకమైన నిర్బంధాన్ని ఖండించడం ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యత. తెలంగాణకు బయటి ప్రజాస్వామిక వాదుల బాధ్యత.

అట్లాగే ఒక విశాల ప్రజా ఉద్యమంలో కార్మికవర్గ పాత్ర ఎంత కీలకమైనదో కూడ సకల జనుల సమ్మె స్పష్టంగా చూపుతున్నది. కార్మికవర్గం ప్రత్యక్షంగా పాలకుల మనుగడకు అవసరమైన ఆర్థిక మూలాలను అందజేస్తుంది గనుక కార్మికవర్గం తన పని ఆపితే ఏలినవారి ప్రాణవాయువు నిలిచిపోతుంది. కార్మికవర్గ నిరంతర శ్రమ మీదనే ఏలినవారి పటాటోపమంతా ఆధారపడి ఉంది గనుక ఆ కార్మికవర్గం కళ్లెపూరజేస్తే ఏలినవారి అధికారచక్రం కీచుమంటూ ఆగిపోతుంది. ప్రపంచ చరివూతలో ఎన్నోసార్లు రుజువైన ఈ సత్యాన్ని తెలంగాణ నడిబొడ్డు మీద తెలంగాణ బిడ్డలు మరొకసారి ప్రకటిస్తున్నారు.

అయితే ఇప్పటికి సకల జనుల సమ్మెది పాక్షిక విజయమే. ఇది సంపూర్ణ విజయం దిశగా పయనించాలంటే ఇవాళ సకల జనుల సమ్మెలో పాల్గొంటున్న దాదాపు పది లక్షల మంది కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, అసంఘటిత రంగ సోదరులతో మిగిలిన నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు చెయ్యీచెయ్యీ కలపవలసి ఉంది. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డా తన వంతుగా ఏమి చేయగలిగితే అది చేయవలసి ఉంది.

ఇది ఇంకా పాక్షిక విజయమే అనడం ఎందువల్లనంటే తెలంగాణ ప్రత్యర్థులు నలుగురుండగా అందు లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనే ఒక్క ప్రత్యర్థి మీద మాత్రమే సకల జనుల సమ్మె ప్రభావం ఉన్న ది. మిగిలిన ముగ్గురు ప్రత్యర్థులు భారత ప్రభుత్వం; కోస్తాంధ్ర, రాయలసీమ కుబేరులు; తెలంగాణ దళారులు కూడ దిగివచ్చే పోరాట రూపాలను తెలంగాణ ప్రజలు చేపట్టినప్పుడే సకల జనుల సమ్మె సార్థకమవుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష సాకారమవుతుంది. ఈ ముగ్గురు ప్రత్యర్థుల రాజకీయ ఆర్థిక ప్రయోజనాలను అడుగడుగునా అడ్డుకోవడమే, తద్వారా వారి ని లొంగదీయడమే ఇవాళ్టి కర్తవ్యం.
తెలంగాణలో ఉన్న, తెలంగాణ మీదుగా వెళ్తున్న కేంద్ర ప్రభుత్వ సేవలను, సంస్థలను, వ్యాపారాల ను కూడ అడ్డుకుని, డిసెంబర్ 9 ప్రకటన అమలు చేసేవరకూ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాలు కూడ అడ్డుకుంటామని ప్రకటించవలసి ఉంది. అలాగే కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాపారులు తెలంగాణ వనరులను కొల్లగొట్టి కుబేరులయి, రాజకీయాలలోకి దిగారు. వారి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు తెలంగాణలో ఇక చెల్లవని అడుగడుగునా ప్రకటించవలసి ఉంది.

ప్రతిఘటించవలసి ఉంది. తెలంగాణను వ్యతిరేకిస్తున్న, తెలంగాణ పట్ల అవకాశవాదం నడుపుతున్న రాజకీయ నాయకుల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఇక నెరవరనివ్వబోమని ప్రతిఘటించవలసి ఉంది. అదే విధంగా తెలంగాణలో పుట్టి కూడ తెలంగాణ వ్యతిరేకులుగా, ద్రోహులుగా ఉన్నవారి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయడం ప్రారంభించినప్పుడే వారు దారికి రాగలరు. ఈ పనులన్నీ తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులూ, తెలంగాణ ప్రజలూ ఎక్కడికక్కడ చేయవచ్చు.
ఇటువంటి విస్తృతమైన సకల జనుల సమ్మెలో ప్రతి మనిషికీ పాత్ర ఉంది. ఆ పాత్ర నిర్వహించడం ద్వారానే సింగరేణి, ఆర్‌టిసి, విద్యుత్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెను బలోపేతం చేయగలుగుతాం. అప్పుడు మాత్రమే వారి మీద సాగుతున్న అమానుష నిర్బంధాన్ని తగ్గించగలుగుతాం. అప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్ర సాధనకు దగ్గరవుతాం.
-ఎన్. వేణుగోపాల్

Sunday, September 4, 2011

12 ఎఫ్-అబద్ధాలూ, మోసాలూ -ఎన్. వేణుగోపాల్ Namasethe Telangana 05/08/2011


12 ఎఫ్-అబద్ధాలూ, మోసాలూ
-ఎన్. వేణుగోపాల్
తెలంగాణకు పనికొచ్చే ముల్కీ నిబంధనలు రద్దు చేయడమేమో క్షణాల మీద జరిగిపోయింది. తెలంగాణ వారి ఉద్యోగాలను ఇతర ప్రాంతాల వారు కొల్లగొట్టకుండా తీసుకోవలసిన రక్షణ చర్య కాగితం మీదికి రావడానికి మాత్రం రెండు సంవత్సరాలు పట్టింది. ఆ ఉత్తర్వులు రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించి, స్థానికులను నిర్వచించాయి. కానీ ఈ ఉత్తర్వులు కాగితం మీదికి రావడం అనేక కుట్రలతో, కుహకాలతో జరిగింది.
రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14 ఎఫ్ అనే ఉప నిబంధనను తొలగించాలని ఎంతో కాలంగా సాగుతున్న ఆందోళన కీలక దశకు చేరింది. ఈ సందర్భంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే మనం ఎంత అజ్ఞానుల, అబద్ధాలకోరుల, మూర్ఖుల, కుట్రదారుల పాలనలో ఉన్నాం గదా! అని వెయ్యిన్కొకటోసారి ఆశ్చర్యం కలుగుతున్నది.
కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫేర్స్ (సిసిపిఎ- రాజకీయ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం) అనేదొకటి ఉంది. దీనిలో ప్రధాని మన్మోహన్, ప్రణబ్ ముఖర్జీ, ఎ.కె. ఆంటోనీ, పి. చిదంబరం,ఎస్.ఎం.కృష్ణ సభ్యులు. వీరిలో ప్రతిఒక్కరూ కనీ సం నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం గడిపారు.అందరికందరూ కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా చాలా కాలంగా ఉన్నారు. ఇద్దరు ముఖ్యమంవూతులుగా కూడా పనిచేశారు. కానీ ఇంత అనుభవజ్ఞుల ఉప సంఘం ఆగస్టు 1న సమావేశమై ఒక పనికిమాలిన, అన్యాయమైన, అనవసరమైన నిర్ణయం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులలోం చి 14 ఎఫ్ ఉపనిబంధనను తొలగించమని ఆంధ్రవూపదేశ్ శాసనసభ చేత మరొక తీర్మానం చేయించి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది. సమావేశం అయిపోయిన తర్వాత ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తూ చిదంబరం ‘2010 జనవరిలోనో ఎప్పుడో ఆంధ్రవూపదేశ్ శాసనసభ ఆతీర్మానం చేసి పంపింది.
తర్వాత చాలా మార్పులు జరిగాయి. కనుక మళ్లీ తీర్మానం చేసి పంపాలని సిసిపిఎ నిర్ణయించింది. ఆ విష యం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం’ అన్నారు. ‘2010 జనవరిలోనో ఎప్పుడో’ అట. హార్వర్డ్ విద్యావంతుడూ అంతరంగిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యుడూ అయిన ఈ పెద్దమనిషికి కనీసం తాను మాట్లాడుతున్న విషయం సంపూర్ణంగా తెలుసుకోవాలనే ఇంగిత జ్ఞానం లేనట్టుంది. ఆ తీర్మానం జరిగింది 2010 మార్చ్ 18న.చిదంబరం ప్రకటన తర్వాత మళ్లీ తీర్మానం చేయాలా? వద్దా అని శుష్కమైన, మోసపూరితమైన, అనవసరమైన చర్చ జరుగుతున్నది. నిజానికి ఈ విషయంలో ఇప్పుడే కాదు, 2010లో కూడా శాసనసభ తీర్మానం అవసరంలేదు. ఎందుకంటే సవరణ అవసరమైన ఉత్తర్వులు రాష్ట్రపతివి. కేంద్ర ప్రభుత్వం తయారు చేసి రాష్ట్రపతి చేత విడుదల చేయించిన వి. ఆ ఉత్తర్వులు ఇవ్వడానికి వీలుగా రాజ్యాంగ సవరణ చేసి, 371-డి అధికరణం చేర్చి రాష్ట్రపతికి ఆ హక్కు కల్పించారు.
