Saturday, July 26, 2014

రాజుకుంటున్న ఆర్టికల్‌ 370 By డేవిడ్


కాశ్మీర్‌ స్వయుంప్రతిపత్తిపై చర్చ 
రద్దు చేసేందుకు ప్రయుత్నాలు 
వివిధ రాష్ట్రాల్లో కాశ్మీర్‌ స్టడీ సెంటర్లు 
సైన్యాన్ని పంపండంపై త్వరలోనే నిర్ణయుం? 
కేబినెట్‌ చర్చకు సహాయువుంత్రి డివూండ్‌ 
రెచ్చగొడుతున్నారంటున్న కాశ్మీర్‌ సిఎం 
370 అవులు కాకపోవడమే సవుస్య 
టెర్రరిజం పీడ వైదొలగి ఉండేది 
వివిధ వూర్గాల్లో తగ్గించిన అధికారాలు 
ప్రజాభిప్రాయూన్ని గెలుచుకోవాలి 
సైనిక ప్రయోగం పరిష్కారం కాదు

గత కొంతకాలంగా కాశ్మీర్‌కు ఉన్న స్వయుంప్ర తిపత్తిపై, ఆ ప్రాంతంలో సైన్యాన్ని ఉపయోగించే విషయుంపై చర్చ జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాశ్మీర్‌ స్వయుం ప్రతిపత్తి విషయుమై పునరాలోచిస్తావుని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వూట్లాడారు. దానిపై వివిధ వర్గాలనుంచి వ్యతిరేకత రావడంతో కాస్త వెనక్కి తగ్గినప్పటికీ ఇప్పుడు సంపూర్ణ మెజారిటీ రావడంతో- ఆర్టికల్‌ 370 విషయుంపై సీరియుస్‌గా ఉన్నట్లుగానే కనిపిస్తుంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ అనుబంధ సంఘాలు, శక్తులు ఆర్టికల్‌ 370, కాశ్మీర్‌లో సైన్యాన్ని ఉపయోగించే విషయూన్ని గురించి తవు క్యాడర్‌ను చైతన్య పరిచేందుకు �కాశ్మీర్‌ స్టడీ సెంటర్‌� పేరుతో వివిధ రాష్ట్రాల్లో కూడా చర్చలు నిర్వహిస్తున్నారుు. దాంట్లో భాగంగానే ఈ నెల 14న ఓయుూలోని మెకస్టర్‌ ఆడిటోరియుంలో, ఒక మీటింగ్‌ నిర్వహించారు. మెుత్తంగా ఈ పరిణావూలను చూస్తుంటే ఆర్టికల్‌ 370, కాశ్మీర్‌లో సైన్యాన్ని ఉపయోగించే విషయుంలో త్వరలో బీజేపీ ఏదోఒక నిర్ణయూనికి రావొచ్చన్నది అర్థవువుతోంది. 

గతంలో ఆమ్‌ఆద్మీ పార్టీనేత ప్రశాంత్‌ భూషన్‌ కాశ్మీర్‌లో సైన్యాన్ని ఉపయోగించే విషయుంలో కాశ్మీర్‌ ప్రజలతో ప్రజాభిప్రాయు సేకరణ చేయూలని అభిప్రాయూన్ని వ్యక్తం చేసినం దుకు హిందూ రక్షదళ్‌ సభ్యులు ఆప్‌ కార్యాలయుంపైదాడి చేశారు. నిజానికి ప్రశాంత్‌భూషన్‌ కాశ్మీర్‌కు స్వయుంప్రతిపత్తి ఇవ్వాలనికూడా వూట్లాడలేదు. ఆయున కేవలం సైన్యాన్ని ఉపయోగించే విషయూనికే పరిమితవుయ్యూరు. తన భావప్రకటన స్వేచ్ఛను ఉపయోగించు కున్నందుకు హిందూ రక్షదళ్‌ సభ్యులు ఎంత వీరంగం సృష్టించారో చూశాం.బీజేపీ ఎంపిగా గెలిచిన జితేంద్ర సింగ్‌, సహాయు వుంత్రిగా- నరేంద్ర మోడీ క్యాబినెట్‌లోకి వచ్చిరావడంతోనే ఆర్టికల్‌ 370పై చర్చజరగాలని ప్రకటించడం చూస్తుంటే ప్రభుత్వం తెనేతుట్టెను కదిపేందుకు సిద్ధపడినట్లు అర్థం చేసుకోవచ్చు. జితేంద్రసింగ్‌ ఆ ప్రకటనను ప్రభుత్వం తరపుననే చేస్తున్నానని చెప్పడంచూస్తే ఆధికారంలోకి వచ్చి వారం రోజులుకూడా పూర్తికాకుండానే ప్రభుత్వం తన సంఘీపరివార్‌ ఎజెండాను అవులుచేయుడానికి ఎంత ఉత్సాహపడుతోందో చూడవచ్చు. 

నిజానికి కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్‌ 370 ఇవ్వాళ దేశానికి సంబంధించిన అత్యవసర సవుస్య కాదు. ఎన్నికలప్రచారంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిష్కారించాల్సిన అవసరం ప్రభుత్వం వుుందు ఉన్నప్పటికీ, వాటిని కాదని 370 పైనే దృష్టిసారిస్తున్నదంటే ప్రభుత్వానికి వుుఖ్యమెనై ఎజెండాలో ఏమిటో అర్థం చేసుకోవచ్చు.నరేంద్రమోడీని అభివృద్ధి బ్రాండ్‌గా చూపించి ఎన్నికల్లో లబ్ధిపొందిన పరివార్‌ శక్తులు- వుల్టినేషనల్‌ కంపెనీలు తవు ప్రయోజనం నెరవేర్చుకోవాలంటే తావుు ఇచ్చిన ఎజెండాను అవులుచేయుడం అనివార్యం. దాంట్లో భాగంగానే పరివార్‌ శక్తులు రద్దుచేయూలని చూస్తున్న కాశ్మీర్‌ స్వయుం ప్రతిపత్తిని ఇప్పుడు అవులు చేయుడానికి ప్రయుత్నిస్తున్నారు. ఈ ప్రయుత్నంలో భాగంగా నరేంద్రమోడీ వెనకఉన్న శక్తుల ప్రయోజనాలను కూడా నెరవేర్చుకోవచ్చు. 

నరేంద్ర మోడీ, ఎంపీ జితేంద్ర సింగ్‌ తదితరులు ఆర్టికల్‌ 370 గురించి వూట్లాడారో లేదో దేశంలోని మేరుున్‌స్ట్రీం మీడియూ మెుదలు, మేధావులు అందరూ దీనిచుట్టే టీవీలో చర్చలు చేస్తూ, ఒకరినొకరు దూషించుకున్నారు. కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలు కూడా రంగంలోకి దిగారుు. ఆర్టికల్‌ 370 రద్దుకు రాజ్యాంగం ఒప్పుకోదని కాంగ్రెస్‌ నేతలు ప్రకటిస్తే, కాశ్మీర్‌ సి.ఎం. ఒవుర్‌ అబ్దుల్లా వూత్రం కాశ్మీర్‌ ప్రజలను రెచ్చగొడుతున్నారని, ప్రజల్లో ఆయోవు యూన్ని సృష్టిస్తున్నారని ప్రకటించారు. దీంతో రెండు, వుూడు టీవీ ఛానల్స్‌తో సహా పత్రికలు దీనిపైనే కథనాలను ప్రచారం చేశారుు.ఈ సవుస్యపై చర్చ జరుగుతున్న కాలంలోనే, ఏదో ఒక రోజు, ఎక్కడో ఒక చోట పేలుళ్లు కూడా జరగొచ్చు (ఆ పేలుళ్లు వేర్పాటు వాదులెనై చేయువచ్చు, లేకపోతే హిందూత్వ శక్తులెనై చేయువచ్చు. 

గతంలో వూలేగావ్‌ పేలుళ్ల అనుభవాలు ఉన్నారుు కదా!). ఆ పేలుళ్ల వెనుక ఏ కాశ్మీర్‌ యుువకులో, లేకపోతే పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదో, కాదంటే ఇండియున్‌ వుుజాహిదీన్‌ టెర్రరిస్టులో ఉన్నట్లు జాతీయు పరిశోధనలు సంస్థలు ఎలాగూ తేలుస్తారుు! టెర్రరిస్ట్‌ దాడుల్లో గాయుపడినవారిపట్ల సానుభూతితో ప్రజలు ర్యాలీలు, క్రొవ్వొత్తుల ప్రదర్శనల్లో వుునిగి పోతుంటే ప్రభుత్వం దాంట్లో భాగంగా- కఠిన నిర్ణయూలు తీసుకుంటున్నాం- అంటూ ప్రజా వ్యతిరేక నిర్ణయూలు తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయూలకు సంబంధించిన వార్తలు కాస్త ప్రాధన్యత కోల్పోరుు, ప్రజల దృష్టి నుండి తప్పించ వచ్చు.నిజానికి పాలక వర్గాలు దేశంలో రాజకీయు అస్థిరతను కృత్రివుంగా సృష్టించడం ద్వారా తవు వర్గాలకు సంబంధించిన అనేక సవుస్యలను నెరవేర్చుకున్నట్లు గతంలో కార్గిల్‌ యుుద్ధం సందర్భంలో చూశాం. 

ఆ సవుయుంలో దేశంలోని మేధావి వర్గం, విద్యార్థులు ఈ యుుద్ధం వెనుక హిందుత్వశక్తుల స్వప్రయోజనాలు ఉన్నాయుని చర్చలో వుునిగితేలుతుంటే, ప్రజలు - కార్గిల్‌ యుుద్ధంలో అసువులు బాసిన అవురవీరులకు నివాళులు అర్పిస్తూ, క్రొవ్వుత్తుల ర్యాలీలు నిర్వహిస్తూ ఈ యుుద్ధం వెనుక ప్రభుత్వ స్వప్రయోజనాలు ఏమెనై ఉన్నాయూ అనేది పట్టించుకోలేదు. ఆ అస్థిర కాలంలోనే పాలక వర్గాలు అనేక ప్రజా వ్యతిరేక విధానాలకు అమోదం తెలపడం, ప్రజా ఉద్యవూలను అణిచివేసే చట్టాలకు రూపకల్పన చేయుడం జరిగింది. ఆ చరిత్రను వుళ్లీ తీసుకురావడంలో భాగమే ఇవ్ళాళ ఆర్టికల్‌ 370 సవుస్యను కదపడం.నిజానికి ఆర్టికల్‌ 370 కాశ్మీర్‌ విషయుంలో- కోవూలో ఉన్న శరీరం లాంటింది. అది 1947 నుంచి ఉనికిలో ఉన్నప్పటికీ ఏనాడు అది తన స్వయుంప్రతిపత్తిని కాపాడుకున్న చరిత్ర లేదు. వివిధ ఒప్పందాల పేరుతో, రాష్ర్టపతి ఉత్తర్వుల పేరుతో ఆ చట్టానికి ఉన్న హక్కులను కాలరాయుడం వుూలంగా అది ఏనాడు తన ఉనికిని చాటుకోలేకపోరుుంది. 

ఆర్టికల్‌లో వున్న లక్ష్యాలు అవులై ఉంటే కాశ్మీర్‌లో టెర్రరిజం అనే సవుస్యే ఉండకపోయేది. కాశ్మీర్‌కు ఉన్న సవుస్యల్లా ఆర్టికల్‌ 370ని సక్రవుంగా అవులు చేయుకపోవడమే. 
జవుు్మ- కాశ్మీర్‌ రాష్ట్రానికి స్వయుం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిందే ఆర్టికల్‌ 370. 1949 నుండి ఇది ఉనికిలో ఉన్నప్పటికీ ఈ ఆర్టికల్‌ నిజంగా ఊపిరి పీల్చుకుని సజీవంగా నిలిచిన రోజులు వూత్రం చాలా తక్కువే. వివిధ ఒప్పందాల పేరుతోనూ, రాష్ర్టపతి ఉత్తర్వుల ద్వారానూ ఈ ఆర్టికల్‌ ద్వారా కాశ్మీర్‌కు కల్పించిన అధికారాలు అన్నింటిని కత్తిరించేశారు. ఆర్టికల్‌ 370 జీవచ్ఛవంగా వూరి దశాబ్దాలు గడిచిపోరుుంది. ఈ ఆర్టికల్‌ ఉద్దేశించిన లక్ష్యాలు వాటి నిజమెనై అర్థంలో అవులరుు ఉన్నట్లరుుతే సవుస్యే ఉండకపోను. అసలు సవుస్యల్లా ఆర్టికల్‌ 370 నిజంగా అవులు కాకపోవడమే. కాశ్మీర్‌ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను కత్తిరించి ఆర్టికల్‌ 370 ద్వారా తిరిగి ఇస్తున్నావుని చెప్పిన భారత ప్రభుత్వం- వాస్తవంలో దానిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. 

కాశ్మీర్‌ సవుస్య ఇప్పటికీ రగులుతూ ఉండటానికి వుూల కారణం అదే.దేశ స్వాతంత్య్రం నాటికి కాశ్మీరు ఒక స్వతంత్ర సంస్థానం. ఇది ఏనాడు ఇండియూలో భాగంగా లేదు. బ్రిటిష్‌ వాడి ఇండియున్‌ ఇండిపెండెన్స్‌ చట్టం ప్రకారం స్వతంత్ర సంస్థానాలకు ఇరు దేశాల్లో ఏలో ఒక దేశంలో కలవడవూ లేక స్వతంత్రంగా ఉండడవూ తేల్చుకునే హక్కును ఆయూ స్వతంత్ర సంస్థానాలకు కల్పించారు. వుహారాజ హరిసింగ్‌ హిందువు కనుక కాశ్మీర్‌ని ఇండియూలో కలిపేస్తాడన్న అనువూనంతో పాక్‌ గిరిజన తెగలను రెచ్చగొట్టి భారత్‌కు వ్యతిరేకంగా పంపింది. వీరి నుండి రక్షణ కోసం హరిసింగ్‌ ఇండియూను అభ్యర్థించాడు. ఇదే అవకాశంగా ఎంచిన భారత ప్రధాని హరిసింగ్‌తో పాక్షిక విలీన ఒప్పందం చేసుకున్నాడు. ప్లెబిసెట్‌ ద్వారా సవుస్యను పరిష్కారం చేస్తానని నెహ్రు ఇచ్చిన వాగ్ధానాన్ని నమ్మిన షేక్‌ అబ్దుల్లా తదితర కాశ్మీర్‌ నాయుకులు కాశ్మీర్‌ను తాత్కాలికంగా భారత్‌లో షరతులతో కూడిన విలీనం చేయుడానికి ఒప్పుకున్నారు. వాళ్ళప్పుడు పాకిస్థాన్‌ను తవు ప్రజాస్వామిక జాతీయు ఆకాంక్షలకు ప్రవూదంగా చూశారు. 

ఇండియూను రక్షకునిలా చూశారు. పరిస్థితులు స్థిమిత పడ్డాక నెహ్రు వాగ్దానం ఇచ్చినట్లు �ప్రజాభిప్రాయు సేకరణ� జరపవచ్చని, ప్రజల అభిప్రాయూన్ని బట్టి ఇండియూలో పూర్తిగా విలీనం కావడవూ, లేక స్వతంత్ర రాజ్యంగా అవతరించడవూ తేల్చుకోవచ్చని వారు ఆశించారు. ఈ చారిత్రక సందర్భంగానే ఆర్టికల్‌ 370కి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ ఒప్పందం ప్రకారం జవుు్మ- కాశ్మీర్‌ కేవలం పాక్షికంగానే విలీనం అవుతుంది. ఆచరణలో అది ప్రత్యేక దేశంగానే ఉంటుంది. భారత్‌ యుూనియున్‌ చేతికి వుూడు శాఖలు (విదేశీ, రక్షణ, సవూచార వీటికి అనుబంధమెనైవి) వూత్రమే అప్పగిస్తారు. కాశ్మీర్‌కు ప్రధాని, రాష్ర్టపతి ఉంటారని ఈ ఒప్పందం 1947 అక్టోబర్‌లో చేసుకున్నారు.ఏప్రిల్‌1948లో ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానం ప్రకారం కూడా జవుు్మ- కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయు సేకరణ (ప్లెబిసెట్‌) నిర్వహించాలి. ఇండియూలో కలవడవూ, పాకిస్థాన్‌లో కలవడవూ అన్నది ఈ ప్లెబిసెట్‌ ద్వారా తేల్చాలి. ఈ తీర్మానానికి కట్టుబడి ఉంటావుని భారత్‌, పాక్‌ ఇరు దేశాలు అంగీకరించారుు. అనంతరం దాన్ని బుట్టదాఖలు చేశారుు. 

