Friday, November 30, 2012

సమస్యల వలయంలో సంక్షేమ హాస్టళ్లు---తన్నీరు హరీష్ రావు టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం ఉప నాయకు



సిద్దిపేటలోని సమీకృత బాలుర హాస్టల్‌లో బుధవారం రాత్రి నుంచి ఉదయం వరకు విద్యార్థులతో గడిపాను. వారితోనే కలిసితిని, పడుకున్నాను. హాస్టళ్లలో ఉండి చదువుకునే పిల్లలను ప్రోత్సహించడానికి, వారి ఇబ్బందులు తెలుసుకుని పరిష్కరించడానికి గతంలో కూడా నేను హాస్టళ్లలో నిద్రపోయాను. కానీ ఈసారి హాస్టల్ నిద్ర నన్ను ఎంతో బాధకు గురిచేసింది. నిరుపేదలైన తల్లిదంవూడులు తమ పిల్లల బతుకు తమలా కావద్దని, చదువుకుని పైకి రావాలనే ఆశతో హాస్టళ్లకు పంపుతున్నారు. అలాంటి పిల్లలను ప్రభుత్వమే తల్లిలా పెంచాలి. మంచి భోజనం పెట్టి, బట్టలిచ్చి, పుస్తకాలిచ్చి, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంచాలి. కానీ హాస్టల్లో పరిస్థితి అలా లేదు. భూకంప బాధితుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక సహాయక శిబిరాలు హాస్టళ్ళకన్నా బాగుంటాయనిపింంది.నేను పడుకున్న హాస్టల్‌లో ప్రతీ విద్యార్థినీ పలకరించాను. ఒక్కొక్కరు తాము ఏ పరిస్థితుల్లో హాస్టల్లో ఉండాల్సివస్తున్నదో చెప్పారు. అందరి కథల్లో ఒక్కటే సారాంశం.తల్లిదంవూడుల పేదరికం,కన్నబిడ్డలకు కడుపునిండా తిండిపెట్టలేని దైన్యం. అనాథలు హాస్టళ్లనే నమ్ముకున్న దురదృష్టం. హాస్టల్లో ఉంటే కనీసం సమయానికి అన్నమైనా దొరుకుతుందని కన్నపేగు ఆశ. కానీ ప్రభుత్వ నిర్వాకంవల్ల ఆ ఆశ కూడా అడియాసే అవుతోంది. ఒక్క సిద్దిపేట ప్రాంతంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా హాస్టళ్ల పరిస్థితిని కూడా తెలుసుకున్నాను. అన్నీ సమస్యల కుప్పలే. పేరుకు బట్టలిస్తున్నామని చెప్పినప్పటికీ అవి పిల్లల వంటిపై ఉండ ఒక్క ఉతుక్కే గుం డీలు, దారాలు తెగిపోతున్నాయి. నాసిరకం బట్ట కావడంతో చీకి చినిగిపోతున్నది. వేసుకునే బట్టలే కాదు,చద్దర్లు, రగ్గులు కూడా ఇవ్వడం లేదు. సొంత బిల్డింగులు లేక కిరాయి, ఇరుకు రూముల్లో, కనీసం టాయిపూట్లు కూడా లేకుండా వందల హాస్ట ళ్లు నడుస్తున్నాయి. కరెంటు మీటరుకు డిడి కట్టాలన్నా నిధులు లేవని సర్కారు చెబుతోంది. నీళ్లు రాని పైపులు, వెలగని లైట్లు, తిరగని ఫ్యాన్లు ఏ హాస్టల్ పోయినా కన్పిస్తాయి. ఈ పరిస్థితుల్లోనే సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలం పాలమాకుల ఎస్సీ హాస్టల్లో ఓ విద్యార్థి పాముకాటుతో చనిపోయాడు. హాస్టల్ విద్యార్థులకు ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలని డాక్టర్లు చెబుతున్నా కనీసం నల్లా నీళ్లు కూడా రావడం లేదు. అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీరు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. డాక్టర్లు రెగ్యులర్‌గా వచ్చి, పిల్లలకు వైద్య సేవలు అందించాలనే నిబంధన ఉన్నా అమలు కావడం లేదు. డాక్టర్లు వచ్చి రోగ నిర్థారణ చేసినా, పిల్లలకు ఇవ్వడానికి మందులు లేవు. ఖాళీగా ఉన్న హాస్టల్ వార్డెన్ పోస్టులను భర్తీ చేయడం లేదు. ఫలితంగా ఒక్కో వార్డెన్ రెండు, మూడు హాస్టళ్లకు ఇన్‌చార్జీగా ఉండాల్సి వస్తోంది. పిల్లలను చదివించడానికి ట్యూటర్లను నియమించడం లేదు. ఈ అసౌకర్యాలకు మించింది ఆకలి సమస్య, అన్నం సమస్య. 

