ఆమె జ్ఞాపకాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. బహుజ ను ల హృదయాలు ఆత్మీయమైన స్పందనతో ఒక్క సారిగా కరిగిపోతాయి. ఆమె సుగుణాలు స్నేహ సౌశీ ల్యాన్ని గుర్తుచేసి బహుజనులను ఒక్కచోటికి చేరు స్తాయి. ఆమె మానవతా వాదం ముందు ప్రతీ ఒక్కరూ బలాదూరే. బహుజన సర్వతో ముఖాభివృద్ధికి ఆమె ఒక ప్రతీక. ఆమె ఒకతరానికి ప్రతినిధి. సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్య శాలి. ఆమె పేరు చాకలి ఐలమ్మ. అయి లమ్మ పుట్టినిల్లు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో క్రిష్టాపురం అనే చిన్నగ్రామం. పుట్టినిల్లుకు దగ్గరగానే పాలకుర్తి మండల కేంద్రం ఆ వీరనారి మెట్టినిల్లు. రజాకార్లను తరిమికొట్టి ఎరజ్రెండా ఎగురవేసి తెలంగాణ రెైతాంగ పోరుకు కేంద్ర బిందువుగా నిలిచింది పాలకుర్తి. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో అయిలమ్మకు బాల్య వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. ప్రధానంగా వీరికి వారి అత్యంత గౌరవ ప్రదంగా ఆరాధించే చాకలి కులవృత్తే వారికి జీవనాధారం.
ఐలమ్మకు సిద్ధాంతం తెలియదు. కానీ బహుజనులను చీత్కారం చేసిన మొఖా లమీద చీత్కార తుంపురులనే కుమ్మరించిన కల్కి అవతారం ఆమె. కుట్రలు కుతం త్రాలు తెలియవు కానీ బహుజనుల అణచివేతకు ఏర్పడిన గూడుపుఠానులన్నింటినీ ఒక కుదుపు కుదిపిన సాహస వీరవనిత. ఇటువంటి స్త్రీ చెైతన్యమూర్తులు ధెైర్య సాహాసాల వల్లనే తెలంగాణ సాయుధ రెైతాంగపోరాటంతో పాటు మహిళా ఉద్యమం ఎదిగిం ది. పోరాటక్రమంలో మహిళల్లో చెైతన్యం తేవడానికి అనేకమంది కృషి చేసారు. అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా ‘దొరా’అని ఉత్పత్తికులాల చేత పిలుపించుకొనే సంస్కృతికి చరమగీత పాడినవారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నా రు. దొరా అని పిలువకపోతే ఉన్నతకులాల అనుంగు ఉంపుడుకత్తెలలో కూడా ఉన్న రాక్షస ప్రవృత్తి అనేక పీడన రూపాలలో బయటకు వచ్చేది. వెనుకబడిన కు లాల మీద ఆ పీడన రూపాలు విరుచుకు పడేవి. తమను దొరా అని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొల్పి, దగ్గరుండి అఘయిత్యం చేయించేవారు. స్త్రీ సాధికారతే స్త్రీ విముక్తికి మంచి ఆయుధమని స్త్రీలు నేడు నమ్మటానికి ఐలమ్మ ఉత్పత్తికులాల వారికి ఒక మంచి ఆయుధమైంది.
ఈ భూమినాది. పండించిన పంటనాది. తీసుకెళ్లడానికి దొరెవ్వడు.
నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రెైతాంగ విప్లవాగ్ని చాకలి అయిలమ్మ. ఆమె నడిపిన కౌల్దారి పోరాటం ప్రజా పోరాటాలకు నిరంతరం స్ఫూర్తినిస్తుంది. భూమి కోసం, భుక్తికోసం వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన వీరతెలంగాణ సాయుధ రెైతాంగ పోరాటంలో అయి లమ్మ చూపిన తెగువ మరువలేనిది. దొరలను ఎదిరిస్తే కష్టా లు తప్పవని తెలుసు. ప్రాణాలు తీస్తారని తెల్సినా పోరాట బాట పట్టింది అయిలమ్మ. ఆ పోరాటంలో తన పేరు చిర స్థాయిగా నిలిచిపోతుందని తన పేరును ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటారని అయిలమ్మ కలలో కూడా ఊహించి ఉండదేమో!.ప్రతి రోజూ అందరికంటే ముందే తనే సూర్యున్ని చూసేది. ఎంతోమందికి మేలు కొలుపు అయ్యేది. ఇంటింటికీ వెళ్లి బట్టలు తీసుకునేది. అరికాళ్లలో రాళ్లు గుచ్చుకున్నా, చంకలో పిల్లవాడు పాలకోసం ఏడుస్తున్నా, నెత్తిమీద చద్దికూడు గంప భారం అవుతున్నా, భుజానికున్న మైల పాతల మూట బరువు ఎక్కువ వుతున్నా, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని చాకిరేవుకు సాగిపోయేది.
కడుపులో పేగులు మెలివడుతున్నా, పొదల మాటున పసివాడు పాలకోసం గొంతెత్తి ఏడ్చినా,,, నెత్తిమీద కొంగేసుకొని నిశ్చింతగా తనపని తాను చేసుకునేది. పులిసిన చద్దికూ డులో పచ్చిమిరపకాయ నంజుకుంటూ, సగం పేగులు మాడ్చుకొని భర్తకు చేదోడు వాదోడెై, అర్థాకలి చంపుకొని, తన ఇల్లును బట్టల ఖజానా చేసుకొని, పెైసా పెైసా కూడబెట్టి పాలకుర్తిలో 40 ఎకరాల భూమిని అయిలమ్మ కౌలుకు తీసుకుంది. అది మల్లెంపల్లి భూస్వామి కొండల్‌రావుకు చెందిన భూమి.అందులో నాలుగు ఎకరాలు సాగు చేసింది. ఐలమ్మ కుటుంబం ఈ భూమిలో కష్టపడటం పాలకుర్తి పట్వారీకి గిట్టలేదు. ఆయన పేరు వీరమనేని శేషగిరిరావు. అయిలమ్మ కుటుంబంతో విరోధం పెంచుకుంటాడు. అయిలమ్మే కాదు ఆనాటి అక్కడి ప్రజలు వెట్టికి గురెై స్వేచ్ఛగా జీవించలేని పరిస్థి తులు ఏర్పడ్డాయి. దొరోడు తన ఇంట్లో పెండ్లికి అట్టహాసంగా ఊరిప్రజలతో వెట్టిచాకిరి చేయించేవాడు. ఉత్పత్తి చేసే సామా న్య జనులకు కేవలం జొన్న సజ్జగటుక కూడా దొరక నిచ్చే వారు కాదు. పాలకుర్తి పట్వారీ అయిలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పని చేయాలని ఒత్తిడి చేశాడు.
కానీ అప్పటికీ ఆంధ్ర మహాసభ తనలో నింపిన చెైతన్య స్ఫూర్తితో పని చేయడానికి నిరాకరించింది. అయి లమ్మను ఎలాగెైనా లొంగదీసుకోవాలని భూస్వాములు కుట్రలు చేశారు. వారు చేసిన అన్ని ప్రయత్నాలను తిప్పికొట్టింది. ఆనాటి దొరలకు అధికార దర్పాలు ఎక్కువగా ఉండేవి. మీకు కట్న కానుకలు ఎందుకివ్వాలి?. మీఇంట్లో వెట్టి చాకిరి ఎందుకు చేయాలి? ఈప్రశ్నల పరంపరలో వీరోచితంగా పోరాడిన వీరవనిత చాక లి అయిలమ్మ. పాలకుర్తి పట్వారీ పప్పులుడకక అయిలమ్మ కుటుంబం కమ్యూని స్టుల్లో చేరిందని విసునూర్ దేశ్‌ముఖ్ రాపాక రాంచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. కేసులో అగ్రనాయకులతో పాటు అయిలమ్మ కుటుంబాన్ని ఇరికించారు. అయిన ప్పటికీ కోర్టులో తీర్పు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా వచ్చింది. అయిలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టు కోల్పోతుందని భావించిన దేశ్‌ముఖ్ పట్వారిని పిలిపించుకొని, అయిలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని తన పేరున రాయించు కున్నాడు. భూమి తనదని, వండించిన ధాన్యం తనదేనని పంటను కోసుకురమ్మని వందమందిని దేశ్‌ముఖ్ పంపాడు.
