Monday, May 21, 2012
Sunday, May 20, 2012
దళిత వ్యతిరేకత
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించి సక్రమంగా అమలు చేయాలని ఉద్యమం సాగుతున్న దశలోనే, ఈ విషయమై కమిటీ సదస్సులు జరుపుతుండగానే, ఉప ఎన్నికలలో లబ్ధి కోసం దళితుల నిధులు దారి మళ్ళించడం దారుణం. దళితుల అభ్యున్నతికి ఏదో ఒరగ బెడుతున్నట్టు ఎప్పుడూ ఊదరగొట్టే ప్రభుత్వాలు ఆచరణలో చేస్తున్నది శూన్యమని ఆధారాలతో సహా రుజువైంది. అయినా ఈ అన్యాయాన్ని చక్కదిద్దడానికి పాలకులకు మనసొప్పడం లేదు. సబ్‌ప్లాన్ అమలుపై అనుసరిస్తున్న దాటివేత వైఖరి ప్రభుత్వ దళిత వ్యతిరేక దృక్పథాన్ని వెల్లడిస్తున్నది.
ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలలో ఓట్లు రాబట్టుకునేందుకు ఎస్సీ, ఎస్టీ నిధులను కేటాయించడం పట్ల శనివారం దళిత నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుపై ప్రభుత్వం శనివారం హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఒకవైపు మంత్రివర్గ కమిటీ సదస్సులు నిర్వహిస్తున్న దశలోనే మరోవైపు ప్రభుత్వం బాధ్యతారహితంగా నిధుల మళ్ళింపునకు పాల్పడడంపై దళిత సంఘాలు ఈ సమావేశంలో నిలదీశాయి. ఉప ఎన్నికలు జరుగుతున్న 18 నియోజకవర్గాలకు 180 కోట్ల రూపాయల మేర దళితుల నిధులు మళ్ళించారనే ఆరోపణ ఉన్నది. ఇందుకోసం ఒక్కరోజే 20 జీవోలు జారీ చేశారని దళిత నాయకులు ఆరోపిస్తున్నారు. దళితులు ఇంతగా ఆందోళన చేస్తున్నా నిధుల దారి మళ్ళింపు ఎట్లా జరిగిందనే విషయమై సమగ్ర దర్యాప్తు జరపాలె. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవలిందే. ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో ఎస్సీ, ఎస్టీ పేరెంట్స్ అసోసియేషన్ కూడా స్కాలర్‌షిప్ నిధుల మంజూరీలో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టింది. దళితుల అభ్యున్నతిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఈ ఆందోళనలన్నీ సాగుతున్నాయి. ‘ఉప సంఘం బోగస్, సబ్ కమిటీ గో బ్యాక్’ అంటూ దళితులు నిరసన చేపట్టడానికి దారి తీసి పరిస్థితికీ ప్రభుత్వ నయవంచనే కారణం. ఎస్సీ, ఎస్టీ నిధులు ఖర్చు చేయడానికి ప్రత్యేక పద్దు కేటాయించాలనీ, ఉప ప్రణాళిక నిధుల ఖర్చు చేయని శాఖలను గుర్తించి, బాధ్యులైన అధికారులపై చర్య తీసుకునే అధికారం నోడల్ ఏజెన్సీలకు ఇవ్వాలని గతంలో గవర్నర్‌ల కమిటీ సిఫారసు చేయడం గమనార్హం.
తరతరాలుగా అణచివేతకు గురవుతున్న దళితులను అభివృద్ధి చేయడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి- అభివృద్ధి పథకాలు దళితులకు చేరేలా ప్రత్యేక శ్రద్ధ కనబరచడం. రెండు- దళితుల జనాభా ప్రకారం నిధులు కేటాయించి అవి వారికి చేరేలా చర్యలు చేపట్టడం. మొదటి విధానం సక్రమంగా అమలు కావడం లేదు కనుకనే రెండవ విధానాన్ని పకడ్బందిగా అమలు చేయాలని దళితులు ఉద్యమిస్తున్నారు. ఉదాహరణకు. ఒక ఊరిలో వీధి దీపా లు పెట్టించే పథకం ఎనబై శాతం అమలు జరిగితే, అమలు జరగని ఇరవై శాతం ప్రాంతంలోనే దళిత వాడలు ఉండే అవకాశం ఉన్నది. ఏదైనా స్వయం ఉపాధి పథకం ద్వారా 80 శాతం యువత లభ్ధి పొందితే, దళితులు లబ్ధి పొందని 20 శాతంలో ఉండే అవకాశం ఉంది. ఇది సామాజిక వాస్తవికత. ప్రభుత్వ అధికారులు అభివృద్ధి పథకాలు దళితులకు చేరే విధంగా తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు. గిరిజనుల పట్ల కూడా ఇదే అలక్ష్యం జరుగుతున్నది. అందువల్ల దళితుల, గిరిజనుల జనాభాకు అనుగుణంగా ప్రత్యేకించి వారి కోసమే నిధులు కేటాయించి వ్యయం చేయాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. ఇదే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్. జాతీయ స్థాయిలోనే ఈ మేరకు నిర్ణయం జరిగింది.
మహారాష్ట్ర వంటి కొన్నిరాష్ట్రాలు ఈ సబ్‌ప్లాన్‌ను సక్రమంగా అమలు చేస్తున్నాయి. కానీ సరిగ్గా అమలు చేయని రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ కూడా ఉన్నది. గత ఏడాది ఎస్సీలకు కేటాయించిన నిధుల్లో 1400 కోట్ల రూపాయలు వినియోగమే కాలేదు. ఇదే విధంగా ఎస్టీ నిధుల్లో 450 కోట్లు వినియోగించలేదు. ఎస్సీలకు కేటాయించిన నిధులు వినియోగించక పోవడం పాలకులు అనుసరిస్తున్న ఒక ఎత్తుగడ. బడ్జెట్‌లో కేటాయించినట్టు కనిపించినప్పటికీ వాటిని దారి మళ్ళించడం మరో ఎత్తుగడ. దళితులకు ఏ మాత్రం సంబంధం లేని పథకాలకు నిధులు కేటాయించడం మరో పన్నాగం. ఈ విధంగా అనేక విధాలుగా ప్రభుత్వం దళితులను మోసం చేస్తున్నది. సబ్‌ప్లాన్ నిధులను ఉపయోగించే విషయమై స్పష్టమైన విధానాలు ఉన్నాయి. దళితులు వ్యక్తిగా లేదా బృందాలుగా లబ్ధి పొందే విధంగా నిధులు ఉపయోగపడాలె. లేదా దళిత వాడలకు ఉపయోగపడేలా నిధుల వినియోగం జరగాలె. ఇందుకు భిన్నంగా ఎస్సీ, ఎస్టీలకు సంబంధం లేని- కొల్లేరు అభివృద్ధి, హుస్సేన్ సాగర్ సుందరీకరణ వంటి పథకాలకు నిధులను కేటాయించి దానిని దళితుల కోసం కేటాయించినట్టు ప్రభుత్వం బుకాయిస్తున్నది.
ప్రభుత్వం అనుసరిస్తున్న టక్కుటమారాలన్నీ గమనించిన దళితులు మహారాష్ట్ర తరహాలో నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ ప్రభుత్వం నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేసినప్పటికీ వాటికి ఆర్థిక పరమైన అధికారాలు ఇవ్వకుండా కాగితపు పులులుగా మార్చిందని దళితులు విమర్శిస్తున్నారు. సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై సాగే పర్యవేక్షణ వ్యవస్థ కూడా నామమావూతంగా ఉన్నది. సబ్‌ప్లాన్ అమలుపై ప్రభుత్వం నలభై శాఖలతో కీలక సమావేశం నిర్వహిస్తే దీనికి ఉన్నతాధికారులు డుమ్మా కొట్టడం తాజా ఉదాహరణ. ముఖ్యమంత్రి సారథ్యంలో ఉండే అపెక్స్ కమిటీ, చీఫ్ సెక్రటరీ ఆధ్యర్యంలోని కమిటీ, సాం ఘిక సంక్షేమ మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలోని నోడల్ ఏజెన్సీలు, జిల్లా డివిజన్ మున్సిపాలిటీ మండల స్థాయి పర్యవేక్షక కమిటీలు అన్నీ ఏర్పాటు చేసి ప్రభు త్వం నిధులను మాత్రం సక్రమంగా వినియోగించడం లేదు. అందుకే సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత ఏర్పడితే అమలు చేయనందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. సంబంధిత అధికారులకు శిక్ష పడుతుందనే భయం ఉంటుంది. అయితే సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలనే ఉద్యమం తీవ్రమైన తరువాత కూడా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. క్యాబినెట్ సబ్ కమిటీ వేసి సదస్సులు నిర్వహిస్తున్నది. నిజానికి ప్రభుత్వం సదస్సులు ఏర్పాటు చేయడం, సర్వేలు జరపడం కాదు చేయాల్సింది. ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలె. దళితులు కోరుతున్నట్టు సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించడం ద్వారానే ఈ సమస్య పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని గ్రహించాలె.
