మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజల ఆకాంక్షలకు ప్రతి రూపంగా అంబేద్కర్ సాధించిపెట్టిన ఎస్సీ రిజర్వేషన్లను జనాభా దామాషాకనుగుణంగా వర్గీకరించి సమాన పంపిణీ చేయాలనే సామాజిక న్యాయ సూత్రం తో మాదిగ దండోరా ఉద్యమం జూలై ఏడుతో 20 వసంతంలోకి అడుగుపెడుతుంది. ఈ రాష్ట్రంలో చెక్కు చెదరని నిర్మాణం,విశాల పోరాట దృక్పథం కలిగి నిరంతర పీడిత జనపక్షం వహిస్తూ రెండు దశాబ్దాలుగా పేద వర్గాల గొంతుకగా వర్ధిల్లుతున్నది మాదిగ దండోరా. 1994లో ప్రకాశం జిల్లా ఈదుముడి అనే చిన్న గ్రామంలో మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో 20మంది యువకులతో ప్రారంభమైన ఉద్యమం ఇరవై ఏళ్లుగా నిలువడం చారివూతాత్మకమైన క్రమం. ఉద్యమానికి ఎన్నో అవరోధాలు,అవమానాలు, నిందలు, నిర్బంధాలు,కష్టాలు, కన్నీళ్లు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ఇరవైఏళ్లుగా సజీవంగా ఉద్యమ ప్రయాణంలో ఉండడానికి దండోరాకు మందకృష్ణ నాయకత్వమే కారణం. గడిచిన రెండు దశాబ్దాలకాలంలో అనేక సామాజిక సమస్యలపై పోరాటాలను నిర్మిస్తూ వాటికి పరిష్కారాలు చూపుతూ ముందుకు సాగడమే కారణం. రాజకీ య పార్టీలకు ధీటైన ప్రత్యామ్నాయ రాజకీయేతర శక్తిగా ఎంఆర్‌పీఎస్‌ను మంద కృష్ణ తీర్చిదిద్దారు. చాలా మంది ఈ ఉద్యమ సంస్థను మాదిగలకు నీడనిచ్చే చెట్టుగానే భావించారుగానీ,అది యావత్ పేదవర్గాలకు నీడను పరిచే మహా వృ క్షంగాఎదుగుతుందని ఊహించలేకపోయారు.ఈ క్రమంలోనే మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజల కోసం వర్గీకరణ కోసం, వికలాంగుల పెన్షన్ పెంపు కోసం రాజకీయ రిజర్వేషన్లు, వితంతువుల పెన్షన్ల కోసం ఎంఆర్‌పీఎస్ పోరాడింది. పేదవారికి కడుపునిండా అన్నం కోసం రేషన్ బియ్యం పెంపు కోసం పోరాటం కొనసాగిస్తున్నది.
కులం పేరు చెప్పుకోవడానికి బాధపడిన మాదిగల్లో ఆత్మ గౌరవాన్ని నింపి ఐక్యతను తెచ్చి హక్కుల కోసం పోరాడే చైతన్యాన్ని తీసుకురావడంలో ఎంఆర్‌పీఎస్ గణనీయమైన కృషి చేసింది. చిన్నారుల ఆరోగ్యాల కోసం, గుండెజబ్బుల పిల్లల కోసం దండోరా పోరాడి సరికొత్త మానవీయ ఉద్యమానికి పురుడు పోసిం ది. ఇలా సమాజంలోని సమస్త వర్గాల హక్కులు, సమస్యల కోసం పోరాడి ఉన్నతమైన మానవీయ హక్కుల ఉద్యమంగా దండోరా ఎదిగింది. ఈ నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం మొదటిదశలో ఆరేళ్లు అలుపెరుగని పోరాటం చేసి 2000 సంవత్సరంలో ప్రభుత్వం మెడలు వంచి వర్గీకరణ సాధించడం జరిగింది. దీంతో ఎస్సీల్లోని అట్టడుగు ఉపకులాలు రిజర్వేషన్లు పొంది ఎన్నో ఫలాలను అనుభవించారు. కానీ ఇది గిట్టని కొన్ని స్వార్థపరశక్తులు సుప్రీంకోర్టుకు ఎక్కి సాంకేతిక కారణాల సాకుతో వర్గీకరణను రద్దు చేయించడం జరిగింది. దీంతో అనివార్యంగా రెండోదశ వర్గీకరణ పోరాటం చేయాల్సివస్తున్నది. వర్గీకరణ న్యాయమే అని జస్టిస్ ఉషామెహ్రా కమిషన్ కేంద్రానికి నివేదిక సమర్పించడంతోపాటు, రాష్ట్ర అసెంబ్లీ మూడుసార్లు వర్గీకరణ కోసం తీర్మానం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ పార్లమెంటులో బిల్లు పెడితే మద్ధతిస్తామని ప్రకటించాయి. ప్రధానికి లేఖలు రాశాయి. ప్రస్తుతం వర్గీకరణ చట్టంగా కావడానికి సాంకేతిక ప్రక్రియలన్నీ ముగించుకున్నది.
