Friday, November 30, 2012

ఉప ప్రణాళికలు--Namasete Telangana Sampadakiyam


ఉప ప్రణాళికలు

దళితులు, గిరిజనుల ఉప ప్రణాళికలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టడం హర్షణీయం. దేశ చరివూతలోనే ఇట్లా ఉప ప్రణాళికను చట్టబద్ధం చేయడం ఇదే మొదలు. అయితే ఇందుకు గర్వపడాల్సింది మాత్రం ఏమీ లేదు. దళితుల, గిరిజనుల ఉప ప్రణాళికలను కొన్నిరాష్ట్రాలు సమర్థవంతంగా,నిజాయితీతో అమలు చేస్తుండగా, మన రాష్ట్రం మాత్రం విఫలమైంది. నిధులు దారి మళ్ళడంపై దళిత సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఈ ఒత్తిడి వల్లనే రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించ వలసి వచ్చింది. అందువల్ల ఈ బిల్లును ప్రవేశ పెట్టడం దళితులు పోరాడి సాధించిన విజయం. అయితే ఈబిల్లులో ఇంకా కొన్ని లోపాలున్నాయి. శాసనసభలో సాగే చర్చలో వీటిని గుర్తించి చట్టాన్ని మరింత పకడ్బందీగా రూపొందిస్తే బాగుంటుంది. దళితుల, గిరిజనుల ఉప ప్రణాళికలను అమలు చేయడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో చట్టబద్ధత కల్పించడం తప్పనిసరైంది. షెడ్యూల్డు కులాలు, తెగలకు జనాభాకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపు జరపడంతో సరిపోదు. అమలు జరపడాని కి ఎటువంటి వ్యవస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నారు, అమలు జరగకపోతే తీసుకునే చర్యలేమిటనేది ప్రధానం. తాజా బిల్లు ప్రకారం- షెడ్యూల్డు కులాల, తెగల అభివృద్ధి మండలి విధాన నిర్ణయాలలో రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. పథకాల రూపకల్పన, అమలులో సూచనలు ఇస్తుంది. వివిధ శాఖల ఉపప్రణాళికా ప్రతిపాదనలను ఆమోదిస్తుంది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేసే ఈ మండలి ఏడాదికి రెండుసార్లు సమావేశమవుతుంది. నోడల్ ఏజెన్సీలు ఆయా శాఖల సహాయంతో సంధాన, సమన్వయ పాత్ర పోషిస్తాయి. అమలు, పర్యవేక్షణలను సమీక్షిస్తాయి. విధినిర్వహణలో లోపం ఉంటే శిక్షించడం, ఉత్తమ సేవలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల జవాబుదారీతనాన్ని ప్రవేశ పెట్టినట్టు అవుతున్నది. నిజానికి వ్యవస్థాగత ఏర్పాటు ఇప్పుడు లేదని కాదు. ఇప్పటి వరకు ఉన్న ఏర్పాట్ల ప్రకారం- ముఖ్యమంత్రి చైర్మన్‌గా అపెక్స్ కమిటీ ఉంటుంది. నోడల్ ఏజెన్సీలతో పాటు జిల్లా డివిజన్, మండల స్థాయిలో పర్యవేక్షక కమిటీలు కూడాఉంటాయి. ఇవన్నీ నిర్ణీత వ్యవధిలో సమావేశాలు జరుపుతుండాలె. కానీ చిత్తశుద్ధితో అమలు జరగడం లేదు. అందుకే దళితులు చట్టబద్ధత కోసం పట్టుపట్టి పోరాడారు. 

ఉప ప్రణాళికలకు చట్టబద్ధత కల్పించడం పట్ల సంతృప్తి వ్యక్తమవుతున్నప్పటికీ, ఈ బిల్లు లోపభూయిష్టంగానే ఉన్నదనే విమర్శలున్నాయి. చట్టానికి పదేళ్ల పరిమితి పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తమవుతున్నది. నిజానికి దళితులు, గిరిజనులకూ ఇతర సామాజిక వర్గాలకు మధ్య వ్యత్యాసం తగ్గినప్పుడు చట్టం దానికదే నిరర్థకమై కాలం చెల్లిపోతుంది. అంతే తప్ప కాలపరిమితిని కృత్రిమంగా నిర్ణయించకూడదనే వాదన ఉన్నది. బడ్జెట్ విడుదల అధికారం నోడల్ ఏజెన్సీకి లేకపోవడం మరో లోపమనే విమర్శ ఉన్నది. ఈ కాలంలో మౌలిక సదుపాయాల కల్పనా రంగం ప్రాముఖ్యం గలది. ఈ రంగంలో పనుల విభజన సాధ్యం కాదనే కారణం చూపడం భావ్యం కాదు. అంబుడ్స్‌మన్ వ్యవస్థ నెలకొల్పాలనేది మొదటి నుంచీ ప్రధాన డిమాండ్‌గా ఉన్నది. కానీ బిల్లులో ఈ ప్రతిపాదన లేదు. కనీసం రాష్ట్ర మండలి ఏడాదికి రెండు కన్నా ఇంకా ఎక్కువసార్లు సమావేశమై సమీక్షిస్తుంటే బాగుంటుంది. నిధులు మురిగి పోకుండా, మళ్ళించకుండా నిబంధనలు లేవనే అభ్యంతరం కూడా వ్యక్తమవుతున్నది. నిజానికి ఉప ప్రణాళికలపై ఉన్న ప్రధాన విమర్శ ఇదే. ప్రభుత్వం బడ్జెట్‌లో దళితులకు, గిరిజనులకు కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టు చూపి ఖర్చు చేయడం లేదు. బడ్జెట్ కేటాయింపులు ఆశించిన రీతిలో వినియోగించక పోవడం ప్రజాస్వామ్య విరుద్ధం కూడా. ఈ బిల్లు రూపకల్పనకు ముందు భారీ కసరత్తు జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీ అభివూపాయాలు సేకరించి నివేదికను సమర్పించింది. ఆ నివేదికే ఈ బిల్లుకు ప్రాతిపదిక. ప్రభుత్వం ఆ నివేదికను వెంటనే బయట పెడితే ఇప్పటి వరకు అందులోని అంశాలపై చర్చ జరిగేది. ప్రభుత్వం ప్రజాభివూపాయాన్ని గమనించి బిల్లు రూపొందిస్తే బాగుండేది. ఉప ప్రణాళిక అమలులో పారదర్శకత పాటిస్తామని చెబుతున్న ప్రభుత్వం కీలకమైన నివేదికను ఇంత కాలం మరుగున పెట్టక పోవాల్సింది. 

దళితులకు, గిరిజనులకు వారి జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించాలనే భావన ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1970 దశకంలో మొదలైంది. కానీ ఆ ఫలాలు అనుభవించకుండానే అప్పటి నుంచి దళితులు, గిరిజనులలో ఒక తరం గడిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేసినట్టయితే సుమారు ఎనభై వేల కోట్ల రూపాయలు వారి కోసం ఉపయోగపడేవని అంచనా. వివిధ పథకాల రూపంలో ఈ నిధులు ఈ అట్టడుగు వర్గాలకు ఉపయోగపడితే ఒక తరం అనేక సదుపాయాలు అనుభవించి సర్వతోముఖాభివృద్ధిని సాధించేది. ఈ అభివృద్ధి ప్రభావం మిగతా తరాలపై కూడా ఉండేది. ఉప ప్రణాళికలకు చట్టబద్ధత కల్పించే విషయంలో ఇప్పుడు అన్ని పార్టీలు హడావుడి చేస్తున్నాయి. ప్రత్యేకించి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడం కూడా ఈ హంగామాలో భాగమే. కానీ ఇప్పటి వరకు దళితుల, గిరిజనుల నిధులను దారి మళ్ళించడంలో అన్ని ప్రభుత్వాల పాత్ర ఉన్నది. ఉప ప్రణాళికల అమలు తీరును ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో పెడతామని ప్రభుత్వం అంటున్నది. దీని వల్ల కొంత మేర మాత్రమే ఫలితం కనబడవచ్చు. దళితుల పట్ల, గిరిజనుల పట్ల వివక్ష చూపడం అనేది సామాజిక రుగ్మత. సామాజిక సమస్యకు పరిష్కారం సాంకేతిక రంగంలో లభించదు. పాలకుల భావజాలంలో, ప్రభుత్వ యంత్రాంగ స్వభావంలో మార్పు రావాలె. పాలకవర్గం వివక్షాపూరితంగా ఉన్నదనడానికి ఉప ప్రణాళికలు పెట్టవలసి రావడమే నిదర్శనం. ఉప ప్రణాళికలు ఆర్థిక రంగానికి మాత్రమే పరిమితమైనవి. కానీ పరిపాలనా రంగంలో, సామాజిక రంగంలో నిత్యం ఎదురయ్యే వివక్షను, అణచివేతను రూపుమాపడం కూడా అవసరమే. శాసన సభలో చర్చ ఇంత విస్తృతంగా సాగాలె.

Namasete Telangana News Paper Dated: 1/12/2012

సమస్యల వలయంలో సంక్షేమ హాస్టళ్లు---తన్నీరు హరీష్ రావు టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం ఉప నాయకుసిద్దిపేటలోని సమీకృత బాలుర హాస్టల్‌లో బుధవారం రాత్రి నుంచి ఉదయం వరకు విద్యార్థులతో గడిపాను. వారితోనే కలిసితిని, పడుకున్నాను. హాస్టళ్లలో ఉండి చదువుకునే పిల్లలను ప్రోత్సహించడానికి, వారి ఇబ్బందులు తెలుసుకుని పరిష్కరించడానికి గతంలో కూడా నేను హాస్టళ్లలో నిద్రపోయాను. కానీ ఈసారి హాస్టల్ నిద్ర నన్ను ఎంతో బాధకు గురిచేసింది. నిరుపేదలైన తల్లిదంవూడులు తమ పిల్లల బతుకు తమలా కావద్దని, చదువుకుని పైకి రావాలనే ఆశతో హాస్టళ్లకు పంపుతున్నారు. అలాంటి పిల్లలను ప్రభుత్వమే తల్లిలా పెంచాలి. మంచి భోజనం పెట్టి, బట్టలిచ్చి, పుస్తకాలిచ్చి, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంచాలి. కానీ హాస్టల్లో పరిస్థితి అలా లేదు. భూకంప బాధితుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక సహాయక శిబిరాలు హాస్టళ్ళకన్నా బాగుంటాయనిపింంది.నేను పడుకున్న హాస్టల్‌లో ప్రతీ విద్యార్థినీ పలకరించాను. ఒక్కొక్కరు తాము ఏ పరిస్థితుల్లో హాస్టల్లో ఉండాల్సివస్తున్నదో చెప్పారు. అందరి కథల్లో ఒక్కటే సారాంశం.తల్లిదంవూడుల పేదరికం,కన్నబిడ్డలకు కడుపునిండా తిండిపెట్టలేని దైన్యం. అనాథలు హాస్టళ్లనే నమ్ముకున్న దురదృష్టం. హాస్టల్లో ఉంటే కనీసం సమయానికి అన్నమైనా దొరుకుతుందని కన్నపేగు ఆశ. కానీ ప్రభుత్వ నిర్వాకంవల్ల ఆ ఆశ కూడా అడియాసే అవుతోంది. ఒక్క సిద్దిపేట ప్రాంతంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా హాస్టళ్ల పరిస్థితిని కూడా తెలుసుకున్నాను. అన్నీ సమస్యల కుప్పలే. పేరుకు బట్టలిస్తున్నామని చెప్పినప్పటికీ అవి పిల్లల వంటిపై ఉండ ఒక్క ఉతుక్కే గుం డీలు, దారాలు తెగిపోతున్నాయి. నాసిరకం బట్ట కావడంతో చీకి చినిగిపోతున్నది. వేసుకునే బట్టలే కాదు,చద్దర్లు, రగ్గులు కూడా ఇవ్వడం లేదు. సొంత బిల్డింగులు లేక కిరాయి, ఇరుకు రూముల్లో, కనీసం టాయిపూట్లు కూడా లేకుండా వందల హాస్ట ళ్లు నడుస్తున్నాయి. కరెంటు మీటరుకు డిడి కట్టాలన్నా నిధులు లేవని సర్కారు చెబుతోంది. నీళ్లు రాని పైపులు, వెలగని లైట్లు, తిరగని ఫ్యాన్లు ఏ హాస్టల్ పోయినా కన్పిస్తాయి. ఈ పరిస్థితుల్లోనే సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలం పాలమాకుల ఎస్సీ హాస్టల్లో ఓ విద్యార్థి పాముకాటుతో చనిపోయాడు. హాస్టల్ విద్యార్థులకు ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలని డాక్టర్లు చెబుతున్నా కనీసం నల్లా నీళ్లు కూడా రావడం లేదు. అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీరు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. డాక్టర్లు రెగ్యులర్‌గా వచ్చి, పిల్లలకు వైద్య సేవలు అందించాలనే నిబంధన ఉన్నా అమలు కావడం లేదు. డాక్టర్లు వచ్చి రోగ నిర్థారణ చేసినా, పిల్లలకు ఇవ్వడానికి మందులు లేవు. ఖాళీగా ఉన్న హాస్టల్ వార్డెన్ పోస్టులను భర్తీ చేయడం లేదు. ఫలితంగా ఒక్కో వార్డెన్ రెండు, మూడు హాస్టళ్లకు ఇన్‌చార్జీగా ఉండాల్సి వస్తోంది. పిల్లలను చదివించడానికి ట్యూటర్లను నియమించడం లేదు. ఈ అసౌకర్యాలకు మించింది ఆకలి సమస్య, అన్నం సమస్య. 

ఎదుగుతున్న పిల్లలకు ప్రతి రోజు 2600 కేలరీల శక్తి అవసరమని జాతీయ పౌష్టికాహార సంస్థ లెక్కకట్టింది. ఈ శక్తి అందాలంటే తిండిలో పోషక విలువలు ఉండా లి. ఉప్మా, ఇడ్లీ, దోశ, పప్పు, పాలు, ఆకుకూరలు, మాంసం, గుడ్డు, పండ్లు, పల్లిపట్టి, పెరుగు ఖచ్చితంగా ఉండాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే నిపుణులు హాస్టళ్ల ‘మెనూ’తయారు చేశారు. ప్రస్తుతం అన్ని హాస్టళ్లలో కాగితాలకు పరిమితమైన ‘మెనూ’లో అన్నీ ఉంటాయి. కానీ పిల్లల ప్లేట్లలో మాత్రం దొడ్డుబియ్యంలో నీళ్లచారు కనిపిస్తోంది. ‘మెనూ’ లోంచి పాలు, పెరుగు, మాంసం, స్నాక్స్ ఎప్పుడో మాయమయ్యాయి.మనిషి అనే వారికెవరికైనా కనీసం 2500 కేలరీల శక్తి ఇచ్చే ఆహారం తీసుకోకుంటే రోగాన పడతాడు. ‘మెనూ’ ప్రకారం పదార్థాలు పళ్లెంలో ఉండాలంటే ఒక మనిషిపై కనీసం 45 రూపాయలు ఖర్చు చేయా లి. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు రోజుకు 50 రూపాయలుపభుత్వ ఆసుపవూతుల్లో రోగికి 40, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే హాస్టళ్లలో రోజుకు 40 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ, వికలాంగుల హాస్టళ్లలో, గురుకుల పాఠశాలల్లో ఉంటున్న ఆరు లక్షల మంది పిల్లలకు ఒక్కొక్కరికి రోజుకు పెడుతున్న ఖర్చు సగటున 16.83 రూపాయలు మాత్రమే. ఏడవ తరగతి లోపు విద్యార్థులకు నెలకు 475, హైస్కూల్ విద్యార్థులకు నెలకు 535 చొప్పున ఇస్తున్నారు. నాలుగేళ్ల క్రితం అప్పుడున్న మార్కె ట్ రేట్ల ప్రకారం ఈ లెక్క వేశారు. కానీ నాలుగేళ్లలో ధరలు చుక్కల్లో చేరాయి. గడిచిన నాలుగేళ్లలో నిత్యావసర ధరల్లో 150 శాతం పెరుగుదల ఉన్నదని స్వయంగా బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ స్పష్టం చేసింది. ఈ లెక్కను పరిగణనలోకి తీసుకున్నా హాస్టల్ విద్యార్థులకు కనీసం రోజుకు 42 అయినా ఇవ్వాలి. కానీ పాత లెక్కల ప్రకారమే భోజన ఖర్చులు చెల్లిస్తున్నారు. 