ఐరాస తీర్మానం ప్రకారం, నెహ్రు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రజాభిప్రాయు సేకరణ జరపాలని కోరిన షేక్‌ అబ్దుల్లాను విడతలు విడతలుగా 17 సంవత్సరాలకు పైగా జైలులో నిర్భంధించారు. కాశ్మీర్‌ ప్రజల స్వయుం నిర్ణయూధికారం కోసం జైలు జీవితం అనుభవించిన షేక్‌ అబ్దుల్లా సహజంగానే కాశ్మీరీలకు ఆరాధ్యనీయుుడు అయ్యూడు. ఆయున్ని కాశ్మీర్‌ సింహంగా పిలుచుకున్నారు.
ఒంటె- గుడారం సామెతలాగా- వుూడు శాఖలు అడిగిన భారత ప్రభుత్వం క్రవుంగా గుడారం మెుత్తాన్ని ఆక్రమించేసింది. ఐరాస తీర్మానాలకు విరుద్ధంగా సెనై్యంతో రాష్ట్రాన్ని నింపేశారు. ఇన్ట్‌మ్రెంట్‌ ఆఫ్‌ అసెషన్‌లో ఒక అంశం ఆధారంగా రాష్ర్టపతి ఉత్తర్వుల పేరుతో ఆర్టికల్‌ 370ని వుృత శరీరంగా వూర్చివేశారు. 1950 ప్రెసిడెన్సియుల్‌ ఆర్డర్‌, 1952 ఢిల్లీ అగ్రిమెంట్‌ల ద్వారా ఆర్టికల్‌ 370లోని సారాన్ని పీల్చి పిప్పిగా మిగిల్చారు. అనంతరం కూడా వివిధ ప్రెసిడెన్షియుల్‌ ఆర్డర్లు జారీ చేసి, ఈ ఆర్టికల్‌ను వురింతగా బలహీనం చేస్తూ పోయూరు. కాశ్మీర్‌ లోయును సైనిక బ్యారక్‌గా వూర్చి వేశారు. 

ఇవ్వాళ పాలకవర్గాలు టెర్రరిజాన్ని బూచీగా చూపిస్తున్నారుు. కాని టెర్రరిజం అనేది గాలిలో నుంచి ఊడిపడలేదు. ఒకవేళ బైటివారు ప్రవేశపెట్టినపుడు కూడా టెర్రరిజం ఉంటే ఉండవచ్చు. కాని అది ఉన్న చోటులో తగిన పునాది లేకుండా అది ఎంతోకాలం వునజాలదు. ఒకచోట టెర్రిజం దీర్ఘకాలం పాటు కొనసాగిందంటే కారణం, అది అలా కొనసాగడానికి తగిన సావూజిక, ఆర్థిక, రాజకీయు పరిస్థితులు అక్కడ ఉన్నాయునే అర్థం. ఇదొక విషయుం అరుుతే, పాలకులు న్యాయుమెనై ఉద్యవూలను కూడా టెర్రరిజంగా చెప్పడం వురో విషయుం. కాశ్మీర్‌లో టెర్రరిజాన్ని ఆశ్రరుుంచింది చాలా కొద్దివుందే. జె.కె.ఎల్‌.ఎఫ్‌ నాయుకత్వంలో అక్కడ ఉధృతమెనై ఉద్యవుం నడిచింది. కాని ప్రజా ఉద్యవూన్ని కూడా- సైన్యాన్ని వినియోగించి కర్కశంగా అణచివేయుడంతో అక్కడి ప్రజలకు తవు సహజ ప్రజాస్వామిక జాతీయు ఆకాంక్షలు వెళ్ళబుచ్చడానికి తగిన వేదిక లేకుండా పోరుుంది. అందువలన టెర్రరిజం సజీవంగా ఉంది.

పాకిస్థాన్‌లో భారత వ్యతిరేక సెంటిమెంట్లు ప్రబలంగా ఉండటానికి కారణం కాశ్మీర్‌లో సాగుతున్న అణచివేతే.ఈ భారత్‌ వ్యతిరేక సెంటిమెంట్లు చూపి ఇక్కడ పాక్‌ వ్యతిరేక సెంటిమెంట్లు రెచ్చగొట్టడంలో హిందూత్వ శక్తులు, కాంగ్రెస్‌ శక్తులు సఫలం అవుతున్నారుు. ఇది చివరికి కోడి వుుందా, గుడ్డు వుుందా అన్నట్లు తయూరరుుంది.కాశ్మీర్‌ని భారత దేశంలో భాగంగా చేసుకోవాలంటే మెుదట అక్కడి ప్రజల్ని గెలవాలి. వారి వునసుల్ని, హృదయూల్ని గెలుచుకోవాలి. నెహ్రు చెప్పినట్లు కాశ్మీర్‌ని ఒక సుందర ప్రకృతి నిలయుంగా కాకుండా- చీవుు నెత్తురు వూంసం ఉన్న వునుషులుగా చూస్తేనే ఇది సాధ్యం. చరిత్రను పరికిస్తే వునకు తెలిసేది అణచివేతకు గురువుతున్న జాతులు ఎంతోకాలం అణిగివుణిగి ఉండలేవు. అణచివేతకు గురవుతున్న జాతి తిరుగుబాటుకు ప్రయుత్నించడం ఒక సహజ, ప్రాకృతిక, జాతీయు లక్షణం. ఆ లక్షణంతోనే భారత ప్రజలు బ్రిటిష్‌ వాడిపై తిరుగబడ్డారు. అదే లక్షణంతో కాశ్మీర్‌ ప్రజలు తవు అసంతృప్తిని వివిధ రూపాల్లో వెళ్లగక్కుతున్నారు. ఈ విషయూన్ని గవునించకుండా హిందుత్వ శక్తులు కాశ్మీర్‌ తుట్టెను కదపడానికి ప్రయుత్నిస్తే వురోవూరు సుందర కాశ్మీరంలో నెత్తుటేరులు పారే అవకాశం ఉంది.

Surya Telugu News Paper Dated: 25/07/2014 

Wednesday, July 23, 2014

పీడితులకు పోరాటమే మార్గం By కొంకల వెంకటనారాయణ


Updated : 7/24/2014 3:24:51 AM
Views : 20
1998 జూలై16న వేంపెంట నరమేధం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని పౌరప్రజాస్వామిక,విప్లవ సంస్థల వైఖరుల బండరాన్ని బయట పెడుతూ కారంచేడు నుంచి వేంపెంట దాకా దళితులపై దాడులు ఎందు కు జరుగుతున్నాయి? ఏం చేయాలి? అని అమరుడు మారోజు వీరన్న స్థాపించిన దళిత బహుజన మహాసభ రికార్డు చేసింది. ఆ కొనసాగింపుగానే కులవర్గ జమిలి పోరాట అవగహానలోనే 2012లో లక్షింపేట దళితుల హత్యాకాండపై పౌర, ప్రజాస్వామిక, విప్లవ సంస్థల, దళిత, బీసీ కుల సంస్థల వైఖరుల్ని వివిధ తెలుగు దిన, వార, మాస పత్రికల్లో జరిగిన చర్చవిశ్లేషణల్ని ఒక చోట చేర్చి విలువైన డాక్యుమెంట్ రూపంలో జాబాలి ప్రచురణల పేర కొంకల వెంకటనారాయణ, పాపని నాగరాజు, కమ్మరి రేణుక తీసుకురావడం జరిగింది.

గతంలో దళిత రణన్నినాదం సంకలన వేసిన ఉ.సా అయినా, నేడు దళిత ప్రతిఘటనా పోరాటాల నినాదం పేరు తో కారంచేడు, చుండూరు, నీరుకొం డ, తిమ్మసముద్రం, వేంపెంట, ప్యాపి లి, లక్షింపేట, కంబాలపల్లి (కర్నాటక రాష్ర్టం), ఖైర్లాంజీ (మహారాష్ర్ట రాష్ర్టం) సంఘటనలపై వివిధ విప్లవ, ప్రజాస్వామిక సంస్థలు జరిపిన సైద్ధాంతిక చర్చను ఒకచోట చేర్చిన నాగరాజులు బీసీలు కావడం యాదృచ్ఛికం. కానీ ఇండియా సమాజాన్ని కులవర్గ సమాజమని, ఈ సమాజాన్ని కుల-వర్గ జమిలి పోరాటాల ద్వారానే నిర్మూలించే వీలు ఉంటుదని నమ్మిన వ్యక్తులుగా కొనసాగుతున్నారన్నది చారిత్రక సత్యం.

వీరన్న రూపొందించి నిర్మించిన కులవర్గ జమిలి పోరాట కార్యక్రమాన్ని మోసుకువెళ్లే కార్యకర్తగా, ఆపార్టీ విద్యార్ధి విభాగామైన బిడియస్‌ఎఫ్‌కు రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా పాపని నాగరాజు వెలుగులోనే కారంచేడు నుండి లక్షింపేట వరకు జరిగిన సంఘటనలను సంకలనంగా ముద్రించే బాధ్యతను స్వీకరించాడు. ఇది భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏ విధంగా అరికట్టాలో అన్వేషించే క్రమంలో అధ్యయనంచేసి ముందుకు పోవడానికి కార్యకర్తలకు, ప్రజాసంస్థకు తొడ్పడుతుందీ దళిత ప్రతిఘటనా పోరాటాల నినాదం. ఈ గ్రంథం ఆ కర్తవ్య నిర్వహణనకు తోడ్పడుతుందని భావించే నాగరాజు ఈ ముద్రణను పూనుకున్నాడు. 

నేడు కొన్ని సంఘటనలు సాకుగా చేసుకొని దళితులను బీసీలను శత్రువులుగా చిత్రించి మిత్రవైరుధ్యాలను శత్రు పూరిత వైరుద్యాలుగా సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుచేతనే బ్రాహ్మణీయ అగ్రకుల అకృత్యాలు దళితులపై ఎన్ని జరిగిన ఆపలేకపోతున్నాం. కనక ఈ వాస్తవాన్ని గుర్తించి కులవర్గ జమిలిపోరాటాల ద్వారానే దళితుల, పీడితకుల ప్రజల విముక్తి ఉంటుందనే విశ్వసించి ప్రయాణిద్దాం. 

దళిత విద్యార్థులు..కొన్ని అనుభవాలు By ప్రొఫెసర్ జి. హరగోపాల్


Updated : 7/24/2014 3:30:28 AM
Views : 70
వరంగల్ నా చైతన్యాన్ని, సామాజిక స్పృహని చాలా ప్రభావితం చేసింది. దళిత పిల్లలకుండే సామాజిక అనుభవం వల్ల వాళ్లకు రీసెర్చ్ గైడెన్స్ చేస్తే వాళ్లకంటే నాకే ఎక్కువ ప్రయోజనమని, సమాజం మరింత లోతుగా అవగాహన అవుతుందనే కొంత స్వార్థంతో చాలామంది దళిత, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, అలాగే మహిళా రీసెర్చ్ స్కాలర్లకు నేను పరిశోధనా పర్యవేక్షకుడిగా బాధ్యతలు తీసుకున్నాను.

గత వారం కాలమ్‌లో రాసిన వ్యాసంలో దళిత విద్యార్థినీ విద్యార్థులకు లోతైన జీవితానుభవం ఉంటుందని సామాజిక చలన సూత్రాలు వాళ్లకు అవగాహన అయిన విధంగా ఇతర సామాజిక వర్గాలకు అర్థంకాకపోవచ్చునని కూడా రాశాను. ఇవి అధ్యాపకుడిగా నాల్గున్నర దశాబ్దాలు విద్యారంగంలో పనిచేసిన అనుభవ ఆధారంగా రాసిన మాటలు.నాలుగు, ఐదు నెలల క్రితం రైల్వే అధికారి భరత్‌భూషణ్ పదోన్నతి సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన సన్మాన సభకు నన్ను పిలిచారు. 

భరత్‌భూషణ్ నిజాయితీ, నిబద్ధత గల అధికారి. దళితులకు శంకరన్ లాగ సేవ చేశారన్న పేరు కూడా ఉంది. ఆయన తన ఆత్మకథ ను ప్రచురించే ముందు నా అభిప్రాయం కోసం పం పించాడు. నేను వ్యక్తిగతంగా చాలా గౌరవించే అధికారులలో ఆయన ఒకరు. ఆ సందర్భంలో డీజీపీ ప్రసాదరావు నా పక్కనే కూర్చుని ఉండడం వల్ల, ఆయన నన్ను ఆశ్చర్యపరిచే ఒక ప్రశ్న అడిగాడు. 

హరగోపాల్ గారూ.. మీ సామాజిక నేపథ్యం భిన్నమై నా దళితుల పట్ల, పేదల పట్ల మీకు ఏర్పడ్డ అనుబం ధం, ఆ కన్‌సర్న్ మీకు ఎలా వచ్చిందో తెలుసుకోవాలని చాలాకాలంగా అనుకుంటున్నానని అన్నాడు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి కొంత వ్యవధి పట్టిం ది. అయితే నాకు తక్షణం తట్టిన జవాబు నేను వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో చదువు చెబుతున్నప్పుడు ఉన్న రాజకీయ వాతావరణం, దళిత పిల్లల వ్యక్తిగత జీవితాలు దగ్గరగా చూడడం వల్ల కావచ్చు అని చెబితే, ఎప్పుడైనా తీరికగా దానిమీద మనం మాట్లాడుకోవాలి అని ప్రసాదరావు గారన్నారు. ఆయన లా అండ్ ఆర్డర్ డీజీపీ అయినప్పుడు పోలీసు వ్యవస్థను మానవీకరించండి అని నేను మెసేజ్ పంపితే, నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను అని తిరిగి మెసేజ్ పంపాడు.

కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పు డు ఒక విద్యార్థి తనకు ఒకే ఒక డ్రెస్ ఉందని, దాన్ని ఉతికి ఆరవేసేటప్పుడు అది ఆరకపోతే క్లాసుకు రావ డం ఇబ్బందిగా ఉంది అని అన్నాడు. మరొక అబ్బా యి తల్లికి అల్సర్ ఉందని ఆపరేషన్ చేయించడానికి 600 రూపాయాలు అవసరమని సెలవుల్లో మట్టిపని చేసి మూడువందలు సంపాదించానని తన బుగ్గలు పోయిన చేతులను చూపుతూ మరొక మూడువందలకు ఎవరైనా తోడ్పడితే తల్లి ఆపరేషన్ జరుగుతుందని చెప్పాడు. 

నేను గ్రామానికి చెందినవాడినైనా, నాకుండే సామాజిక నేపథ్యం నా చుట్టూ ఉండే పరిస్థితులను అంత నిశితంగా చూడడానికి అడ్డువచ్చిందేమోనని నాకు అనిపిస్తుంది. కొందరు ఎంఏ చదువుతున్న పిల్లల కుటుంబ పరిస్థితులు వింటుంటే, ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల చదువు ఎంత కష్టమో నని అనిపించింది. వినే పాఠాలకు, చదివే గ్రంథాలకు వాళ్ల జీవితానికి ఏం సంబంధం లేదని వాళ్లు అర్థం చేసుకున్నప్పుడు ఈ విద్యా విధానం పట్ల ఏం గౌరవం ఏర్పడుతుంది? ఈ విద్యావ్యవస్థ పేదల జీవితాలను ఎలా మారుస్తుంది. దీని రెలెవెన్స్ ఏమి టి అని క్లాసులో సూటిగానే ప్రశ్నించేవారు.

వరంగల్ నా చైతన్యాన్ని, సామాజిక స్పృహని చాలా ప్రభావితం చేసింది.దళిత పిల్లలకుండే సామాజిక అనుభవం వల్ల వాళ్లకు రీసెర్చ్ గైడెన్స్ చేస్తే వాళ్లకంటే నాకే ఎక్కువ ప్రయోజనమని, సమాజం మరింత లోతుగా అవగాహన అవుతుందనే కొంత స్వార్థంతో చాలామంది దళిత, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, అలాగే మహిళా రీసెర్చ్ స్కాలర్ల కు నేను పరిశోధనా పర్యవేక్షకుడిగా (రీసెర్చ్ సూపర్‌వైజర్) బాధ్యతలు తీసుకున్నాను. బహుశా నేను 30 ఎంఫిల్‌లు, 20 పీహెడ్‌డీలకు గైడ్ చేశాను. దీంట్లో అత్యధికులు పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులే. ఈ విద్యార్థులు తమ పీహెచ్‌డీ పూర్తిచేసి జీవితంలో బాగా రాణిస్తున్నారు. దేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో పనిచేస్తున్నారు.

వీళ్ల గురిం చి తెలంగాణ సమాజానికి, అధ్యాపకవర్గానికి చెప్పడం చాలా అవసరం. అలాగే తెలంగాణ పునర్ నిర్మాణమంటే వచ్చే తరంలో అత్యంత సామాజిక స్పృహ కలిగి ఈ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే దళిత, బహుజన మేధావులు కావాలి. అధ్యాపకులు ఆ దిశలో చర్యలు చేపట్టవలసిన అవసరం ఉన్నది.
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నేను గైడ్‌గా పనిచేసిన స్కాలర్లలో సుకుమార్, ఇందిర, సౌజన్య, జగన్నాథ్, చంద్రయ్య, సాయిబాబా, అరుణ్‌కుమా ర్, మల్లిక్‌లు మేధోపరంగా ఎంత అద్భుతంగా ఎదిగారో చూస్తే.., ఇలాంటి స్కాలర్లు విద్యారంగానికి, విజ్ఞాన అభివృద్ధికి, సామాజిక మార్పుకు ఎలా తోడ్పడగలరో మనకు తెలుస్తున్నది.
సుకుమార్ అంబేద్కర్ దృక్పథంలో మానవహక్కులు అనే అంశం మీద పీహెచ్‌డీ చేశాడు. క్యాంపస్‌లో దళిత రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేవాడు.

