Monday, July 21, 2014

ఇంకా ఈ దురాచారమా? By ప్రొఫెసర్ జి. హరగోపాల్

Updated : 7/3/2014 2:06:29 AM
Views : 281
దేశం అభివద్ధి దశలో వేగంగా ముందుకు సాగినా, పాకీ పని వారు ఆ పని నుంచి విముక్తి చెంద డం అటుంచి, పంజాబ్, హర్యానా లాంటి అభివద్ధిచెందిన రాష్ర్టాల్లో కానీ లేదా వామపక్ష పార్టీలు చాలా కాలం అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్, కేరళ రాష్ర్టాల్లో కానీ ఈ సమస్యకు పరిష్కారం రాకపోవడంపెద్ద విషాదం. అలాగే గుజరాత్ అభివద్ధి నమూనా అని రోజూ ఊదరగొడుతున్నా, ఆ రాష్ట్రంలో పాకీ పని నిరాఘాటంగా సాగుతున్నది.

రెండు వారాల క్రితం (జూన్ 14 నాడు) ప్రజల జర్నలిస్టు భాషాసింగ్ రాసిన కనిపించని భారతం పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ రచనలో మనుషుల మల మూత్రాలను ఎత్తి గంప ల్లో నెత్తి మీద మోసుకెళ్ళే అమానుషం మనదేశంలోని అనేక రాష్ర్టాల్లో ఎలా కొనసాగుతున్నదో మన సు ద్రవించేలా చిత్రీకరించారు.
నా బాల్యంలో మా చిన్నమ్మ వాళ్ళ దగ్గరికి సెలవుల్లో మహబూబ్‌నగర్ పట్టణానికి వెళ్లినప్పుడు ఆ దశ్యాన్ని చూశాను. మానవ మలాన్ని నెత్తిపై ఎత్తుకొని పోతున్నప్పుడు అది గంపలోనుంచి కారుతూ వాళ్ళ మొఖాల మీదు గా కిందికి జారే దశ్యం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఒళ్ళు జలదరిస్తుంది.

ఈ పని ఎప్పటి నుంచి ప్రారంభమయ్యిందో కాని,ఈ నికష్ట పని గురించి స్వాతంత్వ్రోద్యమ కాలంలో గాంధీజీకి అంబేద్కర్‌కు మధ్య దీనిపై తీవ్రమైన చర్చ జరిగింది. 
గాంధీజీ ఈ వత్తి చేసే వారిని తల్లి ప్రేమతో పోలుస్తూ ప్రతి తల్లి ఈ పనిని చేస్తుందని ఆమె ఈ పనిని నికష్టమైందని అనుకోదని, అలాగే పాకీ పనివాళ్లు కూడా సమాజ ఆరోగ్యం కోసం ఈ బాధ్యత నిర్వహిస్తున్నారని వాదించాడు. 

అంబేద్కర్, గాంధీ దక్పథం పట్ల తీవ్ర అభ్యంతరం చెపుతూ, తల్లి తన సొంత పిల్లలకు ఈ సేవ చేస్తుందే తప్ప, ఇతరుల పిల్లలకు చేయదని, పిల్లల మీద తల్లి ప్రేమతో ఆ పని చేస్తుందేమో కానీ పాకీ పని వాళ్లు ఎవ్వరూ ఈపనిని ఇష్టం గా చేయకపోవడమే కాక దాన్ని అసహ్యించుకుంటారని వాదిస్తూ.. దీన్ని ఒకే కులానికి చెందిన మహిళలచే చేయించి దాన్ని వ్యవస్థీకతం చేయడం పట్ల అంబేద్కర్ తీవ్ర అభ్యంతరం చెప్పాడు. ఇది దాదా పు ఎనిమిది, తొమ్మిది దశాబ్దాల కిందటి సంగతి.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాం గం అంటరాన్నితనాన్ని నిషేధించింది. ఆ నిషేధం తో ఈ పని కూడా రద్దు కావలసింది. కానీ అంటరానితనం ఎన్నో విధాలుగా కొనసాగడమే కాక కొన్ని కొత్త ప్రక్రియలు కూడా వచ్చి చేరాయి. ఆధునికత, అభివద్ధి గురించి గొప్పలు చెప్పుకునే మన పాలకులు, పాకీ పనిని ఎందుకు ఆధునీకరించలే దు? రైల్వే డిపార్టుమెంట్ అధునాతన సూపర్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టారు. ఢిల్లీలో మెట్రోను నిర్మా ణం చేయగలిగారు. 

కొందరు ముఖ్యమంత్రులు బుల్లెట్ రైళ్ల గురించి మాట్లాడుతున్నారు. కానీ అదే రైల్వే డిపార్టుమెంట్‌లో వందలాదిమంది పాకీ పని వాళ్లు పనిచేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా రైళ్ల లో మలమూత్రాలను మనుషుల చేత శుభ్రం చేస్తున్నారా? మన దేశంలో మనిషి గౌరవం గురించి, మనిషి హుందా గురించి ఎన్నడూ ఆలోచించని వారు పరిపాలన సాగిస్తున్నంత కాలం ఈ సమస్య అంతం కాదు. ఆధునికత అనాగరిక మానవ సం బంధాల కలయికే మన దేశ సమకాలీన సంస్కతిగా మనం భావించవలసి ఉంటుంది. 


ఈ గ్రంథ రచయిత భాషాసింగ్‌కు ఉండే మానవీయ విలువల వల్ల ప్రతి రాష్ట్రంలో తాను సమాచారం సేకరించడమే గాక వాళ్ల మధ్యే జీవించింది. వాళ్లతో కలిసి భోజనం చేసి తన మానవత్వాన్ని పెం చుకున్నది. ప్రతి రాష్ట్రంలో కొందరు పాకీ మహిళల జీవితాన్ని గురించి వాళ్ల ఫీలింగ్స్‌ను చాలా లోతు గా తట్టింది.

ఈ పనిని ఎంత అసహ్యించుకుంటా రో, తమ గురించి తాము ఎంత న్యూనతాభావాన్ని పెంచుకున్నారో గమనిస్తే మనం ఇలాంటి సమాజం లో, ఇలాంటి మనుషుల మధ్య జీవించడం మన విషాదం. ఈ పని నుంచి బయటపడడం ఎలా అని పాకీ పనివాళ్లు బాధపడుతున్నారు. తమను ఎవరైనా వేరే పనిలోకి రానిస్తారా అనే అనుమానం, భయం కూడా వాళ్లను వేధిస్తున్నది. తాము చేసే పనిని ఇతరులు అసహ్యించుకోవడమే కాక తమను చూస్తేనే ముక్కుకు చేయి అడ్డం పెట్టుకొని వేగంగా నడుస్తారు.ఒక పాకీమహిళ మాట్లాడుతూ.. తాము ఒక టీ కొట్టు పెడితే ఎవరైనా తాము చేసిన ఛాయ్ ని తాగుతారా అని ప్రశ్నించింది. దేశ ప్రధాని ఒకప్పుడు ఛాయ్ వాలా అని ప్రచారం జరిగినా కొం దరు ఛాయ్ వాలాలు కూడా కాలేని పరిస్థితి ఉన్న ది. ఆయనకు అది తెలుసో తెలియదో మనకు తెలియదు.

మన దేశంలో గత రెండు దశాబ్దాలుగా సఫాయ్ కర్మచారి ఆందోళన దేశవ్యాప్తంగా బెజవాడ విల్సన్ గారి నాయకత్వంలో జరుగుతున్నది. శంకరన్ గారు తన పదవీ విరమణ తర్వాత రెండంటే రెండే పను లు చేశారు. ఒకటి నక్సలైట్లకు ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు. రెండు- సఫాయ్ కర్మచారి ఆందోళనకు తన పూర్తి మద్దతు ప్రకటించి, దానికి నైతిక బలాన్ని ఇచ్చారు.ండవ లక్ష్యం దేశంలోని మొత్తం డ్రై లాట్రిన్స్‌ని కూలగొట్టడం. శంకరన్ గారితో కలిసి శాంతి చర్చల రిపోర్టును తయారు చేస్తున్నప్పుడు రోజూ ఎన్ని లాట్రిన్స్ కూలగొట్టారన్న సమాచారం వచ్చినప్పుడల్లా ఎంతో సంతోషంగా ఆ సంఖ్య నాకు చెప్పేవాడు. ఎన్ని ఎక్కువ కూలగొడితే అంత సంతోషపడేవాడు. నిజానికి ఆ పని తన జీవి త కాలంలోనే పూర్తి కావాలని, పాకీ వారు లేని ఒక సమాజాన్ని ఆయన ఆశించాడు.