Namasete Telangana News Paper Dated : 21/05/2012
Namasete Telangana News Paper Dated : 21/05/2012
Thursday, May 17, 2012
గనులు, వనరులు, ఆదివాసీ హక్కులు--బృందా కరత్
Share
Thu, 17 May 2012, IST
గనులు, ఖనిజాల రంగంలో ప్రతిపాదించిన సంస్కరణలు భూమి, దానికి సంబంధించిన వనరుల యజమానుల హక్కులపై దాడి చేయ డానికి ఉద్దేశించినవే తప్ప మరొకటి కాదు. ప్రపంచ వ్యాప్తంగా గిరిజన, దేశీయ కమ్యూనిటీలు తమకు చెందిన భూముల్లో నిక్షిప్తమై ఉన్న ఖనిజ సంపదపై తమ హక్కులను చాటుకుంటున్నాయి. వారు ఆ భూములపై, ఆ భూముల్లో లభించే ఖనిజాలపై సంప్రదాయబద్ధమైన హక్కులు కలిగి ఉన్నారు. అయితే గిరిజనుల న్యాయపరమైన హక్కుల సంగతి అటుంచి ఆ సంపదలో కనీసం కొంత శాతంపై కూడా హక్కులు పొందలేకపోతున్నారు. ప్రస్తుత నయా ఉదారవాద విధానాల నేపథ్యంలో దేశీయ కార్పొరేట్ సంస్థలు, బహుళ జాతి మైనింగ్ కంపెనీలు ఖనిజాలు, జాతీయ వనరులను దోచుకుంటున్నాయి. మరోవైపు దోపిడీకి గురవుతున్న కమ్యూనిటీల నుండి ప్రతిఘటన ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఇది అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఐక్యరాజ్యసమితి ఒప్పందాల్లో ప్రతిబింబిస్తోంది. గిరిజనులు సంప్రదాయబద్ధంగా వ్యక్తిగతంగా కానీ, సమిష్టిగా గానీ అనుభవిస్తున్న లేదా వారి స్వాధీనంలో ఉన్న భూముల యాజమాన్య హక్కులు, నియంత్రణ, నిర్వహణలను ఇవి వివిధ రూపాల్లో గుర్తిస్తున్నాయి. తమ ప్రాంతాలను అభివృద్ధి అవసరాలకు ఉపయోగించుకునే విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో వారికి గల హక్కులను, తమ ప్రాంతాల్లో చేపట్టే ఎటువంటి ప్రాజెక్టులకు స్వేచ్ఛగా ఆమోదం తెలిపేందుకు, లేదా తిరస్కరించేందుకు వారికి గల హక్కులను ఇవి గుర్తించాయి.
తమ హక్కుల పరిరక్షణ కోసం గిరిజనులు చేసే పోరాటాలు లేదా వారు చేసే త్యాగాల ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఆ తీర్మానాలను చట్టబద్ధమైన హక్కులుగా మార్చడం అత్యంత ముఖ్యమైన విషయం. ఇది భారత్‌కు పూర్తిగా వర్తిస్తుంది. యుపిఎ ప్రభుత్వం 2011గనులు, ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు (ఎంఎంఆర్‌డిఎ) ప్రవేశపెట్టింది. ఆ బిల్లు ప్రస్తుతం పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలనలో ఉంది.
ప్రయివేటీకరణకు ప్రోత్సాహం
భారతదేశంలో గనుల యాజమాన్యం ప్రభు త్వానికే చెందుతుంది. అయితే ఇనుప ఖనిజం, బాక్సైట్, రాగి, బొగ్గు మొదలైన ప్రధాన ఖనిజాలపై కేంద్ర ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇసుక, ఇటుకరాయి. గ్రానైట్ వంటి చిన్నపాటి ఖనిజాలపై నియంత్రణ కలిగి ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వద్ద గనుల ప్రయివేటీ కరణను ప్రవేశపెట్టాయి. గనులను ప్రయివేటు కంపెనీలకు లీజుకు ఇవ్వడంతోపాటు ఇనుప ఖనిజం, బాక్సైట్, ఉక్కు, అల్యూమినియం వంటి క్యాప్టివ్ గనులను టాటాలు, బిర్లాలు వంటి కార్పొరేట్ సంస్థల చేతికి అప్పగిస్తున్నాయి. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇటీవల ఈ పరిశ్రమ కోసం రూపొందించిన నివేదిక ప్రకారం 23 రాష్ట్రాల్లో 2009 సంవత్సరాంతానికి 4.9 లక్షల హెక్టార్ల భూమిని మైనింగ్ లీజులకు అద్దెకు ఇచ్చారు. ప్రయివేటు కంపెనీలకు 70 శాతం భూములను కట్టబెట్టారు.
గనుల రంగంలో మరింతగా నియంత్రణ ఎత్తివేసి సరళీకరించేందుకు, హోడా కమిటీ సిఫార్సుల ప్రాతిపదికగా ప్రయివేటీకరణను ప్రోత్సహించేందుకు ఎంఎంఆర్‌డిఎ బిల్లు దోహదం చేస్తుంది. హై టెక్నాలజీ భూగర్భ పరిశోధన, ప్రాస్పెక్టింగ్, తవ్వకం విధానాన్ని ఇది ప్రవేశపెడుతుంది. తక్కువ ధరలకు మైనింగ్ పనులను లీజుకు ఇవ్వడాన్ని ప్రోత్సహిస్తుంది. గనుల రంగంలో ఎఫ్‌డిఐలు, విదేశీ కంపెనీలను ప్రోత్సహిస్తుంది. అటువంటి కంపెనీలపట్ల సాను కూలత చూపే కొంతమందికి గనులను లీజుకు ఇవ్వడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంతకుముందు కేటాయించిన విస్తీర్ణం కంటే ఎక్కువ మొత్తంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు వాటిని అనుమ తిస్తుంది. ఇందువల్ల సమానత్వం, పర్యావరణం, వృద్ధిపై ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ అంశాలపై సమగ్ర విశ్లేషణ అవసరం. కాగా ఇక్కడ గిరిజనులకు హక్కులను కల్పించేందుకు ఉద్దేశించినవిగా చెబుతున్న అంశాల గురించి ప్రధానంగా దృష్టి కేంద్రీకరిద్దాం. కోల్ మైనింగ్ కంపెనీలు తమ లాభాల్లో 26 శాతం మొత్తాన్ని నిధులు ఇవ్వాలనే నిబంధన ఒకటి ఉంది. ఇతర ఖనిజాల విషయంలో రాయిల్టీతో సమానంగా చెల్లించాలి. కంపెనీలు తప్పనిసరిగా కొంతమొత్తం చెల్లించాలనే నిబంధన అవసరమే అయినప్పటికీ ఈ నిధులు గని యజమానులు, బ్యూరోక్రసీ ఆధిపత్యం చెలాయించే జిల్లా ఖనిజాల ఫౌండేషన్ నియంత్రణలో ఉంటాయి. ఈ ఫౌండేషన్‌లో స్థానిక కమ్యూనిటీలకు నామమాత్రపు ప్రాతినిధ్యం మాత్రమే ఉంటుంది. అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వం కంపెనీలు చెల్లించే మొత్తాలతో నిధులను నిర్వహించేందుకు ట్రస్టులను ఏర్పాటు చేస్తుంది. స్థానిక భారతీయుల యాజమాన్యంలోని భూముల్లో రిజర్వ్‌లుపై చెల్లించే నిధులకు ప్రభుత్వం ఇటీవల ఇటీవల 41 మంది భారతీయులకు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. నిధులను దుర్వినియోగం చేసినందుకు గాను ఈ నష్టపరిహారం చెల్లించాల్సివచ్చింది. ఇటువంటి కేసు లోనే అమెరికా 3.4 బిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించాల్సి రావచ్చునని భావిస్తున్నారు. ఇటువంటి నిధుల నిర్వహణలో బాధిత వ్యక్తులకు ఎటువంటి నిర్ణాయక పాత్ర లేకపోతే ఎంఎంఆర్‌డిఎ బిల్లులో ప్రతిపాదిత జిల్లా ఖనిజాల ఫౌండేషన్‌లో మాదిరిగా నిధుల దుర్వినియోగం అనివార్యమవుతుంది. పైగా భారతదేశంలో రాయల్టీలు బాగా తక్కువగా ఉంటాయి. ఇటీవలి కాలం వరకు ఇనుప ఖనిజానికి కేంద్ర ప్రభుత్వం ఒడిశా రాష్ట్రానికి నిర్ణయించిన రాయల్లీ టన్నుకు రు26 మాత్రమే. ఇనుప ఖనిజం తవ్వకం ఖర్చు టన్నుకు రు. 250 నుండి రు. 300 కాగా, మార్కెట్‌లో ఉన్న అత్యధిక రేటు టన్నుకు ఏడు వేల రూపాయలు. దీంతో మైనింగ్ కంపెనీలు భారీ మొత్తంలో లాభాలు ఆర్జించాయి. రాయల్టీ రేట్లను ఇటీవలే పెంచినప్పటికీ కంపెనీలు గడిస్తున్న లాభాలతో పోలిస్తే చెల్లిస్తున్న రాయిల్టీలు స్వల్పం గానే ఉన్నాయి.