భారత రాజ్యాంగం: యాభై దశాబ్దాలు అనే అంశం మీద జాతీయ సదస్సు పెట్టి సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలను ఆహ్వానించాం. కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డితో పాటు బొజ్జాతారకం, శంకరన్, పి.ఎస్. కృష్ణన్, కన్నబీరాన్ ఇలా చాలామంది పాల్గొన్నారు. సెమినార్‌ను ప్రారంభించడానికి జస్టిస్ వెంకటాచలయ్య గారిని ఆహ్వానించాం. చాలామంది విద్యార్థు లు ముఖ్యంగా దళిత విద్యార్థులు రాత్రి చాలాసేపు నాతో సెమినార్ పనులు చేస్తూనే ఉన్నారు.

ఉదయం వెంకటాచలయ్య గారు, నేను మా వైస్ చాన్స్‌లర్ రామారావు గారు హాలుకు చేరుకుంటుండగానే రాత్రి నాతో కలిసి పనిచేసిన విద్యార్థులతో పాటు చాలామంది పెద్దపెట్టున వెంకటాచలయ్య గోబ్యాక్ అని నినాదాలు చేస్తూ మమ్మల్ని ఘోరావ్ చేశారు. దీంట్లో సుకుమార్ కూడా ఉన్నాడు. మమ్మల్ని ఒక గంట పాటు ఆపారు. చాలాసార్లు విజ్ఞప్తులు చేసి, సెమినార్‌లో తమ అభిప్రాయాలు కూడా చెప్పుకోవచ్చని ఎంతో నచ్చజెప్పితే కానీ వినలేదు. అయితే విద్యార్థులు ఘోరావ్ చేయడాన్ని చూస్తే, మేము చెప్పిన పాఠాలు మాకు అప్పజెప్పారు అనిపించింది. నేను సుకుమార్ కలిసి రెండు మూడు రీసెర్చ్ పేపర్లు కూడా రాశాం. ఆయన పీహెచ్‌డీ చేస్తున్న క్రమంలో నే ఢిల్లీవిశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా సెలక్ట్ అయ్యా డు. నాలుగు రోజుల క్రితం నేను ఢిల్లీ వెళ్లినప్పుడు తాను స్వీడన్‌లో జరుగుతున్న ఒక అంతర్జాతీయ సదస్సుకు వెళ్తున్నానని చెప్పాడు.నేను ఢిల్లీలో వీలుం టే సుకుమార్ దగ్గరే ఉంటాను. 

ఇప్పుడు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సుకుమార్ దళిత హక్కుల కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నాడు. ఎవరికి భయపడడు. అలాగే ఇందిర దళిత ఫెమినిజం మీద పీహెచ్‌డీ చేసింది. ఈ అమ్మాయిలో కొంత మొండితనముంది. కానీ నేను చూస్తూండగానే ఇంగ్లీషులో అద్భుతంగా రాయడం,మాట్లాడడం నేర్చుకున్నది. ఆమె థీసిస్ రాస్తున్నప్పుడు గైడ్‌గా ఆమె రాసిన కొన్ని అంశాల మీద నాకు అంగీకరారముండేది కాదు. అభిప్రాయాలు ఎక్కువ రాయకూడదని అది రీసెర్చ్ చేసే పద్ధతి కాదని అంటే మీరు దళితులు కాదు, మహిళ కాదు కనుక మీకు ఈ అంశాలు బోధపడవు అని అన్నది. ఒక రీసెర్చ్ స్కాలర్ సాధారణంగా అలా మాట్లాడరు. కానీ అది-కేవలం గైడ్ తన స్నేహితుడు అనుకున్నప్పుడే సాధ్యం. మొదట ఆమె పద్మావతి యూనివర్సిటీలో చేరి, ఇప్పుడు ఐఐటీలో పనిచేస్తున్నది. పది సంవత్సరాలు ఆమె పరిశోధనను కొనసాగిస్తే దేశంలోని అగ్రమేధావులలో ఒకరిగా రాణిస్తుం ది.ఏ చిన్న సహాయం చేయకున్నా నా మీద అలుగుతుంది. ఈ సాన్నిహిత్యాన్ని నేను ఎప్పుడూ గౌరవించాను.అయితే ఇక్కడే ఒక విషయం చెప్పాలి. హైద రాబాద్ లుంబినీపార్క్ బాంబు పేలుళ్లు జరిగి నప్పు డు నేను కలకత్తాలో ఉన్నాను. ఇందిర ఫోన్ చేసి.. సార్ మీరెక్కడున్నారు? అని అడిగి బాంబు ఘటన జరిగినచోట లేనని చెప్పి నప్పు డు,నేనక్కడ ఉన్నా నేమోనని తాను భయపడ్డానని చెప్పింది. ఒక అధ్యా పకుడి గురించి విద్యార్థి ప్రేమాభిమానాలతో ఆందో ళన పడటం అరుదైన అనుభవంగా గుర్తుంచుకున్నా ను. మిగతా స్కాలర్ల గురించి వచ్చే వారం ప్రస్తావిస్తాను. ఈ విశ్లేషణ ముందు చెప్పినట్టుగా అగ్రవర్ణ అధ్యాపకులకు అలాగే తెలంగాణ అధ్యాపక లోకానికి తెలంగాణ పునర్‌నిర్మాణంలో మనం చెయ్యవలసిన, చెయ్యగలిగిన పాత్ర గురించి గుర్తు చెయ్యడమే.

‘దళిత ప్రతిఘటనా నినాదం’ - దుడ్డు ప్రభాకర్‌

Published at: 24-07-2014 01:11 AM
ఈ దేశంలో పేదలందరికీ ఆకలి సమస్య అయితే, ఆ పేదల్లోని దళితులకు ఆకలితో పాటు అంటరానితనం కూడా సమస్యగా ఉంది. రెండు సమస్యలతో పోరాడుతున్న ఈ దేశ నిషిద్ధ మానవుడు ఆకలి, అంటరానితనం లేని సమాజ నిర్మాణంలో ముందు వరుసలో నిలబడ్డానికి ‘దళిత ప్రతిఘటనా నినాదం’ పుస్తకంలోని వ్యాసాలు, విశ్లేషణలు, డిబేట్‌లు ఉపయోగపడతాయి.
కారంచేడు నరమేధం (1985) నుంచి లక్షింపేట మారణకాండ (2012) దాకా దళితులపై జరిగిన సామూహిక దాడులు, ఆ హంతక మూకల అరెస్టుకై జరిగిన పోరాటాలు, ఆ సందర్భంగా జరిగిన చర్చలను రికార్డు చేసి పుస్తక రూపంలో మనముందుంచిన పాపని నాగరాజు అభినందనీయుడు. కారంచేడు నుంచి ప్యాపిలి దాకా దళితుల పోరాట చరిత్రను ‘దళిత రణన్నినాదం’ పేరుతో ఉ.సా. 2005లో రికార్డు చేశారు. ప్యాపిలి నుంచి లక్షింపేట దాకా ‘దళిత ప్రతిఘటనా పోరాటాల నినాదం’ పేరుతో నాగరాజు పుస్తకరూపంలో తేవడాన్ని ఉసా రాజకీయ వారసత్వ కొనసాగింపులో భాగమని నేననుకుంటున్నాను. అయితే కారంచేడు నుంచి లక్షింపేట దాకా రాష్ట్రంలో అన్ని సంఘటనలు ఇక్కడ రికార్డు కాలేదు. ఇక్కడే కాదు ప్రతిఘటనా దళిత నెత్తుటి చరిత్రగా ఎక్కడా రికార్డు కాలేదు. కారణాలు అనేకం ఉన్నాయి. దళితుల ఆత్మగౌరవ సమస్య ముందుకొచ్చిన ప్రతి సందర్భంలో ప్రతి చోటా దళితసమూహంపై అత్యంత క్రూరమైన సామూహిక హత్యాకాండ జరుగుతూనే ఉంది. మనిషిగా బతకడం కోసం దళితులు వేస్తున్న ప్రతి అడుగూ నెత్తుటి మడుగవుతుంది. అవన్నీ వెలుగు చూడడం లేదు. బయటి ప్రపంచానికి తెలుస్తున్నవి కొన్నిమాత్రమే. వాటిలో ఉద్యమరూపం తీసుకున్నవి అత్యల్పం. దాడితీవ్రత, పారిన నెత్తుటి పరిమాణం, పెరుగుతున్న టీవీల రేటింగ్‌ను బట్టి లాభాల్ని అంచనావేసుకొని ప్రచారానికి ప్రాధాన్యతస్తున్న కార్పొరేట్‌ మీడియా మాయజాలంలో నాగరాజు చేసిన ప్రయత్నం చిన్నది కాదు.
ఈ దేశ చరిత్రలో బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా జరిగిన పోరా టాలలో చిందిన నెత్తుర్ని, జరిగిన కుట్రల్ని, తెగిపడిన తలల్ని ఏ చరిత్రకారుడు లెక్కగట్టలేదు. అందుకే ప్రపంచ చరిత్రంతా వర్గపోరాటాల చరిత్రగా రికార్డయింది. ఈ దేశ ప్రత్యేక పరిస్థితుల్ని నిర్దిష్టంగా పరిశీలించనందువల్ల జరిగిన పొరపాటు కాదది. ఉద్దేశపూర్వకంగా దాటవేసిన కుట్ర. లక్షింపేట మారణకాండ సందర్భంగా జరిగిన డిబేట్‌లో ఆ కుట్రలు ఇంకా స్పష్టంగా, నగ్నంగా బయటపడ్డాయి. అభ్యుదయ వాదులుగా చెలామణి అవుతున్న అనేకమంది ముసుగుల్ని లక్షింపేట దళిత మృతవీరులు బదాబదలు చేశారు. అందుకే ఈ సంకలనం ఒక చారిత్రక అవసరం. మనిషిని మనిషిగా గుర్తించే సమాజాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కరి చేతిలో ఉండాల్సిన పుస్తకమిది. కారంచేడు నాటి దళిత ఆత్మగౌరవ ప్రతిఘటనా పోరాట చైతన్యం లక్షింపేట జరిగిన నాటికి నిర్జీవమయింది. ఎందుకయింది? కారకులెవ్వరు? అని చెప్పడానికే ఆ గాయాల్ని మళ్లీ ఒకసారి గుర్తు చేశాను. ఆ నెత్తుటి బాటలోని ప్రతి మలుపూ వివరంగా పరిశీలించడానికి మీ చేతిలో ఉన్న ఈ పుస్తకం ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను.
కారంచేడు మాదిగలు చిందించిన రక్తం దళిత ఆత్మగౌరవ పోరాటాల్ని పదునెక్కించి ప్రతిఘటనా పోరాటాలకు బాటలు వేసింది. అనేకమంది ఉద్యమకారులు, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులకు జన్మనిచ్చింది. తరతరాలుగా అగ్రకుల పెత్తందారుల దాడులకు అణచివేతకు గురైన దళితులు స్వతంత్రంగా ఉద్యమం నడుపుకోవాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చింది. అంటరానితనం, అవమానాలు, అత్యాచారాలు మౌనంగా భరిస్తూ మూగగా రోదిస్తున్న గొంతుల్లో పొలికేకల్ని ధ్వనింపజేసింది. కుల సమస్య ఈ దేశంలోని అన్ని పార్టీ ఎజెండాల్లో ప్రధాన అంశంగా చేర్చింది.
మహారాష్ట్రలో జరిగిన దళిత పాంథర్స్‌ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటున్న సమయంలోనే అగ్రకుల భూస్వామ్య పాలకవర్గాలు వ్యూహాలు మార్చుకున్నాయి. వేంపెంట మారణహోమంలో రెడ్లు వెనకుండి మాదిగలు, బీసీలపైకి మాలల్ని కొందరు బీసీలను రెచ్చగొట్టి దాడులు చేయించారు... ఈ నేపథ్యంలో దళిత, బహుజనులకే రాజ్యాధికారం అంటూ రాజ్యాధికారమే ఇలాంటి దాడులకు పరిష్కారమని ఉద్యమనాయకులు తేల్చేశారు. ఆశయం మంచిదే. వారంతా పల్లెల్ని వదిలి పదవులపై ఆశలు పెంచుకోవడమే విషాదం.  అదే అదనుగా స్థానిక ఆధిపత్య శక్తులు పీడిత కులాల మధ్య మిత్ర వైరుధ్యాలను శత్రు వైరుధ్యాలుగా మార్చుతున్నారు. అందులో భాగంగానే లక్షింపేట జరిగింది. లక్షింపేట మాత్రమే కాదు. వేంపెంట తర్వాత ద ళితులపై జరిగిన మెజారిటీ దాడులు బీసీలు కాకుంటే ఊరు ఊరంతా కలిసి చేసినవే. లక్షింపేట మాలలపై జరిగిన మారణకాండకు వ్యతిరేకంగా ఉద్యమం కంటే మేధాపరమైన చర్చే ఎక్కువగా జరిగింది. కాంగ్రెస్‌ నుంచి సీపీఐ, సీపీఎం దాకా దళితులు నమ్ముకున్న అన్ని ఓట్ల పార్టీలు మెజారిటీ ‘ఊరు’ ఓట్ల కోసం ‘వాడ’ బతుకుల్ని నిర్లక్ష్యం చేశాయి. అంతేకాదు ఊరుకి ప్రత్యక్ష మద్దతు తెలియజేస్తున్నాయి. కారంచేడు తర్వాత కొన్ని ప్రత్యామ్నాయ కుల ఉద్యమ సం స్థలు మినహా అనేక కుల సంఘాల నాయకుల్ని నమ్ముకుంటే స్వార్థ ప్రయోజనాలకు, ప్రలోభాలకు లొంగినట్టే ముంచి హంతక మూకలతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు. ఎవరెన్ని ‘దగా’లు చేసినా దళితులు మాత్రం ప్రత్యక్ష యుద్ధక్షేత్రాలుగా మారుతున్న వెలివాడలో జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ఈ దేశంలో పేదలందరికీ ఆకలి సమస్య అయితే, ఆ పేదల్లోని దళితులకు ఆకలితో పాటు అంటరానితనం కూడా సమస్యగా ఉంది. రెండు సమస్యలతో పోరాడుతున్న ఈ దేశ నిషిద్ధమానవుడు ఆకలి, అంటరానితనంలేని సమాజ నిర్మాణంలో ముందు వరుసలో నిలబడ్డానికి ఈ పుస్తకంలోని వ్యాసాలు, విశ్లేషణలు, డిబేట్‌లు ఉపయోగపడతాయని ఆశిస్తూ...
దుడ్డు ప్రభాకర్‌
కులనిర్మూలన పోరాట సమితి
(‘దళిత ప్రతిఘటనా నినాదం’ అనే సంకలనం నేడు  హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరణ జరుగుతున్న సందర్భంగా ముందుమాటలోని కొన్ని భాగాలు)