ఆంధ్ర మహాసభ కార్యకర్తలు, బయటి గ్రామాలనుండి వచ్చిన నాయకులు అయిలమ్మతో సహా పొలం దగ్గర కూర్చున్నారు. పంటను ధ్వంసం చేయాలని, లేదా కోసుకెళ్లాలని వచ్చిన గూండాలను ఎదిరించారు. ఆ గూండాలపెై అయిలమ్మ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వెల్లగక్కింది. తాను బతికి ఉన్నంత సేపు భూమి, పంట మీకు దక్కదని కొంగును నడుముకు చుట్టి ఆవేశ పూరితంగా మాట్లాడింది. ఈ చెైతన్యపు తాకిడికి గూండాలు వెనుదిరిగారు. వరిపంట కోసి, వరికట్టలు కొట్టి ధాన్యాన్ని అయిలమ్మ ఇంటికి చేర్చారు. భంగపాటుకు గురెైన దేశ్‌ముఖ్ మరోసారి పోలీసులను ఆశ్రయించి తన పంట ను, ధాన్యాన్ని కమ్యూనిష్టులు దోచుకెళ్లారని నాయకులపెై స్థానికులపెై కేసులు పెట్టిం చాడు. కమ్యూనిస్టు నాయకత్వం చొరవ, కొండా లక్ష్హణ్ బాపూజీ సహకారంతో అయిలమ్మకు అనుకూలంగా తీర్పు వచ్చింది. రజాకార్ల ఉప సేనాధిపతి అయిన దేశ్‌ముఖ్ రెండుసార్లు పరాజయం పాలయ్యాడు. దేశ్‌ముఖ్ పాలకుర్తిపెై దాడులు నిర్వహించి, ఇండ్లను బూడిద చేయించాడు. జీవంజి సోమయ్య, నర్సయ్యలను సజీవదహనం చేశాడు. అయిలమ్మ ఇంట్లోఉన్న సరుకులు ఎత్తుకెళ్లారు. అయి లమ్మ కుమార్తె సోమనర్సమ్మపెై అత్యాచారానికి పాల్పడ్డారు. అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ అయిలమ్మ కుటుంబం ఎరజ్రెండాను వీడలేదు. అన్నీ కోల్పో యిన అయిలమ్మ ఒక్కచిత్తం చేసుకొంది. ‘ఈ దొరగాడు ఇంతకంటే ఇంక నన్ను ఏవిధంగా నష్టపెట్టగలడు’ అని తనలో తాను ప్రశ్నించుకొన్నది.
నీ దొరోడు ఏం చేస్తాడ్రా’ అని మొక్కవోని ధెైర్యంతో రోకలి బండ చేతబూని గూండాలను తరమి కొట్టిన నారీమణి అయిలమ్మ. కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరిన సాహసి. పాలకుర్తి పట్వారి శేషగిరిరావు ఇంటిని కూల్చి మొక్కజొన్న పండించిన ఘనత మరువలేనిది. అయిలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపెై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. అలాగే 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు. అయిలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేలమంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన అయిలమ్మ సెప్టెంబర్ 10, 1985న అనారోగ్యంతో మరణించింది. పాలకుర్తిలో అయిలమ్మ స్మారక స్థూపం, స్మారక భవనం సిపిఎం వారు నిర్మించారు. నేడు జరుగుతున్న భూపోరాటాలకు చాకలి అయిలమ్మ చేసిన భూపోరాటం మాతృక అని చెప్పవచ్చు. ఇంకా ఉత్పత్తికులాల ఉత్పత్తిని దోపిడి చేస్తున్న గుత్తదార్లను, బ్రోకర్లను భూస్థాపితం చేయటానికి అయిలమ్మను స్ఫూర్తిగా తీసుకొని పోరాటం కొనసాగించాలి.
సెప్టెంబర్ 10 చాకలి అయిలమ్మ వర్ధంతి
Namasete Telangana News Paper Dated : 09/09/2012
No comments:
Post a Comment