Wednesday, November 7, 2012

ఈ హత్యలకు బాధ్యులు ఎవరు? ---సుజాత సూరేపల్లిమేడం, ఆ సంఘాలను రానియవద్దు వాళ్ళు ప్రజలను అమ్ముకుంటా రు. వాళ్ళుఉద్యమాలను ఫోటోలు, వీడియోలు తీసుకొని సొమ్ము చేసుకుంటారు, పోలేపల్లి సెజ్ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నపుడు వచ్చిన దాదాపు నూటానలభై సంఘాల గురించి ఆరా తీసి, అనుక్ష ణం కళ్ళల్లో వత్తులేసుకొని పోలేపల్లివాసులను కాపాడే వెంక లేడు అన్న చేదు నిజాన్ని నమ్మడంకష్టంగానే ఉంది. పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఉద్యమం లో దాదాపు రెండేళ్లు వెంక కలిసి పనిచేసిన అనేక సంఘటనలు మెదడులో సుళ్ళు తిరుగుతున్నాయి. నిజానికి పోలేపల్లి ఉద్యమంలో ప్రజల దగ్గర, వెంక లాంటి కార్యకర్తల దగ్గర పనిచేయడమే ఈ రోజు రాజ్యాన్ని నాలుగు దిక్కుల నుంచి, కపట రాజకీయ నాయకులను, దళారులను, కొన్ని సంఘాలను నలభై దిక్కుల నుంచి చూసే చూపుని నేర్పింది. వెంక ఈ మధ్యలో కూడా పోలేపల్లి భూముల కోసం మళ్లీ ప్రజల దగ్గరకి వెళ్తున్నడని విన్నప్పుడు చాలా సంతోషపడిన. పోలేపల్లిలో ఇపుడు మనుషులులేరు, అస్థిపంజరాలున్నై, పెద్దపెద్ద బిల్డింగులు,నల్లనల్లని రోడ్లు, లైట్‌లు ఏపీఐఐసీ అనే బోర్డ్‌తో ఒక అందమైన జైలు నిర్మించబడింది. ఆప్రదేశంలో ఒకప్పుడు పచ్చగా ఉన్న పోలేపల్లి ఇపుడు సెజ్ కంపెనీల్లో మాడిమసై పోయింది. భూమి కోసం తన్లాడి వారు రెండు నెలలకు, మూడు నెలలకు ఒక్కొక్కరు రాలిపోన్నారు.పాలమూరులో ప్రతీ కార్యక్షికమంలో చురుకుగా పాల్గొన్న వెంక ఇవ్వాళ లేడు. అటు భూములు పోయి గుండె పగిలి చచ్చిన జనా లు ఒకవైపు, చావబోయే జనాల కోసం పనిచేసే కార్యకర్తల హత్యలు మరో వైపు. ఇంక తెలంగాణ అంతా బొందలగడ్డ కావలసిందేనా? 

భూముల కోసం, తరతరాల చెమట,రక్తంతో తడిపిన జాగ కోసం, నాలు గు మెతుకులు తిందామనే సరికి గద్దప్లూక్క వచ్చి తన్నుకుపోతున్నారు. తమ భూమిని ఏ కంపెనీ వారో గుంజుకుంటుంటే వారిని అడ్డుకుంటే నిమిషాల్లో పోలీసోల్లు దిగుతారు. ఇపుడు వెంక చనిపోయి ఇన్ని రోజులైనా కలెక్ట ర్, ఎస్పీలకు స్వయంగా కలిసి చెప్పినా ఆ జాడను కనుక్కోలేకపోతున్నారు. తన తండ్రి పోలీసు నౌకరి చేసి ఇంత గుడిసె గూడ సంపాదించుకోలేని స్థితిలో ఉన్న వెంక కుటుంబం ఎట్లాంటిదో తెలుసుకోవడానికి ఢిల్లీ నుంచి గూఢచారశాఖను రప్పించాలా? దేనికి అమ్ముడు పోనీ కార్యకర్తను కనీసం ఎవరు ఎత్తుక పో యి చంపిన్రు అన్న సమాచారం కూడా ఇస్తలేరు. ఈదేశంలో అత్యంత శక్తివంతమై న వ్యవస్థ, అడవులను మింగి, ఖనిజ సంపదలను విదేశాలకు అమ్ముకొని, కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్న వారిని ఏమి అనలేరు. మారు మూల గ్రామాల్లో ఉంటూ, కాకులు దూరని కారడవుల్లో అమాయకులైన పేద ప్రజలు, వారి ప్రాణాల కోసం, పర్యావరణం కోసం, రేపటి తరం కోసం కొట్లాడుతుంటే వెంటనే కొరడా ఝుళిపించే పోలీసు వారు ఒక్క మనిషి, ఒకే ఒక్క మని షి చావుకు కారణాలు కనుక్కోలేరా? అని ఆశ పడుతుంటారు. భస్మాసుర ‘హస్తా’లను అభయహస్తాలని నమ్ముతున్న ఈజనాలను మార్చే ప్రయత్నం ఎవరు చేసినా ఈ రాజ్యం బలి తీసుకోకుండా ఉంటుందా? 

తెలంగాణలో తెగువ, ధైర్యం, తెలివితేట లు ఉన్నవాళ్లందరూ మావోయిస్టులనే ముద్రవేసి చంపివేయపడుతున్నారు. ఎవ్వనికి అమ్ముడుపోనివాడు అంటే మావోయిస్టని, రాజ్యానికి దోపిడీ దారులకు,దళారులకు కండ్లల్ల నలుసు లెక్క ఉంటరు అని ఒక ప్రొఫెసర్ ఆవేదనతోని చెప్పాడు ఒక ప్రజాసంఘానికి బాధ్యత వహిస్తున్నా డు. తెలంగాణ వాళ్ళంటే, తెలంగాణ కోసం ఏర్పడ్డ ప్రజాసంఘాలంటే వాటికి ఒక కలర్ వేయాలి ఆ వంకతో చంపేయాలి. కేసులు పెట్టాలి, జైలు పాలు చేయాలి. ఈ ఫార్ములా బాగానే పనికొస్తున్నది. నిజమే ఒక నీతి, నిజాయితీ గల కార్యకర్త తయారు కావాలంటే కనీసం వంద సంవత్సరాలు పడుతుంది అన్న మాటలు వాస్తవమే! అవినీతి, అన్యాయం అన్ని పాదాల విల య తాండవం చేస్తున్నప్పుడు నీతి, నిజాయితీలని చరిత్ర పుస్తకాలలో వెతుక్కొనే పరిస్థితి వస్తుంది మరి. ఇపుడున్న ఈ మరమనుషుల యుగంలో మనుసులున్న మనుషులను, మానవత్వం, హక్కులను గురించి మాట్లాడే వాళ్ళని ఊహించడం ఇంకా కష్టం.

తెలంగాణ ఇవ్వాలంటే ఇవ్వొచ్చు, లేదనుకుంటే ఇవ్వకపోవచ్చు. కానీ ఒక వింతైన రిపోర్ట్ ఇచ్చిన కృష్ణ కమిటీలోని ఎనిమిదవ చాప్టర్‌ను ఇక్కడి పాలకులు మాత్రం పక్కాగా అమలు చేస్తున్నారు..సచ్చేటోడు సస్తనే ఉంటే మంత్రి పదవుల కోసం పోటీలు పడతనే ఉన్నరు కొంతమంది. రాజిరెడ్డి లు, వెంక ఏదో ఒక రూపంలో బలవుతూనే ఉంటరు. కవులు, జర్నలిస్ట్‌లు ఉద్యమ కవాతులు చేస్తూనే ఉంటారు. టీచర్లు, ప్రజాసంఘాలు నల్ల దినాలు చేసుకుంటారు. వెంక జాడ లేకుండాపోయి అమరుల జాబితాలలోకి పోతారు. పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంటే పట్టించుకోని రాజకీయ నాయకులను మనం ఏమి చేయాలి? తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి పైసా ఆశించకుండా పనిచేసే వెంక కాపాడుకోకుంటే ఎవడు కాపాడుతాడు ఈదేశాన్ని? అడ్డంవచ్చిన వాడినల్ల సంపుకుంట పోతుంటే చూసే వాళ్ళ నిశ్శబ్దాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి?

నాలుగుసార్లు జై తెలంగాణ అంటే, తెలంగాణకు మద్దతు పలకకుండా, ఇక్కడి ప్రజలకి ఇష్టం లేకుండా ఈప్రాంతంలోకి అడుగు పెట్టనీయమని అడ్డుకుంటే, రాజ్యం చేస్తున్న నేరాలను ఎత్తిచూపితే ఏదో ఒక పేరు మీద చంపేస్తరు అని విశ్లేషకుల అభివూపాయం. ప్రజలు నమ్మి ఒట్లు వేసి, గెలిపించినోళ్ళు ప్రజలకు వ్యతిరేకులైతే దాన్ని ప్రశ్నిస్తే చంపేస్తరా అంటున్రు అయన తో పని చేసినోళ్ళు. కార్యకర్తల ప్రాణాలతో ఆడుకొనే ఈ వ్యవస్థను నమ్ముకొని ముందుకు అడుగు వేయగలమా? 

ఈదేశంలో అంబేడ్కరిజం విప్లవీకరించాలి అని బడుగు బలహీన వర్గాల ను ఉద్ధరిస్తామనే వారు బడుగులు చస్తుంటే పట్టించుకోరేం? ఏ సిద్ధాంతం అయితే ఏమిటి, ప్రజలతోని, ప్రజల కోసం పనిచేయొద్దని ఏ ‘ఇజం’ చెపుతుంది? పోలేపల్లిలో, పర్లపల్లి లో బలవుతున్న బడుగు బలహీన వర్గాలు సిద్ధాంత చర్చలతోని కడుపునింపుకోలేరు. వాళ్లకు కావలసింది వారితో ఉండి వాళ్ళ జీవితాలని కాపాడే ‘యిజం’. ఈ దేశంలో కులం ఉంది, వర్గం ఉంది అని చెప్పిన అంబేద్కర్‌ను ఒక్క కులానికే పరిమితం చేసి, అయన సిద్ధాంతాలను చర్చలకు మాత్రమే కుదించి, తెల్లకాగితాల మీదికి ఎక్కిస్తే అసలు చదువేలేని 80శాతం మంది ప్రజలకు ఈ ఇజాలు ఎప్పుడు అం దాలి? అప్పటిదాకా ఎంతమందిని మనం పోగొట్టుకోవాలి? రైట్, లెఫ్ట్‌లు కలిసి మాట్లాడే సందర్భం ఇది, అంబేద్కర్, మావో కలిసి కొత్త ‘ఇజా’లని ప్రజలకు అందివ్వకపొతే నష్టపోయేది అన్ని వైపులా పేదలు, దళిత, వెనుకబడ్డ ఆదివాసీ లు. ‘ఇజాల’ కొట్లాటలన్నీ ఒక్క కాడికి తెచ్చే పని అయినా ఎవరో ఒకరు మొదలుపెట్టాలి. లేకపోతే ఎవరి గొప్పలువారు చెప్పుకోవడానికే సమ యం సరిపోదు. సిద్ధాంత చర్చలతో ని నిరంతరం ప్రజల మధ్యలో ఉండి, ప్రజలతోని పని చేసేవే రెండు సిద్ధాంతాలు, కేవలం పుస్తకాలకు, చర్చలకు ఎప్పుడు మిగిలిపోలే దు. బతకడానికి కావలసిన కనీస అవసరాల లైన హక్కులను కాలరాస్తూ ఉన్న రాజకీయాలని చూస్తూ ఎప్పుడూ మౌనంగా ఉండలేదు. 
చివరికి, ఇక్కడ పోలీసులు, నాయకులు, ఇంకా సంఘాలు లేవనుకుంటే నష్టం ఏమి లేదు. ఇపుడు వెంక హత్య మీద కప్పబడిన నిజాన్ని ఛేదించేవారే లేకపోతే ఇంకా ఇక్కడ ప్రజాస్వామ్యం, నాలుగు కుర్చీల వం టి పాఠాలు చెప్పడం మనం మానుకోవాలి. మరొక్కమారు ప్రజల దిక్కున, ప్రజల కొర కు, ప్రజల చేత మాట్లాడే ప్రత్యామ్నాయ వ్య వస్థలకు, కొత్త స్వతంత్ర భావాలకి కనీసం వెంక రాజిరెడ్డిల ప్రాణాలు నూతన ప్రజాస్వామిక విత్తనాలై మొలకెత్తాలి. ఈ నరమేధాలు ఇంకా కొనసాగనివ్వడం అనాగరిక సామాజిక లక్షణం.

అంతర్జాతీయ మార్కెట్లను ఆహ్వానిస్తున్నాం అని ఉత్సాహపడే వారికందరికీ, తమకు తెలియకుండానే తమ విలువైన హక్కులన్నింటిని ఫారిన్ కరెన్సీకి తాకట్టుపెడుతున్నాం అన్న సంగతి తెలియదు. ఇటు ప్రభుత్వమే సారా దుకాణాలను నడుపుతూ పేద మధ్య తరగతిని మత్తులో ముంచుతూ, అటు పబ్బు, క్లబ్బు సంస్కృతిని కాస్తా చదువుకున్న యువత నర నరాన పాకిస్తూ, డ్రగ్స్ కంటే ఘోరంగా విషాన్ని జీవితాల్లో నింపుతున్న ఈ అతి భయంకర ప్రపంచీకరణను అదుపు చేయాలి. లేకపోతే రేపటి ప్రపంచ పటంలో మనం ఉండే అవకాశం లేదు. ఇంకా ప్రజా ఉద్యమాలు ఊసేత్తే ప్రసక్తే లేదు. అన్ని ఇజాలను పక్కన పెట్టి నిస్వార్థంగా పని చేసే కార్యకర్తలని కాపాడుకోవడమే ఇప్పుడున్న అవసరం. 

-సుజాత సూరేపల్లి 
(తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యద

Namasete Telangana News Paper Dated: 08/11/2012

No comments:

Post a Comment