Andhra Jyothi Telugu News Paper Dated: 24/07/2014 

చుండూరు న్యాయ పోరాటం-సామాజిక, చారిత్రక నేపథ్యం By డాక్టర్‌ కత్తి పద్మారావు                       ఆ రోజు చేసిన ఉద్యమ ఫలితం వల్లే చుండూరులో ప్రత్యేక కోర్టు ఏర్పడింది. పివి నర్సింహారావు ముందు పెట్టిన రెండవ ప్రధానమైన డిమాండ్‌ చుండూరులో రెసిడెన్షియల్‌ కాలేజీ నిర్మాణం. ఈ కాలేజీ ఏర్పాటు తరువాత సుమారు 50 గ్రామాల దళిత విద్యార్థులు చుట్టు ప్రక్కల విద్యావంతులు అవడమేకాక 50 శాతం సీట్లు చుండూరు బాధితులకు లభ్యమవ్వడంతో మొత్తం రాష్ట్రంలోనే అత్యున్నత విద్య కల్గిన దళితవాడగా చుండూరు బాధితుల కాలనీ రూపొందింది. ఈ డిమాండ్‌ను మొదట్లో జనార్దనరెడ్డి ప్రభుత్వం వ్యతిరేకించింది.
                   చుండూరు మారణ హోమం జరిగి 2014 ఆగస్టు 6కు 23 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో చుండూరు న్యాయ పోరాట పునశ్చరణ చేద్దాం. 1991 ఆగస్టు 6 ఉదయం అగ్రవర్ణాల వారు బరిసెలు, గండ్ర గొడ్డళ్ళు, కత్తులు, సరిగ బాదులతో చుండూరు దళితవాడ మీద దాడిచేసి ఎనిమిది మందిని దారుణంగా హత్య చేశారు. సామాజిక, సాంస్కృతిక నేపథ్యం నుంచి ఆలోచిస్తే ఈ దారుణ హత్యకు కారణం కేవలం ఈర్ష ్య అని తేలుతుంది. ఈర్ష ్యకు కారణం కేవలం దళితులకు విద్య రావడం, మంచి బట్టలు వేసుకోవడం, అంబేద్కర్‌ విగ్రహాన్ని స్థాపించుకోవడం, కారంచేడులో ప్రారంభమైన దళిత ఉద్యమాన్ని ప్రోత్సహించడం. ఆత్మ గౌరవంతో బతకడమని నిగ్గు తేలింది. చిన్న చిన్న ఘటనలను ఆధారం చేసుకుని అగ్రవర్ణాల వారు దళితుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టాలని వ్యూహం పన్ని ఈ దారుణమైన హత్యలు చేసి, గోనె సంచుల్లో కట్టి తుంగభద్ర కాలువల్లో తొక్కి పెట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ తుంగభద్రలో ఉన్న శవాలను ఏరి బయటకు తీసి ప్రపంచానికి చూపించి, పోరాటానికి నడుం కట్టి చలో ఢిల్లీ వరకు ఈ పోరాటాన్ని తీసుకువెళ్ళింది.
                       జనార్దన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నిందితుల తరపునే ఉన్నారు. ఈ పోరాటంలో ప్రత్యేకమైన మూడు డిమాండ్లు ముందుకొచ్చాయి. ఒకటి 1989 ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం ఊరిలోనే ప్రత్యేక కోర్టును పెట్టాలనేది ముఖ్యమైన డిమాండ్‌. రెండవది రక్తపాతం జరిగిన దగ్గర ఊరిని మొత్తాన్ని యూనిట్‌గా తీసుకుని అందరికీ పునరావాసం కల్పించాలనేది, మూడవది రెసిడెన్షియల్‌ కాలేజీ ఊరిలో కట్టాలనేది ఈ మూడు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. అందుకు చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మూడు ప్రధానమైన డిమాండ్ల కోసం ఢిల్లీలోని బోట్‌క్లబ్‌లో సుమారు నెల రోజులు పోరాటం చేసింది. రాష్ట్రపతి భవన్‌కు ఎస్సీ, ఎస్టీ ఎంపిలు 107 మందితో ర్యాలీ సాగింది. అప్పటి రాష్ట్రపతి ఆర్‌ వెంకట్రామన్‌ మెమోరాండం తీసుకోవడానికి నిరాకరించారు. అప్పుడే దళితుడు రాష్ట్రపతి కావాలనే డిమాండు పుట్టింది. ఒక గ్రామ స్థాయి నుంచి జాతీయవాద స్థాయికి వెళ్ళిన ఉద్యమంలో రామ్‌విలాస్‌ పాశ్వాన్‌, రామ్‌దాస్‌ అటాలే, అరుణ్‌ కాంబ్లే, దళిత్‌ ఏలుమలై, సిఆర్‌ దాస్‌ (కేరళ), భగవాన్‌ దాస్‌ వంటి ప్రముఖ దళిత ఉద్యమకారులతో పాటు బోట్‌ క్లబ్‌లో చుండూరు బాధితుల్ని ఉద్దేశించి మాట్లాడిన విపి సింగ్‌, శరద్‌పవార్‌, వెంకటస్వామి, బూటాసింగ్‌ వంటి వివిధ పార్టీల ప్రతినిధులు దళిత ఉద్యమ విస్తృతికి దోహదకారులయ్యారు. ముఖ్యంగా నాటి ప్రధానమంత్రి పివి నర్సింహారావుతో చర్చల సందర్భంలో బూటాసింగ్‌ మధ్యవర్తిత్వం వహించారు. ఆనాడు జెఎన్‌యులోని దళిత స్టూడెంట్‌ ఫెడరేషన్‌ నాయకులు ఈ చర్చల్లో ఎంతో చురుకుగా పనిచేశారు. ఢిల్లీలో అంబేద్కర్‌ భవన్‌ నుంచి రోజూ బోట్‌ క్లబ్‌ వరకు 25 రోజులు జరిగిన ర్యాలీలు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పివి నర్సింహారావు ఇంటి ముందు జరిగిన ధర్నా ప్రధానమైంది. అక్కడ ఊరిలోనే ప్రత్యేక కోర్టు డిమాండ్‌ ముఖ్యమైంది. ఆ డిమాండ్‌ను ఒప్పుకోవడానికి పార్లమెంటులో ఒత్తిడి తీసుకురావాల్సి వచ్చింది. ఆ రోజు చేసిన ఉద్యమ ఫలితం వల్లే చుండూరులో ప్రత్యేక కోర్టు ఏర్పడింది. పివి నర్సింహారావు ముందు పెట్టిన రెండవ ప్రధానమైన డిమాండ్‌ చుండూరులో రెసిడెన్షియల్‌ కాలేజీ నిర్మాణం. ఈ కాలేజీ ఏర్పాటు తరువాత సుమారు 50 గ్రామాల దళిత విద్యార్థులు చుట్టు ప్రక్కల విద్యావంతులు అవడమేకాక 50 శాతం సీట్లు చుండూరు బాధితులకు లభ్యమవ్వడంతో మొత్తం రాష్ట్రంలోనే అత్యున్నత విద్య కల్గిన దళితవాడగా చుండూరు బాధితుల కాలనీ రూపొందింది. ఈ డిమాండ్‌ను మొదట్లో జనార్దనరెడ్డి ప్రభుత్వం వ్యతిరేకించింది. దళిత ఉద్యమం నంద్యాలకు చేరుకుని ఆయన మీద మృతవీరుల భార్యలను ఎన్నికల పోటీలో నిలబెట్టడానికి సిద్ధపడినప్పుడే పివి నర్సింహారావు కూడా చర్చలకు కబురు పంపారు. ఈ చర్చల్లో ఆయన రెసిడెన్షియల్‌ కాలేజీని అంగీకరించారు. ఈ పోరాట ఫలితంగా చుండూరు దళితవాడలో ప్రతి కుటుంబానికీ అర ఎకరం చొప్పున 225 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. ఎక్కువ భూమిని భూమి కొనుగోలు పథకంలోనే ఇచ్చారు. 69 మందికి సామూహిక వివాహాలు చుండూరులో నిర్వహించి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చెప్పిన కుల నిర్మూలన భావాన్ని విస్తృతం చేయడం జరిగింది. చనిపోయిన వారి కుటుంబాలతో సహా 40 మందికి పైగా ఉద్యోగాలు సంపాదించాం.చుండూరు ఉద్యమం గురించి 1998లో మలేషియాలో జరిగిన ప్రపంచ దళిత మహాసభల్లో అభినందన తీర్మానం జరిగింది. ఈ సభకు రెండు వందల దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ప్రత్యేక కోర్టు నెరవేరే వరకు అన్ని దేశాల ప్రతినిధులు కట్టుబడి ఉంటామని శపథం చేశారు. 1999లో లండన్‌లో జరిగిన మానవ హక్కుల సదస్సుల్లో విపి సింగ్‌తో పాటు పలువురు చుండూరు విషయాన్ని ప్రస్తావించారు. ఇది దేశ, అంతర్జాతీయ స్థాయిలో చర్చించబడే దశకు వెళ్ళింది.
                       ఇక చుండూరు న్యాయ పోరాటానికి వస్తే చుండూరులో 2004లో ప్రత్యేక కోర్టు ప్రారంభమైంది. చుండూరు సాక్షులకు అమ్ముడుపోయే అవసరం లేదు. వారికి ఇల్లు, పొలం, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. ఆత్మస్థైర్యంతో ఉన్నారు. చుండూరు సాక్షులు చెప్పిన సాక్ష్యాలతో భారతదేశం అంతా మారుమ్రోగాయి. వారు ఇచ్చిన సాక్ష్యాలతో జడ్జీలే కంటతడి పెట్టారు. ప్రత్యేక కోర్టులో ముద్దాయిలు 219 మంది. ప్రత్యేక కోర్టులో సాక్షులు 134 మంది. అయిదుగురు జడ్జీలు ఈ కేసును విచారించారు. ఈ కోర్టు తీర్పు 2007 జులై 31న వచ్చింది. ఈ కేసు వీర్పు వచ్చే నాటికి 219 మంది ముద్దాయిలకు గాను 179 మంది ముద్దాయిలు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ 219లో ఏడుగురిని ఇంకా అరెస్టు కూడా చేయలేదు. చుండూరు ప్రత్యేక కోర్టు 21 మందికి జీవిత ఖైదు, 35 మందికి ఒక సంవత్సరం శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. 2007 ఆగస్టులో ఈ కేసు హైకోర్టుకు వెళ్ళింది. 2014 జనవరిలో అప్పీలుకు వచ్చింది. 2014 ఏప్రిల్‌ 22న చుండూరు ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టి వేసింది. దేశమంతా ఈ కేసు కొట్టివేయడాన్ని ఖండించి ఇందులో వివక్ష ఉందని ఉద్యమం చేయడం జరిగింది. ఈ ఉద్యమంలో అన్ని సంఘాలూ తమ వంతు బాధ్యతను నిర్వహించాయి. డీజీపీ ప్రసాదరావు చొరవతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అప్పీలు చేయడానికి అనుమతి ఇచ్చింది. సుప్రీం కోర్టులో కేసు అడ్మిట్‌ అయ్యింది (20472/2014). ప్రైవేటు కేసు బాధితుల కమిటీ కన్వీనరు జాలాది మోజెస్‌ వేశారు. దానిని సుప్రీం కోర్టు అంగీకరించింది. 2014 జులై 30న ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణ కానుంది. ఈ కేసును వాదించాల్సిందిగా కారంచేడు కేసును సుప్రీం కోర్టులో వాదించిన ఎంఎన్‌ రావును దళిత మహాసభ కోరింది. ప్రభుత్వం అంగీకరించింది. సుప్రీం కోర్టులో మళ్ళీ తప్పక శిక్షలు పడతాయని దళితులే కాక దళిత ఉద్యమ, దళిత ప్రజల మద్దతుదారులంతా ఆశిస్తున్నారు. దేశంలో న్యాయస్థానాలకు, ధర్మానికి కూడా కులం ఉందని చుండూరు కేసు ఋజువు చేసింది. అయితే సామాజిక న్యాయం దళితులకు చేకూరే వరకూ ఈ పోరాటం జరుగుతూనే ఉండాలి. దళితులు మిగిలిన అన్ని కులాలతో, వర్గాలతో సమాంతరంగా ఎదిగే వరకూ అన్ని దిశలుగా ఈ పోరాటం సాగుతుంది. అయితే చుండూరు న్యాయ పోరాటం వెనుక ఉన్న చరిత్రను సరిగా అవగాహన చేసుకోకపోతే ఇది కేవలం కేసుల కోసం పోరాడినట్టే భావించడం జరుగుతుంది. ఈ న్యాయ పోరాటం దళిత విముక్తి పోరాటంలో భాగం మాత్రమే. అంతిమంగా కులం నిర్మూలన అయ్యే వరకు, భూమి పంపిణీ అయ్యే వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ పోరాటంలో అందరూ భాగస్వాములే.
(ఆగస్టు 6న చుండూరు బాధితుల 23వ వర్ధంతి, జులై 30న సుప్రీం కోర్టులో 
చుండూరు కేసు విచారణ సందర్భంగా) 
- డాక్టర్‌ కత్తి పద్మారావు 
(వ్యాసకర్త దళిత ఉద్యమ నేత)

Prajashakti Telugu News Paper Dated : 23/07/2014 

Monday, July 21, 2014

ఇంకా ఈ దురాచారమా? By ప్రొఫెసర్ జి. హరగోపాల్

Updated : 7/3/2014 2:06:29 AM
Views : 281
దేశం అభివద్ధి దశలో వేగంగా ముందుకు సాగినా, పాకీ పని వారు ఆ పని నుంచి విముక్తి చెంద డం అటుంచి, పంజాబ్, హర్యానా లాంటి అభివద్ధిచెందిన రాష్ర్టాల్లో కానీ లేదా వామపక్ష పార్టీలు చాలా కాలం అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్, కేరళ రాష్ర్టాల్లో కానీ ఈ సమస్యకు పరిష్కారం రాకపోవడంపెద్ద విషాదం. అలాగే గుజరాత్ అభివద్ధి నమూనా అని రోజూ ఊదరగొడుతున్నా, ఆ రాష్ట్రంలో పాకీ పని నిరాఘాటంగా సాగుతున్నది.

రెండు వారాల క్రితం (జూన్ 14 నాడు) ప్రజల జర్నలిస్టు భాషాసింగ్ రాసిన కనిపించని భారతం పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ రచనలో మనుషుల మల మూత్రాలను ఎత్తి గంప ల్లో నెత్తి మీద మోసుకెళ్ళే అమానుషం మనదేశంలోని అనేక రాష్ర్టాల్లో ఎలా కొనసాగుతున్నదో మన సు ద్రవించేలా చిత్రీకరించారు.
నా బాల్యంలో మా చిన్నమ్మ వాళ్ళ దగ్గరికి సెలవుల్లో మహబూబ్‌నగర్ పట్టణానికి వెళ్లినప్పుడు ఆ దశ్యాన్ని చూశాను. మానవ మలాన్ని నెత్తిపై ఎత్తుకొని పోతున్నప్పుడు అది గంపలోనుంచి కారుతూ వాళ్ళ మొఖాల మీదు గా కిందికి జారే దశ్యం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఒళ్ళు జలదరిస్తుంది.

ఈ పని ఎప్పటి నుంచి ప్రారంభమయ్యిందో కాని,ఈ నికష్ట పని గురించి స్వాతంత్వ్రోద్యమ కాలంలో గాంధీజీకి అంబేద్కర్‌కు మధ్య దీనిపై తీవ్రమైన చర్చ జరిగింది. 
గాంధీజీ ఈ వత్తి చేసే వారిని తల్లి ప్రేమతో పోలుస్తూ ప్రతి తల్లి ఈ పనిని చేస్తుందని ఆమె ఈ పనిని నికష్టమైందని అనుకోదని, అలాగే పాకీ పనివాళ్లు కూడా సమాజ ఆరోగ్యం కోసం ఈ బాధ్యత నిర్వహిస్తున్నారని వాదించాడు. 

అంబేద్కర్, గాంధీ దక్పథం పట్ల తీవ్ర అభ్యంతరం చెపుతూ, తల్లి తన సొంత పిల్లలకు ఈ సేవ చేస్తుందే తప్ప, ఇతరుల పిల్లలకు చేయదని, పిల్లల మీద తల్లి ప్రేమతో ఆ పని చేస్తుందేమో కానీ పాకీ పని వాళ్లు ఎవ్వరూ ఈపనిని ఇష్టం గా చేయకపోవడమే కాక దాన్ని అసహ్యించుకుంటారని వాదిస్తూ.. దీన్ని ఒకే కులానికి చెందిన మహిళలచే చేయించి దాన్ని వ్యవస్థీకతం చేయడం పట్ల అంబేద్కర్ తీవ్ర అభ్యంతరం చెప్పాడు. ఇది దాదా పు ఎనిమిది, తొమ్మిది దశాబ్దాల కిందటి సంగతి.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాం గం అంటరాన్నితనాన్ని నిషేధించింది. ఆ నిషేధం తో ఈ పని కూడా రద్దు కావలసింది. కానీ అంటరానితనం ఎన్నో విధాలుగా కొనసాగడమే కాక కొన్ని కొత్త ప్రక్రియలు కూడా వచ్చి చేరాయి. ఆధునికత, అభివద్ధి గురించి గొప్పలు చెప్పుకునే మన పాలకులు, పాకీ పనిని ఎందుకు ఆధునీకరించలే దు? రైల్వే డిపార్టుమెంట్ అధునాతన సూపర్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టారు. ఢిల్లీలో మెట్రోను నిర్మా ణం చేయగలిగారు. 

కొందరు ముఖ్యమంత్రులు బుల్లెట్ రైళ్ల గురించి మాట్లాడుతున్నారు. కానీ అదే రైల్వే డిపార్టుమెంట్‌లో వందలాదిమంది పాకీ పని వాళ్లు పనిచేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా రైళ్ల లో మలమూత్రాలను మనుషుల చేత శుభ్రం చేస్తున్నారా? మన దేశంలో మనిషి గౌరవం గురించి, మనిషి హుందా గురించి ఎన్నడూ ఆలోచించని వారు పరిపాలన సాగిస్తున్నంత కాలం ఈ సమస్య అంతం కాదు. ఆధునికత అనాగరిక మానవ సం బంధాల కలయికే మన దేశ సమకాలీన సంస్కతిగా మనం భావించవలసి ఉంటుంది. 


