Sunday, September 4, 2011

పౌర సమాజం.పజలు.పజాస్వామ్యం! పొ. ఘంటా చక్రపాణి Namasethe Telangana 30/08/2011


పౌర సమాజం.పజలు.పజాస్వామ్యం!
పొ. ఘంటా చక్రపాణి
సామాజిక పరిశోధకులు
అనుకున్నట్టుగానే జరిగింది. భారత పార్లమెంటు అసాధారణ రీతిలో బాబూరావు హజారే అలియాస్ అన్నా హజారేకు జీ హుజూర్ అంటూ సాగి ల పడింది. దీనివల్ల అవినీతిలో కూరుకుపోయిన తరువాత వ్యక్తులైనా, వ్యవస్థలైనా సమర్థించుకోవడం సాధ్యపడదని,ఎంతటి బలహీనుల ముందైనా తలవంచక తప్పదని మరోసారి రుజువయింది.వ్యక్తిగా,సిద్ధాంత పరంగా అన్నా హజారే పెద్ద బలవంతుడేమీ కాకపోయినా, ఎంచుకున్న ఎజెండా వల్ల ఆయన కొందరికి భగవంతుడి అవతారంగా కనిపిస్తున్నాడు. పెద్దగా చదువుకోకపోయినా ఆయన ఇప్పుడు భారతీయ ఆధునికులకు కొత్త పాటలు నేర్పిస్తోన్న గురువుగా మారిపోయాడు. కంప్యూటర్లు కనిపెట్టాక ఇంట్నట్ (సైబర్ స్పేస్) మీద ఇంత తక్కువ కాలంలో అంత పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తీ ఇంకెవరూ లేరని ఇప్పుడు సాఫ్ట్‌వేర్ నిపుణులు లెక్కలు గట్టి మరీ చెబుతున్నారు. పైగా ప్రపంచంలో ఇవాళ అన్ని దేశాల పత్రికల్లో అన్నా గురించి రాస్తున్నారు.
రేపో, మాపో అతని పేరును నోబెల్ ప్రైజ్ లాంటి అత్యున్నత పురస్కారానికి సిఫార్సు చేసినా ఆశ్చర్యం లేదు. ఇది అతని జీవితంలో ఊహించని విజయం. ఈ విజయం వెనుక నిరంతర కృషి, జీవితాంతం ఆచరించిన ఆదర్శమేదో ఉందనుకుంటే పొరపాటే. నిజానికి అతనొక సాధారణమైన పౌరుడు. అరవైయేళ్ల క్రితమే అత్యంత నిరాశాజనకమైన జీవితంతో విసిగిపోయిన యువకుడిగా తానిక జీవితంలో ఏమీ సాధించలేనని, బతకడమే దుర్భరమై, చావుతప్ప తనకు గత్యంతరం లేదని రెండు పేజీల లేఖ రాసి ఆత్మహత్యకు పూనుకున్న బాబూరావు హజారే తానే అన్నా హజారేగా అవతరిస్తానని ఊహించి ఉండడు. ఆత్మహత్య సంకల్పం నుంచి బయటపడ్డ హజారే తర్వాత భారత సైన్యంలో సాధారణ డ్రైవర్‌గా పదిహేనేళ్లు పనిచేసి పదవీ విరమణ చేసి తన స్వగ్రామంలో ఉంటూ సంఘ సేవకుడిగా మారిపోయాడు. అన్నాహజారే జీవితం, సాధించిన విజయం ఆత్మహత్య ఆలోచనలో ఉన్న వాళ్లకొక పాఠం అవుతుంది.
అన్నా విజయం వెనుక కేవలం ఆయన వ్యక్తిగత కృషి మాత్ర మే కాదు. దేశ, విదేశాల్లో ఉంటూ అవినీతి అంతమైతే సమాజం బాగుపడుతుందనుకుంటున్న కోట్లాదిమంది ఆశలు, అలాంటి భావనకు బీజం వేసిన మీడియా మద్దతు, పౌర సమాజ ప్రయ త్నమూ ఉంది. మధ్య, ఉన్నత వర్గాల నుంచి అండ అన్నా ఉద్యమానికి లభించింది. మన రాజకీయ పార్టీల్లో ఏ ఒక్కరికి కూడా అన్నా ఎజెండాతో ఏకాభివూపాయం లేకపోయినా ఈ ఒత్తిడి వల్ల పార్లమెంటులో తమ తమ అభ్యంతరాలను పక్కనపెట్టి అన్నా సూచనలకు ఆగమేఘాల మీద ఆమోదముద్ర వేశారు. ఇప్పుడు ఎన్నికల సంస్కరణల పేరుతో పాలక వర్గాలకు అన్నా మరో కొత్త సవాలు విసురుతున్నారు. భవిష్యత్తులో ఎవలా స్పందిస్తారో వేచి చూ ద్దాం.
ఇప్పటికైతే అన్నా పుణ్యమా అని దేశంలో సమస్యలన్నీ మాయమైపోయి ఇప్పుడు పౌరసమాజమే ప్రధాన అంశమైపోయింది. జాతీయ మీడియా ఇప్పుడిప్పుడే అన్నా భక్తి పారవశ్యంలో నుంచి కాస్త బయటపడినట్టు కనిపిస్తున్నప్పటికీ, తెలుగు మీడియా మాత్రం తనదైన శైలిలో విడతల వారీగా కాసేపు అన్నా గురించి, మరికాసేపు జగనన్న గురించి తన వినోదాత్మక కథనాలతో ప్రజావాహినికి అవినీతి బోధ చేస్తోంది. ఇలా చేయడం వల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి ప్రజల్లో అవినీతి పట్ల ఏవగింపు ఉంది కాబట్టి మేము సైతం అవినీతికి వ్యతిరేకం అని క్రెడిట్ కొట్టేయవచ్చు. రెండోది తెలంగాణ అంశానికి తాత్కాలికంగానైనా తెరవేయవచ్చు. అందులో ఒక రకంగా మన మీడియాతో పాటు పాలక పక్షాలు సైతం పాక్షికంగానైనా విజయం సాధించినట్టే భావించాలి. తెలంగాణలోని సకల జనుల సమ్మెకు సమాయ త్తం కావాలని ప్రొఫెసర్ కోదండరాం కాలికి బలపం కట్టుకుని మరీ ప్రచా రం చేస్తున్నారు. కొన్నాళ్లుగా ఆయన ఏదో ఒక జిల్లాకు వెళ్లి ప్రజలను ఉద్యమ పంథాలోకి నడిపిస్తున్నారు.
చాలాచోట్ల ఆంధ్రా నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ వేలాదిమంది కూడా తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టాలని ఊరేగింపులు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణ కోసం పోరాడుతున్న డాక్టర్లను గాడిదలని నోరుజారిన వైద్యశాఖ మంత్రి సుదర్శన్‌డ్డి చేసిన తప్పుకు చెంపలేసుకున్నారు. వరంగల్‌లో ఒక న్యాయమూర్తి తెలంగాణ న్యాయవాదులకు ఉద్యమాలు వద్దంటూ నీతిబోధ చేయాలని చూస్తే న్యాయవాదులం తా అతనికే హితబోధ చేసినట్టు వింటున్నాం. మరోవైపు తెలంగాణ అన్న ఉద్యోగులను, విద్యార్థులను, న్యాయవాదులను ప్రభుత్వం, పోలీసులు వేటా డి పట్టుకుని జైళ్లలో పెడుతున్నారు. ఇవేవీ తెలుగు మీడియా దృష్టికి రాలేదు. ఈ విషయాలపై చర్చ లేదు. ఈ వారం రోజుల్లో ఎవ్వరూ తెలంగాణ ఊసే ఎత్తలేదు. తాము తప్ప వేరే సమాజమే లేదన్నట్టుగా నిరంతరం విశ్వసించే మన మీడియా ఇప్పుడు పౌర సమాజం గురించి పెద్ద పెద్ద మాటలు చెపుతోంది.
మీడియా దృష్టిలో ప్రొఫెసర్ కోదండరాం పౌర సమాజ ప్రతినిధి కాదు. తెలంగాణ పౌరులందరి ఆకాంక్షలకు వేదికలుగా ఏర్పడ్డ జాయింట్ యాక్షన్ కమిటీలు పౌర సమాజం కాదు! గుడ్డిలో మెల్లగా ఈ అందరి ఆకాంక్షలకు ప్రతినిధులుగా రాజీనామాలు చేసిన వందలాది మంది ప్రజా ప్రతినిధులు కూడా పౌర సమాజం కాదు. స్పీకర్ గారి దృష్టిలో కూడా చిత్తశుద్ధి లేదు. ఒక్క మీడియానే కాదు, సమాజం గురించి ఏ ఒక్కరోజు కూడా అస్స లు పట్టించుకోని వాళ్లు ఇవాళ పౌర సమాజం గొప్పతనాన్ని ప్రస్తుతిస్తున్నారు. ఇంతకీ పౌర సమాజం అంటే ఏమిటి? మన సమాజానికి (మానవ సమాజానికి) పౌర సమాజానికి తేడా ఏమిటి అన్న విషయాలు తెలుసుకోవాలి. ఇటు పౌరులకు, అటు సమాజానికి జవాబుదారీగా ఉండలేని వాళ్లు ఎందుకు పౌర సమాజాన్ని నెత్తినెత్తుకుంటున్నారు? అన్న విషయాలూ ఆలోచించాలి.
సమాజం అంటే మనందరం. ఈ దేశంలో, రాష్ట్రంలో ఉన్న పౌరులంద రం కలిస్తేనే భారతీయ సమాజమో, తెలుగు సమాజమో, తెలంగాణ సమాజమో అవుతాం.
ఈ పౌరులంతా పరస్పరం సహకరించుకుం ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటేనో దాన్ని సమాజం అంటాం. రాజ్యాంగం పుణ్యమా అని అందరికి సమాన పౌరసత్వం ఉంది గానీ ఇంకా సామాజిక భావనే పూర్తిగా మనలో లేదు. ఇంకా కుల సమాజంతోనో, మత సమాజంతోనో గుర్తింపు పొందే స్థితిలో మనం ఉన్నాం. ఒకవేళ చాలా ఉదారంగా మనదంతా ఒకటే భారతీయ సమాజం అనుకున్నా, భారతీయులంతా మన సహోదరులని భావించినా ఎవరి సంస్కృతులు, భాషలు, జీవన విధానాలు, అస్తిత్వాలు వారికున్నాయి. మన దేశంలో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టే మనం రాజకీయంగా ‘ప్రాతినిధ్య తరహా ప్రజాస్వామ్యంలో’ ఉన్నాం. అంటే అమెరికాలో లాగా అందరం ఒకే వ్యక్తికీ ఓటేసి ఎన్నుకోకుండా మన మన నాయకులను ఎన్నుకుని చట్టసభలకు పంపిస్తున్నాం. ఆ ప్రతినిధులు మన అవసరాలు, ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తుంటారు. అయినా ప్రభుత్వాలు మన ఆకాంక్షలకు అనుగుణంగా నడవడం లేదు. మన ప్రతినిధుల మాట చెల్లడం లేదు. మాట చెల్లనందుకు నిరసనగా రాజీనామాలు చేసినా అవీ చెల్ల డం లేదు. దానికోసం కూడా పోరాటాలు చేయవలసి వస్తోంది.
అటువంటి ది హటాత్తుగా నలుగురు వ్యక్తులు పౌర సమాజం పేరుతో తెరమీదకు వచ్చి, ఈ దేశ పౌరులందరికీ తామే ప్రతినిధులం అని చెప్పుకోవడం విడ్డూరం. విచివూతంగా వాళ్లు చెప్పుకున్నట్టే మనం కూడా వాళ్లను పౌర సమాజం అంటు న్నాం. నిజానికి పౌర సమాజం అనేది పాలకుల సృష్టి. సమాజానికి జవాబుదారులుగా లేని వాళ్లు సృష్టించిన వ్యవస్థ. ప్రజా జీవితంలో ఉండి, ప్రభుత్వేతరంగా ఉంటూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేసే సంస్థలను పౌర సమాజంగా ప్రపంచ బ్యాంకు పిలుస్తోంది. ప్రభుత్వాలు ప్రజల విశ్వసనీయ త కోల్పోతున్న రోజుల్లో సమాజానికి ప్రత్యామ్నాయంగా ప్రపంచబ్యాంకు పౌర సమాజాన్ని పెంచి పోషిస్తోంది. గతంలో స్వచ్ఛంద సేవా సంస్థలు ఉండే వి. సమాజ సేవా తత్పరత కలిగిన కొందరు సమాజంలో ఉన్న చెడు ధోరణులకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు. మంచిని బోధించేవారు. అటువంటి వ్యక్తులు, సంస్థలు కొన్ని ఆ తరువాత ఎన్జీవోలు అంటే ప్రభుత్వేతర సంస్థలుగా మారాయి. వీటికి ప్రభుత్వాల నుంచి, దేశ, విదేశాల నుంచి నిధులు అందుతాయి.