ఈ కర్మచారి ఆం దోళన వల్ల ఈ పనిని రద్దు చేస్తూ ఒక చట్టం కూడా వచ్చింది. పాకీ పనివాళ్ల పునరావాసం (రిహాబిలిటేషన్) కోసం కేంద్ర బడ్జెట్‌లో వంద కోట్లు కేటాయించారు. విల్సన్ ఈ విషయాన్ని చెబుతూ, ప్రభుత్వ అధికారులతో గత రెండు మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఈ అధికారులు గంటల తరబడి పనిచేయడమే గాక, సెలవుల్లో కూడా కొందరు అధికారులు పనిచేస్తారు. వీళ్లు ఇంత కష్టపడుతున్నది వందకోట్లు ఖర్చు కాకుండా చూడడమే అని అం టూ, వంద కోట్లల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకపోవడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి! అని చాలా ఆవేదనతో, ఆవేశంతో మాట్లాడాడు.

దేశం అభివద్ధి దశలో వేగంగా ముందుకు సాగి నా, పాకీ పని వారు ఆ పని నుంచి విముక్తి చెంద డం అటుంచి, పంజాబ్, హర్యానా లాంటి అభివద్ధిచెందిన రాష్ర్టాల్లో కానీ లేదా వామపక్ష పార్టీలు చాలా కాలం అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్, కేరళ రాష్ర్టాల్లో కానీ ఈ సమస్యకు పరిష్కారం రాకపోవడం పెద్ద విషాదం. అలాగే గుజరాత్ అభివద్ధి నమూనా అని రోజూ ఊదరగొడుతున్నా, ఆ రాష్ట్రం లో పాకీ పని నిరాఘాటంగా సాగుతున్నది. ఢిల్లీ నగర నడిబొడ్డున ఇంకా ఇది కొనసాగుతున్నది.

ఈ పుస్తక ఆవిష్కరణ జరిగిన అనంతపూర్‌లో ఈ పనికి వ్యతిరేకంగా నారాయణమ్మ తిరుగుబాటు చేసింది. ఆమె చాలా హుందాగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నది. పాకీ పని చేస్తున్న తాను తిరగబడిన ఈ దొడ్డిని గడ్డపారతో తానే కూలగొట్టి ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచింది. ఈ వత్తి నుంచి వచ్చిన దయానంద్ బెంగళూరులోని సోషల్ లా స్కూల్ అధ్యాపకుడుగా పనిచేస్తున్నాడు. ఈ అంశం మీద మంచి పరిశోధన చేస్తున్నాడు. ఆయన చిత్రీకరించిన ఘటనలను ఎన్డీ టీవీ వాళ్లు ప్రసారం చేసి దేశాన్ని షాక్‌కు గురిచేశారు. ఒకవైపు పాకీ పనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న సందర్భం లో కేంద్ర ప్రభుత్వంలో అధికారానికి వచ్చిన పార్టీ ఒక ప్రతీఘాత విప్లవ దారిలో పోతున్నది. 

ఈ కింది ఆలోచనాధారను గమనించండి. పాకీ పనిచేసే వాల్మీకులు ఈ పనిని కేవలం తమ పొట్టకూటి కోసం చేయడం లేదు. పొట్టకూటి కోసమే అయితే దీన్ని వాళ్లెప్పుడో మానేసేవారు. ఏదో దశలో ఎవరికో ఒకరికి ఇది దైవ ఆజ్ఞగా వచ్చి ఉంటుంది. భగవంతుడిని సంతప్తిపరచడం కోసం దీన్ని ఒక దైవ కార్యంగా తలచి తరతరాలుగా వాళ్లు వత్తిని నిర్వహిస్తున్నారు. లేకపోతే.. ఇన్ని తరాలుగా ఇది కొనసాగడం అసా ధ్యం. ఈ భావాలు తన పుస్తకం కర్మయోగిలో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ వ్యక్తపరిచిన భావ తరంగాలు. ఇలాంటి ఆలోచనా ధోరణిని ఎలా అర్థం చేసుకుంటారో పేదవాళ్ల భవిష్యత్తు ఏమిటో ఆలోచించే బాధ్యత పాఠకులకే వదిలేస్తున్నాను.
ప్రొఫెసర్ జి. హరగోపాల్

Namasete Telangana Telugu News Paper Dated: 3/07/2014 

No comments:

Post a Comment