ఈ గ్రంథ రచయిత భాషాసింగ్‌కు ఉండే మానవీయ విలువల వల్ల ప్రతి రాష్ట్రంలో తాను సమాచారం సేకరించడమే గాక వాళ్ల మధ్యే జీవించింది. వాళ్లతో కలిసి భోజనం చేసి తన మానవత్వాన్ని పెం చుకున్నది. ప్రతి రాష్ట్రంలో కొందరు పాకీ మహిళల జీవితాన్ని గురించి వాళ్ల ఫీలింగ్స్‌ను చాలా లోతు గా తట్టింది.

ఈ పనిని ఎంత అసహ్యించుకుంటా రో, తమ గురించి తాము ఎంత న్యూనతాభావాన్ని పెంచుకున్నారో గమనిస్తే మనం ఇలాంటి సమాజం లో, ఇలాంటి మనుషుల మధ్య జీవించడం మన విషాదం. ఈ పని నుంచి బయటపడడం ఎలా అని పాకీ పనివాళ్లు బాధపడుతున్నారు. తమను ఎవరైనా వేరే పనిలోకి రానిస్తారా అనే అనుమానం, భయం కూడా వాళ్లను వేధిస్తున్నది. తాము చేసే పనిని ఇతరులు అసహ్యించుకోవడమే కాక తమను చూస్తేనే ముక్కుకు చేయి అడ్డం పెట్టుకొని వేగంగా నడుస్తారు.ఒక పాకీమహిళ మాట్లాడుతూ.. తాము ఒక టీ కొట్టు పెడితే ఎవరైనా తాము చేసిన ఛాయ్ ని తాగుతారా అని ప్రశ్నించింది. దేశ ప్రధాని ఒకప్పుడు ఛాయ్ వాలా అని ప్రచారం జరిగినా కొం దరు ఛాయ్ వాలాలు కూడా కాలేని పరిస్థితి ఉన్న ది. ఆయనకు అది తెలుసో తెలియదో మనకు తెలియదు.

మన దేశంలో గత రెండు దశాబ్దాలుగా సఫాయ్ కర్మచారి ఆందోళన దేశవ్యాప్తంగా బెజవాడ విల్సన్ గారి నాయకత్వంలో జరుగుతున్నది. శంకరన్ గారు తన పదవీ విరమణ తర్వాత రెండంటే రెండే పను లు చేశారు. ఒకటి నక్సలైట్లకు ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు. రెండు- సఫాయ్ కర్మచారి ఆందోళనకు తన పూర్తి మద్దతు ప్రకటించి, దానికి నైతిక బలాన్ని ఇచ్చారు.ండవ లక్ష్యం దేశంలోని మొత్తం డ్రై లాట్రిన్స్‌ని కూలగొట్టడం. శంకరన్ గారితో కలిసి శాంతి చర్చల రిపోర్టును తయారు చేస్తున్నప్పుడు రోజూ ఎన్ని లాట్రిన్స్ కూలగొట్టారన్న సమాచారం వచ్చినప్పుడల్లా ఎంతో సంతోషంగా ఆ సంఖ్య నాకు చెప్పేవాడు. ఎన్ని ఎక్కువ కూలగొడితే అంత సంతోషపడేవాడు. నిజానికి ఆ పని తన జీవి త కాలంలోనే పూర్తి కావాలని, పాకీ వారు లేని ఒక సమాజాన్ని ఆయన ఆశించాడు.

ఈ కర్మచారి ఆం దోళన వల్ల ఈ పనిని రద్దు చేస్తూ ఒక చట్టం కూడా వచ్చింది. పాకీ పనివాళ్ల పునరావాసం (రిహాబిలిటేషన్) కోసం కేంద్ర బడ్జెట్‌లో వంద కోట్లు కేటాయించారు. విల్సన్ ఈ విషయాన్ని చెబుతూ, ప్రభుత్వ అధికారులతో గత రెండు మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఈ అధికారులు గంటల తరబడి పనిచేయడమే గాక, సెలవుల్లో కూడా కొందరు అధికారులు పనిచేస్తారు. వీళ్లు ఇంత కష్టపడుతున్నది వందకోట్లు ఖర్చు కాకుండా చూడడమే అని అం టూ, వంద కోట్లల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకపోవడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి! అని చాలా ఆవేదనతో, ఆవేశంతో మాట్లాడాడు.

దేశం అభివద్ధి దశలో వేగంగా ముందుకు సాగి నా, పాకీ పని వారు ఆ పని నుంచి విముక్తి చెంద డం అటుంచి, పంజాబ్, హర్యానా లాంటి అభివద్ధిచెందిన రాష్ర్టాల్లో కానీ లేదా వామపక్ష పార్టీలు చాలా కాలం అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్, కేరళ రాష్ర్టాల్లో కానీ ఈ సమస్యకు పరిష్కారం రాకపోవడం పెద్ద విషాదం. అలాగే గుజరాత్ అభివద్ధి నమూనా అని రోజూ ఊదరగొడుతున్నా, ఆ రాష్ట్రం లో పాకీ పని నిరాఘాటంగా సాగుతున్నది. ఢిల్లీ నగర నడిబొడ్డున ఇంకా ఇది కొనసాగుతున్నది.

ఈ పుస్తక ఆవిష్కరణ జరిగిన అనంతపూర్‌లో ఈ పనికి వ్యతిరేకంగా నారాయణమ్మ తిరుగుబాటు చేసింది. ఆమె చాలా హుందాగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నది. పాకీ పని చేస్తున్న తాను తిరగబడిన ఈ దొడ్డిని గడ్డపారతో తానే కూలగొట్టి ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచింది. ఈ వత్తి నుంచి వచ్చిన దయానంద్ బెంగళూరులోని సోషల్ లా స్కూల్ అధ్యాపకుడుగా పనిచేస్తున్నాడు. ఈ అంశం మీద మంచి పరిశోధన చేస్తున్నాడు. ఆయన చిత్రీకరించిన ఘటనలను ఎన్డీ టీవీ వాళ్లు ప్రసారం చేసి దేశాన్ని షాక్‌కు గురిచేశారు. ఒకవైపు పాకీ పనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న సందర్భం లో కేంద్ర ప్రభుత్వంలో అధికారానికి వచ్చిన పార్టీ ఒక ప్రతీఘాత విప్లవ దారిలో పోతున్నది. 

ఈ కింది ఆలోచనాధారను గమనించండి. పాకీ పనిచేసే వాల్మీకులు ఈ పనిని కేవలం తమ పొట్టకూటి కోసం చేయడం లేదు. పొట్టకూటి కోసమే అయితే దీన్ని వాళ్లెప్పుడో మానేసేవారు. ఏదో దశలో ఎవరికో ఒకరికి ఇది దైవ ఆజ్ఞగా వచ్చి ఉంటుంది. భగవంతుడిని సంతప్తిపరచడం కోసం దీన్ని ఒక దైవ కార్యంగా తలచి తరతరాలుగా వాళ్లు వత్తిని నిర్వహిస్తున్నారు. లేకపోతే.. ఇన్ని తరాలుగా ఇది కొనసాగడం అసా ధ్యం. ఈ భావాలు తన పుస్తకం కర్మయోగిలో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ వ్యక్తపరిచిన భావ తరంగాలు. ఇలాంటి ఆలోచనా ధోరణిని ఎలా అర్థం చేసుకుంటారో పేదవాళ్ల భవిష్యత్తు ఏమిటో ఆలోచించే బాధ్యత పాఠకులకే వదిలేస్తున్నాను.
ప్రొఫెసర్ జి. హరగోపాల్

Namasete Telangana Telugu News Paper Dated: 3/07/2014 

ప‌నికోసం ఆదివాసీ కార్మి‌కుల అగ‌చాట్లు‌ By అర్చనా ప్రసాద్‌
               ఆదివాసీలు రిజర్వ్‌ లేబర్‌లో పెద్ద సంఖ్యలో మిగిలిపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుత రూపంలో పెట్టుబడి దారీవాదం కొనసాగించాలంటే ఇది-ఈ రిజర్వ్‌ లేబర్‌ -అనేది చాలా కీలకం. ఆ రకంగా, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగితకు, పని కోరుతున్నా లభించని ఆదివాసీ కార్మికుల సంఖ్య పెరగడానికి, సమకాలీన పెట్టుబడిదారీ విధానం హయాంలో ఆదివాసీలకు ఏమీ లభ్యం కాని ధోరణికి మధ్య సంక్లిష్టమైన, వైవిధ్యమైన సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, ఆదివాసీ కార్మికుల మౌలిక హక్కుల కోసం ప్రజాస్వామ్య ఉద్యమాలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆదివాసీల్లో తమ రాజకీయపరమైన నిర్మాణాలను మరింత బలోపేతం చేయడం ద్వారా కూడా వారి హక్కులకై పోరాడాల్సి ఉంది
                  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను రూపొందిస్తున్న సమయంలో కఠినమైన రోజులు ముందున్నాయంటూ ఆర్థిక మంత్రి ప్రజలను సమాయత్తం చేస్తున్న తరుణంలో, జనాభా గణాంకాలు ఆదివాసీ కార్మికుల పనితీరుకు సంబంధించిన వివరాలు వెల్లడించాయి. పని కోసం వారు పడుతున్న అగచాట్లను వివరించాయి. ఉపాధి వెతుక్కుంటూ ఆదివాసీ కార్మికులు లేబర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించారని ఈ డేటా స్పష్టంగా పేర్కొంది. అయితే, వారికి ఉపాధి మాత్రం దొరకడం లేదని, దాంతో వారు బతకడం కోసం తక్కువ కూలీకి కూడా సిద్ధపడిపోతున్నారని పేర్కొంది. ఈ ధోరణి, సంస్కరణలు ప్రారంభమైన నాటి నుంచీ ఉన్నప్పటికీ గత దశాబ్ద కాలంలో అయితే మరీ ఎక్కువైంది. ఈ దశాబ్దంలోనే రెండు జనాభా లెక్కలు వెలువడ్డాయి. అదీ 2001, 2011 సంవత్సరాల్లో. ఈ రెండు జనాభా లెక్కల మధ్య గల దశాబ్దంలో వనరులు సుసంపన్నంగా గల ప్రాంతాల్లోకి కార్పొరేట్‌ శక్తులు ముమ్మరంగా చొరబడడం పెరిగింది. అలాగే బడా ప్రాజెక్టుల కోసం ఆదివాసీ భూములను స్వాధీనం చేసుకోవడం కూడా ఈ దశాబ్దంలోనే కనిపించింది. పైకి పురోగతి, అభివృద్ధి సూచికలుగా కనిపించే ఈ ఉదాహరణలను చాలా తరచుగా నయా ఉదారవాదాన్ని బలపరిచే శక్తులు సమర్థిస్తూ ఉంటాయి. పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ జరిగితేనే ఆదివాసీలకు ఉపాధి లభిస్తుందని, తద్వారా వారి ప్రాంతాల అభివృద్ధికి దారి తీస్తుందని వారు చెబుతూ ఉంటారు. అయితే, దీనికి విరుద్ధంగా, కార్పొరేట్‌ చొరబాటు కేంద్రాలన్నీ కూడా ఉపాధి కల్పించే కేంద్రాలకు బదులుగా హింసాత్మకమైన, ప్రగతిశీల సామాజిక వైరుధ్యాలకు, ఘర్షణలకు కేంద్రాలుగా మారిపోయాయి. నిలకడగా కొనసాగుతూ వచ్చిన ఈ విధానం యొక్క దీర్ఘకాలిక ప్రభావాన్ని 2001, 2011 మధ్య కాలంలో ఆదివాసీ కార్మిక వర్గంలో వచ్చిన మార్పుల్లో చూడవచ్చు.

పని ప్రాతినిధ్యంలో ప్రధాన ధోరణులు

                  కార్మిక వర్గానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన డేటాను బాల కార్మికులు (5-14 ఏళ్ళు), రెగ్యులర్‌ కార్మికులు(15-59), వృద్ధులైన కార్మికులు (60 ఏళ్ళు, ఆ పైబడిన వారు)గా వర్గీకరించి విశ్లేషించవచ్చు. ఈ మూడు కేటగిరీలను పరిశీలిస్తే ఆదివాసీ కార్మికులకు సంబంధించి వివిధ వర్గాల్లో నయా ఉదారవాదం విస్తృత ప్రభావం ఏ మేరకు ఉందో మనకు తెలిసిపోతుంది. 2001, 2011 మధ్య కాలంలో ఎస్‌టి కార్మిక వర్గంలో మార్పులు కూడా ఈ కింది పరిస్థితులను తెలియపరుస్తున్నాయి.
                  మొదటగా, మొత్తం కార్మిక వర్గంతో పోలిస్తే స్వల్పంగా తగ్గుదల నమోదై నప్పటికీ రెగ్యులర్‌ కార్మికులకు (15-59 సంవత్స రాలు) సంబంధించి చూసినట్లైతే ఉపాధిలో బాగా క్షీణత కనిపిస్తోంది. బాల కార్మికులు కూడా తగ్గారు. ఇక రెండవది, ఉపాధిలో క్షీణత అనేది గ్రామీణ ప్రాంతాల్లో పని కొరవడడం వల్లనే జరుగు తోంది. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఈ స్థాయిలో క్షీణత అనేది కనిపించడం లేదు. పైగా, పట్టణ కార్మిక వర్గంలో పెరుగుదల కనిపిస్తోంది. ఇది కూడా పట్టణ మహిళా కార్మికుల ప్రాతినిధ్యం పెరగడం వల్లనే సంభవించింది. గ్రామీణ ప్రాంతాల్లో రెగ్యులర్‌ మహిళా కార్మికుల్లో తగ్గుదల ఉన్నప్పటికీ మహిళా కార్మికుల ప్రాతినిధ్యం పెరిగింది. దాదాపు ఐదు లక్షల మంది మహిళా కార్మికులు నమోదయ్యారు లేదా దామాషా పద్ధతిలో 2.68 శాతం పెరిగారు. దీనికి భిన్నంగా, గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కార్మికుల సంఖ్య 32 లక్షల వరకు పెరిగింది. కానీ ప్రతికూల వృద్ధిరేటు 1.84 శాతం నమోదైంది. గ్రామీణ పురుష కార్మికులు ఒక అర శాతం పెరిగారు. లేదా 42 లక్షల మంది వరకు నమోదయ్యారు. కానీ, ఈ పెరుగుదల అనేది స్వల్ప కార్మిక వర్గంలోనే కనిపించింది. మరోవైపు మహిళా కార్మికులు 2 శాతం కన్నా తక్కువ రేటు చొప్పున తగ్గుతూ వచ్చారు. ప్రధాన పనుల్లో ఈ నష్టం, మహిళా కార్మికుల స్థానే పురుష వ్యవసాయ కార్మికులను చొప్పించడం చూస్తుంటే గ్రామీణ రంగంలో ఉపాధి సరిగా లేదని, పైగా సంక్షోభం, నిరాశా నిస్పృహలు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఇక మూడవది, మొత్తం కార్మిక వర్గంలో 60 ఏళ్ళకు పైబడిన కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ కూడా, బాగా పెద్ద మొత్తంలో పెరిగింది మహిళా కార్మికులే. అది కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే. పెరిగింది కూడా ఐదు లక్షల మంది వరకు మహిళా కార్మికులే. ఈ డేటా అంతా చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. రెగ్యులర్‌ కార్మికులకు సరైన, లాభసాటి అయిన ఉపాధి దొరకడమే కష్టసాధ్యంగా మారుతున్న పరిస్థితుల్లో మరింత మంది మహిళలు పని వెతుక్కుంటూ వస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

పెరుగుతున్న నిరుద్యోగం

               ఎస్‌టిల్లో ఉపాధి అవకాశాలు తగ్గుతున్నప్పటికీ మరింత మంది పురుషులు, మహిళలు, పిల్లలు పని కోసం వెతుక్కుంటూ లేబర్‌ మార్కెట్‌లోకి ప్రవేశిస్తుండడం గణనీయంగా కనిపిస్తోంది. మొత్తం కార్మికుల్లో బాల కార్మికుల సంఖ్య తగ్గినప్పటికీ లేబర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించే బాలల సంఖ్య మాత్రం పెరిగింది. బాల కార్మికులు తగ్గుతున్నారంటే దానర్థం నయా ఉదారవాద ప్రభుత్వ విద్యా విధానాల ప్రభావం కారణమని భావించాల్సిన అవసరం కూడా లేదని, మరింత పనిచేయగలిగిన కార్మికులు లేబర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించడమే కాకుండా తక్కువ వేతనాలకు చేయడానికి కూడా సుముఖంగా ఉండడంతోనే బాల కార్మికుల సంఖ్య తగ్గుతోందని భావించాల్సి వస్తుందని పేర్కొంది. అందువల్ల, రెగ్యులర్‌ కార్మికుల కన్నా కూడా పని కావాలని కోరుతూ వచ్చే బాల కార్మికుల సంఖ్య ఎక్కువ ఉండడం మనం చూడవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రెగ్యులర్‌ పురుష, మహిళా కార్మికులు పెరగగా పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా మహిళా రెగ్యులర్‌ కార్మికులే పెరిగారు. రెగ్యులర్‌ కార్మికుల్లో పట్టణ పురుష కార్మికులు తగ్గుతున్న వాస్తవాన్ని గమనంలోకి తీసుకుంటే పురుష కార్మికులు మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి వెతుక్కుంటూ వెళ్ళిపోతుండడం కనిపిస్తోంది. ప్రధానంగా వ్యవసాయ పనుల వైపు వీరు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇలా పని కోసం వెతుక్కుంటూ వెళుతున్నారంటే వ్యవసాయ రంగ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించబడిందని కూడా అనుకోనక్కరలేదు. దానికన్నా కూడా తక్కువ వేతనాలు, సరిగా లేని పని పరిస్థితుల కారణంగా గ్రామీణ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గడానికి ఇది దారి తీసే అవకాశం ఉంది.
                  పైన పేర్కొన్న విశ్లేషణలో సూచించినట్లుగా, ఆదివాసీ కార్మికులు పెద్ద సంఖ్యలో లేబర్‌ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నారని జనాభా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, వారికి అక్కడ ఎలాంటి ఉపాధీ దొరకడం లేదు. అంటే, దీన్ని బట్టి చూస్తే ఆదివాసీలు రిజర్వ్‌ లేబర్‌లో పెద్ద సంఖ్యలో మిగిలిపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుత రూపంలో పెట్టుబడి దారీవాదం కొనసాగించాలంటే ఇది-ఈ రిజర్వ్‌ లేబర్‌ -అనేది చాలా కీలకం. ఆ రకంగా, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగితకు, పని కోరుతున్నా లభించని ఆదివాసీ కార్మికుల సంఖ్య పెరగడానికి, సమకాలీన పెట్టుబడిదారీ విధానం హయాంలో ఆదివాసీలకు ఏమీ లభ్యం కాని ధోరణికి మధ్య సంక్లిష్టమైన, వైవిధ్యమైన సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, ఆదివాసీ కార్మికుల మౌలిక హక్కుల కోసం ప్రజాస్వామ్య ఉద్యమాలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆదివాసీల్లో తమ రాజకీయపరమైన నిర్మాణాలను మరింత బలోపేతం చేయడం ద్వారా కూడా వారి హక్కులకై పోరాడాల్సి ఉంది. అయితే, ఆదివాసీ కార్మికుని మనుగడపై జరుగుతున్న నయా ఉదారవాద దాడిని తిప్పికొట్టేందుకు విశ్వసనీయమైన, ప్రగతిశీల సవాలును విసిరేలా అన్ని సామాజిక గ్రూపులకు చెందిన కార్మికుల మధ్య ఐక్యత నెలకొన్న నేపథ్యంలో ఈ పోరాటం చేపట్టాల్సిన అవసరం ఉంది.
                

Prajashakti Telugu News Paper Dated: 17/07/2014 

ఈ వెట్టి నుంచి విముక్తి ఎప్పుడు ? By రమేష్‌ బుద్దారం
                భారతీయ సమాజంలో పుట్టుక కారణంగా, వృత్తి కారణంగా కొందరికి దైవత్వాన్ని ఆపాదించి, మరికొందరికి హీనమైన స్థానాన్ని ఇచ్చింది. హెచ్చుతగ్గుల హోదానిచ్చే దారుణమైన కులవ్యవస్థ పునాదిగా, మను ధర్మ, పురుషాధిపత్య సమాజం కొందరిని నిచ్చెన మెట్ల వ్యవస్థలో అగ్రభాగాన ఉంచి అన్ని సౌఖ్యాలూ పొందుటకు వారు అర్హులని సూచిస్తూ మరికొందరిని వారి సేవకులని, వీరు వారి సేవలో ఉంటేనే వీరికి మోక్షం అనే కపట నీతిని బోధిస్తోంది. ఈ క్రమంలో ఎన్నో దళిత, బహుజన బడుగు జీవుల జీవితాలు ఒక వర్గం వారి సేవకే బలి చేయబడ్డాయి. అలాంటి ఒక కులమే పాకి పని వారు (పారిశుధ్య కార్మికులు). మేహతర్‌, బంగి, తోటి, వాల్మీకి అని వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలుగా పిలువబడినప్పటికీ వీరు చేసేది మాత్రం పాకీ పని. తరతరాలుగా విద్యకు, అభివృద్ధికి దూరంగా ఉంటూ, 66 సంవత్సరాల స్వతంత్ర దేశంలో, సాంకేతికంగా ఎన్నో శిఖరాలు అధిరోహించినప్పటికీ అనాదిగా చేపట్టిన పాకీ పనిని ఇంకా వీరితో చేయించడం దేశం, నాగరిక ప్రపంచ పౌరులందరూ సిగ్గుతో తలదించుకోవలసిన విషయం. మన దేశ ప్రభుత్వ, పౌరుల అమానవీయ మనుగడకు నిదర్శనం. భారత రాజ్యాంగం దేశ పౌరులందరూ సమానమని, కుల, లింగ, మత, వర్ణ భేదం, అంటరానితనం, వివక్ష మొదలైనవి ఎవరు పాటించినా ఆర్టికల్‌ 15, 17 ప్రకారం శిక్షింపబడతారని పేర్కొన్నప్పటికీ కులం పేరుతో వారు చేసే వృత్తి చేత ఈ కులం వారు నాగరిక సమాజంలో ఇంకా వివక్షను ఎదుర్కోవడం చాల హేయమైన విషయం.
                 చిన్న చీపురు కట్ట, ఒక రేకు, ఒక బుట్ట, సాధనాలుగా ప్రభుత్వం నడిపే డ్రై లెట్రిన్‌లు, ప్రైవేటు వ్యక్తుల మరుగుదొడ్ల నుంచి మనిషి మలాన్ని గంపలో ఎత్తుకుని మోసుకుంటూ ఊరి అవతల పెంట దిబ్బలలో వేయించడం ఎన్నో తరాలుగా మనం చూస్తున్న అణచివేత ప్రక్రియ. ఈ హేయమైన దురాచారం మన రాష్ట్రంలో అంత ప్రాచుర్యంలో లేకున్నా అభివృద్ధికి చిరునామాగా చెప్పుకునే గుజరాత్‌లో, ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఇంకా సజీవంగా ఉంది. ఇదే కాకుండా అనునిత్యం మన కళ్ళ ముందు రైల్వే పట్టాలపై, సెప్టిక్‌ ట్యాంక్‌లు, మురుగు కాలవలు, మొదలగు చోట్ల వీరిని చూస్తుంటాం. ఈ వృత్తిలో ముఖ్యంగా పురుషుల కంటే దళిత మహిళలు ఎక్కువగా ఉన్నారు.
                    1992లో వివిధ సామాజిక సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం భారతదేశంలో 13 లక్షల మంది చేతులతో మానవ మలాన్ని ఎత్తివేసే వృత్తిలో కొనసాగుతున్నట్లుగా నిర్ధారించుకొని ఈ పద్ధతిని నిర్మూలించాలని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం జరిగింది. అయితే వాద ప్రతివాదనల అనంతరం సుప్రీంకోర్టు ఈ పద్ధతిని ఒక మానవీయ దృక్పథంతో పరిశీలించి ఒక ప్రత్యేక తీర్పు ద్వారా డ్రై లెట్రిన్‌ల నిర్మాణ నిషేధిత చట్టం 1993 ఆఫ్‌ 46 ప్రకారం నేరంగా పరిగణిస్తూ శిక్షలు, జరిమానాలతో కూడిన ఒక చట్టం చేయడం జరిగింది. పాకీ పనిని నిషేధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంప్లారుమెంట్‌ ఆఫ్‌ మాన్యువల్‌ స్కావెంజర్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ డ్రై లెట్రిన్స్‌ ప్రొహిబిషన్‌ ఆక్ట్‌ 1993 తెచ్చారు, కానీ వివిధ కారణాల రీత్యా 1997 వరకు ఆ చట్టం అమలుకు నోచుకోలేదు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాకీ పని వారందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నేషనల్‌ స్కీం ఆఫ్‌ లిబరేషన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ అనే పథకాన్ని ప్రవేశ పెట్టారు. అయినప్పటికీ ఇది నిర్దేశించిన లక్ష్యాలను సాధించలేకపోయింది. ఆ తర్వాత క్రమంలో ఈ చట్టం అనుకున్న ఫలితాలు సాధించలేకపోవడం, పౌర సమాజం ముఖ్యంగా సఫాయి కర్మచారీ ఆందోళన్‌, ఇతర స్వచ్ఛంద సంస్థల ఒత్తిడి మూలంగా ఈ మధ్య కాలంలో ది ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ఎంప్లారుమెంట్‌ యాజ్‌ మాన్యువల్‌ స్కావెంజర్స్‌ అండ్‌ దెయిర్‌ రిహాబిలిటేషన్‌ ఆక్ట్‌, 2013 తెచ్చింది. పూర్వం గల చట్టానికి ఇది పూర్తిగా భిన్నమైనది. వారి పునరావాసం, ఆర్థిక, సామాజిక అభివృద్ధి మొదలగు అంశాలు ఈ చట్టంలో చాలా సూటిగా వివరించారు. ఇది పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవాల్సి ఉంది.
                     2001లో మన రాష్ట్రంలో సర్వే చేయగా 8,402 మంది సఫాయి కర్మచారులుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. వీరి చేత నిషేధింపబడిన 25,672 కమ్యూనిటీ డ్రై లెట్రిన్లనందు పాకీ పనిని చేయిస్తున్నారు. వీరు నూటికి నూరు శాతం షెడ్యూల్డు కులాలకు చెందిన దళితులు. వీరు దీనిని వంశపారంపర్యంగా చేస్తున్న పనే అని గుర్తించారు. కచ్చితమైన లెక్కలు లేకపోయినప్పటికీ మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎమ్‌పవర్‌మెంట్‌ 2002-03 గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా వీరి జనాభా దాదాపు 6,76,009. ఇందులో దాదాపు 95 శాతం మంది దళిత కులం వారని నిర్ధారించింది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందామని చెబుతున్న మన దేశంలో పాకీ పని చేసేవారు ఉండటం సిగ్గుపడాల్సిన విషయం. ఒక మనిషి విసర్జించిన దాన్ని మరొక మనిషి తన చేతులతో తీసి శుభ్రపరచాల్సిన అవసరం సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేటి సమాజంలో ఎంత మాత్రం కూడనిది. పాలకులు ఒక వైపు సామాజిక అభివృద్ధి, సమానత్వం గురించి మాట్లాడుతూ మరొక వైపు ఇలాంటి హేయమైన దురాచార నిర్మూలనకు కృషి చేయకపోవడం విడ్డూరం.
                     ఈ కార్మికులు సాంఘిక దురాచారాన్నే గాక తీవ్రమైన అనారోగ్య పరిస్థితిని కూడా ఎదుర్కొంటున్నారు. వారు ప్రతిరోజూ డ్రైయిన్ల (మురుగు కాల్వలు, గొట్టాలు) లోకి ఎలాంటి భద్రత, ముందు జాగ్రత్త చర్యలు, పర్యవేక్షణ, ఎలాంటి తక్షణ వైద్య సహాయం లేకుండా దిగి, మిథేన్‌, హైడ్రోజన్‌సల్ఫైడ్‌ వంటి హానికరమైన వాయువులను పీల్చి కాలేయ వ్యాధులు, చర్మ, శ్వాసకోశ వ్యాధుల భారీనపడి ఆకస్మిక మరణాలకు గురవుతున్నారు. అందులో ముఖ్యంగా బలవుతుంది పొట్టకూటి కోసం ఈ వృత్తి చేపట్టిన దళితులే. అంతర్జాతీయ సంస్థలైన మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన , జాతి తారతమ్య నిర్మూలన సదస్సు, స్త్రీల పట్ల అన్ని రకాల వివక్ష నిర్మూలన సదస్సు. మొదలగునవి కూడా ఈ విషయాన్ని చాల తీవ్రంగా పరిగణించాయి. తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన తీవ్రంగా జరుగుతుందని పేర్కొన్నాయి . ఇక వీరి సంక్షేమానికి చేపట్టిన చర్యలు అరకొరగానే ఉన్నాయి.
                         ఇక వీరి అభివృద్దికి జాతీయ షెడ్యూల్‌ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ, జాతీయ సఫాయి కర్మచారి ఆర్థికాభివృద్ధి సంస్థ, జాతీయ షెడ్యూల్‌ తెగల ఆర్థికాభివృద్ధి సంస్థల నుంచి రుణాలను అందించేందుకు చర్యలు చేపట్టి, తరతరాలుగా పేదరికం, నిరక్షరాస్యత , అంటరాని తనం, మొదలగు సామాజిక సమస్యలతో సతమతమవుతున్న ఈ పారిశుధ్య కార్మికుల పిల్లలకు స్కూల్‌ నుంచి ఉన్నత విద్య అందించాలి అప్పుడే రాబోయే తరాలు ఈ వెట్టి చాకిరి నుంచి బయట పడగలుగుతాయి. ఇవేమీ కాకుండా వీరి సర్వతోముఖాభివృద్ధికి అందుబాటులో ఉన్న వనరులు వినియోగించి వీరి సంక్షేమానికి రాజ్యం ఈ దిశగా చర్యలు చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీనితో పాటు సభ్య సమాజ పౌరులు, ఆలోచన విధానం లో మార్పు రావాలి, అప్పుడే రాజ్యాంగంలో పౌరులకు ఉద్దేశించిన కనీస హక్కులు సాకారమౌతాయి.

- Prajashakti Telugu News Paper Dated : 17/07/2014 

రిజర్వేషన్లు ఉండాల్సిందే - బి. విజయభారతి


Published at: 18-07-2014 01:05 AM
రిజర్వేషన్ల గురించీ కులనిర్మూలన గురించీ సాగుతున్న చర్చలు సమస్యలను మరింత జటిలం చేస్తూ సమసమాజ ఆవిర్భావాన్ని మరింత వెనక్కు నెడుతున్నాయి. భారతదేశంలో రిజ ర్వేషన్ల వ్యవస్థ అతి ప్రాచీన కాలం నుంచీ అంటే భా రతీయ/హిందూ ధర్మశాస్ర్తాల కాలం నుంచీ ఉన్నది. గౌరవప్రదమైన వృత్తులు కొన్ని కులాలకూ హీన వృత్తులు కొన్ని కులాలకూ రిజర్వు చేయబడ్డాయి. చాతుర్వర్ణ వ్యవస్థ భారతదేశ సంస్కృతిలో ప్రధానమైనది. బ్రిటిష్‌ వారి పాలనలోకి వచ్చే నాటికి ఈ దేశంలోని అన్ని రాజ్యాల్లోనూ/ సంస్థానాల్లోనూ చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. చాతుర్వర్ణాల్లో బ్రాహ్మణ వర్గం వారికి విద్యాసంబంధమైన వృత్తులు - దేవాలయాలకు సంబంధించిన వృత్తులు - ఉద్యోగాలు రిజర్వు అయ్యాయి. క్షత్రియులకు పాలనాపర వ్యాపకాలు - వైశ్యులకు వర్తక సంబంధ పనులు రిజర్వు అయ్యాయి. వీళ్ళందరకీ భూములుండేవి. సంపద ఉండేది. శూద్ర కులాలకు సేవక ధర్మం రిజర్వు చేశారు. వారిలో కొన్ని వర్గాలు వస్తూత్పత్తితో వ్యవసాయ పనులతో పై వర్ణాలకు దగ్గర అయ్యారు - కొందరు సేవక ధర్మానికే పరిమితం చేయబడి తమకు విధించిన పనుల్లో ఉండిపోవలసి వచ్చింది. ఇదంతా రిజర్వేషన్‌ వ్యవహారమే. కాలక్రమంలో ఈ వర్ణాలు శాఖోపశాఖలుగా కులాలుగా విస్తరించాయి. కులం అంటే ఒక సముదాయం. భారతదేశంలో వేద మతాన్ని కర్మకాండను నిరసిస్తూ జైన, బౌద్ధ ధర్మాలు తలెత్తిన కాలంలో జైన ధర్మాన్ని పాటించే జన సముదాయాల్లో అతి చిన్న విభాగాన్ని ‘కులం’ అనేవారట. తర్వాతికాలంలో బౌద్ధ, శైవ, వైష్ణవ, జైన ధర్మాలు పరస్పరం కలహించుకున్న చరిత్ర భారతదేశానికి ఉన్నది. అలా సంకుచిత పరిధిలో కులాల ఉనికి వ్యాప్తిలోకి వచ్చి ఉండొచ్చు. మతంఏదైనా ఇవి చాతుర్వర్ణాల రిజర్వేషన్లను అతిక్రమించలేదు. భారతదేశంలోని అధిక సంస్థానాలు బ్రిటిష్‌ ప్రభుత్వ ఏలుబడిలోకి వచ్చాకే సమాజంలో మానవ హక్కులు- అవకాశాల గురించి చర్చలు మొదలయ్యాయి. శూద్ర వర్ణాలకూ అప్పటికే ఏర్పడి ఉన్న పంచమ కులాల వారికీ మెరుగైన జీవనావకాశాల గురించి ఆలోచన మొదలైంది. వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం బ్రిటిష్‌ పాలకులకు కనబడింది. అందుకే మొదట వారు లేబర్‌ స్కూళ్ళు - కార్మికుల కోసం, కూలీల కోసం, మాలమాదిగల కోసం తెరిచారు. వారి సంక్షేమం కోసం లేబర్‌ డిపార్టుమెంట్‌ ఏర్పడింది. దానినే సాంఘిక సంక్షేమశాఖగా ఇప్పుడు చెప్పుకుంటున్నారు. రాజ్యాంగం పౌరులందరికీ సమాన అవకాశాలు/హక్కులు వాగ్దానం చేసింది గనుక నిమ్న వర్గాలుగా చెప్పబడే కొన్ని కులాల వారికి వారి సామాజిక స్థాయి పెరిగే వరకూ రిజర్వేషన్లు అవసరమయ్యాయి. శతాబ్దాలుగా అగ్రవర్ణాలు రిజర్వేషన్‌ సౌకర్యాలు అనుభవించి కొన్ని కులాలను కిందికి తొక్కివేశారు. ఇప్పుడు అణగారిన కులాలకు రిజర్వేషన్‌ మొదలై కొన్ని సంవత్సరాలు గడవలేదు. అవి సరిగ్గా అమలుకావటమూ లేదు. అయినా వీరి రిజర్వేషన్లపై అలజడి జరుగుతున్నది.
ఇంజనీరింగ్‌, మెడిసిన్‌లో మొదట్లో రిజర్వేషన్‌ నియమాలు కొంతలో కొంత పాటించటం వల్ల నేడు ఆ రంగాల్లో కింది కులాల వారు కొందరు కనిపిస్తున్నారు. దానితో ‘ప్రతిభ’ పదం ముందుకు వచ్చింది. ఇప్పుడు మెడికల్‌ విద్య సీట్ల కౌన్సిలింగ్‌లో, ఇతర ఉద్యోగాల ఎంపికలో కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మెరిట్‌లో వచ్చినా సీట్ల కేటాయింపు రిజర్వేషన్‌ లెక్కల్లోనే చేస్తున్నారు. దానివల్ల అర్హత మార్కులు పొందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సీట్లు తగ్గుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు మూసివేసే విధంగా కార్పొరేట్‌ పాఠశాలలు/ కాలేజీలు వర్ధిల్లేలా నిర్ణయాలు తీసుకుంటూ సామాన్యుల విద్యకు గండి కొడుతున్నారు. వర్ణవ్యవస్థ చట్ర ంలో రిజర్వేషన్లనూ, ప్రజాస్వామ్య వ్యవస్థ చట్రంలో రిజర్వేషన్లనూ సునిశితంగా అధ్యయనం చేయాలి. సమసమాజం - మానవహక్కులు అనే భావన ప్రజలలో పాదుకొల్పవలసిన బాధ్యత రాజ్యానిదే. ప్రత్యేకంగా కుల నిర్మూలనకు కోట్లు ఖర్చు పెట్టక్కరలేదు. సమధర్మం, సమన్యాయం అన్నివర్గాల ప్రజలకూ సమంగా అందిస్తే కులాల అంతరాలు అవే పోతాయి.
- బి. విజయభారతి

Andhra Jyothi Telugu News Paper Dated: 18/7/2014 

సమస్య వెంటే పరిష్కారం! - రంగనాయకమ్మ


Published at: 13-07-2014 00:58 AM
సమాజంలో ఉన్న ప్రతీ మనిషీ శ్రమ చెయ్యాలని గ్రహించడమూ; ప్రతి మనిషీ శారీరక - మేధా శ్రమలు రెండూ చెయ్యాలని గ్రహించడమూ, మొదటి సంగతి. ఆ మార్పుల కోసం, శ్రామిక వర్గ పోరాటం అత్యవసరమని గ్రహించడం, మరో సంగతి. ఏ గ్రహింపూ లేకుండా, ‘కుల విధానాన్ని  తక్షణం నిర్మూలించాలి’ అంటూ అరిచే నినాదాలు ఆ నిర్మూలనకు ఏ మాత్రమూ పనికి రావు. పైగా ఆ శబ్దాలు, సిద్ధాంత శబ్ద కాలుష్యాన్ని మాత్రమే దట్టంగా సృష్టిస్తాయి.
‘కులాల విధానం’ అనే సమస్యకి పరిష్కారం, కులాంతర వివాహాలే. కుల విధానాన్ని అంగీకరించని వారందరూ గ్రహించవలసింది ఇదే. సమస్య ఉంటే, దాని వెంటే పరిష్కారం ఉంటుంది. సమస్య వల్ల బాధపడే వాళ్ళకి పరిష్కారం తెలియలేదంటే సమస్యే తెలియలేదని అర్థం.
కుల విధానం పుట్టుక గురించి మాట్లాడే వారు కొందరు, ‘చాతుర్వర్ణాలు’ అనే పేరుతో ‘బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర’ అంటూ మొదలు పెడతారు. అలా మొదలు పెట్టి, ఆ నాలుగు వర్ణాలూ, ఏ శ్రమల తోటీ, ఏ వృత్తుల తోటీ సంబంధాలు లేకుండా పుట్టుకొచ్చినట్టు చెప్పుకొస్తారు. ప్రతీ వర్ణమూ అనేక విభాగాలుగా వేరు వేరు వృత్తుల్లో నిమగ్నమై ఉండడమూ; ‘శూద్రులు’ అనే వర్ణం, అనేకానేక శారీరక శ్రమలు చేసే వృత్తులు గానూ, ప్రతీ వృత్తీ ఒక కులం గానూ ఏర్పరడమూ; ఇవన్నీ సమాజంలో స్పష్టంగా కనపడుతూ ఉన్నవే.
బట్టలు ఉతికే వృత్తి ఒక కులం. క్షవరాలు చేసే వృత్తి ఇంకో కులం. చేపలు పట్టే వృత్తి మరో కులం. నేతా, కుట్టూ, వేరు వేరు కులాలే. వృత్తులు మారినా, కలిసినా, కులాలు నిలబడే ఉండడం సంప్రదాయంగా సాగుతోంది. ఒక వృత్తినీ, దాని కులం పేరునీ చూస్తే, వృత్తి మొదటిదో, కులం మొదటిదో, తేలికగానే గ్రహించవచ్చు. శ్రమలే లేని కాలంలో వృత్తులు ఉండవు. వృత్తులే లేని కాలంలో, దానికి కులం పేరు ఏర్పడదు. ఒక కులం గల కుటుంబంలో ఒక పెళ్ళి జరగాలంటే, అదే కులం గల, అంటే అదే వృత్తి గల వ్యక్తే, ఆ కుటుంబంలోకి రావడం జరుగుతోంది. వివాహ సంబంధాలు ఏ కులానికి ఆ కులంలోనే ఏర్పడాలి - అనే సంప్రదాయానికి మూల కారణం, ‘ఒకే రకం వృత్తి’ అనేదే. అంటే, వృత్తిని బట్టే కులం. కులాన్ని బట్టే వివాహ సంప్రదాయం. అంటే, కులాలు పోవాలంటే, వృత్తుల విధానంలో పెద్ద మార్పు జరగాలని అర్థం.

‘కులాలు’ అన్నప్పుడు, అవి కేవలం వేరు వేరు భిన్న వృత్తులు మాత్రమే కాదు; ఆ వృత్తులకూ, వాటిని బట్టి ఆ కులాలకూ, చిన్నా - పెద్దా గుర్తింపులు కూడా ఏర్పడ్డాయి. అయితే, ‘వృత్తులు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. ఈ కుల విధానం ఈ దేశంలోనే ఎందుకు ఉంది?’ అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రశ్నలు ఎప్పుడూ మంచివి. కారణాల్ని గ్రహించాలనే ప్రయత్నాలు అవి. ఇతర దేశాల్లో ఉన్న వేరు వేరు చెత్త సంప్రదాయాలు ఈ దేశంలో లేవు. ఒక దేశంలో ఉన ్న మంచిగానీ చెడ్డగానీ, అదే రకంగా ప్రతీ చోటా ఉండడం లేదు. ఇక్కడి చెడ్డని మించిన చెడ్డ, అక్కడ ఉండవచ్చు. అక్కడి మంచిని మించిన మంచి, ఇక్కడ ఉండవచ్చు. ‘ఇక్కడ ఉన్నది అక్కడ లే దేం?’ ప్రశ్నకి జవాబు, ‘‘అక్కడ ఉన్నది ఇక్కడ లేదేం?’’ అనేదే.    మన దగ్గిర ఉన్నది చెడ్డే అని తెలిస్తే, దాన్ని మనం మార్చుకోవాలి ‘కుల విధానం’ పోవలిసిందే. కానీ ఎలాగ? పరిష్కారం కావాలంటే, సమస్యని సరిగా అర్థం చేసుకోవాలి.
ఇద్దరు వేరు వేరు కులాల వాళ్ళు స్నేహంగా ఉన్నా, ఆ కులాలు పోయినట్టు కాదు. ఆ ఇద్దరూ రోజూ కలిసి భోజనాలు చేస్తూ ఉన్నా, ఆ కులాలు పోయినట్టు కాదు. కాలేజీల్లో, స్నేహాలూ, హోటళ్ళలో పక్కపక్కనే కూర్చుని భోజనాలూ, ఇవన్నీ సాగుతూనే ఉన్నాయి. అయినా కులాలు కులాల్లాగే ఉంటున్నాయి.

ఇద్దరు చిన్నా పెద్దా కులాల స్ర్తీ పురుషులు, రహస్య సంబంధాలతో ఉంటే, కులాలు పోయినట్లు కాదు. ఆ సీ్త్ర పురుషులు బహిరంగంగా, పెళ్ళి తంతు ఉన్నా లేకపోయినా, భార్యాభర్తలుగా, కుటుంబ సంబంధాలతోనే, పిల్లలకు తల్లిదండ్రులు గానే, కలిసి జీవిస్తూ ఉంటే, అటువంటి సంబంధంలో బైల్దేరే పిల్లలకు ఏ కులాలూ లెక్కలోకి రావు. కానీ, రిజర్వేషన్‌ పద్ధతి సాగుతూనే ఉంటే, తండ్రి కులమో, తల్లి కులమో, ఏది చిన్న కులమైతే అది, ఆ పిల్లలకు కూడా చుట్టుకుంటుంది. తల్లి దండ్రులు కులాంతర వివాహం చేసుకున్నా, రిజర్వేషన్ల ద్వారా, పిల్లల తరానికి కూడా చిన్న కులాలు నిలిచిపోతాయి!
కులాంతర వివాహాలు, నూటికొకటో కోటి కొకటో జరగడం గాక, నిరభ్యంతరంగా జరిగే మార్గం ఏది? ఆ మార్గం ఏమిటో తెలుసుకోవాలంటే, కనీసం 100 కులాంతర వివాహాల్ని పరిశీలించి చూడాలి. ఈ పరిశీలనలో, రెడ్డి యువతికి మాల యువకుడితో పెళ్ళీ; బ్రాహ్మణ యువతికి, మాదిగ యువకుడితో పెళ్ళీ; వైశ్య యువకుడికి, మంగలి యువతితో పెళ్ళీ; ఇలా ఆ 100 పెళ్ళిళ్ళూ చిన్నా పెద్దా కులాల మధ్య జరగడం కనపడతాయి. అందులో కారణాల కోసం వెతికితే, చిన్న కులాల వ్యక్తులకు, వారి కుల వృత్తులు మారిపోవడమే కనపడుతుంది. ఒక బ్రాహ్మణ యువతికీ, ఒక టీచరుగా ఉన ్న మంగలి యువకుడికీ పెళ్ళి జరిగిందంటే, ఆ చిన్న కులం యువకుడికి విద్యా స్థాయి పెరిగి, తన కుల వృత్తి వదిలి, పై స్థాయి ఉద్యోగిగా మారడమే, పెద్ద కులం యువతితో పరిచయం, చివరికి పెళ్ళికి అంగీకారం!
చిన్న కులాల వ్యక్తులు, తమ కుల వృత్తుల్ని వదిలి వేస్తే, అప్పుడు సమాజానికి ఆ వృత్తులతో అవసరం ఎలా తీరుతుంది? ఈ నాడైతే, చిన్న కులాల్లో ఇంకా కుల వృత్తుల్ని వదలని వాళ్ళ ద్వారానే, సమాజ అవసరాలు తీరుతున్నాయి. కానీ, ఒక క్షవరాల కులంలో అందరూ కుల వృత్తిని వదిలేస్తే, అప్పుడేమవుతుంది? - సమాజానికి అవసరమైన ప్రతీ శ్రమనీ నిలబెట్టుకునే కొత్త విధానాన్ని మార్క్సిజం చెపుతుంది. చిన్నా - పెద్దా వృత్తులుగా సాగుతూ ఉన్న శ్రమ విభజనని, ‘సమానత్వ శ్రమ విభజన’గా మార్చాలనేదే ఆ కొత్త విధానం. కొత్త విధానమే లేకపోతే, అట్టడుగు శ్రమలు చేసే కులాలకు విముక్తి ఎలాగ?
ఈనాడు, చిన్న కులాల కుటుంబాల్లో మార్పులు, రిజర్వేషన్ల ద్వారా జరగడం నిజమే. కానీ ఆ మార్పు, ఆ కులాల జనాభాలో అత్యల్ప సంఖ్యకి మాత్రమే దొరుకుతుంది. రిజర్వేషన్లలోనే క్రీమీ లేయర్‌ పద్ధతిని ప్రవేశపెడితే, ఆ రకమైన మేలు కూడా ఎక్కువ జనాభాకి అందదు. భారత దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పేర్లతో ఉన్న మొత్తం జనాభాని చూస్తే, ఆ సంఖ్యలో మెజారిటీకి రిజర్వేషన్ల ద్వారా జరిగే మేలేమీ ఉండదు. పెద్ద కులాల పేదల్లో జరిగినట్టే చిన్న కులాల్లో కూడా, పరిశ్రమల్లో ఉద్యోగాలూ జీతాలూ సంపాదిస్తూ ఎదగడం అంటే, భూస్వాముల కిందా పెట్టుబడిదారుల కిందా వేతన బానిసలుగా బతకడమే. అదే ఆ ఎదుగుదలకి అర్థం! ఈనాడు కూడా, అనేక పరిశ్రమల్లో పని పనిచేసే ఇంజనీర్ల వంటి ఉద్యోగులకు కూడా, రోజుకి 16 గంటల పని, తప్పనిసరి నియమం!
ఒక చిన్న కులస్తుడు, పెట్టుబడిదారుడిగా ఎదిగి, లేదా రిజర్వేషన్ల మార్గం ద్వారా ప్రభుత్వంలో మంత్రిగా మారి, స్వంత భవనాలతో, స్వంత పెట్టుబడులతో ఎదిగిపోయినప్పుడు, తన పిల్లల వివాహాల కోసం, తన కులంలోనే పేదల వేపు చూడడు. పెద్ద కులాల్లో పేదల వేపు కూడా చూడడు. తనతో సమాన ఆర్థిక స్థాయి గల సంబంధాల కోసమే చూస్తాడు. పెద్ద కులాల వాళ్ళయినా చేసేది అక్షరాలా అదే. అంటే, యజమాని వర్గంగా ఎదిగిన ఆ చిన్నా - పెద్దా కులాల వాళ్ళకి, కులాల దృష్టి పోయి, యజమానుల వర్గ దృష్టే ప్రధాన దృష్టి అవుతుంది.

రాబోయే కాలం అంతా ప్రైవేటు పరిశ్రమల కాలమే. శ్రామికులు ఏ కులాల వారైనా, వారి డిగ్రీల గురించీ, జీతాల గురించీ, నిర్ణయాలన్నీ పారిశ్రామికవేత్తల ఇష్టాయిష్టాలే. అప్పుడు చిన్న కులాల్లో అల్పసంఖ్యని కూడా రిజర్వేషన్లు రక్షించలేవు. నిత్యం బానిస బతుకులూ, నిరుద్యోగాలూ, అడుగు స్థాయి వృత్తులూ, కులాల స్తిరత్వాలూ, అన్నీ వెనకడుగులే.
పెద్ద కులాల్లో అయినా, చిన్న కులాల్లో అయినా, అత్యధిక జనం శ్రామికులే. అందరూ తమ కులాల్ని గురించే తలపోస్తూ, కుల సంఘాలు పెట్టుకుంటూ, ‘కుల విధానాన్నే’ మరింత స్థిరంగా నిలబెట్టుకుంటున్నారు. చిన్న కులాల వారు రిజర్వేషన్ల భ్రమలతో, తమ కులాలే తమకు శాశ్విత రక్షణ అనుకుంటున్నారు. తాము ఏ వర్గ సంబంధాల్లో, ఏ స్తితిలో ఉన్నారో, గ్ర హించడం లేదు. రిజర్వేషన్లని ఉపయోగించుకుంటూ కూడా వర్గ స్పృహతో ఉండాలని గ్రహించడం లేదు. .
చిన్న కులాల జనాభాకి తాము ఘోరమైన ‘శ్రమ దోపిడీ’కి గురి అవుతున్నామని తెలీదు. దాని వల్ల దోపిడీ శ్రమ - విభజనలో చిక్కి ఉన్నామనీ తెలీదు. పిల్లి నోటిలో చిక్కిన ఎలక కూడా ఆత్మరక్షణ కోసం పెనుగులాడుతుంది. ఆ మాత్రపు రక్షణ స్పృహ కూడా శ్రామిక జనాభాకి లేదు.