ఇక్కడి ప్రభుత్వాలు చేయలేకపోతున్న అభివృద్ధి పనులను ఈ సంస్థలు తమకు అందుతున్న నిధులతో చేస్తుంటాయి. అట్లా ఉన్న కొన్ని సంస్థలే అభివృద్ధి సంగతి పక్కనబెట్టి ఈ దేశాన్ని, చట్టాలను, పరిపాలన వ్యవస్థలను సంస్కరించాలన్న ప్రచారానికి పూనుకున్నాయి. చాలామంది చదువుకున్న వాళ్లు, పెద్దపెద్ద ఉద్యోగాల్లో ఉన్న వాళ్లు ప్రభుత్వంలో ఉండి దేశ ప్రగతిలో భాగం కావాల్సిన వాళ్లు, ఉద్యోగాలు వదిలేసో, పదవీ విరమణ చేసిన తరువాతో ఇలాంటి పనికి పూనుకుంటున్నారు. ఇలాంటి పనిలో వారికి ప్రభుత్వంలో కంటే ఎక్కువ జీతం, గౌరవం, హోదా దొరుకుతున్నాయి. లోక్‌సత్తా కూడా పార్టీగా మారకముందు అలా పౌర సమాజంగా చెలామణి అయింది. జయవూపకాశ్ నారాయణ్ ఐఎఎస్ అధికారి అయి ఉండీ, పదవీ విరమణ చేసి పౌరసమాజ ప్రతినిధిగా మారినట్టే, కిరణ్‌బేడీ కూడా తనే స్వయంగా ఎన్జీవోలు ఏర్పాటు చేసుకుని పౌరసమాజ ప్రతినిధిగా అవతరించింది. హజారే జీవితంలో కూడా ఈ మూడు దశలూ ఉన్నాయి.
సైన్యం నుంచి తిరిగి వచ్చాక తన స్వగ్రామమైన రాలేగాం సిద్ధిలో స్థిరపడ్డ అన్నా, ఆ ఊర్లో మద్యపానానికి వ్యతిరేకంగా, హిందూ ధర్మానికి అనుకూలంగా ప్రచా రం చేసి స్వచ్ఛంద సేవకుడిగా ఉండేవాడు. ఆ తరువాత ఎన్జీవో ప్రారంభించి గ్రామీణ నీటి పారుదల రంగంలో పనిచేశాడు. ఆ తరువాత పౌర సమాజ కార్యకర్తగా సమాచారహక్కు బిల్లు రూపొందించిన వారితో కలిసి పనిచేశాడు.
ఇట్లా ప్రభుత్వ, దేశ, విదేశ ప్రభుత్వేతర సంస్థల నుంచి పెద్ద మొత్తంలో నిధులు తీసుకుని ఇంతకాలం పాలకపక్షాలకు అనుబంధంగా, కొన్నిసార్లు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో పనిచేస్తూ వస్తోన్న వాళ్లను ఇప్పుడు మీడియా పౌర సమాజమని అంటోంది. నిజానికి అటు పౌరుల్లో భాగంగా లేనివాళ్లు, ఇటు సమాజంతో సంబంధం లేనివాళ్లే ఇవాళ పౌరసమాజం పేరుతో ప్రభుత్వాల కు వణుకు పుట్టిస్తున్నారు. పాలసీలు చేస్తామని ముందుకొస్తున్నారు. ఇంతకాలం ఇటు ప్రభుత్వాలు, అటు ప్రపంచబ్యాంకు లాంటి సంస్థలు వాళ్ల పనులకు, విధానాలకు జనామోదం ఉందని చెప్పుకోవడానికి ఈ సంస్థలను ఉమ్మడిగా వాడుకునేవి. ఇప్పుడు ప్రపంచీకరణ పేరుతో ప్రైవేటు రంగం విస్తరించాక అంతర్జాతీయ పెట్టుబడిదారీ సంస్థలు, కార్పొరేటు సంస్థలు కూడా వీటిని వాడుకుని కృత్రిమ ఉద్యమాలు సృష్టించి ఆయా దేశాల ప్రభుత్వాల మెడలు వంచి తమకు అనుకూలంగా ఉండే చట్టాలను తయారు చేసుకుంటున్నాయి.
గతంలో భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నప్పు డు దాన్ని పూర్తిగా వ్యతిరేకించే ప్రజా సంఘాలకు భిన్నంగా ఈ ‘పౌర సమాజమే భూసేకరణను చట్టబద్ధం చేయాలని వాదించింది. అలాగే ప్రపంచబ్యాంకు పారదర్శకత పేరుతో ప్రభుత్వం లోపల ఏమి జరుగుతుందో తనకు తెలియాలని శాసించినప్పుడు ఒకవైపు ప్రపంచబ్యాంకు పెత్తనాన్ని ప్రజలు వ్యతిరేకిస్తుంటే పౌర సమాజం మాత్రం సమాచార హక్కు కోసం లాబీయింగ్ చేయడమే కాక ప్రత్యామ్నాయంగా చట్టమే రూపొందించింది. దాన్ని గుడ్డిగా ఆమోదించిన ప్రభుత్వం ఇప్పుడు లోక్‌పాల్ చట్టం విషయంలో పౌరసమా జం ఉచ్చులో పడి పరువు తీసుకుంది.
అన్నా హజారే పౌరసమాజ ఉద్యమం పేరుతో చేస్తున్న ఆందోళన రెండు ప్రధాన పరిణామాలకు దారి తీయనుంది. ఈ ఉద్యమం ఈ దేశంలో ప్రజలు వేరు, పౌర సమాజం వేరని, ప్రజా ఉద్యమాలకు బెదరని ప్రభుత్వం పౌర సమాజం పేరుతో సాగే పెట్టుబడిదారీ ఉద్యమాలకు వణుకుతుందని ఇప్పటికే నిరూపించింది. అలాగే అవినీతి అనేది ప్రజలకు, ప్రభుత్వానికి మాత్ర మే సంబంధించిన అవలక్షణమని దీనితో కార్పొరేట్ మార్కెట్ వ్యవస్థకు సంబంధం లేదని చెపుతోంది. నిజానికి ఈ దేశంలో మార్కెట్ వ్యవస్థ ప్రవేశించిన తరువాతే అవినీతి కోట్లకు పడగపూత్తింది. అన్నా ప్రతిపాదిస్తోన్న జన్ లోక్‌పాల్ బిల్లు కేవలం ప్రభుత్వ రంగానికి అవినీతి రంగు పూసి ప్రైవేటు పెట్టుబడిదారులను గాలికి వదిలేస్తోంది. అంటే భవిష్యత్తులో అవినీతికి ప్రజలను బాధ్యులని చేసి, ప్రభుత్వంలో భాగంగాలేని కోటీశ్వరులకు కొమ్ముకాసే చట్టం ఇవాళ రాబోతుంది. రాజ్యాంగం ద్వారా ప్రజలు ప్రభుత్వాలకు ఇచ్చిన అనేక హక్కులను, అవకాశాలను ప్రభుత్వ ప్రమేయంలేని వ్యక్తుల కూటమికి కట్టబెట్టే ఒక ప్రత్యామ్నా య వ్యవస్థను ప్రతిపాదిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలందరి నిర్ణయాన్ని బట్టి మాత్రమే ప్రభుత్వాలు పనిచేస్తాయి.
అటువంటి ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రజా ఉద్యమాలు వాటిని సరిచేయ ప్రయత్నిస్తాయి. అలాంటి ప్రజల ఆకాంక్షలను, ఉద్యమాలను ప్రభుత్వాలు గౌరవించకపోగా, పౌర సమాజం పేరు తో ప్రజలకు సంబంధంలేని వ్యక్తుల కూటములకు దాసోహం అవడం సార్వభౌమాధికారానికే ప్రమాదం. ఇది అంతర్జాతీయంగా సాగుతోన్న కుట్ర. కాబ ప్రభుత్వం చేతుపూత్తేసింది. ఒక్క ప్రభుత్వానికే కాదు మన రాజకీయ పార్టీలన్నిటికీ ఈ సంగతి తెలుసు. అందుకే అన్నా జన్‌లోక్‌పాల్ అసంబద్ధం అంటూనే అతని పోరాటానికి మద్దతు ఇస్తామని అంటున్నాయి.
చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఇప్పుడు అవినీతి పోరాటానికి కూడా విస్తరించాడు. దృష్టి లోపం ఉన్నప్పుడు లోకమంతా రెండుగా కనిపిస్తుంది మరి. ఒకవైపు తన ఆస్తిని వెయ్యికోట్లకు పందెం కాసిన వ్యక్తే ఇవాళ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతానంటున్నాడు. జగన్ ఎంతైనా ఈ తరం వాడు కదా! రెండెకరాలు కూడా లేని చంద్రబాబుకు వెయ్యికోట్లు ఉంటే అవినీతి కానప్పుడు వారసత్వంగా వందలాది ఎకరాలున్న తనకు లక్ష కోట్లు ఉంటే అవినీతి ఎలా అవుతుందని అడుగుతున్నాడు. ఢిల్లీ కేంద్రంగా సాగుతోన్న అవినీతిపై వ్యతిరేక పోరాటానికి సంఘీభావం పేరుతో హంగామా చేస్తోన్న వాళ్లెవరూ ఇక్కడ హైదరాబాద్‌లో బయటపడుతోన్న అవినీతి గుట్టల గురించి మాట వరసకైనా మాట్లాడలేకపోతున్నారు. ఈ మధ్య కొందరు సినిమా పెద్ద లు కూడా పాపం నిరాహారదీక్షలు చేసి మరీ తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
తప్పులేదు. కానీ అదే తెలుగు సినిమా పరిక్షిశమలో సాగుతోన్న కోటానుకోట్ల అవినీతిపై వీళ్లెప్పుడూ పెదవి విప్పరు. ఈ మధ్య కాలం లో మన సినీ పెద్దలు కొందరు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి కోట్లు సంపాదిస్తున్నారు. కొందరు పన్నులు ఎగ్గొడుతున్నట్టు, పబ్బులు నడిపిస్తూ అనైతిక ప్రవర్తన ప్రేరేపిస్తోన్నట్టు, డ్రగ్స్ వ్యాపారంలో దొరికిపోతున్నట్టు, ఇంకొంత మంది అసాంఘిక శక్తులతో కలిసి భూ ఆక్రమణలు, సెటిప్మూంట్లు చేయడమే కాక, హత్యలు, దోపిడీలకూ పాల్పడ్డట్టు అభియోగాలొచ్చాయి. కొందరిని పోలీసులు ఆయా నేరాల కింద ఆరెస్టు కూడా చేశారు. తమ చుట్టూ ఉన్న సమాజంలో ఇన్ని జరుగుతున్నా తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండే వాళ్లే ఇవాళ వీధుల్లోకొచ్చి సమాజానికి నీతిబోధ చేస్తున్నారు.
తామంతా పౌర సమాజమేనని తమకు ప్రశ్నించే హక్కు ఉంటుందని వాదిస్తున్నారు. సమాజం గురిం చి ఎన్నడూ ఆలోచించని వాళ్లకు పౌర సమాజం అని చెప్పుకునే హక్కు ఉండ దు. ఉండకూడదు. కానీ ప్రభుత్వం ఇవాళ సమాజంలోని అసలైన పౌరుల ఆకాంక్షలను అణచివేసి, పౌర సమాజం పేరుతో యాగీ చేస్తోన్న కొందరి అడుగులకు మడుగులొత్తుతోంది. ఈ రెండూ ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు వ్యతిరేకమే కాదు, రాజ్యాంగ విరుద్ధం కూడా.

