Showing posts with label సి. కాశిం. Show all posts
Showing posts with label సి. కాశిం. Show all posts

Tuesday, January 28, 2014

విప్లవ సాహిత్యంలో వస్తురూప వైవిధ్యం By డాక్టర్ సి.కాశీం


నలభై రెండు
ఏళ్లుగా విరసం విప్లవ
రాజకీయాలను ప్రచారం చేయడానికి
పనిచేస్తూనే ఉన్నది. నిషేధాలకు, నిర్బంధాలకు
గురైనా సాహిత్య సజనను కొనసాగిస్తూనే
ఉన్నది. మూడు తరాల రచయితలతో
విరసం నవ నవోన్మేషంగా నడుస్తున్నదనే
వాస్తవాన్ని 24వ మహాసభలు
నిరూపించాయి.

నూరేళ్ల కాళోజీ యాదిలో జనవరి 11,12 తేదీల్లో విరసం 24వ మహాసభలు ఓరుగల్లులో విజయవంతంగా జరిగాయి. జీవితం, కవిత్వం, రాజకీయాలలో ప్రజాస్వామ్య దక్పథాన్ని ప్రదర్శించిన కాళోజీ ప్రతీ మూలమలుపులో ప్రజలవైపు, పోరాటాలవైపు నిలబడ్డాడు. పౌరహక్కులను అడిగిన గొంతులపై ఆయుధం ఎక్కుపెట్టి న దుర్మార్గాన్ని ఎండగడుతూనే కాళోజీ కన్నుమూశారు. ఆట, పాట, మాట అనధికారికంగా బంద్ అయిన ఓరుగల్లు నగరంలో విరసం 24వ మహాసభలు దిగ్విజయంగా జరుపుకున్నది. ప్రజల ప్రత్యామ్నాయ అభివద్ధి నమూనాను విధ్వంసం చేయడానికి పాలకులు బాసగూడలో ఆదివాసులపై జరిపిన దాడిని ప్రతిబింబిస్తూ విరసం కళాకారులు బాసగూడనాటకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా కవులూ, కళాకారులు నిర్వహించిన ర్యాలీ ఓరుగల్లు నగరాన్ని ఉత్తేజపర్చింది. కిలోమీటర్ల మేర కాగడాలతో ప్రదర్శన జరిగింది. రోడ్లన్నీ పాటలతో పల్లవించాయి.
సాహిత్యం కోణంలో చూసినప్పుడు విప్లవ సాహిత్యం ఎన్ని రూపాలలో వికసించిందో ఈసభలు అద్దం పట్టాయి. కళ్లుండి చూడలేని కొందరు సాహిత్య విమర్శకులకు ఈ సభలలో వచ్చిన విప్లవ సాహిత్యమే సమాధానం చెబుతుంది. చెవులుండి వినలేని పండితులు పుస్తకావిష్కరణల సందర్భంగా విశ్లేషకులు చెప్పిన అభిప్రాయాలైనా వినాల్సింది. విప్లవ సాహిత్యంలో, విరసంలో మూడుతరాల కవులు, రచయితలు ఉన్నారు. ప్రతీ పది సంవత్సరాలకు సంస్థలోకి కొత్త నీరు వచ్చి చేరుతూనే ఉన్నది. బహుశా, ఇట్లాంటి సజీవ లక్షణం ఉన్న సంస్థలు మరోటి లేవంటే అతిశయోక్తి కాదేమో. కథ, కవిత్వం, నవల, నాటకం లాంటి ప్రక్రియలను చేపట్టి సాధికారికంగా నిర్వహిస్తున్నవాళ్లు విరసంలో ఉన్నారు. ఒక రచయితల సంఘం ప్రతీ ఏటా 30 పుస్తకాలను ఆవిష్కరించుకోగలుగుతుందంటే, అవి వాసిలో, రాశిలో తీసిపోని పుస్తకాలుగా మిగులుతున్నాయంటే ఆ ఘనత విరసం కే దక్కింది. ఈసారి మహాసభలలో కూడా విరసం సభ్యులు రాసిన 13 పుస్తకాలు వచ్చాయి. అందులో కవిత్వం 1, కథలు 3, నవలలు 2, సాహిత్య విమర్శ 3, ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యాసాలు 4 ఉన్నాయి. అనువాదాలు, విరసం తన సామాజిక బాధ్యతగా ప్రజలకు అందించాలని భావించిన సాహిత్యాన్ని కూడా ప్రచురించి ప్రచారం చేస్తుంది. అట్లా విరసం ప్రచురణలుగా వచ్చిన పుస్తకాలు 17 ఉన్నాయి. విరసం రచయితలు ఎన్నడూ సాహిత్య విలువల విషయం లో రాజీపడలేదు. సాహిత్య వస్తువుకు ఇచ్చిన ప్రాధాన్యతను, సాహిత్య రూపంలో నిర్లక్ష్యం చేయలేదు. వస్తువును ఆశ్రయించిన రూపం సాహిత్య రచనలో ఉండాలని త్రిపురనేని మధుసూదనరావు చెప్పిన మాటను విరసం రచయితల ఎరుకలో ఉందని ఈ మహాసభల సందర్భంగా వెలువడిన 30 పుస్తకాలను చూస్తే అర్థమవుతుంది.

విరసం వైపు నుంచి మొదట్లో వచ్చినంత బలంగా కవిత్వం రావటం లేదని పరిశీలించకుండానే (విరసం అధికార పత్రిక అరుణతారను కూడా) జడ్జిమెంట్ ఇచ్చే సాహిత్య వాతావరణం నేడు ఉంది. శ్రీశ్రీ, శివసాగర్, చెరబండరాజు, వరవరరావు వంటి లబ్ధప్రతిష్టులైన వారి కవిత్వం దగ్గరే కొందరు విమర్శకులు ఆగిపోయారు. తర్వా త వచ్చిన కొత్త నీళ్లు తాగటానికి తెలుగు సాహిత్య వాతావరణం అలవాటు పడలేదు. సముద్రుడు, ఎమ్మెస్సార్, కౌముది రచనలు విప్లవ కవిత్వంలో తెచ్చి న వస్తు, శిల్పనైపుణ్యాన్ని చూడలేకపోయారు. ఈ తరం లో కూడా కవిత్వానికి విరసంలో లోటులేదు. బలమైన గొంతుకలు ముందుకొచ్చాయి. ముప్పై ఏళ్ల లోపు వయసున్న కవులు విరసంలో బలమైన కవిత్వం రాస్తున్నవాళ్లు అరడజన్‌కు పైగా ఉన్నారు. వీళ్లు కూడా సంస్థ తీసుకున్న గ్రీన్‌హంట్ వ్యతిరేకతను తమ రచనలలో ప్రదర్శిస్తున్నారు. ఈ తరంలోని వాడే ఉదయ్‌భాను.ఈ రెండేళ్లలో గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా రాసిన కవిత్వా న్ని పిల్లనగ్రోవి తుఫాన్ పేరుతో సంకలనం చేసి 24వ మహాసభలలో ఆవిష్కరించాడు. పుస్తకానికి పెట్టిన పేరులోనే గొప్ప సౌందర్యాత్మకత కనిపిస్తుంది. పుటలు తిప్పేస్తే రక్తం స్రవిస్తున్న పిల్లనగ్రోవి పెదవులు మనల్ని కన్నీళ్లు పెట్టిస్తాయి. విషాదగీతిక పిల్లనగ్రోవి తుఫాన్‌గా మారుతున్న కవిసమయం ఇవాల్టి దశ్యం. ఈ విషాద, గం భీర దశ్యాన్ని కలంలో ఒంపుకున్నవాడే కవి అనే బాధ్యతను ఉద య్ గుర్తుచేశాడు.తొలిపొద్దును మింగేసే పాలకులున్నచోట సూర్యాస్తమయం గురించి బాధపడటంలో అర్థం లేదనే కొత్త కవి సమయాలను గ్రీన్‌హంట్ వ్యతిరేక కవిత్వం మనముందు ఉంచింది.

కాంత పున్నం వెన్నెల ఈ మూడు పదాలు ఒకేలా ఉన్నాయి కదా! వెలుగు అని అర్థాన్ని స్ఫూరిస్తున్నాయి. మూడు పదాలను కలిపితే మంచి కవితా పాదం వలె ఉన్నాయి. కాని ఇది ఒక కథ పేరు. ఇట్లాంటి శీర్షిక పెట్టింది చేయి తిరిగిన కథా రచయిత కాదు. చనిపోయిన నిజమైన మనుషుల కోసం-భయవిహ్వాల దిగ్భ్రాంతి లో ఉన్న వారి బంధుమిత్రుల కోసం...చావంటే, శవమంటే అందరిలాగే ఆమడదూరం పరిగెత్తే పద్మకుమారి విచిత్రంగా, అనివార్యం గా అనేక అసహజ మరణాల్లో బంధు మిత్రుల సంఘం సభ్యులతో కలిసి రాష్ట్రమంతా తిరుగుతుంది. కన్నీళ్లు జలజలాకారే చిత్రమైన బాధ్యత. మానసికంగా, శారీరకంగా కల్లోలపరిచే బయటి కల్లోలం. అదిగో అలాంటి స్థితిలో ఇలాంటి కథలు రాయడం వల్ల.. ప్రతీవాక్యం మత్యుశీతల స్పర్శ నుంచి రూపుదిద్దుకున్నదే.. అని అల్లం రాజయ్య ఎన్ని వాక్యాలు పేర్చుకుంటూ పోయినా కాంత పున్నం వెన్నెల కథ గురించి సరిగా చెప్పలేనని మొరాయించాడు. తెలంగాణలో విప్లవ కథా రచనలో లబ్దప్రతిష్టుడిగా పేరున్న అల్లం రాజయ్య విరసం ఈ తరం సభ్యురాలు పద్మకుమారి రాసిన మొట్టమొదటి కథ గురించి ఈ వాక్యాలు రాయటానికి కారణం ఆ కథలో ఉండేబలం.
తెలంగాణ సమాజంలో ముస్లింలకు, ఉత్పత్తి కులాల మధ్య ఉండే సజీవ మానవ సంబంధాల గురించిన అబ్బా, ముస్లిం రైతు రోజు జీవితాన్ని వ్యక్తంచేసేఈద్ నమాజ్, ముస్లిం మహిళల జీవితాలలో వచ్చిన మార్పును చెప్పే సైదాబీ తాయమ్మ సంప్రదాయ కుటుంబాల్లో నుంచి బయటికి వచ్చి జీవించాలంటే స్త్రీకి కలిగే ఇబ్బందులను చిత్రించిన మబ్బులు కమ్మిన ఆకాశం తరగతి గది నాలుగు గోడల మధ్య ఎంత వ్యధ ఉందో చెప్పిన బడిలో చీకటి, ప్రజల కోసం మిగిలేటోళ్లు కథలను కలిపి విరసం సభ్యుడు బాసిత్ కథా సంపుటి వేశాడు. ఈ కథలన్నీ ప్రత్యామ్నాయ ఆలోచనా ధారను ప్రతిబింబించేవి.

సాహిత్యంలో నవలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. నవలా ప్రక్రియను చేపట్టి సాధికారికంగా నడిపినవారు విరసంలో గత నలభై ఏళ్లుగా ఉన్నారు. ఈ వరుసలోనే విరసం సీనియర్ సభ్యురాలు నల్లూరి రుక్మిణి రాసిన ఒండ్రుమట్టి నవలను ఈ సభల్లోనే ఆవిష్కరించారు. నవల అనే రెండో మాట దాని రూపశిల్పాలను, దాని కాల్పనికతను కళాత్మకతను సూచిస్తుంది. ఈ రెండు అంశాలు ఒక రసాయనిక సమ్మేళనంలో మేలు కలయిక సాధించడమే ఒండ్రుమట్టి సాధించిన విజయం అని ఎన్. వేణుగోపాల్ ముందుమాట లో ఈ నవల వస్తు శిల్ప వైశిష్ట్యాన్ని వివరించారు.
ఒండ్రుమట్టి నవలతో పాటు వసంతగీతం నవలను కూడా ఇదే సభలలో ఆవిష్కరించారు. ఈ నవలా రచయిత అల్లం రాజయ్య. కొలిమంటుకున్నది, కొమురంభీం వంటి పూర్తి నిడివి ఉన్న నవలలు, అతడు లాంటి పాక్షిక నవలతో తెలుగు సమాజంపై విశేష ప్రభావాన్ని వేసిన అల్లం రాజయ్య చేతి నుంచి వసంతగీతం జాలు వారింది. అడవి వెన్నెల లాంటి పదునైన, అందమైన, ఉద్విగ్నమైన కథా కథనశైలితో మలచిన నవల వసంతగీతం. ఈ శైలి రాజయ్య సొంతం. వసంతగీతం నవల నిర్దిష్టమైన సమకాలీన చారిత్రక నవల. 1985-86 మధ్యకాలంలో నవలా వస్తువు. అట్లే ఆదిలాబాద్ జిల్లా పార్టీ నాయకత్వంలో ఒక దళం దైనందిన జీవి తం, పోరాట ఆచరణ,త్యాగాలు చిత్రించిన రాజకీయార్థిక చారిత్రక నవల ఇది అని వరవరరావు చెప్పారు. ఇట్లాంటి అద్భుత నవల లు విరసం అల్లం రాజయ్య నుంచి రావటం వర్తమాన చరిత్రకొక నమ్మకం.


ప్రజా ప్రత్యామ్నాయాల్లో నూరేళ్ల కాళోజీ గుర్తులో జరిగాయి కనుక కాళోజీతో సుదీర్ఘకాలం కలిసి నడిచిన వరవరరావు రాసిన నూరేళ్ల కాళోజీ పుస్తకం ఈ సభల్లోనే వచ్చింది. ఒక చేత తర్కం, మరో చేత గతితర్కం పట్టుకొని తెలుగు సాహిత్యాన్ని వ్యాఖ్యానించే విప్లవ సాహిత్య విమర్శకుడు చెంచయ్య ప్రతి విరసం సభలకు ఒక పుస్తకంతో వస్తాడు. ఈ సభల్లో సామాజికంవ్యాస సంపుటిని తెచ్చాడు. వివిధ సందర్భాలతో సాహిత్యం-సమాజం కలపోతగా రాసిన వ్యాసాలివి. ఒక రచనను మనం చదువుతుంటే ఆ రచయితే మన ముందు కూర్చొని మాట్లాడుతున్నట్టు అన్పించడమంటేనే పదాలు మాట్లాడటం. ఈ శక్తి కొందరు రచయితలకే ఉంటుంది. ఇందులో కష్ణాబాయి ఉంది. బహుశా, ఆమె నలభై ఏళ్లలో రాసిన రచనల సర్వస్వం ఈ సాహిత్య సమాలోచన. ఈ మహాసభలలో ఆవిష్కరించడం ఒక సందర్భం.

