Showing posts with label Dr. P Kanakaiah. Show all posts
Showing posts with label Dr. P Kanakaiah. Show all posts

Monday, October 7, 2013

సాహిత్యంలో గిరిజనులు By ప్రొఫెసర్. గుండె డప్పు కనకయ్య, తెలంగాణ యూనివర్సిటీ


హైటెక్‌ జీవితానికి అలవాటు పడుతున్న ఈ రోజులలో గిరిజన వ్యవస్థలోకూడా మార్పులు రావాలని కొందరు కోరుకుంటున్నారు. తమకు ఇష్టం లేకున్నా తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని కొందరంటారు. అయితే ఈనాడు గిరిజన వివాహవ్యవస్థ తారుమారు అవుతోందని, ఈనాడు వరుణ్ణి కొనుక్కోవాల్సి వస్తోందని, ఈ పరిణామం కొంత బాధగా ఉందని ఇంకొందరి వాదన. పాత సంప్రదాయం ఉంటేనే స్త్రీకి ఒక గౌరవ ప్రదమైన మర్యాద ఉంటుందని, తద్వారా ఒక స్థాయి ఉంటుందని, స్త్రీని గౌరవించని సమాజం తమకు వద్దని, ఆ సంప్రదాయం కనుమరుగై పోవటం తమకు ఇష్టం లేదని కొందరు అంటున్నారు. 

ఉత్పత్తి కులాల వృత్తిపరమైన జాబితాను పరిశీలిస్తే- గిరిజనుల్లో కూడా ఉత్పత్తి చేసేవారు, పెట్టుబడిదారులు, కూలీలు, రోజువారి కూలీలు, సంచారులు ఉన్నారు. వీరిలో పేదవారు, మధ్యతరగతి వారు ఉన్నారు కానీ ధనికులు లేరు. అత్యంత ధనికులు అసలే లేరు. అయితే వీరిలో మార్వాడి తెగనుండి విడిపోయి, వలస వచ్చిన కొంతమంది ఆంధ్రప్రదేశ్‌ లో నివసిస్తున్నారు. వీరు గొప్ప వ్యాపారులుగా సుస్థిరతను ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నారు. ఈ కులాలలో ఉత్పత్తే ప్రధానం. నిజామాబాద్‌ జిల్లాలోని గాంధారిలో కోటీశ్వరులు ఉన్నారు. లంబాడ, అజుమెర, రవి, ధర్మ, గోత్రం, కొయ్యవాళ్లు ఎక్కువగా ఉన్నారు. నేడు 300 తాండాలున్నాయి. లుకా, లుడా, బాడా గోడా, అజ్జుమెర కులాలు ఉన్నాయి. లంబాడీలు ఎక్కువ మంది శాఖాహారులు. ఎందుకంటే వీరు మార్వాడీలనుండి వచ్చి మార్వాడి సంతతి కింద ఉన్నారు. 

వీరికి కొన్ని ఆశ్రీత కులాలు ఉన్నాయి. ఆశ్రీత కులాలు కూడా ఆహార పరంగా మాంసాహారులు, శాఖాహారులు ఉన్నారు. డా బి. ఆర్‌. అంబేడ్కర్‌ ఊళ్లలో ఉన్న వారిని- వారి వారి స్థితిని బట్టి, కులాన్ని బట్టి, వృత్తినిబట్టి అన్ని రకాల బేరీజు వేసిన తర్వాత ఎవరిని ఏ జాబితాలో పెట్టాలో ఆలోచించారు. ఆనాడు ఈ కులాల మీద వేసిన కమిటీలు, ఆయా కులాల వారికి స్వేచ్ఛను ఇచ్చాయి. ఎవరికి ఏ కులంలో ఇష్టమైతే ఆ కులంలో చేరుమనే స్వేచ్ఛకూడా ఇచ్చారు. కోరుకున్న కొన్ని ఆయా కులాల ఇష్ట ప్రకారం సంబంధిత జాబితాలో చేర్చారు. గిరిజన తెగలలో నేడు హైందవ మతంలో ఎన్ని వృత్తులు ఉన్నాయో దాదాపు అన్ని కులాలు ఉన్నాయి. అన్ని వృత్తులు కూడా ఉన్నాయి. కొయ్యలు - కోయదొరలు - నేటి హైందవ జాతిలో ఉన్న కాపులలాగా పరిగణన పొందుతున్నారు. వీరిని గిరిజన తెగల్లో పెద్ద కులస్థులుగా పరిగణిస్తారు. వీరు మిగతా కులాలను తక్కువ కులాలుగా లెక్కగడతారు. 