ఈక్రమంలోనే దండోరా నాయకత్వం యూపీఏ ప్రభుత్వ పెద్దలకు వర్గీకరణ చేయాలని లేఖలు కూడా రాయడం జరిగింది. ఇప్పుడు కొంతమంది మాల స్వార్థపర శక్తులు తప్ప వర్గీకరణను వ్యతిరేకించే శక్తలేవీ లేవు. ఈ నేపథ్యంలోనే వర్గీకరణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి, కాంగ్రెస్ పెద్దల నిద్దుర మత్తు వదిలించడానికి దండోరా ఉద్య మం సమాయత్తమవుతున్నది. ఇంత సుదీర్ఘ ఉద్యమంలో చేసి న త్యాగాలను చూసైనా మాల సోదరుల వర్గీకరణకు సహకరించాలని దండోరా కోరుతున్నది. ఇరవైఏళ్ల దండోరా ఉద్యమం లో మాల సోదరులను సోదర ఉద్యమ సహచరులుగానే చూ స్తుంది తప్ప శత్రువులుగా చూడటం లేదు. కాబట్టి సామాజిక పీడితులుగా సాటి పీడితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నది.దండోరా ఉద్యమం రాష్ట్ర రాజకీయ, ఉద్యమ ముఖ చిత్రం మీదనే కాదు, మొత్తంగా దేశ ఉద్యమాల ముఖ చిత్రం మీదనే ప్రత్యేక ముద్ర వేసింది. తమ జాతి సమూహాల సమస్యల పరిష్కారం కోసం మాత్రమేగాక, సమాజంలోని సకల పీడితుల సమస్యలను తమ భుజస్కంధాలపై వేసుకుని పోరాడటం ద్వారా దండోరా ఉద్యమం ఉద్యమాల చరివూతలో సరికొత్త అధ్యాయాన్ని రచించింది. వికలాంగులకు పెన్షన్ పెంచాలన్న డిమాండ్‌తోపాటు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని దండోరా డిమాండ్ చేస్తున్నది. తెల్ల రేషన్ కార్డుమీద బియ్యం కోటా పెంపు కోసం ఉద్యమం మరింత ఉధృతంగా దండోరా నిర్వహిస్తున్నది. పిల్లలు, వృద్ధులు, వితంతువులు ఇలా సకల వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం దండోరా ఉద్యమిస్తున్నది.
భారత దేశ చరివూతలో దండోరా ఉద్యమం సరికొత్త పుటగా నిలిచింది. చెప్పులు కుట్టే చేతులతో చరిత్ర తిరగరాసిన ఉద్యమం దండోరా. కులం పేరు చెప్పుకోవడానికి ఆత్మన్యూనతకు గురైన జనాన్నే తలెత్తుకుని నేను మాదిగను అని సగౌరవంగా చెప్పుకునే స్థితికి దండోరా ఆత్మగౌరవ పోరాటం తెచ్చింది. ఈ నేపథ్యంలోనే సమాజంలోని అనేక నిమ్న, వెనుకబడిన బడుగు కులాలన్నీ దండోరా స్ఫూర్తితో కుల చైతన్యంతో ఉద్యమాల బాట పట్టినయ్. అదే క్రమంలో అన్ని అణచబడ్డ కులాల పోరాటాలకు మాదిగ దండోరా ఉద్యమం బాసటగా నిలిచి ప్రోత్సహించింది.ఆ ఉద్యమాల విజయానికి చేయూతనిచ్చింది. దండోరా ఉద్య మం కుల సంఘమే. అయినా అది కులతత్వంతో ఆలోచించకుండా సబ్బండ వర్గాలను సోదరత్వంతో చూసి వారిని అక్కున చేర్చుకున్నది. వారి సమస్యల పరిష్కారానికి తోడ్పాటునందించింది. మాల మాదిగల ఐక్యతను కోరుతూనే మాల ఐఏఎస్ అధికారి అర్జునరావుకు అన్యాయం జరిగినప్పుడు, గద్దర్‌పై కాల్పులు జరిపినప్పుడు, ఢిల్లీలో చందర్‌రావు అనే మాల ఉద్యోగిపై టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు దాడిచేసినప్పుడు, మాజీ మంత్రి శంకర్‌రావుపై అగ్రకులాలు దాడిచేసినప్పుడు, గీతాడ్డిపై కోదండరాం అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, ఈ మధ్యకాలంలోనే శ్రీకాకుళంలో లక్షింపేటలో జరిగిన హత్యాకాండ ఘటనపై కూడా దండోరా ఉద్యమించింది. బాధితుల పక్షాన నిలిచి అన్యాయాన్ని ఎదిరించింది. ఇలా పోరాడడం ద్వారా మాదిగ దండోరా ఉద్యమం మాలలకు వ్యతిరేకం కాదని చాటాం.
అలాగే విప్లవోద్యమాలపై ప్రభుత్వాల దమ నకాండను నిరసిస్తూ ఉద్యమాల పక్షాన నిలిచి నిర్బంధకాండను ఖండించాము. ఉద్యమాలను అణచడానికి తీసుకురాదలచిన ‘పోటా’ చట్టా న్ని ఎంఆర్‌పీఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. విప్లవోద్యమనేతలు ఎన్‌కౌంటర్ల పేరుతో అమరులైనప్పుడు ఆ బూటకపు ఎన్‌కౌంటర్లను ఖం డించింది. ప్రజాస్వామిక, విప్లవోద్యమాల పట్ల రాజ్యహింసకు వ్యతిరేకంగా దండోరా ఉద్య మం గొంతు విప్పంది.అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ ఉద్యమానికి మద్ధతు నిచ్చిం ది. అనేక తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నది.అలాగే తెలంగాణ జిల్లాల్లో మెజార్టీగా ఉన్న ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారంలో వాటా దక్కాలనే డిమాండ్‌తో సామాజిక తెలంగాణకోసం దండోరా ఉద్యమం కదులుతున్నది.అణగారిన వర్గాలుగా మూడు ప్రాంతాల్లో ఉన్న వారిని కూడగట్టి తెలంగాణ ఉద్యమానికి మద్ధతును కూడగట్టింది. చెరుకు సుధాకర్‌పై రాజ్యనిర్బంధం, విమలక్కపై కుట్ర కేసుల సందర్భంలోనూ దండోరా ఉద్యమం బాధితుల పక్షాన నిలిచి రాజ్యహింసను వ్యతిరేకించింది. సామాజిక ఉద్యమాలను ప్రజాస్వామిక పోరాటాలతో మమేకం చేస్తూ.. దండోరా ఉద్యమం దిక్సూచిగా నిలిచింది. ఇదే సందర్భంలో భవిష్యత్ తరాల నిజమైన విముక్తి కోసం సమస్త పీడక కులాల ప్రజలందరి విముక్తి లక్ష్యంతో ఫూలే, అంబేద్కర్ ఆశయాల వెలుగులో నూతన రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు మంద కృష్ణ సమాయత్తమవుతున్నారు. సమస్త పీడితుల విముక్తి కోసం మహాజనుల పార్టీ నిర్మాణం కాబోతున్నది. ఇదే దేశంలో సమస్త పీడితుల వెలుగుబాటగా మారబోతున్నది. బహుజనుల రాజ్యం రాబోతున్నది. దీనికి దండోరా సమరశంఖం పూరించి ముందుకు కదులుతున్నది.
-గోవిందు నరేష్ మాదిగ
ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
(మాదిగ దండోరా ఉద్యమానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా..)
Namasete Telangana Telugu News Paper Dated : 08/07/2013
No comments:
Post a Comment