ప్యాట్రన్-క్లయింట్ సంబంధాలు
ఈ పథకంలో ముఖ్యమైన విషయం ప్యాట్రన్- క్లయింట్ మధ్య సంబంధాలు. గిరిజనులను భూములు, దానిలోని వనరుల యజమానులుగా బిచ్చగాళ్లుగా మారుస్తున్నాయి. ఈ బిల్లులోని నిబంధనలు గిరిజనులకు రాజ్యాంగం, ముఖ్యంగా ఐదవ షెడ్యూల్ కల్పించిన హక్కులపై దాడి చేసే విగా ఉన్నాయి. ఐదవ షెడ్యూల్ ప్రాంతాలను, గిరిజనుల భూమిని గిరిజనేతరులకు బదిలీ చేయ డాన్ని నిషేధిస్తుంది. ఆంధ్రప్రదేశ్ చేసిన 70/1 చట్టం, ఛత్తీస్‌గఢ్ చేసిన చోటానాగపూర్ కౌల్దారీ చట్టం, సంతల్ పరగణాస్ కౌల్దారీ చట్టం తరహాలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. మైనింగ్ కంపెనీలు లీజుకు తీసుకున్న భూములేవీ ఆదివాసీ లకు చెందినవి కావు. ఇందువల్లనే సమతా కేసులో గిరిజనులకు చెందిన భూములను గిరిజనేతరులకు విక్రయించడం, బదిలీ చేయడం, లీజుకు ఇవ్వడం చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. గిరిజనుల సహకార సంఘాలకు చెందిన భూములను మైనింగ్‌కు కేటాయించరాదు. ఈ బిల్లు సమతా కేసును అతిక్రమించేదిగా ఉంది. ప్రధాన ఖనిజాల గనులను లీజ్‌కు తీసుకునే విషయంలో గిరిజన సహకార సంఘాలను అనర్హులుగా ఈ చట్టం ప్రకటించింది. సంబంధిత చట్టాల కింద నమోదైన కంపెనీలకు మాత్రమే లీజుకు తీసుకునే అధికారం కల్పించారు. ఐదవ, ఆరవ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని స్వల్ప ఖనిజాలు, స్వల్ప మొత్తంలో డిపాజిట్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన సహకార సంఘాలను లీజ్ పొందడానికి అర్హతగల
సంస్థలుగా పరిశీలించవచ్చు. (పరిశీలించవచ్చు మాత్రమే, విధిగా పరిశీలించాలని కాదు).
మైనింగ్ కంపెనీల్లో గిరిజనులకు తప్పనిసరిగా కొంత వాటా ఇవ్వాలని 2010 ముసాయిదా బిల్లు నిర్దేశించింది.కంపెనీ గిరిజనులకు ప్రమోటార్ కోటా కింద 26 శాతం వాటాకు సమానంగా షేర్లు ఇవ్వాలని ఈ నిబంధన పేర్కొంది. దక్షిణాఫ్రికా బ్లాక్ ఎకానమీ ఎంపవర్‌మెంట్ యాక్ట్ కూడా మైనింగ్ కంపెనీల్లో చారిత్రాత్మకంగా సామాజికంగా నిరాదరణకు గురవుతున్న వర్గాలకు 26 శాతం షేర్లను ఇవ్వాలని నిర్దేశించింంది. అయితే భారత దేశంలో మైనింగ్ లాబీల ఒత్తిడికి లొంగిన ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న ముసాయిదాలో చేర్చిన నిబంధన స్థానంలో నామమాత్రంగా బాధిత కుటుంబాల్లో ఒక్కొక్క సభ్యునికి ఒక్కొక్క షేర్ చొప్పున కేటాయించే పద్ధతిని ప్రవేశపెట్టింది.
జీవనోపాధి కోల్పోయినవారికి నష్టపరిహారం, పరిహారంగా ఉద్యోగాలు కల్పించడం వంటి అనేక ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఈ బిల్లులో అందుకు సంబంధించిన నిబంధనలు సరిపోయే రీతిలో, అస్పష్టంగా ఉన్నాయి. మైనింగ్ రంగంలో పర్మినెంట్ ఉద్యోగాల్లో కోత విధించి కాంట్రాక్టు, క్యాజుయల్ కార్మికులను నియమించడం పెరిగి పోయిన నేపథ్యంలో భూమి కోల్పోయినవారికి ఉపాధి కల్పిస్తామనే హామీలను విశ్వసించలేము. భూ సేకరణ బిల్లు గిరిజనుల యాజమాన్య హక్కులకు పాతరవేయడంతోపాటు అంతర్జాతీయ, దేశీయ సంస్థలు ఐదవ షెడ్యూల్, గిరిజనులు అధికంగా నివసించే ఖనిజ వనరులతో పరిపుష్టమైన ప్రాంతాల్లో తేలికగా ప్రవేశించి ప్రకృతి వనరులను దోచుకునేందుకు అవకాశం కల్పించే విధంగా ఉంది. గిరిజనుల హక్కుల పరిరక్షణకు సంబంధించి అనేక అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకాలు చేసిన భారతదేశం ఈ ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. బిల్లును ఈ రూపంలో తేవడాన్ని గట్టిగా ప్రతిఘటించాలి. ఐదవ షెడ్యూల్, గిరిజన తండాల్లో భూముల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు గిరిజనులకు భూముల్లో యాజమాన్యాన్ని గుర్తించేందుకు, వారి హక్కులను పరిరక్షించేందుకు పటిష్టమైన చట్టబద్ధమైన యంత్రాంగం కోసం ప్రత్యామ్నాయ నమూనా కోసం ఉద్యమాలు నిర్వహించాలి.
Prajashakti News Paper Dated : 18/05/2012
-బృందా కరత్
Wednesday, May 16, 2012
ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు చట్టం ఎలా ఉండాలి ?--జాన్‌వెస్లి
Share
Wed, 16 May 2012, IST
- రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ (ప్రత్యేక ప్రణాళిక) నిధుల్లో గత 19 సంవత్సరాల్లో ఎస్సీలవి 17,970 కోట్లు, ఎస్టీలవి 5 వేల కోట్లు కోత పెట్టారు. కేంద్ర ప్రణాళికా బడ్జెట్‌లో గత 10 సంవత్సరాలలో ఎస్సీలకు ఖర్చు చేయాల్సిన నిధుల్లోనే 5 లక్షల కోట్లు కోత పెట్టారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రణాళికా బడ్జెట్‌లలో గత 60 సంవత్సరాల కోత, దారి మళ్లింపు వివరాలు చూస్తే లక్షల కోట్లు దళిత, గిరిజనులు కోల్పోయారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణంగా ఉండవచ్చు.
దేశవ్యాపితంగా దళిత, గిరిజనులు సామాజిక, ఆర్థిక దోపిడీి అణచివేతకు గురౌతున్నారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో కేటాయిస్తున్న నిధులు వారి దరిచేరక అన్ని రంగాలలోనూ అభివృద్ధిలో వెనుకబడి ఉన్నారు. ఈ స్థితిని మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌లలో దళిత, గిరిజనుల జనాభా శాతానికి తగ్గకుండా నిధులు ప్రత్యేకంగా కేటాయించి వారి ప్రయోజనాలకే ఖర్చు చేసేందుకు 1980లో ఎస్సీ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్, ట్రైబల్ సబ్‌ప్లాన్ రూపొందించి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం ఎస్సీలకు మన రాష్ట్ర, కేంద్ర ప్రణాళికా బడ్జెట్‌లలో 16.2 శాతం, గిరిజనులకు రాష్ట్రంలో 6.6, కేంద్రంలో 8 శాతం నిధులు కేటాయించి ఖర్చు చేయాల్సి ఉంది. 2011 జనాభా ప్రకారం అయితే మన రాష్ట్రంలో ఎస్సీలకు 18, ఎస్టీలకు 8 శాతానికి పైగా కేటాయించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు కలిపి 8 శాతానికి మించి ఖర్చు చేయడం లేదు. ఖర్చు చేశామంటున్న నిధుల్లో సగం దళిత, గిరిజనేతరులకు దారి మళ్లింపు, బినామీ పేర్లతో అవినీతికి పాల్పడుతున్నారు. సబ్‌ప్లాన్ అమలుకు సూచనలే తప్ప సమగ్ర చట్టం లేదు. ఇది పాలకుల్లో చిత్తశుద్ధి లేమిని తెలియజేస్తున్నది.
రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ (ప్రత్యేక ప్రణాళిక) నిధుల్లో గత 19 సంవత్సరాల్లో ఎస్సీలవి 17,970 కోట్లు, ఎస్టీలవి 5 వేల కోట్లు కోత పెట్టారు. కేంద్ర ప్రణాళికా బడ్జెట్‌లో గత 10 సంవత్సరాలలో ఎస్సీలకు ఖర్చు చేయాల్సిన నిధుల్లోనే 5 లక్షల కోట్లు కోత పెట్టారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రణాళికా బడ్జెట్‌లలో గత 60 సంవత్సరాల కోత, దారి మళ్లింపు వివరాలు చూస్తే లక్షల కోట్లు దళిత, గిరిజనులు కోల్పోయారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణంగా ఉండవచ్చు.
అందుకే స్వాతంత్య్రం వచ్చి 60 సంవత్సరాల తరువాత కూడా అన్ని రంగాల్లో అభివృద్ధిలో వెనుకబడి ఉన్నారు. ఈ నిధులన్నీ సక్రమంగా ఖర్చు చేసి ఉంటే అన్ని దళిత, గిరిజన వాడలు అభివృద్ధి చెంది ఉండేవి. ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలతో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఉండవచ్చు. అన్ని దళిత, గిరిజనవాడలకు రక్షిత మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు, కమ్యూనిటీ హళ్లు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను కల్పించి ఉండవచ్చు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇవ్వవచ్చు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమ హాస్టల్స్‌లో సౌకర్యాలు మెరుగుపర్చడమేకాక పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు ఇవ్వొచ్చు. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా సబ్సీడి రుణాలు సంవత్సరానికి వెయ్యి కోట్లు ఇవ్వొచ్చు. అలాచేస్తే అన్ని రంగాలలో అభివృద్ధి చెందే అవకాశం ఉండేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పాలక పార్టీలు, దళిత, గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారినే దోపిడీ చేస్తున్నాయి.
మన రాష్ట్రంలో సబ్‌ప్లాన్ (ప్రత్యేక ప్రణాళిక) అమలుకై కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఉద్యమిస్తూనే ఉన్నది. 2007లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బివి రాఘవులతోపాటు 25 మంది నిరవధిక దీక్షలు, చలో అసెంబ్లీ ఫలితంగా రాష్ట్రంలో సబ్‌ప్లాన్ అమలుకు ఎస్సీ, ఎస్టీ నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేసింది. ఆనాటి నుండి జనాభా ప్రకారం నిధులు కేటాయింపు ప్రతిపాదిస్తున్నారు. కానీ సబ్‌ప్లాన్ (ప్రత్యేక ప్రణాళిక) నిధులను ప్రభుత్వం నోడల్ ఏజెన్సీలకు కేటాయించడం లేదు. కోత, దారి మళ్లింపు కొనసాగుతుంది. సబ్‌ప్లాన్ అమలుకు చట్టం చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులుతోపాటు ఎస్.వీరయ్య, నాగయ్య, బాబురావులు 6 రోజులు నిరవధిక నిరాహర దీక్ష చేశారు. కెవిపిఎస్, వ్యకాస, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ జరిగింది. సబ్‌ప్లాన్ (ప్రత్యేక ప్రణాళిక) అమలుకు చట్టంపై మేధావులతో కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి మాట తప్పారు. ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాల సందర్భంగా కెవిపిఎస్‌తోపాటు ఇతర 100 దళిత, గిరిజన, ప్రజా సంఘాలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు, మేధావులతో ఐక్యకార్యచరణ కమిటీిగా ఏర్పడి ఉద్యమించింది. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు మద్దతునిచ్చారు. ఐక్యకార్యచరణ కమిటి ఆధ్వర్యంలో కెవిపిఎస్‌తోపాటు 10సంఘాల నుండి 10 మంది 72 గంటలు దీక్ష చేశారు. ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను, సంఘాల నాయకులను అరెస్టు చేసింది. అధికార పార్టీలోని ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఐక్యమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, న్యూడెమోక్రసీ నాయకులు వెంకటేశ్వరావుతోపాటు అన్ని సంఘాల నాయకులు, వందలాది మంది దళితులు చట్టం ప్రకటించేంతవరకు కదిలేది లేదని రెండు రోజులు బైఠాయించడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. 2 నెలల్లో చట్టం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మా చైర్మన్‌గా 9 మంది మంత్రులతో సబ్‌కమిటీి ఏర్పాటు చేసింది. కమిటీ ఈ నెల 16 నుండి జిల్లాల పర్యటనలు చేస్తున్నది. కాలయాపన చేయకుండా సమగ్ర చట్టం తీసుకురావాలి.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ (ప్రత్యేక ప్రణాళిక) అమలుకు ఈ క్రింది ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకుని సమగ్ర చట్టం తీసుకురావాలని కోరుతున్నాం.
చట్టంలో ఉండాల్సిన అంశాలు
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చట్టం తీసుకురావాలి.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ జనాభా శాతానికి తగ్గకుండా రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి.
2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించాలి.
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగానే ప్రణాళికా బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ జనాభా శాతానికి తగ్గకుండా నిధులు వేరుచేసి ఆ మొత్తం నిధులన్నీ ముందుగా ఎస్సీ, ఎస్టీ నోడల్ ఏజెన్సీలకు కేటాయించాలి.
కేంద్ర ప్రణాళికా బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ప్రకారం రావాల్సిన నిధులను కూడా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ నోడల్ ఏజెన్సీలకు కేటాయించాలి.
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో నుండి రాష్ట్రానికి కేటాయించే కెేంద్ర సహాయం కూడ ఎస్సీ, ఎస్టీ నోడల్ ఏజెన్సీలకు కేటాయించాలి.
తరతరాలుగా దళిత, గిరిజనులు సామాజిక, ఆర్థిక అణచివేతకు గురౌతున్నారు, వారి అభివృద్ధికి 5 శాతం నిధులు అదనంగా కేటాయించాలి.
రాష్ట్ర ప్రణాళికా బడ్టెట్‌లో ఎస్సీ, ఎస్టీల జనాభా శాతానికి అనుగుణంగా నిధులు కేటాయించగా మిగిలిన జనరల్ బడ్జెట్‌లో అందరితోపాటు ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలకు వినియోగించాలి. జనరల్ బడ్జెట్‌లో ఎస్సీ ఎస్టీలకు ఖర్చు చేసిన నిధులను సబ్‌ప్లాన్ నిధులుగా పరిగణించరాదు.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను వారికి ప్రత్యక్ష ప్రయోజనం కలిగించే వాటికి మాత్రమే ఖర్చు చేయాలి. దళిత, గిరిజన నివాస ప్రాంతాల అభివృద్ధి రక్షిత మంచినీరు, రోడ్లు, డ్రైనేజి, వీధి లైట్లు, మరుగుదొడ్లు, కమ్యూనిటీ హాల్స్, సంక్షేమ హాస్టల్స్, విద్యా, స్కాలర్‌షిప్‌లు, ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ సబ్సిడీ రుణాలు, భూముల అభివృద్ధి తదితర ప్రత్యక్ష ప్రయోజనాలు కల్గించే వాటికి ఖర్చు చేయాలి.
సబ్‌ప్లాన్ నిధుల్లో కోత విధించడం, దారి మళ్లించడం, బినామీ తదితర రూపాల్లో అవినీతికి పాల్పడితే తిరిగి రాబట్టడంతోపాటు కఠిన శిక్షలు విధించాలి.
అనివార్య పరిస్థితుల్లో ఖర్చు కాకుండా నిధులు మిగిలితే మురిగిపోనివ్వకూడదు. ఆ నిధులను వచ్చే సంవత్సరం సబ్‌ప్లాన్ నిధుల్లో కలిపి అదనంగా కేటాయించాలి.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ నోడల్ ఏజెన్సీలకు ప్రత్యేకంగా ఐఏఎస్ స్థాయి అధికారులను, జిల్లా స్థాయి వరకు ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించాలి.
వీటిని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలతో అనుసంధానం చేయాలి.
రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌తోపాటు మున్సిపల్ కార్పోరేషన్, మున్సిపాలిటీలు, జిల్లా, మండల పరిషత్, మండలం, గ్రామ పంచాయితీలు, స్థానిక సంస్థలకు వచ్చే ఆదాయంలో బడ్జెట్‌లలో స్థానిక ఎస్సీ, ఎస్టీ జనాభా శాతానికి అనుగుణంగా నిధులు కేటాయించి,
ఖర్చు చేయాలి.
1980 నుండి కోత, దారి మళ్లించిన సబ్‌ప్లాన్ నిధులను దశల వారీగా తిరిగి కేటాయించాలి.
సబ్‌ప్లాన్ అమలుకు రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల, మున్సిపాల్టీలు, కార్పోరేషన్ల స్థాయిల్లో ''సామాజిక తనిఖీల వ్యవస్థ'' లేక అథారిటీ కమిటిలను ఏర్పాటు చేయాలి.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, తదితర సమస్యలపై సంవత్సరానికి రెండు లేదా అంతకు ఎక్కువ సార్లు ప్రజాపథం లాంటి కార్యక్రమాలు నిర్వహించాలి.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల ఖర్చు కోసం ప్రణాళికను పార్టీ, ప్రజా సంఘాలు, సంస్థలతో చర్చించి ప్రతి సంవత్సరం రూపొందించాలి. శాసనసభలో ఆమోదం పొందాలి.
ఎస్సీ, ఎస్టీ ప్లానును సరైన విధంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సంబంధిత మంత్రులతో, శాఖాధిపతులతో, తరచు అనగా కనీసం మూడు నెలలకొకసారైనా పర్యవేక్షణ సమావేశాలను ఏర్పాటు చేసి, ఏవిధమైన తప్పొప్పులున్నట్లైతే వాటిని సవరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
జిల్లా స్థాయిలో కలెక్టరు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సంయుక్త కలెక్టరు సహకారంతో ఈ ప్రత్యేక పథకాల అమలును కనీసం నెలకొకసారైనా పర్యవేక్షించాలి. తప్పులు చేసి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలను తీసుకోవాలి.
పై అంశాలు అమలు చేయని శాఖలు, అధికారులు, సంబంధిత మంత్రులు, ప్రజాప్రతినిధులు, బాధ్యులను ఉద్యోగం, పదవుల నుండి తొలగించడంతోపాటు కఠినంగా శిక్షించే విధంగా చట్టంలో ఉండాలి. దళిత, గిరిజనేతరుడైతే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం శిక్షించాలి.
ఈ అంశాల సాధనకోసం దళిత, గిరిజన, ప్రజా సంఘాలు సంఘటితంగా ఉద్యమించాలి. అన్ని రాజీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. ముఖ్యమంత్రి చెప్పిన 2 నెలల్లో వాగ్దానంలో 49 గడిచిపోయాయి. ఆందుకు మరో 45 రోజులు అంటున్నారు. కాలయాపన జరగకుండా అమల్లోకి తెచ్చేవిధంగా కృషి చేయాలి.
(రచయిత కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
Prajashakti News Paper Dated : 16.05.2012
-జాన్‌వెస్లి
Saturday, May 12, 2012
Food fascism--Kancha Ilaiah
After the beef festival in Osmania University, Hyderabad, on April 15 — in which 1,500-2,000 students belonging to SC/ST/OBC communities and some faculty members participated — was attacked by the Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) and Rastriya Swayamsevak Sangh (RSS) activists, food culture has become an issue of national debate.
The ABVP and RSS attacked the students who ate beef, burnt media vans covering the festival and a bus on the Osmania campus. Predictably, they used only SC/ST/OBC students to get the job done. Osmania students, leaving behind their image as agitators for a separate Telangana state, became the harbingers of social reform that could protect the Muslims, who often face hostility sparked by the notion that it is ungodly to eat beef, even in this region.
Culture engenders passion and throughout history cultural battles have claimed more lives than wars fought over land. After human society entered the phase of organised religion, each religion formulated its own notion of God and structuralised its relationship with God/ gods/prophets. In this process, many inimical relationships were established between religions, based often on the food habits of people and the theological definitions that had been worked out around them.
What is not so well known is that the Arya dharma was constructed around full-scale beef-eating in ancient India and the early opposition to that came from Jain Vardhaman Mahavir and the spiritual theory that required total abstinence from all forms of meat. Since it was not possible to sustain large human existence around only vegetarianism (at that time all plants were treated as lifeless), Jainism could not expand. The beef-eating Arya dharma continued to hold sway, perhaps till such time as Gautam Buddha’s Buddhism gained in strength.
Buddha discovered the middle path between the Vedic multi-fold, violent spiritual dharma and the extreme non-violent Jain philosophy, and abolished all forms of animal sacrifices (within the Sangha), but allowed eating of meat, beef, pork and fish as purely need-based food items.
We do not have exact evidence when the Arya Brahmins became vegetarians. One theory is that they adopted the pure vegetarian food culture during Adi Shankara’s anti-Buddhist Advaita campaigns. Though there are Brahmins who ritually eat meat and fish in several parts of western and eastern India, beef, somehow, has become a spiritual untouchable, maybe because of cow worship of Brahminism.
Beef may have gone out of Hindu food culture, but it has survived among SC/STs and some OBC communities.
In evolving vegetarianism, the influence of Jainism worked more than any other factor. During the phase of Islam’s expansion and British colonialism, Brahmins not only became rigid vegetarians but established a cow-worshipping culture and came to label Muslims and Christians as “cow eaters”.
They also re-worked their literary texts to say that vegetarians are sacred (pure) people and meat, beef and fish-eaters are chandaals. During this entire period they never cared to examine what the Sudras, Ati Sudras (Dalits) and Adivasis, who had nothing to do with Islam and Christianity, were eating. The preferred food of the vast masses continued to be meat, fish and beef.
During the freedom struggle, Brahminic vegetarianism got a further fillip with Mahatma Gandhi joining the bandwagon.
Gandhi, in fact, politicised food culture in a significant way. The RSS and its political wing, Jana Sangh, also adopted vegetarianism and cow protection (not buffalo and bull protection) as their post-Independence, nationalist, cultural ideology, without any regard for the democratic principle that what one eats must be left to the individual.
Till the days of the Mandal movement, the Bharatiya Janata Party (the new name of the Jana Sangh), remained weak because the Dalit-Bahujan masses suspected that its leaders wouldn’t eat “people’s food”. It remained by and large a Brahmin-Baniya party. Till then, in fact, all parties were headed by Brahminic forces who took for granted that Gandhian Hinduism had acquired legitimacy. The communists never engaged with cultural issues, thinking that the masses would not like such an engagement. But they did not talk against any food culture.
After Independence, even academic institutions turned Brahminic vegetarian; several sociologists wrote what could be called “Hindu sociology”, dividing society into pure (vegetarian) and impure (meat, fish and beef-eating) castes.
Modern sociological theories, instead of suggesting methods of abolishing graded caste-based inequalities, added the new spiritual fascist language of “social purity” of vegetarianism and “social impurity” of non-vegetarianism. They, too, forgot that Indian Muslims and Christians would be bracketed as impure people. But the Indian Christians and Muslims know that their God created animals to provide food for humans. The Bible, for example, says, “You may eat any animal that has completely split hooves and that chews the cud.” It further says that the camel, though it chews the cud, does not have a split hoof; the pig, though, has a split hoof but does not chew the cud; therefore “you must not eat their meat.”
The Quran’s prescriptions are on the same lines. But the Western Christian menu includes pork and the Muslim menu includes camel meat. It was the non-cow and -pig-eating food culture that caused the Sepoy mutiny in India in 1857.
To overcome all these problems of food culture that India as a modern nation has inherited, we should adopt a democratic plural and individualist food culture without validating anything in spiritual terms. Universities ought to be agents of transformation.
SC/ST/OBC students come from uninhibited food cultural backgrounds and they think that the mess menu should be multi-cultural and not affect the individual’s democratic right to eat any item. No religious culture (Hindu, Muslim, Christian) should control the food habits of people. In this respect, states must follow the Kerala model of keeping an all-inclusive menu in public spaces, and not the Gujarat model, where one religious culture rules the roost.
Kancha Ilaiah is director, Centre for the Study of Social Exclusion and Inclusive Policy, Maulana Azad
National Urdu University, Hyderabad
Daccan Chronicle News Paper Dated : 13/05/2012
Thursday, May 10, 2012
తెలంగాణ గళంలో కాషాయ గరళం!---ఘంటా చక్రపాణి,
బీజేపీ గురించి ఈ తరం నాయకుల్లో చాలామంది కంటే డా. దాసోజుశ్రావణ్‌కే ఎక్కువగా తెలుసు. టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరోలో క్రియాశీలంగా ఉన్న ఈ యువనేత పూర్వాక్షిశమం లో కరుడుగట్టిన కాషాయ కరసేవకుడు. శ్రావణ్ మాతో పాటు ఉస్మానియా యూనివర్సిటిలో చదువుతున్నప్పుడు అఖిల ఏబీవీపీ మిలిటెంట్ నాయకుల్లో ముఖ్యుడు.ఆయన ఏబీవీపీనుంచి ఆర్ట్స్‌కాలేజీ విద్యార్థిసంఘం ప్రధానకార్యదర్శిగా గెలుపొందారు. 1985-90 మధ్యకాలంలో కొన్ని వామపక్ష విద్యార్ధిసంఘాలను ప్రభుత్వం నిషేధించింది. మరికొన్నిటిని నిర్మూలించడానికి ఏబీవీపీ ప్రయత్నించేది. వామపక్ష, దళిత బహుజన విద్యార్ధి సంఘాలు, ఆ భావజాలంతో పనిచేసే విద్యార్థుల మీద ఏబీవీపీ ఆధ్వర్యం లో అనేక దాడులు జరిగేవి.ఆయనకు ఆకాలంలో అగ్రక్షిశేణి బీజేపీ నాయకులతో సన్నిహిత సంబంధాలుండేవి. అదే శ్రావణ్ ఇప్పుడు బీజేపీ రాజకీయాలను ఏవగించుకుంటున్నాడు. మతతత్వ, ప్రాంతీయ అవకాశవాద పార్టీ అని, నిండుకుండ లాంటి తెలంగాణ ఉద్యమంలో విషపుచుక్క అని బీజేపీపై విరుచుకుపడ్డారు. శ్రావణ్ మాటలను రాజకీయ ప్రేలాపనలుగా కొట్టిపారేయలేము. ఎందుకంటే ఆయన సంప్రదాయ రాజకీయ వాదికాదు. ఎంబీఏతో పాటు ఎంఏ, పీహెచ్‌డీ చేసిన శ్రావణ్ కొంతకాలం ఆధ్యాపకుడుగా ఉన్నా డు. ఆ తరువాత ప్రముఖ కార్పొరేట్ కంపనీలలో పనిచేసేవాడు.సామాజిక న్యాయం నినాదానికి ఆకర్షితుడై ప్రజారాజ్యంలో చేరిన శ్రావణ్ ఇప్పుడు తెలంగాణాతోనే అది సాధ్యమని నమ్ముతున్నాడు. ఆ నమ్మకంతోనే ఎన్ని ఒడిదుడుకులున్నా టీఆర్‌ఎస్‌లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. బీజేపీ కుల, మతవాద ధోరణి తెలంగాణవాదానికీ, సామాజిక న్యాయానికి పెనుముప్పుగా మారిందని అంటున్నారు.ఆయనొక్కరే కాదు, జాతీయవాద పార్టీగా బీజేపీని అభిమానిస్తోన్న వాళ్ళు, సంఘ్ పరివార్ పట్ల గౌరవం ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ రాజకీయ ఎత్తుగడలపట్ల ఆందోళన చెందుతున్నారు. ఇది బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు, ఆయన శిష్యుడు కిషన్‌రెడ్డి రాజేసిన కుంపటి అని వారి వాదన. ఆ కుంపటి ఇప్పుడు తెలంగాణ జేఏసీలో పొగపెడుతోంది. ఇది చాలా మంది తెలంగాణ వాదులను కలవరపెడుతోంది.
బీజేపీ పన్నెండేళ్ళ క్రితం కాకినాడలో కాగితంమీద రాసి పెట్టడం మిన హా సంస్థాగతంగా తెలంగాణ కోసం ఎన్నడూ పోరాడింది లేదు. 2004 దాకా కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ఎన్నడూ తెలంగాణ ఊసే ఎత్తలేదు. తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఆ పార్టీ అగ్రనాయకత్వం భావించింది.తెలంగాణ ఉద్యమం 2009 లో ఊపందుకున్న తరువాత ఆ పార్టీ గుంపులో గోవింద అన్నట్టుగా ఉద్యమానికి జైకొట్టింది. అడపాదడపా ఆ పార్టీ శ్రేణులను బహిరంగ సభలకు తరలించి బలోపేతం అయ్యే ప్రయత్నాలు చేసింది. బీజేపీకి ఎన్నడూలేని జనామోదం లభించడానికి ఆ పార్టీ సొంత ఎజెండా పక్కకుపెట్టి తెలంగాణ జేఏసీలో చేరడం కారణమయింది. తెలంగాణ జేఏసీకి ఉన్న విశ్వసనీయత మొత్తం తెలంగాణ సమాజాన్ని కులమతాలకు అతీతంగా, రాజకీయ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అందరినీ ఏకం చేయడానికి దోహదపడింది. సిద్ధాంతపరంగా బద్ధ శత్రువులుగా ఉండే నక్సలైటు పార్టీలు, ప్రజాసంఘాలతో బీజేపీ చేతులుకలిపి పనిచేయాల్సిన పరిస్థితి తెచ్చింది. అప్పటిదాకా మతతత్వ రాజకీయాలు నడిపే పార్టీగా ఉన్న బీజేపీ, తెలంగాణ ఉద్యమ పార్టీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
చాలా మంది ఆ పార్టీని అంగీకరించే స్థితికి వచ్చారు. కేవలం తెలంగాణ సాధనే తప్ప మరో ఎజెండా లేని నాయకత్వం, దానికోసం సంఘటిత శక్తిగా కదిలిన ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, పౌర సమాజం వెన్నెముకగా ఉంటూ జేఏసీని నిలబెట్టాయి. ఆ పార్టీ తెలంగాణ కోసం చిత్తశుద్ధిగా పోరాడుతున్నదని నమ్మడం వల్లే నిజామాబాద్‌లో డి.శ్రీనివాస్‌ను కాదని ముస్లింలు కూడా జేఏసీ పై విశ్వాసంతో బీజేపీకి పట్టం కట్టారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మినారాయణ ముస్లిం వీధుల్లో తలపై టోపీ పెట్టుకుని కేసీఆర్, కిషన్‌డ్డితో కలిసి ఊరేగితే ప్రజలు నిజంగానే నమ్మారు. కానీ జేఏసీ కార్యక్షికమాల్లో, ప్రజా ఉద్యమ క్షేత్రంలో బీజేపీ కదలికలను నిశితంగా గమనించిన వారికి బీజేపీ పట్ల పెద్ద నమ్మకం ఎప్పుడూ లేదు.
బీజేపీ కూడా టీడీపీ లాగే రెండు కళ్ళ సిద్ధాంతాన్నే పాటించింది. ఆ పార్టీ తరపున రాజేశ్వర్‌రావు, విద్యాసాగర్‌రావు, దత్తావూతేయ, లక్ష్మణ్‌లాంటి వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడితే కిషన్‌రెడ్డి మాత్రం వెంకయ్యనాయు డు కనుసన్నల్లో పనిచేస్తూ వచ్చారు. ఉద్యమం ఉధృతంగా ఉన్నరోజుల్లో బీజేపీ ఒకవైపు జేఏసీలో ఉంటూనే కార్యక్షికమాలకు దూరంగా ఉన్న సందర్భాలూ ఉన్నాయి. బతుకమ్మ ఆడడంలో ఆసక్తిగా పాల్గొన్న బీజేపీ శ్రేణులు సహాయ నిరాకరణ, సకలజనుల సమ్మె సందర్భంగా ప్రత్యక్ష కార్యాచరణకు దూరంగా ఉన్నాయి. రైల్‌రోకో సందర్భంగా టీఆర్‌ఎస్, టీ-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర నాయకులు అరెస్ట్ అయినప్పుడు బీజేపీ అగ్రనాయకులు ఎక్కడా కనిపించలేదని ఉద్యమాన్ని పరిశీలించిన వారికి అర్థమవుతోంది. అలాగే జేఏసీ పిలుపు మేరకు అందులో భాగస్వామ్య పక్షాల ప్రతినిధులంతా రాజీనామా చేసిన సందర్భంలో కూడా కిషన్‌డ్డి రాజీనామా చేయలేదు.
జగన్ నిజామాబాద్ వచ్చినప్పుడు ఆయనను నిలదీయాలన్నా, చంద్రబాబును పాలకుర్తి రాకుండా అడ్డుకోవాలన్నా బీజేపీ స్పందించలేదు. పైగా అది తమ విధానం కాదని తప్పించుకున్నది. మహబూబ్‌నగర్ ఎన్నికలకు ముందు యాత్రచేసే దాకా ఆయన పెద్దగా ఉద్యమంలో లేరు. కనీసం ఉద్యమంలో పాల్గొని కేసుల పాలయిన వారిని విడిపించడంలో, నిరాశతో ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు మనోధైర్యం నింపడంలో ఆ పార్టీ నిర్లిప్తతే దీనికి నిదర్శనం. ఆంధ్రాలో జై ఆంధ్రా నినాదంతో ముందుకు వెడతామని చెప్పిన ఆ పార్టీ మూడేళ్ళు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది.నిజానికి జై ఆంధ్రా ఆపార్టీ విధానం అయితే ఇప్పటికే అటువంటి నిర్మాణం, కార్యాచరణకు పూనుకుని ఉండాలి. భావ సారూప్యం ఉన్న రాజకీయ సంస్థలు, పౌర సమాజంతో అక్కడ కూడా ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుని ఉండాల్సింది. కనీసం అక్కడ ఆంధ్ర రాష్ట్రంకోసం పోరాడుతున్న దళిత బహుజన సంఘాలకు బాసటగా ఉండాల్సింది. కొవ్వూరులో పోటీ చేసి తమ వాదనను వినిపించి ప్రజలను ఆదిశగా చైతన్యవంతులను చేయాల్సింది. ఆప్రాంతంలో తన కులంలో ఆదరణ ఉన్న వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఒక మహాకూటమి ఏర్పాటు చేయాల్సింది.ఇవేవీ ఆ పార్టీ చేయలేదు. ఈ విషయంలో సీపీఐని, ఆపార్టీ అధినేత నారాయణను అభినందించాలి. ఆయన ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకే నాలుకతో మాట్లాడారు. జేఏసీలో భాగం కాకపోయినా అన్ని సందర్భాల్లోనూ సీపీఐని ప్రజలపక్షాన నిలబడేలా చూశారు. ఇలాంటి విమర్శలు వచ్చిన ప్రతిసారీ బీజేపీ సుష్మాస్వరాజ్ పార్లమెంటు ప్రసంగాన్ని గురించి చెపుతుంటారు.
అది నిజమే, ఆమెకు స్పీకర్ అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ సమస్యను అద్భుతంగా ఆవిష్కరించి అందరినీ ఆకట్టుకున్నది. అందు కే ఆమె తెలంగాణ ప్రజలకు దగ్గర కాగలిగారు. కానీ అన్నా హజారే అవినీతి అజెండాకోసం నెలలతరబడి పార్లమెంటు జరుగకుండా అడ్డుకున్న పార్టీ తెలంగాణ కోసం నిరవధికంగా పార్లమెంటును ఎందుకు స్తంభింప చేయలేక పోయింది? బీజేపీ ఎంపీల్లో వందమంది ఒక్కసారిగా లేచి నిలబడితే నిజంగానే ప్రభుత్వానికి ముచ్చెమటలు పడతాయి. కానీ ఆపార్టీ అలా చేయలేదు. 2014 దాకా చేయదు కూడా! ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలలాగే ఈ సమస్య 2014 దాకా మిగిలి ఉండాలని కోరుకుంటోంది. 2014ఎన్నికల్లో తెలంగాణలోని అన్నిస్థానాల్లోఒంటరిగానే పోటీ చేస్తాం అని ఆ పార్టీ నేత కిషన్‌డ్డి ప్రకటించారు. మహబూబ్‌నగర్ విజయం తరువాత ఆయనలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది.నిజానికి అప్పటినుంచే ఆ పార్టీ తప్పటడుగులు మొదలయ్యాయి. మహబూబ్‌నగర్ గెలుపు పూర్తిగా తనదేనని బీజేపీ భ్రమ పడుతున్నది. మహబూబ్‌నగర్‌లో బీజేపీ బలం కన్నా ఎన్నం శ్రీనివాసడ్డికి ఉన్న బలగం ఎక్కువ ప్రభావం చూపింది. శ్రీనివాసడ్డి పోటీ చేసే నాటికి ఆయనకు బీజేపీ సభ్యత్వం కూడా లేదు. ఆయన కరుడుగట్టిన తెలంగాణావాది. కేంద్రప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో చేరి టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. కేసీఆర్‌తో విభేదించి బయటకు వెళ్ళినా పార్టీ శ్రేణులతో సాన్నిహిత్యం కొనసాగిం చారు. టీఆర్‌ఎస్ పట్ల అక్కడక్కడా ఉన్న అసంతృప్తిని కూడా అనుకూలంగా మలుచుకున్నారు.