ఎదుగుతున్న పిల్లలకు ప్రతి రోజు 2600 కేలరీల శక్తి అవసరమని జాతీయ పౌష్టికాహార సంస్థ లెక్కకట్టింది. ఈ శక్తి అందాలంటే తిండిలో పోషక విలువలు ఉండా లి. ఉప్మా, ఇడ్లీ, దోశ, పప్పు, పాలు, ఆకుకూరలు, మాంసం, గుడ్డు, పండ్లు, పల్లిపట్టి, పెరుగు ఖచ్చితంగా ఉండాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే నిపుణులు హాస్టళ్ల ‘మెనూ’తయారు చేశారు. ప్రస్తుతం అన్ని హాస్టళ్లలో కాగితాలకు పరిమితమైన ‘మెనూ’లో అన్నీ ఉంటాయి. కానీ పిల్లల ప్లేట్లలో మాత్రం దొడ్డుబియ్యంలో నీళ్లచారు కనిపిస్తోంది. ‘మెనూ’ లోంచి పాలు, పెరుగు, మాంసం, స్నాక్స్ ఎప్పుడో మాయమయ్యాయి.మనిషి అనే వారికెవరికైనా కనీసం 2500 కేలరీల శక్తి ఇచ్చే ఆహారం తీసుకోకుంటే రోగాన పడతాడు. ‘మెనూ’ ప్రకారం పదార్థాలు పళ్లెంలో ఉండాలంటే ఒక మనిషిపై కనీసం 45 రూపాయలు ఖర్చు చేయా లి. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు రోజుకు 50 రూపాయలుపభుత్వ ఆసుపవూతుల్లో రోగికి 40, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే హాస్టళ్లలో రోజుకు 40 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ, వికలాంగుల హాస్టళ్లలో, గురుకుల పాఠశాలల్లో ఉంటున్న ఆరు లక్షల మంది పిల్లలకు ఒక్కొక్కరికి రోజుకు పెడుతున్న ఖర్చు సగటున 16.83 రూపాయలు మాత్రమే. ఏడవ తరగతి లోపు విద్యార్థులకు నెలకు 475, హైస్కూల్ విద్యార్థులకు నెలకు 535 చొప్పున ఇస్తున్నారు. నాలుగేళ్ల క్రితం అప్పుడున్న మార్కె ట్ రేట్ల ప్రకారం ఈ లెక్క వేశారు. కానీ నాలుగేళ్లలో ధరలు చుక్కల్లో చేరాయి. గడిచిన నాలుగేళ్లలో నిత్యావసర ధరల్లో 150 శాతం పెరుగుదల ఉన్నదని స్వయంగా బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ స్పష్టం చేసింది. ఈ లెక్కను పరిగణనలోకి తీసుకున్నా హాస్టల్ విద్యార్థులకు కనీసం రోజుకు 42 అయినా ఇవ్వాలి. కానీ పాత లెక్కల ప్రకారమే భోజన ఖర్చులు చెల్లిస్తున్నారు. 

ప్రభుత్వ లెక్క ప్రకారం విద్యార్థులకు రెండు రూపాయలతో రోజంతా పప్పు పెట్టాలి. రూపాయి 71 పైసతో గుడ్డు పెట్టాలి. ఒక్క రూపాయితో పండ్లు కొనియ్యాలి. 14 పైసలతో బిస్కట్లు తినిపియ్యాలి. 14 పైసలకే పల్లీ పట్టీ పట్టుకు రావాలి. 26 పైసలతో శనిగలు ఇవ్వాలి. 63 పైసలతో ఉప్మా పెట్టాలి. 26 పైసలతో అటుకులు తెచ్చియ్యాలి. పసుపు, ఉప్పు, అల్లం, ఎల్లిపాయ, దనియాలు, జిలకర, మసాలాలన్నీ కలిపి 80 పైసల్లో సమకూర్చాలి. ఇది సాధ్యమయ్యే పనేనా? అయినా సరే, వార్డెన్లు ఎలాగో తిప్పలు పడి ఇన్నాళ్లూ నెట్టుకొచ్చారు. నాలుగు రోజులు ఇవ్వాల్సిన గుడ్డును రెండు రోజులకు కుదించారు. ప్రతీరోజు ఇవ్వాల్సిన పండ్లను రెండు రోజులే ఇస్తున్నారు. ప్రతీ రోజూ బడి నుంచి రాగానే ఇవ్వాల్సిన స్నాక్స్‌ను ఇవ్వడం లేదు. కానీ ప్రభుత్వం ఇటీవల వంటగ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేయడంతో హాస్టళ్లలో అన్నం ఉడకడం లేదు. గ్యాస్ పై సబ్సిడీ ఎత్తేయడం వల్ల ప్రతీ విద్యార్థిపై నెలకు అదనంగా 82రూపాయల భారం పడుతోంది. విద్యార్థికి భోజనం పెట్టడం కోసం చేసే ఖర్చులోంచే అవి చెల్లించాల్సి వస్తోంది. అంటే ఒక్కో విద్యార్థికి ప్రతీరోజు ప్రభుత్వమిచ్చే పదహారున్నరలో ఆరు రూపాయలు గ్యాస్‌కే పోతున్నది. దీంతో వార్డెన్లు తప్పనిసరి పరిస్థితుల్లో చారుపోసి సరిపెడుతున్నారు. చింతపండు ధర కూడా ఎక్కువ కావడంతో నీళ్లచారే మిగులుతోంది. ఇప్పుడు పెరిగిన ధరలకు, ప్రభుత్వం ఇచ్చే నిధులకు నక్కకూ, నాగలోకానికున్నంత తేడా ఉండడంతో చికెన్ అనే మాటనే మరిచిపోయారు. కాస్మొటిక్ చార్జీల పరిస్థితి కూడా అలాగే ఉన్నది. 

నెలకు 62 రూపాయలు ఇస్తున్నారు. వీటితోనే నెలంతా సబ్బులు, కొబ్బరి నూనె, కోల్డ్ క్రీములు, పౌడర్ కొనుక్కోవాలి. కటింగ్ చేయించుకోవాలి. కటింగ్ చేయించుకుంటే రు.25 అవుతుంది. కానీ సర్కారు లెక్క కట్టేది 12 మాత్రమే.అన్ని హాస్టళ్లలో దోమల సమస్య ఉన్నది. దోమలు రాకుండా మెష్‌లు కూడా పెట్టడం లేదు. ఇవన్నీ కళ్లారా చూసిన తర్వాత, ఈ సమస్యల మధ్య పిల్లలకు దక్కేది రెండు పూటల నీళ్ల చారు, దొడ్డు అన్నం మాత్రమే. ఈ మాత్రం తిండి ఆ పేద తల్లిదంవూడులు పెట్టలేరా? తల్లిదంవూడులు తమ పిల్లలు పడుతున్న గోస చూసి తల్లడిల్లుతున్నారు. అందుకే చాలా మంది తమ పిల్లలను హాస్టళ్ల నుంచి ఇండ్లకు తీసుకుపోతున్నారు.ఇటీవలి కాలంలో హాస్టల్ విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణమిదే. కానీ ప్రభుత్వం మాత్రం విద్యార్థుల సంఖ్య తగ్గడం కూడా తమ ఘనతే అ ని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఆన్‌లైన్ విధానం ప్రవేశ పెట్టిన తర్వాత బోగస్ విద్యార్థులను ఏరివేశామని, అందుకే హాస్టళ్లలో పిల్లల సంఖ్య తగ్గిందని ఆత్మవంచనకు పా ల్పడుతోంది.హాస్టళ్లలో సరిగ్గా అన్నం పెట్టడం లేదని తల్లిదంవూడులు పిల్లలను ఇంటికి తీసుకెళ్తుం తమ గొప్పే అని చెప్పుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లింది.

ధరలకు అనుగుణంగా నిధులు పెంచమని ప్రభుత్వాన్ని అడగలేదా? అని సంక్షేమ అధికారులను నేనడిగాను. ఏడాది నుంచి ప్రతిపాదనలు పంపుతూనే ఉ న్నామనీ, కానీ అక్కడి నుంచి జవాబు రావడం లేద నీ సమాధానం వచ్చింది. పెరిగిన ధరల ప్రకారం ఒక్కో విద్యార్థికి 45 రూపాయలు చేయడం సమంజసంగా ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి ఒప్పుకోవాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గ్యాస్ సబ్సిడీని సర్కారే భరిస్తే భారం తగ్గుతుంది. 

