‘పసిపాప లాంటి వృద్ధాప్యంలో/నిబ్బరంగా నిలబడి
చిరుగాలి సితారా సంగీతాన్ని /పలికించే వేళ, పలవరించే వేళ
జీవితమా! నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు’ అని శివసాగర్ ఎనభై ఏళ్ల వృద్ధాప్యంలో యవ్వనాన్ని రొమాంటిక్‌గా పలవరించాడు. ప్రతి వృద్దుడు ఇలా కోరుకోవటం సహజం. కాని ప్రకృతిలో ఇది సాధ్యంకాదు.
ప్రతి మనిషికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే మూడు దశలు తప్పనిసరిగా ఉంటాయి. బాల్యం, యవ్వనంలో ఉండే సంతోషం వృద్ధాప్యంలో సాధ్యం కాదు. ఒక రకంగా మనిషి జీవితంలో ఏ విధంగా చూసినా ఈ చివరి దశ కష్టభరితమైనది. విషాద కరమైనది. కాని వీళ్లు ఒక గతానికి సాక్ష్యం. ఆ గతం తాలూకు తీపి, చేదు గుర్తులను వర్తమానానికి అందించే వాహిక వృద్ధులే. గతం భుజాల మీద నిలబడి వర్తమానాన్ని వీక్షిస్తూ, భవిష్యత్‌ను కలగనాలనే అవగాహన ప్రతి మనిషికి ఉండాలి. అప్పుడే వృద్ధుల పట్ల మన సామాజిక బాధ్యత గుర్తుంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా వృద్ధులకు సాధారణంగా అనారోగ్యం, బలవర్ధక ఆహారం లేకపోవటం, నిస్సత్తువ, భయం, వెలితిగా ఉండటం, ఆర్థిక స్థోమత లేకపోవటం, సరియైన పోషణ, అయినవారి ఆదరణ లేకపోవటం లాంటి సమస్యలు ఉంటాయి. ‘వృద్ధాప్యం’ అనే స్థితిలో కదలలేకపోవటం, అవయవాలు సరిగ్గా పనిచేయకపోవటం, కనుచూపు కోల్పోవటం లాంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలు అనేవి వీరికి ఉండే స్థూలసమస్యలు. యవ్వనంలో ఉండే శుభ్రమైన జీవితం నుంచి ఒకేసారి అపరిశువూభమైన జీవితంలోకి ప్రవేశిస్తారు. దీని వలన మానసికంగా కుంగిపోతారు. గతంలో ఆర్థికంగా బాగా బతికిన వీళ్లు ముసలితనంలో ఆర్థిక సమస్యలు ఆవరించేసరికి తట్టుకోలేక మానసిక, ఆరోగ్య సమస్యలకు గురవుతారు. తమ కళ్లముందే తమ బిడ్డలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే.. ముసలి తల్లిదంవూడులు భరించలేరు. తద్వారా కొందరు మానసిక ఒత్తిడికి గురవుతారు.
ఇన్ని సమస్యలను ఎదుర్కొనే వృద్ధులు ఒకప్పుడు తమ యవ్వన రక్తాన్నంతా ధారపోసి బిడ్డలను కని, పెంచి, పెద్ద చేశారనే సత్యాన్ని ఈ తరం మర్చిపోవటమే అతిపెద్ద విషా దం. సమాజంలో పతనమవుతున్న విలువలకు ఇదొక నిదర్శనం. ఈ దేశానికి వసుదైక కుటుంబమనేది సర్వనామం. సమష్టి జీవనం, సామూహిక ఉత్పత్తి వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇక్కడి సామాజిక జీవనానికి పునాది లాంటి ది. వృద్ధుల బాధ్యతను కుటుంబం మొత్తం స్వీకరించే తత్వం ప్రజలలో ఉండేది. రాను రాను ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు పెరిగాయి. మనుషుల ఆలోచన ధోరణిలో కూడా చాలా మార్పులు వచ్చాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలనే వాస్తవం కూడా ఈ స్థితి పెరగడానికి కారణమైనది.
