9/23/2011 12:30:10 AM
సకల జనులకు నీరాజనం
సకల జనుల సమ్మెలో భాగంగా చరివూతాత్మకమైన, విశిష్టమైన, నిర్ణయాత్మకమైన పోరాటం సాగిస్తున్న తెలంగాణ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు నీరాజనం. ప్రత్యేకంగా హైదరాబాద్, ఢిల్లీ మాయల మరాఠీల ప్రాణాలు గోదావరి లోయ భూగర్భంలోనూ, ఆర్థిక ప్రయోజనాలలోనూ ఉన్నాయని గుర్తించి అక్కడి చిలుకను పట్టుకుంటున్న సింగరేణి కార్మిక వర్గానికీ, ఇతర కార్మిక, ఉద్యోగ సోదరులకూ జేజేలు.
తొమ్మిది రోజులుగా తెలంగాణ ప్రజలు ప్రదర్శిస్తున్న ఈ సమరశీల పోరాట స్ఫూర్తి అద్భుతంగా, ఉత్సాహభరితంగా, ఆశాసూచికగా ఉన్నది. తెలంగాణ ప్రజా ఉద్యమం ఆరు దశాబ్దాల ఆకాంక్షల వ్యక్తీకరణలూ, ఐక్యతా ప్రదర్శనలూ, నిరసన ప్రకటనలూ దాటి సెప్టెంబర్ 13న ఒక మలుపు తిరిగి సకల జనుల సమ్మెగా ప్రతిఘటనా మార్గా న్ని చేపట్టింది. ఈ ప్రతిఘటన ఇప్పటికే తెలంగాణ వైరివర్గాలలో భూకంపం పుట్టిస్తున్నది. మహా ఘనత వహించిన ముఖ్యమంవూతివర్యులు సచివాలయంలోకి దొడ్డిదారిన ప్రవేశించిన ఘట్టం ఆర్తనాదములు శ్రవణానందకరముగనున్నవి అని మాయాబజార్ ఘటోత్కచుడు అన్నట్టు కనులవిందుగా ఉన్నది.
ఈ అద్భుత, అపూర్వ సన్నివేశంలో మరచిపోకుండా గుర్తించవలసిన, ఎత్తిపట్టవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి గుర్తించి, విస్తరించినప్పుడు మాత్రమే, ఉన్నతీకరించినప్పుడు మాత్రమే తెలంగాణ స్వప్నం సాకారమయే దిశలో మరొక ముందడుగు వేయగలుగుతాం. సకల జనుల సమ్మె ప్రారంభంలో అది ఏమిటి, ఎలా జరగాలి, సకల జనులంటే ఎవరు, కార్యక్షికమం ఎలా ఉంటుంది లాంటి ప్రశ్నలతో గందరగోళ స్థితి కొంత ఉండింది. బహుశా ఆ కారణం వల్లనే అనుకు న్న సమయానికి ప్రారంభం కాకపోవడం, వాయిదా పడడం జరిగింది. కాని ఆ కృత్యాద్యవస్థను దాటి సకల జనుల సమ్మె సెప్టెంబర్ 13న 65,000 మంది సింగరేణి కార్మికుల సమ్మెతో, నాలుగున్నర లక్షల రాష్ట్రవూపభుత్వోద్యోగుల సమ్మెతో ప్రారం భం కావడం అద్భుతమైన నాంది.
ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న శక్తుల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయకుండా పోరాటం ముందుకు కదలడం సాధ్యం కాదని తెలిసిన స్థితిలో సింగరేణి సమ్మె ఆ పనిని సాధించింది. సింగరేణి విశిష్టమైనది, ప్రత్యేకమైనది. అది దక్షిణ భారతదేశం మొత్తంలో ఏకైక బొగ్గు గని. వందలాది ప్రభుత్వ, ప్రైవేటు విద్యుదుత్పత్తి కేంద్రాలకు, పరిక్షిశమలకు బొగ్గు సరఫరా చేసే గని. నాలుగు జిల్లాలు వ్యాపించిన, లక్ష కుటుంబా ల జీవనాధారమైన విశాలమైన బొగ్గు గని. కనీసం ఏడు దశాబ్దాలు గా వీరోచితమైన పోరాట సంప్రదా యం ఉన్న గని. అది మూతబడితే ఆ మేరకు ప్రభుత్వానికీ, పరిక్షిశమలకూ, కాంట్రాక్టర్లకూ గంగ అందువల్లనే సింగరేణి కార్మికులు, వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు సమ్మెలో దిగడం ప్రభుత్వాన్ని స్తంభింపజేసింది.
తర్వాత ఒక్కొక్కరుగా థియేటర్ కార్మికులు, ఒక లక్షా డ్బై వేల మంది ఉపాధ్యాయులు, అరవై వేల మంది ఆర్‌టిసి కార్మికులు, రెండు లక్షల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, వేలాదిగా అనేక ఇతర వర్గాల ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు, పారిశుధ్య కార్మికులు, న్యాయవాదులు, విద్యార్థులు కూడ సకల జను ల సమ్మెలో దిగడం రాష్ట్ర ప్రభుత్వాన్ని అల్లకల్లోలం చేసింది. చేస్తున్న ది. తెలంగాణ ఆకాంక్షలకు ప్రధాన అవరోధంగా ఉన్న ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సరైన శిక్ష.
ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సింగరేణి, ఆర్‌టిసి, విద్యుత్తు మూడు రంగాలూ అతి ప్రధాన స్థానంలో ఉన్నాయి. ఈ మూడు రంగాలలో ప్రతిష్టంభన ఏర్పడితే మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే దెబ్బతింటుంది. రాష్ట్ర ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అలా రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో పడినప్పుడే తెలంగాణ ఆకాంక్షలను గౌరవించడం, తానే 2009 డిసెంబర్ 9న చేసిన వాగ్దానాన్ని అమలు పరచడం ఎంత అవసరమో కేంద్ర ప్రభుత్వానికి తెలిసివస్తుంది. అందువల్ల ఈ అపురూప పోరాటాన్ని సమర్థించడం, ఎత్తిపట్టడం, అది ఆగిపోకుండా చూడడం, దాన్ని విస్తరించడం, దాని మీద అమలవుతున్న భయంకరమైన, చట్టవ్యతిరేకమైన నిర్బంధాన్ని ఖండించడం ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యత. తెలంగాణకు బయటి ప్రజాస్వామిక వాదుల బాధ్యత.
అట్లాగే ఒక విశాల ప్రజా ఉద్యమంలో కార్మికవర్గ పాత్ర ఎంత కీలకమైనదో కూడ సకల జనుల సమ్మె స్పష్టంగా చూపుతున్నది. కార్మికవర్గం ప్రత్యక్షంగా పాలకుల మనుగడకు అవసరమైన ఆర్థిక మూలాలను అందజేస్తుంది గనుక కార్మికవర్గం తన పని ఆపితే ఏలినవారి ప్రాణవాయువు నిలిచిపోతుంది. కార్మికవర్గ నిరంతర శ్రమ మీదనే ఏలినవారి పటాటోపమంతా ఆధారపడి ఉంది గనుక ఆ కార్మికవర్గం కళ్లెపూరజేస్తే ఏలినవారి అధికారచక్రం కీచుమంటూ ఆగిపోతుంది. ప్రపంచ చరివూతలో ఎన్నోసార్లు రుజువైన ఈ సత్యాన్ని తెలంగాణ నడిబొడ్డు మీద తెలంగాణ బిడ్డలు మరొకసారి ప్రకటిస్తున్నారు.
అయితే ఇప్పటికి సకల జనుల సమ్మెది పాక్షిక విజయమే. ఇది సంపూర్ణ విజయం దిశగా పయనించాలంటే ఇవాళ సకల జనుల సమ్మెలో పాల్గొంటున్న దాదాపు పది లక్షల మంది కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, అసంఘటిత రంగ సోదరులతో మిగిలిన నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు చెయ్యీచెయ్యీ కలపవలసి ఉంది. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డా తన వంతుగా ఏమి చేయగలిగితే అది చేయవలసి ఉంది.
ఇది ఇంకా పాక్షిక విజయమే అనడం ఎందువల్లనంటే తెలంగాణ ప్రత్యర్థులు నలుగురుండగా అందు లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనే ఒక్క ప్రత్యర్థి మీద మాత్రమే సకల జనుల సమ్మె ప్రభావం ఉన్న ది. మిగిలిన ముగ్గురు ప్రత్యర్థులు భారత ప్రభుత్వం; కోస్తాంధ్ర, రాయలసీమ కుబేరులు; తెలంగాణ దళారులు కూడ దిగివచ్చే పోరాట రూపాలను తెలంగాణ ప్రజలు చేపట్టినప్పుడే సకల జనుల సమ్మె సార్థకమవుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష సాకారమవుతుంది. ఈ ముగ్గురు ప్రత్యర్థుల రాజకీయ ఆర్థిక ప్రయోజనాలను అడుగడుగునా అడ్డుకోవడమే, తద్వారా వారి ని లొంగదీయడమే ఇవాళ్టి కర్తవ్యం.
తెలంగాణలో ఉన్న, తెలంగాణ మీదుగా వెళ్తున్న కేంద్ర ప్రభుత్వ సేవలను, సంస్థలను, వ్యాపారాల ను కూడ అడ్డుకుని, డిసెంబర్ 9 ప్రకటన అమలు చేసేవరకూ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాలు కూడ అడ్డుకుంటామని ప్రకటించవలసి ఉంది. అలాగే కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాపారులు తెలంగాణ వనరులను కొల్లగొట్టి కుబేరులయి, రాజకీయాలలోకి దిగారు. వారి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు తెలంగాణలో ఇక చెల్లవని అడుగడుగునా ప్రకటించవలసి ఉంది.
ప్రతిఘటించవలసి ఉంది. తెలంగాణను వ్యతిరేకిస్తున్న, తెలంగాణ పట్ల అవకాశవాదం నడుపుతున్న రాజకీయ నాయకుల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఇక నెరవరనివ్వబోమని ప్రతిఘటించవలసి ఉంది. అదే విధంగా తెలంగాణలో పుట్టి కూడ తెలంగాణ వ్యతిరేకులుగా, ద్రోహులుగా ఉన్నవారి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయడం ప్రారంభించినప్పుడే వారు దారికి రాగలరు. ఈ పనులన్నీ తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులూ, తెలంగాణ ప్రజలూ ఎక్కడికక్కడ చేయవచ్చు.
ఇటువంటి విస్తృతమైన సకల జనుల సమ్మెలో ప్రతి మనిషికీ పాత్ర ఉంది. ఆ పాత్ర నిర్వహించడం ద్వారానే సింగరేణి, ఆర్‌టిసి, విద్యుత్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెను బలోపేతం చేయగలుగుతాం. అప్పుడు మాత్రమే వారి మీద సాగుతున్న అమానుష నిర్బంధాన్ని తగ్గించగలుగుతాం. అప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్ర సాధనకు దగ్గరవుతాం.
-ఎన్. వేణుగోపాల్
No comments:
Post a Comment