సామాజిక తెలంగాణ ఒప్పందం జరగాలి- డా.జిలుకర శ్రీనివాస్ Andhra Jyothi 30/08/2011


సామాజిక తెలంగాణ ఒప్పందం జరగాలి
సామాజిక తెలంగాణ ఒప్పందం మీద సంతకం చేసేందుకు కాంగ్రెస్, టిఆర్ఎస్, టిడిపి, సిపిఐ, బిజెపి వంటి పార్టీలు ముందుకొస్తాయా? తెలంగాణ పెద్దమనుషుల ఒప్పందం చేసుకొనేందుకు ఇరుపక్షాలు సిద్ధపడుతాయా? ఒకవేళ ముందుకు రాకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ఆయా పార్టీలకు మద్దతు ఎందుకివ్వాలి?
సామాజిక తెలంగాణ తక్షణమే సాధ్యం కాదు, భౌగోళిక తెలంగా ణే ఆచరణ సాధ్యమని కొందరు వాదిస్తున్నారు. ఈ మానవ వికాస భావజాలవాదులతో పాటు పాలక వర్గాలు కూడా ఇదే వాదన చేస్తున్నారు. పాలకవర్గాలకు అనుకూలమైన ఈ అవగాహనపట్ల 'వికాస'వాదులు సిగ్గుపడుతున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. పైగా అంబేద్కర్‌వాదులనూ, సామాజిక తెలంగాణవాదులనూ పాలకవర్గాల వైఖరికి అనుకూలంగా వ్యవహరించాలని సూచించే విప్లవ కర్తవ్యాన్ని మాత్రం మరచిపోవడంలేదు.
సామాజిక తెలంగాణ సాధ్యమేనా అనే సందేహంలో దాని సాధ్యాసాధ్యాల కంటే దాని పట్ల వ్యతిరేకతే ఎక్కువ ప్రదర్శితమవుతోంది. మన దేశంలో కులం సామాజిక వాస్తవికత. కులాతీత దృక్పథాలు, పరిష్కారాలు అంతిమంగా అగ్రకులాల ప్రయోజనాలకే ఉపకరిస్తాయి. తెలంగాణ ఉద్యమం కులాతీతంగా సాగుతుందనేది ఒక భ్రమాజనిత వాదన. అది ఉద్యమ నిర్దిష్ట వాస్తవికతను స్పష్టంగా చూడలేని గుడ్డితనం.
ఆంధ్ర, తెలంగాణ అగ్రకుల ఆధిపత్యం నుండి బయటపడే ఒక మార్గంగా తెలంగాణను బహుజనులు చూస్తున్నారు. ఆంధ్ర అగ్రకులాల నుండి అధికారాన్ని హస్తగ తం చేసుకొనే అవకాశంగా తెలంగాణ అగ్రకులాలు పరిగణిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణను వేదమయం చేస్తానని కెసిఆర్ ప్రకటించారు.
ఇది తెలంగాణ బహుజనులు ఆశిస్తున్నదానికి పూర్తిగా వ్యతిరేకమైంది. కెసిఆర్ నిర్వహించే యజ్ఞయాగాలు, పూజారుల పాదసేవలు ఆయన భావజాలాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. రేపు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పీడిత కులాలను అధోపాతాళానికి తొక్కేయబోడనే హామీ ఏమీలేదు. అందుకే సామాజిక తెలంగాణ కావాలని ఎలాంటి రాజీ లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కోరుతున్నారు.
దేశవ్యాప్తంగా బిసీ, మైనార్టీలకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు. అలాంటప్పుడు తెలంగాణలో మాత్రం కావాలని ఎందుకు అడుగుతున్నారు? ఈ దేశ అధికారంలో జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చట్టబద్ధమైన వాటా ఉంటుందని నాడు రాజ్యాంగసభలో జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ప్రకటనను అమలుచేసి ఉంటే సామాజిక తెలంగాణ అనే డిమాండ్ వచ్చేది కాదు.
దేశ విభజన పేరుతో ముస్లింలను పాకిస్తాన్‌కు పంపేసి బ్రాహ్మణీయ పాలకవర్గం రాజ్యాంగసభను పూర్తిగా ఆక్రమించుకుంది. ఏకపక్షంగా సాగిన రాజ్యాంగసభ సమావేశాలు మైనార్టీలకు అప్పటివరకు అమల్లో వున్న ప్రత్యేక నియోజకవర్గాలతోపాటు విద్యా ఉద్యోగ క్షేత్రాలలో ప్రాతినిధ్యాన్ని కూడా 27, 28 ఆగస్టు 1947లో రద్దు చేశాయి. బీసీలకు అధికారంలో వాటా కల్పిస్తామని నెహ్రూ చేసిన ప్రకటనను తుంగలో తొక్కేసారు.
ఎస్సీ, ఎస్టీలకు కేవలం ఉమ్మడి నియోజకవర్గాల రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి బానిసలను చేశారు. బిసీలకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేసి రాజకీయ దాస్యంలోకి నెట్టేశారు. ఆ రకంగా అధికారమంతా కేవలం బ్రాహ్మణీయ అగ్రకులాల చేతిలో కేంద్రీకృతమైంది. దేశంమీద పాలకవర్గం తిరుగులేని ఆధిపత్యం చెలాయించాలంటే ఉత్తర, దక్షిణ భారతాలకు మధ్యన ఉన్న నిజాం రాజ్యాన్ని ఆక్రమించాలి.
అందుకే నిజాం రాజ్యాన్ని ఇండియన్ యూనియన్ సైన్యం ద్వారా ఆక్రమించారు. ఈ ఆక్రమిత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. హైదరాబాద్ రాజ్యం పునరుత్థానం పొందకుండా భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో మూడు ముక్కలు చేసి తెలంగాణను ఆంధ్రలో విలీనం చేశారు. ఫలితంగా ఆంధ్ర అగ్రకులాలు లబ్ధి పొందాయి. దాంతో నేటికీ బహుజనులు తీవ్రమైన దాస్యంలో మగ్గుతున్నారు. అందుకే సామాజిక న్యాయానికి ఇంత ప్రాధాన్యం ఏర్పడింది. దాన్ని రాజ్యాంగ పరిధిలో సాధించడం అనేది ఎస్సీ, ఎస్టీల కన్నా బీసీ, మైనార్టీలకే ఎక్కువ అవసరం. అందుకే కొత్త రాష్ట్రం సామాజిక పునాదుల మీద ఏర్పడాలి.
కేవలం రాజకీయ వనరుల పంపిణీకి మాత్రమే సామాజిక తెలంగాణ భావనను పరిమితం చేయడం అపరిణతికి నిదర్శనం. సామాజిక న్యాయం అనే భావనను పాలకవర్గాలు ఎంత అపహాస్యం చేశాయో, దాన్ని సమర్ధించే శక్తులూ అంతే చేస్తున్నాయి. వనరుల, అవకాశాల పునర్‌పంపిణీయే సామాజిక న్యాయం అనే ఉదారవాద అవగాహన కూడా దృగ్గోచరమైందే తప్ప సారభూతమైంది కాదు.
సామాజిక అవగాహన పునాదిగా లేని వనరుల పంపిణీ, అవకాశాల పునర్‌పంపిణీ వంటి రాజ్యాంగ సహితమైన సాంకేతికవాదం మాత్రమే 'సామాజిక న్యాయం' అనే భావన రూపంలో ప్రాచుర్యం పొందింది. కానీ స్వేచ్ఛ, సమానత్వం, స్వతంత్రం, సోదరభావం, న్యాయం అనే విలువల ఆధారంగా తెలంగాణ సమాజాన్ని నిర్మించాలని ఇక్కడి బహుజనులు కోరుకుంటున్నారు. బహుజనవాదం పునాదులమీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడే పీడిత కులాలకు న్యాయం జరుగుతుంది.
అయితే సామాజిక తెలంగాణ ఏర్పాటు సాధ్యమా అనేది చిక్కు ప్రశ్నగా ఉంది. దీనికి పరిష్కారమార్గం చూపాలని బహుజన మేధావుల మీద ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఒక పక్షంగా- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరో పక్షంగా ఏర్పడి ఒక ఒప్పందం చేసుకోవాలి. అదే తెలంగాణ పెద్ద మనుషుల ఒప్పందం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎలాంటి రక్షణలు, హక్కులు లభిస్తాయో అంశాలవారీగా పేర్కొని ఇరు పక్షాలు సంతకం చేయాలి.
స్థూలంగా ఇలాంటి అంశాలు ఒప్పందంలో ఉండాలి
1. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి. కాని బీసీ, మైనారిటీలకు రాజకీయ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ అగ్రకులాల వల్ల లభించలేదు. అందుకే రాబోయే తెలంగాణలో జనాభా ప్రాతిపదికన బీసీలకు 50 శాతం, మైనార్టీలకు 15 శాతం రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని అన్ని పార్టీలు ఇచ్చే ప్రధానమైన హామీ ఈ ఒప్పందంలో ఉండాలి.
2. బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి విడుదల చేసి సరైన పద్ధతిలో ఖర్చుచేయాలి.
3. ముస్లింలు సమైక్య రాష్ట్రంలో సాంస్కృతికంగా రాజకీయంగా ఆర్థికంగా అనేకం కోల్పోయారు. జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో దామాషా ప్రాతినిధ్యం కల్పిస్తూ చట్టం చేయాలి. ఉర్దూ భాష వికాసంకోసం పాటుపడాలి. ముస్లింలపై వారి సంస్కృతిపై జరిగే దాడులను అరికట్టాలి. తీవ్రవాద ముద్రతో, శాంతిభద్రతల పేరుతో ముస్లింలను వేధించే పోలీసు హింసను నియంత్రించాలి.
4. బహుజనుల భూమిని పారిశ్రామిక అవసరాల పేరుతో సేకరించే విధానం రద్దు చేయాలి. అవాంఛిత రియల్ ఎస్టేట్ వ్యాపారంవల్ల వ్యవసాయరంగం నష్టపోతుంది. అందువల్ల భూగరిష్ట పరిమితి చట్టాన్ని అమలుచేయాలి. పట్టణ భూగరిష్ట పరిమిత చట్టాన్ని పునరుద్దరించి బహుజనుల భూములు కాపాడాలి. భూబదలాయింపు చట్టాలను సమీక్షించాలి.
5. బహుజన సంస్కృతిని వైదిక సంస్కృతితో నింపే ప్రయత్నాలను అరికట్టాలి. అందుకోసం ఒక సాంస్కృతిక అధ్యయనశాఖను ఏర్పర్చాలి.
6. ఆదివాసీ షెడ్యూల్డు ఏరియాల్లో గిరిజనేతరుల ప్రాబల్యం తగ్గించాలి. అటవీ సంపదమీద ఆదివాసీలకే నిర్ణయాధికారం ఉండాలి. వారి భాషాసాహిత్యాలు, సంస్కృతుల పరిరక్షణతోపాటు సమగ్ర వికాసంకోసం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. వారి ప్రాంతాల అటానమస్ స్థితిని కాపాడేందుకు ప్రత్యేక వ్యవస్థ రూపొందించాలి.
7. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలోనూ సంప్రదింపులలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజకీయేతర సంస్థలకూ సంఘాలకూ ప్రాతినిధ్యం ఉండాలి. ఇలాంటి అనేక అంశాలతోపాటు వివిధ సంస్థలు, సంఘాల సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఈ ఒప్పందం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఆమోదయోగ్యమైన తెలంగాణ ఏర్పడుతుంది. అదే సామాజిక లేదా బహుజన తెలంగాణ అవుతుంది.
ఈ ఒప్పందానికి రాజ్యాంగ ఆమోదం ఉండదు. ఇది రాజకీయమైన నైతిక ఒప్పందం. తెలంగాణ ఏర్పడేందుకు రూపొందించే టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్‌లో ఈ ఒప్పందాన్ని పేర్కొనాలి. తెలంగాణ ఆంధ్రలో విలీనం సందర్భంగా చేసుకొన్న ఒప్పందం ఏ విధంగా అవమానించబడిందో అదేవిధంగా తెలంగాణ పెద్దమనుషుల ఒప్పందం కూడా అమలుకు నోచుకోకపోవచ్చు. అంత మాత్రాన ఈ ఒప్పందం ప్రాముఖ్యాన్ని, విలువనూ తోసిపుచ్చలేం.
దీనివల్ల తమకు అన్యాయం జరిగిందని పీడిత కులస్తులు పోరాడేందుకు ఒక సహేతుకమైన పునాదైనా ఏర్పడుతుంది. అయితే ఈ ఒప్పందం మీద సంతకం చేసేందుకు కాంగ్రెస్, టిఆర్ఎస్, టిడిపి, సిపిఐ, బిజెపి వంటి పార్టీలు ముందుకొస్తాయా? తెలంగాణ పెద్దమనుషుల ఒప్పందం చేసుకొనేందుకు ఇరుపక్షాలు సిద్ధపడుతాయా? ఒకవేళ ముందుకు రాకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ఆయా పార్టీలకు మద్దతు ఎందుకివ్వాలి?
- డా.జిలుకర శ్రీనివాస్
కన్వీనర్, 'సింగిడి' తెలంగాణ రచయితల సంఘం

బడుగుల భాగస్వామ్యం తేల్చాలి - మంద కృష్ణ మాదిగ Andhra Jyothi News Paper 31/08/2011


బడుగుల భాగస్వామ్యం తేల్చాలి
- మంద కృష్ణ మాదిగ
'భారతదేశమా నీ ప్రయాణం ఎటు?' -పండిట్ నెహ్రూ1928లో రాసిన ఒక గ్రంథ శీర్షిక అది. ప్రపంచం పెట్టుబడిదారీ, సోషలిస్టు వ్యవస్థలుగా చీలిపోతున్న సందర్భమది. భారతదేశానికి స్వాతంత్య్రం వస్తే సోషలిస్టు వ్యవస్థవైపే భారత్ పయనిస్తుందని నెహ్రూ విస్పష్టంగా చెప్పారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ తెలంగాణ ఏ లక్షణం కలిగివుంటుంది? ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నామని చెప్పే ఏ అగ్రకుల నాయకులూ ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా లేరు.
ఒక పోరాటానికి నాయకత్వం వహించే శక్తులు అవలంభించే విధానం వల్ల ఆ పోరాటం ద్వారా వచ్చే ఫలాలు అన్ని వర్గాలకు అందే విధంగా ఉంటాయా లేదా అనే విషయం ఆ పోరాటం జరుగుతున్న సందర్భంలోనే తెలిసిపోతుంది. తెలంగాణను కోరే వారిలో ప్రధానంగా మూడు శక్తులు పనిచేస్తున్నాయి. అవి: (అ) ముందు తెలంగాణ వస్తే చాలు అనుకునే శక్తులు.
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేంతవరకు ఎలాంటి సామాజిక అంశాలను చర్చకు తేకూడదని అనుకునే శక్తులు ఇవి. ఈ శక్తులు అగ్రకుల భూస్వామ్య వర్గాలు; (ఆ) ప్రజాస్వామిక తెలంగాణ కోరుకునే శక్తులు. వీరిని ఒక్క మాటలో చెప్పాలంటే విప్లవోద్యమ అనుకూల శక్తులుగా చెప్పవచ్చు; (ఇ) తెలంగాణను కోరుకునే సామాజిక శక్తులు. ఈ శక్తులు వచ్చే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జనాభా దామాషా ప్రకారం భాగస్వామ్యం అన్ని రంగాలలో ఉండాలని కోరుకునేవి.
తెలంగాణ ఏర్పడిన వెంటనే తాము అధికారాన్ని కైవసం చేసుకోవడంతో పాటు అన్ని రంగాల మీద ఆధిపత్యం చెలాయించడానికి, తెలంగాణలోని అణగారిన కులాల ప్రజల్ని అన్ని రంగాలలో వెనక్కు నెట్టివేయడానికి అగ్రకుల భూస్వామ్య వర్గాలు పకడ్బందీగా ఇప్పటి నుంచే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే క్రమంలోనే భూస్వామ్య వర్గాల ఆధిపత్యాన్ని ఎండగడుతూ వారి దోపిడీ రాజకీయాలను ఎదుర్కొనే విధంగా, ప్రజాస్వామిక తెలంగాణను కోరుతున్న విప్లవోద్యమ అనుకూల శక్తులు తమ ప్రయత్నాలను కొనసాగించాలి. దురదృష్ట వశాత్తు ఒక స్పష్టమైన ఎజెండాతో తమ కార్యాచరణను ఆ శక్తులు ప్రజల ముందు ఇప్పటివరకు పెట్టలేకపోయాయి. ఇక సామాజిక శక్తుల పక్షాన ఎంఆర్‌పిఎస్ ముందు వరుసలో ఉండి, వచ్చే తెలంగాణలో 90 శాతంగా ఉన్న అణగారిన వర్గాలకు అన్ని రంగాలలో న్యాయమైన వాటాను డిమాండ్ చేస్తోంది. అణగారిన వర్గాలను అప్రమత్తం చేస్తూ తమ బాధ్యతను ఈ సంస్థ నెరవేరుస్తోంది.
ఈ కారణంగా తెలంగాణలో ఉన్న అగ్రకుల భూస్వామ్యశక్తులు సామాజిక న్యాయాన్ని కోరే శక్తులను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇది రెండు విధాలుగా జరుగుతోంది. మొదట అగ్రకులాలు డైరెక్టుగా దుష్ప్రచారం చేస్తున్నాయి. రెండవది అణగారిన కులాల నుంచి కొంత మంది స్వార్థపరులను చేరదీసి డబ్బులకు, పదవులకు ఆశపడ్డవారితో చేయించడం కూడా జరుగుతుంది. అగ్రకుల శక్తులకు, అణగారిన కులాల శక్తులకు మధ్య జరిగిన ప్రతి సంఘర్షణలో గతం నుంచి నేటివరకు ఈ వైఖరినే అగ్రకుల శక్తులు కొనసాగిస్తున్నాయి.
చెప్పవచ్చినదేమిటంటే ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో ఆ ఉద్యమం తన లక్ష్యాన్ని సాధించాలంటే, ఆ ఉద్యమం అంతర్గతంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిని పరిష్కరించుకోవాలి. ఆ అంతర్గత సమస్యలను న్యాయబద్ధంగా పరిష్కరించుకున్నప్పుడే ఉమ్మడి లక్ష్యం త్వరగా నెరవేరుతుంది. అలా కాక లక్ష్య సాధనలో అంతర్గతంగా ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారాన్ని విస్మరిస్తే ఉమ్మడి లక్ష్య సాధన కూడా జాప్యం జరిగి అది మరింత జటిలంగా మారే ప్రమాదం ఉందని ఎంఆర్‌పిఎస్ విశ్వసిస్తుంది. అంతర్గతంగా ఎదుర్కొంటున్న సమస్యలను ముందుగా గుర్తించి పరిష్కరించుకున్న ప్రతి ఉద్యమం తమ లక్ష్యాన్ని సులువుగా చేరుకున్న సందర్భాలు మన రాష్ట్ర, దేశచరిత్రలో ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు కొన్నిటిని నిశితంగా చూద్దాం.
(అ) ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు లక్ష్యం :- తెలుగు ప్రజల హక్కుల్ని, అవకాశాల్ని తమిళులు కొల్లగొడుతున్నట్లుగా, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే కోస్తాంధ్ర ప్రాంత ప్రజలు తమ హక్కుల్ని హరించరనే గ్యారంటీ ఏమిటని రాయలసీమ ప్రజలకు అనుమానం వచ్చింది. రాయలసీమ సోదరులలో ప్రగాఢంగా ఉన్న ఈ అనుమానాలను తొలగించడానికై కోస్తాంధ్ర నాయకులు, సీమ నాయకులకు లిఖిత పూర్వకమైన హమీలు ఇచ్చారు. 1937 నవంబర్ 16న ఈ లిఖిత పూర్వక హామీలపై ఇరుప్రాంతాల మధ్య జరిగిన ఒప్పందమే శ్రీబాగ్ ఒప్పందంగా ప్రసిద్ధి పొందింది. దరిమిలా రెండు ప్రాంతాల ప్రజల సమష్టి కృషితో 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
(ఆ) ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు :- స్వాతంత్య్రానంతరం దేశవ్యాప్తంగా భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలనే ఆకాంక్ష బలపడుతున్న సందర్భం అది. ఆంధ్ర, హైరదాబాద్ రాష్ట్రాలలోని తెలుగు ప్రజలు ఒకే రాష్ట్రంగా ఏర్పడాలనే బలమైన ఆకాంక్ష ఆంధ్ర నాయకుల నుంచి ఉత్పన్నమయింది. అయితే సమైక్య రాష్ట్రంలో తాము దోపిడీకి గురవుతామనే భయాందోళనలు తెలంగాణ వారిలో వ్యక్తమయ్యాయి. ఆ భయాందోళనలను ఎన్నో సందర్భాలలో తెలంగాణ నాయకులు బహిరంగంగానే వ్యక్తపరచడం జరిగింది.
ఆ భయాందోళనలను తొలగించడానికే 1956 ఫిబ్రవరి 20న ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది. దానివల్ల తెలంగాణ ప్రాంతీయ బోర్డు మొదలు కొని విద్యా, ఉద్యోగ అవకాశాలు, నీటి పంపిణీ, బడ్జెట్ మొదలగు విషయాల మీద తెలంగాణకు రావాల్సిన, దక్కాల్సిన అన్ని విషయాల మీద ఒప్పందం జరిగింది. దీనినే పెద్ద మనుషుల ఒప్పందం అన్నారు. ఈ ఒప్పందం జరిగిన తరువాతనే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఏకమై 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది.
(ఇ) స్వాతంత్య్ర పోరాటం : 1917లో హోం రూల్ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. భారతీయులకు స్వయం పాలనాధికారాలు ఇస్తున్నామని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు దేశరాజకీయాల్లో కాంగ్రెస్, ముస్లిం లీగ్‌లు మాత్రమే ప్రధాన శక్తులు. యావత్ భారతీయుల పేరిట వచ్చిన రాజకీయ అధికారాన్ని కాంగ్రెస్ పేరుతో అగ్రకుల హిందువులు, ముస్లింలీగ్ పేరుతో సంపన్న ముస్లిం వర్గాలు అధికారాన్ని పంచుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే చట్ట సభల్లో మాకు కూడా ప్రాతినిధ్యం కావాల్సిందేనంటూ దళిత గిరిజన బలహీన వర్గాలు దేశవ్యాప్తంగా పోరాటాన్ని మొదలుపెట్టాయి.
అప్పటికి గాంధీ, అంబేద్కర్, జిన్నాలు దేశ రాజకీయ చిత్రపటంలోకి ఇంకా రాలేదు. 1928లో సైమన్ కమిషన్ ఎదుట, ఆ తరువాత లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో స్వాతంత్య్రాన్ని అగ్రకులాలతో పాటు నిమ్నకులాలు కూడా కోరుతున్నాయని, స్వాతంత్య్రానంతరం అన్ని రంగాలలో తమకు న్యాయమైన వాటా ప్రాతినిధ్యం సంగతి ఏమిటో మీరు ముందే తేల్చాలని అంబేద్కర్ పట్టు పట్టారు. దేశ స్వాతంత్య్రాన్ని స్వాగతిస్తూనే అణగారిన కులాల పక్షాన అంబేద్కర్ బలంగా నిలబడ్డారు. నిమ్న కులాల వాణిని బ్రిటిష్ పాలకులు, కాంగ్రెస్ నాయకుల ముందు విన్పించిన తరువాతనే బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డును 1932లో ప్రకటించింది.
ఆ అవార్డును అడ్డుకోవడానికి అగ్రకుల శక్తులు గాంధీని ముందుపెట్టడం, ఆయన ఆమరణ దీక్షకు పూనుకోవడం, అప్పటివరకు అంబేద్కర్‌కు అనుసరించిన కొంతమంది దళితనాయకులు కాంగ్రెస్‌కు లొంగిపోయి, దళారులుగా మారి కమ్యూనల్ అవార్డు దళితులకు అవసరం లేదంటూ అంబేద్కర్‌కు వెన్ను పోటు పొడవటం జరిగింది. గాంధీ చనిపోతాడనే వదంతులతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడడం, అటు గాంధీ ప్రాణాలు కాపాడటానికి, పీడితకులాల కనీసహక్కులను సంరక్షించుకోవడానికి అంబేద్కర్ ముందుకు రావడం జరిగింది. ఆ విధంగా గాంధీ, అంబేద్కర్‌ల మధ్య 1932లో జరిగిన పూనా ఒడంబడిక ఫలితమే స్వాతంత్య్రానంతరం అమలు జరుగుతున్న నేటి రిజర్వేషన్ల విధానమని అందరికి తెలిసిందే.
పై మూడు ఒప్పందాలు జరిగిన వివిధ సందర్భాలను గమనిస్తే తమిళుల నుంచి విడివడే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న కాలంలోనే రెండు అసమాన ప్రాంతాల మధ్య కొనసాగుతున్న అసమానతలను రూపుమార్పించే దిశగా శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది. రెండు తెలుగురాష్ట్రాలు కలిసి ఒక్కటిగా ఏర్పడే సందర్భంలోకూడా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అసమానతలు, దోపిడీని తొలగించుకునే విధంగా అన్ని రంగాలలో సమాన పంపిణీ జరిగే విధంగా ముందే పెద్దమనుషుల ఒప్పందం జరిగింది.
దేశ స్వాతంత్య్రం సాధించుకునే సందర్భంగా దేశంలో కుల అసమానతలు సాంఘిక వివక్షలను తొలగించుకునే విధంగా అస్పృశ్యులకు, గిరిజనులకు అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం దక్కే విధంగా గాంధీ, అంబేద్కర్‌ల మధ్య పూనా ఒడంబడిక జరిగింది. ఆ తర్వాతే దేశానికి స్వాతం త్య్రం సాధించడం జరిగింది. ఒప్పందాలు చట్టాలుగా అమలులోకి వచ్చి, నిజాయితీగా అమలయితే దేశంలోని వివిధ వర్గాల ప్రజలు అసమానతలు తొలగించుకుని ఐక్యంగా జీవిస్తారని గాంధీ, అంబేద్కర్ల మధ్య జరిగిన ఒప్పందం సాక్ష్యం చెప్పింది.
ఒప్పందాల మీద కలిసిన రాష్ట్రం ఆ ఒప్పందాలను అమలు చేయకపోతే తిరిగి ప్రత్యేక రాష్ట్రమే శరణ్యం అనే డిమాండ్ వస్తుంది. అందుకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే సాక్ష్యం. అందువల్ల తెలంగాణలోని అణగారిన కులాలు, అగ్రకులాల మధ్య ఒక ఒప్పందం జరగడంతో పాటు ఆ ఒప్పందం తెలంగాణ, ఆంధ్ర ఒప్పందంలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అగ్రకులనాయకులదేనని ఎంఆర్‌పిఎస్ భావిస్తోంది. తెలంగాణ జనాభాలో 90 శాతంగా ఉన్న అణగారిన కులాలకు రాజకీయ అధికారంలోను, సంపదలోను, విద్యా, ఉపాధి అవకాశాలలోను వారి వారి జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలో భాగస్వామ్యం ఉండే హక్కును గుర్తించే విధంగా, అది త్రికరణ శుద్ధిగా అమలు జరిగే విధంగా ఒప్పందం కుదరాలి.
ఇందుకు తెలంగాణ అగ్రకుల శక్తులు ముందుకు వచ్చి అణగారిన కులాల ప్రజల ఆకాంక్షలను గౌరవించటడం, గుర్తించడం చేయాల్సి ఉంటుందని గుర్తుచేస్తున్నాం. అప్పుడే తెలంగాణలోని అగ్రకులాలు, అణగారిన కులాల మధ్యన మరింత ఐక్యత ఏర్పడి, సీమాంధ్ర అగ్రకుల రాజకీయ పెట్టుబడిదారులు కల్పించే ప్రతి అడ్డంకిని తొలగించుకోవడం సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే అవకాశం ఉంటుందని ఎంఆర్‌పిఎస్ సంపూర్ణంగా విశ్వసిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే. కాని అంతకు ముందే అణగారిన కులాల భాగస్వామ్య విషయం కూడా తేల్చాల్సిందే.
- మంద కృష్ణ మాదిగ
ఎమ్ ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు

విధ్వంసమైన స్వప్నం--- ప్రొ.హరగోపాల్ (అరుంధతీరాయ్ సాహిత్య) Namasethe Telangana 01/09/2011


8/31/2011 11:25:31 PM
విధ్వంసమైన స్వప్నం
అరుంధతీరాయ్ సాహిత్య ప్రపంచంలోనే కాక, సామాజిక ప్రక్రియలో భాగమేకాక రాజకీయాలను ప్రభావితం చేసే ఒక అపూర్వమైన రచయివూతిగా ఎదిగారు. ఆమె మొదటి నవలకు అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ రావడంతో ఆమె సాహిత్య ప్రస్థానం ప్రారంభమయింది. అవుతే ఆ నవల రాయడానికి అమెది చిన్న వయసైనా ఆమె జీవితానుభవం చాలా లోతైంది. పురుష ఆధిక్యంలేని కుటుంబంలో తాను పెరిగానని, తన తల్లి తనకు చాలా స్వేచ్ఛ నివ్వడమే గాక స్వేచ్ఛగా జీవించమనే విలువల నిచ్చిందని తెలుగు రచయితలనుద్దేశించి మాట్లాడిన ఒక చిన్న సమావేశంలో ఆమె చెప్పారు.
తాను రాయాలని ఎప్పుడు అనుకోనని, రాయడమంటే తనకు చాలా అయిష్టమని (Reluctance ) అవుతే కొన్ని అనుభవాలు కొన్ని ఆలోచనలు తనను వెంటాడేవి రాసే దాకా మనసు కుదుట పడదని అంటారు. తాను స్వేచ్ఛగా జీవించాలనే తపనే తనను ఆర్కిటెక్చర్ విద్యార్థిని చేశాయని, అర్కిటెక్చర్ అవుతే ఏ ఉద్యోగంలో చేరకుండా తోచినప్పుడు పనిచేసే వెసులు బాటు ఉంటుందని తాను భావించానని ఒక సందర్భంలో అన్నారు. మనిషిగా అంతరంగాలలోకి వెళ్లే ఒక మానవీయకోణం కూడా ఆమె వ్యక్తిత్వంలో ఉంది. ఈ మానవీయ కోణమే ఇవ్వాళ్ల ఆమెను ఒక బలీయమైన శక్తిగా మలచిందేమో అనిపిస్తుంది.
ఆమె రాజకీయ అభివూపాయాలు బలంగా రూపొందింది అమెరికా మీద జరిగిన 9/11 సంఘటన నేపథ్యంలో నే. ఆ సంఘటన తనకు తన రచనా శక్తికి , తన నిజాయితీకి ఒక పెద్ద పరీక్ష అని భావించింది. ఆరోజు ప్రపంచం దిగ్భ్రాంతి చెందినప్పుడు, ‘‘టెర్రరిస్టుల’’ మీద ప్రపంచమంతా ఆగ్రహంగా ఉన్నప్పుడు - అమెరికా విదేశీ విధానం, అమెరికా భిన్న దేశాల పట్ల అవలంబించిన వైఖరి , అమెరికా సామ్రాజ్యవాదం ఈ సంక్షోభాన్ని ఎలా కొని తెచ్చుకుందో చాలా స్పష్టంగా చెప్పిన వాళ్లలో ఒకరు అరుంధతీరాయ్. మరొకరు నోం చాంస్కీ. ప్రతిభావంతమైన మేధావి చాంస్కీకి దక్కినంతటి గౌరవాన్ని అరుంధతీరాయ్ పొందగలిగారు. ఇది సాధారణమైన విషయమేమీ కాదు.
ఆ తర్వాత ఆమె రాసిన ప్రతి రచనలో ఒక స్పష్టమైన సామ్రాజ్యవాద వ్యతిరేకత ఉంది. అలాగే ఎదిగే క్రమంలో మొత్తం ప్రపంచీకరణ నమూనాను ప్రశ్నిస్తూ చాలా మౌలికమైన అంశాలమీద వ్యాసాలు రాస్తూ మేధావుల ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తున్నారు. లేదా కనీసం వాళ్లు పునరాలోచించేంత లోతైన విశ్లేషణ చేస్తున్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో ఆమెను తీవ్రంగా ఆలోచింపచేసిన అంశం- మనిషికి ప్రకృతికి ఉండే అతి సున్నితమైన సంబంధం, దాని విధ్వంసం. మనుషులను ప్రేమించే స్వభావమున్న వాళ్లు ప్రకృతిని ప్రేమించడం సహజమేమో లేదా ప్రకృతిని ప్రేమించేవాళ్లు మనుషులను ప్రేమిస్తారేమో. ఆర్.ఎస్. రావు గారు ప్రకృతిని ముఖ్యంగా పూలని అతిగా ప్రేమించడంతో ఆయన రాజకీయ ఆలోచనా ప్రస్థానం ప్రారంభమయ్యిందంటారు. అందుకే మనిషిని విశాలమైన ప్రకృతిలో ఇతర జీవరాసులలో ఒక జీవిగా చూడాలే తప్ప మనిషి కేంద్రంగా విశ్వాన్ని చూడడాన్ని ఆమె సంపూర్ణంగా తిరస్కరించారు. దీంతో ఆమె అభివృద్ధిని కూడా ప్రకృతి కోణం నుంచే చూడడం వలన చారివూతకంగా ఆమె అవగాహనకు పరిమితులుండవచ్చని భావించేవారు కూడా ఉన్నారు.
అవుతే ప్రకృతిని ప్రేమించే క్రమంలో ప్రకృతికి చాలా దగ్గరగా జీవిస్తున్న గిరిజనుల దగ్గరకు వెళ్లిపోయారు. నిజానికి గిరిజనుల జీవితం ప్రకృతితో విడదీయరాని సంబంధంగా ఉంటుంది. అందుకే ప్రకృతి వనరుల విధ్వంసం గిరిజనుల జీవిత విధ్వంసంగా మారడంతో దానికి వ్యతిరేకంగా పోరాడే గిరిజన పోరాటాలను, ఆ పోరాటాలలో వాళ్లకు బాసటగా నిలిచిన మావోయిస్టు పార్టీని అభిమానించి ఆ విప్లవ ఉద్యమాల గురించి రాయడం ప్రారంభించారు.
విధ్వంసమైన స్వప్నం పుస్తకంలోని మూడు వ్యాసాలలో ఛత్తీస్‌గఢ్ లో లేదా దండకారణ్యంలో జరుగుతున్న పోరాటాల మీద ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. పేదలలో అతిపేదవావూ్లైన , అతి బలహీనులైన గిరిజనులు సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా గత ఆరు సంవత్సరాలుగా రాజీలేని పోరాటాలు చేస్తూ ఈ రోజు ప్రధానమంత్రి, హోం మంత్రి చిదంబరం ఈ గిరిజనులను దేశభవూదతకు అతి పెద్దముప్పుగా పరిగణించే దశదాకా చేరుకున్నాయని పేర్కొన్నారు. ఈ పోరాటాన్ని ఎదుర్కోవడానికి పోలీస్, పారామిలిటరీ, సల్వా జుడుం లాంటి అసాంఘిక శక్తులను ఉపయోగించడమే కాక భారత సైన్యాన్ని , విమాన దళాలని దించడం ద్వారా ప్రభుత్వం తన స్వంత ప్రజలతో యుద్ధానికి సన్నద్దమైందని అంటూ.., సైన్యాన్ని దండకారణ్యంలో తప్పక ఉపయోగిస్తారని అరుంధతీ రాయ్ అంటున్నారు. సైన్యం ‘మావోయిస్టులతో పోరాట’మనే అంటూ సామాన్య గిరిజనుల మీద యుద్ధం చేయడం ప్రారంభిస్తే మనదేశ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మీడియా, రాజకీయాలు ఎలా స్పందిస్తాయన్న అంశంమీద భవిష్యత్తు పరిణామాలు ఆధారపడి ఉంటాయని ఆమె భావిస్తున్నారు.
అరుంధతీ రాయ్ ఆలోచనా క్రమం ఇలా ఉన్న సందర్భంలోనే ఒక మూడు నాలుగు రోజుల క్రితం భారత సైన్యాధి పతి ముంబయి లో మాట్లాడుతూ మావోయిస్టు రాజకీయాలు శాంతి భద్రతల సమస్య కాదని , ఇది ఒక సామాజిక ఆర్థిక సమస్య అని , సమస్య ఇంత జటిలం కావడానికి పాలకుల దుష్పరిపాలన (మిస్ గవ్నన్స్) కారణమని చాలా స్పష్టంగా అన్నారు. ఒక దశాబ్దం కంటే పూర్వం జాతీయ మానవహక్కుల సంఘం నిర్వహించిన ఒక అంతర్గత సమావేశంలో మా లాంటి వాళ్లం ఈ శాన్యభారతదేశంలో సైన్యం జోక్యాన్ని, అణచివేత చట్టాన్ని ప్రశ్నించాం. సైన్యానికి ప్రత్యేక అధికారాలను కల్పించిన చట్టాన్ని కూడా ప్రశ్నించినప్పుడు అప్పటి సైన్యాధిపతి శంకరరాయ్ చౌదరి కూడా ఇప్పటి సైన్యాధిపతి చేసిన వ్యాఖ్యలే చేశారు. సైన్యం మొదటినుంచి కూడా అంతర్గత సమస్యలకు తమను ఉపయోగించ వద్దని అంటున్నది.
ఎన్ని సలహాలు ఇచ్చినా ప్రపంచబ్యాంకు అంతర్జాతీయ పెట్టుబడికి దళారులైన చిదంబరం లాంటి వాళ్లు సైన్యం మీద విపరీతమైన ఒత్తిడి పెడుతున్నారు. ఈ విషయంలో రచయివూతిగా అరుంధతీ రాయ్ దేశవూపజలను చైతన్యవంతులను చేయాలనే ఒక బాధ్యత తీసుకున్నారనేది చాలా స్పష్టం. అలాగే ఈ మధ్య అన్నాహజారే ఉద్యమం గురించి ఆమె రాసిన వ్యాసం పెద్ద దుమారమే లేపింది. ఢిల్లీలో ఉన్న చాలామంది ఆలోచనా పరులను , ప్రజాస్వామిక వాదులను కదిలించింది. అవుతే అన్నా హజారే ఉద్యమం ఒక మార్పు కొరకు జరుగుతున్న ఉద్యమంగా లేదని , ప్రపంచీకరణ విధానాలను ప్రశ్నించడం లేదని , అవినీతికి మూల కారణమైన కార్పొరేటు రంగాన్ని ప్రశ్నించకుండా , భ్రష్టుపట్టిన పాలక వ్యవస్థ మీద ప్రజా ఆగ్రహాన్ని సరియైన దిశలో సమీకరించడంలో విఫలమైందని విళ్లేషించారు. ఏ అభివూపాయాన్ని అయినా తన రచనా పటిమను ఉపయోగించి ఒక స్పష్టమైన , సహజమైన రాజీలేని అభివూపాయాలను, విశ్లేషణలను సమకాలీన సమాజానికి అందిస్తున్న అరుదైన రచయిత్రి అరుంధతీ రాయ్.
ఆమె చెప్పిన ప్రతి అంశాన్ని అంగీకరించాలని ఎవరూ అనడం లేదు. కానీ మనిషి ఆలోచనను సమస్య వేళ్ల దగ్గరకు తీసుకుపోయే శక్తి ఆమె రచనలకుంది. అలాగే దాదాపు సంవత్సరం క్రితం హైదరాబాదు వచ్చినప్పుడు తెలంగాణ మీద తన అభివూపాయాలను అడిగితే, తెలంగాణ సరే, ఎలాంటి తెలంగాణ అనే సందేహాలను వెలిబుచ్చింది. ఈసారి తన విధ్వంసమైన స్వప్నం బోకెన్ రిపబ్లిక్ ) పుస్తక ఆవిష్కరణ సభకు వచ్చినప్పుడు తెలంగాణ మీద చాలా స్పష్టమైన అభివూపాయాలను చెబుతూ , ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలా కాక తెలంగాణకు ఒక రాజకీయ పోరాట చరిత్ర ఉందని, విలువలకొరకు పోరాడే ఈ వారసత్వం వలన ఒక ప్రజాస్వామ్య తెలంగాణ సాధ్యమే అని అభివూపాయపడ్డారు. అవుతే ఆమె ఈ అభివూపాయాన్ని ఏర్పరుచుకుంటున్న ఈ సందర్భంలో ప్రెస్ క్లబ్‌లో జరిగిన సభను కొందరు బిజెవైఎం కార్యకర్తలు అడ్డుకోవడం తెలంగాణ ఉద్యమానికి కొన్ని కొత్త సవాళ్లను సంధించింది.
జీజేపీ తెలంగాణ రాష్ట్రం కొరకు పనిచేసే అన్ని శక్తులతో , న్యూ డెమాక్షికసీ లాంటి పార్టీలతో కూడా కలిసి జేఏసీలో భాగస్వామిగా ఉంది. ఒక అంతర్జాతీయ ప్రఖ్యాతి కలిగిన రచయిత్రి, అందులో తెలంగాణ ఆకాంక్షను బలపరుస్తున్న మనిషిని గౌరవించే బదులు ‘ అరుంధతీరాయ్ డౌన్ డౌన్’ అని ‘గో బ్యాక్’ అని ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంటే తెలంగాణ ఆకాంక్షకంటే తమ మతతత్వ సంకుచితత్వ మేకాక ,ఒక స్త్రీని , ఒక మైనారిటీకి చెందిన మనిషిగా ప్రజాస్వామ్య భావాలు గల వ్యక్తిగా గౌరవించే సంస్కృతి, సంస్కారం లోపించిన ఈ రాజకీయాలు తెలంగాణ ఉద్యమం పేరిట బలపడడం తెలంగాణ ప్రజాస్వామ్య శక్తులు జాగ్రత్తగా గమనించవలసిన అవసరముంది. ఎలాంటి తెలంగాణ అని సంవత్సరం క్రితం అడిగిన ప్రశ్న తెలంగాణ ఉద్యమం లో ఒక భాగం కావాలి. నామటుకు నాకు మన కంటూ ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అరుంధతీరాయ్ లాంటి రచయివూతులు స్వేచ్ఛగా మాట్లాడే తెలంగాణే నిర్మించుకోవాలి. కానీ అదొక విధ్వంసమైన స్వప్నంగా పరిణమించరాదు.
- ప్రొ.హరగోపాల్

బి.సి.లకు ప్రత్యేక ప్రణాళిక - కంచ ఐలయ్య Andhra Jyothi 01/09/2011


బి.సి.లకు ప్రత్యేక ప్రణాళిక
- కంచ ఐలయ్య
వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ (2012-13) మన రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల వారికి ఒక ప్రత్యేక ప్రణాళిక (స్పెషల్ కంపోనెంట్ ప్లాన్) రూపొందించాలి. గత ఆదివారంనాడు హైదరాబాద్ జూబ్లీ హాలులో జరిగిన బిసి మేధావుల, ప్రజా సంఘాల, రాజకీయ నాయకుల సదస్సు తీర్మానమది. జాతీయ స్థాయిలో ఎస్‌సి/ఎస్‌టిలకు స్పెషల్ కంపోనెంట్ ప్లాను, సబ్ ప్లానులు ఉన్నాయి. బిసిలకు ఇప్పటివరకు కేంద్ర స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ అటువంటి ప్రణాళిక లేదు. ఆ మాట కొస్తే బిసిలకు ఇటీవలివరకు కేంద్ర స్థాయిలో రాజ్యాంగబద్ధ గుర్తింపు లేదు. మండల్ ఉద్యమం ఫలితంగా ఒక గుర్తింపు లభించింది.
దాని ఫలితమే బిసిలకు విద్యా ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు. ఇంతకు మించి ఏ గుర్తింపూ లేదు. వనరులు అసలే లేవు. బిసిలు హిందూయిజంలో భాగం అనే దృక్పథం, దానితోపాటు కొంత అభివృద్ధి చెందిన వారనే భావనతో బిసిలకు ఏ రంగంలో కూడా ఒక ప్రత్యేక గుర్తింపు రాకుండా చూస్తున్నారు. అయితే, అభివృద్ధిపరంగా చూసినప్పుడు, (మన రాష్ట్రాన్నే తీసుకుందాం) 'ఏ' గ్రూపులోని బిసిలంతా సంచార కులాల వారై, హిందువులు నీచవృత్తులుగా భావించే 'గొప్ప' వృత్తులు చేసేవారుగా ఉన్నారు.
గంగిరెద్దుల, పిచ్చగుంట్ల నుంచి చాకలి, మంగలి కులాల వరకు ఆర్థికంగా అధోగతిలో ఉన్నారు. విద్యాపరంగా దాదాపు జీరో లెవల్ అభివృద్ధిలో ఉన్నారు. బిసిల పాత జాబితాలోని 93 కులాల్లో, ఇంగ్లీషు మీడియం విద్యారంగంలో అడుగుపెట్టిన వారు చాలా తక్కువ. కనుక బిసిలకు సైతం ఒక 'నిర్దిష్ట విద్యాప్రణాళిక'ను రూపొందించాలి. అటువంటి విద్యా ప్రణాళికను రూపొందించని పక్షంలో కొన్ని బిసి కులాల్లోని పిల్లల్ని స్కూలుకు పంపడం కూడా అసాధ్యమవుతుంది.
ఇక వృత్తులతో బతికే బిసిలకు ఇప్పటివరకు 17 ఫెడరేషన్లు ఉన్నాయి. వాటిలో కొన్నిటికి ఒక చైర్మన్, ఒక కారు, ఆయనతోనే తిరిగే ఒక ప్యూను ఉంటారు. అంతే తప్ప ఆ వృత్తికారుల అభివృద్ధికి పైసలు కానీ, ప్రణాళికలు గానీ లేవు. అధ్యయనమనే ఆలోచన అంతకన్నా లేదు. కొత్తగా వచ్చి చేరిన (139) బిసి కులాల్లో కొందరికి నిర్దిష్టమైన వృత్తులున్నాయి. మిగతావారికి, రోడ్లమీద పడి తిరగడం, అడుక్కు తినడమే వృత్తి. 65 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత ఇన్ని కులాలు అడుక్కు తినే వృత్తిలో ఎట్లా ఉన్నాయి? ఈ స్థితిని ఎట్లా మార్చాలి? వారు ఇలా ఉండడం దేశానికే అవమానం కాదా?
అందుకే కొన్ని కులాల వ ృత్తుల్ని పూర్తిగా మార్చే ప్రణాళికతోపాటు మరికొన్ని వృత్తుల్ని, ఆధునికీకరించి పారిశ్రామికీకరణలోకి ప్రవేశపెట్టే ప్రణాళికను నిర్దిష్టంగా రూపొందించాలి. అది ఇప్పుడున్న సాధారణ ప్లాను వల్ల సాధ్యంకాదు. బిసి ప్రత్యేక ప్రణాళిక వల్లనే సాధ్యమవుతుంది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రకారం ఆదాయ వ్యయాల మొత్తం విలువ 129 వేల కోట్ల రూపాయలని అంచనా. అందులో రమారమి 56 వేల కోట్ల రూపాయలను ప్లాన్డ్ బడ్జెట్‌గాను, 73 వేల కోట్లు నాన్-ప్లాన్డ్ బడ్జెట్‌గాను చూపించారు. నాన్ ప్లాన్ బడ్జెట్ జీతభత్యాలకు, ఎస్టాబ్లిష్‌మెంట్‌కు, పాత స్కీములను నడపడానికి మాత్రమే వాడుతారు.
ఆ డబ్బులో ఒక కొత్త ప్లాను ప్రతిపాదించలేదు. అందువల్ల 56 వేల కోట్ల రూపాయల ప్లాన్డ్ బడ్జెట్‌లో 25 శాతం స్పెషల్ బిసి ప్లానుకు 14వేల కోట్ల రూపాయలు ఇవ్వొచ్చు. 2012 నాటికి బడ్జెట్ పెరగనుంది కనుక దాదాపు 15 వేల కోట్ల రూపాయలతో బిసి బడ్జెట్ రూపొందించాలి అనేది వాదన. దాన్ని ఎట్లా ఖర్చు చెయ్యాలన్నది కూడా పెద్ద సమస్య. ఎస్‌సి, ఎస్‌టి ప్లాన్ డబ్బును పూర్తిగా ఖర్చు కాలేదన్ననెపంతో దారిమళ్ళించిన సంగతి తెల్సిందే. అందుకే ఖర్చు ప్లాను చాలా కీలకమైనది. ఐతే ఇప్పుడు బిసిలకు కేటాయించిన 3,400 కోట్ల రూపాయలు స్కాలర్‌షిప్‌ల కోసం మాత్రమే. ఈ అన్యాయాన్ని కచ్చితంగా సవరించాలి.
బిసి ప్లాన్ బడ్జెట్‌లో 40 శాతం డబ్బును బిసిల విద్యకు ప్రత్యేకంగా కేటాయించాలి. ముఖ్యంగా 'ఏ' గ్రూపులోని కులాల పిల్లలకు మూడేళ్ళ వయసు నుంచి 18 ఏళ్ల వయసు వచ్చేంతవరకు చదువు, తిండి ఇవ్వకుండా వారి బతుక్కు ఒక అర్థాన్ని ఇవ్వలేం. 'బి' గ్రూపుల్లో కూడా సంచార కులాలున్నాయి. కురుమ కులమే అందుకు మంచి ఉదాహరణ. ఈ కులంలో దాదాపు 50 శాతం కుటుంబాలు 'మందల మన్యాల్లో' ఉంటారు. వారు పిల్లలను బడికి తోలలేరు. వారికో వృత్తి ఉన్నా, సంచార అవసరం వారిని వెన్నాడుతూనే ఉంది. ఇటువంటి కులాల వృత్తులకు నిలకడ కల్పించాలి.
వృత్తులున్న కులాలకు, ఆ వృత్తులను ఆధునికీకరించేందుకు, అవి పారిశ్రామీకరణ వైపు పయనించేందుకు ప్లాను తయారు చేయాలి. వృత్తులు లేనివారికి ఒక వృత్తిని కల్పించాలి. అది సాధించేందుకు అన్ని కులాల పిల్లల్ని ఇంగ్లీషు-తెలుగు సమపాళ్ళలో ఉండే విద్యా వ్యవస్థను గ్రామస్థాయిలో ఏర్పాటు చే యాలి. ఈ కులాల పిల్లలు కామన్‌స్కూళ్ళలో ఉన్నా వారి పోషణ, పుస్తకాలు ప్లాన్డ్ బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టాలి. బిసిలకు ప్రతి తాలూకాలో ఒక ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్/ఇంటర్‌మీడియట్ కాలేజీని ఈ డబ్బులో నుంచి ఖర్చు చేసి నడపాలి.
ప్రతి జిల్లాలో ఒక క్వాలిటీ ఇంగ్లీషు మీడియం డిగ్రీ కాలేజీని (రెసిడెన్షియల్) తప్పకుండా నడపాలి. ఇక్కడే వారిని ఐఏఎస్, ఐపిఎస్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం చెయ్యాలి. విద్య ఒక్కటి మాత్రమే కుటుంబాన్ని, కులాన్ని ఆధునికీకరిస్తుందనే ఆదర్శాన్ని ప్రజల జీవితాల మార్పులో నిరూపించాలి. ఇందుకు ముందే చెప్పినట్లు 40 శాతం ప్లాన్ బడ్జెట్‌ను ఖర్చు చెయ్యడం అవసరం.
మిగతా 60 శాతాన్ని అన్ని కులాలకు ఫెడరేషన్‌లను ఏర్పరిచి ప్రతికులానికి జనాభా ప్రాతిపదికన వాటా అందేట్లు చూడడం. అందుకోసం ఇప్పుడున్న 17 ఫెడరేషన్లు పోగా మిగిలిన కులాలన్నిటినీ ఫెడరేషన్ల కిందకి రాబట్టాలి. ఏ వృత్తిలేని చిన్న కులాలను ఆ కులాల అభివృద్ధి ఫెడరేషన్ ఏర్పరిచి, వాటికి స్థిర జీవితాన్ని, ఒక మంచి ఇల్లును, కొద్దో గొప్పో భూమి లేదా గౌరవప్రద వ్యాపారం లేదా మరో వృత్తిని ఏర్పరచాలి. తల్లిదండ్రులు అడుక్కొచ్చి పెడితే తిని పిల్లలు ఆత్మగౌరవంతో స్కూల్లో కూర్చోలేరు.
అందుకని ఈ ప్లాను వాళ్ళ కుటుంబాలు సెటిల్‌మెంట్‌పై ఎక్కువగా ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది. మొత్తంగా అన్ని కులాల్ని (మున్నూర్ కాపులతో సహా) కాన్ఫెడరేషన్‌లుగా రూపొందితే వాటి ద్వారా (వాటికి ఆఫీసులు, మంచి అధ్యయన సిబ్బంది ఉండాలి) వృత్తుల ఆధునికీకరణకు పూనుకోవచ్చు.
ఉదాహరణకు కల్లుగీత వృత్తిని ఆధునికీకరించాలంటే చెట్లు పెంచడంతో (ఫారెన్ లిక్కర్ కంటె కల్లు మంచిది కనుక)పాటు తాటికి, లొట్టి దాచే యంత్రాన్ని తయారు చెయ్యడం కష్టం కాదు. మనిషి చెట్టెక్కి పడిచచ్చే స్థితిని మార్చాలి. అలాగే చాకళ్ళు గాడిదల్లా బట్టలుమోసే స్థితి మార్చాలి. ఉతుకుడు పద్ధతిని, ఇస్త్రీ పద్ధతిని బాగా ఆధునికీకరించాలి. నేత గాళ్ళకు మిషన్లద్వారా నేసే పద్ధతిని ఇంటింటికి తీసుకుపోవాలి. బట్టలమ్మే మార్కెటును కొంతైనా వారి చేతిలోకి తేవాలి.
షీప్ బ్రీడర్స్ ఫెడరేషన్ ద్వారా ఎరువు సమీకరణ, ఉన్ని కత్తిరిం పు, పాలు పితకడం, మాంసం ఎగుమతి వంటి పనులన్నిటికీ, అలాగే తమ గ్రామాల నుంచి ఆధునిక పద్ధతిలో అమ్మకానికి, ఎగుమతికి ఉపయోగపడే శాస్త్రీయ పద్ధతుల్ని రూపొందించాలి. కుం డల తయారీ వ్యవస్థను సంపూర్ణంగా ఆధునికీకరించవచ్చు. ఐతే వీటన్నిటికి ఫెడరేషన్‌ల ద్వారా ప్రత్యేక అధ్యయనాలు, మేధావులతో కూడిన చర్చలు జరగాలి. ఈ పనికి ప్రతి ఫెడరేషన్‌లో రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ కోసం డబ్బు కేటాయించుకొని నిపుణుల కమిటీలు వేయాల్సి ఉంటుంది. ఇవేకాక వ్యవసాయ రంగంలో ఈ వృత్తులను ముడేసి అభివృద్ధి చెయ్యాల్సి ఉంటుంది.
బిసిల్లో కొన్ని కులాలు ప్రత్యేక వ్యవసాయ కులాలు, కొన్ని పాక్షిక వ్యవసాయ కు లాలు ఉన్నాయి. వ్యవసాయ పనిముట్లను ఆధునీకరిస్తే దున్నుడు, కలుపుతీసుడు నీళ్ళు పెట్టుడు వంటి పనులపై కూడా కొత్తకోణం లో రీసెర్చ్ జరగాలి. అందుకు ఒక బిసి వ్యవసాయ ఆధునిక ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా చేపల పెంపకం, కుందేళ్ళ పెంపకం వంటి పనులు పల్లెకార్ల ఫెడరేషన్ ఆధునిక రూపంలో చెయ్యవచ్చు. నీటి, ఆహార వనరులను బిసి ఫెడరేషన్ల ద్వారానే అభివృద్ధి చెయ్యగలం.
ఇక్కడ అన్ని కులవృత్తులను ప్రస్తావించలేకపోయినప్పటికీ బిసి ప్లానుతో ఆర్థిక వ్యవస్థలో విప్లవాన్ని తేవ చ్చు. ఇటువంటి ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి ద్వారా కులాల మధ్య సంబం«ధం మారుతుంది. ఎస్‌సి, బిసిల మధ్య ఉండే వైరుధ్యం, అగ్రకులాలతో వీరికుండే వైరుధ్యం బాగా మారుతుంది. ఇది ప్లాన్ ్డ బడ్జెట్‌ద్వారా మాత్రమే సాధ్యం. ఈ ప్లానులో (విద్యా ప్లానులో భాగంగా) ఫూలే నాలెడ్జ్ కేంద్రాల అభివృద్ధి, చాకలి ఐలమ్మ సాంస్కృతిక రంగాల అభివృద్ధిని, లైబ్రరీలను పెట్టవచ్చు. బిసి కళల ఆధునీకరణ జరపొచ్చు.
వీటన్నింటికీ ప్రత్యేక అధ్యయనాలు, ప్లాను రూపొందించాల్సి ఉంటుంది. కుల-సమీకరణ, వృత్తి-సమీకరణ ఏకకాలంగా జరగాలంటే చైతన్యవంతమైన శక్తులు కూడా ఆయా కులాల్లో ఎదగాల్సి ఉంటుంది. అప్పుడే ప్రభుత్వ ఉద్యోగాల నుంచి ప్రైవేట్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ వైపు యువత మరలుతుంది. ఈ మౌలిక మార్పును, త్వరితగతిని తీసుకురావడానికి, బిసిల్లోని మనుషుల్ని నాగరిక మానవులుగా తీర్చి ద్దిడానికి ఈ బిసి ప్లాన్ తప్పక అవసరం. అది బిసిల ఐక్యపోరాటంతోనే సాధించుకోగలం.
అంతుకు ముందుగా జరగాల్సింది ఈ ఆలోచనను బిసిల ముందుంచడం. వారిని తమ కుల చైతన్యం నుంచి, ఒక బిసి చైతన్యంలోకి ఎదిగించడం. అందుకు ప్రతి పాత తాలూకా కేంద్రంలో, జిల్లా కేంద్రాల్లో బిసి సదస్సులు జరుపుకొని ఈ అంశంపైనే చర్చించడం అవసరం. ఈ క్రమంలోనే అన్ని పార్టీల్లోని బిసి నాయకులపై వత్తిడి పెంచాలి. అన్ని పార్టీల్లో, ప్రజాసంఘాల్లో ఇదొక 'పిచ్చి వా దంగా' మారితే తప్ప బిసిలు బిసి స్పెషల్ ప్లానును సాధించుకోలే రు. అది రాకుండా ఆత్మహత్యలు తప్ప బిసిలకు మరోదారి కనిపించదు. రాష్ట్రంలో బిసిల ఆత్మహత్యలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం. ఈ పోరాటం 2012 ప్లాన్ బడ్జెట్ ప్రతిపాదనలోపే జరగాలి.
- కంచ ఐలయ్య
(వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత)

