భారతదేశం లౌకిక, సోషలిస్టు వ్యవస్థలను కలిగి ఉంది. మనదేశంలో మతస్వేచ్ఛ ఉంది. అందుకే అన్ని విశ్వాసాలవారు ఐక్యంగా 67సంవత్సరాల నుండి ఐక్యంగా కొనసాగుతున్నారు. విశ్వాసం మీద ఆటుపోటులను ఎదుర్కొన్న వాటిని అధిగమించి దేశం అభివృద్ధిపదంలో నడుస్తోంది. మనవిశ్వాసం ప్రపంచంలోనే అతిపురాతన విశ్వాసాలలో ఒకటి. అవి గ్రీకు తత్వం, ఈజిప్టు, చైనీయుల విశ్వాసాల కంటే పురాతనమైంది. అయినా హిబ్రూభాషలో రాసిన బైబిలో కూడా హిందూ విశ్వాసాన్ని గూర్చి పేర్కొన్నారంటే ఎంత పురాతనమైనదో వెల్లడవుతోంది. అలాంటి సహజీవనం కలిగిన హిందూదేశంలో మతపరమైన కలపరమైన ఊరేగింపులను ప్రదర్శనలను సమావేశాలను రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులు ఎంతవరకు సమంజసం? భారతదేశంలో ఉన్నచాతుర్వర్ణ సిద్ధాంతం పెరిగి విభజించి నేటికి 1200పైగా గర్తింపు పొందిన కులాలున్నాయి. ఈ కులాలన్నీ నిచ్చనమెట్లుగా హెచ్చు తగ్గులు న్నాయి. మనుధర్మాశాస్త్రం హిందువుల పవిత్ర గ్రంధంలో కేవలం నాలుగువర్ణాలను బ్రహ్మాణ, క్షత్రియ, వైశ్య,శూద్ర వర్ణా లను పేర్కొంటే 12వందల కులాలు ఎలా వచ్చాయి. ఎలా పెరిగాయి విజ్ఞులే చెప్పాలి. కులపరమైన రాజకీయ ప్రదర్శనలను నిషేధించడం వ్యక్తిస్వేచ్ఛను బడుగువర్గాల సమానత్వాన్ని మంట గలపడమేనని పేర్కొనవచ్చు.
బడుగులైన హరిజనులను ఊరివెలుపల దూరంగా నివాసం ఏర్పరుచుకొని బానిసలుగానూ, జంతువుల కంటే హీనంగా జీవ నం సాగిస్తున్నారు. వీరు బానిసలుగా బ్రతుకుతూ యజమాని సొత్తులో భాగం. వారికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం సమానవత్వాలు, న్యాయం వెలుపలుండి బ్రతుకుతున్నారు. వీరు అసలు ఎవరు? అంటే మనుధర్మశాస్త్రం అంటుంది. అంటరానివారుగా వేల సంవ త్సరాల నుండి పెరిగి పెరిగి 2011 నాటికి 17.85 కోట్ల మంది అయ్యారు. వీరివలనే అడవుల్ల అనాగరికంగా బ్రతికేజనంను గిరి జనులని గుర్తించారు. వేలసంవత్సరాల నుండి పడ్డా కష్టాలకు నేడు భారతదేశ రాజ్యాంగం వీరికి రాజ్యాంగపరమైన రాయితీ లను ఇచ్చింది. హరిజనులకు గిరిజనులకు ప్రత్యేక షెడ్యూల్డు 70 కింద రాయితీలు కల్పించింది. హరిజనులకన్నా అంటరాని తనాన్ని రాజ్యాంగ ప్రకరణ 17కింద రద్దు చేసింది. ఉపాధి వేతన సౌకర్యాలలో రిజర్వేషన్స్ కల్పించి చారిత్రక తప్పిదాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తుంది. దాదాపు 18 కోట్ల జనాభా కలిగిన ఏ అవకాశాలు లేకుండా ధనికులు దేశఫలాలను అనుభ విస్తుంటే వీరు చూస్తూ వారి దయాదాక్షిణ్యం మీద ఆధారపడా ల్సిందేనా?