అక్కడ అక్కడ తక్కువ కులాలను అణచివేయడాలు కూడా ఉన్నాయి. మామూలుగా ఇక్కడి తెలుగు జాతిలో ఏ విధమైన మానవసంబంధాలున్నాయో గిరిజనతెగల్లో కూడా అవి అలాగే కొనసాగు తున్నాయి. అయితే వివాహ వ్యవస్థ మాత్రం హైందవ జాతికి విభిన్నంగా ఉండటం విశేషం.ఒక పెళ్లి ఒక ఇంటిలో జరగాలంటే వరుడు అనేక ఇబ్బందులు పడాలి. ఇబ్బందులను అధిగమించి ఎదురు కట్నంగా వధువు తల్లిదండ్రులకు రూ. 520 కట్నంగా ఇచ్చి పిల్లను తెచ్చుకోవాలి. వీరి వివాహ వ్యవస్థ ప్రకారం- వరుడు అత్తవారింటికి పిల్లను అడగటానికి వస్తాడు. అక్కడ మొదలవుతుంది పెండ్లి తంతు. అతన్ని ఎనిమిది రోజుల తర్వాత రమ్మంటారు. వరుడు తిరిగి ఎనిమిది రోజులకు వధువు ఇంటికి వస్తాడు. అతనికి ఇంటి ముందర ఒక కుర్చీ లాంటిది ఏదైనా కూర్చోవటానికి వేస్తారు. దానిమీద కూర్చుండమంటారు. కానీ ఎవరు వచ్చినా చూసి, లేచి నిలబడాలి. చేతులు కట్టుకొని నిలబడాలి. 

మామూలుగా కాదు, వరుడు దబాలున లేచి నిలబడాలి. చివరకు కుక్క, పిల్లి, కోడిపిల్ల, మేకపిల్ల వచ్చినా లేచి నిలబడాలి. మళ్లీ ఇంటి వాళ్లు కూర్చోమంటేనే కూర్చోవాలి. లేకపోతే మర్యాద తగ్గిపోయినట్టే. ఏదైనా కింద పడితే వంగి తీసి ఇవ్వాలి. రోజంతా గడిచిన తర్వాత ఆ సాయంత్రానికి ఇంట్లోకి ఆహ్వానిస్తారు. మంచి షడ్రుచులతో అమృత ప్రాయమైన భోజనం పెడతారు. తిన్న తర్వాత పోకలు ఇస్తారు. వాటిని దవడకు వేసుకొని నమలాలి. తర్వాత తాగడం అలవాటు ఉంటే బీడీలు చుట్టలు ఇస్తారు. ఉదయాన్నే ఐదు గంటలకు లేపుతారు. చేయి పెడితే కొరుకుడు పడే చలి నీళ్లతో స్నానం చేయమంటారు. ఆ నీళ్లను ఏడు రోజుల కింద తెచ్చి పెడతారు. ఏడు కుండల్లో నీళ్లు పోసి పెడతారు. అవి చల్లగా మంచులాగా తయారు అవుతాయి. ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఇట్లా - సుమారు వారికి నచ్చే వరకు రోజు ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. కొరుకుడు పడే చలిని తట్టుకుంటేనే పిల్లనివ్వాలనే ఆచారం ఈ నాటికీ లంబాడ తెగలో ఉంది. అలాగే ఆ కుండల మీద మూతగా పెట్టి ఉంచిన చిప్పలను పాదంతో తొక్కి పగల గొట్టాలి. ఒక చిప్పను మధ్యలో పెట్టి చుట్టూ నిలబడతారు.