ప్రభుత్వ లెక్క ప్రకారం విద్యార్థులకు రెండు రూపాయలతో రోజంతా పప్పు పెట్టాలి. రూపాయి 71 పైసతో గుడ్డు పెట్టాలి. ఒక్క రూపాయితో పండ్లు కొనియ్యాలి. 14 పైసలతో బిస్కట్లు తినిపియ్యాలి. 14 పైసలకే పల్లీ పట్టీ పట్టుకు రావాలి. 26 పైసలతో శనిగలు ఇవ్వాలి. 63 పైసలతో ఉప్మా పెట్టాలి. 26 పైసలతో అటుకులు తెచ్చియ్యాలి. పసుపు, ఉప్పు, అల్లం, ఎల్లిపాయ, దనియాలు, జిలకర, మసాలాలన్నీ కలిపి 80 పైసల్లో సమకూర్చాలి. ఇది సాధ్యమయ్యే పనేనా? అయినా సరే, వార్డెన్లు ఎలాగో తిప్పలు పడి ఇన్నాళ్లూ నెట్టుకొచ్చారు. నాలుగు రోజులు ఇవ్వాల్సిన గుడ్డును రెండు రోజులకు కుదించారు. ప్రతీరోజు ఇవ్వాల్సిన పండ్లను రెండు రోజులే ఇస్తున్నారు. ప్రతీ రోజూ బడి నుంచి రాగానే ఇవ్వాల్సిన స్నాక్స్‌ను ఇవ్వడం లేదు. కానీ ప్రభుత్వం ఇటీవల వంటగ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేయడంతో హాస్టళ్లలో అన్నం ఉడకడం లేదు. గ్యాస్ పై సబ్సిడీ ఎత్తేయడం వల్ల ప్రతీ విద్యార్థిపై నెలకు అదనంగా 82రూపాయల భారం పడుతోంది. విద్యార్థికి భోజనం పెట్టడం కోసం చేసే ఖర్చులోంచే అవి చెల్లించాల్సి వస్తోంది. అంటే ఒక్కో విద్యార్థికి ప్రతీరోజు ప్రభుత్వమిచ్చే పదహారున్నరలో ఆరు రూపాయలు గ్యాస్‌కే పోతున్నది. దీంతో వార్డెన్లు తప్పనిసరి పరిస్థితుల్లో చారుపోసి సరిపెడుతున్నారు. చింతపండు ధర కూడా ఎక్కువ కావడంతో నీళ్లచారే మిగులుతోంది. ఇప్పుడు పెరిగిన ధరలకు, ప్రభుత్వం ఇచ్చే నిధులకు నక్కకూ, నాగలోకానికున్నంత తేడా ఉండడంతో చికెన్ అనే మాటనే మరిచిపోయారు. కాస్మొటిక్ చార్జీల పరిస్థితి కూడా అలాగే ఉన్నది. 

నెలకు 62 రూపాయలు ఇస్తున్నారు. వీటితోనే నెలంతా సబ్బులు, కొబ్బరి నూనె, కోల్డ్ క్రీములు, పౌడర్ కొనుక్కోవాలి. కటింగ్ చేయించుకోవాలి. కటింగ్ చేయించుకుంటే రు.25 అవుతుంది. కానీ సర్కారు లెక్క కట్టేది 12 మాత్రమే.అన్ని హాస్టళ్లలో దోమల సమస్య ఉన్నది. దోమలు రాకుండా మెష్‌లు కూడా పెట్టడం లేదు. ఇవన్నీ కళ్లారా చూసిన తర్వాత, ఈ సమస్యల మధ్య పిల్లలకు దక్కేది రెండు పూటల నీళ్ల చారు, దొడ్డు అన్నం మాత్రమే. ఈ మాత్రం తిండి ఆ పేద తల్లిదంవూడులు పెట్టలేరా? తల్లిదంవూడులు తమ పిల్లలు పడుతున్న గోస చూసి తల్లడిల్లుతున్నారు. అందుకే చాలా మంది తమ పిల్లలను హాస్టళ్ల నుంచి ఇండ్లకు తీసుకుపోతున్నారు.ఇటీవలి కాలంలో హాస్టల్ విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణమిదే. కానీ ప్రభుత్వం మాత్రం విద్యార్థుల సంఖ్య తగ్గడం కూడా తమ ఘనతే అ ని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఆన్‌లైన్ విధానం ప్రవేశ పెట్టిన తర్వాత బోగస్ విద్యార్థులను ఏరివేశామని, అందుకే హాస్టళ్లలో పిల్లల సంఖ్య తగ్గిందని ఆత్మవంచనకు పా ల్పడుతోంది.హాస్టళ్లలో సరిగ్గా అన్నం పెట్టడం లేదని తల్లిదంవూడులు పిల్లలను ఇంటికి తీసుకెళ్తుం తమ గొప్పే అని చెప్పుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లింది.

ధరలకు అనుగుణంగా నిధులు పెంచమని ప్రభుత్వాన్ని అడగలేదా? అని సంక్షేమ అధికారులను నేనడిగాను. ఏడాది నుంచి ప్రతిపాదనలు పంపుతూనే ఉ న్నామనీ, కానీ అక్కడి నుంచి జవాబు రావడం లేద నీ సమాధానం వచ్చింది. పెరిగిన ధరల ప్రకారం ఒక్కో విద్యార్థికి 45 రూపాయలు చేయడం సమంజసంగా ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి ఒప్పుకోవాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గ్యాస్ సబ్సిడీని సర్కారే భరిస్తే భారం తగ్గుతుంది. 

రూపాయి కిలో బియ్యం పథకాన్ని హాస్టళ్లలో అమలు చేస్తే మంచిది. కానీ ప్రభుత్వం ఆ పనిచేయడం లేదు.రాష్ట్రం మొత్తం మీద హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులు దాదాపు ఆరు లక్షలు. ఒక్కో విద్యార్థికి 16.83 రూపాయల చొప్పున ఒకరోజుకు సర్కారు పెడుతున్న ఖర్చు 99 లక్షలు. ఒక్కో విద్యార్థికి నలభై రూపాయల చొప్పున ఖర్చు పెడితే అయ్యేది 2.40 కోట్లు. పెరిగేది కోటీ 39 లక్షలు. ఏడాదికి సగటున 250 రోజులు హాస్టల్ నడుస్తుంది. అంటే అదనంగా ప్రభుత్వంపై పడే భారం 347 కోట్లు. ఇది ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఖర్చు చేయకుండా వదిలేసిన నిధుల్లో నాలుగో వంతు కూడా కాదు. ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు జరిపే సందర్భంగా చాయ్ బిస్కట్ల కోసం పెట్టే ఖర్చులో సగం కూడా కాదు. పేపర్లు, టీవీల్లో ప్రభుత్వం చేసుకునే ప్రచార ఖర్చులో పదో వంతు కూడా కాదు. బడా పారిక్షిశామిక వేత్తలు, పెట్టుబడిదారులకు సర్కారు ఇచ్చే రాయితీల్లో, కట్టబెట్టే భూమి విలువలో ఒక్క శాతం కూడా కాదు.

సాధారణ ఉద్యోగుల నుంచి ఐఎఎస్, ఐపిఎస్‌ల వరకు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, న్యాయమూర్తులు ఇలా ప్రతీ ఒక్కరి జీతాలు ప్రతీ ఏటా పెరిగిన ధరలకు అనుగుణంగా పెరుగుతూనే ఉన్నాయి. కానీ పేద పిల్లల పవ్లూంలో మాత్రం ఏటా రెండు ముద్దలు తగ్గుతూనే ఉన్నాయి. తక్షణం హాస్టల్ మెస్ చార్జీలు పెంచాలి. లేకుంటే పిడికెడు అన్నం నోట్లోకి వెళ్లక, పిల్లలు అవే పిడికిళ్లను ప్రభుత్వంపై సంధించే అవకాశం ఉంది. బడుగు, బలహీన వర్గాల పిల్లలు అన్నం కోసం రోడ్డెక్కడం ఎవరికీ మంచిదికాదు. కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో హాస్టల్ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో భోజన ఖర్చులకు ఒక్కో విద్యార్థికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో అలాంటి ఆలోచనే చేయడం లేదు. 

దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు చట్టబద్దత బిల్లు తెస్తున్నామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గొప్పగా చెప్పుకున్నారు. మరి ఎస్సీ, ఎస్టీ పిల్లలు హాస్టళ్లలో అర్థాకలితో అలమటిస్తుంటే ఈ ముఖ్యమంవూతికి ఎందుకు పట్టడం లేదు. వారికోసం ఎందుకు నిధులు కేటాయించడం లేదు. దీనికిఆయనే సమాధానం చెప్పా లి. పరిస్థితులను స్వయంగా తెలుసుకోవడానికి మం త్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాస్టల్ నిద్రచేయాలని ముఖ్యమంత్రి గొప్పగా చెప్పారు. ఇందిరమ్మ బాట పేరిట జిల్లాలు తిరుగుతున్న ముఖ్యమంత్రి అక్కడక్కడా హాస్టళ్లను కూడా సందర్శిస్తున్నారు. కానీ ఆయనకు సమస్యలు ఎందుకు కనపడటం లేదో అర్థం కావ డం లేదు. మెదక్ జిల్లాలో హాస్టల్ సందర్శించినప్పుడు సిఎం నిద్ర చేసిన గదిని మాత్రమే శుభ్రం చేసి, సున్నం వేశారు అధికారులు. మిగతా గదులను కూడా శుభ్రం చేయలేదు. ఆయన బస చేసిన హాస్టల్‌లోనే సమస్యలు పరిష్కారం కాలేదు.

-తన్నీరు హరీష్ రావు
టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం ఉప నాయకులుhostel


Namasete Telangana News Paper Dated: 1/12/1012

-- Shankar Sampangi
EFL-University-Hyderabad.

Tuesday, November 27, 2012

భారత ప్రప్రథమ సామాజికతత్వవేత్త-- Y Kphule
కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకుగురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసినమహనీయుడు మహాత్మ జోతిరావ్‌ గోవిందరావు ఫూలే. సామాజిక తత్వవేత్త, ఉద్యమకా రుడు, సంఘసేవకుడెైన ఫూలే మహారాష్టక్రు చెందినవా డు. ఆయన భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసంపోరాడా డు. మహారాష్టల్రోని పూణే జిల్లాలో ఖానవలి ప్రాంతంలో 1827 ఏప్రిల్‌ 11న జోతిరావ్‌ ఫూలే జన్మించాడు. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవాడు.కాలక్రమేణా పీష్వా పరిపాలనాకాలంలో పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు ఫూలే గా మార్పు చెందింది. జోతిరావ్‌కి సంవత్సరం వయస్సు రాకుండానే తల్లి తనువు చాలించింది.7 సంవత్సరాల వయస్సులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. తరువాత చదువు మానివేసి వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండేవాడు.

అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ ఫూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ. ప్రతిరోజూ నిద్రకుపక్రమించే ముందు లాంతరు వెలుతురులో చదువుకునే వాడు. జోతిరావ్‌కు చదువుపట్ల ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం టీచర్‌, ఇంటి ప్రక్కనేఉండే ఒక క్రైస్తవ పెద్దమనిషి జోతిరావ్‌ తండ్రిని ఒప్పించి ఆయన విద్యాభ్యాసం కొనసాగేలా చేశారు. ఆయన1841లో స్కాటిష్‌ మిషన్‌ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించాడు. సదాశివ భిల్లాల్‌ గోవింద్‌ అనే బ్రాహ్మణునితో ఫూలే పరిచయం జీవితకాల స్నేహంగా మారింది. చిన్నప్పుడే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపెై జ్ఞానాన్ని సంపాదించాడు ఫూలే .జోతిరావ్‌కు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజి, జార్జ్‌ వాషింగ్టన్‌ల జీవితచరిత్రలు ప్రభావితం చేయడంవల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి. థామస్‌ రచించిన ‘మానవ హక్కులు’ పుస్తకం అతని ఆలోచనలను ప్రభావితం చేసింది. 

అమెరికా స్వాతంత్య్రపోరాటం ఆయనను ప్రభావితం చేయడమే కాకుండా మానవత్వపు విలువలెైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచింపచేసింది. గులాంగిరి, పూణే సత్య సోధక సమాజ నివేదిక, తృతీయ రత్న, ఛత్రపతి శివాజీ, రాజ్‌భోంస్లే యాంఛ, విద్యాకాథాతిల్‌, బ్రాహ్మణ్‌ పంతోజి మొదలెైనవి మహాత్మ ఫూలే ముఖ్య రచనలు.13 ఏళ్ళ ప్రాయంలో జోతిరావ్‌కి 9 సంవత్సరాల సావిత్రితో వివాహం జరిగింది. విద్యాభ్యాసం పూర్తయినతర్వాత ఆయన తన కుటుంబవ్యాపారమైన పూలవ్యాపారం ప్రారంభించాడు.1848లో జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో ఫూలే, బిసి ‘మాలి’ కులానికి చెందిన వాడవడం వల్ల కులవివక్షకు గురయ్యాడు. ఆ క్షణం నుండి కుల వివక్షపెై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. కుల విధానంలో ఆయన బ్రాహ్మ ణులనువిమర్శించ డమే కాకుండా సమాజంలో వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వ పోవడానికి ఆయన అభ్యంతరం తెలిపాడు.

బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించవలసినదిగా సామాన్యుల్ని ప్రోత్సహించాడు.సమాజంలో సగభాగంగా ఉన్న స్ర్తీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించాడు. అందువల్ల స్ర్తీలు విద్యావంతులు కావాలని నమ్మాడు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపాడు. 1948 ఆగస్ట్‌లో బాలికలకు పాఠశాల స్థాపించాడు. ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడం, అస్పృస్యులకు కూడా బోధించవలసిరావడంతోఉపాధ్యాయులె వరూ ముందుకు రాలేదు. చివరకు జోతిరావ్‌ఫూలే తనభార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు. పాఠశాల నిర్వహణలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కొంతకాలం పాఠశాలను నిర్వహించలేక మూసివేశాడు. అయినా పట్టు వదలక తన మిత్రులెైన గోవింద్‌, వల్వేకర్‌ల సహాయంతో పాఠశాలను పునఃప్రారంభించాడు.క్రమంగా ఆదరణ పెరగడంతో 1851-52లో మరో రెండు పాఠశాలలు స్థాపించాడు. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని ఫూలే విమర్శించేవాడు.

ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి. ముసలివారికిచ్చి పెళ్ళి చేయడంవల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు. వీరు మళ్ళీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేదికాదు. అందువల్ల వితంతు పునర్వివాహాలను గురించి ఫూలే ప్రజల్లో చెైతన్యం తీసుకువచ్చాడు. స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించాడు. 1864లో గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించి, వితంతువులెైన గర్భిణీ స్ర్తీలకు అండగా నిలిచాడు. దేశంలోనే ఇటువంటి కేంద్రం స్థాపించడం ఇదే మొదటిసారి. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి ఫూలే దత్తత తీసుకున్నాడు.1873 సెప్టెంబర్‌ 24న సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించాడు. దేశంలోనే ఇది మొట్టమొదటిసంస్కరణోద్యమం. శూద్రులను బ్రాహ్మణ చెర నుండి కాపాడటమే ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సంస్థ సభ్యులు పురోహితుల అవసరం లేకుండానే దేవుణ్ణి పూజించేవారు. 

కుల, మత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పించేవారు. వేదాలను పవిత్రంగా భావించడాన్ని ఫూలే వ్యతిరేకించాడు. విగ్రహారాధనను ఖండించాడు.1891లో ప్రచురించిన సార్వజనిక్‌ ధర్మపుస్తక్‌ మత, సాంఘిక విషాయలపెై ఫూలే అభిప్రాయాలను తెలియచేస్తుంది. స్ర్తీ, పురుషుల మధ్య లింగవివక్షను ఫూలే విమర్శించాడు. సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించాడు. 1853లో వితంతు మహిళల అనాథ శిశువుల కోసం సేవాసదనం ప్రారంభించాడు. ఈతరహలో ఒక భారతీయ హిందువు ఒకసంస్థను ప్రారంభిం చడం అదే మొదటిసారి. 1968లో తన ఇంటి దగ్గరున్న స్నానాల తొట్టి వద్ద స్నానం చేసేందుకు అంటరాని వారికి కూడా అనుమతి ఇచ్చాడు. 1869లో ‘పౌరోహిత్యం యొక్క బండారం’ పుస్తక రచన చేశాడు. 1871 సత్యశోధక సమాజం తరపున ‘దీనబంధు’ వార పత్రిక ప్రారంభించాడు. 1880లో భారత ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ పితామహుడు లొఖాండేతో కలసి రెైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు. 1873లో ‘గులాంగిరి’ (బానిసత్వం) పుస్తకం ప్రచురించాడు. 

దీనిలో బ్రాహ్మణీయ అమానుష సూత్రాలను, శూద్రులు- అతి శూద్రులపెై బ్రాహ్మణీయుల క్రూర వెైఖరిని ఫూలే తులనాత్మకంగా పరిశీలించాడు. సహపంక్తి భోజనానికి సంసిద్ధత ప్రకటించాడు. 1883 కల్టివేటర్స్‌ విప్‌కార్డ్‌ (సేద్యగాడిపెై చెర్నకోల) పుస్తక రచన పూర్తిచేశాడు. ఏప్రిల్‌లో బొంబాయిలో జరిగిన ఒక సమావేశంలో పుస్తకాన్ని వినిపించాడు. 1885లో సత్యసారాంశం ప్రచురించాడు. ఇదే సయంలో ప్రచురితమైన తన హెచ్చరిక (వార్నింగ్‌) బుక్‌లెట్‌లో ప్రార్థనా సమాజం, బ్రహ్మసమాజం తదితర బ్రాహ్మణీయ సంస్థలమీద తీవ్ర విమర్శలు చేశాడు.1891లో ఫూలే రచించిన ‘సార్వజనిక్‌ సత్యధర్మ పుస్తకం’ ఆయన మరణాంతరం ప్రచురితమైంది. ఇందులో చాతుర్వర్ణ వ్యవస్థను దుయ్యబట్టాడు.మద్యపానాన్ని వ్యతిరేకించి,1888లో మున్సిపాలిటీ అధ్యక్షునికి మద్యం షాపులను మూసి వేయవలసిందిగా ఉత్తరం వ్రాశాడు. ఆయన వ్రాసిన 33 ఆర్టికల్స్‌ గల సార్వజనిక్‌ సత్యధర్మ పుస్తకంలో కుటుంబ సృష్టి నియమాల గురించి వివరిస్తూ ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా వ్యక్తీకరించాడు. 

ప్రతి ఒక్కరికి సమాన స్వేచ్ఛ హక్కును తీర్మానించాడు. 1879 చివర్లో ‘దీనబంధు’ వారపత్రికను ముంబయిలో స్థాపించాడు. దీనిలో రెైతులు, కార్మికుల సమస్యలు, బాధలు వివరించేవాడు. శెత్కర్యాచ అస్సోడ్‌ పుస్తకం సామాజిక ప్రాముఖ్యం గలది.భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్ర్తీయంగా రూపొందించిన తొలి దార్శ నికుడు ఫూలే. దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఆలోచనలరి, విశ్లేషణకి ‘గులాంగిరి’ అద్దం పడుతుంది. మనుషుల చుట్టూ బ్రాహ్మణులు చుట్టిన దాస్యపు సంకెళ్ళ నుండి వాళ్ళు విముక్తికావడం, తోటి శూద్రుల నిజపరిస్థితిని బహిర్గతం చేయడం, ఇవి ఏకాస్త విద్యనెైనా నేర్చిన శూద్రసహోదరుల కర్తవ్యాలు. ప్రతిగ్రామంలోనూ శూద్రులకు పాఠశాలలు కావాలి. కానీ వాటిలో బ్రాహ్మణ ఉపాధ్యాయులు మాత్రం వద్దన్నాడు.

దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాలలాంటి వాళ్ళు అని చెప్పాడు. మహాత్మాఫూలే ఆధునిక భారతదేశ సమాజంలో అందరికంటే గొప్ప శూద్రుడు. హిందూ సమాజంలో అగ్రకులాలవారి బానిసలుగా బతుకుతున్న కిందికులాల వారిలో తమ బానిసత్వంపట్ల ఆయన చెైతన్యం రగిలించారు. సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారత దేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మ ఫూలే తన గురువు అని డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ ప్రకటించారు. దక్షిణాఫ్రికా జాతీయోద్యమ నాయకుడు నెల్సన్‌ మండేలా భారతదేశ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆ మహనీయునికి సమర్పించాలని నిర్ణయించు కొన్న గౌరవ కానుక మహాత్మ ఫూలే రచించిన మహత్తర గ్రంథం ‘గులాంగిరి’. సమాజంలో వెనుకబడినవర్గాల ప్రజలు, మహిళల అభ్యున్నతికోసం చేసినకృషికి ఆయనకు ‘మహాత్మ’ బిరుదు ఇచ్చారు. దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మ ఫూలే 1890 నవంబరు 28న కన్నుమూశాడు. కుల వివక్షను ఎదిరించి బడుగు వర్గాల హక్కుల కోసం కృషి చేసిన మహానీయునిగా ఫూలే పేరు చరిత్రలో నిలిచిపోతుంది. 

yk
ఆ మహనీయ సామాజిక తత్వవేత్తకి నిజమైన నివాళి అర్పించడమంటే- ఫూలే రచనలను ప్రాథమిక విద్యా స్థాయినుండి విశ్వవిద్యాల యస్థాయివరకు పాఠ్యాంశాలుగాచేర్చాలి. విశ్వవిద్యా లయాల్లో మహాత్మ ఫూలే విద్యాపీఠాన్ని ఏర్పాటుచేయాలి. ఫూలే జయంతి, వర్ధంతు లనాడు (ఏప్రిల్‌ 11, నవంబరు 28) సెలవుదినాలుగా ప్రకటించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో, హాస్టళ్లల్లో మహాత్మఫూలే చిత్రపటాలను అలంకరించాలి.ప్రతి జిల్లాలో ఫూలే బిసిభవనాలను నిర్మించాలి. విగ్రహాలను ఆవిష్కరించాలి. బిసి రిజర్వే షన్లను జనాభా దామాషా ప్రకారం 50 శాతానికి పెంచాలి. చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. దేశ జనగణనలో బిసి కులాల లెక్కలు విడివిడిగా సేకరించాలి.సామాజిక న్యాయం, సామాజిక ప్రజాస్వామ్యాలను స్థాపించాలి.

నవంబర్‌ 28 జోతిరావ్‌ ఫూలే వర్ధంతి
Surya Telugu News Paper Dated: 28/11/2012

ఖండాంతరాల్లో కన్నతల్లి పాట (రసమయి బాలకిషన్) --SampadakiyamRasamayee
పాట ఎంత గొప్పదీ! ఉద్యమాల్లో ఉరుమై ఉరిమింది పాట. పోరాటమొక్కలను నాటింది పాట. మనుషులకు మట్టిమీద ప్రేమను పుట్టించింది. మనసుల మధ్య మమతలవారధి కట్టింది. అణిచివేతకు గురైన మన సంస్కృతిని బతికించేందుకు సిద్ధపడ్డది. దేశదేశాలకు విస్తరించి, జైతెలంగాణ అనిపిస్తున్నది. దూరమైనా పేగుబంధం మాసిపోదని రుజువుచేస్తున్నది. నాలుగుకోట్లమంది కొట్లాటకు మద్దతు కూడగడుతున్నది. వికసించిన ఆకాంక్షలకు పల్లవై చరణమై, రాగమై, భాగమై ఉద్యమంలో ముందు నడుస్తూ, నడిపిస్తున్నది. ఆస్ట్రేలియా ఖండంలో కూడా తెలంగాణపాట బరిగీసి నిలబడ్డది. ఖండాలు దాటిన తెలంగాణ బిడ్డలు ఇయ్యాల పుట్టినగడ్డ కోసం మేము సైతం అంటున్నరు. పాలుమరువని పసిపిల్లల నుంచి పండు ముసలోల్ల దాకా ఒక్కటే మాట. తెలంగాణ సాధించాలె. మావోళ్ల బతుకులు బాగ్గావాలె. మాది మాకు దక్కాలె. పడుకున్నా, మేల్కున్నా మదిల రగులుతున్న ముచ్చట ఇదే. 

మలిదశ తెలంగాణ ఉద్యమం అందించిన స్ఫూర్తి ఇయ్యాల ఖండాలుదాటి ఖన్నుమని మార్మోగుతున్నది. అందుకే సద్ది తిన్న తావును తలువాలన్నది తెలంగాణ జీవన విధానంలోనుంచి పుట్టుకొచ్చిన నానుడి. వలసపోయినా...వలపోత దు:ఖాలను గురించి వాళ్లు రందిపడుతున్నరు. అందు కే దేశదేశాల్లో తెలంగాణ నినాదాలు హోరెత్తున్నయి. తెలంగాణ సంస్కృతికి హారతి పడుతున్నయి. తెలంగాణ పాటన్న, మాటన్న సంబురపడుతున్నయి ఆ గుండెలు. సద్దు ల బతుకమ్మైనా, సంబురాల దసరైనా, దేశంగాని దేశంలో తెలంగాణ సప్పుడు వినపడాల్సిందే. అమెరికా నుంచి సింగపూర్ దాకా మన బిడ్డలందరిదీ జైతెలంగాణే. ఇక్కడ తండ్లాటకు వాళ్లు తల్లడిల్లుతున్నరు. ఇక్కడి పాటకు వాళ్లు గొంతుకలుపుతున్నరు. ఇక్కడి బలిదానాలకు వాళ్లు కన్నీళ్లు పెడుతూ కుమిలిపోతున్నరు. దేశంగాని దేశంలో పిడికిలి బిగించి జైతెలంగాణ అంటూ గర్జిస్తున్నరు. కొట్లాట పదునెక్కుతున్న యాల్ల జన్మనిచ్చిన మట్టిమీద లేనందుకు వాళ్లంతా దిగులు మేఘాలవుతున్నరు. అందుకే మేము సైతమంటూ పరాయిదేశాల్లో తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నరు. తెలంగాణ తల్లికి పబ్బతిపడుతున్నరు.

అరవయేండ్ల దు:ఖానికి చరమగీతం పాడాలని కంకణం కట్టుకున్న వాళ్ల ప్రేమజూస్తే మన కండ్లు మనల్నే నమ్మలేకుండ చేస్తయి. దూరం ఎంతుం కన్నతల్లి మీద పాయిరముండా లె. అస్ట్రేలియాలో వెయ్యికుటుంబాలకు ఇపుడొక్కటే రక్తసంబంధం. అదే తెలంగాణ పేగుబం ధం. కులం లేదు, మతం లేదు. తెలంగాణోడైతే చాలు. అక్కున చేర్చుకొని అలాయి బలాయి ఇచ్చుడే. ఏ ఊరు, ఏ పల్లె. ఇన్ని దినాలు యాడున్నరని కలుపకబోయేతనం. తెలంగాణ ఈ యేడు వచ్చేనాట్న అని సొద ఎల్లబోసుకునుడే. వైట్‌హౌజ్ ముందైనా సిడ్నీ లోటస్ బిల్డింగ్ ఆవరణలోనైనా తెలంగాణ నినాదం పోటెత్తాల్సిందే. ఎక్కడిది ఈ సోయి. ఎందుకింత పాయి రం. వాళ్లంతా ఈ నేలతల్లి బిడ్డలు. అందుకే ఈ నేల విముక్తి కోసం జబ్బసరిచి కొట్లాడుతమంటున్నరు. సందర్భమేదైనా తెలంగాణ నేటివిటీ కనిపించాలె. తెలంగాణ పాట వినిపించాలె. ఈ మట్టిమీద మాయని మమకారం. పిల్లాజెల్లా అంతా కలిసి పరాయి దేశంలో రోడ్ల మీద ప్లకార్డులు పట్టి జైతెలంగాణ అంటూ నినదిస్తున్నరు.

తెలంగాణ బిడ్డలకంటే ముందే తిష్టేసి ఆటాలు, తానాల అసోసియేషన్‌లుగా కులసంఘాలు పెట్టుకున్న సీమాంవూధుల పెత్తనాలు. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పనట్టు లొల్లి. కుల్లం కుల్లం మన మాట, మాట్లాడుకోనికి లేదు. మన బాధ చెప్పుకోనికి లేదు. తెలుగు తల్లి, తెలుగు జాతి, సంకురాత్రి, అట్లతద్ది. మరి మన ముచ్చట ఏమైపోవాలి. మన బతుకేమైపోవాలె. ఇగ లాభం లేదు. మనకో సంఘం ముండాలె. మనోళ్లంతా కలుసుకోవాలె. పండుగలు పబ్బాలే కాదు, తెలంగాణ కోసం పోరాటం చెయ్యనీకి ఒక్కటి కావాలె. ఏదో ఒకటి చెయ్యాలె. 

ఇగ వెతుకు భూతద్దమేసి వెతుకు. తెలంగాణకెల్లి వచ్చినోళ్లందరిని కూడగట్టు. అట్లా ఒకటి కాదు రెండు కాదు. ఐదారేండ్లు గాలిచ్చి గాలిచ్చి జాతరల తప్పిపోయినోడు దొరికనట్టు ఒక్కక్కరే కలిసి, కట్టుకున్న కలలగూడు. చెట్టుకొకడు పుట్టకొకడైన తెలంగాణ బిడ్డల జాడలు తీసి గుండెల నిండా వేసుకున్న గుర్తులు. తెలుగు అసోసియేషన్‌లకు దీటుగా రూపుదిద్దుకున్న తెలంగాణ కొంగుబంగారాల కొలుపులు. అందరొక్కపక్క జేరినంకా మనూరోడు కలిసిండని సంబురం సద్దికుండైంది. సీమాంవూధులతో పరాయిదేశాల్ల మన పోటీ, సంఘాలు పెట్టుడువరకే ఆగలేదు. వాళ్ల సినిమాలు చూడమని ‘జైతెలంగాణ’లాంటి తెలంగాణ సినిమాలను పోటికి తెప్పించుకొని అక్కడి థియేటర్‌లల్ల ఆడిచ్చుకున్నరు.

ఆత్మగౌరవం కలిగిన తెలంగాణ బిడ్డలు ఇయ్యాల మరిం త ధిక్కారంతో గళమెత్తుతున్నరు. తెలుగు భాష పేరుతో అన్నదమ్ములమని నిండాముంచిన కుట్రల మీద అగ్గై మండుతున్నరు. సందర్భమేదైనా తెలంగాణ ఇగురం కనిపించాలె. మొన్న దీపావళికి సుత ఆస్ట్రేలియాలో తెలంగా ణ అస్తిత్వాన్ని నిలబెట్టిన్రు. తెలుగోళ్లంత ఒక్కటై పండుగ చేసిన్రు. ఆడ ప్రతియేడు చేస్తరట. ‘దివాలి ఉత్సవ్’ పేరుతో తెలుగోళ్లంత ఒక్కచోట కలుసుకొని ఆటపాటలతో గడుపుతరు. 

ఇగ ఈ యేడు అట్లా కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేసివూనట. అక్కడున్న తెలంగాణ బిడ్డలకు ఒక్కసారిగా మన పాట గుర్తుకొచ్చింది. ఈడ గూడ ఆంధ్రోళ్ళ ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ...’ వినుడేంది. ఎట్లనన్న జేసి మన తడాఖ సూపెట్టాలె. ఏం చెయ్యాలె. ఏదో ఒకటి చెయ్యాలె. ఒక్క రు కాదు, ఇద్దరు కాదు. తెలంగాణ బిడ్డ ల ఇండ్లల్ల ఇదే ముచ్చట ఇసారిచ్చుకొని ఒక నిర్ణయానికొచ్చి. మన కళాకారుల్నే పిలిపించాలె. తెలంగాణ ధూంధాం అంటేందో చూపెట్టాలె. తెలంగాణ పాట ఎట్లుంటదో వినిపించాలె. ఆస్ట్రేలియా గడ్డ మీద తెలంగాణ దరు వు వెూత వెూగాలె. అట్లా నేను ఆస్ట్రేలియాలో ఉన్న తెలంగాణ బిడ్డల ఆతిథ్యం అందుకునే అవకాశం దక్కింది. అక్కడ అడుగు పెట్టిన్నోలేదో మూడేండ్ల చిన్నపాప నా దగ్గరికొచ్చి ‘అంకుల్ మీరు తెలంగాణకోసం మల్ల టీవి లోపటికి ఎపుడుపోతరు’ అని అడిగింది.

అవ్వతోడు కండ్లకు నీళ్ళొచ్చినయి. పసిపిల్లలకు సుత తెలంగాణ మీద అంత ద్యాస ఉన్నదా అనిపించింది. అక్కడి మనుషులు, మానవసంబంధాలు, డిగ్నిటీ ఆఫ్ లేబర్, సింప్లిసిటీ చూస్తుంటే నాకైతే మనసుల మనసులేదు. మనకు వాళ్ళ కు ఎంత తేడా. హెలికాప్టర్‌ల పోయి విత్తనాలేసుడేంది. ఒక్కోరైతుకు వందల ఎకరాల భూమి ఉండుడేంది. డెవలప్ అయిన దేశం ల సర్కారు కూడ ఎవుసానికే పెద్దపీ అని నాలోపట నాకే ఎన్నో ప్రశ్నలు. కానీ, అక్కడి తెలంగాణ బిడ్డలకు సుత ఎన్నో ప్రశ్నలు లేకపోలేదు. 

‘ఒక ప్రాంత విముక్తి కోసం మనుషులు తమ కు తాము ప్రాణాలు తీసుకునుడేంది? మనుషులు సచ్చిపోతున్నా పాలకుల గుండెపూందుకు కరుగుతలేవు?ఇంకెంత కాలం ఇట్లా దోచుకొని ఏలుతరట? చార్మినార్ కాడ కుక్కలను పట్టించుకున్న సినీయాక్టర్...మనుషులు సచ్చిపోతున్నా సపుడెందుకు చేస్తలేదు?పోరాడెటోళ్లు కలిసికట్టుగ ఎందుకుంటలేరు? అవకాశవాదులై పార్టీపూందుకు మారుతున్నరు? తెలంగాణ ఇంకా రాకుంటా వెూకాలడ్డుపెడుతున్నదెవరు? ఇంకెపుడొస్తది తెలంగాణ?’’ ఇట్లా మెల్‌బోర్న్, సిడ్నీ, కాన్‌బెపూరాల పొడుగూత ఉన్న తెలంగాణ బిడ్డల మనుసులల్ల ఈ ప్రశ్నలు మెదుల్తనే ఉన్నయి. నన్నుగూడ అడుగనే అడిగిన్రు. సవాలక్ష ప్రశ్నలు. కడుపు రగిలిపోయే నిప్పు కణికలు. పరాయి దేశాల్లో ఉన్నా ఇంతగనం ఆలోచిస్తున్న తీరుకు ఇక్కడినుంచి పోయినోళ్లకు ఎవలకైనా మనసంతా బేజారైతది. 

తెలంగాణ పదిజిల్లాల నుంచి అక్కడికిపోయినోళ్లు అక్కడ్నే స్థిరపడ్డరు. అయినా వాళ్ల మనాది మాత్రం తెలంగాణ గురించే కొట్టుకుంటున్నది. అయినా వాళ్ల కొలువుల బిజీకి వాళ్ల సంసారాల నే పట్టించుకునే టైం లేదు. శనివా రం, ఆదివారం తప్ప ఇంటిపట్టున ఉండేదే లేదు. అసొంటోళ్లు తెలంగాణ గురించి పట్టించుకుంటున్న తీరుకు నాకైతే సంబురమైంది. ఉద్యమం ఎంత గొప్పది. ఎన్నిగీతల్ని చెరిపి ఎంతమందిని ఇట్లా కలిపిందోనని మనసుల్నే ఉద్యమానికి దండం పెట్టిన. తెలంగాణ తల్లి గొప్పతనం ఇదీ అనిపించింది. పాడెటందుకు నేను ఉన్నా. కానీ, కోరస్ పాడెటో ళ్లు లేరుకదా అనుకున్న. కానీ, తెలంగాడ ఆడబిడ్డలు ‘అన్న మేమున్నం, నీకెందుకు బాధ’న్నరు. మన ఆడబిడ్డలకు బతుకమ్మపాటలో, పెండ్లిపాటలో తెల్వకుంట ఉంటదా. ఎన్నడో చిన్ననాడు పాడుకున్నయి. ఇన్నయి. ఇపుడు అర్జంటుగా అవసరమొచ్చినయి. గొంతువిప్పాలె. పాట నేర్వాలే.

ఆంధ్రోళ్లకు మన తడాఖ చూపెట్టాలె. చలో కంప్యూటర్ తెరువు. తెలంగాణ పాటలు వెతుకు. టెక్నాలజీ ఎవడబ్బ సొత్తు. తెలంగాణ పాట కోసం టెక్నాలజీ కూడా క్యూకట్టాలె. పాటకు హారతిపట్టాలె. యూట్యూబ్‌లల్ల గుట్టలోలే ఉన్న పాటలల్ల మంచి మంచియి ఏరుకోని, ఎదురుకోని, వినుకుంట రాసుకోని, రాసినయి వినుకుంట మళ్ల పాడుకోని, నేర్వాలే. తెలంగాణ బిడ్డలతో మాట్లాడినట్టు. తెలంగాణ బతుకుపాటలో లీనం కావాలె. అట్లా ఆడబిడ్డలు కోరస్‌కు సిద్ధమైన్రు. అది కూడా ఎన్నో కష్టాలను భరించుకుంట. ఒకపక్క వాళ్ల నౌకర్లు చేసుకుంటునే వారంరోజుల పాటు రోజు సాయంత్రం 5గంటల నుంచి రాత్రి పదిగొట్టెదాకా తెలంగాణ పాటలు ప్రాక్టీ స్ చేసిన్రు. వాళ్లెందుకీ తిప్పలు. వాళ్ల బతుకు వాళ్లు బతుకచ్చు కదా అనిపిస్త ది. 

కానీ, వాళ్లు తెలంగాణ మట్టి బిడ్డలు. జబ్బసరిచిన కొట్లాటను చూసి, మేము కూడా తెలంగాణ బిడ్డలమే అని నిరూపించిన్రు. పాడడానికి ఓకే కానీ, మరి పాటకు అనుగుణంగా దరువు లేకుంటే ఎట్ల. నా తండ్లాట చూసి ఆస్ట్రేలియల ఉన్న తెలంగాణ బిడ్డలు దానికీ ఓ పరిష్కారం ఆలోచించిన్రు. పక్కరాష్ట్రంల చర్చిలో డోలక్ వాయించే కళాకారునితో మాట్లాడి ఫ్లైట్ టిక్కెట్ రానుబోను కొనిచ్చి, ఓ కొత్త డోలక్ కొని తెలంగాణ పాటకు హుషారు తెచ్చిన్రు. కళాకారులను కల్యామాకుప్లూక్క సూశే ఇక్కడి రాజకీయ నాయకులకు కూడా, అంతటి సోయుంటే మా కళాకారులందరు మరింత లగాంచి పాడుదురేవెూ.

వారం రోజులు ప్రాక్టీసు జరిగే చోటనే కాదు, వాళ్ల ఇండ్లల్ల, ఆఫీసులల్ల పాటలు పిల్లకాలువలై పారినై. లయలో పాడాలని గొంతులు సవరించి న్రు అక్కచెప్లూండ్లు. పుట్టినగడ్డ మీద ప్రేమే లేకుంటే ఎట్లా సాధ్యమైతది. తెలంగాణ పల్లెమీద, ఇక్కడి మనుషుల మీద ఉన్న మమకారానికి నిదర్శనమనిపించింది. పట్టుపట్టి పాటలు నేర్చుకున్నరు. ఎన్నోవందలమంది కళాకారులను చూసి వేలాది సభల్లో గొంతెత్తిన ఇన్నేండ్ల నా సాంస్కృతిక జీవితంలో ఇదో కొత్త అనుభవం. తెలంగాణ పౌరుషాన్ని, పాటలో జతకలిపి తెలుగోళ్లందరికి చూపించాలని పంతం పట్టిన సమయం ఇది. మనదికాని నేల మీద సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, రకరకాల చిన్నా, పెద్ద కొలువు లు జేసె తెలంగాణబిడ్డలు తెలంగాణ పాటకు పట్టం కట్టిన సందర్భం.

సీమాంవూధ పాలనలో మన యాస బోయింది, బాసపోయింది. పండుగలు, పబ్బాలు కళతప్పినై. కానీ పరాయి దేశాల్లో ఉన్న, ఏ తెలంగాణ బిడ్డకైనా తెలంగాణ పేరువినపడితే మనసు పులకరిస్తున్నది. అందుకే మన పండుగ లు, మన వంటలు చేసుకోని జన్మనిచ్చిన తావును యాదిచేసుకుంటున్నరు. ఆస్ట్రేలియాలో ధూంధాం నాడు తెలంగాణ వంటకాలు కొలువుదీరినయి. ఒక్కరే అన్ని వంటలు చేసుడు కుదురదని ఒకరు గుడా లు చేస్తే, ఇంకొకరు బచ్చాలు, ఒకరు బగారేసుకొత్తే, ఇంకొకరు పచ్చిపలుసు చేసుకొచ్చిన్రు. మక్కగ్యాలు, మలీదముద్దలే కాదు, సర్వపిండి కాంచి సర్వం చేసిన్రు. టైం సరిపోదని ఒక్కో ఇంటికెల్లి ఒక్కో తెలంగాణ వంటకం బోనం బైలెల్లినట్టే బైలెల్లినై. కలిసి తినడానికి, కష్టసుఖం మాట్లాడుకోవడానికి ధూంధాం తెలంగాణోళ్లందరిని ఒక్కచోట చేర్చింది. 

నామూషి లేదు, నారాజయ్యేది లేదు. పనికి విలువిచ్చే దేశంల ఇన్సల్ట్ అనే మాటకు జాగేలేదనపించింది. లేకుంటే మున్సిపాలిటీ చెత్త తీసుకపోయెటోన్ని ఎంపీగా ఎన్నుకున్నరంటే నమ్మగలమా? పక్కింటి కుక్కకు తిండిపెడతలేరని కంప్లయింట్ చేసెటోల్లను ఎక్కడన్నా చూడగలమా? అంతేకాదు, చారివూతక కట్టడం ఏదైనా...మన రోడ్ల మీద కట్టే చిన్న మైసమ్మ గుడి అంతదయినా సరే, దాన్ని కాపాడుకునే తీరు ఎక్కడన్నా చూడగలమా. ఆడున్నట్టు ఈడ కూడా ఉంటే మన కోటిలింగాల, రామప్ప అసొంటియి ఆగమెందుకైతయి. ఎన్ని ప్రశ్నలో ఆ దేశాన్ని చూసినంక. 
ఆరున్నర దశాబ్దాల సీమాంధ్ర పాలనలో తెలంగాణ పల్లె పడావుబడ్డది. ఇయ్యాల పండుగలు, పబ్బాలకు ఒకనాడున్న ఆనందం లేదు. సంబురం లేదు. కానీ, ఆస్ట్రేలియా మనోళ్లను చూసినంక, వాళ్లు తినేతిండిలో కూడా తెలంగాణను యాజ్జేసుకుంటున్న తీరుకు ఆశ్చర్యం కలిగింది. 

బహుశా వాళ్లు అక్కడే స్థిరపడడం ఒక కారణమైతే, తెలంగాణ సంస్కృతికి జరిగిన నష్టమేందో తెలిసిన తనం కూడా మరో కార ణం. అందుకే బయటిదేశంలో బతుకుతున్నా, అవ్వల్దర్జా ఉద్యోగాలు చేస్తున్నా తెలంగాణ నేలను మరువద్దునే సోయి వాళ్లల్లో బలంగా నాటుకపోయింది. సంస్కృతిని రక్షించుకోవాలని మాటలు చెప్పుడుకాదు, ఆచరించి చూపించాలె అని ఒకలకొకలు చెపుకోకుండనే అనుకున్నట్టుగా మెదిలిన్రు. తెలంగాణ పల్లెను గుర్తుకు తెచ్చిన్రు. తెలంగాణ మట్టిపరిమళాన్ని సజీవంగా వెూసుతిరుగుతున్న రు. సాటి తెలుగోళ్లకు రుచిచూపిస్తున్నరు. తెలంగాణ డిమాండ్ ఎంత న్యాయమైందో వివరించి, చర్చించి, తర్కించి చెప్తున్నరు. అందుకే ఏ ప్రాంత ఏ దేశపోడైనా ఇయాల తెలంగాణ ఉద్యమాన్ని కాదనలేకుండ ఉన్నరు. అరుదైన ఈ కలయిక కోసం వెయ్యిమంది తెలంగాణ బిడ్డలు ఒక్కచోట చేరిన్రు. వాళ్లందరికీ సరిపడ తెలంగాణ వంటకాలు తయారు చేసివూనంటే, వాళ్లకు ఈ మట్టిమీద ఎంత ప్రేమున్నదో అర్థం చేసుకోవచ్చు.

