Saturday, February 25, 2012

కేంద్ర హోంమంత్రికి బహిరంగ లేఖ-- -ఎన్. వేణుగోపాల్


పళనియప్పన్ చిదంబరం గారూ, మీరు అగ్రాసనాధిపత్యం వహిస్తున్న మహా ఘనత వహించిన గృహమంత్రిత్వశాఖ మే 6న విడుదల చేసిన ఒక ప్రకటన (బెదిరింపు లేఖ)కు జవాబుగా బహిరంగలేఖ రాయాలనిపిస్తున్నది. ఆ రెండు పేరా గ్రాఫుల ప్రకటనలో చెప్పినవీ, చెప్పనివీ చాలా విషయాలున్నాయి. తమ రాజకీయాలను సమర్థించమని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) నాయకులు కొన్ని స్వచ్ఛంద సంస్థలను, మేధావుల ను అడుగుతున్నారని, అలా సమర్థించడం 1967 నాటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధ) చట్టం కింద శిక్షార్హమని, అలా సమర్థించిన వారికి పది సంవత్సరాల శిక్ష విధించవచ్చునని మీ మంత్రిత్వశాఖ ఆ ప్రకటనలో బెదిరించిం ది.

ఈ ప్రకటనను 'ప్రజాప్రయోజనాల' కోసమే చేస్తున్నామని, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)కు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్థానం లేదనీ ఆ ప్రకటన చెప్పింది. మావోయిస్టులు ఆదివాసులతో సహా అమాయకులను చంపుతున్నారనీ, విధ్వంసాలు సాగిస్తున్నారనీ ఒక ముక్తాయింపు కూడా చేసింది.

మావోయిస్టు పార్టీ రాజకీయాలను సమర్థిస్తూ రచనలు చేయడం చట్టరీత్యా నేరం అవునా కాదా చర్చించవలసిందే. కానీ దానికన్నా ముందు మిమ్మల్ని అడగవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి.

edit.భారతదేశంలో విద్యుదుత్ప త్తి చేస్తానని నమ్మించి వేల కోట్ల రూపాయలు ముంచిన ఎన్రాన్ కంపెనీని సమర్థించడం నేరం అవునా కాదా? భారత ప్రజల కూ, భారత ఖజానాకూ అపారమైన నష్టం కలగజేసిన ఎన్రాన్ కంపెనీ తరఫున న్యాయస్థానంలో వాదించడం నేరం అవునా కాదా? ఫెయిర్ గ్రోత్ అనే ముదుపు సంస్థలో పెట్టుబడులు పెట్టడం అనైతికమ ని, అవినీతికరమని పార్లమెంటులో కూడా చర్చ జరిగిన తర్వాత అలా పెట్టుబడులు పెట్టానని ఒప్పుకున్నవారు నేరస్థులవునా కాదా? వారు మంత్రి పదవికి రాజీనామా చేసినంత మాత్రానా ఆ నేరం సమసిపోయినట్టేనా? పన్ను ఎగవేత దారులకు క్షమాభిక్ష ప్రసాదించి దేశ ఖజానాకు లక్షల కోట్ల నష్టం కలగజేసి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేత మొట్టికాయలు వేయించుకోవడం నేరం అవునా కాదా? ఆసంస్థ డైరెక్టర్లలో ఒకరుగా ఉండి, ఆ తర్వాత వచ్చి న రాజకీయాధికారాన్ని ఉపయోగించి ఆ సంస్థకు లక్షల కోట్ల లాభాలు చేకూర్చగల పథకాలు రచించడం నేరం అవునా కాదా? చిదంబరం గారూ, ఈ పనులన్నీ చేసినది మీరే గనుక అవన్నీ నేరాలు కాదని మీరు అనుకోవచ్చు. కాని వలసవాద వ్యతిరేక భారత జాతీయోద్యమం, స్వావలంబననూ, సామాజిక న్యాయాన్నీ ప్రవచించిన భారత రాజ్యాంగ స్ఫూర్తి, భారత సమాజపు సహజ వివేకం వాటన్నిటినీ నేరాలుగానే గుర్తిస్తున్నాయి. నిజానికి దేశమంటే మనుషులోయ్ అనుకుంటే అవన్నీ దేశద్రోహకర నేరాలు. ఆ నేరాలు చేసిన మీకు ఇతరుల నేరాలు ఎన్నే హక్కులేదు.