ఆయనకు అక్కడ సామాజికంగా పెద్ద బలగమే ఉన్నది. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న ఎన్నంను బీజేపీఅభ్యర్థిగా ఎంచుకుంది. ఇదే మహబూబ్‌నగర్ జేఏసీ రెండుగా చీలిపోవడానికి కారణం అయింది. అక్కడి జేఏసీలో వామపక్ష భావాలున్న విద్యావంతులు ఉన్నట్టే ఆధిపత్య కులరాజకీయాలు నడిపే వాళ్ళూ ఉన్నారు. బీజేపీ శ్రీనివాసరెడ్డి బలంతో పాటు ఆయన కులాన్ని కూడా ఆయుధంగా వాడుకున్నది. అక్కడ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఆయన ఒక్కరే రెడ్డి కావడం కలిసి వచ్చింది. ఇక రెండోది మతం.టీఆర్‌ఎస్ ముస్లిం అభ్యర్థిని రంగంలో దింపే సరికి బీజేపీ తన పాత మతవాదానికి పదునుపెట్టింది. కాషాయం పులుముకుని కిషన్‌రెడ్డి కాస్తా లాల్‌కిషన్ అద్వానీగా మారిపోయా రు. ఈ ఎన్నికను ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌తో పోల్చారు.ఆయనకు ముస్లిం సోదరుల్లో రజాకార్లు కనిపించారు. ఎన్నికల్లో గెలిచారు కానీ రెండేళ్లపాటు బీజేపీ నేతలు ఉద్యమంలో ఉంటూ పార్టీకి సమకూర్చిన సరికొత్త ఉదార రూపాన్ని మాత్రం చెరిపేసుకున్నారు. ఇప్పుడు ఆపార్టీ తెలంగాణ సాధనకు, ఉద్యమ సామాజిక న్యాయ ఎజెండాకు భిన్నంగా నడుస్తోంది. అందుకే పరకాలలో మరో శ్రీనివాసడ్డి కోసం గాలిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ చిన్నాచితక నేతలు కూడా సకల జనుల సమ్మె విరమణను తప్పుపడుతున్నారు. ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ రాదనే వాదన లేవనెత్తుతున్నారు. శాసనసభకు జరిగే ఉపఎన్నికల్లో జాతీయ పార్టీ అవసరం ఏమిటో అర్థం కాదు. లోక్‌సభలో 114 మంది సభ్యులున్నా ఏమీ చేయలేకపోతున్న ఈ పార్టీ ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీలో నాలుగో సభ్యుడు గెలిస్తే తడాఖా చూపిస్తామని చెప్పడం నమ్మశక్యంగా లేదు. బీజేపీ వైఖరి తెలంగాణవాదుల్లో ఆందోళన కలిగిస్తున్నది. భాగస్వామ్య పార్టీల ఈ ఆధిపత్య పోరు జేఏసీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నది. ఇంతకాలం మీడియా గుసగుసలకే పరిమితమైన ఈ విభేదాలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మాటల యుద్ధమే దానికి అద్దంపడుతోంది.
మహబూబ్‌నగర్ లో బీజేపీ ప్రదర్శించిన దూకుడే ఇప్పుడు పరకాలలో టీఆర్‌ఎస్ ప్రదర్శిస్తున్నది. కచ్చితంగా వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్‌కు, తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు. మహబూబ్‌నగర్‌లో జేఏసీ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన బీజేపీ ఇప్పటికైనా పరకాల నుంచి విరమించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరిమీదయినా పోటీకి దిగొచ్చు. కానీ జేఏసీలో చేరిన పార్టీలు సమష్టిగా తెలంగాణ కోసం ఉద్యమిస్తామని, ఉద్యమ వ్యతిరేక శక్తులమీద యుద్ధం చేస్తామని చెపుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఒకరిమీద ఒకరు యుద్ధానికి దిగి ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయి. ఇంతకాలం తమకు నీడనిచ్చిన చెట్టును తామే నరికేసుకుంటున్నాయి. జేఏసిని రద్దు చేస్తారని, కోదండ రామ్‌ను చైర్మన్ పదవినుంచి తప్పిస్తారని వార్తాకథనాలు వ్యాపిస్తున్నాయి. జేఏసీ అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిఫలించే వేదిక. దాన్ని రద్దు చేయడమంటే తెలంగాణ ఉద్యమాన్ని రద్దు చేయడమే. ఆ హక్కు ఏ ఒక్కరికీ ఉండదు. సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నా తెలంగాణ సమష్టి, జన ఆకాంక్షకు అధికారిక ప్రతినిధిగా నిలబడ్డ వ్యక్తి కోదండ రామ్. ఆయన జేఏసీ ఏర్పడ్డాక ఉద్యమంలోకి వచ్చిన వ్యక్తికాదు. మలిదశ ఉద్యమానికి పునాది వేసిన వారిలో ఒకరు. కీలకమైన సమయంలో ఉద్యమ రథానికి సారధిగా ఉన్న కోదండరామ్‌ను తొలగించే అధికారం కూడా ఎవరికీ లేదు. ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు జేఏసీ సూచన మేరకు నడుచుకోవాలి. లేదంటే ఎవరిదారి వాళ్ళు చూసుకోవాలి. ఉద్యమాన్ని విషతుల్యం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు!
సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ghantapatham@gmail.com
Namasete Telangana News Paper Dated : 11/05/2012
Tuesday, May 8, 2012
బీవేర్ ఆఫ్ బీఫ్ పాలిటిక్స్! - సుజాత సూరేపల్లి
మానవ హక్కులు, అందులో దళితుల హక్కులు, జీవించే హక్కు, స్వేచ్ఛ, వీటి నిర్వచనాల గురించి ఇపుడు, ఈ కాలంలో చెప్పుకోవలసి రావడం సిగ్గుచేటు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృతీ చిహ్నంగా జరుపుకున్న బీఫ్ ఫెస్టివల్ విద్యార్థుల మధ్య ఇపుడిపుడే గట్టిపడుతున్న సంబంధాలను దెబ్బతీస్తుంది అని కొందరు వాపోతుంటే, ఇది దళితుల చావు బతుకుల సమస్యగా మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఇంకాస్త ముందుకెళితే బీఫ్ తినని వాడు, వద్దనే వాడు కూడా దళిత వ్యతిరేకులనే ముద్రను కూడా వేస్తున్నారు.
శరత్ నలిమెల గొంతు ఇంటర్నెట్‌లో 'బీఫ్ ఇజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ' అని మార్మోగుతుంది. కంచె ఐలయ్య, వినోద్ మరికొందరు ప్రొఫెసర్లు దీనికి వెనుక ముందు ఉండి నడిపిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అన్ని విశ్వ విద్యాలయాలలో దీని గురించి చర్చ అనివార్యమైంది. ఈ చర్చ ఎపుడో అపుడు జరగవలసిందే. అయితే ఇపుడున్న పరిస్థితులలో ఎవరు ఎక్కువ ఈ సంఘటనని అడ్డం పెట్టుకొని లాభపడుతున్నారు అనే చర్చ తప్పకుండా జరపవలసి వుంది.
బీఫ్ తినడాన్ని ఒక వర్గం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటున్నాం. ఎవరు ఆ వర్గం? హిందూత్వ వాదులు అయితే వారు ఏ కులం వారయి ఉండాలి? అగ్ర కులాలు మాత్రమే వ్యతిరేకిస్తే మనం దీనిని కుల సమస్యగా అంటగట్టవచ్చు. కాని ఇక్కడ మెజారిటీ విద్యార్థులు బహుజనులే, క్రింది కులాల వారే అడ్డుపడుతున్నపుడు, మనం దీనిని మతానికి సంబంధించిన సమస్యగా మాత్రమే చూడాలి కదా! అయితే దీనిని కేవలం దళితులూ వర్సెస్ అగ్ర కులాల కుట్ర అనడానికి వీలు లేదు.