ఒక్కచోట చేరిన తెలంగాణ బిడ్డల మధ్య, తెలంగాణ బువ్వ తింటుంటే ఎంత దిల్‌కుష్ అయ్యిందో. కాస్ట్‌లీ దేశం. ఖరీదైన డాలర్ల రాజ్యం. ఈడ మన తిండే దొరుకుతదనుకున్న. కానీ, వెయ్యిమందికి తెలంగాణ రుచులనే పంచివూనంటే ‘ఆవూస్టేలియా తెలంగాణ ఫోరమ్’కి ఉన్న శక్తియేందో, తెలంగాణ మట్టిపట్ల ఎంత అభిమానం గూడుకట్టుకొని ఉందో తెలిసింది. మన ఊళ్లల్ల దసరా చేసుకున్నట్టు, సంబురంగా హోలీ ఆడినట్టు అంద రి ముఖాల్లో ఒక సంతోషం. ఆనందం. కాటగలిసినోడు దొరికినట్టు. తింటున్నంత సేపు తెలంగాణ ముచ్చట్లే. మన ఊళ్లల్ల ఎట్లుండె ఎనుకట. అంతమారిపాయె. ఆంధ్రోళ్లొచ్చి ఆగం చేసిపాయె. తలుచుకొని, తల్లడిల్లి, ఓదార్చుకొని, ఎన్ని ముచ్చట్లో అన్ని గుంపులల్ల. 

తెలంగాణ పాటకున్న దమ్ము చూపెట్టే టైం రానే ఒచ్చింది. దివాలి ఉత్సవ్ సందర్భంగా రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ మధ్య తెలంగాణ పాటకు సీమాంవూధులు ఇచ్చిన ఛాన్స్ ఐదునిమిషాలు. ఈ ఐదునిమిషాల కోసమా ఇంతదూరమొచ్చింది. నా సంగతిపోనీ. వారం రోజుల సంది ప్రాక్టీసులు చేస్తే ఐదునిమిషాలేనా. అయినా ఏం కాదు. ఒక్క తెలంగాణ పాట చాలదా సీమాంవూధుల గుండెలు గుబెల్లు మనడానికి. ‘ఎనుకముందు చూసుడేంది రాజన్న ఒరె రాజన్న ఎత్తుర తెలంగాణ జెండా...’పాట ఆస్ట్రేలియా ఆకాశాన్ని తాకింది. గూడా అంజన్నకు జై. హాల్ హాలంతా సీట్లల్ల కూసుంటే పాపం. 

ఆంధ్రోళ్లు కూడా ఎగురందుకు, గొంతు కలుపందుకు. అట్లా ఫట్టఫట్ట పాట మార్చి పాట అందుకొనుడు నా వంతైతే, జై తెలంగాణ అని నినదించుడు కిందున్నోళ్ల వంతైంది. పాటకు తోడు నాలుగు ముచ్చట్లు చెప్పాలె. ఇంతమంది తెలంగాణ కోసం అల్లాడుతున్నరంటే అది నా గొప్పతనం కాదు. తెలంగాణ ఉద్యమ గొప్పతనం. మీరు నాకిచ్చిన ఈ అవకాశం నాకేకాదు, తెలంగాణ మాటను, పాటను వెూసుకుంటొచ్చే ఎవ్వలకైనా ఇట్లనే ఆతిథ్యమిస్తరని తెలుసునాకు.. నాగుండెల నుండి మనస్ఫూర్తిగా వచ్చిన నాలుగుమాటలవి. 

వాళ్లకు నా మీదనో, నా పాడుడు మీదనో కాదు. వాళ్లకు తెలంగాణ ఉద్యమం మీద ప్రేమ. లేకుంటే తెలంగాణ వ్యతిరేకైనా నల్లగొండ నకిరేకల్ సీపీఎం నాయకుని అల్లుడు, సీమాంవూధుడే అయినా తెలంగాణ కోసం ఎందుకు నిలబడుతడు. తెలంగాణ రావాలని ఎందుకు కోరుకుంటడు. తెలంగాణోల్లతో కలిసి జై తెలంగాణ అని ఎట్లా అంటడు. కాలికి బలపం కట్టుకొని తిరిగి ధూంధాం ప్రోగ్రాం ఎట్లా పెట్టిస్తడు. దేశం దాటినంకా బయటినుంచి చూస్తే న్యాయాన్యాయాలు తేలిపోయినై. తెలిసొచ్చినై. ఏమైతేనేం మామ చెయ్యలేని పనిని అల్లుడు ఖండాలకు ఆవల చేస్తున్నడు. ఆయన మంచి మనసుకు తెలంగాణ బిడ్డలందరి తరుపున దండాలు చెప్పిన. ఎనిమిదివందల మంది బలిదానాల తర్వాత కూడా, ఇక్కడున్న ఒక్క సీమాంవూధుని గుండైనా కరిగింది. 

ఆ బిడ్డల కోసం ఒక్క కన్నీ టి సుక్కైనా కార్చిన్రా. పదవులు, అధికారం కాపాడుకోవడానికి నిత్యం అధిష్టానాల చుట్టూ తిరుగుతూ అందరికందరూ తెలంగాణ ద్రోహం చేసే జాదూలే. పైగా ఒకరిమీద ఒకరు నిందలేసుకుంటూ జనానికి గంతలు కడుతూ నీతిమంతులమంటూ ఫోజులు కొట్టే యాక్టర్లే. ఇన్ని చేస్తూ పాదయావూతలని, పరామర్శలని ఎన్ని నక్కజిత్తుల ఏషాలో. తెలంగాణ మీద స్పష్టత ఇయ్యువూనంటే సీమగూండాలు తెలంగాణ బిడ్డల మీద దాడులుచేస్తున్న వైనం మన మనుసుల కెల్లి ఎట్లా చెరిగిపోతది. ఆస్ట్రేలియాలో ఉన్న జనాలకు తెలంగాణ ఉద్యమం గురించి చెప్తే ఆశ్చర్యపడ్డరు. ఒక ఉద్యమం కోసం మనుషులు నిలువునా తగులబడి పోవడం ఎక్కడైనా ఉందా అనడిగిన్రు. ఏం సమాధానం చెప్తం. ప్రపంచమంతా తెలుసుకున్నోళ్లు వాళ్లు. గొప్పగొప్ప సదువులు సదివినోళ్లు. వాళ్లకు అన్యాయమనిపిస్తున్నది. కానీ, ఇక్కడున్న ఏ నేతకు కూడా ఇసుమంతైనా బాధ్య త ఉన్నదా అనేది మనల్ని నిత్యం వెంటాడుతున్న ప్రశ్నే. 

దగాపడ్డ తెలంగాణ బతుకుపట్ల వాళ్లు నిండుమనసుతో ఆలోచిస్తున్నరు. ఈ బాధలు తీరాలే. ఈ రాత మారాలె. తెలంగాణ రావాలె. తెలంగాణ బతుకుల్లో పొద్దు పొడువాలె. స్టేజి మీద అమరవీరుల పాటపాడితే కన్నీరు పెట్టని కన్నులేదు. తెలంగాణ అమరవీరులకు జోహార్లు చెప్పని గొంతులేదు. పిడికిల్లు బిగుసుకున్నయి. అనుకున్నదానికంటే ఎక్కువ రెస్పాన్సే వచ్చింది. దివాలి ఉత్సవ్‌లో అన్ని ప్రోగ్రామ్స్ ఒకెత్తయితే, తెలంగాణ పాట మరో ఎత్తుగా నిలిచింది. తెలంగాణ బిడ్డల గుండెల్లో ఇదీ మా తడాఖ అని ఉంటే, సీమాంవూధుల నోట ‘పాటంటే తెలంగాణే’ అనేది అవ్యక్తంగా జాలువారిన మాట.


ఇల్లుకు దూరమైనోనికి ఇంటోల్లమీద పాణం కొట్టుకున్నట్టు ఆస్ట్రేలియా, సింగపూరే కాదు ఏ దేశంలో ఉన్నా వాళ్ల ధ్యాసంతా తెలంగాణలో రాజకీయ మార్పుల గురించే. ఎవ్వరు కొంచెం వైదొలిగినా, ఏం జరిగేనో, ఎటుమళ్ళేనో, ఉద్యమం మీద ఏ ప్రభావా న్ని చూపుతోందోనని వెయ్యికండ్లతో పహారా కాస్తున్నరు. ఢోకా చేసెటోళ్లను చూసి కలవరపడుతున్నరు. పార్టీలన్నీ తెలంగాణకుసై అంటూనే వాళ్లు బలపడడానికే పెద్దపీటవేస్తున్నరు. ఇలాంటి పెడధోరణులు ఉద్యమానికి నష్టం చేస్తయి. అరవయేండ్ల ఆశలు తీరాలంటే ఉద్యమం ఉధృతం గావాలె. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ నిలబడాలని, కాంగ్రెస్ మీద కలబడాలని, అట్లా తెలంగాణ సాధించాలని వాళ్లందరిలో ఒక ఆశ. 

ఉద్యమం మాటున స్వార్థ ప్రయోజనాలు చూసుకునే నాయకులంటే వాళ్లకు మంట. ఉద్యమాన్ని రాజేసి ఢిల్లీ మెడలు వంచాలె. అందుకోసం తెలంగాణ సమాజమంత ఒక్కటికావాలె. జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టా లె. ఊరువాడ కలిసిపోయి, పట్నం పల్లె పోరుబాట పట్టాలె. ఇందుకోసం ప్రతీఒక్క తెలంగాణ బిడ్డ ముందునడువాలె. అందరినీ కలిపి సమరానికి సై అనాలె. పార్టీలతో పాటు జేఏసీ కృషిజెయ్యా లె. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి రథసారధిగా ఉన్న కేసియార్‌లాంటి పెద్దలు అందరిని ఒక్కటి చేసి ఉద్యమపంథాలో కొత్త అధ్యాయాన్ని రచించాలె. తెలంగాణ సమాజాన్ని ఒక్కతాటిమీదికి తీసుకొచ్చిననాడు తెలంగాణను ఎవ్వరూ అడ్డుకోలేరన్నది అక్కడి మనసుల్లో మెదులుతున్న ఆలోచన. 

తెలంగాణను అడ్డుకోవడానికి సీమాంధ్ర పెట్టుబడిదారులంత ఒక్కటై, పార్టీలకు అతీతంగా నిలిచిన చరిత్ర మనకు తెలియందా. అన్యాయం చేయడానికి వాళ్లంత ఒక్కటై తెలంగాణను అడ్డుకుంటుంటే, మరి మనం న్యాయం కోసం కొట్లాడుతున్నోళ్లుగా మరింత లౌక్యంగా వ్యవహరించాలె గదా. తెలంగాణ పేరుతో ఇంకా రాజకీయాలు చేసే సీమాంధ్ర పార్టీలకు బుద్ధిచెప్పాలె గదా. అది ఎట్లా సాధ్యమైతదో మనసుపెట్టాలె. డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడని కేంద్రం కళ్లు తెరిపించాలె. గత అనుభవాలను సమీక్షించుకోని ఉద్యమాన్ని కొత్తగా నిర్మించాలె. ఆస్ట్రేలియాలో నన్ను మరింత ఆశ్చర్యపరిచిన విషయం...అమరులకు నివాళులు అర్పించిన కొవ్వత్తులను వేదిక మీది నుంచి తీసి, పిల్లల చేతికందించిన తల్లిదంవూడులు చెప్పిన మాట. ‘కొట్లాట ఇంకా ఒడువలేదు. ఇక మీరు కూడ మా పోరాట వారసత్వాన్ని అందుకోన్రి..’ అని క్రొవ్వత్తులను పిల్లల చేతిలో పెట్టిన్రు. పోరాటాన్ని వారసత్వంగా అందిస్తున్న ఆ బిడ్డల స్ఫూర్తి ఇవాళ తెలంగాణ ఉద్యమానికి కావాలి. అందుకోసమే వాళ్లు ఖండాతరాల్లో మన కన్నతల్లి పాటను గుండెలకు అద్దుకున్నరు. వాళ్లందరికీ పేరుపేరునా శరనార్థి...

ఆస్ట్రేలియాలో నన్ను మరింత ఆశ్చర్యపరిచిన విషయం...అమరులకు నివాళులు అర్పించిన క్రొవ్వత్తులను వేదిక మీది నుంచి తీసి, పిల్లల చేతికందించిన తల్లిదంవూడులు చెప్పిన మాట. ‘కొట్లాట ఇంకా ఒడువలేదు. ఇక మీరు కూడ మా పోరాట వారసత్వాన్ని అందుకోన్రి..’ అని కొవ్వత్తులను పిల్లల చేతిలో పెట్టిన్రు. పోరాటాన్ని వారసత్వంగా అందిస్తున్న ఆ బిడ్డల స్ఫూర్తి ఇవాళ తెలంగాణ ఉద్యమానికి కావాలి. అందుకోసమే వాళ్లు ఖండాతరాల్లో మన కన్నతల్లి పాటను గుండెలకు అద్దుకున్నరు. 

-రసమయి బాలకిషన్ 
ధూంధాం వ్యవస్థాపక అధ్యక్షులు , 944085920


Namasete Telangana Telugu News Paper Dated: 28/11/2012

Sampadakiyam 

సమన్యాయ సత్యశోధకుడు(మహాత్మ జ్యోతిరావు ఫూలే ) - పాపని నాగరాజువిప్లవ ప్రతిబంధకమైన ఈ కుల వ్యవస్థ, వర్గ వ్యవస్థను తనలో అంతర్భాంగా ఇముడ్చుకుంది. కనుక ఈ దేశంలో కుల-వర్గ వ్యవస్థలు ఉన్నాయన్న సత్యాన్ని శోధించిన ఫూలే-అంబేద్కర్‌లను విమర్శించడం గుడ్డితనమే అవుతుంది. ఫూలే-అంబేద్కర్ అవగాహనతో నూతన ప్రత్యామ్నాయ సమన్యాయ పోరాటాల్ని నిర్మించడమే ఫూలేకి అర్పించే నిజమైన నివాళి. 

మహాత్మ జ్యోతిరావు ఫూలే ఈ దేశ ఆధునిక యుగ వైతాళికుడు, నిజమైన పునరుజ్జీవనోద్యమ పితామహుడు. ఫూలేను పునరుజ్జీవనోద్యమ పితామహుడిగా, ఆధునిక యుగ వైతాళికుడిగా మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందో ఆయన జీవిత చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది. భారతదేశంలోని శూద్రాతి శూద్రులు (దళిత బహుజన, ఆదివాసీ గిరిజన, ముస్లిం మైనార్టీలు) బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో బానిసలుగా ఉన్నారనీ, వీరు, అమెరికాలోని నల్లజాతి బానిసల్లాగా ఉన్నారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఫూలే. అందుకే బ్రాహ్మణీయ కుల వ్యవస్థలోని బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడడమొక్కటే మన ముందున్న ప్రథమ కర్తవ్యంగా ఫూలే ప్రకటించారు.

బడుగులు బానిసలుగా ఉండడానికి బ్రాహ్మణీయ దోపిడీ, అణచివేత, వివక్షలను అర్థం చేసుకోకపోవడం, అందుకు చదువు లేకపోవడమే మూలమని ఫూలే గ్రహించాడు. 1834-38 కాలంలో ఫూలే మరాఠీ పాఠశాలలో చేరి విద్యాభ్యాసం ప్రారంభించారు. శూద్రులు, అగ్రవర్ణాలకు సేవలు చేయాలేగానీ విద్య నేర్చుకోకూడదని బ్రాహ్మణులు ఆయన తండ్రి గోవిందరావును బెదిరించి ఫూలే చదువు(బడి) మాన్పిస్తారు. బ్రాహ్మణుల కుటిలోపాయాల్ని గ్రహించిన ఫూలే తన తండ్రి స్నేహితులైన ముస్లిం, క్రిస్టియన్ మతస్థులైన వారి ద్వారా లహుజీబువామాంగ్ వద్ద క్రిస్టియన్ మిషనరీ (ఇంగ్లీష్) పాఠశాలలో మళ్లీ విద్యాభ్యాసం ప్రారంభిస్తారు. బ్రాహ్మణ విద్యార్థుల కన్నా ప్రతిభావంతుడవుతాడు.

తరగతి గదిలో స్నేహం ఏర్పడ్డ ఓ బ్రాహ్మణ విద్యార్థి ఫూలేను తన వివాహానికి ఆహ్వానిస్తాడు. ఆ వివాహానికి హాజరైన ఫూలేను బ్రాహ్మణులు, మాలి కులస్తుడని తెలుసుకొని బ్రాహ్మణులతో పెళ్లిలో సమానంగా నడవడమా? అంటూ, శూద్రుడంటూ ఫూలే ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు. అలా అవమానించిన బ్రాహ్మణుల దోపిడీ, అణిచివేతల్ని బహిర్గతపర్చాలని కంకణం కట్టుకొని 1848లో ఫూణేలో మొట్టమొదటగా దళిత (అస్పృశ్యులకు) బాలికలకు పాఠశాల నెలకొల్పారు. ఆ తదనంతరం 1851లో మరో రెండు పాఠశాలల్ని నెలకొల్పారు. శ్రామిక ప్రజల కోసం 1855లో 'రాత్రి బడి'ని స్థాపించారు. ఇలా బ్రాహ్మణ వ్యతిరేకతతో శూద్ర వర్గంలోని అతిశూద్రులకు విద్యావ్యాప్తి చేయడంతో బెంబేలెత్తిన బ్రాహ్మణులు 1849లో ఫూలేను ఆయన తండ్రి చేత కుటుంబం నుంచి బహిష్కరింపజేస్తారు. అయినా కలత చెందక మొక్కవోని ధైర్యంతో, పట్టుదలతో మరింత ముందుకు పోతాడు. జీవిత భాగస్వామి సావిత్రీభాయి సహకారంతో బ్రాహ్మణ వ్యతిరేక సాంస్కృతిక పోరాటాల్ని నిర్మిస్తారు ఫూలే.

ఫూలే కేవలం శూద్ర వర్ణాల్లో అణిచివేతకు గురౌతున్న కులాల ప్రజల పక్షాన పోరాడటమే కాకుండా, అగ్రవర్ణ వితంతువుల పునర్వివాహానికి గొప్ప కృషి చేశారు. 1873లో 'గులంగిరి' 'సేద్యగాని చర్మకోల' అనే గ్రంథాల్ని రచించారు. 'దీనబంధు' అనే పత్రికను స్థాపించి పురోహితులు చేసే దోపిడీలపై భావజాల ప్రచారాన్ని మరింత ప్రచారం చేశారు. భావజాల ప్రచారాన్ని కార్యాచరణగా మార్చడానికి 1870లో 'సార్వజనిక్ సభ', 1873 సెప్టెంబర్ 24న 'సత్యశోధక సమాజం సంస్థ'ను స్థాపించారు. దీనికన్నా ముందు బ్రిటిష్ వలస వాదులకు '1882లో హంటర్ కమిషన్‌కు' శూద్రాతి శూద్రులకు చదువు చెప్పించాల్సిన అవసరం ఉందని నివేదికలిచ్చి, అస్పృశ్యుల కోసం బ్రిటిష్ వారితో పాఠశాలల్ని ఏర్పాటు చేయించారు. సామ్రాజ్యవాద కోణంలోనైతే ఇది మనకు వ్యతిరేకమైనది. భారతదేశంలో కులం కోణంలో చూస్తే అస్పృశ్యులు వేల సంవత్సరాలుగా విద్యకు, విజ్ఞానానికి దూరం చేయబడుతున్నారు కనుక కులం కోణంలో అనుకూలమైనది. 1873-75 సంవత్సరాలలో బ్రాహ్మణ పురోహితులు లేకుండా జున్నార్ పరిసర ప్రాంతాల్లో సుమారు 40 గ్రామాల్లో పెళ్ళిళ్లు నిర్వహించి, ప్రత్యామ్నాయ వివాహ సంస్కృతికి బీజం వేసారు.

బ్రాహ్మణీయ కుల వ్యవస్థ వ్యతిరేక కార్యక్రమాలే కాకుండా బ్రిటీష్ వలసవాదులకు వ్యతిరేకంగానూ, శూద్ర వర్గంలోని రైతాంగంపై బ్రాహ్మణ-వైశ్యు (బాట్‌జీ-షేట్‌జీ)ల వడ్డీ దోపిడీ, శ్రమ దోపిడీల రూపాల్ని, వారి బండారాన్ని బయటపెట్టారు. అంతేకాదు, తను ఏర్పాటు చేసిన సత్యశోధక సమాజ్ సంస్థ సారధ్యంలో తన సహచరుడు ఎన్.ఎమ్.లోఖండేతో బొంబాయి నూలు మిల్లులలోని శూద్రాతిశూద్ర కార్మికుల హక్కుల కోసం, 12 గంటల పనిదినం, ఆదివారం సెలవుకై ట్రేడ్ యూనియన్‌ను నెలకొల్పి పోరాటాలు చేశారు. ఫూలేకి కేవలం కుల వ్యవస్థ వ్యతిరేకతే కాదు, సామ్రాజ్యవాద వ్యతిరేకత, కార్మికవర్గ, రైతాంగ పక్షంగా పోరాడే అవగాహన, కార్యాచరణ ఉంది. ఫూలే-లోఖండే నిర్మించిన కార్మికవర్గ పోరాటాల్ని చరిత్ర పుటల్లో చేర్చకపోవడంలోనే బ్రాహ్మణీయ కుట్ర ఉంది.

బాట్‌జీ, సేట్‌జీల దోపిడీ, వివక్షలతో శూద్రవర్ణ ప్రజలు మనుషులుగా గుర్తించ నిరాకరిస్తున్న మూలంగా శూద్రులు వడ్డీకి అప్పులు తీసుకోవడం, మంగలి కులస్తులు క్షవరాలు చేయడం మానేస్తారు. అంతేకాదు ఫూలే ఒక అడుగు ముందుకేసి శూద్ర వర్ణాల ప్రజలకు పాలకులకన్నా బ్యూరోక్రాట్స్ ప్రమాదకారులని ప్రకటిస్తారు. ఇలా బ్రాహ్మణీయ వ్యవస్థపై స్పష్టంగా యుద్ధాన్ని చేయడంలో ఫూలేకు మరెవ్వరూ సాటిలేరు.

బ్రాహ్మణీయ కుల వ్యతిరేక పోరాట చారిత్రక అంశాల్ని పరిశీలించి స్వీకరించడంలో ఫూలే తీసుకున్న అవగాహనను భారతదేశ విప్లవ మార్క్సిస్టులు తీసుకోకపోవడం విచారకరం. పైగా విప్లవానికి అడ్డంకిగా మారుతుందని చిత్రీకరించడం విడ్డూరం. ఫూలే వారసులుగా పిలువబడేవారు బ్రాహ్మణీయ కుల వ్యవస్థ వ్యతిరేక, స్వయం గౌరవ సమన్యాయ పోరాట అవగాహనను వదిలి అగ్రకుల పాలకవర్గాలకు ఉపయోగపడే కులస్థిరీకరణకై బారులు తీరడం, బడుగు ప్రజల్ని ఆధునిక బానిసలుగా మార్చే ప్రయత్నం చేయడమే అవుతుంది. ఇది విచారకరం, ప్రమాదకరం కూడా. ఇది ఫూలే-అంబేద్కరిస్టుల అవగాహనకు విరుద్ధం.

విప్లవ ప్రతిబంధకమైన ఈ కుల వ్యవస్థ, వర్గ వ్యవస్థను తనలో అంతర్భాంగా ఇముడ్చుకుంది. కనుక ఈ దేశంలో కుల-వర్గ వ్యవస్థలు ఉన్నాయన్న సత్యాన్ని శోధించిన ఫూలే-అంబేద్కర్‌లను విమర్శించడం గుడ్డితనమే అవుతుంది. ఫూలే-అంబేద్కర్ అవగాహనతో నూతన ప్రత్యామ్నాయ సమన్యాయ పోరాటాల్ని నిర్మించడమే ఫూలేకి అర్పించే నిజమైన నివాళి.

- పాపని నాగరాజు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సామాజిక తెలంగాణ మహాసభ
(నేడు ఫూలే 122వ వర్థంతి)

Andhra Jyothi Telugu News Paper Dated: 28/11/2012

Saturday, November 24, 2012

Laxmipet Dalit KillingsA land dispute may have been the immediate cause of the June 2012 attack on dalits in Laxmipet, a village in Srikakulam district, Andhra Pradesh, but the episode signals a potentially explosive situation. The incident was fuelled, on the one hand, by the dalit desire for self-respect and identity, embodied in the increasing assertion of a female dalit sarpanch, and on the other, by the state-level political advancement of the backward caste Kapu community. Particularly disturbing are the participation of Kapu women and children in the killings, and the failure of dalit offi cials and politicians in preventing the incident and securing justice for the victims.
This report was prepared after a visit to Laxmipet on 8 and 9 September by K Laxminarayana (klnss@uohyd.ernet.in), K Srinivasulu (srinivasulukarli@gmail.com), Arun K Patnaik (akpatnaik1@yahoo.com), K Y Ratnam and Timma Reddy.
The sleepy village of Laxmipet in Vangara mandal in Srikakulam district of northern coastal Andhra flashed on news channels on 12 June. In the early morning hours of that day, a large posse of Turpu Kapus, comprising men, women and even teenage children drawn from the village and the neighbouring villages, arrived in tractors, auto­rickshaws and bicycles. This horde gathered and vengefully pounced on the unsuspecting Malas, who live on the other side of the road that separates them from the Turpu Kapus. In the orgy which went on for four hours, five Malas were killed and more than two dozen were seriously injured. This number included women and even children. The fact that 80 Kapus were arrested and jailed shows the scale and magnitude of the riot in terms of planning, motive and participation.
A Resettlement Problem
Laxmipet is a resettled village where the evacuees of the Madduvalasa reservoir were resettled in 2001. The old Laxmipet had a population of 1,500. The major castes in this village were the Malas and Turpu Kapus. These comprised 80 and 120 families respectively. Others like service and artisan castes – Chakali, Mangali and Padmasali – constituted few families. While the Turpu Kapus (backward castes) owned most of the farmland, the Malas (dalits) constituted the bulk of the agricultural labour force.
With the land acquisition for the reservoir and resettlement of the displaced, some of the Kapu and Mala families moved out to other places. All the land thus acquired, except 250 acres, got submerged in the reservoir. Out of these, 190 acres are cultivated by the Kapus and remaining 60 acres have been cultivated by the Malas. Though this land was acquired and due compensation paid by the government, yet in the popular perception, the unsubmerged land is considered to be the property of the erstwhile owners. The dalits negotiated with the Kapus who had settled elsewhere and that is how they came to cultivate the 60 acres of land for almost a decade.
This became a bone of contention. The Kapus in the village began to demand that the dalits vacate the land so that they could take possession and cultivate it. Resisting this, the dalits even petitioned to the district administration to allot these lands to them since they were landless. There were attempts on the part of the revenue divisional o­fficer (RDO) to amicably settle the issue by making the Kapus consent to the status quo. But back in the village, the K­apus remained adamant and kept pressuring the dalits.
Explosive Situation
Though the land dispute is the immediate cause of the conflict, the portrayal of the conflicts in Laxmipet as an economic issue alone would reduce the significance of a caste conflict emerging in the village. The northern coastal Andhra districts, dominated by the Turpu Kapus, have witnessed a sense of assertion from the dalits in the last decade or so. This is largely because of the emergence of an educated class among the dalits. This has resulted in the assertion of dalit youth in different walks of life – education, employment, electoral politics, etc. For instance, the state policy of reservations to the scheduled castes (SCs) could be seen as having resulted in the denial of jobs and promotions to the others, especially to the Turpu Kapus.
Though the Turpu Kapus practise many cultural norms similar to the dalits, such as their liberal attitudes towards widow remarriage and so on, what has, in fact, added to the Kapu’s power is a process of visible change in state-level politics in the post-Rajasekhara Reddy period. The appointment of Botsa Satyanarayana, a man from the Kapu community in this region, as the president of the State Congress Committee has emboldened them politically. Though the Kapus have a significant presence in this region, with the prominence of Botsa Satyanarayana and Chiranjeevi in the ruling Congress Party, there was a perceptible change at the state level in the self-image of the Kapus – the elite as well as the masses – as counterpoint to the Reddys and Kammas, the two communities that have dominated state politics through their hold on the Congress and Telugu Desam Party (TDP) respectively.
Seen in the emergent context of the political economy of the state, the Laxmipet incident cannot be seen as an isolated event but as indicative of a potentially explosive situation. If the dalit desire for self-respect and identity constitutes one part of the emergent reality, then the arrogant expectation of the Kapus that the dalits will continue as their palerus(farm servants) forms the other side.
Laxmipet Gram Panchayat was reserved for an SC woman in the last Panchayat elections. The dominant Turpu Kapus identified a Mala woman by the name of Chittiri Simhalamma and got her elected unopposed as the sarpanch. Out of dependence and ignorance, Simhalamma initially acted at their behest. Once installed in the position, however, she could understand her own power over resources and the need to utilise it for the purposes it was meant for. This meant a substantial material loss to the Turpu Kapu elite, apart from the injury to their pride because, till recently, they had enjoyed unchallenged access and control in the village.
The village panchayat office is under construction. The panchayat meetings used to be held in the ex-sarpanch’s residence. Later, the meeting was shifted to the primary school building. But the sarpanch used to stand while “conducting” meetings whereas other ordinary members from the Kapu community sat down in the chairs during deliberations. From this servile position in the panchayat, despite being its sarpanch, Simhalamma took independent decisions on the utilisation of the funds and developmental activities in the village. This was seen as sufficient grounds to teach a lesson to the dalits. Simhalamma and her actions were seen as unacceptable to the Kapus. But given her official position, the Kapus found it risky to harm her and instead resorted to other methods.
Several instances point to the tensions that were building up between the Turpu Kapus and the dalits. For instance, a dalit president of the local mahila mandali was attacked and injured. Two months later, she died. The brother-in-law of the sarpanch, Chittiri Appadu, was attacked when he went to cultivate “disputed” lands. Both instances were treated as ordinary cases by local police, by ignoring the written request from victims to book cases under the Scheduled Caste and Scheduled Tribe (Prevention of Atrocities) Act. Most of the police officers were dalits, including the station o­fficer. The casual treatment of these instances by dalit officers, in fact, seems to have emboldened the local Kapus for an attack on a larger scale.
In view of these instances, a police picket was set up in the village to prevent further occurrence of any such incidents. This was lifted on 11 June, after almost six months, on the pretext that there was a bye-election to Narasannapet assembly constituency on 12 June.
Anatomy of the Attack
The attack on the dalits immediately a­fter the lifting of the police picket was not accidental. It indicates the fact that the Kapus were waiting for the removal of the police post. The sharp focus on the targets during the four hour-long uninterrupted attack suggests its well-planned and meticulously executed nature. In this operation, while the local Turpu Kapu men gave the directions, the Kapu men from the neighbouring villages along with the local women and children actively participated.
Specific to the Laxmipet atrocity and deserving of attention as a dangerous development, reminiscent of the Gujarat riots, is the active involvement of Kapu women and children in killing dalits. There are two instances clearly identified by the dalits where Kapu men attacked, but Kapu women and children completed the task. Nivarthi Sangmeshu, who was known for his courage and uprightness, was dragged from his house in the early morning, chased, beaten and floored. Women beheaded him by axing him as he tried to approach his sister’s house. Similarly in the case of Chittiri Appadu, the Kapu women did the final act. The dalit eyewitnesses point to a meticulous execution that almost followed a pattern: the men identified the victim and attacked him as grievously as possible within a short span and moved on for new prey. The women accompanied by adolescents followed them to ascertain and finish the task.
Even to the most cruel, it would appear unbelievable that apart from five gruesome murders, 19 other non-murder victims had their skulls broken and limbs severed. Fourteen of the latter could escape death because they fell unconscious and were found in a pool of blood and were therefore taken to be dead. The remaining five who were not unconscious ran for their lives and hid in all kinds of unlikely places to escape death.
Even in the notorious Karamchedu or Chundur cases, which were as gruesome and large-scale as the present one, there was no direct involvement of women, let alone children. What is alarming is that despite the active participation of the Turpu Kapu women and children in the attack, no enquiry was pursued on this aspect. No cases were filed and no one arrested. This is clear evidence of the shabby work done by the investigating agency and points to a dilution of the cases.
Dalit Representation?
What is of an equal concern is the fact that the Laxmipet atrocity happened at a time when all the local administrative functionaries in charge of law and order – the chief inspector (CI), additional ­superintendent of police (ASP), deputy superintendent of police (DSP) and mandal revenue officer (MRO) – were SCs. Sensing the gravity of the situation, the sarpanch’s husband Chittiri Gangulu informed the local police but the latter arrived in the village only four hours later. The local Member of Legislative Assembly (MLA), also a member of the state cabinet, Kondru Murali, belongs to the dalit community. He is even said to have suggested to the dalits to give up their claims over the land and compromise with the Kapus. That he has not visited Laxmipet, a village in his constituency, even three months after the atrocity is worth noting.
The failure of the officials and politicians in preventing the incident gets further compounded by their inadequate efforts at initiating the justice mechanism – bringing the culprits to book and addressing the grievances of the victims. Anyone who visits Laxmipet would notice that even three months after the atro­city, despite a police camp in the village, the dalitwada is gripped by fear and ­insecurity of life and livelihood. This is only heightened by the suspicious visits of the influential Turpu Kapu men from the neighbouring villages.
The state government has responded by setting up a special court in Srikakulam to deliver justice on a fast-track basis through a government order (GO) issued on 26 September. The dalit organisations demand immediate withdrawal of this GO as it violates the SC/ST Atrocities Prevention Act, which clearly mandates that such a special court needs to be set up in Laxmipet itself where the atrocities happened. It is also reported that dalit organisations propose a four-day padayatra from Laxmipet to Srikakulam, a distance of 90 kilometres, to show solidarity with and instil a sense of security among the dalits of Laxmipet.