కుల విధానమే కాదు. ఇంకా ఉన్న ఏ చెడ్డ విధానం అయినా గతించేది ఎవరి ద్వారా? సమస్య ఎవరిదో వారి ద్వారా.
మేధావులు బైల్దేరి, ‘కుల విధానం తక్షణం నశించాలి. దాన్ని వెంటనే తీసివెయ్యాలి’ అని ఘోషిస్తారు. దారి మధ్యలో ఉన్న ముళ్ళపొదని తక్షణం తవ్వి పైకి లాగి దాన్ని దారికి దూరంగా విసిరెయ్యడం ఎంత సాధ్యమో, కుల విధానాన్ని తీసివెయ్యడం అంత సాధ్యం అనుకుంటారు.
‘‘ఏ పెద్ద కులం వ్యక్తి అయినా, చిన్న కులం వ్యక్తినే పెళ్ళి చేసుకోవాలి’ అని చట్టం చెయ్యడం సాధ్యం కాదు. అలాంటి చట్టమే ఉంటే, పెద్ద కులాల వాళ్ళు పెళ్ళిళ్ళే మానుకుంటారు. పెళ్ళిళ్ళు లేని విధానాన్ని పెద్ద కులాల మధ్యనే పాటిస్తారు.
కులాంతరాల భార్యాభర్తలు, తమ పిల్లలకి తామే ఏదో ఒక కులాన్ని అంటగట్టడం తప్పకపోతే, కుల నిర్మూలన మాట ఎత్తడం దండగ.
సమాజంలో ఉన్న ప్రతీ మనిషీ శ్రమ చెయ్యాలని గ్రహించడమూ; ప్రతీ మనిషీ శారీరక - మేధా శ్రమలు రెండూ చెయ్యాలని గ్రహించడమూ, మొదటి సంగతి. ఆ మార్పుల కోసం, శ్రామిక వర్గ పోరాటం అత్యవసరమని గ్రహించడం, మరో సంగతి.
ఏ గ్రహింపూ లేకుండా, ‘కుల విధానాన్ని తక్షణం నిర్మూలించాలి’ అంటూ అరిచే నినాదాలు ఆ నిర్మూలనకు ఏ మాత్రమూ పనికి రావు. పైగా ఆ శబ్దాలు, సిద్ధాంత శబ్ద కాలుష్యాన్ని మాత్రమే దట్టంగా సృష్టిస్తాయి.

- రంగనాయకమ్మ

Andhra Jyothi Telugu News Paper Dated: 13/7/2014 

రాజ్యంతోనే కుల నిర్మూలన! - డాక్టర్‌ కదిరె కృష్ణ


Published at: 04-07-2014 01:02 AM
‘కుల నిర్మూలన ఎలా సాధ్యం?’ శీర్షికన (ఆంధ్రజ్యోతి, జూన్‌ 24) ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ రాసిన వ్యాసం చాలా గందరగోళంగా ఉంది. వినోద్‌ రాసిన ఈ వ్యాసం ‘కులనిర్మూలనతోనే న్యాయం’ శీర్షికన (ఆంధ్రజ్యోతి, జూన్‌ 13) కల్పనా కన్నభిరాన్‌ రాసిన వ్యాసానికి స్పందన. ఈ వ్యాసం ద్వారా వినోద్‌కుమార్‌ సైద్ధాంతిక గందరగోళాన్ని సృష్టించడంతో పాటు, సామాజిక అవగాహనాలోపాన్ని మరింత పెంచిపోషించే ప్రయత్నం చేశారు. తెలంగాణ సమాజంలో సాంఘిక, ఆర్థిక అసమానతలు తొలగాలంటే కులనిర్మూలన జరిగి తీరాలన్న కల్పనా కన్నభిరాన్‌ ప్రతిపాదనను స్వాగతించాలంటాడు వినోద్‌. ఆ వెంటనే తిరిగి కుల నిర్మూలన జరుగనే జరుగదు అని ధ్రువీకరణ పత్రాన్ని జారవిడుస్తాడు. కులనిర్మూలనే జరుగదు అనుకున్నప్పుడు ప్రొ. కల్పనా కన్నభిరాన్‌ కుల నిర్మూలనా ప్రతిపాదనను తిరస్కరించాలి గానీ, స్వాగతించడమేమిటి? ‘కల్పనా కన్నభిరాన్‌ మంచి ఉద్దేశంతోనే కులనిర్మూలన జరగాలని కోరుకోవచ్చు కానీ, అది సాధ్యం కాదు... ప్రొఫెసర్‌ కల్పనా కన్నభిరాన్‌ అమాయకంగా, నిజాయితీతోనే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక న్యాయం జరగాలంటే కుల నిర్మూలనతోనే అది సాధ్యం అని రాశారు, కానీ తెలంగాణలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కులాన్ని నిర్మూలించడం ఎవరి వల్లా కాదు’ అంటారు. ఆమె అమాయకత్వం ఏమో గానీ వినోద్‌ ఆ వెనువెంటనే కులం ముల్లును కులంతోనే తొలగించాలి అని ప్రతిపాదించి తన అమాయకత్వాన్ని, అవగాహనా రాహిత్యాన్ని చాటుకున్నారు. కుల నిర్మూలన పట్ల పాలకులకు చిత్తశుద్ధి లేదని తెగ వాపోతారు సదరు వ్యాసకర్త. కుల నిర్మూలన ఎవరి వల్లా కాదని సూత్రీకరించి, వల్లకాని విషయానికి పాలకులకు చిత్తశుద్ధి లేదని చెప్పడం దేనికి నిదర్శనం? ‘పాలకులకు కులాన్ని నిర్మూలించడం అసలే ఇష్టం లేదని మరింత ఆవేదనను వెల్లగక్కారు’. సాధ్యం కాని దానికి ఇష్టంతో చేస్తే మాత్రం సాధ్యం అవుతుందా? కులనిర్మూలన జరగదు లేదా సాధ్యం కాదు. వినోద్‌ మాటల్లో చెప్పాలంటే ‘ఎవరి వల్లా కాదు’. ఇదే నిజమైతే డా. అంబేద్కర్‌ ‘కుల నిర్మూలన’ను ఎందుకు ప్రతిపాదించినట్టు? తన జీవితాంతం కుల నిర్మూలన కోసమే ఎందుకు పరితపించినట్టు? ఇక గాలి వినోద్‌ కుమార్‌ వాక్రుచ్చినట్టు ‘కులాధారిత రిజర్వేషన్లు ఉన్నంతకాలం కుల నిర్మూలన జరగదు’ ఇది పాక్షిక సత్యమే కానీ పూర్తిగా వాస్తవం కాదు. రిజర్వేషన్లు కూడా కులనిర్మూలనలో భాగమే! వేల సంవత్సరాలుగా కుల వ్యవస్థ చేత విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలకు ఎడంగా ఉంచబడడం చేతనే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు అన్ని రంగాల్లో వెనుకబడ్డాయి. అందుచేత భూమి, పరిశ్రమలు, ఇతర అన్ని రంగాలలో వేల ఏళ్ల ముందున్న ఆధిపత్య కులాలతో పోటీ పడలేరు కనుకనే ఈ వర్గాలకు రిజర్వేషన్ల కల్పన అనివార్యమయింది. అంటే Equa lity among the inequalsజూటను సాధించడమన్నమాట. ఇది రాజ్యాంగస్ఫూర్తి కూడా. ఈ రిజర్వేషన్లు లేకపోతే ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండేది. రిజర్వేషన్లు ఉన్నందుకే విద్య, తద్వారా ఉద్యోగం, ఉపాధి ఫలితంగా ఆర్థిక వెసులుబాటు సాధ్యమైంది. ఆ వెసులుబాటు మరింత వెసులుబాటును కల్పించి అన్ని రంగాలలో సాధ్యమైనంత మేరకు ప్రాతినిధ్యం కల్పించింది. ఆ ప్రాతినిధ్యమే తన జాతి ప్రజలకు తిరిగి వెసులుబాటును కల్పించాలి. ఇదే రిజర్వేషన్ల పరమావధి. వెసులుబాటు పొందినవారు ఆ సౌకర్యం లేని వారికి ప్రతినిధి. అతని కర్తవ్యం ఏ కులానికి ప్రతినిధిగా వచ్చాడో, ఆ కులాల ప్రజల అభివృద్ధికి కృషి చేయడంగా భావించవచ్చు. మహాపురుషుల పరిభాషలో చెప్పాలంటేPay back to the Society. ఈ సూత్రం మొత్తం అణగారిన వర్గాలకు వెలుగుగా నిలవాలి. అప్పుడు ప్రస్తుతం ఉన్నదానికి రెట్టింపు శాతం విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థికవెసులుబాటు కలుగుతుంది. ఈ వెసులుబాటే సాధికారతకు దారితీస్తుంది. ఈ సాధికారతే ఆత్మగౌరవాన్ని తద్వారా రాజకీయ అధికారాన్ని సమకూరుస్తుంది. తద్వారా సామాజిక సమానత్వం అనగా కుల నిర్మూలన సాధించబడుతుంది. కానీPay back to the Society దగ్గరే ఈ సమాజం ఆగిపోయింది. ఇది ఎవరి బాధ్యత? ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే రిజర్వేషన్లు ఖచ్చితంగా కుల నిర్మూలనలో భాగంగా కల్పించబడినవే. రిజర్వేషన్లు సమాజగతమే కానీ వైయక్తికం కాదు.
డాక్టర్‌ కదిరె కృష్ణ

Andhra Jyothi Telugu News Paper Dated : 4/07/2014 

కుల నిర్మూలన ఎలా సాధ్యం? By డా. గాలి వినోద్ కుమార్


Published at: 24-06-2014 13:41 PM
కుల నిర్మూలనతోనే న్యాయం' శీర్షికన జూన్ 13న 'ఆంధ్రజ్యోతి'లో ప్రొఫెసర్ కల్పనా కన్నాభిరాన్ రాసిన వ్యాసం యావత్ తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా ఉంది. తెలంగాణ సమాజంలో సాంఘిక, ఆర్థిక, అసమానతలు తొలగాలంటే కుల నిర్మూలన జరిగి తీరాల్సిందేనని ఆమె సూచించారు. దాన్ని స్వాగతించాల్సిందే. అయితే కులాన్ని ఎలా నిర్మూలించవచ్చో కల్పనా ఈ వ్యాసంలో రాసి ఉంటే బాగుండేది. ఈ దేశంలో చార్వాకులు, బుద్ధుడు, కబీర్, మహాత్మా జ్యోతిబా ఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, డా. అంబేద్కర్‌ల వరకు కులనిర్మూలన జరగాలని ఉద్యమించిన వారే. కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడున్న హిందూ అగ్రవర్ణ ఆధిపత్య రాజ్యంలో పాలకులకు కుల నిర్మూలన పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా కుల నిర్మూలన ఎలా సాధ్యం? ఒకవైపు కుల నిర్మూలన జరగాలని కోరుకునే అంబేద్కరైట్‌లు సయితం మరోవైపు ఆ కులం ఆధారంగా ఏర్పడిన రిజర్వేషన్లు ఉండాలని కోరుకుంటారు. కుల ఆధారిత రిజర్వేషన్లు కోరుకున్నంత కాలం కుల నిర్మూలన సాధ్యం కాదు.
ఈ దేశంలో ఒక్క బహుజన సమాజ్ పార్టీకి తప్ప మిగతా ఏ రాజకీయ పార్టీకి కుల వివక్ష, కుల నిర్మూలన పట్ల స్పష్టమైన అవగాహన లేదు. కల్పనా కన్నాభిరాన్ మంచి ఉద్దేశ్యంతోనే కుల నిర్మూలన జరగాలని కోరుకోవచ్చు కానీ అది సాధ్యం కాదు. కులాన్ని చెప్పొద్దు, కులాన్ని వాడొద్దు, కులాన్ని ధ్వంసం చేయాలని కోరుకున్న మహనీయుల సూక్తుల్ని భారత ప్రజలెవరూ పాటించడం లేదు. ముఖ్యంగా పరిపాలకులకు కులాన్మి నిర్మూలించడం అసలే ఇష్టం లేదు. కులం ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళు కుల నిర్మూలనకు ఇష్టపడరు. కులం ద్వారా బాధలు పడుతున్న వాళ్ళు కుల నిర్మూలన జరగాలని కోరుకుంటారు. కానీ కుల ఆధారిత రిజర్వేషన్లు వదులుకోరు. కాబట్టి కులం ద్వారా బాగుపడుతున్న వాళ్ళు బాధితులు సయితం కులాన్ని వదులుకునే పరిస్థితి లేదు. అలాంటప్పుడు కుల నిర్మూలన ఎలా సాధ్యం? కాబట్టి కుల నిర్మూలన అనే అంశాన్ని పక్కన పెట్టి ఏ కులం అనే ఆయుధంతో, బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు లబ్ధిపొందుతున్నారో అదే ఆయుధంతోనే కులం బాధితులు కూడా లబ్ధి పొందే సూత్రాన్ని బహుజన ఉద్యమ పిత కాన్షీరాం మనకు అందించి ఫలితాలను సాధించిపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో ఆయన చేసిన ఈ ప్రయోగం సఫలం అయి దేశ వ్యాప్తంగా స్ఫూర్తిని రగిలించింది. తెలంగాణ రాష్ట్రంలో అది ఎందుకు సాధ్యం కాలేదు? అందుకే తెలంగాణ, సీమాంధ్రకు ఒక కాన్షీరాం కావాలి. శ్రీకృష్ణ కమిటీ లెక్కల ప్రకారం 93.8 శాతం జనాభా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత మైనార్టీలదే. తెలంగాణ రాష్ట్ర సాధనలో వీరే కీలక భూమిక పోషించారు.
ఉద్యమాలు చేసింది వీళ్ళే, ఆత్మబలిదానాలు చేసిందీ వీరే, కేసుల పాలు అయింది ఈ వర్గాలే అయినా ఒక్క శాతం జనాభా కూడా లేని వెలమ సామజిక వర్గం అధికారాన్ని సాధించింది. ఇదెలా సాధ్యం అయింది? ప్రొఫెసర్ కల్పనా అమాయకంగానిజాయితీతోనే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక న్యాయం జరగాలంటే కుల నిర్మూలనతోనే సాధ్యం అని రాశారు. కానీ తెలంగాణలోనే కాదు యావత్ భారతదేశంలో నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కులాన్ని నిర్మూలించడం ఎవరి వల్ల కాదు. అందుకే కులం అనే ముల్లును కులంతోనే తొలగించాలి. కులం ఉన్నంత వరకు కులం ద్వారా ప్రయోజనం పొందుతున్న వారిని చూసి కులం ద్వారా బాధితులైన వారు కూడా ఎలా కులాన్ని ఉపయోగించి ప్రయోజనం పొందుతారో ఆలోచించాలి. కృష్ణ మాదిగకు కులాన్ని ఎలా వాడుకోవాలో అర్థం కాకపోవడం వల్లనే ఆయన మాదిగలకు రిజర్వేషన్లు సాధించలేకపోయారు. బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య, బీసీ స్వతంత్ర రాజకీయ వేదికను తయారు చేయడం కంటే రిజర్వేషన్లకే బీసీ ఉద్యమాన్ని పరిమితం చేయడం వలన తమిళనాడులో డీఎంకే సాధించిన విజయాలను ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణయ్య సాధించలేకపోయారు. డా.బి.ఆర్. అంబేద్కర్ కూడా చిన్న రాష్ట్రాల్లో చిన్న కులాలు అధికారాన్ని చేపట్టాలని ఆశించారు. దళిత, బీసీ నాయకుల వైఫల్యం కారణంగా ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ అధికారాన్ని చేపట్టారు. వీరికి ప్రత్యామ్నాయంగా దళిత, బీసీ మైనార్టీలు రాజకీయ పోరాటాన్ని చేసి ఉంటే ఈ వర్గాలు ఇటు తెలంగాణలో అటు సీమాంధ్రలో అధికారాన్ని సాధించేవి.

న్యాయశాస్త్ర అధ్యాపకులు, ఓయూ

Andhra Jyothi Telugu News Paper Dated: 24/06/2014