తెలంగాణ ప్రాంతాన్ని ముందుగా శాతవాహను లు, చాళుక్యలు, కాకతీయులు అటు తర్వాత మొఘలాయిలు పాలించారు. మొఘలాయిల ఏలుబడిలో ము స్లిం రాజ్యస్థాపన జరిగింది. మొఘలాయిల పతనంతో గోల్కొండ కేంద్రంగా ఆసఫ్‌జాహీలు (తానీషాలు) పాల న సాగించారు. వారి కాలంలోనే తెలంగాణ భాషలో ఉర్దూ మిళితమైంది. తదుపరి నిజాంలు హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని పాలన సాగించారు. ఎంతమంది ఏలినా! మనుషుల జీవనశైలి మారలె. చరిత్ర, సంస్కృ తి ఆచారాలు, కుల వ్యవహారాలు, కుటుంబ వ్యవస్థ తీరు, గ్రామ స్వరూపమైన కుల పదజాల నుడికారం వృత్తులలో మమేకమై, కుల అల్లిక మాండలికం, పదజాలంతో తెలంగాణ భాషా‘గుమ్మి’ నిండింది. తొలకని సమాచారం నిలువై, కొన్ని వేలసంవత్సరాలు అనేక ప్రాచీన తెలుగు పదసంపద పదపదానికి, ఈ ప్రాంతం లో తెలింగా, ఉర్దూ, పార్సీ, కన్నడం, హిందూ, మార్వా డీ, తమిళం భాషల కలయికలైన జీవభాష తెలంగాణ భాష. దీనిని దక్కని భాషని పిలిచారు. హైదరాబాద్ దేశదేశాల ప్రజల సంస్కృతులతో విలసిల్లిన ప్రాంతం తెలంగాణైతే, నడిమిట్ల నల్లగొండజిల్లా ప్రజల విశిష్టత మాండలిక పదజాలం. నట్టనడుమ ప్రాంతీయ ఏలుబళ్లతో పద సౌందర్యమై భాషాశాస్త్రం సామ్యమైన భాషా రీతి కనిపిస్తుంది. కులవృత్తి పదాలు, బడుగు బలహీనవర్గాల, నిరక్షరాస్యుల మాండలిక పదజాలం ఇది. అగ్రవర్ణ ఉన్నత, ధనిక, సంపన్న వర్గాల విద్యావంతుల పదజాలం కొంత సామ్యం కలిమిడి అయినా! భాషాంతరికమైన తెలుగు భాషా పదజాలాన్ని వాడుతూ ఈ జిల్లా జనం మాండలికమైన సంస్కృతిని నిలబెడుతున్నారు. పరాయీకరణ చెందిన అగ్రవర్ణీకులు, సంస్కృతి మాటు న మాయ ప్రదర్శన బతుకమ్మ లాడుతూనే ఉన్నారు. ప్రకృతిని మించిన వారసత్వమని, ప్లాస్టిక్ కాయితం పూల బొడ్డెమ్మలు నిలుపుతున్నారు. ఇదొక పార్శం.యేతరజాతి వాళ్లు నిరక్షరాస్యులుగా, నెట్టి వేయబడ్డ జాతి జనులు మాండలీకరణమై ప్రజల భాషను పలుకుతారు.ఉదాహరణకు కైకిలి, కిస్తీ, లొల్లి, తుంకలు, ఇట్టెం, జాగ, ఇంగులం, కార్జం, సియ్యలు, గుర్రు, జిద్దు, పలుకరం, బిగెడు, సికారి, సుతిలి, బాగం, తొక్కు, గల్లీ, రకం తదితరాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. గీ విధంగా ఈ జిల్లా సామాజిక కులాల్లో వృత్తి మాండలిక భాషను పదిల పరుస్తున్నారు. ప్రభావితం చేస్తున్నారు. ఈ జిల్లా జీవనంలో ఇమిడి ఉన్న ఉర్దూపదాలు ఇజ్జత్, ఎకురార్‌నా మ, కర్చీపు, కైమా, చటాకు, జులుం, నిషాని, వజన్, వతన్, శికాయిత్, సుభూత్, హుకుం ఇంకా ఎన్నో.. ఇట్లా తెలంగాణ తెలుగులో మిళితమై వాడుక భాషగా మారిన విధానం చూస్తున్నం.
గ్రామీణ ప్రజలకు జీవితంతో ముడిపడిన ధాన్యం కొలతలు, గివ్వి తెలిసిన వాళ్ళు బతుకు తెల్సిన చెప్పటానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. అడవిలో తండలు, గోండులు, ఆదివాసులు, సవరలు వీళ్ల పదజాలం మారుమూల పల్లెలను తాకుతూ, మిళితమై కొన్నొందల, వేల సంవత్సరాల ప్రాచీనతను, నిత్య ఆధునికతను అద్ది, పుదిచ్చి ఈ ప్రాంత తెలంగాణ తెలుగు పదాలు మాండలిక నుడికారాన్ని ఎత్తి పడ్తుంది. వన్నె తెచ్చింది. పద జల్లెడలై ఎత్తి, అక్షరాలను, రాసులుగా కుమ్మరిస్తుంది. పదజాలమై వికసించి భాషా శాస్త్రంగా వర్ధిల్లుతుంది. భాషా వైవిధ్యం ఉన్న వాళ్ళను రెండు రకాల ప్రజలను గమనించాలి. ప్రజలలోని భాషా అప్రమాణికమనీ, సామాజికంగా వృద్ధి చెందినటు వంటిది గా, మరొకటి ప్రజల్లో భాషా మార్పులు చెందుతూ సామాజిక అభివృద్ధి అవుతూ, సామాన్యులభాష ప్రా మాణికమైన భాష అవుతుంది.ప్రామాణికతలో కూడా మాండలికం కలుస్తూ ఆధునికమైన భాషలో కూడా స్వభావం మారుతూ ఉంటుం ది. దీన్ని ప్రామాణికంలో మాండలిక మిళిత భాష అనవచ్చును. స్వభావంలో రెండింటికి విరుద్ధ భావాలున్నా, అనివార్యంగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. వాటినే విరూపకాలు అంటారు. ఈ రెండు మమేకమై సాగుతూ వ్యతిరేకమైన స్వభావాన్ని వదులుకుంటాయి. మనం ప్రామాణిక మాండలికాన్ని చూస్తే అర్థమైతది. భాష ప్రజల్లో పుట్టి ప్రజల్లో పెరుగుతుంది. ఆదిమ కాలం నుంచి కూడా దినదినాభివృద్ధి చెంది ప్రజల భాష నుంచి తెగలభాష, తెగలభాష నుంచి జాతులు, జాతుల భాష నుంచి కులాలభాష, కులాలభాష నుంచి వృత్తుల భాషగా అభివృద్ధి చెందుతాయని భాషా చరిత్ర పరిశోధ నల వల్ల తెలుస్తున్నది. తెలంగాణలో అధికశాతంగా మాండలికం మాల, మాదిగ ఉపకులాలు, బీసీ ఉప కులాల జీవనంలో వృద్ధి చెందింది. ప్రామాణికంలో దేశీయత లోపించిన భాష. అగ్రవర్ణీకులు సంకరం చేసి వర్గ స్వభావ భాషని అందరి భాషగా బడుగు, బలహీన వర్గాలకే తిరిగి భాషా శాస్త్రాన్ని బోధిస్తున్నారు, బొంకిస్తున్నారు. అసలు తెలంగాణ మాండలిక భాష ను సందిగ్ధంలో పడేస్తున్రు. అంటే సంస్కృతీకరణతో కలుషితమై, కిందిస్థాయి ప్రజల స్వచ్ఛత మాండలికం ప్రామాణికం కాబోయే ముందు పరదేశ భాషాప్రవేశం మొదలుపెట్టి దేశీయ భాషీయులను అగౌరవ పరుస్తున్నారు. ఈ తెలంగాణ పల్లెల్లో కుల నిర్మూలన జరగకుండా నిత్యం అవమానంతో పా టు, భాషావమానాన్ని ఎదుర్కొంటున్నారు.
ప్రజలు భాష కూడా మాదిగవాడకు ఒకరకం, మాల వాడకు ఇంకోరకం, కుమ్మరి, చాకలి గొల,్ల గౌండ్ల బీసీ వాడల్లో ఒకరకంగా, రాత భాషకు, మౌఖిక భాషకు, వాడుక భాషకు, సంభాషించే భాషని, బయటి భాష అని, యాస భాష అని, కులవృత్తుల భాష అని, చెప్పుల భాష అని, బేగరి భాష అని పిలువబడుతున్నది. ఊరు, వాడ కులం వృత్తి, వృద్ధులు, పిల్లల్లో మాండలికంలోనే విభిన్న తేడా. కుల వృత్తి మాండలికం పద కోశం బలహీనవర్గాల సామాజిక భాషా వ్యవహార కలయికై, సమూహమై కుల పనులకు సంబంధించి వృత్తి చిహ్నాలు భాషా నిర్మితానికి ప్రాతినిధ్యం అందిస్తూ, క్షేత్రస్థాయి అస్తిత్వ అనుభవమై ఉంటున్నది. పరిశీలనే పరిశోధనా దృష్టికి, నిజాయితీని గుండెనిండా ఆలింగనం చేస్తే తప్పా, భాషా శాస్త్రం వర్ధిల్లదని అర్థమైతుంది.ఈ కుల వృత్తి మాండలిక పరిశోధక కవి రచయిత ముత్యాలు. కవిత, కథ నవలా ప్రక్రియల్లో చేయి తిరిగిన రచయిత. ఈ దేశ రచయితల్లో ఒకరు దుగిలి కవి త్వం, సూర పురుడు, ఇగురం నవలలు, బేగరి కథలు భూతం ముత్యాలు కలం నుంచి వెలువడ్డ రచనలు. ఈ రచయిత సాహితీ ప్రస్థానంలో మొదలైన సందర్భం.. నల్లగొండ టౌన్‌హాలు నందు దళిత సాహిత్య రాష్ట్ర సదస్సు 14,15 డిసెంబర్ 2002 నాటికి పది తెల్ల పేపర్ల నిండా పదిహేను కవితలతో వచ్చి సాహితీ ప్రవేశం చేసినవాడు. ఈయన ఉపాధ్యాయుడు. స్థానికతపై పరిపక్వ త ఉన్న భూతం ముత్యాలు ‘గుంపు’ సాహితీ సంస్థలో సభ్యుడై, సాహితీ సృష్టి సాగిస్తున్నాడు. మాండలిక భాషా ప్రణాళికను ఒడుపుతో తనవైపు తిప్పుకొన్న రచయిత. తెలంగాణ ఉద్యమ సాహితీ చరివూతలో ‘గుంపు’ సాహితీ మిత్రుడు. భూతంముత్యాలు మాండలిక భాషా పరిరక్షక్షుడుగా విజేయుడై మళ్లీ పది జిల్లాల పదకోశాన్ని నిర్మిస్తాడని ఆశిద్దాం. ఇతను వివిధ రచయితలు, కవుల గ్రంథాలలో మాండలిక పదకోశాన్ని ఏరి మరో పదకోశ గ్రంథాన్ని ముద్రించి భాషా సేవకు అంకితం కావాలని కోరుకుందాం.
-వేముల ఎల్లయ్య
(‘మాండలీకం’ తెలంగాణ కుల వృత్తి పదకోశం పుస్తకానికి వేముల ఎల్లయ్య రాసిన
ముందుమాట నుంచి కొన్ని భాగాలు)
Namasete Telangana Telugu News Paper Dated : 12/6/2013
No comments:
Post a Comment