బాల్‌ఠాక్రే మరణాన్ని దేశంలోని మీడియా ముఖ్యంగా ఇంగ్లిషు మీడియా గంటల తరబడి ప్రసారం చేసింది. ఠాక్రే ఎదిగిన పద్ధతిని ఆయన గుణగణాల్ని సుదీర్ఘంగా విశ్లేషకులు చర్చించారు. అయితే చర్చ మరీ దారితప్పకుండా కొంత సమన్వయాన్ని పాటించింది. ఆయన పాత్రను విశ్లేషణాత్మకంగా, విమర్శనాత్మకంగా, తులనాత్మకంగా అంచనా వేశారు. అంతవరకు మీడియాను హర్షించవలసిందే. కానీ కొందరు విశ్లేషకులు ఠాక్రే ను మించిన నాయకుడు లేడని, అలాగే కార్టూనిస్టుగా ఆయన ముందు ప్రపంచంలో ఎవ్వరు నిలువలేరనే లాంటి వ్యాఖ్యానాలు కూడా చేశారు. ఇక ఆయన అంతిమ యాత్రకు వచ్చిన జనాన్ని- ఐదు లక్షల దగ్గర ప్రారంభమై, 25 లక్షల దాకా ఊహకు అందనట్టుగా అంచనాలు వేశారు. టీవీల్లో చూపించే సంఖ్య చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే మహారాష్ట్రియన్లు అతిపెద్ద సంఖ్యలో పాల్గొన్న మాట నిజం. ఠాక్రే పాత్ర ఏమిటి అన్నది పక్కకుపెట్టి, ఇంతపెద్ద సంఖ్యలో ఆయనను అభిమానించే ఈ జనం ఎవ్వరు? ఎందుకు ఒక సనాతన సంప్రదాయవాది, ముస్లింల మీద దక్షిణ, ఉత్తర భారతవాసుల మీద దాడులు రెచ్చగొట్టిన వ్యక్తిని అభిమానించడం అనేది విశ్లేషించవలసి ఉంటుంది.
ఠాక్రే విద్వేష రాజకీయాల నుంచి లేదా వాటి ఆధారంగా మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబయి నగరంలో ఒక ప్రధాన నాయకుడిగా ఎలా ఎదిగాడు అని ఆలోచిస్తే, బాల్ ఠాక్రే నమూనా మన సామాజిక, రాజకీయ మార్పు దిశని, దశని చాటుతుంది. ముంబయి నగరం భారత దేశ ఆర్థిక రాజధాని. చాలా ముందుగా పారిక్షిశామికీకరణ చెందిన నగరం. ఇక్కడి ట్రేడ్ యూనియన్లు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడమే కాక, ముంబాయిని మతాతీత సెక్యులర్ నగరంగా నిలబెట్టాయి. పెట్టుబడికి కూడా అది అప్పటి చారివూతక అవసరం. స్వాతంవూత్యానంతరం భారత పార్లమెంటుకు వామపక్షవాది, సామ్రాజ్యవాద వ్యతిరేకి కృష్ణమీనన్‌ను ఎన్నుకున్న విశాల భావాల నగరమిది. అప్పటికి మీనన్ దక్షిణ భారత ప్రాంతం వాడని కాని, కేరళవాడు అని కాని ఎవ్వరూ అనలేదు, అనుకోలేదు. తర్వాత జార్జ్ ఫెర్నాండెజ్‌ను నాయకుడిగా నిలబెట్టిన నగరమిది. ఈ ప్రజాస్వామిక సంస్కృతి మారుతూ, 60లలోనే బాల్‌ఠాక్రే ఒక నాయకుడిగా ఎదగడం ప్రారంభమై, శివసేన నిర్మాణమై, ఠాక్రే మహారాష్ట్ర రాజకీయా లను నిర్దేశించి, చివరకు ముఖ్యమంత్రి ఎవ్వరు అని నిర్ణయించే కీలక దశకు చేరుకున్నాడు. ఈ పరిణామం సెక్యులర్, ప్రజాస్వామ్య సంస్కృతి విధ్వంసానికి దారితీసి, ప్రాంతీయ, అస్తిత్వ రాజకీయాలకు బీజం వేసి, విష వృక్షంగా పెరిగింది.
జాతీయపార్టీ అయిన హిందూ మతతత్వ భారతీయ జనతా పార్టీ కూడా సమాంతరంగా ఎదుగుతూ వచ్చింది. అయితే హిందూ ‘అస్తిత్వ’ రాజకీయాల మీద పెరిగిన పార్టీ, ‘విశ్వ’హిందూ పరిషత్‌ను ప్రోత్సహించిన పార్టీ, ఉత్తర భారత, దక్షిణ భారత హిందువులను ద్వేషించిన బాల్ ఠాక్రేకు ఎలా మద్దతు ఇచ్చింది? బీహార్ వాసులను, తమిళులను, అలాగే ఇతరుల మీద దాడులు చేసినప్పు డు ఏం చేసింది? ఎందుకు మౌనంగా ఉన్నది? అనే ప్రశ్నలు కూడా అడగవలసి ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి, బాల్ ఠాక్రేకు ఉమ్మడి శత్రువు ట్రేడ్ యూనియన్ ఉద్యమం, వామపక్ష రాజకీయాలు. అలాగే ముస్లింలు. మత తత్వ రాజకీయాల నిజ స్వరూపం అదేనని అర్థం చేసుకోవాలి. విద్వేష రాజకీయాలకు తాము ‘శవూతువు’ అనుకునేవాడి మీద అసహ్యం ఎక్కువ పాళ్లల్లో ఉండడం వల్ల ఉదారవాద రాజకీయాలు కూడా గిట్టవు. అక్కడే కాంగ్రెస్ పార్టీలో ఎంత హిపోక్షికసి ఉన్నా, మతతత్వ పార్టీల కంటే మెరుగు అనే భావన చాలా మందిలో ఉంది. ఆ సామాజిక మద్దతు కాంగ్రెస్ పార్టీని ఇంకా పార్లమెంటరీ రాజకీయాల్లో నిలబెట్టింది.
ముంబాయి నగరం 1970ల వరకే పారిక్షిశామిక సంక్షోభాన్ని అనుభవిస్తూ, 1980 దశాబ్దం వరకు నూలు పరిక్షిశమ దెబ్బతినడంతో దత్తా సామం త్ దాదాపు చివరి ట్రేడ్ యూనియన్ నాయకుడిగా నిస్సహాయ స్థితిలోకి నెట్టబడ్డాడు. లక్షలాదిమంది కార్మికులు వీధి పాలు కావడంతో, అవకాశాలు తగ్గి, ఉన్న అవకాశాలు పోగొట్టుకున్న కార్మికులు ఒకవైపు, కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్న శ్రామికులు మరోవైపు ఉండడంతో, విద్వేష రాజకీయాలను రెచ్చగొట్టడం చాలా సులభమయ్యింది. నూలు పరిక్షిశమతో దెబ్బతిన్న గుజరాత్ శ్రామికులు తిరిగి తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోవడంతో బాంబే మిల్లుల సంక్షోభం గుజరాత్‌కు చేరుకుని అక్కడ విద్వేష రాజకీయాలను పెంచి పోషించింది. గుజరాత్‌ను ఐదు దశాబ్దాలుగా అధ్యయనం చేస్తు న్న జాన్‌వూబెమన్ గుజరాత్ మతకల్లోలాల మీద రాసిన వ్యాసంలో ఈ అంశా న్ని ప్రస్తావించాడు.
గుజరాత్ మారణకాండ భారతదేశ నాగరికతకు, సంస్కృతికి, ప్రజాస్వామ్యానికి సెక్యులరిజానికి ఎన్నడూ మాసిపోని అమానుష మచ్చగా ఉండిపోతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం నుంచి పుట్టిన నరేంవూదమోడీ ఆ సంక్షోభానికి పరిష్కారంగా కనిపించడం భారత రాజకీయాలలో ఒక పెద్ద విషాదం.
1960 దశాబ్దం చివర పెరిగిన అస్తిత్వ రాజకీయాలు సైద్ధాంతిక రాజకీయాలకు సవాలుగా మారాయి. అన్ని అస్తిత్వాలు అప్రజాస్వామికమని కాదు కానీ, బడుగు వర్గాల అస్తిత్వ రాజకీయాలకు ఒక సమక్షిగమైన ప్రాపంచిక దృక్పథం లేకుండా ఒక ప్రత్యామ్నాయ సమాజం కాని, సామాజిక సంబంధాలు కాని సాధ్యం కావు. ఒక రకంగా అస్తిత్వ రాజకీయాలు వామపక్ష రాజకీయాలకు, అలాగే రాడికల్ రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తాయి.
ఆ దూరం లేకపోతే అస్తిత్వం, తన అస్తిత్వాన్ని కోలుపోతుందని భావిస్తున్నాయి. అలాగే పార్లమెంటరీ వామపక్షాలు ఏమితోచని పరిస్థితిలోకి నెట్టబడ్డాయి. మతతత్వ, అస్తిత్వ రాజకీయాలను ఎలా ఎదుర్కొవాలి. అలాగే ప్రజాస్వామిక ఆకాంక్ష నుంచి ఎదిగిన అస్తిత్వాలతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి అనే అంశం మీద వాళ్ళకు స్పష్టత లేదు. విప్లవ రాజకీయాలు ఎన్నో ప్రాణ త్యాగాలు చేసినా అణచబడ్డ వర్గాల అస్తిత్వాలు కూడా కొంతవరకు ఆ రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నాయి.
ఈ పరిమితులు సనాతన, సంప్రదాయ, నిచ్చె న మెట్ల సామాజిక మార్పులో భాగమా, ఇది అస్తిత్వాల పరిమితా లేక చారివూతక పరిణామపు మలుపులలో ఒక అనివార్యమా అన్న అంశాల మీద క్రియాత్మక రాజకీయ ప్రయోగాలు కావాలి. సృజనాత్మక పరిశీలన, పరిశోధన, తీవ్రమైన మేధోమథనం జరగాలి. మార్పు కోసం నిరంత రం శ్రమ పడుతున్న రాజకీయాల వైఫల్యమే బాల్ ఠాక్రే అనే నాయకుడి జననానికి, జనంలో ఆ నాయకత్వం పెరగడానికి కారణం అని భావించ వలసి ఉంటుంది.
సామాజిక మార్పు జరగవలసిన రీతిలో జరగకపోవడం వలన భూస్వామ్య భావజాలం కొనసాగడం వల్ల దేశంలో ఒకరకమైన ఫాసిజం పెరిగే ప్రమాదం చాలా దగ్గరలో ఉన్నది. ఒక ముస్లిం అమ్మాయి ఫేస్ బుక్‌లో ఒక హిందూ అమ్మాయికి పంపిన అభివూపాయం వాళ్లిదరి అరెస్టుకు దారితీయడం దేన్ని సూచిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ ప్రమా దం తెలంగాణ అస్తిత్వ పోరాట సృహతో నిరంతరంగా ఉండాలి. 1969 ఉద్యమంలో ఎన్ని ఒడుదొడుకులు ఉన్నా, అది కూడా ఒక అస్తిత్వ ఉద్యమ మే అయినా, తెలంగాణలో ఉండే పోరాట వారసత్వం అలాంటి రాజకీయాలను ఎదగనివ్వలేదు. కాని ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం ఆ దిశగా వెళ్ళే సూచికలు కనిపిస్తున్నాయి. చరిత్రతో, మతంతో సంబంధం లేని ఒక కట్టడం ఇన్నేళ్ల తర్వాత మత విద్వేషాలకు కారణం కావడం తెలంగాణ ఉద్యమ పరిమితులను సూచిస్తున్నది. తెలంగాణ భవిష్యత్తుకు సవాలుగా మారనుంది. తెలంగాణ అస్తిత్వ పోరాటం ప్రజాస్వామ్య విస్తృతికి, ఉన్నతమైన సామాజిక సంబంధాలకు దారితీయాలే కాని బాల్‌ఠాక్రేకు వారసులు కాకూడదు.
ప్రొఫెసర్ జి. హరగోపా
Namasete Telangana News Paper Dated: 22/11/2012
No comments:
Post a Comment