Tuesday, December 31, 2013

సంస్కారపుష్పం సాకర స్వప్నం (స్వప్న) లండన్ యూనివర్సిటీలో పీజీకి సీట్

12/31/2013 3:59:27 AM

బడిపాఠం... పరీక్షలో వందకు వంద మార్కులనిస్తుంది!
జీవతపా కనీసం పాస్ చేయిస్తుందన్న గ్యారెంటీ లేదు! కాని కొందరుంటారు... బడిపాఠాలతో పాటు జీవిత పాఠాలనూ నేర్చుకొని అటు పరీక్షల్లో ఇటు
జిందగీలో వందకు వంద మార్కులు తెచ్చుకుంటారు! అలాంటి వాళ్ల జాబితాలో ఫస్ట్ పేరు.. స్వప్న! ఊరు..
నిజామాబాద్ జిల్లా.. అంబం! సంస్కార్ బళ్లో
ఓనమాలనే కాదు జీవనసంస్కారానికీ శ్రీకారం చుట్టి... ఇప్పుడు లండన్ యూనివర్సిటీలో
పీజీకి సీట్ సంపాందించింది!
కనని కల సాకారమైన ఈ ఆడబిడ్డ విజయయానంలో తొలి గురువు తల్లి పుష్పమాల పాత్రా గొప్పదే!
ఆ వివరాలే ఇవి...


zindagi1
ఆరోతరగతి పిల్లలు ఏం చేస్తరు? బుద్ధిగా చదువుకుంటూ ఆటలాడుకుంటరు. కానీ స్వప్నతోపాటు సంస్కార్ పాఠశాల పిల్లలందరూ ఒక చోట చేరి బాలవికాస సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. చిన్నపిల్లల హక్కుల గురించి తెల్సుకోవడం, సృజనాత్మకతని పెంపొందించుకోవడం, సామాజిక రుగ్మతల కారణంగా తమలో కొందరు అనుభవించిన బాధలు పంచుకోవడం, తల్లిదంవూడుల నుంచి తాము కోల్పోయిన అనురాగాన్ని గుర్తుచేసుకోవటం.. అప్పటికవే ఆ చిన్నారుల కోరికలు! విషయాన్ని టీచర్లకు చెప్తే ఆనందంగా అంగీకరించారు. నిజానికి ఆ వయసులో వ్యక్తిగత, సామాజిక బాధ్యతల గురించి ఆలోచించేంత మెచ్యూరిటీ రావడానికి కారణం వారి నేపథ్యమే. ముఖ్యంగా బాలల సంఘంలో ప్రధానపాత్ర పోషించిన స్వప్నది!

కష్టాల్లో శ్రమే ఆయుధం
స్వప్న వాళ్లమ్మపేరు పుష్పమాల. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెంటాఖుర్దు గ్రామానికి చెందిన పుష్పమాలకు పన్నెండో ఏటనే పెళ్లైంది. తర్వాత ఏడాదే స్వప్న పుట్టింది. ఆ తర్వాత మూడేళ్లకు మరో బాబు పుట్టాడు. బీదకుటుంబం. భార్యాభర్తలు రెక్కాడిస్తేనే పిల్లల డొక్కలు నిండుతయ్. అయితే, కష్టమైనా నష్టమైనా కలిసే ఉందామని చేసిన బాసల్ని మరిచి, ఎవరికీ చెప్పకుండా ఇల్లువదిలి వెళ్లిపోయాడు పుష్పమాల భర్త, స్వప్న తండ్రీ! అప్పట్నుంచి ఒంటి చేత్తోనే ఇంటిని నెట్టుకొచ్చిందామె. నాలుగేళ్ల స్వప్నని వర్ని మండలం కోటయ్యక్యాంపులోని సంస్కార్ ఆధ్వర్యంలో నడుస్తున్న చెల్లినిలయం పాఠశాలలో చేర్పించింది. ‘సంస్కార్’.. గుర్రం జాషువా కూతురు హేమలతాలవణం ఆధర్యంలో నడుస్తున్న సంస్థ. అభాగ్యులు, పేదల పిల్లలను అక్కున చేర్చుకొని చదువు చెప్పిస్తుంది ఆ సంస్థ.

సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ముబారక్‌నగర్‌లో కుట్టు పనిలో శిక్షణ కేంద్రం ప్రారంభించారు. ఏడాది వయసున్న బాబుని పుట్టింట్లో ఉంచి ఆ కేంద్రంలో చేరింది పుష్పమాల. వాళ్ల నాన్న స్కూల్ అటెండర్‌గా పనిచేసేవాడు. ఆయనతో కలిసి బడికిపోతూ పుష్ప ఏడో తరగతి వరకు చదువుకుంది. ఆ కొద్దిపాటి చదువే ఆమెను టైలరింగ్ శిక్షణ వైపు నడిపించింది. ముబారక్‌నగర్‌లో మూడునెలల పాటు శిక్షణ పొందింది. నేర్చుకున్న టైలరింగ్ వృత్తి తిండిపెట్టింది. అప్పటి కలెక్టర్ ఆశామూర్తి వెట్టి కార్మికులు, నిరుపేదల కోసం ఓ కాలనీని నిర్మించారు. వర్ని మండలం అంబం శివారులోని ఆశానగర్ కాలనీలో పుష్పమాలకు ఓ ఇల్లుతో పాటు ఎకరం భూమిని కేటాయించారు. ఈమెతో పాటు కుట్టు పని నేర్చుకున్న 18 కుటుంబాలు కాలనీలో స్థిరపడ్డాయి. వీళ్లతో హాస్టల్ విద్యార్థులకు ఫ్రాక్‌లు, షర్ట్‌లు, కుట్టించే వాళ్లు. ఇందుకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది. అలా కాలం గడుస్తున్న తరుణంలో 14 కుటుంబాలు ఆ ఊరొదిలి వెళ్లిపోయాయి. దీంతో అధికారులు హాస్టల్ విద్యార్థుల బట్టలు కుట్టే పనిని ఇవ్వడం మానేశారు. అప్పుడు పుష్పమాలకు కూలీ పనే దిక్కయింది. పరిస్థితులు ఎలా ఉన్నా వారవారం స్వప్నని చూసేందుకు సంస్కార్ స్కూల్‌కి పొయివచ్చేది పుష్పమాల. పండుగలప్పుడు సెలవులొస్తే తల్లితో పాటు స్వప్న కూడా ఉపాధిహామీ పనులకు వెళ్లేది.

కన్నబిడ్డలాగా చూసుకుంటాం..

zindagi2
ఐదేళ్ల నుంచి స్వప్న పరిచయం మాకు! టాలెంట్ ఉన్న అమ్మాయిలను పైకి తీసుకురావలన్న తపన నాది. ఈ అమ్మాయిని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో ముందుకు సాగుతున్నాను. మా ఇంట్లో బిడ్డలాగా చూసుకుంటున్నాం. డిగ్రీ పరీక్ష ఫీజు కట్టి తేదీలు చెప్పి, ఫస్టుక్లాసు మార్కులు వచ్చేలా చూస్తున్నాం. 
- వసుంధర, లెక్చరర్


కలలో కూడా.. 
నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన నేను లండన్‌లో చదువుతానని కలలో కూడా ఊహించలేదు! మా అమ్మ శ్రమ, నా పట్టుదల, మా గురువుల ప్రోత్సహం నన్నీరోజు ఈ స్థాయికి చేర్చాయి!

పిల్లల ఆధ్వర్యంలో ‘ మా మాట’ పత్రిక 
సంస్కార్ పాఠశాలలో చదువుతున్న బాలవికాస సంఘాల పిల్లలందరూ కలిసి ‘ మా మాట’ అనే పత్రిక నడపాలని నిర్ణయానికి వచ్చారు. పెద్దల జోక్యం లేకుండా పిల్లలే ఎడిటోరియల్ బోర్డుగా ఏర్పడి నడిపే పత్రిక ఇది. ఇందులో స్వప్న పాత్ర కీలకమైంది. పత్రిక అచ్చయ్యే వరకు ప్రతి అక్షరం స్వప్న పర్యవేక్షణలోనే జరిగేది. పిల్లలు పడుతున్న బాధలు, వాళ్లు వేసే బొమ్మలు, కథలు, కవితలూ, సామాజిక అంశాల గురించి ఈ పత్రికలో ప్రచురించే వాళ్లు. భావ వ్యక్తీకరణ, వ్యక్తిత్వ వికాసం తరగతులు పాఠశాలలో నిర్వహించేవారు! తన కుటుంబనేపథ్యాన్ని, కష్టాలను తలుచుకొని బాధపడేది. నలుగురులో ఒకరిలా కాకుండా నలుగురికి ఒకరిలా బతకాలనీ ఆశించేది. స్వప్న మూడో తరగతి చదివే రోజుల్లో ఒకసారి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పాటలపోటీల్లో పాల్గొంది. రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి వచ్చిందామెకి. అక్కడి నుంచే స్వప్న విజయ ప్రస్థానం మొదలైందని అనుకోవచ్చు. చదువుతోపాటు ఆటల్లోనూ ముందుండేది. వాలీబాల్ క్రీడలో జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొంది. చలాకీగా ఉండడం, ఏదైనా విషయాన్ని సూటిగా చెప్పగలిగే స్వభావం ఉండడం, విశ్లేషణాత్మకంగా వివరించగలగడం భవిష్యత్‌లో ఆమెను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేశాయి! 

అమెరికా సదస్సు.. వీసా కష్టాలు..
ప్లాన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ 52 దేశాల్లో శాఖలు నడుపుతోంది. వాళ్ల శాఖ ఢిల్లీలో ప్లాన్ ఇండియా పేరుతో ఉంది. స్థానికంగా సంస్కార్ ఇంటర్నేషనల్ సహకారం ప్లాన్ ఇండియా సంస్థకు ఉండేది. బాలల హక్కులు, వారు ఎదుర్కొంటున్న కష్టాల గురించి అమెరికాలోని బోస్టన్ నగరంలో ప్లాన్ ఇండియా ఓ సదస్సును నిర్వహించింది. సంస్కార్ బడిలో స్వప్న ఆధ్వరంలో నడుస్తోన్న కార్యక్షికమాల్ని తమతో పంచుకోవాలంటూ ప్లాన్ వాళ్లు ఆమెను ఈ సదస్సుకు ఆహ్వానించారు. వీసాతో సహా అన్ని ఖర్చులూ సంస్థే భరిస్తుందని చెప్పారు. ఆమెలో చెప్పలేని ఆనందం. వివిధ దేశాలకు చెందిన పిల్లలు, ప్రొఫెసర్ల ముందు మాట్లాడే అరుదైన అవకాశం! భారత్ నుంచి స్వప్నతో పాటు ఉత్తరాఖండ్‌కి చెందిన మరొకరికి మాత్రమే ఈ అవకాశం వచ్చింది. తన బిడ్డను విదేశాలకు పంపేందుకు పుష్పమాల ముందుగా ఒప్పుకోలేదు. టీచర్లు సర్ది చెప్పడంతో సరే అంది. ఇదే సమయంలో మరో మెలిక.. వీసా కోసం తండ్రి సంతకం తప్పనిసరి అని చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోలేదు. నాన్న ఉన్నా లేనట్లే.. ఏం చేయగలదు? అధికారులను బతిమాలినా నిబంధనలు ఒప్పుకోవన్నారు. చివరి నిమిషంలో సామాజిక కార్యకర్త విమలక్క ఢిల్లీలోని ఉన్నతాధికారులతో మాట్లాడారు. అమ్మసంతకంతో వీసా వచ్చేలా చేశారు. ఆమెకు ఆంగ్లం రాదు. ఈ సదస్సుకు ఆమెతో పాటే వెళ్ళిన టీచర్ శాంతి ప్రభోదిని స్వప్న చెప్పే అంశాలను ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేశారు. మొదటి బహుమతి లభించింది. 

ఇంటర్‌లో ఇబ్బందుపూన్నో..!
సాంఘిక సంక్షేమశాఖ గురుకుల కళాశాల నిజామాబాద్‌లో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన ఆమెకు సంస్కార్‌లో లభించినంత స్వేచ్ఛ ఉండేది కాదు. ఎలాగోలా ఇంటర్‌పూర్తి చేసింది. సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు ఇంటి ముందు వేసుకున్న పాకలో స్వప్న వంట చేస్తుండగా అది తగులబడింది. అప్పుడు ఆమె కుడి కాలు కాలి మూడు నెలల పాటు ఆస్పవూతిలో ఉండాల్సి వచ్చింది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే కుటుంబం.. ప్రైవేటు దవాఖానాలో వైద్యం.. అప్పులు చేయాల్సి వచ్చింది.

డిగ్రీలో దక్షిణావూఫికాకు..
జిల్లా కేంద్రంలోని మహిళా కళాశాలలో స్వప్న బీకాం మొదటి సంవత్సరంలో జాయిన్ అయింది. ఎన్‌ఎస్‌ఎస్ క్యాంపుల్లో పాల్గొంది. ఈ క్రమంలో ప్రోగామ్ అధికారిణిగా ఉన్న వసుంధర పరిచయం ఏర్పడింది. స్వప్న చురుకుతనాన్ని చూసిన ఆమె బీఏలోకి మారాలని సలహా ఇచ్చింది. శ్రీ పెరంబుదూర్‌లోని రాజీవ్ గాంధీ మెమోరియల్ హాల్‌లో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లకు జాతీయ స్థాయిలో సామాజికరుగ్మతలు, సేవలపై ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి స్వప్నను తీసుకొని వెళ్లారు వసుంధర. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి సదస్సుల్లో పాల్గొంది. సామాజికరుగ్మతలు, పిల్లల హక్కులు, మాతా, శిశు సంరక్షణ తదితర టాపిక్‌లపై మాట్లాడే అవకాశం లభించింది. ఈ క్రమంలో దక్షిణావూఫికాలోని జెనీవాకు చెందిన స్టార్ గేజెస్ ఆర్గనైజేషన్ వాళ్లు కేప్‌టౌన్‌లో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చేందుకు సామాజిక సమస్యలపై అవగాహన ఉన్న చురుకైన గ్రామీణ యువతులను ఎంపిక చేశారు. ఈ క్రమంలో నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ ఆధ్వర్యంలో నడుస్తున్న మధుయాష్కీ ఫౌండేషన్ కో-ఆర్డినేటర్‌గా ఉన్న వసుంధర స్వప్న పేరును రికమండ్ చేశారు. దీంతో అంతర్జాతీయ వేదికను ఎక్కే మరో అవకాశం స్వప్న తలుపు తట్టింది. ఆర్గనైజేషన్ వాళ్లు ఆన్‌లైన్‌లో స్వప్నను ఇంటర్వ్యూ చేశారు. స్పోకెన్ ఇంగ్లీష్‌లో వీక్ అనేది మైనస్ పాయింట్‌గా నిలిచింది. అయినా భావవ్యక్తీకరణతో ఆ ఇంటర్వ్యూలో విజయం సాధించింది. అక్కడ ఓర్లాప్స్ ఆర్గనైజేషన్ వాళ్లు మూణ్ణెళ్ల పాటు కేప్‌టౌలీడర్ షిప్ క్వాలిటీస్, డిజిటల్ క్లాసెస్‌లో వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. పిల్లలకు ప్లేవే మెథడ్‌లో ఎలా బోధించాలో నేర్పించారు. గ్రామీణ మహిళలు గర్భిణులుగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంగన్‌వాడీ కేంద్రాలను ఎలా తీర్చిదిద్దాలి? పిల్లలను ఎలా రప్పించాలి? వాళ్లకు ఇష్టమైనరీతిలో ఎలా విద్యాబోధన చేయాలో నేర్పించారు. ప్రతినెలా అంగన్‌వాడీ కేంద్రంలోనే గర్భిణులకు మందులు ఇచ్చే మెషిన్‌ను ఏర్పాటు చేశారు. రోగి బొటనవేలి ముద్రల ఆధారంగా శరీరంలోని సమస్యలను తెలుసుకొని ఆ మిషన్ మందులు ఇస్తుంది. 

లండన్ యూనివర్సిటీలో పీజీ..
లండన్ యూనివర్సిటీ పరిధిలోని కింగ్స్ కాలేజీ వాళ్లు గ్రామీణ సామాజిక నేపథ్యం ఉన్న వాళ్లను ఎంపిక చేసుకొని ఉచితంగా పీజీ సీటు ఇస్తారు. ఇందుకోసం ఆన్‌లైన్ ఇంటర్వ్యూ నిర్వహించారు. లెక్చరర్ వసుంధర సహకారంతో ఇంటర్వ్యూకి హాజరైన స్వప్నకు మరో సువర్ణావకాశం లభించింది. నాలుగేళ్లపాటు ఏదైనా పీజీ కోర్సు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కింగ్స్ కాలేజీ ప్రకటించింది. ఇందుకోసం ఐఈఎల్‌టీఎస్ పాసవ్వాలి. ఇంగ్లీష్‌నాలెడ్జ్ కోసం మధుయాష్కీ ఫౌండేషన్ తరఫున స్పోకెన్ ఇంగ్లీష్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. నాలుగునెల్లల్లో ఐస్ పాసై లండన్ యూనివర్సిటీ మెట్లెకనున్నది స్వప్న. ‘శ్రమ నీ ఆయుధమైతే విజయం బానిస’ అన్న సూక్తి స్వప్న విషయంలో వంద శాతం కరెక్ట్.


ఎం.ఎస్. నర్సింహాచారి
టీ మీడియా ప్రతినిధి, నిజామాబాద్
ఫోటోలు : ఎల్. రవీందర్

Jindagi, Namasete Telangana Telugu News Paper Dated : 31/12/2013 

No comments:

Post a Comment