ఈ ఆధారిత బ్రతుకుల కంటే బ్రతుకేలేకుంటే మంచి దని అంటారు. మనిషన్నాకా పౌరుషం, చీమునెత్తురున్నంతగా బానిసగా బ్రతకగలడా? కులం,మతం గుర్తించినపుడు హక్కు లను రాజ్యాంగం ఇస్తే వాటిని పొందెందుకు ప్రదర్శనలు, సమా వేశాలు కులం పేరుమీద జరుపుకొని వారి సాధక బాధలను దేశ ప్రజలకు చెప్పుకోవడానికి స్వేచ్ఛలేకపోవడం ఎంతవరకు సమంజసమంటారు విజ్ఞులు ఆలోచించాలి. అందుకే డాక్టర్ అంబేద్కర్ అంటారు 'నల్ల కోటు న్యాయవాదులు నా జనులను రక్షించరు అని. అది నేడు నిజమైందని చెప్పకతప్పదు. అందుకే రాజ్యాంగంలో 'న్యాయసమీక్ష'ను బ్రిటిషురాజ్యాంగం నుండి గ్రహించి ప్రతి అంశాలమీద జుడిషియారి, కార్యనిర్వహాకవర్గం చేసిన చట్టాలను ప్రతిపాదనలను 'రివ్యూ' చేసే అధికారాన్ని రాజ్యాంగంలో సంగ్రహాంగా పేర్కొన్నారు. దీనినే ప్రొఫెసర్ కె.సి వేరే 'రాజ్యాంగపు గుండె కాయగా అభివర్ణించారు. జ్యుడిషియల్ రివ్యూను ఒక బెంచి ఇచ్చిన తీర్పును వెరొక బెంచి రివ్యూ చేసే అధికారం కల్పించింది. చివరిగా అన్యాయ అంశాలను 'రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించి ప్రజల స్వేచ్ఛను రాజ్యాంగ ధర్మం ప్రకా రం రక్షించే అధికారాన్ని కలిగి ఉంది. నేడు పెరిగిన 'క్యాస్ట్ కాన్షియస్'ను అరికట్టవలసిందే కాని వారి గొంతులను అణచివేయకూడదు. ఎవరి విశ్వాసాన్ని, సాంఘిక సమానత్వాన్ని హరించకుండాచూడాల్సిన రాజ్యమేఫేలైతే రక్షించ వలసిన న్యాయశాఖ కొందర్ని స్వేచ్ఛ కంఠాన్ని నొక్కిం చాలనుకోవడం చట్టబద్దంకాదు కదా! 18కోట్ల మంది హరిజనుల స్వేచ్ఛకు భంగం.సామాజిక న్యాయాన్ని ఇవ్వాల్సిన రాజ్యమే ఈ విధమైన చర్యలను చేయవచ్చా?న్యాయాధీశులే పునరాలో చించాలి. పేదలు, అన్ని కులాలల్లో ఉన్నారు. కాని అన్ని కులా లకు అంటరానితనం లేదు. అందరు ఊరిలో జీవిస్తుంటే హరి జనులు, ఆదివాసీలు ఊరివెలుపల అడవుల్లో జీవితాలు వెలగబెట్టడం ఎందుకు? అన్న ప్రశ్న ఉత్తరప్రదేశ్‌లో మాయావతి బహు జనపార్టీలను ఉద్దేశించిన చట్టం అందరికి వర్తింపచేయడం సమంజసంగా లేదు. కూటికున్నవాడికి కులం ఉన్నవారికి వారి బాధేమి తెలుస్తుంది. తమ బాధలను వ్యక్తం చేసుకునేందుకు స్వేచ్ఛను పోలీసు లరక్షణతో అరికట్టాలనుకోవడం అక్రమం, అమానుషం కదా!