ఆ ఉత్తర్వులలో ఏదైనా తప్పు దొర్లితే, దొర్లిందని ఎవరయినా ఎత్తిచూపినప్పుడు, ఆ ఎత్తిచూపినవారు తీర్మానం చేయవలసిన అవసరమేమీ లేదు. ఆ ఉత్తర్వులు తయారుచేసినవారో, విడుదలచేసినవారో సవరణ ప్రకటిస్తే సరిపోతుంది. కానీ సాధారణమైన పనులను కూడా సంక్లిష్టంగా మార్చే ప్రభుత్వ యంత్రాంగం ఇది. ప్రజాజీవనానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ మాయగా మార్చి, ఎవరికీ తెలియకుండా తిమ్మిని బమ్మిని చేయడం ఈ రాజకీయ వ్యవస్థ ఓ కళగా అభివృద్ధి చేసింది.
ఎవరు తప్పుచేశారో వారు సవరించుకోవాలని, అది చాలా సులభంగా జరగవచ్చునని మామూలు మనుషులం అనుకుంటాం. కానీ ఆ తప్పు ప్రభావం ఎవరిమీద పడుతుందో వాళ్లు అష్టకష్టాలు పడి, బలమైన తమ ప్రత్యర్థులను ఒప్పించి, వారే మెజారిటీగా తాము మైనారిటీగా ఉన్న సభలో తీర్మానాన్ని ఆమోదింపజేసి పంపిస్తేనే సవరిస్తాము అని చెప్పే దగుల్బాజీ రాజకీయ వ్యవస్థ ఇది. చచ్చో చెడో, బ్రహ్మ ప్రయత్నం చేసి అవసరం లేకపోయినా ఒకసారి అటువంటి తీర్మానం చేసి పంపిస్తే, దానిమీద ఏ చర్యా తీసుకోకుండా పదిహేను నెలలు తాత్సారం చేసి, ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టండి అని అడిగే బేహద్బీ ఈ ప్రజావ్యతిరేక వ్యవస్థకే చెల్లింది. అసలింతకూ ఈ మోసం ఈ సిసిపిఎ తోనే, చిదంబరం ప్రకటనతోనే ప్రారంభం కాలేదు. రాష్ట్రపతి ఉత్తర్వుల తయారీలోనే ఈ మోసానికి, అబద్ధానికి బీజం ఉంది. ఈ విషాద, దుర్మార్గ గాథ అక్కడి నుంచే ప్రారంభించాలి.
1947కు ముందరి చట్టాలేవైనా, ప్రత్యేకంగా రద్దు చేసినవి మినహా, స్వతంత్ర భారతంలో కూడా కొనసాగుతాయనీ, అందువల్ల హైదరాబాద్ రాజ్యంలో 1919లో జారీ అయిన ముల్కీ నిబంధనలు కూడా చెల్లుతాయనీ, సుప్రీంకోర్టు 1972 అక్టోబర్ 3న తీర్పు ఇచ్చింది. తెలంగాణ ప్రజలకు మేలు చేసే ఈ తీర్పును నీరు గార్చడానికి కేంద్ర ప్రభుత్వం 1972 డిసెంబర్‌లో ముల్కీ చట్టం అనే కొత్త చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టంలో తెలంగాణకు అనుకూలంగా ఏవో కొద్దిపాటి రక్షణలు ఉంటే అవి కూడా ఉండగూడదని, అసలు తమకు ప్రత్యేక రాష్ట్రమే కావాలని జై ఆంధ్ర ఉద్యమం మొదలయింది. దానితో మళ్లీ ఒకసారి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష విజృంభించింది. ఆ నేపథ్యంలో 1973 జనవరిలో రాష్ట్రపతి పాలన విధించి, అక్టోబర్‌లో ఆరుసూవూతాల పథకం ప్రతిపాదించి, అభివృద్ధికి నోచుకోని రెండు ప్రాంతాలనూ చల్లబరుస్తున్నానని, ఇక రాష్ట్ర విభజన అవసరం లేదని నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించారు.
