కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వదని యాభై ఎనిమిదేళ్ల చరిత్ర నిరూపించింది. ఈ వాస్తవం ఇంకా వర్తమానంలో స్పష్టంగా అర్థమవుతున్నది. పచ్చి తెలంగాణ వ్యతిరేకి అయిన ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 19న మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ మోసాల చరివూతకు సాక్ష్యం. ఆయనే తెలంగాణకు వ్యతిరేకంగా కోర్‌కమిటీలో మాట్లాడుతున్నాడనేది ఆఫ్ ది రికార్డ్ అయినా, ఆయన ప్రవర్తన దీన్ని రుజువు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టులకు కేంద్రమవుతుందనే బూచీని కూడా ప్రణబ్ ఎనిమిది సంవత్సరాలుగా (అంతర్గత సమావేశాల్లో) ఇతర కాంగ్రెస్ పెద్దల కు చూపెడుతున్నారు.
కానీ మావోయిస్టులు తెలంగాణలో దాదాపు నలభై ఏండ్లుగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కూడా పనిచేస్తారు. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న మావోయిస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు కూడా జరిపింది. కనుక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మావోయిస్టులు ఉంటారని చెప్పడం కేవలం సాకు మాత్రమే. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా అడ్డుపడడానికి ఈ ప్రచారాన్ని చేస్తున్నారు. ప్రజలకు భూమి, భుక్తి, విముక్తి దక్కేవరకు మావోయిస్టులు ప్రజల్లో ఉండి పనిచేస్తారానేది చరిత్ర రుజువు చేసింది. ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్‌లేని ప్రాంతాలలో కూడా ప్రజల విముక్తి కోసం మావోయిస్టులు పనిచేస్తున్నట్టే రేపటి తెలంగాణ రాష్ట్రంలో కూడా పనిచేస్తారు. కేంద్రం ఈ బూచిని చూపెట్టినప్పుడల్లా ఇక్కడి మేధావులు ఆత్మరక్షణలో పడుతున్నట్టు ఉంది.
తెలంగాణ రాష్ట్రం రాకపోవడానికి మావోయిస్టులు కారణం కాదు. ఎందుకంటే సోనియాగాంధీ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు తెలంగాణ కంటే కోస్తాంధ్ర భూస్వాములు, పెట్టుబడిదారుల వల్లనే ఎక్కువ నెరవేరుతాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం లేదు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకొని ఇక్కడి మేధావులు, బుద్ధిజీవులు కేంద్రం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి.
ప్రజల ఒత్తిడితో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు అనివార్యంగా రాజీనామాలు చేశారు. తెలంగాణపోరాటంలో ఇదొక పాజిటివ్ అంశం. కానీ కేంద్రంలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ఎంపీల రాజీనామాలతో కేంద్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదు. కొద్దిమంది తెలంగాణ ఎమ్మెల్యేలను మేనేజ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా పడిపోదు. కనుక అటు కేంద్రంలోనూ, ఇటు కోస్తాంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలోనూ చలనం లేదు.
ఇప్పు డు రాజీనామాలు చేసిన నాయకుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా ఉంది. రాజీనామాలు వెనక్కి తీసుకోవడం ఎలాగో ఆలోచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే శక్తి ఏ రకంగా చూసినా కోస్తాంధ్ర నాయకులతో పోల్చుకుంటే తెలంగాణ నాయకులకు లేదు. ఇక్కడి నాయకులు డబ్బును వెదజల్లలేరు. లాబీయింగ్ చేయలేరు. కనుకనే ప్రణబ్, ఆజాద్, చిదంబరం అంతా కోసాంధ్ర కావూరి, రాయపాటి, లగడపాటి, సుబ్బిరామిడ్డిలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే లాబీయింగ్‌లతో తెలంగాణ రాదని అర్థమవుతున్నది. అందుకే ఇక తెలంగాణ రాజకీయ నాయకులకు మిగిలింది ప్రజలు, ప్రజాపోరాటాలే.
ఇవాళ తెలంగాణ ఉద్యమం బహుళ నాయకత్వం కింద సాగుతున్నది. అనేక రకాల ప్రజా సమూహాలు ఈ ఉద్యమంలో ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, లాయర్లు, మేధావులు, కవులు, కళాకారులు.. ప్రధాన స్రవంతిగా ఉన్నారు. విద్యార్థులు మినహాయిస్తే మిగతా వర్గాలు చాలా చిన్న సమూహమైనా..బలీయమైన శక్తి. విద్యార్థులందరూ ఐక్యంగా ఉద్యమంలో కదలడం లేదు. కనీసం నాలుగు లక్షలకు పైగా ఉన్న ఉద్యోగులు కూడా అందరూ పాల్గొనడం లేదు. ఉద్యోగులు ఆర్గనైజ్డ్ సెక్టార్. సమష్టిగా కదలి లక్ష్యాన్ని సాధించే సత్తా ఉన్న వర్గం. వాళ్లలో సంపూర్ణ కదలిక లేకపోవడానికి అనేక కారణాలున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అనివార్యత, భవిష్యత్‌తరాల కోసమైనా .. తెలం గాణ ఆవశ్యకతను వివరించాలి. వారిలో కమిట్‌మెంట్ పెరిగేటట్లు విషయాన్ని అవగాహన కలిగించాలి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవనే అవగాహనను ఉద్యోగుల్లో ప్రచారం చేయాలి. రాష్ట్రం కోసం జరిగే పోరాటంలో కొన్ని త్యాగాలు తప్పవనే సంసిద్ధతను పెంచాలి. తెలంగాణ రావడం వల్ల వెంటనే ఉద్యోగులకు జరిగే ఆర్థిక ప్రయోజనాన్ని శక్తిమంతంగా ప్రచారం చేయాలి.