రెండో విషయం, బీఫ్ ముస్లింలు, ఇతర కులాలు, రాష్ట్రాల వారు తింటున్నపుడు, దీనిని దళితులు మాత్రమే నెత్తిన పెట్టుకొని బరువు మోయడం కూడా అక్కర్లేదేమో. బీఫ్ ఒక కులానికి, అంటరానితనానికి చిహ్నంగా ఉన్నా కూడా, ప్రపంచీకరణలో ఆహారపు అలవాట్లు అందరి అలవాట్లుగా మారాయి. వేజిటేరియనిజం అనేక కారణాలతో అనేకులు, అన్ని కులాల వారు పాటిస్తున్నారు. అగ్రకులాలలో అత్యధికులు మాంసం తింటున్నారు.
బీఫ్ తింటున్నారు కాబట్టి వాటి ధరలు కూడా పెరిగిపోతున్నాయి అని చాలా సార్లు మాంసం అమ్మే వాళ్ళు చెప్పుకోవడం, జోకులు వేసుకోవడం మనకు తెలియక కాదు. బీఫ్ తినే వారందరూ ఏకం అయితే ఇది కొంతమంది సమస్యగా మనం చూడక్కర్లేదు. దీనిని బీఫ్ తినని ఒక మైనారిటీ వర్గం వారు మరొక మెజారిటీ వర్గం వారిని మతం పేరుతో, పవిత్రత పేరుతో, వారి ఆహారపు హక్కుని కాలరాసే విధంగా మాట్లాడుతున్నారు. ఇది అందరూ ప్రశ్నించవలసిందే.
నిజానికి ఎస్ఎఫ్ఐ, పిడిఎస్‌యు, కొన్ని తెలంగాణ సంఘాలు కలిసి నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్‌ని అడ్డుకుంటున్న వారు, వారు మాట్లాడుతున్న భాషని ఎవరూ సమర్థించడం లేదు. వీరు ఎక్కువగా లెఫ్ట్ సంఘాల బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినట్టు కనపడుతుంది. లెఫ్ట్ సంఘాలకి ఒక అవగాహన, కొన్ని విషయాలలో పరిపక్వత ఉన్నట్టు మనకు తెలుసు. తెలంగాణ విషయం అంటే అందరూ వస్తారు కాని మా జన్మ హక్కు అయిన బీఫ్ తినడానికి ఎవరూ ఎందుకు ముందుకు రావడం లేదు అని నిర్వాహకులు బాధపడుతున్నారు.
ఇవాళ తెలంగాణ అంటే ఒక అగ్రకుల ఉద్యమం, అగ్రహార హక్కుల కోసం పోట్లాడుతున్నట్టు మలచబడుతున్నది, కనపడుతున్నది. వేరే విధంగా కనబడడానికి ఆస్కారం లేదు కూడా. చచ్చేవాళ్ళు, చీపుర్లు, కర్రలు పట్టుకొని జై తెలంగాణ అనేటోల్లు అందరూ అమాయకులు, కులాల కుంపట్లు తెలియనోళ్లు కాని అందరికీ తెలంగాణ వొస్తే న్యాయం జరుగుతుంది అని ముందుకు పడేటోళ్ళు. మండల కమిషన్ అపుడు కూడా దళితులు ముందు పడ్డ విషయం మనకు తెలుసు. కనీసం ఈ ఒక్క సారన్నా తెలంగాణ పేరుతో అందరూ ఒక్కచోట జమ అయితే చూసే అదృష్టం వచ్చింది, అందులో రంగులు చూడడంలోనే ఆలస్యం అవుతుంది.
అంబేద్కరిజం ఇక్కడ పనికి రావడం లేదు, సంస్కృతి గురించిన చింత ఎవరికీ లేదు అని, వచ్చినోడే మనోడు, రానోడు మనువాది అని ముద్రలు వేస్తున్నారు బీఫ్ ఫెస్టివల్ నేతలు. నిజమే, ఈ దేశంలో లెఫ్ట్ అండ్ రైట్ సంఘాలకి తేడా ఉంది. రైట్ లోను, లెఫ్ట్ లోను మనవాళ్ళే ఉండడం, ఉండేట్టుగా వ్యవస్థని తయారు చేయడం ఈ దేశంలో హిందూ మతం తత్వశాస్త్ర సారాంశం, ఏకైక సిద్ధాంతం. అందరికీ న్యాయం అందించడంలో అంబేద్కర్ చూపించిన మార్గంలోకి ఎవరూ పోకుండా ఈ రైట్, లెఫ్ట్ వింగ్‌లు చాలా జాగ్రత్తగా తమ పాత్రను పోషిస్తుంటాయి.
ఒకడు కొట్లాడుతుంటడు, ఇంకొకడు అడ్డుపడుతుంటడు, రైట్‌లో మనోడే, లెఫ్ట్‌లో మనోడే. ఒక అన్న బిజెపి నోట్లోంచి ఊడిపడితే మరొకరు మార్క్స్, మావో నోట్లోంచి, చూసేటోల్లు, వినేటోల్లు అందరూ అన్న తమ్ముళ్లే, మనవేలు, మన కన్ను. కళ్ళు తెరిచి చూసే సరికి ఉన్న నలుగురు నాలుగు దిక్కులు. ఈ విభజనలు కుటుంబాల దగ్గరి నుంచి రాజకీయాల దాకా విస్తరించాయి. అరవై ఏళ్ల తరువాత కూడా ఈ కుట్రల పర్యవసానం తెలుసుకొనే దశకి ఉద్యమాలు చేరుకోలేదు.
ఆ అవకాశం కూడా మనం ఇవ్వట్లేదు. ఇప్పటికీ పాఠ్య పుస్తకాలలో ఉత్తమ పురుషుడు రాముడు, ఉత్తమ స్త్రీ సీతగానే చెప్పే చదువులు ఉన్న చోట, సమ్మక్క, సారక్క పండగలతో సహా అన్ని దేవుళ్ళని హిందూ దేవుళ్ళుగా మార్చివేసే చోట, నర నరాల్లో నాలుగు దిక్కుల నుంచి హిందూత్వాన్ని చొప్పిస్తున్న చోట మార్పు అంత సులభం కాదు. దానికి చాలా శిక్షణ అవసరం. అన్ని శక్తులను పసిగట్టే స్థితికి దళితులూ బహుజనులు చేరుకోవట్లేదు, ఆ అవకాశం కనుచూపు మేరలో కనబడట్లేదు. ఇలాంటి సందర్భంలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించడం ఒకందుకు మంచిదే అయినా, బాగుపడేది మాత్రం శత్రువే.
ఇపుడు కాకపోతే ఎపుడు ఇట్లాంటి విషయాలని మాట్లాడాలి? మంచి ముహూర్తం చెప్పండి అని ఒక మిత్రుడు అడిగితే ఏమి సమాధానం చెప్పాలి? పొరలు పొరలుగా ఉన్న కులాల కుళ్ళును కడిగేయడం ఒక పగలు, ఒక సంవత్సరంలో సాధ్యమేనా? నన్ను నేను సరిచేసుకుంటూ, నా నమ్మకాలని సంస్కరించుకుంటూ, ప్రజాస్వామ్యీకరించుకునే అవకాశాన్ని కల్పించడం ప్రజాస్వామ్య,
బహుజనులందరి బాధ్యత కాదా?
ఫూలే, పెరియార్, అంబేద్కర్ పాఠాలు ప్రతి పిల్లవాడికీ నోటికి వచ్చిన రోజు, బ్రాహ్మణ భావజాలానికి దూరంగా దళిత బహుజనులు అందరినీ తీసుకుని వచ్చిన రోజు మాత్రమే ఆహారం కూడా ఒక సంస్కృతీ చిహ్నం అని అర్థం అవుతుంది. అసలు సంస్కృతి, హక్కులు అన్నీ హిందూ కళ్ళతో మాత్రమే చూడాలని అంటుంటే ఇంక లోకం ఎపుడూ కాషాయంలోనే కనబడుతుంది. ఈ కాషాయంలో నుంచి బయటపడ్డప్పుడే కుట్రలను తిప్పి కొట్టగలుగుతాం. లేకపోతే మళ్లీ మనమే మన కోసమే మనల్ని మనం దూరం చేసుకుంటాం. అపుడు అక్కడ మనమే, ఇక్కడ మనమే.
శత్రువు ఇపుడు జరిగే విభజనపై ఒక వికటాట్టహాసం చేస్తూ మరో పది కాలాల పాటు వాడి స్థానం కాపాడుకుంటాడు. ఇది విభజన సమయం కాదు, ఎన్ని కష్టాలు పడి అయినా ఏకమయ్యే సమయం. అంబేద్కర్ చెప్పిన ముఖ్య సూత్రాలైన భూమిని జాతీయం చెయ్యడం, దాస్య విముక్తి కావడం, హిందూ మతం నుంచి విముక్తి కోసం పోరాటాలు చేస్తేనే ఇక్కడ బతకడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బతుకు ఉన్నపుడే జీవితం, సంస్కృతీ కాపాడబడతాయి. ఇవన్నీ జరగాలంటే ఒక అడుగు ముందున్న వాళ్ళు నలుగురిని నడిపించే బాధ్యత తీసుకోవాల్సిందే. ఆ తరువాతనే ఇటువంటి అంశాలను తీసుకొని ముందుకు పోవాలి. - సుజాత సూరేపల్లి
Andhra Jyothi News Paper Dated : 09/05/2012
Subscribe to:
Posts (Atom)