మీరు ఎన్నుతున్న నేరాలన్నీ కేవలం మీరు, మీవంటివారు చేసిన నేరాలను ఎత్తిచూపేవి, బయటపెట్టేవి, అటువంటి నేరాలు జరగడానికి వీలులేని నిజమైన శ్రేయోరాజ్యం నెలకొనాలని ఆశించేవి. అటువంటి ప్రజల రాజ్యాం ఏర్పడాలని, ఇప్పటి వేదాంత భోజ్యం రద్దు కావాలని ఒక్క మావోయిస్టులు మాత్రమే కోరడంలేదు. ఆదివాసులు, దళితులు, అన్ని అణగారిన సామాజిక వర్గాలు, దోపిడీకి పీడన కూ గురవుతున్న వారందరూ ఆ ఆకాంక్షనే వ్యక్తం చేస్తున్నా రు. గాంధేయవాదులు, సర్వోదయవాదులు, స్వార్థప్రయోజనాలులేని దేశభక్తులు, ప్రతిపక్షాలలోని కింది స్థాయి కార్యకర్తలు కోరుతున్నారు.

మావోయిస్టులు కోరుకునేది అదేగనుక ఆమాట అన్నవారందరినీ మావోయిస్టుల సమర్థకులు గా భావించి చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టాన్ని ఉపయోగిస్తామంటే మీ ఇష్టం. కాని దేశంలో జైళ్లు సరిపోతాయో లేదో ఒక్కసారి చూసుకొండి. అసలు ఇంతకీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే మాట మీరు ఎత్తారు గనుక, పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలో అసలు ఒక రాజకీయ పక్షాన్ని నిషేధించడమే తప్పు.

నా విధానాలను సమర్థిస్తేనే వాక్, సభా స్వాతంత్య్రాలు, వ్యతిరేకిస్తే నిషేధం అనేది హిట్లర్ అమలు చేసిన నాజీజం. ముస్సోలినీ అమలు చేసిన ఫాసి జం అవుతుంది గాని ప్రజాస్వామ్యం కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అన్ని అభిప్రాయాలు గలవారికీ చోటు ఉండాలి, ఉంటుంది. ఫలానా వారికి చోటులేదు అనే మాట చెల్లదు.

మీ పేరు-బహుశా మీ పేరులో మొదటి పదమైన మీ తండ్రిగారి పేరు- తలచుకున్నప్పుడల్లా మా నేల మీద ఆ పేరుగల పోలీసు అధికారి సాగించిన ఆకృత్యాలు గుర్తుకొస్తాయి. ఆయన పాత మద్రాసు రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో కాటూరు, యలమర్రు గ్రామాల్లో కమ్యూనిస్టు విశ్వాసాలు ఉన్న పాపానికి స్త్రీల ను, పురుషులను వివస్త్రలను చేసి గాంధీ విగ్రహం చుట్టూ పరుగెత్తించాడు.

అప్పటి నుంచి కాలం ఆరు దశాబ్దాలు ముందుకు కదిలిందనీ, కొత్త పళనియప్పన్ హార్వర్డ్‌లో చదువుకుని వచ్చి నాజూకు తేరాడనీ భ్రమ పడ్డందుకు క్షమించండి. ఇప్పటి పళనియప్పన్ కమ్యూనిస్టు భావాలు ఉన్న వాళ్లను ఎట్లాగు చంపుతున్నాడు. 'ఎవరికైనా ఏ భావాలయినా ఉండవచ్చు. వాటిని కాపాడడమే ప్రజాస్వామ్యపు గీటురాయి' అని వోల్టేర్ అన్నమాటను నమ్మిన మేధావులను పది సంవత్సరాల పాటు జైలుకు పంపుతానంటున్నాడు. ఎంత అభివృద్ధి! ఎంత ప్రజాస్వామ్యం!!

-ఎన్. వేణుగోపాల్
Andhra Jyothi News Paper Dated : 11/05/2010

No comments:

Post a Comment