ఆ చిప్పను వరుడు తన పాదంతో ఒకేసారి తొక్కి పగల గొట్టాలి. పగిలితే వరుడు నచ్చుతాడు, లేకపోతే లేదు. అతడు ఇలా రోజుకొక పరీక్షలో నెగ్గాల్సిందే. ‘పెండ్లి బర్చికావడి’ అనే ఒక తంతు ఉంది. ఒక మొద్దును కావడిలాగా కట్టాలి. ఒకవైపు మంచి బలిష్టులైన ఇద్దరు మనుషులు, మరోవైపు బలవంతులైన ఇద్దరు మనుషులు కూర్చుంటారు. ఆ కావడిని భుజంమీద పెట్టుకొని వరుడు మోయాలి. ఏ మాత్రం వంగినా, కూలబడ్డా, లేక మోయలేక పోయినా పిల్ల దక్కదు. దీనిని పెండ్లి బర్చి కావడి అంటారు. ఈ కావడిని మోస్తుంటే జిల్లేడు కొమ్మతో కొడుతారు. ఈ తంతు అయిపోయిన తర్వాత ఇదివరకు ఎప్పుడో వేసిన పాత తాడు ముడులను, దందెడ ముడులను అనగా కఠినం అనుకున్న, లేదా ఆ వూరిలో ఎవరూ విప్పలేని ముడులను విప్పాలి. అలాగే బావమరుదులు మరీ ఇబ్బంది పెడతారు. పలుగు రాళ్లను తెచ్చి, రెండు రాళ్ల మధ్యలో చెవిని పెట్టి బాగా ఒత్తుతారు. పెళ్లి కూతురును బాగాచూసుకోవాలని బుద్ధిచెబుతారు. అలాగే కుటుంబాన్ని సక్రమంగా నడిపించు కోవాలని ఆజ్ఞాపిస్తారు. 

ఒక్కోసారి ఈ పలుగు రాళ్లు కోసుకుని చెవి అంచుల నుండి నెత్తురు కూడా వస్తుంది. ఇట్లా ఈనేక సార్లు బావమరుదులు బావలకు చెవి చివరి అంచులో రాళ్లు పెట్టి ఒత్తి బాధకు గురిచేస్తారు. ఈ రాళ్లు ఒత్తటానికి కారణం, భార్యా భర్తల మధ్య గొడవలు వచ్చినపుడు, తమకు జన్మనిచ్చిన పవిత్రమైన అమ్మను బావ ఏనాడు తిట్టకూడదని బావమరుదులు హామీ తీసుకుంటారు. ఇలా బాధకు గురి చేసి వాగ్దానం తీసుకోటం ఒక విచిత్రమైన విశేషంగా భావించవచ్చు. 
వరుడు నీళ్లు తెచ్చివ్వాలి. సెలిమె సుమారు ఐదు కిలోమీటర్లు ఉంటుంది. ఆ సెలిమె దగ్గరకు వెళ్లి నీళ్లు తీసుకొని రావాలి. దీని వలన వరునికి ఎంత ఓపిక ఉందనేది తెలుసుకుంటారు. సహనం పాటిస్తాడా లేదా అనేది తేలి పోతుంది. విసురు రాయి విసిరి పెండ్లికి సరిపడా జొన్నలు విసరాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పిల్లను ఇవ్వుమని అత్తామామలను బతిమిలాడటం ఇంకొక ఎత్తు. పిల్లను తన భార్యగా తీసుకొని రావాలంటే ఇంటిల్లిపాదిని వరుడు బతిమిలాడు కుంటాడు. 

అనేక ధాన ధర్మాలను చేస్తాడు. అనేక వాగ్దానాలను చేస్తాడు. ఇంటిల్లిపాదికి నచ్చే వరకు ఇలా ఎన్నో పరీక్షలు నెగ్గాల్సి ఉంటుంది. ఒకమాటలో చెప్పాలంటే వధువు కోసం ఏమైనా చేయాల్సిందే. అయితే ఇన్ని పరీక్షలు ఒకవైపు నడిపిస్తూనే అత్తమామలు వరునికి తగిన పుష్ఠికరమైన భోజనాన్ని ప్రతీ రోజు ఏర్పాటు చేస్తారు. బాగా పచ్చెడలు పెడతారు. నెయ్యి విరివిగా వాడుతారు. ఇవన్నీ వరుని కోసమే. అత్తవారు చూపెట్టిన మర్యాదతో సుమారు తాను అత్తవారింటికి వచ్చినప్పుడు ఉన్న మొలతాడు తెగిపోవాలి. వరుడు బలంగా, దొడ్డుగా అయిన తర్వాత అతడికి వివాహం చేయటానికి ఇష్ట పడతారు. ఎన్నో పరీక్షలు నెగ్గిన అనంతరం, వరుడు తన తల్లి దండ్రులకు కబురు చేస్తాడు. వారు పెళ్లి మేళంతో వస్తారు. వారికి కబురు పంపక ముందే ఇయ్యంపుల కోసం ఒక కల్లు బట్టిని తయారు చేసుకోటం పరిపాటి. మధ్యపానం ఉంది గానీ మాంసాహారం అందరికీ లేదు. మందు తాగటం కొంతమందికే అలవాటు. 

అయితే ఇప్పపూవు సారా తాగడం అందరికీ అలవాటు. ఎందుకంటే అది ఆరోగ్యానికి రక్ష అని వీరు భావిస్తారు. వివాహ సమయాల్లో కొన్ని చోట్ల, ఒక మేకను కోసి పంచడం ఉంది. దాన్ని మాంసాహారంగా భుజించటం ఉంది. వీరి కులంలో బెల్లంతో స్వాగతం పలకాలి. కోటీశ్వ రుడైనా కూడా బెల్లంతో స్వాగతం పలకాల్సిందే. వధువు పెళ్లి కూతురు అవుతుంది. బలియా గాజులు వేసుకోటం పరిపాటి. వివాహ సందర్భంలో కాంస్లీ- జాకెట్‌, అద్దాల రవికెలు, చీరెలు వాడడం పరిపాటి. వివాహం కోసం ప్రత్యేక వస్త్రాలు ఉంటాయి. ‘చూడో తీపెరు’ ఫంక్షన్‌ వంటిది వీరి సంప్రదాయం. పచ్చపచ్చగా కొమ్మలు రెమ్మలు విరుసుకొచ్చి వేసుకున్న పెళ్లి పందిరులు పెళ్లికళను చేకూరుస్తాయి. మూడేసి మట్టి కుండలతో చేసిన దొంతులను, నాలుగు మూలలు పెట్టి వాటిమధ్య కూర్చుంటారు. అన్ని గింజలతో కూడిన పోలు పట్నం పోస్తారు. వైభవోపేతంగా వివాహం జరుగుతుంది. వీరికి పెండ్లి చేసే బ్రాహ్మణవర్గం ఉంది. వీరికి కర్మలు చేసే పూజారులున్నారు. తాళి కట్టే సంప్రదాయం ఉంది. 

రోలు, రోకలి వాడకం ఉంది. పెళ్లి ప్రారంభంలోనే కూరళ్లు పట్టడం ఉంది. వీరు అత్యంత ఇష్టంగా భావించే దేవుడు సేవాలాల్‌ మహారాజు. రామ్‌ రావు మహారాజ్‌, బ్రహ్మచారి. ఈ ముగ్గురికీ పవిత్రంగా అందరూ మొక్కుకుంటారు. దేవుని ముందర రూ. 520 వధువు తండ్రి చేతిలో పెడితే, వధువు తల్లిదండ్రులు పిల్లను వరుని చేతిలో పెడతారు. వీరు వివాహానికి పల్లకీగా ఎద్దును వాడతారు. ఎద్దుమీద కూర్చొని అరుంధతి నక్షత్రాన్ని చూడాలి. ఎద్దుమీద వధువు ఎక్కి వరుని ఇంటికి పోవాలి. ఇలా ప్రత్యేకమైన వాహనాలు వాడుతారు. దీంతో వివాహ తంతు అయిపోతుంది. హైటెక్‌ జీవితానికి అలవాటు పడుతున్న ఈ రోజులలో గిరిజన వ్యవస్థలోకూడా మార్పులు రావాలని కొందరు కోరుకుంటున్నారు. తమకు ఇష్టం లేకున్నా తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని కొందరంటారు. అయితే ఈనాడు గిరిజన వివాహవ్యవస్థ తారుమారు అవుతోందని, ఈనాడు వరుణ్ణి కొనుక్కోవాల్సి వస్తోందని, ఈ పరిణామం కొంత బాధగా ఉందని ఇంకొందరి వాదన. పాత సంప్రదాయం ఉంటేనే స్త్రీకి ఒక గౌరవ ప్రదమైన మర్యాద ఉంటుందని, తద్వారా ఒక స్థాయి ఉంటుందని, స్త్రీని గౌరవించని సమాజం తమకు వద్దని, ఆ సంప్రదాయం కనుమరుగై పోవటం తమకు ఇష్టం లేదని కొందరు అంటున్నారు.

Suryaa Telugu News Paper Dated: 07/10/2013 

Saturday, September 8, 2012

మైలపడిన కాలాన్ని కడిగిన తిరుగుబాటు బావుటా -- Dr. P Kanakaiah



chak
ఆమె జ్ఞాపకాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. బహుజ ను ల హృదయాలు ఆత్మీయమైన స్పందనతో ఒక్క సారిగా కరిగిపోతాయి. ఆమె సుగుణాలు స్నేహ సౌశీ ల్యాన్ని గుర్తుచేసి బహుజనులను ఒక్కచోటికి చేరు స్తాయి. ఆమె మానవతా వాదం ముందు ప్రతీ ఒక్కరూ బలాదూరే. బహుజన సర్వతో ముఖాభివృద్ధికి ఆమె ఒక ప్రతీక. ఆమె ఒకతరానికి ప్రతినిధి. సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్య శాలి. ఆమె పేరు చాకలి ఐలమ్మ. అయి లమ్మ పుట్టినిల్లు వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలంలో క్రిష్టాపురం అనే చిన్నగ్రామం. పుట్టినిల్లుకు దగ్గరగానే పాలకుర్తి మండల కేంద్రం ఆ వీరనారి మెట్టినిల్లు. రజాకార్లను తరిమికొట్టి ఎరజ్రెండా ఎగురవేసి తెలంగాణ రెైతాంగ పోరుకు కేంద్ర బిందువుగా నిలిచింది పాలకుర్తి. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో అయిలమ్మకు బాల్య వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. ప్రధానంగా వీరికి వారి అత్యంత గౌరవ ప్రదంగా ఆరాధించే చాకలి కులవృత్తే వారికి జీవనాధారం.

ఐలమ్మకు సిద్ధాంతం తెలియదు. కానీ బహుజనులను చీత్కారం చేసిన మొఖా లమీద చీత్కార తుంపురులనే కుమ్మరించిన కల్కి అవతారం ఆమె. కుట్రలు కుతం త్రాలు తెలియవు కానీ బహుజనుల అణచివేతకు ఏర్పడిన గూడుపుఠానులన్నింటినీ ఒక కుదుపు కుదిపిన సాహస వీరవనిత. ఇటువంటి స్త్రీ చెైతన్యమూర్తులు ధెైర్య సాహాసాల వల్లనే తెలంగాణ సాయుధ రెైతాంగపోరాటంతో పాటు మహిళా ఉద్యమం ఎదిగిం ది. పోరాటక్రమంలో మహిళల్లో చెైతన్యం తేవడానికి అనేకమంది కృషి చేసారు. అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా ‘దొరా’అని ఉత్పత్తికులాల చేత పిలుపించుకొనే సంస్కృతికి చరమగీత పాడినవారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నా రు. దొరా అని పిలువకపోతే ఉన్నతకులాల అనుంగు ఉంపుడుకత్తెలలో కూడా ఉన్న రాక్షస ప్రవృత్తి అనేక పీడన రూపాలలో బయటకు వచ్చేది. వెనుకబడిన కు లాల మీద ఆ పీడన రూపాలు విరుచుకు పడేవి. తమను దొరా అని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొల్పి, దగ్గరుండి అఘయిత్యం చేయించేవారు. స్త్రీ సాధికారతే స్త్రీ విముక్తికి మంచి ఆయుధమని స్త్రీలు నేడు నమ్మటానికి ఐలమ్మ ఉత్పత్తికులాల వారికి ఒక మంచి ఆయుధమైంది. 
ఈ భూమినాది. పండించిన పంటనాది. తీసుకెళ్లడానికి దొరెవ్వడు.

నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రెైతాంగ విప్లవాగ్ని చాకలి అయిలమ్మ. ఆమె నడిపిన కౌల్దారి పోరాటం ప్రజా పోరాటాలకు నిరంతరం స్ఫూర్తినిస్తుంది. భూమి కోసం, భుక్తికోసం వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన వీరతెలంగాణ సాయుధ రెైతాంగ పోరాటంలో అయి లమ్మ చూపిన తెగువ మరువలేనిది. దొరలను ఎదిరిస్తే కష్టా లు తప్పవని తెలుసు. ప్రాణాలు తీస్తారని తెల్సినా పోరాట బాట పట్టింది అయిలమ్మ. ఆ పోరాటంలో తన పేరు చిర స్థాయిగా నిలిచిపోతుందని తన పేరును ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటారని అయిలమ్మ కలలో కూడా ఊహించి ఉండదేమో!.ప్రతి రోజూ అందరికంటే ముందే తనే సూర్యున్ని చూసేది. ఎంతోమందికి మేలు కొలుపు అయ్యేది. ఇంటింటికీ వెళ్లి బట్టలు తీసుకునేది. అరికాళ్లలో రాళ్లు గుచ్చుకున్నా, చంకలో పిల్లవాడు పాలకోసం ఏడుస్తున్నా, నెత్తిమీద చద్దికూడు గంప భారం అవుతున్నా, భుజానికున్న మైల పాతల మూట బరువు ఎక్కువ వుతున్నా, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని చాకిరేవుకు సాగిపోయేది.

కడుపులో పేగులు మెలివడుతున్నా, పొదల మాటున పసివాడు పాలకోసం గొంతెత్తి ఏడ్చినా,,, నెత్తిమీద కొంగేసుకొని నిశ్చింతగా తనపని తాను చేసుకునేది. పులిసిన చద్దికూ డులో పచ్చిమిరపకాయ నంజుకుంటూ, సగం పేగులు మాడ్చుకొని భర్తకు చేదోడు వాదోడెై, అర్థాకలి చంపుకొని, తన ఇల్లును బట్టల ఖజానా చేసుకొని, పెైసా పెైసా కూడబెట్టి పాలకుర్తిలో 40 ఎకరాల భూమిని అయిలమ్మ కౌలుకు తీసుకుంది. అది మల్లెంపల్లి భూస్వామి కొండల్‌రావుకు చెందిన భూమి.అందులో నాలుగు ఎకరాలు సాగు చేసింది. ఐలమ్మ కుటుంబం ఈ భూమిలో కష్టపడటం పాలకుర్తి పట్వారీకి గిట్టలేదు. ఆయన పేరు వీరమనేని శేషగిరిరావు. అయిలమ్మ కుటుంబంతో విరోధం పెంచుకుంటాడు. అయిలమ్మే కాదు ఆనాటి అక్కడి ప్రజలు వెట్టికి గురెై స్వేచ్ఛగా జీవించలేని పరిస్థి తులు ఏర్పడ్డాయి. దొరోడు తన ఇంట్లో పెండ్లికి అట్టహాసంగా ఊరిప్రజలతో వెట్టిచాకిరి చేయించేవాడు. ఉత్పత్తి చేసే సామా న్య జనులకు కేవలం జొన్న సజ్జగటుక కూడా దొరక నిచ్చే వారు కాదు. పాలకుర్తి పట్వారీ అయిలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పని చేయాలని ఒత్తిడి చేశాడు.

కానీ అప్పటికీ ఆంధ్ర మహాసభ తనలో నింపిన చెైతన్య స్ఫూర్తితో పని చేయడానికి నిరాకరించింది. అయి లమ్మను ఎలాగెైనా లొంగదీసుకోవాలని భూస్వాములు కుట్రలు చేశారు. వారు చేసిన అన్ని ప్రయత్నాలను తిప్పికొట్టింది. ఆనాటి దొరలకు అధికార దర్పాలు ఎక్కువగా ఉండేవి. మీకు కట్న కానుకలు ఎందుకివ్వాలి?. మీఇంట్లో వెట్టి చాకిరి ఎందుకు చేయాలి? ఈప్రశ్నల పరంపరలో వీరోచితంగా పోరాడిన వీరవనిత చాక లి అయిలమ్మ. పాలకుర్తి పట్వారీ పప్పులుడకక అయిలమ్మ కుటుంబం కమ్యూని స్టుల్లో చేరిందని విసునూర్‌ దేశ్‌ముఖ్‌ రాపాక రాంచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. కేసులో అగ్రనాయకులతో పాటు అయిలమ్మ కుటుంబాన్ని ఇరికించారు. అయిన ప్పటికీ కోర్టులో తీర్పు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా వచ్చింది. అయిలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టు కోల్పోతుందని భావించిన దేశ్‌ముఖ్‌ పట్వారిని పిలిపించుకొని, అయిలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని తన పేరున రాయించు కున్నాడు. భూమి తనదని, వండించిన ధాన్యం తనదేనని పంటను కోసుకురమ్మని వందమందిని దేశ్‌ముఖ్‌ పంపాడు. 

ఆంధ్ర మహాసభ కార్యకర్తలు, బయటి గ్రామాలనుండి వచ్చిన నాయకులు అయిలమ్మతో సహా పొలం దగ్గర కూర్చున్నారు. పంటను ధ్వంసం చేయాలని, లేదా కోసుకెళ్లాలని వచ్చిన గూండాలను ఎదిరించారు. ఆ గూండాలపెై అయిలమ్మ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వెల్లగక్కింది. తాను బతికి ఉన్నంత సేపు భూమి, పంట మీకు దక్కదని కొంగును నడుముకు చుట్టి ఆవేశ పూరితంగా మాట్లాడింది. ఈ చెైతన్యపు తాకిడికి గూండాలు వెనుదిరిగారు. వరిపంట కోసి, వరికట్టలు కొట్టి ధాన్యాన్ని అయిలమ్మ ఇంటికి చేర్చారు. భంగపాటుకు గురెైన దేశ్‌ముఖ్‌ మరోసారి పోలీసులను ఆశ్రయించి తన పంట ను, ధాన్యాన్ని కమ్యూనిష్టులు దోచుకెళ్లారని నాయకులపెై స్థానికులపెై కేసులు పెట్టిం చాడు. కమ్యూనిస్టు నాయకత్వం చొరవ, కొండా లక్ష్హణ్‌ బాపూజీ సహకారంతో అయిలమ్మకు అనుకూలంగా తీర్పు వచ్చింది. రజాకార్ల ఉప సేనాధిపతి అయిన దేశ్‌ముఖ్‌ రెండుసార్లు పరాజయం పాలయ్యాడు. దేశ్‌ముఖ్‌ పాలకుర్తిపెై దాడులు నిర్వహించి, ఇండ్లను బూడిద చేయించాడు. జీవంజి సోమయ్య, నర్సయ్యలను సజీవదహనం చేశాడు. అయిలమ్మ ఇంట్లోఉన్న సరుకులు ఎత్తుకెళ్లారు. అయి లమ్మ కుమార్తె సోమనర్సమ్మపెై అత్యాచారానికి పాల్పడ్డారు. అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ అయిలమ్మ కుటుంబం ఎరజ్రెండాను వీడలేదు. అన్నీ కోల్పో యిన అయిలమ్మ ఒక్కచిత్తం చేసుకొంది. ‘ఈ దొరగాడు ఇంతకంటే ఇంక నన్ను ఏవిధంగా నష్టపెట్టగలడు’ అని తనలో తాను ప్రశ్నించుకొన్నది.

kanakaiya
నీ దొరోడు ఏం చేస్తాడ్రా’ అని మొక్కవోని ధెైర్యంతో రోకలి బండ చేతబూని గూండాలను తరమి కొట్టిన నారీమణి అయిలమ్మ. కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరిన సాహసి. పాలకుర్తి పట్వారి శేషగిరిరావు ఇంటిని కూల్చి మొక్కజొన్న పండించిన ఘనత మరువలేనిది. అయిలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపెై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. అలాగే 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు. అయిలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేలమంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన అయిలమ్మ సెప్టెంబర్‌ 10, 1985న అనారోగ్యంతో మరణించింది. పాలకుర్తిలో అయిలమ్మ స్మారక స్థూపం, స్మారక భవనం సిపిఎం వారు నిర్మించారు. నేడు జరుగుతున్న భూపోరాటాలకు చాకలి అయిలమ్మ చేసిన భూపోరాటం మాతృక అని చెప్పవచ్చు. ఇంకా ఉత్పత్తికులాల ఉత్పత్తిని దోపిడి చేస్తున్న గుత్తదార్లను, బ్రోకర్లను భూస్థాపితం చేయటానికి అయిలమ్మను స్ఫూర్తిగా తీసుకొని పోరాటం కొనసాగించాలి. 

సెప్టెంబర్‌ 10 చాకలి అయిలమ్మ వర్ధంతి

Namasete Telangana News Paper Dated : 09/09/2012