విరసం తెలంగాణ ఏర్పాటును సైద్ధాంతికంగానే గత నలభై ఏళ్లు గా సమర్థిస్తున్నది. అంతేకాదు రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగే పోరాటాలలో భాగమవుతున్నది. 90వ దశకంలో ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమానికి విరసం కలాన్ని, గళాన్ని తోడు చేసింది. విరసం సభ్యులు కవిత్వం, కథలు, వ్యాసాలు ప్రచురించారు. సంస్థ సభ్యుడు కాశీం రాసిననేను తెలంగాణోన్ని మాట్లాడుతున్న(వ్యాసాలు)పుస్తకాన్ని ఈ సభల్లోనే ఆవిష్కరించారుపజాస్వామ్య తెలంగాణ ఎట్లా ఉండాలో ఈ రచన ద్వారా తెలంగాణ సమాజానికి కావల్సిన సమాచారం అందుతుంది.
ఇక విరసం ప్రచురించి ఈ సభలో ఆవిష్కరించిన సాహిత్యంలో దండకారణ్య కథలు అగ్రస్థానంలో నిలుస్తాయి. ప్రజల ప్రత్యామ్నా యం ఎట్లా పుష్పించి వికసిస్తున్నదో ఈ కథల్లో చూడవచ్చు. ఒక రకంగా విరసం, విప్లవోద్యమం ఆవల ఉన్న రచయితలెవరికి తెలియని ఒక కొత్త జీవితాన్ని, సాహిత్య వస్తువును, ఘర్షణను, యుద్ధా న్ని ఈ కథల్లో దర్శిస్తాం. యుద్ధరంగ కథకులతో ఆత్మీయ కరచాల నం చేసే అవకాశం తెలుగు సమాజానికి ఈ కథలు కల్పించాయి. అమ్మ పొలం దున్నుతున్నది/నాన్న ఊయల ఊపుతాడు/ చందు అన్నం వండుతాడు/ పెదనాన్న బియ్యం చెరుగుతాడు అనే వాక్యాలను మనమెప్పుడైనా మన పుస్తకాలలో చదివామా? లేదే?! కాని ఇవ్వాళ దండకారణ్యంలో జనతన సర్కార్ నడుపుతున్న పాఠశాల లో ఈ వాక్యాలను పిల్లలు చదువుతుంటారు. ఈ శాస్త్రీయమైన విద్య మనకు పరిచయం కావాలంటే ఈ కథలు చదివి తీరాలి.

రక్తం బొట్టు చిందకపోవచ్చు, చిందినా కనిపించకపోవచ్చు, అవయవాలు తెగిపడకపోవచ్చు, తెగిపడినా మాయం కావచ్చు. కత్తి దూసుకుపోతుంది. పిడిపట్టిన చేయి మాత్రం దొరకదు. తూటా పేలకపోవచ్చు. కాని మనుషులు నేల రాలుతారు. శత్రువు పడక గదిలో కూర్చొని ఉంటాడు. కాని పోల్చుకోలేము. దీనినే ఎల్‌ఐసీ అంటాం. మంద్రస్థాయి యుద్ధం అని నైఘంటికార్థం. ప్రపంచ పోలీస్ అమెరికా నుంచి మొదలు ప్రతీ దేశంలో ప్రజా వ్యతిరేక పాలకులందరు పాటిస్తూ అమలు చేస్తున్న ప్రతిఘాతక యుద్ధ నీతి ని తెలుగు పాఠకులకు పరిచయం చేయటానికి విరసం సభ్యుడు రివేరా అనువదించిన మంద్రస్థాయి యుద్ధం పుస్తకాన్ని ఈ సభ ల్లో ఆవిష్కరించారు.
1969లో విద్యార్థి ఉద్యమం నాయకుడిగా, 1998 నుంచి జనసభ కన్వీనర్, ప్రజాఫ్రంట్ అధ్యక్షుడిగా ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడిన ఆకుల భూమయ్య డిసెంబర్ 24, 2013న హత్య కు గురయ్యాడు. ఆయన వివిధ సందర్భాలలో ప్రజాస్వామ్య తెలంగాణ కోసం రాసిన వ్యాసాలను ఆకుల భూమయ్య రచనలు పేరు తో ఈ సభల్లో ఆవిష్కరించారు. ఆయన ఇచ్చిన ఆఖరి ఉపన్యాసా న్ని కూడా బుక్‌లెట్ రూపంలో తెచ్చారు. తెలంగాణ ప్రాంతం వలెనే తన అస్తి త్వం కోసం 1936 నుంచి పెనుగులాడుతున్న ప్రాంతం రాయలసీమ. శ్రీబాగ్ ఒడంబడిక నుంచి కోస్తాంధ్ర పాలకులు ఉల్లంఘనలకే పాల్పడ్డారని చరిత్ర చెబుతున్న సత్యం. దీని నుంచి ప్రజల పెనుగులాట ప్రత్యే క రాష్ట్ర ఆకాంక్షగా ఉద్యమ రూపం తీసుకోవాలని విరసం కోరుకోవటమే కాదు దానికి కావల్సిన సైద్ధాంతిక భావజాలాన్ని ఇవ్వటం కోసం నేటి రాయలసీమ పుస్తకాన్ని ప్రచురించి ఆవిష్కరించింది.

వరంగల్ విప్లవోద్యమంలో ఆర్కేది చెరగని సంతకం.అతని జ్ఞాపకాలతో వరంగల్ మిత్రులు తెచ్చిన పుస్తకం ఆర్కే పోరాట జలపాతాన్నిఇక్కడే ఆవిష్కరించారు. అతని సహచరి భారతి రెండు పోరాట గాథలపేరుతో రాసిన కథల్ని విరసం ప్రచురించిం ది. ప్రజలు తమ చరిత్రను తామే నిర్మించుకుంటారనటానికి ఈ గాథలు నిదర్శనం. మనం తప్పక తెలుసుకోవాల్సిన మనుషులు కొందరుంటారు.వాళ్లు చచ్చిబతికిన ధన్యులు తరం తాలూకు జ్ఞాపకాలను ఈతరానికి అందించాలని విరసం భావించి ఆదర్శజీవులు అమరులుపేరుతో పుస్తకాన్నితెచ్చి ఆవిష్కరించింది.
ప్రజల సంస్కతి, కళలు వర్థిల్లాలనేది విరసం నినాదం. సంస్కతిలో భాగమైన ఉత్పత్తి కులాల ఆహారం కూడా వర్థిల్లాలి. అగ్రకుల సమాజం చేత నిరాకరించబడిన దళితుల, ఆదివాసుల ప్రధాన ఆహారమైన బీఫ్‌ను విప్లవోద్యమం, విరసం తన ఆచరణలో భాగం చేసుకున్నది. దానిని అందరికి అలవాటు చేయాలని రెండో రోజు సభలలో బీఫ్ కూరను వడ్డించింది.ఈ ఆహారం ప్రజలందరి తిండి గా మారాలనే అవగాహనను పెంపొందించటానికి బీఫ్ రాజకీయాలు పుస్తకాన్ని సభల్లో ఆవిష్కరించింది.

ఇక నందిని సిధారెడ్డి తెలంగాణ నెనరున్న కవి మిత్రుడు. విరసానికి మిత్రుడు, విప్లవానికి ప్రేమికుడు. మంజీర మీద రాసిన, మట్టి మీద రాసిన మనిషితనం తప్పిపోని ఆర్థ్రత అతని కవిత్వం నిండా పారుతుంది.ఇక్కడి చెట్లగాలి(కవిత్వం)ని మోసుకొని విరసం సభలకు వచ్చి ఆవిష్కరించాడు.నిత్యజీవితంలో సోషలిజం (భూసారం శివన్న),విప్లవ మేధావి మహిత, అరణ్యపర్వం (ఆలూరి భుజంగరావు కథలు),పువ్వర్తి అమరులు, అరుణతార సాహి త్య విమర్శ, అరుణతార, సజన డీవీడీలు, రేపు (కథ) పుస్తకాలను కూడా ఈ సభల్లో ఆవిష్కరించారు.
నలభై రెండు ఏళ్లుగా విరసం విప్లవ రాజకీయాలను ప్రచారం చేయడానికి పనిచేస్తూనే ఉన్నది. నిషేధాలకు, నిర్బంధాలకు గురైనా సాహిత్య సజనను కొనసాగిస్తూనే ఉన్నది. మూడు తరాల రచయితలతో విరసం నవ నవోన్మేషంగా నడుస్తున్నదనే వాస్తవాన్ని ఈ మహాసభలు నిరూపించాయి.-
9701444450 Namasete Telangana Telugu News Paper Dated : 27/1/2014 

Saturday, April 27, 2013

వృద్ధుల బాధ్యత పాలకులదే - డా. సి. కాశీం



'పసిపాప లాంటి వృద్ధాప్యంలో
నిబ్బరంగా నిలబడి
చిరుగాలి సితారా సంగీతాన్ని
పలికించే వేళ, పలవరించే వేళ
జీవితమా!
నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు!'

అని శివసాగర్ 80 ఏళ్ల వృద్ధాప్యంలో యవ్వనాన్ని రొమాంటిక్‌గా పలవరించారు. ప్రతివృద్ధుడు ఇలా కోరుకోవటం సహజం. కానీ ప్రకృతిలో ఇది సాధ్యం కాదు.
ప్రతి మనిషికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే మూడు దశలు ంటాయి. బాల్యం, యవ్వనంలో ఉండే సంతోషం వృద్ధాప్యంలో సాధ్యం కాదు. మనిషి జీవితంలో ఏ విధంగా చూసినా ఈ చివరి దశ కష్టభరితమైంది. విషాదకరమైనది. కానీ వృద్ధులు ఒక గతానికి సాక్ష్యం. ఆ గతం తాలూకు తీపి, చేదు గుర్తులను వర్తమానానికి అందించే వాహిక వృద్ధులే. గతం భుజాల మీద నిలబడి వర్తమానాన్ని వీక్షిస్తూ, భవిష్యత్‌ను కలగనాలనే అవగాహన ప్రతి మనిషికి ఉండాలి. అప్పుడే వృద్ధుల పట్ల మన సామాజిక బాధ్యత గుర్తుంటుంది.

ఇక ప్రపంచీకరణ విధానాలు అమలవుతున్న ఈ ఇరవై సంవత్సరాలలో మానవ విలువలు డాలర్ కట్టల కింద నలిగిపోతున్న పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తుంది. విలువల రాహిత్యం అన్నిచోట్ల పెరిగింది. ఆస్తికోసం కన్న తల్లిదండ్రులను రోడ్డు పాలుచేసే, లేదా చంపేసే దుర్మార్గం దాపురించింది. ఎలక్ట్రానిక్ వస్తువుల వలన దూరాలు తగ్గాయి. కానీ ముసలి తల్లిదండ్రులకు పిల్లలకు మాత్రం దూరం మరింత పెరిగింది. కవరేజి లేని ప్రాంతాలలో ముసలి వాళ్లను ఉంచాలనే ధోరణి పెరిగిపోయింది. కారణాలు ఏవైనా సమాజానికి ఇది మం చిది కాదు. మనమలు, మనమరాండ్రతో హాయిగా నవ్వుతూ ఉండవల్సిన వయసులో చెట్టుకిందో, బస్టాండులో, ఫ్లై ఓవర్ కిందో, ఫుట్‌పాత్ మీదనో తల దాచుకోవటమనే దౌర్భాగ్యం రావటం ఈ వ్యవస్థ కుళ్లిపోతుందనడానికి నిదర్శనం. మనల్ని కనీపెంచిన వాళ్లను రోడ్డుపాలు చేస్తే, రేపు మనం కనీపెంచిన వాళ్లు కూడా అదే పని చేస్తారనే ఎరుక ఉండాలి. రక్తబంధం బాధ్యతను తీర్చుకోవటం కనీస ధర్మం. అయితే సమస్యకు ఇదొక పార్శ్వం.

అనాథలు, ఆర్థిక స్థోమత లేని వృద్ధులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. సంక్షేమ రాజ్యమని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా ఉండాలి. 'తల్లిదండ్రుల, సీనియర్ పౌరుల పోషణ, సంక్షేమ చట్టం 2007' ప్రకారం ప్రభుత్వమే వృద్ధుల బాధ్యతను తీసుకోవాలి. ఈ చట్టంలోని మూడవ అధ్యాయం ప్రకారం (1) ప్రతి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒకటి చొప్పున వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాలి. అందులో 150 మందికి ఆశ్రయం కల్పించాలి. (2) ప్రభుత్వ ఆసుపత్రులలో సీనియర్ పౌరుల కోసం పడకలు ఏర్పాటు చేయాలి. (3) సీనియర్ పౌరులకు వేరుగా క్యూ పద్ధతిని ఏర్పాటు చేయాలి. (4) చట్టంలోని సదుపాయాలను ప్రభుత్వం మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. (5) జిల్లా మేజిస్ట్రేట్‌కు ఈ చట్టం అమలు పర్యవేక్షణ బాధ్యత ఉంటుంది. (6) సీనియర్ పౌరుల సంరక్షణ బాధ్యతను బుద్ధి పూర్వకంగా విస్మరించిన వ్యక్తులకు మూడు నెలలు జైలు శిక్ష, ఐదు వేల రూపాయల జరిమానా విధించవచ్చు. ఈ అంశాల అమలు పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధి ప్రదర్శించిన దాఖలాలు లేవు.

మన రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం నియమించిన మోహినీగిరి కమిటీ నివేదికను అమలుచేయాలి. వితంతువుల సమస్యల అధ్యయనానికి మరో కమిటీని నియమించాలి. వీరి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయటం వలన కూడా సమస్యలను పరిష్కరించటం సులభమవుతుంది.
వృద్ధుల పరిస్థితి ఇలా ఉంటే వితంతువుల పరిస్థితి మరీ ఘోరం. నా అనేవారు లేక, తోడు లేక గుండె చెరువై జీవిస్తుంటారు. భర్త చనిపోయి, బంధువుల నిరాదరణకు గురై, కన్నబిడ్డల సాదుకోలేక అనేక ఇబ్బందులు పడుతుంటారు. వీరి బాధ్యత కూడా ప్రభుత్వం చూడాలని అనేక చట్టాలు చెబుతున్నాయి. కానీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి.

- డా. సి. కాశీం
(ఏప్రిల్ 28న వృద్ధుల, వితంతువుల యుద్ధభేరి సందర్భంగా)

Andhra Jyothi Telugu News Paper Dated : 28/4/2013

Friday, April 26, 2013

వృద్ధులు, వితంతువులకు అండగా ఉందాం By -డాక్టర్ సి. కాశీం



‘పసిపాప లాంటి వృద్ధాప్యంలో/నిబ్బరంగా నిలబడి
చిరుగాలి సితారా సంగీతాన్ని /పలికించే వేళ, పలవరించే వేళ
జీవితమా! నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు’ అని శివసాగర్ ఎనభై ఏళ్ల వృద్ధాప్యంలో యవ్వనాన్ని రొమాంటిక్‌గా పలవరించాడు. ప్రతి వృద్దుడు ఇలా కోరుకోవటం సహజం. కాని ప్రకృతిలో ఇది సాధ్యంకాదు.
ప్రతి మనిషికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే మూడు దశలు తప్పనిసరిగా ఉంటాయి. బాల్యం, యవ్వనంలో ఉండే సంతోషం వృద్ధాప్యంలో సాధ్యం కాదు. ఒక రకంగా మనిషి జీవితంలో ఏ విధంగా చూసినా ఈ చివరి దశ కష్టభరితమైనది. విషాద కరమైనది. కాని వీళ్లు ఒక గతానికి సాక్ష్యం. ఆ గతం తాలూకు తీపి, చేదు గుర్తులను వర్తమానానికి అందించే వాహిక వృద్ధులే. గతం భుజాల మీద నిలబడి వర్తమానాన్ని వీక్షిస్తూ, భవిష్యత్‌ను కలగనాలనే అవగాహన ప్రతి మనిషికి ఉండాలి. అప్పుడే వృద్ధుల పట్ల మన సామాజిక బాధ్యత గుర్తుంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా వృద్ధులకు సాధారణంగా అనారోగ్యం, బలవర్ధక ఆహారం లేకపోవటం, నిస్సత్తువ, భయం, వెలితిగా ఉండటం, ఆర్థిక స్థోమత లేకపోవటం, సరియైన పోషణ, అయినవారి ఆదరణ లేకపోవటం లాంటి సమస్యలు ఉంటాయి. ‘వృద్ధాప్యం’ అనే స్థితిలో కదలలేకపోవటం, అవయవాలు సరిగ్గా పనిచేయకపోవటం, కనుచూపు కోల్పోవటం లాంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలు అనేవి వీరికి ఉండే స్థూలసమస్యలు. యవ్వనంలో ఉండే శుభ్రమైన జీవితం నుంచి ఒకేసారి అపరిశువూభమైన జీవితంలోకి ప్రవేశిస్తారు. దీని వలన మానసికంగా కుంగిపోతారు. గతంలో ఆర్థికంగా బాగా బతికిన వీళ్లు ముసలితనంలో ఆర్థిక సమస్యలు ఆవరించేసరికి తట్టుకోలేక మానసిక, ఆరోగ్య సమస్యలకు గురవుతారు. తమ కళ్లముందే తమ బిడ్డలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే.. ముసలి తల్లిదంవూడులు భరించలేరు. తద్వారా కొందరు మానసిక ఒత్తిడికి గురవుతారు.

ఇన్ని సమస్యలను ఎదుర్కొనే వృద్ధులు ఒకప్పుడు తమ యవ్వన రక్తాన్నంతా ధారపోసి బిడ్డలను కని, పెంచి, పెద్ద చేశారనే సత్యాన్ని ఈ తరం మర్చిపోవటమే అతిపెద్ద విషా దం. సమాజంలో పతనమవుతున్న విలువలకు ఇదొక నిదర్శనం. ఈ దేశానికి వసుదైక కుటుంబమనేది సర్వనామం. సమష్టి జీవనం, సామూహిక ఉత్పత్తి వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇక్కడి సామాజిక జీవనానికి పునాది లాంటి ది. వృద్ధుల బాధ్యతను కుటుంబం మొత్తం స్వీకరించే తత్వం ప్రజలలో ఉండేది. రాను రాను ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు పెరిగాయి. మనుషుల ఆలోచన ధోరణిలో కూడా చాలా మార్పులు వచ్చాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలనే వాస్తవం కూడా ఈ స్థితి పెరగడానికి కారణమైనది.

ఇక ప్రపంచీకరణ విధానాలు అమలవుతున్న ఈ ఇరవై సంవత్సరాలలో మానవ విలువలు డాలర్ కట్టల కింద నలిగిపోతున్న పరిస్థితి కళ్ల ముందు కన్పిస్తున్నది. విలువల రాహిత్యం అన్నిచోట్ల పెరిగింది. ఆస్తి కోసం కన్న తల్లిదంవూడులను రోడ్డు పాలుచేసే లేదా చంపేసే దుర్మార్గం దాపురించింది. ముసలి తల్లిదంవూడులను ఏవగించుకునే కాలం వచ్చిం ది. ఎలవూక్టానిక్ వస్తువుల వలన దూరాలు తగ్గాయి. కాని ముసలి తల్లిదంవూడులకు పిల్లలకు మాత్రం దూరం మరింత పెరిగింది. కవరేజి లేని ప్రాంతాలలో ముసలి వాళ్లను ఉంచాల నే ధోరణి పెరిగిపోయింది. కారణాలు ఏవైనా సమాజానికి ఇది మంచిది కాదు. మనుమలు, మనుమరాండ్లతో హాయిగా ఉండవల్సిన వయసులో చెట్టుకిందో, బస్టాండులో, ఫ్లైఓవర్ కిందో, ఫుట్‌పాత్ మీదనో తల దాచుకోవటమనే దౌర్భాగ్యం రావటం ఈ వ్యవస్థ కుళ్లిపోయిందనడానికి నిదర్శనం. మనల్ని కనిపెంచిన వాళ్లను రోడ్డుపాలు చేస్తే, రేపు మనం కనిపెంచిన వాళ్లు కూడా అదే పని చేస్తారనే ఎరుక ఉండాలి. రక్తబంధం బాధ్యతను తీర్చుకోవటం కనీస ధర్మం. అయితే సమస్యకు ఇదొక పార్శ్వం మాత్రమే.

ఇంకో కోణం ఏమిటంటే.. రోజురోజుకు ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి. డబ్బున్న వాళ్లే మరింత ధనవంతులు అవుతున్నారు. గ్రామీ ణ ఆర్థిక వ్యవస్థ ప్రపంచీకరణ ఫలితంగా, కరువు వలన విచ్ఛిన్నమైనది. దీంతో వలసలు పెరిగాయి. బతుకుదెరువు కోసం ఏళ్ల తరబడి ఇతర ప్రాంతాలకు వలసపోవటం వల్ల ఇంటి దగ్గరే ఉన్న ముసలి తల్లిదంవూడులు అనాథలైపోతున్నారు. అనివార్యంగా తిండి కోసం వాళ్లు రోడ్డుపాలవుతున్నారు. ఆర్థిక స్థోమత లేక పోషించలేని స్థితిలో తల్లిదంవూడులను పట్టించుకోలేని వాళ్లు కొందరైతే, డబ్బుం డి తల్లిదంవూడులను వృద్ధావూశమాలకు పంపించే వాళ్లు మరికొందరు. చూడటానికి ఎవ్వరులేని అనాథలు మరికొందరు. మానవ విలువలు పతనం కావడానికి సమాజం బాధ్యత ఎంత వుంటుందో, అంతకు రెట్టింపు పాలకుల బాధ్యత కూడా ఉంటుంది. ‘మంచి పాలకులు ఉన్నచోట మంచి పౌరులుంటార’ని గ్రీకు మాట ఉన్నది. కనుక మన పాలకులు విలువల రాహిత్యాన్ని పెంచి పోషిస్తున్నారనటంలో అసత్యం లేదు.

అనాథలు, ఆర్థిక స్థోమతలేని వృద్ధులను ఆదుకోవల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుం ది. సంక్షేమ రాజ్యమని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా ఉండాలి. తల్లిదంవూడులు, సీనియర్ సిటిజన్‌ల పోషణ, సంక్షేమ చట్టం 2007 ప్రకారం ప్రభుత్వమే వృద్ధుల బాధ్యతను తీసుకోవాలి. ఈ చట్టంలోని మూడవ అధ్యాయం ప్రకారం- 1. ప్రతి రాష్ర్ట ప్రభు త్వం జిల్లాకు ఒకటి చొప్పున వృద్ధావూశమాలను ఏర్పాటు చేయాలి. అందులో 150 మంది కి ఆశ్రయం కల్పించాలి. 2. ప్రభుత్వ ఆసుపవూతులలో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక పడకలను ఏర్పాటు చేయాలి. 3.సీనియర్ పౌరులకు వేరుగా క్యూపద్ధతిని ఏర్పాటు చేయాలి. 4.చట్టంలోని సదుపాయాలను ప్రభుత్వం మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. 5. జిల్లా మేజిస్ట్రేట్‌కు ఈ చట్టం అమలు, పర్యవేక్షణ బాధ్యత ఉంటుంది. 6.సీనియర్ పౌరుల సంరక్షణ బాధ్యతను బుద్ధి పూర్వకంగా విస్మరించిన వ్యక్తులకు మూడు నెలలు జైలు శిక్ష, ఐదు వేలు జరిమానా విధించవచ్చు. ఈ అంశాల అమలు పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధి ప్రదర్శించిన దాఖలాలు లేవు.

ఇక 65 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, వితంతువులకు కేంద్ర ప్రభుత్వం 200 రూపాయలు పెన్షన్ ఇస్తున్నది. 2004, 2009 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌పార్టీ రాష్ర్టంలో అధికారంలోకి వస్తే వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 225 రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటించింది. అంటే కేంద్రం ఇచ్చే 200రూపాయలకు, రాష్ర్టం మరో 225 కలిపితే 425 రూపాయలు రావాలి. కాని కేంద్రం ఇచ్చే 200 రూపాయలు మాత్రమే ఇచ్చి రాష్ర్ట ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నది. ఎమ్మెల్యేల జీతాలను మాత్రం 30 వేల నుంచి 80 వేల రూపాయలకు పెంచుకున్న నాయకులు ప్రజల గురించి పట్టించుకునేస్థితిలో లేరు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 200 రూపాయల పెన్షన్‌కు అదనంగా ఉత్తరవూపదేశ్ ప్రభుత్వం 200 కలిపి(మెత్తం 400), రాజస్తాన్ 300 (మొత్తం500), గోవా 800(మొత్తం 1000), ఢిల్లీ 1000 (మొత్తం 1200), తమిళనాడు 800(మొత్తం 1000) రూపాయలు ఇస్తుండగా మన రాష్ర్ట ప్రభుత్వం మాత్రం నాయకుల ఆస్తులు పెంచుకునే వైపు ప్రయాణం చేస్తున్నది. కనీ సం ప్రయాణ రాయితీ గురించి కూడా మన ప్రభుత్వం ఆలోచించడం లేదు.

ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం నియమించిన ‘మోహినీగిరి కమిటీ’ నివేదికను అమలు చేయాలి. ఈ రాష్ర్ట ప్రభుత్వం వృద్ధులు, వితంతువుల సమస్యల అధ్యయనానికి మరో కమిటీని నియమించాలి. వీరి కోసం ప్రత్యేక మంత్రి త్వ శాఖను ఏర్పాటు చేయటం వలన కూడా సమస్యలను పరిష్కరించటం సులభమవుతుంది. వృద్ధుల పరిస్థితి ఇలా ఉంటే వితంతువుల పరిస్థితి మరింత ఘోరం. నా అనేవారు లేక, తోడు లేక గుండె చెరువై జీవిస్తుంటారు. భర్త చనిపోయి, బంధువుల నిరాద రణకు గురై, కన్నబిడ్డలను పోషించుకోలేక అనేక ఇబ్బందులు పడుతుంటారు. వీరి బాధ్యతను కూడా ప్రభుత్వం చూడాలని అనేక చట్టాలు చెబుతున్నాయి. కాని అవి కాగితాలకే పరిమితమయ్యాయి.

80 లక్షల మంది వృద్ధులు, 30 లక్షల మంది వితంతువుల బాధలు ఈ రాష్ర్టంలో అరణ్యరోదనగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో వీరి కన్నీళ్లను తుడవడానికి మాదిగ రిజర్వేషన్ పోరాటసమితి (ఎంఆర్‌పీఎస్) పూనుకోవడం అభినందనీయం. ఒక కులసంఘం సామాజిక సమస్యలపై పని చేయాలనే దృష్టి కలిగి ఉండ టం అన్ని సంఘాలకు ఆదర్శం కావాలి. బోసినవ్వుల పసిబిడ్డలు గుండె ఆగిపోయి అర్థాంతరంగా చనిపోతుంటే వారికి ప్రభుత్వమే ఉచిత ఆపరేషన్ చేయాలని 2004లో ఎంఆర్‌పీఎస్ ఉద్యమించింది. 2007లో వికలాంగుల తరపున పోరాటం చేసి 200 రూపాయలు ఉన్న పెన్షన్‌ను 500కు పెంచేటట్లు చేసింది. ఈ వొరవడిలో ఇవ్వాళ వృద్ధుల కోసం, వితంతువుల కోసం వారి పెన్షన్ 1000 రూపాయలు పెంచాలనే డిమాండ్‌తో పోరాడుతున్నది. మందకృష్ణ మాదిగ ఆరు నెలలు రాష్ర్టమంతటా పాదయాత్ర చేసి ఈ సమస్యపై కదలిక తీసుకరావటం హర్షించాల్సిన విషయం.

సమాజంలో వృద్ధులకు బిడ్డలుగా, వితంతువులకు అన్నలు, అక్కలుగా వారికి గౌరవవూపదమైన జీవితం దక్కటానికి జరిగే పోరాటంలో అందరం భాగం కావాలి. వాళ్ల డిమాం డ్ నెరవేరే వరకు ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేయాలి. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాలు దీనికి మద్దతు ప్రకటించి పోరాటానికి అండగా నిలబడాలి.

-డాక్టర్ సి. కాశీం
(2013 ఏవూపిల్ 28న వృద్ధులు, వితంతువుల యుద్ధభేరి సందర్భంగా..)

Namasete Telangana Telugu News Paper Dated : 27/4/2013 

Friday, December 21, 2012

ధూంధాం పదేళ్ల నడక---డాక్టర్ కాశీం



kishan
తిరుపతి ఏడు కొండలపై ప్రపంచ తెలుగుమహాసభలు. దక్కన్ పీఠభూమి హైద్రాబాద్ నడిబొడ్డున ధూంధాం పదేళ్ల సభ. కాలం కత్తి అంచున రాలుతున్న రక్తపు బొట్లను తాగి బలిసిన కోస్తాంధ్ర పెత్తనానికి నిలు సాక్ష్యం తెలుగు మహాసభలు. శ్రీకాకుళ పోరాటంలో సుబ్బారావు పాణి గ్రాహి, చిన బాబును చంపిన వెంగళరావు 1975లో తెలుగు మహాసభలను జరిపాడు. తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని కనుమరుగు చేయడానికి తెలుగు భాషా ఉత్స వాలు సాధనమయ్యాయి. తెలంగాణ విద్యార్థులను, కవులను, కళాకారులను హత్య చేసినవాడు భాషపేరుతో ఊరేగాడు.

మళ్లీ ఇవ్వాళ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి ప్రపంచ తెలుగు మహాసభల కు పూనుకున్నాడు. తెలంగాణలో వెయ్యిమంది విద్యార్థులు నేలరాలారు. రచయితలను, కళాకారులను (అరుణోదయ విమల)బంధిస్తున్నారు. తెలంగా ణ అస్తిత్వం కోసం పెనుగులాడుతున్నది. మరోవైపు పాలకులు భాష పేరుమీద పండగ చేస్తున్నారు. నేటి పాలకులు కాసు బ్రహ్మానందడ్డి, జలగం వారసులే. తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షను కనుమరుగు చేయటానికి తెలుగు భాషను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు.

అందుకే తెలంగాణ బుద్ధిజీవులు ఆంధ్ర భాషా సాహిత్యాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ సాహిత్యం, కళారూపాల ను ఎజెండా మీదికి తీసుకురావాలి. ఈ సందర్భంలో హైదరాబాద్ లలిత కళాతోరణంలో ఈనెల 22న జరుగుతున్న పదే ళ్ల ధూంధాం దశాబ్ది ఉత్సవాలు కాకుండా తెలుగు మహాసభలకు ధీటుగా తెలంగాణ కళలు, సాహిత్యాన్ని నిలబె వేదికగా మారాలి. తెలంగాణ ప్రజలపై కోస్తాంధ్ర పాలకులు ప్రయోగిస్తున్న నిర్బంధానికి వ్యతిరేకంగా కలాలు, గళాలు విన్పించే శబ్దం కావాలి.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగా ణ గానకోకిల బెల్లి లలితను కోస్తాంధ్ర పాలకు లు పదిహేడు ముక్కలుగా నరికేసి, ఐలన్నను బూటకపు ఎన్‌కౌంటర్ చేసి విద్యార్థులను, మేధావులను జైళ్లలో బంధించి గద్దర్‌పై తుపా కి పేల్చి ఆట, పాట, మాటపై ఆంక్షలు విధించి న రోజుల్లో కళాకారుల సంఘటితశక్తిగా 2002 సెప్టెంబర్ 30న ధూం ధాం ఆవిర్భ వించింది. ఏ తెలుగు నిఘంటువును వెదికి నా ఈ పదం కనిపించదు. నిఘంటువుకు కావాల్సిన జనం పదాన్ని ఎజెండామీదికి తెచ్చిన ఘనత తెలంగాణ కళాకారులది. తెలంగాణ పల్లెలన్ని ధూంధాం ఆడాయి. రాజకీయ వేదికలన్నీ ధూంధాం సభలుగా మారాయి. కాలం విధించిన సామాజిక బాధ్యతను ధూం ధాం కళాకారులు నెరవేర్చా రు. బాలకిషన్ అనే అరుంధతి సుతుండు ధూంధాంకు సర్వనామమయిండు. సాధార ణ బడిపంతులు అసాధారణ మనిషిగా ఎద గటానికి ఈ కాలం సహకరించింది. ఈ నేల మీద చిందిన నెత్తురు, కారిన కన్నీళ్లు, రాలిన చెమట ధూంధాం పుట్టుకకు నేపథ్యమైంది.

పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని కాళోజీ చెప్పినట్లు తెలం గాణ కోసం యాదగిరి అమరుడయ్యాడు. నైజాం ఘోరీ కట్టి చుక్కల్లో చంద్రుడ య్యాడు. పశుల పిలగాని చేతికి పాటను అందించి ముళ్లుగపూరను ఆయుధంగా మలచిన సుద్దాల హన్మంతు ఈ భూమి పుత్రుడే. తేనెపూసిన కత్తివి నీవు నెహ్రయ్యా అనగలిగిన సాహసం పోరాడే ప్రజలు తెలంగాణ కవులకు ఇచ్చారు. నాగలి మోసిన రైతు తుపాకిని ఎత్తి నైజాం సర్కారు మెడలు వంచితే రివిజని జం పార్లమెంటులో కూర్చుంది. రైతు భంగపడ్డాడు. ఊరుపోయింది. మళ్లీ తెలుగు నేలలో వసంత కాలమేఘం శ్రీకాకుళం మీదుగా తెలంగాణలో కురిసింది. ఈ వానకు తడిసి ఊరు మనదిరా/ ఈ వాడ మనదిరా/ దొర ఏందిరో/ వాని దోపిడేందిరో అంటూ గూడ అంజయ్య పాటల కొలిమి రాజేశాడు. చెర బండరాజు కొండలు పగలేసే బండలు పిండిన మనిషి కోసం కలాన్ని ఎక్కుపె ట్టాడు. సిరిమల్లె చెట్టు కింద ఒంటరి శోకం పెడుతున్న లచ్చుమమ్మ కొడుకుగా పుట్టిన గుమ్మడి విఠల్‌రావు తూప్రాన్ తుపాన్ బిడ్డగా గద్దరయ్యాడు. 

ఒరిగిపో యిన బిడ్డల కోసం కరిగిపోయిన గుండెలను ఎర్రజెండాలుగా మలచి నెత్తుటి జెండాను ఎత్తుకొని మురిసిపోయాడు.‘అన్నెము పున్నెము ఎరుగని చిన్నితమ్ము ల తీసుకెళ్లి/అడగరాని ప్రశ్నలడిగి అన్నలను చూపెట్టుమని’ రాజ్యం రౌడీగా మారినప్పుడు రాజ్యహింసను గానం చేస్తూ తిరిగిన బైరాగి గోరటి వెంకన్న పాటల చెలిమెలో ఊరిన నీటి చెమ్మ. ఈ ప్రజా వాగ్గేయకారుల పాటలకు చైతన్యం పొందిన రెండో తరం కళాకారులు కలిసి సృష్టించిన జలపాతమే తెలంగాణ ధూంధాం. జన నాట్య మండలి పాటలు పాడుకుంటూ అన్నలు ఇంటికొస్తే బువ్వపెట్టిన పిలగాడు ధూం ధాం రసమయిగా మారటానికి ఇంతటి చరిత్ర ఉంది. కోట్లాదిమందిని లాలించి, ఊగించిన పాట గురించి పాటను రాసిన భిక్షపతి ఎన్ని త్యాగాలను నెమరువేసుకొని ఉంటాడు. 

దయానర్సింగ్, నాగరాజు, నేర్నాల కిషోర్, అమరుడు కృష్ణవర్మ, గర్జన విద్యార్థి వీరులను మల్లెపులుగా మట్టి వాసనలుగా కవిత్వీకరించిన దరువు ఎల్లయ్య ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన సూర్యుళ్లను మరిగించిన అభినయ శ్రీనివాస్, దేశప తి, ఏపూరి సోమన్న ఇట్లా వందలాది గళాలు విచ్చుకోవటానికి జననాట్య మండ లి, అరుణోదయ సంస్థలు చిందించిన నెత్తురే కారణం. ఎక్కడో ఒకచోట వీళ్ల నాడుల్లో ఎరుపు ప్రవహిస్తుంది. వీళ్లందరి సామూహిక బృందగానమే ‘ధూంధాం’. వీళ్లందరిని కూడేసిన మనిషి మాత్రం కచ్చితంగా రసమయి బాలకిషన్. వ్యక్తులుగా గద్దర్, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, డప్పు రమేష్, అంద్శై, జయరాజ్ సంస్థలుగా అరుణోదయ, ప్రజాకళామండలి ఈధూంధాం విస్తరించడానికి మూలం. 

ఊరు, వాడ ఏకమై కళాకారుల కోసం 70వ దశకం ఎదురు చూసినట్లు, మళ్లీ ధూంధాం కళాకారుల కోసం ఎదురుచూసింది. నాయకులు వేదిక కింద కూర్చుంటే, కళాకారులు వేదికపై నుంచి పాటలు పాడే ప్రజాస్వామిక వాతా వరణానికి ధూంధాం పునాది వేసింది. కళాకారులే సభను నిర్వహించే స్థితి సృష్టించబడింది. దళితులే ఆటగాళ్లుగా, పాటగాళ్లుగా మారారు. నాయకులయ్యా రు, గాయకులయ్యారు. కొత్త సాహిత్య వస్తువు, కొత్త రూపం కష్టజీవి కనుకొ లుకుల నుంచి వచ్చింది. ఊరు, పేరు తెలి య ని కవులకు, కళాకారులకు ధూం ధాం వేదికయింది. ఏ ఉద్యమంలో లేని అద్భుత మైన రసాయన చర్య ధూంధాంలో జరిగింది. చరి త్రలో ఒక లోటును ధూంధాం పూడ్చింది. అల్లిక వారసత్వం నుంచి ఎదిగివచ్చిన అందె శ్రీ తెలంగాణ గొంతుల్లో జయజయహే తెలంగాణగా మారాడు. జనగర్జనల జడివాన ను కురిపించాడు. ఇదొక గుణాత్మక మార్పు. 

కానీ సమాజంలో పెరిగిన విలువల రాహి త్యం కళాకారులపై పడింది. చెడు అలవాట్ల కు, రాజకీయ నాయకులకు బానిసల య్యా రు. ఉద్యమం కోసం కాకుండా ఓట్ల కోసం, నోట్ల కోసం పాడటానికి పూనుకున్నారు. విప్లవ సాంస్కృతిక సంస్థలు బలంగా లేకపోవ డం వలన ఇలా జరిగిందని సంతృప్తి చెందితే ఉద్యమానికి నష్టం. సైద్ధాంతిక పునా ది లేని ధూం ధాంలే కళాకారులు ధ్వంసం కావటాని కి కారణమయ్యాయంటే తప్పు అన్నవాళ్లది కాదు. రాజకీయ నాయకులను ఓట్లలో గెలి పించడమే ప్రధాన లక్ష్యంగా ధూం ధాం ప్రయాణించటం కూడా కారణం. కవులు, కళాకారులు ప్రతిపక్షంగా ఉండాలనే ఎరుకను కళాకారులు మర్చిపోయారు. అగ్రకుల నాయకులు కళాకారులకుండే ప్రజాదరణ కు భయపడ్డారు. దీంతో వీళ్ల ప్రాధాన్యాన్ని తగ్గించటానికి కుట్రపూరితంగా ఈ విలువల రాహిత్యాన్ని పెంచారు. కళాకారులకు ఎప్పుడైనా బండి యాదగిరి, బెల్లిలలిత, గద్దర్ నమూ నా కావాలే తప్ప, రాజకీయ నాయకులు కాదు. 

కళాకారులు తెలంగాణ కోసం ఎన్నికలను ఎత్తిపట్టే వారుగా, ఉద్యమం ద్వారానే తెలంగాణ అని చెప్పే వారుగా చీలిపోయారు. ధూంధాం ఎన్నికల వైపు మొగ్గు చూపిందని చరిత్ర రుజువు చేసింది. గద్దర్ గౌరవాధ్యక్షులుగా, గూడ అంజయ్య అధ్యక్షులుగా తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఉద్యమాల ద్వారానే తెలంగాణ అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. అంటరానివిగా చూసి న కళారూపాలను గౌరవంగా ప్రదర్శించిన తెలంగాణ ధూంధాం, సాంస్కృతిక ఉద్యమం ఇవాల్టి సందర్భంలో బలం పుంజుకోవాలి. ధూంధాం ఉత్సవాలుగా కాకుండా పదేళ్ల నడకలో జరిగిన లోటుపాట్లను చర్చించుకునే సభగా మార్చి తే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది. రసమయికి చరివూతలో చోటు దొరుకుతుంది. 

-డాక్టర్ కాశీం
(పదేళ్ల ధూంధాం సభ సందర్భంగా..

Namasete Telangana News Paper Dated: 22/12/2012

Saturday, August 25, 2012

లక్షింపేటా..! - డా.సి.కాశీం


లక్షింపేట.. లక్షింపేట
నిన్నేమని పిలువాలి తల్లీ
కళ్ళు తెరిచినా మూసినా
దృశ్యం చెదిరిపోవటం లేదు
కలత నిద్రలోంచి- చావు వాసన వస్తుంది
కనుగుడ్లు చిమ్మిన రక్తంతో
నీ మట్టి గడ్డ కట్టింది
మునివేళ్లతో మట్టిని తాకుదామంటే
మానవ కంకాళాలు కన్పిస్తున్నాయి
నీతో సంభాషించాలంటే
కత్తుల భాషను చూసి భయమేస్తుంది
నీ గర్భంలో పాతిపెట్టుకున్న నమ్మకాన్ని
వేకువజాము కోయిల పాట సాక్షిగా నరికివేసారు
కత్తి మొనకు నిప్పులు రాలుతుంటే
మాల తల్లుల చెంపల మీద
సముద్రాలు పారుతున్నాయి
ఇక్కడ భూమి కడుపులో
కళ్లు పెట్టి చూడటమే నేరమైంది!
లక్షింపేటా..!
నేను లేగదూడ కంటిలో దుఃఖాన్ని చూసాను
చెట్టుపై వాలిన కాకి శోకాన్ని విన్నాను
అపుడే ప్రసవించిన మేకపిల్ల- అరుపు ఆగిపోయింది
తల్లికోడి రెక్కల చాటున దాగిన
కోడిపిల్లల భయాన్ని కనుగొన్నాను
వంశధార నది అలలపై
పారుతున్న రక్తాన్ని చూసి
సూర్యుడు మూర్ఛపోయాడు
బొడ్డులో దిగిన బాకుపోటు నుంచి తేరుకొనక ముందే
కనుపాపలు కత్తికి వేలాడుతున్నాయి
మరణ వాంగ్మూలం- పెదాలకు చేరకముందే
నాలుక తెగిపోయిన దృశ్యం
లక్షింపేటా..! నీ జ్ఞాపకాల సందు నుంచి
ఒక దుఃఖం పొగిలి పొగిలి నడుస్తుంది
చరిత్ర పాన్పు మీద
తగలబడుతున్న భర్త కోసం భార్య
జీవిత మాన్యాల మీద- వాలిపోయిన బిడ్డ కోసం తల్లి
గొడ్డలి కొస నుంచి
కారుతున్న అన్న రక్తంబొట్టు కోసం చెల్లి
మాంసం ముద్దలను పోల్చుకోలేక
పిచ్చివాళ్లలా తిరుగుతున్నారు
మొగలిరేకుల లక్షింపేట వనంలో
నాలుగు మొండాలు వేలాడాయి
పుట్టిన తారీఖులు లేని వాడని తల్లీ
ఈ నేల మీద ఎన్నిసార్లు- చంపబడ్డానో
చార్వాకుడి నుంచి సంగమేసు వరకు- చరిత్రే సాక్ష్యం
మూడు దశాబ్దాల క్రితం
నేను కారంచేడును
ఇప్పుడు- నెత్తుటి ముగ్గేసిన లక్షింపేటను
ఎన్నిసార్లు చంపినా
నేనొక ఫీనిక్స్‌ను

- డా.సి.కాశీం
97014 44450

Saturday, March 24, 2012

ఒక యోధుడి విషాద నిష్క్రమణ--డాక్టర్ సి. కాశీం



చాలా రోజుల తర్వాత ఈ మధ్య ఒక మిత్రుడు కలిశాడు. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మా మాటల్లో సాంబశివుని ప్రస్తావన కూడా వచ్చిం ది. ఒకప్పుడు నా మిత్రుడు బీజేపీ రాజకీయాలతో ఉన్నాడు. శాంతి చర్చల సందర్భంలో (2005) సాంబశివుడు ఈ మిత్రుడి గ్రామానికి వచ్చాడట. అమెరికన్ సామావూజ్యవాదం, బీజేపీ మతోన్మాదం ప్రజలకు ఏవిధంగా శత్రువులయ్యాయో ప్రజల సమక్షంలో గంటసేపు ఉపన్యాసించి దళిత, గిరిజన, బలహీన వర్గాలకు వ్యతిరేకమైన ఆ పార్టీలో పనిచేయటమంటే ప్రజల వ్యతిరేక వర్గంలో ఉండటమేనని చెప్పాడట. సాంబశివుడి ఉపన్యాస ప్రభావంతో ఆ మిత్రుడు బీజేపీని వదిలిపెట్టి నీతి, నిజాయితీగా తన కులవృత్తి (వవూడంగి) పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. అతడు ఒక ఉపన్యాసంతో ఎన్ని రకాలుగా ప్రభావితం చేశాడో తలచుకుంటే ఆశ్చర్యమేస్తుంది. తన ఆచరణతో, చెదరని చిరునవ్వు పలకరింపుతో, ప్రజలపట్ల ఉండే నిబద్ధత తో, వర్గశవూతువు పట్ల ఉండే కసితో రెండు దశాబ్దాలు తెలుగునేలపై చెరగని సంతకం చేశాడు.

మందెంట పోయేటి యలమందను మహోన్నత నాయకుడిగా ఎదిగించిన విప్లవోద్యమానికి సాంబశివుడే సాక్ష్యం. నాగజెముళ్ళ బృందావనంలో విరబూసిన విప్లవ మందా రం. అతడు నడిచినంత మేర విప్లవాన్ని వెదజల్లాడు. నెర్రె లు పారిన కరువు నేలలో నాగళ్ళతో సంభాషించాడు.రజాకార్లతో రణం చేసిన ఎర్రగుండె నల్లగొండలో కళ్ళు తెరిచి పాలమూరు పోరుకేకయ్యాడు. శత్రువు నీడలా వెంటాడుతుంటే ప్రజాక్షేవూతంలో ఉండి యుద్ధం చేశాడు. చెంచులను దోపిడీ చేస్తు జంగ్లాత్‌గాళ్ళను తరిమికొట్టి అడవి బిడ్డలకు అండగా నిలబడ్డాడు. వలసపోతున్న జీవితాలకు కాసింత నమ్మకాన్ని ఇచ్చాడు. తెలుగు నేలపై విశేష ప్రభావాన్ని వేసి న అతికొద్ది మంది విప్లవకారులలో సాంబశివుడు ఒకరు. 
సాంబశివుడు నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలోని దాసిడ్డిగూడెంలో పుట్టాడు. కునపురి చంద్రయ్య, లక్ష్మమ్మలకు పుట్టిన మొదటి సంతానం. కడు పేదరికం. నోరులేని జీవాలను నమ్ముకొని బతికిన కుటుంబం. కన్నీళ్ళను కతికి, బతుకు చితికిన బాల్యం దొరగడీలో జీతమున్నది. చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది. తర్వాత గొంగడి భుజానికెక్కింది. గొర్లమందకు, మేకల దొడ్డికి దొరైపోయాడు. ఐదవ తరగతిలో ఆగిన చదువును కొనసాగించాలని చాలా తపించాడు. కానీ పేదరికం అతన్ని వెక్కిరించింది. 
సరిగ్గా ఈ సమయంలో దాసిడ్డిగూడెంకు చెందిన శ్యామల కిష్టయ్య భువనగిరి డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. రాడికల్ రాజకీయాలతో ప్రభావితుడయ్యాడు. ఈ రాజకీయాలను కిష్టయ్య దాసిడ్డిగూడెం మోసుకొచ్చాడు. కిష్టయ్య, ఐలయ్య ఇద్దరు చెలికాండ్రు. శ్యామల కిష్టయ్య తెచ్చిన రాజకీయాల ప్రభావంతో విప్లవం కోసం పూర్తికాలం పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. రైతుకూలి సంఘం పెట్టి, దానికి నాయకత్వం వహించి అనేక పోరాటాలు నడిపాడు. క్రమంగా 90వ దశకం లో ఉండిన విప్లవాల వెల్లువ ఐలయ్యను మరింత పదునెక్కించింది. 
వరంగల్ రైతుకూలి సంఘం మహాసభలు మరింత ఉత్తేజాన్నిచ్చాయి. మేకల దామోదర్‌డ్డి (సంజీవ్), బాబన్న ప్రభావంతో ఉన్న ఊరును, కన్నతల్లిని వదిలి కోట్లాది తల్లుల విముక్తి కోసం ప్రయాణమయ్యాడు. అనతికాలంలోనే నాయకుడిగా ఎదిగాడు. ప్రేమించాల్చిన వాళ్ళను అధికంగా ప్రేమించి, ద్వేషించాల్సిన వర్గ శత్రువును అంతకంటే అధికంగా ద్వేషించే సైద్ధాంతిక పటుత్వాన్ని అలవర్చుకున్నాడు. ఎదుటి వ్యక్తు లు చెప్పే విషయాలను ఓపికగా వినటం అతడికి అలవాటు. కనుకనే మంచి నాయకుడుగా మారాడు. క్యాడర్‌లో ఉండే నైపుణ్యాలను, శక్తులను బట్టి ప్రోత్సహించేవా డు. సూర్యం, ఆర్.కె మాధవ్‌లతో కలిసి పనిచేయటం వల్ల విప్లవ నాయకత్వ లక్షణాలు ఒంటపట్టాయి.
ఐలయ్య రామన్నగా, సుధాకర్‌గా, పనిచేస్తూ సాంబశివుడిగా పరిణామం చెంది పాలమూరు జిల్లాలో పనిచేయటంలోనే అతడి రాజకీయ జీవితం విశాలమైంది. సాంబశివుడి వారసత్వాన్ని తలకెత్తుకోవటం వల్ల ప్రజలకు సాంబశివుడుగా ప్రేమ పాత్రుడయ్యాడు. పాలమూరు జిల్లా కొల్లాపూర్ తాలూకాలోని చుక్కాయిపల్లిలో అంటరాని పూరి గుడిసెలో ఉదయిస్తున్న సూర్యునిపై చిర్రా చిటికెన పుల్ల తీసుకొని దరువేసిన మనిషే సాంబశివుడు. అంటరాని పెను మంటను ఆర్పడానికి విప్లవాన్ని కౌగిలించుకున్న మాదిగ బిడ్డ పేరే సాంబశివుడు. కునపురి ఐలయ్య పాలమూరుకు రాకమునుపు ఈ జిల్లా విప్లవోద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తిపేరు సాంబశివుడు పభాకర్). ఈ పేరు ప్రజలకు ఎంత ప్రేమనో, శత్రువుకు అంత భయం. పాలమూరు విప్లవోద్యమానికి సుదర్శన్‌డ్డి జీవంపోస్తే సాంబశివుడు విస్తరిం పచేశాడు. మాధవ్ అద్భుతమైన నిర్మాణం చేశాడు. విప్లవోద్యమ అవసరాల రీత్యా లింగమూ ర్తి, రమేశ్‌తో కలిసి కృష్ణానది దాటుతుండగా పుట్టి మునిగి సాంబశివుడు 2001లో అమరుడయ్యాడు. సాంబశివుడు అమరత్వం తర్వాత పాలమూరు జిల్లా విప్లవోద్యమ నాయకత్వ బాధ్యతలను కునపురి ఐలయ్య (సుధాకర్) చేపట్టాడు. ఇక్కడి నుంచి ఐలయ్య సాంబశివుడయ్యాడు.

సాంబశివుడి పేరుతో పాలమూరు మీద వేసిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఆ ప్రభావాన్ని తర్వాత కాలంలో సాంబశివుడిగా మారిన ఐలయ్య విప్లవోద్యమం నుంచి బయటికి వచ్చేవరకు కొనసాగించాడు. ఎందరికో గుండె ధైర్యం చెప్పిన అతనికి ఎందుకు గుండె జారిదో తెలియదు. కానీ సేఫ్ జోన్‌లోకి వెళ్ళి తిరిగివచ్చాడు. కానీ రాజ్యానికి విప్లవోద్యమ రహస్యాలు చెప్పకుండా ఉద్యమం పట్ల కృతజ్ఞతను ప్రదర్శించాడు. అట్లే ఉద్యమానికి వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. పైగా విప్లవోద్యమం గొప్పతనాన్ని పొగిడాడు. ఉద్యమంలో ఉండగా తాను చేసిన ప్రతి రాజకీయ చర్య సరైనదేనని ప్రకటించాడు. విప్లవోద్యమం నుంచి బయటికి వచ్చాక చాలా మందిలాగా వ్యక్తిగత జీవితంలో ముడుచుకొని ఉండలేకపోయాడు. చలనశీలమైన తన స్వభావాన్ని తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా వ్యక్తం చేశాడు. బూర్జువా అధికార రాజకీయాల కోసం పనిచేస్తున్నప్పుడు సహజంగానే పాత, కొత్త శత్రువులు ఏకమవుతారనే స్పృహను మర్చినట్లున్నాడు. 

ప్రత్యామ్నాయ రాజకీయాలలో నాయకుడిగా ఉండి వర్గ శత్రు వు నిర్మూలనలో భాగమైన వ్యక్తిని ఈ పాలకవర్గాలు వదిలిపెడ్తామని భావించటంలోనే విషాదమున్నది. శ్రీ కృష్ణ కమిటీ వ చాప్టర్‌లో భాగమై న, రాజ్య ప్రేరిత ప్రైవేటు గూండాలు చేసినా.. ఇది రాజ్యం చేసిన హత్యనే. యోధుడిలా తెలుగు నేలపై తిరగాడిన సాంబశివుడి విషాద నిష్క్రమణ జీర్ణించుకోలేనిదే. అయినా అతని విప్లవ స్వప్నం, తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చే దారిలో మనందరం నడవటమే అతనికి మనమిచ్చే నివాళి. విప్లవోద్యమంలో పనిచేసి బయటికి వచ్చి ఉద్యమంపై బురద చల్లి, అనారోగ్యాలతో మరణించిన కొందరి సంస్మరణ సభల పేరిట విప్లవోద్యమం మీద దాడి చేస్తున్న ఈ సందర్భంలో విప్లవోద్యమం పట్ల సాంబశివుడు చూపిన విజ్ఞత, నిబద్ధత మనకు ఆదర్శం కావాలి. 