ఈ దశలో భాగంగానే ఉద్యోగులు రోజు ఎదుర్కొంటున్న చాలా సమస్యలు కోస్తాంధ్ర పాలకుల వలననే అనే విషయా న్ని అర్థం చేయించాలి. ఆ సమస్యల పరిష్కారం కోసం పోరా ట రూపాలను ఎన్నుకొని ఉద్యోగులను కదలించాలి. చివరగా ఈ పోరాటాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం జరిగే పోరాటంతో సమన్వయం చేయాలి. ఇట్లా ప్రారంభమైన ఉద్యమంలో అంచలంచెలుగా కార్యాలయాలను బంద్ చేయడం, పాలకులకు సహాయ నిరాకరణ చేయడం, రోడ్ల మీదికి వచ్చి దిగ్బం ధం చేయించడం. పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడేటట్టు చేయడం. దీనితో పాటు బయట జరుగుతున్న ప్రజాపోరాటంలో ఉద్యోగులను భాగం చేయా లి. ఇక చదువుకున్న విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, కవులు, కళాకారులు ప్రజాసేవకులుగా మారి గ్రామాల్లోకి ప్రవేశించాలి.
ఆ ప్రజలతోనే జీవించాలి. వారి నమ్మకాన్ని చూరగొనాలి. స్థానిక సమస్యలపై ప్రజలను కదిలిస్తూ ఉద్యమానికి సిద్ధం చేయాలి. ఇట్లా ప్రారంభమైన పోరాటాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం జరిగే ఉద్యమంగా మార్చాలి. అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి తెలంగాణ వచ్చేవరకు వివిధ పార్టీల జెండాను, ఎజెండాను పక్కకు పెట్టి తెలంగాణ సాధనే ఏకైక ఎజెండాగా పనిచేయాలి. గ్రామంలో చురుకైన, నిజాయితీ కలిగిన రాజకీయ అవగాహన ఉన్న కార్యకర్తలను ఎంపిక చేసి ఒక కమిటీని రూపొందించాలి. ఆ కమిటీకి కావల్సిన ఆర్థిక వనరులను గ్రామ ప్రజలపై ఆధారపడి సమకూర్చుకోవాలి. ప్రతీ నెలకు ఒకసారి ఖర్చుల వివరాలను ప్రజల సమక్షంలో చెప్పి భవిష్యత్ కార్యక్షికమాన్ని చర్చించి ప్రకటించాలి. గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని నిరవధికంగా గ్రామ పంచాయితీ కార్యాలయం, పాఠశాలలు, పోస్టాఫీసు, అంగన్‌వాడి కేంద్రం పనిచేయకుండా చేయాలి. విద్యుత్ బిల్లులు చెల్లించకూడదు. ఒక్క వైద్యశాల మినహాయించి గ్రామంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేయాలి. ఇట్లా కనీసం ఒక నెల కార్యక్షికమాన్ని గ్రామ కమిటీలో రూపొందించుకొని అమలు చేయాలి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇదే కార్యక్షికమం చేపట్టాలి.
ఈ క్రమంలోనే..యగామానికి ఒకరోజు చొప్పున మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలకు తాళం వేసే బాధ్యతను తీసుకొని అమలు చేయాలి. ఈ విధంగా గ్రామాలు, మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల, జిల్లాలు ఏకమైన రాష్ట్ర రాజధానిని దిగ్బంధం చేయాలి. తెలంగాణ నలుమూలల ఉంచి ప్రజలు మూకుమ్మడిగా రాజధానికి చేరుకోవాలి. కనీసం నలభై లక్షల మందిని తరలించి హైదరాబాద్‌లో ఉన్న అసెంబ్లీ, సచివాలయం, డీజీపీ ఆఫీసు మొదలుకొని ప్రధాన కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలను దిగ్బంధం చేయాలి. తాళాలు వేసి వాటి ముందే కూర్చోవాలి. తెలంగాణకు అడ్డుపడుతున్న కోస్తాంధ్ర పెట్టుబడిదారుల వ్యాపారాలను అడ్డుకోవాలి. తెలంగాణ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రవాణా వ్యవస్థను నిలిపివేయాలి. ఈ పోరాటంలో హైదరాబాద్ బస్తీల ప్రజలను కదిలించాలి. ఈ విధంగా.. గ్రామం మొదలు రాజధాని దాకా..పోరాటాన్ని విస్తృతం, తీవ్రతరం చేసి కోస్తాం ధ్ర దోపిడీ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలి. తెలంగాణ ప్రజల సత్తా చాటాలి. కడవరకూ పోరాడి తెలంగాణ సాధించాలి.
No comments:
Post a Comment