ఇక ప్రపంచీకరణ విధానాలు అమలవుతున్న ఈ ఇరవై సంవత్సరాలలో మానవ విలువలు డాలర్ కట్టల కింద నలిగిపోతున్న పరిస్థితి కళ్ల ముందు కన్పిస్తున్నది. విలువల రాహిత్యం అన్నిచోట్ల పెరిగింది. ఆస్తి కోసం కన్న తల్లిదంవూడులను రోడ్డు పాలుచేసే లేదా చంపేసే దుర్మార్గం దాపురించింది. ముసలి తల్లిదంవూడులను ఏవగించుకునే కాలం వచ్చిం ది. ఎలవూక్టానిక్ వస్తువుల వలన దూరాలు తగ్గాయి. కాని ముసలి తల్లిదంవూడులకు పిల్లలకు మాత్రం దూరం మరింత పెరిగింది. కవరేజి లేని ప్రాంతాలలో ముసలి వాళ్లను ఉంచాల నే ధోరణి పెరిగిపోయింది. కారణాలు ఏవైనా సమాజానికి ఇది మంచిది కాదు. మనుమలు, మనుమరాండ్లతో హాయిగా ఉండవల్సిన వయసులో చెట్టుకిందో, బస్టాండులో, ఫ్లైఓవర్ కిందో, ఫుట్‌పాత్ మీదనో తల దాచుకోవటమనే దౌర్భాగ్యం రావటం ఈ వ్యవస్థ కుళ్లిపోయిందనడానికి నిదర్శనం. మనల్ని కనిపెంచిన వాళ్లను రోడ్డుపాలు చేస్తే, రేపు మనం కనిపెంచిన వాళ్లు కూడా అదే పని చేస్తారనే ఎరుక ఉండాలి. రక్తబంధం బాధ్యతను తీర్చుకోవటం కనీస ధర్మం. అయితే సమస్యకు ఇదొక పార్శ్వం మాత్రమే.
ఇంకో కోణం ఏమిటంటే.. రోజురోజుకు ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి. డబ్బున్న వాళ్లే మరింత ధనవంతులు అవుతున్నారు. గ్రామీ ణ ఆర్థిక వ్యవస్థ ప్రపంచీకరణ ఫలితంగా, కరువు వలన విచ్ఛిన్నమైనది. దీంతో వలసలు పెరిగాయి. బతుకుదెరువు కోసం ఏళ్ల తరబడి ఇతర ప్రాంతాలకు వలసపోవటం వల్ల ఇంటి దగ్గరే ఉన్న ముసలి తల్లిదంవూడులు అనాథలైపోతున్నారు. అనివార్యంగా తిండి కోసం వాళ్లు రోడ్డుపాలవుతున్నారు. ఆర్థిక స్థోమత లేక పోషించలేని స్థితిలో తల్లిదంవూడులను పట్టించుకోలేని వాళ్లు కొందరైతే, డబ్బుం డి తల్లిదంవూడులను వృద్ధావూశమాలకు పంపించే వాళ్లు మరికొందరు. చూడటానికి ఎవ్వరులేని అనాథలు మరికొందరు. మానవ విలువలు పతనం కావడానికి సమాజం బాధ్యత ఎంత వుంటుందో, అంతకు రెట్టింపు పాలకుల బాధ్యత కూడా ఉంటుంది. ‘మంచి పాలకులు ఉన్నచోట మంచి పౌరులుంటార’ని గ్రీకు మాట ఉన్నది. కనుక మన పాలకులు విలువల రాహిత్యాన్ని పెంచి పోషిస్తున్నారనటంలో అసత్యం లేదు.
అనాథలు, ఆర్థిక స్థోమతలేని వృద్ధులను ఆదుకోవల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుం ది. సంక్షేమ రాజ్యమని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా ఉండాలి. తల్లిదంవూడులు, సీనియర్ సిటిజన్‌ల పోషణ, సంక్షేమ చట్టం 2007 ప్రకారం ప్రభుత్వమే వృద్ధుల బాధ్యతను తీసుకోవాలి. ఈ చట్టంలోని మూడవ అధ్యాయం ప్రకారం- 1. ప్రతి రాష్ర్ట ప్రభు త్వం జిల్లాకు ఒకటి చొప్పున వృద్ధావూశమాలను ఏర్పాటు చేయాలి. అందులో 150 మంది కి ఆశ్రయం కల్పించాలి. 2. ప్రభుత్వ ఆసుపవూతులలో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక పడకలను ఏర్పాటు చేయాలి. 3.సీనియర్ పౌరులకు వేరుగా క్యూపద్ధతిని ఏర్పాటు చేయాలి. 4.చట్టంలోని సదుపాయాలను ప్రభుత్వం మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. 5. జిల్లా మేజిస్ట్రేట్‌కు ఈ చట్టం అమలు, పర్యవేక్షణ బాధ్యత ఉంటుంది. 6.సీనియర్ పౌరుల సంరక్షణ బాధ్యతను బుద్ధి పూర్వకంగా విస్మరించిన వ్యక్తులకు మూడు నెలలు జైలు శిక్ష, ఐదు వేలు జరిమానా విధించవచ్చు. ఈ అంశాల అమలు పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధి ప్రదర్శించిన దాఖలాలు లేవు.