ఈ స్థితి నుండి కోట్ల మందిని బయ టకుపడేయాలి. బిఎన్‌పి తన రాజకీయఉద్దేశాలను వ్యక్తం చేయ డానికి వీలులేదు. అంతేగాక చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండటం మంచిది. కాని హక్కుల పరిరక్షణకు మీటి ంగులు పెడితే నిషేధం. కనుక దానిని ఎత్తివేయాలి. దేశంలో నాలుగు వేలకుపైగా కులసంఘాలు, ఎన్.జి.ఓలు న్నాయి. వారి పాత్రను కూడా గమనించాలి. కులసంఘాలలో అగ్రకుల సంఘాలు, సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వారికి బాధలు లేకపోయినా ముందుకెళ్లేందుకు స్థాపించుకున్నారు. వారిని ప్రత్యేకించి రద్దు చేయాల్సిందిపోయి భుక్తికొరకు పోరాడే వారిపై నిషేధం విధించడం ఏమిటి? హిందుత్వాన్ని చాటే మత సంస్థలను నిషేధించడం ఆపేసి, అందరిపై ఊకుమ్మడిగా ఆంక్ష లను విధించకపోగా ఏకంగా నిషేధించడం సమంజసం కాదు. న్యాయస్థానంలో మరొకసారి ఈ అంశాన్ని ధర్మాసం నివేదించి పరిశీలించవలసిన అవసరం ఎంతైన ఉంది. అదేవిధంగా మతం, సాంఘిక అంశాలను, రాజకీయంచేసి రాజకీయ పార్టీలు చేస్తున్న ఊరేగింపులను బలప్రదర్శనలు నిషేధించాల్సినదిపోయి బలహీ నవర్గాల హక్కులను స్వేచ్ఛను హరించి వేయడం ఎంతవరకు సబబు అంటారు. జ్యుడిషి§రి చట్టాన్ని ఇంటర్‌ప్రెట్ చేయాలే గాని చట్టాలను చేయకూడదు. జ్యూడిషియరీ కార్యనిర్వహక, శాసనశాఖ విధుల్లోకి చొరబడటం సమంజసం కాదు. ఎవరి పరి ధుల్లో వారు వ్యవహరించడం మంచిది. సమాజంలోని హెచ్చు తగ్గులను బట్టి రాజకీయ బలాలను బట్టిపోకుండా 'సమన్యాయ పాలన అమలయ్యేటట్లు చూడాలి. అంతేగాక బలవంతుడ్ని కొమ్ముకాయకుండా బలహీనుడ్ని రక్షించివారి హక్కులను, స్వేచ్ఛ ను రక్షించడం రాజ్యన్యాయశాఖ చేయాల్సిన పనికాని సమాజపు రుగ్మతలను తొలగించాలే తప్ప కులాధిక్యతకు బానిసలై రాజ్యాంగ వ్యతిరేకతలకు పాల్పడకూడదని మనవి. ఏదిఏమైన రాజకీయ పార్టీల ఆగడాలను అరికట్టేందుకు చేసే ప్రయత్నంలో దిగువనున్న సామాజికవర్గాలకు అన్యాయం చేయ రాదు. అందర్ని ఒకే తాటితో బిగించాలనుకోవడం అనర్థం అవు తుంది. ఈ నిషేధాల అమలు విసరించాలే కాని వ్యతిరేకరించ రాదు. న్యాయశాఖ పరువను కాపాడుకోవాలి. బలహీన వర్గాల ప్రజలు, మైనారిటీ ప్రజల విశ్వాసం మీద నిప్పులు పోయరాదు. ఏదిఏమైన ఈ నిషేధాలను అమలు చేయడం అంతసులభం కాదు! కనుక తప్పకుండా మెజారిటీ వారు అల్పసంఖ్యాల వారి మనోభావాలను పరిగణనలోకి తీసుకొని మెలగవలసి ఉంది.
Vaartha Telugu News Paper Dated : 03/09/2013
|
Thursday, September 5, 2013
మత ప్రదర్శనలపై నిషేధం సమంజసమా? By Dr Asaiah IIS
Labels:
Asaiah
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment