Showing posts with label Asaiah. Show all posts
Showing posts with label Asaiah. Show all posts

Thursday, September 12, 2013

ఎన్ని ప్రణాళికలైనా ఎస్‌సి,ఎస్‌టిల నిధుల దారి మళ్లింపు By Dr K Asaiah IIS

గురువారం , సెప్టెంబర్ 12 ,2013


భారతదేశంలో పేదరికాన్ని, అవిద్య, వెనుకబాటు తనాన్ని తొలగించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నాయి. కాని ఆ నిధులు కేటాయించిన పనులకు, అంశాల కోసం వ్యయం చేయకుండా వేరే పనులకు మళ్లించడంతో ఎస్‌.సి. ఎస్‌.టిలలో అభివృద్ధిచెందక ఇంకా పేదరికంలోనే మగ్గుతు న్నారు. దీనికి ఎవరు బాధ్యులు? ఉద్యోగసామ్యం, రాజకీయ కార్యనిర్వహక వర్గం బాధ్యత వహించక తప్పదు. ఇప్పటికీ పదకొండు ప్రణాళికలు అమలయ్యాయి. కాని ఎస్‌.సి.ఎస్‌టిలలో 42శాతం మంది పేదరికం, అవిద్యతో మగ్గుతున్నారు. కారణం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించిన నిధులు వారి కోసం ఖర్చు చేయడంలేదు. వాటిని వేరే పనులకు ఖర్చు చేస్తున్నట్లు ఆదాయవ్యయ నివేదికలు తెలుపుతున్నాయి. పార్లమెంటులో ఎస్‌.సి.ఎస్‌.టిల అభివృద్ధిపై జరిగిన చర్చలో డిసెంబరు 20 12లో తెలిపిన వివరాల ప్రకారం ఆయా రాష్ట్రాలు ఎస్‌సి. ఎస్‌టిలకు కేటాయించిన నిధులు సుమారు 10వేల కోట్ల రూపా యలు ప్రతి సంవత్సరం ఖర్చు చేయడంలేదని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వమే ఎస్‌.సి.ఎస్‌టిలకు కేటాయించిన నిధులు ఆయా శాఖల అభివృద్ధికి ఖర్చు చేయడం లేదన్నది సుస్పష్టం. అంతేగాక కొన్ని శాఖలు ఎస్‌సిపి, ఎస్‌టిపిలకు నిధులను కేటాయించడం లేదని జాతీయ దళిత మానవ హక్కుల సంఘం తన నివేదికలో తెలిపినట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం శాఖలు 25 ఎస్‌టి,ఎస్‌పిలకు నిధులే కేటాయించడంలేదని పేర్కొంది.
2012-13 బడ్జెట్‌లో కూడా ఎస్‌పి,ఎస్‌టి షెడ్యూలు కులాల ఉప ప్రణాళికగాని, షెడ్యూల్డు తరగతుల ఉపప్రణాళికలకు గాని నిధులు కేటాయించడం లేదు. ఇంకా అభివృద్ధి ఎక్కడ జరుగు తుంది. కేటాయింపులే లేక పథకాలు ఎలా అమలు చేస్తారు. ఎస్‌సి,ఎస్‌టిలకు రిజర్వేషన్లుండి ప్రయోజనం ఏమిటి? 2012- 13లో ఎస్‌సిలకు 16 శాతం, ఎస్‌టిలకు 8శాతం నైష్పత్తిక పద్ధతిలో బడ్జెట్‌ నిధులు కేటాయించాలి. కానీ ఎస్‌సిలకు నాలుగు శాతం, ఎస్‌టిలకు మూడు శాతం నిధులు కేటాయించి, ఎస్‌సి లకు రావాల్సిన 26,233 కోట్లు అభివృద్ధి నిధులు కేటాయించ లేదు. అదే విధంగా ఎస్‌టిలకు 9,572 నిధులు కూడా కేటా యించలేదని 2010లో జాదవ్‌కమిటీ పేర్కొంది. ప్రభుత్వ శాఖ లలో 25 శాఖలు ఎస్‌సి,ఎస్‌టిలను గురించి పట్టించుకోవడం లేదని పేర్కొంది. (పార్లమెంటరీ డిబేట్‌-2010ని చూడండి) ఎస్‌సి,ఎస్‌టిల అభివృద్ధికి ఎన్నో వాగ్దానాలు ప్రకటనలు చేసిన మంత్రులే వీరి పట్ల శ్రద్ధ చూపడంలేదు. ఇప్పుడిప్పుడే ఎదిగిన దళితులు వారివెనుకబాటుతనం కారణాలు ఎదుగుతుంటే బయటపడుతున్నాయి. రిజర్వేషన్లు ఎన్నోఏళ్ళనుండి పేపరుకు పరిమితమై నిధులు ఖర్చుచేయని స్థితి రిజర్వేషన్లు కొనసాగిన ప్రయోజనం ఉండదు.
అదే విధంగా2013-14 బడ్జెట్‌లో ఎస్‌సి,ఎస్‌టిలకు నిధులు కేటాయించాల్సినవి ఎస్‌సిపిలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం 15 శాతం (16.2శాతం 2001) ఎస్‌టిపిలకు 7.5 శాతం (8.4శాతం 2001) కేటాయించాలి. 2013-14 జనరల్‌ బడ్జెట్‌ నిధులు 5,55,322 కోట్లు కాగా ఎస్‌సిపి కింద ఎస్‌సిపిలకు 15శాతం చొప్పున,ఎస్‌సిలకు 83,298.3 కోట్లు కేటాయిం చాలి. కాని 2013-14 బడ్జెట్‌లో 41,561 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. అంటే 41,737 కోట్లు అసలు బడ్జె ట్‌లో కేటాయించలేదు. అదే విధంగా షెడ్యూల్డు తరగతులకు వారి జనాభానిష్పత్తి ప్రకారం (8.4శాతం) 7.5శాతం కేటా యించాలి. కాని 24,598 కోట్లు కేటాయించగా ఇంఆకా 17, 051 కోట్లు కేటాయించలేదు. ఇది చాలా దారుణం. ఒక పక్క బడుగులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటూ నిధులే కేటాయించకపోతే అసలు డబ్బులు ఎక్కడినుంచి వస్తాయి. ఇది స్కామ్‌ అందామా? మోసం అందామా. ఇలా 1994లో ఇందిరాగాంధీ ప్రత్యేక ప్రణాళికలు ప్రకటించిన నుండి ఎన్ని కోట్లు ఎస్‌సి,ఎస్‌టిల నిధులు దారిమళ్ళించారో చూస్తే కడుపు తరుక్కుపోతుంది.ఒకపక్క ఆకలితో జనం చనిపోతుంటే ఎస్‌సి, ఎస్‌టి పట్ల ఎస్‌టిపి కింద 2013-14లో 41,649.15 కోట్లు కేటాయించాల్సింది. కాని 24,598 కోట్లు కేటాయించి సర్ది పెట్టుకున్నారు. ఒక విధంగా ఇది కేవలం కంటితుడుపు చర్య. నోరులేని మనుషులపట్లఈ విధంగా ప్రవర్తించడం నేరం. కేంద్ర ప్రభుత్వ శాఖలు, రక్షణశాఖ, శాస్త్రసాంకేతికరంగం, న్యాయ శాఖ, అణుఇంధన శాఖ, పర్యావరణశాఖ ఇలా చాలా శాఖలు ఎస్‌సి,ఎస్‌టిలకు బడ్జెట్‌ కేటాయించడం లేదని తేలింది. ఇంత అన్యాయం జరుగుతుంటే ఎస్‌.సిలు 79 మంది, ఎస్‌.టిలు 38 మంది లోక్‌సభలో ప్రతినిధులున్నారు. వీరు నిధులపై ఆరా తీసిన దాఖలాలు లేవు. మరి వీరు లోక్‌సభకు ఎస్‌సి,ఎస్‌టిల నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహిస్తూ ఏమి చేస్తున్నట్లు కనీసం నిధులైన కేటాయించలేకపోతే ఎందుకు?
కేంద్ర ప్రభుత్వమే ఈ తీరుగా వ్యవహరిస్తుంటే రాష్ట్ర ప్రభు త్వాలు మరింత దారుణంగా వ్యవహరిస్తున్నాయి.దానితో ఎస్‌సి ఎస్‌టిలు పేదరికంలో మగ్గుతున్నారు. విద్యావకాశాలు లేవు, ఆరోగ్యసౌకర్యాలు అంతంతమాత్రమే. తక్కువజీతాలొచ్చే ఉద్యో గాలతో  ఎస్‌సిఎస్‌టిలలో ఏవిధంగా ఎదుగుదల ఉంటుందో విజ్ఞులు ఆలోచించాలి. వీరిపట్ల వేధింపులు, పీడింపులు, దోపి డీలు, దౌర్జన్యాలు, హత్యలు, రేప్‌లు జరుగుతుంటే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర వహిస్తుండటం శోచనీయం. ఈ విధంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ధిక్కరించడం నేరమే అవుతుందని ఢిల్లీలోని హక్కుల సంస్థలు పేర్కొన్నాయి.
ఇదేరీతిలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ బాధ్యతను విస్మరిస్తున్నాయి. వాటిలో బీహార్‌,రాజస్థాన్‌ ప్రభుత్వాలు కూడా బడ్జెట్‌ కేటాయింపులు చేయడం లేదు. బీహార్‌లో ఎస్‌సిల జనాభా 15.7 శాతం కాని బడ్జెట్‌లో 16.9 శాతంఎస్‌సిపి కింద 2010-11లో కేటాయించినట్లు పేర్కొనగా, వాస్తవంగా 1.2 శాతం నిధులు మాత్రమేనని వారి లెక్కలు తెలుపుతున్నాయి. రాజస్థాన్‌లో కూడా 17 శాతం ఎస్‌సిలు జనాభా, వార్షిక బడ్జె ట్‌లో ఎస్‌సిఎస్‌పి కింద 16.4 శాతం కేటాయించాల్సి ఉండగా కేవలం 3.9 శాతం నిధులు మాత్రమే కేటాయించారు. ఇదే రీతిలో షెడ్యూల్డు జాతులు ఎస్‌సిటిపి కూడా ఇదే రీతిలో ఉండ టం గమనార్హం.అదేరీతిలో ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలో కూడా నిధులు ఎస్‌సి,ఎస్‌టిలకు కేటాయించగా ఆ నిధులను ఇతర ఖర్చులకు వ్యయం చేయడం గమనించాల్సిన అవసరం ఉంది. మధ్యప్రదేశ్‌లో ఎస్‌సి,ఎస్‌టిలకు కేటాయించిన నిధులు ఆఫీసు కుర్చీలు, సోఫాలు కొనేందుకు ఆయుర్వేద, హోమియోపతి మందులు కొనేందుకు వ్యయం చేసారు. మరి కొన్ని నిధులు వ్యవసాయ కాలువల నిర్మాణానికి ఖర్చు చేసారు. 236 కోట్లు బ్రిడ్జ్‌ నిర్మాణానికి ఉపయోగించారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌సిఎస్‌పి నిధులు గ్రాంట్స్‌ఇన్‌ఎయిడ్‌ కింద లెక్కలు చూప నేలేదు. 17 శాతం వరకు నిధులను యుపి ఉద్యోగులు జీతాలు చెల్లించేందుకు ఉపయోగిస్తారు. కాని ఎస్‌సిఎస్‌పి నిధులు జీతా లకు వాడరాదని స్పష్టంగా చట్టాలు, బడ్జెట్‌ పేర్కొంటున్నాయి. ఎంతగానో రాజ్యాంగ వ్యతిరేకతకు పాల్పడుతున్నాయి.
గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎస్‌సిఎస్‌టిలకు కేటా యించాల్సిన నిధులను దారి మళ్లించి ఆ ప్రభుత్వ కార్యక్రమా లకు ఖర్చుచేస్తున్నారు. పాతవే అనే ఎన్‌జిఒ వెల్లడించిన వివరాల ప్రకారం ఎస్‌సిఎస్‌టి బడ్జెట్‌ నిధులను గుజరాత్‌లో ఐదు కోట్ల రూపాయలు స్వామి వివేకానంద 150 జన్మదినానికి ఖర్చు చేసారు. 170 కోట్లు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిర్మాణానికి ఉపయో గించారు. టాయిలెట్లు, మార్కెట్ల నిర్మాణానికి ఉపయోగించారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్‌సి,ఎస్‌టిల నిధులను తమ సొంత పనులకు కేటాయించి వేరే పనులకు కేటాయించినట్లు రికార్డులు సృష్టించాయి. కేంద్ర ప్రభుత్వమే తప్పుడు విధంగా ఎస్‌సి, ఎస్‌టిల నిధులు ఖర్చు చేస్తుంటే రాష్ట్రాలు ఆగుతాయా? గత 60 సవత్సరాల నుండి ఇదేస్థితి అయితే వీరి అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఇది మానవహక్కుల ఉల్లంఘన కిందకివస్తుంది. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఎస్‌సి,ఎస్‌టి నిధులు అవి నీతి మార్గంలో తరలివెళ్లుతున్నాయి. ఎస్‌సి,ఎస్‌టిలు మాత్రం ఎవరో వస్తారని ఏదోచేస్తారని ఎదురుచూస్తూ కరిగిపోతున్నారు. ఇదేనా మానవత్వం. వారి శ్రమను దోచుకోవడమేకాక ప్రభు త్వాలే ఈ విధంగా ప్రవర్తించడం ఎస్‌సి,ఎస్‌టిల పట్ల కంచెచేను మేసినట్లుంది. కులాన్ని ప్రభుత్వాలు అధికారికంగా పోషిస్తున్నా యని ఇటీవల ప్రొఫెసర్లు ఘోషిస్తున్నారు. కాని ఎస్‌సి,ఎస్‌ట ిలను గూర్చి పట్టించుకునే వారులేరు. మనదేశం అభివృద్ధిపట్ల ఎలాంటి శ్రద్ధ చూపుతున్నారో విదితమవుతుంది.
కాని మనరాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 1994లో ఎస్‌స ిఎస్‌పి,ఎస్‌టిఎస్‌పిల చట్టాన్ని తెచ్చి అన్ని రాష్ట్రాలకు ఆదర్శ మైందని చెప్పకతప్పదు. ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో ఎస్‌సి,ఎస్‌టి లకు మొత్తం బడ్జెట్‌లో 16,65,297 కోట్లు 2013-14లో కేటాయించగా అందులో 16.2 శాతం ఎస్‌సిలకు, 7.4 శాతం ఎస్‌టిలకు ఎస్‌సిపి,ఎస్‌టిపిల కింద కేటాయించడం గమనార్హం. గతంలో మన రాష్ట్రంలో 2002-03 కాలంలో ఎస్‌సిపి నిధు లను సెక్రటరియేట్‌లో బిల్డింగ్‌లు కట్టేందుకు ఉపయోగించినట్లు సిఎజి నివేదికలో పేర్కొన్నారు. ఇదేనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బడుగుల అభివృద్ధికి పాటుపడుతున్నామని చెప్పుకొంటూ ఇం తగా ఎస్‌సిఎస్‌టిల మోసపుచ్చడం నీతి బాహ్యమైన చర్యగా చెప్పకతప్పదు.ఢిల్లీలోని రాష్ట్రప్రభుత్వం ఎస్‌సి,ఎస్‌టిల నిధులు కామన్‌వెల్త్‌ క్రీడలకు కేటాయించి రోడ్లు, భవన నిర్మాణాలకు 350కోట్లు, ఎస్‌సి,ఎస్‌టిల నిధులు ఖర్చుచేసారు. ఈ సిడబ్ల్యు ఎస్‌ కేసులు సిబిఐ ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉంది. ఢిల్లీలో మురికి కాలువల ఒడ్డున నివసిస్తున్న అభాగ్య ఎస్‌సి,ఎస్‌టిలకు కేటాయించిన నిధులు వారికి కాకుండా వేరే కార్యక్రమాలకు ఖర్చుచేయడం క్షమించరాని విషయం. అందుకే ఎస్‌సి,ఎస్‌టి వాచ్‌డాగ్‌ను ఏర్పరచి నిధులు వారికే ఖర్చు చేసేలా చట్ట నిర్దేశన చేస్తూ రాజ్యాంగ విధులు నిర్వహించే విధంగాచూడాలి. ఎస్‌సి, ఎస్‌టిల బ్రతుకుల్లో వెలుగునింపాలి.

Vaartha Telugu News Paper Dated : 12/09/2013 

Thursday, September 5, 2013

షెడ్యూల్డు కులాల వెనుకబాటుతనం ఏపాటిది? By Asaiah IIS


భారతదేశంలో బడుగులు అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే ఏకైక మార్గం. కాని ఆ విద్యనే వారికి అందకుండా చేస్తోంది.ఈ అగ్రకుల సమాజం. దేశంలో ప్రకటనలు చూస్తే మాత్రం షెడ్యూల్డుకులాల వారికి అన్నివసతులు కల్పించుతున్నామని చెబుతున్నారు. కాని ఆ విద్యా విషయంలో అభివృద్ధి చాలా వెనుకబడి ఉన్నారన్నదే పచ్చినిజం. అన్ని గణాంకాలు పరిశీలిస్తే విషయం బోధ పడుతుంది. షెడ్యూల్డు కులాల జనాభాలో 0-6 సంవత్స రాల వారిని మినహాయించి వారిలో  అక్షరాస్యులను చూస్తే చాలా వ్యత్యాసం కన్పిస్తుంది.

ఎస్‌.సిలలో విద్యావంతులు తక్కువగా ఉన్నారు. 2001 జనాభా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ జనాభా మొత్తం 7,62,10,007 కాగా ఎస్‌.సి శాతంగా నమోదు అయింది. అంటే వీరిద్దరు కలిసి జనాభా 25.2 శాతంగా నమోదయ్యిందని గణాంక శాఖ కమి షనర్‌ వెల్లడించారు. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతులవారి జనాభా 2001 నుండి 2011 మధ్యకాలంలో ఎస్‌.సిల జనాభా 20.8 శాతం, ఎస్‌.టి.లు 23.7శాతం పెరిగిందన్నమాట. విద్యా,కార్మికుల శాతం 2011 ఎస్‌సి, ఎస్‌టిల వివరాలు ఇంకా గుణించాల్సి ఉంది. దేశంలో షెడ్యూల్డుకులాల జనాభా ఎక్కు వగా పంజాబ్‌ రాష్ట్రంలో మొదటి స్థానం 31.9 శాతంగా ఉంది. షెడ్యూల్డు జాతుల వారు అధికంగా లక్షద్వీప్‌ కేంద్రపాలిత ప్రాం తంలో 94.8 శాతంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 59 ఎస్‌సి కులాల్లో మాల,మాదిగ,ఆది ద్రావిడ, ఆది ఆంధ్ర మొత్తం కలిపి 93.6 శాతం మంది ఎస్‌.సిల జనాభాలో ఉన్నట్లు 2011 గణాం కాలు వివరిస్తున్నాయి. మిగతా 55కులాల జనాభా 6.4శాతమే. మాదిగల జనాభా 6,074,250 మంది అంటే ఎస్‌.సిల జనాభాలో 49.2 శాతం మాదిగలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు. మాలలు జనాభా 5,139,305 అంటే 41.6శాతంగా ఉన్నారు. ఆది ద్రావిడులు 1,94,806 మంది అంటే 1.6 శాతం ఆది ఆంధ్రులు 1.9 శాతంగా ఉన్నారు. మిగతా 19ఎస్‌.సి జాతుల వారు జనాభా 2001లో కేవలంవెయ్యిమందిగా నమోదయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2001 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డు కులాలు వారిలో 82.5 శాతం గ్రామాలలో నివసిస్తున్నారు. గ్రామాలలో నివసించే ఎస్‌సిజనాభాలో ఆది ద్రావిడులు 88.7 శాతం ఉన్నారు. మాదిగలు గ్రామాలలో 85.1 శాతం, మాలలు 81.9 శాతం, ఆది ఆంధ్రులు 76.8 శాతం జీవిస్తున్నారు. అన్ని జిల్లాలో కంటే నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 22 శాతం ఎస్‌.సి జనాభాలో జీవిస్తున్నట్లు,విశాఖపట్నంజిల్లాలో అతితక్కువ ఎస్‌సి జనాభా 7.6 శాతం నమోదయింది. ఆంధ్ర ప్రదేశ్‌లో ఎస్‌.సిల విద్య మొత్తం రాష్ట్రంలో అక్షరాస్యులలో 34.9 శాతం ఎస్‌.సిలు అక్షరాస్యులు వీరు ప్రాథమికస్థాయి కంటే దిగువన ఉన్నారు. అక్ష రాస్యులు అంటే ఎవరైతే విద్యా మొదటి నుండి ప్రైమరీ, మాధ్య మికస్థాయి 32 శాతంగా ప్రైమరీ స్థాయిలోను 10.6 శాతం మాధ్యమిక స్థాయిలో ఎస్‌.సిలు విద్యావంతులుగా ఉన్నారు. 17.8శాతం ఎస్‌.సిలు మెట్రిక్‌,ఆపైన విద్యావంతులుగా ఉన్నారు. అంటే ఎస్‌.సి జనాభాలో ఆరవవ్యక్తి అక్షరాస్యుడు, మెట్రిక్యులేట్‌గా గుర్తించబడ్డారు. అక్షరాస్యుడు నుండిడిగ్రీ స్థాయి ఆపైన నమోదైన ఎస్‌.సిల 3.7 శాతం మాత్రమే. వ్యక్తిగతంగా వీరిలో ఆది ఆంధ్రులు 6.3శాతం మంది గ్రాడ్యుయేట్లు ఆపైన చదువుకున్న వారీగా ఉన్నారు. మొత్తం విద్యలో ఎస్‌.సిల చదు వుకోనేవారు డ్రాప్‌ అవుట్‌లో ఎక్కువమంది ఉండటం గమ నార్హం. జనాభాలో 5-14 వయస్సువారు ముఖ్యమైన విద్యా ర్థులు వీరు 72.8 శాతంగా ఆంధ్రప్రదేశ్‌ పిల్ల జనాభాలో విద్యా ర్థులుగా ఉన్నారు. చదువుకొనే ఎస్‌.సి కులాలలో ఎక్కువ శాతం ఆది ద్రావిడ, ఆది ఆంధ్రా మాలలు, ఎక్కువ మంది పాఠశాలలో నమోదై చదువుతున్నారు. విద్యా గణాంకాలు ప్రాథమికంగా అభివృద్ధిపెరుగుదల రేటును సూచిస్తుంది. తద్వార సమాజం పురోభివృద్ధిచెందుతున్నట్లు అంచనా వేయవచ్చును.వారి జనాభా శాతాన్ని బట్టి కూడా అభివృద్ధిరేటును అంచనా వేయవచ్చు. విద్యతోపాటు షెడ్యుల్టు కులాలవారిలో అవగాహన శాతాన్నిబట్టి వారి పెరుగుదల రేటును గుర్తించవచ్చు. విద్యాతో పాటు ఆరో గ్యం,పరిశుభ్రత, ఇతర సామాజిక స్థితిని గుణిస్తారు. 2001 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డు కులంలో విద్యావం తులు రాయడం,చదవడం, అర్థంచేసుకొనే వారు వయస్సు ఏడు సంవ త్సరాలపై బడిన వారిసంఖ్య 53.5 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో సరాసరి విద్యశాతం 60.5 శాతం జనాభాలో ఉండగా అందులో షెడ్యూల్డు కులం వారులో విద్య 1991లో 31.6 శాతం కాగా 2001 నాటికి ఎస్‌సిలో విద్యా శాతం 21.9 శాతం పెరిగింది. అంటే ఎస్‌సిలో మొత్తం విద్యశాతం 53.5 శాతం మాత్రమే.

షెడ్యూల్డు కులాల్లో విద్యశాతంలో ఆది ఆంధ్రులు 69.6 శాతం మంది, ఆది ద్రావిడులలో 65.4 శాతంమంది, మాల లలో 60 శాతం, మాదిగలలో 47.5 శాతం మంది విద్యావం తులుగా నమోదయ్యారు.ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డు కులాల మహి ళలలో విద్యాశాతం 43.3 శాతం మొత్తం రాష్ట్రంలోమహిళలలో విద్యాశాతం 50.4 శాతం ఉంది. షెడ్యూల్డు కులాల పురుషుల విద్యావంతుల కంటే మహిళలలో అక్షరాస్యుల శాతం తక్కువగా ఉంది.ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డుకులాల మహిళలలో విద్యాశాతం ఆది ఆంధ్రుల మహిళలు 63 శాతంకాగా మాదిగలు మహిళలు 36.9శాతం అక్షరాస్యులుగా ఉన్నారు. ఎస్‌.సిలలో స్త్రీ,పురు షుల శాతం ఆంధ్రప్రదేశ్‌లోని జనాభాలో ప్రతి వెయ్యిమంది పురుషులకు 981 మంది మహిళలున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం ఎస్‌సి జనాభాలో వెయ్యి మంది పురుషులకు 978 మహిళలున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలో వెయ్యిమంది పురుషులకు 1046 మంది మహిళలున్నా జిల్లా అదిలాబాద్‌. తక్కువ మహిళలున్న జిల్లా అనంతపూర్‌ 956 మంది.

ఆర్థిక కార్యక్రమాలు
ఆంధ్రరాష్ట్ర జనాభాలో పనిచేసే వారిసంఖ్య షెడ్యూల్డు కులా లలో 50.5 శాతం మంది పనిచేసేవారు. అదే సాధారణ రాష్ట్ర జనాభాలో కేవలం 45.8 శాతం మాత్రమే. అంటే ఎస్‌.సిలలో ఎక్కువ మంది పనిచేసేవారున్నారు. అదే విధంగా ఎస్‌సి పురుషులలో కష్టపడేవారి సంఖ్య 54.4 శాతం మందిగా నమోద య్యారు. షెడ్యూల్డు కులాల జనాభాలో పనిచేసేవారి సంఖ్య 52.2 శాతం మాదిగలులో పనిచేసే వారిసంఖ్య అధికంగా ఉన్నారు. తక్కువమంది 49.9 ఆది ఆంధ్రులు తక్కువగా పని వారున్నారు. మహిలా పనివారిలో కూడా ఆదిఆంధ్ర మహిళలలో పనిచేసేవారి సంఖ్య 36.5శాతం డబ్ల్యుపిఆర్‌ వర్క్‌ పార్టిసిపేషన్‌ రేటుగా నమోదయ్యింది. పనిచేసే ఎస్‌సి పనివారు 1991 జనాభా లెక్కల్లో 95.6శాతం షెడ్యూల్డుకులాల వారు రాష్ట్రంలో పనిచేసేవారు. వీరు 2001నాటికి 79.6శాతంగా నమోదయ్యారు. 2001 లెక్కల వివరాలు ఇంకాఅందలేదు.అదే విధంగా ఎస్‌.సిలలో మాధ్యమిక పనివారి శాతం 4.4 శాతం 1991లో ఉండగా వారు 20.8 శాతానికి 2001 నాటికి పెరిగారు. రాష్ట్రం లోనున్న వ్యవసాయ కూలీలో 68.3 శాతం ఉండగా ఎస్‌.సి వ్యవసాయకూలీలు 80 శాతం అంటే 22.7 శాతం మంది ఎక్కువ. జాతీయ స్థాయిలో వ్యవసాయ కార్మికులు శాతం 45.6 శాతం రిజిస్టరు కాగా మిగతా పని కార్మికుల శాతం 20.1 శాతం ఇందులో 9.7 శాతం మందే వ్యవసాయ కార్మికులుగా రిజిస్టరు అయినారు.వ్యక్తిగత కులస్థాయిలో ఆది ద్రావిడులు 72.7 శాతం వ్యవసాయ కూలీలుగానూ, ఆది ఆంధ్రులు 71.4 శాతం గానూ మాదిగలు 70.4 శాతం, మాలలు 68శాతం వ్యవసాయ కూలీ లుగా నమోదయ్యారు.షెడ్యూల్డు కూలాలోస్థిరమైన ఆదాయ వనరులు భూమి మీద ఆధిపత్యం లేకపోవడం వలన స్థిరత్వం లేకుండా ఉన్నారు. మహిళాకార్మికులు ఎస్‌.సిలు 25.98 శాతం, ఎస్‌టిలు 43.71 శాతం, ఇతరులు అందరు 22.5 శాతం మహి ళలే కార్మికులు.ఆంధ్రప్రదేశ్‌లో మహిళా ఎస్‌.సి కార్మికులు 46.7 శాతం, ఎస్‌.టిలు 50.75 శాతం, పురుషుల ఎస్‌.సి కార్మికులు 90శాతంపైగా ఉన్నారు.


ఎస్‌సిల పెత్తనం ఎంత?
 షెడ్యూల్డు కులాల్లో భూమి ఉన్నవారు 19.7శాతం భూమి లేనివారి శాతం 7.9 శాతం కొద్ది భూమి ఉన్న ఎస్‌.సిల శాతం 48 శాతం ఇంటిస్థలం ఉన్నవారు 13.3 శాతం నమోదయ్యారు. షెడ్యూల్డు కులాల వారికి భూస్థలం ఉంటే వారి జీవితంలో స్థిరత్వం దొరుకుతుంది. స్థిరాదాయం లేనందువలన దేశదిమ్మ రులుగా తీరుగుతున్నారు. దేశంలో పేదవారు అంటే ముందుగా వీరిపైనే వెళ్లుతుంది ఎస్‌.సిలలో పేదరికం 48.35శాతం నుండి 35.97 శాతానికి 1995-96లో తగ్గి నట్లు నమోదయ్యింది. పేదరికపు దిగువ నున్న వారి ఎస్‌.సిలే అని చెప్పవచ్చును.

Vaartha Telugu News Paper Dated : 02/09/2013 

మత ప్రదర్శనలపై నిషేధం సమంజసమా? By Dr Asaiah IIS

భారతదేశం లౌకిక, సోషలిస్టు వ్యవస్థలను కలిగి ఉంది.  మనదేశంలో మతస్వేచ్ఛ ఉంది. అందుకే అన్ని విశ్వాసాలవారు ఐక్యంగా 67సంవత్సరాల నుండి ఐక్యంగా కొనసాగుతున్నారు. విశ్వాసం మీద ఆటుపోటులను ఎదుర్కొన్న వాటిని అధిగమించి దేశం అభివృద్ధిపదంలో నడుస్తోంది. మనవిశ్వాసం ప్రపంచంలోనే అతిపురాతన విశ్వాసాలలో ఒకటి. అవి గ్రీకు తత్వం, ఈజిప్టు, చైనీయుల విశ్వాసాల కంటే పురాతనమైంది. అయినా హిబ్రూభాషలో రాసిన బైబిలో కూడా హిందూ విశ్వాసాన్ని గూర్చి పేర్కొన్నారంటే ఎంత పురాతనమైనదో వెల్లడవుతోంది. అలాంటి సహజీవనం కలిగిన హిందూదేశంలో మతపరమైన కలపరమైన ఊరేగింపులను ప్రదర్శనలను సమావేశాలను రద్దు చేస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పులు ఎంతవరకు సమంజసం? భారతదేశంలో ఉన్నచాతుర్వర్ణ సిద్ధాంతం పెరిగి విభజించి నేటికి 1200పైగా గర్తింపు పొందిన కులాలున్నాయి. ఈ కులాలన్నీ నిచ్చనమెట్లుగా హెచ్చు తగ్గులు న్నాయి. మనుధర్మాశాస్త్రం హిందువుల పవిత్ర గ్రంధంలో కేవలం నాలుగువర్ణాలను బ్రహ్మాణ, క్షత్రియ, వైశ్య,శూద్ర వర్ణా లను పేర్కొంటే 12వందల కులాలు ఎలా వచ్చాయి. ఎలా పెరిగాయి విజ్ఞులే చెప్పాలి. కులపరమైన రాజకీయ ప్రదర్శనలను నిషేధించడం వ్యక్తిస్వేచ్ఛను బడుగువర్గాల సమానత్వాన్ని మంట గలపడమేనని పేర్కొనవచ్చు.
బడుగులైన హరిజనులను ఊరివెలుపల దూరంగా నివాసం ఏర్పరుచుకొని బానిసలుగానూ, జంతువుల కంటే హీనంగా జీవ నం సాగిస్తున్నారు. వీరు బానిసలుగా బ్రతుకుతూ యజమాని సొత్తులో భాగం. వారికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం సమానవత్వాలు, న్యాయం వెలుపలుండి బ్రతుకుతున్నారు. వీరు అసలు ఎవరు? అంటే మనుధర్మశాస్త్రం అంటుంది. అంటరానివారుగా వేల సంవ త్సరాల నుండి పెరిగి పెరిగి 2011 నాటికి 17.85 కోట్ల మంది అయ్యారు. వీరివలనే అడవుల్ల అనాగరికంగా బ్రతికేజనంను గిరి జనులని గుర్తించారు. వేలసంవత్సరాల నుండి పడ్డా కష్టాలకు నేడు భారతదేశ రాజ్యాంగం వీరికి రాజ్యాంగపరమైన రాయితీ లను ఇచ్చింది. హరిజనులకు గిరిజనులకు ప్రత్యేక షెడ్యూల్డు 70 కింద రాయితీలు కల్పించింది. హరిజనులకన్నా అంటరాని తనాన్ని రాజ్యాంగ ప్రకరణ 17కింద రద్దు చేసింది. ఉపాధి వేతన సౌకర్యాలలో రిజర్వేషన్స్‌ కల్పించి చారిత్రక తప్పిదాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తుంది. దాదాపు 18 కోట్ల జనాభా కలిగిన ఏ అవకాశాలు లేకుండా ధనికులు దేశఫలాలను అనుభ విస్తుంటే వీరు చూస్తూ వారి దయాదాక్షిణ్యం మీద ఆధారపడా ల్సిందేనా?ఈ ఆధారిత బ్రతుకుల కంటే బ్రతుకేలేకుంటే మంచి దని అంటారు. మనిషన్నాకా పౌరుషం, చీమునెత్తురున్నంతగా బానిసగా బ్రతకగలడా? కులం,మతం గుర్తించినపుడు హక్కు లను రాజ్యాంగం ఇస్తే వాటిని పొందెందుకు ప్రదర్శనలు, సమా వేశాలు కులం పేరుమీద జరుపుకొని వారి సాధక బాధలను దేశ ప్రజలకు చెప్పుకోవడానికి స్వేచ్ఛలేకపోవడం ఎంతవరకు సమంజసమంటారు విజ్ఞులు ఆలోచించాలి. అందుకే డాక్టర్‌ అంబేద్కర్‌ అంటారు 'నల్ల కోటు న్యాయవాదులు నా జనులను రక్షించరు అని. అది నేడు నిజమైందని చెప్పకతప్పదు. అందుకే రాజ్యాంగంలో 'న్యాయసమీక్ష'ను బ్రిటిషురాజ్యాంగం నుండి గ్రహించి ప్రతి అంశాలమీద జుడిషియారి, కార్యనిర్వహాకవర్గం చేసిన చట్టాలను ప్రతిపాదనలను 'రివ్యూ' చేసే అధికారాన్ని రాజ్యాంగంలో సంగ్రహాంగా పేర్కొన్నారు. దీనినే ప్రొఫెసర్‌ కె.సి వేరే 'రాజ్యాంగపు గుండె కాయగా అభివర్ణించారు. జ్యుడిషియల్‌ రివ్యూను ఒక బెంచి ఇచ్చిన తీర్పును వెరొక బెంచి రివ్యూ చేసే అధికారం కల్పించింది. చివరిగా అన్యాయ అంశాలను 'రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించి ప్రజల స్వేచ్ఛను రాజ్యాంగ ధర్మం ప్రకా రం రక్షించే అధికారాన్ని కలిగి ఉంది.
నేడు పెరిగిన 'క్యాస్ట్‌ కాన్షియస్‌'ను అరికట్టవలసిందే కాని వారి గొంతులను అణచివేయకూడదు. ఎవరి విశ్వాసాన్ని, సాంఘిక సమానత్వాన్ని హరించకుండాచూడాల్సిన రాజ్యమేఫేలైతే రక్షించ వలసిన న్యాయశాఖ కొందర్ని స్వేచ్ఛ కంఠాన్ని నొక్కిం చాలనుకోవడం చట్టబద్దంకాదు కదా! 18కోట్ల మంది హరిజనుల స్వేచ్ఛకు భంగం.సామాజిక న్యాయాన్ని ఇవ్వాల్సిన రాజ్యమే ఈ విధమైన చర్యలను చేయవచ్చా?న్యాయాధీశులే పునరాలో చించాలి. పేదలు, అన్ని కులాలల్లో ఉన్నారు. కాని అన్ని కులా లకు అంటరానితనం లేదు. అందరు ఊరిలో జీవిస్తుంటే హరి జనులు, ఆదివాసీలు ఊరివెలుపల అడవుల్లో జీవితాలు వెలగబెట్టడం ఎందుకు? అన్న ప్రశ్న ఉత్తరప్రదేశ్‌లో మాయావతి బహు జనపార్టీలను ఉద్దేశించిన చట్టం అందరికి వర్తింపచేయడం సమంజసంగా లేదు. కూటికున్నవాడికి కులం ఉన్నవారికి వారి బాధేమి తెలుస్తుంది. తమ బాధలను వ్యక్తం చేసుకునేందుకు స్వేచ్ఛను పోలీసు లరక్షణతో అరికట్టాలనుకోవడం అక్రమం, అమానుషం కదా!ఈ స్థితి నుండి కోట్ల మందిని బయ టకుపడేయాలి. బిఎన్‌పి తన రాజకీయఉద్దేశాలను వ్యక్తం  చేయ డానికి వీలులేదు. అంతేగాక చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండటం మంచిది. కాని హక్కుల పరిరక్షణకు మీటి ంగులు పెడితే నిషేధం. కనుక దానిని ఎత్తివేయాలి.
దేశంలో నాలుగు వేలకుపైగా కులసంఘాలు, ఎన్‌.జి.ఓలు న్నాయి. వారి పాత్రను కూడా గమనించాలి. కులసంఘాలలో అగ్రకుల సంఘాలు, సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వారికి బాధలు లేకపోయినా ముందుకెళ్లేందుకు స్థాపించుకున్నారు. వారిని ప్రత్యేకించి రద్దు చేయాల్సిందిపోయి భుక్తికొరకు పోరాడే వారిపై నిషేధం విధించడం ఏమిటి? హిందుత్వాన్ని చాటే మత సంస్థలను నిషేధించడం ఆపేసి, అందరిపై ఊకుమ్మడిగా ఆంక్ష లను విధించకపోగా ఏకంగా నిషేధించడం సమంజసం కాదు. న్యాయస్థానంలో మరొకసారి ఈ అంశాన్ని ధర్మాసం నివేదించి పరిశీలించవలసిన అవసరం ఎంతైన ఉంది. అదేవిధంగా మతం, సాంఘిక అంశాలను, రాజకీయంచేసి రాజకీయ పార్టీలు చేస్తున్న ఊరేగింపులను బలప్రదర్శనలు నిషేధించాల్సినదిపోయి బలహీ నవర్గాల హక్కులను స్వేచ్ఛను హరించి వేయడం ఎంతవరకు సబబు అంటారు. జ్యుడిషి§రి చట్టాన్ని ఇంటర్‌ప్రెట్‌ చేయాలే గాని చట్టాలను చేయకూడదు. జ్యూడిషియరీ కార్యనిర్వహక, శాసనశాఖ విధుల్లోకి చొరబడటం సమంజసం కాదు. ఎవరి పరి ధుల్లో వారు వ్యవహరించడం మంచిది. సమాజంలోని హెచ్చు తగ్గులను బట్టి రాజకీయ బలాలను బట్టిపోకుండా 'సమన్యాయ పాలన అమలయ్యేటట్లు చూడాలి. అంతేగాక బలవంతుడ్ని కొమ్ముకాయకుండా బలహీనుడ్ని రక్షించివారి హక్కులను, స్వేచ్ఛ ను రక్షించడం రాజ్యన్యాయశాఖ చేయాల్సిన పనికాని సమాజపు రుగ్మతలను తొలగించాలే తప్ప కులాధిక్యతకు బానిసలై రాజ్యాంగ వ్యతిరేకతలకు పాల్పడకూడదని మనవి.
ఏదిఏమైన రాజకీయ పార్టీల ఆగడాలను అరికట్టేందుకు చేసే ప్రయత్నంలో దిగువనున్న సామాజికవర్గాలకు అన్యాయం చేయ రాదు. అందర్ని ఒకే తాటితో బిగించాలనుకోవడం అనర్థం అవు తుంది. ఈ నిషేధాల అమలు విసరించాలే కాని వ్యతిరేకరించ రాదు. న్యాయశాఖ పరువను కాపాడుకోవాలి. బలహీన వర్గాల ప్రజలు, మైనారిటీ ప్రజల విశ్వాసం మీద నిప్పులు పోయరాదు. ఏదిఏమైన ఈ నిషేధాలను అమలు చేయడం అంతసులభం కాదు! కనుక తప్పకుండా మెజారిటీ వారు అల్పసంఖ్యాల వారి మనోభావాలను పరిగణనలోకి తీసుకొని మెలగవలసి ఉంది.

Vaartha Telugu News Paper Dated : 03/09/2013