ఆ ఆరు సూత్రాల పథకంలో మూడో అంశం ‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యక్ష నియామకాలలో కొంతమేరకు స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వడం, స్థానికుల ను నిర్వచించడం’ ఆరో అంశం ‘పై ఐదూ అమలయితే ఇకనుంచి (తెలంగాణ) ప్రాంతీయమండలి, ముల్కీ నిబంధనలు అనవసరమైపోతాయి’పై ఐదు అంశాలు అమలయినా కాకపోయినా ఈ ఆరో అంశం మాత్రం వెంటనే అమలులోకి వచ్చింది. డిసెంబర్‌లోనే ముల్కీ రూల్స్ రద్దు చట్టం తెచ్చారు. మూడో అంశాన్ని అమలు చేయడం కోసం రాజ్యాంగానికి 32వ సవరణచేసి, అధికరణం 371-డి చేర్చి, ఆంధ్రవూపదేశ్ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి రాష్ట్రపతికి అధికారం ఇచ్చారు. మామూలుగా ఎక్కడివారయినా, ఎక్కడికయినా వెళ్లి ఉద్యోగం చేసుకోవచ్చునని చెప్పే చట్టాలు గాని, రాజ్యాంగ అధికరణం 16 గానీ ఈ ప్రత్యేక అధికారాలకు అడ్డురావని స్పష్టంగా చెప్పారు.
అయినా, రాష్ట్రపతికి ఈ ప్రత్యేక అధికారాలు 1973 డిసెంబర్‌లో సమకూరితే, 1975 అక్టోబర్ దాకా ఆ అధికారాన్ని ఉపయోగించుకున్న ఉత్తర్వులు రాలేదు. తెలంగాణకు పనికొచ్చే ముల్కీ నిబంధనలు రద్దు చేయడమేమో క్షణాల మీద జరిగిపోయింది. తెలంగాణ వారి ఉద్యోగాలను ఇతర ప్రాంతాల వారు కొల్లగొట్టకుండా తీసుకోవలసిన రక్షణ చర్య కాగితం మీదికి రావడానికి మాత్రం రెండు సంవత్సరాలు పట్టింది. ఆ ఉత్తర్వులు రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించి, స్థానికులను నిర్వచించాయి. కానీ ఈ ఉత్తర్వులు కాగితం మీదికి రావడం అనేక కుట్రలతో, కుహకాలతో జరిగింది. పధ్నాలుగా పరిచ్ఛేదాలు. మూడు షెడ్యూళ్లతో సుదీర్ఘమైన ఈ ఉత్తర్వులు రాసిన వారెవరో, రాయించిన వారెవరో, ఆ ముసాయిదాను తెలంగాణ నాయకులు, మేధావులు చూశారో లేదో తెలియదు. కానీ చాలా తెలివిగా తెలంగాణ వ్యతిరేక అంశాలు ఇందులో జొప్పించబడ్డాయి. మొత్తం ఉత్తర్వులు తయారైన తీరు మీద వివరమైన విశ్లేషణ అవసరం. కానీ ఇక్కడ మచ్చుకు రెండు చూద్దాం.
ఒకటి. ఇప్పటిదాకా చెప్పిన నేపథ్యం చూస్తే తెలంగాణ ప్రజలందరికీ (పాత హైదరాబాద్ రాష్ట్ర ప్రజలందరికీ) సమానంగా ప్రభుత్వోద్యోగాలలో రక్షణ కల్పించిన ముల్కీ నిబంధనల స్థానంలో వచ్చిన స్థానిక జోన్ల విభజన తెలంగాణనంతా ఒకే జోన్‌గా చూసి ఉండవలసింది. 1969 ఉద్యమ డిమాండ్ అదే. కానీ చాలా విచివూతంగా రాష్ట్రపతి ఉత్తర్వులు తెలంగాణను రెండు జోన్లుగా విభజించి, తెలంగాణలోనే కొన్ని జిల్లాల అభ్యర్థులు మరికొన్ని జిల్లాల్లో స్థానికేతరులు అయ్యే పరిస్థితి కల్పించాయి. మరోవైపు నిజంగా ఏ స్థానికేతరులు (అంటే కోస్తాంధ్ర, రాయలసీమ-లేదా పాత మద్రాసు రాష్ట్రీయులు) సాగించిన ఉద్యోగాల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం జరిగిందో ఆ స్థానికేతరులు దొడ్డిదారిన స్థానికులు అయిపోవడానికి అన్ని అవకాశాలు సమకూరాయి.