source : Vol - XLVII No. 47-48, December 01, 2012 Hyderabad Political Economy Grou

http://www.epw.in/commentary/laxmipet-dalit-killings.html 

Friday, November 23, 2012

ఇదేమి భావ దారిద్య్రం? - అద్దంకి దయాకర్విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే గీతమ్మ విషయంలో కోదండరామ్‌ను విమర్శిస్తున్నారు, గీతారెడ్డిని విమర్శిస్తున్నారు, మాలలనూ వదలడం లేదు. ఇంతకన్నా భావ దారిద్య్రం లేదు... మొట్టమొదట కోదండరామ్‌ను ప్రశ్నించింది మేము, వివరణతో కూడిన క్షమాపణ కోరింది మేము. కోదండరామ్ తెలంగాణ ఉద్యమ నాయకుడు. అతని అంగీకారాన్ని మన్నించాల్సిన అవసరం అటు గీతారెడ్డితో పాటు ఇటు కుల, ప్రజాసంఘాలకు ఉంది. లేదంటే తెలంగాణ ఉద్యమానికి విఘాతం కలుగుతుంది. 

సామాజిక న్యాయం పేరిట సమాజంలో వచ్చిన మార్పును తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం పరిపాటి అయింది. సహజ న్యాయ సూత్రం నుంచే సమానత్వం, సామాజిక న్యాయం లాంటి సిద్ధాంతాలు పుట్టాయి. సమాజంలో అణిచివేయబడ్డ వర్గాలకు న్యాయం జరగాలనే దృష్టితో భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ఈ అంశాలకు ఇప్పుడిప్పుడే సామాజిక మద్దతు లభిస్తోంది. రాజ్యాంగ బద్ధమైన రిజర్వేషన్లు సమన్యాయానికి కొనసాగింపుగా ఫూలే సామాజిక న్యాయ సూత్రాన్ని, దాని ఆవశ్యకతను అంబేద్కర్ మరొక్కసారి సమాజం దృష్టిలోకి తెచ్చాడు. సామాజిక న్యాయ చైతన్యానికి సమాజం నుంచి మద్దతు పెంచుకోవడానికి కాకుండా దాన్ని ఇష్టానుసారం కొన్ని సంఘాలు వాడుకోవడం వల్లనే అసలు సమస్య మొదలవుతుంది. గీతారెడ్డిపై కోదండరాం చేసిన వ్యాఖ్యలను, అగ్రవర్ణాలు సైతం ఖండించిన మాట వాస్తవం.

దళితులపై ఎవరూ ఏ రకమైన అత్యాచారాలు, అవమానకర దాడులు చేసినా యావత్ దళిత సమాజంతో పాటు మానవతావాదులు, అగ్రకులాలకు చెందిన ప్రజాస్వామిక వాదులు గర్హిస్తూనే వస్తోన్నారు. గీతారెడ్డిపై కోదండరాం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడం, జరిగిన దానిపై అతను రెండు సార్లు క్షమాపణ చెప్పడం, దాన్ని గీతారెడ్డి అంగీకరించకపోవడం లాంటి విషయాలు జరుగుతున్న క్రమంలోనే తెలంగాణ వ్యతిరేకులు, కోదండరామ్ వ్యతిరేకులు, మాల వ్యతిరేకులు కూడా దీన్ని వాడుకొని వారి అక్కసును వెళ్ళగక్కడం గమనిస్తున్నాము.

ఒకవైపు ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ఏ విధంగా ఈ అంశాన్ని వినియోగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంటే మరోవైపు తెలంగాణ వ్యతిరేక శక్తులు అతనిపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. తప్పు దొర్లిన మాట వాస్తవం. అలా అని చెప్పి పదే పదే ఆ అంశాన్ని నాన్చి లబ్ధి పొందాలనుకోవడం స్వార్థం. గీతారెడ్డి ప్రస్తుత ప్రభుత్వంలో కీలక మంత్రి. ఉద్యమ నేత ఈశ్వరీ బాయి కుమార్తె కావడం వల్ల ఆమెకు సమాజంలో అన్ని వర్గాల నుంచి మద్దతు లభించడం చూశాము. మరో వైపు చుండూరు, కారంచేడు సంఘటనల అనంతరం తన అగ్రవర్ణ బహిరంగ సూచిక అయిన రెడ్డిని కత్తిరించుకున్న దళిత అనుకూల కోదండరాంను అందరూ విమర్శించడం చూశాము. సంఘటన జరిగిన తీరు, దానికి లభించిన మద్దతు, విమర్శలను ఎవరూ వ్యతిరేకించలేదు. అది ప్రజాస్వామికమైన చర్చే ఆశ్చర్యంగా.. కోదండరాం అంశంలో మాలలను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చెయ్యడం విడ్డూరం. ఒకరు గీతారెడ్డికి మద్దతు చెపుతూనే మీరు దళితుల పక్షాన నిలబడాలంటూ కోదండరాం పటేల్ గిరిని ప్రశ్నిస్తారు.

ప్రతిఘాతమైన శక్తిగా తెలంగాణ మాల మహానాడును చిత్రీకరించడం ఒక పద్ధతి ప్రకారం జరిగిన కుట్రగా భావిస్తున్నాము. గీతారెడ్డిపై వ్యాఖ్యలు చేసిన కోదండరామ్‌కు, జేఏసీలో మా సంఘం భాగస్వామిగా ఉండడానికి సంబంధమేమిటి? తెలంగాణ శక్తులన్నింటినీ ఏకం చేసేందుకు ఏర్పాటైన ఒక ఫెడరల్ కాన్సెప్ట్‌తో ఏర్పడ్డ సంస్థ తెలంగాణ జేఏసీ. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాలల భాగస్వామ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో పాటు, మా హక్కుల రక్షణ కోసం ఏర్పడ్డ సంస్థ తెలంగాణ మాల మహానాడు. దీనిలో మాదిగ దండోరా ఉండకూడదని ఎవరూ అడ్డుకోలేదు. అగ్రవర్ణాల నాయక త్వం క్రింద పనిచేయలేమనో... మరో అంశంతోనో విభేదించి మాదిగ నాయకత్వం జేఏసీ నుంచి వెళ్ళిపోయింది.

కానీ మాదిగ నాయకులున్నారనేది వారికి తెలియదు. నువ్వు లేనిది అడుక్కో, కానీ నేనెందుకున్నానని ప్రశ్నించడం అవివేకం. ఒక విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే గీతమ్మ విషయంలో కోదండరామ్‌ను విమర్శిస్తున్నారు, గీతారెడ్డిని విమర్శిస్తున్నారు, మాలలను కూడా వదలడం లేదు. ఇంతకన్నా భావ దారిద్య్రం లేదు. దీనిమీద మిమ్మల్ని స్పందించమన్నదెవరు? మాలలను దోషులుగా నిలబెట్ట మంటున్నదెవరు? ఇదీ ఒక కుట్రేనా? తెలంగాణలో దళితులు ఎలా ఉండాలో నిర్దేశించేదీ వీళ్ళే. ఉద్యమకారులను, అగ్రవర్ణాలను దోషులు చేసేదీ వీళ్ళే. చివరికి బాధితులను కూడా బోనులో నిలబెట్టేది వీళ్ళే. వీరే ఇంకో అడుగు ముందుకేసి జనాభా లెక్కలను తామే సేకరించి ప్రకటించారు. మాలలు 2శాతం ఉన్నారని, మాదిగలు 20 శాతం ఉన్నారని.... ఇంక జనాభా లెక్కల సేకరణ ఎందుకు? మాలలపై విషం వెళ్ళగక్కేందుకు ఇంత దిగజారాలా? ఇంతకూ గీతారెడ్డిపై ప్రేమో కోదండరామ్‌పైనా, మా సంఘం పైనా ఎందుకింత కోపమో ఇంకా అర్థం కాలేదు కానీ... ఈ అంశం ద్వారా మళ్ళొక్కసారి చర్చకు రావడానికి ప్రయత్నించిన మిత్రులకు స్వాగతం.

మాదిగల కోసం కానీ తెలంగాణ కోసం కానీ కనీసం ప్రయత్నించని వ్యక్తులే ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. ఉద్యమించని మీకు ప్రశ్నించే నైతిక హక్కు ఎక్కడిది? ఉద్యమంలో పనిచేయకుండా పటేల్ గిరి కావాలని కోరుకుంటున్నారు. దాని కోసం దాదాగిరి చేస్తే రాదు. పటేల్‌ల నాయకత్వంలో సమాంతర ఉద్యమాన్ని చేయొచ్చుగా! అది చేతకాదు. పటేళ్ళను విమర్శించడమే పనిగా ఎందుకు పెట్టుకున్నారు? గీతారెడ్డి అంశాన్ని అవకాశంగా తీసుకొని కోదండరామిరెడ్డిని చెడ్డ పటేల్ చేశారు. రెడ్డయినా, దొరయినా ఇంత కాల్చుకు తినాలా? గతంలో గీతారెడ్డి తెలంగాణ ప్రాంతంలో వీరోచితమైన పోరాటం చేసిన యోధురాలి తనయ. ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ కంటే సీనియర్ మంత్రి. వాస్తవానికి ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవి రాకుండా చేసిన నాడు ఏం చేశారు?

ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి పటేల్ గిరిని ప్రశ్నించలేదు. సామాజిక న్యాయానికి కూడా రిజర్వేషన్లు ఉంటాయా? అది కూడా కులాలవారీగానా? ప్రాంతాల వారీగానా? చెప్పాలి. గీతారెడ్డి సంఘటనలో స్పందించాల్సింది మేము. జరిగిన విషయాన్ని పెంచడం వల్ల ఉద్యమానికి విఘాతం కలుగుతుందనే భావన, స్వయంగా మేము జేఏసీలో ఉండడం, జేఏసీలోని పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాలు, దళిత పక్షపాతంగా ఉండడం వల్ల అందరం బాధపడే క్షమాపణలు కోరడం జరిగింది. చెప్పిన క్షమాపణలను రాజకీయం చేశారు. మరీ విచిత్రమైన విమర్శలు చేస్తున్నారు- మాల మహానాడు కోదండరాంకు మద్దతునిస్తుంటే దండోరా గీతారెడ్డి వైపు నిలబడిందని. మొట్టమొదట కోదండరామ్‌ను ప్రశ్నించింది మేము, వివరణతో కూడిన క్షమాపణ కోరింది మేము. కోదండరామ్ తెలంగాణ ఉద్యమ నాయకుడు. అతని అంగీకారాన్ని మన్నించాల్సిన అవసరం అటు గీతారెడ్డికి, ఇటు కుల, ప్రజాసంఘాలకు ఉంది. లేదంటే తెలంగాణ ఉద్యమానికి విఘాతం కలుగుతుంది.

వేలు మనదే -కన్ను మనదే. దళితుల ఆత్మగౌరవం ఎంతగొప్పదో ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం అంతే గొప్పది. ఎందుకంటే 90 శాతం బడుగుల కోసం ఆధిపత్య కులాలు ఉద్యమిస్తున్నప్పుడు సమీకరించాలనే సదుద్దేశంతో బడుగులందరం కలిసి నడవాలి. దీనికి సహకరించని వాళ్ళే ఇప్పుడు కోదండరామ్‌పై విరుచుకు పడుతున్నారు. తప్పు జరగడాన్ని తప్పుబట్టడం తప్పు. జరిగిన తప్పు చేసిన వ్యక్తి పశ్చాత్తాపాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. తప్పుపై జరుగుతున్న చర్చ సమస్య పరిష్కారం దిశగా కాకు ండా సమస్యను జటిలం చేసే వైపు పయనించడాన్ని ప్రశ్నిస్తున్నాము. ఈ సంఘటన ద్వారా మాల, మాదిగ సంఘాలు మూకుమ్మడిగా స్పందించి మేమంతా ఒక్కటే అనే నినాదంతో ముందుకు సాగారు. అది సంతోషించాల్సింది పోయి వైరుధ్యాలను పెంచేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం కావట్లేదు. 

మాల, మాదిగల మధ్య ఉన్న వర్గీకరణ సమస్య వల్ల 1.5 కోట్ల మంది దళితులు బాధపడుతున్నారు. ఆ సమస్య పరిష్కారానికి ఏ ఒక్క మాదిగ నాయకుడు ముందుకురాడు. సమస్యను సమస్యగానే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పరిష్కారం కోసం ఆలోచించేవారే లేరు. ఎన్నోసార్లు మా సంఘం చేసింది ఆ ప్రయత్నం. ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుందామంటే కలిసిరారు. వర్గీకరణపై చర్చించుకుందామంటే ఒప్పుకోరు. దేశ జనాభాలో 18.3 శాతంగా ఉన్న దళితులకు రిజర్వేషన్లు పెంచమని ఎందుకు కోరడం లేదు? వర్గీకరణ మీద రాద్దాంతం చేసే నాయకులందరికీ ఒక విన్నపం. మాదిగల పట్ల మాకు వ్యతరేకత లేదు.