-డాక్టర్ సి. కాశీం 
(రేపు సాంబశివుడి ప్రథమ వర్ధంతి)
Namasete Telangana News Paper Dated : 25/03/2012 

Friday, November 18, 2011

నిర్బంధాన్ని నిలువరిద్దాం By -డాక్టర్ సి.కాశీం


‘వాడు చమురు దాహానికి రేపిన/ఇసుక తుఫాను రేణువులన్నీ ఇక్కడ/ నీ, నా కనుప్పల మెత్తని కూసాన్ని తెగ్గోస్తున్నా/ఎంత అచేతనంగా పడుకున్నాం మనం/ పాలపొడుల మీద, పడిసి చెక్కిళ్ల మీద/ తల్లి రొమ్ముల మీద వృద్ధాప్యం చేతి కర్ర మీద/ బాంబులు కురుస్తు న్నా/ బంకర్లలో దాక్కున్నామే మనం/ ముష్టి బతుకుకోసం తొండల్లా వంగి వంగి దాక్కున్నామే గాని/ మనుషుల్లా నిటారుగా నిలబడలేని నిన్నూ, నన్ను చూసి/ భూమికి సమాంతరంగా నడుస్తున్న జీవులూ వెక్కిరిస్తున్నాయి’ (కవిత్వంపై ఎర్రజెండా-పుట-183)

ఈ కవితను చెరుకు సుధాకర్ ఫిబ్రవరి 1999న రాశాడు. విరసం ప్రచురించిన ‘కవిత్వంపై ఎర్రజెండా’ సంకలనంలో అచ్చయింది. అమెరికన్ సామ్రాజ్యవాదం చమురు కోసం ఇరాన్ మీద చేసిన దాడిని సుధాకర్ ఈ కవితలో చిత్రించాడు. బలహీనుల మీద బలవంతులు చేస్తున్న దాడి సందర్భంలో మౌనంగా ఉండే మధ్యతరగతి బుద్ధిజీవుల అచేతన స్థితిని అసహ్యించుకున్నాడు. ఒక విప్లవకవిగా అమెరికా సామ్రాజ్యవాదినైనా, ఆంధ్ర వలసవాదినైనా ఒకేలా చూసే రాజకీయ దృష్టి ని, సైద్ధాంతిక బలాన్ని అతడు నడిసొచ్చిన దారే నేర్పింది. ఆ దారి సమ స్త ప్రజలను విముక్తి చేసేది. అక్కడి నుంచి కాస్త ఆగిచూస్తే...
దృశ్యం మారిపోయింది. అస్తిత్వ పోరాటంలో కూడా సుధాకర్ చాలా దారులే నడిచాడు. తెలంగాణ మహాసభ నుంచి రాష్ట్ర సాధన కోసం మడమ తిప్పని పోరాటమే చేస్తున్నాడు. తెలంగాణ కోసం పోరా ట ఆచరణ సరిగ్గానే ఉందనడానికి ఆయన పట్ల శత్రువు వైఖరే గీటురాయి. తెలంగాణ ఉద్యమంలో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన మొద టి వ్యక్తిగా నిలబడ్డాడు. ఇప్పుడు శత్రు శిబిరంలో వరంగల్ కారాగారంలో తెలంగాణను కలగంటున్నాడు. ఇంత జరిగినా తెలంగాణలో ఉండే బుద్ధిజీవులు మౌనంగా ఉండటమే ఆశ్చర్యం. ‘శత్రువు మన దగ్గరకు రాలేదు కదా!’ అని మౌనంగా ఉంటే, మనల్ని చంపేసే నాటికి మాట్లాడటానికి ఇంకెవరు మిగలరనే సత్యాన్ని గుర్తించనంత జడత్వంలో తెలంగాణ బుద్ధిజీవులున్నారా? పై కవితలో చెప్పినట్టు బతుకు కోసం తొడల్లా వంగి వంగి దాక్కున్నామా?

నిర్మాణపరంగా సుధాకర్ ఒక బూర్జువా పార్టీలో ఉండవచ్చు. కాని అతడు కవి, రచయిత, వృత్తిరీత్యా డాక్టర్. అట్లాంటి వ్యక్తి మీద పీడీ యాక్ట్ పెట్టిన సందర్భంలోనైనా బుద్ధిజీవులు స్పందించాలి. ఒక సృజనాత్మక రచయిత విషయంలో రాజ్యం ఎంత ఫాసిస్టుగా వ్యవహరించిందో ప్రపంచానికి చాటి చెప్పాలి. నిజానికి ఆయన కవితా రచనను ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. అక్టోబర్ 3న 307 సెక్షన్ కింద నకిరేకల్ పోలీసులు అరెస్టు చేసి నల్లగొండ జైలులో బంధించారు. బిడ్డ పెళ్లి పను లు చూసుకోకుండా పదిహేను రోజులు జైలులో ఉంచారు. దొడ్డి కొమురయ్య బ్యారక్ నుంచి (జైలులో ఉన్న తెలంగాణవాదులు జైలు గదులకు మార్చి రాసిన పేర్లు) అక్టోబర్ 13న రాసిన ‘ఎ పోయం ఈజ్ ఫ్లోయెమ్’ ఒక దినపవూతికలో అచ్చయింది. పాట వెన్నెల చిలుకరించినట్లు/ నెత్తురు వొలకబోసినట్లు ..అది కవితైనా, పాటైనా, కవితా పాట కలిసిన ప్రవాహమే. నడుస్తున్న తెలంగాణ ఉద్యమ ప్రవాహానికి ప్రతీకగా ఈ పోయెంను సుధాకర్ శత్రు శిబిరంలో దోబూచులాడిన నెలవంక సాక్షిగా రాశాడు.

ఉద్యమ నాయకుడిగా మారినా తనలోని కవి చేతనంలోనే ఉన్నాడు.సుధాకర్‌కు ఒక ఉజ్వలమైన గతమున్నది. పోరాట వర్తమానమున్నది. అట్లాంటి గతమే కావచ్చు ఆయనను ఈ దారిలోకి నడిపించింది. అతని తండ్రి ఉషాగౌడ్ తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకి పట్టిన నాయకుడు. రజాకారులు మనుషులను సామూహికంగా బావిలో వేసి చంపిన గుండ్రాంపల్లి అనే పోరాట గ్రామంలో సుధాకర్ పుట్టాడు. ఈ చైతన్యంతో ఆయన ప్రయాణం విర సం, పౌరహక్కుల సంఘాల మీదుగా నడిచింది.
విప్లవ రాజకీయాల నుంచి పార్లమెంటరీ రాజకీయాలలోకి వెళ్లినా పోరాట రూపాలు రాజ్యాన్ని ఇబ్బంది పెట్టేవిగా ఉంటే, పాలక వర్గాలు సహించవనడానికి సుధాకర్ ఉదాహరణ.

తెలంగాణ ఉద్యమాన్ని వా యిదా పద్ధతిలో నడుపుతున్న సందర్భంలో కోస్తాంధ్ర పాలకుల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే మిలిటెంట్ పోరాటాన్ని సుధాకర్ నడిపించాడు. సకల జనుల సమ్మె జరుగుతున్నప్పుడు ఆంధ్ర బస్సులను తెలంగాణ లో నడిపించాలని ప్రయత్నించిన ముఖ్యమంత్రి పన్నాగాన్ని తిప్పికొడుతూ నకిరేకల్‌లో సుధాకర్ నాయకత్వంలో 30 బస్సులను నిలువరించారు. ఇట్లాంటి పోరాట రూపాలు మొత్తం తెలంగాణ ఉద్యమానికి నమూనాగా మారవల్సినవి. కానీ అది జరగలేదు. దీంతో సుధాకర్‌తోపాటు మరో 100 మందిపై నకిరేకల్ పోలీసులు 307 సెక్షన్ కింద నిర్బంధించారు. నాడు పోలీసు నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాటం నిర్మించి ఉంటే నేడు పీడీ చట్టం కింద అరెస్టు చేసేవారు కాదు.

ఇప్పటికైనా కోస్తాంధ్ర పాలకులు తెలంగాణ ఉద్యమంపై అమలుచేస్తున్న నిర్బంధాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలి. సాంద్రత కలిగిన ఒక కవిని, మేధావిని, డాక్టర్‌ను అక్రమ నిర్బంధం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ బుద్ధిజీవులపై ఉంది. ఎమ్జన్సీలో పీడీయాక్ట్ కింద అరెస్టైయిన కవులను, మేధావులను కాపాడుకోవడానికి ఎలాంటి కార్యాచరణను బుద్ధిజీవులు రూపొందించుకున్నారో అలాం టి పనిని నేటి తెలంగాణ బుద్ధిజీవులు చేయాలి.
Namasete Telangana News Paper Dated 19/11/.2011

Sunday, September 4, 2011

విద్యార్థుల రక్తం చిందని పోరే లేదు ---డా॥ సి. కాశిం Namasethe Telangana Jul/10/2011

 విద్యార్థుల రక్తం చిందని పోరే లేదు
 పుస్తకంలోని పుటలు తిరగేయాల్సిన చోట రక్తం బొట్లుగా బొట్లుగా కారుతున్నది. కమ్మనికలలు వికసించాల్సిన క్యాంపస్‌లో రబ్బరుబుప్లూట్ తగిలిన గాయాలు సల్పుతున్నవి. యవ్వనపు ప్రేమలు కవిత్వం రాయవల్సిన మునివేళ్ళు లాఠీ దెబ్బలకు పగిలి కంకర రాళ్ళ వైపు చూస్తున్నాయి. రాలిపడిన మాంసం ముద్దలు నెరవేరని తెలంగాణ కోసం తలబాదుకుంటున్నాయి. గోరింటాకుతో ఎరుపెక్కిన లేడిస్ హస్టల్ అరచేతులు ముళ్ళ కంచెను ఈడ్చేస్తున్నాయి. బొంగరంతో ఆడిన బాల్యం బాష్పవాయువు గోళాలను ఒడుపుగా అందుకొని శత్రు శిబిరం వైపు విసురుతున్నది. కోడికూతతో నిద్ర లేసిన డప్పు క్యాంపస్‌ను కదం తొక్కిస్తున్నది. సామూహిక గానంలో శత్రువు ఎత్తులు చిత్తవుతున్నాయి. మూడువందల మంది విద్యార్థులు ఆరువందల మంది పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒకరకంగా క్యాంపస్ సరిహద్ధులలో యుద్దం జరుగుతున్నది. కాలం కత్తులవంతెనపై విద్యార్థులు కవాతు చేస్తున్నారు. ఇది నడుస్తున్న తెలంగాణ.  ఎంత విచిత్రం. తొంభైయొవ దశకమంతా ప్రపంచీకరణ పడగనీడలో గ్లోబల్ ఎండమావుల వెంట పరుగెత్తిన విద్యార్ధులు ఇవ్వాళ తెలంగాణ కోసం త్యాగానికి సిద్ధపడుతున్నారు. ‘దేశానికి కళ్ళు నీవే, కాళ్ళు నీవే అని చెప్పిన చెరబండరాజు కలను నెరవేర్చుతున్నారు. పుస్తకాలను వదిలి తెలంగాణ నినాదాన్ని అందుకుంటున్నారు. క్యాంపస్ చెట్లకింద పోటీ పరీక్షల పుస్తకాలతో కుస్తీపట్టిన వాళ్ళు నడుస్తున్న తెలంగాణ ఉద్యమానికి వ్యూహాలు పన్నుతున్నారు. షకలకబేబీ పాటల్లో తేలియాడిన పిల్లలందరు పొడుస్తున్నా పొద్దు మీద నడుస్తున్న కాలానికి కాపలకాస్తున్నారు. పాఠశాలలే పోరుబాటలుగా కళాశాలలే కదన రంగంగా కదులుతున్నాయి. ఉద్యమాలకు దూరమవుతున్న విద్యార్థులను నిలదీసి తమ చారివూతక బాధ్యతను గుర్తుచేసిన ఘనత తెలంగాణ ఉద్యమానికే దక్కింది. అరవై, డైబై్బయో దశకాలలో నడిచిన ఉజ్వల పోరాటాన్ని ఈ తరానికి గుర్తు చేసింది తెలంగాణ ఉద్యమే.  నిజానికి తెలంగాణ పోరాటంలో విద్యార్థులు ప్రతీ మూలమలుపులో అగ్రబాగాన నిలబడ్డారు. ఒక రకంగా విద్యార్థుల పోరాటం కార్మిక, మేధావి, విద్యార్థుల ఐక్యతకు కూడా తెలంగాణ పోరాటం నిలు నిదర్శనం. 1969 జనవరి, 5 న ఖమ్మం జిల్లా పాల్వంచ ధర్మల్ పవర్ స్టేషన్‌లో ఆంధ్ర ఉద్యోగుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కృష్ణ అనే దినసరి కార్మికుడు అమరణ నిరహారదీక్షను మొదలు పెట్టాడు. దీని ప్రభావంతో ఖమ్మం పట్టణంలో రవీంవూదనాథ్ అనే విద్యార్థి జనవరి , 9న అమరణదీక్షకు పూనుకున్నాడు. కార్మికుడు మొదలు పెట్టిన ఉద్యమాన్ని విద్యార్థి అందుకున్నాడు. దీనితో తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు ఉప్పెనలా కదిలారు. ఆంధ్రబోర్ఢులన్నింటిని పీకేశారు. ఆంధ్ర బ్యాంకులపై దాడులు చేశారు. ఆంధ్ర అధికారులు ‘గోబ్యాక్ ’ అంటూ అడ్డుకున్నారు. ఇట్లా సమస్త పాలనా రంగమంతా స్తంభించి పోయింది. హైదరాబాద్, శంషాబాద్, సదాశివపేట్ మొదలైన చోట్ల కాల్పులుజరిగాయి. విద్యార్థులు అమరులయ్యారు. కొందరు గాయపడ్డారు. తెలంగాణ కోసం రక్తం ఏరులై పారింది. ఇట్లా 1969 ఉద్యమం కాసు బ్రహ్మానందడ్డి రక్త దాహానికి బలైపోయింది. 370 మంది విద్యార్థుల వేడి నెత్తురు చిందింది. ఈ నెత్తురు తివాచీ మీద నడుచుకుంటూ వెళ్ళిన చెన్నాడ్డి విద్రోహానికి తెలంగాణ ఉద్యమం మోసపోయింది. చాలా రోజుల తర్వాత 1998 లో తెలంగాణ కోసం తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ (టి.ఎస్.ఎఫ్) ఏర్పడినా చంద్రబాబు నిర్భంధ పాలనలో విస్తృతంగా పని చేయలేకపోయింది. నలభై వసంతాల తర్వాత 2009 లో మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎజెండా మీదకి దూసుకొచ్చింది. గిరిజనుడి విళ్లంబులా ఆంధ్రపాలక వర్గాల పై దూసుకెళ్లింది.  ఉస్మానియా మూనివర్శిటీ విద్యార్థులు ఉద్యమంలోకి రావడంతో గుణాత్మకమైన మార్పు వచ్చింది.కెసిఆర్ దీక్షకు మద్దతుగా విద్యార్థుల ర్యాలీ మలి దశ ఉద్యమానికి ప్రాణం పోసింది. ఆర్ట్స్ కాలేజీ ముందువిద్యార్థుల దీక్షా శిబిరం వెలసింది. విద్యార్థి ఐక్యకారాచరణ కమిటి (జెఎసి) ఆర్ట్స్ కాలేజీ మొట్ల మీద ఆవిర్బవించింది. డిసెంబర్ 9న చలో అసెంబ్లీ పిలుపునిచ్చిన ఓ యూ జెఏసీ ప్రపంచం చూపును తనవైపుకు తిప్పుకున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెన్నులో వనుకును పుట్టించిన ఘనత విద్యార్ధులదే. ఒకవైపు కె.సి.ఆర్ ఆమరణ నిరహార దీక్ష, మరోవైపు విద్యార్థి ఉద్యమం తాకిడికి తట్టుకోలాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిసెంబరు, 9 అర్ధరాత్రి తెలంగాణ ప్రక్రియ ను మొదలుపెడుతామని ప్రకటించాయి. తెలంగాణ చరివూతలో మొదటి సారి కేంద్రం తరుపున తెలంగాణ కు అనుకూలంగా వచ్చిన ప్రకటన ఇదే. ఇది రావటానికి అనేక శక్తులతో పాటు విద్యార్థుల పాత్ర అద్వితీయమైనదనే విషయాన్ని అందరుగమనంలో ఉంచుకోవాలి.  తెలంగాణ ప్రాంతంలో అరుదుగా వచ్చిన విద్యార్థి ఉద్యమాలను ప్రతీ సందర్భంలో కోస్తాంధ్ర పాలక వర్గాలు అణిచివేసాయి. ఈ సందర్భంలో కూడా అదే జరిగింది. 2009 నవంబర్, 21 న ప్రారంభమైన విద్యార్థులు వెన్ను చూపకుండా ముందుకు కదిలారు. తెలంగాణకు వ్యతిరేకంగా డిసెంబరు, 23న ప్రకటనను నిరసిస్తూ లక్షలాది మంది విద్యార్థులతో 2010 జనవరి 3న ఆర్ట్స్ కాలేజీ మెట్ల మీద కనివిని రీతిలో విద్యార్థి గర్జన సభ జరిగింది . తెలంగాణ ప్రజలపై ఈ సభ అద్భుతమైన ప్రభావాన్ని వేసింది. స్వచ్చంధంగా తరలి వచ్చిన విద్యార్థులు తమ తెలంగాణ ఆ కాంక్షను ప్రపంచానికి చాటారు. ఈ సభ కొనసాగింపుగా జనవరి, 18 నుంచి ఫిబ్రవరి 7 న కాకతీయ యూనివర్శిటీ లో విద్యార్ధి పొలికేక ను లక్షలాది విద్యార్థుల సమక్షంలో ఢిల్లీ పాలకులకు విన్పించారు.  ఇట్లా సంవత్సర కాలం ఐక్యమత్యం గా విద్యార్థులందరు పార్టీలకతీతంగతా ఒకటై తెలంగాణ కోసం ఉద్యమించారు. జైలు పాలయ్యారు. లాఠీదెబ్బలు తిన్నారు. కాళ్ళు చేతులు విరగగొట్టునన్నారు. 620 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ కోసమే తమ యవ్వనపు రక్తనంతా దారపోశారు. ఏముయిందో ఏమోకాని , నెత్తిన పిడుగు పడట్లు 2010 మార్చిన తెలంగాణ విద్యార్థి జాక్‌లో చీలిక వచ్చింది. తెలంగాణ ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థి ఉద్యమం నిట్ట నిలువునా చీలిపోయింది. కళ్ళముందే చెట్టంత బిడ్డ కూలిపోతే తల్లి ఎంతగా దుక్కిస్తుందో, తెలంగాణ ప్రజ అట్లా ఏడ్చింది. ఇలా కావడానికి తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు అందరి పాత్ర ఉంది. కడుపు చించుకుంటే కాళ్ల మీదపడుతుంది.   అయినా నిరాశను తుత్తునీయలు చేస్తు ఈ వ్యాసం రాసే సమయానికి ఆర్ట్స్ కాలేజీ మెట్ల మీద నిలబడి విద్యార్ధి నాయకులు మాట్లాడుతున్నారు. ‘విడిపోయినా మేమంతా కలుస్తున్నాం ’ మహా ఆమరణదీక్షకు పూనుకుంటున్నాం (జూలై11, 2011) తెలంగాణ ఇవ్వండి లేదా మా ప్రాణాలైన తీసుకోండి అంటూ ప్రకటిస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో తెలంగాణ ప్రజలకు ఇదొక పెద్ద ఆశ . ఈ కమిట్‌మెంటును తెలంగాణ వచ్చేవరకు కొనసాగించాలని విద్యార్థులకు తెలంగాణ ప్రజలందరి తరుపున విన్నపం. రాజీనామా లు చేసిన నాయకులు కూడా ప్రజాక్షేవూతంలోకి వచ్చి ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వస్తుందనే సత్యాన్ని ఆ నాయకులకు గుర్తు చేయవలసిన బాధ్యత కూడా విద్యార్థులదే. ఎందుకంటే కోస్తాంధ్ర పెట్టుబడిదారుల డబ్బు సంచులకు అమ్ముడుపోయిన కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని రాజీనామాలకే ఇస్తుందనేది అర్ధసత్యమే.  తెలంగాణ కు గత నలభై ఏళ్ళుగా ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అందుకే ఉద్యమాల ద్వారానే డిసెంబరు 9 ప్రకటన వచ్చిందనే సత్యాన్ని అందరు గ్రహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను స్తంబింప చేసే ఉద్యమాలకు సిద్ధమైతేనే తెలంగాణ ఫలిస్తుంది. తెలంగాణ ఉద్యమం ప్రతీ మూలమలుపులో తమ రక్తాన్ని ధారపోసిన విద్యార్థులు కళ్ళ ముందరి కాలంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తమ భుజాల మీద మోసి చారివూతక కర్తవ్యాన్ని నెరవేర్చాలి.  డా॥ సి. కాశిం