ఇక 65 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, వితంతువులకు కేంద్ర ప్రభుత్వం 200 రూపాయలు పెన్షన్ ఇస్తున్నది. 2004, 2009 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌పార్టీ రాష్ర్టంలో అధికారంలోకి వస్తే వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 225 రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటించింది. అంటే కేంద్రం ఇచ్చే 200రూపాయలకు, రాష్ర్టం మరో 225 కలిపితే 425 రూపాయలు రావాలి. కాని కేంద్రం ఇచ్చే 200 రూపాయలు మాత్రమే ఇచ్చి రాష్ర్ట ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నది. ఎమ్మెల్యేల జీతాలను మాత్రం 30 వేల నుంచి 80 వేల రూపాయలకు పెంచుకున్న నాయకులు ప్రజల గురించి పట్టించుకునేస్థితిలో లేరు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 200 రూపాయల పెన్షన్‌కు అదనంగా ఉత్తరవూపదేశ్ ప్రభుత్వం 200 కలిపి(మెత్తం 400), రాజస్తాన్ 300 (మొత్తం500), గోవా 800(మొత్తం 1000), ఢిల్లీ 1000 (మొత్తం 1200), తమిళనాడు 800(మొత్తం 1000) రూపాయలు ఇస్తుండగా మన రాష్ర్ట ప్రభుత్వం మాత్రం నాయకుల ఆస్తులు పెంచుకునే వైపు ప్రయాణం చేస్తున్నది. కనీ సం ప్రయాణ రాయితీ గురించి కూడా మన ప్రభుత్వం ఆలోచించడం లేదు.
ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం నియమించిన ‘మోహినీగిరి కమిటీ’ నివేదికను అమలు చేయాలి. ఈ రాష్ర్ట ప్రభుత్వం వృద్ధులు, వితంతువుల సమస్యల అధ్యయనానికి మరో కమిటీని నియమించాలి. వీరి కోసం ప్రత్యేక మంత్రి త్వ శాఖను ఏర్పాటు చేయటం వలన కూడా సమస్యలను పరిష్కరించటం సులభమవుతుంది. వృద్ధుల పరిస్థితి ఇలా ఉంటే వితంతువుల పరిస్థితి మరింత ఘోరం. నా అనేవారు లేక, తోడు లేక గుండె చెరువై జీవిస్తుంటారు. భర్త చనిపోయి, బంధువుల నిరాద రణకు గురై, కన్నబిడ్డలను పోషించుకోలేక అనేక ఇబ్బందులు పడుతుంటారు. వీరి బాధ్యతను కూడా ప్రభుత్వం చూడాలని అనేక చట్టాలు చెబుతున్నాయి. కాని అవి కాగితాలకే పరిమితమయ్యాయి.
80 లక్షల మంది వృద్ధులు, 30 లక్షల మంది వితంతువుల బాధలు ఈ రాష్ర్టంలో అరణ్యరోదనగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో వీరి కన్నీళ్లను తుడవడానికి మాదిగ రిజర్వేషన్ పోరాటసమితి (ఎంఆర్‌పీఎస్) పూనుకోవడం అభినందనీయం. ఒక కులసంఘం సామాజిక సమస్యలపై పని చేయాలనే దృష్టి కలిగి ఉండ టం అన్ని సంఘాలకు ఆదర్శం కావాలి. బోసినవ్వుల పసిబిడ్డలు గుండె ఆగిపోయి అర్థాంతరంగా చనిపోతుంటే వారికి ప్రభుత్వమే ఉచిత ఆపరేషన్ చేయాలని 2004లో ఎంఆర్‌పీఎస్ ఉద్యమించింది. 2007లో వికలాంగుల తరపున పోరాటం చేసి 200 రూపాయలు ఉన్న పెన్షన్‌ను 500కు పెంచేటట్లు చేసింది. ఈ వొరవడిలో ఇవ్వాళ వృద్ధుల కోసం, వితంతువుల కోసం వారి పెన్షన్ 1000 రూపాయలు పెంచాలనే డిమాండ్‌తో పోరాడుతున్నది. మందకృష్ణ మాదిగ ఆరు నెలలు రాష్ర్టమంతటా పాదయాత్ర చేసి ఈ సమస్యపై కదలిక తీసుకరావటం హర్షించాల్సిన విషయం.
సమాజంలో వృద్ధులకు బిడ్డలుగా, వితంతువులకు అన్నలు, అక్కలుగా వారికి గౌరవవూపదమైన జీవితం దక్కటానికి జరిగే పోరాటంలో అందరం భాగం కావాలి. వాళ్ల డిమాం డ్ నెరవేరే వరకు ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేయాలి. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాలు దీనికి మద్దతు ప్రకటించి పోరాటానికి అండగా నిలబడాలి.
-డాక్టర్ సి. కాశీం
(2013 ఏవూపిల్ 28న వృద్ధులు, వితంతువుల యుద్ధభేరి సందర్భంగా..)
Namasete Telangana Telugu News Paper Dated : 27/4/2013
No comments:
Post a Comment