మాదిగ నాయకత్వంపైనే. వర్గీకరణ వల్ల నష్టపోయే దైనా లాభపడేదైనా మాలలే. మాలల సమ్మతం లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా శూన్యం. అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్న పార్టీలు దళితులనెప్పుడూ విభజించడానికే ప్రయత్నిస్తూ మాదిగలవైపే ఉంటాయి...అన్యాయంగా మాలలపై అసత్య ప్రచారాలు చేసిన మేధావుల, రాజకీయనాయకుల, ప్రజాసంఘాల, విప్లవ సంఘాలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. వర్గీకరణను అగ్రకుల ప్రభుత్వాలు ఎలా వాడుకుంటున్నాయనేది. ఇంకా మాల, మాదిగల మధ్య వైరుధ్యాలను పెంచి, వైషమ్యాలవైపు తీసుకెళ్ళొద్దని కొందరు మాదిగ నాయకులను కోరుతున్నాము. మీకు చేతనైతే, వీలైతే వర్గీకరణ సాధన కోసం ప్రభుత్వాలపై పోరాడండి మాలలపై కాదు. మీ లక్ష్యం వర్గీకరణఫై ఉండాలి కానీ మాలనాయకత్వం ఉన్న దగ్గర కావద్దు.

మీరు తెలంగాణ ఉద్యమంలో ఉండరు. ఆ ఉద్యమాల్లో ఉన్న మాలనాయకత్వాన్ని విమర్శిస్తారు. రాజకీయ పార్టీలో ఎదిగిన మాల నాయకత్వంపై పోటీగా ఎదగాలని విమర్శిస్తారు. ఎక్కడైనా మాలలుంటే వారే లక్ష్యంగా పనిచేయడం పరిపాటి అయింది... కమ్యూనల్ బ్లాక్ మెయిలింగ్ మొనాటనీ అయిపోయింది. ఇక సాగదు. ఒక సమస్యతోని ఇద్దరు ముగ్గురిని టార్గెట్ చేస్తే గొప్ప అనుకుని భంగ పడవద్దు. ఇక్కడ కోదండరామ్ చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపి మాలల మీద, ఇటు గీతారెడ్డి మీద ఉన్న వ్యతిరేకతను వెళ్ళగక్కినందుకు మాకేమీ బాధలేదు. తెలంగాణలో కూడా వర్గీకరణ పేరు మీద దళితులను విడగొట్టేందుకు సీమాంధ్ర మాదిగలు ప్రయత్నిస్తున్నారు. ఇది తప్పు. వర్గీకరణపై చర్చించడానికి మేము సిద్ధం. రండి సమస్యను పరిష్కరించుకుందాం. కలిసి పోరాడుదాం.

- అద్దంకి దయాకర్
వ్యవస్థాపక అధ్యక్షులు - తెలంగాణ మాల మహానాడు
అధికార ప్రతినిధి - తెలంగాణ జేఏసీ

Andhra Jyothi News Paper Dated: 24/11/2012

Wednesday, November 21, 2012

భారతదేశ పరిణామంలో బాల్‌ఠాక్రే ---హరగోపాల్బాల్‌ఠాక్రే మరణాన్ని దేశంలోని మీడియా ముఖ్యంగా ఇంగ్లిషు మీడియా గంటల తరబడి ప్రసారం చేసింది. ఠాక్రే ఎదిగిన పద్ధతిని ఆయన గుణగణాల్ని సుదీర్ఘంగా విశ్లేషకులు చర్చించారు. అయితే చర్చ మరీ దారితప్పకుండా కొంత సమన్వయాన్ని పాటించింది. ఆయన పాత్రను విశ్లేషణాత్మకంగా, విమర్శనాత్మకంగా, తులనాత్మకంగా అంచనా వేశారు. అంతవరకు మీడియాను హర్షించవలసిందే. కానీ కొందరు విశ్లేషకులు ఠాక్రే ను మించిన నాయకుడు లేడని, అలాగే కార్టూనిస్టుగా ఆయన ముందు ప్రపంచంలో ఎవ్వరు నిలువలేరనే లాంటి వ్యాఖ్యానాలు కూడా చేశారు. ఇక ఆయన అంతిమ యాత్రకు వచ్చిన జనాన్ని- ఐదు లక్షల దగ్గర ప్రారంభమై, 25 లక్షల దాకా ఊహకు అందనట్టుగా అంచనాలు వేశారు. టీవీల్లో చూపించే సంఖ్య చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే మహారాష్ట్రియన్లు అతిపెద్ద సంఖ్యలో పాల్గొన్న మాట నిజం. ఠాక్రే పాత్ర ఏమిటి అన్నది పక్కకుపెట్టి, ఇంతపెద్ద సంఖ్యలో ఆయనను అభిమానించే ఈ జనం ఎవ్వరు? ఎందుకు ఒక సనాతన సంప్రదాయవాది, ముస్లింల మీద దక్షిణ, ఉత్తర భారతవాసుల మీద దాడులు రెచ్చగొట్టిన వ్యక్తిని అభిమానించడం అనేది విశ్లేషించవలసి ఉంటుంది.

ఠాక్రే విద్వేష రాజకీయాల నుంచి లేదా వాటి ఆధారంగా మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబయి నగరంలో ఒక ప్రధాన నాయకుడిగా ఎలా ఎదిగాడు అని ఆలోచిస్తే, బాల్ ఠాక్రే నమూనా మన సామాజిక, రాజకీయ మార్పు దిశని, దశని చాటుతుంది. ముంబయి నగరం భారత దేశ ఆర్థిక రాజధాని. చాలా ముందుగా పారిక్షిశామికీకరణ చెందిన నగరం. ఇక్కడి ట్రేడ్ యూనియన్లు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడమే కాక, ముంబాయిని మతాతీత సెక్యులర్ నగరంగా నిలబెట్టాయి. పెట్టుబడికి కూడా అది అప్పటి చారివూతక అవసరం. స్వాతంవూత్యానంతరం భారత పార్లమెంటుకు వామపక్షవాది, సామ్రాజ్యవాద వ్యతిరేకి కృష్ణమీనన్‌ను ఎన్నుకున్న విశాల భావాల నగరమిది. అప్పటికి మీనన్ దక్షిణ భారత ప్రాంతం వాడని కాని, కేరళవాడు అని కాని ఎవ్వరూ అనలేదు, అనుకోలేదు. తర్వాత జార్జ్ ఫెర్నాండెజ్‌ను నాయకుడిగా నిలబెట్టిన నగరమిది. ఈ ప్రజాస్వామిక సంస్కృతి మారుతూ, 60లలోనే బాల్‌ఠాక్రే ఒక నాయకుడిగా ఎదగడం ప్రారంభమై, శివసేన నిర్మాణమై, ఠాక్రే మహారాష్ట్ర రాజకీయా లను నిర్దేశించి, చివరకు ముఖ్యమంత్రి ఎవ్వరు అని నిర్ణయించే కీలక దశకు చేరుకున్నాడు. ఈ పరిణామం సెక్యులర్, ప్రజాస్వామ్య సంస్కృతి విధ్వంసానికి దారితీసి, ప్రాంతీయ, అస్తిత్వ రాజకీయాలకు బీజం వేసి, విష వృక్షంగా పెరిగింది.

జాతీయపార్టీ అయిన హిందూ మతతత్వ భారతీయ జనతా పార్టీ కూడా సమాంతరంగా ఎదుగుతూ వచ్చింది. అయితే హిందూ ‘అస్తిత్వ’ రాజకీయాల మీద పెరిగిన పార్టీ, ‘విశ్వ’హిందూ పరిషత్‌ను ప్రోత్సహించిన పార్టీ, ఉత్తర భారత, దక్షిణ భారత హిందువులను ద్వేషించిన బాల్ ఠాక్రేకు ఎలా మద్దతు ఇచ్చింది? బీహార్ వాసులను, తమిళులను, అలాగే ఇతరుల మీద దాడులు చేసినప్పు డు ఏం చేసింది? ఎందుకు మౌనంగా ఉన్నది? అనే ప్రశ్నలు కూడా అడగవలసి ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి, బాల్ ఠాక్రేకు ఉమ్మడి శత్రువు ట్రేడ్ యూనియన్ ఉద్యమం, వామపక్ష రాజకీయాలు. అలాగే ముస్లింలు. మత తత్వ రాజకీయాల నిజ స్వరూపం అదేనని అర్థం చేసుకోవాలి. విద్వేష రాజకీయాలకు తాము ‘శవూతువు’ అనుకునేవాడి మీద అసహ్యం ఎక్కువ పాళ్లల్లో ఉండడం వల్ల ఉదారవాద రాజకీయాలు కూడా గిట్టవు. అక్కడే కాంగ్రెస్ పార్టీలో ఎంత హిపోక్షికసి ఉన్నా, మతతత్వ పార్టీల కంటే మెరుగు అనే భావన చాలా మందిలో ఉంది. ఆ సామాజిక మద్దతు కాంగ్రెస్ పార్టీని ఇంకా పార్లమెంటరీ రాజకీయాల్లో నిలబెట్టింది. 

ముంబాయి నగరం 1970ల వరకే పారిక్షిశామిక సంక్షోభాన్ని అనుభవిస్తూ, 1980 దశాబ్దం వరకు నూలు పరిక్షిశమ దెబ్బతినడంతో దత్తా సామం త్ దాదాపు చివరి ట్రేడ్ యూనియన్ నాయకుడిగా నిస్సహాయ స్థితిలోకి నెట్టబడ్డాడు. లక్షలాదిమంది కార్మికులు వీధి పాలు కావడంతో, అవకాశాలు తగ్గి, ఉన్న అవకాశాలు పోగొట్టుకున్న కార్మికులు ఒకవైపు, కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్న శ్రామికులు మరోవైపు ఉండడంతో, విద్వేష రాజకీయాలను రెచ్చగొట్టడం చాలా సులభమయ్యింది. నూలు పరిక్షిశమతో దెబ్బతిన్న గుజరాత్ శ్రామికులు తిరిగి తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోవడంతో బాంబే మిల్లుల సంక్షోభం గుజరాత్‌కు చేరుకుని అక్కడ విద్వేష రాజకీయాలను పెంచి పోషించింది. గుజరాత్‌ను ఐదు దశాబ్దాలుగా అధ్యయనం చేస్తు న్న జాన్‌వూబెమన్ గుజరాత్ మతకల్లోలాల మీద రాసిన వ్యాసంలో ఈ అంశా న్ని ప్రస్తావించాడు. 

గుజరాత్ మారణకాండ భారతదేశ నాగరికతకు, సంస్కృతికి, ప్రజాస్వామ్యానికి సెక్యులరిజానికి ఎన్నడూ మాసిపోని అమానుష మచ్చగా ఉండిపోతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం నుంచి పుట్టిన నరేంవూదమోడీ ఆ సంక్షోభానికి పరిష్కారంగా కనిపించడం భారత రాజకీయాలలో ఒక పెద్ద విషాదం.
1960 దశాబ్దం చివర పెరిగిన అస్తిత్వ రాజకీయాలు సైద్ధాంతిక రాజకీయాలకు సవాలుగా మారాయి. అన్ని అస్తిత్వాలు అప్రజాస్వామికమని కాదు కానీ, బడుగు వర్గాల అస్తిత్వ రాజకీయాలకు ఒక సమక్షిగమైన ప్రాపంచిక దృక్పథం లేకుండా ఒక ప్రత్యామ్నాయ సమాజం కాని, సామాజిక సంబంధాలు కాని సాధ్యం కావు. ఒక రకంగా అస్తిత్వ రాజకీయాలు వామపక్ష రాజకీయాలకు, అలాగే రాడికల్ రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తాయి. 

ఆ దూరం లేకపోతే అస్తిత్వం, తన అస్తిత్వాన్ని కోలుపోతుందని భావిస్తున్నాయి. అలాగే పార్లమెంటరీ వామపక్షాలు ఏమితోచని పరిస్థితిలోకి నెట్టబడ్డాయి. మతతత్వ, అస్తిత్వ రాజకీయాలను ఎలా ఎదుర్కొవాలి. అలాగే ప్రజాస్వామిక ఆకాంక్ష నుంచి ఎదిగిన అస్తిత్వాలతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి అనే అంశం మీద వాళ్ళకు స్పష్టత లేదు. విప్లవ రాజకీయాలు ఎన్నో ప్రాణ త్యాగాలు చేసినా అణచబడ్డ వర్గాల అస్తిత్వాలు కూడా కొంతవరకు ఆ రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నాయి.

ఈ పరిమితులు సనాతన, సంప్రదాయ, నిచ్చె న మెట్ల సామాజిక మార్పులో భాగమా, ఇది అస్తిత్వాల పరిమితా లేక చారివూతక పరిణామపు మలుపులలో ఒక అనివార్యమా అన్న అంశాల మీద క్రియాత్మక రాజకీయ ప్రయోగాలు కావాలి. సృజనాత్మక పరిశీలన, పరిశోధన, తీవ్రమైన మేధోమథనం జరగాలి. మార్పు కోసం నిరంత రం శ్రమ పడుతున్న రాజకీయాల వైఫల్యమే బాల్ ఠాక్రే అనే నాయకుడి జననానికి, జనంలో ఆ నాయకత్వం పెరగడానికి కారణం అని భావించ వలసి ఉంటుంది.

సామాజిక మార్పు జరగవలసిన రీతిలో జరగకపోవడం వలన భూస్వామ్య భావజాలం కొనసాగడం వల్ల దేశంలో ఒకరకమైన ఫాసిజం పెరిగే ప్రమాదం చాలా దగ్గరలో ఉన్నది. ఒక ముస్లిం అమ్మాయి ఫేస్ బుక్‌లో ఒక హిందూ అమ్మాయికి పంపిన అభివూపాయం వాళ్లిదరి అరెస్టుకు దారితీయడం దేన్ని సూచిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ ప్రమా దం తెలంగాణ అస్తిత్వ పోరాట సృహతో నిరంతరంగా ఉండాలి. 1969 ఉద్యమంలో ఎన్ని ఒడుదొడుకులు ఉన్నా, అది కూడా ఒక అస్తిత్వ ఉద్యమ మే అయినా, తెలంగాణలో ఉండే పోరాట వారసత్వం అలాంటి రాజకీయాలను ఎదగనివ్వలేదు. కాని ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం ఆ దిశగా వెళ్ళే సూచికలు కనిపిస్తున్నాయి. చరిత్రతో, మతంతో సంబంధం లేని ఒక కట్టడం ఇన్నేళ్ల తర్వాత మత విద్వేషాలకు కారణం కావడం తెలంగాణ ఉద్యమ పరిమితులను సూచిస్తున్నది. తెలంగాణ భవిష్యత్తుకు సవాలుగా మారనుంది. తెలంగాణ అస్తిత్వ పోరాటం ప్రజాస్వామ్య విస్తృతికి, ఉన్నతమైన సామాజిక సంబంధాలకు దారితీయాలే కాని బాల్‌ఠాక్రేకు వారసులు కాకూడదు.

ప్రొఫెసర్ జి. హరగోపా
Namasete Telangana News Paper Dated: 22/11/2012