ప్రజా పోరాటాలతోనే ప్రత్యేక రాష్ట్రం---డా. సి.కాశీం






కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వదని యాభై ఎనిమిదేళ్ల చరిత్ర నిరూపించింది. ఈ వాస్తవం ఇంకా వర్తమానంలో స్పష్టంగా అర్థమవుతున్నది. పచ్చి తెలంగాణ వ్యతిరేకి అయిన ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 19న మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ మోసాల చరివూతకు సాక్ష్యం. ఆయనే తెలంగాణకు వ్యతిరేకంగా కోర్‌కమిటీలో మాట్లాడుతున్నాడనేది ఆఫ్ ది రికార్డ్ అయినా, ఆయన ప్రవర్తన దీన్ని రుజువు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టులకు కేంద్రమవుతుందనే బూచీని కూడా ప్రణబ్ ఎనిమిది సంవత్సరాలుగా (అంతర్గత సమావేశాల్లో) ఇతర కాంగ్రెస్ పెద్దల కు చూపెడుతున్నారు.

కానీ మావోయిస్టులు తెలంగాణలో దాదాపు నలభై ఏండ్లుగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కూడా పనిచేస్తారు. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న మావోయిస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు కూడా జరిపింది. కనుక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మావోయిస్టులు ఉంటారని చెప్పడం కేవలం సాకు మాత్రమే. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా అడ్డుపడడానికి ఈ ప్రచారాన్ని చేస్తున్నారు. ప్రజలకు భూమి, భుక్తి, విముక్తి దక్కేవరకు మావోయిస్టులు ప్రజల్లో ఉండి పనిచేస్తారానేది చరిత్ర రుజువు చేసింది. ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్‌లేని ప్రాంతాలలో కూడా ప్రజల విముక్తి కోసం మావోయిస్టులు పనిచేస్తున్నట్టే రేపటి తెలంగాణ రాష్ట్రంలో కూడా పనిచేస్తారు. కేంద్రం ఈ బూచిని చూపెట్టినప్పుడల్లా ఇక్కడి మేధావులు ఆత్మరక్షణలో పడుతున్నట్టు ఉంది.

తెలంగాణ రాష్ట్రం రాకపోవడానికి మావోయిస్టులు కారణం కాదు. ఎందుకంటే సోనియాగాంధీ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు తెలంగాణ కంటే కోస్తాంధ్ర భూస్వాములు, పెట్టుబడిదారుల వల్లనే ఎక్కువ నెరవేరుతాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం లేదు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకొని ఇక్కడి మేధావులు, బుద్ధిజీవులు కేంద్రం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి.
ప్రజల ఒత్తిడితో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు అనివార్యంగా రాజీనామాలు చేశారు. తెలంగాణపోరాటంలో ఇదొక పాజిటివ్ అంశం. కానీ కేంద్రంలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ఎంపీల రాజీనామాలతో కేంద్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదు. కొద్దిమంది తెలంగాణ ఎమ్మెల్యేలను మేనేజ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా పడిపోదు. కనుక అటు కేంద్రంలోనూ, ఇటు కోస్తాంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలోనూ చలనం లేదు.

ఇప్పు డు రాజీనామాలు చేసిన నాయకుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా ఉంది. రాజీనామాలు వెనక్కి తీసుకోవడం ఎలాగో ఆలోచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే శక్తి ఏ రకంగా చూసినా కోస్తాంధ్ర నాయకులతో పోల్చుకుంటే తెలంగాణ నాయకులకు లేదు. ఇక్కడి నాయకులు డబ్బును వెదజల్లలేరు. లాబీయింగ్ చేయలేరు. కనుకనే ప్రణబ్, ఆజాద్, చిదంబరం అంతా కోసాంధ్ర కావూరి, రాయపాటి, లగడపాటి, సుబ్బిరామిడ్డిలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే లాబీయింగ్‌లతో తెలంగాణ రాదని అర్థమవుతున్నది. అందుకే ఇక తెలంగాణ రాజకీయ నాయకులకు మిగిలింది ప్రజలు, ప్రజాపోరాటాలే.

ఇవాళ తెలంగాణ ఉద్యమం బహుళ నాయకత్వం కింద సాగుతున్నది. అనేక రకాల ప్రజా సమూహాలు ఈ ఉద్యమంలో ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, లాయర్లు, మేధావులు, కవులు, కళాకారులు.. ప్రధాన స్రవంతిగా ఉన్నారు. విద్యార్థులు మినహాయిస్తే మిగతా వర్గాలు చాలా చిన్న సమూహమైనా..బలీయమైన శక్తి. విద్యార్థులందరూ ఐక్యంగా ఉద్యమంలో కదలడం లేదు. కనీసం నాలుగు లక్షలకు పైగా ఉన్న ఉద్యోగులు కూడా అందరూ పాల్గొనడం లేదు. ఉద్యోగులు ఆర్గనైజ్డ్ సెక్టార్. సమష్టిగా కదలి లక్ష్యాన్ని సాధించే సత్తా ఉన్న వర్గం. వాళ్లలో సంపూర్ణ కదలిక లేకపోవడానికి అనేక కారణాలున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అనివార్యత, భవిష్యత్‌తరాల కోసమైనా .. తెలం గాణ ఆవశ్యకతను వివరించాలి. వారిలో కమిట్‌మెంట్ పెరిగేటట్లు విషయాన్ని అవగాహన కలిగించాలి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవనే అవగాహనను ఉద్యోగుల్లో ప్రచారం చేయాలి. రాష్ట్రం కోసం జరిగే పోరాటంలో కొన్ని త్యాగాలు తప్పవనే సంసిద్ధతను పెంచాలి. తెలంగాణ రావడం వల్ల వెంటనే ఉద్యోగులకు జరిగే ఆర్థిక ప్రయోజనాన్ని శక్తిమంతంగా ప్రచారం చేయాలి.


ఈ దశలో భాగంగానే ఉద్యోగులు రోజు ఎదుర్కొంటున్న చాలా సమస్యలు కోస్తాంధ్ర పాలకుల వలననే అనే విషయా న్ని అర్థం చేయించాలి. ఆ సమస్యల పరిష్కారం కోసం పోరా ట రూపాలను ఎన్నుకొని ఉద్యోగులను కదలించాలి. చివరగా ఈ పోరాటాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం జరిగే పోరాటంతో సమన్వయం చేయాలి. ఇట్లా ప్రారంభమైన ఉద్యమంలో అంచలంచెలుగా కార్యాలయాలను బంద్ చేయడం, పాలకులకు సహాయ నిరాకరణ చేయడం, రోడ్ల మీదికి వచ్చి దిగ్బం ధం చేయించడం. పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడేటట్టు చేయడం. దీనితో పాటు బయట జరుగుతున్న ప్రజాపోరాటంలో ఉద్యోగులను భాగం చేయా లి. ఇక చదువుకున్న విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, కవులు, కళాకారులు ప్రజాసేవకులుగా మారి గ్రామాల్లోకి ప్రవేశించాలి.

ఆ ప్రజలతోనే జీవించాలి. వారి నమ్మకాన్ని చూరగొనాలి. స్థానిక సమస్యలపై ప్రజలను కదిలిస్తూ ఉద్యమానికి సిద్ధం చేయాలి. ఇట్లా ప్రారంభమైన పోరాటాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం జరిగే ఉద్యమంగా మార్చాలి. అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి తెలంగాణ వచ్చేవరకు వివిధ పార్టీల జెండాను, ఎజెండాను పక్కకు పెట్టి తెలంగాణ సాధనే ఏకైక ఎజెండాగా పనిచేయాలి. గ్రామంలో చురుకైన, నిజాయితీ కలిగిన రాజకీయ అవగాహన ఉన్న కార్యకర్తలను ఎంపిక చేసి ఒక కమిటీని రూపొందించాలి. ఆ కమిటీకి కావల్సిన ఆర్థిక వనరులను గ్రామ ప్రజలపై ఆధారపడి సమకూర్చుకోవాలి. ప్రతీ నెలకు ఒకసారి ఖర్చుల వివరాలను ప్రజల సమక్షంలో చెప్పి భవిష్యత్ కార్యక్షికమాన్ని చర్చించి ప్రకటించాలి. గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని నిరవధికంగా గ్రామ పంచాయితీ కార్యాలయం, పాఠశాలలు, పోస్టాఫీసు, అంగన్‌వాడి కేంద్రం పనిచేయకుండా చేయాలి. విద్యుత్ బిల్లులు చెల్లించకూడదు. ఒక్క వైద్యశాల మినహాయించి గ్రామంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేయాలి. ఇట్లా కనీసం ఒక నెల కార్యక్షికమాన్ని గ్రామ కమిటీలో రూపొందించుకొని అమలు చేయాలి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇదే కార్యక్షికమం చేపట్టాలి.

ఈ క్రమంలోనే..యగామానికి ఒకరోజు చొప్పున మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలకు తాళం వేసే బాధ్యతను తీసుకొని అమలు చేయాలి. ఈ విధంగా గ్రామాలు, మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల, జిల్లాలు ఏకమైన రాష్ట్ర రాజధానిని దిగ్బంధం చేయాలి. తెలంగాణ నలుమూలల ఉంచి ప్రజలు మూకుమ్మడిగా రాజధానికి చేరుకోవాలి. కనీసం నలభై లక్షల మందిని తరలించి హైదరాబాద్‌లో ఉన్న అసెంబ్లీ, సచివాలయం, డీజీపీ ఆఫీసు మొదలుకొని ప్రధాన కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలను దిగ్బంధం చేయాలి. తాళాలు వేసి వాటి ముందే కూర్చోవాలి. తెలంగాణకు అడ్డుపడుతున్న కోస్తాంధ్ర పెట్టుబడిదారుల వ్యాపారాలను అడ్డుకోవాలి. తెలంగాణ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రవాణా వ్యవస్థను నిలిపివేయాలి. ఈ పోరాటంలో హైదరాబాద్ బస్తీల ప్రజలను కదిలించాలి. ఈ విధంగా.. గ్రామం మొదలు రాజధాని దాకా..పోరాటాన్ని విస్తృతం, తీవ్రతరం చేసి కోస్తాం ధ్ర దోపిడీ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలి. తెలంగాణ ప్రజల సత్తా చాటాలి. కడవరకూ పోరాడి తెలంగాణ సాధించాలి.

విద్యార్థుల రక్తం చిందని పోరే లేదు ---డా॥ సి. కాశిం


7/10/2011 1:55:25 AM
విద్యార్థుల రక్తం చిందని పోరే లేదు
పుస్తకంలోని పుటలు తిరగేయాల్సిన చోట రక్తం బొట్లుగా బొట్లుగా కారుతున్నది. కమ్మనికలలు వికసించాల్సిన క్యాంపస్‌లో రబ్బరుబుప్లూట్ తగిలిన గాయాలు సల్పుతున్నవి. యవ్వనపు ప్రేమలు కవిత్వం రాయవల్సిన మునివేళ్ళు లాఠీ దెబ్బలకు పగిలి కంకర రాళ్ళ వైపు చూస్తున్నాయి. రాలిపడిన మాంసం ముద్దలు నెరవేరని తెలంగాణ కోసం తలబాదుకుంటున్నాయి. గోరింటాకుతో ఎరుపెక్కిన లేడిస్ హస్టల్ అరచేతులు ముళ్ళ కంచెను ఈడ్చేస్తున్నాయి. బొంగరంతో ఆడిన బాల్యం బాష్పవాయువు గోళాలను ఒడుపుగా అందుకొని శత్రు శిబిరం వైపు విసురుతున్నది. కోడికూతతో నిద్ర లేసిన డప్పు క్యాంపస్‌ను కదం తొక్కిస్తున్నది. సామూహిక గానంలో శత్రువు ఎత్తులు చిత్తవుతున్నాయి. మూడువందల మంది విద్యార్థులు ఆరువందల మంది పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒకరకంగా క్యాంపస్ సరిహద్ధులలో యుద్దం జరుగుతున్నది. కాలం కత్తులవంతెనపై విద్యార్థులు కవాతు చేస్తున్నారు. ఇది నడుస్తున్న తెలంగాణ.
ఎంత విచిత్రం. తొంభైయొవ దశకమంతా ప్రపంచీకరణ పడగనీడలో గ్లోబల్ ఎండమావుల వెంట పరుగెత్తిన విద్యార్ధులు ఇవ్వాళ తెలంగాణ కోసం త్యాగానికి సిద్ధపడుతున్నారు. ‘దేశానికి కళ్ళు నీవే, కాళ్ళు నీవే అని చెప్పిన చెరబండరాజు కలను నెరవేర్చుతున్నారు. పుస్తకాలను వదిలి తెలంగాణ నినాదాన్ని అందుకుంటున్నారు. క్యాంపస్ చెట్లకింద పోటీ పరీక్షల పుస్తకాలతో కుస్తీపట్టిన వాళ్ళు నడుస్తున్న తెలంగాణ ఉద్యమానికి వ్యూహాలు పన్నుతున్నారు. షకలకబేబీ పాటల్లో తేలియాడిన పిల్లలందరు పొడుస్తున్నా పొద్దు మీద నడుస్తున్న కాలానికి కాపలకాస్తున్నారు. పాఠశాలలే పోరుబాటలుగా కళాశాలలే కదన రంగంగా కదులుతున్నాయి. ఉద్యమాలకు దూరమవుతున్న విద్యార్థులను నిలదీసి తమ చారివూతక బాధ్యతను గుర్తుచేసిన ఘనత తెలంగాణ ఉద్యమానికే దక్కింది. అరవై, డైబై్బయో దశకాలలో నడిచిన ఉజ్వల పోరాటాన్ని ఈ తరానికి గుర్తు చేసింది తెలంగాణ ఉద్యమే.
నిజానికి తెలంగాణ పోరాటంలో విద్యార్థులు ప్రతీ మూలమలుపులో అగ్రబాగాన నిలబడ్డారు. ఒక రకంగా విద్యార్థుల పోరాటం కార్మిక, మేధావి, విద్యార్థుల ఐక్యతకు కూడా తెలంగాణ పోరాటం నిలు నిదర్శనం. 1969 జనవరి, 5 న ఖమ్మం జిల్లా పాల్వంచ ధర్మల్ పవర్ స్టేషన్‌లో ఆంధ్ర ఉద్యోగుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కృష్ణ అనే దినసరి కార్మికుడు అమరణ నిరహారదీక్షను మొదలు పెట్టాడు. దీని ప్రభావంతో ఖమ్మం పట్టణంలో రవీంవూదనాథ్ అనే విద్యార్థి జనవరి , 9న అమరణదీక్షకు పూనుకున్నాడు. కార్మికుడు మొదలు పెట్టిన ఉద్యమాన్ని విద్యార్థి అందుకున్నాడు. దీనితో తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు ఉప్పెనలా కదిలారు. ఆంధ్రబోర్ఢులన్నింటిని పీకేశారు. ఆంధ్ర బ్యాంకులపై దాడులు చేశారు. ఆంధ్ర అధికారులు ‘గోబ్యాక్ ’ అంటూ అడ్డుకున్నారు. ఇట్లా సమస్త పాలనా రంగమంతా స్తంభించి పోయింది. హైదరాబాద్, శంషాబాద్, సదాశివపేట్ మొదలైన చోట్ల కాల్పులుజరిగాయి. విద్యార్థులు అమరులయ్యారు. కొందరు గాయపడ్డారు. తెలంగాణ కోసం రక్తం ఏరులై పారింది. ఇట్లా 1969 ఉద్యమం కాసు బ్రహ్మానందడ్డి రక్త దాహానికి బలైపోయింది. 370 మంది విద్యార్థుల వేడి నెత్తురు చిందింది. ఈ నెత్తురు తివాచీ మీద నడుచుకుంటూ వెళ్ళిన చెన్నాడ్డి విద్రోహానికి తెలంగాణ ఉద్యమం మోసపోయింది. చాలా రోజుల తర్వాత 1998 లో తెలంగాణ కోసం తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ (టి.ఎస్.ఎఫ్) ఏర్పడినా చంద్రబాబు నిర్భంధ పాలనలో విస్తృతంగా పని చేయలేకపోయింది.
నలభై వసంతాల తర్వాత 2009 లో మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎజెండా మీదకి దూసుకొచ్చింది. గిరిజనుడి విళ్లంబులా ఆంధ్రపాలక వర్గాల పై దూసుకెళ్లింది.
ఉస్మానియా మూనివర్శిటీ విద్యార్థులు ఉద్యమంలోకి రావడంతో గుణాత్మకమైన మార్పు వచ్చింది.కెసిఆర్ దీక్షకు మద్దతుగా విద్యార్థుల ర్యాలీ మలి దశ ఉద్యమానికి ప్రాణం పోసింది. ఆర్ట్స్ కాలేజీ ముందువిద్యార్థుల దీక్షా శిబిరం వెలసింది. విద్యార్థి ఐక్యకారాచరణ కమిటి (జెఎసి) ఆర్ట్స్ కాలేజీ మొట్ల మీద ఆవిర్బవించింది. డిసెంబర్ 9న చలో అసెంబ్లీ పిలుపునిచ్చిన ఓ యూ జెఏసీ ప్రపంచం చూపును తనవైపుకు తిప్పుకున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెన్నులో వనుకును పుట్టించిన ఘనత విద్యార్ధులదే. ఒకవైపు కె.సి.ఆర్ ఆమరణ నిరహార దీక్ష, మరోవైపు విద్యార్థి ఉద్యమం తాకిడికి తట్టుకోలాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిసెంబరు, 9 అర్ధరాత్రి తెలంగాణ ప్రక్రియ ను మొదలుపెడుతామని ప్రకటించాయి. తెలంగాణ చరివూతలో మొదటి సారి కేంద్రం తరుపున తెలంగాణ కు అనుకూలంగా వచ్చిన ప్రకటన ఇదే. ఇది రావటానికి అనేక శక్తులతో పాటు విద్యార్థుల పాత్ర అద్వితీయమైనదనే విషయాన్ని అందరుగమనంలో ఉంచుకోవాలి.
తెలంగాణ ప్రాంతంలో అరుదుగా వచ్చిన విద్యార్థి ఉద్యమాలను ప్రతీ సందర్భంలో కోస్తాంధ్ర పాలక వర్గాలు అణిచివేసాయి. ఈ సందర్భంలో కూడా అదే జరిగింది. 2009 నవంబర్, 21 న ప్రారంభమైన విద్యార్థులు వెన్ను చూపకుండా ముందుకు కదిలారు. తెలంగాణకు వ్యతిరేకంగా డిసెంబరు, 23న ప్రకటనను నిరసిస్తూ లక్షలాది మంది విద్యార్థులతో 2010 జనవరి 3న ఆర్ట్స్ కాలేజీ మెట్ల మీద కనివిని రీతిలో విద్యార్థి గర్జన సభ జరిగింది . తెలంగాణ ప్రజలపై ఈ సభ అద్భుతమైన ప్రభావాన్ని వేసింది. స్వచ్చంధంగా తరలి వచ్చిన విద్యార్థులు తమ తెలంగాణ ఆ కాంక్షను ప్రపంచానికి చాటారు. ఈ సభ కొనసాగింపుగా జనవరి, 18 నుంచి ఫిబ్రవరి 7 న కాకతీయ యూనివర్శిటీ లో విద్యార్ధి పొలికేక ను లక్షలాది విద్యార్థుల సమక్షంలో ఢిల్లీ పాలకులకు విన్పించారు.
ఇట్లా సంవత్సర కాలం ఐక్యమత్యం గా విద్యార్థులందరు పార్టీలకతీతంగతా ఒకటై తెలంగాణ కోసం ఉద్యమించారు. జైలు పాలయ్యారు. లాఠీదెబ్బలు తిన్నారు. కాళ్ళు చేతులు విరగగొట్టునన్నారు. 620 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ కోసమే తమ యవ్వనపు రక్తనంతా దారపోశారు. ఏముయిందో ఏమోకాని , నెత్తిన పిడుగు పడట్లు 2010 మార్చిన తెలంగాణ విద్యార్థి జాక్‌లో చీలిక వచ్చింది. తెలంగాణ ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థి ఉద్యమం నిట్ట నిలువునా చీలిపోయింది. కళ్ళముందే చెట్టంత బిడ్డ కూలిపోతే తల్లి ఎంతగా దుక్కిస్తుందో, తెలంగాణ ప్రజ అట్లా ఏడ్చింది. ఇలా కావడానికి తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు అందరి పాత్ర ఉంది. కడుపు చించుకుంటే కాళ్ల మీదపడుతుంది.
అయినా నిరాశను తుత్తునీయలు చేస్తు ఈ వ్యాసం రాసే సమయానికి ఆర్ట్స్ కాలేజీ మెట్ల మీద నిలబడి విద్యార్ధి నాయకులు మాట్లాడుతున్నారు. ‘విడిపోయినా మేమంతా కలుస్తున్నాం ’ మహా ఆమరణదీక్షకు పూనుకుంటున్నాం (జూలై11, 2011) తెలంగాణ ఇవ్వండి లేదా మా ప్రాణాలైన తీసుకోండి అంటూ ప్రకటిస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో తెలంగాణ ప్రజలకు ఇదొక పెద్ద ఆశ . ఈ కమిట్‌మెంటును తెలంగాణ వచ్చేవరకు కొనసాగించాలని విద్యార్థులకు తెలంగాణ ప్రజలందరి తరుపున విన్నపం. రాజీనామా లు చేసిన నాయకులు కూడా ప్రజాక్షేవూతంలోకి వచ్చి ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వస్తుందనే సత్యాన్ని ఆ నాయకులకు గుర్తు చేయవలసిన బాధ్యత కూడా విద్యార్థులదే. ఎందుకంటే కోస్తాంధ్ర పెట్టుబడిదారుల డబ్బు సంచులకు అమ్ముడుపోయిన కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని రాజీనామాలకే ఇస్తుందనేది అర్ధసత్యమే.
తెలంగాణ కు గత నలభై ఏళ్ళుగా ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అందుకే ఉద్యమాల ద్వారానే డిసెంబరు 9 ప్రకటన వచ్చిందనే సత్యాన్ని అందరు గ్రహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను స్తంబింప చేసే ఉద్యమాలకు సిద్ధమైతేనే తెలంగాణ ఫలిస్తుంది. తెలంగాణ ఉద్యమం ప్రతీ మూలమలుపులో తమ రక్తాన్ని ధారపోసిన విద్యార్థులు కళ్ళ ముందరి కాలంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తమ భుజాల మీద మోసి చారివూతక కర్తవ్యాన్ని నెరవేర్చాలి.
డా॥ సి. కాశిం