మరాండీ శిక్ష చేస్తున్న హెచ్చరిక!---గుర్రం సీతారాములు రీసెర్చ్ స్కాలర్ Namasethe Telangana 02/09/2011


9/2/2011 12:21:10 AM
మరాండీ శిక్ష చేస్తున్న హెచ్చరిక!
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంవూదంలో ‘ఉరిశిక్షల రద్దు పోరాట కమిటీ’ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభ చాలా ఉత్తేజకరంగా జరిగింది. వర్షంలో ఎవరు వస్తారులే అనుకుంటూ సమావేశానికి బయలుదేరాను. జోరున వర్షం కురుస్తున్నా సభ జరుగుతున్న హాల్ కిక్కిరిసిపోయింది. ఎందుకో రాజ్యం ఇంత కసాయిగా ఉన్నా ‘పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు’ .. ఆ సమావేశానికి వచ్చి న సంఖ్య చూస్తే చాలా ఆశ కలిగింది. దాదాపు నాలుగు ఏళ్ల కింద ట జార్ఖండ్ ముఖ్యమంత్రి బాబులాల్ మరాం డి కుమారుడి మీద జరిగిన దాడిలో అతని కొడుకుతో పాటు మరి కొంతమంది మరణించారనే అభియోగంతో, ఆ దాడిలో పాల్గొన్నారని ఛత్రపతిమండల్, మనోజ్ రజ్వార్, అనిల్ రాం, జీతన్ మరాండీలకు ఉరి శిక్ష పడింది. దీనికి నిరసనగా జరిగిన సభకు వరవరరావు, గద్దర్, బీడీ శర్మ, విప్లవ కవి శివాడ్డి, జీతన్ మరాండీ సహచరి అపర్ణా మరాండీ, విస్తాపన విరోధ్ మంచ్ ప్రతినిధి వినోద్ తదితరులు హాజరయ్యారు. హాల్ అంతా నిండిపోయింది.
ఈ మధ్య అంత పెద్దసంఖ్యలో అందునా జోరున వర్షం కురుస్తున్నా హాజరవడం బహుశా ఇదే మొదటిసారేమో. లోపల ఎంతమంది ఉన్నారో అంతమంది, లోపల చోటులేక బయ నిలబడ్డారు. కూర్చోవడానికి సీట్ వెతుక్కోవడానికి చాలా కష్టపడ్డాను. తన ఏడాది కొడుకునెత్తుకొని కళ్లలో అంతులేని ఆశతో భవిష్యత్తుమీద అచంచలమైన భరోసాతో శత్రువుమీద దూకడానికి సిద్ధంగా ఉన్న సివంగి లా అపర్ణా మరాండి కనిపించింది. నా సీట్ పక్కనే తన కొడుకుని ఎత్తుకొని ఒళ్లో పెట్టుకొని అమాయకంగా కూర్చొంది. మన నిర్వాహకుల తెలుగు ప్రసంగాలు అర్థంగాక నన్ను పిలిచారా లేదా అనే ఆమె తొట్రుపాటు గమనించాను. చాలా సాదా సీదాగా, ఎముకల గూడులా ఉన్న ఆమెను చూస్తే అంత గొప్ప కళాకారిణిగా అనిపించదు. ఆమె మీద నాకు గౌరవం పెరిగింది.
అదే సందర్భంలో.. పాట అంగట్లో అమ్మకపు సరుకై, ఎలక్షిక్టానిక్ మీడి యా యజమానుల దగ్గర ఆత్మాభిమానాన్ని అమ్ముకుంటున్న కొంతమందిని చూస్తేజాలి వేసింది. జీతన్ మరాండీ ఈరోజు ఎందుకు ఉరికంబానికి ఎక్కుతున్నాడు?ఎందుకంటే.. ప్రజల నోటికాడి కూడు, నీడ దోచుకుంటున్న దోపి డీ శక్తుల గుట్టు బయట పెట్టినందుకే అపర్ణా మరాండీ సహచరుడు ఉరికంబం ఎక్కాల్సి వచ్చిం ది. ఎప్పటి నుంచి ఈ పరంపర మొదలయ్యిం ది? వాళ్లు లాహోర్ కుట్రకేసులో పాల్గొన్న వాళ్లు కావచ్చు. అంతర్జాతీయ ఆయిల్ మాఫియా ‘షెల్’ కంపె నీ దురాగతాలకు ఉరికంబమెక్కిన కేంసారో వివా కావచ్చు. అమెరికన్ సామ్రాజ్యవాదులు బలిగొన్న సక్కో వాంజెట్టీ కావచ్చు. తెలంగాణ జైత్రయాత్ర భూమిపువూతులు భూమ య్య, కిష్టాగౌడ్ కావచ్చు. నేడు నేను కావ చ్చు. రేపు మీరూ కావచ్చు. ఇలా రాజ్యహింసలో ఎందరో బలయిపో యారు.
ఇంకా ఎంతకాలం ఈ మానవ హననాలు? ఈ ప్రశ్నలు ముప్పిరిగా నా మనసులో తొలుస్తున్నాయ్. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేసిన కసాయి తనం ఆమె కళ్లల్లో కన్పించింది. ఆమె చేతుల్లో ఉన్న ఏడాది వయసు బిడ్డను ఎత్తుకొని వాణ్ణి నిద్రపుచ్చుతూ తోటి కళాకారుల గజ్జెల సవ్వడి చూసి ఊగిపోయింది. తనూ, తన సహచరుడు ఆ గజ్జెలతో ఎన్ని వందల ఊళ్లను మేల్కొలిపి ఉంటా రు? ఇంకొన్ని రోజుల్లో తన కొడుకు తండ్రి లేని అనాథ అయినా తన కొడుకులా మరే కొడు కూ నీడలేని వాడు కావద్దని దేశమంతా సంచారిలా తిరుగుతోం ది. అందరినీ సంఘటితం చేసే పనిలో ఉందామె. రాజ్యం కత్తుల వంతెన మీద సవారి చేస్తున్న ఆమెను చూస్తే ఆపాటి త్యాగంలో ఒక పైసా వంతు అయినా ఈ దేశ మేధో వికాసవంతులు చేస్తున్నారా? అనిపించింది. ప్రశ్నించే వాళ్లను అభివృద్ధి నిరోధకులని లక్షల రూపాయలు ప్రభుత్వ వేతనాలు తీసుకుంటున్న వాళ్లు, బహుళజాతి కంపెనీల మోచేతి నీళ్లు తాగే ఎన్‌జీఓలు పిల్లి కూతలు కూస్తున్నారు. ఆమె ప్రసంగాన్ని విశ్వవిద్యాలయంలో ఉన్న కుహ నా మేధావులతో గోడ కుర్చీ వేయించి వినిపించాలని పించింది. ‘అంతర్జాతీయ విపణిలో భారతమాత అంగాంగం తాకట్టు పెట్టబడుతోంది’ అని ప్రజాకవి చెరబండ రాజు చెప్పిన విషయాన్ని అపర్ణ మరాండీ అంటూంటే.. గర్వపడ్డాను. జాతీయ, అంతర్జాతీయ దోపిడీ దారులు వందల ఏళ్లుగా సమస్త వనరులను దోచుకున్నారు.
నేడు వాళ్ల దృష్టి భూమి అడుగున ఉన్న విలువైన బాకె్సైట్ మీద పడ్డది. దానికి అక్కడ ఉన్న ఆదివాసులు అడ్డుగా ఉన్నారని వాళ్లను భౌతికంగా నిర్మూలించడానికి సిద్ధమయ్యారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో ఆదివాసీ గిరిజనులపై యుద్ధానికి సిద్ధమయ్యారు. మానవరహిత విమానాలతో యుద్ధసన్నాహాలు చేస్తున్నారు. జార్ఖండ్ నుంచి వచ్చిన ‘విస్తాపన్ విరోధి మంచ్’, జీతన్ మరాండీ ప్రాతినిధ్యం వహిస్తున్న ‘అభేన్ సాంస్కృతిక సంస్థ’ నుంచి మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్ జార్ఖండ్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఫాసిస్ట్ విధానాలను దుయ్యబట్టారు. చూస్తే అమాయకంగా కనిపించిన అపర్ణా మరాండీ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడి దారులు జల్, జమీన్, జంగిల్ మీద ఆదివాసీలకు కనీసం హక్కులేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఖనిజాల తవ్వకం కోసం ఆదివాసులను అక్కడినుంచి తరిమేసే పనిలో ఉన్నారని, దాన్ని ప్రశ్నించిన వాళ్లను దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్జె కట్టి పాటపాడే ఆదివాసుల మీద , వాళ్ల కలాల మీద, గళాల మీద ఆంక్షలు ఆక్షేపణీయమని అన్నారు. జిందాల్, మిట్టల్, అభిజిత్ లాంటి సంస్థ లు మైనింగ్ మాఫియా అవతారమెత్తి లక్షలాది మంది ఆదివాసులను నిర్వాసితుల్ని చేస్తున్నాయని అపర్ణా మరాండీ తెలిపారు.
ఈ క్రమంలో వందలాదిమంది చనిపోయారని, ఎంతో మంది కనిపించకుండాపోయారని ఆమె వాపోయారు. ప్రశ్నించిన కళాకారుల కు ఉరిశిక్షలు వేస్తున్నారని, ఇవాళ తన సహచరుడు జీతన్ మరాండీ కూడా ఆ కుట్రకు బలయ్యారని తెలిపారు. ఇది వ్యక్తిగతంగా జీతన్ మరాండీ మీద పెట్టిన కేసు, వేసిన ఉరి శిక్షగా అనుకోవడం లేదనీ, ఇది ఆదివాసీ ఉద్యమాలను అంతం చేయడానికి మైనింగ్ మాఫియా చేసిన దాడిగా చూడాలని పిలుపునిచ్చారు. వందల ఏళ్లుగా ఆదివాసులు అటవీ సంపద హక్కు భుక్తంగా చేసుకొని బతుకుతున్నారు. నేడు వాళ్ల ఉనికికే ప్రమాదం వచ్చిందని అన్నారు. ఇవ్వాళ దేశంలోని బుద్ధిజీవులంతా.. మైనింగ్ మాఫియా, బహుళజాతి కంపెనీల దోపిడీని ప్రశ్నించి ఎదిరించకుంటే.. అందరికీ ఉరితాడే మిగులుతుందని హెచ్చరించారు. ఇవ్వాళ భారత ప్రభుత్వానికి ఈ నేల వాసుల ప్రయోజనా ల కన్నా మైనింగ్ మాఫియా ప్రయోజనాలే ముఖ్యమని దానికి వ్యతిరేకం గా దేశంలోని ప్రజాస్వామికవాదు లు, మేధావులు సంఘటితంగా ఐక్య ఉద్యమాలు తీవ్రతరం చేయాలని అపర్ణా మరాండీ కోరారు. ఉరి శిక్షల రద్దు కోసం జాతీయంగా, అంతర్జాతీయం గా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, అమానవీయమని అంటున్నా.. మన ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయని విమర్శించారు.
ఇలాంటి చట్టాలకు వ్యతిరేకంగా మనమంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో రాజీవ్ హంతకులకు ఉరిశిక్ష రద్దు చేయాలని అక్కడి అసెంబ్లీ తీర్మానం చేయడం ఆహ్వానించదగిందని అన్నారు. మరి మనమిక్కడ ఏం చేస్తున్నాం. ‘సామాన్యుల్ని శవాలుగామార్చి, పోలీసులు మిలిటరీ సాయంతో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో జులుం, జబర్ దస్తీలే న్యాయం, ధర్మం అని బుకాయించి, దబాయించి అధికారం చెలాయిస్తుంటే మేధావులు, ప్రజాస్వామ్య పరిరక్షకులు, విద్యార్థులు అంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? లేక భయానికి తలొంచుకుంటున్నారా?’ అని రావిశాస్త్రి ఎప్పుడో ఇందిరమ్మ అత్యవసర పరిస్థితుల్లో అన్నారు. సరిగ్గా ఇవ్వాళ తెలంగాణలో ప్రతిరోజూ పరిస్థితి ఎమ్జన్సీని తలపిస్తోంది. నేడు తెలంగాణ కూడా అంతరంగిక భద్రతా చట్టంలోకి మారిపోనుందా..? ఏమో??
-గుర్రం సీతారాములు
రీసెర్చ్ స్కాలర్