రెండవ కుట్ర. స్థానికేతరులను తెలంగాణ ఉద్యోగాలలో ప్రవేశపెట్టడానికి కల్పించిన మినహాయింపులు. రాష్ట్రపతి ఉత్తర్వులలో చివరి పరిచ్ఛేదమైన 14 ‘పై ఉత్తర్వులు ఈ కింది వాటికి వర్తించవు’ అంటూ ఆరు మినహాయింపులు ఇచ్చింది. అవి. ‘ఎ) రాష్ట్ర ప్రభుత్వ సెక్ర లోని ఏ ఉద్యోగమైనా. బి) శాఖాధికారి కార్యాలయంలోని ఏ ఉద్యోగమైనా. సి) ప్రత్యేక అధికారి దగ్గర, సంస్థలలో ఏ ఉద్యోగమైనా. డి) రాష్ట్రస్థాయి కార్యాలయాలలో, సంస్థలలో ఏ ఉద్యోగమైనా. ఇ) భారీ అభివృద్ధి పథకాలలో నాన్ గెజిటెడ్ కాని ఏ ఉద్యోగమైనా. ఎఫ్) హైదరాబాద్ సిటీ పోలీసు చట్టం 1348 ఫసలీ లోని సెక్షన్ 3, క్లాజ్ బిలో నిర్వచించిన ఏ పోలీసు అధికారి ఉద్యోగమైనా’.
ఈ మొదటి ఐదు మినహాయింపులను గత ముప్ఫై ఐదు సంవత్సరాలలో ఎన్ని రకాలుగా, ఎంతగా దుర్వినియోగం చేశారో చెప్పడానికి ఇక్కడ స్థలం సరిపోదు. సెక్ర సంబంధంలేని ఉద్యోగాలను సెక్ర ఉద్యోగాలుగా చూపారు. అవసరమైన వాటినీ కాని వాటినీ కూడా శాఖాధికారి కార్యాలయాలుగా ప్రకటించి వాటి సంఖ్యను ఐదు రెట్లు పెంచారు. ప్రభుత్వ శాఖలుగా రావలసిన చాలా కార్యాలయాలను ప్రత్యేక అధికారి కింద, సంస్థ కింద చూపించారు. జిల్లాజోన్ స్థాయి కార్యాలయాలను కూడా రాష్ట్రస్థాయి కార్యాలయాలుగా ప్రకటించారు. ఇలా సెక్ర పాలనాధికారంలో కోస్తాంధ్ర, రాయలసీమ అధికారులు చక్రం తిప్పుతూ ఉండడం వల్ల ఈ పనులన్నీ జరిగాయి. మినహాయింపు ల దుర్వినియోగం విచ్చలవిడిగా జరిగింది. తెలంగాణ అభ్యర్థులు తమకు న్యాయంగా రావలసిన కొన్ని లక్షల ఉద్యోగాలు కోల్పోయారు.
ఈ అక్రమాల మీద గిర్‌గ్లాని కమిషన్, తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు, ఇతర విశ్లేషకులు మాట్లాడుతుండగానే చివరి మినహాయింపు అయిన ఎఫ్ రంగం మీదికి వచ్చింది. సుప్రీంకోర్టు దాకా కేసు నవడడం, అనవసరమైన, అర్థరహితమైన ఫ్రీజోన్ అనే మాట రావడం ఇక్కడ చెప్పుకోనక్కరలేదు. కానీ ఆ ఉప నిబంధనలో హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టాన్ని ఉదహరించడం కేవలం ఆ చట్టంలో సెక్షన్ 3 క్లాజ్ బిలో పోలీసు అధికారి అంటే ఉన్న నిర్వచనం కోసం మాత్రమే. ఆ నిర్వచనం కిందికి రాష్ట్రంలోని పోలీసు అధికారులందరూ వస్తారు. అంటే రాష్ట్రపతి ఉత్తర్వులలోని మినహాయింపును వాడుకొని రాష్ట్ర పోలీసు వ్యవస్థలో తెలంగాణ అభ్యర్థులకు ఎటువంటి రక్షణా, వాటా లేకుండా చేయడానికి జరుగుతున్న ప్రయత్నమిది. ఆంధ్రవూపదేశ్ సమైక్య రాష్ట్రం కొనసాగినంత కాలం తెలంగాణ ప్రజల, ఉద్యోగార్థుల, నిరుద్యోగుల, అభ్యర్థుల ప్రయోజనాలు ఎంత దారుణంగా, కుట్ర పూరితంగా, మోసపూరితంగా దెబ్బతింటాయో చూపడానికి ఇంతకన్న వేరే ఉదాహరణ కావాలా?