రూపాయి కిలో బియ్యం పథకాన్ని హాస్టళ్లలో అమలు చేస్తే మంచిది. కానీ ప్రభుత్వం ఆ పనిచేయడం లేదు.రాష్ట్రం మొత్తం మీద హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులు దాదాపు ఆరు లక్షలు. ఒక్కో విద్యార్థికి 16.83 రూపాయల చొప్పున ఒకరోజుకు సర్కారు పెడుతున్న ఖర్చు 99 లక్షలు. ఒక్కో విద్యార్థికి నలభై రూపాయల చొప్పున ఖర్చు పెడితే అయ్యేది 2.40 కోట్లు. పెరిగేది కోటీ 39 లక్షలు. ఏడాదికి సగటున 250 రోజులు హాస్టల్ నడుస్తుంది. అంటే అదనంగా ప్రభుత్వంపై పడే భారం 347 కోట్లు. ఇది ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఖర్చు చేయకుండా వదిలేసిన నిధుల్లో నాలుగో వంతు కూడా కాదు. ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు జరిపే సందర్భంగా చాయ్ బిస్కట్ల కోసం పెట్టే ఖర్చులో సగం కూడా కాదు. పేపర్లు, టీవీల్లో ప్రభుత్వం చేసుకునే ప్రచార ఖర్చులో పదో వంతు కూడా కాదు. బడా పారిక్షిశామిక వేత్తలు, పెట్టుబడిదారులకు సర్కారు ఇచ్చే రాయితీల్లో, కట్టబెట్టే భూమి విలువలో ఒక్క శాతం కూడా కాదు.

సాధారణ ఉద్యోగుల నుంచి ఐఎఎస్, ఐపిఎస్‌ల వరకు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, న్యాయమూర్తులు ఇలా ప్రతీ ఒక్కరి జీతాలు ప్రతీ ఏటా పెరిగిన ధరలకు అనుగుణంగా పెరుగుతూనే ఉన్నాయి. కానీ పేద పిల్లల పవ్లూంలో మాత్రం ఏటా రెండు ముద్దలు తగ్గుతూనే ఉన్నాయి. తక్షణం హాస్టల్ మెస్ చార్జీలు పెంచాలి. లేకుంటే పిడికెడు అన్నం నోట్లోకి వెళ్లక, పిల్లలు అవే పిడికిళ్లను ప్రభుత్వంపై సంధించే అవకాశం ఉంది. బడుగు, బలహీన వర్గాల పిల్లలు అన్నం కోసం రోడ్డెక్కడం ఎవరికీ మంచిదికాదు. కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో హాస్టల్ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో భోజన ఖర్చులకు ఒక్కో విద్యార్థికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో అలాంటి ఆలోచనే చేయడం లేదు. 

దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు చట్టబద్దత బిల్లు తెస్తున్నామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గొప్పగా చెప్పుకున్నారు. మరి ఎస్సీ, ఎస్టీ పిల్లలు హాస్టళ్లలో అర్థాకలితో అలమటిస్తుంటే ఈ ముఖ్యమంవూతికి ఎందుకు పట్టడం లేదు. వారికోసం ఎందుకు నిధులు కేటాయించడం లేదు. దీనికిఆయనే సమాధానం చెప్పా లి. పరిస్థితులను స్వయంగా తెలుసుకోవడానికి మం త్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాస్టల్ నిద్రచేయాలని ముఖ్యమంత్రి గొప్పగా చెప్పారు. ఇందిరమ్మ బాట పేరిట జిల్లాలు తిరుగుతున్న ముఖ్యమంత్రి అక్కడక్కడా హాస్టళ్లను కూడా సందర్శిస్తున్నారు. కానీ ఆయనకు సమస్యలు ఎందుకు కనపడటం లేదో అర్థం కావ డం లేదు. మెదక్ జిల్లాలో హాస్టల్ సందర్శించినప్పుడు సిఎం నిద్ర చేసిన గదిని మాత్రమే శుభ్రం చేసి, సున్నం వేశారు అధికారులు. మిగతా గదులను కూడా శుభ్రం చేయలేదు. ఆయన బస చేసిన హాస్టల్‌లోనే సమస్యలు పరిష్కారం కాలేదు.

-తన్నీరు హరీష్ రావు
టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం ఉప నాయకులు



hostel


Namasete Telangana News Paper Dated: 1/12/1012

-- 



Shankar Sampangi
EFL-University-Hyderabad.

No comments:

Post a Comment