హక్కులడిగితే అశాస్త్రీయమా?----మైపతి అరుణ్‌కుమార్ ఆదివాసీ విద్యార్థి సంఘం


హక్కులడిగితే అశాస్త్రీయమా?
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఈ తరుణంలో కొంతమంది ఆదివాసీ నేతలు మన్యసీమ రాష్ట్ర డిమాండ్‌ను ముందుకు తెస్తున్నారు. 2009 తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న రోజుల్లో కూడా ఈ నేతలు మన్యసీమ డిమాండ్ ముందుకు తీసుకువచ్చారు. నాటి నుంచి నేటి వరకు ఈ నేతలు మన్యసీమ రాష్ట్ర డిమాండ్ చేసిన పాపానదని కొంతమంది గిరిజన నేతలు ‘మన్యసీమ’ ఉద్యమాన్ని ఆంధ్రవూపాంత పెట్టుబడిదారీ ఉద్యమం అంటున్నారు. అయితే గిరిజనులు తమను తాము పాలించుకోవడానికి రాజ్యాంగంలో 5,6 షెడ్యూల్డ్‌లను కల్పించారు. దీని ప్రకారం ఐదవ షెడ్యూల్డ్‌లో భాగమైన ఆంధ్రవూపదేశ్ ఆదివాసీలకు స్వయంపాలన 64 ఏళ్ల భారతావనిలో అమలు చేసిన దాఖలాలు లేవు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో దీన్ని అమలు చేస్తారా లేదా అన్న గ్యారంటీ లేదు.


ఈ షెడ్యూల్డ్ ప్రకారం మా ప్రాంతాలకు స్వయంపాలన అధికారం కల్పించబడాలి. కానీ నేటి ఆంధ్రవూపదేశ్ పాలకులు కల్పించలేదు. అందుకే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులను కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. దీనిని కోరడం తెలంగాణ ఉద్యమాన్ని నీర్చుగార్చడం ఎలా అవుతంది? న్యాయమైన రాజ్యాంగబద్ధమైన డిమాండ్‌ను అడగటం పాపమెలా అవుతుంది? మన్యసీమ రాష్ట్ర డిమాండ్‌ను కేంద్రంలో వినిపించడానికి కిశోర్ చంద్రదేవ్ (ఇతడు గిరిజనుడు కాదు అనే వివాదం ఉంది) కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకునేటట్లు ఈ సీమాంధ్ర పెత్తందారులు సోనియా, మన్మోహన్ సింగ్‌లను ఒప్పించగలిగారని విమర్శిస్తున్నారు. కిశోర్ చంద్రదేవ్ ఎస్టీ కాదనే వివాదం ఉన్నప్పుడు లంబాడీలు కూడా ఎస్టీలు కాదని, రాజ్యాంగంలో ఎస్టీలుగా గుర్తించబడలేదని కోర్టులో వివాదం నడుస్తున్నది. అలాంటప్పుడు లంబాడీలను తెలంగాణ వాదులు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? అయినా కిశోర్ చంద్రదేవ్ మన్యసీమను సమర్థించడం లేదని ప్రతికాముఖంగానే ప్రకటించారు.‘మన్యసీమ’ రాష్ట్రం కావాలనే డిమాండ్ ఆదివాసీల గుండెలోతుల నుంచి రావాలంటున్నారు కొందరు గిరిజన నేతలు. చరివూతలో ఆదివాసీలు ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం, తమ సంస్కృతి పరిరక్షణ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. తమ మనుగడ కోసం 13వ శతాబ్దం నుంచే తిరుగుబాటు జెండా ఎగురవేశారు.


మేడారం కేంద్రంగా సమ్మక్క-సారలమ్మల పోరా టం, బీహార్ కొండల్లో పహాడియల తిరుగుబాటు, సంతాల్ తిరుగుబాటు, బిర్సాముండా తిరుగుబాటు, రంప తిరుగుబాటు, కొమురం భీం తిరుగుబాటు, అల్లూ రి, గంటందొర, మల్లుదొర తిరుగుబాట్లు చరివూతలో పేరెన్నిక గన్నవి.స్వాతంవూత్యానంతరం 1968 శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటం, ఇంద్ర తిరుగుబాటు ఆదివాసుల పోరాటాలకు వన్నెతెచ్చినవి.విశాఖ మన్యంలో బాకె్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం అక్కడి ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల మూడు లక్షల మంది జల సమాధి అవుతామని ప్రాజెక్టుకు వ్యతిరేకం గా ఉద్యమిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు భూములు దోచుకునే వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సామాజిక, సాంస్కృతిక అణచివేతలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ.. మనుగడ కోల్పోతున్న ఆదిమ తెగలు తమ గుండెలోతుల నుంచి సాంస్కృతిక పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. వనరులను రక్షించుకోవడానికి ఉద్యమిస్తున్నారు.


‘మన్యసీమ డిమాండ్ అశాస్త్రీయం’ అంటూ చేస్తున్న వాదన ఏ విధంగా చూసినా దానికి శాస్త్రీయత లేదు. అలాగే ఒక తెగకు మరో తెగకు మధ్య సంబంధాలు లేవన్నది కూడా చారివూతక తప్పిదం. చరివూతలో ఆదివాసీలు ఐక్యతకు మారుపేరని చెప్పుకునే వారికి, తెగల మధ్య వైరుధ్యం ఎక్కడ కనపడిందో? రాజ్యాంగబద్ధంగా.. ఆదివాసీ ప్రాంతాలకు ఆనాడే సరిహద్దులను నిర్ణయించారు. ఐదవ షెడ్యూల్డ్‌లో 244(1)(2) క్లాజు ప్రకారం 31484 చదరపు కిలోమీటర్ల భూభాగంలోని షెడ్యూ ల్డ్ ప్రాంతానికి స్వయం పరిపాలన కల్పించాలని స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే మన్యసీమ కోరుతున్నాం. దీనిలో అసంబద్ధత ఎక్కడుందో మన్యసీమను వ్యతిరేకిస్తున్న వారికే తెలియాలి.


తెలంగాణ రాష్ట్ర డిమాండ్ న్యాయమైనది. రాజ్యాంగబద్ధమైనది. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఎనలేని త్యాగాలు చేస్తున్నారు. దశాబ్దకాలంగా పోరాడుతున్నారు. అదే తరుణంలో ఆదివాసీ ప్రాంతాలకు కూడా స్వయంపాలన కావాలని ఆదివాసులు కోరుతున్నారు. దీనికోసం ఆదివాసులు అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ రోజు లంబాడీల కన్న ఆదివాసీలే తెలంగాణకు ఎక్కువగా మద్ద తు తెలుపుతున్నారు. కానీ తెలంగాణ వా దులు మాత్రం ఆదివాసీల సమస్యలను ప్రస్తావించడంలో విఫలమయ్యారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగిందో, అదే విధంగా ఆదివాసులకు కూడా అన్యా యం జరిగింది. మరోమాటలో చెప్పాలంటే.. ఆదివాసీ ప్రాం తాలకు అంతకంటే ఎక్కువ అన్యాయం జరిగింది.


గోండ్వాన ప్రాంతం నుంచి విభజించబడిన ఆదివాసీ ప్రాంతం ఆంధ్రవూపదేశ్ పరాయి పాలనలో సాంస్కృతిక విచ్ఛిన్నానికి బలైంది. భవిష్యత్ తెలంగాణలో కూడా అగ్రకుల పాలనలో మగ్గుతామనే భయం ఆదివాసీలలో నెలకొన్నది. తెలంగాణ ప్రాంతం వారు ఆంధ్రవూపాంతం వలసలను వ్యతిరేకిస్తున్నారే తప్ప లంబాడీల గురించి మాత్రం ప్రస్తావించడం లేదు. సీమాంవూధులు తెలంగాణ ప్రాంత వారి ఉద్యోగాలు దోచుకున్నట్లే, లంబాడీలు ఆదివాసీల ఉద్యోగాలను దోచుకున్నారు. 610 జీవో వలస లంబాడీలకు వర్తించదా అనేది ఆదివాసీల ప్రశ్న!
ఆదివాసీలు తెలంగాణ ఉద్యమానికి ఎప్పుడూ వ్యతిరేకులు కారు. అయితే వెనుకబడిన ఆదివాసీ ప్రాంతాల గురించి తెలంగాణలోని ప్రజాసంఘాలకు, బాహ్య ప్రపంచానికి తెలియనిది కాదు. ఎన్నో ఆటుపోట్ల మధ్య పభుత్వ నిర్బంధాల మధ్య ఆదివాసులు నలిగిపోతున్నారు. ఇవ్వాళ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోఆదివాసీ ప్రాంతాలకు స్వయంపాలన కల్పించాలని కోరుతున్నారు. ఈ విధానం ద్వారా నే ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్ముతున్నారు.
-మైపతి అరుణ్‌కుమార్
ఆదివాసీ విద్యార్థి సంఘం (తుడుందెబ్బ) ఉపాధ్యక్షులు